separation
-
సతీమణి ఆర్తితో విడిపోతున్నట్లు ప్రకటించిన హీరో జయం రవి (ఫోటోలు)
-
Sireesha: భర్తతో విడాకులు.. ట్రెండింగ్‌లో తెలుగు నటి (ఫోటోలు)
-
ధర్మం అంటే..? మంచిమాట
ప్రకృతి ఎలా ప్రవర్తించాలి, ప్రాణికోటి ఎలా ప్రవర్తించాలో తెలియజేసేదే ధర్మం. అది మార్పు చెందే ప్రసక్తే ఉండదు. మనిషికి ఆధ్యాత్మికోన్నతి అందించేదే ధర్మం. మానవ ధర్మాల్లో ముఖ్యమైనవి– నిగ్రహం, ప్రేమ, సంతృప్తి, త్యాగం, అలాగే మనిషిని దహింప జేసేవి– అత్యాశ, ద్వేషం, పరదూషణ, పగ. మనిషి ఆధ్యాత్మిక కర్మలను ధర్మబద్ధంగా ఆచరించినప్పుడే తనను, సమాజాన్ని, ఇతరప్రాణుల్ని, ప్రకృతిని, ప్రపంచాన్ని రక్షించగలుగుతాడు. ధర్మం అనేది లేకపోతే పై వాటికి రక్షణ లేదు. మానవునికి ధర్మాచరణ ముఖ్యం, తాను జీవిస్తున్న సమాజ భద్రతకు, తన జీవన క్రమశిక్షణకు మానవుడు విధిగా ఆచరించవలసిన కొన్ని విశేష ధర్మాలను భాగవతం చెప్పింది. సత్యనిష్ఠ, దయాగుణం, తపస్సు, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం, త్యాగం, నిజాయితీ, నిష్కపటం, ఓర్పు, వినయం మొదలైనవి ప్రతి వ్యక్తి పాటించవలసిన ఉత్తమ ధర్మాలు. ఇవి వ్యక్తిగతంగా తనకే గాక తాను జీవిస్తున్న సమాజానికి, సర్వమానవాళికి కూడా శ్రేయస్సును కలిగిస్తాయి. మానవులకు, జంతువులకు, వస్తువులకు పరమాత్మ ధర్మాలను నిర్దేశించాడు. వినయం, సహనం, ఆచారం, పరాక్రమం మనిషికి సంస్కారం అందించే సాధనాలు. తనకు నచ్చని అంశాలను పరులమీద రుద్దకుండా చేయటం ధర్మం. తన దారిలో ఎవరి మాట వినకుండా ముందుకు నడవడం అధర్మం. అగ్ని వేడిని, నీరు చల్లదనాన్ని అందిస్తాయి. సింహం గర్జిస్తుంది. అటు ఇటూ పరుగెత్తుతూ చపలత్వాన్ని ప్రదర్శించడం లేడి లక్షణం. ఈ రకంగా ప్రతిదీ తన ధర్మాన్ని పాటింపజేయడం కేవలం పరమాత్మ సృజన. ఆయన సంకల్పం లేనిదే మానవ ధర్మం మృగ్యమే. ప్రతి పనిలో మనిషి అభివృద్ధిని ఆశిస్తాడు. అది సాధించాలంటే కఠోర సాధన అవసరం. సాధనే ధర్మం. అది మనిషిని పతనం కానివ్వకుండా కాపాడుతుంది. ధర్మాచరణ వ్యక్తి మనఃస్థితిని బట్టి ఆధారపడి వుంటుంది. తన వ్యక్తిగత ధర్మాన్ని విడిస్తే అది అభివృద్ధిని నిరోధిస్తుంది. అటువంటి వ్యక్తికి సుఖ సంతోషాలు, శాంతి లభించవు. ప్రతి వ్యక్తి ధర్మాన్ని రక్షించాలి. ప్రతి పనినీ ధర్మబద్ధంగా చేయాలి. ధర్మాచరణను కొనసాగించాలి. ‘ధర్మో రక్షతి రక్షితః’. ధర్మాన్ని ఎవరు రక్షిస్తాడో, అట్టి వ్యక్తిని ధర్మమే కాపాడుతుంది. ధర్మానికి హాని చేసేవాడిని ధర్మమే హతమారుస్తుంది. కొలిమిద్వారా పుట్టిన వేడివల్ల ఇనుము వేడెక్కుతుంది. బంగారం శుద్ధి అవుతుంది. అట్లే ధర్మాచరణ వ్యక్తిని, మనసును శుద్ధిపరుస్తుంది. ఎవరూ వేలెత్తి చూపకుండా ఉండేలా చేసుకోవాలి గాని అధర్మం చేస్తూ ఇతరులను భయపెట్టకూడదు. ఎంత సంపాదించినా పైకి తీసుకొని పోయేటపుడు కేవలం పాపపుణ్యాలే కాని మణి మాణిక్యాలు కావు. మన తర్వాత ఉన్నవాళ్లు మనం సంపాదించింది తింటారో తినరో వారికే విధంగా విధి రాసి ఉందో తెలియదు. వారికి భగవంతుడే విధంగా తినేప్రాప్తిని రాసి పెట్టాడో వారు అలానే ఉంటారు. కనుక రాబోయే తరాలకు నువ్వు సంపాదించి ఇచ్చే తాపత్రయం పెంచుకోకూడదు. ధర్మం అంటే పరస్పర రక్షణ. దాన్ని ఆచరించి, రక్షించే ఉత్తమ యోగ్యతనీ బాధ్యతనీ మనిషికి భగవంతుడు ప్రసాదించాడు. ధర్మాన్ని ఎవరు రక్షిస్తారో వారిని ధర్మం రక్షిస్తుంది. అదే ధర్మో రక్షతి రక్షితః. ధర్మం వల్ల అన్నీ సాధ్యమౌతాయి: ధర్మాచరణ వలన అర్థప్రాప్తి, ధర్మాచరణం వల్లనే సుఖం, ధర్మం వల్లనే సమస్తం సాధించవచ్చని ధర్మ సారమే ఈ విశ్వమన్న సత్యం మనకు తెలుస్తోంది. స్వధర్మానికి బాధ కలిగించేది–విధర్మం, ఇతరుల ప్రేరణచే ఇతరుల ధర్మాన్ని ఆచరించేది – పరధర్మం, భగవంతుడి పట్ల విశ్వాసరహితులైన వారు చేసేది, చెప్పేది – ఉపధర్మం. తన «దర్మాన్ని నిర్లక్ష్యం చేయడం, చెప్పబడిన ధర్మానికి విపరీతార్థాలను తీసి వివరించడం అనే అయిదు ‘అధర్మాలు’ త్యజించవలసినవిగా వేదవ్యాసుడు పేర్కొన్నాడు. కరుణ, ఆదర్శ గృహస్థ జీవనం, నిత్యకర్మాచరణ శీలత లోక కల్యాణకార కాలు, భగవద్భక్తి మార్గ నిర్దేశాలు. వీటిని మరవడం మన ధర్మాన్ని మనం మరచిపోవడమేనన్నది సత్యం. – తరిగొప్పుల వీఎల్లెన్ మూర్తి -
వెకేషన్లో కోలీవుడ్ క్యూట్ కపుల్: రూమర్స్‌కు ఫుల్స్టాప్!
ఇదిగో పులి అంటే అదిగో తోక అంటూ సోషల్ మీడియాలో వార్తలు పుంఖాను పుంఖాలుగా వస్తూ ఉంటాయి. అదీ సెలబ్రిటీల జీవితాలకు సంబంధించిన వార్తలైతే క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. ఇటీవలి కాలంలో అలాంటి వాటిల్లో ఒకటి స్టార్ హీరో సూర్య, నటి జ్యోతిక విడాకుల వార్త. తాజాగా ఒక్క పోస్ట్‌తో ఈ ఊహగానాలకు చెక్ చెప్పింది నటి జ్యోతిక. భర్త సూర్యతో కలిసి జ్యోతిక ఫిన్లాండ్లో వెకేషన్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. గడ్డకట్టే చలి, చిల్లింగ్ స్నోలో హాయిగా గడుపుతున్న బెస్ట్ మూమెంట్స్ , క్యూట్ వీడియోని జ్యోతిక తన ఇన్‌స్టాలో షేర్ చేసింది. జీవితం ఇంద్రధనుస్సులా రంగులమయం. ఒక్కో రంగును వెతికి పట్టుకొని ఆస్వాదిద్దాం. ఇదిగో ప్రకాశ వంతమైన నా శ్వేత వర్ణం అంటూ మంచులో తన సహచరుడితో ఉత్సాహంగా, ఉల్లాసంగా ఉన్న వీడియోను పోస్ట్ చేసింది. తద్వారా ఈ రియల్ కపుల్ విడిపోతున్నారనే వార్తలకు ఫుల్ స్టాప్ పడినట్టైంది. దీంతో అభిమానులు క్యూట్ కపుల్ అంటూ కమెంట్స్ చేశారు. కాగా సూర్యతో గొడవల వల్లే ముంబైకి షిప్ట్ అయిపోయిందన్న వార్తలపై స్పందించిన జ్యోతిక వృత్తిపరమైన కారణాల వల్లే తాను ముంబైకి వెళ్లానంటూ క్లారిటీ ఇచ్చింది. రీఎంట్రీ తర్వాత, జ్యోతికకు బాలీవుడ్లో కూడా ఆఫర్లు వస్తున్నాయి. బాలీవుడ్ కమిట్మెంట్లు పూర్తయిన తర్వాత చెన్నైకి తిరిగి వస్తానని కూడా జ్యోతిక స్పష్టం చేసింది. జ్యోతిక చివరిసారిగా జియో బేబీ దర్శకత్వం వహించిన మలయాళ చిత్రం కథల్: ది కోర్లో అద్బుతమైన నటనతో ఆకట్టుకుంది. లెజెండరీ నటుడు మమ్ముట్టి సరసన పోటీపడి మరీ నటించి మెప్పించింది. అలాగే వికాస్ బహల్ దర్శకత్వంలో అజయ్ దేవగన్ , ఆర్. మాధవన్ కూడా ప్రధాన పాత్రల్లో వస్తున్న బాలీవుడ్ హారర్/థ్రిల్లర్ షైతాన్‌లో నటిస్తోంది. షైతాన్ గుజరాతీ మూవీ వాష్‌కి రీమేక్‌గా వస్తోంది. View this post on Instagram A post shared by Jyotika (@jyotika) /p> -
భర్తతో విడాకులు.. పెళ్లికి మించిపోయేలా గ్రాండ్‌గా పార్టీ
'ఆహ్వానం' అనే తెలుగు సినిమా మీకు గుర్తుందా? రమ్యకృష్ణ- శ్రీకాంత్ నటించిన ఆ సినిమాలో హీరోయిన్ రమ్యకృష్ణ.. పెళ్లిలాగే విడాకుల మహోత్సవాన్ని కూడా ఘనంగా జరుపుకోవాలని ఇంటింటికీ వెళ్లి విడాకుల ఆహ్వానాన్ని అందిస్తుంది. సరిగ్గా ఇలాంటి సంఘటనే చైనాలోనూ చోటుచేసుకుంది. తన భర్తతో విడాకులు తీసుకున్న ఓ మహిళ కూడా డివోర్స్ పార్టీ చేసుకుంది. ఇష్టంలేని బంధంలో కొనసాగే కంటే విడాకులు తీసుకొని నచ్చిన లైఫ్ ఎంజయ్ చేద్దాం అంటూ ఫ్రెండ్స్‌కి గ్రాండ్ పార్టీ ఇచ్చింది. పెళ్లి ప్రతి ఒక్కరి జీవితంలో అద్భుతమైన ఘట్టం. లైఫ్‌లో అన్నిటికన్నా పెళ్లి వేడుకకు అత్యంత ప్రాధాన్యత ఇస్తారు. అందుకే కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి మరీ ఎంతో గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటారు. తమ వివాహాన్ని ఎప్పటికి గుర్తుండేలా జరుపుకోవాలని ఎన్నో కలలు కంటారు. విందు, వినోదాలతో అట్టహాసంగా జరుపుకుంటారు. తాజాగా ఓ మహిళ విడాకుల కోసం పార్టీ ఏర్పాటు చేసి వార్తల్లో నిలిచింది. చైనాలోని గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్‌కు చెందిన సాంగ్ అనే మహిళ నాలుగేళ్ల వివాహ బంధానికి ముగింపు పలికింది. ఈ ఘట్టాన్ని మరుపులేని వేడుకలా జరుపుకోవాలని భావించి సన్నిహితులకు ఘనంగా పార్టీ ఏర్పాటు చేసింది. దీన్ని ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేయడానికి ఫోటోగ్రాఫర్లను కూడా పిలిపించింది. ఈ సందర్భంగా సాంగ్.. తన నాన్సెన్స్ మ్యారేజ్ ఇక్కడితో ముగిసిందని, మరోసారి సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందని తెలిపింది. తన మాజీ భర్త మోసం చేశాడని, అతని ఫోన్లో మెసేజ్‌లు చూసి తట్టుకోలేకపోయానని సాంగ్ సన్నిహితుల వద్ద గోడు వెళ్లబోసుకుంది. విడాకుల తర్వాత ఇంత ఆనందం ఉంటుందని తెలిస్తే, చాలా కాలం క్రితమే డివోర్స్ తీసుకునేదాన్ని అని పేర్కొనడం విశేషం. -
భార్యతో తెగదెంపులు: ఇప్పటికే రూ. 1500 కోట్లు మటాష్!
రేమండ్ అధినేత, బిలియనీర్ గౌతమ్ సింఘానియా భార్యతో, విభేదాలు, విడాకులు అంశం వార్తలకెక్కింది మొదలు రేమాండ్ సంపద భారీగా కుప్పకూలింది. దాదాపు 1500కోట్ల రూపాయలను సంస్థ కోల్పోయింది. 32 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి స్వస్తి అంటూ తన భార్య నవాజ్ సింఘానియాతో విడిపోతున్నట్లు సింఘానియా ప్రకటించిన సంగతి తెలిసిందే. భౌతిక దాడికి పాల్పడ్డారని బోర్డు మీటింగ్స్‌లో మాట్లాడనీయలేదని నవాజ్ మోడీ ఆరోపణల నేపథ్యంలో వివాదం నడుస్తోంది. అటు ఇద్దరు కుమార్తెల ప్రయోజనాలు, కుటుంబ గౌరవం నేపథ్యంలో తన గోప్యతను గౌరవించాలంటూ సింఘానియా మౌనం పాటిస్తుండటం గమనార్హం. ప్రపంచంలోనే అతిపెద్ద సూట్ ఫాబ్రిక్ ఉత్పత్తిదారులలో ఒకటైన రేమండ్ లిమిటెడ్ ఛైర్మన్ గౌతమ్ సింఘానియా వివాదం నేపథ్యంలో పెట్టుబడిదారులలో ఆందోళన నెలకొంది. దీంతో వరుసగా ఏడో రోజు కూడా భారీ అమ్మకాలు వెల్లువెత్తాయి. బుధవారం నాడు షేర్లు 4.4శాతం కుప్పకూలాయి. నవంబర్ 13 నుండి షేరు మొత్తంగా 12శాతం పతనమైంది. నవాజ్ మోడీ కూడా బోర్డు సభ్యురాలు కాబట్టి ఇది కార్పొరేట్ గవర్నెన్స్ సమస్య అనీ, ఇది కంపెనీపై ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలియదని ICICI సెక్యూరిటీస్ లిమిటెడ్ విశ్లేషకుడు వరుణ్ సింగ్ అన్నారు. రూ.11,658 కోట్ల నెట్‌వర్త్ మరోవైపు సెటిల్మెంట్లో భాగంగా నవాజ్ మోడీ 1.4 బిలియన్ డాలర్ల సంపదలో 75శాతం ఇవ్వాలని కోరినట్టు తెలుస్తోంది.అయితే దీనిపై ఆ రేమండ్ గ్రూప్ ప్రతినిధి ఇంకా అధికారికంగా స్పందించలేదు. రేమండ్ లిమిటెడ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.11,658 కోట్లు. రేమండ్ వ్యాపారంలో ఎక్కువ భాగం రియల్ ఎస్టేట్ వాటానే ఎక్కువ. దక్షిణ ముంబైలోని జేకే హౌస్ ఆస్తి అత్యంత విలువైందిగా అంచనా. దీని విలువ దాదాపు రూ. 6,000 కోట్లు ఉంటుందని సమాచారం. దీంతోపాటు లంబోర్ఘిని గల్లార్డో LP570 సూపర్లెగ్గేరా, లంబోర్ఘిని ముర్సిలాగో, లోటస్ ఎలిస్ కన్వర్టిబుల్, నిస్సాన్ స్కైలైన్ GTR, హోండా S2000, ఫెరారీ 458 ఇటాలియా, ఆడి క్యూ7 లగ్జరీ కార్లు కూడా సింఘానియా సొంతం. -
విడిపోతున్నాం..ఈ దీపావళి గతంలోలా ఉండదు: బిలియనీర్ షాకింగ్ ప్రకటన
Gautam Singhania ప్రముఖ వ్యాపారవేత్త, బిలియనీర్ గౌతమ్ సింఘానియా సోమవారం భార్య నవాజ్ నుండి విడిపోతున్నట్లు ప్రకటించారు. పండగవేళ తన జీవితంలో ఒక ముఖ్యమైన వార్తను సోషల్ మీడియాద్వారాపంచుకున్నారు. ఈ దీపావళి గతంలో లాగా ఉండబోదు అని రేమండ్ లిమిటెడ్ సీఎండీ సింఘానియా ట్విటర్లో పోస్ట్‌లో తెలిపారు. ముంబైలో కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులను అలా ప్రకటించారో లేదో ఇలా విడాకుల విషయాన్ని ప్రకటించడం బిజినెస్ వర్గాలను విస్మయ పర్చింది. దంపతులుగా ముప్పయి రెండేళ్లు ఎంతో నిబద్ధతగా పరస్పరం విశ్వాసంగా జీవించాం. తల్లిదండ్రులుగా మారాం. ఒకరికొకరు తోడూ నీడగా ఒక బలమైన అండగా నిలబడ్డాం. ఫలితంగా మరో రెండు అందమైన జీవితాలు జతకలిశాయి ఇపుడిక వేరు వేరు మార్గాల్లో జీవించాలని నిర్ణయించుకున్నాం అంటూ తన పోస్ట్‌లో చెప్పుకొచ్చారు. ఇటీవలి కొన్ని దురదృష్టకర సంఘటలు, కొంతమంది వ్యక్తుల వల్ల చాలా నిరాధారమైన పుకార్లు వ్యాపించాయి. ఈ క్రమంలో వజ్రాల్లాంటి పిల్లలు నిహారిక, నిసా కోసం ఏం చేయాలో అది చేస్తామని కూడా సింఘానియా వెల్లడించారు. తమ వ్యక్తిగత నిర్ణయాన్ని గౌరవించి, తమ గోప్యతకు ప్రాధాన్యత ఇవ్వాల్సిందిగా కోరారు. టెక్స్టైల్స్-టు-రియల్ ఎస్టేట్ దిగ్గజం సింఘానియా ఎనిమిదేళ్ల పరిచయం తర్వాత న్యాయవాది నాడార్ మోడీ కుమార్తె నవాజ్ మోడీని 1999లో వివాహం చేసుకున్నారు. కాగా రేమండ్ గ్రూపు బలమైన వృద్ధిని సాధించిందనీ, 5 వేల కోట్ల రూపాయలతో ముంబై మెట్రోపాలిటన్ ప్రాంతంలో 3 కొత్త రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్‌లను సింఘానియా సోమవారం ట్విటర్ ద్వారా ప్రకటించారు. దుస్తుల బ్రాండ్ రేమండ్ గ్రూప్‌ను జయపత్ సింఘానియా నెలకొల్పగా, అతని కుమారుడు, గౌతమ్ సింఘానియా ఈ గ్రూపును మరిన్ని రంగాలకు విస్తరించారు. pic.twitter.com/kW853q7Kc0 — Gautam Singhania (@SinghaniaGautam) November 13, 2023 -
ప్రియుడికి గుడ్ బై: ఇకపై నాకు సంబంధంలేదు: ఇటలీ ప్రధాని
PM Georgia Meloni Announces Separation ఇటలీ ప్రధాని జార్జియా మెలోని సంచలన విషయాన్ని ప్రకటించారు. తన చిరకాల ప్రియుడు టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా గియాంబ్రూనో నుండి విడిపోతున్నట్లు ఎక్స్ (ట్విటర్(ద్వారా) శుక్రవారం ప్రకటించారు. ఇటీవల ఆండ్రియా చేసిన అభ్యంతర వ్యాఖ్యలే ఈ పరిణామానికి దారితీసినట్టు తెలుస్తోంది. ‘ఆండ్రియా జియాంబ్రూనోతో దాదాపు 10 సంవత్సరాల పాటు కొనసాగిన బంధం ముగిసింది’’ అని ప్రధాని మెలోని వెల్లడించారు. గత కొంతకాలంగా తమదారులు వేరుగా ఉన్నాయి. ఇక ఇపుడు వాటిని చెప్పాల్సిన సమయం వచ్చిందంటూ ఆమె ట్వీట్ చేశారు. అతనితో కలిసి గడిపిన అద్భుతమైన కాలానికి, ఎదుర్కొన్న ఇబ్బందులకు ఇక స్వస్తి. తన జీవితంలో గినేవ్రా పాపను అందించినందుకు అతనికి కృతజ్ఞతలు అంటూ ఆమె పోస్ట్ చేశారు. అంతేకాదు ఆ ఎపిసోడ్ తర్వాత మెలోని తన భాగస్వామి చేసిన వ్యాఖ్యలకు తనను బాధ్యురాల్ని చేయవద్దని, భవిష్యత్తులో జియాంబ్రూనో ప్రవర్తనకు సంబంధించిన ప్రశ్నలకు సమాధానం తాను ఇవ్వబోనని ప్రధాని మెలోని తేల్చి చెప్పారు. గత పదేళ్ళుగా సహజీవనం చేస్తున్న మెలోనీ, ఆండ్రియా ఈ దంపతులకు ఏడేళ్ల కుమార్తె ఉంది. కుమార్తె బాధ్యతలను మెలోనీ తీసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ప్రముఖ టీవీ ఛానెల్ లో వ్యాఖ్యాతగా పని చేస్తున్న ఆండ్రియా మహిళా సహోద్యోగిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విమర్శలకు తావిచ్చింది. 2015లో మెలెనీ కనిపించిన ఒక టీవీ షో రచయితగా ఆండ్రియాను కలిసారు. -
ఫ్లిప్‌కార్ట్ నుంచి విడివడ్డ ఫోన్‌పే
న్యూఢిల్లీ: ఈకామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ నుంచి డిజిటల్ పేమెంట్స్ కంపెనీ ఫోన్‌పే విడివడింది. ఇకపై రెండు సంస్థలూ వేర్వేరుగా కార్యకలాపాలు కొనసాగించనున్నట్లు కంపెనీలు సంయుక్తంగా వెల్లడించాయి. ఈ రెండింటికీ యూఎస్ రిటైల్ దిగ్గజం వాల్‌మార్ట్ మాతృ సంస్థకాగా.. ఫోన్‌పేను 2016లో ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ కొనుగోలు చేసింది. తాజా లావాదేవీలో భాగంగా వాల్‌మార్ట్ ఆధ్వర్యంలోని ప్రస్తుత ఫ్లిప్‌కార్ట్ సింగపూర్, ఫోన్‌పే సింగపూర్ వాటాదారులు ఫోన్‌పే ఇండియాలో ప్రత్యక్షంగా షేర్లను కొనుగోలు చేసినట్లు సంయుక్తంగా విడుదల చేసిన ప్రకటన పేర్కొంది. వెరసి ఫోన్‌పే భారత కంపెనీగా ఆవిర్భవించినట్లు తెలియజేసింది. ఈ ఏడాది ప్రారంభంలో మొదలైన ఈ ప్రాసెస్ తాజాగా పూర్తయినట్లు వెల్లడించింది. రెండు బిజినెస్ గ్రూపులలోనూ వాల్‌మార్ట్ మెజారిటీ వాటాదారుగా కొనసాగుతున్నట్లు తెలియజేసింది. ఒక్కో కంపెనీ 40 కోట్ల యూజర్ బేస్ ద్వారా దేశీ దిగ్గజాలుగా ఎదిగినట్లు ఫోన్‌పే వ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ పేర్కొన్నారు. ఈ ఏడాది ఫోన్‌పే స్వస్థలాన్ని(డొమిసైల్) సింగపూర్ నుంచి భారత్‌కు మార్పు చేసుకున్నట్లు తెలియజేశారు. -
Heteroparental superfecundation: కవలలే గానీ... తండ్రులు వేరు
బ్రెజిల్లో ఓ 19 ఏళ్ల యువతి కవలలకు జన్మనిచ్చింది. ఇందులో విశేషం ఏముందంటారా? చాలా పెద్ద విశేషమే ఉంది. ఆ కవలలిద్దరికీ తండ్రులు వేర్వేరు! నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజమే. సదరు యువతి ఒకే రోజున ఇద్దరు యువకులతో శారీరకంగా కలవడం ఇందుకు దారి తీసిందట!! పిల్లలకు 8 నెలలు వచ్చాక అసలు వారి తండ్రి ఎవరా అని ఆమెకు అనుమానం వచ్చింది. వారి తండ్రిగా తాను భావిస్తున్న యువకునికి పితృత్వ పరీక్ష చేయించగా కవలల్లో ఒకరి డీఎన్ఏతో మాత్రమే సరిపోయిందట. దాంతో ఆమెతో పాటు డాక్టర్లు కూడా ఆశ్చర్యపోయారు. కాసేపు ఆలోచించిన మీదట, తాను అదే రోజు మరో యువకునితో శారీరకంగా కలిసిన విషయం ఆమెకు గుర్తొచ్చింది. డీఎన్ఏ పరీక్ష చేయించగా రెండో బాబుకు అతనే తండ్రి అని తేలింది! ‘‘ఇది అత్యంత అరుదైన సంగతి. 10 లక్షల్లో ఒక్క కేసులో మాత్రమే ఇలా జరిగేందుకు ఆస్కారముంటుంది’’ అని డాక్టర్లు చెబుతున్నారు. శాస్త్రీయంగా దీన్ని హెటరో పేరెంటల్ సూపర్ ఫెకండేషన్ (బహుళ పిండోత్పత్తి)గా పిలుస్తారట. ఒకే రోజు ఇద్దరు పురుషులతో శారీరకంగా కలిసి, సదరు స్త్రీ తాలుకు రెండు అండాలు వారి వీర్య కణాలతో వేర్వేరుగా ఫలదీకరణ చెందితే ఇలా జరుగుతుందట. ఫలితంగా తయారయ్యే రెండు పిండాలూ వేర్వేరు మావి (ఉమ్మనీటి సంచి)లో పెరుగుతాయట. మనుషుల్లో అత్యంత అరుదే అయినా పలు జంతువుల్లో మాత్రం ఇది కాస్త సాధారణమేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. -
విడాకులు తీసుకున్న మరో నటుడు.. మరణమే బాగుంటుందని
Nitish Bharadwaj As Krishna Announces Divorce With His Wife Smita: చిత్ర పరిశ్రమలో వివాహ బంధాలతో ఇలా ఒక్కటవుతుంటే.. అలా విడిపోతున్నారు. ఎంత వేగంగా పెళ్లి పీటలు ఎక్కుతున్నారో.. అంతే వేగంగా విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. గత కొంతకాలం నుంచి సెలబ్రిటీల సినిమాలు కాకుండా వారి వ్యక్తిగత విషయాలతోనే హెడ్‌లైన్స్‌లో నిలుస్తున్నారు. కొందరు నేరాలు, మోసాలతో వార్తల్లోకి ఎక్కితే.. వారి భాగస్వామితో తెగదెంపులు చేసుకుని అందరి దృష్టిని ఆకర్షిస్తున్నారు మరికొందరు. టాలీవుడ్ మోస్ట్ క్యూట్ కపుల్ నాగ చైతన్య, సమంత విడిపోయారనే విషయాన్ని ఇప్పుడిప్పుడే జీర్ణించుకుంటున్న తరుణంలో కోలీవుడ్ బ్యూటీఫుల్ కపుల్ ధనుష్, ఐశ్వర్యలు విడాకులు తీసుకుంటున్నట్లు పెద్ద బాంబు పేల్చారు. దీంతో అభిమానగనం, ప్రేక్షకలోకం నివ్వెరపోయి అందుకు కారణాలు ఏంటా అని ఆలోచిస్తున్నాయి. (చదవండి: ధనుష్-ఐశ్వర్య విడాకులపై ఆర్జీవీ షాకింగ్ ట్వీట్లు..) ఇదిలా ఉంటే తాజాగా మరో సెలబ్రిటీ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించాడు. అతనే ప్రముఖ టీవీ సీరియల్ నటుడు నితీష్ భరద్వాజ్. అతను భరద్వాజ్ కంటే 'మహాభారతం' సీరియల్లో శ్రీకృష్ణుడిగానే మోస్ట్ పాపులర్. నితీష్ భరద్వాజ్ తన భార్య, ఐఏఎస్ అధికారిణి స్మితా గేట్‌తో ఉన్న 10 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. అయితే నితీష్ భరద్వాజ్, స్మితా గేట్ 2019 సెప్టెంబర్‌లో విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్ గురించి 'నేను 2019 సెప్టెంబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. కాగా 2009లో స్మితా గేట్‌ను రెండో వివాహం చేసుకున్నాడు నితీష్ భరద్వాజ్. (చదవండి: ధనుష్-ఐశ్వర్య డివోర్స్.. ఫ్యాన్స్ షాకింగ్ రియాక్షన్స్) బీఆర్ చోప్రా తెరకెక్కించిన టీవీ సిరీస్ 'మహాభారతం'లోని శ్రీకృష్ణుడి పాత్రలో భరద్వాజ్ ప్రేక్షకులను ఎంతో అలరించాడు. ఈ పాత్రతో అతనికి ఎనలేని పేరు వచ్చింది. ఈ టీవీ సిరీస్ 1988వో నాలుగు సీజన్స్‌తో వచ్చి ప్రేక్షకుల మన్ననలు పొందింది. అలాగే బీఆర్ చోప్రా రూపొందించిన అనేక సీరియల్స్‌లో నటించాడు. అందులో 'విష్ణువు' పాత్రతో మరింత ప్రసిద్ధి చెందాడు నితీష్ భరద్వాజ్. అలాగే నితీష్ తొలిసారిగా డైరెక్ట్ చేసిన పిత్రురూన్ చిత్రానికి ఎంతో పేరు వచ్చింది. నితీష్ సినిమాల్లోకి రాకముందు వెటర్నరీ సర్జన్‌గా పనిచేశాడు. (చదవండి: విడాకుల ప్రకటనకు ముందు రజనీకి ధనుష్ ఫోన్ కాల్.. కారణం ఇదేనా?) -
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
-
హీరో ధనుష్, ఐశ్వర్య విడాకులు
న్యూఢిల్లీ: దక్షిణాదిన మంచి ఫాన్ ఫాలోయింగ్ ఉన్న తమిళ నటుడు ధనుష్, అతని భార్య ఐశ్వర్య (సూపర్‌స్టార్ రజనీకాంత్ కూతురు) విడిపోతున్నట్లు ప్రకటించారు. 18 ఏళ్ల తమ వైవాహిక జీవితానికి ముగింపు పలుకుతున్నట్లు వీరిద్దరూ సోమవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో ట్విట్టర్లో వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశారు. అభిమానులను నివ్వెరపోయేలా చేశారు. లోపల పేరు మార్పు తప్ప ఇద్దరిదీ ఒకే ప్రకటన. (చదవండి: ఆ సినిమా చూసి ఐశ్వర్య ఫిదా, బొకే పంపి మరీ.. ధనుష్-ఐశ్యర్యల లవ్‌స్టోరీ) స్నేహితులుగా, దంపతులుగా, తల్లిదండ్రులుగా, పరస్పర శ్రేయోభిలాషులుగా 18 ఏళ్లు కలిసి బతికాం. పురోగతి, ఒకరినొకరు అర్థం చేసుకోవడం, సర్దుకుపోవడం, పరిస్థితులకు అలవాటుపడటం.. ఇలా సాగిందీ ప్రయాణం. ఈ రోజు ఇరువురివి భిన్నమార్గాలుగా కనపడుతున్నాయి... ధనుష్, నేను దంపతులుగా విడిపోవాలని నిర్ణయించుకున్నాం. మంచి భవిష్యత్తు కోసం.. మమ్మల్ని మేము అర్థం చేసుకోవడానికి కొంత సమయం తీసుకోవాలనుకుంటున్నాం. మా నిర్ణయాన్ని గౌరవించాల్సిందిగా విజ్ఞప్తి. ఈ పరిస్థితులను అధిగమించడానికి మాకు తగిన ప్రైవసీ ఇవ్వండి. మీ అందరికీ ఎప్పటిలాగే ప్రేమతో – ఐశ్వర్యా రజనీకాంత్ ధనుష్ సోదరికి ఐశ్యర్య మంచి స్నేహితురాలు. దాంతో ధనుష్, ఐశ్వర్యల మధ్య ప్రేమ చిగురించింది. ఇరు కుటుంబాల పెద్దలు వీరికి పెళ్లి చేయాలని నిర్ణయించడంతో నవంబరు 18, 2004లో ఈ ప్రేమపక్షులు ఒక్కటయ్యారు. వీరికి యాత్రా రాజా (15 ఏళ్లు), లింగ రాజా (11) అని ఇద్దరు కుమారులు ఉన్నారు. 2011లో ఐశ్వర్య తొలిసారిగా దర్శకత్వం వహించి భర్త ధనుష్ హీరోగా థ్రిల్లర్ సినిమా ‘3’ని తెరకెక్కించారు. హీరోయిన్గా తన బాల్య స్నేహితురాలు శృతి హాసన్‌ను తీసుకున్నారు. ఈ సినిమా చిత్రీకరణలోనే.. ధనుష్, శృతి మధ్య ఏదో ఉందనే ప్రచారం తీవ్రంగా జరిగింది. దాంతో వీరి వైవాహిక జీవితం ఒడిదుడుకులకు లోనైంది. తర్వాత అంతా సర్దుకున్నా... ఇప్పుడేం జరిగిందో గాని ఇక కలిసి బతకలేమనే నిర్ణయానికి వీరిద్దరూ వచ్చి విడిపోతున్నట్లు సోమవారం ప్రకటించారు. . 🙏🙏🙏🙏🙏 pic.twitter.com/hAPu2aPp4n — Dhanush (@dhanushkraja) January 17, 2022 -
విడాకులపై ఫోటోతో క్లారిటీ ఇచ్చిన ప్రియమణి
Priyamani Break Silences Divorce Rumours: నటి ప్రియమణి.. భర్త ముస్తాఫా రాజ్నుంచి కొంత కాలంగా దూరంగా ఉంటుందని సోషల్ మీడియాలో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వీరిద్దరూ త్వరలోనే విడాకులు తీసుకోనున్నారంటూ పుకార్లు షికార్లు చేశాయి. గతంలో ముస్తఫా తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ తాము విడాకులు తీసుకోలేదని ముస్తాఫా మొదటి భార్య అయేషా ఆరోపించిన సంగతి తెలిసిందే. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని సోషల్ మీడియా వేదికగా సంచలన వ్యాఖ్యలు చేసింది.చదవండి: రీసెంట్‌గానే బ్రేకప్ అయ్యింది.. బాధలో ఉన్నా: విజయ్ దేవరకొండ ఈ వ్యవహారం అనంతరం ప్రియమణి-ముస్తాఫాల మధ్య గొడవలు వచ్చాయని సోషల్ మీడియాలో వార్తలు వచ్చాయి. తాజాగా ప్రియమణి తన విడాకులకు సంబంధించిన రూమర్స్‌కు చెక్ పెట్టింది. దీపావళి సందర్భంగా భర్త ముస్తాఫా రాజ్‌తో కలిసి దిగిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. భర్తతో చిరునవ్వులు చిందిస్తూ ఫోటోను పంచుకుంది. దీంతో విడాకుల రూమర్స్‌పై ప్రియమణి పరోక్షంగా బదులిచ్చినట్లయ్యింది. చదవండి:పునీత్ మరణం తర్వాత తొలిసారి స్పందించిన భార్య అశ్విని ప్రియుడితో కలిసి దీపావళి చేసుకున్న స్టార్ హీరో కూతురు View this post on Instagram A post shared by Priya Mani Raj (@pillumani) -
Elon Musk: ఆమెతో మూడేళ్ల సహజీవనం.. ఒక బిడ్డ కూడా!
ఓపెన్ ఏఐ టెక్నాలజీతో వాహనాలను నియంత్రిచాలనుకోవడం వరకు ఓకే. కానీ, జంతువుల్ని, మనుషుల్ని సైతం కంట్రోల్ చేయాలనే ప్రయత్నించడం!!.. ఇలా ఊహాతీతమైన ఎన్నో ఆలోచనలకు కేరాఫ్ ఎలన్ మస్క్. అపర కుబేరుడిగా, టెస్లా సీఈవోగా అంతకు మించి స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ ఏజెన్సీ ఓనర్‌గా మస్క్ అందరికీ సుపరిచితుడే. అభిమానులు ఆయన్నొక ప్రత్యేకమైన మేధావిగా, ప్రత్యర్థులు పిచ్చోడిగా, మీడియా బహుతిక్క మనిషిగా ఎలివేట్ చేస్తుంటుంది. అలాంటి మస్క్.. వ్యక్తిగత జీవితానికి వచ్చే సరికి ఆగం ఆగం అవుతుంటాడు. తాజాగా తన డేటింగ్ గర్ల్‌ఫ్రెండ్ గ్రిమ్స్‌కు గుడ్‌బై చెప్పేశాడు యాభై ఏళ్ల ఎలన్ మస్క్!. కారణాలేంటో తెలియదుగానీ.. వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నట్లు ఇటు మస్క్, అటు గ్రిమ్స్ సన్నిహితులు అమెరికా మీడియా హౌజ్‌లకు ఉప్పందించారు. ప్రస్తుతం వీళ్లిద్దరూ విడివిడిగా ఉంటున్నట్లు మస్క్ సైతం ధృవీకరించినట్లు కథనాలు వెలువడుతున్నాయి. ఇదిలా ఉంటే 2018 నుంచి కెనెడియన్ సింగర్ గ్రిమ్స్‌తో డేటింగ్ మొదలుపెట్టాడు మస్క్. 2020 మే నెలలో వీళ్లిద్దరూ ఓ కొడుకు పుట్టగా(ఎలన్ మస్క్ ఏడో బిడ్డ).. ఎవరికీ అర్థంకానీ రితీలో X AE A-XII అనే విచిత్రమైన పేరు పెట్టుకున్నాడు ఈ టెస్లా బాస్. అప్పటి నుంచి ఈ జంట కొడుకును వెంటపెట్టుకునే చాలాసార్లు కెమెరా కళ్లకు చిక్కింది. అయితే ఇప్పుడు వీళ్లిద్దరూ విడిపోవాలని నిర్ణయించుకున్నప్పటికీ.. కొడుకు బాధ్యతను మాత్రం ఇద్దరూ కలిసే చూసుకోవాలని భావిస్తున్నట్లు సమాచారం. 33 ఏళ్ల గ్రిమ్స్ అసలు పేరు క్లెయిర్ బౌచర్. కెరీర్ మొత్తంలో ఇప్పటిదాకా ఐదు ఆల్బమ్‌లు చేసిందీమె. వాన్కోవర్(కెనెడా)లో పుట్టి, పెరిగిన ఆమె.. 2007 నుంచి మ్యూజిక్ రంగంలోకి అడుగుపెట్టింది. గతంలో ఈమెపై డ్రగ్స్ తీసుకుందనే ఆరోపణలపై కేసులు కూడా నమోదు అయ్యాయి. కెనెడియన్ సింగర్ డెవోన్ వేల్ష్తో సహజీవనం ప్రేమవ్యవహారం నడిపిన బౌచర్(గ్రిమ్స్).. 2012 నుంచి ఆరేళ్లపాటు గిటార్ మ్యూజిషియన్ జేమీ బ్రూక్స్‌తో సహజీవనం చేసింది. ఆ తర్వాత బ్రూక్స్‌కి బ్రేకప్ చెప్పి.. ఎలన్ మస్క్‌తో డేటింగ్ మొదలుపెట్టింది. SpaceEx https://t.co/nesX0NetTu — Ross Brennan (@_rossbrennan) September 24, 2021 Sick of hearing about "Grime" and "Musk". Let's hear about "Soap" and "Fragrance" for once. — Vivian "Buzzfeed where is my paycheck" lamb (@aeonlamb) September 24, 2021 గతంలో పలువురితో డేటింగ్ చేసిన మస్క్.. కెనడియన్ రచయిత జస్టిన్ విల్సన్‌ను 2000 సంవత్సరంలో పెళ్లి చేసుకున్నాడు. వీళ్లిద్దరికీ ఓ బిడ్డ పుట్టగా.. పది వారాలకే సడన్ ఇన్ఫాంట్ డెత్ సిండ్రోమ్ కారణంగా కన్నుమూసింది. ఆ తర్వాత ఐవీఎఫ్ ద్వారా 2004లో కవలల్ని, 2006లో ట్రిప్లెట్స్(ఒకే కాన్పులో ముగ్గురు)ను కన్నది ఈ జంట. ఎనిమిదేళ్లకు ఆమెకు విడాకులిచ్చి.. బ్రిటిష్ నటి టలులాహ్ రిలేతో డేటింగ్ చేశారు. 2010లో రిలేను వివాహం చేసుకుని.. 2012లో విడాకులిచ్చాడు. ఆ మరుసటి ఏడాది రిలేను మళ్లీ పెళ్లి చేసుకున్న మస్క్.. చివరికి 2016 రిలేకు సైతం విడాకులిచ్చేశాడు. నటి అంబర్ హర్డ్‌తో మస్క్ ఆ తర్వాత దక్కిన ఫేమ్, డబ్బుతో సెలబ్రిటీలతో కొంతకాలం డేటింగ్ చేశాడు. 2017లో నటి అంబర్ హర్డ్‌తో కొంతకాలం డేటింగ్ చేసినట్లు పుకార్లు వినిపించగా.. హర్డ్ మాజీ భర్త జానీ డెప్ ఆ ఆరోపణలు నిజమేనని ఆరోపించాడు. అయితే మస్క్, హర్డ్‌లు ఇద్దరూ ఆ ఆరోపణల్ని కొట్టిపారేస్తూ వస్తున్నారు. చదవండి: పోర్న్ మూవీలో నటించనున్న ఎలన్ మస్క్ -
కరోనా ఎఫెక్ట్: ఎవరెస్ట్‌పై చైనా విభజన రేఖ
బీజింగ్: కోవిడ్ కట్టడి కోసం ప్రపంచదేశాలన్ని విభిన్న మార్గాలు అనుసరిస్తుండగా.. తాజాగా చైనా ఎవరెస్ట్ పర్వతంపై విభజన రేఖ ఏర్పాటు చేసేందుకు నిర్ణయించుకుంది. ఎందుకంటే నేపాల్ నుంచి ఎవరెస్ట్ అధిరోహిచండానికి వచ్చే పర్వతారోహకులు తమ దేశంలో ప్రవేశించడం వల్ల కోవిడ్ కేసులు పెరుగుతున్నాయని చైనా భావిస్తోంది. దీన్ని కట్టడి చేయడం కోసం చైనా ఎవరెస్ట్ శిఖరంపై విభజన రేఖ ఏర్పాటు చేయనుందని డ్రాగన్ జాతీయ మీడియా తెలిపింది. నేపాల్ నుంచి ఎవరెస్ట్ అధిరోహించడానికి వస్తున్న వారిలో చాలా మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలడంతో చైనా ఈ నిర్ణయం తీసుకున్నట్టు అక్కడి మీడియా వెల్లడించింది. విభజన రేఖ ఏర్పాటు వల్ల పర్వతారోహకులు చైనాలోని ఎవరెస్ట్ ఉత్తర దిశగా పర్వతాన్ని ఎక్కడాన్ని నిరోధిస్తుంది. అంతేకాక సరిహద్దును దాటడం.. నేపాల్ వైపు, ఎవరితోనైనా.. ఏ వస్తువులతోనైనా సంబంధాలు పెట్టుకోవడాన్ని కూడా నిషేధిస్తుంది. ప్రస్తుతం చైనాలో స్థానికంగా వ్యాప్తి అవుతున్న కేసుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయినప్పటికి.. వేరే దేశాల నుంచి వచ్చే వారి ద్వారా నమోదవుతున్న కోవిడ్ కేసులు బాగా పెరుగుతున్నాయి. ఇక తాజాగా నేపాల్‌లో కొత్త కేసుల సంఖ్య పెరుగుతుండటంతో ముందు జాగ్రత్త చర్యగా చైనా ఈ నిర్ణయం తీసుకుంది. అధిరోహకులు చైనా వైపు నుంచి శిఖరాన్ని చేరుకోవడానికి ప్రయత్నించే ముందే.. టిబెటన్ పర్వతారోహణ మార్గదర్శకుల బృందం శిఖరం వద్ద విభజన రేఖను ఏర్పాటు చేస్తుందని అధికారిక వార్తా సంస్థ జిన్హువా వెల్లడించింది. అయితే విభజన రేఖను ఎలా గీస్తారు.. ఏ ప్రామాణికాల ప్రకారం ఏర్పాటు చేస్తారు అనే దాని గురించి నివేదిక స్పష్టం చేయలేదు. భారతదేశం, చైనా మధ్య హిమాలయపర్వత సానువుల్లో ఉన్న చాలా ప్రధాన నగరాలు, పట్టణాల్లో లాక్డౌన్ విధించారు. దేశీయ మరియు అంతర్జాతీయ విమానాలు రద్దు చేశారు. చదవండి: చైనా కుతంత్రం: జీవాయుధంగా కరోనా -
14 ఏళ్ల బంధం.. నేను, సిద్ధాంత్ విడిపోతున్నాం: దర్శకుడు
బాలీవుడ్లో మొట్టమొదటి స్వలింగ సంపర్క జంటగా గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు అపూర్వ అస్రానీ, మ్యూజిక్ డైరెక్టర్ సిద్ధాంత్ పిల్లై. గత 14 ఏళ్లుగా వీరిద్దరూ కలిసి ఉంటున్నారు. కొద్ది రోజుల క్రితమే సొంతంగా ఇళ్లు కూడా తీసుకున్నారు. ఈ క్రమంలో దర్శకుడు అపూర్వ అస్రానీ శనివారం సంచలన ప్రకటన చేశాడు. తామిద్దరం విడిపోతున్నామని.. 14 ఏళ్ల తమ బంధానికి ముగింపు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ‘‘మా ప్రయాణంలో కొన్ని తప్పులు చేశాం’’ అంటూ ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ ప్రకటన చేశాడు అపూర్వ అస్రానీ. దాంతో పాటు ఓ నోట్‌ని కూడా షేర్ చేశాడు. దీనిలో.. ‘‘నేను, సిద్ధాంత్ విడిపోతున్నట్లు ప్రకటించడానికి చాలా బాధపడుతున్నాను. దేశంలో చాలా మంది ఎల్జీబీటీక్యూ కపుల్స్‌కి మేం ఆదర్శంగా నిలిచాం. ఈ విషయం వారందరిని నిరాశపరుస్తుందని నాకు తెలుసు. కానీ ఈ 14 ఏళ్ల కాలంలో ప్రతి రోజు ఎంతో ముఖ్యమైనది.. విలువైనది. ఇన్నేళ్ల తర్వాత మేం స్నేహపూర్వకంగా విడిపోతున్నాం’’ అని తెలిపాడు ‘‘మన దేశంలో స్వలింగ సంపర్క జంటకు ఎలాంటి ప్రేరణలు, ఆదర్శాలు ఉండవు. మేం ఏర్పాటు చేసుకున్న ఈ ప్రత్యేకమైన మార్గంలో కొన్ని తప్పులు చేశాం. స్వలింగ సంపర్కులమైనప్పటికి మా ప్రేమ గురించి ధైర్యంగా ప్రకటించాం.. అంతేకాక కలిసి ఉండాలనే సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్న తొలి తరం ఎల్జీబీటీక్యూ జంట మేమే. దీని గురించి చెప్పడానికి నాకు ఎలాంటి బాధ లేదు. కానీ జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. మా ప్రయాణంలో కూడా ఆ మార్పులు వచ్చాయి. దాంతో మేం విడిపోక తప్పడం లేదు’’ అన్నాడు. ‘‘ఈ సందర్భంగా మీ అందరిని కోరిది ఒక్కటే. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో మా గోప్యతని, మనోభావాలని గౌరవించాలని కోరుకుంటున్నాను. ఎలాంటి ఊహాగానాలను ప్రచారం చేయవద్దని మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీ మెసేజ్‌లలో కూడా మమ్మల్ని ట్యాగ్ చేయవద్దు. భవిష్యత్తుపై నమ్మకం ఉందనే మాటతో దీన్ని ముగించాలనుకుంటున్నాను. సిద్, నేను అనే కాదు మాలో ప్రతి ఒక్కరం కోరుకునేది ప్రేమ, కమిట్మెంట్, సురక్షితమైన నివాసం. నమ్మకంపై ఆశలు వదులుకోకండి’’ అంటూ అపూర్వ అస్రానీ ఈ నోట్‌ని ముగించాడు. View this post on Instagram A post shared by Apurva (@apurva_asrani) ఇక కొద్ది రోజుల క్రితం అపూర్వ నటి సంధ్య మ్రిదులతో కలిసి ఉన్న ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశాడు. దీనిలో ఆమెని మ్యాచ్‌మేకర్ అని.. తనను మ్యాచ్ చేసింది అని తెలిపాడు. అపూర్వ అస్రానీ, సిద్ధాంత్ గతేడాది గోవాలో సొంతంగా ఇల్లు కూడా తీసుకున్నారు. ఈ సందర్భంగా ‘‘గత 13 ఏళ్లుగా మమ్మల్ని కజిన్స్‌గా చెప్పుకుంటూ ఒకే ఇంట్లో కలిసి ఉండేవాళ్లం. మా గురించి చుట్టుపక్కల వారికి తెలియకుండా ఉండటం కోసం గది తలుపులు మూసి ఉంచేవాళ్లం. కొద్ది రోజుల క్రితం మా సొంత ఇంటిని కొనగోలు చేశాం. మేం పార్ట్నర్స్మని ఇప్పుడు మా ఇరుగుపొరుగు వారికి మేమే స్వచ్ఛందంగా చెప్తున్నాం. ఎల్జీబీటీక్యూ కుటుంబాలకు ధైర్యం చెప్పడానికి ఈ ప్రకటన చేస్తున్నాం’’ అంటూ ట్వీట్ అపూర్వ ట్వీట్ చేశాడు. ఇలా ప్రకటించిన ఏడాదిలోపే విడిపోతున్నట్లు ప్రకటించి అందరికి షాకిచ్చాడు. For 13 years we pretended to be cousins so we could rent a home together. We were told 'keep curtains drawn so neighbors don't know 'what' you are'. We recently bought our own home. Now we voluntarily tell neighbors we are partners 💕. It's time LGBTQ families are normalised too. pic.twitter.com/kZ9t9Wnc7i — Apurva (@Apurvasrani) May 29, 2020 చదవండి: ‘ప్రియురాలి’తో మహిళ.. తీసుకెళ్లిన పోలీసులు 'గే'ల కోసం మాట్లాడితే రూ.10 లక్షల ఫైన్ -
భర్తతో విడిపోతున్నా, కష్టంగా ఉంది!: నటి ఎమోషనల్
బాలీవుడ్ నటి కీర్తి కుల్హరి తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, అతడితో విడిపోయాక అతడి ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొంది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్ పెట్టింది. "నేను, నా భర్త సాహిల్ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఇది రాత పూర్వకంగా కాదు, కానీ జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టం. ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ విడిపోవడాన్ని ఎవరూ అంగీకరించకపోగా చాలామందిని అది బాధిస్తుంది కూడా. బ్రేకప్ చెప్పుకోవడమూ అంత ఈజీ ఏమీ కాదులెండి. కానీ తప్పడం లేదు. ప్రస్తుతం నేను ఓ మంచి ప్రదేశంలోనే ఉన్నాను. దయచేసి దీని గురించి ఎవరూ కామెంట్ చేయొద్దు. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా!" అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేసింది. అయితే కొందరు అభిమానులు ఈమె పోస్ట్ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఏప్రిల్ ఫూల్ చేయడం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని సోషల్ మీడియాలో ప్రకటించడాన్ని ప్రశంసిస్తున్నారు. కాగా కీర్తి కుల్హరి 2016 జూన్‌లో సాహిల్‌ను వివాహమాడింది. సినిమాల్లో నటించేందుకు తన భర్త ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆ మధ్య ఇంటర్వ్యూల్లోనూ పేర్కొంది. కీర్తి.. పింక్, ఇందు సర్కార్, బ్లాక్మెయిల్, ఉరి: ద సర్జికల్ స్ట్రైక్, మిషన్ మంగళ్ సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ద గర్ల్ ఆన్ ద ట్రైన్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది. అలగే డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న క్రిమినల్ జస్టిస్ అనే వెబ్ సిరీస్‌లోనూ ముఖ్య పాత్ర పోషించింది. View this post on Instagram A post shared by Kirti Kulhari (@iamkirtikulhari) చదవండి: పెళ్లైన హీరోతో నయన తార సహజీవనం: బీజేపి ఎమ్మెల్యే -
టాటా గ్రూప్ నుంచి ఇలా విడిపోతాం..!
సాక్షి, ముంబై: టాటా గ్రూప్‌తో ఏడు దశాబ్దాల సుదీర్ఘ సంబంధాలకు ముగింపు పలకడానికి సంబంధించిన ఒక ప్రణాళికను అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టుకు సమర్పించినట్లు షాపూర్జీ పలోంజీ (ఎస్పీ) గ్రూప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. టాటా గ్రూప్‌లో మిస్త్రీల వాటా విలువ రూ.1.75 లక్షల కోట్లు అని న్యాయస్థానానికి తెలిపినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. గ్రూప్ చైర్మన్‌గా సైరస్ మిస్త్రీని బోర్డ్ తొలగించిన 2016 అక్టోబర్ 28 తర్వాత మిస్త్రీలు-టాటాల మధ్య న్యాయపోరాటం సుప్రీంకోర్టుకు చేరిన సంగతి సంగతి తెలిసిందే. ‘‘టాటా సన్స్ అనేది రెండు గ్రూపులు కలిసిన కంపెనీ. టాటా గ్రూప్‌లో టాటా ట్రస్టులు, టాటా కుటుంబ సభ్యులు, టాటా కంపెనీలు ఉన్నాయి. వీరికి 81.6 శాతం వాటా ఉంది. ఇక 18.37 శాతం వాటా మిస్త్రీల కుటుంబానికి ఉంది’’ అని అత్యున్నత న్యాయస్థానానికి తెలియజేసినట్లు షాపూర్జీ పలోంజీ గ్రూప్ ప్రకటన పేర్కొంది. (టాటా గ్రూపునకు ఎస్పీ గ్రూప్ టాటా) ప్రకటన ప్రకారం... విడిపోవడానికి సంబంధించిన ప్రణాళిక ఇలా: ప్రో-రేటా స్ప్లిట్ ఆఫ్ లిస్టెడ్ అసెట్స్ (షేర్ ధరల విలువ ప్రాతిపదిక) ప్రో-రేటా షేర్ ఆఫ్ ఆఫ్ ది బ్రాండ్ (ఇప్పటికే టాటాలు పబ్లిష్ చేసిన బ్రాండ్ విలువ ప్రాతిపదికన) నికర రుణాలు సర్దుబాటు చేసిన అన్‌లిస్టెడ్ అసెట్స్‌కు సంబంధించి తటస్థంగా ఉండే థర్డ్ పార్టీ వ్యాల్యూషన్ ప్రకారం... టాటా సన్స్ ప్రస్తుతం వాటా కలిగిన లిస్టయిన టాటా సంస్థల్లో ప్రో–రేటా షేర్ల ప్రాతిపదికన నాన్-క్యాష్ సెటిల్మెంట్ జరగాలని ఎస్పీ గ్రూప్ కోరుతోంది. ఉదాహరణకు టీసీఎస్‌లో టాటాలకు 72 శాతం వాటా ఉంటే (టాటా సన్స్‌లో 18.37 శాతం ఎస్పీ గ్రూప్ యాజమాన్యం ప్రాతిపతికన) ఇందులో 13.22 శాతం ఎస్పీ గ్రూప్‌కు దక్కాల్సి ఉంటుంది. దీని ప్రస్తుత మార్కెట్ విలువ దాదాపు రూ.1,35,000 కోట్లు. నికర రుణానికి సంబంధించి సర్దుబాటు చేసిన బ్రాండ్ వ్యాల్యూ ప్రో–రేటా షేర్‌ను నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. అన్‌లిస్టెడ్ కంపెనీల విషయానికి వస్తే, ఇరు పార్టీలకూ సమ్మతమైన వ్యాల్యూయేటర్లు వీటి విలువను నిర్ధారిస్తారు. దీనిని కూడా నగదు లేదా లిస్టెడ్ సెక్యూరిటీల ద్వారా పరిష్కరించుకోవచ్చు. -
విడిపోయేందుకు బిడ్డ అమ్మకం
కటక్: ఒడిశాలోని మల్కన్‌గిరి జిల్లాలో తల్లిదండ్రుల గొడవకు ఒక చిన్నారి బలయ్యాడు. భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి ఒకరికి ఒకరు దగ్గరవుతారు అనుకున్నారు. అయితే గొడవలు సద్దుమణపోయే సరికి వారు విడిపోవాలనుకున్నారు. వారికి ఉన్న ఒక్కగానొక్క కొడుకు విడిపోవడానికి అడ్డుగా మారడంతో అతనిని విక్రయించారు. అనంతరం ఎవరి దారి వారు చూసుకున్నారు. మథిలి మండలం కియాంగ్ పంచాయతీ పరిధిలోని తేలగబేజా గ్రామంలో ఈ అమానవీయ ఘటన జరిగింది. ఆ తల్లి కూడా కన్న ప్రేమ మరచి బాలుడిని విక్రయించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ కుటుంబం ఆ బాలుడిని కొనుకున్నారు. అతనిని పశువుల కాపరిగా నియమించారు. పశువులను మేతకు తీసుకువెళ్లను అంటే తనను ఇష్టం వచ్చినట్లు కొట్టేవారని బాలుడు వాసుదేవ్ వాపోయాడు. అంతేకాకుండా అన్నం కూడా సరిగా పెట్టకుండా హింసించేవారని అందుకే అక్కడి నుంచి పారిపోయినట్లు బాలుడు తెలిపాడు. అక్కడ బాలుడి కథ విన్న గ్రామస్తులు అతడిని అంగన్వాడీ కేంద్రానికి అప్పగించాడు. దీంతో అంగన్వాడీ కార్యకర్తబాలుడిని తమ ఇంటికి తీసుకువెళ్లారు. బాలుడిని కొనుగోలు చేసిన కుటుంబం ఈ విషయం తెలుసుకొని అతడిని తమకు అప్పగించాలని అంగన్వాడీ కార్యకర్తను బెదిరించింది. దీంతో అంగన్వాడీ కార్యకర్త ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో రంగప్రవేశం చేసిన ఉన్నతాధికారులు బాలుడి తల్లిదండ్రుల వద్దకు వెళతామంటే పంపిస్తామని లేదా చదువుకుంటానంటే చదివిస్తామని తెలిపారు. మొత్తానికి బాలుడి కథ విన్నవారందరూ అతని పరిస్థితి చూసి కన్నీరు పెట్టుకుంటున్నారు. చదవండి: మోసం: సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య -
స్థానికత ఆధారంగానే విభజన జరగాలి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ ఉద్యోగుల విభజన అంశంలో ఏపీ విద్యుత్ సంస్థల యాజమాన్యాలు అనుసరిస్తున్న మొండి వైఖరిని వీడాలని తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ జాయింట్ యాక్షన్ కమిటీ (టీఈఈజేఏసీ), తెలంగాణ స్టేట్ పవర్ ఇంజనీర్స్ అసోసియేషన్ (టీఎస్‌పీఈఏ)లు డిమాండ్ చేశాయి. స్థానికత ఆధారంగా ఉద్యోగుల విభజన జరగాల్సిందేనని ఆయా సంఘాలు స్పష్టం చేశాయి. ఈ మేరకు శుక్రవారం టీఈఈజేఏసీ చైర్మన్ ఎన్.శివాజీ, టీఎస్‌పీఈఏ అధ్యక్షుడు రత్నాకర్‌రావు మింట్‌కాంపౌండ్‌లో వేర్వేరుగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశాల్లో మాట్లాడారు. విద్యుత్ ఉద్యోగుల విభజన ఏకసభ్య కమిటీ న్యాయమూర్తి ధర్మాధికారి మార్గదర్శకాలకు విరుద్ధంగా 582 మంది ఏపీ ఉద్యోగులను తెలంగాణ విద్యుత్ సంస్థల్లో కేటాయించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు వారు ప్రకటించారు. స్థానికత ఆధారంగా తెలంగాణ విద్యుత్ సంస్థలు రిలీవ్ చేసిన ఉద్యోగులను ఏపీ విద్యుత్ సంస్థల్లో చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. -
అక్కడమ్మాయి... ఇక్కడబ్బాయి
సాక్షి, ఖమ్మం : ఉరిమే మేఘాలు ఒళ్లు జలదరింపజేస్తాయి. మెరిసే మెరుపులు భయకంపితులను చేస్తాయి. ఉరుమూ, మెరుపుల కలయికలో కురిసే చినుకులు మాత్రం మేనుకు కొత్త హాయినిస్తాయి. తోడుగా నిలవాల్సిన సహచరి సాన్నిహిత్యం ఉంటే ఆ హాయి ఆనందాన్నిస్తుంది. కొత్త దంపతులకు ఈ రకమైన పరిసరాలు ఉత్తేజాన్నిస్తాయి. కానీ ఏం లాభం.. చూసుకోవడానికి కూడా వీలు లేకుండా కఠిన నిబంధనలు.. కలుసుకుంటే కలిగే విపరిణామాల గురించి ఎన్నో అనుమానాలు. నిజంకాకపోయి ఉంటే బాగుండేదన్న తలంపులు. పదే పదే గుర్తొచ్చే భాగస్వామి(ని). అయినా కుదరదంటే కుదరదంతే..అనే పెద్ద వాళ్ల ఆంక్షలు.. కాంక్షలున్న చోట ఆంక్షలు ఎలా నిలుస్తాయనే కుర్రకారు ఆలోచనలు. వెరసి ఆషాఢమాసం నవ దంపతులకు ఎడబాటు తప్పదు. ఈ నేపథ్యంలో నూతనజంటను ఆషాఢంలో విడిగా ఎందుకుంచాలంటే.. బంధం బలోపేతం.. ఆషాఢ మాసంలోని నెల రోజుల పాటు పెళ్లయిన కొత్త జంట మధ్య బంధాన్ని బలోపేతం చేస్తుంది. అరేంజ్డ్ మ్యారేజ్ అయితే ఆ దంపతుల మధ్య అనురాగాన్ని చిగురింపజేస్తుంది. అటు ఏడు తరాలు, ఇటు ఏడు తరాలు చూసి, ఆచారాలు, వ్యవహారాలు, సంప్రదాయాలు అన్నీ చూసి నిర్ధారించిన వివాహాల్లో దంపతుల వ్యక్తిగత ఇష్టాఇష్టాలకు అంతగా ప్రాధాన్యత లేకుండేది. ఈ ఆషాఢ మాసం ఎడబాటు కారణంగా వ్యక్తిగత అభిరుచులు, అభిప్రాయాలు మరింత బలపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ప్రత్యామ్నాయాలు బోలెడు.. ఎడబాటు కొత్త జంటకు కొంత ఇబ్బంది కలిగించినప్పటికీ ప్రస్తుత ఆధునిక కాలంలో అందుబాటులో ఉన్న సాంకేతిక పరికరాలు ఎడబాటు భావనను దూరం చేస్తున్నాయి. సెల్‌ఫోన్ వచ్చాక మనుషుల మధ్య మానసికంగా దూరం చాలా వరకు తగ్గిపోయింది. ఎస్ఎంఎస్లు, వాట్సప్‌లు, ఇన్స్టాగ్రాం, ఫేస్బుక్ లాంటి సామాజిక మాధ్యమాల ద్వారా పరస్పర సందేశాలు ఎలాగూ మార్చుకునే సౌకర్యం ఉండనే ఉంది. తమ విరహాగ్ని చల్లార్చు కునే పలు రకాల ప్రత్యామ్నాయాలకు కొదవేం లేదు. అభిప్రాయాలు, స్వీట్ నథింగ్స్ షేర్ చేసుకుంటూ కాలాన్ని సులువుగా గడిపేయొచ్చు. శాస్త్రీయ కోణంలోనూ... మంచిదే నవ దంపతులు ఆషాఢ మాసంలో విడిగా ఉండాలనే నియమం ఏనాటి నుంచో వస్తోంది. పూర్వం రోజుల్లో కొత్తగా పెళ్లయిన యువకులు ఆరు నెలల పాటు అత్తగారింట్లో ఉండే సంప్రదాయం ఉండేది. శ్రమించే సమయంలో ఆరునెలల పాటు అత్తవారింట్లో కూర్చుని ఉంటే జరగాల్సిన పనులు స్తంభించిపోతాయి. నవ దంపతులు ఒకే గూటిలో ఉండడం అంత మంచిది కాదని ఎందుకంటారంటే.. ఈ సమయంలో ఒక వేళ గర్భధారణ జరగడం తల్లి, బిడ్డలకు అంత క్షేమకరం కాదు. ఆషాఢ మాసంలో కురిసే వర్షాలు, వరదల కారణంగా సమీప జలాశయాలతోపాటు పరిసరాల్లోని నీళ్లుకలుషితం అవుతాయి. కలుషిత నీటిని వినియోగించినా అనారోగ్యాలు ప్రబలే అవకాశాలున్నాయి. చలిజ్వరాలు, విరోచనాలు, తలనొప్పి మొదలైన ఆరోగ్య సమస్యలు విస్తరించే ప్రమాదం ఉంటుంది. చీడ, పీడలు జనించే సమయంలో అనారోగ్య రోజులు, అశుభ సమయాల్లో గర్భధారణ జరిగితే అది పుట్టే శిశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుందని శాస్త్రవచనం. ఇపుడు గర్భధారణ జరిగితే ప్రసవ సమయం వచ్చే ఎండాకాలంలో ఉంటుంది. తీవ్ర ఉష్ణోగ్రతలు, వడగాలులు వీచే వేసవి సమయం జన్మించే శిశువు బాహ్య పరిసరాలు, ఉష్ణోగ్రతను భరించే స్థితిలో ఉండకపోవచ్చు. కాబట్టి ఈ ఒక్క ఆషాఢ మాసంలో దంపతులు వియోగం పాటిస్తే సంతానోత్పత్తి సమయాన్ని జూన్, జూలై వరకు పొడిగించుకునే అవకాశం ఉంటుంది. సాధారణ ఉష్ణోగ్రతల కారణంగా సుఖ ప్రసవానికి అనుకూలంగా ఉంటుంది. శిశువు సైతం తన నూతన పరిసరాలకు సులువుగా అలవాటు పడతాడు. ఈ శాస్త్రీయ నేపథ్యంలో కొత్త జంటకు ఎడబాటును అనివార్యమని పెద్దలు నిర్ణయించారు. ఎడబాటు ఎందుకంటే..? కొత్త కోడలు తన అత్తను చూడకూడదు. అల్లుడు అత్త వారింటి గడప దాటకూడదు అనే నిబంధనలు మానవ సమాజంలో తరచూ వినపించేవే. కోడలు, అత్త ఒకరినొకరు చూసుకోవడం వల్ల వచ్చే సమస్యలు ఏమీలేవు. అయితే దీని వెనుక శాస్త్రీయత, సంప్రదాయం దాగి ఉంది. ప్రధానంగా మన దేశం వ్యవసాయంపైన ఆధారపడి ఉందని అందరికీ తెలిసిందే.. మృగశిరకార్తె నుంచి ప్రారంభమైన తొలకరి చినుకుల రాక.. క్రమంగా ఆషాఢ మాసంలో అడుగు పెట్టే సరికి పూర్తి వర్షాకాలంగా మారిపోతుంది. సాగు ప్రధానవృత్తిగా ఉన్న మెజార్టీ కుటుంబాల్లో ఇంటిల్లిపాదీ వ్యవసాయ పనుల్లో నిమగ్నం అవుతారు. చినుకుల రాక కోసం ఎదురుచూస్తూ నల్లటి మేఘాలపై కొండంత ఆశతో దుక్కులు దున్నడం, నాట్లు వేయడం వంటి పనులు అనివార్యంగా జరపాల్సి ఉంటుంది. బడికి వెళ్లే పిల్లల్ని వదిలేస్తే పెద్దవాళ్లంతా వ్యవసాయ పనుల్లోనే బిజీగా ఉంటారు కాబట్టి కొత్త అల్లుడికి చేయాల్సిన మర్యాదలు చేయలేకపోతారు. కాబట్టి కర్మభూమిగా కీర్తిగాంచిన దేశంలో చేసే వృత్తిని కాదని మిగిలినవేవీ చేయాలనుకోరు. అందుకే ఈ నెలలో కొత్త అల్లుడు ఇంటికి రాకుండా ఉంటే సాగు పనులు నిరాటంకంగా సాగిపోతాయనే ఉద్దేశంతో ఈ నియమం వి«ధించారు. వ్యవసాయాధారిత కుటుంబాలన్నింటిలోనూ ఇదే పరిస్థితి ఉంటుంది కాబట్టి అందరూ ఈ నియమాన్ని అనుసరిస్తున్నారు. ఆషాఢం ‘పట్టి’ ఆషాఢమాసంలో పుట్టింటికి పంపించే కోడలికి గతంలో అత్తవారింటి నుంచి ఆషాఢపట్టి అని ఒక పెట్టెను ఇచ్చి పంపించేవారు. దీనిలో ఉత్తరాలకట్ట, పెన్ను, పచ్చీసులాంటి ఆటవస్తువులుండేవి. నెలరోజుల ఎడబాటు కాలంలో భర్తకు ఉత్తరాలు రాసేందుకు, భర్త జ్ఞాపకాల నుంచి దూరంగా ఉండేందుకు, కాలక్షేపానికి పచ్చీసు ఉపయోగపడేది. ఈ సౌకర్యాలు కూడా లేని రోజుల్లో మేఘ సందేశాలు, పావురాల సందేశాలు ఉండేవంటారు. ఆషాఢ మాసంలో ఎదురయ్యే ప్రేయసీప్రియుల విరహవేదన ప్రధాన కథావస్తువుగా మహాకవి కాళిదాసు మేఘసందేశం రచించారు. ఇప్పుడు సెల్ఫోన్లు వచ్చాక.. వాట్సప్.. వీడియోకాల్స్‌లో మాట్లాడుకుంటున్నారు. కొత్త కోడళ్లకు ప్రత్యేకం నాకు ఇటీవలే వివాహమైంది. ఆషాఢమాసంలో పెట్టుపోత విషయంలో అత్తారింటివారు, అమ్మనాన్నలు కొత్తగా కొత్త బట్టలు ఇవ్వడం ఆచారం. అందుకోసం ఇటీవల షాపింగ్ చేశాం. చాలా రకాల కొత్త చీరలు, డ్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. డిస్కౌంట్లు ఆకర్షించాయి. చాలా తక్కువ ధరకే అనుకున్న బట్టలు వచ్చాయి. – నవ్యశ్రీ, నూతన వధువు, ఖమ్మం -
వెనక్కి తగ్గిన ట్రంప్..
వాషింగ్టన్ : అమెరికా- మెక్సికో సరిహద్దుల్లో తల్లితండ్రుల నుంచి పిల్లలను వేరు చేసి నిర్భందించే విధానానికి స్వస్తిపలుకుతూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులపై సంతకాలు చేశారు. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించే కుటుంబాలను విచ్ఛిన్నం చేసేలా ప్రస్తుత విధానం ఉందనే విమర్శలు వెల్లువెత్తడంతో ట్రంప్ తాజా నిర్ణయం తీసుకున్నారు. అయితే వలస విధానం విషయంలో ఏమాత్రం తగ్గబోమని స్పష్టం చేశారు. అక్రమంగా సరిహద్దులు దాటి అమెరికాలో ప్రవేశించినందుకు ఇక కుటుంబాలను కలిపే ప్రాసిక్యూషన్ ఎదుర్కొనేలా చర్యలు చేపడతారు. ప్రస్తుతం అక్రమ వలసదారుల్లో పిల్లలను తల్లితండ్రులను వేర్వేరుగా నిర్భందిస్తుండటంపై విమర్శలు ఎదురవడంతో ట్రంప్ యంత్రాంగం పునరాలోచనలో పడింది. ‘ తమ సరిహద్దులు ఇప్పుడు మరింత పటిష్టంగా ఉన్నాయని, అయితే కుటుంబాలను సమిష్టిగా ఉంచాల్సిన బాధ్యత తమపై ఉంద’ని ఎగ్జిక్యూటివ్ ఉత్తర్వులపై సంతకాలు చేసిన అనంతరం ట్రంప్ వ్యాఖ్యానించారు. కుటుంబాలను వేరు చేశామన్న భావన ఎవరిలో కలగరాదనేది తన అభిమతమని ఆయన స్పష్టం చేశారు. కాగా వలసలపై తన కఠిన వైఖరిని పదేపదే సమర్ధించుకుంటున్న ట్రంప్ వలస వచ్చిన చిన్నారులను సరిహద్దులు దాటిన అనంతరం తల్లితండ్రుల నుంచి బలవంతంగా వేరుచేయడాన్నీ వెనకేసుకువచ్చేవారు. అయితే తల్లితండ్రులకు దూరమైన చిన్నారులు కంటతడి పెట్టే దృశ్యాలు, వారిని బోనుల్లో నిర్భందించడం వంటి ఫోటోలు అంతర్జాతీయంగా విమర్శలు వెల్లువెత్తాయి. -
అవును.. 20 ఏళ్ల తర్వాత విడిపోతున్నాం
సాక్షి, ముంబై: బాలీవుడ్లో మరో బ్రేకప్ ఖాయమైపోయింది. నటుడు అర్జున్ రామ్‌పాల్(45) తన భార్య మెహర్ జెసియా(47) నుంచి విడిపోతున్నట్లు ప్రకటించాడు. మూడేళ్లుగా వీళ్లిద్దరూ విడాకులు తీసుకోబోతున్నట్లు వార్తలు రావటం, జంటగా కనిపించి ఆ వార్తలను పటాపంచల్ చేస్తూ వచ్చారు . అయితే ఈసారి మాత్రం దానిని నిజం చేస్తూ సంయుక్తంగా ఓ ప్రకటనను విడుదల చేశారు. ‘20 ఏళ్ల అందమైన ప్రయాణం తర్వాత పరస్పర అంగీకారంతో మేం విడిపోవాలనుకుంటున్నాం. వీటి వెనుక కారణాలు ప్రత్యేకంగా ఏమీ లేవు. వేర్వేరు దారుల్లో వెళ్దామనుకుంటున్నాం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నాం. కొత్త ప్రయాణం ప్రారంభించాలనుకుంటున్నప్పటికీ మాకు కావాల్సిన వాళ్ల కోసం మా మధ్య బంధం కొనసాగుతుంది’ అని ప్రకటనలో పేర్కొన్నారు. కాగా, తన కంటే వయసులో పెద్ద అయిన మోడల్ మెహర్ జెసియాను 1998లో అర్జున్ వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు అమ్మాయిలు మహీకా(16), మైరా(13). మోడల్‌గా కెరీర్ ప్రారంభించిన అర్జున్ రామ్‌పాల్.. ప్యార్ ఇష్క్ ఔర్ మొహబ్బత్(2001) చిత్రం ద్వారా బాలీవుడ్లో అడుగుపెట్టిన అర్జున్ రామ్‌పాల్.. దీవానపన్, ఆంఖే, దిల్ హై తుమ్హారా, దిల్ కా రిష్తా తదితర చిత్రాల్లో నటించారు. డాన్, ఓం శాంతి ఓం, రాక్ ఆన్, హౌజ్‌ఫుల్, రాజ్‌నీతి, రా వన్, హీరోయిన్ చిత్రాల్లో అర్జున్ నటనకు మంచి పేరు దక్కింది. ఆ మధ్య డాడీ చిత్రంతో ప్రేక్షకులను పలకరించిన అర్జున్ రామ్‌పాల్, పల్తాన్తో త్వరలో ప్రేక్షకులను పలకరించనున్నాడు. -
మరో సీనియర్ సినీజంట విడిపోయింది!
మరో సీనియర్ సినీజంట విడాకుల బాట పట్టింది. ప్రఖ్యాత హాలీవుడ్ దంపతులు బెన్ స్టిల్లర్-క్రిస్టిన్ టేలర్ తమ 18 ఏళ్ల వైవాహిక జీవితానికి తెరదించారు. తాము విడిపోతున్నట్టు శుక్రవారం అధికారికంగా ప్రకటించారు. 'ఒకరి పట్ల ఒకరికి అపారమైన ప్రేమ, గౌరవం ఉండటం వల్ల మేం 18 ఏళ్ల పాటు కలిసి జీవించాం. ఇప్పడు మేం విడిపోవాలని నిర్ణయించాం. బాధ్యతాయుతమైన తల్లిదండ్రులుగా మా పిల్లలను పెంచుతూ.. సన్నిహిత స్నేహితులుగా కొనసాగలనుకుంటున్నాం. దయచేసి మా ప్రైవసీని మీడియా గౌరవించాలని కోరుతున్నాం' అని ఈ జంట ఓ ఉమ్మడి ప్రకటనలో పేర్కొంది. హాలీవుడ్ మూవీ 'జూలాండర్' సినిమాతో బెన్ స్టిల్లర్ ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయ్యాడు. 1995లో వచ్చిన ‘ద బ్రాడీ బంచ్’ చిత్రంలో టీనేజ్ కూతురి పాత్రతో క్రిస్టిన్ టేలర్ పేరు సంపాదించుకుంది. బేన్-టేలర్ జోడీ ట్రోపిక్ థండర్, మీట్ ద పేరెంట్స్ వంటి పలు హాలీవుడ్ చిత్రాల్లో కలిసి నటించింది. వీరికి 2000 సంవత్సరంలో పెళ్లి అయ్యింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. -
వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ కొరిటెపాడు (గుంటూరు): ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్‌మాదిగ పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం చేపట్టిన ఆందోళనకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు సైతం మద్దతు ఇచ్చారని, అయినా కొన్ని శక్తులు ఇంకా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల మేధోమధన సదస్సు, 26న అన్ని కులాలు, ప్రజా సంఘాల మేధోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీల మేధోమధన సదస్సు, 28న ఉద్యోగులు, మేధావులు మేధోమదన సదస్సు, సెప్టెంబర్ 4వ తేదీన మాదిగ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేధోమధన సదస్సులు హైదరాబాదులో మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరగనున్నాయని తెలిపారు. -
కవలల ప్రేమ !
వారిద్దరూ కవల పిల్లలు. ఏడేళ్లుగా ఒకరిని విడిచి ఒకరు ఉండడంలేదు. ఒకే కంచంలో తింటూ.. ఒకే పాఠశాలకు వెళ్లి చదువుకుంటున్నారు. అలాంటి వారి మధ్య ఒక్క రోజు ఎడబాటు రావడంతో భరించలేకపోయారు. వివరాల్లోకి వెళితే.. వేంపల్లె రాజీవ్ కాలనీలో నివాసం ఉండే రవికుమార్‌కు కేతన్, కేతన అనే అబ్బాయి, అమ్మాయి (కవలలు) ఉన్నారు. ఆదివారం మధ్యాహ్నం వీరు తండ్రి రవికుమార్ వద్దకు వెళ్లి తిరిగి వస్తూ జెడ్పీ బాలుర హైస్కూలు సమీపంలో రోడ్డు దాటుతుండగా కేతనను ఓ వ్యక్తి మోటారు సైకిల్‌పై వెళ్తూ ఢీకొట్టాడు. దీంతో ఆ చిన్నారి కుడి భుజం, మోచేయి వద్ద ఎముక విరిగింది. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ప్రాథమిక చికిత్స నిర్వహించి మెరుగైన చికిత్స కోసం కేతనను కడప రిమ్స్‌కు తరలించారు. కేతన్ ఇంటి వద్దే ఉండిపోయాడు. రిమ్స్‌లో కేతన చికిత్స పొందుతూ సోదరుడు కేతన్ వస్తే కాని ఏమీ తిననని మారాం చేసింది. కేతన్‌ను రిమ్స్‌కు తీసుకెళ్లాక అన్నం తినింది. సోమవారం సాయంత్రం డిశ్చార్జ్ అయ్యాక ఇంటికి వచ్చారు. ఇంట్లో కూడా కేతనకు.. సోదరుడు కేతన్ అన్నం తినిపిస్తూ సపర్యలు చేస్తున్నాడు. వీరి ప్రేమ చూసి ఇరుగు పొరుగు వారు ఔరా అంటూ ఆశ్చర్యపోతున్నారు. -ఫొటో: రామ్మోహన్‌రెడ్డి, వేంపల్లె -
నేడు పునర్విభజన కమిటీ భేటీ
-
ఉత్త మాటలే..
విమ్స్, ఏయూకు మినహా అన్నింటా రిక్తహస్తమే బడ్జెట్లో రుణమాఫీ కేటాయింపుల్లో జిల్లాకు దక్కేది స్వల్పమే విశాఖ అభివృద్ధిపై సీఎం చిన్నచూపు ఐటీ, పర్యాటకం, పారిశ్రామిక రంగాల ప్రస్తావనే లేదు ఎయిర్‌పోర్టు, కేజీహెచ్, సుజల స్రవంతికి కేటాయింపులు నిల్ అంతన్నారు ఇంతన్నారు. తీరా చూస్తే బడ్జెట్ కేటాయింపుల దగ్గరకు వచ్చేసరికి విశాఖకు రిక్తహస్తం మిగిల్చారు. రాష్ట్రంలో విశాఖపట్నాన్ని ముంబైగా మార్చుతానని, ప్రపంచాన్ని నగరం ముంగిటకు తీసుకువస్తానని సీఎంగా అనేకసార్లు ప్రకటించిన చంద్రబాబు ఆచరణలో మొండిచేయే చూపించారు. బుధవారం ప్రవేశపెట్టిన తాజా బడ్జెట్లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల ఊసే లేదు. సాక్షి,విశాఖపట్నం : విభజన తర్వాత ఏపీలో ఐటీ,పారిశ్రామిక,పర్యాటక రంగాలకు విశాఖ కేంద్రంగా అవతరించడంతో బడ్జెట్లో ఈప్రాంతానికి అత్యదిక ప్రాధాన్యత కలుగుతుందని అంతా ఆశించారు. తీరాచూస్తే మాటలు బారెడు, కేటాయింపులు మూరెడు అన్న చందంగా మా రింది. ఒక్క విమ్స్,ఆంధ్రాయూనివర్సిటీలకు మాత్రమే కొంత ఊరట కలిగించారు. విమ్స్‌కు రూ.12కోట్లు, ఆంద్రాయూనివర్సిటీకి రూ.292 కోట్లు కేటాయించినట్లు ప్రకటించారు. గంగవరం పోర్టులో రూ.4,500కోట్లతో ఎల్ఎన్జీ టెర్మినల్ ఏర్పాటుకు ముందుకు వచ్చిన కంపెనీకి అనుమతులు ఇస్తున్నట్లు ప్రకటించారు. విశాఖ ఈఎన్టీ ఆస్పత్రికి రూ.50లక్షలు కేటాయించారు. ఇవిమినహా విశాఖకు బడ్జెట్లో ప్రత్యేకంగా ఒరిగింది శూన్యమనే చెప్పాలి. వాస్తవానికి విభజన తర్వాత ఏపీలో పారిశ్రామిక,ఐటీ,పర్యాటక రంగాలకు విశాఖ రాజధానిగా అవతరించింది. దీంతో ఈప్రాంతం అభివృద్ధిపై ప్రభుత్వం భారీగా దృష్టిపెడుతుందని భావించినా బడ్జెట్లో ఈప్రాంతానికి ప్రత్యేక ప్రాధాన్యత కల్పించలేదు. ఐటీ రంగంలో ఏపీ వాటా భవిష్యత్తులో రూ.43,600కోట్లకు చేరుకుంటామని ప్రకటించిన ప్రభుత్వం ఇక్కడ ఐటీఐఆర్ ఏర్పాటు,కొత్త కంపెనీలకు అనుమతులు గురించి నామమాత్రం ప్రస్తావన లేదు. పారిశ్రామికరంగం బడ్జెట్ నుంచి ఎంతో ఆశించింది. కేవలం విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్ నిర్మిస్తామని ప్రకటించి చేతులు దులిపేసుకున్నారు. పర్యాటక రంగంపైనా ఆశ్రద్ధే కనబర్చారు. తిరుపతిలో రూ.117కోట్లతో ఇంటర్నేషనల్ కన్వెన్షన్ సెంటర్‌కు నిర్మిస్తామని ప్రకటించిన ప్రభుత్వం విశాఖలో ఆగిపోయిన కన్వెన్షన్ సెంటర్‌కు కనీసం నిధులు కేటాయింపులు చేయలేదు. కాకినాడ,విజయవాడ,తిరుపతి ఎయిర్‌పోర్టుల విస్తరణ చేస్తామని ప్రకటించిన ప్రభుత్వం అభివృద్ధికి నోచుకోని విశాఖ ఎయిర్‌పోర్టుపై కనీస హామీ కూడా ఇవ్వలేకపోయింది. కేజీహెచ్ అభివృద్ధికి గతంలో ప్రభుత్వం రూ.5కోట్ల వరకు కేటాయించింది. ప్రస్తుత ప్రభుత్వం కేజీహెచ్‌పై కన్నెత్తికూడా చూడలేదు. కీలకమైన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పథకంపైనా శీతకన్నేసింది. గత ప్రభుత్వం ఈప్రాజెక్టుకు రూ.3కోట్లు కేటాయించగా, ఇప్పుడు రిక్తహస్తం మిగిల్చింది. రుణమాఫీ పథకానికి రాష్ట్రబడ్జెట్లో రూ.5వేల కోట్లు కేటాయించగా, ఒక్క విశాఖజిల్లాలోనే రూ.1,040 కోట్ల వరకు మాఫీ చేయాల్సి ఉంది. అలాంటప్పుడు కేటాయించిన తక్కువ బడ్జెట్ జిల్లాలో సగానికికూడా లబ్దిదారులకు అందేలా లేదు. అంటే అసలు రుణమాఫీ ఎంతమందికి అందుతుందనేది ప్రశ్నార్థకంగా మారింది. నిరాశ బడ్జెట్ రుణ మాఫీ అజెండాతో అధికారం చేజిక్కుంచుకున్న టీడీపీ రాష్ట్ర బడ్జెట్లో రుణమాఫీ చేస్తుందని ప్రజలంతా ఎదురు చూశారు. ప్రజలను నిరాశ పరిచేలా బుధవారం అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టారు. యువతకు ప్రాధాన్యత కల్పించలేదు. రాష్ట్ర విభజన అనంతరం కీలకంగా మారిన విశాఖ అభివృద్ధికి ఎలాంటి నిధులు కేటయించకపోవడం దురదృష్టకరం. - వంశీకృష్ణశ్రీనివాస్, వైఎస్సార్సీపీ నాయకుడు. సాహసోపేత బడ్జెట్ మౌలిక వసతులకు ప్రాధాన్యం కల్పిస్తూ లక్షకోట్లతో బడ్జెట్ ఏర్పాటు చేయడం సాహసోపేత నిర్ణయం. పెట్టుబడులను పెంచడానికి ఇది ఆరంభంగా నిలుస్తుంది. ప్రభుత్వం సంక్షేమ బాధ్యతను విస్మరించలేదు. విద్యకు సమపాళ్లలో నిధులను కేటాయించారు. అన్ని రంగాలను పునరుజ్జీవింపచేసే బడ్జెట్ ఇది. పరిమిత వనరులతో అనేక అభివృద్ది కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రణాళికేతర వ్యయం ప్రభుత్వ భారాన్ని స్పష్టం చేస్తుంది. నిర్దిష్ట లక్ష్యాలు, అత్యంత ఆవశ్యకాలను గుర్తించి ప్రాథమిక నిధులు ఏర్పాటు చేస్తే రాష్ట్రం సర్వతోముఖాభివృద్ది సాధ్యమవుతుంది. -ఆచార్య కె.రామ్మోహనరావు, రిజిస్ట్రార్ ఇది మాయ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం మాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. బడ్జెట్ కేటాయింపులో గిరిజనులకు తీవ్ర అన్యాయం జరిగింది. గత ప్రభుత్వం రూ.2100 కోట్లు బడ్జెట్లో కూటేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రూ. 1150 కోట్లు మాత్రమే కేటాయించి అన్యాయం చేసింది. - కిల్లో సురేంద్ర, ఏపీ గిరిజన సంఘం జిల్లా అధ్యక్షుడు, అరకులోయ గిరిజనులకు ప్రాధాన్యత లేదు ఎస్సీ,ఎస్టీ సబ్ ప్లాన్‌లో జనాభా ప్రాతిపదికన కేటాయించకుండా ప్రభుత్వం గిరిజనులకు అన్యాయం చేసింది. జాబు కావాలంటే బాబురావాలని నిరుద్యోగులకు మొండి చెయ్యి చూపింది. ఇంధిరమ్మ ఇళ్లకు బడ్జెట్లో నామామాత్రంగా ప్రాధాన్యత ఇచ్చారు. ఇళ్లన్నీ అర్ధాంతరంగా నిలిచిపోయే ప్రమాదం వుంది. - కె.అరుణకుమారి, ఎంపీపీ, అరకులోయ బాగానే సర్దుబాటు చేశారు..! కొత్త రాష్ట్రంలో బడ్జెట్ రూపకల్పన బాగానే చేశారు. బడ్జెట్ లోటు వున్నప్పటికీ ఆ ఇబ్బంది లేకుండా అన్నింటికీ సమన్యాయం చేశారు. రాజధాని లేని ఈ రాష్ట్రానికి ఉన్నంతలో ఇబ్బందులు లేకుండా బాగానే సర్దుబాటు చేశారు. 10 ఏళ్లుగా అభివృద్దికి నోచుకోని ప్రజలకు బడ్జెట్ ఆశలు కల్పించింది. - బండారు రంగమోహన్‌రావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, బీజేపీ విజన్ లేదు..! బడ్జెట్లో విజన్ కనిపించడం లేదు. విశాఖ అభివృద్దికి ఎలాంటి ప్రయత్నం చేయలేదు. యువత ఓట్లు చేజిక్కించుకున్న తర్వాత వారి అవసరం లేదనుకున్నారో ఏమో గానీ వారికి ఉపయోగపడే పధకాలు లేవు. సాంకేతిక విద్యను యువతకు చేరువ చేసేందుకు అవసరమైన బడ్జెట్ కేటాయింపులు లేవు. -బాణాల శ్రీనివాసరావు, పీసీసీ కార్యదర్శి రుణమాఫీకీ బడ్జెట్ ఏదీ..! రుణమాఫీకి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరగలేదు. రుణమాఫీ చేస్తానంటూ ఓట్లడిగిన చంద్రబాబు ఆ వర్గాన్ని బడ్జెట్లో వదిలేశారు. రైతుల కోసం రూపాయి కూడా కేటాయింపులు చేయలేదు. - బెహరా భాస్కరరావు , కాంగ్రెస్ నగర అధ్యక్షుడు నిరాశ నింపింది.. బడ్జెట్ నిరాశ నింపింది. చంద్రబాబు బూటకపు హామీలు తమ వర్గానికే మేలు చేసేలా వుంది. ముఖ్యమంత్రిగా తొమ్మిదేళ్ల అనుభవం వుందని చెప్పుకుంటున్న చంద్రబాబు మొదటి బడ్జెట్ అంకెల గారడీలా వుంది. ఏపీ చరిత్రలో ఇలాంటి బడ్జెట్‌ను ఎప్పుడూ చూడలేదు. - కొయ్యా ప్రసాదరెడ్డి, వైఎస్ఆర్సీపీ శ్రీకాకుళం ఇన్చార్జి ప్రజల్ని మభ్యపెట్టారు రాష్ట్ర బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేదిగా ఉంది. బడ్జెట్లో కేటాయించిన అంకెలకు పెద్ద విలువ లేకుండా పోయింది. రైతుల రుణమాఫీకి ఆర్బీఐతో చర్చలు జరుపుతున్నట్టు, వనరుల సమీకరణకై ప్రభుత్వం నిమగ్నమైనట్టు చెప్పి బాధ్యతను దాట వేసింది. రైతులను అయోమయంలోనికి నెట్టింది. బడ్జెట్లో ప్రభుత్వం మౌలిక సదుపాయాలకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పి కేవలం రూ.400కోట్లు మాత్రమే కేటాయించి ఎక్కువ భాగం ప్రైవేటు రంగానికి అప్పజెప్పుతున్నట్టు స్పష్టం అవుతోంది. - కె. లోకనాథం. సీపీఎం జిల్లా కార్యదర్శి ఉత్తరాంధ్రకు ప్రయోజనమేది? రాష్ట్ర బడ్జెట్లో ఉత్తరాంధ్రకు ఎలాంటి ప్రయోజనం లేదు. ఐటీ రంగం అభివృద్ధి గురించి పెద్ద లక్ష్యాలు ప్రకటించినా, కేటాయింపులు కేవలం రూ.111 కోట్లు మాత్రమే ఉండటం విచారకం. స్టీల్‌ప్లాంట్ గనులు కేటాయింపు గాని, దీనికి అనుబంధ పరిశ్రమలు ఈ ప్రాంతంలో నెలకొల్పే ప్రతిపాదన గాని బడ్జెట్లో ప్రస్తావనకు నోచుకోలేదు. బడ్జెట్లో విశాఖకు కూడా న్యాయం జరగలేదు. జిల్లా ఎమ్మెల్యేలంతా బడ్జెట్ కేటాయింపుల జరిగేలా పట్టుబట్టాలి. - ఎమ్.వి.ఎస్.శర్మ, ఎమ్మెల్సీ కేంద్ర నిధులపై ఆధారపడ్డ బడ్జెట్.. రాష్ట్ర సొంత నిధులు కేవలం 34 శాతం మాత్రమే ఉండటంతో కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడిన బడ్జెట్ ఇది. పటిష్ట వ్యూహం దర్శించడం లేదు. వృద్ధి కన్నా సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. విజన్ 2029కి మార్గ దర్శక సూత్రాలను తెలియజేయాల్సిన అవసరం ఉంది. ప్రణాళికేతర వ్యయం 80 శాతం ఉంటడం కొంత ఇబ్బందికరం. మొత్తం మీద కేంద్రం, ఇతర వనరులపై ఆధారపడి రూపొం దించిన బడ్జెట్ అన్నది సుస్పష్టం. - ఎం.సుందరరావు, అర్థశాస్త్ర విభాగం, ఏయూ ఉత్తరాంధ్రకు నిధులివ్వాల్సింది.. వెనుకబడిన ఉత్తరాంధ్ర అభివృద్దికి మరింత నిధులు కేటాయిస్తే బాగుండేది. వ్యవసాయ రంగానికి పెద్దపీట వేయడం అభినందనీయం. ఎఫ్‌డీఐలలో మన రాష్ట్ర శాతం పెంచుకోవడం ద్వారా మౌలిక వసతుల అభివృద్ది సాధ్యపడుతుంది. ప్రాథమిక విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం సమంజసమే. అదే స్థాయిలో ఉన్నత విద్యకు మరింత నిధుల కేటాయింపులు జరపాల్సి ఉంది. గ్రామీణాభివృద్ది, ఆరోగ్య రంగాలకు కేటాయింపులు బాగున్నాయి. - ఆచార్య టి.కోటేశ్వరరావు, అర్థశాస్త్ర విభాగాధిపతి -
విభజన ప్రక్రియ పూర్తి
అనంతపురం: గవర్నర్ ఇఎస్ఎల్ నరసింహన్ లేపాక్షి ఆలయాన్ని సందర్శించారు. ఇక్కడ ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన ప్రక్రియ పూర్తయిందని చెప్పారు. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం, జూన్ 8న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఏర్పడినట్లు తెలిపారు. ఆవిర్భావ దినోత్సవ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వానిదేనన్నారు. ఏపి రాజధాని ఏర్పాటులో అవరోధాలున్నాయని, వాటిని అధిగమిస్తామని చెప్పారు. లేపాక్షిలో వినాయక విగ్రహం చోరీపై దర్యాప్తు కొనసాగుతోందని గవర్నర్ చెప్పారు. -
రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానం అమలు చేస్తాం
= డబ్బులిస్తే రైతులకు 24 గంటలు విద్యుత్ సరఫరా చేస్తాం = రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే.శివకుమార్ సాక్షి, బళ్లారి : రాష్ట్రంలో నూతన విద్యుత్ విధానాన్ని అమలు చేస్తామని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి డీకే.శివకుమార్ తెలిపారు. ఆయన సోమవారం బళ్లారి తాలూకా కుడితినిలోని బళ్లారి థర్మల్ విద్యుత్ కేంద్రాన్ని (బీటీపీఎస్) పరిశీలించారు. అంతకుముందు అధికారులతో ప్రత్యేకంగా సమావేశమై పూర్తి వివరాలు అడిగి తెలుసుకున్నారు. మంత్రి డీకేశీ మొట్ట మొదటిసారిగా బళ్లారి జిల్లాకు రావడంతో ఆయనకు పార్టీ కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. అనంతరం డీకేశీ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో నూతన విద్యుత్ పాలసీని వారం రోజుల్లోగా అమలు చేస్తామన్నారు. సోలార్ విద్యుత్ స్టేషన్లు, గాలిమరలు తదితర విధానాలు అమలు చేస్తామన్నారు. నూతన విద్యుత్ పాలసీ అమల్లోకి రానుండటంతో రాష్ట్రంలో రైతులకు, విద్యార్థులకు విద్యుత్ సమస్య రాకుండా చూస్తామన్నారు. ఉచిత విద్యుత్‌కు ప్రభుత్వం అమలు చేసిన నియమాల ప్రకారం ఎన్ని గంటలు విద్యుత్ ఇవ్వాలో అన్నే గంటలు సరఫరా చేస్తామన్నారు. అయితే నూతన విద్యుత్ పాలసీ అమలు చేయడం వల్ల డబ్బులు చెల్లించిన రైతులకు 24 గంటల పాటు విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. డబ్బులు చెల్లిస్తే ఏ రైతుకు ఎన్ని గంటలు విద్యుత్ కావాలో వారికి మీటర్లు ఏర్పాటు చేసి సరఫరా చేస్తామన్నారు. సోలార్ విద్యుత్ ప్లాంట్లు ఏర్పాటు చేస్తుండటం వల్ల రైతులకు డబ్బులు తీసుకుని విద్యుత్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం సిద్ధమ వుతోందన్నారు. బళ్లారి జిల్లా కుడితిని బీటీపీఎస్‌లో త్వరలో మూడవ యూనిట్‌ను ప్రారంభించేందుకు కృషి చేస్తామన్నారు. ఈ ఏడాది ఆఖరిలోపు అందుకు సంబంధించిన పనులను పూర్తి చేసేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని అధికారులకు ఆదేశించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 3657 మెగావాట్ల జల విద్యుత్, 2800 మెగావాట్ల థర్మల్ విద్యుత్, 3248 మెగావాట్ల సౌర, పవన విద్యుత్ ఉత్పత్తిఅవుతోంద న్నారు. 900 మెగావాట్ల విద్యుత్‌ను ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేస్తున్నామని, దీంతో రాష్ట్రంలో మొత్తం 13,697 మెగావాట్ల విద్యుత్‌ను ఉపయోగిస్తున్నట్లు చెప్పారు. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా 1836 మెగా వాట్లు విద్యుత్ సరఫరా అవుతోందన్నారు. ఉడిపి విద్యుత్ కేంద్రం నుంచి 1200 మెగావాట్లు విద్యుత్ ఉత్పత్తి అవుతోందని గుర్తు చేశారు. రాష్ట్రంలో, కేంద్రం నుంచి వస్తున్న విద్యుత్ వల్ల ఈ ఏడాది వేసవిలో విద్యుత్ కొరత లేకుండా గట్టి చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ అధికారులు, బీటీపీఎస్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.