
కోలీవుడ్ జంట ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇది సాధారణ గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. నిజంగానే ఈ జంట కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ బర్త్‌డే పురస్కరించుకుని ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది.
'నా గురువు, స్నేహితుడు, తండ్రివంటి వ్యక్తికి బర్త్‌డే శుభాకాంక్షలు. మీతో బంధం మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను' అంటూ సెల్వరాఘవన్‌తో దిగిన ఫొటోను ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీనికి సెల్వ రాఘవన్ 'ప్రియమైన కూతురికి ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ధనుష్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఐశ్వర్య అతడి దగ్గరకు తిరిగి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం పలుకుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment