aishwarya rajinikanth
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
విడాకులు క్యాన్సిల్! ధనుష్-ఐశ్వర్య మళ్లీ ఒక్కటి కానున్నారా? (ఫొటోలు)
-
కోర్టు విచారణకు దూరంగా ధనుష్, ఐశ్వర్య... మరోసారి వాయిదా!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. కానీ, వారిద్దరూ విచారణ కోసం కోర్టులో హాజరుకాలేదు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించారు. ఆ సమయం నుంచి ఇద్దరూ వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ తమ వైవాహిక జీవితం ముగిసిందంటూ పరస్పర విడాకుల కోసం చెన్నై కుటుంబ సంక్షేమ కోర్టులో రెండేళ్ల క్రితమే పిటిషన్ వేశారు. కానీ, ఇప్పటి వరకు కోర్టులో మాత్రం హజరవలేదు. ఈ ఏడాది ఏప్రిల్‌లోనే న్యాయస్థానం ముందుకు రావాలని వారికి నోటీసులు కూడా కోర్టు పంపింది. ఈ క్రమంలో అక్టోబర్ 7న విచారణకు రావాల్సి ఉంది. అయితే, వారిద్దరూ ఇప్పుడు కూడా కోర్టులో హాజరు కాలేదు. దీంతో అక్టోబర్ 19కి వాయిదా వేస్తున్నట్లు న్యాయమూర్తి శుభాదేవి తెలిపారు.2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్, ఐశ్వర్య పలు విభేదాల వల్ల 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్నారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే, కోర్టు విచారణకు వారిద్దరూ హజరు కాకపోవడంతో మళ్లీ కలుస్తారంటూ ఫ్యాన్స్ చర్చించుకుంటున్నారు. -
'లాల్ సలామ్' ఓటీటీ ఆలస్యానికి కారణం చెప్పిన ఐశ్వర్య
సౌత్ ఇండియాలో భారీ అంచనాల మధ్య రజనీకాంత్ 'లాల్ సలామ్' విడుదలైంది. అయితే, ప్రేక్షకుల ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. అయినప్పటికీ రజనీ అభిమానులు ఈ చిత్రం ఓటీటీ విడుదల కోసం ఎదురుచూస్తున్నారు. తాజాగా లాల్‌సలామ్ ఓటీటీ రిలీజ్ గురించి చిత్ర డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్ ఆప్డేట్ ఇచ్చారు. అతి త్వరలో ఈ చిత్రాన్ని ఓటీటీలోకి తీసుకొస్తామని ఆమె ఇలా ప్రకటించారు.'లాల్ సలాం' చిత్రాన్ని తెరకెక్కించడంలో మేము చాలా కష్టపడ్డాం. కానీ, మేము అనుకున్నంతగా విజయం పొందలేకపోయాం. మొదటి మేము అనుకున్నట్లుగా థియేటర్లో విడుదల చేయలేదు. కొన్ని సీన్లు లేకుండానే మీ ముందుకు తీసుకొచ్చాం. ఆ సీన్లు అన్నీ సినిమాకు చాలా ముఖ్యమైనవి. హార్డ్ డిస్క్ కనిపించకపోవడం వల్లే ఈ ఇబ్బందులు పడ్డాం. అయితే, అందులో మిస్ అయిన సీన్లు ఇప్పుడు రికవీరే చేశాం. వాటిని సినిమాకు యాడ్ చేసి సరికొత్తగా ఓటీటీ వర్షన్లో విడుదల చేస్తాం. ఇప్పటికే ఆ సీన్లకు సంబంధించిన మ్యూజిక్ వర్క్‌ను రెహమాన్ ప్రారంభించారు. అయితే దీనికి సంబంధించి ఆయన ఎలాంటి రెమ్యునరేషన్ తీసుకోలేదు.' అని ఐశ్వర్య చెప్పుకొచ్చారు.లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందని విడుదలకు రెండురోజుల ముందు అనుకున్నాం. ఈ క్రమంలో ఆయన పాత్రకు సంబంధించి నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. ఆపై హార్డ్ డిస్క్ కనిపించకుండా పోయింది. దీంతో తప్పని పరిస్థితిలో సినిమాను విడుదల చేయాల్సి వచ్చింది. ఇదీ చదవండి: ఒక్కటైన సిద్ధార్థ్-అదితీ.. ఫొటోలు వైరల్కథలో బలం ఉన్నప్పటికీ చివరి క్షణంలో తీసుకున్న నిర్ణయాల వల్లే సినిమాకు మైనస్‌గా మిగిలింది. ఇప్పుడు ఓటీటీ వర్షన్లో అలాంటి ఇబ్బంది ఉండదు. తప్పకుండా సినిమా అందరికీ నచ్చుతుంది. అని పేర్కొన్నారు. సెప్టెంబర్ 20న సన్ నెక్ట్స్, నెట్‌ఫ్లిక్స్‌లో లాల్ సలామ్ స్ట్రీమింగ్కు రానుందని టాక్. థియేటర్లో చూడని వారికి తప్పకుండా నచ్చుతుందని ఫ్యాన్స్ అభిప్రాయ పడుతున్నారు. -
సుచిత్ర సంచలన వ్యాఖ్యలు
సుచీలీక్స్‌తో సింగర్ సుచిత్ర అప్పట్లో తీవ్ర ప్రకంపనలు సృష్టించింది. సెలబ్రిటీల పర్సనల్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసి యావత్ సినీ ఇండస్ట్రీనే షేక్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మరోసారి సెలబ్రిటీలపై విరుచుకుపడింది. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ గురించి మాట్లాడుతూ.. వాళ్లు పెళ్లయినప్పటినుంచి ఒకరిని ఒకరు మోసం చేసుకుంటూనే ఉన్నారు. పెళ్లయిన విషయాన్నే మర్చిపోయి మిగతావాళ్లతో డేటింగ్ చేశారు. ఐశ్వర్య కంటే ధనుషే నయంభర్త మోసం చేశాడని ఆరోపించిన ఐశ్వర్య ఏమైనా పద్ధతిగా ఉందా? తను కూడా వేరేవాళ్లతో డేటింగ్ చేసి మోసం చేయలేదా? ఆమె కంటే ధనుషే నయం.. అయినా ఐశ్వర్య తన పిల్లలను ఏనాడూ పెద్దగా పట్టించుకోలేదు. అందుకే వారి కుమారులు యాత్ర, లింగ.. అమ్మమ్మ- తాతయ్యల వద్ద పెరిగితే బాగుంటుంది' అని సుచిత్ర చెప్పుకొచ్చింది.కార్తీక్ గేభర్త కార్తీక్‌తో విడాకుల గురించి మాట్లాడుతూ.. 'కార్తీక్‌తో పెళ్లయిన 11 ఏళ్లకు అతడు గే అని తెలిసింది. అది బయటకు చెప్పే ధైర్యం అతడికి లేదు. ఆ మరుసటి ఏడాదే విడాకులు తీసుకున్నాను. పూటుగా తాగిన తర్వాత ధనుష్, నా భర్త ఒకే గదిలో ఉండేవారు. రాత్రిపూట గదిలో నా భర్తతో ధనుష్‌కు ఏం పని?' అని ప్రశ్నించింది.అందుకే టార్గెట్‌కాగా ఓ ఇంటర్వ్యూలో సింగర్ మాజీ భర్త కార్తీక్.. సుచిత్ర మానసిక ఆరోగ్యం బాగోలేదని తెలిపాడు. అయితే తన మానసిక స్థితి బాగోలేదని కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని సుచిత్ర ఆరోపించింది. ఎప్పుడైతే డ్రగ్స్ వాడేందుకు ఒప్పుకోలేదో అప్పుడే తనను ధనుష్, కార్తీక్ టార్గెట్ చేశారని వెల్లడించింది.చదవండి: బాలీవుడ్లో రాణిస్తున్న బ్యూటీ.. ఫస్ట్ సినిమా తెలుగులోనే! -
ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ధనుష్ కుమారుడు.. మార్కులెన్నో తెలుసా..?
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లు కొద్దిరోజుల క్రితమే విడాకుల విషయంలో వార్తల్లో నిలిచారు. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. అయితే, గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు.ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర 12వ తరగతి బోర్డు పరీక్షలలో బాగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇంటర్ ఫలితాల్లో అతని అత్యుత్తమ ప్రదర్శనకు అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఫిదా అవుతున్నారు. ఇటీవల ముగిసిన 12వ తరగతి బోర్డు పరీక్షలో యాత్ర 600 మార్కులకు గాను మొత్తం 569 మార్కులు సాధించినట్లు సమాచారం. తమిళ్ 100కి 98, ఇంగ్లిష్‌లో 92, గణితంలో 99, ఫిజిక్స్‌లో 91, బయాలజీలో 97, కెమిస్ట్రీలో 92 మార్కులు సాధించినట్లు ఇంటర్నెట్లో ఒక వార్త వైరల్ అవుతుంది. ఇందులో అధికారికంగా ప్రకటన వెలువడలేదు.ధనుష్, ఐశ్వర్య విడిపోయినప్పటికీ, వారు తమ ఇద్దరు పిల్లలను బాధ్యతగానే చూసుకుంటున్నారు. లాల్ సలామ్ మ్యూజిక్ లాంచ్ పార్టీలో ఐశ్వర్యతో పాటుగా యాత్ర,లింగ కనిపించారు. కెప్టెన్ మిల్లర్ ఫిల్మ్ ఫెస్టివల్ సమయంలో పిల్లలు ఇద్దరూ కూడా ధనుష్‌తో కలిసి సందడి చేశారు. యాత్రకు 18 ఏళ్లు కాగా, చిన్న కుమారుడు లింగాకు 14 ఏళ్లు. వీరిద్దరూ చెన్నైలోని ఓ ప్రముఖ పాఠశాలలో చదువుకున్నట్లు సమాచారం. -
సినిమా అట్టర్ ఫ్లాప్.. కొత్తిల్లు కొన్న రజనీ కూతురు
తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య గత కొద్ది రోజులుగా విడాకుల వ్యవహారంతో వార్తల్లో నిలుస్తోంది. రెండేళ్ల క్రితమే హీరో ధనుష్‌తో విడిపోయిన ఆమె అప్పటినుంచి వేరుగా జీవిస్తోంది. మళ్లీ కలుస్తారని మధ్యలో ఊహాగానాలు వెలువడినా చివరకు విడాకులు తీసుకోవడానికే ఇద్దరూ మొగ్గు చూపారు. ఇందుకోసం కోర్టు చుట్టూ తిరుగుతున్నారు.పిల్లలతో ఇదే ఇంట్లోఇదిలా ఉంటే ఐశ్వర్య కొత్తిల్లు కొన్నదంటూ గత రెండు రోజులుగా జోరుగా ప్రచారం జరుగుతోంది. చెన్నైలోని ఈ కొత్తింట్లోనే ఐశ్వర్య తన కుమారులిద్దరితో కలిసుండనుంది. ఇటీవలే గృహ ప్రవేశం జరగ్గా ఈ వేడుకకు తల్లిదండ్రులు లత-రజనీకాంత్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం పెద్ద హడావుడి లేకుండా ఎంతో సింపుల్‌గా జరిగినట్లు తెలుస్తోంది.డిజాస్టర్కాగా ఐశ్వర్య.. ధనుష్‌ను హీరోగా పెట్టి '3' సినిమా తీసింది. తర్వాత 'వాయ్ రాజా వాయ్' మూవీకి దర్శకుడరాలిగా వ్యవహరించింది. చాలాకాలంగా సినిమాలకు దూరంగా ఉన్న ఆమె 'లాల్ సలాం'తో మరోసారి దర్శకురాలి అవతారం ఎత్తింది. తన తండ్రి రజనీకాంత్ కీలక పాత్రలో నటించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది.చదవండి: నటుడి ఇంట మోగిన పెళ్లి బాజాలు.. వరుడి బ్యాక్‌గ్రౌండ్ ఇదే! -
ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌లకు కోర్టు ఉత్తర్వులు
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, ఐశ్వర్య రజినీకాంత్‌ల విడాకుల విషయంలో కోర్టుకు హాజరవ్వాలని చెన్నై ఫ్యామిలీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న వీరిద్దరూ సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించారు. వారికి యాత్ర, లింగ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా 2022లో పలు విభేదాల వల్ల తాము విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. గత రెండేళ్లుగా ధనుశ్, ఐశ్వర్య వేర్వేరుగానే ఉంటున్నారు. ఇదిలా ఉండగా.. కొద్దిరోజుల క్రితమే ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసింది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. ఈ క్రమంలో వారిద్దరిని కలిపేందుకు రజనీకాంత్ కూడా తీవ్రంగా ప్రయత్నించినట్లు తెలుస్తోంది. అయినా కూడా వారిద్దరు విడాకులు తీసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా వారి పిటిషన్‌ను న్యాయమూర్తి సుభాదేవి విచారించారు. అక్టోబరు 7న చెన్నై ఫ్యామిలీ కోర్టులో ధనుష్, ఐశ్వర్య ఇద్దరూ విచారణకు హాజరవ్వాలని ఉత్తర్వులు ఇచ్చారు. 2022 నుంచి వేర్వేరుగా ఉంటున్న ఈ జంట పలు సినిమా నిర్మాణంలో బిజీగానే ఉంటున్నారు. వారి కుమారులు యాత్ర, లింగ మాత్రం ఐశ్వర్య వద్దే ఉంటున్నారు. కానీ వారిద్దరూ కూడా అప్పడప్పుడు ధనుష్ వద్దకు వెళ్లి వచ్చేవారు. ఏదేమైనా సుమారు 18 ఏళ్ల పాటు కలిసి జీవించిన ఈ స్టార్ కపుల్స్ ఈ సంవత్సరంలో విడాకులు తీసుకుని తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నారనే విషయాన్ని ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. -
రెండేళ్లుగా సస్పెన్స్.. విడాకులే కావాలంటున్న ధనుష్-ఐశ్వర్య
కోలీవుడ్ స్టార్ హీరో ధనుశ్, ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తుతం తమ సినిమాలతో బిజీగా ఉంటున్నారు. సుమారు 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న ధనుష్ దంపతులు 2022లోనే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. ఆ తర్వాత నుంచి ఇద్దరు దూరంగానే ఉంటున్నారు. ఇటీవల ఐశ్వర్య రజినీకాంత్ లాల్ సలామ్ సినిమాను తెరకెక్కించారు. మరోవైపు ధనుశ్ రాయన్ అనే చిత్రంలో నటిస్తున్నారు. ఇదిలా ఉండగా.. తాజాగా ఈ జంట అధికారికంగా చెన్నై ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసినట్లు తెలుస్తోంది. పరస్పర అంగీకారంతో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేసినట్లు సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించిన స్టార్ కపుల్ దాదాపు రెండేళ్ల తర్వాత అధికారికంగా విడాకుల కోసం పిటిషన్లు వేశారు. త్వరలో వారి కేసు విచారణకు రానున్నట్లు సమాచారం. కాగా.. 2004లో ధనుశ్, ఐశ్వర్య ఘనంగా వివాహం చేసుకున్నారు. వీరికీ ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. దీంతో మరోసారి ధనుశ్- ఐశ్వర్య టాపిక్ కోలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కలుస్తారని భావించినా.. గతంలో ఈ జంట మళ్లీ కలవబోతున్నారని చాలాసార్లు వార్తలొచ్చాయి. అంతే కాదు అభిమానులు సైతం వీరిద్దరు కలుస్తారని ఆశలు పెట్టుకున్నారు. రెండేళ్లకు పైగా దూరంగా ఉన్న ఈ జంట చివరికీ విడిపోయేందుకే మొగ్గు చూపారు. 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n — Dhanush (@dhanushkraja) January 17, 2022 -
ప్రేమలో పడ్డ ఐశ్వర్య రజనీకాంత్.. ఆమె మాటలే చెప్తున్నాయ్!
కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజనీకాంత్, ధనుష్ విడిపోయి రెండేళ్లు అవుతోంది. 2004లో పెళ్లి చేసుకున్న ఈ జంట 2022 జనవరిలో విడిపోతున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ప్రస్తుతం విడిపోయినప్పటికీ వారిద్దరి మధ్య స్నేహం, గౌరవం అలాగే ఉందని, అందుకు నిదర్శనం ఐశ్వర్య ఇప్పుడు తన మాజీ భర్త ధనుష్ గురించి మాట్లడమేనని నెటిజన్లు అంటున్నారు. పెళ్లయి 18 ఏళ్లు, ఇద్దరు పిల్లలు ఉన్న తర్వాత విడిపోతున్నట్లు ప్రకటించిన ఈ జంట ఇప్పుడు మళ్లీ ఒక్కటవుతుందని కోలీవుడ్‌లో పుకార్లు వస్తున్నాయి. విడాకులు తీసుకున్నట్లు అధికారికంగా ప్రకటించనప్పటికీ.. ధనుష్, ఐశ్వర్య విడివిడిగా జీవిస్తున్నారనే విషయం తెలిసిందే. భార్యాభర్తలుగా కలిసి లేకున్నా.. ఇద్దరూ మంచి స్నేహితులని ఐశ్వర్య మాటలే నిదర్శనం. ఐశ్వర్య తన దర్శకత్వం వహించిన లాల్ సలామ్ కోసం ఒక ఇంటర్వ్యూలో ధనుష్ గురించి మాట్లాడింది. దీంతో ఇద్దరూ తిరిగి మళ్లీ కలుసుకోనున్నారని ఊహాగానాలకు దారితీసింది. దక్షిణాది సినిమాకి చెందిన ప్రముఖ సంగీత స్వరకర్త అనిరుధ్ రవిచందర్ సినీ జర్నీ వెనుక ధనుష్ ఉన్నాడని ఆమె ఇలా చెప్పుకొచ్చింది. అనిరుధ్ రవిచందర్ పెద్ద స్టార్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నాడు. ప్రస్తుతం కోట్లలో పారితోషికం తీసుకుంటున్నాడు. అయితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన '3' చిత్రానికి అనిరుధ్ మొదట సంగీతాన్ని అందించాడు. అప్పుడు అతని వయస్సు దాదాపు 20 సంవత్సరాలు. అలాంటి కుర్రాడు సంగీత దర్శకత్వం వహించాలనేది ధనుష్ కోరికని.. అనిరుధ్ నేడు ఇంత స్థాయికి చేరుకున్నాడంటే అందుకు కారణం ధనుష్ అని ఆమె చెప్పింది. గత కొన్ని సంవత్సరాలుగా, అనిరుధ్ రవిచందర్ భారతదేశంలో అత్యంత డిమాండ్ ఉన్న సంగీత స్వరకర్తలలో ఒకరిగా మారారు. నేడు దక్షిణాదిలోని ప్రతి దర్శకుడి మొదటి ఎంపిక అతనే. 2012లో '3' సినిమాతో తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఆ సినిమాలోని 'కొలవెరి డి..' పాట ఆప్పట్లో పెద్ద సెన్సేషన్ అని అందరికి తెలిసిందే. అనిరుధ్ రవిచందర్ ఐశ్వర్యకు కజిన్ అవుతాడు. కానీ ధనుష్ మాత్రం అనిరుధ్‌లోని ప్రతిభను గుర్తించాడని ఐశ్వర్య తెలిపింది. అనిరుద్ సక్సెస్ జర్నీ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది అతను మా బంధువు అయినందుకు సంతోషంగా ఉంది. ధనుష్ వల్లే అనిరుధ్ సినిమాల్లోకి వచ్చాడు. అనిరుధ్‌ను మొదట సింగపూర్‌కు పంపించి చదివించాలని ఆయన తల్లిదండ్రులు అనుకున్నారు. కానీ ధనుష్ మాత్రం సంగీతంపై మక్కువ కొనసాగించాలని అన్నారు. ప్రతిభను ఎలా గుర్తించాలో ధనుష్‌కి తెలుసు. ఇక్కడే ఉండి విజయాన్ని అందుకోవాలని అనిరుధ్‌ని ధనుష్ ఒప్పించాడని ఐశ్వర్య తెలిపింది. కీబోర్డ్ కొనడం నుంచి పాటలు రాయమని ఒత్తిడి చేయడం వరకు ప్రతిదానికీ ధనుష్‌కే క్రెడిట్ ఉంది. అనేలా ఐశ్వర్య తెలిపింది. దీంతో తన మాజీ భర్త ధనుష్‌తో ఐశ్వర్య మళ్లీ ప్రేమలో పడినట్లు ప్రచారం జరుగుతుంది. కానీ ఈ విషయంపై ఆమె నుంచి ఎలాంటి ప్రకటన జరగలేదు. -
అట్టర్‌ఫ్లాప్‌గా లాల్‌సలామ్.. నాన్నవల్లేనన్న ఐశ్వర్య రజనీకాంత్!
లాల్ సలామ్.. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా చతికిలపడింది. ఈ మూవీలో రజనీకాంత్‌ది అతిథి పాత్ర మాత్రమే! విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. అయితే కూతురే డైరెక్టర్ కావడంతో రజనీ గెస్ట్‌గా నటించేందుకు ఓకే చెప్పాడు. కానీ ఆయన అలా వచ్చి ఇలా వెళ్లిపోతే ఏం బాగుంటుందని తన పాత్రను బలవంతంగా పొడిగించారట. దానివల్లే ఈ సినిమా ఫ్లాప్ అయిందంటోంది ఐశ్వర్య రజనీకాంత్. రజనీ ఇమేజ్‌కు తగ్గట్లుగా.. తాజాగా ఆమె మాట్లాడుతూ.. 'లాల్ సలామ్ చిత్రంలో మొయిదీన్ భాయ్ పాత్ర నిడివి మొదట్లో 10 నిమిషాలే అనుకున్నాం. కానీ ఎప్పుడైతే ఆయన(రజనీకాంత్) ఆ రోల్ చేస్తానన్నాడో తన రేంజ్‌కు పది నిమిషాలు పెడితే ఏం బాగుంటుందనుకున్నాం.. నిడివి పెంచాలని డిసైడయ్యాం. దీంతో స్క్రిప్ట్ మారిపోయింది. మొయిదీన్ భాయ్ చుట్టూ సినిమా తిరిగేలా ప్లాన్ చేశాం. నిజానికి అతడు ఇంటర్వెల్ వస్తాడు. కొన్ని కారణాల వల్ల తనను సినిమా ప్రారంభంలోనే పరిచయం చేశాం. లేదంటే ప్రేక్షకులు ఇంటర్వెల్ వరకు ఓపిక పట్టలేరేమోనని భయపడ్డాం.. అందుకే సినిమా అంతటా ఆయన ఉండేలా రకరకాలుగా ఎడిట్ చేయాల్సి వచ్చింది. ఆయన్ను చూశాక సినిమా పట్టించుకోలేదు సినిమాలో కంటెంట్ బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే రజనీకాంత్‌ను చూపించామో అంతా నీరుగారిపోయింది. ఆయన్ను చూశాక మిగతా కథ గురించి, పాత్రల గురించి ఎవరూ పట్టించుకోలేదు. అంటే రజనీకాంత్ సినిమా అంటే పూర్తిగా ఆయన గురించి మాత్రమే ఉండాలి. అది కాకుండా వేరే వాటిపై ఫోకస్ చేస్తే జనాలు ఒప్పుకోరని నాకు ఈ సినిమాతో తెలిసొచ్చింది. ఆయన ఉంటే మిగతావాటిపై ఎవరూ ఫోకస్ చేయలేరు. అంతగా డామినేట్ చేస్తాడు' అని చెప్పుకొచ్చింది. చదవండి: రెండో పెళ్లి చేసుకున్న నటి మాజీ భర్త.. ఆశీర్వదించండంటూ పోస్ట్.. -
లాల్ సలామ్ డిజాస్టర్.. ఆ హీరోతో ప్లాన్ చేస్తోన్న ఐశ్వర్య!
కోలీవుడ్ డైరెక్టర్ ఐశ్వర్య రజినీకాంత్ మరో నటుడితో చిత్రం చేయడానికి సిద్ధమవుతున్నారా? అని అంటే ఈ ప్రశ్నకు కోలీవుడ్ వర్గాల నుంచి అవుననే సమాధానమే వస్తోంది. గతంలో ధనుష్ కథానాయకుడిగా ఒక చిత్రం, గౌతమ్ కార్తీక్ కథానాయకుడిగా వై రాజా వై అనే చిత్రాన్ని తెరకెక్కించారు ఐశ్వర్య రజనీకాంత్. ఈ రెండు చిత్రాలు ఆశించిన విజయాలను సాధించకపోవడంతో ఐశ్వర్య తర్వాత చిత్రానికి కొంత గ్యాప్ తీసుకున్నారు. ఆ తరువాత ఇటీవల తన తండ్రి రజనీకాంత్‌ను గౌరవ పాత్రలో నటింపజేసి రూపొందించిన చిత్రం లాల్ సలామ్. ఇందులో నటుడు విష్ణువిశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ సంగీతాన్ని అందించారు. క్రికెట్లోని అసమానతలు, మత విభేదాల గురించి చర్చించిన ఈ చిత్రం కూడా ఇటీవల భారీ అంచనాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా మిగిలింది. తాజాగా ఐశ్వర్య మరో చిత్రానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సిద్ధార్థ్‌ను కథానాయకుడిగా నటింపచేయడానికి చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. ఈ చర్చలు సఫలమైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రం పైన ఐశ్వర్యకు హిట్ అందిస్తుందో లేదో వేచి చూడాల్సిందే. -
కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీ.. ఇది మరీ విడ్డూరం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పవర్ ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలామ్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంతమాత్రంగానే వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరుసగా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొనడం విశేషం. హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్ సలామ్ చిత్రం సక్సెస్ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu — Lyca Productions (@LycaProductions) February 23, 2024 చదవండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్ -
ఆ ఒక్క పాట సినిమాను చంపేసింది: ఐశ్వర్య రజనీకాంత్
హీరో ధనుష్‌ను ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ చేసిన పాట 'వై దిస్ కొలైవెరి..'. ధనుష్ రాసిన ఈ పాటకు అనిరుధ్ బాణీలు కట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలిగా పరిచయం అయిన '3' చిత్రంలోనే పాటే ఇది! 2012లో విడుదలైన ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అన్న సామెత మాదిరి ఈ మూవీలో వై దిస్ కొలైవెరిడీ పాట విపరీతంగా పాపులర్ అయ్యింది. ఎంతగా అంటే స్వయంగా దేశ ప్రధాని అప్పట్లో ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌ను విందుకు ఆహ్వానించి అభినందించారు. సినిమాను చంపేసింది ఆ సమయంలో ఏ వీధిలో చూసినా వై దిస్ కొలైవెరి పాటే వినిపించేది. అయితే ఈ పాట 3 చిత్రాన్ని చంపేసిందని ఆ సినిమా దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ వ్యక్తం చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఆమె డైరెక్ట్ చేసిన కొత్త మూవీ లాల్ సలామ్. రజనీకాంత్, విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని లైకా సంస్థ నిర్మించింది. ఏఆర్.రెహ్మన్ సంగీతాన్ని అందించిన ఈ మూవీ శుక్రవారం తెరపైకి వచ్చింది. ఈ సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో దర్శకురాలు ఐశ్వర్య రజనీకాంత్ తన తొలి చిత్రం 3 గురించి ప్రస్తావించారు. పాట వల్లే సినిమా మరుగునడపింది జీవితంలో కొన్ని అనూహ్య సంఘటనలు జరగాలని ఉంటే వాటికి మనం సిద్ధపడాలన్నారు. తన జీవితంలో 3 చిత్రం విషయంలోనూ అలాగే జరిగిందన్నారు. అందులోని వై దిస్ కొలైవెరి సాంగ్ అనూహ్య విజయాన్ని సాధించిందన్నారు. అయితే అది చిత్రానికి బలం కావాల్సింది బలహీనంగా మారిందన్నారు. ఇంకా చెప్పాలంటే ఆ పాట చిత్రాన్ని చంపేసిందన్నారు. ఇటీవల రీ రిలీజ్ అయినప్పుడు పలువురు తనకు ఫోన్ చేసి అభినందనలు తెలిపారన్నారు. చిత్ర నిర్మాణ సమయంలో గానీ, మొదటగా విడుదల అయినప్పుడు రాని అభినందనలు ఇప్పుడు రావడానికి కారణం వై దిస్ కొలైవెరి పాట చిత్రాన్ని మరుగున పడేయడమేనని ఐశ్వర్య పేర్కొన్నారు. చదవండి: శింబు సినిమాలో కమల్ హాసన్ గెస్ట్ రోల్? -
బిగ్ డీల్‌తో ఓటీటీలోకి 'లాల్ సలామ్'.. భారీగా రజనీకాంత్ రెమ్యునరేషన్
ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన మూడో చిత్రం 'లాల్ సలామ్'. ఈ చిత్రంలో యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించగా.. రజనీకాంత్ అతిధి పాత్రలో మెప్పించారు. లైకా ప్రొడక్షన్స్ ద్వారా సుభాస్కరన్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాలతో ఫిబ్రవరి 9న విడుదలైంది. కానీ ప్రేక్షకులను నిరాశపరిచింది. సాధారణంగా రజనీకాంత్ చిత్రాలకు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్లో కూడా మంచి డిమాండ్ ఉంటుంది. ఈ చిత్రంలో మొయిదీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలేదు. కానీ తెలుగు రాష్ట్రాల్లో లాల్ సలాం సినిమాను చూసే వాళ్లు లేకపోవడంతో భారీగా స్క్రీన్స్ తగ్గించేశారు. కొన్ని చోట్ల షోలు క్యాన్సిల్ చేసి డబ్బు కూడా ప్రేక్షకులకు రిటర్న్ ఇచ్చేశారు. ఓటీటీలో ఎప్పుడు అయితే తాజాగా ఈ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ గురించి నెట్టింట ఓ వార్త ప్రచారం జరుగుతుంది. లాలా సలాం ఓటీటీ రైట్స్‌ను భారీ ధరకు నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. సినిమా విడుదలైన 60 రోజులకు స్ట్రీమింగ్ చేయాలని అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట. కానీ సినిమా అనుకున్నంతగా ప్రేక్షకులను మెప్పించకపోవడంతో కేవలం 30 రోజుల్లోనే ఓటీటీలో విడుదల చేయాలని నెట్‌ఫ్లిక్స్ ప్లాన్ చేస్తుందట. నిమిషానికి రూ. 1.30 కోట్ల రెమ్యునరేషన్ లాల్ సలామ్ సినిమా కోసం రజనీకాంత్ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారో అంటూ ఇప్పటికే పలు కథనాలు వచ్చాయి. ఈ సినిమాలో ఆయన కేవలం 30 నిమిషాలు మాత్రమే కనిపిస్తారు. రజనీ ఉన్నంత సేపు సినిమా ఒక రేంజ్లో ఉంటుంది. అందులో ఎలాంటి సందేహం లేదు. ఈ మూవీ కోసం రజనీకాంత్ సుమారు రూ. 40 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు సమాచారం. అంటే ఈ లెక్కన నిమిషానికి రూ. 1.30 కోట్లు రజనీ తీసుకున్నట్లు తెలుస్తోంది. -
సింగిల్‌గా ఉంటేనే చాలా సేఫ్, ఒంటరితనమే బాగుంది: ఐశ్వర్య
విడాకులు.. కొంతకాలంగా ఈ ట్రెండ్ కామన్ అయిపోయింది. పెళ్లి చేసుకున్న ఏడాదికి, పెళ్లయిన 20 ఏళ్లకు.. ఇలా ఎప్పుడంటే అప్పుడు ఎంతో ఈజీగా బంధాలు తెంచేసుకుంటున్నారు. కలకాలం కలిసి ఉంటామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేసినా సరే దాన్ని నిలబెట్టుకోవడంలో విఫలమవుతూనే ఉన్నారు. ఇకపోతే కోలీవుడ్‌లో స్టార్ జంటగా వెలుగొందిన ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ రెండేళ్లక్రితం విడిపోయారు. సినిమాలపై ఫోకస్ విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరూ విడివిడిగా జీవిస్తున్నారు. ధనుష్ తన సినిమాల మీద ఫోకస్ చేయగా ఐశ్వర్య కూడా దర్శకత్వంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో తను డైరెక్ట్ చేసిన లాల్ సలాం మూవీ ఫిబ్రవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇందులో ఆమె తండ్రి రజనీకాంత్ కీలక పాత్ర పోషించాడు. ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్ అందుకుంటోంది. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఓ యూట్యూబ్ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి మాట్లాడింది. ఒంటరితనమే బాగుంది 'గత రెండేళ్లుగా ఒంటరితనంతోనే సావాసం చేస్తున్నాను. అయితే ఈ ఒంటరితనాన్ని నేను ఆస్వాదిస్తున్నాను. నేను గ్రహించిన ఓ ముఖ్య విషయం ఏంటంటే.. ఒంటరిగా ఉన్నప్పుడే మరింత సురక్షితంగా ఉండగలం. ఈ ఏకాంతం నాకు చాలా బాగా నచ్చింది. వాయ్ రాజా వాయ్ (2015) సినిమా తర్వాత పిల్లల కోసం సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నాను. కానీ ప్రపంచం చాలా వేగంగా ముందుకు వెళ్లిపోతోంది. టైమే తెలియడం లేదు. పిల్లలు ఎదిగే సమయంలో వారితో ఉండాలనుకున్నాను. అదే ఈజీ.. అందుకే అప్పుడు సినిమాలకు దూరంగా ఉన్నాను. ఇక చెప్పాలంటే జీవితాన్ని ఒంటరిగా లాక్కురావడమే ఈజీగా ఉంది' అని చెప్పుకొచ్చింది. దీంతో వీరు ఎప్పటికైనా కలుస్తారని అభిమానులు పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. కాగా ఐశ్వర్య- ధనుష్ 2004లో పెళ్లి చేసుకున్నారు. వీరికి లింగ, యాత్ర అని ఇద్దరు కుమారులు జన్మించారు. దాదాపు 18 ఏళ్లపాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఐశ్వర్య- ధనుష్ 2022లో విడిపోతున్నట్లు ప్రకటించి అందరికీ షాకిచ్చారు. చదవండి: బికినీలోనే కాదు అవసరమైతే అంటూ.. బోల్డ్ కామెంట్ చేసిన హీరోయిన్ -
సూపర్ స్టార్ సినిమాకు షాక్.. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే. కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. -
Lal SalaamTwitter Review: 'లాల్ సలాం' ట్విటర్ రివ్యూ
మొయిద్దీన్ భాయ్‌గా థియేటర్లో అడుగుపెట్టేశారు రజనీకాంత్. ఆయన కీలక పాత్ర పోషించిన 'లాల్ సలాం' నేడు ఫిబ్రవరి 9న విడుదలైంది. చాలా ఏళ్ల తర్వాత ఈ చిత్రంతో తన కుమార్తె ఐశ్వర్య దర్శకత్వం వహించింది. లైకా ప్రొడక్షన్స్ సంస్థలో సుభాస్కరణ్ ఈ మూవీని నిర్మించారు. విష్ణు విశాల్ , విక్రాంత్ ప్రధాన పాత్రల్లో నటించారు. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ యాక్షన్ మూవీలో టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ అతిథిగా మెప్పించారు. ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇచ్చారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె మళ్లీ బిగ్ స్క్రీన్‌పై కనిపించారు. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు తమిళనాడులోని అన్ని ప్రదేశాల్లో ఫస్ట్‌డే ఫస్ట్ షో పడిపోయింది. మతాన్ని నమ్మితే మనసులో ఉంచుకో. మానవత్వాన్ని అందరితో పంచుకో. భారతీయుడిగా నేర్చుకోవల్సింది ఇదే అని సినిమా చూసిన ప్రేక్షకులు కామెంట్లు చేస్తున్నారు. మత సామరస్యం ప్రధాన కాన్సెప్ట్‌తో ఈ సినిమా తెరకెక్కింది అని చాలా జాగ్రత్తగా ఈ కథన ఐశ్వర్య డైరెక్ట్ చేశారని నెటిజన్లు తెలుపుతున్నారు. లాల్ సలాం ఇచ్చిన సామాజిక సందేశం అందరినీ మెప్పిస్తుందని తెలుపుతున్నారు. ముఖ్యంగా రజనీకాంత్ ఎంట్రీ సీన్ మామూలగా ఉండదని ఫ్యాన్స్ చెబుతున్నారు. ఆ సమయంలో అందరికీ భాషా సినిమా గుర్తుకొస్తుందని తెలుపుతున్నారు. లాల్ సలాం చిత్రంలో రజనీకాంత్ ప్రత్యేక పాత్రలో కనిపించినా కథలో పూర్తిగా ఆయనే ఆక్రమించేశాడని చెప్పవచ్చు. ఇందులో ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అదరగొట్టేశాడని అంటున్నారు. ఆయన అందించిన బీజీఎమ్‌తో రజనీకాంత్ ఎలివేషన్ సీన్స్ పీక్స్‌కు చేరుకుంటాయని తెలుపుతున్నారు. లాల్ సలాం కథ అనేది పవర్ఫుల్ సబ్జెక్ట్ కానీ దానిని చెప్పడంలో కొంత వరకు ఐశ్వర్య విఫలం అయ్యారని కొందరు అభిప్రాయ పడుతున్నారు. రజనీకాంత్‌ను చాలా తక్కువ సమయంలో చూపించారని అంటున్నారు. విష్ణు - విక్రాంత్‌ల సీన్లు ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయని అంటున్నారు. సినిమాలో పెద్దగా ఎమోషనల్ కనెక్షన్ లేదని తెలుపుతూ ఫైనల్‌గా సాధారణ ఆడియెన్స్‌కు నిరాశ కలిగిస్తుందని చెబుతున్నారు. #LalSalaam - 🙏 Powerful Subject, Powerless Narration. Superstar more than extended cameo, Vishnu - Vikranth Neat. Sadly Poor Characterization. Scattered scenes & Abrupt Edits. Emotional Connect is missing. DISAPPOINTMENT! — Christopher Kanagaraj (@Chrissuccess) February 9, 2024 #LalSalaam 2nd Half 🔥🔥🔥🔥 A Tribute Film To All The Muslim Friends #Thalaivar Getup 💥🥵🙆♂️ We Won @ash_rajinikanth Akka 🏆 Social Message Was Very Well Told #LalSalaamFDFS #SuperstarRajinikanth pic.twitter.com/CdXZenCnzt — 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 9, 2024 Unexpected 🔥 THALAIVAR Entry #LalSalaam pic.twitter.com/TKSzbzSfm8 — 𝗘𝗻𝗶𝘀𝗵𝗠𝗦𝗗 (@enish_7) February 9, 2024 #LalSalaamReview Humanity should defeat religion Second half was disappointing in recent movies But #LalSalaam scores better post interval . Climax was hard ✨🔥 Winner ✨✨✨ pic.twitter.com/4uiWL1usi0 — Matt.S (@mattskumar) February 9, 2024 #LalSalaam Good watch! Strong story, ok screenplay and powerful climax. ARR songs are wonderful. #Thalaivar as usual rocks. Valiant attempt by the newbie director #AishwaryaRajinikanth 🤘🏼👍🏻👏🏻#LalSalaamFDFS #RegalTimesSquare #LalSalaamUSA@LycaProductions — Kodes (@KodesOn) February 9, 2024 Thank you Ethiraj College ♥️🤗#LalSalaam pic.twitter.com/n5fzI5gqsr — Vikranth Santhosh (@vikranth_offl) February 8, 2024 2nd Half increased the standards ✅ Climax will be talk of the town Overall, Vere Level Film 🔥🔥🙏 Not even a single flaw to point Kudos to @ash_rajinikanth 👏👏#LalSalaam #LalSalaamFDFS @rajinikanth #SuperstarRajinikanth pic.twitter.com/8wyJ3JXUsz — 𝐀𝐥𝐥𝐚𝐫𝐢 𝐑𝐚𝐦𝐮𝐝𝐮 𝐍𝐓𝐑 (@AllariRamuduNTR) February 9, 2024 -
'మా నాన్నకు అలాంటి అవసరం లేదు'.. సూపర్ స్టార్ కూతురు ఆసక్తికర కామెంట్స్!
రజనీకాంత్ పవర్ఫుల్ పాత్ర పోషించిన తాజా చిత్రం లాల్ సలామ్. ఈ చిత్రంలో ఆయన అతిథిగా మొహిద్దీన్ అనే పాత్రలో కనిపించారు. ఈ చిత్రానికి ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ భారీ ఎత్తున నిర్మించారు. విక్రాంత్ హీరోగా నటించిన ఈ చిత్రంలో నటి నిరోషా, జీవిత, తంబిరామయ్య, సెంథిల్, తంగదురై ముఖ్య పాత్రలు పోషించారు. కాగా సీనియర్ క్రికెట్ కళాకారుడు కపిల్ దేవ్ కూడా ఇందులో అతిథి పాత్ర పోషించడం మరో విశేషం. ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించిన లాల్ సలామ్ చిత్ర షూటింగ్ ఈ నెల 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమైంది. ఈ సందర్భంగా చిత్ర ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని చైన్నెలోని ఓ స్టార్ హోటల్లో నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ మాట్లాడుతూ.. లాల్ సలామ్ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమ వేదికపై తను మాట్లాడింది తన తండ్రి రజనీకాంత్‌కు తెలియదన్నారు. అయితే చిత్ర ప్రమోషన్ కోసమే తాను మాట్లాడినట్టు ఆ తర్వాత చైన్నె విమానాశ్రయంలో కొందరు మీడియా వారు తన తండ్రి వద్ద ప్రస్తావించారన్నారు. అందుకు చిన్న వివరణ ఇస్తున్నానని తెలిపారు. తన ద్వారానో.. లేదంటే చిత్రంలోని రాజకీయ అంశాల వల్లనో సూపర్ స్టార్ చిత్రం ఆడాల్సిన అవసరం లేదన్నారు. ఎలాంటి రాజకీయాలు లేని జైలర్ చిత్రం సూపర్ హిట్ అయిన విషయం అందరికీ తెలిసిందే అన్నారు. వ్యక్తిగత భావాలకు గౌరవం ఇచ్చే వ్యక్తి తన తండ్రి రజనీకాంత్ అని పేర్కొన్నారు. కాగా రాజకీయాలు అన్నవి ప్రతి రంగంలోనూ ఉంటాయని.. కానీ అలాంటి రాజకీయంతో కూడిన క్రికెట్ క్రీడా నేపథ్యంలో సాగే కథా చిత్రం లాల్ సలామ్ అని చెప్పారు. ఈ అవకాశాన్ని కల్పించిన లైకా ప్రాడక్షన్న్స్ అధినేత సుభాస్కరన్కు కృతజ్ఞతలు తెలిపారు. కాగా ఈ కార్యక్రమంలో నటుడు విష్ణు విశాల్, విక్రాంత్, తంబి రామయ్య, సెంథిల్ పాల్గొన్నారు. -
రజనీకాంత్ 'లాల్ సలాం' ట్రైలర్ విడుదల
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'లాల్ సలాం'. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్ తర్వాత రజనీకాంత్ నుంచి వస్తున్న సినిమా కావడంతో కోలీవుడ్‌లో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 9న లాల్ సలాం సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. విడుదలకు సమయం దగ్గరపడుతుండటంతో ఈ మూవీ ప్రమోషన్స్ కార్యక్రమాల స్పీడ్ పెంచేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా తమళ ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్ర యూనిట్. రజనీ పాత్ర ఎంతో పవర్ ఫుల్‌గా కనిపిస్తోంది. ఏడేళ్ల తర్వాత ఐశ్వర్య రజనీకాంత్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడం విశేషం. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై సుభాస్కరణ్ చిత్రాన్ని నిర్మించారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. సంగీతంతో ప్రయోగాలు చేసే మ్యూజిక్ దిగ్గజం ఏఆర్ రెహమాన్ ఈ చిత్రంతో మరో కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. దివంగత గాయకులు బంబా బక్యా, షాహుల్ హమీద్‌ల గాత్రాన్ని కృత్రిమ మేధస్సు సాంకేతికత ద్వారా పునఃసృష్టించి 'లాల్ సలామ్' చిత్రంలో వినిపించారు. 'తిమిరి ఎళుడా..' అనే ఈ సాంగ్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. 'లాల్ సలాం'లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ సీనియర్ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
'లాల్ సలామ్' పాటలో ఆ దివంగత సింగర్స్ గాత్రం
రజనీకాంత్ నటించిన లాల్ సలామ్ ఫిబ్రవరి 9న విడుదలవుతోంది. ఈ చిత్రంలో ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన 'తిమిరి ఎలుదా' అనే పాటను ఏఐ టెక్నాలజీతో రూపొందించారు. ఈ పాటలో దివంగత గాయకులు షాహుల్ హమీద్, బాంబ భక్య స్వరాలను ఉపయోగించడంతో ఆ పాటపై అందరిలో ఆసక్తి నెలకొంది. సంగీత ప్రపంచంలో ఇదొక అద్భుతం అని నెటిజన్ల నుంచి కామెంట్లు వస్తున్నాయి. ఇదెలా సాధ్యం అంటూ కొందరు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. దీంతో తాజాగా ఏఆర్ రెహమాన్ వివరణ ఇచ్చారు. లాల్ సలామ్ ఆడియోను కొద్దిరోజుల క్రితం చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఈ చిత్రంలోని పాటలకు మంచి టాక్ వచ్చింది. కానీ ఇందులోని తిమిరి ఎలుదా అనే పాట కోసం గతంలో మరణించిన వారి వాయిస్ ఉపయోగించడంతో ఆయనపై కొంతమేరకు విమర్శలు వచ్చాయి. 'గతంలో మరణించిన ఆ ఇద్దరి సింగర్స్ వాయిస్ అల్గారిథమ్‌లను ఉపయోగించేందుకు వారి కుటుంబ సభ్యుల నుంచి అనుమతి తీసుకున్నాము. అందుకు గాను ఆ కుటుంబాలకు తగినంత పారితోషకాన్ని కూడా అందించడం జరిగింది. మంచి కోసం టెక్నాలజీని ఉపయోగించడంలో ఎలాంటి తప్పులేదు.' అని రెహమాన్ తన ఎక్స్ పేజీలో పోస్ట్ చేశారు. మరణించిన సింగర్స్ వాయిస్‌తో పాటలు రూపొందించడం ప్రపంచంలో ఇదే తొలిసారి అని చెబుతున్నారు. 1990లలో తన మ్యాజికల్ వాయిస్‌తో అభిమానులను ఉర్రూతలూగించిన షాహుల్ హమీద్. ఏఆర్ రెహమాన్ మ్యూజిక్‌లో పలు సాంగ్స్ పాడటం జరిగింది. 1997లో ఆయన తుది శ్వాస విడిచారు. బాంబ భక్య కూడా రెహమాన్ మ్యూజిక్‌లో పాటలు పాడారు. ముఖ్యంగా రోబో, బిగిల్,పొన్నియిన్ సెల్వన్ వంటి చిత్రాల్లో ఆయన గాత్రం పాపులర్ అయింది. 2022లో ఆయన కూడా మరణించిన విషయం తెలిసిందే. అమ అభిమాన సింగర్స్ గాత్రాన్ని ఏఐ టెక్నాలజీతో మళ్లీ మరోసారి వినేలా చేసిన రెహమాన్‌కు ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇక లాల్ సలామ్ సినిమా విషయానికి వస్తే.. రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఇందులో నటించారు. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. -
కూతురు మాటలకు క్లారిటీ ఇచ్చిన రజనీకాంత్
రజనీకాంత్ అతిథిగా పవర్ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలాం. విష్ణు విశాల్, విక్రాంత్ నటించిన ఈ చిత్రానికి రజనీ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఫిబ్రవరి 9న ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. ఇటీవల ఈ చిత్ర ఆడియో ఆవిష్కరణ కార్యక్రమాన్ని చైన్నెలోని ఒక ప్రైవేటు కళాశాలలో నిర్వహించారు. దర్శకురాలు ఐశ్వర్య మాట్లాడుతూ నిజానికి తన తండ్రి సంగీ కాదని ఆయన సూపర్‌స్టార్ అని అన్నారు. సంఘీ అయితే లాల్ సలాం చిత్రంలో ఆయన నటించే వారే కాదని పేర్కొన్నారు. సంఘీ అంటే మతవాది అనే అర్థం వస్తుంది. కాగా రజనీకాంత్ సోమవారం ఉదయం జ్ఞానవేల్ దర్శకత్వంలో నటిస్తున్న వేట్టైయాన్ చిత్ర షూటింగ్ కోసం ఏపీలోని కడప వెళ్లారు. అక్కడ విమానాశ్రయంలో మీడియాతో ఐశ్వర్య మాట్లాడిన సంఘీ అంశం గురించి ప్రశ్నించగా సంఘీ అంటే చెడ్డ పదం కాదని రజనీకాంత్ స్పష్టం చేశారు. ఐశ్వర్య ఎక్కడా తప్పుగా మాట్లాడలేదని పేర్కొన్నారు. తన తండ్రి ఒక ఆధ్యాత్మిక భావాలు కల వ్యక్తి అని.. ఎందుకు అలాంటి దృష్టిలో చూస్తారని మాత్రమే అన్నారని వివరించారు. అయినా ఈ చర్చ లాల్ సలాం చిత్ర ప్రచారం కోసం కాదని, లాల్ సలాం చిత్రం అద్భుతంగా వచ్చిందని పేర్కొన్నారు. -
మా నాన్న అలాంటి వారు కాదన్న ఐశ్వర్య.. కన్నీళ్లు పెట్టుకున్న రజనీకాంత్
సూపర్ స్టార్ రజనీకాంత్ లాల్ సలామ్ సినిమా ఆడియో లాంచ్ కార్యక్రమం తాజాగా చెన్నైలో జరిగింది. ఫిబ్రవరి 9న ఈ సినిమా విడుదల కానుంది. తాజాగా భారీ ఎత్తున జరిగిన ఆడియో లాంచ్ కార్యక్రమంలో రజనీకాంత్, ఆయన భార్య లత, కుమార్తెలు ఐశ్వర్య, సెలందర్య, మనవళ్లు యాత్ర, లింగ పాల్గొన్నారు. వీరితో పాటు దర్శకులు నెల్సన్, కేఎస్ రవికుమార్, నిర్మాత కలైపులి ఎస్ థాను సహా ప్రముఖులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. లాల్ సలామ్ చిత్రానికి దర్శకురాలు అయిన ఐశ్వర్య రజనీకాంత్ తన తండ్రి గురించి, సినీరంగంలో తనకు ఎదురవుతున్న సవాళ్ల గురించి ఓపెన్‌గానే మాట్లాడింది. 'మా నాన్నగారు 35 ఏళ్లుగా వెండితెరపై నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఆ పేరుకు భంగం కలిగించే హక్కు ఏ కూతురికి ఉండదు. ఈ సినిమా కథ నచ్చడంతో లాల్ సలామ్‌లో నటించడానికి ఆయన అంగీకరించారు. అందరూ అనుకుంటున్నట్లుగా ఆయన నా కోసం ఈ చిత్రంలో నటించలేదు. ఈ సినిమా కోసం పనిచేసిన టీమ్‌ను నమ్మి రజనీకాంత్, సంగీత దర్శకులు ఏఆర్ రెహమాన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వారిద్దరు కలిసి ఉన్న ప్రాజెక్ట్‌లో పనిచేయడం మా అందరికి గొప్ప వరం. ఒక స్టార్‌కు అమ్మాయి అని గుర్తింపు ఉంటే చాలు ఇక్కడ ఎవరూ సినిమా అవకాశం ఇవ్వరు. చిత్ర పరిశ్రమలో మీరు పెద్ద వ్యక్తి అయినప్పటికీ, వారు మీకు సినిమా ఛాన్స్ ఇవ్వరు. కారణం ఎంటో నాకు తెలియదు. కొత్తవారికే ఛాన్సులు ఇస్తారు కానీ మాకు సినిమా అవకాశం ఇవ్వరు. ఆ విషయం చిత్రపరిశ్రమలో ఉన్నవారికే తెలుస్తుంది. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాం. ఎన్నో అవాంతరాలు వచ్చినా ముందుకు సాగాం. ఈ క్రమంలో దాదాపు 2 ఏళ్ల పాటు ఈ సినిమాకు పని చేస్తున్నప్పుడు నా పిల్లలతో ఎక్కువ సమయం గడపలేకపోయాను. వారి పాఠశాలలో సమావేశానికి కూడా హాజరు కాలేదు. అయినా వారు నన్ను సపోర్ట్ చేస్తారు. నా పిల్లలే నా గొప్ప బహుమతి.' అని ఐశ్వర్య తెలిపింది. నాన్న అలాంటి వారు కాదు: ఐశ్వర్య సోషల్‌మీడియా వేదికగా తన నాన్నగారిపైన చాలా నెగటివిటీని వ్యాప్తి చేస్తున్నారని ఐశ్వర్య బాధపడింది. ' నాన్నగారిపై వస్తున్న నెగటివిటీ గురించి నా టీమ్ ద్వారా తెలుసుకున్నాను. ఒక్కోసారి అలాంటి వాటిపై చాలా కోపం వస్తుంది. మేము కూడా మనుషులమే కదా.. మాకు కూడా భావోద్వేగాలు ఉంటాయి. చాలా మంది నా తండ్రిని సంఘీ (మతవాది) అంటూ ప్రచారం చేస్తుంటే బాధేస్తుంది. దానికి అర్థం కూడా నాకు తెలియదు. ఒక మతానికి మద్దతు ఇచ్చేవారిని సంఘీ అని పిలుస్తారని తర్వాత తెలుసుకున్నాను. దీంతో ఆయనపై చెడుగా వ్యాప్తి చేశారు. రజనీకాంత్ ఎప్పటికీ సంఘీ కాదు.. ఆయన అలాంటి వారే అయితే లాల్ సలామ్ చిత్రంలో నటించే వారే కాదు.' అని ఐశ్వర్య చెప్పింది. స్టేజీపై తన కూతురు మాటలు వింటూనే రజనీకాంత్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ఏ కుటుంబంలో అయినా అమ్మాయికి ఏదైనా సమస్య వస్తే నాన్న డబ్బులు ఇస్తారేమో కానీ సినిమా ఛాన్స్ ఇవ్వరు. నా కోసం మాత్రమే ఈ చిత్రాన్ని రజనీకాంత్ ఒప్పుకోలేదు. కథ చెప్పిన తర్వాత ఆయనకు నచ్చే ఈ సినిమాలో నటించడానికి అంగీకరించారు. నాన్నేం చిన్న పిల్లవాడు కాదు. ఆయనకు అన్నీ తెలుసు. కథలో బలం ఉంది కాబట్టే ఒప్పుకున్నారు. మానవత్వం ఉన్న వ్యక్తి మాత్రమే ఈ కథకు సెట్ అవుతారు. అందుకే నాన్నగారిని ఈ పాత్ర కోసం కలిశాం. ఆయన కూడా బాగుంది నేను చేస్తానని ముందుకు వచ్చారు.' అని ఐశ్వర్య చెప్పింది. లాల్ సలామ్ చిత్రంలో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా హీరోయిజం చూపనున్నారు. రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య ఐదేళ్ల తర్వాత ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏ.ఆర్.రెహమాన్ సంగీతం అందించారు. విష్ణు విశాల్, విక్రాంత్ కీలక పాత్రలు పోషించారు. కపిల్‌దేవ్, జీవిత రాజశేఖర్ అతిథి పాత్రల్లో కనిపించనున్నారు. ఫిబ్రవరి 9న ఈ చిత్రం విడుదల కానున్న విషయం తెలిసిందే. ரஜினிகாந்த் சங்கி கிடையாது" - ஐஸ்வர்யா ரஜினிகாந்த் #AishwaryaRajinikanth | #Rajinikanth𓃵 | #LalSalaamAudioLaunch | #LalSalaam pic.twitter.com/fDF2Bfa1jg — Jerold (@Jerold25961839) January 26, 2024 -
రజనీకాంత్‌తో పోటీకి దిగుతున్న ధనుష్
నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన తాజా చిత్రం కెప్టెన్ మిల్లర్. నటి ప్రియాంక అరుణ్ మోహన్ నాయకిగా నటించగా నివేదిత సతీస్, జాన్ కొక్కెన్, సుమేష్కుమార్, శివరాజ్ కుమార్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. అరుణ్ మాదేశ్వరన్ కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహిస్తున్న ఈ చిత్రాన్ని సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ భారీ బడ్జెట్లో నిర్మిస్తోంది. జీవీ ప్రకాష్‌కుమార్ సంగీతాన్ని అందిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే షూటింగ్పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలను జరుపుకుంటోంది. కాగా కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ముందుగా నిర్మాతలు ప్రకటించారు. ఇదే సమయంలో రజనీకాంత్ సినిమా కూడా విడుదల కానుంది. ఆయన ప్రధాన పాత్రలో నటించిన లాల్ సలామ్ సినిమా కూడా పొంగల్‌కు రెడీ అయిపోయింది. ఈ చిత్రానికి ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. రజనీకాంత్ సినిమాతో పోటీ ఎందుకని కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగానే అంటే డిసెంబర్ నెలలోనే విడుదల చేయనున్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అయింది. ఈ విషయంలో చిత్ర నిర్మాతలు క్లారిటీ ఇచ్చారు. కెప్టెన్ మిల్లర్ చిత్రాన్ని ముందుగా నిర్ణయించిన ప్రకారమే అంటే సంక్రాంతి సందర్భంగా విడుదల చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ సంక్రాంతి పండుగరోజు రజనీకాంత్‌కు, ధనుష్‌కు మధ్య పోటీ తప్పనిసరిగా మారింది. లాల్ సలామ్ చిత్ర ట్రైలర్ ఇటీవల విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. అదే విధంగా ధనుష్ నటించిన కెప్టెన్ మిల్లర్ చిత్ర టీజర్, పాటలు విడుదలై ట్రెండింగ్ అవుతున్నాయి. దీంతో ఈ రెండు చిత్రాలకు ప్రేక్షకులు ఇచ్చే రిజల్ట్స్ పైనే సినీ వర్గాల్లోనూ, అటు అభిమానుల్లోనూ ఆసక్తి నెలకొంది. కెప్టెన్ మిల్లర్ 2024 జనవరి 15న విడుదల అవుతుండగా... లాల్ సలామ్ సంక్రాంతికి విడుదల అని మాత్రమే ప్రకటించారు. -
రూల్స్ బ్రేక్ చేసిన ధనుష్ కుమారుడికి ఫైన్ వేసిన పోలీసులు
తమిళ చిత్రసీమలోనే కాకుండా భారతీయ చిత్రసీమలో కూడా ప్రముఖ నటుడిగా కొనసాగుతున్నాడు ధనుష్.. రీసెంట్గా తెలుగులో 'సార్' సినిమాతో మెప్పించాడు. సాధారణ వ్యక్తిలా తన కెరియర్ను ప్రారంభించిన ధనుష్ ఎంతో కష్టపడి కోలీవుడ్‌లో స్టార్ హీరోగా ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్యను 2004లో ధనుష్ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. సుమారు 18 ఏళ్ల తర్వాత వారిద్దరి మధ్య ఒక్కసారిగా మనస్పర్థలు రావడంతో రెండేళ్ల క్రితం నుంచి విడివిడిగా ఉంటున్నారు కానీ వారిద్దరి పిల్లలు యాత్ర, లింగ ప్రస్తుతానికి ఐశ్వర్య రజనీకాంత్ వద్దే ఉంటున్నారు. తరుచూ వారిద్దరూ ధనుష్ వద్దకు వెళ్తూ ఉంటారు. తాజాగా ధనుష్ పెద్ద కుమారుడు యాత్ర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించినందుకు తమిళనాడు పోలీసులు జరిమానా విధించారు. ఈ ఉదంతం కాస్త ఆలస్యంగా వెలుగులోకి రావడంతో పలు తమిళ మీడియా సంస్థలు కూడా అదే కథనాన్ని ప్రచురించాయి. తన YZF R15 బైక్‌ను నడుపుతున్న సమయంలో యాత్ర హెల్మెట్ లేకుండా పోలీసుల కెమెరాలకు చిక్కాడు. అతనికి డ్రైవింగ్ లైసెన్స్ కూడా లేదు. ఆ సమయంలో అతను తన తాత రజనీకాంత్ ఇంటి నుంచి తన తండ్రి ధనుష్ ఇంటికి ద్విచక్ర వాహనంలో వెళ్లినట్లు సమాచారం. ఆ సమయంలో అతివేగంతో ద్విచక్రవాహనాన్ని నడిపిన వీడియో వైరల్‌గా మారింది. ఆ వీడియోలో ఉన్న వ్యక్తి నిజంగానే ధనుష్ కొడుకు యాత్రే అని పోలీసులు నిర్ధారించారు. దీంతో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించినందుకు రూ.1000 జరిమానా విధించారు. -
'లాల్ సలాం' టీజర్ రిలీజ్.. మొయిద్దీన్ భాయ్‌గా మెప్పించిన రజినీకాంత్
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. తాజాగా లాల్ సలాం టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. జైలర్‌తో సూపర్ హిట్ అందుకున్న రజనీకాంత్ ఈ చిత్రంలో ముస్లిం నాయకుడిగా కనిపించనున్నాడు. క్రికెట్‌తో మొదలైన గొడవలు సమాజంలో మతాల మధ్య చిచ్చుపెట్టేలా ఎందుకు మారాయి..? అనేది కథాంశం. టీజర్లో రజనీ సీరియస్ లుక్‌లో కనిపించగా.. విష్ణు విశాల్ ఏదో గొడవలో చిక్కుకున్నట్లు తెలుస్తోంది. క్రికెట్ ఆటతో ముడిపడి ఉన్న ఓ యాక్షన్ కథాంశంతో రూపొందిన చిత్రమిది. ఇందులో మొయిద్దీన్ భాయ్ అనే పాత్రలో రజనీకాంత్ చాలా పవర్‌ఫుల్‌గా కనిపించాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి లాల్ సలాం విడుదల కానుంది. -
'లాల్ సలాం' హార్డ్ డిస్క్‌లు మాయం.. రజనీ కాంత్‌కు సినిమాకు బ్రేకులు
రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ సంతోష్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రంలో రజనీకాంత్ అతిథి పాత్రలో కనిపించనున్నారు. 'లాల్ సలామ్' చిత్రం చివరి దశకు చేరుకుంటుండగా.. రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్‌లో కనిపించకుండా పోయాయని ప్రచారం జరుగుతుంది. జైలర్‌తో భారీ హిట్ అందుకున్న రజనీ కాంత్.. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న 'లాల్ సలామ్' చిత్రంలో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. క్రికెట్ గేమ్ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా.. హిందీ చిత్రం 'కై పో చే'కి (Kai Po Che) రీమేక్ అని అంటున్నారు. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించారు. ఈ చిత్రంలో రజనీ మొయిదీన్ భాయ్‌గా ప్రత్యేక పాత్రలో కనిపించారు. దీంతో సినిమాపై అంచనాలు పెరిగాయి. 'లాల్ సలామ్' చిత్రీకరణ పూర్తయి చివరి దశకు చేరుకుంటుండగా.. సినిమాలో రజనీకాంత్‌కు సంబంధించిన కొన్ని సన్నివేశాలు హార్డ్ డిస్క్ నుంచి మాయమైనట్లు సమాచారం. ఎంతో కష్టపడి రజనీ మీద చిత్రీకరించిన దృశ్యాలు ఎక్కడా హార్డ్ డిస్క్‌లలో కనిపించడం లేదట. ఆ దృశ్యాలను వెలికి తీసేందుకు విదేశాల నుంచి సాంకేతిక నిపుణులను రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు సమాచారం. దీంతో 2024 సంక్రాంతి రేసు నుంచి ‘లాల్ సలామ్ ’ సినిమా తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. పొంగల్‌కు ఇప్పటికే ప్రకటించినట్లుగా, శివకార్తికేయన్ నటించిన అయాలన్, జయం రవి నటించిన సైరన్ మాత్రమే కోలీవుడ్ విడుదల కానున్నాయి. ‘లాల్ సలాం’లో రజనీకాంత్ మొయిద్దీన్ భాయ్‌గా కనిపించనున్నారు. అలాగే ఈ సినిమాతో ప్రముఖ హీరోయిన్ జీవితా రాజశేఖర్ రీ ఎంట్రీ ఇవ్వనున్నారు. దాదాపు 33 ఏళ్ల తర్వాత ఆమె నటించనుండడంతో అటు కోలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ ఈ సినిమాపై ఆసక్తి నెలకొంది. -
ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలవనున్నారా? నిజమేంటంటే?
కోలీవుడ్ స్టార్ జంట ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ గతేడాది విడిపోయిన సంగతి తెలిసిందే! 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ వీరిద్దరూ విడిపోయారు. విడాకులు తీసుకోలేదు కానీ ఇద్దరూ ఏకాభిప్రాయంతో వేర్వేరుగానే జీవిస్తున్నారు. పిల్లల బాధ్యతను మాత్రం ఇద్దరూ చూసుకుంటున్నారు. అయితే వీరిద్దరూ విడాకుల విషయంలో ఓ అడుగు వెనక్కు వేశారని, త్వరలోనే మళ్లీ కలవబోతున్నారంటూ ఈ మధ్య ప్రచారం జరుగుతోంది. విడాకులు తీసుకోలే.. కానీ ఇందులో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. ధనుష్, ఐశ్వర్య.. ఇద్దరూ వారివారి పనుల్లో బిజీ అయ్యారు. ప్రస్తుతం వారి ఫోకస్ అంతా కెరీర్ పైనే ఉంది తప్ప భార్యాభర్తలుగా మళ్లీ కలిసిపోవాలన్న ఆలోచన అయితే ముమ్మాటికీ లేదు. కావున, వీరు మళ్లీ కలిసిపోనున్నారంటూ వస్తున్న వార్తల్లో నిజం లేనట్లు సమాచారం. అయితే వీళ్లు విడిపోయారే కానీ ఇంతవరకు విడాకులకు దరఖాస్తు చేయలేదు. మళ్లీ పెళ్లి చేసుకోవాలన్న ఆలోచన వచ్చినప్పుడో లేదంటే ఏదైనా అవసరం వచ్చినప్పుడు చూసుకుందాంలే అని లైట్ తీసుకుంటున్నారట.. తర్వాత ఎప్పుడైనా విడాకులు తీసుకోవచ్చులే అని ఆలోచిస్తున్నారట! తిరిగి కలిసే ఛాన్సే లేదా? భార్యాభర్తలుగా విడిపోయినప్పటికీ ఒకరిపై మరొకరికి ఎనలేని గౌరవం ఉంది. పిల్లల కోసం కొన్ని కార్యక్రమాల్లోనూ కలిసి పాల్గొనక తప్పడం లేదు. కానీ తిరిగి కలిసిపోయే ఛాన్స్ మాత్రం కనిపించడం లేదు! సినిమాల విషయానికి వస్తే.. ధనుష్ ప్రస్తుతం కెప్టెన్ మిల్లర్ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ డిసెంబర్లో విడుదలకు సిద్ధమవుతోంది. అలాగే తన 50వ సినిమాకు సన్నద్ధమవుతున్నాడు. హాఫ్ సెంచరీ కొట్టే సినిమాలో ధనుష్ నటించడమే కాకుండా దర్శకత్వం కూడా వహించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఐశ్వర్య రజనీకాంత్ లాల్ సలాం సినిమా నిర్మాణ పనులను చూసుకుంటోంది. చదవండి: అప్పట్లో సల్మాన్ పారితోషికం రూ.2.5 కోట్లు.. ఇప్పుడేకంగా.. -
రెండోపెళ్లి చేసుకోనున్న ఐశ్వర్య రజనీకాంత్..?
తమిళనటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ దంపతులు విడిపోతున్నట్లు గతేడాది ప్రకటించిన విషయం తెలిసిందే. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోషల్‌మీడియా వేదికగా ప్రకటించారు. కానీ మళ్లీ కొద్దిరోజుల కిందట విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఆ వార్తలపై అటు ధనుష్ కానీ, ఇటు ఐశ్వర్య కానీ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. దీంతో వీరిద్దరు మళ్లీ కలవడం అనేది అసాధ్యం అని అభిమానులు కామ్ అయిపోయారు. (ఇదీ చదవండి: నా కంటే 30 ఏళ్లు పెద్దవాడు.. అయినా పెళ్లి చేసుకుంటే: ప్రముఖ సింగర్) తాజాగా ఐశ్వర్య రజనీకాంత్ రెండోపెళ్లి చేసుకోబోతున్నారంటూ విపరీతంగా ప్రచారం జరుగుతుంది. ప్రస్థుతం ఆమె ఇద్దరు పిల్లలతో సింగిల్ మదర్‌గా ఉంటున్నారు. అంతే కాకుండా ఓ సినిమాకు డైరెక్షన్ కూడా చేస్తున్నారు. ఇలాంటి పుకార్లు రావడానికి ప్రధాన కారణం ఐశ్వర్యపై ఈమధ్య కోలీవుడ్‌కు చెందిన ఓ హీరోతో ఆమె కనిపించిందని తెలుస్తోంది. చెన్నైలోని ఓ రిసార్ట్‌లో అతడితో ఆమె సన్నిహితంగా మెలుగుతూ కనిపించడంతో ఈ రెండో పెళ్లిపై పుకార్లు బలంగా వ్యాపిస్తున్నాయి. ఇందులో ఎంతమేరకు నిజముందో తెలియదు. ఇదే విషయంపై ఐశ్వర్య రజనీకాంత్ స్పందిస్తే బాగుంటుందని అభిమానులు ఆశిస్తున్నారు. లేదంటే ఇలాంటి పుకార్ల వల్ల ఇమేజ్ దెబ్బతింటుందని వారు తెలుపుతున్నారు. ఎందుకు విడిపోయారు.. కారణం ఇదేనా? కారణం ఏంటనేది ఇప్పటికీ పూర్తిగా బయటకు తెలియదు. తామిద్దరం విడిపోతున్నట్లు మొదట ఐశ్వర్య ప్రకటించగా తర్వాత ధనుష్ ప్రకటించారు. దీంతో అంతా అవాక్కయ్యారు. కానీ సుచీ లీక్స్‌లో ధనుష్ ఫోటోలు బయటకు వచ్చినరోజు నుంచే వీరి మధ్య గొడవ స్టార్ట్ అయిందనే ప్రచారం ఉంది. ఆ తర్వాత ధనుష్ ఓ హీరోయిన్‌తో చనువుగా ఉండటం ఐశ్వర్యకి నచ్చలేదని, అందుకే ఐశ్వర్య విడాకులు ఇచ్చేందుకు రెడీ అయిందనే టాక్ ఉంది. కోలీవుడ్‌లో ధనుష్‌కు ఉన్న ఎఫైర్ విషయంలో ఐశ్వర్య చాలా కాలంగా భరిస్తూ వచ్చి.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. (ఇదీ చదవండి: ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు) -
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు ఊరట.. కేసు కొట్టివేసిన హైకోర్టు
నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్లకు చైన్నె హైకోర్టులో ఊరట లభించింది. వారిపై ఉన్న కేసును కొట్టేస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారు. ధనుష్ కథానాయకుడిగా ఐశ్వర్య రజనీకాంత్ నిర్మించిన చిత్రం 'వేలైయిల్లా పట్టాదారి' తెలుగులో రఘువరణ్ బీటెక్. ఈ చిత్రం 2014 జూలై నెలలో విడుదలైంది. కాగా ఇందులో ధనుష్ సిగరెట్లు కాల్చే సన్నివేశాలు ఎక్కువగా ఉన్నాయని, ఆ సందర్భాల్లో పొగ తాగడం ఆరోగ్యానికి హానికరం వంటి చట్టపరమైన నిబంధనల పాటించలేదంటూ టుబాకో నిరోధక శాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ఫిర్యాదు చేసింది. (ఇదీ చదవండి: చిరంజీవి గొప్ప మనసు.. ఉచిత కేన్సర్ స్క్రీనింగ్ టెస్టులు ప్రారంభం) దీంతో ఆరోగ్య శాఖ సహాయక నిర్వాహకుడు చైన్నె, సైదాపేట కోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్లకు నోటీసులు జారీ చేసింది. అయితే ఈ కేసులో తమ వ్యక్తిగతంగా హాజరుకాకుండా ఆదేశాలు జారీ చేయాలని, తమపై కేసును కొట్టివేయాలని ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ విడివిడిగా చైన్నె హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కాగా ఈ పిటిషన్ న్యాయమూర్తి ఆనంద్ వెంకటేష్ సమక్షంలో విచారణకు వచ్చింది. ధనుష్ తీర్పును న్యాయవాది విజయ్ సుబ్రమణియన్ హాజరై వాదించారు. వాదనల అనంతరం ఈ కేసులో సరైన ఆధారాలు లేవంటూ పిటిషన్ కొట్టివేస్తున్నట్లు నాయమూర్తి ఉత్తర్వులు జారీ చేశారు. -
రోజురోజుకీ మీపై ప్రేమ రెట్టింపవుతోంది, ఈ రోజు వస్తుందని ఊహించలేదు
‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్ స్టార్‌తో షూటింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయుద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్ సలామ్’లో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
దొంగతనం చేయడానికి ఐశ్వర్యే కారణం.. పనిమనిషి షాకింగ్ స్టేట్మెంట్
సూపర్ స్టార్ రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో కొన్ని రోజుల క్రితం భారీ చోరీ జరిగిన సంగతి తెలిసిందే. 60 సవర్ల బంగారు నగలు చోరీకి గురైయ్యాయని ఐశ్వర్య ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ఇంటి పనిషి ఈశ్వరిని నిందితురాలిగా గుర్తించారు. ఈమెను అరెస్ట్ చేసి విచారించగా తానే దొంగతనం చేసినట్లు ఒప్పుకుంది. అయితే తాను దొంగతనం చేయడానికి కారణం ఐశ్వర్యే అంటూ విస్తుపోయే సమాధానం ఇచ్చింది. 'నేను ఐశ్వర్య ఇంట్లో గొడ్డు చాకిరీ చేశాను. ఆమె చెప్పిన పనులన్నీ చేసేదాన్ని. అయితే ఐశ్వర్య దగ్గర బోలెడు డబ్బులు ఉన్నా నాకు రూ. 30వేల జీతమే ఇచ్చేవారు. ఆ డబ్బు ఒక కుటుంబం బతకడానికి సరిపోతుందా? అందుకే దొంగతనాలు చేయడం మొదలుపెట్టా. మొదట చిన్నచిన్న వస్తువులు దొంగిలించేదాన్ని. కానీ దొరికిపోలేదు. దీంతో ధైర్యం చేసి నగలు కూడా దొంగతనం చేశాను' అంటూ విచారణలో ఈశ్వరి చెప్పుకొచ్చింది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే.. ఐశ్వర్య చెప్పినదాని కంటే ఈశ్వరి ఇంట్లో ఇంకా ఎక్కవ బంగారమే దొరికింది. ఆమె ఐశ్వర్య ఇంటితో పాటు రజనీకాంత్, ధనుష్ ఇళ్లలో కూడా పనిచేసేదట. దీంతో ఆ నగలు అక్కడ దొంగిలించిందా? అన్న కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఐశ్వర్య అనుమానమే నిజమైంది.. ఇంటి పనివాళ్లే దొంగలు
సూపర్‌స్టార్ రజనీకాంత్ కూమార్తె ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో ఇటీవల దుండగులు దొంగతనానికి పాల్పడిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ కేసులో ఇద్దరు మహిళలతో పాటు డ్రైవర్ వెంకటేశ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐశ్వర్య అనుమానించినట్టుగానే ఆమె ఇంటి పనివాళ్లే ఈ చోరీ చేసినట్లు వెల్లడైంది. పోలీసుల సమాచారం ప్రకారం.. రెండు రోజుల క్రితం ఐశ్వర్య రజనీకాంత్ ఇంట్లో దొంగతనం జరగగా ఈ ఘటనలో 60 లక్షలు విలువ చేసే బంగారు, వజ్రాల ఆభరణాలు అపహరణకు గురయ్యాయి. దీంతో ఐశ్వర్య తేనాం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. చదవండి: అమ్మ ప్రెగ్నెంట్ అని నాన్న చెప్పగానే షాకయ్యా: నటి ఆర్య పార్వతి ఆమె ఫిర్యాదుతో కేసు నమోదు చేసివిచారణ చేపట్టగా సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఐశ్వర్య నివాసంలో దాదాపు 18 ఏళ్లుగా పని చేస్తున్న మండవేలికి చెందిన ఈశ్వరి(46) మరో మహిళ లక్ష్మి, డ్రైవర్ వెంకటేశ్‌తో పాటు మరో ముగ్గురు ఈ దొంగతనానికి తెగబడ్డారు. దొంగలించిన ఆభరణాలను అమ్మి ఆ డబ్బుతో చెన్నైలో ఓ ఇల్లుతో పాటు అనేక కాస్ట్లీ వస్తువులు కొనుగోలు చేసినట్టు నిందితులు విచారణలో తెలిపారు పోలీసులు పేర్కొన్నారు. చదవండి: డ్రగ్స్ కేసులో అడ్డంగా దొరికిపోయిన నటి.. దంపతులమని నమ్మించి మరో వ్యక్తితో కలిసి గది అద్దెకు.. అంతేకాదు కొంతకాలంగా ఐశ్వర్య ఇంటిలోని విలువైన వస్తువులను వారు దొంగిలించినట్లుగా పోలీసులు విచారణలో గుర్తించారు. కాగా తన ఇంట్లో చోరి జరగడంతో పోలీసుల ఆశ్రయించిన ఐశ్వర్య తన ఇంటి పనివాళ్లైన ఈశ్వరి, లక్ష్మి, డ్రైవర్ వెంకటేశన్‌తో సహా ముగ్గురిపై అనుమానం ఉందని, తరచూ వారు తన అపార్ట్‌మెంట్‌కు వెళ్లవారని.. లాకర్ కీలు కూడా ఎక్కడ ఉన్నాయో వారికి తెలుసని ఆమె ఫిర్యాదు పేర్కొంది. కాగా ఐశ్వర్య ఇంట్లోని 100 సవర్ల బంగారం, 30 గ్రాముల వజ్రాభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులుతో పాటు కొన్ని పత్రాలు చోరీకి గురైనట్లు పోలీసులు స్పష్టం చేశారు. -
రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఇంట్లో భారీ చోరీ.. వజ్రాలు, నగలు
నటుడు రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య ఇంట్లో రూ.60 లక్షల విలువైన నగలు చోరీకి గురయ్యాయి. ఐశ్వర్య స్థానిక తేనాంపేట లోని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రూ.60 లక్షల విలువైన బంగారు నగలు, వజ్రాలు చోరీకి గురైయ్యాయని తెలిపారు. అవి తన పెళ్లి నగలని తెలిపారు. వాటిని తాను ఇంట్లోని లాకర్లో పెట్టానని, ఫిబ్రవరి 10వ తేదీన లాకరు తెరిచి చూడగా ఎక్కువ భాగం నగలు కనిపించలేదని చెప్పారు. తన ఇంట్లో పని చేసే ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌పై అనుమానం ఉందని పేర్కొన్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని ఈశ్వరి, లక్ష్మీ, డ్రైవర్ వెంకట్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టు సమాచారం. ఐశ్వర్య ఎప్పుడు పోలీసులకు ఫిర్యాదు చేశారన్న విషయంలో స్పష్టత లేదు. గత నెల 10వ తేదీన నగలు చోరీకి గురయ్యాయని చెప్పిన ఐశ్వర్య ఆ విషయం ఇప్పుడు వెలుగుచూడడంలో మర్మమేమిటి అన్నది తెలియాల్సి ఉంది. -
షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ
సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు, ధనుష్ మాజీ భార్య ఐశ్యర్య రజనీకాంత్ పోలీసులను ఆశ్రయించారు. ఆమె ఇంట్లో చోరి జరిగిందని, లక్షలు విలువ చేసే నగలు, వజ్రాలు దొంగతనానికి గురైనట్లు చేసినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. అంతేకాదు లాకర్లో ఉన్న నగదు పోవడంతో ఐశ్వర్య తన ఇంట్లో పని చేసే ముగ్గురు సిబ్బందిపై అనుమానం వ్యక్తం చేస్తూ తేనాం పేట పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ చోరికి గురైన వాటిలో డైమండ్ సెట్, ఆలయ అభరణాలలో అన్‌కట్ డైమండ్స్, పురాతన బంగారు ముక్కలు, నవరత్నం సెట్లు, బంగారు, వజ్రాలతో కూడిన రెండు నెక్ పీసెస్‌కి సరిపడే చెవిపోగులు, ఆరమ్ నెక్లెస్, సుమారు 60 సవర్ల బ్యాంగిల్స్ ఉన్నాయని పేర్కొంది. వీటి విలువ సుమారు 3.6లక్షల ఉంటుందని ఎఫ్ఐఆర్లో వెల్లడించారు. కానీ వాస్తవంగా వాటి విలువ అంతకంటే ఎక్కువే ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. కాగా 2019లో జరిగిన తన సోదరి సౌందర్ వివాహ వేడుకలో ఈ ఆభరణాలు ధరించినట్టు తెలిపారు. చదవండి: ఆ హీరోయిన్ని బ్లాక్ చేసిన బన్నీ! స్క్రిన్ షాట్స్‌తో నటి ఆరోపణలు.. ఆ తర్వాత నుంచి వాటిని బయటకు తీయలేదని ఫిర్యాదు పేర్కొన్నారు. ప్రస్తుతం వాటిని తన తండ్రి రజనీకాంత్ పోయేస్ గార్డెన్ నివాసంలోని లాకర్లో ఈ నగదు భద్రపరిచనట్లు ఆమె చెప్పారు. అయితే లాకర్ కీ మాత్రం తన దగ్గరే ఉందని, ప్రస్తుతం తాను నివసిస్తున్న సెయింట్ మేరిస్ రోడ్ అపార్టుమెంటులోని పర్సనల్ స్టీల్ అల్మారాలో లాకర్ కీ ఉంచినట్లు ఐశ్వర్య తెలిపారు. దీని సమాచారం తన పనివాళ్లకే తెలుసని, వారే నగదు దొంగతనం చేసుంటారని ఐశ్వర్య తన ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో పోలీసులు ఐపీసీ సెక్షన్ 381 కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
30 ఏళ్ల తర్వాత జీవిత రాజశేఖర్ రీఎంట్రీ, సూపర్ స్టార్‌కు చెల్లిగా..
దాదాపు మూడు దశాబ్దాల తర్వాత వెండితెరపై అలరించేందుకు రెడీ అయ్యారు నటి జీవిత రాజశేఖర్. నిర్మాతగా, దర్శకురాలిగా మారి భర్త, పిల్లల సినిమాల బాధ్యత తీసుకున్న ఆమె ఇప్పుడు నటిగా రీఎంట్రీ ఇవ్వబోతున్నారు. 1991లో నటుడు రాజశేఖర్‌తో వివాహం ఆనంతరం ఆమె వెండితెరకు దూరమయ్యారు. ఆ తర్వాత జీవిత ఏ సినిమాల్లో కనిపించలేదు. కానీ మెగాఫోన్ పట్టి దర్శకురాలిగా పలు చిత్రాలు తెరకెక్కించారు. చదవండి: అప్పుడే ఓటీటీకి వచ్చేస్తోన్న ‘బుట్టబొమ్మ’! స్ట్రీమింగ్ ఎప్పుడు, ఎక్కడంటే.. ఇక ఇప్పుడు దాదాపు ముప్పై ఏళ్ల తర్వాత ఆమె నటించేందుకు సిద్ధమయ్యారు. ఓ స్టార్ హీరోకు సోదరిగా నటించనున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ రజనీకాంత్ చిత్రంతో ఆమె తన సెకండ్ ఇన్నింగ్స్‌ని స్టార్ట్ చేయడం విశేషం. ప్రస్తుతం జైలర్ సినిమాతో బిజీగా ఉన్న రజనీ తన నెక్ట్స్ చిత్రం కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో చేయబోతున్నారు. మార్చి 7న ఈ మూవీ షూటింగ్ చెన్నైలో ప్రారంభం కానుంది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా వెలువడింది. చదవండి: పెళ్లి తర్వాత నయనతారకు కలిసిరావడం లేదా? భర్తకు అలా, నయన్‌కు ఇలా! ఈ సందర్భంగా ఇందులోని ప్రధాన పాత్రలకు చిత్ర బృందం స్వాగతం పలుకుతూ ఓ ట్వీట్ చేసింది. ఇందులో రజనీకాంత్, నటుడు విష్ణు విశాల్‌తో పాటు నటి జీవిత రాజశేఖర్ ఫొటోలను షేర్ చేశారు. అంతేకాదు ఈ చిత్రంలో ఆమె రజనీకాంత్‌కు సోదరిగా నటించబోతున్నట్లు ఈ సందర్భంగా మేకర్స్ వెల్లడించారు. అయితే లైకా ప్రొడక్షన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఇతర నటీనటుల వివరాలను కూడా మేకర్స్ ప్రకటించనున్నారు. #LalSalaam - Shoot to start on March 7 in Chennai - @TheVishnuVishal and @vikranth_offl to play majority of CCL games before joining shoot - Jeevitha Rajasekhar to play Superstar Rajinikanth's sister in the film, an important role pic.twitter.com/C5URzbfFSI — Siddarth Srinivas (@sidhuwrites) February 28, 2023 -
రజనీకాంత్‌కు షాకింగ్ రెమ్యునరేషన్.. 7 రోజులకే అన్ని కోట్లా?
సూపర్ స్టార్ రజనీకాంత్ చరిష్మా గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఏడు పదుల వయసు దాటిన ఆయన క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. తలైవా తెరపై కనిపిస్తే చాలు.. కలెక్షన్ల వర్షం కురవాల్సిందే. సినిమా టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ దద్దరిల్లిపోతుంది.ఆ స్థాయిలో వెండితెరను శాసిస్తాడు కాబట్టే పారితోషికం కూడా అదే స్థాయిలో తీసుకుంటాడు. ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ అనే సినిమా చేస్తున్నాడు. దీంతో పాటు లాల్ సలామ్ అనే సినిమాలో కూడా నటిస్తున్నాడు. అయితే ఈ చిత్రంలో రజనీకాంత్ హీరోగా కాకుండా.. గెస్ట్ రోల్ ప్లే చేస్తున్నాడు. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్నారు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. లాల్ సలామ్ కోసం రజనీకాంత్ వారం రోజుల కాల్షీట్ను కేటాయించారట. అయితే ఈ ఏడు రోజులకు గాను ఆయన భారీగానే పారితోషికం పుచ్చుకుంటున్నారట. వారం రోజులకుగాను రూ.25 కోట్ల రెమ్యునరేషన్ ఇచ్చేందుకు లైకా సంస్థ సూపర్‌స్టార్‌తో డీల్ కుదుర్చుకుందట. త్వరలోనే లాల్ సలామ్ సెట్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. మరోవైపు ‘జైలర్’ మూవీ కోసం కూడా రజనీకాంత్ భారీగానే డిమాండ్ చేశారట. ఈ సినిమా కోసం రజనీకాంత్ ఏకంగా రూ.140 కోట్లు తీసుకుంటున్నాడట. దక్షిణాదికి చెందిన హీరోలలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకుంటున్న స్టార్స్‌లో రజనీకాంత్ మొదటి స్థానంలో ఉన్నారని ఇండస్ట్రీ టాక్. -
ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీ కపుల్స్ వీళ్లే..
సినీ ఇండస్ట్రీలో ప్రేమ- విడాకులు చాలా కామన్ అయిపోయింది. ఎంత త్వరగా ప్రేమలో పడతారో అంతే త్వరగా విడిపోతున్నారు. ఇప్పటికే టాలీవుడ్, బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడాకులు తీసుకున్న సెలబ్రిటీల లిస్ట్ అంతకంతకూ ఎక్కువైపోయింది. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న దంపతులు సైతం తమ బంధానికి ఫుల్స్టాప్ పెట్టేశారు. పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకొని చివరికి కోర్టు మెట్లు ఎక్కారు. 2022 ఇంకొన్ని రోజుల్లో ముగియనుంది. త్వరలోనే 2023లోకి గ్రాండ్‌గా అడుగుపెట్టబోతున్నాం. ఈ నేపథ్యంలో ఈ ఏడాది విడాకులు తీసుకున్న సెలబ్రిటీలు ఎవరెవరో ఓసారి చూసేద్దామా.. ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ తమిళ స్టార్ హీరో ధనుష్- రజనీకాంత్ కూతురు ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలోనే విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. తమిళ నాట స్టార్ కపుల్‌గా గుర్తింపు పొందిన ఈ జంట 2004 నవంబర్ 18న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇరు కుటుంబసభ్యుల నిర్ణయంతో అంగరంగ వైభవంగా వీరి వివాహం జరిగింది. పెళ్లి నాటికి ధనుష్ వయసు 21 ఏళ్లు, ఐశ్వర్య వయసు 23 ఏళ్లు. ఈ దంపతులకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. సాఫీగా సాగిపోతుందనుకున్న వీరి వైవాహిక బంధంలో మనస్పర్థలు ఏర్పడి ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. యోయో హనీసింగ్- షాలినీ తల్వార్ బాలీవుడ్ ర్యాపర్, మ్యూజిక్ కంపోజర్ యో యో హనీసింగ్ తన పదేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికాడు. సుమారు పదేళ్లపాటు ప్రేమలో మునిగితేలిన హనీసింగ్-షాలినీలు 2011లో వివాహబంధంతో ఒక్కటయ్యారు. కానీ మనస్పర్థలు రావడంతో సెప్టెంబర్ 8న విడాకులు తీసుకున్నారు. ఇక హనీసింగ్ తనను లైంగికంగా, మానసికంగా వేధింపులకు గురిచేయడమే కాకుండా, ఇతర మహిళలతో వివాహేతర సంబంధంపెట్టుకున్నాడని ఆరోపిస్తూ షాలిని కోర్టును ఆశ్రయించడంతో వివాదం రచ్చకెక్కింది. ఇదిలా ఉంటే షాలినీతో విడాకులు తీసుకున్న కొద్ది నెలలకే హనీసింగ్ తన గర్ల్‌ఫ్రెండ్ టీనా తడానితో చెట్టాపట్టాలేసుకొని తిరగడం మీడియా కంట పడింది. రాజీవ్ సేన్- చారు అసోపా మాజీ విశ్వసుందరి సుష్మితా సేన్ సోదరుడు రాజీవ్ సేన్ విడాకులు వ్యవహరం ఇప్పటికీ హాట్‌టాపిక్‌గానే ఉంది. టీవీ నటి చారు అసోపా- రాజీవ్ సేన్లు 2019 జూన్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ఏడాది వయసున్న కూతురు జియానా ఉంది. అయితే పెళ్లయిన ఏడాదిన్నరగే విడిపోతున్నట్లు ప్రకటించి అందిరికి షాక్ ఇచ్చిన ఈ దంపతులు తమ కూతురి కోసం కలిసి ఉండాలనుకుంటున్నామంటూ ఇటీవల తమ విడాకులను రద్దు చేసుకున్నారు. కానీ మళ్లీ ఏమైందో ఏమో కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకోవడానికే మొగ్గు చూపుతున్నట్లు ప్రకటించారు. ప్రస్తుతం భార్యభర్తలుగా విడిపోతున్నామని, కేవలం కూతురు జియానుకు తల్లిదండ్రులుగా ఉంటున్నామని తెలిపారు. రాఖీ సావంత్- రితేష్ వివాదాస్పద వ్యాఖ్యలతో తరచూ వార్తల్లో నానుతూ ఉంటుంది రాఖీ సావంత్. బిగ్‌బాస్ షోతో మరింత పాపులర్ అయిన ఆమె ఈ ఏడాది వాలంటైన్స్ డే రోజు తన భర్త రితేశ్ సింగ్‌తో విడిపోతున్నట్లు ప్రకటించింది.రితేశ్‌కు ఆల్రెడీ పెళ్లైన విషయాన్ని తన దగ్గర దాచిపెట్టాడని, వారు విడాకులు తీసుకోలేదు కాబట్టి చట్టబద్ధంగా తమ వివాహం చెల్లదండూ అతడితో తెగదెంపులు చేసుకుంది. మాజీ భర్త జ్ఞాపకాలను సైతం వదిలించుకుంది. ఇక ప్రస్తుతం తనకంటే ఆరేళ్లు చిన్నవాడైన అదిల్ దురానీతో ప్రేమలో మునిగితేలుతుంది. సుస్మితా సేన్-లలిత్ మోదీ మాజీ విశ్వసుందరి, నటి సుస్మితా సేన్ ప్రేమ వ్యవహారం మీడియాలో ఎంత హాట్‌టాపిక్‌గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మొన్నటి వరకు తనకంటే 15 ఏళ్ల చిన్నవాడైన మోడల్ ప్రముఖ మోడల్ రోహ్మన్తో ప్రేమాయణం నడిపిన సుస్మితా తాజాగా మాజీ ఐపీఎల్ చైర్మన్ లలిత్ మోదీతో సహజీవనం చేస్తుందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. వీరిద్దరు మాల్దీవుల్లో షికార్లు చేసిన ఫొటోలు, లండన్‌లో ఫ్యామిలీతో కలిసి ఎంజాయ్ చేస్తున్నా పిక్స్‌ను స్వయంగా లలిత్ మోదీ షేర్ చేశాడు. ఈ సందర్భంగా సుస్మితాను తన బెటర్ హాఫ్(భార్య) అంటూ పరిచయం చేశాడు మోదీ. ఆ తర్వాత ప్రస్తుతం తాము డేటింగ్లో ఉన్నామనీ, త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్లు స్పష్టం చేశాడు. దీంతో వీరిద్దరి ప్రేమ వ్యవహరం మీడియాలో, సోషల్ మీడియాల్లో చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ లలిత్ మోదీకి గుడ్‌బై చెప్పి ప్రస్తుతం రోహ్మన్తోనే సుస్మితా కలిసి ఉంటున్నట్లు తెలుస్తుంది. సోహైల్ ఖాన్-సీమా సల్మాన్ ఖాన్ ఫ్యామిలీకి పెళ్లిళ్లు అచ్చొచ్చినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే అర్బాజ్ ఖాన్ విడాకులు తీసుకోగా, ఇప్పుడు సల్మాన్ మరో తమ్ముడు సోహైల్ ఖాన్ కూడా భార్య నుంచి విడిపోయాడు. ఎంతో అన్యోన్యంగా కనిపిస్తున్న సోహైల్- సీమా ఖాన్లు 24 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికారు. ప్రేమించి, పెద్దలను ఎదిరించి మరీ పెళ్లి చేసుకున్న సోహైల్-సీమా ఖాన్లు విడాకులు తీసుకోవడం బాలీవుడ్లో హాట్‌టాపిక్‌గా మారిన సంగతి తెలిసిందే. అయితే వీరి విడాకుల వెనుక ఓ హీరోయిన్ పేరు ప్రధానంగా వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీతో సొహైల్ ఖాన్ కొంతకాలంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు వార్తలు జోరుగా వినిపించాయి. కారణం ఏదైనా తమ వివాహ బంధానికి ముగింపు పలికారు ఈ బ్యూటిఫుల్ కపుల్. -
ఫిబ్రవరిలో లాల్ సలామ్లోకి...
‘లాల్ సలామ్’ గ్రౌండ్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఫిబ్రవరిలో అని సమాచారం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌సలామ్’. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య ఓ పది రోజులు షూటింగ్ చేశారు. అయితే రజనీ లేని సీన్స్‌ని చిత్రీకరించారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌లోకి రజనీ అడుగుపెడతారట. ఇక ‘3’ (2012) చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ‘వై రాజా వై’ (2015), ‘రాజా రాణి’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. -
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న రజనీకాంత్.. ఆ తర్వాత దర్గాకు కూడా..
సూపర్ స్టార్ రజనీకాంత్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. గురువారం ఉదయం వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో శ్రీవారి సుప్రభాత సేవలో ఆయన కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. కూతురు ఐశ్వర్య రజనీకాంత్‌తో కలిసి స్వామివారికి మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనం అనంతరం ఆలయ రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం అందించగా, ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేశారు. ఇక ఆలయం వెలుపలు రజనీకాంత్‌ను చూడటానికి భక్తులు ఉత్సాహం చూపారు. తిరుమల శ్రీవారిని దర్శనం అనంతరం నేరుగా రజనీకాంత్ కడపకు వెళ్లారు. అక్కడ కొలువైన అమీన్‌పీర్ దర్గాను ఆయన దర్శించుకున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ రెహమాన్‌తో పాటు రజనీ దర్గాను సందర్శించారు. -
మాజీ దంపతులు ఐశ్వర్య-ధనుష్ తనయులతో సరదాగా రజనీ, ఫొటో వైరల్
సూపర్‌స్టార్ రజనీకాంత్ 72వ పుట్టిన రోజు వేడుకలను ఆయన అభిమానులు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. ఆయన సతీమణి లత రజనీకాంత్ కూడా అభిమానులతో కలిసి కేక్ కట్ చేసి వారితో ఆనందాన్ని పంచుకున్నారు. అయితే రజనీకాంత్ మాత్రం ఈ వేడుకల్లో ఎక్కడా కనిపించలేదు. అనేకమంది అభిమానులు రజనీకాంత్‌ను చూడడానికి ఆయన ఇంటికి చేరుకున్నారు. అయితే గంటలపాటు పడిగాపులు కాసినా రజనీకాంత్ కనిపించకపోవడంతో అభిమానులు నిరాశతో వెనుదిరిగారు. మరికొందరైతే ఎంతో ఆశతో వచ్చినా తమ అభిమాన నటుడిని చూడలేకపోయామంటూ కంటతడి పెట్టుకున్నారు. చదవండి: బిగ్‌బాస్ 6: బయటకు రాగానే సూర్యను కలిసిన ఇనయా, ఫొటో వైరల్ కాగా రజనీకాంత్ పుట్టిన రోజు సందర్భంగా పలువురు రాజకీయ సినీ ప్రముఖులు శుభాకాంక్షలు అందించిన విషయం తెలిసిందే. దీంతో వారందరికీ పేరుపేరునా రజనీ ధన్యవాదాలు తెలిపారు. ఈ మేరకు మంగళవారం మీడియాకు ఓ ప్రకటన విడుదల చేశారు. తనకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ రవి, మిత్రుడు, ముఖ్యమంత్రి స్టాలిన్‌కు ధన్యవాదాలు అని పేర్కొన్నారు. అదే విధంగా మరో ప్రకటనలో ఎడపాడి పళనిసామి, ఓ.పన్నీర్ సెల్వం, అన్నామలై, టీకే.రంగరాజన్, వైగో, అన్బుమణి రామదాస్, జీకే వాసన్, తిరుమావళన్.. చదవండి: విజయ్ సేతుపతి షాకింగ్ లుక్ వైరల్, అవాక్కవుతున్న ఫ్యాన్స్ ఏసీ షణ్ముగం, తిరువుక్కరసు, సీమాన్ తదితర నాయకులకు, నటుడు కమలహాసన్, సంగీత దర్శకుడు ఇళయరాజా, షారూఖ్ ఖాన్, అక్షయ్ కుమార్, మోహన్ లాల్, మమ్ముట్టి, శివరాజ్ కుమార్, శరత్ కుమార్, ఉదయనిధి స్టాలిన్, ధను, వైరముత్తు తదితర సినీ ప్రముఖులకు ధన్యవాదాలు తెలిపారు. అదే విధంగా ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలిపారు. కాగా రజనీకాంత్ తన మనవళ్ల (నటుడు ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్ కొడుకులు)తో ఉత్సాహంగా గడుపుతున్న ఫొటోను ఆమె పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ మీడియాకు విడుదల చేశారు. అందులో పుట్టినరోజు వేడుక తరువాత అని పేర్కొనడం గమనార్హం. Cannot capture something more beautiful.. Cannot caption some such bonds .. My birthday boy with my boys ! #grandfatherlove❤️ #grandsonsrock💙 pic.twitter.com/iCWLZ6b6n7 — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) December 12, 2022 -
ఏఆర్ రెహమాన్ సంగీత బాణీలకు సలామ్ చేసిన ఐశ్వర్య
తమిళసినిమా: ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతం గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. ఇటీవల విడుదల అయిన పొన్నియిన్ సెల్వన్ త్రంతో తనకు తానే సాటి అని మరోసారి నిరపించుకున్నారు. చేతిలో పలు చిత్రాలతో బిజీగా ఉన్న రెహమాన్ ప్రస్తుతం లాల్ సలాం సినిమాకి సంగీతం అందించడంలో నిమగ్నమయ్యారు. సపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్న చిత్రం ఇది. ఆయన పెద్ద కతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈమె 2012లో ధనుష్, శృతిహాసన్ జంటగా నటింన 3 త్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. ఆ తరువాత గౌతమ్ కార్తీక్ హీరోగా వై రాజా వై చిత్రం చేశారు. మళ్లీ తాజాగా లాల్ సలాం చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించనున్నారు. ఈ చిత్రం ఈనెల 5వ తేదీన పూజా కార్యక్రవలతో ప్రారంభమైంది. ప్రస్తుతం పాటల రికార్డింగ్ జరుగుతోంది. ఏఆర్.రెహమాన్ సంగీత బాణీలకు దర్శకురాలు ఐశ్వర్య మైమర పోతూ సలామ్ చేశారు. ఆ వీడియోను ఏఆర్ రెహవన్ సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. అది ఇప్పుడు వైరల్ అవుతోంది. కాగా లాల్ సలాం చిత్రంపై ఇప్పటి నుంచే అంచనాలు పెరుగుతున్నాయి. లైకా ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని వచ్చే ఏడాదిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. Jamming with the most promising female Director @ash_rajinikanth for #lalsalaam in mumbai.#தமிழ் pic.twitter.com/Qg83tefxxv — A.R.Rahman (@arrahman) November 25, 2022 -
ఐశ్వర్య డైరెక్షన్లో అతిథి పాత్రలో తలైవా
తమిళ సినిమా: రజనీకాంత్ పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో కొత్త చిత్రం రాబోతోంది. ఈ మేరకు శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో 2012లో ధనుష్, శృతిహాసన్ జంటగా 3 చిత్రం, నటుడు గౌతమ్ కార్తీక్ హీరోగా 2015లో వై రాజా వై అనే మరో చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. చాలా గ్యాప్ తర్వాత తాజాగా ఆమె సినీ కెప్టెన్ బాధ్యతలు చేపట్టడానికి సిద్ధమయ్యారు.. ఈ చిత్రంలో సపర్ స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్నారు. ఈయన ఇంతకుముందు తన రెండవ కూతురు సౌందర్య రజనీకాంత్ దర్శకత్వంలో కోచ్చడయాన్ అనే యానిమేషన్ చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఇప్పుడు పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వంలో నటించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రేజీ చిత్రానికి లాల్ సలాం అనే టైటిల్‌ను నిర్ణయించారు. ఈ చిత్రం టైటిల్ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. తనయ దర్శకత్వంలో తలైవా అంట ఆయన అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు అధర్వ హీరోగా నటించనున్నట్లు ప్రచారం జరిగింది. కొన్ని కారణాల వల్ల ఆయన ఇందులో నటించడం లేదు. తాజాగా నటుడు విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. దీనికి ఆస్కార్ అవార్డు గ్రహీత ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని, విష్ణు రంగసామి ఛాయాగ్రహణాన్ని అందిస్తున్నట్టు లైకా సంస్థ నిర్వాహకుడు తమిళ్ కుమరన్ తెలిపారు. #LalSalaam 🫡 to everyone out there! We are extremely delighted to announce our next project, with the one & only Superstar 🌟 @rajinikanth in a special appearance! Directed by @ash_rajinikanth 🎬 Starring @TheVishnuVishal & @vikranth_offl in the leads 🏏 Music by @arrahman 🎶 pic.twitter.com/aYlxiXHodZ — Lyca Productions (@LycaProductions) November 5, 2022 -
కూతురు ఐశ్వర్య రజనీకాంత్ చిత్రంలో ‘తలైవా’!
ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో ఒక ఆసక్తికరమైన వార్త హల్చల్ చేస్తోంది. అది ఐశ్వర్య రజనీకాంత్ గురించే. నటుడు ధనుశ్, ఐశ్వర్యలు మనస్పర్థలు కారణంగా ఇటీవల విడిపోయిన విషయం తెలిసిందే. అయితే వీరిద్దరిని మళ్లీ కలపడానికి కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పక్కన పెడితే ఐశ్వర్య రజనీకాంత్ దర్శకురాలు అన్న విషయం తెలిసిందే. చదవండి: నడవలేని స్థితిలో పూజ.. ఫొటో షేర్ చేసిన ‘బుట్టబొమ్మ’ ధనుశ్, శృతిహాసన్ జంటగా నటించిన 3 చిత్రంతో ఐశ్వర్య మెగా ఫోన్ పట్టారు. ఆ తరువాత వై రాజా వై అనే చిత్రం తెరకెక్కించారు. అలాగే స్టంట్ కళాకారుల నేపథ్యంలో సినిమా వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రం చేశారు. తాజాగా చాలా గ్యాప్ తరువాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. విశేషం ఏటంటే ఇందులో ఆమె తండ్రి సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథి పాత్రలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు తెలుస్తోంది. కాగా ఇందులో నటుడు అధర్వ కథానాయకుడిగా నటించనున్నట్లు సమాచారం. చదవండి: జపాన్‌లో తారక్‌కు అరుదైన స్వాగతం, వీడియో వైరల్ దీనిని లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు, చిత్ర షూటింగ్ నవంబర్ తొలి వారంలో ప్రారంభించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. అయితే ఇక్కడ మరో వార్త కూడా ప్రచారంలో ఉంది. ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించనున్న చిత్రంలో నటుడు శింబు కథానాయకుడిగా నటించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. అయితే వీటిలో ఏ విషయం అధికారిక పూర్వకంగా వెల్లడి కాలేదన్నది గమనార్హం. కాగా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించడానికి సిద్ధమవుతున్న మాట మాత్రం నిజం. -
విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు!
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుశ్-ఐశ్వర్య రజనీకాంత్‌లు మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయామని ధనుశ్-ఐశ్వర్యలు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. పిల్లల కోసం వీరిద్దరు వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ధనుశ్ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుశ్కు తన పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విడాకులు ఈ వార్తలపై స్పందించాడు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట ఫాలోవర్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుశ్ ఓ కొత్త ఇంటిని కొనుగొలు చేస్తున్నాడని, విడాకులు రద్దు ప్రకటన ఆనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే ధనుశ్ ఖరీదు చేయబోయే ఆ ఇంటి విలువ రూ. 100 కోట్లని, వచ్చే ఏడాది జనవరిలో భార్య, పిల్లలతో గృహ ప్రవేశం కూడా చేయబోతున్నాడంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలు నిజమైతే బాగుండని, మళ్లీ వారిద్దరు కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2004 నవంబర్ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ధనుశ్-ఐశ్వర్యలకు యాత్రా రాజా (15 ), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ధనుష్- ఐశ్వర్య కలుస్తారా? హీరో తండ్రి ఏమన్నాడంటే?
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే పిల్లల విషయంలో మాత్రం వారు అప్పుడప్పుడు కలుస్తూ వస్తున్నారు. దీంతో వీరు విడాకుల వ్యవహారంలో వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య.. ఇద్దరూ విడాకులను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించాడు. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ధనుష్‌కు అతడి పిల్లల సంతోషమే ముఖ్యం అని బదులిచ్చాడు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయానుకుంటున్నారు. అలాగే 1930 నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ చేస్తున్నాడు. చదవండి: రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా అమితాబ్‌కు చిరు స్పెషల్ విషెస్ -
ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలవబోతున్నారా? ఇదిగో క్లారిటీ..
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్‌లు విడాకులు రద్దు చేసుకుంటున్నారంటూ కొన్ని రోజులు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ వార్తలు నిజమైతే బాగుండని ఫ్యాన్స్‌తో పాటు సెలబ్రెటీలు సైతం ఆశపడుతున్నారు. అయితే వారిద్దరు మళ్లీ కలుస్తున్నారా? లేదా? అనేది మాత్రం క్లారిటీ లేదు. తాజాగా ఈ వీరిద్దరు మళ్లీ కలవడంపై వారి సన్నిహితుల నుంచి స్పష్టత ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. చదవండి: అను ఇమ్మాన్యుయేల్‌కు మరో చాన్స్ ధనుష్-ఐశ్యర్య మళ్లీ కలుస్తున్నారని, వారు విడాకులు రద్దు చేసుకోబోతున్నారంటూ వస్తున్న వార్తల్లో ఏమాత్రం నిజం లేదని తెలుస్తోంది. వారిద్దరు మళ్లీ కలిసే ఆలోచనలో లేరని, ప్రస్తుతం ఎవరి జీవితం వారిది అన్నట్లుగా ధనుష్-ఐశ్వర్యలు వ్యవహరిస్తున్నారని సన్నిహితుల నుంచి సమాచారం. కనీసం ఎదురుపడిన వారు మాట్లాడుకోవడం లేదట. పిల్లల విషయంలో మాత్రమే వారిద్దరు అప్పుడప్పుడు కలుస్తున్నారని, బహుశా ఆ సమయంలో వారిని చూడటం వల్లే ఈ వార్తలు పుట్టుకొచ్చి ఉంటాయని సన్నిహితులు అభిప్రాయపడ్డారట. చదవండి: త్రిష చిత్రంలో నయనతార?.. ఆ పాత్రకు అంగీకరిస్తారా..? కాగా 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ధనుష్-ఐశ్వర్యలు తమ 18ఏళ్ల వైవాహిక బంధానికి ఈ ఏడాది ప్రారంభంలో స్వస్తి పిలికారు. తాము విడాకులు తీసుకుంటున్నామంటూ జనవరిలో ప్రకటించారు వీరిద్దరు ప్రకటించడం వారి ఫ్యాన్స్‌తో సినీ సెలబ్రెటీలు సైతం షాకయ్యారు. కానీ వీరి విడాకులు తీసుకుంటున్నారన్న వార్తలు వచ్చినప్పటి నుంచి మళ్లీ కలిస్తే బాగుండూ అంటూ ధనుష్ ఫ్యాన్స్ ఆశగా ఎదురు చూశారు. ఈ క్రమంలోనే వారు మళ్లీ కలుస్తున్నారనే వార్తలు నెట్టింట పుట్టుకొస్తున్నాయి. -
ఊహించని ట్విస్ట్.. విడాకులపై వెనక్కి తగ్గిన ధనుష్-ఐశ్వర్య!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఈ ఏడాది ప్రారంభంలో.. ధనుష్,ఐశ్వర్యలు సోషల్ మీడియా వేదికగా భార్యభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 18ఏళ్ల వివాహం తర్వాత ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ప్రకటించడం అభిమానులకు కూడా ఆవేదనను గురిచేసింది. వీరిద్దరూ కలిసి ఉంటే బాగుండు అని అంతా అనుకున్నారు. ఇప్పుడిదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది. ధనుష్-ఐశ్వర్యలు తమ విడాకుల ప్రకటనను రద్దు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలె రజనీకాంత్ ఇంట్లో ఇరు కుటుంబసభ్యులు సమావేశమయ్యారట. ఈ సందర్భంగా ఈ జంట మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఐశ్వర్య-ధనుష్‌లు కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నారట. ఇదే గనుక నిజమైతే, అభిమానులకు ఇంతకంటే గుడ్‌న్యూస్ ఏముంటుంది. -
ధనుష్‌తో విడాకుల తర్వాత.. డైరెక్టర్‌గా రీఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్య
తమిళ సినిమా: తలైవా వారసురాళ్లు మరోసారి మెగా ఫోన్ పట్టడానికి సిద్ధం అవుతున్నారు. రజనీకాంత్ ఇద్దరు కూమార్తెలు సినీ దర్శకురాళ్లే. నటుడు ధనుష్‌ను పెళ్లి చేసుకున్న ఐశ్వర్య ఆయన హీరోగా 2012లో 3 అనే చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమయ్యారు. అదే చిత్రంతో నటి శృతిహాసన్ హీరోయిన్గా కోలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చారు. సంగీత దర్శకుడు అనిరుధ్‌కు కూడా ఇదే తొలి చిత్రం. ఈ చిత్రం సక్సెస్ అనిపించుకోకపోయినా వై దిస్ కొలవెరి డి పాటతో దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకుంది. ఆ తర్వాత 2014లో వై రాజా వై అనే చిత్రాన్ని ఐశ్వర్య తెరకెక్కించారు. అలాగే 2017లో సినీ స్టంట్ కళాకారుల ఇతివృత్తంతో సినివ వీరన్ అనే డాక్యుమెంటరీ చిత్రాన్ని రూపొందించారు. ఇక నటుడు ధనుష్, ఐశ్వర్యల పెళ్లి, విడాకులు తీసుకున్న విషయం కూడా తెలిసిందే. భార్య నుంచి విడిపోయిన ధనుష్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. మరి ఐశ్వర్య రజనీకాంత్ ఏం చేస్తున్నారన్నది చర్చనీయాంశమైంది. కాగా ఐశ్వర్య రజనీకాంత్ సుమారు ఐదేళ్ల తర్వాత మళ్లీ మెగా ఫోన్ పట్టడానికి సిద్ధమవుతున్నట్లు తాజా సమాచారం. ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తున్నట్లు తెలిసింది. ఇందులో రజనీకాంత్ అతిథి పాత్రలో నటించనున్నట్లు టాక్ వినిపిస్తోంది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో కూడిన అధికారిక ప్రకటన త్వరలో వెల్లడయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇకపోతే రజనీకాంత్ రెండో కూతురు సౌందర్య రజనీకాంత్ కూడా తన తండ్రి కథానాయకుడిగా కొచ్చడైయాన్ అనే చారిత్రక కథా చిత్రాన్ని యానిమేషన్ ఫార్మేట్లో తెరకెక్కించిన విషయం తెలిసిందే. -
విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్- ఐశ్వర్య
కోలీవుడ్‌లో స్టార్ జంటగా వెలుగొందిన ధనుష్- ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్న ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను వెంటేసుకుని ధనుష్ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్- ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. 'ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..' అంటూ సోమవారం ఓ ఫొటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో ధనుష్, ఐశ్వర్య... తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా, ఏంటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్.. డైరెక్టర్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది. What a way to start the day ! Monday morning watching the Investiture Ceremony of school ,where my first born takes up oath as sports captain🎖#proudmommymoment #theygrowupsofast 🧡 pic.twitter.com/91GMsGsLhG — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 22, 2022 చదవండి: ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
ఎలాంటి నెగిటివిటి లేకుండా జీవించగలను: ఐశ్వర్య ఆసక్తికర ట్వీట్
కోలీవడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్య రజనీకాంత్ ఈ ఏడాగి తమ వైవాహిక బంధాన్ని స్వస్తి పలికిన సంగతి తెలిసిందే. జనవరిలో తాము విడిపోయామని ప్రకటించిన ఫ్యాన్స్‌కి షాకిచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రస్తుతం ఈ మాజీ జంట వారి వారి పనుల్లో బిజీగా అయిపోయారు. ఈ క్రమంలో తాజాగా ఐశ్వర్య చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశమైంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అంనతరం ఐశ్వర్య తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటుంది. చదవండి: రవితేజకు షాక్.. ‘రామారావు ఆన్ డ్యూటీ’ సీన్స్ లీక్! ఈ క్రమంలో ఆమె ఓ సంచలన ట్వీట్ చేసింది. జిమ్‌లో వ్యాయమం చేస్తున్న వీడియోను షేర్ చేస్తూ.. ‘బయటి నుంచి ఎలాంటి ప్రతికూలత వచ్చినా దానిని సమర్థవంతగా ప్రతిఘటించగలను. అందుకు ప్రేరణ నాలోనే ఉంది. ఇక నెగిటివిటి లేకుండ జీవించగలను’ అంటూ ఆమె రాసుకొచ్చింది. ఇది చూసి ఆమె ఫాలోవర్స్ ఇది ధనుష్ ఉద్ధేశించే చేసిందేనా? అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఐశ్వర్య రజినీకాంత్ ఓ బాలీవుడ్ చిత్రానికి దర్శకత్వం వహించనన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. My Monday morning 👊🏼 Motivation for anything for me comes from within.. Any kind of negativity from outside ..I can live without #workingonself #onlypositivevibes pic.twitter.com/WlTpO2zSWM — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) July 25, 2022 -
రజనీకాంత్‌కు అరుదైన గౌరవం, తలైవాకు ఆదాయ పన్నుశాఖ అవార్డు
సూపర్ స్టార్ రజనీకాంత్‌కు అరుదైన గౌరవం దక్కింది. తమిళనాడులో అత్యధిక ఆదాయపు పన్ను చెల్లిస్తున్నందుకు గాను ఆ శాఖ ప్రతిష్ట్రాత్మక అవార్డును తలైవాకు ప్రధానం చేసింది. ఆదాయపన్ను శాఖ దినోత్సవాన్ని ఆదివారం స్థానిక రాయపేటలోని మ్యూజిక్ అకాడమీలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మునీశ్వర్నాథ్ భండారీ, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. చదవండి: NBK107: కర్నూల్ కొండారెడ్డి బురుజు వద్ద బాలయ్య సందడి! కాగా ఈ వేదికపై తమిళనాడులో అత్యధికంగా పన్ను చెల్లించినందుకుగానూ నటుడు రజినీకాంత్‌ను అభినందిస్తూ ఉత్తమ టాక్స్ పేయర్ అవార్డును ప్రదానం చేశారు. కాగా ఈ అవార్డును రజినీకాంత్‌కు బదులుగా ఆయన కూమార్తె ఐశ్వర్య రజినీకాంత్ పుదుచ్చేరి లెప్ట్నెంట్ గవర్నర్ తమిళిసై నుంచి అందుకున్నా రు. రజినీకాంత్ నిబద్ధత కొనియాడ దగినదని వక్తలు అభిప్రాయపడ్డారు. చదవండి: ఊహించని రీతిలో సూపర్ స్టార్ ఇల్లు, చూస్తే అవాక్కవ్వాల్సిందే.. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్‌కు హైకోర్టులో ఊరట
నటుడు ధనుష్, ఆయన మాజీ భార్య (వీరు ఇటీవలే విడిపోయారు) ఐశ్వర్య రజనీకాంత్‌కు మద్రాసు హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్లితే నటుడు ధనుష్ కథానాయకుడిగా నటించిన చిత్రం వేలై ఇల్లా పట్టాదారి. వండర్ బార్ సంస్థ 2014లో నిర్మించిన చిత్రం ఇది. ఈ సంస్థకు నటుడు ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్టర్లుగా ఉన్నారు. కాగా, ఈ చిత్రంలో పొగ తాగే సన్నివేశాలు చోటుచేసుకున్నాయని, ఆ సన్నివేశాల్లో చట్టపరమైన హెచ్చరిక నిబంధనలు పాటించనందున, నటుడు ధనుష్, నిర్మాతలపైన తగిన చర్యలు తీసుకోవాలని తమిళనాడు పొగాకు నియంత్రణ ప్రజా సమితి తరఫున 2014 జూలైలో ప్రభుత్వానికి ఫిర్యా దు చేశారు. చదవండి: బడా వ్యాపారవేత్త నన్ను జీతం తీసుకునే భార్యగా ఉండమన్నాడు: హీరోయిన్ దీంతో ఆరోగ్యశాఖ జాయింట్ డైరెక్టర్.. ధనుష్ ఐశ్వర్య రజనీకాంత్‌పై స్థానిక సైదాపేట కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన న్యాయస్థానం ఈ నెల 15వ తేదీన కోర్టుకు హాజరు కావాల్సిందిగా నోటీసులు జారీ చేసింది. కాగా ఈ కేసును కొట్టివేయాలని, తమను సైదాపేట కోర్టులో హాజరవ్వాలంటూ జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలంటూ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ చెన్నై హైకోర్టులో విడివిడిగా పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై గురువారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి ఎన్. సతీష్ కుమార్ ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ సైదాపేట న్యాయస్థానంలో హాజరయ్యే అంశంపై స్టే విధిస్తూ తదుపరి విచారణను ఆగస్టు 10వ తేదీకి వాయిదా వేశారు. -
ధనుష్‌తో కలిసేదేలే అని క్లారిటీ ఇచ్చేసిన ఐశ్వర్య!
కోలీవుడ్‌లో స్టార్ జంటగా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే అవి మామూలు గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి వ్యాఖ్యానించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. పైగా విడాకుల ప్రకటన తర్వాత కూడా ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివరన ధనుష్ అనే పదాన్ని అలాగే ఉంచుకుంది. ఇక ఇటీవల ఆమె డైరెక్ట్ చేసిన సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో ఐశ్వర్యను స్నేహితురాలు అని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు ధనుష్. దీంతో వీళ్లు మళ్లీ కలిసే సూచనలున్నాయని అభిప్రాయాపడ్డారు ఫ్యాన్స్! చదవండి: Bheemla Nayak-OTT: ఒక్కరోజు ముందుగానే స్ట్రీమింగ్ అవుతున్న ‘భీమ్లా నాయక్’ తాజాగా వారి ఆశలపై నీళ్లు చల్లింది ఐశ్వర్య. సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. దీంతో ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్‌కు బదులుగా ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్ అని మాత్రమే కనిపిస్తోంది. ఈ చర్యతో తాము కలిసేదే లేదని చెప్పకనే చెప్పింది. కాగా ఐశ్యర్య-ధనుష్‌లు ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చదవండి: గ్యాస్ టాంకర్ అని వెక్కిరించేవారు.. రాశీ ఖన్నా -
రజనీకాంత్ కుమార్తె జీవితంలో కొత్త మలుపు.. ట్వీట్ చేసిన ఐశ్వర్య
తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ కుమార్తె ఐశ్వర్యకి బాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. తమిళ చిత్ర సీమలో డైరెక్టర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆమె ఇప్పుడు హిందీ పరిశ్రమలో అడుగుపెడుతున్నారు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ఆమె స్వయంగా ప్రకటించారు. ‘‘ఈ వారాన్ని ఇంతకంటే అద్భుతంగా ప్రారంభించలేను. దర్శకురాలిగా బాలీవుడ్లో నా ప్రయాణాన్ని మొదలుపెడుతున్నానని చెప్పడం ఎంతో సంతోషాన్నిస్తోంది. ‘ఓ సాథీ చల్’ అనే ప్రేమకథా చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాను. ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అని పేర్కొన్నారు ఐశ్వర్య. కాగా ‘ఓ సాథీ చల్’ అనే సినిమాని సీ9 పిక్చర్స్ నిర్మించనుంది. My week couldn’t have started better..Happy n feeling blessed to announce my directorial debut in Hindi “Oh Saathi Chal”,an extraordinary true love story,produced by @MeenuAroraa @Cloud9Pictures1 @archsda #NeerajMaini need all your blessings n wishes pic.twitter.com/zqDH2BkQme — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) March 21, 2022 -
విడాకుల తర్వాత తొలిసారి కుమారులతో బయటికొచ్చిన ధనుష్
Dhanush Spot With His Sons After Split With Aishwarya: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్యర్య రజనీకాంత్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ధనుష్-ఐశ్యర్యలు ఈ ఏడాది ప్రారంభంలో ముగింపు పలకడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004 నవంబర్ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ మాజీ జంటకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ అయితే వీరు విడాకులు తీసుకుని మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ వారు ఒక్కటవుతారేమోనని ఆశిస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం వీరిద్దరి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఐశ్యర్య రీసెంట్గా ఓ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది. దీనిపై ధనుష్ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు మై ఫ్రెండ్ అంటూ మాజీ భార్యను స్నేహితురాలు అనేశాడు. దీంతో ఆ ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ధనుష్ తనయులతో కలిసి కనిపించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కు యాత్రా రాజా, లింగ రాజాలతో కలిసి హజరైన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మార్చి 17న జరిగిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కన్సర్ట్కు ధనుష్ తన ఇద్దరు కుమారులతో పాల్గొన్నాడు. అంతేకాదు ఈ ఈవెంట్లో ఇళయరాజా మ్యూజిక్కు ధనుష్ స్వరాలు కూడా ఇచ్చాడు. ఈ వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఐశ్యర్య కూడా ఉంటే ఎంత ముచ్చటగా ఉండేదే అంటూ ఈ మాజీ కపుల్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Our @dhanushkraja own lyrics for Yathra and Linga at #RockWithRaja concert. Whattey soulful lyrics that too fro t of Meastro. இதுதான் என் குழந்தைக்கு இனிமே தாலாட்டு தலைவா. pic.twitter.com/XSCo5A9lcS — Chandru (D Fan ) (@dhanushkutty) March 18, 2022 -
మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి!
Dhanush Tweet On Ex Wife Aishwarya Rajinikanth: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్యర్య రజనీకాంత్‌లు విడిపోవడాన్ని ఇప్పటికీ ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉన్న ఈ జంట విడాకులు తీసుకుని అందరికి షాకిచ్చారు. విడిపోయాక ధనుష్-ఐశ్యర్యలు ఎవరి పనుల్లో వారు బిజీ ఉన్నారు. కానీ వీరి అభిమానులు, సన్నిహితులు మాత్రం వీరిద్దరూ మళ్లీ కలిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. అంతేకాదు వీరి నుంచి ఏమైన తీపి కబురు అందుతుందేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో విడాకుల అనంతరం తొలిసారి మాజీ భార్యపై ట్వీట్ చేశాడు ధనుష్. చదవండి: ‘సర్కారు వారి పాట’ అప్డేట్, 20న సెకండ్ సింగిల్ ఈ సందర్భంగా ఐశ్యర్యకు శుభాకాంక్షలు తెలుపుతూ ధనుష్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్‌టాపిక్ మారింది. ఇదిలా ఉంటే ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిన ఓ పాట గురువారం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మ్యూజిక్ వీడియోపై ధనుష్ ట్వీట్ చేశాడు. ‘‘పయని’ మ్యూజిక్ వీడియోకు దర్శకత్వం వహించిన నా స్నేహితురాలు ఐశ్యర్య.ఆర్.ధనుష్‌కు శుభాకాంక్షలు. గాడ్ బ్లెస్’’ అంటూ రాసుకొచ్చాడు. ఇక ధనుష్ తీరు చూసిన నెటిజన్లు కాస్తా అసహనం వ్యక్తం చేస్తున్నారు. విడాకులు ప్రకటన అనంతరం కూడా ఐశ్యర్య తన ట్విటర్ ప్రోఫైల్ పేరు పక్కన ధనుష్ పేరును అలాగే ఉంచింది. చదవండి: సౌందర్య, రంభ ఉన్నారని సంతోషపడ్డా.. హీరోగా నన్ను తీసేశారు : శ్రీకాంత్ కానీ ధనుష్ మాత్రం ఆమెను స్నేహితురాలు అని పిలవడం నచ్చడం లేదంటూ నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక వీరిద్దరూ మళ్లీ కలుస్తారని ఆశిస్తున్న ఫ్యాన్స్ ‘ఏంటి అన్న అలా అనేశావ్’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ఐశ్యర్య-ధనుష్‌లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా ఐశ్యర్య దర్శకత్వంలో రూపొందిచన ఈ మ్యూజిక్ వీడియోలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్, ఢీ ఫేం శ్రష్టి జంటగా నటించారు. ఈ వీడియో తమిళ వెర్షన్‌ను సూపర్‌స్టార్ రజినీకాంత్ విడుదల చేయగా, తెలుగు వెర్షన్ 'సంచారి'ని అల్లు అర్జున్, మలయాళ వెర్షన్ 'యాత్రక్కారి'ని మోహన్‌లాల్ రిలీజ్ చేశారు. Congrats my friend @ash_r_dhanush on your music video #payani https://t.co/G8HHRKPzfr God bless — Dhanush (@dhanushkraja) March 17, 2022 -
ధనుష్ సోదరుడితో దిగిన ఫొటో షేర్ చేసిన ఐశ్వర్య
కోలీవుడ్ జంట ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇది సాధారణ గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. నిజంగానే ఈ జంట కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ బర్త్‌డే పురస్కరించుకుని ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'నా గురువు, స్నేహితుడు, తండ్రివంటి వ్యక్తికి బర్త్‌డే శుభాకాంక్షలు. మీతో బంధం మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను' అంటూ సెల్వరాఘవన్‌తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీనికి సెల్వ రాఘవన్ 'ప్రియమైన కూతురికి ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ధనుష్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఐశ్వర్య అతడి దగ్గరకు తిరిగి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం పలుకుతున్నారు. -
విడాకుల తర్వాత తొలిసారి కలుసుకున్న ధనుష్, ఐశ్వర్య.. ఏం జరిగిందంటే
మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్న క్రమంలో ధనుష్ తండ్రి కస్తూరి రాజా ఓ మీడియా సమావేశంతో వాళ్లిద్దరు మళ్లీ కలుస్తారంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. దీంతో ఫ్యాన్స్, వారి ఫాలోవర్స్ అంతా త్వరలోనే ఇద్దరి మధ్య మనస్పర్థలు తొలిగి ఒక్కటవుతారేమోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ తరుణంలో అందరిని ఆశ్చర్యపరిచే సంఘటన తాజాగా చోటు చేసుకుంది. చదవండి: విజయ్‌తో పెళ్లి వార్తలపై తొలిసారి నోరు విప్పిన రష్మిక, ఏం చెప్పిందంటే.. ఇటీవల షూటింగ్ నేపథ్యంలో హైదరాబాద్‌కు వచ్చిన ధనుష్-ఐశ్వర్యలు ఒకే హోటల్లో ఉన్నప్పటికీ కనీసం ఒకరినిఒకరు చూసుకొనే లేదట. ఇక తిరిగి చెన్నై వెళ్లిన(వేరు వేరుగా) ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ పార్టీకి హజరైనట్లు తెలుస్తోంది. పార్టీలో ఈ మాజీ దంపతులు మాట్లాడుకుంటారేమోనని అక్కడికి వచ్చిన అతిథులంతా ఆసక్తిగా ఎదురు చూశారట. కానీ వారు మాత్రం దూరంగానే ఉన్నారట. అంతేకాదు ఒకరికి ఒకరు తెలియనట్లుగా వ్యవహరించినట్లు సన్నిహితవర్గాల నుంచి సమాచారం. కనీసం మాటవరుసకైనా ఒకరినొకరు మాట్లాడుకోకపోవడంతో వీరిద్దరూ మళ్లీ కలిసిపోతారన్న వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదని స్పష్టమవుతోంది. చదవండి: హీరోగా ‘మైనింగ్ కింగ్’ గాలి జనార్థన్ రెడ్డి కుమారుడు, మూవీ టైటిల్ ఖరారు -
ఆసుపత్రి పాలైన ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య..
Dhanush Ex wife Aishwaryaa R Dhanush Admitted Into Hospital: రజనీకాంత్ కూతురు, స్టార్ హీరో ధనుష్ మాజీ భార్య ఐశ్వర్య ఆసుపత్రి పాలైంది. ఈ విషయాన్ని స్వయంగా ఆమె తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించింది. అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కరోనా వచ్చింది. హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాను. దయచేసి అందరూ మాస్కులు ధరించి సురక్షితంగా ఉండండి. 20211..ఇంకా నాకోసం ఏమేమి తీసుకొస్తావో చూస్తాను అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ షేర్ చేసింది. దీంతో ఐశ్వర్య త్వరగా కోలుకోవాలంటూ అభిమానులు కామెంట్లు చేస్తున్నారు. కాగా కొన్ని రోజుల క్రితమే ధనుష్‌కి సైతం కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయిన సంగతి తెలిసిందే. ఇక మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా పేరు తెచ్చుకున్న ధనుష్-ఐశ్వర్యలు ఇటీవలె విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయాన్ని వారి అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) -
విడాకుల తర్వాత ఐశ్వర్య ఫస్ట్ ఫోటో ఇదే.. నెట్టింట వైరల్
Aishwarya Rajinikanth First Photo After Divorce With Dhanush: మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ధనుష్-ఐశ్వర్యలు మళ్లీ కలిస్తే బావుండని ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే ధనుష్-ఐశ్వర్యలు మాత్రం తమ పనుల్లో ఫుల్ బిజీ అయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం హైదరాబాదాలోనే ఒకే హోటల్లో ఉన్న వీరు ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. సార్ సినిమా షూటింగ్ పనుల్లో ధనుష్ నిమగ్నమైతే, ఓ సాంగ్ షూటింగ్ కోసం ఐశ్వర్య ఇప్పుడు ఫుల్ బిజీగా మారిపోయింది. గతంలో సినిమాలు డైరెక్టర్ చేసిన ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్‌ను తెరకెక్కిస్తుంది. వాలెంటైన్స్ డే స్పెషల్‌గా ఈ సాంగ్‌ను రిలీజ్ చేయనున్నారు. దీనికి సంబంధించిన డిస్కషన్లో ఐశ్వర్య పాల్గొంది. ధనుష్‌తో విడాకులు ప్రకటించిన అనంతరం ఐశ్వర్య తొలిసారిగా కనిపించడంతో ఈ ఫోటో ప్రస్తుతం తెగ వైరల్ అవుతుంది. -
ధనుష్-ఐశ్వర్య విడాకులు: అంతలోనే ఏం జరిగింది?
ధనుష్-ఐశ్వర్యల విడాకుల వ్యవహారం తమిళనాట హాట్‌టాపిక్‌గా మారింది. 18ఏళ్లు కలిసున్న ఈ స్టార్ కపుల్ అనూహ్యంగా విడిపోతున్నట్లు ప్రకటించడానికి అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి ఐశ్వర్య ధనుష్ కంటే రెండేళ్లు పెద్ద. కాదల్ కొండై సినిమా సమయంలో ఏర్పడిన వీరి పరిచయం ప్రేమ దాకా వెళ్లింది. అలా ఇరు వర్గాల పెద్దలను ఒప్పించి 2004లో ఈ జంట పెళ్లి చేసుకున్నారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. ఎంతో అన్యోన్యంగా సాగుతున్న వారి జీవితంలో కొన్నాళ్ల క్రితమే విభేదాలు వచ్చాయని, కానీ మామ(రజనీకాంత్)జ్యోక్యంతో గొడవలు సద్దుమణిగాయని కోలీవుడ్ టాక్. ఇటీవలె ధనుష్ నటించిన అసురన్ చిత్రానికి నేషనల్ అవార్డును సంపాదించగా, అదే సమయంలో రజనీ దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. దీనికి సంబంధించిన ఓ ఫోటోను సైతం ఐశ్వర్య షేర్ చేస్తూ.. ఇద్దరూ నా వాళ్లు అంటూ సంతోషంతో పొంగిపోయింది. ఆ తర్వాత రజనీకాంత్ అస్వస్థతకు గురైన సమయంలో కూడా ధనుష్ దగ్గరుండి మామగారికి సేవలు చేసినట్లు తెలుస్తుంది. అంతేకాకుండా ఈనెలలోనే ప్రారంభమైన ధనుష్ ఫస్ట్ స్ట్రెయిట్ మూవీ 'సార్' చిత్ర షూటింగ్‌కి సైతం ఐశ్వర్య హాజరైంది. ఇప్పటివరకు బాగానే ఉన్నా అంతలోనే విడాకులు ప్రకటించి అనూహ్యంగా షాక్ ఇచ్చారు ఈ కోలీవుడ్ కపుల్. -
నా అల్లుడు చాలా మంచి వాడు: రజనీకాంత్ వీడియో వైరల్
Rajinikanth Praising Dhanush Old Video Goes Viral: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్వర్యల విడాకుల విషయం ప్రస్తుతం తమిళనాట హాట్ టాపిక్‌గా మారింది. 2004లో ప్రేమ వివాహం చేసుకున్న ఈ జంట 18 ఏళ్ల వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. ఇక భార్యభర్తలుగా కలిసుండలేమంటూ ప్రకటించి అభిమానులకు షాక్ ఇచ్చారు. దీంతో ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ కపుల్ విడాకులు తీసుకోవడం ఏంటని ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ధనుష్-ఐశ్వర్యలకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. గతంలో కాలా సినిమా ఆడియో ఫంక్షన్లో ధనుష్ గురించి రజనీకాంత్ మాట్లాడుతూ.. 'ధనుష్ చాలా మంచి వ్యక్తి. తల్లిదండ్రులను దేవుళ్లుగా భావిస్తాడు. భార్యను బాగా చూసుకుంటాడు. అతను మంచి తండ్రి, మంచి అల్లుడు, మంచి మనిషి, చాలా ప్రతిభ కలవాడు' అంటూ రజనీ మాట్లాడిన ఓ పాత వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా కూతురి విడాకుల నేపథ్యంలో స్టే స్రాంగ్ తలైవా అంటూ అభిమానులు పోస్టులు పెడుతున్నారు. Apart From Trolls. Feeling sad For Rajini. Stay Strong 🙏 #Dhanush #DhanushDivorce #Divorce @dhanushkraja#Beast #Thalapathy66 @actorvijay pic.twitter.com/3brl7XYWNu — பாண்டி💙❤💚 (@PandiyanKpm) January 18, 2022 -
మరోసారి హాట్‌టాపిక్‌గా మారిన సుచీలీక్స్, ఆ ఫోటోలతోనే..
Real Story Behind Suchi Leaks, Is Suchi Leaks Reason For Dhanush Divorce: తమిళ స్టార్ హీరో ధనుష్ పేరు మరోసారి సంచలనమైంది. భార్య ఐశ్వర్యతో విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న ఐశ్వర్య- ధనుష్‌లు18 ఏళ్ల తర్వాత తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించిన సంగతి తెలిసిందే. స్నేహితులుగా,దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా ఇంతకాలం కలిసున్న తాము ఇకపై భార్యభర్తలుగా విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు పేర్కొన్నారు. నిజానికి వీరిద్దరి మధ్య సుచీ లీక్స్ వ్యవహారంతోనే కలహాలు మొదలయ్యాయని కోలీవుడ్ టాక్. తమిళనాట స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న ధనుష్ పేరు సుచీ లీక్స్‌లో బయటపడటం అప్పట్లో సెన్సేషన్‌కు దారితీసింది. అసలేంటీ సుచీ లీక్స్? 2017లో కోలీవుడ్‌ను ఊపేసిన అత్యంత వివాదాస్పద అంశం సుచీ లీక్స్. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసి తీవ్ర దుమారం సృష్టించింది. ఇందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ లిస్ట్‌లో స్వయంగా రజనీకాంత్ అల్లుడు, అప్పటికే స్టార్ స్టేటస్ సంపాదించుకన్న ధనుష్ ఉండటం మరింత హాట్ టాపిక్‌గా మారింది. త్రిష, అమలాపాల్ వంటి హీరోయిన్లతో ధనుష్ ప్రైవేట్ ఫోటోలు లీకయ్యాయి. దీనికి తోడు కొందరు హీరోయిన్లతో ధనుష్‌కు ఉన్న అఫెర్లను చాలా కాలంగా భరిస్తూ వచ్చిన ఐశ్వర్య.. చివరకు చేసేదేమిలేక విడిపోవాలని నిర్ణయం తీసుకున్నారని తమిళ సినీ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సూపర్‌స్టార్ రజనీకాంత్.. ఇద్దరు కూతుళ్లూ విడాకులు
Rajinikanth Two Daughters Marriage Life Ended In Divorce, Deets Inside: విడాకుల ప్రకటనతో హీరో ధనుష్- ఐశ్వర్యలు అభిమానులకు ఊహించని షాక్ ఇచ్చారు. 18 ఏళ్ల వైవాహిక బంధానికి ముగింపు పలుకుతూ సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్లు ప్రకటించారు. కోలీవుడ్‌లో బ్యూటిఫుల్ కపూల్‌గా గుర్తింపుపొందిన ధనుష్, ఐశ్వర్యలు విడిపోవడం సినీ వర్గాలను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది.. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ స్టార్ కపూల్.. విడాకులు తీసుకోవడం అభిమానుకులకు మింగుడుపడటం లేదు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు18 ఏళ్ల తర్వాత విడిపోవాలని ఎందుకు నిర్ణయించుకున్నారంటూ ఫ్యాన్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా ధనుష్- ఐశ్వర్యల విడాకుల ప్రకటనతో రజనీకాంత్ చిన్న కూతురు సౌందర్య విడాకుల అంశం కూడా మరోసారి తెరమీదకి వచ్చింది. అప్పట్లో సౌందర్య విడాకులు కోలీవుడ్ నాట సెన్సేషన్‌గా మారిన సంగతి తెలిసిందే. 2010లో అశ్విన్ అనే వ్యాపారవేత్తతో సౌందర్యకు వివాహం జరిగింది. వీరికి వేద్ కృష్ణ అనే బాబు కూడా ఉన్నాడు. అయితే మనస్పర్థల కారణంగా 2017లో ఈ జంట విడాకులు తీసుకుంది. అనంతరం రెండేళ్లకు నటుడు, బిజినెస్ మ్యాన్ విషగన్ వనంగముడిని పెళ్లాడింది. సూపర్‌స్టార్ రజనీకాంత్ సైతం ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇప్పటివరకు ఎలాంటి కలతలు లేకుండా సాఫీగానే సాగుతుంది వారి బంధం. కానీ రజనీ కూతుళ్లు మాత్రం వివాహ బంధాన్ని నిలబెట్టుకోలేకపోతున్నారని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
నల్ల తంబి
‘ఎందుకమ్మా నన్నింత నల్లగా కన్నావు’ అంటే ‘నిన్ను ఎర్రగా కని ఉంటే త్వరగా మాసిపోయేవాడివి కదా’ అంటుంది అమ్మ.‘ఎవరిని పట్టుకుని నలుపు అంటున్నావ్.. ఇది గ్యారంటీ కలర్’ అంటాడు శివాజీ వాళ్ల మామయ్య. రజనీకాంత్ నటించిన ‘శివాజీ’ సినిమాలో ఇలాంటి డైలాగ్స్ ఉంటాయి. ఈ నల్ల ఆ నల్ల కాదు. తమిళంలో నల్ల అంటే మంచి అని. డిసెంబర్ 12 రజనీకాంత్ జన్మదినం సందర్భంగా ఆయన అన్నయ్య సత్యనారాయణ రావ్ ఈ తంబి గురించి ‘సాక్షి’తో పంచుకున్న నల్ల సంగతులు. ►రజనీకాంత్‌గారి బర్త్‌డే (డిసెంబర్ 12) సందర్భంగా ఆయన గురించి కొన్ని విశేషాలు తెలుసుకోవాలనిపించింది. అందుకే ఈ ఇంటర్వ్యూ... సత్యనారాయణ రావ్: చాలా సంతోషం. ►ఇప్పుడంటే రజనీగారి పుట్టిన రోజులు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. ఆయన ఫ్యాన్స్ అయితే ఓ పండుగలా చేస్తున్నారు. చిన్నప్పుడు ఆయన బర్త్‌డేలు ఎలా జరిగేవి? ఇంటివరకే పరిమితం అయ్యేది. మా అమ్మగారు ఉన్నంతవరకూ సింపుల్‌గా చేసేవారు. రజనీకి తొమ్మిదేళ్ల వయసప్పుడు మా అమ్మగారు చనిపోయారు. అనారోగ్యంతో ఆమె కన్నుమూశారు. అమ్మ చనిపోయిన ఏడాదికి నాకు పెళ్లయింది. అప్పటినుంచి మా ఆవిడే రజనీ బర్త్‌డేలు చేయడం మొదలుపెట్టింది. అది కూడా సింపుల్‌గానే. పాయసం, పూరి, వడ.. ఆయన బర్త్‌డే అంటే ఈ మూడూ చేసేది. మా దగ్గర ఆయన ఉన్నంతవరకూ ఇదే ఆనవాయితీ. ► జనరల్‌గా తమ్ముడి గురించి చెప్పేటప్పుడు ‘వాడు’ అంటుంటారు. మీరేమో ‘ఆయన’ అంటున్నారు. స్టార్ కాబట్టి అలా అనాల్సి వచ్చిందా? అదేం కాదు. మాకు ‘ఏరా.. పోరా’ అని పిలుచుకునే అలవాటు చిన్నప్పుడే లేదు. ‘ఎన్నప్పా.. వాప్పా.. పోప్పా’ (ఏమప్పా.. రాప్పా.. పోప్పా) అంటుంటాను. తను కూడా నన్ను అంతే. పిలుపులు గౌరవంగా ఉన్నప్పటికీ అవేవీ మా అనుబంధాన్ని దూరంగా ఉంచినట్లు కాదు. ►రజనీగారికి తోడబుట్టినవాళ్లు ఎంతమంది? ఒక అక్క, తన తర్వాత నేను, నా తర్వాత తమ్ముడు, రజనీ నాలుగో ఆయన. మా అక్కకి పదహారేళ్ల వయసులోనే పెళ్లయింది. తమ్ముడు చనిపోయాడు. రజనీ, నేను కలిసి పెరిగింది ఎక్కువ. ► మీ ఇద్దరూ కలిసి సినిమాలకు వెళ్లేవారా? కథలు చెప్పుకునేవారా? బోల్డన్ని కథలు చెప్పుకునేవాళ్లం. ముఖ్యంగా రాజుల కథలు చదివేవాళ్లం కూడా. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ కథ, మహాభారతం చెప్పుకునేవాళ్లం. రజనీకి శివాజీ కథ అంటే ఇష్టం. ఇక సినిమాల గురించి చెప్పాలంటే.. రజనీ ఎక్కువగా తమిళ సినిమాలు, నేను కన్నడ సినిమాలు చూసేవాళ్లం. అందుకని దాదాపు విడివిడిగానే వెళ్లేవాళ్లం. రజనీకి ఎంజీఆర్, శివాజీ గణేశన్గార్ల సినిమాలంటే చాలా ఇష్టం. ► సినిమాల్లో శివాజీ, హిస్టరీలో ఛత్రపతి శివాజీ అంటే ఇష్టం అన్న మాట. రజనీగారి రియల్ నేమ్ కూడా శివాజీరావ్ గైక్వాడ్ కదా? అమ్మానాన్న పెట్టిన పేరు అదే. సినిమాల్లోకి వచ్చాక డైరెక్టర్ కె. బాలచందర్‌గారు పేరు మార్చా రు. ఆ పేరే స్థిరపడిపోయింది. ► చిన్న రజనీ అల్లరిపిల్లవాడేనా? (నవ్వేస్తూ) రుంబ కురుంబు (బాగా అల్లరి). అయితే ఫ్రెండ్స్‌తో బాగా గొడవలు పడటం లాంటివి ఉండేవి కాదు. ఎప్పుడైనా చిన్న చిన్న తగాదాలు ఆడటం, ఆ తర్వాత వెంటనే కలిసిపోవడం. రజనీకి ఫుట్‌బాల్, కబడ్డీ అంటే ఇష్టం. ► మరి ఆటల్లో తొండి చేయడం, ఓడిపోయినప్పుడు ఫీలవ్వడం లాంటివి? రజనీకి ఓటమి అనేది లేదు. ఎప్పుడూ విజయమే. ఆటల్లో ఫస్ట్. చదువులో కూడా బెస్టే. చిన్నప్పుడే మంచి భావాలు ఉండేవి. ఏదైనా అన్యాయం అనిపిస్తే వెంటనే ఎదురు తిరిగి అడగడం లాంటివి. ► ‘శివాజీ’ సినిమాలో నల్లగా ఉన్న రజనీ పాత్ర తెల్లబడటానికి ట్రై చేస్తుంది. ‘బాబా’ సినిమాలో ‘గ్యారంటీ కలర్’ అని ఓ పాటలో వస్తుంది. రజనీగారు ‘నల్ల పయ్యనే కదా’? (నవ్వేస్తూ) అవును. నల్ల పయ్యన్ (మంచి అబ్బాయి). రుంబ రుంబ నల్ల పయ్యన్ (చాలా చాలా మంచి అబ్బాయి). ► మీ అమ్మగారు చనిపోయాక రజనీగారు, మీ నాన్నగారు మీ కుటుంబంతోనే ఉండేవారా? తమ్ముడి స్కూల్ ఫీజులు మీరేమైనా కట్టేవారా? నాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో చేసేవారు. 55 ఏళ్లకు రిటైర్ అయ్యారు. 30 రూపాయలు పెన్షన్ వచ్చేది. ఆ తర్వాత 50, 100. 1985లో నాన్న చనిపోయారు. అప్పటికి ఆయనకు 150 రూపాయలు వచ్చేది. నాతోనే ఉండేవారు. రజనీ స్కూల్ ఫీజులు కట్టేవాడిని. నాకు తనని బాగా చదివించాలని ఉండేది. డాక్టర్ చేయాలని కోరిక. బాగా చదువుకుంటే సీట్ వస్తుంది.. డాక్టర్ అవ్వొచ్చు అనేవాడిని. అయితే డ్రామాల్లో నటించడం మొదలుపెట్టాక రజనీ మైండ్ డైవర్ట్ అయింది. ► మరి ఎంతదాకా చదువుకున్నారు? ప్లస్ టు వరకే. చిన్నప్పుడు రజనీని రామకృష్ణ మిషన్ వాళ్లు స్థాపించిన రామకృష్ణ మఠంలో చేర్పించాను. స్కూల్ అయిపోగానే మఠంకి వెళ్లేవాళ్లం. నేను ప్రార్థనలు చేసేవాడిని. రజనీ అయితే వేద మంత్రాలు నేర్చుకుని, అక్కడ సేవలు కూడా చేయడం జరిగింది. ఆ మఠంలో ఏడాదికి ఒకసారి డ్రామాలు వేసేవారు. ఆ డ్రామాల్లో ఉత్సాహంగా పాల్గొన్న రజనీకి అప్పుడే యాక్టింగ్ మీద ఇంట్రస్ట్ మొదలైంది. రామకృష్ణ మఠంలో మాత్రమే కాకుండా విడిగా స్టేజ్ నాటకాల్లోనూ నటించడం స్టార్ట్ అయింది. దాంతో చదువు మీద ఆసక్తి పోయింది. ► మీరు మందలించలేదా? అలా ఏం లేదు కానీ కాలేజీకి వెళ్లకపోవడంతో ఖాళీగా ఉండటంవల్ల మాకు తెలిసిన ఆయన రజనీని కండక్టర్‌గా చేర్పించారు. ఆ జాబ్‌లో జాయిన్ అయినా ధ్యాస అంతా నాటకాల మీదే. ఫ్రెండ్స్‌తో కలిసి నాటకాలు వేయడం అలవాటైంది. అప్పుడు తన స్నేహితులు ‘నీ ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. నువ్వు సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా. మద్రాస్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయితే అవకాశాలు వస్తాయి’ అన్నారు. దాంతో తనకి కూడా ఆసక్తి పెరిగి, మదరాసు వెళ్లడం జరిగింది. ► కండక్టర్ జాబ్ రిజైన్ చేసి, మదరాసు వెళతానంటే మీరేమన్నారు? నెల ఖర్చులు మీరే పంపించేవారా? కండక్టర్‌గా చేసింది రెండేళ్లే. రజనీ ఏం చేస్తానంటే దానికి ఓకే అనేవాడిని. మదరాసు వెళతానంటే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఫీజు కట్టాను. ఖర్చుల నిమిత్తం నెలకి రూ.500 పంపించేవాడిని. తన స్నేహితులు కూడా కొంచెం పంపించేవాళ్లు. రజనీకి పట్టుదల ఎక్కువ. పైగా ఇష్టంగా ఎంచుకున్నది కాబట్టి ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో క్లాసులకు బాగా వెళ్లి, చివరికి బాలచందర్‌గారి దృష్టిలో పడటం జరిగింది. ► మీ తమ్ముడు సూపర్‌స్టార్ స్థాయికి చేరుకుంటారని ఊహించారా? చిన్నప్పుడు ఆటల్లోనే ఓటమి లేదని చెప్పాను కదా. పెద్ద స్థాయికి వెళ్లడం ఖాయం అనుకున్నాను. సినిమా అవకాశాలు రావడం, బిజీ అవ్వడం.. అంతా సాఫీగా జరిగినందుకు ఆనందంగా ఉంది. ఈ స్థాయికి చేరుకోవడానికి తన కృషి కారణం. ►రజనీగారి స్టైల్ ఆయన్ను మాస్‌కి దగ్గర చేసింది. ఆ నడక వేగం, మాట తీరు ఆకట్టుకున్నాయి. చిన్నప్పుడూ ఇంతేనా? అసలు స్లోగా నడవడం తనకు అలవాటు లేదు. చిన్నప్పుడూ అంతే. ఫాస్ట్‌గా నడవడం, ఫాస్ట్‌గా మాట్లాడటం. స్టైల్ అనేది తను స్క్రీన్ కోసం అలవాటు చేసుకున్నది కాదు. నేచురల్‌గా వచ్చింది. ► మీ కుటుంబం గురించి? మీకెంత మంది పిల్లలు? నా భార్య మూడు నెలల క్రితం చనిపోయింది. నాకు ఇద్దరు కూతుళ్లు, ముగ్గురు కొడుకులు. కూతుళ్లిద్దరికీ పెళ్లయింది. కొడుకులు కూడా బాగా సెటిలయ్యారు. ► మీ పిల్లలు సెటిలవ్వడానికి వాళ్ల చిన్నాన్న సహాయం ఎంతవరకూ ఉంది? నా ఇద్దరి కూతుళ్ల పెళ్లిళ్లూ తన చేతుల మీదగానే జరిగాయి. కొడుకులను నేను చదివించుకున్నాను. మాకు కావాల్సిన సౌకర్యాలన్నీ నా తమ్ముడు సమకూర్చడంతో హ్యాపీగా ఉన్నాం. నేను బెంగళూరు కార్పొరేషన్లో సూపర్వైజర్గా చేసేవాడిని. రిటైర్ అయి పదిహేనేళ్లకుపైనే అయింది. పెన్షన్ వస్తోంది. ► రజనీగారికి పెళ్లయ్యాక ఆయన భార్య లతగారు, మీ ఆవిడ ఎలా ఉండేవారు? మీ కుటుంబాన్ని మీ తమ్ముడు చూసే విషయంలో లతగారికి ఏమైనా ఆక్షేపణ ఉండేదా? అలా ఏం లేదు. మా మరదలు, మా ఆవిడ ఇద్దరూ బాగుండేవాళ్లు. తమ్ముడు మదరాసులో సెటిలైనా నా కుటుంబంతో నేను బెంగళూరులోనే ఉండిపోయాను. మంచీ చెడుకి కలుసుకుంటాం. కష్టసుఖాలు చెప్పుకుంటాం. మా ఇంటి ఆడవాళ్ల వల్ల మాకెలాంటి మనస్పర్థలు రాలేదు. ► చిన్నప్పుడు ఎంతో ప్రేమగా పెంచిన వదిన మూడు నెలల క్రితం చనిపోయినప్పుడు రజనీగారు వచ్చారా? వచ్చి, తన వదిన అంతిమ సంస్కారాలన్నీ దగ్గరుండి చేయడం జరిగింది. ఇలా చెప్పొచ్చో లేదో కానీ అలాంటి తమ్ముడు దొరకడం నా పుణ్యం. ► మీ ‘స్టార్ బ్రదర్’కి మీరు ఫోన్ చేయాలంటే.. అందరిలా మేనేజర్ ద్వారానా? డైరెక్ట్‌గా చేస్తారా? లేదు. డైరెక్ట్‌గానే చేస్తాను. వీలున్నప్పుడల్లా మాట్లాడుకుంటాం. ఆరోగ్యం బాగుందా? పిల్లలందరూ బాగున్నారా? అని రజనీ ఫోన్ చేస్తే, తన క్షేమసమాచారాలు తెలుసుకోవడం కోసం నేను ఫోన్ చేస్తుంటాను. ► మీ తమ్ముడు పెద్ద స్టార్ కాబట్టి ఆయనతో సినిమా నిర్మించి క్యాష్ చేసుకోవాలని మీరు అనుకోలేదా? రజనీగారు మీకా సలహా ఇవ్వలేదా? నాకు జాబ్ ఉంది కాబట్టి నేనా విషయం గురించి ఆలోచించలేదు. తమ్ముడు కూడా ఎప్పుడూ నాతో ఆ మాట అనలేదు. అయినా తనతో ఎంతోమంది నిర్మాతలు సినిమాలు తీస్తున్నారు. ఒక సినిమా మీద ఎన్నో కుటుంబాలు ఆధారపడి ఉంటాయి. మా తమ్ముడి సినిమా చాలామందికి ఉపాధి కల్పిస్తోంది కాబట్టి నాకు ఆనందమే. ► మీ పిల్లల్ని కూడా సినిమాల్లోకి తీసుకురావాలనుకోలేదా? నా రెండో కొడుకు పాండురంగకి సినిమాలంటే చాలా ఇష్టం. సినిమాల్లోకి రావాలని ఫుణే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో కూడా చేరాడు. కానీ మా తమ్ముడికి అంతగా ఇష్టం లేదు. సినిమాల్లో ఏదీ శాశ్వతం కాదు.. జాబ్ చేసుకుని హ్యాపీగా ఉంటే బాగుంటుందనడంతో నాకూ అదే మంచిదనిపించింది. ఎందుకంటే ఇక్కడ పేరు రావాలంటే అదృష్టం ఉండాలి. కొంతమంది పేరు తెచ్చుకోగలిగారు. కొంతమంది ఏమీ లేకుండా పోయారు కూడా. అందుకే తమ్ముడి మాటే కరెక్ట్ అనిపించింది. దాంతో మా పాండురంగ కూడా సినిమా ఆలోచన వదులుకున్నాడు. ► రజనీగారి పిల్లలు ఐశ్వర్య, సౌందర్య మీతో ఎలా ఉంటారు? మీ పిల్లలు ఆయనతో? పెదనాన్న అని నాతో బాగుంటారు. రజనీ పిల్లలు బంగారాలు. నా పిల్లలు కూడా వాళ్ల చిన్నాన్నతో బాగుంటారు. ► మీ అక్కగారికి ఎంతమంది పిల్లలు? వాళ్లను కూడా రజనీగారు బాగా చూసుకుంటారా? అక్కకి ఇద్దరు కొడుకులు, ఒక కూతురు. ఇప్పుడు అక్క లేదు. చనిపోయింది. ఆమె పిల్లలను కూడా రజనీ బాగానే చూసుకోవడంతో వాళ్ల జీవితాలూ బాగున్నాయి. ► రజనీగారు మంచి ఫామ్‌లో ఉన్నప్పుడు బాబాజీ అంటూ హిమాలయాలకు వెళ్లడం లాంటివి చేసినప్పుడు కెరీర్ గురించి మీరేమైనా కంగారుపడ్డారా? లేదు. ఎందుకంటే చిన్నప్పుడే తనలో ఆధ్యాత్మికం ఉంది. రామకృష్ణ మఠం ప్రభావం తన మీద ఉంది. ఆధ్యాత్మిక బాటలో వెళుతూనే కెరీర్‌ని కూడా సమాంతరంగా తీసుకెళ్లడం తనకు తెలుసు. ఏదో వైరాగ్యం వచ్చినట్లు కుటుంబాన్ని, వృత్తిని వదిలేస్తే అప్పుడు కంగారు పడేవాడిని. ► చిన్నప్పుడు కూడా ఆయనలో ఆధ్యాత్మిక భావాలు ఉండేవన్నారు. గుడికి వెళ్లడంలాంటివి చేసేవారా? మా ఇంటికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఓ శివుడి గుడి ఉండేది. ఆ పక్కనే రజనీ చదువుకున్న స్కూల్ ఉంది. స్కూల్‌కి వెళ్లేటప్పుడు శివుడి గుడిని దర్శించుకోవడం ఆనవాయితీ. కండక్టర్ అయిన తర్వాత, హీరో అయ్యాక కూడా రజనీ ఆ గుడిని దర్శించుకున్న సందర్భాలు ఎక్కువే. ► ఆయనతో పాటు హిమాలయాలు రమ్మని మిమ్మల్నెప్పుడూ అడగలేదా? చాలాసార్లు పిలిస్తే నేనే వెళ్లలేదు. కాలి నడకన 40, 50 కిలోమీటర్లు కొండల్లో వెళ్లాలి. నాక్కొంచెం మోకాళ్ల నొప్పి. అందుకే నా వల్ల కాదన్నాను. ► మీకూ, ఆయనకు వయసు వ్యత్యాసం ఎంత? దాదాపు పదేళ్లు. నాకు 77 ఏళ్లు. ► రజనీగారి షూటింగ్ లొకేషన్‌కి మీరు వెళతారా? లేదు. రజనీకి పద్మ విభూషణ్ అవార్డు ఇస్తే ఢిల్లీ వెళ్లాను. అప్పుడు ‘2.ఓ’ షూటింగ్ అక్కడ జరుగుతోంది. అందుకని ఆ లొకేషన్‌కి వెళ్లాను. అప్పుడు రజనీకి ఆరోగ్యం అంత బాగాలేదు. ‘2.ఓ’ అంత బాగా వచ్చిందంటే దానికి కారణం డైరెక్టర్ శంకర్. తమ్ముడికి ఆరోగ్యం బాగాలేకపోయినా ఓపికగా చేయించుకున్నారు. ► మీ తమ్ముడి ఆరోగ్యం విషయంలో మీరు కలవరపడుతుంటారా? అది ఉంటుంది. అప్పుడప్పుడూ హెల్త్ వైజ్‌గా డౌన్ అయితే ఆ దేవుడ్ని ప్రార్థిస్తుంటాను.. తన ఆరోగ్యం బాగుండాలని. ఎందుకంటే మనకన్నా చిన్నవాళ్లు అనారోగ్యంపాలైతే బాధగా ఉంటుంది. నాకు మోకాలి నొప్పి ఉన్నా ఆరోగ్యపరంగా వేరే సమస్యలు లేవు. అందుకే రజనీ అస్వస్థతకు గురైతే బాధపడిపోతుంటాను. అయినా ఆ మహావతార్ బాబాజీ అనుగ్రహం తన మీద ఉంది. అభిమానుల ప్రార్థనలు ఉంటాయి. అవే చల్లగా కాపాడతాయి. ► రజనీగారి సినిమాలు చూసి బాగుంటే బాగుందని లేదంటే లేదని నిక్కచ్చిగా చెబుతారా? నా తమ్ముడి సినిమా రిలీజ్ అవ్వగానే సాధ్యమైనంతవరకూ ఫస్ట్ డే ఫస్ట్ షో చూస్తా. బాగుంటే బాగుందని చెబుతాను. బాగా లేకపోతే ఆ విషయం కూడా చెప్పేస్తాను. ‘కాలా’ సినిమాని సరిగ్గా తీయలేదని చెప్పాను. హీరో క్యారెక్టర్‌కి, విలన్ క్యారెక్టర్‌కి మధ్య ఇంకా ఏదో ఉండాలనిపించిందని అన్నాను. ► ఆయన నటించిన సినిమాల్లో మీకు బాగా ఇష్టమైనవి? ఐదు, పది సినిమాలని లెక్కేసి చెప్పలేను. తమ్ముడు యాక్ట్ చేసే సినిమాలన్నీ ఇష్టమే. తన యాక్టింగ్ చాలా బాగుంటుంది. ► ‘ఈ ఫంక్షన్ నాకు స్పెషల్. ఎందుకంటే మా అన్నయ్య వచ్చారు’ అని ‘2.ఓ’ ఫంక్షన్లో రజనీగారు అన్నారు.. ఆయన ఎందుకలా అన్నారు? నేను సాధారణంగా షూటింగ్ లొకేషన్స్‌కి వెళ్లనని చెప్పాను కదా. సినిమా ఫంక్షన్స్‌కి కూడా వెళ్లను. చెన్నైలో జరిగిన ‘2.ఓ’ ట్రైలర్ రిలీజ్ ఫంక్షన్‌కి నన్ను రమ్మని రజనీ పిలిస్తే వెళ్లాను. ఇంటి ఫంక్షన్స్‌కి తప్ప సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లను కాబట్టి, తనకు ఆనందంగా ఉండి ఉంటుంది. ►ఫైనల్లీ.. రజనీగారికి రాజకీయాలు సూట్ అవుతాయంటారా? ఆ విషయం గురించి నేను చెప్పేకన్నా ఆయన చెబితేనే బాగుంటుంది. అయితే ఒక్కటి మాత్రం చెబుతాను. ఇప్పుడు రాజకీయ నాయకుల్లా మాత్రం పరిపాలించే అవకాశం లేదు. తన స్టైల్లో ఉంటుంది. – డి.జి. భవాని -
త్రీ వీఐపీస్
(వెరీ ఇండివిడ్యువల్ పీపుల్) సౌందర్యను రజనీకాంత్ కూతురిగా పరిచయం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ‘వీఐపీ–2’ చిత్రంతో సత్తా చాటుకోవడానికి రెడీ అయిన డైరెక్టర్ ఆమె. కాజోల్‌ని అజయ్ దేవగన్ భార్యగా పరిచయం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. ఆమె యాక్ట్ చేసిన ‘దిల్వాలే దుల్హనియా లేజాయేంగే’ సినిమా 22 ఏళ్లుగా ముంబైలోని మరాఠా మందిర్‌లో ఇంకా ఆడుతోంది. ఆమె అంతటి వీఐపీ. ధనుష్‌ను సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడిగా పరిచయం చేయడం కరెక్ట్ కాదనిపిస్తోంది. వీఐపీలంతా క్లాస్ అనుకుంటారు కదా.. ధనుష్ మాస్‌లకే వీఐపీ. వీళ్లు ముగ్గురూ ఒక్క చోట దొరికితే ఏమవుతుంది? ‘వీఐపీ’ ఇంటర్వ్యూ అవుతుంది. ముగ్గురు వీఐపీలు... అవును.. ముగ్గురూ ‘వెరీ ఇండివిడ్యువల్ పీపుల్’. నాన్నే బెటర్ డాన్! హాయ్ సౌందర్యా... మోషన్ కాప్చర్ టెక్నాలజీతో ‘కొచ్చడయాన్’ తీశారు. ఇప్పుడు ప్రాపర్ కమర్షియల్ లైవ్ మూవీని హ్యాండిల్ చేయడం ఎలా ఉంది? ‘వీఐపీ 2’ పక్కా మాస్ మసాలా ఎంటర్టైనర్. హ్యూమన్ ఎమోషన్స్, డ్రామా, హ్యూమర్ ఉన్న సినిమా. ఇందులో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు ఉన్నారు. వాళ్లందర్నీ డైరెక్ట్ చేయడం బాగా అనిపించింది. మీ బావ (సౌందర్య అక్క ఐశ్వర్య భర్త ధనుష్)గారు ఈ సినిమాకి హీరో కమ్ స్టోరీ రైటర్.. మరదలికి ఫ్రీడమ్ ఇచ్చారా? డైరెక్షన్లో ఇన్వాల్వ్ అయ్యారా? ధనుష్ డైరెక్టర్స్ ఆర్టిస్ట్. స్క్రిప్ట్ వర్క్ మాత్రమే ఆయనది. మిగతా విషయాలన్నీ నాకే వదిలేశారు. సెట్స్‌కి వెళ్లేముందు మా రిలేషన్స్ తీసి పక్కన పెట్టేశాం. ‘వీఐపీ’ (తెలుగులో ‘రఘువరన్ బీటెక్’) పెద్ద హిట్. నన్నీ సినిమాను డైరెక్ట్ చేయమనప్పుడు ప్రెజర్‌గా కాక రెస్పాన్సిబిలిటీగా ఫీలయ్యా. ఏదైనా విషయంలో వాదనలు జరిగాయా? ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు ‘ఒకవేళ ఏదైనా విషయాల్లో అభిప్రాయాలు కలవకపోతే మనం కచ్చితంగా వాదించుకోవాలి’ అనుకున్నాం. అలాగే చాలాసార్లు మా మధ్య వాదనలు జరిగాయి. సినిమా బాగా రావడం కోసం డిబేట్స్ జరుగుతాయి. ఈ సినిమా షూటింగ్ స్పాట్‌కి మీ నాన్నగారు (రజనీకాంత్) వచ్చినప్పుడు ఏమనిపించింది? చాలా హ్యాపీ అనిపించింది కానీ, ఆయన ముందు ‘స్టార్ట్... కట్’ చెప్పడానికి మాత్రం కొంచెం ఇబ్బందిపడ్డాను. కాసేపు షూటింగ్ చూసేసి, వెళ్లిపోయారాయన. నేను ఇంటికి వెళ్లిన తర్వాత ‘బాగా తీస్తున్నావ్’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. అది చాలు నాకు. మరి.. మీ నాన్నగారిని మళ్లీ ఎప్పుడు డైరెక్ట్ చేస్తారు? ‘కొచ్చడయాన్’ లైవ్ యాక్షన్ మూవీ కాదు కాబట్టి, కార్టూన్ మూవీ అనుకున్నారు. ఆ సినిమాలో నాన్నగారు లైవ్‌లో కనిపించరు. అయినప్పటికీ కొన్ని సీన్స్ కోసం ఆయనతో నటింపజేశాం. స్క్రీన్ మీద యానిమేషన్ రూపంలో చూపించాం. అయితే, లైవ్ యాక్షన్ సినిమా చేస్తే ఆ సంతృప్తే వేరు. ఆ ఛాన్స్ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తా. ఒకవేళ మళ్లీ ‘కొచ్చడయాన్’ చేసే ఛాన్స్ వస్తే లైవ్ యాక్షన్ ఫిల్మ్‌గా చేస్తా. మీ నాన్నగారు చేసిన సినిమాల్లో మీకు ఏది బాగా ఇష్టం! అప్పా (నాన్న)ను డాన్‌గా చూడడం నాకిష్టం. అందుకే ‘భాషా’ నా ఆల్‌టైమ్ ఫేవరెట్. ఆయన కంటే బెటర్ డాన్ ఎవరూ ఉండరు. మీ నాన్నగారు సూపర్‌స్టార్ అయినా చాలా సింపుల్‌గా ఉంటారు. ఎప్పుడైనా హెయిర్‌కి డై వేసుకోమని, అదీ ఇదీ చెబుతుంటారా? ఆయన నిజమైన వ్యక్తి. ఎక్కడనుంచి వచ్చామనేది మర్చిపోరు. అప్పా సింప్లిసిటీ నుంచి మేం నేర్చుకోవలసింది చాలా ఉంది. సింప్లిసిటీ చూసే చాలామంది అభిమానులయ్యారు. హి ఈజ్ వన్నాఫ్ ద మోస్ట్ స్టైలిష్ పర్సన్స్. డై వేసుకుని, స్టైల్‌గా డ్రస్సప్ చేసుకోవలసిన అవసరం లేదు. వ్యక్తిగత జీవితం ఎలా ఉంది? ఇటీవలే మీరు డైవోర్స్ తీసుకున్నారు? నో కామెంట్స్. ప్రస్తుతం హ్యాపీ స్పేస్‌లో ఉన్నాను. విజయాలతో పాటు విలువలు ముఖ్యం హాయ్ కాజోల్... సినిమాలు తగ్గించేశారు..? సినిమా పుస్తకం లాంటిది. మంచి బుక్ చదవడం ప్రారంభిస్తే పూర్తయ్యే వరకు వదలిపెట్టం! అలాగే, చివరివరకు నన్ను చదివించగల స్క్రిప్ట్ వచ్చినప్పుడు చేస్తున్నా. ‘వీఐపీ–2’లో మిమ్మల్నంతగా ఆకర్షించినవి? నా రోల్ వసుంధరా పరమేశ్వరన్. వెరీ స్ట్రాంగ్ అండ్ సెల్ఫ్ మేడ్ విమెన్. ఆమెకు ఆత్మగౌరవం ఎక్కువ. ఎంత ఆత్మవిశ్వాసం అంటే... ‘మీరు ఎక్కడ, ఎలాంటి సిట్యువేషన్స్‌లో వదిలేసినా తిరిగొస్తా ఐ విల్ కమ్ బ్యాక్ టు ద టాప్’ అనే వ్యక్తి. తన దృష్టిలో తానొక ఆదర్శ వ్యక్తి. మిసెస్, సీఈఓ వంటి లేబుల్స్ ఆమెకు నచ్చవు. రోల్ బాగుంది... తమిళ్ మీకు రాదు కదా! అందుకే చేయగలనా?లేదా? అని ఆలోచించా. ధనుష్, సౌందర్య.. నా డైలాగుల్లో 50 శాతం ఇంగ్లిష్‌లో ఉంటాయంటే మేనేజ్ చేయొచ్చనుకున్నా! ఫస్ట్‌డే 3 పేజీల తమిళ డైలాగులు నా చేతిలో పెట్టారు. ‘ఇవి చెప్పడం నా వల్ల కాదు. ఇంకో యాక్టర్‌ను చూసుకోండి’ అన్నా. అప్పుడు వాళ్లు ‘లెట్స్ ట్రై ఫర్ వన్ ఆర్ టు డేస్. ఆ తర్వాత కూడా కష్టం అనిపిస్తే వేరే యాక్టర్‌ను చూసుకుంటాం’ అన్నారు. అలా అలా నటించేశా. కాజోల్ విలన్‌గానా? చాలామంది షాక్! (నవ్వుతూ) నా దృష్టిలో వసుంధర విలన్ కాదు. ఇద్దరు వ్యక్తులు, వాళ్ల వ్యక్తిత్వా లు, ఐడియాల మధ్య ఘర్షణపై తీసిన సినిమా ఇది. ప్రతి ఒక్కరూ వేర్వేరుగా ఆలోచిస్తారు. ఎవరి ఆలోచనలను వాళ్లు నమ్ముతారు. అప్పుడు తప్పకుండా గొడవ వస్తుంది. అలాంటి కథే ఇది. ప్రతి గణేష్ చతుర్థికి, నవరాత్రులకు మీరు చీర కట్టుకుని మండపాలకు వెళుతుంటారు.. నాకు తెలిసి రెండేళ్ల వయసున్నప్పట్నుంచి వెళుతునాన్ను. అప్పట్నుంచి ఇప్పటి వరకు అదే సంప్రదాయం కొనసాగుతోంది. శిరస్సు వంచి దుర్గాదేవికి నమస్కరించడం, గణేష్ పూజలు చేయడం నాకు ఇష్టం. ఐ లవ్ శారీస్. మహిళ అందమంతా చీరలోనే ఉంటుంది. గౌన్, శారీ... రెండిటిలో ఏదొకదాన్ని ఎంచుకోమంటే నేను చీరకే ఓటేస్తాను. దేవుడిపై మీ అభిప్రాయం ఏంటి? నా చిన్నప్పుడు ‘దేవుడు అమ్మానాన్నల వంటివాడు’ అని అమ్మ చెప్పింది. మనం ఏం చేసినా తల్లిదండ్రులు ప్రేమిస్తారు. తప్పులుంటే క్షమిస్తారు. దేవుడూ అంతే. నెత్తి మీద మొట్టికాయ వేసి పగ తీర్చుకునే రకం కాదు. మీ పిల్లలకు కూడా ఈ మాటలు చెబుతారా? అఫ్కోర్స్. లైఫ్‌లో సక్సెస్ కావడం చాలా ఇంపార్టెంట్. అదే టైమ్‌లో విలువలతో మంచి మనిషిగా మెలగడం కూడా ముఖ్యం. పిల్లలను మంచిగా పెంచడం నా బాధ్యత. ఎవరైనా మీతో చెడుగా ప్రవర్తిస్తే ‘మీ అమ్మ నిన్ను సరిగ్గా పెంచలేదా?’ అని అడుగుతారు. నా పిల్లలకు ఆ ప్రశ్న ఎదురు కాదు. వాళ్లను ఎవరూ వేలెత్తి చూపే సందర్భం రాదు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను ఎలా బ్యాలెన్స్ చేస్తారు? నేనిప్పుడు హైదరాబాద్‌లో ఉన్నాను. మా అబ్బాయి నేను లేకుండానే డిన్నర్ చేస్తున్నాడు. చాలా గిల్టీగా ఉంది. అలాగని రాత్రంతా కూర్చుని ఏడవను. నటిగా మూవీని ప్రమోట్ చేయడం నా బాధ్యత. రేపటి నుంచి వాడితో టైమ్ స్పెండ్ చేస్తాను. ఈ విధంగా పర్సనల్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేసుకుంటాను. నా లైఫ్‌ని నా కొడుకు చూస్తూ, పెరుగుతాడు కాబట్టి పెదై్దన తర్వాత వర్కింగ్ విమెన్‌ను ఎక్కువ రెస్పెక్ట్ చేస్తాడు. నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్...! ‘వీఐపీ’ (తెలుగులో ‘రఘువరన్ బీటెక్’)ని వేల్రాజ్ డైరెక్షన్లో చేశారు.. సీక్వెల్‌కి సౌందర్యని అనుకున్నారెందుకని? ధనుష్: సీక్వెల్ చేయాలని వేల్రాజ్ అనుకోలేదు. రఘువరన్‌ని మళ్లీ స్క్రీన్‌పైకి తీసుకు రావాలని నేను అనుకున్నా. అందుకే స్టోరీ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ రాశాను. నేను హీరోగా సౌందర్య డైరెక్షన్లో ఓ సినిమా చేయాలనుకున్నా. ఇదైతే బాగుంటుందనిపించింది. సౌందర్యకీ స్క్రిప్ట్ నచ్చింది. కోలీవుడ్ టు బాలీవుడ్.. ఇప్పుడు ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ ఆఫ్ ఫకీర్’ ద్వారా హాలీవుడ్‌కి వెళుతున్నారు... ఎలా ఉంది? ఐయామ్ బ్లెస్డ్. నేనెప్పుడూ కథకు విలువ ఇచ్చి సినిమాలు సెలక్ట్ చేసుకుంటాను. ‘రాంజ్నా’కి అవకాశం వచ్చినప్పుడు హిందీ ఇంట్రడక్షన్‌కి ఈ సినిమా బాగుంటుందనిపించి, ఒప్పుకున్నాను. నా ఊహ నిజమైంది. అనుకున్నట్లే ఆ సినిమా బాగా ఆడింది. హాలీవుడ్ సినిమా చేయాలని ‘ది ఎక్స్ట్రార్డినరీ జర్నీ...’ ఒప్పుకోలేదు. కథ, నా క్యారెక్టర్ నచ్చి ఒప్పుకున్నాను. డిఫరెంట్ లాంగ్వేజెస్ ట్రే చేయడం నాకిష్టమే. హిందీలో మీ రెండో సినిమా ‘షమితాబ్’ అనుకున్నంతగా ఆడలేదు కదా? నిజమే. ఒక్కోసారి మన ఊహలు నిజం కావు. అయితే ఆ సినిమా చేసినందుకు నేనం పశ్చాత్తాపపడటంలేదు. బాల్కీలాంటి దర్శకుడితో సినిమా అంటే అదొక మంచి ఎక్స్పీరియన్స్. అమితాబ్‌గారి కాంబినేషన్ అంటే మాటలా? ఆ విధంగా సినిమా నాకు మంచి మెమరీ అయింది. మరి మీ మామగారు (రజనీకాంత్) కాంబినేషన్లో సినిమా చేయాలని లేదా? రజనీ సార్‌తో కాంబినేషన్ కుదిరితే హ్యాపీ. అదేంటీ.. సార్ అంటున్నారు.. మావయ్యా అని పిలవరా? కొన్ని పిలుపులను ఇంటి వరకే పరిమితం చేయాలి. రజనీ సార్ ప్రజల మనిషి. ఆయన గురించి పబ్లిక్‌గా మాట్లాడేటప్పుడు ‘సార్’ అంటేనే గౌరవంగా ఉంటుంది. మరి.. ప్రజల మనిషి ముఖ్యమంత్రి అయితే చూడాలని ఉందా? నాకు రాజకీయాలు తెలియవు. రజనీ సార్‌కి ఏం అనిపిస్తే అది చేస్తారు. ఒకవేళ సీయం కావాలని ఆయన అనుకుంటే హ్యాపీయే. ఆయన అభిమానులు కూడా ఇష్టపడుతున్నారు. ఈ మధ్య తమిళ పరిశ్రమలో ‘నటీనటుల సంఘం’, ‘నిర్మాతల మండలి’ ఎన్నికలు హాట్ హాట్‌గా జరిగాయి? ఈ రెండింటికీ విశాల్ అధ్యక్షుడిగా వ్యవహరించడం కరెక్టేనా? అంత దూరం ఆలోచించను. రాజకీయాలు తెలియవని ఇంతకుముందు అన్నాను కదా. ఇక్కడ కూడా అదే మాట అంటున్నా. నేను ఇతరుల వ్యవహారాల్లోకి తొంగిచూడను. నేను, నా సినిమాలు, నా కుటుంబం తప్ప నాకు మరో ధ్యాస ఉండదు. ఆ మాటకొస్తే నాకు జనరల్ నాలెడ్జ్ తక్కువ. మీరు ఏదైనా క్లిష్టమైన ప్రశ్న వేశారనుకోండి.. ‘నెక్ట్స్ క్వశ్చన్ ప్లీజ్..’ అంటా (నవ్వుతూ). బాక్సాఫీస్ లెక్కల పరంగా ఇతర హీరోలతో పోటీ పడరా? అస్సలు లేదండి. నా సినిమాలతో నేను పోటీ పడతా. ‘రఘువరన్ బీటెక్’ బాగా ఆడింది కదా. నా నెక్ట్స్ మూవీ ఇంకా బాగా ఆడాలని కోరుకుంటా. నా సినిమాల రికార్డ్స్‌ని మళ్లీ నా సినిమాలే బ్రేక్ చేయాలనుకుంటా. కంటెంట్ ఈజ్ కింగ్ అని నమ్ముతా. మంచి కథలు సెలక్ట్ చేసుకుని, వెళ్లిపోవడం. అంతే. ఫైనల్లీ... ఇంత సన్నగా ఉన్నారు కదా... ఒకవేళ ‘బాహుబలి’లో భల్లాలదేవా లాంటి క్యారెక్టర్‌కు అవకాశం వస్తే చేస్తారా? అమ్మో.. ఏదో కొంచెం బరువు పెరగమంటే ఓకే కానీ, భల్లాలదేవాకి తగ్గట్టు బాడీని బిల్డ్ చేయడమంటే నా వల్ల కాదు. ఇలా సన్నగా ఉండనివ్వండి (నవ్వేస్తూ). మేం నవ్వుకున్నాం ఆ మధ్య మీరు వాళ్ల కొడుకంటూ ఓ దంపతులు కోర్టుకెక్కారు.. ఆధారాలు కూడా చూపించారు? ఇవాళ ఆధారాలు సృష్టించడం కష్టమా? చెప్పండి. ఫొటోలను మార్చేయడం చాలా ఈజీ. అందుకే ‘మా దగ్గర ఫొటోలున్నాయి’ అని ఆ దంపతులు చూపించినప్పుడు నేను, నా భార్య, ఇతర కుటుంబ సభ్యులు... మేమంతా నవ్వుకున్నాం. సెలబ్రిటీలకు ఇలాంటి వ్యవహారాలు తలనొప్పిగానే ఉంటాయి... అందుకే ఈ స్టేటస్ ప్రమాదమే? అఫ్కోర్స్ ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రమాదం అనిపిస్తుంది. కానీ, ఈ స్టేటస్ అందరికీ రాదండి. అదృష్టం ఉండాలి. వేలాది, లక్షలాది మంది అభిమానం సంపాదించుకోవడం అంటే చిన్న విషయం కాదు. అందుకే సెలబ్రిటీ అయినందుకు నాకు ఆనందమే. – డి.జి. భవాని -
ఉమెన్ ఇండియా c/o ఐశ్వర్య
ఐశ్వర్య డెరైక్టర్.. డాన్సర్.. ప్లేబ్యాక్ సింగర్.. పాత సంగతే. ఐశ్వర్య రజనీకాంత్ కూతురు.. ధనుష్ భార్య.. తెలిసిన సంగతే. ఐశ్వర్య ఇప్పుడు అంబాసిడర్!! కొత్తేముంది? బ్రాండుకో అంబాసిడర్. కానీ ఐశ్వర్య బ్రాండ్ అంబాసిడర్ కాదు. ఉమన్ పవర్‌కి ఇండియాను ఒక గ్రాండ్ నేమ్‌గా మార్చబోతున్న అంబాసిడర్. ఎలా తెలుసు మార్చబోతోందని! ఇంటర్వ్యూ చదవండి. మీకో కొత్త ఐశ్వర్య కనిపిస్తుంది. మీలోకి కొత్త శక్తి ప్రవహిస్తుంది. ⇒ మహిళా సంరక్షణ, సాధికారిత కోసం ఐరాస దూతగా ఎంపిక కావడం అంటే బరువైన బాధ్యత. మీరు న్యాయం చేస్తారన్నది చాలామంది నమ్మకం... ఐశ్వర్య: అవును. నమ్మకం లేకపోతే ఈ బాధ్యత నాకివ్వరు. అది నాకు బాగా తెలుసు. ఈ బాధ్యతను నాకెందుకు ఇచ్చారు? ఏ ప్రాతిపదికన నన్ను తీసుకున్నారు? అని నేను ఆలోచించలేదు. ఎంత బాగా చేయగలమనే ఆలోచనలో పడ్డాను. ఇలాంటివి పండగ చేసుకునే బాధ్యతలు కాదు. వెంటనే పనిలో పడాల్సినవి. చదువు విలువ తెలియని వాళ్లు చాలామంది ఉన్నారు. అలాంటి వాళ్లల్లో ఓ పది మంది పిల్లలు స్కూల్‌కి వెళ్లేలా చేసినా నేను సక్సెస్ అయినట్లే. అలాగే, ఇంటికే పరిమితమైన స్త్రీలలో ఓ పది మంది ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఉద్యోగం చేయాలనే భావన కలిగించినా నా పదవికి నేను న్యాయం చేసినట్లే. ⇒ దేశానికి స్వాతంత్య్రం వచ్చి 69 ఏళ్లయిన ఈ సందర్భంలోనూ ఇంకా స్త్రీ-పురుష సమానత్వం, స్త్రీ స్వేచ్ఛ కోసం పోరాడాల్సి రావడం బాధాకరమైన విషయమే అనాలి... ఐశ్వర్య:బాధాకరమే. కానీ, సంతోషించదగ్గ విషయం ఏంటంటే.. గడచిన పదేళ్లతో పోల్చితే ఇప్పుడు పరిస్థితులు బాగున్నాయి. తమకు ఎదురైన సమస్యలను బహిరంగంగా చెప్పుకోవడానికి పదేళ్ల క్రితం ఆడవాళ్లు వెనకాడేవాళ్లు. సమస్యలన్నింటినీ మనసులోనే దాచుకునేవాళ్లు. ఇప్పుడు బయటికొస్తున్నారు. ఇది శుభ పరిణామం. భవిష్యత్తులో ఇంకా మంచి మార్పొలొస్తాయి. ⇒ అసలు మహిళలు ఎదగడానికి మగవాళ్లు సపోర్ట్ చేయాలని ఎదురుచూడడం ఎందుకు? అక్కడే మహిళ బలహీనురాలని తేలిపోతోంది కదా? ఐశ్వర్య : కరెక్టే. ఎవరో ఎంకరేజ్ చేయాలని ఎదురు చూడకూడదు. స్వశక్తితో ఎదగాలి. అయితే ఇక్కడో విషయం చెప్పాలి. ఇంట్లో ఉన్న మగవాడి సపోర్ట్‌ని ఆడవాళ్లు ఆశించడం తప్పు కాదు. అలాగే, మగవాడు కూడా ఆడవాళ్ల సపోర్ట్‌ని ఆశించడం తప్పు కాదు. ‘ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది’ అనే సామెత మనకు తెలిసిందే. అలాగే, ప్రతి మహిళ విజయం వెనక ఒక మగాడు ఉండటం తప్పు కాదు. అయితే, ఆ మగాడు ‘నా వల్లే నీకీ జీవితం’ అంటే అది తప్పు అవుతుంది. ఇక్కడ ఎవరూ ఎక్కువ కాదు.. ఎవరూ తక్కువ కాదు. ఒకరి మీద మరికొరికి గౌరవం ఉన్నప్పుడు ఇద్దరూ సమానమే అనిపిస్తుంది. ఒక కుటుంబం బాగుండాలంటే ఇంట్లో ఉండే ఆడా, మగా కృషి చేయాలి. ఒక్కరి వల్ల ఏదీ సాధ్యం కాదు. ⇒ మనది పురుషాధిక్య సమాజం. స్త్రీ ఎదుగుదలను చూసి తట్టుకోలేని మగవాళ్లే ఎక్కువ.. ఐశ్వర్య : అఫ్కోర్స్ అది నిజమే. రాను రాను ఈ ధోరణిలో కూడా మార్పు కనిపిస్తోంది. ఎవరో తట్టుకోలేరని మనం ఆగిపోకూడదు. ఆనందించదగ్గ విషయం ఏంటంటే.. రీసెంట్గా జరిగిన రియో ఒలింపిక్స్‌లో మహిళలు పతకాలు గెల్చుకు వచ్చారు. వాళ్లు దేశానికి గర్వకారణం. చాలామంది ఆడవాళ్లకు వీళ్లు ఓ ఇన్స్పిరేషన్. ⇒ మీ ఇంటి వాతావరణం గురించి చెబుతారా? ఐశ్వర్య : నా జీవితంలో ఇద్దరు పురుషులు కీలకం. పెళ్లి కాక ముందు నాన్న (రజనీకాంత్), పెళ్లైన తర్వాత ధనుష్ (భర్త). మా నాన్న మాకు మా కాళ్ల మీద నిలబడటం నేర్పించారు. ఆత్మనూన్యతా భావంతో కాకుండా ఆత్మవిశ్వాసంతో బతికేలా పెంచారు. నా భర్త ధనుష్ ఆడవాళ్లను గౌరవించే వ్యక్తి. పెళ్లై, ఇద్దరు బిడ్డలకు తల్లయాక కూడా దర్శకురాలిగా కొనసాగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో మంచి వాతావరణం ఉండటమే. ‘నాన్న సూపర్ స్టార్. భర్త కూడా అంతే. అలాంటప్పుడు ఈవిడ పని చేయాల్సిన అవసరం ఏంటి?’ అని చాలామంది అనుకుంటారు. కానీ, నాకూ ఒక లక్ష్యం ఉండాలి కదా. ఆర్థికంగా బాగున్న మహిళలు పని చేయకూడదనీ, లేని మహిళలు ఉద్యోగాలు చేసుకుని బతకాలనీ కాదు. ఎవరికైనా ఒక టార్గెట్ ఉండాలి. సంపాదన ముఖ్యం. ఆర్థిక స్వాతంత్య్రం ఉన్నప్పుడు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది. సొంత డబ్బుతో పిల్లలకు కావాల్సినవి కొన్నప్పుడు, చీరలు, నగలు కొనుక్కున్నప్పుడు, ఇంటి అవసరాలకు ఖర్చు పెట్టినప్పుడు లభించే తృప్తే వేరు. ⇒ మీరన్నది కరెక్టే. కానీ, ప్రపంచం ఇంత వేగంగా ఎదుగుతున్నా.. కొంతమంది మహిళలు ఇంకా ఇంటికే పరిమితం కావాలనుకుంటున్నారు. అలాంటివాళ్లకు ఏం చెబుతారు? ఐశ్వర్య : అవగాహన కలిగించాలి. ఇంట్లో ఉండేవాళ్లను నేను తక్కువ చేయడం లేదు. గృహిణులు చాలా పవర్ఫుల్. ‘ఇవాళ నేను ఇంటి బాధ్యతలకు సెలవు చెబుతున్నా’ అని ఒక్క రోజు అనమనండి. ఇంటిల్లిపాదీ షాకైపోతారు. ఇల్లు మొత్తం తలకిందులవుతుంది. ఒకవేళ ఇంటి బాధ్యతలు నిర్వర్తించడంలో ఆనందం ఉందనుకుంటే ఓకే. కానీ, బయటికొచ్చి ఉద్యోగం చేయాలంటే భయపడే ఆడవాళ్లు మాత్రం ఆత్మవిశ్వాసం పెంచుకోవాల్సిందే. తాము సంపాదించడం ద్వారా కుటుంబ ఆర్థిక పరిస్థితి మెరుగవుతుందనుకున్నప్పుడు ఉద్యోగం చేయాలి. బయట ఎదురయ్యే పరిస్థితులను తట్టుకోవడానికి కావల్సిన ధైర్యం తెచ్చుకోవాలి. ఎవరికి భయపడాలి? ఎందుకు భయపడాలి? ⇒ ఆత్మకథతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ ఐశ్వర్య : ఓ సెలబ్రిటీ కూతురిగా, స్టార్ భార్యగా, ఫిల్మ్ మేకర్‌గా, తల్లిగా.. ఇప్పటివరకూ తాను ఎదుర్కొన్న అనుభవాల సమాహారంతో ‘స్టాండింగ్ ఆన్ యాన్ యాపిల్ బాక్స్’ పేరుతో ఐశ్వర్యా ధనుష్ ఆత్మకథ రాస్తున్నారు. వ్యక్తిగత జీవితంలో చోటు చేసుకున్న పలు అంశాలను ఐశ్వర్య ఈ పుస్తకంలో ప్రస్తావిస్తున్నారు. ఎత్తు-పల్లాలు, ఆగ్రహావేదనలు.. ఇలా పలు భావాలను ఈ స్వీయచరిత్రలో వ్యక్తపరుస్తున్నారు. ‘‘ఈ ఏడాది చివర్లో ఈ పుస్తకం బయటికొస్తుంది’’ అని ఆమె పేర్కొన్నారు. ⇒ స్టార్ హీరో కూతురు, స్టార్ హీరో భార్య కాబట్టి లైంగిక వేధింపులు ఎదురయ్యే అవకాశం మీకు లేదేమో. స్వీయానుభవాలు లేనప్పుడు ఇతరుల సమస్యలోని గాఢత మీకు తెలిసే అవకాశం ఉందా? ఐశ్వర్య : ఒక స్త్రీ సమస్య ఇంకో స్త్రీ అర్థం చేసుకోవడానికి స్వీయానుభవాలు అవసరం లేదని నా ఫీలింగ్. మనలాంటి అమ్మాయే కదా అనే ఫీలింగ్ ఉంటే చాలు. ఉదాహరణకు మన కళ్లెదుట నిప్పు ఉందనుకోండి. అది టచ్ చేసి దాని తాలూకు బాధ తెలుసుకోవాలనుకోం కదా. తాకితే బాధ ఖాయం అని తెలుసు. ఇది కూడా అంతే. మనం అనుభవించకుండానే గాయం తాలూకు బాధ ఎలా ఉంటుందో అనుభవించగలుగుతాం. సెలబ్రిటీ ఉమన్ అయినా.. మామూలు మహిళ అయినా.. ఆడవాళ్లకు సాటి స్త్రీ బాధ తెలుసుకునే అద్భుతమైన వరం ఆ దేవుడు మనకు ఇచ్చాడు. ⇒ కొన్ని సందర్భాల్లో ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు అవుతారు. రోడ్డు మీదకొచ్చి సమస్యలు చెప్పుకునే మహిళలను వాళ్లే విమర్శిస్తారు... ఐశ్వర్య : అలాంటి వాళ్లను దృష్టిలో పెట్టుకుని కూడా కొంతమంది ఆడవాళ్లు తమ సమస్యలు చెప్పుకోవడానికి వెనకాడతారు. అందుకే సమస్యలు చెప్పుకోవాలనుకున్నప్పుడు ఇతరుల గురించి ఆలోచించకూడదు. ఎందుకంటే, ఎవరూ మన జీవితాల్ని ఉద్ధరించరు. విమర్శించేవాళ్లు మనం మాట్లాడినా ఎద్దేవా చేస్తారు.. మాట్లాడకపోయినా చేస్తారు. అందుకే అంటున్నా.. ‘మీ ఇంట్లో మగవాళ్ల కారణంగా సమస్య వస్తే.. బయటికి వచ్చి చెప్పండి. సమస్యను పరిష్కరించు కోండి. జీవితాన్ని మాత్రం త్యాగం చేయొద్దు’. ⇒ ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించే మగవాళ్లల్లో ఆ విపరీత ధోరణికి కారణం ఏమనుకుంటున్నారు. పెంపకం లోపం అనుకోవచ్చా? ఐశ్వర్య : పెంపకం ఓ కారణం మాత్రమే. పరిసరాల ప్రభావం ఓ కారణం అవుతుంది. అలాగే, చిన్నప్పట్నుంచీ మైండ్ సెట్ ఎలా ఉంది? అనేది ఇంకో కారణం. పెంపకం గురించి చెప్పాలంటే... ఇంట్లో ఆడపిల్లలను పెంచేటప్పుడు సేఫ్టీ పేరుతో ప్రతిదానికీ ఆంక్షలు పెడతారు. ‘ఆడపిల్లవి...’ అంటూ చాలా విషయాలకు ‘నో’ చెప్పేస్తారు. దాంతో ఆడపిల్ల తన ఇష్టాలను బలవంతంగా అణిచేసుకుంటుంది. ‘నో’ అనే పదానికి అలవాటు పడిపోతుంది. కానీ, మగపిల్లలు ఏం చేసినా ‘నో’ అనరు. దాంతో ఎవరైనా వాళ్లకి ‘నో’ చెబితే, అహం అడ్డొస్తుంది. పంతం నెగ్గించుకోవాలనుకుంటారు. దానికోసం ఎంతదాకా అయినా వెళ్లడానికి వెనుకాడరు. అందుకే ఆడపిల్లలకు పెట్టినట్లుగా మగపిల్లలకు కూడా కొన్ని ఆంక్షలు పెట్టాలి. అలా పెంచితే ఏది పడితే అది చేసినప్పుడు ‘నో’ అనే ఆంక్ష ఎదురైనా... భవిష్యత్తులో ఎక్కడైనా తిరస్కరణకు గురైనా, పెద్ద బాధ అనిపించదు. ⇒ అందుకే నాన్న చాలా ఆనందపడ్డారు! ఐశ్వర్య : డెరైక్టర్‌గా ‘3’తో నా తొలి అడుగు సునాయాసంగా పడింది. దానికి కారణం నా బ్యాగ్రౌండ్. ప్రతిభ నిరూపించుకోవడానికి మార్గం దొరికింది. సో.. నా అంతట నేనుగా అవకాశం సంపాదించినట్లు కాదు. కానీ, యూఎన్‌కు ఉమెన్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా ఎంపిక కావడం అనేది నేను సొంతంగా సాధించుకున్నది. ఇండిపెండెంట్‌గా అచీవ్ చేశాను కాబట్టి నాన్న చాలా ఆనందపడ్డారు. ‘ఐయామ్ ప్రౌడ్ ఆఫ్ యు’ అన్నారు. మా అమ్మ (లతా రజనీకాంత్) వండర్ఫుల్. క్లుప్తంగా చెప్పాలంటే అమ్మా నాన్న ఇద్దరూ నాకు ఆదర్శం. ⇒ ఇద్దరు కొడుకులకు తల్లిగా మీ బిడ్డలను మీరెలా పెంచుతున్నారు. మిమ్మల్ని మీ అమ్మా నాన్న ఎలా పెంచారు? ఐశ్వర్య : మా అమ్మా నాన్న ఆదర్శంగా తీసుకోదగ్గ వ్యక్తులు. వాళ్ల పెంపకం ఎంత మంచిదో నాకు చిన్నప్పుడు తెలియలేదు. నేను తల్లయ్యాక అర్థమవుతోంది. మా అమ్మానాన్నల్లా నా పిల్లలను నేను పెంచుతున్నానా? అని ఎప్పుడూ ఆలోచించలేదు. ఆ మాటకొస్తే పెంపకం విషయంలో ఎవరికీ పోలిక పెట్టలేం. ఎందుకంటే, ఆ ఇంటి పరిస్థితులను బట్టి పిల్లల పెంపకం ఉంటుంది. ‘నేను ఇలా పెంచుతున్నాను. మీరు కూడా ఇలా పెంచండి’ అని ఎవరికీ సలహా ఇవ్వకూడదు. ఏ తల్లిదండ్రైనా పిల్లల మంచి గురించే ఆలోచిస్తారు. పిల్లలు చెడిపోవాలని ఆనుకోరు. నేను నా పిల్లలిద్దరికీ ఆడవాళ్లను గౌరవించాలనే విషయాన్ని పర్టిక్యులర్‌గా చెబుతాను. చిన్నప్పట్నుంచీ చెప్పి, పెంచితే పెద్దయ్యాక మహిళలను గౌరవించడం అలవాటవుతుంది. ఆడ-మగ సమానం అనే ఫీలింగ్ వాళ్లల్లో నాటుకుపోయేలా పెంచుతాను. ⇒ మా ఇంట్లో ఆ తేడా లేదు ఐశ్వర్య : మా ఇంట్లో ఆడ-మగ అని అడుగడుగునా తేడా చూపించే పరిస్థితులు ఉండవ్. నేను నా పనితో బిజీగా ఉన్నప్పుడు మా ఆయన పిల్లలను చూసుకుంటారు. ఆయన బిజీగా ఉన్నప్పుడు నేను చూసుకుంటాను. భార్యాభర్తలకు ఒకరి పని మీద ఇంకొకరికి గౌరవం ఉన్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. నేనీ రోజున డెరైక్టర్‌గా చేయగలుగుతున్నానంటే దానికి కారణం మా ఇంట్లో ఉండే మగవాళ్లే (తండ్రి, భర్తని ఉద్దేశించి). ⇒ అంతరిక్షయానం చేయడానికి ఆడవాళ్లు వెనకాడని ఈ రోజుల్లో ఇంటి గడప దాటని ఆడవాళ్లూ ఉన్నారు. అలాంటి వాళ్లను చైతన్యపరచడానికి మీ వంతుగా ఏం చేయాలనుకుంటున్నారు? ఐశ్వర్య : లక్కీగా నేను ఉన్నది చాలా పవర్ఫుల్ మీడియా. సినీ దర్శకురాలిగా నేను ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సినిమాలు చేస్తాను. యూఎన్‌కు ఉమన్స్ గుడ్‌విల్ అంబాసిడర్‌గా మహిళలను మోటివేట్ చేసేలా డాక్యుమెంటరీలు తీయాలనుకుంటున్నాను. అలాగే, ఇవాళ సామాజిక మాధమ్యం ఓ వరం. సోషల్ మీడియా కారణంగా ప్రపంచం చిన్నదైపోయింది. ఐదారేళ్ల క్రితం ఎక్కడైనా జరగరానిది జరిగితే అది వెలుగులోకొచ్చేది కాదు. ఇప్పుడలా కాదు. మారుమూల గ్రామాల్లో జరిగే లైంగిక దాడుల గురించి మొత్తం ప్రపంచానికి తెలుస్తోంది. అందుకే ఈ మీడియాని మంచి వేదికగా వాడుకోవాలనుకుంటున్నాను. ⇒ దర్శకురాలిగా మీ ఫ్యూచర్ ఫ్లాన్స్? ఐశ్వర్య : ఇప్పటివరకూ చేసిన ‘3’, ‘వై రాజా వై’ చిత్రాలకు భిన్నంగా ఉండే సినిమాలు చేయబోతున్నాను. రెండు కథలు రెడీ చేశాను. ఈ ఏడాది చివర్లో ఒక సినిమా ఆరంభమయ్యే అవకాశం ఉంది. - డి.జి. భవాని -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
తిరుమల: కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీవెంకటేశ్వరస్వామి వారిని శుక్రవారం పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు దర్శించుకున్నారు. తెలంగాణ శాసనసభ స్పీకర్ ఎస్ మధుసూదనాచారి, మద్రాస్ హైకోర్టు చీఫ్ జస్టిస్ అగ్నిహోత్రి, సమాచార కమిషనర్ వెంకటేశ్వర్లు దర్శించుకున్నారు. అలాగే తమిళ సూపర్‌స్టార్ రజనీకాంత్ ఇద్దరు కుమార్తెలు ఐశ్వర్య, సౌందర్యలు కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. శ్రీవారి దర్శన అనంతరం వారికి ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.