
అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.
‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన.
..సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు.
.. ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది.

పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు.