వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు | Some body trying to stop SC reservation separation | Sakshi
Sakshi News home page

వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు

Published Sun, Aug 21 2016 8:46 PM | Last Updated on Mon, Sep 4 2017 10:16 AM

వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు

వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు

ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి
సుధాకర్‌ మాదిగ
 
కొరిటెపాడు (గుంటూరు): ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్‌) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్‌ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్‌మాదిగ పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్‌ భవన్‌లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం చేపట్టిన ఆందోళనకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు సైతం మద్దతు ఇచ్చారని, అయినా కొన్ని శక్తులు ఇంకా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల మేధోమధన సదస్సు, 26న అన్ని కులాలు, ప్రజా సంఘాల మేధోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీల మేధోమధన సదస్సు, 28న ఉద్యోగులు, మేధావులు మేధోమదన సదస్సు, సెప్టెంబర్‌ 4వ తేదీన మాదిగ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేధోమధన సదస్సులు హైదరాబాదులో మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరగనున్నాయని తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement