Aishwaryaa R Dhanush
-
ధనుష్- ఐశ్వర్యకు విడాకుల మంజూరు
తమిళ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రెండేళ్ల క్రితమే విడిపోతున్నట్లు ప్రకటించారు. మనస్పర్థలు తొలగిపోయి ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఆశగా ఎదురుచూశారు, కానీ ఆ దిశగా ప్రయత్నాలు సాగలేదు. ఇద్దరూ విడిపోవడానికే నిర్ణయించుకున్నారు. ఈ మేరకు విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ వెల్ఫేర్ కోర్టులో దరఖాస్తు చేసుకున్నారు.తాము కలిసుండాలనుకోవడం లేదని, విడిపోవాలనే నిర్ణయించుకున్నామని కరాఖండిగా చెప్పారు. ఈ క్రమంలో న్యాయస్థానం ధనుష్-ఐశ్వర్య దంపతులకు విడాకులు మంజూరు చేసింది. ఈ మేరకు బుధవారం తుదితీర్పు వెలువరించింది.కాగా ధనుష్.. సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్యను 2004లో పెళ్లి చేసుకున్నాడు. వీరికి యాత్ర, లింగ అనే కుమారులు జన్మించారు. 2022లో ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ప్రకటించారు. నేడు అధికారికంగా విడాకులు తీసుకున్నారు.చదవండి: సవతికూతురిపై నటి రూ.50 కోట్ల పరువునష్టం దావా! -
విడాకులు రద్దు? కొత్త ఇంటికి మారనున్న ధనుశ్-ఐశ్వర్యలు!
కోలీవుడ్ మాజీ దంపతులు ధనుశ్-ఐశ్వర్య రజనీకాంత్‌లు మళ్లీ కలుస్తారంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరిలో విడిపోయామని ధనుశ్-ఐశ్వర్యలు అధికారిక ప్రకటన ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు తమ విడాకులను ఈ మాజీ దంపతులు రద్దు చేసుకోవాలనుకుంటున్నట్లు సోషల్ మీడియా జోరుగా ప్రచారం జరుగుతోంది. పిల్లల కోసం వీరిద్దరు వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఆలోచనలో ఉన్నట్లు ఊహగానాలు వ్యక్తం అవుతున్నాయి. చదవండి: మోహన్ లాల్‌కు షాక్, అక్కడ ‘మాన్స్టర్’పై నిషేధం అయితే దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. ఈ క్రమంలో ధనుశ్ తండ్రి కస్తూరి రాజా విడాకులు రద్దుపై పరోక్షంగా స్పందించారు. ధనుశ్కు తన పిల్లల సంతోషమే ముఖ్యమంటూ విడాకులు ఈ వార్తలపై స్పందించాడు. దీంతో విడాకులు రద్దుపై వస్తున్న వార్తలు నిజమేనంటూ ఈ జంట ఫాలోవర్స్ సంబరపడిపోతున్నారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర అప్డేట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ధనుశ్ ఓ కొత్త ఇంటిని కొనుగొలు చేస్తున్నాడని, విడాకులు రద్దు ప్రకటన ఆనంతరం ఐశ్వర్య, పిల్లలతో కలిసి ఈ ఇంట్లోనే ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. చదవండి: ఈ వారం థియేటర్, ఓటీటీలోకి వచ్చే చిత్రాలివే ధనుశ్ ఖరీదు చేయబోయే ఆ ఇంటి విలువ రూ. 100 కోట్లని, వచ్చే ఏడాది జనవరిలో భార్య, పిల్లలతో గృహ ప్రవేశం కూడా చేయబోతున్నాడంటూ తమిళ మీడియా, వెబ్సైట్లలో కథనాలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై ఎలాంటి క్లారిటీ లేదు. కానీ ఈ వార్తలు నిజమైతే బాగుండని, మళ్లీ వారిద్దరు కలిసే రోజు కోసం ఎదురుచూస్తున్నామంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. కాగా 2004 నవంబర్ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ధనుశ్-ఐశ్వర్యలకు యాత్రా రాజా (15 ), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. -
ధనుష్- ఐశ్వర్య కలుస్తారా? హీరో తండ్రి ఏమన్నాడంటే?
కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్య విడిపోతున్నట్లు ఈ ఏడాది ప్రారంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే! అయితే పిల్లల విషయంలో మాత్రం వారు అప్పుడప్పుడు కలుస్తూ వస్తున్నారు. దీంతో వీరు విడాకుల వ్యవహారంలో వెనక్కి తగ్గారని, త్వరలోనే మళ్లీ కలిసే ఛాన్స్ ఉందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. ధనుష్, ఐశ్వర్య.. ఇద్దరూ విడాకులను వాయిదా వేసుకోవాలని యోచిస్తున్నట్లు కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా ఈ వార్తలపై ధనుష్ తండ్రి కస్తూరి రాజా స్పందించాడు. ధనుష్, ఐశ్వర్య మళ్లీ కలుస్తారా? అన్న ప్రశ్నకు నేరుగా సమాధానం ఇవ్వకుండా.. ధనుష్‌కు అతడి పిల్లల సంతోషమే ముఖ్యం అని బదులిచ్చాడు. ఇకపోతే ధనుష్ ప్రస్తుతం వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమాను డిసెంబర్ 2న విడుదల చేయానుకుంటున్నారు. అలాగే 1930 నాటి బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న కెప్టెన్ మిల్లర్ మూవీ చేస్తున్నాడు. చదవండి: రోలెక్స్ పాత్ర చేయడం ఇష్టం లేదు, ఆయన కోసమే ఒప్పుకున్నా అమితాబ్‌కు చిరు స్పెషల్ విషెస్ -
ఊహించని ట్విస్ట్.. విడాకులపై వెనక్కి తగ్గిన ధనుష్-ఐశ్వర్య!
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్-ఐశ్వర్యలు విడాకులు రద్దు చేసుకుంటున్నారా? అంటే అవుననే అంటున్నాయి తమిళ మీడియా వర్గాలు. ఈ ఏడాది ప్రారంభంలో.. ధనుష్,ఐశ్వర్యలు సోషల్ మీడియా వేదికగా భార్యభర్తలుగా విడిపోతున్నాం అని ప్రకటించి అందరికి షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 18ఏళ్ల వివాహం తర్వాత ధనుష్ దంపతులు ఈ నిర్ణయం తీసుకోవడం ఇండస్ట్రీలో సంచలనంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు ప్రకటించడం అభిమానులకు కూడా ఆవేదనను గురిచేసింది. వీరిద్దరూ కలిసి ఉంటే బాగుండు అని అంతా అనుకున్నారు. ఇప్పుడిదే నిజం కాబోతున్నట్లు తెలుస్తుంది. ధనుష్-ఐశ్వర్యలు తమ విడాకుల ప్రకటనను రద్దు చేసుకుంటున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. ఇటీవలె రజనీకాంత్ ఇంట్లో ఇరు కుటుంబసభ్యులు సమావేశమయ్యారట. ఈ సందర్భంగా ఈ జంట మధ్య సయోధ్య కుదిరినట్లు సమాచారం. అంతేకాకుండా పిల్లల భవిష్యత్తును కూడా దృష్టిలో పెట్టుకొని ఐశ్వర్య-ధనుష్‌లు కలిసి ఉండాలనే నిర్ణయించుకున్నారట. ఇదే గనుక నిజమైతే, అభిమానులకు ఇంతకంటే గుడ్‌న్యూస్ ఏముంటుంది. -
విడాకుల తర్వాత తొలిసారి కలిసిన ధనుష్- ఐశ్వర్య
కోలీవుడ్‌లో స్టార్ జంటగా వెలుగొందిన ధనుష్- ఐశ్వర్య ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్న ప్రకటించి ఫ్యాన్స్‌కు షాకిచ్చారు. అయితే ఎప్పటికైనా కలవకపోతారా? అని అభిమానులు ఎదురుచూస్తున్న సమయంలో సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. వీరు విడిపోయాక కలిసి కనిపించిన దాఖలాలు ఎక్కడా లేవు. కాకపోతే తన ఇద్దరు కుమారులను వెంటేసుకుని ధనుష్ ఓసారి ఇళయరాజా సంగీత కచేరీకి వెళ్లాడు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం తొలిసారి కలిసి కనిపించారు ధనుష్- ఐశ్వర్య. పెద్ద కొడుకు యాత్ర స్కూల్లో జరిగిన ఓ కార్యక్రమానికి మాజీ దంపతులిద్దరూ హాజరయ్యారు. 'ఈ రోజు ఎంత బాగా మొదలయ్యిందో. నా పెద్ద కొడుకు స్పోర్ట్స్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు..' అంటూ సోమవారం ఓ ఫొటో వదిలింది ఐశ్వర్య. అదే సమయంలో ఓ ఫ్యామిలీ పిక్‌ను సైతం ఇన్స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసింది. ఇందులో ధనుష్, ఐశ్వర్య... తమ పిల్లలతో కలిసి కెమెరావైపు నవ్వులు చిందిస్తూ కనిపిస్తున్నారు. ఈ ఫొటో చూసిన అభిమానులు వీరు మళ్లీ కలిసిపోయారా, ఏంటి? అని కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే ధనుష్ తెలుగు, తమిళ సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. మరోపక్క ఐశ్వర్య రజనీకాంత్.. డైరెక్టర్‌గా బాలీవుడ్లో అడుగుపెట్టబోతుంది. హిందీలో ఓ సాథీ చల్ అనే ప్రేమకథా చిత్రాన్ని ఆమె డైరెక్ట్ చేస్తోంది. What a way to start the day ! Monday morning watching the Investiture Ceremony of school ,where my first born takes up oath as sports captain🎖#proudmommymoment #theygrowupsofast 🧡 pic.twitter.com/91GMsGsLhG — Aishwarya Rajinikanth (@ash_rajinikanth) August 22, 2022 చదవండి: ఆగస్టు చివరి వారంలో ఓటీటీలో సందడి చేసే చిత్రాలివే! చూపులు కలవకుండానే పెళ్లి చేసుకున్న చిరంజీవి -
ధనుష్‌తో కలిసేదేలే అని క్లారిటీ ఇచ్చేసిన ఐశ్వర్య!
కోలీవుడ్‌లో స్టార్ జంటగా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్. 18 ఏళ్ల పాటు అన్యోన్యంగా మెలిగిన ఈ జంట ఈ ఏడాది ప్రారంభంలో విడిపోతున్నట్లు ప్రకటించి అభిమానులకు షాకిచ్చారు. అయితే అవి మామూలు గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి వ్యాఖ్యానించడంతో అభిమానుల్లో మళ్లీ ఆశలు చిగురించాయి. పైగా విడాకుల ప్రకటన తర్వాత కూడా ఐశ్వర్య తన సోషల్ మీడియా ఖాతాల్లో పేరు చివరన ధనుష్ అనే పదాన్ని అలాగే ఉంచుకుంది. ఇక ఇటీవల ఆమె డైరెక్ట్ చేసిన సాంగ్ రిలీజ్ చేసిన సమయంలో ఐశ్వర్యను స్నేహితురాలు అని ప్రస్తావిస్తూ శుభాకాంక్షలు తెలిపాడు ధనుష్. దీంతో వీళ్లు మళ్లీ కలిసే సూచనలున్నాయని అభిప్రాయాపడ్డారు ఫ్యాన్స్! చదవండి: Bheemla Nayak-OTT: ఒక్కరోజు ముందుగానే స్ట్రీమింగ్ అవుతున్న ‘భీమ్లా నాయక్’ తాజాగా వారి ఆశలపై నీళ్లు చల్లింది ఐశ్వర్య. సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరు చివరన ఉన్న ధనుష్‌ను తొలగించి ఐశ్వర్య రజనీకాంత్‌గా మార్చేసుకుంది. దీంతో ఇన్స్టాగ్రామ్, ట్విటర్లో ఐశ్వర్య రజనీకాంత్ ధనుష్‌కు బదులుగా ఇప్పుడు ఐశ్వర్య రజనీకాంత్ అని మాత్రమే కనిపిస్తోంది. ఈ చర్యతో తాము కలిసేదే లేదని చెప్పకనే చెప్పింది. కాగా ఐశ్యర్య-ధనుష్‌లు ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. చదవండి: గ్యాస్ టాంకర్ అని వెక్కిరించేవారు.. రాశీ ఖన్నా -
విడాకుల తర్వాత తొలిసారి కుమారులతో బయటికొచ్చిన ధనుష్
Dhanush Spot With His Sons After Split With Aishwarya: కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్-ఐశ్యర్య రజనీకాంత్ విడిపోయిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చారు. 18 ఏళ్ల వారి వైవాహిక బంధానికి ధనుష్-ఐశ్యర్యలు ఈ ఏడాది ప్రారంభంలో ముగింపు పలకడం అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. 2004 నవంబర్ 18న పెళ్లి బంధంతో ఒక్కటైన ఈ మాజీ జంటకు యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. చదవండి: ఫుడ్ డెలివరి బాయ్‌గా మారిన స్టార్ కమెడియన్, ఫొటో వైరల్ అయితే వీరు విడాకులు తీసుకుని మూడు నెలలు గడుస్తున్న ఇప్పటికీ వారు ఒక్కటవుతారేమోనని ఆశిస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే విడాకుల అనంతరం వీరిద్దరి ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. ఇప్పటికే పలు సినిమాలకు దర్శకత్వం వహించిన ఐశ్యర్య రీసెంట్గా ఓ మ్యూజిక్ వీడియోను రిలీజ్ చేసింది. దీనిపై ధనుష్ ప్రశంసలు కురిపిస్తూ శుభాకాంక్షలు మై ఫ్రెండ్ అంటూ మాజీ భార్యను స్నేహితురాలు అనేశాడు. దీంతో ఆ ట్వీట్ హాట్‌టాపిక్‌గా మారింది. చదవండి: మాజీ భార్య ఐశ్యర్యపై ధనుష్ ట్వీట్, అంత మాట అనేశాడేంటి! ఇదిలా ఉంటే విడాకుల అనంతరం ధనుష్ తనయులతో కలిసి కనిపించాడు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ ఈవెంట్‌కు యాత్రా రాజా, లింగ రాజాలతో కలిసి హజరైన ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. మార్చి 17న జరిగిన మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా మ్యూజిక్ కన్సర్ట్కు ధనుష్ తన ఇద్దరు కుమారులతో పాల్గొన్నాడు. అంతేకాదు ఈ ఈవెంట్లో ఇళయరాజా మ్యూజిక్కు ధనుష్ స్వరాలు కూడా ఇచ్చాడు. ఈ వీడియో ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంటుంది. దీంతో ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఐశ్యర్య కూడా ఉంటే ఎంత ముచ్చటగా ఉండేదే అంటూ ఈ మాజీ కపుల్ ఫ్యాన్స్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. Our @dhanushkraja own lyrics for Yathra and Linga at #RockWithRaja concert. Whattey soulful lyrics that too fro t of Meastro. இதுதான் என் குழந்தைக்கு இனிமே தாலாட்டு தலைவா. pic.twitter.com/XSCo5A9lcS — Chandru (D Fan ) (@dhanushkutty) March 18, 2022 -
ధనుష్ సోదరుడితో దిగిన ఫొటో షేర్ చేసిన ఐశ్వర్య
కోలీవుడ్ జంట ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ విడాకుల ప్రకటనతో అభిమానులు షాక్‌కు గురయ్యారు. అయితే ఇది సాధారణ గొడవలేనని, మళ్లీ కలిసిపోతారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా వ్యాఖ్యలతో అభిమానుల్లో కొత్త ఆశలు రేకెత్తాయి. నిజంగానే ఈ జంట కలిసిపోయే రోజు దగ్గరలోనే ఉందని కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు ఫ్యాన్స్. తాజాగా ధనుష్ సోదరుడు, దర్శకుడు సెల్వ రాఘవన్ బర్త్‌డే పురస్కరించుకుని ఐశ్వర్య సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపింది. 'నా గురువు, స్నేహితుడు, తండ్రివంటి వ్యక్తికి బర్త్‌డే శుభాకాంక్షలు. మీతో బంధం మున్ముందు కూడా ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తున్నాను' అంటూ సెల్వరాఘవన్‌తో దిగిన ఫొటోను ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది. దీనికి సెల్వ రాఘవన్ 'ప్రియమైన కూతురికి ధన్యవాదాలు' అని రిప్లై ఇచ్చాడు. ఇది చూసిన కొందరు నెటిజన్లు ధనుష్ ఫ్యామిలీతో టచ్‌లో ఉన్న ఐశ్వర్య అతడి దగ్గరకు తిరిగి వెళ్లే రోజు దగ్గరలోనే ఉందని జోస్యం పలుకుతున్నారు. -
ప్రేమ ఒక్కరితో ఆగిపోదు: ఐశ్వర్య రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
కోలీవుడ్ స్టార్ జంట ధనుష్- ఐశ్వర్య రజనీకాంత్ విడిపోయిన విషయం తెలిసిందే! 18 ఏళ్ల వైవాహిక జీవితానికి స్వస్తి పలుకుతూ ఇద్దరూ విడిపోతున్నట్లు జనవరిలో సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. అయితే అవి కుటుంబ తగాదాలేనని, వారు మళ్లీ కలుస్తారని ధనుష్ తండ్రి వ్యాఖ్యానించడంతో వీరిద్దరూ మళ్లీ ఒక్కటైపోతారేమోనని ఆశగా ఎదురుచూస్తున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఇటీవల కరోనా బారిన పడిన ఐశ్వర్య తాజాగా ఓ ఇంటర్వ్యూలో ప్రేమ గురించి తన అభిప్రాయాన్ని వెల్లడించింది. 'ప్రేమ అనేది అద్భుతమైన భావవ్యక్తీకరణ. ఇది ఒక వ్యక్తికో, వస్తువుకో సంబంధించింది కాదు. నేను ఎదిగేకొద్దీ ప్రేమ నిర్వచనం కూడా మారుతూ వస్తోంది. నాకు మా అమ్మానాన్న అంటే ఇష్టం. అలాగే నా పిల్లలను ప్రేమిస్తున్నాను. ప్రేమ ఒక వ్యక్తితో ఆగిపోదు' అని చెప్పుకొచ్చింది. -
కూతురి విడాకులు, లోలోన కుమిలిపోతున్న రజనీకాంత్!
Rajnikanth Badly Affected By Aishwarya-Dhanush’s Separation: ఒకప్పుడు విడాకులు అసాధారణమైన విషయం.. కానీ రానురానూ అవి కూడా సర్వసాధారణమైపోయాయి. నచ్చితే కలిసుంటున్నారు, లేదంటే విడిపోతున్నామని సింపుల్‌గా చెప్పేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ ధోరణి ఎక్కువైపోయింది. చాలామంది సినీతారల పెళ్లిళ్లు ఎక్కువకాలం నిలవడం లేదు. కోలీవుడ్ స్టార్ కపుల్ ధనుష్- ఐశ్వర్యలు ఈ కోవలోకే వస్తారు. 18 ఏళ్లు కలిసి జీవించిన వీరిద్దరూ జనవరి 17న విడిపోతున్నట్లు ప్రకటించారు. వారు విడిపోవడాన్ని అభిమానులే కాదు ఐశ్వర్య తండ్రి, సూపర్ స్టార్ రజనీకాంత్ సైతం జీర్ణించుకోలేకపోతున్నాడు. ఆ దంపతులను కలిపేందుకు ఆయన శతవిధాలుగా ప్రయత్నిస్తున్నట్లు వినికిడి. కూతురు, అల్లుడు విడిపోదామని నిర్ణయించుకున్నప్పటి నుంచి రజనీకాంత్ తీవ్ర మనోవేదనకు లోనవుతున్నట్లు కొన్ని కథనాలు వెలువడుతున్నాయి. కూతురి జీవితాన్ని చక్కదిద్దాలని ఆయన ఎంతగానో ప్రయత్నిస్తున్నాడట. వారి మధ్య కలిగిన ఎడబాటు తాత్కాలికమేనని ఆయన బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. నిజానికి ధనుష్- ఐశ్వర్య మధ్య తీవ్ర విబేధాలు వచ్చిన ప్రతిసారి రజనీకాంత్ వాటిని పరిష్కరించి ఇద్దరినీ కలిపేవాడట. అయితే ఈసారి తీవ్రస్థాయిలో గొడవలు రావడంతో వారిద్దరూ వాటిని పరిష్కరించుకోవడానికి బదులుగా విడిపోవడానికే నిశ్చయించుకోవడంతో రజనీ లోలోనే కుమిలిపోతున్నట్లు సమాచారం. -
విడాకుల తర్వాత ఒకే చోట ఉంటున్న ధనుష్, ఐశ్వర్య!
కోలీవుడ్ స్టార్ ధనుష్, ఆయన మాజీ భార్య ఐశ్వర్య రజనీకాంత్ ఒకేచోట ఉన్నారు. అదేంటి? వీళ్లిద్దరూ విడిపోయారు కదా! మరి ఒకేదగ్గర ఉండటం ఏంటి? అనుకుంటున్నారా? మరేం లేదు.. వ్యక్తిగత విషయాలతో డిస్టర్బ్ అయిన ఈ ఇద్దరూ అప్పుడే తమతమ పనుల్లో మునిగిపోయారు. ధనుష్ సినిమా షూటింగ్ కోసం హైదరాబాద్‌లో ఉండగా అటు ఐశ్వర్య కూడా లవ్ సాంగ్ చిత్రీకరణ కోసం సిటీలో పాగా వేసింది. చదవండి: కుటుంబాన్ని నిర్లక్ష్యం చేసిన ధనుష్, అందుకే విడాకులు అయితే వీరిద్దరు కూడా ఒకే హోటల్లో ఉంటున్నట్లు సమాచారం. తమ ప్రాజెక్టులు పూర్తి చేయడానికి సిటీకి వచ్చేసిన వీళ్లిద్దరూ రామోజీ రావు స్టూడియోలోని సితారా హోటల్లో బస చేస్తునట్లు తెలుస్తోంది. ఐశ్వర్య ప్రస్తుతం ఓ లవ్ సాంగ్‌ను డైరెక్ట్ చేస్తోంది. ఈ పాటను వాలంటైన్స్ డేకి రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. కాగా ధనుష్, ఐశ్వర్య రజనీకాంత్ 2004లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. 18 ఏళ్లపాటు అన్యోన్యంగా ఉంటూ వచ్చిన ఈ దంపతులు 2022 జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు ప్రకటించారు. -
ధనుష్‌తో విడాకులు.. ఐశ్వర్య ఇప్పుడేం చేస్తుందో తెలుసా?
మొన్నటిదాకా కోలీవుడ్‌లో స్టార్ కపుల్‌గా వెలుగొందారు ధనుష్- ఐశ్వర్య. ఎంతో అన్యోన్యంగా ఉండే ఈ జంట విడాకులు తీసుకోవడాన్ని అభిమానులు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. ఇది అబద్ధమైతే బాగుండని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో వారు మళ్లీ కలుస్తారంటూ ధనుష్ తండ్రి కస్తూరి రాజా చేసిన వ్యాఖ్యలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి. నిజంగానే వాళ్లు కలుస్తారా? లేదంటే విడాకులు మంజూరవడం తథ్యమా? అని రకరకాలుగా ఆలోచిస్తున్నారు. ఈ విషయాన్ని పక్కన పెడితే ప్రస్తుతం ఐశ్వర్య ఏం చేస్తుందో తెలుసా? జనవరి 17న విడాకులు తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో ప్రకటించిన ఆమె అప్పుడే తన వృత్తిలో మునిగిపోయింది. ఒక లవ్ సాంగ్‌ను ఆమె దగ్గరుండి డైరెక్ట్ చేస్తుందట. అందులో భాగంగా నిర్మాత ప్రేన అరోరాకు సలహాలు, సూచనలు తెలియజేస్తున్నట్లు వినికిడి. ఇది వాలెంటైన్స్ డే స్పెషల్ సాంగ్ అని, ఇందులో కొంత రొమాన్స్ కూడా కలగలిపి ఉంటుందని సమాచారం. ఈ సాంగ్ షూటింగ్ హైదరాబాద్‌లో జనవరి 25 నుంచి 27 వరకు జరగనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఐశ్వర్య ఈ సాంగ్‌పైనే ఫుల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. చదవండి: 'నీ ఎదవ ఓవరాక్టింగ్, నీకు కరోనా రావాలి' అంటూ హరితేజపై నెటిజన్ కామెంట్ -
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
-
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
న్యూఢిల్లీ: దక్షిణాదిన మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ నటుడు ధనుష్, అతని భార్య ఐశ్వర్య (సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు) విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్లో వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అభిమానులను నివ్వెరపోయేలా చేశారు. లోపల పేరు మార్పు తప్ప ఇద్దరిదీ ఒకే ప్రకటన. (చదవండి: ఆ సినిమా చూసి ఐశ్వర్య ఫిదా, బొకే పంపి మరీ.. ధనుష్-ఐశ్యర్యల లవ్‌స్టోరీ) స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో – ఐశ్వర్యా రజనీకాంత్ ధనుష్ సోదరికి ఐశ్యర్య మంచి స్నేహితురాలు. దాంతో ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్ హీరోగా థ్రిల్లర్ సినిమా ‘3’ని తెరకెక్కించారు. హీరోయిన్గా తన బాల్య స్నేహితురాలు శృతి హాసన్‌ను తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే.. ధనుష్, శృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం తీవ్రంగా జరిగింది. దాంతో వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. తర్వాత అంతా సర్దుకున్నా... ఇప్పుడేం జరిగిందో గాని ఇక కలిసి బతకలేమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చి విడిపోతున్నట్లు సోమవారం ప్రకటించారు. . 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n — Dhanush (@dhanushkraja) January 17, 2022 -
‘వాళ్లు..నా వాళ్లు..ఇది చరిత్ర’ : ఐశ్వర్య
సాక్షి, హైదరాబాద్: ప్రయోగాలకు కేరాఫ్ అడ్రస్ తమిళ స్టార్ హీరో ధనుష్. సమాజంలోని అమానవీయ కోణాన్ని ప్రయోగాత్మకంగా తెర కెక్కించి బాక్సాఫీసును షేక్ చేయడమే కాదు జాతీయ అవార్డును సైతం దక్కించుకున్న గొప్ప నటుడు ధనుష్. సినిమా చూసిన వెంటనే జాతీయ అవార్డు ఖాయమనే నమ్మకాన్ని ప్రేక్షకుల్లో కలిగించిన అసామాన్య హీరో. అందులోనూ ఒకే వేదికపై పిల్లనిచ్చిన మామతో కలిసి అత్యుత్తమ పురస్కారాన్ని అందుకుని కొత్త చరితను లిఖించాడు ధనుష్. 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల్లో తమిళ సూపర్ స్టార్లు ధనుష్, తలైవా రజనీకాంత్ కొత్త చరిత్రను లిఖించారు. సినిమా చరిత్రలో ఒకేసారి ఒకే వేదికపై, ఒకే కుటుంబంలో ఇద్దరు లెజెండ్స్ రెండు ఉత్తమ జాతీయ అవార్డులు గెల్చుకుని చరిత్ర సృష్టించారు. రజనీకాంత్ 51వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును గెలుచుకోగా, ధనుష్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకున్నారు. అందుకే రజనీకాంత్ కుమార్తె, ధనుష్ భార్య ఐశ్వర్య సంతోషంతో ఉక్కిరిబిక్కిరవుతోంది. ఈ చారిత్రాత్మక విజయాన్ని సెలబ్రేట్ చేసు కుంటోంది. ‘‘వాళ్లిద్దరు నావాళ్లే. ఇదొక చరిత్ర’’ అని వ్యాఖ్యానించింది. ఈ సందర్భంగా భార్యగా, కుమార్తెగా గర్వపడుతున్నానంటూ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు కృతజ్ఞతలు తెలిపింది. నిజానికి సినీ ప్రేమికులంతా కూడా ఈ అరుదైన సందర్భాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ధనుష్ కూడా తాజా పురస్కారాలపై సంతోషం వ్యక్తం చేశాడు. ఈ ఆనందాన్ని వర్ణించలేనంటూ ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొన్నాడు. View this post on Instagram A post shared by Aishwaryaa R Dhanush (@aishwaryaa_r_dhanush) View this post on Instagram A post shared by Dhanush (@dhanushkraja) -
రజనీకాంత్ ఎందుకు వెళ్లడం లేదు?
చెన్నై: ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో తన కుమార్తె ఐశ్వర్య ఇవ్వనున్న నృత్య ప్రదర్శనను సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రత్యక్షంగా చూసే అవకాశం లేదట. ఆయనే కాదు ఐశ్వర్వ భర్త హీరో ధనుష్ కూడా ఆమె నృత్యాన్ని తిలకించడానికి వీలుపడదట. ఈ విషయాన్ని ఐశ్వర్య స్వయంగా వెల్లడించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా న్యూయార్క్‌లోని ఐక్యరాజ్యసమితి కార్యాలయంలో మార్చి 8న రజనీ తనయ భరతనాట్య ప్రదర్శన ఇవ్వనున్నారు. ఈ ఘనత దక్కించుకున్న తొలి భారతీయులుగా ఆమె గుర్తింపు పొందనున్నారు. అయితే తన ప్రదర్శన తిలకించడానికి తమ కుటుంబం నుంచి ఎవరూ న్యూయార్క్ రావడం లేదని ఐశ్వర్య తెలిపారు. 'అప్పా 2.0 సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ధనుష్, నా సోదరి సౌందర్య వీఐపీ-2 సినిమా పనుల్లో తీరిక లేకుండా ఉన్నారు. మా పిల్లల్ని చూసుకోవడానికి అమ్మ చెన్నైలోనే ఉండాల్సి వచ్చింద'ని ఐశ్వర్య వివరించారు.