
ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్
Dhanush and Aishwaryaa Rajinikanths Separation: నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల 18 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. తాము విడిపోతున్నట్లు ఈ జంట సోమవారం రాత్రి విడివిడిగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వైవాహిక బంధం 18 ఏళ్లు కొనసాగింది. వీరి మధ్య మనస్పర్థలంటూ ఇప్పటి వరకు వదంతులు కూడా దొర్లలేదు. అలాంటిది ఈ జంట విడిపోవడం అనేది కోలీవుడ్ వర్గాలే జీర్ణించుకోలేని పరిస్థితి.
చదవండి: (సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు)
గత ఏడాది అక్టోబర్ నెల 25వ తేదిన రజినీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, ధనుష్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఒకే వేదికపై అందుకున్న సందర్భాన్ని ఐశ్వర్య ఇది చారిత్రాత్మకం అంటూ గర్వంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇకపోతే కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. ఐశ్వర్య రజనీకాంత్ కూడా సినీ దర్శకురాలే. ఆమె తాజాగా ఒక చిత్రానికి దర్శకత్వం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇది ధనుష్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ మధ్య బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ధనుష్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని, అదే మనస్పర్థలకు దారి తీసి విడిపోయే వరకు వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది.
చదవండి: (ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్‌గా సౌందర్య.. ఫోటో వైరల్)
అయితే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు మధ్య మనస్పర్థలు గత రెండు నెలల క్రితమే మొదలయ్యాయని సమాచారం. వాటిని పరిష్కరించే ప్రయత్నం రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు చేసినా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని సమాచారం. కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య కూ డా మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్‌కు విడాకులిచ్చి విశాఖన్ వణంగాముడిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.