మాదిగలపై దాడిని ఖండిస్తున్నాం | The attack does not correct | Sakshi
Sakshi News home page

మాదిగలపై దాడిని ఖండిస్తున్నాం

Published Sat, Aug 6 2016 9:45 PM | Last Updated on Mon, Sep 4 2017 8:09 AM

మాదిగలపై దాడిని ఖండిస్తున్నాం

మాదిగలపై దాడిని ఖండిస్తున్నాం

రామగిరి : హైదరాబాదులోని నిజాం కళాశాలలో నిర్వహించిన ఎమ్మార్పీఎస్‌ వర్గీకరణ సంఘీభావ సంఘాల సమావేశంలో మాల లు ప్రవేశించి గాలి వినోద్, గద్దర్‌లపై దాడిచేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని ఎమ్మార్పీఎస్‌ జాతీయ నాయకుడు తీగల రత్నంమాదిగ, ఎంఈఎఫ్‌ జిల్లా అధ్యక్షుడు మల్లెపాక వెంకన్నమాదిగ, ఎమ్మార్పీఎస్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి బకరం శ్రీనివాస్‌ మాదిగ, ఎంఎస్‌ఎఫ్‌ రాష్ట్ర ప్రదాన కార్యదర్శి కొమిరె స్వామి మాదిగలు అన్నారు. శనివారం స్థానిక ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. కొందరు స్వార్థపరులు అంబేద్కర్‌ వాదులుగా చెప్పుకుంటూ స్వీయ ప్రయోజనాల కోసం  ప్రజాస్వా మ్యాన్ని ఖూనీ చేస్తున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో ఎమ్మార్పీఎస్, ఎంఈఎఫ్, ఎంఎస్‌ఎఫ్‌ నాయకులు మత్స్యగిరి, బొజ్జ దేవయ్య, బీపంగి అనిల్, వెంకటసింగ్, బరిగెల సైదులు, నర్సింహ, శివశంకర్, శ్రీశైలం, గణేష్, తీగల ఇంద్రకుమార్, శేఖర్, అరుణ్, స్వామినాథ్, హరికుమార్‌ పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement