Aishwaryaa.R.Dhanush
-
విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే
మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఓ మీడియా సమావేశంతో వాళ్లిద్దరు మళ్లీ కలుస్తారంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్, వారి ఫాలోవర్స్ అంతా త్వరలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగి ఒక్కటవుతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే.. ఇటీవల షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్-ఐశ్వర్యలు ఒకే హోటల్లో ఉన్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. ఇక తిరిగి చెన్నై వెళ్లిన(వేరు వేరుగా) ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి హజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో ఈ మాజీ దంపతులు మాట్లాడుకుంటారేమోనని అక్కడికి వచ్చిన అతిథులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. కానీ వారు మాత్రం దూరంగానే ఉన్నారట. అంతేకాదు ఒకరికి ఒకరు తెలియనట్లుగా వ్యవహరించినట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది. చదవండి: హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు -
ఆసుపత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య..
Dhanush Ex wife Aishwaryaa R Dhanush Admitted Into Hospital: రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 20211..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే ధనుష్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) -
విడాకుల తర్వాత ఐశ్వర్య ఫస్ట్ ఫోటో ఇదే.. నెట్టింట వైరల్
Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush: మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ధనుష్-ఐశ్వర్యలు మాత్రం తమ పనుల్లో ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాదాలోనే ఒకే హోటల్లో ఉన్న వీరు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సార్ సినిమా షూటింగ్ పనుల్లో ధనుష్ నిమగ్నమైతే, ఓ సాంగ్ షూటింగ్ కోసం ఐశ్వర్య ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. గతంలో సినిమాలు డైరెక్టర్ చేసిన ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్‌ను తెరకెక్కిస్తుంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ఐశ్వర్య పాల్గొంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అనంతరం ఐశ్వర్య తొలిసారిగా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. -
నా అల్లుడు చాలా మంచి వాడు: రజనీకాంత్ వీడియో వైరల్
Rajinikanth Praising Dhanush Old Video Goes Viral: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యల విడాకుల విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక భార్యభర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్ విడాకులు తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాలా సినిమా ఆడియో ఫంక్షన్లో ధనుష్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. 'ధనుష్ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు' అంటూ రజనీ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా కూతురి విడాకుల నేపథ్యంలో స్టే స్రాంగ్ తలైవా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong 🙏 #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu — பாண்டி💙❤💚 (@PandiyanKpm) January 18, 2022 -
Dhanush and Aishwaryaa Separation: ఫలించని తలైవా ప్రయత్నం
Dhanush and Aishwaryaa Rajinikanths Separation: నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతుల 18 ఏళ్ల వైవాహిక బంధం ముగిసింది. తాము విడిపోతున్నట్లు ఈ జంట సోమవారం రాత్రి విడివిడిగా ట్విట్టర్ ద్వారా ప్రకటించింది. ఈ విషయం ఇప్పుడు కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ వైవాహిక బంధం 18 ఏళ్లు కొనసాగింది. వీరి మధ్య మనస్పర్థలంటూ ఇప్పటి వరకు వదంతులు కూడా దొర్లలేదు. అలాంటిది ఈ జంట విడిపోవడం అనేది కోలీవుడ్ వర్గాలే జీర్ణించుకోలేని పరిస్థితి. చదవండి: (సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు) గత ఏడాది అక్టోబర్ నెల 25వ తేదిన రజినీకాంత్ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును, ధనుష్ జాతీయ ఉత్తమనటుడు అవార్డును ఒకే వేదికపై అందుకున్న సందర్భాన్ని ఐశ్వర్య ఇది చారిత్రాత్మకం అంటూ గర్వంగా ట్విట్టర్లో పేర్కొన్నారు. ఇకపోతే కోలీవుడ్ నుంచి హాలీవుడ్ స్థాయికి ఎదిగిన నటుడు ధనుష్. ఐశ్వర్య రజనీకాంత్ కూడా సినీ దర్శకురాలే. ఆమె తాజాగా ఒక చిత్రానికి దర్శకత్వం నిర్వహించే ఆలోచనలో ఉన్నారు. అయితే ఇది ధనుష్‌కు ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది. అలాగే ఈ మధ్య బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తున్న ధనుష్ కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, ఒక నటితో సన్నిహితంగా ఉంటున్నారని, ఈ విషయంలో భార్యాభర్తల మధ్య వాగ్వాదం జరిగిందని, అదే మనస్పర్థలకు దారి తీసి విడిపోయే వరకు వెళ్లిందనే ప్రచారం జరుగుతోంది. చదవండి: (ధనుష్-ఐశ్వర్య విడాకులు: అక్కకు సపోర్ట్‌గా సౌందర్య.. ఫోటో వైరల్) అయితే ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌లు మధ్య మనస్పర్థలు గత రెండు నెలల క్రితమే మొదలయ్యాయని సమాచారం. వాటిని పరిష్కరించే ప్రయత్నం రజనీకాంత్, ఆయన కుటుంబ సభ్యులు చేసినా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ తమ నిర్ణయాన్ని మార్చుకోకపోవడంతో పరిస్థితి ఇక్కడి వరకు వచ్చిందని సమాచారం. కాగా రజనీకాంత్ రెండవ కూతురు సౌందర్య కూ డా మొదటి భర్త అశ్విన్ రామ్‌కుమార్‌కు విడాకులిచ్చి విశాఖన్ వణంగాముడిని రెండవ వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. -
ఐశ్వర్య కోసం పాట పాడిన ధనుష్.. పాత వీడియో వైరల్
Dhanush Singing Song For Aishwarya At A Party Goes Viral: స్టార్ హీరో ధనుష్- ఐశ్వర్యల విడాకుల అంశం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను షాక్‌కి గురి చేస్తుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం ఏంటన్నది ఆసక్తికరంగా మారింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో అభిమానులు వీరిద్దరి క్యూట్ మూమెంట్స్‌ని గుర్తుచేసుకొంటున్నారు. గతంలో ఓ పార్టీలో హీరో ధనుష్ భార్య కోసం ఎంతో ప్రేమగా పాట పాడగా, భర్త ఇచ్చిన సర్‌ప్రైజ్‌కి ఐశ్వర్య సిగ్గుపడుతుంది. 8నెలల క్రితం నాటిది ఈ వీడియో. తాజాగా ధనుష్-ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో మరోసారి ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడిపోవడం అభిమానులకు మింగుడుపడటం లేదు. ఈ వార్త చాలా షాకింగ్‌గా ఉందని పలువురు ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. విడాకుల ప్రకటనకు కొద్ది రోజుల ముందు కూడా ఓ సినిమా ఫంక్షన్లో ఇద్దరూ కలిసి కనిపించారు. అంతలోనే ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. This one 💔 #Dhanush #Aishwarya pic.twitter.com/c8FDeuzqyL — VCD (@VCDtweets) January 17, 2022 -
రజనీకాంత్ ఫ్యాన్స్ కు షాకింగ్ న్యూస్
ముంబై: రజనీకాంత్ అభిమానులకు షాకింగ్ న్యూస్. 'కబాలి' స్టార్ అధికారిక ట్విట్టర్ ఖాతా మంగళవారం రాత్రి హ్యాకింగ్ కు గురైంది. ఆయన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి 'రజనీకాంత్ హిట్ టు కిల్' ట్వీట్ రావడంతో అభిమానులు కంగారు పడ్డారు. గుర్తు తెలియని దుండగులు ఆయన ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసినట్టు తర్వాత గుర్తించారు. కొన్ని గంటల తర్వాత ఈ విషయాన్ని రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య.ఆర్.ధనుష్ ధ్రువీకరించారు. ఇప్పుడు తన తండ్రి ఖాతాను పునరుద్ధరించామని పేర్కొన్నారు. అంతా సవ్యంగా ఉందని అందరికీ ధన్యవాదాలు తెలిపారు. 2013, ఫిబ్రవరిలో ట్విట్టర్ ఖాతా తెరిచిన రజనీకాంత్ కేవలం 23 మందిని మాత్రమే అనుసరిస్తున్నారు. కమల్ హాసన్, ఆమిర్ ఖాన్, షారూఖ్ ఖాన్, పా రంజిత్, కళైపులి ఎస్ థాను వంటి ప్రముఖులను మాత్రమే ఆయన ఫాలో అవుతున్నారు. ఆయనకు ట్విట్టర్ లో 30 లక్షల మందిపైగా ఫాలోవర్లు ఉన్నారు. @superstarrajini appa's account was hacked..handle retrieved. Thank you all :) #AllIsWell — Aishwaryaa.R.Dhanush (@ash_r_dhanush) 2 August 2016