రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరైన పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు
సాక్షి, అనంతపురం: మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఓ కేసు విషయంలో శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. రామగిరి సీఐ జీటీ నాయుడు, ఎస్‌ఐ నాగస్వామి తెలిపిన వివరాల మేరకు.. 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్సార్‌సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి, సూర్యంతో పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం స్వగ్రామంలో ఉన్న సూర్యంను పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వైఎస్సార్‌సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి)
బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కిడ్నాప్ చేసి దాడిచేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారన్నారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్‌పై ఫిర్యాదు చేయగా.. అప్పట్లో పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా, బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా, పోలీసులు కేసును పునరి్వచారణ చేపట్టారు. ఈక్రమంలో టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకొని శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ప్రతి మంగళ, శుక్రవారం నిందితులు పోలీస్‌స్టేషన్‌కువచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు నిబంధన విధించారు.
Comments
Please login to add a commentAdd a comment