mrps
-
ఇది పరిష్కరించుకోదగిన మిత్రవైరుద్ధ్యం!
భారతదేశంలో ఉన్న నిచ్చెన మెట్ల కుల సమాజం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం పాలు చేస్తోంది. ప్రతి విషయంలోనూ కులం ప్రధానపాత్ర వహిస్తోంది. కులనిర్మూలన జరగక పోగా కులం వేళ్ళు మరింత బలంగా లోలోతుల్లోకి వెళ్తున్నాయి. ప్రజాస్వామ్యంలో కుల నిర్మూలనైనా జరగాలి లేదా సంపద, అధికారాల్లో ఎవరి వాటా వారికైనా దక్కాలి. ఇవేవీ జరుగకపోగా వేలసంఖ్యలో విభజింపబడిన పాలిత కులాల మధ్య చెప్పలేనన్ని వైరుద్ధ్యాలు! తమకు దక్కాల్సిన వాటా కోసం ఉమ్మడి పోరాటాలు చేయకుండా తమలో తామే తన్నుకోవడం కనిపిస్తోంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల మధ్య వైరుద్ధ్యాలే కనిపిస్తున్నాయి. నిజానికివన్నీ మిత్ర వైరుద్ధ్యాలే తప్ప శత్రు వైరుద్ధ్యాలు కావు. వీటిని పరిష్కరించుకోకుండా దశాబ్దాలుగా తగవులాడుకుంటూనే ఉన్నారు.ఎస్సీల్లోని మాల–మాదిగలు, వారి ఉపకులాల మధ్య ఉండాల్సింది మిత్రవైరుద్ధ్యం కాగా అది శత్రువైరుద్ధ్యంగా కొనసాగుతుండడం బాధాకరం. ఇరువురికీ ఆరాధ్యుడు అంబేడ్కర్. ఆయన స్ఫూర్తితో దళిత జాతి విముక్తికై ఉమ్మడి పోరాటాలు చేయకుండా దశాబ్దాలుగా పాత వైరుద్ధ్యాలను మరింత విస్తృతం చేసి దళిత రాజ్యాధికార భావనకు మరింతదూరం జరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో ‘దళిత మహాసభ’ దళితులపై జరిగిన పాశవిక దాడులను సమర్థంగా ఎదుర్కొంది. ఎండగట్టింది. దళితుల్లో ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని పెంచింది. అంబేడ్కర్ స్ఫూర్తితో, ఇంగ్లీషు చదువులతో, క్రైస్తవ చైతన్యంతో ఆంధ్ర మాలలు కొంతవరకైనా పాలక స్థాయికెదిగి ఐఏఎస్, ఐపీఎస్ వంటి సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. రాజకీయ పదవులూ గెలుచుకున్నారు. అలాగే మూడు దశాబ్దాల క్రితం మంద కృష్ణ మాదిగ ప్రారంభించిన ‘మాదిగ దండోరా’ ఉద్యమం చరిత్రాత్మకమైనది. అది మాదిగల్లో ఆత్మగౌరవాన్ని, పోరాట పటిమను, అంబేడ్కర్ భావజాలాన్ని అర్థం చేసుకునేలా చేసింది. అది కేవలం వర్గీకరణ ఉద్యమంగానే ఉండిపోకుండా వికలాంగుల పెన్షన్, తెలంగాణ ఉద్యమానికి ఊతమిచ్చింది. కొందరు ఆధిపత్య కులాల వారు తమ పేరు చివర తమ కులాలను తెలియచేసే విశేషాలను పెట్టుకున్నట్లే.. మాదిగలు కూడా తమ పేరు చివర ‘మాదిగ’ పదాన్ని చేర్చుకోవాలని మంద కృష్ణ మాదిగ ఇచ్చిన పిలుపు ఆ కులంలో ఆత్మగౌరవాన్ని ప్రోది చేసింది. ఒక్క దళిత కులాల్లోనే కాదు పీడిత కులాలందరికీ ఆత్మవిశ్వాసాన్నిచ్చిందీ దండోరా ఉద్యమం. అయితే దండోరా ప్రధాన లక్ష్యం రిజర్వేషన్లలో ఏబీసీడీ వర్గీకరణ సాధించడం.కానీ వర్గీకరణ విషయంలో మాల, మాదిగల మధ్య అభిప్రాయ భేదాలు ఏర్పడ్డాయి. దేశం మొత్తంగా కొన్నిచోట్ల మాలలు, మరికొన్ని చోట్ల మాది గలు రిజర్వేషన్లలో భాగాన్ని ఎక్కువగా అనుభవిస్తున్నారన్నది వాస్తవం. వర్గీకరణ చేస్తే మాల, మాదిగ ఉపకులాలన్నీ రిజర్వేషన్ సౌకర్యాన్ని సమానంగా అనుభవించి అన్ని ఉపకులాలు పైకొస్తాయన్నది వర్గీకరణ కావాలనే వారి వాదం. వర్గీకరణ వల్ల దళితుల్లో ఐక్యత దెబ్బతింటుందని వర్గీకరణను వ్యతిరేకించే వారి వాదన. ఎక్కడ మాలల్లో గానీ, మాదిగల్లో కానీ చైతన్యం ఎక్కువగా ఉంటే అక్కడ ఆయా కులాలవారు రిజర్వేషన్ సౌకర్యాన్ని ఎక్కువ ఉపయోగించుకున్నారన్నది వాస్తవం.వర్గీకరణ కావాలనడంలో ఎవరి వాటా వారికి చెందాలన్న ప్రజాస్వామిక సూత్రముంది. ఆంధ్రప్రదేశ్‌లో వర్గీకరణను ఒకసారి చేసినా కొందరు సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్ల దాని అమలు నిలిపివేయబడింది. అప్పట్నుంచి వైరుద్ధ్యాలు మరీ ఎక్కువయ్యాయి. వర్గీకరణ ఉద్యమం దేశవ్యాప్తమైంది. దీన్ని ఆసరాగా చేసుకొని పాలకపార్టీలు ఓట్లు రాజకీయాలాడటం మొదలు పెట్టాయి. దళితుల ఓట్లు కోసం వర్గీకరణను సమర్థించడం, వ్యతిరేకించడం రాజకీయ పార్టీలకు ఓ ఆటగా మారింది.చదవండి: చేగువేరా టు సనాతని హిందూ!ఈ మధ్యనే సుప్రీంకోర్టు వర్గీకరణ చేయడం సరైన దేనని తీర్పునిచ్చింది. అందులో మెలిక పెట్టింది. క్రీమీలేయర్ పాటించాలని. తరతరాలుగా రాజకీయ, సామాజిక, విద్య, ఆర్థిక, ఉద్యోగపరమైన అధికారాలు అనుభవిస్తున్న వారికి లేని క్రీమీలేయర్ దళితుల వర్గీకరణకు కావాలనడం ధర్మ సమ్మతమేనా? కొందరు దళితనేతలు క్రీమీలేయర్ వద్దంటే మరికొందరు వర్గీకరణే వద్దంటున్నారు. మాయావతి లాంటి నాయకురాలు కూడా వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారు. సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చినా ఇలాంటి సందర్భాల్లో వర్గీకరణ అమలవుతుందా అనే అనుమానం రావడం సహజమే. అమలు కాకుండా ఉండటానికి వర్గీకరణ వ్యతిరేకులు, అమలు చేయడానికి వర్గీకరణ అనుకూలురు ఇంకా ఎన్నేండ్లు పోరాటాలు చేస్తూ తమ ఉమ్మడి లక్ష్యాన్ని మరిచిపోతారు?దళిత సోదర సోదరీమణులు తమ మధ్యనున్న వైరుధ్యాలను మిత్ర వైరుద్ధ్యాలుగా భావించి చర్చలతో వర్గీకరణ సమస్య విషయంలో ఏకీభావానికి వచ్చి దళిత రాజ్యాధికార భావనను సాకారం చేసే దిశగా పయనం కొనసాగిస్తే మంచిది. తమ అంతిమ లక్ష్యం దళిత సాధికారత, రాజ్యాధికారం అన్న విషయాన్ని అర్థం చేసుకుంటే ఇరువైపుల వారికీ వర్గీకరణ సమస్య అతి చిన్నదిగా కనబడుతుంది.- డాక్టర్ కాలువ మల్లయ్యప్రముఖ కథా రచయిత -
చంద్రబాబుకు మాదిగల డెడ్ లైన్..
-
బీజేపీకి ఎమ్మార్పిఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో మాదిగలు భారతీయ జనతా పార్టీకి మద్దతునివ్వాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పిలుపునిచ్చారు. ప్రధాన మంత్రి మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఎస్సీల వర్గీకరణకు పూర్తి మద్దతు ప్రకటించడమేకాక దీనికి సంబంధించి కార్యాచరణ రూపొందిస్తున్నారని అన్నారు. దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని మాటిచ్చి తప్పిన ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన మంత్రివర్గంలో మాదిగలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. మాదిగలను మో సం చేసిన బీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయొద్దని మందకృష్ణ కోరారు. ఎమ్మార్పిఎస్‌కు అనుబంధంగా ఉన్న ఎంఎస్పీ ఇతర విభాగాలు సైతం బీజేపీ గెలుపు కోసం పనిచేస్తాయని తెలిపారు. సోమవారం ఆయ న సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశంలో మాట్లాడారు. దశాబ్దాల పాటు దేశాన్ని, రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పార్టీ మాదిగలను ఓటుబ్యాంకు మాదిరి వాడుకుందన్నారు. ఎస్సీల వర్గీకరణ చేయాలని, లేకుంటే మాదిగలు నష్టపోతారని కాంగ్రెస్ ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్లు స్పష్టం చేసినప్పటికీ ఆ ప్రక్రియ పూర్తి చేయలేదన్నారు. ఇంతకాలం ఓట్లు వేసి మోసపోయిన దళితులు, ఇప్పుడు ఆలోచించాలని సూచించారు. బీఆర్ఎస్ సర్కార్ అణచివేసింది.. అదేవిధంగా రాష్ట్రంలో దశాబ్ద కాలం అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం దళితులపై దాడులు చేయించిందని, ఎన్నో విధాలుగా అణిచివేసిందని మంద కృష్ణ గుర్తు చేశారు. బీఆర్ఎస్ సర్కార్ దళితులకు భూపంపిణీ చేయకపోగా, గత ప్రభుత్వాలు పంచిన భూమిని లాక్కుందని ఆగ్రహంవ్యక్తం చేశారు. అలాంటి పార్టీకి ఓటు వేస్తే మరింత నష్టపోతామని, మాదిగలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం ఆలోచించి బీజేపీకి ఓటు వేయాలని కోరారు. సుప్రీంకోర్టులో వర్గీకరణ అంశం ఉండటంతో కొంత ఆలస్యం జరగవచ్చని, జనవరి లేదా ఫిబ్రవరిలో జరిగే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ జరుగుతుందని విశ్వసిస్తున్నట్లు మందకృష్ణ వివరించారు. గతవారం రాష్ట్రానికి వచ్చిన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సైతం వర్గీకరణపై స్పష్టత ఇచ్చారన్నారు. బీఆర్ఎస్కు ఓటేస్తే కేసీఆర్ మూడోసారి సీఎం అవుతారని, కాంగ్రెస్‌కు ఓటేస్తే రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి సీఎం అవుతారని, బీజేపీకి ఓటేస్తే బీసీ సీఎంతో పాటు ఎస్సీ వర్గీకరణ జరుగుతుందన్నారు. ఈ అంశాన్ని ప్రతిఒక దళిత ఓటరు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలన్నారు. ప్రస్తుతం ఎమ్మార్పిఎస్‌కు ప్రధాన శత్రువులు బీఆర్ఎస్, కేసీఆర్ అని, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి మాటలు చెప్పడం తప్ప చేతలుండవని విమర్శించారు. వర్గీకరణ కోసం కేంద్రానికి లేఖ రాయలంటూ గాందీభవన్‌లో వినతిపత్రం ఇస్తే తీసుకుని కనీసం మాట్లాడని వ్యక్తి రేవంత్ అన్నారు. గాం«దీభవన్ సాక్షిగా మాదిగలను రేవంత్ అవమానించారని, అలాంటి పార్టీకి ఓటు ఎందుకేయాలని ప్రశ్నించారు. ఎన్నో ఏళ్ల తర్వాత జాతీయ పార్టీ నుంచి బీసీ సీఎం హామీ వచ్చిందని, రాష్ట్రంలోని బీసీ కుల సంఘాలన్నీ బీజేపీకి మద్దతు ఇచ్చి గెలిపించుకోవాలని ఆయన అన్నారు. బీసీ రాజకీయ రిజర్వేషన్ల అంశాన్ని ముందుకు తీసుకెళ్తున్న ఆర్.కృష్ణయ్య తక్షణమే బీజేపీకి మద్దతు ప్రకటించాలని మందకృష్ణ కోరారు. -
ఎమ్మార్పీఎస్ వర్సెస్ బీజేపీ.. మహబూబ్‌నగర్‌లో ఉద్రిక్తత
సాక్షి, మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలో మంగళవారం ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి, బీజేపీ కార్యకర్తల నడుమ ఘర్షణ జరిగింది. కర్రలతో ఇరు వర్గాలు దాడికి దిగగా.. అడ్డుకునే యత్నం చేసిన ఓ కానిస్టేబుల్ గాయపడ్డాడు. మరోవైపు పోలీస్ వాహనం సైతం ధ్వంసం కావడంతో.. నలుగురిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఎస్సీ వర్గకరణ సమస్య పరిష్కారం డిమాండ్‌తో ర్యాలీ చేపట్టిన ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు.. అన్నపూర్ణ గార్డెన్ వద్దకు చేరుకుని భారీ ఎత్తున నినాదాలు చేశారు. అదే సమయంలో లోపల బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరుగుతోంది. బయటకు వచ్చిన బీజేపీ కార్యకర్తలు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలపై బాహాబాహీకి దిగారు. పరిస్థితిని అదుపు చేసేందుకు రంగంలోకి దిగిన పోలీసులు.. ఇరు వర్గాలను చెదరగొట్టారు. ఈ క్రమంలో.. ఓ కానిస్టేబుల్‌కు గాయాలు కాగా, ఓ పోలీస్ వాహనం అద్దాలు ధ్వంసం అయ్యాయి. ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కార డిమాండ్‌తో ఎమ్మార్సీఎస్ ఆందోళన చేపట్టింది. అయితే ఈ వ్యవహారంలో బీజేపీ వైఖరి, కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో స్పష్టం చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేస్తోంది. ఇక గత రాత్రి ఎమ్మార్పీఎస్ ప్రతినిధుల బృందం ఒకటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ను కలిసి ఈ మేరకు ఓ వినతి పత్రం సమర్పించాయి కూడా. అయినప్పటికీ మరుసటి నాడే ఇలాంటి పరిణామం చోటు చేసుకోవడంతో.. దీని వెనుక ఎవరైనా ఉన్నారనే అనుమానాలు వ్యక్తం చేస్తోంది బీజేపీ. -
ఎల్బీనగర్లో మిస్సింగ్.. ఖమ్మం జిల్లాలో మృతదేహం లభ్యం
నాగోలు: ఎల్బీనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 16న అదృశ్యమైన వ్యక్తి ఖమ్మం జిల్లాలోని సాగర్ ప్రధాన కాల్వలో శవమై తేలిన సంఘటన సోమవారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా, రాఘవాపురం గ్రామానికి చెందిన పదిర భాను చందర్ నగరానికి వలస వచ్చి నాగోలు సాయినగర్ గుడిసెల్లో ఉంటూ సెంట్రింగ్ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా టీఎస్ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి పని చేస్తున్నాడు. ఈ నెల 16న ఇంటి నుంచి బయటకు వెళ్లిన భానుచందర్ తిరిగి రాలేదు. దీంతో అతని భార్య గాలింపు చేపట్టినా ఆచూకీ తెలియరాలేదు. అదే రోజు భార్యకు ఫోన్ చేసిన భానుచందర్ యాదాద్రి జిల్లా, రాయగిరిలోని ఇంటికి వస్తున్నట్లు చెప్పి ఫోన్ పెట్టేశాడు. తర్వాత ఫోన్ స్విచ్ఛాఫ్ రావడంతో ఆందోళనకు గురైన అతని భార్య కావ్య ఈ నెల 17న ఎల్బీనగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా ఖమ్మం జిల్లా, రఘునాథ పాలెం మండలం, మూలగూడెం వద్ద సాగర్ ప్రధాన కాల్వలో ఈనెల 21న ఓ వ్యక్తి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు అతడి వద్ద ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ హాస్పిటల్ మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆనవాళ్లపై పోలీస్స్టేషన్లకు సమాచారం అందించడంతో అప్పటికే అతడికోసం వెతుకుతున్న ఎల్బీనగర్ ఏసీపీ శ్రీధర్‌రెడ్డి, సీఐ అశోక్‌రెడ్డి, తదితరులు ఆదివారం రాత్రి ఖమ్మం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతదేహాన్ని పరిశీలించారు. మృతడి వేలికి ఉన్న ఉంగరం ఆధారంగా భానుచందర్‌గా గుర్తించారు. ఈ మేరకు ఎల్బీనగర్ పోలీసు లు అతడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. సోమవారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని నాగోలు సాయినగర్‌కు తీసుకువచ్చారు. పాత కక్షలతోనే భాను చందర్ హత్య... సాయినగర్ గుడిసెల్లో ఉంటున్న భాను చందర్‌కు అదే ప్రాంతానికి చెందిన వ్యక్తులతో విబేధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన ముగ్గురు వ్యక్తులు, హయత్‌నగర్ ప్రాంతానికి చెందిన మరొకరితో కలిసి భాను చందర్‌ను పథకం ప్రకారం బయటికి తీసుకెళ్లి హత్య చేసి ఖమ్మం జిల్లా, పాలేరు సమీపంలోని సాగర్ ప్రధాన కాల్వలో పారవేయగా మృతదేహం నీటిలో మూలగూడెం వరకు కొట్టు కొచ్చినట్లు పోలీసులు భావిస్తున్నారు. కాగా ఇప్పటికే దర్యాప్తు చేపట్టిన ఎల్బీనగర్ పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.. నిందితులను కఠినంగా శిక్షించాలి భానుచందర్ హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని టీఎస్ ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు మేడి పాపయ్య, రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు సూర్యప్రకాష్, పలువురు నాయకులు డిమాండ్ చేశారు. బీజేపీ నాయకుల ధర్నా.. నిందితులను శిక్షించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కోశాధికారి చింతల సురేందర్ యాదవ్ ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు సాయినగర్ కాలనీలో ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా సురేందర్ యాదవ్ అక్కడే ఉన్న ఆమ్ఆద్మీ పార్టీ నాయకురాలు ఇందిరాశోభన్ పట్ల దురుసుగా ప్రవ ర్తించాడు. దీంతో పోలీసులు బీజేపీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. సాయినగర్ గుడిసెల వద్ద భారీ ఎలాంటి అవాంఛ నీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. -
అణగారిన వర్గాలకు అండగా ఉంటాం
అంబర్‌పేట: అణగారిన వర్గాల కోసం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఎంతో కృషి చేశారని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి చెప్పారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై చర్చించడానికి ఢిల్లీకి వచ్చిన మందకృష్ణ ప్రమాదానికి గురయ్యారని, అది దురదృష్టకరమన్నారు. ఆయనను పరామర్శించడానికి వెళ్లిన ప్రతిసారి ఆరోగ్యాన్ని సైతం లెక్క చేయకుండా వర్గీకరణ అంశాన్నే ప్రస్తావించే వారని చెప్పారు. అణగారిన వర్గాలకు బీజేపీ అండగా ఉంటుందన్నారు. మందకృష్ణ త్వరగా కోలుకొని ప్రజా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనాలని ఆకాంక్షించారు. ఢిల్లీలో ప్రమాదానికి గురైన మందకృష్ణ మాదిగను కిషన్‌రెడ్డి హైదరాబాద్‌కు స్వయంగా వెంటపెట్టుకొని తీసుకొచ్చారు. విమానాశ్రయం నుంచి వందలాది మంది ఎమ్మార్పీఎస్ కార్యకర్తల మధ్య డీడీ కాలనీలో ఉన్న నివాసానికి ర్యాలీగా వచ్చారు. ఉద్యమాలకు అండగా కిషన్‌రెడ్డి కొన్నేళ్లుగా అనేక ప్రజా ఉద్యమాలకు కిషన్‌రెడ్డి అండగా ఉంటూ వస్తున్నారని, ఇది ఆయన అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధికి నిదర్శనమని మందకృష్ణ మాదిగ చెప్పారు. తాను ప్రజల పక్షాన పోరాడితే అవే అంశాలను కిషన్‌రెడ్డి అసెంబ్లీలో లేవనెత్తుతూ పరిష్కారానికి చొరవ తీసుకున్నారన్నారు. దళితులను మోసం చేసినందుకే సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టారని వ్యాఖ్యానించారు. పథకం కింద దళితులకు డబ్బులు ఇచ్చి వాటిపై కలెక్టర్ పెత్తనం చేయడమే పెద్ద కుట్ర అని అన్నారు. ఒక్క హుజురాబాద్‌కే దళితబంధు పథకం కింద రూ.2 వేల కోట్లు అవసరమవుతాయని ప్రకటించిన కేసీఆర్, రాష్ట్రవ్యాప్తంగా అమలు చేయడానికి ఎన్ని వేల కోట్లు అవుతాయి, ఎలా తెస్తారో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు. ‘ఆత్మనిర్భర్ భారత్’ సాధనలో మోదీకి అండగా నిలవాలి దేశాన్ని ‘ఆత్మనిర్భర్ భారత్’గా రూపొందించేందుకు ప్రతిఒక్కరూ ప్రధాని మోదీ నాయకత్వాన్ని బలపరచాలని పర్యాటక, సాంస్కృతిక, శాఖమంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. గుజరాత్ సీఎంగా, దేశ ప్రధానిగా నరేంద్ర మోదీ నీతివంతమైన పాలనను అందించి ప్రపంచదేశాల్లో భారత్‌కు గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకువచ్చారని పేర్కొన్నారు. మోదీ గుజరాత్ సీఎంగా బాధ్యతలు చేపట్టి అక్టోబర్ 7వ తేదీతో 20 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తిచేసుకోనున్న సందర్భంగా నరేంద్రమోదీ–‘ప్రైడ్ ఆఫ్ ఇండియా’ఇంగ్లిష్ పుస్తకం తెలుగు అనువాదాన్ని ఆదివారం కిషన్‌రెడ్డి ఆవిష్కరించారు. మోదీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సేవా కార్యక్రమాలను గురించి ఈ పుస్తకంలో వివరించారని, దీన్ని ఇతర భాషల్లోకి తీసుకువస్తున్నట్లు నిర్వాహకులు తెలిపినట్లు ఆయన చెప్పారు. -
కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం
బౌద్ధనగర్ (హైదరాబాద్): కోకాపేట ప్రభుత్వ భూముల వేలాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఈ వేలంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అక్రమ సంపాదన పెరిగిందని ఆరోపించారు. శనివారం పార్శిగుట్టలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. విపక్షాలను పక్కదోవ పట్టించడానికి వేలంలో వచ్చిన డబ్బులను దళిత సాధికారిత కోసం ఉపయోగిస్తామని సీఎం ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. వెలమ, కమ్మ అగ్రకులాల ఆత్మగౌరవ భవనాలకు హైటెక్ సిటీలో కోట్లు విలువైన భూములు కేటాయించి బీసీ, మైనార్టీలకు కొండగుట్టల్లో ఎలా కేటాయిస్తారని సీఎం కేసీఆర్‌ను ఆయన ప్రశ్నించారు. దీంతో ప్రజల్లో అసమానతలు పెరుగుతాయన్నారు. దళితుల్లో ఉన్న 59 ఉప కులాల వారికి ఒక సెంటు భూమి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ కేటాయించలేదని పేర్కొన్నారు. నగర శివార్లలోని 200 ఎకరాల్లో అన్ని కులాలకు ఆత్మగౌరవ భవనాల కోసం భూమిని కేటాయించాలని కోరారు. కేసీఆర్ ఏడేళ్ల పాలనలో దళితుల సాధికారిత ముందుకు సాగిందా, వెనక్కి వెళ్లిందా? అనే అంశంపై ఈ నెల 22న సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. -
దళిత మహిళలకు బాబు క్షమాపణ చెప్పాలి
తాడికొండ: నిరుపేదలకు ఇళ్ల స్థలాల పంపిణీని అడ్డుకుంటున్నందుకు నిరసన తెలిపేందుకు వస్తున్న దళిత మహిళలపై టీడీపీ గూండాలతో దాడి చేయించిన చంద్రబాబు క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు పరిశపోగు శ్రీనివాసరావు అన్నారు. బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో రాజధాని తుళ్ళూరు మండలం తాళ్ళాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్లో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలకు శనివారం ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ధర్నాలో పాల్గొనేందుకు వస్తున్న దళిత మహిళలను తన పార్టీ గూండాలతో ట్రాక్టర్లతో తొక్కించి చంపుతామని బెదిరింపులకు పాల్పడడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. ఈ తప్పుడు చర్యలకు విగ్గు రాజు వంతపాడుతూ అబలలను నోటికి పట్టని మాటలనడం సభ్య సమాజం సిగ్గుపడాల్సిన అంశమని చెప్పారు. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడకపోతే రఘురామకృష్ణంరాజుకు ప్రజాక్షేత్రంలో తగిన బుద్ధి చెబుతామన్నారు. రాజధానిలో ప్రతి పేదవాడికి ఇళ్ల స్థలాలు ఇచ్చేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. విజయవాడ బార్ అసోసియేషన్‌కు చెందిన పలువురు న్యాయవాదులు బహుజన పరిరక్షణ సమితి దీక్షలకు మద్దతు తెలిపారు. పలువురు మాట్లాడుతూ..దళిత, ముస్లిం మైనార్టీలకు చెందిన లంక, అసైన్డ్ భూములను బెదిరింపులతో కారుచౌకగా కొనుగోలు చేసి పూలింగ్‌కు ఇచ్చి భారీగా లబ్ధి పొందారన్నారు. కాగా, పలువురు మహిళలు ఎంపీ రఘురామకృష్ణంరాజు వ్యాఖ్యలకు నిరసనగా దిష్టిబొమ్మకు చెప్పుల దండవేసి, చెప్పులతో కొట్టి, కాళ్లతో తన్ని దహనం చేశారు. -
ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన మందకృష్ణ
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తాజాగా ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఆర్టీసీ పరిరక్షణ యాత్రను చేపట్టిన ఆయన హైదరాబాద్ నుంచి భద్రాచలం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘నష్టాల్లో ఉన్న ఆర్టీసీ బతకాలంటే ప్రతి ఒక్కరు సొంత వాహనాలను వదిలి ఆర్టీసీలో ప్రయాణించాలి. ఆర్టీసీ సమ్మె కాలంలో కార్మికులకు మద్దతు ఇచ్చినట్లుగానే ఆర్టీసీని బతికించేందుకు ఇప్పుడు బస్సులో ప్రయాణం చేస్తున్నా. లోటు బడ్జెట్ ఉన్న ఆంధ్రాలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసినప్పుడు.. ఇక్కడ ఎందుకు సాధ్యంకాదు. ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి’ అని కోరారు. ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడంలో భాగంగానే సీఎం కేసీఆర్ ఉద్యోగ సంఘాలను నిర్వీర్యం చేస్తున్నారని, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు మంత్రులు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం చేయాలన్న కేసీఆర్ మాటలు ఎక్కడా కార్యరూపం దాల్చలేదని తప్పుబట్టారు. -
అత్యాచారాల్ని కులంతో ముడిపెట్టొద్దు
కవాడిగూడ: మహిళలపై జరిగే అత్యాచారాలు, హత్యలను కులంకోణంతో చూడొద్దని, కేవలం మానవతా దృక్పథంతోనే చూడాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ పేర్కొన్నారు. మహిళలపై అత్యాచారాలు, హత్యలు జరిగినప్పుడు కులమతాలతో సంబంధం లేకుండా బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని గొంతెత్తుతున్న చరిత్ర తమదని ఆయన స్పష్టం చేశారు. దిశ ఘటనకు మూడ్రోజుల ముందు మూడు ఘటనలు జరిగినప్పటికీ వాటిపై చర్యలు చేపట్టకుండా దిశ ఘటనపై మాత్రమే ఓ సామాజికవర్గం ఒత్తిడికి ప్రభుత్వం తలొగ్గిందని, అందుకే పోలీసులు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు చెందిన నిందితులను ఎన్కౌంటర్ చేశారని ఆయన ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో మంగళవారం చేపట్టిన ఛలో ఇందిరాపార్క్ మహాదీక్షకు వివిధ కుల, ప్రజా, విద్యార్థి సంఘాలు హాజరయ్యాయి. ఈ సందర్భంగా మందకృష్ణ మాట్లాడుతూ..దేశాన్ని కుదిపేసిన గాంధీ, ఇందిరా, రాజీవ్‌గాంధీలను హత్యచేసిన నిందితులను చట్టపరంగానే శిక్షించారేతప్ప ఎన్కౌంటర్ చేయలేదని గుర్తుచేశారు. ఉగ్రవాది కసబ్ సజీవంగా దొరికినా కాల్చి చంపలేదెందుకని ప్రశ్నించారు. దేశంలో 15 ఏళ్లలో 3 లక్షల 41 వేలమంది మహిళలపై అత్యాచారాలు జరిగితే అప్పుడు లేని ఎన్కౌంటర్లు దిశా నిందితుల విషయంలో మాత్రమే ఎందుకని ఆయన ప్రశ్నించారు. ఒకే సామాజికవర్గానికి చెందిన ప్రజాప్రతినిధులైన ఉత్తమ్ కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి దిశ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు కానీ అంతకుముందు జరిగిన టేకు లక్ష్మీ, మానస కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదని ప్రశ్నించారు. నెలరోజుల పాటు 119 నియోజకవర్గాల్లో అత్యాచార ఘటనలపై జరుగుతున్న వివక్ష న్యాయాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి చైతన్య పరచాలన్నారు. దీనిపై త్వరలోనే ‘చలో హైదరాబాద్’కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేబీ రాజు అధ్యక్షతన జరిగిన మహాదీక్షలో ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, దాసు సురేశ్, ప్రొఫెసర్ గాలి వినోద్, చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
కెనడా ఫార్ములా అమలుకు సీఎం కుట్ర
సాక్షి, షాద్‌నగర్: కెనడాలో హక్కుల సాధనకు కార్మికులు ఆందోళనకు దిగితే అక్కడి ప్రభుత్వం వారిపై కాల్పులు జరిపిందని, మన ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఆర్టీసీ కార్మికులపై అదే ఫార్ములాను ప్రయోగించేందుకు కుట్రలు పన్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు చేపట్టిన సమ్మె శనివారం 50వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన షాద్‌నగర్‌లో వారికి మద్దతు తెలిపారు. అనంతరం మందకృష్ణ మాట్లాడుతూ.. 1919 సంవత్సరంలో కెనడా దేశంలో కార్మికులు హక్కుల సాధనకు అక్కడి ప్రభుత్వంపై తిరుగుబాటు చేశారని తెలిపారు. ఈక్రమంలో నిరసన చేపట్టిన వేలమంది కార్మికులపై సర్కారు కాల్పులు జరపడంతో ఇద్దరు మృతిచెందగా మిగతా వారు భయంతో స్వచ్ఛందంగా విధుల్లో చేరానని ఆయన గుర్తు చేశారు. తెలంగాణలోనూ అవసరమనుకుంటే కెనడా ఫార్ములాను ప్రయోగించేందుకు సీఎం కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. ఆర్టీసీ కార్మికులు ధైర్యంతో ప్రభుత్వంపై ఆందోళనకు దిగడంతో సమ్మె ముందుకు సాగుతోందని, లేదంటే కెనడా తరహాలోనే ఆందోళన మధ్యలోనే ముగిసిపోయేదని తెలిపారు. తెలంగాణ ఉద్యమంలోనూ ఉమ్మడి రాష్ట్ర సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి కూడా ఇక్కడి ఉద్యోగులను, కార్మికులను సెల్ఫ్ డిస్మిస్ అనలేదని, కానీ తెలంగాణ సీఎం కార్మికులను భయభ్రాంత్రులకు గురిచేస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యమంలో ఆయనతో కలిసి పనిచేసిన ఆర్టీసీ కార్మికుల కష్టాలను నేడు సీఎం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఆర్టీసీ కార్మికులను ప్రజలనుంచి దూరం చేసేందుకు యత్నిస్తున్నారని తెలిపారు. కార్మికుల సమ్మెకు ప్రారంభంలో ఏ పార్టీ మద్దతు ఇవ్వలేదని, ఒక్క ఎమ్మార్పీఎస్ మాత్రమే అండగా ఉందన్నారు. హక్కుల సాధనలో భాగంగా అమరులైన కుటుంబాల్లో మనోధైర్యాన్ని నింపేందుకు కృషిచేస్తామని మంద కృష్ణ పేర్కొన్నారు. పేదలకు ఆర్టీసీ ఎంతో అవసరమని, అలాంటి సంస్థను రక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం దిగివచ్చి కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నర్సింహ్మ, నాయకులు దర్శన్, బుర్ర రాంచంద్రయ్య, ఇటికాల రాజు, శ్రవణ్‌కుమార్, ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ మ్యాకం నర్సింలు, నాయకులు ఎస్పీ రెడ్డి, అర్జున్‌కుమార్, తిరుపతయ్య, రిషికుమారి, సౌభాగ్య, రాధిక తదతరులు ఉన్నారు. -
‘సబ్బండ వర్గాల మహాదీక్ష’ను భగ్నం చేసిన పోలీసులు
హైదరాబాద్ : తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు చేపడుతున్న సమ్మెకు మద్దతుగా, ఆదివారం ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ తలపెట్టిన సబ్బండ వర్గాల మహాదీక్షకు పోలీసులు అను మతి నిరాకరించారు. అయినప్పటికీ మహాదీక్షను విజయవంతం చేయాలని మందకృష్ణ పిలుపునిచ్చారు. దీంతో మహాదీక్షను భగ్నం చేసేందుకు పోలీసులు ఎక్కడికక్కడ అరెస్టులు, గృహ నిర్భంధానికి పూనుకున్నారు. మహాదీక్షకు కేంద్రంగా ఉన్న ఇందిరాపార్కు చౌరస్తాకు నాలుగుదిక్కులా మూడంచెల బందోబస్తు ఏర్పాటు చేశారు. మధ్యాహ్నం 3 గంటలకు ఒకరిద్దరు అశోక్‌నగర్ చౌరస్తా వద్ద నిరసన తెలిపే ప్రయత్నం చేసినా పోలీసులు ఎత్తుకెళ్లి వ్యాన్‌లో పడేశారు. ఆశోక్‌నగర్ చౌరస్తాకు వచ్చిన ఆందోళనకారులను ముందుగానే అరెస్టు చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తరలించారు. సాయంత్రం 6గంటల వరకు ఇందిరాపార్కు రహదారిలో ప్రయాణించడానికి అనుమతి నిరాకరించడంతో ప్రజలు నానా ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రభుత్వం పడిపోతుందా..? ఒకరోజు మహాదీక్షతో ప్రభుత్వం పడిపోతుందా? అని మందకృష్ణ సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. హబ్సిగూడలో మందకృష్ణను అరెస్ట్ చేసిన పోలీసులు ఘట్కేసర్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సాయంత్రం విడుదల అనంతరం ఆయన మాట్లాడుతూ.. 2009లో కేసీఆర్ 10 రోజుల దీక్ష ముగింపు సమయంలో పోలీసులు, అప్పటి సీఎం రోశయ్య ఎంతో గౌరవించారన్నారు. నేడు శాంతియుతంగా చేస్తున్న దీక్షను పోలీసులు అరెస్ట్ చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారన్నారు. మిలియన్ మార్చ్, సడక్ బంద్, సకలజనుల సమ్మె, చలో ట్యాంక్‌బండ్‌లో పలు విగ్రహలు, వాహనాలను ధ్వంసం చేసినా ఆనాటి ఉమ్మడి ఏపీ ప్రభుత్వం ఒక్క ఉద్యోగినీ సస్పెండ్ చేయలేదని చెప్పారు. కోర్టుకు వెళ్లి మహాదీక్షను చేపడతామని, ఆర్టీసీ సమ్మె ముగిసే వరకు ఎమ్మార్పీఎస్ కార్మికుల వెన్నంటే ఉంటుందని చెప్పారు. మందకృష్ణను పీఎస్‌కు తరలిస్తున్న పోలీసులు -
రాజిరెడ్డి దీక్ష భగ్నం.. అశ్వత్థామరెడ్డికి వైద్య పరీక్షలు!
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కార్మికుల సమ్మె 44వ రోజు కొనసాగుతోంది. ఎల్బీనగర్లోని రెడ్డి కాలనీలో ఆర్టీసీ జేఏసీ నేత రాజిరెడ్డి కొనసాగిస్తున్న నిరవధిక దీక్షను పోలీసులు భగ్నం చేశారు. ఇంటి డోర్ పగలగొట్టి మరి ఆయనను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వచ్చే క్రమంలో రాజిరెడ్డి.. ఇంటి డోర్ వేసుకుని దీక్ష కొనసాగించారు. ఇంటి తలుపు పగలగొట్టి రాజిరెడ్డిని అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఈ సమయంలో రెడ్డి కాలనీలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. మరోవైపు ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డి రెండో రోజు దీక్ష కొనసాగిస్తున్నారు. శనివారం నుంచి హస్తినాపూర్‌లో తన నివాసంలో అశ్వత్థామరెడ్డి దీక్ష కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. గృహ నిర్బంధంలో ఉండి దీక్ష చేస్తున్న ఆయనకు వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం, ఆయన ఆరోగ్యం బాగోలేకపోతే పోలీసులు దీక్ష భగ్నం చేసి అరెస్ట్ చేసే అవకాశమున్నట్టు తెలుస్తోంది. అశ్వత్థామరెడ్డి ఇంటి వద్ద పోలీసులు భారీగా మోహరించారు. మందకృష్ణ అరెస్టు.. ఆర్టీసీ సమ్మెకు మద్దతుగా మహాదీక్షకు ఎమ్మార్పీఎస్ పిలుపునిచ్చిన నేపథ్యంలో పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇందిరాపార్క్ దగ్గర ట్రాఫిక్‌ను మళ్లిస్తున్నారు. ప్రత్యేక బృందాలను రంగంలోకి దించి.. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ అరెస్టులు చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ప్రధాన రహదారులపై చెక్‌పోస్టులు కూడా ఏర్పాటు చేశారు. ఇందిరా పార్క్‌కు వస్తున్న నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టులు చేస్తున్నారు. ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ హబ్సిగూడలోని కృష్ణ లాడ్జ్‌లో ఉన్నారనే సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని మందకృష్ణను అరెస్ట్ చేశారు. ఆయనను నాచారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో కేసీఆర్ ప్రభుత్వం అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని మందకృష్ణ విమర్శించారు. ఎట్టిపరిస్థిలోనూ భవిష్యత్తులో దీక్ష చేసి తీరుతామని అన్నారు. ఎమ్మార్పీఎస్ చేపట్టిన మహాదీక్షలో అసాంఘిక శక్తులు చొరబడి విధ్వంసం సృష్టించేందుకు ప్రయత్నిస్తున్నారన్న సమాచారంతో పోలీసులు బలగాలు అప్రమత్తమైనట్టు తెలుస్తోంది. కొనసాగుతున్న అశ్వత్థామరెడ్డి దీక్ష చదవండి: ఆర్టీసీ సమ్మె: ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర ఆర్టీసీ డిపోల వద్ద కార్మికుల ఆందోళన సమ్మెలో భాగంగా కార్మికులు ఆర్టీసీ డిపోల దగ్గర ఆందోళనకు దిగారు. ఖమ్మం డిపో దగ్గర బైఠాయించిన కార్మికులు... బస్సును అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. మెదక్ జిల్లాలోనూ డిపోల దగ్గర ఆందోళన చేస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇక టీఆర్ఎస్ నేత నామా నాగేశ్వరరావు ఇంటి దగ్గర చీపురులతో ఊడ్చి నిరసన వ్యక్తం చేశారు ఆర్టీసీ కార్మికులు. మరోవైపు -
‘కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కింది’
సాక్షి, సంగారెడ్డి: ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే ఆర్టీసీ జేఏసీ నేతలతో చర్చలను విఫలం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆరోపించారు. సంగారెడ్డిలో ఆర్టీసీ కార్మికులకు ఆయన మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..కేసీఆర్‌కు స్వార్థం తలకెక్కి.. ఆర్టీసీ ఆస్తులను అమ్ముకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆర్టీసీని నామరూపాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. హుజూర్నగర్ గెలుపుతో అహంకారం పెంచుకొని ఆర్టీసీ కార్మికులపై నోరుపారేసుకోవడం తగదన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో లేని ఫామ్ హౌస్..తెలంగాణ వచ్చాక ఎలా వచ్చిందని ప్రశ్నించారు. ఒక పక్క అప్పుల రాష్ట్రం అంటూనే.. మరోపక్క కుటుంబ ఆస్తులను పెంచుకున్నారని ధ్వజమెత్తారు. కేసీఆర్ అక్రమ ఆస్తులకు బలమైన వనరులు ప్రాజెక్టులే అని.. అందులో కాళేశ్వరం ప్రాజెక్టు మొదటిదని మందకృష్ణ ఆరోపించారు. కేసీఆర్ అక్రమ సంపాదనకు వేరేదారి లేక ఇప్పుడు ఆర్టీసీని అమ్ముకోవాలని చూస్తున్నారని ధ్వజమెత్తారు. తెలంగాణ సమాజం పూర్తి మద్దతు ఆర్టీసీ కార్మికులకు ఉందని, కార్మికులు అధైర్యపడొద్దని పిలుపునిచ్చారు. -
మంత్రివర్గంలో సామాజిక న్యాయమేది?
సాక్షి, కాజీపేట : కేసీఆర్ మంత్రి వర్గంలో వెలమ, రెడ్డి వర్గాలకే తప్ప మిగతా వర్గాలకు చోటు ఇవ్వకుండా సామాజిక న్యాయాన్ని విస్మరించారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. హన్మకొండ వడ్డేపల్లిలోని విద్యుత్ భవన్లో శుక్రవారం ఏర్పాటు సమావేశంలో మంద కృష్ణ మాట్లాడా రు. కేసీఆర్ తన మంత్రి వర్గంలో మాల, గౌడ, యాదవ, ముదిరాజ్, కాపు, ముస్లిం వర్గాలకు ఒక్కో సీటు కేటాయించడం ద్వారా ద్వంద్వనీతి అవలంబించారన్నారు. మాదిగ, ఉపకులాలతో పాటు క్యాబినెట్లో ప్రాతినిధ్యం లేని బీసీ, ఎస్టీ, అగ్రకుల వర్గాలకు స్థానం కల్పించేలా పోరాడుతామని తెలిపారు. సెప్టెంబర్ 22న హన్మకొండలోని కేడీసీ గ్రౌండ్లో నిర్వహించే మహాదీక్షకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు పలకాలని కోరా రు. అనంతరం వాల్‌పోస్టర్లు ఆవిష్కరించారు. ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు రాగటి సత్యం, ఎమ్మెస్పీ జాతీయ అధికార ప్రతినిధి తీగల ప్రదీప్‌గౌడ్‌తో బీఎన్.రమేష్, తిప్పారపు లక్ష్మణ్, బొడ్డు దయాకర్, మంద రాజు, ఈర్ల కుమార్ తదితరులు పాల్గొన్నారు. పోరాటాలతోనే సమస్యల పరిష్కారం కేయూ క్యాంపస్: ఉన్నతవిద్యపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. మాదిగల అస్తిత్వం కోసం, సామాజిక సమస్యలపై పోరాటాలకు ఎమ్మార్పీఎస్ కేంద్ర బిందువుగా నిలుస్తోందని చెప్పారు. కేయూకామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ కళాశాల సెమినార్‌హాల్‌లో శుక్రవారం మాదిగ టీచర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యాన మాదిగ అధ్యాపకుల రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో మంద కృష్ణ మాట్లాడుతూ యూనివర్సిటీల్లో రెగ్యులర్ అధ్యాపకుల పోస్టులు భర్తీ చేయడంతో పాటు కాంట్రాక్టు, పార్ట్‌టైం లెక్చరర్లను రెగ్యులరైజ్ చేయాలన్నారు. ఎంటీఎఫ్ బాధ్యు డు డాక్టర్ పి.శ్రీనివాస్ అధ్యక్షతన జరిగిన సదస్సులో కేయూ అడ్మిషన్ల డైరెక్టర్ టి.మనోహర్, డెవలప్మెంట్ ఆఫీసర్ వీ.రాంచంద్రం, ఎంటీఎఫ్ కోఆర్డినేటర్ డాక్టర్ వెంకట్‌మాదిగ, డాక్టర్ సమ్మయ్య, డాక్టర్ సుదర్శన్, డాక్టర్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
21న హన్మకొండలో ‘ఆవేదన దీక్ష’: మందకృష్ణ
సాక్షి, వరంగల్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల చేపట్టిన మంత్రివర్గ విస్తరణలో 12శాతం ఉన్న మాదిగలకు స్థానం కల్పిచకపోవడం.. మాదిగల ఆత్మ గౌరవాన్ని దెబ్బతియ్యడమేనని ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ...ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మండిపడ్డారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ పాలన మొదలైనప్పటి నుంచి మాదిగ, ఉప కులాలపై వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం మాదిగ ఉప కులాలపై నియంతలా వ్యవహరిస్తోందని విమర్శించారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి గతంలో పని చేసిన సీనియర్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపడం మాదిగలపై వివక్ష చూపడం కదా? అని నిలదీశారు. కాగా 12 శాతం ఉన్న మాదిగ, ఉప కులాలకు ఒక్క మంత్రి పదవి ఇవ్వలేదని.. కేవలం ఐదు శాతం ఉన్న రెడ్డి సామాజిక వర్గానికి ఆరు మంత్రి పదవులు కేటాయించడంపై కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. బుధవారం నుంచి ఈ నెల15 వరకు తెలంగాణలోని అన్ని గ్రామ పంచాయితీల ముందు, 16న తహశీల్దార్ కార్యాలయల ముందు నిరసన దీక్షలు చేపడతామన్నారు. 18న అన్ని మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో పెద్దఎత్తున రాస్తారోకోలు నిర్వహిస్తామన్నారు. దీంతోపాటు 21న వరంగల్ జిల్లాలోని హన్మకొండ కేడీసీ మైదానంలో మాదిగలు, ఉప కులాలపై ప్రభుత్వం చూపించే వివక్షపై ఆవేదన వ్యక్తం చేసేందుకు ‘ఆవేదన దీక్ష’ చేస్తామన్నారు. ఈ కార్యకమం కోసం ‘చలో వరంగల్’కి పిలుపునిస్తున్నామని తెలిపారు. ఈ దీక్షలో అన్ని వర్గాల ప్రజలు పాల్గొని మద్దతు తెలుపాలి మందకృష్ణ కోరారు. -
ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు
సాక్షి, విజయవాడ: ఎస్సీ వర్గీకరణ అంశాన్ని రాజకీయం చేసి.. పడ్బం గడుపుకోవాలని మందకృష్ణ మాదిగ చూస్తున్నారని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు పండు అశోక్‌కుమార్ విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌కు మందకృష్ణ బద్ధ శత్రువు అని ఆయన మండిపడ్డారు. అన్నదమ్ముల్లా ఉన్న మాల, మాదిగల మధ్య చంద్రబాబు చిచ్చు పెట్టారని గుమ్మపు సూర్యప్రసాద్ మండిపడ్డారు. సుప్రీంకోర్టు తీర్పును గౌరవించి.. సీఎంస వైఎస్ జగన్మోహన్రెడ్డి మాట్లాడారని, మందకృష్ణ మాటలకు ఎవరు భయపడబోరని ఆయన పేర్కొన్నారు. మందకృష్ణది హేయమైన చర్య.. మందకృష్ణ మాదిగపై ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు ఫైర్ అయ్యారు. ఎస్సీ వర్గీకరణ ఉద్యమాన్ని మందకృష్ణ తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వంతో చర్చలు జరపకుండా 30న అసెంబ్లీ ముట్టడికి పిలుపునివ్వడం హేయమైన చర్య అని అన్నారు. అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది ఎస్సీ వర్గీకరణ కోసం కాదని, సీఎం వైఎస్ జగన్‌ను బ్లాక్మెయిల్ చేసేందుకేనని పేరుపోగు వెంకటేశ్వరరావు మండిపడ్డారు. -
చీటర్ బాబుకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు
హైదరాబాద్: ఆంధ్ర ప్రదేశ్‌లోని అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిన చంద్రబాబు నాయుడు నంబర్ వన్ చీటర్ అని, అందుకే ప్రజలు తగిన రీతిలో ఆయనకు బుద్ధి చెప్పారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ధ్వజమెత్తారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఎమ్మార్పీఎస్ కేంద్ర కార్యాలయంలో విలేకరుల తో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హమీలను చంద్రబాబు విస్మరించడంతో ఎమ్మార్పీఎస్ టీడీపీని ఓడించడమే లక్ష్యంగా పనిచేసింద న్నారు. చంద్రబాబు మోసాలతో మాదిగ పల్లెలు ఆ పార్టీకి దూరమైనాయని తెలిపారు. వైఎస్ జగన్ ఎస్సీ వర్గీకరణ పట్ల మౌనంగా ఉండ టంతో తమ వర్గ ప్రజలకు నోటాకు ఓటు వేయా లని ప్రచారం చేశామని, అయినా టీడీపీపై ఉన్న కోపంతో వారు వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని తెలిపారు. ఈ నెల 27, 28 తేదీలలో చిత్తూరు జిల్లా హార్సిలీహిల్స్‌లో జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న వైఎస్ జగన్‌కు శభాకాంక్షలు తెలిపారు. -
ధర్నాకు అనుమతిస్తారో లేదో చెప్పండి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద మే 7న మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) మహాధర్నా నిర్వహించుకోవడానికి అనుమతినిస్తారో లేదో తెలియచేయాలని హైకోర్టు శుక్రవా రం తెలంగాణ పోలీసులను ఆదేశించింది. తదుపరి విచారణను సోమవారానికి (29కి) వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 27న తాము నిర్వహించతలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై శుక్రవారం జస్టిస్ షావిలి విచారణ జరిపారు. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది ఎన్.హరినాథ్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. శాంతియుతంగా ధర్నా చేసుకునేందుకు పోలీసులు అనుమతినివ్వడం లేదన్నారు. అనుమతి కోసం తాము పెట్టుకున్న దరఖాస్తులను తిరస్కరించారని తెలిపారు. ధర్నా సందర్భంగా అవాంఛనీయ ఘటనలు జరిగే బాధ్యత వహిస్తామంటూ పిటిషనర్‌ను ఈ కోర్టు ముందు అఫిడవిట్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది ఎస్.శరత్‌కుమార్ కోరారు. సంబంధిత అధికారి ముందు అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఆదేశాలు ఇస్తానని న్యాయమూర్తి చెప్పగా, అధికారి ముందు దాఖలు చేసే అఫిడవిట్ అమలుకు నోచుకోదని తెలిపారు. హామీ ఇచ్చి.. వాటిని ఉల్లంఘిం చిన ఘటనలు గతంలో అనేకం ఉన్నాయని ప్రస్తావించారు. ఎంత మంది ఈ ధర్నాకు హాజరవుతారు.. ఏ కారణంతో ఈ ధర్నా చేస్తున్నారు అన్న వివరాలను పిటిషనర్ చెప్పలేదని తెలిపారు. దీనికి హరినాథ్‌రెడ్డి స్పందిస్తూ.. ట్యాంక్‌బండ్‌పై 125 అడుగుల అంబేడ్క ర్ విగ్రహం పెడతామని ప్రభుత్వం హామీ ఇచ్చిందని, ఆ హామీని నెరవేర్చనందుకు నిరసనగా ఈ ధర్నా చేస్తున్నామని చెప్పారు. ఈ శనివారం నిర్వహించే ధర్నాకు ఇంత తక్కువ వ్యవధిలో తగిన భద్రతా ఏర్పాట్లు చేయలేమని శరత్ తెలిపారు. అయితే మే 1 లేదా 7న ధర్నా నిర్వహించుకుంటామని, దీనికి అనుమతినిచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. -
ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసుల్ని ఆదేశించండి
సాక్షి, హైదరాబాద్: ఇందిరాపార్కు ధర్నాచౌక్ వద్ద ఈ నెల 27న తాము నిర్వహించ తలపెట్టిన ధర్నాకు పోలీసులు అనుమతి నిరాకరించడాన్ని సవాలు చేస్తూ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) అధ్యక్షుడు బి.రమేశ్‌బాబు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, హైదరాబాద్ పోలీస్ కమిషనర్, సెంట్రల్ జోన్ డీసీపీలను ప్రతివాదులుగా పేర్కొన్నారు. శాంతియుతంగా నిర్వహించతలపెట్టిన ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని పిటిషనర్ కోర్టును కోరారు. హనుమ జయంతి సందర్భంగా శోభా యాత్ర, జీసస్కు సంబంధించి మరో కార్యక్రమం ఉందన్న కారణంతో అనుమతి నిరాకరించారని తెలిపారు. తమ సమస్యలను ప్రజల దృష్టికి తీసుకురావాలన్న ఉద్దేశంతో ఈ ధర్నా చేస్తున్నామని, మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ధర్నా చేసుకుంటామని తెలిపామని, అయినా పోలీసులు అంగీకరించలేదన్నారు. అందువల్ల ఈ వ్యవహారంలో జోక్యం చేసుకుని తమ ధర్నాకు అనుమతినిచ్చేలా పోలీసులను ఆదేశించాలని ఆయన కోర్టును అభ్యర్థించారు. -
15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్‌కు మద్దతు
జడ్చర్ల టౌన్: రాష్ట్రంలో ఈ నెల 11న జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తాము నాగర్‌కర్నూల్, సికింద్రాబాద్ మినహా రాష్ట్రవ్యాప్తంగా మిగిలిన 15 ఎంపీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇస్తున్నామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. శనివారం సాయంత్రం జడ్చర్లలోని చంద్రగార్డెన్‌లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీపై విశ్వాసం ఉంచి పార్లమెంట్ ఎన్నికల్లో అసెంబ్లీ ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామన్నారు. అయితే సికింద్రాబాద్ స్థానంలో బీజేపీ నుంచి కిషన్‌రెడ్డి పోటీలో ఉన్నారని, ఆయన తమ ఉద్యమానికి ముందు నుంచి మద్దతు పలకడం వల్ల ఆయనకు మద్దతు ఇస్తున్నామన్నారు. పార్లమెంట్ పరిధిలో ఎమ్మార్పీఎస్ తరపున కిషన్‌రెడ్డి గెలుపు కోసం పనిచేస్తామన్నారు. అలాగే నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానం నుంచి మాదిగ వర్గానికి చెందిన సిట్టింగ్ ఎంపీ నంది ఎల్లయ్యను తప్పించి మాల వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇచ్చినందున మద్దతు ఇవ్వడం లేదన్నారు. ప్రస్తుతం ఏపీ ఎన్నికల్లో నిమగ్నమైనందున ఆలస్యంగా వచ్చి ముఖ్యకార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకున్న అనంతరం ప్రకటన చేస్తున్నామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన వ్యక్తి ఎంపీగా ఎలా గెలుస్తారని ప్రశ్నించారు. ఈ కారణంగానే తాము నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానంలో మల్లు రవికి వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించామన్నారు. గతంలో మందా జగన్నాథం, నంది ఎల్లయ్య వర్గీకరణ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావించారని, అలాంటి స్థానం నుంచి తాము మల్లు రవికి ఎలా మద్దతు ఇస్తామని ప్రశ్నించారు. ఆ పార్లమెంట్లో బరిలో ఉన్న ఇద్దరు మాదిగల్లో ఎవరికి మద్దతు ఇస్తామనేది ఈ నెల 9న ప్రకటిస్తామన్నారు. ఏపీలో తాము నోటాకు ఓటేస్తున్నామని, అన్ని పార్టీలు తమను మోసం చేసినందుకే అలా చేస్తున్నామని ప్రకటించారు. అంతకు ముందు ఆయన మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్‌లోని ముఖ్య నాయకులతో విడివిడిగా సమావేశం నిర్వహించి అభిప్రాయాలు తెలుసుకున్నారు. సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జంగయ్య, వెంకటయ్య, నాగరాజు, బాలరాజు, శ్రీను, జాతీయ నాయకులు నిరంజన్, శివ, విష్ణు, విల్సన్ తదితరులు పాల్గొన్నారు. -
కాంగ్రెస్ పార్టీకే మా మద్దతు : మందకృష్ట
సాక్షి, భువనగిరి జిల్లా: వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ కాంగ్రెస్‌కు పూర్తి మద్దతు ఇస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ అన్నారు. సోమవారం ఆయన భువనగిరిలో ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ... గత అసెంబ్లి ఎన్నికల్లో కాంగ్రెస్ మద్దతు ఇచ్చిన విదంగానే లోక్‌సభకు కూడా మద్దతు ఇస్తున్నామన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే మాదిగ వర్గీకరణ జరుగుతుందనే నమ్మకంతో మద్దతు ప్రకటించామని తెలిపారు. రాష్ట్రంలో 17 లోక్‌సభ స్థానాలకు సంబంధించి సికింద్రాబాద్, నాగర్ కర్నూల్లో కాంగ్రెసు మద్దతు ఇవ్వడం లేదన్నారు. బీజేపీ నేత కిషన్ రెడ్డి మాదిగ వర్గానికి అండగా నిలిచిన కారణంగా ఆయనకు మా సంపూర్ణ మద్దతు ఇస్తున్నామని చెప్పారు. నాగర్ కర్నూల్లో ఎంపీగా ఆరు సార్లు గెలిచిన నంది ఎల్లయ్యను కాదని మాల సమాజానికి వర్గానికి చెందిన మల్లు రవికి టికెట్ ఇవ్వడంతో అక్కడ కాంగ్రెసు కాదని నిలబడ్డ వారిలో మిగతా పార్టీలకు మద్దతు ఇస్తామని అన్నారు. భువనగిరి లోక్‌సభలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు. కోమటిరెడ్డి తెలంగాణ కోసం మంత్రి పదవిని వదిలి తెలంగాణ రాష్ట్రం కోసం పోరాడిన వ్యక్తి తెలిపారు. -
చంద్రబాబుపై మందకృష్ణ ఫైర్
సాక్షి, విజయవాడ : సీఎం చంద్రబాబు నాయుడు మాదిగలను నమ్మించి మోసం చేశారని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిలో విశ్వరూప మహాసభకు అనుమతి నిరాకరణను ఖండిస్తున్నామని తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ... మాదిగలకు నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు ఓటు ద్వారా రాజకీయ శిక్ష వేస్తామని పేర్కొన్నారు. సీట్ల కేటాయింపులో టీడీపీ మాలలకే పెద్ద పీట వేసిందని మండిపడ్డారు. దళితులు విషయంలో నిర్లక్ష్యం చూపుతున్న చంద్రబాబును.. రానున్న ఎన్నికల్లో గద్దె దించి తగిన బుద్ధి చెపుతామని హెచ్చరించారు. ఈనెల (మార్చి) 29న తమ రాజకీయ భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామని మందకృష్ణ తెలిపారు. కాగా టీడీపీ హయాంలో దళితులు తీవ్ర అవమానాలకు గురైన సంగతి తెలిసిందే. ‘ఎవరైనా దళితులుగా పుట్టాలని కోరుకుంటారా’ అంటూ ఏకంగా సీఎం చంద్రబాబు వ్యాఖ్యలు చేయగా.. ‘దళితులు మీకెందుకు రా రాజకీయాలు’ అంటూ ఆ పార్టీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అసభ్యకర పదజాలంతో దూషించారు. ఈ విధంగా అధికార పార్టీ అహంకారానికి తార్కాణంగా నిలిచిన ఘటనలు ఇంకెన్నో ఉన్నాయి. -
ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ మద్దతు
సాక్షి, హైదరాబాద్: ప్రజాకూటమికి ఎమ్మార్పీఎస్ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందిం చింది. కేంద్రంలో అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని హామీ ఇచ్చింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి ఆర్.సి.కుంతియా ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షు డు మంద కృష్ణమాదిగతో జరిపిన చర్చలు సఫలీకృతమయ్యాయి. దీంతో ఎమ్మార్పీఎస్ మద్దతు ప్రకటించడమే కాకుండా ప్రజాకూటమి అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు సిద్ధమైంది. వచ్చే లోక్‌సభ, రాజ్యసభ సమావేశాల్లో వర్గీకరణబిల్లు ప్రవేశపెట్టి ఏఐసీసీ అధినేత రాహుల్‌గాంధీతో ఒత్తిడి తేవాలనే ప్రతిపాదనకు కాంగ్రెస్ సానుకూలంగా స్పందించినందుకు మందకృష్ణ కృతజ్ఞతలు తెలిపారు. సోమవారం ఇక్కడ గాంధీభవన్‌లో ఉత్తమ్, కుంతియాతో కలిసి మందకృష్ణ విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణపై మాట తప్పారని, అఖిలపక్ష కమిటీని ఢిల్లీకి తీసుకెళ్లకుండా మోసం చేశారని ధ్వజమెత్తారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ దొంగదీక్షను ప్రశ్నించినందుకు కక్షగట్టి తనను జైల్లో పెట్టారని విమర్శించారు. తెలంగాణకు స్వేచ్ఛ ను ప్రసాదించిన యూపీఏ చైర్పర్సన్ సోనియాగాంధీపై కేసీఆర్ చేసిన విమర్శలను ఆయన తీవ్రంగా ఖండించారు. సోనియా ప్రశ్నలకు కేసీఆర్ సమాధానం చెప్పకుండా హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. సూట్‌కేసులు కావాలనుకుంటే సోనియా తెలంగాణను ఇచ్చేదికాదని, కేసీఆర్‌కు సంచులు కావాలి కాబట్టే, సూట్కేసులని మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. ‘కేసీఆర్‌కు ఆంధ్రా కాంట్రాక్టర్లు ఎక్కువ సంచులు ఇస్తారు, కాబట్టి వాళ్లకే కాంట్రాక్టులు కట్టబెట్టారు’ అని విమర్శించారు. కేసీఆర్ అమరావతికి వెళ్లినప్పుడు చంద్రబాబు ఆంధ్రావాడని గుర్తుకు రాలేదా.. అని ప్రశ్నించారు. కేసీఆర్‌ను ఓడిం చడానికి ఎమ్మార్పీఎస్ పోరాటం కొనసాగుతుందన్నారు. తెలంగాణలో ప్రజాస్వామ్యం బతకాలంటే కేసీఆర్ ఓడిపోవాలని స్పష్టం చేశారు కేసీఆర్ దళిత ద్రోహి: ఉత్తమ్ కేసీఆర్ దళితద్రోహి అని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎస్సీలను సులువుగా మోసం చేయడం కేసీఆర్‌కు తెలుసని అన్నారు. దళితులను నాలుగున్నరేళ్లు మోసం చేశారని ఆరోపించారు. తెలంగాణలో మాదిగ సామాజికవర్గం ఎక్కువగా ఉందని, ఆ వర్గానికి చెందిన రాజయ్యను ఉప ముఖ్యమంత్రి హోదా నుండి ఎందుకు తొలగించారో ఇప్పటికీ తెలియదన్నారు. సిరిసిల్లలో దళితులను హింసించిన కేసీఆర్‌ను దళితులు విస్మరించారని పేర్కొన్నారు. మందకృష్ణ పోరాటం తెలంగాణ సమాజానికి తెలుసని, ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. వర్గీకరణ కోసం గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అసెంబ్లీలో తీర్మానం చేసిందన్నారు. ప్రజాకూటమి మేనిఫెస్టోలో ఎస్సీ వర్గీకరణ అనేది ప్రాధాన్యత అంశంగా మారిందన్నారు. భవిష్యత్తులో మాదిగలకు రాజ్యసభ, ఎమ్మెల్సీ, ఇతర నామిటెడ్ పోస్టులు ఇచ్చి గౌరవిస్తామని హామీనిచ్చారు. కేసీఆర్‌ను గద్దె దింపితేనే రాష్ట్రంలో ప్రజా స్వామ్యం బతుకుతుందన్నారు. అధికారంలోకి రాగానే వర్గీకరణ బిల్లు కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే పార్లమెం ట్లో వర్గీకరణ బిల్లు ప్రవేశపెడతామని కుంతియా స్పష్టమైన హామీ ఇచ్చారు. ఎమ్మార్పీఎస్ ప్రతిపాదనలకు పూర్తి మద్దతు ప్రకటించారు. ప్రజాకూటమిలోకి మందకృష్ణను సాదరంగా ఆహ్వానించారు. హక్కుల కోసం పోరాడుతున్న ఆయనను కేసీఆర్ జైల్లో పెట్టడం దారుణమన్నారు. -
వర్గీకరణపై రూట్‌మ్యాప్ ప్రకటించాలి
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఎన్నికల సందర్భంగానే ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కాంగ్రెస్ ప్రజాఫ్రంట్ స్పష్టమైన రూట్‌మ్యాప్‌ను ప్రకటించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విజ్ఞప్తి చేశారు. దీంతోపాటు తమ డిమాండ్‌ను చిత్తశుద్ధితో ముందు కు తీసుకెళ్లడానికి వీలుగా రాజ్యసభ, లోక్‌సభలతోపాటు ఎమ్మెల్సీగానూ ఎమ్మార్పీఎస్ ప్రతినిధులకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ అంశాలపై స్పష్టమైన హామీ ఇస్తే కాంగ్రెస్ కూటమికి పూర్తి మద్దతు ఇస్తామని చెప్పారు. ఈ మేరకు రాష్ట్ర పార్టీ నాయకత్వాన్ని కలిసి వినతిపత్రాన్ని సమర్పించినట్లు చెప్పా రు. శనివారం మగ్దూంభవన్‌లో ఈ అంశంపై టీజేఎ స్ అధ్యక్షుడు కోదండరాం, టీటీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, సీపీఐ నేత పల్లా వెంకటరెడ్డిలతో సమావేశమయ్యాక ఆయన విలేకరులతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో తమ కూటమికి మద్దతివ్వాలని కాంగ్రెస్ నేతలు కోరారని, ఈ నేపథ్యంలో తమ చిరకాల వర్గీకరణ డిమాండ్‌పై స్పష్టమైన హామీ, చట్టసభల్లో ప్రాతినిధ్యంపై టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి తమ ప్రతిపాదన లు సమర్పించామని చెప్పారు. కూటమిలో ని భాగస్వామ్య పార్టీల మేనిఫెస్టోలతో పాటు ప్రజాఫ్రంట్ మేనిఫెస్టోలోనూ వర్గీకరణపై ఒక రోడ్‌మ్యాప్ ఇచ్చి ఎప్పట్లోగా పరిష్కరి స్తారో తెలపాలని కోరామన్నారు. ఈ అంశాన్ని పరి శీలిస్తామని, దీనిని జాతీయ పార్టీ దృష్టికి తీసుకెళ్తామని కాంగ్రెస్ నాయకులు చెప్పారని తెలిపారు. వర్గీకరణకు అన్ని పార్టీలు మద్దతు ఇస్తున్నా దానిపై ప్రభుత్వపరంగా నిర్ణయం తీసుకోవడంలో జాప్యం జరుగుతోందన్నారు. కాగా, ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ పూర్తిగా న్యాయమైన డిమాండ్ అని, దీనికి తమ మద్దతు ఉంటుందని కోదండరాం తెలిపారు. గతం లో వర్గీకరణ అమలుకు టీడీపీ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, ఇప్పుడు కూడా దీని అమలుకు పూర్తి గా సహకరిస్తుందని రమణ చెప్పారు. ఈ డిమాండ్‌కు తమ జాతీయ పార్టీ నాయకులు మద్దతు ఇచ్చారని, దీనిపై ఎమ్మార్పీఎస్‌కు తమ పూర్తి మద్దతు ఉంటుం దని పల్లా వెంకటరెడ్డి పేర్కొన్నారు. -
కేసీఆర్ మళ్లీ వస్తే ప్రజాస్వామ్యం ఖూనీ
హైదరాబాద్: వచ్చే ఎన్నిక ల్లో కేసీఆర్‌కు మళ్లీ పట్టం కడితే ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా ఖూనీ చేస్తారని, ఇప్పటికే రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ప్రమాదకర ‡పరిస్థితుల్లో ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ విమర్శించారు. నిరుద్యోగులు, విద్యార్థు లు, మహిళలు, దళితులందరికీ అన్యాయం చేసిన సీఎంకు తిరిగి ఆశీర్వదించమని అడిగే నైతికహక్కు ఉందా? అని ప్రశ్నించారు. బుధవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ మోసాలు, వైఫల్యాలు, అణచివేతలపై కొంగరకలాన్‌లోనే నవంబర్ 6న ‘ప్రజా ఆగ్రహ సభ’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సభకు బీజేపీ, టీఆర్ఎస్ మినహా దేశంలోని అన్ని పార్టీల ప్రధాన నాయకులను పిలవనున్నట్లు చెప్పారు. ఈ సభ సన్నాహకాల్లో భాగంగా ఈ నెల 9న ఎమ్మార్పీఎస్ జాతీయస్థాయి సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపారు. టీఆర్ఎస్ అత్యంత పెద్ద సభగా ప్రకటించుకున్న వరంగల్ సభకు 10 నుంచి 15 లక్షలు వరకు ప్రజలు రాగా, కొంగర్‌కలాన్ సభకు 5 లక్షల మంది రాలేదన్నారు. -
టీఆర్ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్‌పై ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. సోమాజీగూడ ప్రెస్ క్లబ్లో విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రభుత్వం మాదిగలను చిన్న చూపు చూస్తున్నదని ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చిత్తశుద్ధి లేదని వ్యాఖ్యానించారు.బీజేపీ జాతీయ నేతలు తెలంగాణకు ఎవరు వచ్చినా మా నిరసన తెలియజేస్తామని వెల్లడించారు. కేసీఆర్ నిండు సభలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేదని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్ కార్యకర్త భారతి మాదిగ, హైదరాబాద్ కలెక్టరేట్ కార్యాలయం ముందు చనిపోయి 10 నెలలు అయింది.. ఇప్పటి వరకు ఆమె కుటుంబానికి ఇస్తానన్న రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా మాట్లాడుతూ..‘ కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీ తీసుకుపోతా అన్నారు. 10 నెలలు కావొస్తున్నా ఇప్పటి వరకూ ఊసే లేదు. కేసీఆర్ మాటాల మనిషి..చేతల మనిషి కాదు. సామాజిక వర్గాల కోణంలో కేసీఆర్ ఇచ్చిన ఏ హామీ నెరవేరలేదు. పారిశుద్ధ్య కార్మికులను రెగ్యులర్ చేయాలి. మాదిగలు చేసే కులవృత్తుల్లో లెదర్ పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వం ఏంచేయలేదు. చెప్పులు కుట్టే కార్మికులకు పింఛన్ ఇచ్చారా? డప్పులు కొట్టే కార్మికులకు పింఛన్ ఇచ్చారా? కేసీఆర్ ప్రభుత్వంలో అవమానకరంగా భర్తరఫ్ చేసింది ఒక్క మాదిగ సామాజికవర్గానికి చెందిన రాజయ్యనే. రామగుండం మేయర్ మాదిగ కాబట్టే కావాలని అతడిపై అవిశ్వాసం పెట్టారు. మాదిగ సామాజిక వర్గానికి స్థలం లేదు..భవనం లేదు. మాదిగ వర్గంపై వివక్ష చూపెడుతున్నా’రని విమర్శించారు. ‘దళితులకు మూడు ఎకరాల భూమి ఎక్కడ?. మంత్రివర్గంలో మాదిగలకు నిజమైన ప్రాతినిథ్యం లేదు. టీఆర్ఎస్లో ఉన్న 16 మంది దళిత ఎమ్మెల్యేల్లో ఏ ఒక్కరికీ మంత్రి పదవి ఇవ్వలేదు. దళితులకు ఒక శాతం కూడా భూపంపిణీ జరగలేదు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు పక్కదారి పట్టించారు. ఎస్టీలకు 12 శాతం రిజర్వేషన్ ఇచ్చారా? టీఆర్ఎస్ మేనిఫెస్టోకు విలువ లేదు. కేసీఆర్ ప్రభుత్వంలో మహిళలకు స్థానం లేకుండా చేశారు. తెలంగాణ ఉద్యమంలో మహిళలు పోరాడారు. వారిని ప్రభుత్వం గుర్తించడం లేదు. తెలంగాణ మహిళలకు అవమానం మిగిలింది..గౌరవం దక్కలేద’ని టీఆర్ఎస్ను, కేసీఆర్‌ను తీవ్రంగా దుయ్యబట్టారు. నవంబర్ 6న ప్రజాగ్రహ సభ ఉంటుందని, టీఆర్ఎస్, బీజేపీ మినహా అన్ని పార్టీలను ఆహ్వానిస్తామని ఈ సందర్భంగా మంద కృష్ణ తెలిపారు. -
16, 17 తేదీల్లో టీఎమ్మార్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు
హైదరాబాద్: మహబూబ్‌నగర్‌లో ఈ నెల 16, 17వ తేదీల్లో టీఎమ్మార్పీఎస్ రాజకీయ అవగాహన సదస్సు నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్, వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ తెలిపారు. సోమవారం విద్యానగర్‌లోని రాష్ట్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. 2019 ఎన్నికలే ప్రామాణికంగా అన్ని పార్లమెంట్, అసెంబ్లీ, నియోజకవర్గాలలో నిర్మాణపరమైన కార్యాచరణను ముందుకు తీసుకెళ్ళేందుకు కార్యకర్తలను సిద్ధం చేయడమే వారి లక్ష్యం అన్నారు. 23 సంవత్సరాల ఎమ్మార్పీఎస్ ఉద్యమాన్ని రాజకీయాల వైపు మళ్ళించడంలో అనేక లోటుపాట్లు జరిగాయన్నారు. బహుజన రాజకీయాలపై పట్టు సాధించడానికి అధిక శాతం ఉన్న అణగారిన కులాలను చైతన్యం చేస్తూ, సామాజిక తెలంగాణ సాధించే దిశగా ముందుకు వెళతామన్నారు. కార్యక్రమానికి ప్రముఖ మేధావులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో నాయకులు మేకల నరేందర్, నాగారం బాబు, బి. చంద్రయ్య, కె.వెంకట్, రమేశ్, జాన్సీ, శ్యాంరావు, గోవర్థన్ తదితరులు పాల్గొన్నారు. -
కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకే ‘సింహగర్జన’
హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలు జరుగుతున్నాయని, ఆ కుట్రలకు కేంద్ర ప్రభుత్వం నాయకత్వం వహిస్తే దాన్ని సుప్రీంకోర్టు అమలు పరుస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. కేంద్రం కుట్రలను తిప్పికొట్టేందుకు దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తుందని, అది తీవ్రరూపం దాల్చకముందే దిద్దుబాటుచర్యలు చేపట్టాలని ఆయన హితవు పలికారు. అట్రాసిటీ చట్టాన్ని నిర్వీర్యం చేసే కుట్రలను తిప్పికొట్టేందుకు ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక కమిటీ ఆధ్వర్యంలో ఆగస్టు 8న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద దళిత గిరిజనులతో ‘సింహగర్జన’నిర్వహించనున్నట్లు తెలిపారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం చేసిన తప్పును వెంటనే సరిదిద్దుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ఓటు రూపంలో కూడా మా నిరసన తెలుపుతామ ని హెచ్చరించారు. సింహగర్జనకు బీజేపీని మినహా అన్ని జాతీయ, ప్రాంతీయ పార్టీల నాయకులను ఒకే వేదికపైకి రప్పించే యత్నాలు చేస్తున్నామన్నారు. తెలంగాణ మాల మహానాడు అధ్యక్షుడు, కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ.. చట్టం నిర్వీర్యం అయ్యాక దళితులపై దాడులు, హత్యలు పెరిగాయన్నారు. కొత్తగా చట్టాలు రూపొందించాల్సిన అవసరం లేదని ఉన్న చట్టాన్నే పటిష్టంగా అమలు చేసి దాన్ని 9వ షెడ్యూల్డ్‌లో పొందుపర్చాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో లంబాడీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు బెల్లయ్య నాయక్, ఎరుకల హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు వలిగి ప్రభాకర్, మాల మహానాడు జాతీయ సెక్రటరీ జనరల్ జంగా శ్రీనివాస్, వివిధ సంఘాల నాయకులు జేబీ రాజు, బాలరాజు, తాటికొండ శ్యామ్‌లాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ ఆవిర్భావ వేడుకలు
ఆసిఫాబాద్‌అర్బన్: ఎమ్మార్పీఎస్ 25వ ఆవిర్భావ వేడుకలను జిల్లా కేంద్రంలోని డాక్టర్ బాబూ జగ్జీవన్ చౌక్ వద్ద శనివారం జెండా ఆవిష్కరించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పొన్నాల నారాయణ మాట్లాడుతూ తరతరాల నుంచి మాదిగ జాతి అన్ని విధాలుగా నష్టపోతుందని, మంద కృష్ణ మాదిగ ఎన్నో ఉద్యమాలు చేస్తున్నా సమస్యలు మాత్రం తీరడంలేదన్నారు. నేటికీ ఉద్యమమే ఊపిరిగా ముందుకు సాగుతున్నామన్నారు. మాదిగల సమస్యలు తీరాలంటే మంద కృష్ణ మాదిగ చేపడుతున్న ఉద్యమంలో మాదిగలు పెద్ద ఎత్తున పాల్గొని, ఉద్యమాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ప్రధానకార్యదర్శి ఇప్ప నాగరాజు, నాయకులు అంజన్న, మోతె నారాయణ, సాగర్, నరేష్ పాల్గొన్నారు. జెండా ఆవిష్కరిస్తున్న నాయకులు -
దళిత శక్తి రాజకీయ శక్తిగా మారాలి
సాక్షి, హైదరాబాద్ : దళిత శక్తి రాజకీయ శక్తిగా మారి బీసీ వర్గాలను కలుపుకుని రాబోయే రోజుల్లో అధికారం చేపట్టాలని ప్రజా గాయకుడు గద్దర్ పిలుపునిచ్చారు. రాష్ట్రంలో పేదల బతుకులు మారాలంటే విద్య, వైద్యం ఉచితంగా అందచేయాలన్నారు. జనం వీటి కోసమే రూ.కోట్లు ఖర్చుపెడుతున్నారన్నారు. ఉద్యోగాలు చేసే వారు కూడా తమ పిల్లల్ని చదివించుకోలేని పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తంచేశారు. సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ టీఎమ్మార్పీఎస్ వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏప్రిల్ 25న ఖమ్మం జిల్లా నుంచి చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు బహిరంగ సభ గురువారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో జరిగింది. ఇందులో గద్దర్ మాట్లాడుతూ.. తెలంగాణ వచ్చిన తర్వాత మాదిగ ఉప కులాల బతుకులు మారలేదని, వారి కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలన్నారు. ‘‘దళితులకు మూడెకరాల భూమి ఇవ్వనందుకు డబ్బు బ్యాంక్‌లో జమ చేయాలి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టి ఇవ్వనందుకు వాటి కిరాయిలను ప్రభుత్వమే బ్యాంక్ అకౌంట్లో వేయాలి. మాల మాదిగలు కలసి ఉండాలి. ఇరువర్గాల మధ్య నేను వారధిగా ఉంటా. దళితులంతా ఐక్య రాజకీయ శక్తిగా మారాలి’’అని అన్నారు. రాబోయే సర్పంచ్, సార్వత్రిక ఎన్నికల్లో పల్లెల్లోకి వెళ్లి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని కోరారు. అక్షరంతోనే జాతి మనుగడ అణగారిన బతుకులు మారాలని, మాదిగ ఉప కులాలను అక్షర చైతన్యం వైపు నడిపించాలన్న బాధ్యతతో సైకిల్ యాత్ర చేపట్టినట్లు వంగపల్లి శ్రీనివాస్ అన్నారు. అక్షరాలే జాతి మనుగడకు మూలమని, బతుకులు మారాలంటే విద్య వైపు మళ్లాలని అన్నారు. దళిత వర్గాలు అభివృద్ధి చెందాలన్నా, చదువుల్లో రాణించాలన్నా ప్రత్యేక సోషల్ వెల్ఫేర్ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని స్పష్టం చేశారు. సమైక్య రాష్ట్రంలో మాదిరే ప్రత్యేక రాష్ట్రంలోనూ దళితుల పరిస్థితి మారలేదని పేర్కొన్నారు. ప్రైవేట్ యూనివర్సిటీల వల్ల పేద విద్యార్థులు చదువుకునే హక్కు కోల్పోతారని, ఆ యూనివర్సిటీలో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు. ఎస్సీలపై సమగ్ర సర్వే జరిపించాలని, డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పింఛన్ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని, దళితులకు మూడెకరాల భూమి ఇవ్వాలన్నారు. తమ సమస్యలు పరిష్కరిస్తేనే బంగారు తెలంగాణలో భాగస్వాములవుతామని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ఓటు చైతన్యంతో రాజకీయ శక్తిగా సత్తా చాటుతామని చెప్పారు. పేద వర్గాలకు చదువును దూరం చేసేందుకే ప్రభుత్వం ప్రైవేట్ యూనివర్సిటీలను ప్రోత్సహిస్తోందని ఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ ఆరోపించారు. త్వరలోనే ఎగ్జిబిషన్ గ్రౌండ్లో దళితుల రాజ్యాంగ అధికార బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో ఎమ్మార్పీస్ జాతీయ ప్రధాన కార్యదర్శి మేడి పాపయ్య మాట్లాడుతూ.. సీఎం గతంలో డప్పుకు, చెప్పుకు రూ.2 వేల పెన్షన్ ఇస్తామని చెప్పినా ఇంత వరకు దాని ఊసే లేదన్నారు. సభలో మోచి సంఘం రాష్ట్ర నాయకులు డా.రాజమౌళిచారి, చింతల మల్లికార్జున్ గౌడ్, బెడగ సంఘం నేతలు చింతల మల్లికార్జున్, సండ్ర వెంకటయ్య, హోళియ, దాసరి నాయకులు వీరేశం, హనుమంతు, సంఘం మహిళ విభాగం జాతీయ అధ్యక్షులు అందె రుక్కమ్మ, రాష్ట్ర అధ్యక్షులు పిడుగు మంజుల, మామిడి రాంచందర్, జి.డి.నర్సింహ, కొల్లూరి వెంకట్, చందు, కొంగరి శంకర్, అశోక్, ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. -
27న వరంగల్‌లో సింహగర్జన సభ: మంద కృష్ణ
హైదరాబాద్ : ఎస్సీ, ఎస్టీలను సంఘటిత పరిచి ఐక్య ఉద్యమాలు చేపట్టేందుకు ఈ నెల 27న వరంగల్‌లో దళిత, గిరిజన సింహగర్జన సభను నిర్వహించనున్నట్లు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ తెలిపారు. సోమవారం ఉస్మానియా యూనివర్సిటీలో సౌత్ ఇండియా జేఏసీ చైర్మన్ గాలి వినోద్‌కుమార్ అధ్యక్షతన దళిత మేధావుల సమావేశం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా హాజరైన మంద కృష్ణ మాట్లాడుతూ.. మేధావుల మౌనం దళిత జాతికి ప్రమాదమని పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంపై ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు దారుణమన్నారు. కార్యక్రమంలో మాల మహానాడు నేత చెన్నయ్య, జేబీ రాజు, ఎంఎస్ఎఫ్ జాతీయ అధ్యక్షుడు రుద్రవరం లింగస్వామిమాదిగ తదితరులు పాల్గొన్నారు. -
నా హత్యకు సీఎం కుట్ర: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: తనను హత్య చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం యత్నిస్తోందని, తనను జైల్లో పెట్టిన సమయంలోనే హత్యకు కుట్ర జరిగిందని, ఈ కుట్రలో సీఎం, ఇద్దరు మంత్రులు, ఒక ఎమ్మెల్యే హస్తం ఉందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆరోపించారు. సోమవారం ఆయన ఢిల్లీలోని ఏఐసీసీ కార్యాలయంలో పీసీసీ చీఫ్ ఉత్తమ్, కుంతియా ఇతర నేతలను కలసి పార్లమెంటులో వర్గీకరణ అంశాన్ని లేవనెత్తేలా కాంగ్రెస్ తరఫున చొరవ తీసుకోవాలని కోరారు. అనంతరం ఉత్తమ్, కుంతియాతో కలసి మీడియాతో మాట్లాడారు. తన హత్యకు జరుగుతున్న కుట్రలపై సీబీఐ విచారణ జరిపించాలని, అప్పుడే ప్రభుత్వ పెద్దల ప్రమేయం బయటపడుతుందన్నారు. ఉత్తమ్ మాట్లాడుతూ మంద కృష్ణ హత్యకు ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఈ కుట్రలో ప్రభుత్వ పెద్దలున్నారని ఆరోపించారు. -
ఇంటర్ విద్యార్థులు నష్టపోతారు
హైదరాబాద్ : ఈ నెల 13న ఎమ్మార్పీఎస్ తలపెట్టిన బంద్ కారణంగా ఇంటర్ విద్యార్థులు నష్టపోతారని, కాబట్టి బంద్‌ను వాయిదా వేసుకోవాలని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి కోరారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్న సమయంలో బంద్ నిర్వహించడం సరికాదని, దీనివల్ల ఇంటర్ విద్యార్థులపై ప్రభావం పడే అవకాశం ఉందని అన్నారు. ఏది ఏమైనప్పటికీ 13న జరగాల్సిన ఇంటర్ పరీక్షలు యథాతథంగా జరుగుతాయని స్పష్టం చేశారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ అధ్యక్షడు మందా కృష్ణ మాదిగ ఈ నెల 13న బంద్‌కు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ బంద్ వల్ల ఇంటర్ పరీక్షలకు ఆటంకం కలుగవచ్చునన్న ఆందోళన వ్యక్తమవుతోంది. -
దళితులు ప్రశ్నించడమే నేరమా?
సాక్షి, హైదరాబాద్: దళితులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అణచివేత ధోరణి ప్రదర్శిస్తున్నాయ ని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యం కల్పించిన హక్కులను పొందకుండా చేస్తున్నాయ ని మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణతోనే దళితులకు పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్నారు. శనివారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో టీజేయూ ఆధ్వ ర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడారు. ‘ఉమ్మడి రిజర్వేషన్ల విధానం విఫలమైంది. దళితుల్లో అభివృద్ధి చెందిన కులాలే రిజర్వేషన్ల ఫలాలు పొందుతున్నాయి. అట్టడుగు వర్గాలకు న్యాయం జరగాలంటే వర్గీకరణ చేయాలి. పరిస్థితులకు అనుగుణంగా రాజ్యాంగాన్ని సవరించుకోవచ్చని అంబేడ్కర్ ఆనాడే చెప్పారు. అందులో భాగంగా ఎన్నోసార్లు రాజ్యాంగ సవరణ చేశారు. అదే క్రమంలో ఎస్సీ వర్గీకరణ కోసం చర్యలు తీసుకోమంటే కేంద్రం నిర్లక్ష్యం వహిస్తోంది. అందుకే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాం. కానీ ప్రశ్నించే హక్కును ప్రభుత్వం హరిస్తోంది. నిలదీసే వ్యక్తిని అక్రమంగా జైల్లో పెడుతోంది. నన్ను ఒకే నెలలో రెండుసార్లు అరెస్టు చేశారు. నేను చేసిన నేరమేంటో ప్రభుత్వం చెప్పాలి’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దళితుడిని కావడంతోనే జైల్లో పెట్టారు.. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ‘మిలియన్ మార్చ్’ జరిగిన సమయంలో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావు, కోదండరాంలపై పదుల సంఖ్యలో కేసులు నమోదైనప్పటికీ ఒక్కరినీ జైల్లో పెట్టలేదని మంద కృష్ణ అన్నారు. కానీ తాను దళితుడు కావడంతో నిర్దాక్షిణ్యంగా జైల్లో పెట్టారన్నారు. ‘సుప్రీం కొలీజియం తీరును జస్టిస్ కర్ణన్ తప్పుబడితే ఆయనను జైల్లో పెట్టాలని ఓ జడ్జి తీర్పునిచ్చారు. కానీ అదే కొలీజియం తప్పులు చేస్తోందని, పక్షపాతంగా వ్యవహరిస్తోందని సుప్రీం జడ్జీలు గొంతెత్తి మీడియా ముందుకొచ్చారు. దీంతో దిగొచ్చిన ప్రభుత్వం వారితో సంప్రదింపులు చేస్తోంది. ఒక దళితుడు ప్రశ్నిస్తే నేరం... అగ్రవర్ణాలు, సంపన్నులు ప్రశ్నిస్తే సంప్రదింపులు చేస్తారా’ అంటూ మండిపడ్డారు. దళితులపై అణచివేతకు ఇంతకంటే పెద్ద ఉదంతం అవసరం లేదన్నారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చిందని, పరుష పదజాలం వాడితే కోర్టు ఆదేశాలతో సంబంధం లేకుండా అరెస్టు చేయాలని నిర్ణయించడం దారుణమని అన్నారు. తాము అధికారంలోకి వస్తే వందరోజుల్లో వర్గీకరణ చేస్తామని బీజేపీ చెప్పిందని.., మరి కేంద్రంలో బీజేపీ అధికారం చేపట్టి ఇంకా వందరోజులు కాలేదా? అని ప్రశ్నించారు. ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం కేసీఆర్ ప్రత్యేక బృందాన్ని ప్రధాని మోదీ వద్దకు తీసుకెళ్లాలని అన్నారు. వర్గీకరణపై సోమవారం హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు ఆయన చెప్పారు. -
మంద కృష్ణపై అక్రమ కేసులను ఎత్తివేయాలి
హైదరాబాద్: ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని, ఆయనను బేషరతుగా విడుదల చేయాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ మేధావుల వేదిక ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రజా గాయకుడు గద్దర్, తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్ చెరుకు సుధాకర్, టీపీసీసీ నేత మల్లు రవి, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ తదితరులు ప్రసంగించారు. గద్దర్ మాట్లాడుతూ దళితుల ఆత్మగౌరవం కోసం పోరాడుతున్న నాయకుడిని అక్రమంగా అరెస్ట్ చేయడం సరైంది కాదన్నారు. ఎస్సీ వర్గీకరణపై పార్లమెంట్లో బిల్లు పెట్టాలని, అందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అఖిలపక్షాన్ని ఢిల్లీకి ఎప్పుడు తీసుకెళ్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. అత్యంత అరాచకంగా, అప్రజాస్వామికంగా మంద కృష్ణమాదిగను అరెస్ట్ చేశారని డాక్టర్ చెరుకు సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. న్యాయబద్ధమైన హక్కుల కోసం పోరాడుతున్న మంద కృష్ణను అక్రమంగా అరెస్ట్ చేయడం హేయమైన చర్య అని మల్లురవి అన్నారు. రాష్ట్రంలో కోటి మంది మాదిగలు ఉన్నారని, ఈ మాదిగలు తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని గాలి వినోద్‌కుమార్ అన్నారు. తెలంగాణలో జరుగుతున్న నిర్బంధాలకు వ్యతిరేకంగా ఫిబ్రవరి 4న ఓయూలో నిర్వహించే భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ కాశీం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉ. సాంబశివరావు, అద్దంకి దయాకర్, నల్లా రాధాకృష్ణ, ప్రొఫెసర్లు మధు, జి. లక్ష్మణ్, ముత్తయ్య, ఇటుకాల పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు. -
మందకృష్ణకు షరతులతో కూడిన బెయిల్
-
దొరలకో చట్టం.. దళితులకో చట్టం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో దళితులకు ఒక చట్టం.. దొరలకు మరో చట్టం నడు స్తోందని ఎమ్మార్పీ ఎస్ వ్యవస్థాపక అధ్య క్షుడు మంద కృష్ణమాదిగ ఆరోపించారు. 21 రోజులుగా చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉంటున్న మంద కష్ణకు మంగళవారం సికింద్రాబాద్ సివిల్ కోర్టు బెయిల్ మంజూరు చేయడంతో రాత్రి 9 గంటలకు విడుదలయ్యారు. దీక్ష చేసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వక పోయినా ఎమ్మార్పీఎస్ కార్యాలయం వద్ద మంద కృష్ణ రెచ్చగొట్టే ప్రసంగం చేశారని పోలీసులు ఆయనను ఈనెల 2న అరెస్టు చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి చంచల్‌గూడ జైల్లో ఉన్న ఆయనకు బెయిల్ లభించడంతో బయటకు వచ్చా రు. ఆయన జైలు వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ నెల 25న అన్ని పార్టీలతో అఖిల పక్షం సమావేశం నిర్వహించి వారి సూచనలు, సలహాల మేరకు భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని తెలిపారు. -
తాత్కాలిక బెయిల్‌పై మంద కృష్ణ విడుదల
హైదరాబాద్: చంచల్‌గూడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోమవారం బెయిల్‌పై విడుదలయ్యారు. మంద కృష్ణ బావ మృతి చెందడంతో అంత్యక్రియలకు హాజరయ్యేందుకు కోర్టు షరతులతో కూడిన తాత్కాలిక బెయిల్‌ను మంజూరు చేసింది. అంత్యక్రియలకు హాజరై తిరిగి మంగళవారం ఆయన జైలుకు రానున్నారు. -
మందకృష్ణ మాదిగకు బెయిల్ మంజూరు
హైదరాబాద్ : ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు మంగళవారం బెయిల్ మంజూరు అయింది. సికింద్రాబాద్ సివిల్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి పది రోజులకోసారి కార్ఖాన, రాంగోపాల్ పేట్ పీఎస్ లో హాజరు కావాలని షరతు విధించింది. ఇద్దరు వ్యక్తులతో పదివేల రూపాయల పూచీకత్తు సమర్పించాలని ఆదేశాలు జారీ చేసింది. -
ఎమ్మార్పీఎస్ ఆందోళన: భారీగా ట్రాఫిక్ జామ్
సాక్షి, యాదాద్రి: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. యాదాద్రి జిల్లాలో మంగళవారం వరంగల్ - హైదరాబాద్ జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. దీంతో హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు ధర్నాను అడ్డుకుని కార్యకర్తల ఆందోళనను విరమింప జేశారు. -
తెలంగాణలో పోలీస్ రాజ్యం నడుస్తోంది: లక్ష్మణ్
హైదరాబాద్ : తెలంగాణలో ప్రస్తుతం పోలీస్ రాజ్యం నడుస్తోందని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. చంచల్ గూడ జైలులో ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ , ఎంఎల్సీ రాంచందర్ రావు కలిశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ..రాష్ట్రంలో కేసీఆర్ నియంత పరిపాలన కొనసాగిస్తున్నారని వ్యాఖ్యానించారు. ప్రజారాజ్యంలో నిరసన తెలిపే హక్కు లేకుండా చేశారని విమర్శించారు. రాష్ట్రంలో ఎస్సీల జనాభా 16 శాతం ఉందని, మాదిగలకు విద్య, ఉద్యోగాల్లో సరైన అవకాశాలు రాకపోవడంతో వారు ఎస్సీ వర్గీకరణ కోసం నాయ్య పోరాటం చేస్తున్నారని చెప్పారు. కేసిఆర్ ఎస్సీ వర్గీకరణ కోసం అన్ని పార్టీలను ఢిల్లీకి తీసుకెళ్తానని చెప్పి మాట తప్పారని విమర్శించారు. రాష్ట్రంలో దళితులు, రైతులు, నాయకులపై కేసులు నమోదు చేసి జైల్లో పెట్టడం జరుగుతుందని, తెలంగాణ ఉద్యమంలో ఇంతకంటే హింసలు జరిగాయని.. కానీ ఎవరిని జైల్లో పెట్టిన దాఖలాలు లేవన్నారు. కేసీఆర్ ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలే బుద్ది చెబుతారని అన్నారు. అందరితో కలిసి ఎస్సీ వర్గీకరణ కోసం కృషి చేస్తామన్నారు. -
27న రాష్ట్రబంద్
సాక్షి, హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది. మంద కృష్ణపై రాష్ట్ర ప్రభుత్వం కావాలనే కక్ష సాధింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. మంద కృష్ణ విడుదలను కోరుతూ ఈ నెల 26 వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల, జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపునిచ్చింది. అప్పటికీ ప్రభుత్వం స్పందించకుంటే ఈ నెల 27న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని ఎమ్మార్పీఎస్ ప్రకటించింది. మంద కృష్ణకు ఎటువంటి హాని జరిగినా అందుకు సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి కడియం బాధ్యత వహించాలని స్పష్టం చేసింది. -
ఎమ్మార్పీఎస్ రాస్తారోకో ఉద్రిక్తం
సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం ఆ సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రాస్తారోకో ఉద్రిక్తంగా మారింది. సూర్యాపేటలోని 65వ నంబర్ జాతీయ రహదారిపై సంఘం నాయకులు, కార్యకర్తలు మధ్యాహ్నం రెండు గంటలుగా రాస్తారోకో చేపట్టారు. దీంతో సుమారు రెండు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించిపోయింది. అదే సమయంలో ఖమ్మం నుంచి హైదరాబాద్ వెళుతున్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు ఆయనను పంపించే ప్రయత్నం చేయగా.. కాన్వాయ్ ఎదుట ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పడుకున్నారు. దీంతో మంత్రి కారు దిగి నాయకులతో మాట్లాడుతుండగా.. కొందరు కార్యకర్తలు రాళ్లు విసిరారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు తుమ్మలను కాన్వాయ్‌లోకి ఎక్కించారు. అనంతరం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలను చెదరగొడుతుండగా.. కాన్వాయ్‌పై వారు మళ్లీ రాళ్లు విసిరారు. ఈ దాడిలో పైలెట్ వాహనానికి రాళ్లు తగలడంతో ముందుభాగంలో స్వల్పంగా అద్దం పగిలింది. విషయం తెలుసుకున్న ఎస్పీ ప్రకాష్‌జాదవ్ హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. -
సూర్యాపేటలో ఎమ్మార్పీఎస్ ఆందోళన
సాక్షి, సూర్యాపేట: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగను వెంటనే విడుదల చేయాలని ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. సూర్యాపేట జిల్లాలో శుక్రవారం ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు జాతీయ రహదారిపై ధర్నాకు దిగారు. దీంతో రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అదే సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ట్రాపిక్‌లో చిక్కుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నేతలు మంత్రి కాన్వాయ్‌ను అడ్డుకున్నారు. దీంతో పోలీసులు ఆందోళన కారులను అరెస్టు చేశారు. -
సిటీ సివిల్ కోర్టుకు కృష్ణ మాదిగ
హైదరాబాద్: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగతోపాటు 11 మంది నాయకులను రాంగోపాల్‌పేట్ పోలీసులు బుధవారం సికింద్రాబాద్ సిటీ సివిల్ కోర్టు 11వ ఏసీఎం జడ్జి ముందు హాజరుపరిచారు. రాంగోపాల్‌పేట్ పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదైన కేసులపై విచారణ జరిపారు. అనంతరం చంచల్‌గూడ జైలుకు తరలించారు. గురువారం కోర్టులో బెయిల్ పిటిషన్‌పై వాద నలు జరగనున్నట్లు కృష్ణమాదిగ తరఫు న్యాయవాది తెలిపారు. కోర్టు వద్ద కృష్ణ మాదిగను కలిసేందుకు ప్రయత్నించిన టీడీపీ సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులును పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం మోత్కుపల్లి మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వానికి ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధి లేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులను మరోసారి మోసగిస్తున్నారని విమర్శించారు. కృష్ణ మాదిగపై పెట్టిన కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. మందకృష్ణను బేషరతుగా విడుదల చేయాలి ఎమ్మార్పీఎస్ జాతీయ కమిటీ డిమాండ్ ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణను వెంటనే విడుదల చేయాలని ఆ సమితి జాతీయ కమిటీ డిమాండ్ చేసింది. లేకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమం నిర్వహిస్తామని హెచ్చరించింది. ఎమ్మార్పీఎస్ నేతల అరెస్టు నేపథ్యంలో జాతీయ కమిటీ నేతలు ఉసురుపాటి బ్రహ్మయ్య, మందకుమార్, నకిరకంటి యాదయ్య, తీగల ప్రదీప్ తదితరులు బుధవారం మాట్లాడుతూ తెలంగాణ మార్చ్ సందర్భంగా కేసీఆర్‌పై ఎన్ని కేసులు పెట్టారని ప్రశ్నించారు. ఆంధ్ర పాలకులను మించి నిరంకుశంగా తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. మందకృష్ణను విడుదల చేయాలనే డిమాండ్‌తో రెండు రోజులపాటు తెలుగు రాష్ట్రాల్లో శాంతియుత నిరసనలకు పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించకపోతే శనివారం కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. -
మంద కృష్ణపై గవర్నర్‌కు టీఎస్ఎంఆర్పీఎస్ ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకుంటామని, ఈ కార్యక్రమానికి భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను రానీయబోమని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ హెచ్చరించడం భారత జాతి గౌరవాన్ని కించపర్చడంగా భావిస్తున్నామని తెలంగాణ స్టేట్ ఎంఆర్పీఎస్ ప్రతినిధులు పేర్కొన్నారు. ఈ మేరకు మంద కృష్ణపై చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కోరారు. తెలుగు మహాసభలను విజయవంతంగా నిర్వహించినందుకు రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. టీఎస్ఎంఆర్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాదిగ, జాతీయ అధ్యక్షుడు సుంకపాక దేవయ్య మాదిగ, జాతీయ ప్రధాన కార్యదర్శి పాపయ్య మాదిగ, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ మాదిగ మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. రాష్ట్ర ప్రభుత్వం అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి ఎస్సీ వర్గీకరణపై చట్టబద్ధత కల్పించేందుకు చొరవ తీసుకోవాలని కోరారు. కుల వృత్తిపై ఆధారపడి జీవించే మాదిగలకు నెలకు రూ.2000 చొప్పున పెన్షన్ ఇప్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. -
ఎమ్మార్పీఎస్ ర్యాలీ ఉద్రిక్తం
హైదరాబాద్: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ప్రభుత్వ నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) చేపట్టిన ర్యాలీ ఉద్రిక్తంగా మారింది. ఆదివారం రాత్రి భారతి సంస్మరణ సభ తరువాత సికింద్రాబాద్ నుంచి ట్యాంక్‌బండ్ వైపు భారీ ర్యాలీగా బయలుదేరిన ఎమ్మార్పీఎస్ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. అయినా ఆందోళనకారులు కొంతదూరం వరకు ముందుకు వెళ్లారు. ఈ సందర్భంగా తీవ్ర స్థాయిలో తోపులాట జరిగి ఉద్రిక్తత నెలకొంది. చివరికి పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలు అక్కడికి చేరుకుని ఆందోళనకారులను చెదరగొట్టాయి. పోలీసులు మంద కృష్ణ సహా పలువురు ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేసి, పోలీస్‌స్టేషన్‌కు తరలించడంతో ఆందోళన సద్దుమణిగింది. ఒక్కసారిగా ర్యాలీ చేపట్టి.. ఇటీవల హైదరాబాద్‌లోని మడ్‌ఫోర్ట్ వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ఆందోళనలో ఎమ్మార్పీఎస్ నాయకురాలు భారతి మరణించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సికింద్రాబాద్ కంటోన్మెంట్ సిక్‌విలేజ్ గ్రౌండ్లో భారతి మాదిగ సంస్మరణ సభను నిర్వహించారు. దీనికి తెలుగు రాష్ట్రాల నుండి పెద్ద సంఖ్యలో మాదిగలు హాజరయ్యారు. ఈ సందర్భంగా భారతి చిత్రపటం వద్ద క్యాండిళ్లతో శ్రద్ధాంజలి ఘటించారు. మాదిగ కళా మండలి ఆధ్వర్యంలో భారతిని స్మరించుకుంటూ పాటలు పాడి జోహార్లు అర్పించారు. అనంతరం మంద కృష్ణ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణపై తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు మాదిగలను మోసం చేశాయని ఆరోపించారు. సభ అనంతరం ట్యాంక్‌బండ్ వరకు ర్యాలీ నిర్వహించాలని పిలుపునిచ్చారు. దీంతో రాత్రి 10.40 గంటల సమయంలో వేలాది మంది కార్యకర్తలతో కలసి ట్యాంక్‌బండ్ వైపు బయలుదేరారు. సభా ప్రాంగణం వద్ద ఉన్న పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించినా వీలుకాలేదు. తర్వాత కూడా పలుచోట్ల పోలీసులు అడ్డుకోవడానికి ప్రయత్నించారు. ప్యారడైజ్ సర్కిల్ వద్ద బారికేడ్లు, ఫెన్సింగ్ ఏర్పాటు చేసినా.. ఆందోళనకారులు తమతో తెచ్చుకున్న కర్రలతో వాటిని తోసేసి ముందుకు కదిలారు. లారీలను అడ్డుపెట్టినా నిలువరించలేకపోయారు. చివరికి ఎంజీ రోడ్‌లోని రాంగోపాల్‌పేట్ పాత పోలీస్‌స్టేషన్ వద్ద పెద్ద సంఖ్యలో పోలీసు బలగాలను మోహరించి.. ఆందోళనకారులను అడ్డుకున్నారు. దీంతో అక్కడ కొంతసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు మంద కృష్ణ, మరికొందరు ఎమ్మార్పీఎస్ నేతలను అరెస్టు చేశారు. మిగతా ఆందోళనకారులను చెదరగొట్టారు. కాగా.. ఆందోళనకారులు దాడులు చేయడంతో పోలీసులకు చెందిన రెండు వాహనాలు స్వల్పంగా ధ్వంసమ య్యాయి. ఇక ర్యాలీగా వస్తున్న వారిలో ఇద్దరు మహిళలు సొమ్మసిల్లి పడిపోవడంతో గాంధీ ఆస్పత్రికి తరలించారు. వర్గీకరణపై మోసం చేశారు: మందకృష్ణ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పారని, మాదిగలను మోసం చేశారని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణపై ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోవడంలో కేసీఆర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని, దాని మూలంగానే భారతి చనిపోయారని పేర్కొన్నారు. వర్గీకరణ ఉద్యమంలో 8 మంది అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్చి 1న అమరవీరుల దినోత్సవాన్ని నిర్వహిస్తామన్నారు. లంబాడీలు, ఆదివాసీల గొడవలకు అధికారులను బలి పశువులను చేయడం తగదని.. సమస్యను పరిష్కరించకుండా వదిలేయడంతో ఉగ్రరూపం దాల్చిందన్నారు. -
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలదే బాధ్యత
హైదరాబాద్: ఎమ్మార్పీస్ నాయకురాలు భారతి మృతికి కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎమ్మార్పీఎస్ సోమవారం తలపెట్టిన కలెక్టరేట్ ముట్టడిలో నాంపల్లిలోని హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగిన తోపులాటలో మృతి చెందిన భారతి మృతదేహానికి ఉస్మానియా ఆస్పత్రి వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించారు. భారతి భౌతికకాయాన్ని కడసారి చూసేందుకు మంగళవారం ఎమ్మార్పీఎస్ నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, వివిధ పార్టీల నేతలు ఉస్మానియా ఆస్పత్రికి తరలివచ్చారు. భారతక్కా అమర్ రహే అంటూ నినాదాలతో ఉస్మానియా ఆస్పత్రి మార్చురీ ప్రాంగణం మార్మోగింది. ఉస్మానియా ఆస్పత్రి నుంచి భౌతికకాయాన్ని ఊరేగింపుగా ఆమె నివాసానికి తీసుకొచ్చారు. పలువురి నివాళి పలు ప్రజా సంఘాలు నాయకులు, ప్రజాగాయకుడు గద్దర్, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, అనిల్ కుమార్ యాదవ్, నరేందర్ యాదవ్, ఎమ్మార్పీఎస్ నాయకులు మందకృష్ణ, రాగడి సత్యం, తిప్పారపు లక్ష్మణ్, మాదిగ స్టూడెంట్ ఫెడరేషన్, మాదిగ మహిళ సమాఖ్య, ఎంజేఎఫ్తో పాటు ఎమ్మార్పీఎస్ వివిధ విభాగాల నాయకులు భారతికి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ..వర్గీకరణ ఆలస్యం చేయడం వల్లే మాదిగల ప్రాణాలు పోతున్నాయని, దీనికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలన్నారు. జాతి కోసం ప్రాణాలర్పించిన భారతి త్యాగం వృథా కాకుండా పోరాడతామన్నారు. కేంద్రాన్ని ఒప్పించాలి అసెంబ్లీ నడుస్తుండటంతో తాము హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కలెక్టరేట్ల ముట్టడికి పిలుపినిచ్చామని మందకృష్ణ చెప్పారు. ఏపీలో ఈ నెల 10 నుంచి జిల్లా కలెక్టరేట్ల ముట్టడి కార్యక్రమం చేపడుతున్నామన్నారు. వర్గీకరణ ఉద్యమాన్ని నిర్వీ ర్యం చేసేందుకు 3 ఏళ్లుగా సీఎం కేసీఆర్ ఎన్నోకుట్రలు చేశారన్నారు. ఇప్పటికైనా కేసీఆర్ అఖిల పక్షాన్ని ఢిల్లీకి తీసుకువెళ్లి వర్గీకరణపై మోదీని ఒప్పించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణకు కేంద్రం ఒప్పుకోకపోతే టీ ఆర్‌ఎస్‌తోపాటు వివిధ పార్టీలన్నీ వర్గీకరణ ఉద్యమానికి కలసి రావాలని కోరారు. వర్గీకరణను నిర్లక్ష్యం చేస్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎడబెల్లి యాదయ్య, మహేందర్, అరుణ్ మాదిగ, సీమాశంకర్, లింగస్వామి తదితరులు పాల్గొన్నారు. -
భారతి కుటుంబానికి 25లక్షల ఎక్స్‌గ్రేషియా
సాక్షి, హైదరాబాద్ : ఎస్సీ వర్గీకరణను డిమాండ్ చేస్తూ హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ఎమ్మార్పీఎస్ నిర్వహించిన ధర్నాలో అస్వస్తతకు గురై మృతి చెందిన కార్యకర్త భారతి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియాను తక్షణమే చెల్లిస్తామని సీఎం కె.చంద్రశేఖర్‌రావు ప్రకటించారు. ఆమె కుటుం బంలో అర్హులుంటే ప్రభుత్వ ఉద్యోగమిస్తామని, ఆమెకు పిల్లలు ఉంటే వారి చదువుల ఖర్చును రాష్ట్ర ప్రభుత్వమే భరిస్తుందని స్పష్టం చేశారు. రాష్ట్రంలో భూ రికార్డుల ప్రక్షాళన కార్యక్రమంపై సోమవారం శాసనసభలో స్వల్ప కాల చర్చ జరుగుతున్న సమయంలో విపక్షాల కోరిక మేరకు భారతి మర ణించిన ఘటనపై సీఎం సభలో ప్రకటన చేశారు. భారతి మృతి దురదృష్టకరమని, ఆమెను వెనక్కి తీసుకురాలేమని అన్నారు. వ్యక్తిగతంగా ఎమ్మార్పీ ఎస్తో తనకు దగ్గరి సంబంధం ఉందని, చంద్ర బాబు మంత్రివర్గంలో ఉన్నప్పుడు మంత్రివర్గ ఉపకమిటీ సభ్యుడిగా ఎస్సీ వర్గీకరణకు తాను మద్దతు తెలిపానన్నారు. అలాగే టీఆర్ఎస్ అధినేతగా కూడా ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటించానన్నారు. ఎస్సీ వర్గీకరణ జరపాలన్న డిమాండ్‌పై అఖిలపక్ష బృందంతో వచ్చి ప్రధాని మోదీని కలుస్తామని, అందుకు సమయం కేటా యించాల్సిందిగా కోరామని గుర్తు చేశారు. సంద ర్భాన్ని బట్టి సమయం కేటాయిస్తానని ప్రధాని హామీ ఇచ్చారని వెల్లడించారు. గతంలో సభలో చేసిన తీర్మానం మేరకు ఎస్సీ వర్గీకరణ చేయాలని కేంద్రాన్ని కోరేందుకు రాష్ట్రం నుంచి అఖిలపక్షాన్ని తీసుకెళ్తానని పునరుద్ఘాటించారు. ఈ విషయం తీవ్రతను వివరిస్తూ ప్రధానికి ఒకట్రెండు రోజుల్లో లేఖ రాస్తానన్నారు. ఎస్సీ వర్గీకరణపై అన్ని రాజకీయపక్షాలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు ఆందోళనకు గురికావా ల్సిన అవసరం లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ప్రధానిని కలసి ఈ సమస్యకు త్వరలో మంచి ముగింపు ఇద్దామని విపక్షాలకు పిలుపు నిచ్చారు. భారతి మృతిపై విచారణ.. ఎస్సీ వర్గీకరణ డిమాండ్‌తో సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించా లని ఎమ్మార్పీఎస్ ఇచ్చిన పిలుపు మేరకు కొందరు కార్యకర్తలు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారని సీఎం కేసీఆర్ తెలిపారు. మధ్యా హ్నం 12.40 గంటల సమయంలో కార్యక ర్తలు కలెక్టరేట్ గేటు తోసుకుని లోపలికి పోవడానికి ప్రయత్నిం చారని, పోలీసులు అడ్డుకుని వారిని వాహనంలో తరలించేందుకు ప్రయత్నించారని అన్నారు. ఇదే సమయంలో ధర్నాలో పాల్గొన్న 40 ఏళ్ల భారతి అస్వస్తతకు గురై అక్కడే కూర్చోగా, పోలీసులు వెంటనే తమ వాహనంలో ఆమెను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారని పేర్కొన్నారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ భారతి మృతిచెందారని, ఈ ఘటనకు సంబందించిన వీడియో ఫుటేజీని స్వయంగా తను వీక్షించానని సీఎం తెలిపారు. ఈ వీడియో ఫుటేజీని మీడియాకు విడుదల చేస్తున్నామని, ఈ ఘటనపై ప్రభుత్వం విచారణ జరుపుతోందని చెప్పారు. భారతి మృతి చెందిన విషాద సమయంలో సభను నిర్వహించకుండా వాయిదా వేయాలని విపక్షాలు చేసిన సూచనతో ఏకీభవిస్తున్నానని అన్నారు. సీఎం విజ్ఞప్తి మేరకు స్పీకర్ మధుసూదనాచారి సభను మంగళవారానికి వాయిదా వేశారు. అఖిలపక్షాన్ని తీసుకెళ్లండి: విపక్షాలు ఎస్సీ వర్గీకరణ జరపాలని ప్రధాని మోదీని కోరేందుకు రాష్ట్రం నుంచి ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లాలని విపక్షనేత కె.జానారెడ్డి, బీజేపీఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, ఎంఐఎం సభ్యుడు అహమ్మద్ పాషా ఖాద్రీ, సీపీఎం సభ్యుడు సున్నం రాజయ్య డిమాండ్ చేశారు. -
‘తెలంగాణలో దొరల పాలన నడుస్తోంది’
ఏటూరునాగారం : తెలంగాణలో దొరల పాలన నడుస్తోందని టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వ్యాఖ్యానించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏ పీఓ గేస్ట్ హౌజ్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ కోసం సంఘాలన్నీ ఏకం కావాలని మంద కృష్ణ మాదిగ కోరారు. వర్గీకరణ కోసం నవంబర్‌లో తలపెట్టిన ఢిల్లీ ముట్టడిని పెద్ద ఎత్తున విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
ఏ పార్టీలోకి వెళ్లినా పదవి వస్తుంది..
కానీ, దళితుల ప్రయోజనాలే ముఖ్యం: మంద కృష్ణ సాక్షి, నాగర్‌కర్నూలు: తాను ఏ పార్టీలో చేరినా మంచి పదవి లభిస్తుందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. బుధవారం నాగర్‌కర్నూలులో జరిగిన ఎమ్మార్పీఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీల్లో చేరాలని చాలామంది అడిగారని, మంచి పదవులు ఇస్తామని చెప్పినా లొంగలేదన్నారు. ఎమ్మార్పీఎస్ లక్ష్యం నెరవేర నిదే ఏ పార్టీలో చేరకూడదని ఉద్యమాన్ని కొనసాగిస్తున్నానని చెప్పారు. నాగర్ కర్నూలు ఎస్పీ కల్మేశ్వర్ ఇక్కడి దళితులపై రౌడీషీట్లు తెరుస్తున్నారని ఆరోపించారు. -
టీడీపీని నామరూపాలు లేకుండా చేస్తాం
– దళితులపై దాడులు చేస్తే ప్రైవేట్ సైన్యంతో తిరగబడతాం – మహాసంకల్ప సభలో ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు కళ్యాణదుర్గం: ఇచ్చిన మాటను నిలబెట్టుకోకుండా అడుగడుగనా దళితులపై దాడులు చేయడం, ఉద్యమాలకు అణగదొక్కడానికి పూనుకుంటున్న సీఎం చంద్రబాబు తెలుగుదేశం పార్టీని నామరూపాల్లేకుండా చేస్తామని ఎమ్మార్పీఎస్ రాష్ట్రవర్కింగ్ ప్రెసిడెంట్ ఎంఎస్ రాజు హెచ్చరించారు. స్థానిక కృష్ణమందిరంలో శనివారం మహాసంకల్ప సభ నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాజు మాట్లాడుతూ దేవినేని ఉమ అనుచరులతో పాటు రాష్ట్రంలో చాలా చోట్ల దళితులపై దాడులు చేస్తున్నారన్నారు. ఇలాగే దాడులు కొనసాగిస్తే ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకుని తిరగబడతామన్నారు. రాష్ట్ర విభజనలో రెండు కళ్ల సిద్దాంతాన్ని అవలంభించిన చంద్రబాబు ఎస్సీ వర్గీకరణలో రెండు నాల్కుల ధోరణి అవలంభిస్తున్నారని విమర్శించారు. కోట్లకు అధిపతులుగా ఉన్న కాపులను బీసీల్లో చేర్చేందుకు చూపుతున్న ప్రేమ, ఎస్సీ వర్గీకరణ పట్ల ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. ఎస్సీ వర్గీకరణ అమలు చేయాల్సింది పోయి ఉద్యమాలను అణగదొక్కేందుకు కుట్ర చేస్తున్నారని వాపోయారు. పోలీసులను అడ్డుపెట్టుకుని ఉద్యమాలు చేయకుండా చేస్తున్నారన్నారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కనివ్వమన్నారు. దళిత కాలనీలు ఎక్కడా అభివృద్ధికి నోచుకోలేదని, కేవలం ప్రభుత్వ ప్రకటనల్లో మాత్రమే కనిపిస్తుందన్నారు. బుడగ జంగాల పరిస్థితి దౌర్భాగ్యంగా ఉందని, వీరిని ఎస్సీలుగా గుర్తించాలని డిమాండ్ చేశారు. వర్గీకరణ కోసం ఈనెల 27న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగే ధర్నాలో దళితుల సత్తాను చాటాలన్నారు. అంతకుముందు జగజ్జీవన్రామ్కు పూలమాల వేసి ర్యాలీగా వచ్చారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ గుత్తి ఇన్చార్జ్ ప్రసాద్, రాష్ట్ర నాయకులు కుంటిమద్ది ఓబులేశు, వన్నూరప్ప, స్వామిదాస్, చిన్నపెద్దన్న, జిల్లా అధ్యక్షుడు కృష్ణ, స్థానిక నాయకులు నాగరాజు, కుళ్ళాయప్ప, దొణస్వామి, అంజి తదితరులు పాల్గొన్నారు. -
'కార్లు వెంబడిస్తున్నాయి.. ప్రాణ రక్షణ లేదు'
వరంగల్: ఆంధ్రప్రదేశ్‌లో తనకు ప్రాణ రక్షణ కరువైందని, తనపై కుట్ర చేస్తున్నారని ఎమ్మార్పీఎస్ నేత మందకృష్ణ మాదిగ ఆందోళన వ్యక్తం చేశారు. తనకు ప్రాణరక్షణ కరువైందనే విషయం ప్రపంచానికి తెలియజేయాలనే మీడియా సమావేశం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. సోమవారం ఉదయం మందకృష్ణ ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ పది రాష్ట్రాల్లో ప్రత్యక్షంగా ఎమ్మార్పీఎస్ పనిచేస్తోందని, దేశంలో ఎక్కడ తిరిగినా తనను ఎవ్వరూ ఆపలేదని, ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం తమ స్వేచ్ఛను హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కురుక్షేత్రం సభ జరగకుండా అక్కడి మాదిగ ఎమ్మెల్యేలను బెదిరించారని చెప్పారు. తనకు స్వేచ్ఛతోపాటు ప్రాణ రక్షణ కూడా కరువైందని, గుర్తు తెలియని కార్లు తనను వెంటాడుతున్నాయని సంచలన విషయం చెప్పారు. తనకు రక్షణ కొరకు కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలియకుండా ఇది జరగదని, తనను వెంబడించింది ఎవరో సీఎం కేసీఆర్ 24 గంటలలో తేల్చాలని డిమాండ్ చేశారు. నిదితులను గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని, వర్గీకరణ చేస్తామన్నారు కాబట్టే ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి పనిచేశామని, ఇద్దరూ మాట తప్పారని ఆవేదన వ్యక్తం చేశారు. బాబులాంటి వారు 100 మంది వచ్చినా ఎమ్మార్పీఎస్ ఎదుర్కొంటుందని ఆంద్రప్రదేశ్‌లో చంద్రబాబు తన విధానాలు మార్చుకుంటే మంచిదని హితవు పలికారు. -
‘కురుక్షేత్రం’ జరిగి తీరుతుంది..
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కృష్ణమాదిగ నయీంనగర్(వరంగల్): కురుక్షేత్ర మహాసభను నిర్వహించి తీరుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ స్పష్టం చేశారు. హన్మకొండలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో జరగాల్సిన కురుక్షేత్ర సభను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నిరంకుశంగా అడ్డుకున్నారని విమర్శించారు. తాము సభ నిర్వహించాలనుకున్న స్థలంలో పోలీసులను మోహరింపజేశారని.. దీంతో తాము ఎక్కడ ఉండాలో తెలియలేదన్నారు. తెలంగాణలో చంద్రబాబు పాదయాత్రకు తాము సహకరించినా.. ఆయన మరిచిపోయారని ఆరోపించారు. మాదిగల సహకారంతోనే ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు వర్గీకరణకు సహకరించడం లేదని పేర్కొన్నారు. ఏదేమైనా విజయవాడ–గుంటూరు మధ్యలో కురుక్షేత్ర సభ నిర్వహించేందుకు హైకోర్టు నుండి అనుమతి రాగానే తేదీ ప్రకటిస్తామని మంద కృష్ణ వెల్లడించారు. -
‘పల్లె’కు వర్గీకరణ సెగ
ఓడీ చెరువు : పుట్టపర్తి నియోజకవర్గ ఎమ్మెల్లే ‘పల్లె’ రఘునాథరెడ్డికి ఎస్సీ వర్గీకరణ సెగ తగిలింది. శనివారం ఓడీ చెరువు మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మాజీ మంత్రి పల్లె పాల్గొన్నారు. విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ నాయకులు తంగేడుకుంట గ్రామం వద్ద రోడ్డుకడ్డంగా బైఠాయించి, నిరసన తెలిపారు. అక్కడి నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులను రోడ్డుపై నుంచి తొలగించేందుకు పోలీసులను పల్లె ఆదేశించారు. ఎస్ఐ సత్యనారాయణ, ఏఎస్ఐలు ఇస్మాయిల్, శివప్రసాద్ సిబ్బందితో కలిసి ఎమ్మార్పీఎస్ నాయకులను అక్కడి నుంచి పంపించేందుకు యత్నించారు. అయితే పోలీసులు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. ఎమ్మెల్యే ఇక్కడికి వచ్చి వర్గీకరణ అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చేవరకు ఇక్కడి నుంచి కదిలేది లేదని భీష్మించి కూర్చున్నారు. ఎమ్మార్పీఎస్ నాయకులు బేకరీ గంగాధర్, కాలేజ్ తిప్పన్న, జింక సుంకన్న, రామయ్య మాట్లాడుతూ మందకృష్ణమాదిగ చేపట్టిన కురుక్షేత్ర యాత్రను అడ్డుకొని మాదిగలను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. సుమారు రెండు గంటల పాటు ఎమ్మార్పీఎస్ నాయకులు రోడ్డుపై భైఠాయించడంతో ఎట్టకేలకు ఆలస్యంగా ఎమ్మెల్యే పల్లె తంగేడుకుంటకు వచ్చారు. ఎమ్మార్పీఎస్ నాయకుల డిమాండ్లను విన్న ఎమ్మెల్యే పల్లె సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు. దీంతో ఆందోళన విరమించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు రామ్మోహన్, ఆనంద్, లక్ష్మీనారాయణ, రమణ, ఎర్రదొడ్డెప్ప, గంగాద్రి, కిష్ట, వీరప్ప, నాగభూషణ, డీలర్ రమణ, పలకగంగన్న, వెంకటరమణ, గంగులప్ప మహిళలు పాల్గొన్నారు. -
జూలై 7న చలో ఢిల్లీ
అనంతపురం రూరల్ : ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ జూలై 7న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద చేపట్టనున్న ఆందోళనకు మాదిగలు తరలివచ్చి జయప్రదం చేయాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు అక్కులప్ప పిలుపునిచ్చారు. శనివారం స్థానిక ఎన్జీఓ హోంలో ‘చలో ఢిల్లీ’ కరపత్రాలు విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చి, అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా దళితులకు ఉన్న అన్ని నామినేటెడ్ పోస్టులను మాలలకు కేటాయించడం ఏమిటని ప్రశ్నించారు. మాదిగలను ఓటు బ్యాంక్‌గా వాడుకుంటున్న టీడీపీకి వచ్చే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్తామన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు వెంకటేష్, చంద్ర, జయప్రకాష్, లక్ష్మన్న, నరసింహులు, రాజు, నాగప్ప, గంగాధర్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
మాట తప్పిన సీఎంకు బుద్ధి చెబుదాం
- ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ ఆలూరు రూరల్/ పత్తికొండ/ఆదోని: ఎస్సీ వర్గీకరణ చేస్తానని చెప్పి మాటతప్పిన సీఎం చంద్రబాబుకు వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతామని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ అన్నారు. ఆదివారం ఆలూరు, ఆదోని పట్టణాల్లో కురుక్షేత్ర సన్నాహక సభలు నిర్వహించారు. పత్తికొండలో విలేకరులతో ఆయన మాట్లాడారు. మాదిగ, మాలల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చిచ్చురేపుతున్నారన్నారు. ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకుపోయేందుకు శ్రమిస్తానన్నారు. మాదిగల సమస్యలను ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లి మద్దతు తెలపాలని కోరతామన్నారు. ఎస్సీ వర్గీకరణపై కేంద్రానికి చంద్రబాబు ఒక సారి కూడా లేఖలు రాయలేదన్నారు. అమరావతిలో జూలై 7వ తేదీన భారీ ఎత్తున కురుక్షేత్ర సభ నిర్వహించి ప్రభుత్వ కళ్లు తెరిపిస్తామన్నారు. ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు సుబాష్‌చంద్ర, జాతీయ అ«ధికార ప్రతినిధి కెవి. వెంకట రమణ, బుడగజంగాల జాతీయ అధ్యక్షుడు తాటికొండ నారాయణ, రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు, జిల్లా నాయకులు పులికొండ, రాముడు, రామకొండ వన్నూరుబాషా, రామంజినేయులు, శ్రీరాములు, రవికుమార్ పాల్గొన్నారు. -
మాకు వెన్నుపోటు పొడిచారు: మందకృష్ణ
హైదరాబాద్: ఎస్టీ, మైనారిటీలకు రిజర్వేషన్లు పెంచిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళితులకు, బలహీనవర్గాలకు పెంచకపోవడం వెన్ను పొడవడమే అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ దుయ్యబట్టారు. ఓయూలో విలేకరులతో మాట్లాడుతూ.. దళిత వ్యతిరేక విధానాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ మానుకోకపోతే రాజకీయంగా దళితులు భూస్థాపితం చేస్తారని హెచ్చరించారు. దళితులపై దాడులు నియంత్రించాలని డిమాండ్ చేశారు. ఎస్సీ, బీసీలకు రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేస్తూ రెండు రోజుల పాటు దీక్ష చేయనున్నట్లు తెలిపారు. ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్ ను ఎత్తివేస్తే కేసిఆర్ ఇంటి ముందు ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
కేసీఆర్ మాదిగల ద్రోహి : ఎమ్మార్పీఎస్
కుషాయిగూడ: నాడు ఉప ముఖ్యమంత్రి రాజయ్యను పదవి నుంచి తప్పించి.. నేడు ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌చంద్ర పదవి కాలం పొడగించకుండా సీఎం కేసీఆర్ అవమానపరిచారని మేడ్చల్ జిల్లా ఎమ్మార్పీఎస్ నాయకుడు కేశపాక రాంచందర్ ఆరోపించారు. రాంచందర్ ఆధ్వర్యంలో గురువారం ఈసీఐఎల్ చౌరస్తాలోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. తెలంగాణ రాష్ర్ట ఆవిర్భావం నుంచి దళితులను కేసీఆర్ అవమానపరుస్తూనే ఉన్నారని ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకులు కేశపాక రాంచందర్ మాదిగ మాట్లాడారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై నోరు మెదపని కేసీఆర్ మాదిగల ద్రోహి అని విమర్శించారు. నిరసనలో భాగంగా నేడు రాష్ర్టవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ దిష్టిబొమ్మలను దహనం చేయనున్నట్లు ఆయన తెలిపారు. -
మందకృష్ణ జాతికి క్షమాపన చెప్పాలి
ఉస్మానియా యూనివర్సిటీ: ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణమాదిగ దండోర ఉద్యమాన్ని మనువాదులకు తాకట్టుపెట్టారని ఎమ్మార్పీఎస్–టీఎస్ రాష్ట్ర అధ్యక్షులు యాతకుల భాస్కర్‌మాదిగ, వర్కింగ్ ప్రసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ అన్నారు. శనివారం ఓయూ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడుతూ ధర్మయుద్ధ మహాసభ వర్గీకరణ సాధనకు అఖరు పోరాటమని ప్రకటించిన మందకృష్ణ మాదిగలను, మాదిగ ఉపకులాలను మనువాదులకు తాకట్టుపెట్టి మరో సారి మోసం చేశారన్నారు. వర్గీకరణకు ప్రధాని సుముఖంగా ఉన్నారని, పార్లమెంట్ సమావేశాల్లో బిల్లుపెడతామని ప్రకటించిన వెంకయ్యనాయుడు సమావేశాల్లో వర్గీకరణ ఊసే ఎత్తకపోవడం దారుణమన్నారు. వర్గీకరణ విషయంలో చిత్తశుద్ధిలేని వెంకయ్యనాయుడు కాళ్లు మొక్కి, అంబేద్కర్‌తో పోల్చిన మందకృష్ణమాదిగ జాతికి క్షమాపన చెప్పాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మేడిపాపాయ్యమాదిగ, సుంకపాక దేవయ్యమాదిగ, సురేందర్ మాదిగ, సునీల్, బీవీ రమణ, అలెగ్జాండర్, కొంగరి శంకర్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. -
వర్గీకరణ చేసి తీరుతాం : వెంకయ్య
-
వర్గీకరణ చేసి తీరుతాం
అప్పుడే మాదిగ కులాలకు న్యాయం ధర్మయుద్ధం మహాసభలో వెంకయ్యనాయుడు వర్గీకరణకు బీజేపీ కట్టుబడి ఉంది మా ప్రభుత్వ హయాంలోనే ఈ ప్రక్రియ పూర్తి చేస్తాం నేను ముందుండి నడిపిస్తా.. అవసరమైతే పోరాటం చేస్తా నోట్ల రద్దు సమస్య పెద్దగా లేదు ఉంటే ఈ సభకు ఇంతమంది వచ్చేవారే కాదు పార్లమెంట్లో వర్గీకరణపై బిల్లు పెడితే మద్దతు: సురవరం సాక్షి, హైదరాబాద్ ‘‘రాజ్యాంగం హక్కులు కల్పించినా మాదిగ కులాలకు ఆ ఫలాలు అందలేదు. దీంతో ఆ కులాలన్నీ ఆర్థికంగా, సామాజికంగా బాగా వెనకబడ్డాయి. ఆ కులాలను ముందుకు తీసుకురావాలంటే ఎస్సీ వర్గీకరణ తప్పనిసరి. అందుకు బీజేపీ కట్టుబడి ఉంది. అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తూ లేఖలు కూడా ఇచ్చాయి. అయితే వర్గీకరణ అంశం సులువైంది కాదు. రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. అందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా బిల్లు పెట్టి చట్టాన్ని తీసుకురావాలి. ఈ ప్రక్రియను నేను ముందుండి నడిపిస్తా. అవసరమైతే పోరాటం చేస్తా..’’అని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి ఎం.వెంకయ్య నాయుడు అన్నారు. ఆదివారం సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్సలో ఎమ్మార్పీఎస్ తలపెట్టిన ధర్మయుద్ధ మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... ‘‘ఎస్సీ వర్గీకరణకు మద్దతుగా నేను మాట్లాడితే కొన్ని వర్గాలు నాపై కోపాన్ని ప్రదర్శిస్తున్నాయి. దళిత కులాలను విభజిస్తున్నారంటూ రాద్ధాంతం చేస్తున్నాయి. కానీ నేను వర్గీకరణ ప్రక్రియను తప్పకుండా అమల్లోకి తీసుకువచ్చేందుకు కృషి చేస్తా. గతంలో రిజర్వేషన్ల ప్రక్రియను అమలు చేయాలన్న సందర్భంలో కొన్ని వర్గాలు హిందువులను విభజిస్తున్నారంటూ గోల చేశాయి. కానీ రిజర్వేషన్లు జరగకపోతే పరిస్థితి మరోలా ఉండేది. అభివృద్ధి కొన్ని వర్గాలకే పరిమితమయ్యేది’’అని వెంకయ్య అన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం కులాల మధ్య గొడవలు పెట్టడం లేదని, అన్ని వర్గాలకు సమన్యాయం జరిగేందుకు కృషి చేస్తుందని, ఇందులో రాజకీయ ఉద్దేశం లేదని పేర్కొన్నారు. ‘‘నెల్లూరుకు వాజ్‌పేయి వచ్చినప్పుడు నేను మైకు పట్టుకుని ప్రకటనలు చేశా.. కానీ ప్రధాన మంత్రిగా ఉన్నప్పుడు నేను పార్టీ పెద్దగా ఆయన పక్కన కూర్చున్నా. నేనెప్పుడూ అంతటి స్థానం అందుకుంటానని ఊహించలేదు. వర్గీకరణ ప్రక్రియ అమల్లోకి వస్తే మాదిగ ఉపకులాల ప్రజలు కూడా అత్యున్నత స్థానాన్ని అందుకుంటారని ఆశిస్తున్నా. ఈ ప్రక్రియ న్యాయబద్ధంగా తీసుకొచ్చేందుకు అన్ని పార్టీల సమ్మతికి ప్రయత్నిస్తా. మాదిగ కులాల కలలను సాకారం చేస్తా. బిల్లుకు సరికొత్త రూపు తీసుకొస్తా’’అని చెప్పారు. నోట్ల సమస్య పెద్దగా లేదు కేంద్ర ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టిందని, దేశంలో ప్రతి అంశాన్ని సమూలంగా మార్చేందుకు ప్రధాని మోదీ ప్రయత్నిస్తున్నారని వెంకయ్యనాయుడు చెప్పారు. ఈ క్రమంలోనే నల్లధనాన్ని బయటకు తీసుకొచ్చేందుకు పెద్దనోట్లను రద్దు చేశామన్నారు. దీనిపై దేశవ్యాప్తంగా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రస్తుతం పెద్దనోట్ల రద్దు సమస్య పెద్దగా లేదని, సమస్య ఉంటే ఇంతపెద్ద సంఖ్యలో ప్రజలు సభకు వచ్చేవారే కారన్నారు. దేశ ప్రజల ఆశలు త్వరలో ఫలిస్తాయని... ఒకేసారి వాటిని అమలు చేయడం సాధ్యం కాదన్నారు. తమ ప్రభుత్వ హయాంలోనే పార్లమెంటులో వర్గీకరణ బిల్లు పాసయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. అనంతరం కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. మాదిగ కులాలు చేస్తున్న వర్గీకరణ ఉద్యమం న్యాయమైందని, ఈ అంశంపై ప్రధానికి వివరిస్తానన్నారు. కేంద్ర సర్వీసుల్లో మాదిగ కులాలకు అన్యాయం జరుగుతోందని కొందరు తనను ప్రశ్నించారని, వర్గీకరణ అమలైతే ఈ సమస్య ఉండదని చెప్పారు. ఇప్పటికే ఆలస్యమైంది: సురవరం ఎస్సీల వర్గీకరణ ప్రక్రియ ఇప్పటికే చాలా ఆలస్యమైందని, దీంతో మాదిగ ఉపకులాల్లో మూడు తరాలకు పైగా నష్టపోయాయని సీపీఐ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్‌రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంటులో బిల్లు పెడితే దేశంలోని అన్ని వామపక్ష పార్టీలు మద్దతిస్తాయని ఆయన తెలిపారు. దళితులపై ఇటీవల దాడులు పెరుగుతున్నాయని, వీటిని ఆపేందుకు ప్రభుత్వాలు మరింత సమర్థంగా పనిచేయాలన్నారు. వర్గీకరణకు మాల కులాలు మద్దతుగా నిలవాలని, దళితుల మధ్య ఐక్యత దెబ్బతింటే ఇతర వర్గాలు లాభపడతాయని, దీనిపై పునరాలోచించుకోవాలని సూచించారు. కేసీఆర్‌కు నాపై కోపం వచ్చినట్టుంది..: మందకృష్ణ ‘‘ఈ సభకు రావాల్సిందిగా ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఆహ్వానించేందుకు పలుమార్లు ప్రయత్నించా. ఈ రోజు మధ్యాహ్నం కూడా ట్రై చేశా. కానీ అపాయింట్మెంటే ఇవ్వలేదు. ఉప ముఖ్యమంత్రులు, మంత్రులతో చాలా ప్రయత్నం చేశా. కానీ వీలు చిక్కలేదు. నాపై ఎందుకు ఇంతటి కోపాన్ని పెంచుకున్నారో అర్థం కావడంలేదు. తెలంగాణకు దళితుడ్ని సీఎంగా చేస్తానని ఆయన అన్నారు. ఆ హామీని నెరవేర్చాలని మాత్రమే అడిగా. అందుకు ఆయనకు నాపై కోపం వచ్చినట్లుంది. కోపముంటే నాపై చూపాలి. కానీ మా మాదిగ కులాల ఆశయాలపై రుద్దొద్దు..’అని ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ అన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇటీవల ఢిల్లీలో ఓ సందర్భంగా కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడుకు పాదాభివందనం చేశా. దీనిపై సోషల్ మీడియాలో చాలా కామెంట్లు చూశా. కానీ నాకు ఎవరి వద్ద బానిసత్వం చేయాల్సిన పనిలేదు. వర్గీకరణ కోసం గత 22 ఏళ్లుగా వెంకయ్యనాయుడు నాకు సలహాలు, సూచనలిస్తూ ముందుకు నడిపించారు. దేశవ్యాప్తంగా పలు రాజకీయ పార్టీల అధ్యక్షులతో మద్దతుగా లేఖలు ఇప్పించారు. నా మాదిగ కులాల ప్రజల కోసం నేను ఏమైనా చేస్తా’’అని పేర్కొన్నారు. వెంకయ్య తనకు పెద్దన్న లాంటివారని, ఆయనకు పాదాభివందనం చేస్తే తప్పులేదని అన్నారు. సభలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభ పక్షనేత జానారెడ్డి, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, రేవంత్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేపీ పక్షనేత కిషన్‌రెడ్డి, ఎంపీలు నంది ఎల్లయ్య, ఆనంద్‌భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. దేశంలోని వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున ప్రజలు సభకు తరలివచ్చారు. -
'మాదిగల ఆకాంక్ష నెరవేర్చాలి'
హైదరాబాద్: మాదిగలది 50 ఏళ్ల ఆవేదన అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష మాదిగ అన్నారు. మాదిగల ఆకాంక్షలు నెరవేర్చాలని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన మాదిగల ధర్మయుద్ధం మహాసభలో ఆయన డిమాండ్ చేశారు. డబ్బులిస్తే మాదిగలు ఇక్కడకు రాలేదని, తమకు దోచుకున్న దాచుకున్న డబ్బుల్లేవన్నారు. ఎన్ని ఇబ్బందులున్నా లక్షలాదిగా ప్రజలు తరలివచ్చారని పేర్కొన్నారు. రాజ్యాంగ సవరణ చేసైనా ఎస్సీ వర్గీకరణ చేయాలని మందకృష తెలిపారు. భారత్ మాతాకీ జై అనగానే సరిపోదు.. మాదిగల పోరాటానికి అండగా ఉంటామని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు హామీఇచ్చారు. మాదిగలకు సమన్యాయం జరగాలన్నారు. మాదిగల పోరాటానికి రాజకీయాలతో సంబంధం లేదని తెలిపారు. మాదిగాల ఎస్సీ వర్గీకరణ లక్ష్యం సిద్ధించాలని ఆకాంక్షించారు. టీఆర్ఎస్ వాళ్లు సభకు రాకపోయినా నష్టం లేదన్నారు. భారత్ మాతాకీ జై అనగానే సరిపోదని, అందరూ అభివృద్ధి చెందినప్పుడే సమన్యాయం జరిగినట్టన్నారు. సమాజంలో ఉన్న అన్ని వర్గాలకు మేలు జరగాలని వెంకయ్యనాయుడు అన్నారు. ఈ సభకు టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్, టీడీపీ నేతలు ఎల్.రమణ, రేవంత్ రెడ్డితో పాటు పలు ప్రజాసంఘాల నేతలు హాజరయ్యారు. ఎస్సీ వర్గీకరణకు నేతలు మద్దతు తెలిపారు. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి భారీగా మాదిగలు తరలివచ్చారు. -
27న ఎమ్మార్పీఎస్ ధర్మయుద్ధ మహాసభ
ఆమనగల్లు(మహబూబ్‌నగర్ జిల్లా): శీతాకాల పార్లమెంటు సమావేశాలలో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపచేయాలని కోరుతూ ఈనెల 27న సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో దర్మయుద్ద మహాసభ నిర్వహిస్తున్నట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి రామచంద్రయ్య తెలిపారు. ఆమనగల్లు పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో శుక్రవారం ధర్మయుద్ద మహాసభ పోస్టర్లను స్థానిక ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామచంద్రయ్య మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ కోసం ఎమ్మార్పీఎస్ 23 ఏళ్లుగా పవిత్ర యుద్దం చేస్తుందని అన్నారు. ఎమ్మార్పీఎస్ ఎస్సీ వర్గీకరణ బిల్లును సాధించి తీరుతుందని ఆయన చెప్పారు. ఎస్సీ రిజర్వేషన్ సాధన కోసం ఎమ్మార్పీఎస్ అలుపెరగని పోరాటం చేస్తుందని, డిల్లీ వేధికగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం చేసిందని ఆయన వివరించారు. ఈనెల 23న జరిగే ధర్మయుద్ద మహాసభలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. -
హామీలు మరిచిన సీఎంకు బుద్ధి చెబుదాం
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడి పిలుపు - సింహా గర్జన మహాసభ పోస్టర్ ఆవిష్కరణ కర్నూలు సీక్యాంప్: ఎస్సీ వర్గీకరణకు హామీ విస్మరించిన సీఎం చంద్రబాబుకు బుద్ధి చెప్పేందుకు మాదిగలు సిద్ధం కావాలని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరపోగు వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. బుధవారపేటలోని సమితి కార్యాలయంలో ఆదివారం సింహగర్జన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చి మూడేళ్లు గడుస్తున్నా వర్గీకరణ అంశం ఊసెత్తడం లేదన్నారు. ఇందుకు సంబంధించి ఎన్నికల సమయంలో మాదిగలకు ఇచ్చిన హామీని నెరవేర్చాలని కోరారు. ఉషామెహ్రా కమిషన్ రిపోర్ట్ ఆధారంగా వర్గీకరణ చేపట్టాలని డిమాండ్ చేశారు. అనంతరం ఈ నెల 29న కర్నూలులో నిర్వహించే సింహా గర్జనకు సంబంధించిన మహాసభ పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్యమాదిగ, రాష్ట్ర కార్యదర్శి దాదాపోగునవీన్, ఎమ్ఎస్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ భానుప్రకాష్, జిల్లా అధ్యక్షుడు అరిగిలి రవి, కర్నూలు సిటీ అధ్యక్షుడు రాచపోగుల రవి తదితరులు పాల్గొన్నారు. -
ఎంఆర్పీఎస్ యువసేన అధ్యక్షునిగా గోవిందరాజులు
రామచంద్రపురం : ఎంఆర్పీఎస్ జిల్లా యువసేన అధ్యక్షునిగా రాజానగరం మండలం జి.ఎర్రంపాలెంకు చెందిన మందం గోవిందరాజులును నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు ఆకుమర్తి చిన్న శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లా ఇ¯ŒSచార్జ్ మంద వెంకటేశ్వరరావు, వ్యవస్థాపక అద్యక్షుడు మంద కృష్ణమాదిగల ఆదేశాలమేరకు ఈ నియామకం చేపట్టినట్లు చిన్న పేర్కొన్నారు. ఈనెల 27న హైదరబాద్‌లో జరిగే మాదిగల ధర్మయుద్ద మహా సభకు జిల్లా నుంచి పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపు నిచ్చారు. . -
10 నుంచి మాదిగల ధర్మపోరాటం
- ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ కర్నూలు సీక్యాంప్: ధర్మపోరాట రథయాత్ర కార్యక్రమం నవంబర్ 10 నుంచి ప్రారంభమవుతుందని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండువీరయ్య మాదిగ తెలిపారు. సోమవారం అంబేడ్కర్‌భవన్‌లో రాష్ట్ర ఎమ్మార్పీఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా దండు వీరయ్య మాదిగ మాట్లాడుతూ..ఎన్నికల మందు వర్గీకరణ చేస్తానని చెప్పిన టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు మాటతప్పి మాదిగలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు మోసాలను వివరిస్తూ నవంబర్ 10వ తేదీన శ్రీకాకుళం జిల్లా నుంచి ధర్మపోరాట రథయాత్ర ప్రారంభమవుతుందని..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంతటా పర్యటిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు నరసింహులు మాదిగ, పూలరాజు, ఈశ్వర్, గోపి, మట్టి ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మార్పీఎస్ ఇన్చార్జీల నియామకం
అనంతపురం న్యూటౌన్ : గ్రామీణ స్థాయిలో ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ ఉద్యమాన్ని బలోపేతం చేసే దిశగా గ్రామ, మండల నియోజక వర్గాలకు పార్లమెంటు, అసెంబ్లీ ఇన్చార్జీలను నియమించినట్లు ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంటు ఎంఎస్ రాజు తెలిపారు. ఈ మేరకు బుధవారం ఆ సంఘం కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఇన్చార్జీల వివరాలు వెల్లడించారు. అనంతపురం పార్లమెంటు ఇన్‌చార్జీలుగా చిన్నపెద్దన్న, కేఎల్ స్వామిదాసు, కణేకల్లు కష్ణ, హిందూపురం డివిజన్ ఇన్చార్జులుగా హనుమంతు, కుంటిమద్ది ఓబిలేసు, రంగనాథ్‌లను నియమించారు. అసెంబ్లీ ఇన్చార్జిగా అనంతపురానికి రవికుమార్, గుంతకల్లుకు అంజనప్రసాద్, ఉరవకొండకు రామదాసు, నాగరాజు, శింగనమలకు కదిరెప్ప, వీరనారాయణ, వేణు, రాం పుల్లయ్య, రామయ్య, తాడిపత్రికి ఎస్వీ రమణ, మహేష్, రామాంజి, రాయదుర్గానికి కేసీ నాగరాజు, కొల్లయ్య, మహేష్, కల్యాణదుర్గానికి ఆంజనేయులు, విజయ్, నాగరాజు, పెనుకొండకు శ్రీనివాసులు, మడకశిరకు రఘురాం, పుట్టపర్తికి గోవింద, హిందూపురానికి ఆనంద్, నరసింహులు, మురళి, ధర్మవరానికి వెంకటేష్, హరి, రాప్తాడుకు జయప్రకాష్, రమణ, కదిరికి గంగిశెట్టి రజనీకాంత్‌ను నియమించినట్లు తెలిపారు. -
ఎస్సీ వర్గీకరణ కోసం కలిసిరావాలి
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణ వరంగల్ : షెడ్యూల్డ్ కులాల వర్గీకరణ కో సం జరుగుతున్న సమరంలో అందరూ స్వ చ్ఛందంగా కలిసిరావాలని ఎమ్మార్పీఎస్ వ్య వస్థాపకుడు మంద కృష్ణమాదిగ అన్నారు. శుక్రవారం హన్మకొం డలోని హరితకాకతీ య హోటల్లో ఏర్పా టు చేసిన కుల సంఘా లు, ప్రజా సం ఘాలు, మేధావుల సన్నాహ క సదస్సులో ఆయన మాట్లాడారు. 35కు పైగా కుల, ప్ర జా సంఘాల నాయకులు హా జరై తమ సంపూర్ణ మద్దతు ప్రకటించడం అభినందనీయమని అన్నారు. సీనియర్ ప్రొ ఫెసర్, రైతు సంఘం నాయకులు కూరపాటి వెంకటనారాయణ మాట్లాడుతూ న్యాయంగా జరుగుతున్న ఎస్సీ వర్గీకరణ ఉద్యమం అంతి మదశలో ఉందని ఇందుకు అన్ని వర్గాల ప్రజ ల నుంచి మద్దతు కావాలని కోరారు. ఎమ్మార్పీఎస్ ఉద్యమ ప్రస్థానంలో తమ పోరాటా లు కేవలం మాదిగల పక్షానే కాక సమాజంలో ని అన్ని వర్గాల క్షేమం కోసం చేసినట్లు తెలిపా రు. వారి పోరాటాల ఫలితంగానే ప్రభుత్వా లు పలు పథకాల రూపకల్పన చేశారని పేర్కొన్నారు. ప్రొఫెసర్ సారంగపాణి మాట్లాడుతూ ఇదే ఐక్య చాటే సమయమని, ఇప్పుడే ఎస్సీ వర్గీకరణ సాధించే దశలో ఉన్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం నాయకులు తిరుణహరిశేషు, మహాజన జేఏసీ వ్యవస్థాపకుడు రాజమౌళి, ఎల్‌హెచ్‌పీఎస్ నాయకులు జైసింగ్‌రాథోడ్ పాల్గొన్నారు. -
వర్గీకరణ సాధించే వరకూ పోరాటం
కోదాడ : ఎస్సీల వర్గీకరణ సాధించే వరకూ ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు, నాయకులు వెనుదిరుగవద్దని టీఎమ్మార్పీస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్ కోరారు. డప్పు–చెప్పు కార్మికులకు నెలకు 2 వేల రూపాయల పించన్ ఇవ్వాలని ఆయన చేపట్టిన పాదయాత్రలో భాగంగా మంగళవారం కోదాడలోని రంగాథియేటర్ సెంటర్లో ఏర్పాటు చేసిన సభలో ఆయన మాట్లాడారు. డప్పు, చెప్పు కార్మికులకు 2 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, ఎస్సీ వర్గీకరణ జరిగే వరకు మీ వెంటే ఉంటానని ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ హమీ ఇచ్చారని దానిని నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. తన పాద యాత్ర ఇప్పటికే 175 కిలోమీటర్లు పూర్తయిందన్నారు. టీఎమ్మార్పీస్ రాష్ట్ర అధ్యక్షుడు యాతాకుల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ సాధన పోరాటంలో మందుండి పోరాడినది మాదిగలేనన్నారు. నవంబర్ 16న లక్ష మంది మాదిగలతో కలిసి భారీ బహిరంగసభను ఏర్పాటు చేస్తున్నామని, మాదిగలంతా ఆ సభకు తరలిరావాలని కోరారు. ఎస్సీలలో ఎన్నో ఉపకులాలు ఉన్నప్పటికీ ఒకటి రెండు కులాలే రిజర్వేషన్ల ఫలాలను అనుభవిస్తూ వస్తున్నాయన్నారు. వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టే విధంగా అన్ని పార్టీలు కృషి చేయాలని, అందుకు మాదిగ నాయకులు, కార్యకర్తలు రాజీలేని పోరాటాలు నిర్వహించాలని కోరారు. రేపటి నుంచి ఖమ్మం జిల్లాలో పాదయాత్ర జరుగనుంది. అంతకు ముందు రాత్రి బసచేసిన కోదాడ రైస్‌మిల్లర్స్ భవనం నుంచి బయలుదేరిన పాతయాత్ర కార్యకర్తలు,నాయకులు కోలాటాలు, మేళతాళాలతో స్వాగతం పలికారు. పట్టణంలో శ్రీనివాస్ ఎమ్మార్పీస్ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో రా్రçష్ట ఉపాధ్యక్షుడు చింతాబాబు, ఆమరారపు శ్రీను, కుటుంబరావు, రాయల వీరస్వామి, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు పరిష్కరించాలి
గుండాల : మాదిగ రిజర్వేషన్ల పోరాటం కోసం చేపట్టిన పాదయాత్ర ఫలితంగా సమస్యలు పరిష్కారం కాకుంటే నవంబర్ 18 తరువాత ప్రభుత్వంపై ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ అన్నారు. డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వడంతో పాటు వచ్చే పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశ పెట్టాలని చేపట్టిన మాదిగ చైతన్య పాదయాత్ర మంగళవారం గుండాలకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హైదరాబాద్‌లోని నిజాం కాలేజి గ్రౌండ్స్‌లో తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరిగిన సమావేశంలో మంత్రులు ఈటెల రాజేందర్, డిప్యూటీ సీఎం మహమూద్‌అలీ హామీ ఇచ్చినప్పటికీ మాదిగల వర్గీకరణ సమస్య నెరవేర్చక పోవడం వల్ల పాదయాత్ర చేపట్టామన్నారు. నవంబర్ 18లోగా ఎస్సీ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశ పెట్టివ్వడంతో పాటు డప్పు, చెప్పు కళాకారులకు రూ.2 వేల పింఛన్ ఇవ్వకపోతే ప్రభుత్వంపై చావు డప్పుతో ప్రచ్ఛన్న యుద్ధానికి సిద్ధమవుతామని హెచ్చరించారు. మాదిగల సమస్యల పరిష్కారం కోసం మాదిగలంతా ఏకం కావాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎమ్మార్పీఎస్ మండల శాఖ అధ్యక్షుడు నత్తి కృష్ణ మాదిగ, టీఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు యాపాకుల భాస్కర్, జాతీయ గౌరవ అధ్యక్షుడు సండ్రపల్లి వెంకటయ్య, మాదిగ ఉద్యోగుల ఫోరం రాష్ట్ర కన్వీనర్ చిలుకమారి గణేష్ మాదిగ, నాయకులు శ్రీను, కిష్టయ్య, నర్సయ్య, శంకర్, దశరథ, కొండల్రావు, స్వామి తదితరులు పాల్గొన్నారు. -
దళితులను నిర్లక్ష్యం చేస్తున్నారు
ఆలేరు : దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 70ఏళ్లు కావస్తున్నా నేటికీ దళితులను చిన్నచూపు చూడడం తగదని టీ–ఎమ్మార్పీఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వంగపల్లి శ్రీనివాస్‌మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. టీఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగచైతన్య పాదయాత్ర సోమవారం ఆలేరుకు చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెప్పులు కుట్టేవారికి, డప్పులు కొట్టేవారికి రూ. 2వేలు పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్లో ప్రవేశపెట్టి చట్టబద్ధత కల్పించాలన్నారు. ఎస్సీ సబ్‌ప్లాన్ నిధులను దారిమళ్లిస్తున్నారని, నేత, గీత, బీడీ కార్మికులకు పెన్షన్లు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని, సమాజసేవ చేస్తున్న చెప్పులు కుట్టే, డప్పులు కొట్టేవారికి పెన్షన్లు ఇవ్వకపోవడం బాధాకరమన్నారు. నవంబర్ 18లోపు ప్రభుత్వం స్పందించకపోతే తమ ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టీ–ఎమ్మార్పీఎస్ అధ్యక్షులు యాతాకులు భాస్కర్, కందుల రామన్, గ్యార నరేష్, మాటూరు నాగరాజు పాల్గొన్నారు. -
వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయి
మందకృష్ణమాదిగ నెల్లూరు(సెంట్రల్): ఎస్సీ వర్గీకరణను కొన్ని శక్తులు అడ్డుకుంటున్నాయని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మందకృష్ణమాదిగ పేర్కొన్నారు. నెల్లూరులోని ఒక కళ్యాణమండపంలో శుక్రవారం నిర్వహించిన ఎమ్మార్పీఎస్ నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇరవయ్యేళ్ల క్రితమే వర్గీకరణ జరగాల్సిందని, తమ కులంలోనే ఉన్నత స్థానంలో ఉన్నవారు దానిని అడ్డుకున్నారన్నారు. న్యాయస్థానాలలో ఏపీకి చెందినవారు కూడా అడ్డుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం వర్గీకరణకు కేంద్రం అనుకూలంగా ఉందని తెలుస్తోందన్నారు. చివరి నిమిషంలో కూడా వర్గీకరణను అడ్డుకునేందుకు చాలామంది ప్రయత్నించవచ్చని ఆందోళన వ్యక్తం చేశారు. అందరూ కలసి ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు పోరాడుదామని పిలుపునిచ్చారు. అందుకే నవంబరు 20న హైదరాబాద్‌లో మాదిగల మహాధర్నా కార్యక్రమం చేపట్టామని మందకృష్ణ మాదిగ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్షుడు మందాపెంచలయ్య, నాయకులు మంచు వేణు, బెల్లంకొండ గోపి పాల్గొన్నారు. -
‘చలో అమలాపురం’ పోస్టర్ విడుదల
కర్నూలు సీక్యాంప్: రాష్ట్రవ్యాప్తంగా దళితులపై పెరిగిపోతున్న దాడులు, వాటిని అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ ఈ నెల 12న తలపెట్టిన చలో అమలాపురం కార్యక్రమానికి సంబంధించి పోస్టర్‌ను ఆదివారం విడుదల చేశారు. బుధవారపేట ఎమ్మార్పీఎస్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు అలిగిరి రవి మాదిగ మాట్లాడారు. ఆవు చర్మం వలిచినందుకు కోస్తాంద్రంలో దళితులను కొందరు దుండగులు చెట్టుకు కట్టేసి కొట్టారని, సభ్య సమాజంలో ఉంటున్న మనం ఇలాంటి పరిస్థితులను చూసి సిగ్గుపడాలని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లాలో ఎస్సీ, ఎస్టీల భూములను అగ్రకులస్తులు కబ్జా చేస్తున్నారని, వారికి అధికార పార్టీనేతలు అండదండలుండడం దురదష్టకరమన్నారు. ఈ శీతాకాల సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లుపై అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాత్రిసుబ్బయ్య, రాష్ట్ర కార్యదర్శి నవీన్మాదిగ, కుమార్, రూబేన్, విజయ్, నరసింహులు, చిన్నలక్ష్మన్న తదితరులు పాల్గొన్నారు. -
స్వార్థ ప్రయోజనాల కోసమే విభజన
మార్పునకు కేంద్రం కాకుండా కుట్ర జిల్లా బంద్‌కు సంపూర్ణ మద్దతు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ వరంగల్ : టీఆర్ఎస్ ప్రభుత్వ మార్పునకు భవిష్యత్‌లో గ్రేటర్ వరంగల్ కేంద్రంగా ఉంటుందన్న భయంతోనే రెండు జిల్లాలుగా విభజించే కుట్ర జరుగుతోందని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ అన్నారు. హన్మకొండలోని హరిత కాకతీయలో సోమవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నూతన జిల్లాల ఏర్పాటు శాస్త్రీయంగా కాకుండా స్వార్థపూరిత ప్రయోజనాల కోసం జరుగుతున్నాయన్నారు. ఓరుగల్లు చరిత్రను తుంగలోకి తొక్కేందుకు కుట్ర జరుగుతోందన్నారు. హన్మకొండ జిల్లా ఏర్పాటుతో చరిత్ర విచ్ఛిన్నం అవుతుందన్న వేదన అందరిలో ఉందన్నారు. కొత్తగా ఏర్పాటవుతున్న భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాకు చెందిన ప్రజలు కూడా వరంగల్‌ను విడదీయెుద్దన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పరిపాలన సౌలభ్యం అంటే కోటి జనాభా ఉన్న హైదరాబాద్, సికిందరాబాద్, సైబరాబాద్‌లను ఎందుకు విడదీయడం లేదన్నారు. సీఎం సొంత జిల్లా మెదక్‌లో ఒక్కో జిల్లా కేంద్రానికి మధ్య 55 నుంచి 75 కిలోమీటర్లు ఉన్నదని, కానీ ఎనిమిది కిలోమీటర్ల దూరం లేని హన్మకొండ, వరంగల్‌ను ఎలా విడదీస్తారని ప్రశ్నించారు. హైదరాబాద్ తర్వాత ఎక్కువ పెట్టుబడులు వచ్చేందుకు వరంగల్ జిల్లా అనుకూలంగా ఉందని, దాన్ని అడ్డుకునేందుకే ఈ విభజన అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చిందన్నారు. జిల్లా పరిరక్షణ కమిటీ నేతృత్వంలో మంగళవారం జరిగే బంద్‌కు ఎమ్మార్పీఎస్ పూర్తిగా మద్దతు ఇవ్వడమే కాకుండా ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో ఎంఎస్పీ జాతీయ ప్రతినిధి ప్రదీప్, ఎమ్మార్పీఎస్ నాయకులు మంద కుమార్, మల్లేష్, వినోద పాల్గొన్నారు. -
‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టుతో విచారణ జరిపించాలి’
కొల్లాపూర్: వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టుచే విచారణ జరిపించాలని ఎమ్మార్పీఎస్ జిల్లా అధ్యక్షుడు కోళ్లశివ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులతో రాస్తారోకో నిర్వహించారు. మండల పరిధిలోని కుడికిళ్ల గ్రామంలో ఇటీవల అత్యాచారానికి గురై ఆత్మహత్య చేసుకున్న ఆకుతోట వర్షిణి మృతిపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, సీఐడీచే విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. బాధిత కుటుంబానికి రూ. 50లక్షల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దుండగులను నిర్భయ చట్టం ద్వారా శిక్షించాలని అన్నారు. ఈ కేసులో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే ఆందోళనకు సిద్ధమవుతామని ఆయన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. కార్యక్రమంలో దండోరా తాలూకా ఇన్చార్జి లక్ష్మయ్య, జిల్లా నాయకులు వడ్డెమాన్ రాముడు, సన్నయ్య, కుర్మయ్య, ఎంఎస్ఎఫ్ తాలూకా ఇన్చార్జ్ తోలు రాముడు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వర్గీకరణను అడ్డుకుంటున్న శక్తులు
ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి సుధాకర్ మాదిగ కొరిటెపాడు (గుంటూరు): ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధతపై మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్) ఆధ్వర్యంలో జరుగుతున్న పోరాటం ప్రస్తుతం కీలక దశకు చేరుకుందని ఎమ్మార్పీఎస్ జాతీయ అధికార ప్రతినిధి దొండపాటి సుధాకర్‌మాదిగ పేర్కొన్నారు. స్థానిక అంబేడ్కర్ భవన్లో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీ వరకు ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ఎస్సీ వర్గీకరణ చట్టబద్ధత కోసం చేపట్టిన ఆందోళనకు అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులు, కేంద్ర మంత్రులు ఎం.వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయలు సైతం మద్దతు ఇచ్చారని, అయినా కొన్ని శక్తులు ఇంకా అడ్డుకునేందుకు కుట్రలు, కుతంత్రాలు కొనసాగిస్తూనే ఉన్నాయని ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలో ఈ నెల 24న ఎమ్మార్పీఎస్, అనుబంధ సంఘాల మేధోమధన సదస్సు, 26న అన్ని కులాలు, ప్రజా సంఘాల మేధోమదన సదస్సు, 27న అన్ని రాజకీయ పార్టీల మేధోమధన సదస్సు, 28న ఉద్యోగులు, మేధావులు మేధోమదన సదస్సు, సెప్టెంబర్ 4వ తేదీన మాదిగ సర్పంచులు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు మేధోమధన సదస్సులు హైదరాబాదులో మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరగనున్నాయని తెలిపారు. -
దాడులు సహించం : ఎమ్మార్పీఎస్
కదిరి టౌన్ : తెలుగుదేశం పార్టీ పాలనలో ఎస్సీఎస్టీలపై దాడులు, దౌర్జన్యాలు అధికమయ్యాయని, ఇలాంటి చర్యలను ఇకపై సహించబోమంటూ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణస్వామి హెచ్చరించారు. భూకబ్జాలు, బెదిరింపులు, అరాచకాలు పునరావృతమైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామన్నారు. స్థానిక ఆర్అండ్బీ అతిథిగృహంలో బుధవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కదిరి ప్రాంతంలో ఎస్సీ, ఎస్టీలను అధికార పార్టీకి చెందిన నాయకులు ఇబ్బందులకు గురి చేస్తున్నారన్నారు. కదిరి ఆర్ఎస్ రోడ్డుకు చెందిన గంగరత్న భూమి పట్టాను రద్దు చేయించి, తనకు అనుకూలమైన వారికి అందించేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ పావులు కదుపుతున్నారని ఆరోపించారు. మున్సిపల్ కమిషనర్‌గా విధుల్లో చేరేందుకు వచ్చిన ఎస్టీ తెగకు చెందిన సుశీలమ్మను అడ్డుకుని బెదిరింపులతో వెనక్కు పంపిన ఘనత కూడా కందికుంటకే చెల్లిందన్నారు. ఎస్సీఎస్టీలపై దాడులు, బెదిరింపులకు పాల్పడుతున్న వారిపై క్రమశిక్షణా చర్యలతోపాటు అట్రాసిటీ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. సమావేశంలో గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మల్లికార్జున నాయక్, మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షులు జి.నాగరాజు, రాంప్రసాద్‌నాయక్, ఎంప్లాయీస్ యూనియన్ నాయకుడు నాగరాజు పాల్గొన్నారు. -
వర్గీకరణ సమస్త వర్గాల ఆకాంక్ష: మంద కృష్ణ
సాక్షి, న్యూఢిల్లీ: ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ సమాజంలోని సమస్త వర్గాల ఆకాంక్ష అని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. రిజర్వేషన్ల వర్గీకరణకు ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో జంతర్‌మంతర్ వద్ద చేపట్టిన ఆందోళన మంగళవారం 22వ రోజుకు చేరుకుంది. ఆందోళనలో పాల్గొన్న ముస్లిం సోదరులను ఉద్దేశించి మంద కృష్ణ మాట్లాడారు. ఈ దీక్షలో ముస్లింలు సైతం పాల్గొనడం సంతోషకరమన్నారు. మాలలు అధిక సంఖ్యలో వర్గీకరణను సమర్థిస్తున్నారన్నారు. బుధవారం మహాధర్నా నిర్వహిస్తున్నట్టు దీనికి తెలుగు రాష్ట్రాల మాదిగలు తరలిరావాలని పిలుపునిచ్చారు.