కోలీవుడ్ లో సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అభిమానులు కాదు. భక్తులు ఉన్నారు. ఆయన్ని ఆరాధించే కోట్లాదిమంది అభిమానులు ఉన్నారు. వారందరూ ఇఫ్పుడు రజనీకాంత్ గురించి టెన్షన్ పడుతున్నారు. వారింట్లో జరుగుతున్న సంఘటనలు చూసి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముందు రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య 2017లో అశ్విన్ రామ్ కుమార్ కు డైవోర్స్ ఇచ్చింది. ఏడు ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. వీరిద్దరికి ఒక బాబు ఉన్నాడు. అతని పేరు వేద్. ఆ తర్వాత సౌందర్య.. 2019లో విషాగన్ వానంగమూడి అనే బిజినెస్ మెన్ ను పెళ్లాడింది.
ఇప్పుడు చెల్లెలి దారిలోనే అక్క కూడా నడిచింది. ధనుష్ కు బ్రేకప్ చెప్పింది. రజనీకాంత్ డాటర్స్ డైవోర్స్ ఇష్యుపై కోలీవుడ్ లో బాగా చర్చ జరుగుతోంది. అందరూ సూపర్ స్టార్ స్టే స్ట్రాంగ్ అంటూ ట్వీట్స్ చేస్తూ రజనీకాంత్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అక్క డైవోర్స్ అనౌన్స్ మెంట్ తర్వాత సౌందర్య కూడా తన సోషల్ మీడియా ఎకౌంట్ లో చిన్నప్పుడు వారిద్దరు రజనీకాంత్ తో దిగిన ఫోటోను డీపీగా మార్చించి. మీ తల్లిదండ్రులను జాగ్రత్తగా చూసుకోండి అంటూ ట్వీట్స్ నెటిజన్స్ రీట్వీట్ చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment