Actor Dhanush Announce Divorce With Aishwarya Rajinikanth, Details Inside - Sakshi
Sakshi News home page

Actor Dhanush Divorce: హీరో ధనుష్‌, ఐశ్వర్య విడాకులు

Published Mon, Jan 17 2022 11:40 PM | Last Updated on Tue, Jan 18 2022 2:30 PM

Dhanush Aishwaryaa Announce Separation After 18 Years of Marriage - Sakshi

న్యూఢిల్లీ: దక్షిణాదిన మంచి ఫాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న తమిళ నటుడు ధనుష్, అతని భార్య ఐశ్వర్య (సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కూతురు) విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్‌లో వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అభిమానులను నివ్వెరపోయేలా చేశారు. లోపల పేరు మార్పు తప్ప ఇద్దరిదీ ఒకే ప్రకటన.

(చదవండి: ఆ సినిమా చూసి ఐశ్వర్య ఫిదా, బొకే పంపి మరీ.. ధనుష్‌-ఐశ్యర్యల లవ్‌స్టోరీ

స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో            
– ఐశ్వర్యా రజనీకాంత్‌ 

ధనుష్‌ సోదరికి ఐశ్యర్య మంచి స్నేహితురాలు. దాంతో ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్‌ హీరోగా థ్రిల్లర్‌ సినిమా ‘3’ని తెరకెక్కించారు. హీరోయిన్‌గా తన బాల్య స్నేహితురాలు శృతి హాసన్‌ను తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే.. ధనుష్, శృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం తీవ్రంగా జరిగింది. దాంతో వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. తర్వాత అంతా సర్దుకున్నా... ఇప్పుడేం జరిగిందో గాని ఇక కలిసి బతకలేమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చి విడిపోతున్నట్లు సోమవారం ప్రకటించారు.  

.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement