sudhakar yadav
-
ఒక పోలీసు ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది?: వైఎస్ జగన్
గుంటూరు, సాక్షి: కూటమి పాలనలో రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం(Red Book Constitution)తో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని.. ప్రశ్నించే స్వరం ఉండకూడదనే భయానక వాతావరణం సృష్టిస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి(YS Jagan Mohan Reddy) అన్నారు. అయితే ప్రతి చర్యకు ప్రతి చర్య తప్పక ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారాయన. గురువారం ఉమ్మడి కర్నూలు జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు.రెడ్‌బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సంఖ్యాబలం లేకపోయినా అన్ని పదవులు తమకే కావాలని చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) అధికార అహంకారం చూపుతున్నారు. స్థానిక సంస్థల ఉప ఎన్నికలు మొన్ననే 57 చోట్ల జరిగాయి. గెలిచే వాతావరణం లేక 7 చోట్ల ఎన్నికలను చంద్రబాబు వాయిదా వేయించారు. 50 చోట్ల ఎన్నిక జరిగితే 39 చోట్ల వైఎస్సార్సీపీనే గెలిచింది. పార్టీ శ్రేణులు, నాయకులు తెగింపుతో గట్టిగా నిలబడి విజయం సాధించారు. చంద్రబాబు నాయుడు మన పార్టీ కేడర్‌ను ఏమీ చేయలేకపోయారు... అప్పటి స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ(YSRCP) స్వీప్ చేసింది. అలాంటి చోట్ల బలం లేకపోయినా చంద్రబాబు అధికార అహంకారం చూపారు. పోలీసులను వాచ్మెన్లకంటే ఘోరంగా వాడుకున్నారు. రామగిరి ఎంపీపీ ఉప ఎన్నికలో 10కి 9 చోట్ల గెలిచాం. మరి అక్కడ గెలవాల్సింది వైఎస్సార్సీపీ కదా?. అక్కడ ఎన్నికను తారుమారు చేయడానికి ప్రయత్నించారు. కోర్టు ఆదేశాలతో ఎంపీటీసీలకు భద్రత ఇవ్వాల్సింది పోయి, పోలీసులే ఎంపీటీసీలను బెదిరించే కార్యక్రమాలు చేశారు. రామగిరి ఎస్సై(Ramagiri SI) ఎంపీటీసీల వాహనం ఎక్కాడు. వీడియో కాల్లో ఎమ్మెల్యేతోనూ, ఎమ్మెల్యే కుమారుడితోనూ బెదిరించారు. టీడీపీకి అనుకూలంగా ఓటేయమని బెదిరించారు. మన పార్టీ ఎంపీటీసీలు ఎన్నిక సమయానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. వేరే మండల కేంద్రానికి తీసుకెళ్లి బైండోవర్ చేసే కార్యక్రమం చేశారు. దీనికి వ్యతిరేకంగా ధర్నాచేస్తే మన పార్టీ జిల్లా అధ్యక్షురాలి మీద, ఇన్ఛార్జిమీద కేసులు పెట్టారు. దీని తర్వాత మన పార్టీ తరఫున యాక్టివ్‌గా ఉన్న లింగమయ్యను హత్యచేశారు. ఈ మాదిరిగా చేయాల్సిన అవసరం ఏముంది? అని జగన్ ప్రశ్నించారు. ప్రజలు ప్రశ్నిస్తారని చంద్రబాబుగారు, ఆయన పార్టీ దారుణాలకు దిగుతోంది. ప్రశ్నించే స్వరం ఉండకూడదని రాష్ట్రవ్యాప్తంగా భయానక వాతావరణం సృష్టిస్తున్నారు. కానీ, ప్రతి చర్యకు, ప్రతి చర్య ఉంటుంది. చంద్రబాబు బంతిని ఎంత గట్టిగా కొడితే.. అంతే వేగంతో అది పైకి లేస్తుంది. ప్రజలకు మంచి చేయడమే ప్రజాస్వామ్యం. అధికారం ఉందని దురహంకారంతో ప్రవర్తిస్తే ప్రజలు కచ్చితంగా తిప్పికొడతారు. వచ్చే ఎన్నికల్లో సింగిల్ డిజిట్‌కూడా రాని పరిస్థితుల్లోకి వెళ్తారు. ఏపీ, తమిళనాడు ఎన్నికల్లో ప్రజలు వన్‌సైడ్‌గా ఇచ్చే తీర్పులు చూశాం. ఈపక్కన ప్రజలు తంతే.. ఆ పక్కన పడతారు. చంద్రబాబు భయపెట్టే ప్రయత్నాలు ఎక్కువ చేస్తాడు. కాబట్టి మనం అప్రమత్తంగా ఉండాలి అని ఉమ్మడి కర్నూలు కేడర్‌ను ఉద్దేశించి వైఎస్ జగన్ అన్నారు. -
పరిటాల సునీతే నీ చొక్కా ఊడదీసి రోడ్డుపై నిలబెడుతుంది చూసుకో..
-
టీడీపీకి ఊడిగం చేస్తావా.. శివ శంకర్ మాస్ వార్నింగ్
-
రామగిరి SI వ్యాఖ్యలకి లాయర్ స్ట్రాంగ్ కౌంటర్..
-
ఖాకీ చొక్కా టీడీపీకి తాకట్టు.. జగన్‌ను విమర్శించే స్థాయా నీది?
అనంతపురం, సాక్షి: రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉందని.. ఆయనే సరిగ్గా విధులు నిర్వహించి ఉంటే కురుబ లింగమయ్య హత్య జరిగి ఉండేదా? అని ప్రశ్నిస్తున్నారు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి(Thopudurthi Prakash Reddy). మాజీ సీఎం వైఎస్ జగన్‌ను ఉద్దేశించి ఎస్సై సుధాకర్ చేసిన కామెంట్లకు ప్రకాశ్‌రెడ్డి బుధవారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. ‘‘ముఖ్యమంత్రి చంద్రబాబు మెప్పు కోసమే రామగిరి ఎస్సై సుధాకర్ యాదవ్(SI Sudhakar Yadav) ఇప్పుడు మాట్లాడుతున్నారు. వైఎస్ జగన్ పై ఆయన చేసిన వ్యాఖ్యలు సరికాదు. జగన్‌ను విమర్శించే స్థాయి కూడా ఎస్సై సుధాకర్ యాదవ్‌కు లేదు. వ్యక్తిగత స్వార్థం కోసమే ఆయన పని చేస్తున్నారు. తన ఖాకీ చొక్కాను టీడీపీకి తాకట్టు పెట్టారాయన. ..సుధాకర్ వ్యవహార శైలి మొదటి నుంచి వివాదాస్పదంగానే ఉంది. రామగిరిలో వైఎస్సార్ సీపీ కార్యకర్త కురుబ లింగమయ్య హత్యకు ఎస్సై సుధాకరే కారణం. సుధాకర్ యాదవ్ ప్రోద్బలంతోనే టీడీపీ నేతలు బరితెగిస్తున్నారు. గతంలో దళితులను ఆయన కించపరచడం నిజం కాదా?. పరిటాల సునీతకు అనుగుణంగానే పని చేయడం వాస్తవం కాదా?. అసలు ఎస్సై సుధాకర్ సరిగగ్గా పని చేసుంటే లింగమయ్య హత్య జరిగి ఉండేదా?. నీ ధర్మ సందేశలు ఎక్కడికి పోయాయి? ఎవరిని నమ్ముకుని ఇలా చేస్తున్నావు?.టీడీపీ నేతలకు చుట్టంగా పనిచేసేందుకా నీకు ఖాకీ చొక్కా ఇచ్చింది?.. అంటూ సుధాకర్‌ను తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి నిలదీశారు... ఎస్సై సుధాకర్ యాదవ్ అక్రమాస్తులు అనేకం ఉన్నాయి. అందుకే రాజకీయాల్లోకి రావాలనుకుంటున్నాడు. ఎమ్మెల్యే పరిటాల సునీత ద్వారా వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ పొందాలని భావిస్తున్నాడు. కానీ, పరిటాల సునీత(Paritala Sunitha) ఇంకొకరికి టిక్కెట్ ఇప్పించే స్థాయిలో లేరన్న విషయం సుధాకర్ గ్రహించాలి. చంద్రబాబును ఎమ్మెల్యే పరిటాల సునీత దూషించారు. అందుకే ఆ కుటుంబానికి చంద్రబాబు వద్ద ప్రాధాన్యత లేకుండా పోయింది. పోలీసులపై అచ్చెన్నాయుడు అనుచిత వ్యాఖ్యలు కనిపించవా?. పోలీసుల పై చంద్రబాబు దూషణలు వినిపించవా?. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పాపిరెడ్డిపల్లి పర్యటన సందర్భంగా పోలీసుల ఆంక్షలు ఎందుకు?. చంద్రబాబు మెప్పు కోసం పనిచేసే పోలీసులను బట్టలూడదీస్తొనన్న వైఎస్ జగన్ వ్యాఖ్యల్లో తప్పేముంది?. కురుబ లింగమయ్య ను పరిటాల సునీత సమీప బంధువులు చంపితే... వారి అనుచరులనే కేసులో సాక్షులుగా పెట్టడం కరెక్టా?అని మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి వ్యాఖ్యానించారు. -
నకిలీ అధికారి అవతారమెత్తిన టీడీపీ నేత పుట్టా అనుచరుడు
సాక్షి ప్రతినిధి, కడప: సీఐడీ అధికారులమంటూ హడావుడి చేసిన నకిలీ అధికారుల బండారం బట్టబయలయిన ఘటనలో వైఎస్సార్ జిల్లా టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడితో సహా 8మందిని cc అరెస్టు చేశారు. వివరాల్లోకి వెళితే.. వైఎస్సార్ జిల్లా మైదుకూరుకు చెందిన న్యాయవాది మహేంద్రకుమార్ (38) టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు. పుట్టా సుధాకర్‌యాదవ్ ద్వారా హైదరాబాద్‌కు చెందిన రంజిత్‌కుమార్ (47)తో పరిచయం ఏర్పడింది. అతను గతంలో తాను పనిచేసిన హైదరాబాద్ కేంద్రంగా అమెరికా ఐటీ నియామకాల కార్యకలాపాలు నిర్వహిస్తున్న అజా (ఏజేఏ) సంస్థ వ్యవహారాల గురించి మహేంద్రకుమార్‌కు తెలిపారు. ఆ సంస్థ లొసుగుల కారణంగా డైరెక్టర్ సుగుణాకరను బెదిరిస్తే రూ.కోట్లు కొల్లగొట్టవచ్చని చెప్పాడు. ఈ క్రమంలో కర్నూల్ రేంజ్ కార్యాలయంలో ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న సుజన్‌ను సంప్రదించారు. ఎస్ఐ సుజన్ కడప అశోక్‌నగర్‌లో ఉంటున్న ఐటీ నిపుణుడు మహ్మద్ అబ్దుల్ ఖదీర్‌ను పరిచయం చేశారు. టెక్నికల్ ఇష్యూస్ బాగా తెలిసిన మరికొంతమంది సభ్యులతో కలిసి ఓ బృందంగా ఏర్పడ్డారు. ఆ మేరకు అజా సంస్థలోకి ప్రవేశించారు. సీఐడీ అధికారులుగా గుర్తింపు కార్డులు చూపించి తనిఖీలు నిర్వహించి నానా హడావుడి చేశారు. రూ.10కోట్లు డిమాండ్ అమెరికాలోని క్లయింట్ విషయంలో అవకతవకలకు పాల్పడినట్లు ఆ దేశ అధికారులు కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయడంతో తనిఖీలకు వచ్చినట్లు ఆ సంస్థ డైరెక్టర్‌ను భయపెట్టారు. ఈ వ్యవహారం నుంచి బయటపడాలంటే రూ.10కోట్లు ముట్టచెప్పాలని డిమాండ్ చేశారు. బేరసారాల తర్వాత రూ.2.3కోట్లు అప్పగించేలా అంగీకారం కుదిరింది. కంపెనీ ఖాతాల్లో రూ.71.80 లక్షలున్నాయని బాధితుడు చెప్పారు. నేరుగా తీసుకుంటే దొరికిపోతామని భావించి ఆ సంస్థ ఉద్యోగులు రవి, చేతన్, హరి ఖాతాల్లోకి రూ.26 లక్షలు బదలాయించారు. ఈ మొత్తం వ్యవహారం జనవరి 26న చోటు చేసుకుంది. 27వ తేదీ ఉదయం ఆ ముగ్గురు ఉద్యోగుల్ని మాదాపూర్‌లోని బాల్కనీ హోటల్‌కు తీసుకెళ్లి బంధించారు. ఏటీఎం కార్డులు, బ్యాంకు వివరాలు తీసుకుని రూ.12.5లక్షలు తమ ఖాతాల్లోకి మార్చుకున్నారు. మిగతా సొమ్ముకోసం డైరెక్టర్‌కు ఫోన్ చేసినా స్పందన లేకపోవడంతో.. ఉద్యోగుల్ని వదిలేసి పారిపోయారు. విషయం గ్రహించిన సంస్థ డైరెక్టర్ సుగుణాకర పోలీసులకు ఫిర్యాదు చేయగా మొత్తం వ్యవహారం బహిర్గతమైంది. ఈ వ్యవహారంలో సహకరించిన వారితో పాటు, ప్రత్యక్షంగా పాల్గొన్న 10మందిపై కేసు నమోదైంది. మైదుకూరు టీడీపీ ఇన్చార్జి పుట్టా సుధాకర్‌యాదవ్ అనుచరుడు మహేంద్రకుమార్, సుబ్బకృష్ణతో పాటు 8మందిని పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ సుజన్, రాజా అనే నిందితుడు పరారీలో ఉన్నారు. -
శ్రీవారి ఆభరణాలు భద్రమే..!
తిరుమల: అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య తిరుమల శ్రీవారి ఆభరణాలున్నాయని, పోటులో ఎలాంటి తవ్వకాలు జరగలేదని టీటీడీ చైర్మన్ పుట్టా సుధాకర్ యాదవ్ తెలిపారు. సోమవారం రాత్రి పద్మావతి అతిథి గృహంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అవాస్తవాలు ప్రచారం చేయడం మానుకోవాలని రమణ దీక్షితులకు సూచించారు. శ్రీవారి ఆలయంలో వజ్ర వైఢూర్యాలతో కూడిన ఆభరణాలను బోర్డు సభ్యులతో కలసి నిశితంగా పరిశీలించినట్లు చెప్పారు. 1952 నుంచి మిరాశీ వ్యవస్థ రద్దయిన 1996 వరకు ప్రతి ఆభరణాన్ని తిరువాభరణం రిజిస్టర్లో నమోదు చేశారని తెలిపారు. 2001లో గరుడ సేవ సందర్భంగా భక్తులు నాణేలు విసరడంతో కెంపు రాయి పగిలిందని చెప్పారు. పగిలిన కెంపు పొడిని సేకరించి మూటకట్టి రిజిస్టర్లో నమోదు చేశారన్నారు. పోటులోని పురాతన గోడలు దెబ్బ తినకుండా అడుగు మందంతో ఫైర్ రిఫ్రట్టరీ బ్రిక్‌వాల్ మాత్రమే ఏర్పాటు చేశారని.. నేలపై ఎలాంటి తవ్వకాలు జరగలేదన్నారు. కాగా, శ్రీవారి ఆభరణాలు ప్రదర్శించాలన్న ప్రతిపాదన ఆగమ శాస్త్రానికి విరుద్ధమని ఆగమ సలహా మండలి సభ్యుడు సుందరవదన భట్టాచార్యులు చెప్పారు. -
రైతులు సేంద్రియ ఎరువులనే వాడాలి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర్ర కార్యదర్శి, బాకారం సర్పంచ్ సుధాకర్ యాదవ్ అన్నారు. మండలంలోని బాకారం గ్రామంలో స్ట్రీట్ క్రాస్ ఈఫోర్స్ సంస్థ ద్వారా రైతులకు సేంద్రియ ఎరువుల తయారీపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. స్ట్రీట్ క్రాస్ ఈఫోర్స్ సంస్థ సభ్యులు గ్రామాలలో రైతులకు పండించే పంటలపై, పంటలకు కావాల్సిన ఎరువులపై అవగాహన కల్పించడం ఎంతో మంచిదని అన్నారు. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ కల్పించడం రైతులకు ఎంతో లాభదాయకం అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు శ్రీరాం రెడ్డి, మాడి వెంకట్ రెడ్డి, సంస్థ సభ్యులు మనోహర్ రెడ్డి, ఈశ్వర్, సుమయ్య, రిషిత, హేమంత్, చైతన్య, కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు. స్ట్రీట్ క్రాస్ ఈ ఫోర్స్ సంస్థ ద్వారా మండలంలోని ఆమ్డాపూర్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్షలకు కావాల్సిన ప్యాడ్లు, సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొళ్ల సిద్దయ్య, ఎంపీటీసీ సామ రాంరెడ్డిలు పాల్గొని పుస్తకాలను పంపిణీ చే«శారు. పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నామని సంస్థ సభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్ చారి, గుంటం సైపాల్ రెడ్డి, హరిపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
నామినేషన్‌కొచ్చారా... డబ్బు తీసుకోండి..
పుట్టా సుధాకర్ యాదవ్ నామినేషన్‌కు వచ్చారా.. అయితే డబ్బులు తీసుకోండీ.. అంటూ మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన కేవీఆర్ అనే టీడీపీ నాయకుడు గురువారం మధ్యాహ్నం డబ్బులు పంపీణీ చేశారు. మైదుకూరు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి అయిన పుట్టా సుధాకర్‌యాదవ్ గురువారం మధ్యాహ్నం భారీ జన సమీకరణ నడుమ నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ అనంతరం ఈ కార్యక్రమానికి ఆయా గ్రామాల నుంచి వచ్చిన వారందరికీ టీడీపీ ద్వితీయశ్రేణి నాయకులందరూ తలో వంద రూపాయలు నగదు చేతిలో పెట్టారు. మద్యం కావాలంటే వనిపెంట రోడ్డుకెళ్లండంటూ చెప్పారు. మైదుకూరు పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్, పోలీసుస్టేషన్, జెడ్పీహైస్కూలు ఇలా పలుచోట్ల నామినేషన్‌కు హాజరైన వారందరికీ వంద రూపాయల చొప్పున డబ్బులను పంచిపెట్టారు. కేవీఆర్ ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో రోడ్డుపై కారు ఆపి అందులో నుంచే డబ్బులను పంచారు. ఈ దృశ్యాలను ‘న్యూస్‌లైన్’ క్లిక్‌మన్పించటంతో అక్కడి నుంచి మకాం మరో చోటికి మార్చారు. ఇలాంటి సంఘటనలు మైదుకూరు పట్టణంలో పలు చోట్ల జరిగాయి.