![Soundarya Rajinikanth Reacts To Aishwaryaa, Dhanush Divorce - Sakshi](/styles/webp/s3/article_images/2022/01/18/soundarya.jpg.webp?itok=3VaSL8xP)
స్టార్ కపూల్ ధనుష్- ఐశ్వర్యల విడాలకుల విషయం ఇప్పుడు చిత్ర పరిశ్రమలో హాట్ టాపిక్‌గా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట.. విడిపోవడాన్ని అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఐశ్వర్య, ధనుష్‌లు.. 18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలికారు.
(చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులకు కారణం ఇదేనా?)
‘స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి’అంటూ ఐశ్వర్య సోషల్ మీడియా ద్వారా తమ విడాకుల విషయాన్ని వెల్లడించారు. అలాగే ధనుష్ కూడా ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో తెలియజేస్తూ..తమ నిర్ణయాన్ని గౌరవించాలంటూ అభిమానులకు విజ్ఞప్తి చేశారు.
కాగా వీరి విడాకుల ప్రకటనపై రజనీకాంత్ ఇప్పటికీ స్పందించకపోవడం గమనార్హం. అయితే విడాకుల ప్రకటనకు ముందే రజనీకాంత్‌కు ధనుష్, ఐశ్వర్యలు ఫోన్ చేశారని, ఆయన వారి నిర్ణయానికి ఎలాంటి అడ్డు చెప్పలేదని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే కూతురుకు మద్దతుగా మాత్రం రజనీకాంత్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ అక్క నిర్ణయానికి సపోర్ట్‌గా నిలిచింది రజనీకాంత్ చిన్న కూతురు, ఐశ్వర్య చెల్లెలు సౌందర్య. అక్క విడాకుల నిర్ణయానికి మద్దతు ఇస్తున్నట్లుగా ట్విటర్ ఖాతాలోని ప్రొఫైల్ పిక్‌ని మార్చింది. తండ్రి రజనీకాంత్‌తో చిన్నప్పుడు దిగిన ఫోటోని తన ప్రొఫెల్ పిక్‌గా మార్చింది. అందులో రజనీకాంత్ ఇద్దరి కూతుళ్లను ఎత్తుకొని ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అక్కకు సపోర్ట్‌గా ఉండమని నెటిజన్స్ కోరుతున్నారు.
#NewProfilePic pic.twitter.com/0SnIQYvkkg
— soundarya rajnikanth (@soundaryaarajni) January 17, 2022
Comments
Please login to add a commentAdd a comment