Bollywood Actress Kirti Kulhari Announced About Divorce With Her Husband - Sakshi
Sakshi News home page

కష్టమే, తప్పట్లేదు, విడిపోతున్నాం: నటి

Published Thu, Apr 1 2021 4:32 PM | Last Updated on Thu, Apr 1 2021 6:57 PM

Kirti Kulhari: Saahil Sehgal And I Have Decided To Separate - Sakshi

నేను, నా భర్త సాహిల్‌ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. కానీ జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం..

బాలీవుడ్‌ నటి కీర్తి కుల్హరి తన భర్తతో విడిపోతున్నట్లు ప్రకటించింది. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని అభిమానులతో పంచుకుంది. అంతేకాదు, అతడితో విడిపోయాక అతడి ఇంటి నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొంది. ఈమేరకు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ పోస్ట్‌ పెట్టింది. "నేను, నా భర్త సాహిల్‌ విడిపోవాలని నిశ్చయించుకున్నాం. ఇది రాత పూర్వకంగా కాదు, కానీ జీవితంలో మాత్రం ఎవరి దారి వారు చూసుకోవాలని ఓ నిర్ణయానికొచ్చాం. కలిసి ఉండాలనుకోవడం కన్నా విడిపోవడం చాలా కష్టం. ఎందుకంటే కలిసి జీవించినప్పుడు అందరూ దాన్ని సాదరంగా ఆహ్వానిస్తారు. కానీ విడిపోవడాన్ని ఎవరూ అంగీకరించకపోగా చాలామందిని అది బాధిస్తుంది కూడా. బ్రేకప్‌ చెప్పుకోవడమూ అంత ఈజీ ఏమీ కాదులెండి. కానీ తప్పడం లేదు. ప్రస్తుతం నేను ఓ మంచి ప్రదేశంలోనే ఉన్నాను. దయచేసి దీని గురించి ఎవరూ కామెంట్‌ చేయొద్దు. ఇప్పటికీ, ఎప్పటికీ కూడా!" అంటూ చేతులు జోడించిన ఎమోజీని జత చేసింది.

అయితే కొందరు అభిమానులు ఈమె పోస్ట్‌ మీద అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మమ్మల్ని ఏప్రిల్‌ ఫూల్‌ చేయడం లేదు కదా? అని ప్రశ్నిస్తున్నారు. మరికొందరేమో ఏంటి? నీకు పెళ్లి కూడా అయిందా? అని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక కొందరు సెలబ్రిటీలు మాత్రం ఆమె ధైర్యంగా ఈ విషయాన్ని సోషల్‌ మీడియాలో ప్రకటించడాన్ని ప్రశంసిస్తున్నారు.

కాగా కీర్తి కుల్హరి 2016 జూన్‌లో సాహిల్‌ను వివాహమాడింది. సినిమాల్లో నటించేందుకు తన భర్త ఎప్పుడూ ప్రోత్సహించేవాడని ఆ మధ్య ఇంటర్వ్యూల్లోనూ పేర్కొంది. కీర్తి.. పింక్‌, ఇందు సర్కార్‌, బ్లాక్‌మెయిల్‌, ఉరి: ద సర్జికల్‌ స్ట్రైక్‌, మిషన్‌ మంగళ్‌ సహా పలు చిత్రాల్లో నటించింది. ఈ మధ్యే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైన ద గర్ల్‌ ఆన్‌ ద ట్రైన్‌లోనూ కీలక పాత్రలో కనిపించింది. అలగే డిస్నీ ప్లస్‌ హాట్‌స్టార్‌లో ప్రసారమవుతోన్న క్రిమినల్‌ జస్టిస్‌ అనే వెబ్‌ సిరీస్‌లోనూ ముఖ్య పాత్ర పోషించింది. 

చదవండి: పెళ్లైన హీరోతో నయన తార సహజీవనం: బీజేపి ఎమ్మెల్యే

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement