Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush Goes Viral - Sakshi
Sakshi News home page

Aishwarya Rajinikanth: విడాకుల తర్వాత ఐశ్వర్య ఫస్ట్‌ ఫోటో ఇదే.. నెట్టింట వైరల్‌

Published Tue, Jan 25 2022 12:44 PM | Last Updated on Tue, Jan 25 2022 3:19 PM

Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush Goes Viral - Sakshi

Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush: మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్‌ కపుల్‌గా వెలుగొందారు ధనుష్‌- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్‌-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ధనుష్‌-ఐశ్వర్యలు మాత్రం తమ పనుల్లో ఫుల్‌ బిజీ అయినట్లు తెలుస్తుంది.

ప్రస్తుతం హైదరాబాదాలోనే ఒకే హోటల్లో ఉన్న వీరు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సార్‌ సినిమా షూటింగ్‌ పనుల్లో ధనుష్‌ నిమగ్నమైతే, ఓ సాంగ్‌ షూటింగ్‌ కోసం ఐశ్వర్య ఇప్పుడు ఫుల్‌ బిజీగా మారిపోయింది.

గతంలో సినిమాలు డైరెక్టర్‌ చేసిన ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్‌ సాంగ్‌ను తెరకెక్కిస్తుంది. వాలెంటైన్స్‌ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్‌ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్‌లో ఐశ్వర్య పాల్గొంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అనంతరం ఐశ్వర్య తొలిసారిగా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్‌ అవుతుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement