రైతులు సేంద్రియ ఎరువులనే వాడాలి | Farmers should use organic fertilizers | Sakshi
Sakshi News home page

రైతులు సేంద్రియ ఎరువులనే వాడాలి

Published Tue, Jan 9 2018 8:45 AM | Last Updated on Mon, Oct 1 2018 2:16 PM

Farmers should use organic fertilizers - Sakshi

మొయినాబాద్‌ రూరల్‌(చేవెళ్ల): ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర్‌ర కార్యదర్శి, బాకారం సర్పంచ్‌ సుధాకర్‌ యాదవ్‌ అన్నారు. మండలంలోని బాకారం గ్రామంలో స్ట్రీట్‌ క్రాస్‌ ఈఫోర్స్‌ సంస్థ ద్వారా రైతులకు సేంద్రియ ఎరువుల తయారీపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ సుధాకర్‌ యాదవ్‌ మాట్లాడుతూ.. స్ట్రీట్‌ క్రాస్‌ ఈఫోర్స్‌ సంస్థ సభ్యులు గ్రామాలలో రైతులకు పండించే పంటలపై, పంటలకు కావాల్సిన ఎరువులపై అవగాహన కల్పించడం ఎంతో మంచిదని అన్నారు. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ కల్పించడం రైతులకు ఎంతో లాభదాయకం అని తెలిపారు.

కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు శ్రీరాం రెడ్డి, మాడి వెంకట్‌ రెడ్డి, సంస్థ సభ్యులు మనోహర్‌ రెడ్డి, ఈశ్వర్, సుమయ్య, రిషిత, హేమంత్, చైతన్య, కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు. స్ట్రీట్‌ క్రాస్‌ ఈ ఫోర్స్‌ సంస్థ ద్వారా మండలంలోని ఆమ్డాపూర్‌ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్షలకు కావాల్సిన ప్యాడ్‌లు, సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ కొళ్ల సిద్దయ్య, ఎంపీటీసీ సామ రాంరెడ్డిలు పాల్గొని పుస్తకాలను పంపిణీ చే«శారు. పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నామని సంస్థ సభ్యులు మనోహర్‌ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్‌ చారి, గుంటం సైపాల్‌ రెడ్డి, హరిపాల్‌ రెడ్డి పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement