ధనుష్‌- ఐశ్వర్యకు విడాకుల మంజూరు | Dhanush, Aishwarya Rajinikanth Finally Granted Divorce | Sakshi
Sakshi News home page

Dhanush: ధనుష్‌- ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు

Published Wed, Nov 27 2024 9:24 PM | Last Updated on Thu, Nov 28 2024 9:37 AM

Dhanush, Aishwarya Rajinikanth Finally Granted Divorce

తమిళ స్టార్‌ జంట ధనుష్‌- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్‌ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.

తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్‌-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.

కాగా ధనుష్‌.. సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్‌- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement