ramagiri
-
ఆర్జీఎఫ్.. ఇది మన కేజీఎఫ్
సాక్షి ప్రతినిధి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గ పరిధిలోని రామగిరి బంగారు గనులకు(ఆర్జీఎఫ్) మంచి రోజులొస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట మూసేసిన ఈ గనులు మళ్లీ తెరుచుకోనున్నాయి. దీంతో వేలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి దొరకనుంది. గనుల తవ్వకానికి సంబంధించిన సంస్థలను ఎంపిక చేసేందుకు టెండర్లనూ ఆహ్వానించారు. టెండర్ల స్వీకరణ గడువు సెప్టెంబర్ 2తో ముగుస్తుంది. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే గనుల తవ్వకం ప్రారంభం కానుంది. రామగిరితో పాటు బొక్కసంపల్లి(రొద్దం మండలం), జౌకుల (కదిరి మండలం) ప్రాంతాల్లో 10 గోల్డ్ఫీల్డ్ బ్లాకులున్నాయి. వీటిలో మైనింగ్ జరిపేందుకు రాష్ట్ర భూగర్భ గనుల శాఖ అంతర్జాతీయ సంస్థల నుంచి టెండర్లు ఆహ్వానించింది. ఇందుకోసం పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇక్కడ బంగారు నిల్వలు బాగా ఉన్నట్టు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గతంలోనే తేల్చింది. రామగిరిలో 1984లో భారత్ గోల్డ్‌మైన్ అనే కంపెనీ తవ్వకాలు చేసి, ఆ తర్వాత 2001లో ఆపేసింది. ఏడాదికి 124 కిలోల బంగారం వెలికితీయాలని, అలా 17 ఏళ్లు చేయాలన్నది అప్పటి కంపెనీ నిర్ణయం. తర్వాత రకరకాల కారణాలతో మైనింగ్ ఆపేశారు. ఈ గనుల్లోనే తవ్వకాలు రామగిరి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, బొక్కసంపల్లి నార్త్ బ్లాక్, సౌత్ బ్లాక్, జౌకుల ఏ, బీ, సీ, డీ, ఈ, ఎఫ్ బ్లాక్‌లలో తవ్వకాలకు టెండర్లు పిలిచారు. ఈ పది బ్లాకుల్లో తవ్వకాల టెండరును దక్కించుకునేందుకు ఇప్పటికే పలు అంతర్జాతీయ సంస్థలు ముందుకొచ్చాయి. తాజాగా ఎంపిక చేసే సంస్థలకు తొలి రెండేళ్లు కాంపొజిట్ లైసెన్స్ ఇస్తారు. అంటే రెండేళ్ల పాటు తవ్వకాలు మాత్రమే చేస్తాయి. ఆ తర్వాత కమర్షియల్ లైసెన్స్(వాణిజ్య సంబంధిత) అనుమతులిస్తారు. రామగిరి, బొక్కసంపల్లి, జౌకుల ప్రాంతాల్లో ఉన్న గోల్డ్‌మైన్స్‌లో టన్ను మైనింగ్(తవ్వకం) జరిపితే 4 నుంచి 5 గ్రాముల వరకూ బంగారం వెలికి తీయొచ్చనేది అంచనా. ఒక్కో చోట 8 నుంచి 10 గ్రాముల వరకూ వెలికి వచ్చే అవకాశం ఉంది. అంతర్జాతీయంగా బంగారం ధర బాగా ఉండటం, అత్యాధునిక మైనింగ్ మెషినరీ అందుబాటులో ఉండటం వల్ల గతంలో మాదిరి కాకుండా ఇప్పుడు ఎక్కువ మంది బిడ్డర్లు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. భారీగా ఉపాధి అవకాశాలు ఇరవై ఏళ్ల కిందట మూతపడ్డ బంగారు గనులు తిరిగి తెరుచుకోనుండటంతో ఉమ్మడి అనంతపురం జిల్లాలో భారీగా ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. ప్రత్యక్షంగా 10 వేల మందికి, పరోక్షంగా మరో 10 వేల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నట్టు అంచనా. రవాణా రంగం, హోటల్ పరిశ్రమలు వంటి అనుబంధ పరిశ్రమలకు కూడా ఊతం ఇచ్చినట్టవుతుంది. అంతర్జాతీయ స్థాయి సంస్థలు బిడ్డింగ్‌కు రావడానికి రెండు కారణాలున్నాయి. అంతర్జాతీయంగా బంగారం ధర ఎక్కువగా ఉంది కాబట్టి మైనింగ్ చేసే సంస్థలకు నష్టమొచ్చే అవకాశమే లేదు. రెండోది.. అండర్ గ్రౌండ్ మైనింగ్. అండర్‌గ్రౌండ్ మైనింగ్ ప్రక్రియలో అత్యాధునిక యంత్రాలొచ్చాయి. ఎలాంటి ఇబ్బందుల్లేకుండా మైనింగ్ జరుగుతుంది. – బాలసుబ్రమణ్యం, అసిస్టెంట్ డైరెక్టర్, గనుల శాఖ, అనంతపురం -
చిన్నారి వైద్యం కోసం వెళ్తూ..
రామగిరి: చిన్నారికి వైద్యం చేయించేందుకు నగరం నుంచి బెంగళూరుకు కారులో బయలుదేరిన ఓ కుటుంబం రోడ్డుప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో అనారోగ్యంతో బాధపడుతున్న మూడు నెలల చిన్నారితో పాటు మరో వ్యక్తి మృత్యువాత పడ్డారు. స్థానికులు, పోలీసులు తెలిపిన మేరకు.. హైదరాబాద్‌కు చెందిన జాన్, జయ దంపతులకు మూడు నెలల క్రితం పాప పుట్టింది. అయితే పాప మెదడు సంబంధించిన వ్యాధితో బాధపడుతుండగా.. హైదరాబాద్‌లోని వైద్యులు బెంగళూరుకు రెఫర్ చేశారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం జాన్, జయ దంపతులు, వారి మూడు నెలల చిన్నారి, జాన్ తమ్ముడు శ్రీనివాసులుతోపాటు నగరానికే చెందిన వడియాల శ్రీనివాసులు(35) స్కార్పియో వాహనం (ఏపీ02డీ7771) అద్దెకు తీసుకుని బయలుదేరారు. వీరి వాహనం అనంతపురం జిల్లా రామగిరి మండలం పెనుబోలు జాతీయ రహదారి వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. ఘటనలో డ్రైవింగ్ చేస్తున్న వడియాల శ్రీనివాసులు, చిన్నారి అక్కడిక్కడే మృతి చెందగా..జాన్ దంపతులు, జాన్ తమ్ముడు శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను కారులో నుంచి బయటకు తీసి ప్రాథమిక వైద్యం చేయించారు. రామగిరి పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం ధర్మవరం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ( చదవండి: చోరీకోసం వచ్చి ప్రాణాలు కోల్పోయాడు ) -
‘అమ్మ’ పెట్టదు.. అడగనివ్వదు!
రామగిరి మండలం వెంకటాపురం గ్రామంలో వడ్డే కులానికి చెందిన దంపతులకు ఇద్దరు అబ్బాయిలు సంతానం. దశాబ్దాలుగా రెండు గదుల ఇంట్లోనే జీవనం సాగిస్తున్నారు. ఇప్పుడు పిల్లలిద్దరికీ పెళ్లిళ్లు చేసిన ఆ దంపతులు... మరోమార్గం లేక ఇద్దరు కోడళ్లు, కుమారులతో కలిసి ఆ ఇంట్లోనే సర్దుకుని జీవనం సాగిస్తున్నారు. వీరు ఇల్లు కట్టుకునేందుకు అర్హులు. ప్రభుత్వం కూడా ఇలాంటి వారికి ఇళ్లు కట్టించి ఇచ్చేందుకు సిద్ధంగా ఉంది. ఆ గ్రామానికే చెందిన ఓ వ్యక్తి ఇంటి పట్టా కోసం తన పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్నారు. కానీ ఒక్కరంటే ఒక్కరూ దరఖాస్తు చేసే సాహసం చేయని పరిస్థితి. ఇలాంటి వారు వెంకటాపురంలో చాలా మందే ఉన్నారు. పథకాలకు అర్హులైనప్పటికీ.. ఇక్కడ రాజకీయ నాయకులకు భయపడి ఒక్క పథకం పొందలేకపోతున్నారు. రామగిరి/అనంతపురం: వెంకటాపురం.. ఈ పేరు వినిపిస్తే చాలు ఓ రాజకీయ నేత గుర్తొస్తారు. ఏళ్లుగా అక్కడ ఆ కుటుంబానిదే ఆధిపత్యం. గ్రామంలో బతికి బట్టకట్టాలంటే వారి చెప్పుచేతల్లో ఉండాల్సిందే. లేదంటే ఊరు విడవక తప్పని పరిస్థితి. చివరకు ప్రభుత్వ పథకాలైనా వారు చెప్పిన తర్వాతే దరఖాస్తు చేసుకోవాలి. కాదూ.. కూడదని దరఖాస్తు చేయాలనుకుంటే ఆ గ్రామంలో వారికి నిలువ నీడ ఉండదు. అందుకే 750 జనాభా ఉన్న వెంకటాపురం దశాబ్దాలుగా పూర్తి నిర్బంధంలో బతుకుతోంది. దరఖాస్తు చేసుకోవాలంటేనే భయం రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలంతా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలనే ఉద్దేశంతో వివిధ సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఎందరో అర్హులు వాటిని అందిపుచ్చుకుని తమ జీవితాలను మార్చుకుంటున్నారు. కానీ రామగిరి మండలం వెంకటాపురంలో మాత్రం ఇందుకు భిన్నమైన వాతావరణం కనిపిస్తుంది. ప్రభుత్వం ఇద్దరు వలంటీర్లను ఆ గ్రామంలో నియమించినా.. ప్రభుత్వ పథకాలకు అర్హులైనప్పటికీ ఒక్కరు కూడా దరఖాస్తు చేసుకోలేని పరిస్థితి. గ్రామంలో ఎవరైనా వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పథకం తీసుకుంటే తమ ఆధిపత్యానికి గండి పడుతుందనే దురాలోచనతో ఆ గ్రామానికి చెందిన రాజకీయ నాయకులు పేదలను ముప్పుతిప్పలు పెడుతున్నారు. పోనీ వారైనా నిరుపేదలను ఆదుకుంటారా అంటే అదీ లేదు. ఎప్పుడూ ఏ మెట్రో సిటీలోనో లేదా జిల్లా కేంద్రంలోనో హాయిగా గడుపుతున్న ఆ ‘పెద్ద’ కుటుంబం నిరుపేదలను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుండటం విమర్శలకు తావిస్తోంది. గూడు లేని 46 మంది ఉన్నా.. వెంకటాపురం గ్రామంలో నిలువ నీడ లేని వారు 46 మంది ఉన్నట్లు ఆ గ్రామస్తులే చెబుతున్నారు. కానీ అధికారులు వెళ్లి అడిగితే ఒక్కరంటే ఒక్కరూ నోరు తెరవలేని పరిస్థితి. అందువల్లే చాలా మంది సొంత ఊరును వదులుకుని బంధువుల ఇళ్లలో కాలం వెళ్లదీస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల గ్రామంలో పర్యటించిన తహసీల్దార్ 14 మంది గ్రామస్తులకు ఇళ్లు లేనట్లు గుర్తించారు. వారంతా దరఖాస్తు చేసుకుంటే ఇళ్లు మంజూరు చేస్తామని చెప్పారు. ఈ క్రమంలో గ్రామానికే చెందిన రైతు శ్రీనివాసులు పేదలకు పట్టాలిచ్చేందుకు సర్వేనంబర్ 752లోని తన 2.50 ఎకరాల పొలాన్ని ప్రభుత్వానికి విక్రయించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. కానీ అక్కడి రాజకీయ నేతలు మాత్రం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఇచ్చే ఇళ్లు తమ గ్రామస్తులకు అవసరం లేదని చెబుతున్నారు. ఫలితంగా గూడులేని నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులే చొరవ తీసుకుని.. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వెంకటాపురం అభివృద్ధిపై దృష్టి సారించింది. స్థానిక శాసనసభ్యుడు తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కూడా వెంకటాపురం వాసుల పరిస్థితి అర్థం చేసుకుని అధికారులనే గ్రామానికి పంపారు. దీంతో మండల అధికారులు పథకాలకు అర్హులను గుర్తించారు. అందువల్లే ప్రస్తుతం గ్రామంలోని 100 మందికి పెన్షన్లు.. 215 రేషన్ కార్డులు ఉన్నాయి. అదో ప్రత్యేక రాజ్యం వెంకటాపురంలో ప్రత్యేక రాజ్యం నడుస్తోంది. ఆ గ్రామంలోకి వెళ్లాలన్నా భయపడే పరిస్థితి నెలకొంది. అధికారులు కూడా ఆ కుటుంబానికి వ్యతిరేకంగా పనిచేసే సాహసం చేయలేకపోతున్నారు. ఒక్క కుటుంబం రాజకీయ ఉనికి కోసం ఎందరో నిరుపేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఆ రాజకీయ కుటుంబీకులు తమ దుస్థితిని అర్థం చేసుకుని ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలని, లేకపోతే వారే సాయం చేసినా బాగుంటుందని గ్రామస్తులు కోరుతున్నారు. అర్హులను గుర్తించాం వెంకటాపురంలో ఇళ్లు లేని వారు 14 మంది ఉన్నట్లు గుర్తించాం. అయితే వారెవరూ ఇంటి కోసం గానీ, స్థలం కోసం గానీ దరఖాస్తు చేయలేదు. వారు ఇల్లు కావాలని కోరితే తప్పకుండా స్థలం ఇవ్వడంతో పాటు అర్హత మేరకు ఇళ్లు కూడా మంజూరు చేస్తాం. – నారాయణస్వామి, తహసీల్దార్ రామగిరి -
రామగిరి ఠాణా.. అక్రమాలకు ఠికానా!
సాక్షి,హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన హైకోర్టు న్యాయవాది గట్టు వామనరావు, పీవీ నాగమణి దంపతుల హత్య విషయంలో పోలీసులపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లా రామగిరి పోలీస్‌స్టేషన్.. స్థానికంగా పేరున్న ఓ ప్రజాప్రతినిధి, అతడి అనుచరులు చేసే పంచాయతీలకు అడ్డాగా మారిందని కల్వచర్ల గ్రామస్తులు వాపోతున్నారు. ఇక్కడ పోలీస్ స్టేషన్‌కు చేరిన వివాదాల్లో సదరు ప్రజాప్రతినిధి అనుచరులు జోక్యం చేసుకోవడం ఆనవాయితీగా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. స్టేషన్‌కు వచ్చిన ఫిర్యాదుల్లో కోర్టుకు వెళ్లేవి చాలా తక్కువ. భూ వివాదాలు, కుటుంబ సమస్యల విషయంలో ఠాణా మెట్లెక్కిన వారి చేతి చమురు వదలాల్సిందే. విషయం తెలవగానే సదరు నేత అనుచరులు వాలిపోతారు. ఎవరో ఒకరి పక్షం వహిస్తారు. వారు ఎవరి పక్షాన నిలిస్తే వారికి స్టేషన్ సిబ్బంది పూర్తిగా సహకరిస్తారు. బాధితుల్లో ముందుగా వెళ్లి సదరు నేత అనుచరులను ప్రసన్నం చేసుకుంటారో వారిదే పైచేయి అవుతుంది. అతడి మాటే ‘సత్యం’.. ఆపై ‘మహేంద్ర’జాలం.. రామగిరి పోలీస్‌స్టేషన్‌లో కల్వచర్లకు చెందిన ఓ నేత సదరు ముఖ్య అనుచరుడిదే హవా. స్థానిక ప్రజాప్రతినిధికి అతడు కుడిభుజం అన్న ప్రచారం ఉంది. అందుకే స్టేషన్లో అతడు ఎంత చెబితే అంత. ఆయన ఆదేశాలు వారిపై ‘మహేంద్ర’జాలంలా పనిచేస్తాయి. రామగిరి పోలీసులు, సదరు నేత కలసి 2019లో రామగిరి పోలీస్ స్టేషన్ వేదికగా ఓ భారీ సెటిల్మెంట్ చేశారని సమాచారం. తన ఎన్నారై భర్త వేధిస్తున్నాడంటూ రామగిరి పోలీసులను ఓ యువతి ఆశ్రయించింది. ఈ విషయలో కల్వచర్ల స్థానిక నేత జోక్యం చేసుకున్నాడు. అంతే సీన్ మొత్తం మారిపోయింది. సాధారణంగా ఇలాంటి కేసుల్లో దంపతులకు పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించాలి లేదా కేసు నమోదు చేయాలి. ఇవేమీ చేయలేదు. 2019 నవంబర్ 22న కౌన్సెలింగ్ పేరిట ఆ ఎన్నారై భర్తను ఠాణాకు పిలిపించారు. తనకు ఆరోగ్యం బాగా లేదని ఆ ఎన్నారై చెబుతున్నా.. అతడిని గంటల పాటు మోకాళ్లపై నిల్చోబెట్టారు. స్టేషన్లో గుంజీలు తీయించారు. రకరకాల కేసులు పెడతామని, కెరీర్ నాశనం చేస్తామని, జీవితంలో తిరిగి అమెరికా వెళ్లకుండా చేస్తామని బెదిరించారు. వాస్తవానికి ఆ యువకుడికి అమెరికాలో మరో మూడేళ్ల పాటు వీసా ఉంది. దీంతో భయపడ్డ బాధితుడు కాళ్లబేరానికి వచ్చాడు. బాధితురాలితో రాజీకి రావాలని అందుకు రూ.50 లక్షలు ముట్టజెప్పాలని సదరు నేత, రామగిరి పోలీసులు తీర్పు చెప్పారు. తాను అంత ఇచ్చుకోలేనని బ్రతిమిలాడి.. ఆఖరికి యువతికి రూ.30 లక్షలు ఇవ్వాలని డీల్ క్లోజ్ చేశారు. చేసేదిలేక బాధితుడు సరేనన్నాడు. తర్వాత ఎన్నారై నుంచి రూ.50 వేలు తీసుకున్నారు. భారీగా వసూలు చేసి ఇచ్చినందుకు సదరు యువతి తండ్రి వద్ద నుంచి కూడా తమ వాటాను పోలీసులు, సదరు నేత పంచుకున్నారు. ఇలాంటి ఉదంతాలకు అక్కడ లెక్కేలేదు. అర కిలోమీటర్‌లోపే హత్య.. మొత్తం వ్యవహారంలో ఓ నేతపై తీవ్ర విమర్శలు వస్తుండటం.. అతడికి, అతడి అనుచరులకు బాగా పట్టున్న రామగిరి పోలీస్స్టేషన్పరిధిలోనే జంటహత్యలు జరగడంపై స్థానికులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి గట్టు వామనరావును అతడికి తెలియకుండానే నిందితులు మంథని నుంచి వెంబడిస్తూ వచ్చారు. మంథని కోర్టు నుంచి హత్యలు జరిగిన ఘటనాస్థలానికి మధ్య దాదాపు 16 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ ప్రదేశానికి ముందు మంథని ఠాణా, అది దాటాక కమాన్‌పూర్ ఠాణా పరిధి ఉంటాయి. ఈ రెండు స్టేషన్ల పరిధిలోనూ అడవి, నిర్మానుష్య ప్రాంతాలు అధికం. వాస్తవానికి ఈ ప్రాంతాల్లో జనసంచారం చాలా తక్కువగా ఉంటుంది. అయితే నిత్యం రద్దీగా ఉండే రామగిరి పీఎస్ పరిధిలో హత్యలు చేయడం, అది కూడా మరో అర కిలోమీటరు దూరంలో స్టేషన్ పరిధి ముగుస్తుందనగా ఘటన జరగడంపై స్థానికులు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రామగిరి పోలీసుల అండ చూసుకునే దుండగులు ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారని ఆరోపిస్తున్నారు. అదే సమయంలో క్రైం సీన్ (నేరం జరిగిన ప్రదేశం)లో సాక్ష్యాధారాల సేకరణకు పోలీసులు పెద్దగా ఆసక్తి చూపలేదని స్థానిక నేతలు ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలకు బలం చేకూర్చేలా అర్ధరాత్రి వెళ్లి క్రైం సీన్ వద్ద ట్రాఫిక్ కోన్స్ పెట్టడం కూడా తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
మాజీ జెడ్పీటీసీ దర్జా.. అవాక్కయిన అధికారులు
రామగిరి: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత సమీప బంధువు, రామగిరి జెడ్పీటీసీ మాజీ సభ్యుడు రామ్మూర్తినాయుడు నామినేషన్ కేంద్రంలోకి వచ్చి కుర్చీలో దర్జాగా కూర్చోవడంతో అక్కడి అధికారులు, అభ్యర్థులు అవాక్కయ్యారు. ఈ ఘటన అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరిలో చోటుచేసుకుంది. అతను అభ్యర్థి కాడు.. కానీ తన సైన్యంతో వచ్చి ఇలా కంప్యూటర్ ముందున్న కుర్చీని లాక్కుని కూర్చోవడంతో అధికారులంతా అవాక్కయ్యారు. (చదవండి: దాడుల పాపం టీడీపీదే..) -
ఫోర్బ్స్ జాబితాలో నల్లగొండ వాసి
రామగిరి (నల్లగొండ) : నల్లగొండ పట్టణానికి చెందిన కోణం సాందీప్.. ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నాడు. హెల్త్‌కేర్ సెక్టార్‌కు సంబంధించి వినూత్న రీతిలో వైద్య, ఆరోగ్య సేవలందిస్తున్న సాందీప్.. ఈ నెల 1న ప్రతిష్టాత్మక ఫోర్బ్స్ పత్రిక విడుదల చేసిన అండర్– 30 పదవ వార్షిక జాబితాలోని 30 మందిలో మొదటి వరుసలో నిలిచాడు. కోణం సాందీప్ 2018 ఫిబ్రవరిలో డాక్టర్ శివ్‌రావ్‌తో కలసి అమెరికాలోని పిట్స్‌బర్గ్‌లో అబ్రిడ్జ్ పేరుతో యాప్ సృష్టించి హెల్త్‌కేర్ రంగంలో రాణిస్తున్నాడు. ఇప్పటివరకు తమ కంపెనీకి 15 మిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చినట్లు సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో బీటెక్ నల్లగొండ పట్టణానికి చెందిన కోణం శ్రీనివాస్, అనురా ధ దంపతుల కుమారుడు సాందీప్ ఏపీలోని కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్‌ఐటీలో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్ ఇంజనీరింగ్‌లో బీటెక్‌తోపాటు కంప్యూటర్ సైన్స్‌లో మైనర్ డిగ్రీ పూర్తి చేశాడు. అమెరికాలోని కార్నెగీ మెలన్ యూనివర్సిటీలో రోబోటిక్స్‌లో ఎంఎస్ పూర్తి చేశాడు. సాందీప్ డ్రోన్లు, రోబోటిక్స్ రంగంలో పలు ఆవిష్కరణలు చేశాడు. హెల్త్‌కేర్ టెక్నాలజీకి సంబంధించి వివిధ అప్లికేషన్స్‌ని కూడా రూపొందించాడు. పాతికేళ్ల వయసులోనే అమెరికా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్న కోణం సాందీప్‌ను పలువురు అభినందిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది: సాందీప్ ఫోర్బ్స్ అండర్ 30 జాబితాకు ఎంపిక కావడం చాలా సంతోషంగా ఉంది. మా యాప్ అబ్రిడ్జ్.. ఈ ఏడాది అమెరికాలో కోవిడ్ –19 వైద్య సేవలు అందించే విషయంలో మంచి గుర్తింపు పొందింది. కోణం ఫౌండేషన్ పేరుతో చారిటీ సంస్థను స్థాపిం చి పేదలకు సేవలందిస్తున్నాం. విద్యాభివృద్ధికి పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. -
పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్
సాక్షి, అనంతపురం: మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఓ కేసు విషయంలో శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. రామగిరి సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ నాగస్వామి తెలిపిన వివరాల మేరకు.. 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి, సూర్యంతో పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం స్వగ్రామంలో ఉన్న సూర్యంను పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి) బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కిడ్నాప్ చేసి దాడిచేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారన్నారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్‌పై ఫిర్యాదు చేయగా.. అప్పట్లో పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా, బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా, పోలీసులు కేసును పునరి్వచారణ చేపట్టారు. ఈక్రమంలో టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకొని శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ప్రతి మంగళ, శుక్రవారం నిందితులు పోలీస్‌స్టేషన్‌కువచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు నిబంధన విధించారు. -
ఏడాదిగా బాలికపై లైంగికదాడి
సాక్షి, రామగిరి(నల్గొండ) : ఏడాదిగా బాలికపై లైంగిక దాడికి పాల్పడుతున్న నలుగురు యువకులను తిప్పర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ నాగదుర్గాప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. తిప్పర్తి మండల పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను అదే గ్రామానికి చెందిన బొబ్బలి నవీన్ ప్రేమిస్తున్నానంటూ నమ్మబలికి శారీరకంగా లోబర్చుకున్నాడు. ఇది గమనించిన నవీన్ స్నేహితుడు గజ్జి రమేష్ ఆ బాలికపై కన్నేశాడు. ఇద్దరి మధ్య కొనసాగుతున్న సంబంధాన్ని అందరికీ చెబుతానంటూ ఆ బాలికను బెదిరించి లొంగదీసుకున్నాడు. ఆ తర్వాత స్థానికంగా కిరాణ దుకాణం నడుపుతున్న బాతుక శంకర్, సింగం అనిల్ కూడా ఆ బాలికను బెదిరించి లోబర్చుకున్నారు. ఇలా ఆ బాలికపై ఏడాది కాలంగా నలుగురు యువకులు లైంగికదాడికి పాల్పడుతూనే ఉన్నారు. (ఎన్ 95 మాస్క్‌ల పేరుతో భారీ మోసం ) ఆరోగ్యం బాగా లేకపోవడంతో.. కొంతకాలంగా బాలిక ఆరోగ్యం బాగాలేకపోవడంతో తల్లిదండ్రులకు అనుమానం వచ్చింది. వెంటనే ఆ బాలికను ఆస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గర్భం దాల్చిందని చెప్పారు. దీంతో ఇందుకు కారకులెవరని నిలదీయడంతో జరిగిన విషయాన్ని తల్లిదండ్రికి వివరించి బోరుమంది. వెంటనే బాలిక తల్లి గత 21వ తేదీన తిప్పర్తి పోలీసులకు ఫిర్యాదు చేసింది. గురువారం ఉదయం సోమోరిగూడెంలోని ఎల్లెంల నాగిరెడ్డి రేకుల షెడ్డు వద్ద నలుగురు యువకులు ఉన్నట్లు సమాచారం రావడంతో వారిని అరెస్ట్ చేసినట్లు సీఐ తెలిపారు. వీరిపై ఐపీసీ 376, 323, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్ఐ జి.సత్యనారాయణ, రైటర్ రమేష్, మీరా సాహెబ్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.(వీడియోలతో బ్లాక్ మెయిలింగ్..) -
గనిలో చిక్కుకున్న రెస్క్యూ బ్రిగేడియర్లు
గోదావరిఖని/రామగిరి: సమస్య పరిశీలించేందుకు బొగ్గు గనిలోకి వెళ్లి ఆరుగురు రెస్క్యూ బ్రిగేడియర్లు ఆపదలో చిక్కుకున్నారు. సింగరే ణి సంస్థ పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ పరిధిలోని ఏఎల్పీ గనిలో గురువారం మధ్యాహ్నం ఈ సంఘటన జరిగింది. అడ్రియాల లాంగ్వాల్ ప్రాజెక్టు గనిలోని మూసివేసిన సీమ్‌లను పరిశీలించేందుకు ఆర్జీ–2 ఏరియాలోని మెయిన్ రెస్క్యూ స్టేషన్‌కు చెందిన రెస్క్యూ సూపరింటెండెంట్ సలీం ఆధ్వర్యంలో 22 మంది గనిపైకి చేరుకున్నారు. మూడు బృందాలుగా వెళ్లి గనిలోని మూసివేసిన ప్యానళ్ల పరిస్థితి తెలుసుకునేందుకు గనిలోని 80వ ప్యానల్‌కు ఆరుగురు బృందం గల ఒక టీం, మరో ఇద్దరు స్టాండ్‌బైగా వెళ్లారు. 80వ ప్యానల్లోని ఎల్సీ–6 వద్ద పరిస్థితి సమీక్షించేందుకు టీం కెప్టెన్ మోహన్ ఆధ్వర్యంలో ఆరుగురు బ్రిగేడియర్లు వెళ్లారు. పరిశీలించిన అనంతరం తిరిగి వస్తున్న క్రమంలో జంక్షన్ వద్ద టీం కెప్టెన్ మోమన్ అదుపు తప్పి మూడు మీటర్ల లోతులో పడిపోయాడు. గమనించిన మిగతా బ్రిగేడియర్లు ఆయనను కాపాడే ప్రయత్నం ఫలించ లేదు. పైకి రావాలని పలుమార్లు ప్రయత్నించి మోహన్ అస్వస్థతకు గురయ్యాడు. ఇద్దరి పరిస్థితి విషమం.. రెస్క్యూ టీం మేనేజర్ మోహన్ ఆధ్వర్యంలో బ్రిగేడియర్లు దిలీప్, నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్‌రావులు టీం సభ్యులుగా మూసివేసిన పని స్థలాల్లోని గోడలను పరిశీలించడానికి వెళ్లారు. అయితే వీరిలో మూడు మీటర్ల లోతులో పడిపోయిన మోహన్ తీవ్ర అస్వస్థతకు గురికాగా, అతడిని కాపాడే ప్రయత్నంలో కొద్ది దూరం భుజాలపై మోసిన దిలీప్ (రెస్క్యూ బెస్ట్ కెప్టన్) పరిస్థితి కూడా ఆందోళనకరంగా మారింది. సింగరేణి ఆస్పత్రిలో చికిత్స అందించిన అనంతరం టీం కెప్టెన్ మోహన్‌ను కరీంనగర్ ఆస్పత్రికి, దిలీప్‌ను హైదరాబాద్ ఆస్పత్రికి రెఫర్ చేశారు. స్వల్ప అస్వస్థతకు గురైన నవాబ్, మధుసూదన్‌రెడ్డి, అజయ్‌రాఘవ, నాగేశ్వర్రావుకు స్థానికంగా చికిత్స అందించారు. ఈ విషయం తెలుసుకున్న ఆర్జీ–1, 2, 3 జీఎంలు కె.నారాయణ, ఎం.సురేశ్, సూర్యనారాయణలు హుటాహుటిన సింగరేణి ఆస్పత్రికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. టీబీజీకేఎస్ ప్రధాన కార్యదర్శి మిర్యాల రాజిరెడ్డి బాధితులను పరామర్శించి సంఘటన జరిగిన తీరును తెలుసుకున్నారు. -
ఇక్కడ రోజూ భూకంపమే..
సాక్షి, కరీంనగర్ : పచ్చని చెట్లు.. జలకళతో చెరువు... పక్షుల కిలకిలరాగాలు.. వ్యవసాయమే ఊపిరిగా బతికే పల్లె ప్రజలు.. పాడి పంటలతో ఆరేళ్ల క్రితం వరకు ఆ ఊరంతా కళకళలాడేది. సింగరేణి రంగప్రవేశంతో పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. పంటచేలు కనుమరుగయ్యాయి. ఊరు బొందలగడ్డగా మారింది. అభివృద్ధికి బొగ్గు అవసరమని, ఊరి భూగర్భంలో బొగ్గు నిల్వలున్నాయని అధికారులు గ్రామస్తులకు చెప్పి పంట భూములు, ఇళ్లు సేకరించారు. అభివృద్ధికి అడ్డుకావొద్దని గ్రామస్తులూ సహకరించారు. పరిహారంతోపాటు పునరావాసం కింద ఇళ్లు నిర్మిచుకునేందుకు ప్లాట్లు కేటాయిస్తామని సింగరేణి హామీ ఇచ్చింది. ఆరేళ్లు గడిచాయి. సింగరేణి బొగ్గు తవ్వుకుపోతోంది. సర్వం ధారపోసిన నిర్వాసితుల బతుకులు మాత్రం ఆగమయ్యాయి. పంట భూములకు పరిహారం ఇచ్చిన సింగరేణి యాజమాన్యం పునరావాసం కోసం ప్లాట్లు కేటాయించడంలో జాప్యం చేస్తోంది. కోర్టు కేసులు పునరావాసానికి ఆటంకంగా మారాయి. దీంతో రామగిరి మండలం లద్నాపూర్‌లోని ఓసీపీ–2 ప్రభావిత ప్రజలు నిత్య బ్లాస్టింగ్లతో బిక్కుబిక్కుమంటూ జీవనం సాగిస్తున్నారు. లద్నాపూర్ ప్రొఫైల్ నివాస గృహాలు 1280 సింగరేణి తీసుకున్న ఇళ్లు 720 ఆర్అండ్ఆర్ ప్యాకేజీ అందాల్సిన వారు 400 సింగరేణి సంస్థ రామగుండం–3 డివిజన్ పరిధిలోని ఓసీపీ–2లో బొగ్గు ఉత్పత్తి కోసం నిత్యం జరిపే బ్లాస్టింగ్‌లకు రామగిరి మండలం లద్నాపూర్ వాసులు భయంభయంగా బతుకుబండి సాగిస్తు న్నారు. ఓసీపీ–2 విస్తరణ కోసం ఆరేళ్లక్రితం గ్రామపరిధిలోని భూసేకరణ చేపట్టింది.ఇప్పటి వరకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ చెల్లించక, పునరావసం కల్పించకపోవడంతో తమ బతుకులతో అధికారులు చెలగాటమాడుతున్నారని నిర్వాసితులు కన్నీరుపెడుతున్నారు. ఊరును ఆనుకుని ఓసీపీ–2లో నిత్యం జరిపే బ్లాస్టింగ్లతో ఎప్పుడు ఎటువైపు నుంచి బండరాయి వచ్చి పడుతుందో, భూప్రకంపనలకు ఇంటికప్పు కూలి మీద పడుతుందోనని దినమొక గండంగా కాలం వెళ్లదీస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో సింగరేణి సిబ్బంది తమను బయటకు రాకుండా ఇళ్లలోనే ఉండాలని ఆదేశిస్తున్నారని, ఇళ్లలో ఉంటే పేలుడు జరిపిన సమయంలో భూకంపం వచ్చినట్లు అవుతోందని, వస్తువులు కింద పడుతున్నాయని పేర్కొటున్నారు.బ్లాస్టింగ్ల ధాటికి గోడలు బీటలు వారాయని, బండరాళ్లు ఎగిరొచ్చి పడ్డాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దుమ్ముతో రోగాలు.. బ్లాస్టింగ్ అనంతరం ఊరంతటిని దుమ్ము ధూళి కప్పేస్తోందని, పేలుడు పదార్థాలతో సుమారు రెండు గంటలు దుర్వాసన వస్తోందని లద్నాపూర్ వాసులు తెలిపారు.వృద్ధులు, చిన్నపిల్లలు వ్యాధులబారిన పడుతున్నారన్నారు. అధికారులను ప్రశ్నిస్తే వీలైనంత త్వరగా ఆర్అండ్ఆర్ ప్యాకేజీ ఇస్తామని, పునరావసం కల్పించి గ్రామాన్ని ఖాళీ చేయిస్తామంటూ కాలయాపన చేస్తున్నారని వాపోతున్నారు. హైకోర్టులో పునరావాసం భూములు.. ఓసీపీ–2 విస్తరణ కోసం లద్నాపూర్‌లో భూసేకరణ చేపట్టిన సింగరేణి నిర్వాసితులకు అదే గ్రామ శివారులోని ప్రభుత్వ భూమితోపాటు పట్టా భూములను కొనుగోలు చేసి పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చింది. ప్రైవేటు భూసేకరణ చేసేందుకు అవార్డ్ పాస్ చేసింది. తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ సంతకాలను పోర్జరీ చేసి అక్రమంగా అవార్డ్ పాస్ చేశారని, ప్రైవేటు భూముల యజమానులు హైకోర్టును ఆశ్రయించారు. పునరావాసం కోసం సేకరించిన భూముల అంశం కోర్టులో ఉండడంతో తీర్పు వెలువడే వరకూ సింగరేణి ఏమీ చేయలని పరిస్థితి నెలకొంద పరిహారం ఇవ్వకుండానే కాలువ మళ్లింపు.. నిర్వాసితులకు ప్యాకేజీ, పునరావసం కల్పించకుండానే సింగరేణి అధికారులు గ్రామాన్ని ఆనుకుని ఉన్న ఎస్సారెస్పీ ఎల్–6 కాలువ మళ్లింపు పనులు చేపట్టారు. ఈ కాలువ ఓసీపీ – 2కు ఆటంకంగా మారడంతో మళ్లిస్తున్నారు. పనులు పూర్తయితే తమను పట్టించుకునే నాథుడే ఉండడని నిర్వాసితులు వారం రోజులుగా పనులను అడ్డుకుని ఆందోళన చేస్తున్నారు. మరోవైపు ఎల్–6 కాలువను యుద్ధ ప్రాతిపదికన మళ్లించకపోతే ఓసీపీ–2, ఏఎల్పీ గనుల మనుగడే ప్రశ్నార్థకంగా మారే పరిస్థితి నెలకొంది. చెప్పిందొకటి.. చేసిందొకటి.. కాలువ పనులను అడ్డుకున్న నిర్వాసితులను ఆరు రోజుల క్రితం చర్చలకు అహ్వానించిన అధికారులు కలెక్టర్ సమక్షంలో సమస్య పరిష్కారిస్తామని తెలిపారు. మరుసటి రోజు ఓబీ కంపెనీలో కాంట్రాక్ట్ కార్మికులుగా పని చేస్తున్న నిర్వాసితులను విధులకు అనుమతించలేదు. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు ఓసీపీ క్వారీలో భైఠాయించారు. అదే సమయంలోనే అధికారులు బ్లాస్లింగ్ చేయడంతో ఆగ్రహించిన నిర్వాసితులు అధికారులను నిలదీశారు. గోదా వరిఖని ఏసీపీ ఉమేందర్ జోక్యంతో నిర్వాసితులు ఆర్డీవో నగేశ్‌తో చర్చలు జరిపారు. మంగళవారం కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్‌తో సమావేశం ఏర్పాటు చేయించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరో చోట పునరారాసం..! ఎల్–6 కాలువ మళ్లింపు అత్యవసరం దృష్ట్యా లద్నాపూర్ నిర్వాసితులకు గ్రామ శివారులో కాకుండా మరో ప్రదేశంలో పునరావసం కల్పించాలనే ఆలోచన లో సింగరేణి అధికారులు ఉన్నట్లు సమాచారం. నిర్వాసితుల సమస్య పరిష్కరించకపోతే కాలువ మళ్లిం పు పనులు సాగవని అంచనాకు వచ్చిన సింగరేణి అధికారులు సూచనప్రాయంగా స్థానిక జేఎన్టీయూ కళాశాల సమీపంలోని బొక్కల వాగు వద్ద పునరావసం కల్పించాలని ఆలోచన చేస్తున్నట్లు తెలి సిం ది.సెంటినరీకాలనీలోని రామాలయం వెనక పునరావసం కల్పిస్తే తమకు అభ్యంతరం లేదని నిర్వాసితులు పేర్కొంటున్నారు. మంగళవారం నాటి చర్చల్లో ఏ నిర్ణయం తీసుకుంటారోనని సింగరేణి యాజమా న్యం,అధికారులు,నిర్వాసితులుఎదురు చూస్తున్నారు. బ్లాస్టింగ్ సమయంలో కర్ఫ్యూను తలపిస్తున్న రహదారి, బ్లాస్టింగ్ సమయంలో నిర్వాసితులు బయటకు రాకుండా కాపలా కాస్తున్న సింగరేణి సిబ్బంది ఇళ్లపై రాళ్లు.. మేము నివాసం ఉంటున్న ఇండ్లకు సమీపంలోనే సింగరేణోళ్లు బ్లాస్టింగ్ చేస్తున్నరు. దీంతో పెద్దపెద్ద బండరాళ్లు వచ్చి ఇండ్లమీద పడుతున్నాయ్. మా బాధ ఎవరికి చెప్పినా పట్టించుకుంటలేరు. నిత్యం చచ్చిబతుకుతున్నం. – పిల్లిట్ల నాగలక్ష్మి, నిర్వాసితురాలు ఎల్– 6 మళ్లించొద్దు నిర్వాసితులకు ఆరేళ్లుగా పునరావసం కల్పించకుండా మభ్యపెడుతున్నారు. ఎల్–6 కాలువ మళ్లింపు పూర్తయితే మమ్మల్ని ఎవరూ పట్టించుకోరు. మా సమస్య పరిష్కరించే వరకూ కాలువ మళ్లింపు పనులు చేయొద్దు. – పోరెడ్డి వెంకటరమణారెడ్డి, నిర్వాసితుడు -
ఉపాధ్యాయ వృత్తికే కళంకం
సాక్షి రామగిరి(పెద్దపల్లి) : లంచాల మకిలి ప్రభుత్వ పాఠశాలల ఉపాధ్యాయులకు అంటుకుంది. ఇప్పటివరకు రెవెన్యూ, ఇరిగేషన్ తదితర శాఖలకు పరిమితమైన లంచావతారులు ఇప్పుడు ఉపాధ్యాయుల రూపంలో బయటపడుతున్నారు. తల్లిదండ్రుల తరువాత గురువును దేవునితో పోల్చుతూ ఆచార్యదేవో భవా అంటారు. విద్యార్థులకు సత్యమేవ జయతే, అబద్ధాలు ఆడరాదని చెప్పే ఉపాధ్యాయులే ఇలా అక్రమ సంపాదనకు ఆశపడి అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడడం రాష్ట్రవ్యాప్తంగా ఇదే మొదటిసారి కావచ్చు. నెలకు వేలల్లో వేతనాలు పొందుతున్న ప్రభుత్వ ఉపాధ్యాయులే ఇలా అవినీతి కార్యకలాపాలకు పాల్పడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందరో ఉపాధ్యాయులు నిరుపేద విద్యార్థులకు తమకు తోచినంత సహాయం చేస్తూ ఆదర్శంగా నిలుస్తూ వృత్తికి వన్నె తెస్తున్న ఈరోజుల్లో ఉపాధ్యాయులంటే అవినీతిపరులే అనే విధంగా చులకన భావం ఏర్పడే విధంగా లంచం తీసుకుంటూ పట్టుబడడం ఆ వృత్తికే మాయని మచ్చగా మారింది. ఓ ప్రధానోపాధ్యాయురాలు టీసీ కోసం రూ.2 వేలు లంచం తీసుకుంటూ రెడ్‌హ్యాండెడ్‌గా ఏసీబీ అధికారులకు చిక్కిన సంఘటన పెద్దపల్లి జిల్లా రామగిరి మండలంలో గురువారం జరిగింది. మండలంలోని బేగంపేట జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలిగా పనిచేస్తున్న దండుగుల లలిత విద్యార్థి నుంచి రూ.2 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. ఏసీబీ డీఎస్పీ కె.బద్రయ్య తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాఠశాలలో సుద్దాల ఓదెలు కుమారుడు రఘు గత విద్యాసంవత్సరంలో పదో తరగతి చదివాడు. పరీక్షల సమయంలో రఘుకు హాల్‌టికెట్ ఇవ్వకుండా హెచ్ఎం లలిత ఇబ్బంది పెట్టింది. ఎందుకు హాల్‌టికెట్ ఇవ్వడం లేదని రఘు తల్లిదండ్రులు రమ, ఓదెలు హెచ్ఎంను కలిసి అడుగగా, రఘు హాజరు శాతం తక్కువగా ఉందని, హాల్‌టికెట్ ఇవ్వడం కుదరదని ఖరాకండిగా చెప్పింది. ఆందోళన చెందిన రమ, ఓదెలు ఆమెను బతిమాడారు. అయినా కనికరించలేదు. తన కొడుకు భవిష్యత్ నాశనం అవుతుందని రమ హెచ్ఎం కాళ్లు మొక్కింది. దీంతో రూ.3 వేలు ఇస్తే హాల్‌టికెట్ ఇస్తానని చెప్పింది. మరోమార్గం లేక కూలీ పనులు చేసుకునే రఘు తల్లిదండ్రులు కొడుకు భవిష్యత్ కోసం హెచ్ఎం లలితను ప్రాధేయపడి రూ.1,500 చెల్లించడంతో హాల్‌టికెట్ ఇచ్చింది. అయితే పదో తరగతి పరీక్షలు రాసిన రఘు భౌతికశాస్త్రంలో ఫెయిల్ అయ్యాడు. తర్వాత సప్లిమెంటరీ పరీక్ష రాసి పాస్ అయ్యాడు. ఉన్నత చదువుల కోసం టీసీ కావాలని ఇటీవల హెచ్ఎంను కలిసి కోరాడు. అందుకు రూ.2 వేలు ఇవ్వాలని లలిత డిమాండ్ చేసింది. ఇదే విషయాన్ని రఘు తల్లిదండ్రులకు చెప్పాడు. దీంతో వారు విధిలేని పరిస్థితుల్లో 20 రోజుల క్రితం ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. స్పందించిన ఏసీబీ అధికారులు ఓదెలు, రఘు చెప్పే విషయాలను నిర్ధారించుకోవడానికి గతనెల 15న బాధితులతో కలిసి మారువేశంలో పాఠశాలకు వెళ్లారు. లంచం కోసం లలిత బాధితులను వేధిస్తుందని ప్రత్యక్షంగా నిర్ధారణ చేసుకున్నారు. ఆతర్వాత హెచ్ఎం మెడికల్ లీవ్ తీసుకుంది. గురువారం తిరిగి విధుల్లో చేరింది. ఈ క్రమంలో ఓదెలు, రఘు హెచ్ఎం లలిత డిమాండ్ చేసిన రూ.2 వేలు తీసుకుని పాఠశాలకు వెళ్లారు. డబ్బులు ముట్టజెప్పి టీసీ తీసుకుని బయటకు వచ్చాక.. అక్కడే కాపుకాసిన ఏసీబీ అధికారులు హెచ్ఎంను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. లలిత భర్తకు సింగరేణిలో ఉన్నతస్థాయి ఉద్యోగం. వీరు సెంటినరీకాలనీలోని సింగరేణి క్వార్టర్లో నివాసం ఉంటున్నారు. నకిలీ ధ్రువీకరణ పత్రాలతో పదోన్నతి పొందినట్లు, గతంలో స్కూల్ గ్రాంటు, దాతలు విరాళాలు కూడా కాజేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, మంచిర్యాలలో ఇతర వ్యాపారాలు కూడా ఉన్నట్లు సమాచారం. బాధితుల ఫిర్యాదు మేరకు ఆమెపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. శుక్రవారం కరీంనగర్‌లోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరుస్తామని డీఎస్పీ భద్రయ్య వెల్లడించారు. -
శ్రీరామా.. ఇదేం డ్రామా
సాక్షి, రామగిరి : ఇంతకాలం తల్లి పరిటాల సునీత కొంగు చాటున రాజకీయాలు చేస్తూ వచ్చిన పరిటాల శ్రీరాం.. ఈ ఎన్నికల్లో గెలుపుతో తన రాజకీయ జీవితాన్ని అరంగేట్రం చేసేందుకు కుట్రలకు తెరలేపాడు. గురువారం పోలింగ్ ప్రక్రియలో భాగంగా రామగిరి మండలంలోని పెదకొండాపురం బూత్ నంబర్ 226 టీడీపీ నాయకులు ఎన్నికల అధికారులను లోబరుచుకొని ఈవీఎం మూత వేయడానికి నకిలీ సీళ్లను సృష్టించారు. అయితే స్థానిక వైఎస్సార్సీపీ ఎన్నికల ఏజెంట్లు అనుమానంతో ఆ సీళ్లను పరిశీలించారు. దీంతో అవి నకిలీ సీళ్లుగా బయటపడ్డాయి. దీనిపై వారు ఎన్నికల అధికారులను ప్రశ్నిస్తే ఎలాంటి సమాధానం ఇవ్వలేక అక్కడి నుంచి వెళ్లిపోయారు. తర్వాత ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డితో పాటు ఎన్నికల ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. అనంతరం స్థానిక అధికారులతో ఈవీఎం ప్యాక్‌లకు ఒరిజినల్ సీళ్లు వేయించి వాటిని తరలించారు. కాగా ఇలాంటి సంఘటనలు రామగిరి మండలంతో పాటు నియోజక వర్గంలోని కనగానపల్లి, రాప్తాడు మండలాల్లో కూడా చోటు చేసుకొన్నట్లు తెలుస్తోంది. కనగానపల్లి మండలంలో గుంతపల్లిలో కూడా ఈవీఎలను నకిలీ సీళ్లతో ప్యాక్ చేస్తుండగా స్థానిక వైఎస్సార్సీపీ పట్టుకొన్నారు. స్థానిక టీడీపీ ఏజెంట్ల వద్ద ఉన్న వాటిని స్వాధీనం చేసుకొని అధికారులకు అందజేశారు. ప్రజావ్యతిరేకతను గుర్తించిన టీడీపీ నాయకులు ఈ ఎన్నికల్లో తమకు ఓటమి తప్పదన్న ఉద్దేశంతో ఇలాంటి కుట్రలకు తెరలేపినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. ఈవీఎంలు సరిగా భద్రత పరచాలి టీడీపీ నాయకులు చేస్తున్న కుట్రలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల అధికారులు ఈవీఎం మిషన్లకు సరైన భద్రత కల్పించాలని వైఎస్సార్సీపీ రాప్తాడు అసెంబ్లీ అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఎన్నికల అధికారులను కోరారు. రామగిరి, కనగానపల్లి మండలాల్లో నకిలీ సీళ్లు బయటపడటం విషయంపై ఆయన విలేకరులతో మాట్లాడారు. దీనిపై వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశామని, వీటిపై సరైన విచారణ చేసి ప్రజల తీర్పును కాపాడాలని కోరామన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని కుట్రలు చేసిన ఈ ఎన్నికల తమ విజయాన్ని ఆపేలేరన్నారు. -
రామగిరిలో ప్రలోభాల పరంపర
సాక్షి, రామగిరి: రాప్తాడు తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ సొంత మండలమైన రామగిరిలో ప్రలోభాలకు గురిచేశారు. ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు ఆపార్టీ నాయకులు విచ్చలవిడిగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తున్నారు. గురువారం జరగనున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఆపార్టీ నాయకులు మండలంలోని తొమ్మిది పంచాయతీల్లో మద్యం ఏరులై పారిస్తున్నారు. మొదటిసారిగా రాప్తాడు అసెంబ్లీ సార్వత్రిక బరిలో పరిటాల శ్రీరామ్ నిలిచారు. ఈసారి ఎన్నికల్లో టీడీపీకి పరాభవం తప్పదన్నట్లు ప్రజలు చర్చించుకుంటున్నారు. దీంతో ఎలాగైనా గెలవాలని పథకం రచించినట్లు తెలుస్తోంది. ఓటుకు రూ. 2వేల నుంచి రూ.3వేల దాకా ఓటర్లకు విచ్చలవిడిగా డబ్బు పంపిణీ చేస్తున్నట్లు స్థానిక నాయకులే బహిరంగంగా చెప్తున్నారు. ఈక్రమంలో కింది స్థాయి అధికారులను సైతం వారు వినియోగించుకుంటూ టీడీపీకి ప్రచారం చేయించుకుంటున్నారు. అందులో భాగంగా గత వారంలో తిమ్మాపురానికి చెందిన అంగన్వాడీ కార్యకర్తతో ప్రచారం చేయించారు. బుధవారం పోలేపల్లి గ్రామంలో బీఎల్ఓ నిర్మల భర్త మక్కిన నారాయణ స్లిప్పులతోపాటు డబ్బులు పంపిణీ చేశారు. మద్యం బాటిళ్లు స్వాధీనం ధర్మవరం రూరల్: గొళ్లపల్లి వద్ద బుధవారం ఎక్సైజ్ శాఖ జరిపిన తనిఖీలలో శ్రీనివాసులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి 38 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు సీఐ నరసానాయుడు తెలిపారు. మద్యాన్ని తరలిస్తున్న ద్విచక్ర వాహనాన్ని కూడా సీజ్ చేశామన్నారు. ఈ దాడులలో ఎస్ఐలు ఎస్ఎం రఫీ, మోహన్‌బాబు, సిబ్బంది రామాంజులు, సుధాకర్‌రెడ్డి, కృష్ణానాయక్, కళ్యాణి, జ్యోతి పొల్గొన్నారు. -
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
-
రాప్తాడులో టెన్షన్.. తోపుదుర్తి ప్రచారంపై ఆంక్షలు
సాక్షి, అనంతపురం: జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో టెన్షన్ వాతావరణం నెలకొంది. వివరాల్లోకి వెళ్తే గత నాలుగున్నరేళ్లుగా మంత్రి పరిటాల సునీత సొంత గ్రామమైన రామగిరిలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలకు పోలీసులు అనుమతి నిరాకరిస్తూ వచ్చారు. మంత్రి సునీత ఒత్తిడితో పోలీసులు వైఎస్సార్ సీపీ నేతలను కూడా రామగిరి మండలంలోనికి అనుమతించలేదు. తాజాగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన నేపథ్యంలో పరిస్థితులు మారాయి. ఎన్నికల సంఘం ఆదేశాలతో రాప్తాడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి రామగిరి మండలం ఎన్నికల ప్రచారానికి పోలీసులు అనుమతిచ్చారు. దీంతో భారీ పోలీసు బందోబస్తు నడుమ తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి రామగిరి మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రకాశ్‌రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో రామగిరి మండలంలోని ప్రజలు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సునీత తమ గ్రామాల్లో ఎటువంటి అభివృద్ధి చేయలేదని ప్రకాశ్‌రెడ్డి ఎదుట ఆవేదన వ్యక్తం చేశారు. అయితే ప్రకాశ్‌రెడ్డికి మద్దుతుగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వస్తున్న వైఎస్సార్ సీపీ కార్యకర్తలను పోలీసులు పలుచోట్ల అడ్డుకున్నారు. స్థానికులు మాత్రమే ప్రకాశ్‌రెడ్డి వెంట ప్రచారం చేయాలని ఆంక్షలు విధించారు. ఈ సందర్భంగా ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల సునీత దౌర్జన్యాలను ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. పరిటాల సునీత మండలమైన రామగిరిలోకి వీసా తీసుకుని వెళ్లేలా పోలీసులు ఆంక్షలు విధించారని.. గత నాలుగున్నరేళ్లుగా తమను రామగిరిలోకి అనుమతించకపోవటం అప్రజాస్వామికం అని పేర్కొన్నారు. కొందరు పోలీసులు, అధికారులు పరిటాల సునీతకు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. రామగిరిలో సునీత ఎలాంటి అభివృద్ధి చేయలేదని అన్నారు. టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓటు వేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడుతున్నారని విమర్శించారు. ప్రజలను భయపెట్టి గెలవాలని టీడీపీ ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఈ ఎన్నికల్లో రాప్తాడులో వైఎస్సార్ సీపీ జెండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. -
మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ
సాక్షి,రామగిరి: మండలంలోని రాజాపూర్ వద్ద ఉన్న ఎస్సారెస్పీ ఎల్ 6 కాలువ మురికి కాలువను తలపిస్తుంది. గ్రామం పరిధిలో సుమారు 400 మీటర్ల పొడవున ఎస్సారెస్పీ కాలువ ప్రవహిస్తుంది. గ్రామం పరిధిలో కాలువ ప్రారంభం నుంచి చివరి వరకు నివాస గృహాల్లోని వృథానీరు కాలువలోకి వదిలేస్తుండంతో ఈదుస్థితి నెలకొంది. కాలువ పొడవునా ఆనుకుని నిర్మించిన సుమారు 200 ఇళ్లలోని మరుగుదొడ్లు, వృథా నీరుకూడా ఇందులోకి పైపులైన్ల ద్వారా వదిలివేయడంతో కాలువ పొడవునా దుర్గంధం వెలువడుతుంది. కాలువ నుంచి సాగునీరు విడుదల అయ్యే సమయంలో మినహా మిగతా సమయంలో ఎస్సారెస్పీ కాలువ మురికి కాలువను తలపిస్తోంది. కాలువలో మురికినీరు నిలిచిపోవడం వల్ల కాలువ పొడవునా తుంగ, చెత్తా చెదారం పేరుకు పోయి పందులకు స్థావరంగా మారి దోమలు వృద్ధి చెందుతున్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీని వల్ల ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నా సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంపై విమర్శలు వెలువడుతున్నాయి. ఇటీవల సింగరేణి స్థంస్థ ఓసీసీ2 విస్తరణ కోసం ఎల్6 కాలువను మళ్లీస్తున్నారు. దీంతో దీన్ని గురించి పట్టించుకునే వారు కరువయ్యారు. కాలువ గురించి ఎవరు పట్టించుకోపోవడం వల్ల మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల స్థానికులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఇటీవల టీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త గ్రామపంచాయతీల ఏర్పాటుకు రూపకల్పన చేయడంతో రాజాపూర్ గ్రామం నూతన గ్రామ పంచాయతీగా ఏర్పడింది. కొత్తగా ఏర్పడిన గ్రామ పంచాయతీ పాలనలోనైన మురికి కాలువను తలపిస్తున్న ఎస్సారెస్పీ కాలువ వల్ల పడుతున్న ఇబ్బందులు తొలగిపోతాయని స్థానికులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైన సంబంధిత అధికారులు మురికి కాలుగా మారిన ఎస్సారెస్పీ కాలువ పట్ల తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భరించలేకపోతున్నాం.. కాలువలోకి ఇండ్లల్లోని నీరు వదిలేయడం వల్ల వస్తున్న గలీజు వాసన భరించలేకపోతున్నాం. కాలువ నుంచి వచ్చే వాసన వల్ల కడుపులో వికారం ఏర్పడి వాంతులు చేసుకుంటున్నాం. కాలువ నిండి తుంగ మొలిచి పందులు తిరుగుతున్నాయి. దీన్ని పట్టించుకునేటోళ్లే లేకుండా పోయారు. –రొడడ బాపు, రాజాపూర్ కాలువ శుభ్రం చేయాలి కాలువలో చెత్తాచెదారం నిండిపోవడం వల్ల దోమలు పెరిగి రోగాల భారిన పడుతున్నాం. నీళ్లు వచ్చినప్పుడు ఎలాంటి వాసన రావడం లేదు, నీళ్లు బంద్ అయిన తరువాత వచ్చే వాసన వల్ల మాగోస చెప్పుకోలేము. అధికారులు కాలువను శుభ్రం చేయించాలి. –బర్ల కుమార్, రాజాపూర్ -
'తహసీల్' భవన నిర్మాణమెప్పుడో..?
రామగిరి మండల కేంద్రంలో తహసీల్దార్ కార్యాలయం నూతన భవన నిర్మాణం చేపట్టేదెన్నడని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాలు, చిన్న మండలాలు, చిన్న పంచాయతీలను ఏర్పా టు చేసింది. దీనిలో భాగంగానే నూతనంగా ఏర్పడిన పెద్దపల్లి జిల్లాలో కొత్తగా రామగిరి మండలాన్ని ఏర్పాటు చేశారు. ముత్తారం: రామగిరి మండలకేంద్రంలోని సెంటినరీకాలనీలో సింగరేణి సంస్థకు చెందిన క్వార్టర్లలో తాత్కాలికంగా తహసీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేశారు. నూతనంగా క్వార్టర్లలో ఏర్పాటు చేసిన తహసీల్దార్ కార్యాలయాన్ని 2016 అక్టోబర్ 11న మంత్రి ఈటల రాజేందర్ చేతులమీదుగా ప్రారంభించారు. అయితే ఇరుగ్గా ఉన్న క్వార్టర్లలో తహసీల్దార్ కార్యాలయ నిర్వహణ అధికారులకు కత్తి మీద సాములా మారింది. దీంతో నూతన భవన నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.70లక్షల నిధులను మంజూరు చేసింది. నూతన భవన నిర్మాణం కోసం సింగరేణి సంస్థ పోస్టాఫీస్ ఎదురుగా అంగడి మార్కెట్ సమీపంలో ఎకరం స్థలాన్ని కేటాయించింది. ఈ ఏడాది ఏప్రిల్ 26న తహసీల్దార్ కార్యాలయం పేరిట లీజ్ రిజిస్ట్రేషన్ చేసింది. అయితే సంబంధిత ఇంజినీరింగ్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా.. దాదాపు నిధులు మంజూరై ఏడాది, స్థలం కేటాయించి ఆరు నెలలు గడుస్తున్నా ఇప్పటివరకు నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. పక్కా భవనం లేక.. నియోజకవర్గంలో విస్తీర్ణంలో, జనాభాలో రామగిరి మండలం రెండో స్థానంలో ఉంటుంది. ఇలాంటి మండలంలో తహసీల్దార్ కార్యాలయానికి పక్కా భవనం లేక ఇరుగ్గా ఉన్న సింగరేణి క్వార్టర్లో నిర్వహించడంతో.. ఇటు ప్రజలు, అటు రెవెన్యూ సిబ్బంది నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి నూతన భవన నిర్మాణ పనులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
డెంగీ లక్షణాలతో యువకుడి మృతి
పుట్టపర్తి అర్బన్: డెంగీ లక్షణాలతో ఓ యువకుడు మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే... రామగిరి మండల కేంద్రంలోని కొత్తగేరికి చెందిన లక్ష్మన్న కుమారుడు పవన్‌కుమార్ (29) కొంత కాలంగా పుట్టపర్తిలోని స్టేట్‌బ్యాంకు ఎదురుగా ఉన్న జియో సెల్‌షాపులో పని చేస్తున్నాడు. పవన్‌కుమార్ సమీపంలోని ఒ గదిలో అద్దెకుంటున్నాడు. గత సోమవారం తీవ్ర జ్వరం రావడంతో సత్యసాయి ఆస్పత్రిలో మూడు రోజులు చికిత్స పొందాడు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మెడికేర్ ఆస్పత్రిలో చేరాడు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. -
గాలిమరల టవర్‌పై నుంచి పడి టెక్నీషియన్ మృతి
రామగిరి: గాలిమరల టవర్‌పై పని చేస్తుండగా పట్టు తప్పి టెక్నీషియన్ కిందపడటంతో మృతి చెందాడు. ఎస్ఐ రామారావు తెలిపిన మేరకు.. విన్సోల్ ఇంజినీరింగ్ ప్రైవేట్ కంపెనీ దుబ్బార్లపల్లి వద్ద గాలిమరల ప్లాంట్ ఏర్పాటు చేస్తోంది. అందులో భాగంగా బుధవారం గాలిమరల టవర్‌పైకి ఎక్కి పనిచేస్తున్న టెక్నీషియన్ సహారా యోగేష్ (20) పట్టు తప్పి కిందపడ్డాడు. తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇతడు మహారాష్ట్రలోని వార్తాడు జిల్లాకు చెందిన పొరగామ్ గ్రామానికి చెందినవాడని ఎస్ఐ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మితిమీరిన మంత్రి బంధువుల ఆగడాలు
రామగిరి: మంత్రి పరిటాల సునీత బంధువుల ఆగడాలు మండలంలో పెచ్చుమీరుతున్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకొని మొన్న మంత్రిగారి బంధువైన ఓ కాంట్రాక్టర్‌కు లబ్ధిచేకూర్చేందుకు బాగున్న ఎంపీడీఓ కార్యాలయాన్ని కూల్చేశారు. ఆ తరువాత ఆ భవనానికి ఉన్న రూ.లక్షలు విలువజేసే రాళ్లను మరొక బంధువుకు కారు చౌకగా అప్పగించారు. మరో బంధువుకు సిమెంట్ గోడౌన్ కోసం బస్‌షెల్టర్‌ను అప్పగించారు. ఇవన్నీ చాలవన్నట్లు అధికారం ఉంది.. అడిగేవారెవరు? అన్నరీతిలో రామగిరి మండలంలో మంత్రి బంధువులు, అనుచరులు చెలరేగి ప్రభుత్వ ఆస్తులను కొల్లగొడుతున్నారు. వీటిని కట్టడి చేయాల్సిన అధికారులు వారికి అడుగులు మడుగులు ఒత్తుతూ జీ హుజూర్ అంటున్నారు. ఇక మంత్రిగారి సొంత పంచాయతీ నసనకోటలో ఇటీవల తాగునీటి సమస్య తీర్చేందుకు రూ.2కోట్లతో పనులు చేపట్టారు. 4 బోరుబావులను ఇటీవలే తవ్వించారు. మిగిలిన ట్యాంకుల నిర్మాణం పైపులైన్ల ఏర్పాటు కొనసాగుతోంది. కొత్తగా తవ్విన బోరుబావుల్లో పుష్కలంగా నీరుపడింది. ఇక ఆలస్యమెందుకు అనుకున్నారో ఏమో ప్రభుత్వ బోర్ల నుంచి వచ్చే నీటితో గంగంపల్లికి చెందిన మంత్రి గారి ఇద్దరు బంధువులు 8 ఎకరాల్లో వేరుశనగ పంటలు సాగు చేశారు. వారి పంటలు పూర్తయ్యే వరకు నీటిని వదలాలని మంత్రే స్వయంగా అధికారులు ఆదేశాలిచ్చారు. ఇక అడ్డేముంది యథేచ్ఛగా ప్రభుత్వ నిధులతో తమ పంటపొలాలకు పైపులు ఏర్పాటు చేసుకొని నీటిని తరలించేస్తున్నారు. -
బాలిక కిడ్నాప్‌పై కేసు నమోదు
పామిడి : మండలంలోని రామగిరి దిగువతండాకు చెందిన వితంతువు రాజమ్మ కూతురు అశ్విని(14) కిడ్నాప్ కేసులో కర్నూలు జిల్లా డోన్ వాసి దాసరి మహేష్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ రవిశంకర్‌రెడ్డి మంగళవారం సాయంత్రం తెలిపారు. వివరాలు.. తల్లితో పాటు అశ్విని బతుకుదెరువు కోసం రాజంపేటలోని పుల్లంపేటకు కూలి పనులకు వెళ్లింది. అక్కడ బాలికతో దాసరి మహేష్ పరిచయం పెంచుకున్నాడు. ఈనెల 11న పెళ్లి చేసుకుంటానని బాలికకు మాయమాటలు చెప్పి అతడు వెంట తీసుకెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత మోసపోయినట్లు బాలిక గ్రహించింది. వెంటనే అతడి బారి నుంచి తప్పించుకుని ఈనెల 25న బాలిక స్వగ్రామానికి వచ్చింది. తల్లితో కలిసి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు మేరకు మహేష్‌ను ఎద్దులపల్లిరోడ్డులో అదుపులోకి తీసుకుని, అతడిపై 420 కేసు నమోదు చేసి గుత్తి కోర్టులో హాజరుపరిచినట్లు ఎస్ఐ తెలిపారు. -
దోచిపెట్టేందుకేనా..?
బాగున్న భవనం కూల్చివేతకు రంగం సిద్ధం రూ.కోటితో రామగిరి ఎంపీడీఓ కార్యాలయ భవన నిర్మాణానికి ఏర్పాట్లు అధికార పార్టీ నేతలకు లబ్ధి చేకూర్చేందుకు మహిళా మంత్రి ఎత్తుగడ? రాతి కట్టడంతో పటిష్టంగా ఉన్న రామగిరి మండల పరిషత్ కార్యాలయాన్ని కూల్చి.. దాని స్థానంలో నూతన భవనం నిర్మించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. భవనం కూలే దశలో ఉందని కానీ, మరమ్మతులు అవసరం అని కానీ స్థానిక అధికారులు నివేదిక ఇవ్వకపోయినా నూతన భవనం నిర్మాణం కోసం రూ.కోటి నిధులు మంజూరు చేశారు. అధికార తెలుగుదేశం పార్టీ వారికి, కాంట్రాక్టర్లకు లబ్ధి చేకూర్చడం కోసమే ఓ మంత్రి ఇలా చేస్తున్నారనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. - అనంతపురం సిటీ జిల్లాలో వజ్రకరూరు, తలుపుల మండల కేంద్రాల్లో ఎంపీడీఓ కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు. తలుపులలో ఎంపీడీఓ కార్యాలయాన్ని రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. గతంలోనే నూతన భవనానికి నిధులు మంజూరైనా స్థానిక నేతల విభేదాల వల్ల నిర్మాణం ముందుకు సాగలేదు. ఇటువంటి వాటిపై దృష్టి సారించకుండా కాలం తీరని రామగిరి మండల పరిషత్ కార్యాలయ భవనాన్ని కూల్చేసి కొత్తగా నిర్మించేందుకు యుద్ధ ప్రాతిపదికన ముందుకు కదిలారు. ఓ మంత్రి చొరవతోనే ఉన్నతాధికారులు ప్రణాళికలు తయారు చేయడంతో మూడు నెలల కిందట కోటి రూపాయల నిధులు మంజూరయ్యాయి. వారం రోజుల్లో కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి వర్గీయులు చెప్పారని మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది చెబుతున్నారు. ఈ విషయమై పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బరావును వివరణ కోరగా టెండరుకు సంబంధించిన ప్రతిపాదనలను ఇంజినీరింగ్ ఇన్ చీఫ్‌కు పంపామన్నారు. వారంలోపు సమాచారం వస్తుందని, టెండరు ఎవరికి దక్కిందనేది అప్పుడు చెబుతామని అన్నారు. ప్రస్తుతమున్న భవనం శిథిలావస్థలో ఉందని, నూతన నిర్మాణం అవసరమని తాము ఎవరికీ నివేదించలేదని రామగిరి ఎంపీడీఓ పూల నరసింహులు తెలిపారు. ఒక వేళ పంచాయతీరాజ్ ఇంజినీర్లు ఏమైనా ప్రణాళిక పంపారేమో తమకు తెలియదన్నారు. వారంలోపు కార్యాలయం ఖాళీ చేయాలని మంత్రి నుంచి సమాచారం అందిందన్నారు. -
అడిగే వారెవరు?.. అడ్డంగా తోడేద్దాం!
- రామగిరి మండలంలో యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా - మంత్రి సునీత ఇలాకా కావడంతో చర్యలకు సాహసించని అధికారులు - పెన్నా నది నుంచి రోజూ వెయ్యి ట్రాక్టర్ల ఇసుక తరలింపు - అడుగంటిపోయిన భూగర్భజలాలు - ఎండిపోయిన బోరుబావులు రామగిరి : రాష్ట్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత సొంత మండలంలోనే ఇసుక దందా సాగుతోంది. పెన్నానది పరివాహక ప్రాంతం నుంచి యథేచ్ఛగా తరలిస్తున్నారు. గాలిమరల పనులకు, కర్ణాటకకు రవాణా చేస్తూ భారీఎత్తున సొమ్ము చేసుకుంటున్నారు. అసలే అధికార పార్టీ వారు, ఆపై మంత్రి ఇలాకా కావడంతో అక్రమార్కులపై చర్యలకు అధికారులు వెనుకాడుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలోని రామగిరి మండలం పేరూరు గ్రామ సమీపంలో పెన్నానది ఉంది. మండల పరిధిలో పేరూరు డ్యాం నుంచి ఐదు కిలోమీటర్ల మేర నదీ పరివాహక ప్రాంతం విస్తరించింది. ఇక్కడ ఇసుక బాగా లభ్యమవుతోంది. దీన్ని అధికార పార్టీ వారు మంచి ఆదాయ వనరుగా మార్చుకున్నారు. జేసీబీలతో ఇసుకను ట్రాక్టర్లలోకి లోడ్ చేస్తూ రవాణా సాగిస్తున్నారు. ఇలా రోజూ వెయ్యి ట్రాక్టర్ల దాకా ఇసుక తరలిపోతోంది. రాష్ట్రంలో ఇసుక రవాణాపై నిషేధం ఉన్న సమయంలోనూ ఇక్కడి నుంచి వేలాది ట్రాక్టర్లు తరలించారు. మండలంలో వివిధ కంపెనీల గాలిమరలను భారీసంఖ్యలో ఏర్పాటు చేస్తున్నారు. రోడ్డు నిర్మాణ పనులు కూడా ఎక్కువగా జరుగుతున్నాయి. వీటికి తోడు అనధికారిక సిమెంట్ ఇటుకల ఫ్యాక్టరీలు ఉన్నాయి. వీటికి పెద్దఎత్తున ఇసుక అవసరమవుతోంది. అంతేగాకుండా పగటిపూట జేసీబీల సాయంతో ట్రాక్టర్లలో తరలించిన ఇసుకను ఒకచోట డంప్ చేసి.. రాత్రికి రాత్రే టిప్పర్ల ద్వారా కర్ణాటక రాష్ట్రంలోని బెంగళూరు, పావగడతో పాటు జిల్లాలోని పలు ప్రాంతాలకు తరలిస్తున్నారు. తద్వారా భారీమొత్తంలో సొమ్ము చేసుకుంటున్నారు. మంత్రి సొంత మండలం కావడంతో రెవెన్యూ అధికారులు, పోలీసులు ‘పెద్దవారితో సమస్య ఎందుకులే’ అన్నట్లు వ్యవహరిస్తున్నారు. దీంతో ఇసుకాసురులు చెలరేగిపోతున్నారు. ఈ ఇసుక దందాకు సంబంధించి రామగిరి పోలీస్‌స్టేషన్‌లో అధికార పార్టీ నాయకులపై ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. గతంలో ఇక్కడ పనిచేసిన ఓ సీఐ పేరూరు ఇసుక దందావైపు పోలీస్ సిబ్బంది ఎవరూ వెళ్లరాదని హుకుం సైతం జారీ చేశారు. పేరూరులోని పోలీస్ ఔట్‌పోస్ట్‌ను సైతం ఆయనే మూసివేయించినట్లు స్థానికులు చర్చించుకుంటున్నారు. పొలాలన్నీ బీడే ఇసుక దందా నేపథ్యంలో పేరూరు, పేరూరు డ్యాం, ఏడుగుర్రాలపల్లి, దుబ్బార్లపల్లి, కొత్తపల్లి తదితర గ్రామాల్లో భూగర్భజలాలు పూర్తిగా అడుగంటిపోయాయి. ఈ గ్రామాల్లో గతంలో 1,500 బోరుబావులు ఉండేవి. అప్పట్లో 300 అడుగుల లోతులోనే నీరు సమృద్ధిగా లభ్యమయ్యేది. ప్రస్తుతం చాలా వరకు ఎండిపోయాయి. 200 బోరుబావుల్లో మాత్రం అరకొర నీరు వస్తోంది. కొత్తగా 750 అడుగులు తవ్వినా.. నీటి చెమ్మ తగలకపోవడంతో బోర్లు వేయడానికి రైతులు సాహసించలేకపోతున్నారు. దీంతో నాలుగేళ్లుగా పెన్నానది పరివాహక ప్రాంతంలో పంట పొలాలు బీడుగా మారాయి. పంచాయతీకి పైసా రాలేదు ఇసుక తరలింపు భారీఎత్తున సాగుతున్నా.. దీనిద్వారా పేరూరు పంచాయతీకి ఎటువంటి ఆదాయమూ సమకూరడంలేదు. పెన్నా నది పరివాహక ప్రాంతంలోని పేరూరు గ్రామ శ్మశానవాటికలో సమాధులను సైతం పెకిలించి ఇసుక తోడుకెళ్తున్నారు. ఇసుక అక్రమ రవాణాను అడ్డుకునేందుకు గతంలో పేరూరు గ్రామంలో పోలీస్ ఔట్‌పోస్టు ఏర్పాటు చేశారు. దీన్ని కూడా రెండేళ్లుగా మూసేశారు. పేరూరు గ్రామంలో నిత్యం వందలాది ఇసుక ట్రాక్టర్లు తిరుగుతుండటంతో ఎప్పుడు, ఏ ప్రమాదం జరుగుతుందోనని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాలని వారు కోరుతున్నారు. -
గ్రిగ్స్‌లో సత్తా చాటిన పుట్టపర్తి విద్యార్థులు
పుట్టపర్తి అర్బన్ : ఇటీవల రామగిరిలో జరిగిన పూర్ణిమారావు గ్రిగ్స్‌పోటీల్లో పుట్టపర్తి మండల విద్యార్థులు సత్తా చాటారు. మండల పరిధిలోని పెడపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్ బాలుర వాలీబాల్‌లో విన్నర్స్‌గా, సీనియర్ బాలికలు షటిల్లో విన్నర్స్, బాలికల హాకీలో రన్నర్స్, జూనియర్ షటిల్లో గర్ల్స్ రన్నర్స్‌గా పథకాలు సాధించారని పీడీ నాగరాజు, హెచ్ఎం రామచంద్రారెడ్డి తెలిపారు. అదేవిధంగా బీడుపల్లి ఉన్నత పాఠశాల విద్యార్థులు సీనియర్ క్రికెట్ పోటీల్లో రన్నర్స్‌గా నిలిచినట్లు పీఈటీ వెంకటేష్, హెచ్ఎం గురుప్రసాద్ పేర్కొన్నారు. మండల పరిధిలోని జగరాజుపల్లి మోడల్ స్కూల్ విద్యార్థులు సీనియర్ బాలికల బాల్బ్యాడ్మిటన్లో రన్నర్స్, సీనియర్ బాలుర చెస్‌లో రన్నర్స్, సీనియర్ బాలుర బ్యాడ్మిటన్లో రన్నర్స్‌గా నిలిచి పతకాలు సాధించినట్లు పీఈటీ అజీంభాష, హెచ్ఎం రాజేష్ తెలిపారు. -
రామగిరి ప్యాసింజర్‌లో రేషన్ బియ్యం స్వాధీనం
కాజీపేట రూరల్ : కాజీపేట నుంచి బ ల్లార్షాకు వెళ్లే రామగిరి ప్యాసింజర్ రైలు లో శుక్రవారం కాజీపేట ఆర్పీఎఫ్ సిబ్బంది 5 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శ్రీనివాస్‌రెడ్డి కథనం ప్రకారం.. రామగిరి ప్యా సింజర్‌లోని బోగీలను శుభ్రం చేసేందు కు తెల్లవారు జామున ఫాతిమానగర్ వద్ద ఉన్న వాషింగ్ సైడ్‌షెడ్ వద్దకు తీసుకెళ్లారు. ఈ సందర్భంగా బోగీలను శుభ్రం చేస్తున్న సిబ్బంది రైలులో బియ్యం మూటలను చూసి స్టేషన్ అధికారులకు సమాచారం అందించారు. అలాగే ఆర్పీఎఫ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో వారు వాషింగ్ సైడ్ వద్దకు వెళ్లి బి య్యం మూటలను స్వాధీనం చేసుకుని ఆర్పీఎఫ్ పోలీస్‌స్టేషన్ తరలించారు. తర్వాత హన్మకొండ డీటీ జయశంకర్‌ను పిలిపించి స్వాధీనం చేసుకున్న బియ్యంను ఆయనకు అప్పగించారు. కాగా, రేషన్ బియ్యాన్ని స్థానిక రేషన్ డీలర్ వీరస్వామికి అప్పగించినట్లు డీటీ తెలిపారు.