Paritala Sriram
-
సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు. ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. -
ధర్మవరంలో నెగ్గేదెవరూ? తగ్గేదెవరు?!
సాక్షి టాస్క్‌ఫోర్స్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారులు తమ స్వేచ్ఛను కోల్పోయారు. నిజాయితీతో పని చేస్తూ నిక్కచ్చిగా వ్యవహరించే అధికారులు తమకు అవసరం లేదంటూ స్థానిక టీడీపీ నాయకులు తమ అధినేత బాటలో రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారు. ఇందుకు ధర్మవరం మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం నిలువుటద్దమైంది. విధులకు హాజరైతే చొక్కా పట్టుకుని బయటకు గెంటేస్తానంటూ కార్యకర్తల సమావేశంలో పరిటాల శ్రీరామ్ వార్నింగ్ ఇచ్చి అహంకారాన్ని ప్రదర్శించగా... ప్రభుత్వం తనని నియమించింది కాబట్టి విధులను నిజాయితీతో నిర్వర్తించి తీరుతానంటూ మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున ప్రతిగా స్పందించారు. ఎవరికి వారే పంతం పట్టడంతో వీరిద్దరిలో నెగ్గేదెవరు? తగ్గేదెవ్వరూ? అన్నది ప్రస్తుతం ధర్మవరంలో హాట్ టాపిక్‌గా మారింది.పరిటాలకు మింగుడు పడని అంశం..ధర్మవరం మున్సిపాలిటీకి నూతన కమిషనర్‌గా మల్లికార్జునను 15రోజుల క్రితం ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. అయితే సదరు కమిషనర్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనూ ధర్మవరం మున్సిపాలిటి కమిషనర్‌గా పనిచేశారు. కరోనా వంటి విపత్కర సమయంలో ఎంతో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించి అందరి మన్ననలు పొందారు. సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ పరిధిలో గతంలో పని చేసిన అనుభవం ఉండడంతో ఆయన పర్యవేక్షణలో ధర్మవరం మరింత అభివృద్ధి చెందుతుందని భావించిన కూటమి ప్రభుత్వం ఇటీవల ఆయనను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విషయం ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా ఉన్న పరిటాల శ్రీరామ్‌కు మింగుడు పడలేదు. కమిషనర్‌గా మల్లికార్జున బాధ్యతలు స్వీకరించక ముందే పరిటాల శ్రీరామ్ టీడీపీ కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి అనుచిత వ్యాఖ్యలు చేశారు. మల్లికార్జున కమిషనర్‌గా బాధ్యతలు చేపడితే చొక్కా పట్టుకుని ఈడ్చుకెళ్లి బయటకు గెంటేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. అంతటితో ఆగకుండా మల్లికార్జున కార్యాలయానికి రాకుండా ఉండేలా టీడీపీ నాయకులు, కార్యకర్తలను పంపి అల్లర్లకు శ్రీకారం చుట్టారు. మున్సిపల్ కార్యాలయంలో టీడీపీ నాయకులు తిష్ట వేసి నిరసన తెలుపుతుండటంతో పోలీసులు ఇరుకున పడ్డారు. తమను మున్సిపల్ కార్యాలయం వద్ద భద్రతకు కేటాయిస్తే రోజువారీ డ్యూటీలు ఎలా చేయాలంటూ వారిలో వారు మదన పడుతున్నారు.అమ్మో ధర్మవరమా?మున్సిపల్ కమిషనర్ మల్లికార్జున వ్యవహారం చిలికి చిలికి గాలి వానగా మారడంతో ధర్మవరానికి బదిలీపై వెళ్లాలంటే అధికారులు హడలెత్తుతున్నారు. నిబంధనలకు తిలోదకాలిచ్చి అధికార పార్టీకి తొత్తుగా పనిచేయడం తమ వల్ల కాదని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ధర్మవరానికి పోస్టింగ్ అయిన అధికారులు సైతం తమను మరో ప్రాంతానికి బదిలీ చేయించుకునేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఓ ముఖ్య అధికారి సైతం ఇక్కడ పని చేయలేక వేరే ప్రాంతానికి బదిలీపై వెళ్లేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి టీడీపీ నేతల వైఖరితో ధర్మవరం వాసులు బెంబేలెత్తిపోతున్నారు. పట్టణ అభివృద్ధిలో కీలకమైన అధికారులను భయభ్రాంతులకు గురి చేస్తున్న నేతల తీరుపై మండిపడుతున్నారు. -
ప్రభుత్వ కార్యాలయాల్లో వెలసిన పరిటాల శ్రీరామ్ ఫోటోలు
-
అధికారుల నిర్వాకం.. సర్కారీ ఆఫీస్‌ల్లో ‘పరిటాల’ ఫోటో
శ్రీ సత్యసాయి జిల్లా: ధర్మవరంలో అధికారుల నిర్వాకం విస్మయం కలిగిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఫోటోలు వెలిశాయి. ధర్మవరం నియోజకవర్గానికి బీజేపీ నుంచి మంత్రి సత్యకుమార్ ప్రాతినిధ్యం వహిస్తుండగా, ధర్మవరం టీడీపీ ఇంఛార్జి గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు.ధర్మవరం నియోజకవర్గంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రి ఫోటోలతో పాటు పరిటాల శ్రీరామ్ ఫోటోలను అధికారులు ఉంచారు. ఏ పదవి లేని పరిటాల శ్రీరామ్ ఫోటో ఉంచటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
‘తమ్ముళ్ల’ ఓవరాక్షన్
సాక్షి, పుట్టపర్తి: ఎన్నికల నిబంధనలు తుంగలో తొక్కి.. పోలింగ్ కేంద్రాల వద్ద టీడీపీ కార్యకర్తలు నానా హంగామా చేశారు. మారణాయుధాలతో దాడికి దిగారు. పోలింగ్ కేంద్రాల్లో దూరడంతో పాటు దొంగ ఓట్లు వేసేందుకు ప్రయతి్నంచారు. జిల్లా వ్యాప్తంగా ప్రశాంతంగా జరిగే పోలింగ్ కేంద్రాల వద్ద అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు ఎక్కడికక్కడ జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. 👉 పుట్టపర్తి నియోజకవర్గం ఓడీ చెరువు మండలం కుసుమవారిపల్లిలో వైఎస్సార్సీపీ మద్దతుదారుడు డీలర్ ఇంద్రప్పపై టీడీపీ అల్లరిమూకలు మారణాయుధాలతో దాడి చేసి గాయపరిచారు.👉 పెనుకొండ నియోజకవర్గం రొద్దం మండలం గోనిమేకపల్లిలో టీడీపీ కార్యకర్తలు హల్చల్ చేశారు. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడి చేసేందుకు యతి్నంచారు. తోపులాటలో పలువురు గాయపడ్డారు. పోలీసులు రంగంలోకి దిగి అదుపు చేశారు.👉 పుట్టపర్తి నియోజకవర్గం కొత్తచెరువు మండలం కొడపగానిపల్లిలో దొంగ ఓట్లు వేసేందుకు టీడీపీ కార్యకర్తలు ప్లాన్ చేశారు. అయితే అధికారులు అడ్డుకోవడంతో దాడులకు దిగే ప్రయత్నం చేశారు. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టారు.👉 హిందూపురంలో ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ, పుట్టపర్తి నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి నిబంధనలు తుంగలో తొక్కారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓట్లు అభ్యర్థించారు. ఓటర్లతో కరచాలనం చేస్తూ సెలీ్ఫలకు ఫోజులు ఇచ్చారు. ఫలితంగా సామాన్యులు ఇబ్బందులు పడ్డారు. పోలింగ్‌బూత్ వద్దపరిటాల శ్రీరామ్ హల్చల్.. రామగిరి మండలం పెద్దకొండాపురంలోని పోలింగ్‌బూత్ వద్ద మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో కలసి హల్చల్ చేశారు. నిబంధనలకు విరుద్ధంగా మందీమార్బలంతో పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. తాను రాప్తాడు టీడీపీ ఎన్నికల చీఫ్నంటూ పోలింగ్ బూత్‌లోకి వెళ్లేందుకు ప్రయతి్నంచారు. ఈ క్రమంలో అక్కడున్న వారిపై దురుసుగా ప్రవర్తించారు. దీంతో స్థానిక వైఎస్సార్ సీపీ నాయకులు, గ్రామస్తులు తిరగబడి అడ్డుకున్నారు. చీఫ్ ఏజెంట్ అయితే అందుకు సంబంధించిన కాపీ చూపాలంటూ పట్టుబట్టారు. ఇందుకు ఆయన సముఖత చూపకపోవడంతో పరిటాల శ్రీరామ్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. పోలింగ్ బూత్ వద్ద ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. దీంతో పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని శ్రీరామ్‌ను వారించి అక్కడి నుంచి పంపించారు. -
సూరి..శ్రీరాం.. మధ్యలో సత్యకుమార్
సాక్షి, పుట్టపర్తి: శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం పార్లమెంటు పరిధిలోని ధర్మవరం అసెంబ్లీ సీటుపై పీటముడి వీడడం లేదు. ఈ సీటును కూటమిలో ఏ పార్టీకి కేటాయిస్తారు.. అభ్యర్థి ఎవరన్న దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. అటు బీజేపీకి ఇచ్చినా లేక టీడీపీ వద్దే ఉంచుకున్నా తానే బరిలో ఉంటానని మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరి (గోను గుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. ఈ మేరకు ఆయన ప్రచారం కూడా మొదలుపెట్టారు. మరోవైపు కష్టకాలంలో పార్టీ శ్రేణులకు అండగా నిలిచానని, తనకే టికెట్ ఇవ్వాలని పరిటాల శ్రీరామ్ డిమాండ్ చేస్తున్నారు. పైగా శ్రీరామ్, సూరి మధ్య ముందు నుంచీ సఖ్యత లేదు. టికెట్ విషయంలో పంతం నెగ్గించుకోవాలని ఎవరికి వారు పట్టుదలతో ఉన్నారు. బల ప్రదర్శనకు కూడా సిద్ధ మయ్యారు. ఇటీవల ఫ్లెక్సీల విషయంలో ఇరు వర్గీ యుల మధ్య ఘర్షణ జరిగింది. ఇద్దరిలో ఎవరికి టికెట్ ఇచ్చినా.. మరొకరు స్వతంత్ర అభ్యరి్థగా బరి లో ఉండే అవకాశముంది. ఇలాంటి తరుణంలో కూ టమి భిన్న నిర్ణయం తీసుకునే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది. యువగళంతో శ్రీరాంలో ఆశ 2019 ఎన్నికల్లో ఓటమి తర్వాత వరదాపురం సూరి తన కాంట్రాక్టుల కారణంగా బీజేపీలో చేరారు. దీంతో టీడీపీ తరఫున ధర్మవరం ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వచ్చారు. తొలి మూడేళ్లు పార్టీ కార్యక్రమాల్లో అంటీముట్టనట్లుగా వ్యవహరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో టీడీపీ కనీసం ఖాతా కూడా తెరవలేదు. కేడర్‌ను బలోపేతం చేయడంలోనూ పరిటాల శ్రీరామ్ పూర్తిగా విఫలమైనట్లు చెబుతున్నారు. అయితే యువగళం పాదయాత్ర సందర్భంగా నారా లోకేశ్ బత్తలపల్లిలో శ్రీరామ్ చేయి పైకెత్తి గెలిపించాలని కోరడంతో ఆయనలో టికెట్ ఆశ మొదలైంది. అంతేకాకుండా రాప్తాడులో ఓడిపోయిన బాధతో ధర్మవరం నుంచి పోటీ చేస్తే బాగుంటుందని భావించారు. మరోవైపు వరదాపురం సూరి చంద్ర బాబుతో నిత్యం టచ్‌లో ఉన్నట్లు సమాచారం. రేసులోకి సత్యకుమార్! ధర్మవరం టికెట్ కోసం పరిటాల శ్రీరామ్, వరదాపురం సూరి పట్టు వదలకపోవడంతో ఇద్దరినీ పక్కనబెట్టి.. బీజేపీ తరఫున సత్యకుమార్‌ను బరిలోకి దించేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. సూరి, శ్రీరామ్‌లలో ఎవరికి టికెట్ ఇచ్చినా మరో వర్గం కూడా పోటీకి దిగడం, గొడవలు చేయడం, అల్లర్లు సృష్టించడం ఖాయమని అంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఇద్దరికీ టికెట్ నిరాకరిస్తున్నట్లు సమాచారం. ఇదీ చదవండి: జనసేన నేతలకు పవన్ ఉచిత సలహా!.. విస్తుపోవాల్సిందే.. -
AP Alliance Clashes: హాట్ టాపిక్‌గా ధర్మవరం సీటు!
సాక్షి, పుట్టపర్తి: ‘అతుకుల బొంత.. రోజూ చింత’ తరహాలో పెద్దల స్థాయిలో బీజేపీ – జనసేన – టీడీపీ కలిసినా.. క్షేత్రస్థాయిలో ఆ పరిస్థితి కనిపించడం లేదు. ఏ పార్టీ అభ్యర్థి బరిలో నిలిచినా మిగిలిన రెండు పార్టీల నుంచి సహకారం కరువవుతోంది. ఓ వైపు అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అన్ని స్థానాలకూ అభ్యర్థులను ప్రకటించింది. కానీ టీడీపీ– బీజేపీ– జనసేన కూటమి ఇంకా కొన్ని స్థానాలను పెండింగులోనే ఉంచింది. ఫలితంగా మూడు పార్టీల నుంచి ఆశావహులు తెరపైకి వస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడే పరిస్థితి ఎదురవుతున్న సందర్భంలో వర్గాలు ఏర్పడుతున్నాయి. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గ సీటు పంచాయితీ ఇంకా తేలనే లేదు. ఓ వైపు బీజేపీ తరఫున తనకే వస్తుందని వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) చెబుతున్నారు. మరోవైపు టీడీపీకే కేటాయించాలని, పరిటాల శ్రీరామ్ బరిలో ఉండాలని ఆయన వర్గీయులు ర్యాలీలు చేస్తున్నారు. రెండు పార్టీల మధ్య గ్యాప్ పెరిగింది. ఫలితంగా ఆ ఇద్దరిలో ఏ ఒక్కరు పోటీలో ఉన్నా మరో వర్గం వ్యతిరేకంగా పనిచేయడం ఖాయమని భావిస్తున్నారు. ఎంపీ అభ్యర్థి కోసం వెతుకులాట హిందూపురం పార్లమెంటు సీటు బీజేపీకి ఇస్తారని తొలుత ప్రచారం జరిగింది. బీజేపీ నేత పరిపూర్ణానంద స్వామి కొన్ని రోజుల పాటు ప్రచారం కూడా చేశారు. అయితే టీడీపీనే పోటీ చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫలితంగా టీడీపీ నుంచి నిమ్మల కిష్టప్ప, అంబికా లక్ష్మీనారాయణ, బీకే పార్థసారథి టికెట్ ఆశిస్తున్నట్లు సమాచారం. ఆ ముగ్గురిలో ఎవరికి టికెట్ ఇచ్చినా మిగతా ఇద్దరూ సహకరించని పరిస్థితి. అంతేకాకుండా టికెట్ ఇవ్వని పక్షంలో నిమ్మల కిష్టప్ప స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి టీడీపీని ఓడించాలనే నిర్ణయానికి వచ్చినట్లు ఆయన అనుచరులు చెబుతున్నారు. దీంతో ఎంపీ సీటు ఎవరికి ఇవ్వాలనే దానిపై టీడీపీ అధిష్టానం ఫోన్ కాల్స్ సర్వే మొదలుపెట్టింది. పుట్టపర్తి సీటు మార్పు? పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గ టీడీపీ టికెట్ మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కోడలు సింధూరరెడ్డికి ఇచ్చారు. అయితే ప్రచారం తొలిరోజునే ఎండవేడిమిని తట్టుకోలేక ఆస్పత్రిలో చేరారు. మరోవైపు సమర్థులకే ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలని వడ్డెర సంఘం నాయకులు చంద్రబాబు నాయుడు వద్ద డిమాండ్ చేస్తున్నారు. దీంతో టికెట్‌పై చంద్రబాబు, లోకేశ్ పునరాలోచన చేస్తున్నట్లు తెలిసింది. పల్లె సింధూరరెడ్డి స్థానంలో పల్లె రఘునాథరెడ్డికే ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. ‘పల్లె’ కుటుంబంలో ఎవరికి ఇచ్చినా బీసీ సామాజిక వర్గాల నుంచి వ్యతిరేకత రావడం ఖాయమని సొంత పార్టీ నాయకులే చెబుతున్నారు. ‘తమ్ముళ్ల’ మండిపాటు అభ్యర్థుల ప్రకటన విషయంలో చంద్రబాబు, లోకేశ్ వైఖరిపై టీడీపీ కార్యకర్తలు మండిపడుతున్నారు. సీనియర్ నాయకులను సంప్రదించకుండా అభ్యర్థులను ప్రకటించడం సరికాదని విమర్శిస్తున్నారు. మరోవైపు బీసీ సామాజిక వర్గాలను విస్మరించి సొంత సామాజిక వర్గానికే టీడీపీలో పెద్దపీట వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. -
ధర్మవరం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్
సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సీటు కోసం ఇద్దరు నేతల మధ్య ఫైటింగ్ మొదలైంది. ఇద్దరిలో ఒకరు గత ఎన్నికల్లో ఓడిపోయాక అడ్రస్ లేకుండా పోయాడు. తర్వాత బీజేపీలో చేరాడు. ఇప్పుడు పార్టీ ఏదైనా మళ్ళీ అక్కడే పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఇంకోనేత మాజీ మంత్రి కుమారుడు. ఇప్పుడు ఇద్దరూ పచ్చ పార్టీ అధినేత చంద్రబాబు ప్రాపకం కోసం పాకులాడుతున్నారు. తమ రాజకీయ ఉనికి కోసం శాంతిభద్రతల సమస్యలను సృష్టించేందుకు కూడా వెనకాడటంలేదు. ఇంతకీ ఆ ఇద్దరూ ఎవరు? పరిటాల శ్రీరాం, గోనుగుంట్ల సూర్యనారాయణ ఆలియాస్ వరదాపురం సూరీ... ఈ ఇద్దరూ సత్యసాయి జిల్లా ధర్మవరం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఎవరి మార్గంలో వారు ప్రయత్నాలు చేస్తున్నారు. వరదాపురం సూరి 2014లో ధర్మవరం నుంచి టీడీపీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఓడిపోగానే కేసుల భయంతో టీడీపీ జెండా పీకేసీ..కమలం గూటికి చేరాడు. దీంతో ధర్మవరం ఇన్చార్జ్ బాధ్యతలను పరిటాల కుటుంబ వారసుడు శ్రీరాంకు అప్పగించారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఐదేళ్ళుగా ధర్మవరంలో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్న పరిటాల శ్రీరాం వచ్చే ఎన్నికల్లో ధర్మవరం నుంచి తానే పోటీ చేస్తానని స్పష్టం చేస్తూ వస్తున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి ధర్మవరంపై కన్నేశారు వరదాపురం సూరీ. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న ఆయన అవసరం అయితే మళ్ళీ టీడీపీలో చేరి పోటీ చేస్తానని చెబుతున్నారు. ధర్మవరం టిక్కెట్ కోసం టీడీపీకి వంద కోట్లు ఫండ్ ఇచ్చేందుకైనా సిద్ధమంటూ వరదాపురం సూరీ కొంతకాలంగా ప్రచారం చేస్తున్నారు. ఇందులో భాగంగానే ధర్మవరం టిక్కెట్ వరదాపురం సూరీకి ఖరారు అయిందని ఆయన వర్గీయులు కూడా ప్రచారం చేసుకుంటున్నారు. సూరీ వర్గీయుల వైఖరిపై మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరాం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత పారిపోయిన వరదాపురం సూరీ మళ్లీ టిక్కెట్ కోరటం హాస్యాస్పదంగా ఉందని ఆయన అంటున్నారు. టీడీపీ టిక్కెట్ వందకోట్లకు కొంటానంటూ సూరీ, ఆయన వర్గీయులు చేస్తున్న ప్రచారాన్ని పరిటాల శ్రీరాం ఖండిస్తున్నారు. ఈ నేపధ్యంలో పెనుకొండ వద్ద జరిగిన చంద్రబాబునాయుడు రా. కదలిరా సభకు జనాన్ని సమీకరించడానికి పరిటాల శ్రీరాం- వరదాపురం సూరీ పోటీపడ్డారు. పైగా ధర్మవరం నియోజకవర్గంలోని బత్తలపల్లి వద్ద ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. వరదాపురం సూరీ వర్గీయులు వెళ్తున్న వాహనాలపై పరిటాల వర్గీయులు రాళ్లతో దాడులకు తెగబడ్డారు. వరదాపురం సూరీ వర్గీయులు కూడా ప్రతిదాడులు చేశారు. దీంతో దాదాపు పది వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. ఇరువర్గాల మధ్య దాదులు ప్రతిదాడులతో బత్తలపల్లి ప్రాంతం రణరంగమైంది. ఇరువర్గాలను చెదరగొట్టిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. రెండు వర్గాల మధ్య ఘర్షణతో ధర్మవరంలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వరదాపురం సూరి, పరిటాల శ్రీరాం వర్గాల కారణంగా ఎప్పుడు ఏం జరుగుతుందో అని సాధారణ ప్రజలు భయపడే పరిస్థితి కొనసాగుతోంది. టీడీపీ నేతల తీరుపై సాధారణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న పరిటాల శ్రీరాం- వరదాపురం సూరిలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
ధర్మవరంలో పరిటాల, సూరి వర్గీయుల మధ్య బయటపడ్డ విబేధాలు
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతుండటంతో ప్రతిపక్ష టీడీపీలో వర్గపోరు రచ్చకెక్కింది. ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నేతల విబేధాలు తీవ్ర స్థాయికి చేరాయి. మాజీ ఎమ్మెల్యే వరదాపురం సూరికి టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్ మధ్య మరోసారి విబేధాలు బయటపడ్డాయి. తాజాగా బత్తలపల్లిలో వరదాపురం సూరి వర్గీయుల వాహనాలను పరిటాల అనుచరులు ధ్వంసం చేశారు. దీంతో పరిటాల-సూరి వర్గీయులు ఒకరికొకరు రాళ్లతో దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో వరదాపురం సూరి వర్గీయులు ప్రయాణిస్తున్న 10-15 వాహనాలు ధ్వంసం అయ్యాయి. నలుగురు సూరి వర్గీయులకు గాయాలయ్యాయి. దీంతో కాసేపు స్థానికంగా ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. పెనుకొండలో సోమవారం సాయంత్రం జరిగే చంద్రబాబు ‘రా.. కదలిరా’ సమావేశానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. కాగా ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్న వరదాపురం సూరి వర్గీయులు చంద్రబాబు సభకు వెళ్లకూడదంటూ పరిటాల శ్రీరామ్ వర్గీయులు ఈ దాడికి పాల్పడ్డారు. ఇక ధర్మవరం టీడీపీ టికెట్ కోసం కొంతకాలంగా పరిటాల శ్రీరామ్ - వరదాపురం సూరి గొడవపడుతున్న సంగతి విదితమే. చదవండి: నర్రెడ్డి సునీత యాక్షన్.. చంద్రబాబు డైరెక్షన్ -
‘ఫ్యామిలీ’ డ్రామా!
సాక్షి, అమరావతి: వచ్చే ఎన్నికల్లో సీట్ల కేటాయించడానికి చంద్రబాబు అనుసరిస్తున్న విధానంపై టీడీపీలో అసంతృప్తి పెల్లుబికుతోంది. ఒక కుటుంబంలో ఒకరికే సీటు ఇస్తానని ఆయన పెట్టిన నిబంధనతో పలువురు సీనియర్ నేతలు రగిలిపోతున్నారు. ఆ కుటుంబాల్లో ఒకరికే సీటు ఇచ్చేందుకు చంద్రబాబు ఈ సాకు చూపుతున్నా తాను కావాలనుకుంటే మాత్రం దానికి సడలింపు ఇచ్చేస్తున్నారు. దీనిపై సీనియర్లు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు. చంద్రబాబు తన కుటుంబంలో కావాల్సిన వారందరికీ సీట్లు ఇచ్చుకుంటూ పార్టీలోని సీనియర్లకు మాత్రమే ఈ రూలు పెడుతుండడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. నిజానికి.. చంద్రబాబు ఇప్పటికే తన కుటుంబంలో ముగ్గురికి సీట్లు ప్రకటించుకోగా, ఇంకో సీటు మలి జాబితాలో ప్రకటించనున్నారు. తనకు కుప్పం, తన కుమారుడు లోకేశ్‌కు మంగళగిరి, తన బావమరిది–వియ్యంకుడు బాలకృష్ణకి హిందూపురం సీట్లను కేటాయించుకున్నారు. మరో సీటును లోకేశ్ తోడల్లుడు, బాలకృష్ణ రెండో అల్లుడు భరత్‌కి ఎక్కడో ఒకచోట ఇవ్వడం ఖాయమైంది. ఇలా నాలుగు సీట్లు చంద్రబాబు తన కుటుంబానికి కేటాయించుకున్నారు. సీనియర్ల విషయానికి వచ్చేసరికి ఒకరికే సీటు ఇవ్వగలమని, కుటుంబంలో ఇద్దరికి ఇవ్వడం సాధ్యంకాదని తెగేసి చెబుతున్నారు. అదేమంటే పొత్తుల్లో సీట్లు తగ్గిపోయాయని వంకలు చెబుతున్నా సొంత కుటుంబానికి నాలుగు సీట్లు ఎలా ఇచ్చుకున్నారనే ప్రశ్నకు సమాధానంలేదు. అయ్యన్నకు సీటు..కొడుక్కి మొండిచేయి.. అనకాపల్లి జిల్లాలో మాజీమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడికి నర్సీపట్నం సీటును ప్రకటించగా ఆయన కుమారుడు విజయ్‌కి సీటు ఇవ్వలేదు. అయ్యన్న తన కుమారుడికి అనకాపల్లి ఎంపీ సీటు ఇవ్వాలని ఎంత ఒత్తిడి చేసినా చంద్రబాబు పట్టించుకోలేదు. ఒక దశలో తనకు కాకుండా తన కుమారుడికి సీటు ఇవ్వాలని అయ్యన్న గట్టిగా కోరినా ఆయన మాట పెడచెవిన పెట్టారు. దీంతో కష్టకాలంలో పార్టీకి అండగా ఉండి, తీవ్ర ప్రతికూల పరిస్థితుల్లో టీడీపీకి కాపుకాసిన తమకు ఈ పరిస్థితి ఏమిటని ఆవేదనతో ఆయన కొద్దిరోజులు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఇప్పుడు తనకు నర్సీపట్నం సీటు ఇచ్చినా అయ్యన్న సంతృప్తిగా లేరు. తనకో నిబంధన, చంద్రబాబుకి మరో నిబంధనా అని అంటూ అంతర్గతంగా రగిలిపోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జేసీ బ్రదర్స్‌కి ఝలక్.. ఇక ఉమ్మడి అనంతపురం జిల్లాలో జేసీ సోదరులకు కూడా చంద్రబాబు ఇదే తరహా ఝలక్ ఇచ్చారు. జేసీ సోదరులు గత ఎన్నికల్లోనూ తాము పక్కకు తప్పుకుని తమ కుమారులను బరిలోకి దింపారు. అనంతపురం ఎంపీ స్థానంలో దివాకర్ కుమారుడు పవన్, తాడిపత్రి ఎమ్మెల్యే స్థానంలో ప్రభాకర్‌రెడ్డి కుమారుడు అస్మిత్‌ని పోటీ చేయించారు. ఈ ఎన్నికల్లో అలాగే సీట్లు ఇవ్వాలని ఎంత లాబీయింగ్ చేసినా అస్మిత్ ఒక్కడికే సీటిచ్చి పవన్‌కి సీటు నిరాకరించారు. దీంతో జేసీ సోదరులు పైకి మామూలుగానే మాట్లాడుతున్నా లోలోన మాత్రం రగిలిపోతూ చంద్రబాబుపై మండిపడుతున్నారు. పనబాక విషయంలోనూ గందరగోళమే.. మరోవైపు.. కేంద్ర మాజీమంత్రి పనబాక లక్ష్మి కుటుంబాన్నీ చంద్రబాబు గాల్లో పెట్టారు. పార్టీలో చేరే ముందు ఆమెతో పాటు ఆమె భర్త కృష్ణయ్యకు సీటిస్తామని చెప్పి తీసుకొచ్చినా ఇప్పుడు ఏ విషయం తేల్చడంలేదు. ఆమెకు మొదట తిరుపతి ఎంపీ సీటు ఇస్తామని చెప్పినా ప్రస్తుతం దానిపైన స్పష్టత ఇవ్వలేదు. బీజేపీతో పొత్తు ఉంటే ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇచ్చేందుకు ఆమె పేరు పరిశీలిస్తున్నట్లు తెలిసింది. దీంతో పనబాక కుటుంబం చంద్రబాబు తమను మోసం చేశారని ఆవేదన వ్యక్తంచేస్తోంది. దీన్నిబట్టి చంద్రబాబు ఒక కుటుంబానికి ఒక సీటనే రూలును తన రెండుకళ్ల సిద్ధాంతం మాదిరిగానే తనకు అవసరమైన చోట మాత్రమే ప్రయోగిస్తున్నట్లు స్పష్టమవుతోంది. పరిటాల కుటుంబానికి చెక్.. ఈ జిల్లాలోనే మరో సీనియర్ నేత పరిటాల సునీత కుటుంబానికి చంద్రబాబు షాకిచ్చారు. సునీతకు రాప్తాడు సీటు ప్రకటించి ఆమె కుమారుడు శ్రీరామ్‌కి సీటు నిరాకరించారు. ధర్మవరం సీటు తన కుమారుడికివ్వాలని పట్టుబట్టినా ఒక కుటుంబానికి ఒకే సీటు పేరుతో అతన్ని పక్కనపెట్టారు. దీంతో పరిటాల కుటుంబం కక్కలేక మింగలేక ఉండిపోయింది. ఇలా సీనియర్ల కుటుంబాలను కట్టడి చేసిన చంద్రబాబు తన కుటుంబానికి మాత్రం నిబంధనలేవీ వర్తించవనేలా వ్యవహరిస్తుండడం సీనియర్లకు మింగుడుపడడంలేదు. ఇక తన కుటుంబానికే కాకుండా కింజరాపు అచ్చెన్నాయుడికి టెక్కలి సీటు ఇవ్వగా, ఆయన అన్న కుమారుడు రామ్మోహన్నాయుడికి శ్రీకాకుళం ఎంపీ సీటు ఖరారు చేశారు. -
పరిటాల ఫ్యామిలీకి గడ్డు కాలం
తెలుగుదేశంలో వ్యక్తులను బట్టి న్యాయ సూత్రాలు మారిపోతున్నాయి. ఒకొక్క కుటుంబానికి ఒక్కో రూల్ అన్నట్లుగా పార్టీ నడుస్తోంది. తమకు నచ్చితే ఒక విధంగా లేకుంటే ఇంకోవిధంగా రూల్స్ మార్చేసే చంద్రబాబు ఇప్పుడు పరిటాల కుటుంబాన్ని మెల్లగా డైల్యూట్ చేస్తున్నారు. ఒకనాడు అనంతపురంతోబాటు రాయలసీమలో అధికభాగాన్ని ప్రభావితం చేసిన పరిటాల కుటుంబం ఇప్పుడు ఉనికికోసం పోరాడుతోంది. గతంలో పెనుగొండ నుంచి గెలిచిన పరిటాల రవి మంత్రిగా పని చేశారు. జిల్లావ్యాప్తంగానే కాకుండా రాయలసీమ, కోస్తాలో సైతం హవా వెలగబెట్టారు. అయన మరణం తరువాత ఎమ్మెల్యేగా గెలిచిన సునీత సైతం టీడీపీలో మంత్రిగా చేసారు. అయితే ఇప్పుడు ఆ కుటుంబం సునీతతోబాటు కుమారుడు శ్రీరామ్‌కు రెండు టిక్కెట్స్ అడుగుతోంది. కానీ దీనికి చంద్రబాబు వ్యతిరేకంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక ఫ్యామిలీకి ఒకటే టిక్కెట్ ఇస్తామని, రెండేసి ఇవ్వలేమని, ఇది రాష్ట్రవ్యాప్త పాలసీ అని చెబుతున్నారు. కానీ లోకేష్, చంద్రబాబు, బాలయ్యబాబు మాత్రం ఒకే ఫ్యామిలీ నుంచి ఉండొచ్చా అనే ప్రశ్నలు పరిటాల క్యాంప్ నుంచి వినిపిస్తున్నాయి. ఇక లోకేష్, చంద్రబాబు మాత్రం రెండేసి చోట్ల పోటీ చేస్తారని అంటున్నారు. చంద్రబాబు కుప్పం నుంచి.. లోకేష్ మంగళగిరి నుంచి.. బాలకృష్ణ హిందూపురం నుంచి.. బాల కృష్ణ చిన్న అల్లుడు భరత్.. విశాఖ ఎంపీ స్థానం నుంచి పోటీ చేస్తున్నాకానీ మాకు మాత్రం రాప్తాడు, ధర్మవరం రెండు సీట్లు ఇవ్వరా అని పరిటాల కుటుంబం ఆవేదన చెందుతోంది. మరోవైపు శ్రీకాకుళం ఎంపీగా రామ్మోహన్ నాయుడు పోటీ చేస్తుండగా టెక్కలి నుంచి అయన బాబాయ్ అచ్చెన్నాయుడు బరిలో ఉన్నారు. మరి వాళ్ళు మాత్రం ఒకే కుటుంబం కాదా అని పరిటాల కుటుంబం అడుగుతోంది. రాప్తాడు నుంచి పరిటాల రవి సతీమణి సునీత.. కుమారుడు శ్రీరామ్ ఆశిస్తున్నారు కానీ రాప్తాడు వరకూ ఒకే చేసిన చంద్రబాబు ధర్మవరం టిక్కెట్ మాత్రం ఇచ్చేదిలేదని అంటూ అక్కడ వరదాపురం సూరి వైపు మొగ్గు చూపుతున్నారు. యువతకు 40 సీట్లు ఇస్తానని మహానాడులో భారీగా హామీ అయితే ఇచ్చారు కానీ అమల్లోకి వచ్చేసరికి మాత్రం ఆ మాటలను గాలికి వదిలేస్తున్నారు. ఇదిలా ఉండగా ధర్మవరంలో వరదాపురం సూరికి, పరిటాల కుటుంబానికి మధ్య యేళ్ళనాటి వైరం ఉంది. దీంతోబాటు పయ్యావుల కేశవ్, ప్రభాకర్ చౌదరి కూడా పరిటాలను ధర్మవరం రానివ్వడం లేదు. వాళ్ళు అవకాశం వస్తే పరిటాల కుటుంబాన్ని ఓడించడానికి చేతులు కలిపేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇలా జిల్లాలో మూలమూలనా వ్యతిరేకత మూటగట్టుకుని శత్రువులను పెంచుకుంటూ వెళ్లిన పరిటాల కుటుంబాన్ని ఆదరించేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాప్తాడుతో సరిపెట్టేసేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. - సిమ్మాదిరప్పన్న -
చంపుతానని బెదిరిస్తున్నాడు
ఆత్మకూరు: ‘నాకు చాలా అప్పులు ఉన్నాయి. అప్పుల బాధ ఎక్కువైంది. దీంతో ఏం చేయాలో దిక్కుతోచక నా భూమి అమ్మి అప్పులు చెల్లించాలనుకుంటే పరిటాల కుటుంబం అండ చూసుకుని టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరుశురామ్ నన్ను చంపేందుకు కుట్ర చేస్తున్నాడు’ అంటూ బి.యాలేరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నేత బండి నాగరాజు వాపోయాడు. ఇందుకు సంబంధించి సెల్ఫీ వీడియో సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. వీడియోలో బండి నాగరాజు మాట్లాడుతూ... ‘ఎస్పీ సార్‌కు నా విన్నపం. నా భూమి అమ్ముతుంటే బండి పరశురామ్ అడ్డుపడుతూ పలుమార్లు నన్ను చంపడానికి ప్రయత్నించాడు. ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశా. ఇప్పటికే బండి పరుశురామ్‌పై చాలా కేసులున్నాయి. పరిటాల శ్రీరామ్, పరిటాల సునీత, బాలాజీ అండ చూసుకుని నన్ను చంపుతానంటూ బెదిరిస్తున్నాడు. మా తాతకు ఐదుగురు కుమారులు ఉండగా... మా నాన్న నాల్గోవాడు. రెండవ వ్యక్తి ముసలన్న కుమారుడే బండి పరుశురామ్. నాకు పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని ఆక్రమించుకునేందుకు పరుశురామ్ ప్రయత్నిస్తున్నాడు. కురుబ కుల పెద్దలు జోక్యం చేసుకుని నాకు న్యాయం చేయాలి. నాకున్న అప్పులు తీర్చుకునేందుకు నా భూమిని అమ్ముతున్నాను. పరుశురామ్ ఆగడాలను ఆపకపోతే నాకు ఆత్మహత్యే శరణ్యం. నాకు ఎలాంటి హాని జరిగినా బండి పరుశురామే కారణమవుతాడు’ అంటూ ఎస్పీ అన్బురాజన్, కురుబ కులస్తులకు సెల్ఫీ వీడియో ద్వారా నాగరాజు అభ్యర్థించాడు. -
రాప్తాడు నియోజకవర్గం లో జరుగుతున్న అభివృద్ధిని చూసి
-
పరిటాల వర్సెస్ వరదాపురం
ధర్మవరం: శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య వర్గపోరు తారాస్థాయికి చేరింది. ప్రశాంతంగా ఉంటున్న నియోజకవర్గంలో అశాంతి రాజేసేలా ఇరువర్గాలు వ్యవహరిస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీలో ఉన్న వరదాపురం సూరి వర్గీయులు టీడీపీలో చేరుతున్నామనే సంకేతాలిచ్చేందుకు ముదిగుబ్బ మండల కేంద్రంలో సొసైటీ సర్కిల్ వద్ద చంద్రబాబు, లోకేశ్ ఫొటోలతో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలే ప్రధానంగా ఘర్షణకు కారణమయ్యాయి. పోలీసులు సకాలంలో స్పందించడంతో పరిస్థితి సద్దుమణిగింది. వరదాపురం సూరి 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి ఘోర ఓటమిని చవిచూశారు. ఆ తర్వాత నెల కూడా గడవక ముందే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి నుంచి ధర్మవరం నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ వ్యవహరిస్తున్నారు. కానీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో త్వరలో టీడీపీలోకి చేరతామని, ఆ పార్టీ టికెట్ తనకేనంటూ కొంత కాలంగా సూరి తన అనుచరులతో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. ఇదిలా ఉండగా, వరదాపురం సూరి రెండు రోజుల కిందట ధర్మవరంలో మీడియాతో మాట్లాడుతూ పరిటాల కుటుంబంపై తీవ్ర విమర్శలు చేశారు. తాను ఎమ్మెల్యేగా ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓ మాజీ మంత్రి అని, వారు ధర్మవరం, శింగనమల, పెనుకొండలకు వెళితే వైఎస్సార్సీపీకి పనిచేస్తారని, ఒక్క రాప్తాడులో మాత్రం టీడీపీకి పని చేస్తారని, ధర్మవరం చెరువుకు నీరు అందించేందుకు తాను సొంత నిధులతో కాలువ మరమ్మతులు చేయిస్తే.. వాటికి కూడా నాడు –నేడు కింద బిల్లులు చేసుకున్నారని పరోక్షంగా పరిటాల సునీతను విమర్శించారు. ఈ నేపథ్యంలో ఇరువర్గాల మధ్య విభేదాలు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే స్థాయికి చేరాయి. మీ పార్టీ నాయకుల ఫొటోలు వేసుకోండి.. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపేందుకు ముదిగుబ్బ మండలంలో వరదాపురం సూరి అనుచరులు పసుపు రంగు ఫ్లెక్సీల ఏర్పాటుకు పూనుకున్నారు. అందులో వరదాపురంతో పాటు చంద్రబాబు, నారా లోకేశ్ ఫొటోలు వేయించారు. దీనిపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు బీజేపీలో ఉన్నందు వల్ల ఆ పార్టీ నాయకుల బొమ్మలు వేసుకోండి. అంతేగానీ చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు ఎలా వేస్తారు? అంటూ మండిపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం చెప్పులు విసురుకున్నారు. ముదిగుబ్బ ఎస్ఐ వంశీకృష్ణ ఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వివాదం ముదురుతుండటంతో సూరి వర్గీయులు వివాదాస్పద ఫ్లెక్సీలను తొలగించి వెనుదిరిగారు. -
పరిటాల కుటుంబానికి టికెట్ ఇస్తారా?
సాక్షి, పుట్టపర్తి: తెలుగుదేశం పార్టీలో దాదాపు మూడు దశాబ్దాల పాటు వెలిగిన పరిటాల కుటుంబం అయోమయంలో పడింది. గత ఎన్నికల్లో రాప్తాడులో ఓటమితో రాజకీయంగా ఎదురుదెబ్బ తగిలింది. కొత్తగా అరంగేట్రం చేసిన శ్రీరామ్ రాప్తాడు కాదని.. దొరికిందే అదనుగా ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్నారు. అయితే అక్కడ కూడా సొంత సామాజికవర్గం నుంచే పోట్లు ఎదురవుతున్నాయి. ఫలితంగా ధర్మవరంలో ఉండలేక.. రాప్తాడుకు రాలేక.. పరిటాల రవీంద్ర, సునీతను గెలిపించిన పెనుకొండ నుంచి పోటీ చేయాలని సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే బీసీ ఓటర్లు ఎక్కువగా ఉండే ఆ నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి టికెట్ ఇస్తారా? లేదా? అనేది టీడీపీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు బీసీ సామాజిక వర్గానికి చెందిన బీకే పార్థసారథి, సవితమ్మ మధ్య టికెట్ పోటీ నెలకొంది. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీరామ్‌కు ఎక్కడి నుంచి టికెట్ ఇస్తారనే దానిపై స్పష్టత కరువైంది. ఉన్నదీ పాయె.. రాప్తాడులో ఓటమితో నియోజకవర్గ ప్రజలను పరిటాల కుటుంబసభ్యులు పట్టించుకోలేదు. దీంతో వారి వెంట నడిచేందుకు కార్యకర్తలు ఉత్సుకత చూపలేదు. ధర్మవరం ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నా.. ఉంటారో.. లేక సొంత నియోజకవర్గానికి వెళ్తారో అనే అనుమానంతో సొంత సామాజిక వర్గం వారే తలోదారి చూసుకుంటున్నారు. దీనికి తోడు బీజేపీ నేత వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) త్వరలో టీడీపీలో చేరతారనే ప్రచారం సాగుతోంది. ధర్మవరం నుంచి ఆ పార్టీ తరఫున పోటీ చేసేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నారని సమాచారం. ఒకవేళ టికెట్ రాకున్నా.. స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగాలనే భావనతో ఉన్నట్లు తెలిసింది. స్వయంకృతాపరాధమే.. హిందూపురం పార్లమెంటులో ఒకప్పుడు కీలకంగా వ్యవహరించిన పరిటాల కుటుంబ సభ్యులకు టికెట్ కష్టాలు రావడం స్వయంకృతాపరాధమేనని చెబుతున్నారు. అన్నీ తామై వ్యవహరించడం, జిల్లా రాజకీయాలను శాసించాలనే అత్యాశకు పోవడంతో కార్యకర్తలు దూరమైనట్లు చెబుతారు. అధికారంలో ఉన్న సమయంలో కేవలం సొంత సామాజికవర్గానికి అనుకూలంగా పని చేయడం, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలను పట్టించుకోకపోవడం కూడా వారి ఓటమికి కారణాలని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఓడినా.. సొంత సామాజిక వర్గంవారికే ప్రాధాన్యత ఇస్తుండడంతో ఇతర సామాజికవర్గాల నుంచి పరిటాల కుటుంబానికి చేదు అనుభవం ఎదురవుతోంది. రెండు చోట్లా వ్యతిరేకతే.. రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లుగా పరిటాల సునీత, పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అయితే రెండు చోట్లా ఇద్దరిపై భారీ వ్యతిరేకత ఉంది. కార్యకర్తలను పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి నెలకొందని చెబుతున్నారు. పార్టీలకు అతీతంగా.. అర్హతే ప్రామాణికంగా టీడీపీ కార్యకర్తలకు సైతం సంక్షేమ ఫలాలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తోంది. దీంతో ఇప్పటికే చాలా మంది వైఎస్సార్సీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఫలితంగా రాప్తాడు, ధర్మవరంలో పరిటాల కుటుంబ సభ్యులు గెలవడం కష్టమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అక్కడా కష్టమేనా..! బీసీ ఓటర్లు అధికంగా ఉన్న పెనుకొండ నుంచి పరిటాల కుటుంబ సభ్యులు పోటీ చేసినా ఘోర పరాభవం తప్పదని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీసీ కులాలకు చెందిన నిమ్మల కిష్టప్ప, బీకే పార్థసారథి, సవితమ్మ మధ్య సమన్వయం లేకపోవడం కూడా కారణంగా చెప్పవచ్చు. ముగ్గురి మధ్యలోకి పరిటాల శ్రీరామ్ వస్తే.. గ్రూపు తగాదాలతో మరోసారి పరాభవం ఖాయమని చెబుతున్నారు. -
రేయ్.. మాపైనే నీళ్లు పోస్తావా!
అనంతపురం/రాప్తాడురూరల్: అన్నం వడ్డించే క్రమంలో పొరబాటున నీళ్లు పడడంతో ఓ దళిత యువకుడిని పరిటాల శ్రీరామ్ అనుచరులు చితకబాదారు. ఈ నెల 7న అనంతపురం రూరల్ మండలం కృష్ణంరెడ్డిపల్లి క్రాస్ సమీపంలో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇటుకలపల్లి సీఐ నరేంద్రరెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం నగరానికి చెందిన దళిత శేఖర్ ఓ ప్రైవేట్ కంటి ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. ఆస్పత్రి యజమాని, అతడి స్నేహితులు ఈ నెల 7న బత్తలపల్లి మండలం ఈదుల ముష్టూరు సమీపంలోని తోటలో విందు ఏర్పాటు చేసుకున్నారు. పరిటాల శ్రీరామ్ అనుచరులైన ఇటుకలపల్లి మాజీ ఎంపీటీసీ సభ్యుడు అక్కులప్ప కుమారుడు అనిల్, మాల్యవంతం శీన, ముష్టూరు సాంబ, ఆత్మకూరు మండలం సనప గ్రామానికి చెందిన ఎస్ఎంఎస్ రాజు హాజరయ్యారు. యజమాని సూచన మేరకు శేఖర్ ఏర్పాట్లలో పాల్గొన్నాడు. భోజనం వడ్డించే క్రమంలో శేఖర్ గ్లాసులో నీళ్లు పోస్తుండగా పొరపాటున శ్రీరామ్ అనుచరులపై పడ్డాయి. అక్కడే శేఖర్‌తో వాగ్వాదానికి దిగారు. అక్కడున్న వారు కల్పించుకుని సర్ది చెప్పారు. విందు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో శేఖర్ మరో ఇద్దరు స్నేహితులతో కలిసి అనంతపురం నగరానికి బైకులో బయలుదేరారు. కృష్ణంరెడ్డిపల్లి క్రాస్ సమీపంలోకి రాగానే వెనుక నుంచి పోలీస్ సైరన్‌తో బొలెరో వాహనంలో వచ్చి బైక్‌ను ఆపారు. వాహనం నుంచి కిందకు దిగిన అనిల్, మాల్యవంతం శీన, సాంబ, రాజు నలుగురూ కలిసి శేఖర్‌పై దాడికి పాల్పడ్డారు. ‘పార్టీలో మా మీద నీళ్లు పోస్తావారా.. నా కొడకా! మేము ఎవరో తెలుసారా?’ అంటూ కులం పేరుతో దూషిస్తూ దాడి చేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. బాధితుడు ఇటుకలపల్లి పోలీస్ స్టేషన్‌కు చేరుకుని జరిగిన ఘటనపై ఫిర్యాదు చేశాడు. అతని ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేశారు. -
పరిటాల సునీత, శ్రీరామ్‌లపై కేసు నమోదు
సాక్షి, శ్రీసత్యసాయి జిల్లా: రాప్తాడు నియోజకవర్గంలో అనుమతి లేకుండా ర్యాలీ నిర్వహించినందుకు మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌పై పోలీస్ చేసు నమోదైంది. కాగా కనగానపల్లి మండలంలో బుధవారం అనుమతి లేకుండా నిర్వహించిన ర్యాలీలో రాప్తాడు టీడీపీ ఇంచార్జి పరిటాల సునీత, ధర్మవరం ఇంచార్జి పరిటాల శ్రీరాం పాల్గొన్నారు. ఈ నేపథ్యంలోనే పరిటాల సునీత, శ్రీరామ్ సహా 119 మంది టీడీపీ నేతలపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇక పరిటాల సునీత, ఆమె తనయుడిపై నిబంధనలకు విరుద్ధంగా వ్వహరించినందుకు కేసు ఫైల్ అవ్వడం ఇదేం తొలిసారి కాదు. అంతకముందు కూడా అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించినందుకు వీరిపై కేసులు నమోదయ్యాయి. చదవండి: దర్యాప్తును ప్రభావితం చేస్తున్నారు.. సాక్షులను బెదిరిస్తున్నారు -
పరిటాల గప్‌చుప్.. ధర్మవరం సీటు జనసేనకేనా?
‘‘ఏం లాభం లేదప్పా... ఎవరితో పొత్తు ఉంటుందో తెలియదు. సీటు పొత్తులో పోతుందా...ఇస్తే ఎవరికిస్తారో తెలియదు... ఇప్పటి నుంచే జనాల్లో తిరుగుతూ డబ్బు పెట్టుకుంటూ పోతే చివరకు గుండు సున్నా. ప్రస్తుతం పార్టీ పరిస్థితీ బాగోలేదు..జిల్లాలో చాలాచోట్ల సీట్లిచ్చినా గెలిచే పరిస్థితి లేదు... అందుకే ఇంటికే పరిమితమైన’’ – టీడీపీ ద్వితీయ శ్రేణి నాయకుడితో ఓ నేత ఆవేదన ఇది.. జిల్లాలోని చాలా నియోజకవర్గాల్లో టీడీపీ నేతలది ఇదే పరిస్ధితి. సాక్షి, పుట్టపర్తి: ఇన్నాళ్లూ టికెట్ కోసం పోటీ పడిన తెలుగు తమ్ముళ్లు... ప్రస్తుతం మౌన ముద్రలో ఉండిపోయారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో పోటీ చేస్తే ఓటమి తప్పదని తెలుసుకుని ఇళ్లకే పరిమితమయ్యారు. చివరకు నియోజకవర్గంలోని ప్రజలనూ కలవడం మానేశారు. దీనికి తోడు జనసేనతో పొత్తు కుదిరితే ఆ పార్టీ నేతలకు టికెట్ ఇస్తారేమోనన్న సందేహం ఓ వైపు వెంటాడుతోంది. ఫలితంగా కార్యకర్తల్లోనూ గందరగోళం నెలకొంది. ఎటు పోవాలి.. ఏ నాయకుడి వద్ద ఉంటే మంచి జరుగుతుందో తెలియక సందిగ్ధంలో పడిపోయారు. ఇళ్లకే పరిమితమైన ‘పచ్చ’ నేతలు.. జనాలు వెంట రాకపోవడంతో జిల్లాలోని పలు నియోజకవర్గాల టీడీపీ ఇన్‌చార్జ్‌లు కూడా బయట తిరగడం మానేశారు. రెండు నెలలుగా కార్యకర్తల యోగ క్షేమాలను సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. కదిరిలో మైనార్టీలకు టికెట్ ఇస్తారని ఇన్చార్జ్గా ఉన్న కందికుంట వెంకట ప్రసాద్ పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు. పుట్టపర్తిలో బీసీ సామాజికవర్గం లేదా కమ్మ కులానికి టికెట్ ఇస్తారని జోరుగా ప్రచారం సాగుతుండటంతో మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి నిరుత్సాహంలో ఉన్నారు. ధర్మవరం టికెట్ జనసేనకు కేటాయిస్తారనే ప్రచారం నేపథ్యంలో పరిటాల శ్రీరామ్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. పుట్టపర్తి బీసీలకేనా? జిల్లా కేంద్రం పుట్టపర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి ఉన్నారు. అయితే ఆయనకు వ్యతిరేకంగా సొంత పార్టీలోనే గ్రూపు రాజకీయం నడుస్తోంది. దీంతో ఆయనకు బదులు బీసీ సామాజికి వర్గానికి చెందిన వారికి టికెట్ ఇస్తే ఎలాంటి సమస్యా ఉండదనే నిర్ణయం అధిష్టానం తీసుకుందని ‘తమ్ముళ్లు’ చెబుతున్నారు. దీంతో పల్లె రఘునాథరెడ్డి పుట్టపర్తిలో సొంత పనులకే పరిమితమయ్యారు. పల్లె వెంట తిరిగేందుకు ‘తమ్ముళ్లు’ కూడా వెనుకడుగు వేస్తున్నారు. బీసీ వర్గాలకు టికెట్ లేదంటే కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలనే డిమాండ్ కూడా ఉంది. ధర్మవరం సీటు జనసేనకేనంటూ ప్రచారం.. నాలుగేళ్లుగా పరిటాల శ్రీరామ్ ఇన్చార్జ్గా వ్యవహరిస్తున్న ధర్మవరం నియోజకవర్గంలో టీడీపీ తరఫున పోటీ చేసేందుకు ఎవరూ ముందుకు రావడం లేదు. పరిటాల శ్రీరామ్ కూడా ఖర్చు తప్ప లాభం లేదని భావించి మౌనంగా ఉన్నట్లు తెలుస్తోంది. వరదాపురం సూరి ఇప్పటికీ బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో జనసేనతో పొత్తు పెట్టుకుని ఆ పార్టీ నేతకే టికెట్ ఇస్తారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో టీడీపీలో చేరేందుకు వరదాపురం సూరి సంకోచిస్తున్నారు. కదిరి మైనార్టీలకేనా? కదిరి నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జ్గా కందికుంట వెంకట ప్రసాద్ చాలా ఏళ్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. అయితే 2009 ఎన్నికల్లో మాత్రమే ఆయన విజయం సాధించారు. మూడుసార్లు ఓడిపోయారు. ఈసారి టికెట్ ఇచ్చినా... మరోసారి ఆయన ఓటమి ఖాయమని సర్వేలో తేలినట్లు తెలిసింది. ఫలితంగా ఆయన బదులు మైనార్టీలకు టికెట్ కేటాయించే ఆలోచనలో టీడీపీ అధిష్టానం ఉన్నట్లు తెలిసింది. ఈ క్రమంలో కందికుంట వెంకట ప్రసాద్ సొంత పనులకే పరిమితమయ్యారని ఆ పార్టీ శ్రేణులే చెబుతున్నాయి. నియోజకవర్గంలో ఎలాంటి కార్యక్రమాల్లో ఆయన కనిపించడం లేదు. ‘యువగళం’తర్వాత గప్‌చుప్.. జిల్లాలో ‘యువగళం’ పాదయాత్ర సమయంలో నారా లోకేశ్ వెంట నడిచేందుకు నాయకులు ఆసక్తి చూపారు. ఆ తర్వాత ఎలాంటి కార్యక్రమూ నిర్వహించలేదు. ఇటీవల నిర్వహించిన టీడీపీ బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ కావడంతో నాయకులు నిరుత్సాహంలో పడ్డారు. కార్యకర్తలు కూడా వెంట రాకపోవడంతో పోటీ చేసేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తున్నారని తెలుస్తోంది. -
భూమి కబ్జాచేసి చంపేస్తామంటున్నారు.. పరిటాల శ్రీరామ్ నుంచి రక్షణ కల్పించండి
సాక్షి, పుట్టపర్తి(శ్రీసత్యసాయి జిల్లా): తెలుగుదేశం నాయకుడు పరిటాల శ్రీరామ్ నుంచి తనకు ప్రాణహాని ఉందని శ్రీసత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన చెరుకూరి వెంకటరాముడు సోమవారం ఎస్పీ రాహుల్‌దేవ్‌సింగ్‌కు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేయడమేగాక దాన్ని రాసి ఇవ్వమంటున్నారని, లేకపోతే చంపేస్తామని ఆయన అనుచరులు బెదిరిస్తున్నారని తెలిపారు. పరిటాల సునీత కబ్జాచేసిన తన భూమిని తనకు ఇప్పించాలని, తనకు రక్షణ కల్పించాలని కోరారు. ‘నా ఆస్తిని కబ్జా చేశారు. నన్ను కిడ్నాప్ చేశారు. ఆ ఆస్తి రాసిస్తాననడంతో వదిలేశారు. కానీ తర్వాత నేను నా ఆస్తి ఇచ్చేది లేదని స్పష్టం చేయడంతో నన్ను హత్యచేసేందుకు కుట్ర పన్నినట్లు తెలిసింది. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ అండతోనే ఆయన అనుచరులు ఇలా చేస్తున్నారు. వారి నుంచి రక్షణ కల్పించాలి..’ అని పేర్కొన్నారు. జిల్లా కేంద్రం పుట్టపర్తిలోని జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘స్పందన’లో ఆయన ఎస్పీకి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు.. అనంతపురం రూరల్ మండలం కక్కలపల్లి రెవెన్యూ లో 141–2 సర్వే నంబరులో 9.81 ఎకరాల భూమి ఉంది. ఆ భూమి 1930 సంవత్సరం ముందు నుంచి వెంకటరాముడు పూర్వీకుల పేరిట ఉంది. తర్వాత మూడు భాగాలుగా పంచుకున్నారు. అందులో మూడోవంతు.. అంటే 3.27 ఎకరాలు చెరుకూరి వెంకటరాముడుకు దక్కింది. అందులో 1.63 ఎకరాలను ఆయన ఇతరులకు విక్రయించారు. మిగిలిన 1.64 ఎకరాల భూమిని తమకు రాసివ్వాలంటూ పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పటి నుంచి వేధిస్తున్నారు. అంతేకాకుండా మొత్తం 9.81 ఎకరాల భూమి ఇంకా సబ్ డివిజన్లు కాకపోవడంతో మొత్తం భూమిపై పరిటాల కుటుంబం కన్నేసింది.. అని వెంకటరాముడు పేర్కొన్నారు. గత నెల 17న కిడ్నాప్ భూమి విషయమై గత నెల 17వ తేదీన ధర్మవరంలో ఉన్న వెంకటరాముడును కిడ్నాప్ చేశారు. పరిటాల అనుచరులు దాదా ఖలందర్, చింతలపల్లి మహేశ్‌నాయుడు, ఎల్.నారాయణచౌదరి, లిక్కర్ సుధాకర్‌నాయుడు ప్రోద్బలంతో కుంటిమద్ది అక్కులప్ప తన గ్యాంగ్‌తో వచ్చి కిడ్నాప్ చేసినట్లు అప్పట్లోనే వెంకట రాముడు అనంతపురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. గుర్తుతెలియని చోటుకు తీసుకెళ్లి తనను తీవ్రంగా కొట్టారని, వారు కోరుకున్నట్లుగా భూమి రాసిస్తానని చెప్పిన తర్వాత అదేరోజు సాయంత్రం ప్రాణాలతో వదిలారని ఆ ఫిర్యాదులో తెలిపారు. చదవండి: టీడీపీ ‘సామాజిక’ చిచ్చు -
నిజాలు సమాధి చేయబోయి.. చివరికి తేలుకుట్టిన దొంగల్లా టీడీపీ..
సాక్షి, ధర్మవరం: హిందూముస్లింల ఐక్యతకు, శాంతి, సామరస్యానికి ప్రతీకగా నిలిచిన ధర్మవరంలో టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ అలజడులు సృష్టించాలని పన్నాగం పన్నారు. తన స్వార్థం కోసం కబరస్తాన్‌ను పావుగా వాడుకున్నారు. పట్టణంలోని మసీదు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో జరిగే అంతర్గత వ్యవహారాలను రాజకీయం చేసి ఎమ్మెల్యే కేతిరెడ్డిపై బురద జల్లాలని ప్రయత్నించారు. అసలేం జరిగిందంటే.. ధర్మవరం ఇందిరానగర్‌లో ముస్లింల కబరస్తాన్ ఉంది. దానికి ఆనుకునే ఎగువ భాగంలో పెద్ద డ్రైనేజీ ఉంది. దీంతో మురుగునీరు తరచూ కబరస్తాన్లోకి వచ్చి చేరుతుండగా, సమాధులన్నీ మునిగిపోతున్నాయి. దీనికి తోడు స్థలం తక్కువగా ఉండటంతో కబరస్తాన్ పూర్తిగా సమాధులతో నిండిపోయింది. దీంతో ముస్లింలు ఎవరైన చనిపోతే ...వారి అంత్యక్రియలను పట్టణానికి 6 కి.మీ దూరంలోని ఈద్గా మైదానంలో నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. శాశ్వత పరిష్కారం కోసం చర్యలు.. కబరస్తాన్‌లో మురుగునీరు చేరకుండా చూడటంతో పాటు వసతులు కల్పించేందుకు గత అక్టోబర్‌లో.. జామియా మసీదు కమిటీ ఆధ్వర్యంలో ముస్లింలు సమావేశం నిర్వహించారు. కబరస్తాన్‌ను పునర్ నిర్మించాలని 40 మసీదులకు చెందిన ముతవల్లీలు ఆమోదించి తీర్మానం చేశారు. అందులో భాగంగా కబరస్తాన్లోని సమాధులను తొలగించి మైదానం మొత్తం 4 అడుగులకుపైగా మట్టితో ఎత్తు చేయాలని తీర్మానంలో పేర్కొన్నారు. అభ్యంతరాలకు రెండు నెలల సమయం తీసుకున్నారు. అందుకు గడువు కూడా ముగియడం, ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో 3 రోజుల క్రితమే మసీదు కమిటీలు, అంజుమన్ కమిటీల ఆధ్వర్యంలో మత పెద్దలు, దాతల సహకారంతో పనులను ప్రారంభించారు. పరిటాల శ్రీరామ్ రంగ ప్రవేశంతో రాజకీయ రంగు కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు ప్రశాంతంగా సాగిపోతుండగా... గురువారం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ వాటి గురించి తెలుసుకున్నారు. స్థానికంగా నివాసం లేని ఆయన...నిజానిజాలు తెలుసుకోకుండా కబరస్తాన్‌లో సమాధులను ఏక పక్షంగా తొలగిస్తున్నారని, ఎమ్మెల్యే కేతిరెడ్డిని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేశారు. దీనిపై ముస్లిం మత పెద్దలంతా స్పందించారు. కబరస్తాన్ పునర్ నిర్మాణ పనులన్నీ తమ ఆధ్వర్యంలో సాగుతున్నాయని, దానికి రాజకీయ రంగు పులమడం అన్యాయమన్నారు. దీన్ని రాజకీయం చేయవద్దని రాజకీయ పారీ్టల నాయకులకు విజ్ఞప్తి చేస్తున్నారు. అందరి ఆమోదంతోనే పనులు.. ర్మవరంలోని అన్ని మసీదు కమిటీలతో చర్చించి 40 మంది ముతవల్లీల ఆమోదంతోనే కబరస్తాన్ పునరి్నర్మాణ పనులు చేస్తున్నాం. ఇందులో ఎలాంటి వివాదం లేదు. రాజకీయ పారీ్టల నాయకులు ఇందులో జోక్యం చేసుకోకూడదు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే మేము చర్చించుకుని సమస్యను పరిష్కరించుకుంటాం. – ముస్తాక్ అహ్మద్, ముతవల్లి, జామియా మసీదు, ధర్మవరం. రాజకీయం చేయొద్దు ఇస్లాం సంప్రదాయంలో కబరస్తాన్ల పునర్నిర్మాణం కొత్తేమీ కాదు. గతంలో అనంతపురంలోని ఈద్గాలో, బత్తలపల్లి కబరస్తాన్, హిందూపురంలోనూ పునర్నిర్మాణ పనులు చేపట్టారు. ధర్మవరంలోనూ అందరి ఆమోదంతోనే ముస్లింలతా కలసికట్టుగా దాతల సహకారంతో కబరస్తాన్‌ను పునర్నిర్మిస్తున్నాం. వీటిని రాజకీయం చేయవద్దు. – జాకీర్, ముతవల్లి, మదీనా మసీదు, ధర్మవరం ఐక్యతను దెబ్బతీయొద్దు కబరస్తాన్ పునర్ నిర్మాణం పవిత్ర కార్యం. ఇందులో ఏ రాజకీయ పార్టీ జోక్యం చేసుకోకూడదు. అంజుమన్ కమిటీ, మతపెద్దలు, మసీదు కమిటీల ఆధ్వర్యంలోనే పనులు జరుగుతున్నాయి. ప్రతి ముస్లిం ఈ పనుల్లో భాగస్వామిగా ఉంటాడు. ముస్లింల ఐక్యతను దెబ్బతీసే విధంగా ఏ ఒక్కరూ వ్యవహరించవద్దు. – స్టార్ ఖలీల్, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు, ధర్మవరం గీత దాటితే చర్యలు కబరస్తాన్ పునర్ నిర్మాణం సున్నితమైన అంశం. ఏ ఒక్కరూ రెచ్చగొట్టే ప్రకటనలు చేయకూడదు. ఈ విషయంపై ఇప్పటికే ముస్లిం మత పెద్దలందరితో చర్చించాం. కబరస్తాన్ పునరి్నర్మాణంలో ఎవరికైనా సందేహాలుంటే మత పెద్దల ద్వారా నివృత్తి చేసుకోవాలి. చట్టపరిధి దాటి సోషల్ మీడియా ద్వారా అసత్యాలు ప్రచారం చేసినా, భావోద్వేగాలు రెచ్చగొడితే చర్యలు తప్పవు. – సుబ్రమణ్యం, వన్‌టౌన్ సీఐ, ధర్మవరం -
ఇష్టానుసారం ఆరోపణలు చేస్తే సహించేది లేదు: కేతిరెడ్డి
-
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
పరిటాల సునీత మహానటి.. సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు
సాక్షి, అనంతపురం: ‘మా ఓర్పు, సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు. మేము తింటున్నదీ ఉప్పూ కారమే. మీకు నిజంగా ధైర్యం ఉంటే మా ఇంటి వద్దకు వచ్చి వెళ్లండి. అప్పుడు మీకు అర్థమవుతుంద’ని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. గత ప్రభుత్వంలో ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓర్పుగా ఉన్నామే గానీ ఏనాడూ సహనం కోల్పోలేదన్నారు. ఇప్పుడు కిరాయి హంతకులతో తమ అమ్మను తిట్టించినా ఓర్పుగానే ఉన్నామన్నారు. అలాగని తమ సహనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దని హెచ్చరించారు. పరిటాల శ్రీరామ్ తమపై అసత్య ఆరోపణలు చేయడంతో పాటు గడప గడపకు కార్యక్రమానికి వెళ్లినప్పుడు ఎవరైనా దాడి చేస్తే తమకు సంబంధం లేదంటూ బెదిరింపు ధోరణితో మాట్లాడుతున్నారన్నారు. అయినప్పటికీ తాము సహనం కోల్పోలేదన్నారు. భాష తప్పే.. భావం కరెక్ట్ చంద్రబాబు విషయంలో తమ అన్న తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి వాడిన భాష తప్పే కానీ.. ఆయన భావం కరెక్ట్ అని ప్రకా‹Ùరెడ్డి స్పష్టం చేశారు. తమ్ముడికి జరగరానిది ఏదైనా జరుగుతుందనే బాధతోనే అలా మాట్లాడారని పేర్కొన్నారు. తమ రాజకీయ చరిత్రలో ఏనాడూ దిగజారుడు వ్యాఖ్యలు చేయలేదన్నారు. ఎంతో ఓర్పు, సహనంతో ప్రజల వద్దకు వెళ్తున్నామే తప్ప నీచ రాజకీయాలకు పాల్పడలేదన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో తమపై కక్ష సాధింపుతో ఎన్నో ఇబ్బందులకు గురిచేశారన్నారు. ఆస్తులు నష్టపోయామని, చివరికి తమపై అక్రమ కేసులు బనాయించినా ఓర్పు, సహనంతో ఉన్నామని గుర్తు చేశారు. ఆనాడు హత్యాకాండకు పాల్పడ్డారు.. పరిటాల రవీంద్ర మంత్రిగా ఉన్నప్పుడు ఉమ్మడి జిల్లాలో ఎన్నో హత్యలు చేయించారన్నారు. అలాగే పరిటాల సునీత మంత్రిగా ఉన్నప్పుడు కూడా హత్యా రాజకీయాలకు పాల్పడ్డారన్నారు. పరిటాల సునీత మహానటి అని ఎద్దేవా చేశారు. ఆమె నటన వెనుక చంద్రబాబు పాత్ర ఉందని అనుమానం వ్యక్తం చేశారు. త్వరలోనే రాప్తాడు నియోజకవర్గంలో పది చోట్ల బహిరంగ సభలు నిర్వహిస్తామన్నారు. ఆ సభల్లో టీడీపీ చేసిన హత్యాకాండ, అరాచకాలు, ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తామన్నారు. జాకీ పరిశ్రమ విషయంలో దు్రష్పచారాన్ని మానుకోవాలని టీడీపీ నేతలకు హితవు చెప్పారు. ఆ పరిశ్రమ టీడీపీ హయాంలో ఒక్క ఇటుక కూడా వేయలేదన్నారు. లేని జాకీపైన పదేపదే మాట్లాడుతున్నారని, దీన్ని ప్రజలు గమనిస్తున్నారని పేర్కొన్నారు. సమావేశంలో ఏడీసీసీ బ్యాంకు మాజీ చైర్మన్ పామిడి వీరాంజనేయులు, జెడ్పీటీసీ సభ్యుడు జూటూరు చంద్రకుమార్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ నాగేశ్వరరెడ్డి పాల్గొన్నారు. -
పొలిటికల్ కారిడార్: రౌడీ షీటర్ విడుదల కోసం రోడ్డెక్కిన పరిటాల సునీత
-
25 ఏళ్లుగా పరిటాల కుటుంబం అనంతపురం జిల్లాకు చేసిందేమి లేదు : తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
-
పరిటాల శ్రీరామ్.. మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?
సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు. చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’) -
Thopudurthi Prakash Reddy: శ్రీరామ్.. నోరు జాగ్రత్త
సాక్షి, అనంతపురం: ‘నిష్పక్షపాతంగా వ్యవహరిస్తున్న పోలీసులపై నోరుపారేసుకోవద్దు. ఎన్నో ఏళ్లు నేరాలు చేస్తూ చట్టానికి చిక్కకుండా తిరిగిన ఎందరినో పోలీసులు కటకటాలపాలు చేశారు. జాగ్రత్తగా మసలుకో.. లేకుంటే నీకూ అదే గతి పడుతుంది’ అంటూ టీడీపీ నేత పరిటాల శ్రీరామ్‌కు రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఘాటుగా హెచ్చరించారు. రామగిరి పోలీసులపై శ్రీరామ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండించారు. శుక్రవారం ఆయన అనంతపురంలోని ఆర్అండ్బీ అతిథిగృహంలో మీడియాతో మాట్లాడారు. మూడు దశాబ్దాలుగా దౌర్జన్యం, రౌడీయిజంతో ప్రజలను భయపెట్టి నిర్మించుకున్న చరిత్ర కాలగర్భంలో కలిసిపోయిందన్నారు. చంద్రబాబునాయుడు, నారా లోకేష్, పార్టీ లేదు బొక్కా లేదు అని అచ్చెన్నాయుడు చెప్పినట్టు టీడీపీ చరిత్ర కూడా మసకబారిపోయిందన్నారు. అధికారంలోకి వచ్చేస్తాం.. ఏమైనా చేసేస్తాం అనే కలలు కనడం మాని.. వాస్తవంలోకి రావాలన్నారు. రామగిరి పోలీసులపై ‘కొడకల్లారా’ అంటూ అనుచితంగా మాట్లాడిన శ్రీరామ్‌ను పోలీసులు కూడా తిరిగి మాట్లాడితే.. అంతటి అవమానకరం మరొకటి ఉండదని, ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని సూచించారు. పరిటాల కుటుంబ నియంతృత్వ, పెత్తందారీ పోకడలు చరిత్రలో కలిసిపోయాయని, ప్రస్తుతం రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లిలో పోలీసులు నీతి, నిజాయితీతో పని చేస్తున్నారని ప్రశంసించారు. ఇప్పుడిప్పుడే ఈ ప్రాంత ప్రజల బానిస సంకెళ్లు తెగిపోయాయన్నారు. మీ వద్ద ఉన్న రౌడీషీటర్లు, హంతకులు, దౌర్జన్యపరుల ఆటలు ఇకపై సాగబోవన్నారు. పరిటాల సునీత తమ్ముడిపై కూడా రౌడీషీట్ ఓపెన్ చేసి పలక పట్టించిన పోలీసులు ఉన్నారన్నారు. జాగ్రత్తగా మసలుకోకుంటే నీకూ అదే గతి పడుతుందని హెచ్చరించారు. ‘పోలీసులను ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్న నీవు గన్మెన్లు లేకుండా తిరుగు.. అప్పుడు తెలుస్తుంది దమ్ము, ధైర్యం ఎంత ఉందో’ అని అన్నారు. ‘మా ప్రభుత్వం వచ్చిన తరువాత మీకు గన్మెన్లను పెంచాం, మేము రక్షించుకునే ప్రాణాలు కనుక మిమ్మలను స్వేచ్ఛగా తిరగనిస్తున్నాం. అది తెలుసుకొని మసులుకో శ్రీరామ్. మీరు చరిత్ర డప్పు కొట్టుకోవడం కాదు... మిమ్మల్ని ఎవ్వరూ లెక్క చేయరు తెలుసుకో’ అని అన్నారు. మీరేం చేశారు.. మేమేం చేశామో తెలుసుకుంటాం వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి చెప్పారు. ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో తాము బిజీగా ఉన్నామని.. త్వరలోనే మీ ఊరికి కూడా వస్తామని.. అక్కడ మీరు ఏమి చేశారు.. మా ప్రభుత్వం ఏమి చేసింది.. ఏమి చేస్తోందో ప్రజల ద్వారానే తెలుసుకుంటామన్నారు. 2019 ఎన్నికల్లో 26వేల ఓట్ల తేడాతో ప్రజలు మిమ్మల్ని ఓడించినా ఆత్మావలోకనం చేసుకోలేకపోతున్నారని శ్రీరామ్‌ను ఎద్దేవా చేశారు. పంచాయతీ ఎన్నికల్లో కూడా టీడీపీ మద్దతుదారులు చతికిలపడ్డారని గుర్తు చేశారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో విషయంలో ఎస్పీ ప్రెస్‌మీట్ పెట్టి స్పష్టత ఇచ్చినా దిగజారుడు విమర్శలు చేయడం తగదన్నారు. రాబోవు రోజుల్లో టమాట రైతులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పరిశ్రమలకు వేలాది ఎకరాలు కేటాయించి అభివృద్ధికి దోహదపడతామన్నారు. విలేకరుల సమావేశంలో అనంతపురం జెడ్పీటీసీ సభ్యుడు చంద్రకుమార్, రాప్తాడు మార్కెట్ యార్డు చైర్మన్ గోపాల్‌రెడ్డి పాల్గొన్నారు. -
సత్యసాయి: టీడీపీ నేత పరిటాల సునీత దురుసు ప్రవర్తన
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె కుమారుడు పరిటాల శ్రీరామ్ సోమవారం పోలీసులపైనే దౌర్జన్యానికి దిగారు. వీరిద్దరూ అనుచరులతో కలిసి భారీ సంఖ్యలో వాహనాల్లో పుట్టపర్తిలోని శ్రీసత్యసాయి జిల్లా కలెక్టరేట్ ఎదుట ధర్నాకు బయల్దేరారు. రామగిరి పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న చెక్‌పోస్టు వద్ద వీరి వాహనాలను ఎస్ఐ జనార్దన్ నాయుడు ఆపారు. సీఎం పర్యటన ఉన్నందున భద్రత కారణాల దృష్ట్యా ఇన్ని వాహనాలను అనుమతించలేమని, కొన్నింటిని మాత్రమే పంపుతామని చెప్పారు. దీంతో పరిటాల సునీత శివాలెత్తారు. ‘గేటు ఎత్తరా.. ఏం చేస్తాడో చూద్దాం’ అంటూ అనుచరులు, రౌడీషీటర్లను ఉసిగొల్పారు. ఇది మంచి పద్ధతి కాదని, పరిస్థితులను అర్థం చేసుకుని పోలీసులకు సహకరించాలని ఎస్ఐ కోరినా పట్టించుకోలేదు. ఎస్ఐతో సునీత, శ్రీరామ్ దురుసుగా ప్రవర్తించారు. ‘మీరు పంపకపోతే మేం దౌర్జన్యం చేస్తాం’ అంటూ బెదిరించారు. ఎస్ఐ అనే గౌరవం లేకుండా ‘ఏందయ్యా.. నువ్వు..’ అంటూ ఏకవచనంతో మాట్లాడారు. చివరకు చెక్‌పోస్టు గుండా నాలుగు వాహనాలు వెళ్లేందుకు ఎస్ఐ అనుమతించారు. కానీ పరిటాల అనుచరులు పోలీసుల ఆదేశాలను సైతం లెక్కచేయలేదు. దౌర్జన్యంగా చెక్‌పోస్టు గేటు పైకెత్తారు. వేరే మార్గాల గుండా వాహనాల్లో తరలివెళ్లారు. చదవండి: (అయ్యో జనార్దనా: ముందు చూస్తే నుయ్యి.. వెనుక చూస్తే గొయ్యి) -
వరదాపురం X పరిటాల.. ఢీ అంటే ఢీ! కొనసాగుతున్న మాటల యుద్ధం
ధర్మవరం టౌన్ (సత్యసాయి జిల్లా): నియోజకవర్గంలో టీడీపీ ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్, బీజేపీ నాయకుడు వరదాపురం సూరి మధ్య కోల్డ్‌వార్ జరుగుతోంది. వారి అనుచరులు తీవ్రమైన విమర్శలు చేసుకుంటూ వారి హయాంలో చేసిన ‘ఘన కార్యాలను’ దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ధర్మవరంలో 300 మంది అమాయకులను అంతం చేసిన చరిత్ర పరిటాల కుటుంబానిదని సూరి వర్గం ఆరోపిస్తుండగా... ఎన్నికల్లో ఓడిపోయిన నెలరోజలకే పార్టీ మారి కార్యకర్తలను నట్టేట ముంచిన చరిత్ర వరదాపురం సూరిదని పరిటాల వర్గం విమర్శలు గుప్పిస్తోంది. తాజాగా ఈ ఇద్దరి నాయకులు తమ అనుచరులతో చేనేత వ్యాపారులు, సామాన్య ప్రజలను బెదిరింపులకు గురిచేయడం విమర్శలకు తావిస్తోంది. ఓటమితో పార్టీ మారిన సూరి.. 2019 ఎన్నికల్లో ధర్మవరం నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించడంతో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన గోనుగుంట్ల సూర్యనారాయణ వెంటనే బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అప్పటి పరిస్థితుల్లో టీడీపీ అధిష్టానం ధర్మవరం నియోజకవర్గ ఇన్చార్జ్గా పరిటాల శ్రీరామ్‌ను ప్రకటించింది. అప్పటి నుంచి పార్టీ కార్యకలాపాలు అతనే నడిస్తున్నాడు. దీంతో ధర్మవరం టీడీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయారు. నేసేపేట కేంద్రంగా బెదిరింపుల పర్వం.. ధర్మవరంలోని నేసేపేటలో తటస్తులైన వ్యాపారులు ఎందరో ఉన్నారు. వారిపై ఇటు సూరి వర్గం, అటు పరిటాల శ్రీరామ్ వర్గం బెదిరింపులకు దిగుతున్నాయి. తమ నాయకుడు త్వరలోనే టీడీపీలో చేరి వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తాడని, వచ్చి కలవాలని చేనేత వ్యాపారులను సూరివర్గం ఒత్తిడి తెస్తోంది. మరోవైపు పరిటాల శ్రీరామ్ అనుచరులు కూడా వచ్చే ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా శ్రీరామ్‌ను ప్రకటిస్తారని, తమ నాయకున్ని వచ్చి కలవాలని చెబుతున్నారు. దీంతో ఏ పార్టీకి సంబంధం లేని వ్యాపారులు ఎవరిదగ్గరకు వెళితే ఏం అడుగుతారో..ఏం జరుగుతుందోనని భయబ్రాంతులకు గురవుతున్నారు. టీడీపీ హయాంలో భారీ దందా.. టీడీపీ ప్రభుత్వ హయాంలో మాజీ ఎమ్మెల్యే పరిటాల రవీంద్ర అనుచరులు పరిటాల పేరు చెప్పి నేసేపేటలో ఎందరో వ్యాపారులను బెదిరించి డబ్బు వసూలు చేసిన సందర్భాలున్నాయి. ఇటు వరదాపురం సూరి ఎమ్మెల్యేగా పని చేసిన సమయంలోనూ చేనేత వ్యాపారులను బెదిరించి సెటిల్మెంట్లు చేసి భూములు లాక్కున్నారన్న ఆరోపణలున్నాయి. తాజాగా ఇద్దరు నేతలూ తమను కలవాలని అనుచరులతో ఒత్తిడి చేయిస్తుండటంతో నేసేపేటలోని వ్యాపారులు, సామాన్యులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పరిటాల కుటుంబంపై తీవ్రమైన ఆరోపణలు.. ధర్మవరంలో టీడీపీ నేతలను తమ వైపు తిప్పుకునేందుకు వరదాపురం సూరి అనుచరులు పరిటాల కుటుంబం చేసిన ఆగడాలను ఒక్కొక్కటిగా వివరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసిన సూరి అనుచరుడు పెద్దిరెడ్డి అరవిందరెడ్డి పరిటాల కుటుంబంపై తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. పరిటాల రవీంద్ర హయాంలో ధర్మవరంలో నరమేధం సృష్టించారని, దాదాపు 300 మందిని హత్య చేశారని ఆరోపించారు. ఇప్పటికీ ఆ 300 మంది ఆచూకీ తెలియదన్నారు. కుటుంబ పాలనతో రాప్తాడులో టీడీపీని భూస్థాపితం చేసి ధర్మవరం వచ్చారని, అటువంటి వారికి టీడీపీ టిక్కెట్ కచ్చితంగా రాదన్నారు. సూరిపై ఎదురు దాడి.. పరిటాల అనుచరులు ఇటీవల మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎదురుదాడి చేశారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలను గాలికి వదిలేసి స్వార్ధం కోసం బీజేపీలోకి చేరిన వరదాపురం సూరికి విలువల్లేవని ఆరోపించారు. రోజూ టీడీపీలోకి వస్తామని చెబుతూ టీడీపీ కార్యకర్తలను, పట్టణ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారన్నారు. టీడీపీలోకి రావాలంటే పరిటాల శ్రీరామ్ కండువా కప్పాలన్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు. నీచ రాజకీయాలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్న సూరి మాటలు నమ్మవద్దన్నారు. ఆ చీకటి రోజులు రావొద్దని కోరుకుంటున్న జనం.. టీడీపీ ప్రభుత్వ పాలనను తలచుకుని జనం భయాందోళనలు చెందుతున్నారు. పట్టణానికి చెందిన నిమ్మల కుంట వెంకటేశ్ అనే వ్యక్తికి సంబంధించిన భూములను లాక్కునేందుకు పరిటాల అనుచరులు ఏకంగా అతన్ని కిడ్నాప్ చేయడం అప్పట్లో పెను సంచలనంగా మారింది. విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గుడ్‌విల్ ఇవ్వలేదన్న కారణంతో గుట్టకిందపల్లి వద్ద జరుగుతున్న పనులను అప్పటి ఎమ్మెల్యే వరదాపురం సూరి నిలిపి వేయడయంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు, సూరి అనుచరులు రాళ్ల దాడిచేసుకున్న విషయాన్ని గుర్తుచేసుకుంటున్నారు. ఇక తన మాట వినడం లేదన్న కారణంతో వరదాపురం సూరి అనుచరుడు ఏకంగా పోలీస్‌స్టేషన్ ఆవరణలోనే కానిస్టేబుల్‌ను చెంపదెబ్బకొట్టడాన్ని తలచుకుని ఆ చీకటి రోజులు మళ్లీ రాకూడదని కోరుకుంటున్నారు. ఏది ఏమైనా∙వీరిద్దరి మాటల యుద్ధం, బెదిరింపుల పర్వం కారణంగా ప్రశాంతంగా ఉండే ధర్మవరంలో అశాంతి రాజుకుంటోంది. -
పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు మరికొందరిపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. అయితే రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మల్లికార్జున తదితరులతో కలిసి సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రచార వాహనంపై నుంచి సునీత, శ్రీరామ్, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు కొండప్ప, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రసంగాలు చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. చదవండి: (హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్) -
బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది:తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి
-
బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది: తోపుదుర్తి
సాక్షి, అనంతపురం: ‘‘పరిటాల శ్రీరామ్.. జూనియర్ ఆర్టిస్ట్ బాబూ... బీడీకట్ట.. హవాయి చెప్పులతో మీనాన్న బతుకు ప్రారంభమైంది. మా నాన్న పుట్టుకతోనే శ్రీమంతుడు. మా పూర్వీకులకు 200 ఎకరాలు భూమి ఉండేది. మీలా మేము అవినీతి చేసి దోచుకోలేదు. ప్రజాసేవలో మా డబ్బే ఖర్చు చేశాం’’ అని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన స్థానిక ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల శ్రీరామ్ అనే జూనియర్ ఆర్టిస్టుకు రాజకీయాల్లో ఉండే అర్హత లేదన్నారు. ఒకసారి రాప్తాడు అని, మరో సారి ధర్మవరం నుంచి పోటీ చేస్తానని చెప్పడం చూస్తే రానున్న ఎన్నికల్లో టికెట్ ఎక్కడ ఇస్తారో...ఆ పార్టీలో అతని స్థానం ఏమిటో తెలుస్తోందన్నారు. ‘‘బాబూ జూనియర్ ఆర్టిస్టు... నీ రాజకీయ ఎత్తుగడలు రాప్తాడులో నావద్ద చూపు... అంతేగానీ ధర్మవరం కేతిరెడ్డి వద్ద చూపావనుకో...ఆయన నా అంత మంచోడు కాదు. ముందు మీ పార్టీలో మీకు టిక్కెట్ ఇస్తారో లేదో మీ అధినాయకుడు వద్దకు వెళ్లి తెల్చుకో... అప్పుడు రాజకీయాలు చేయి’’ అని హితవు పలికారు. మీరు, మీ కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన ఆస్తులకు ప్రజా పోరాటం అని చెప్పడం తగదన్నారు. భూస్వాములపై వ్యతిరేకంగా పరిటాల కుటుంబం పోరాడి ఉంటే...వారికి అన్ని ఆస్తులు ఎక్కడ నుంచి వచ్చాయో లెక్క చెప్పాలని నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టి, మాయ మాటలు చెప్పడం ఇకనైనా మానుకోవాలని హితవు పలికారు. చదవండి: (పరిటాల సునీతకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్) తామేదో చేశామని పరిటాల శ్రీరామ్ చెబుతున్న ప్రాంతం రాప్తాడు నియోజకవర్గంలోకే రాదన్నారు. అక్కడ తమకు ఎలాంటి భూమి లేదన్నారు. తాము పరిటాల కుటుంబీకులు అక్రమంగా సంపాదించిన భూమి, ఆస్తుల వివరాలు అడిగితే.. వాటిపై మాట్లాడకుండా అసత్యాలు, కల్ల్లబొల్లి మాటలు చెప్పడం తగదన్నారు. పరిటాల కుటుంబం చేసిన అవినీతి అక్రమాలపై వారం వారం ఆధారాలతో మీడియా ముందు ఉంచుతామన్నారు. తమ చివరి రక్తం బొట్టు ఉన్నంత వరకు వైఎస్సార్సీపీలోనే ఉంటామనీ, పార్టీ అభివృద్ధికే శ్రమిస్తామన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి సేవ చేస్తామని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి స్పష్టం చేశారు. -
అనంతపురం టీడీపీలో భగ్గుమంటున్న వర్గ విభేదాలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: జిల్లా ఒకప్పుడు టీడీపీకి కంచుకోట. కానీ నేడు వర్గవిభేదాలు, అసమ్మతులు, అసంతృప్తులకు పెట్టనికోట. నియోజకవర్గ స్థాయి నాయకులు పరోక్షంగానూ, ప్రత్యక్షంగానూ సవాళ్లు విసురుకుంటుంటే.. ఉన్న కొద్దిమంది కార్యకర్తలూ ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన నాయకులు సైతం అండగా లేకపోవడంపై కార్యకర్తలు మండిపడుతున్నారు. మొన్నటికి మొన్న మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డికి వ్యతిరేకంగా ద్వితీయ శ్రేణి నాయకులంతా సమావేశమయ్యారు. ఇది సామాజిక మాధ్యమాల్లోనూ వైరల్ అయింది. దీంతో పల్లె వారిని బుజ్జగించాల్సి వచ్చింది. ఇప్పుడు పరిటాల శ్రీరాం వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ధర్మవరంలో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన వరదాపురం సూరి కొన్ని పరిస్థితుల దృష్ట్యా మరో పార్టీలోకి వెళ్లారు. దీంతో పరిటాల శ్రీరాంను ధర్మవరం టీడీపీ ఇన్చార్జ్గా నియమించారు. అయితే.. వరదాపురం సూరి తిరిగి పార్టీలోకి వస్తున్నారనే సంకేతాలు రావడంతో శ్రీరాం ఫైరయ్యారు. ‘పార్టీలోకి ఎవరొచ్చినా కండువా నేనే వేయాలి. పదవులూ నేనే ఇవ్వాలి. అయినా చెంచాలకు సీట్లొస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. టీడీపీలోని పరిటాల వ్యతిరేకులు దీన్ని తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఇక హిందూపురంలో నెగ్గిన బాలకృష్ణ నియోజకవర్గ ప్రజలకు దూరమయ్యారు. ఆయన పేరు చెప్పి మరో వ్యక్తి పెత్తనం చెలాయిస్తుండటంతో కిందిస్థాయి నాయకులు జీర్ణించుకోలేక పోతున్నారు. చదవండి: (పారిశ్రామిక విప్లవం) కాలవకు సెగ.. రాయదుర్గం నియోజకవర్గంలో పోటీచేసి ఓడిపోయిన మాజీ మంత్రి కాలవ శ్రీనివాసులుకు సొంత పార్టీ శ్రేణుల నుంచే సెగ తగులుతోంది. మంత్రి ఉన్నప్పుడు చేసిందేమీ లేదంటూ కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తున్నారు. అనంతపురంలో నివాసముంటున్న ఆయన నియోజకవర్గానికి చుట్టపుచూపుగా వచ్చి వెళుతున్నారని వారు వాపోతున్నారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ప్రస్తుత ఇన్చార్జ్ ఉమామహేశ్వర నాయుడు, మాజీ ఎమ్మెల్యే హనుమంతరాయ చౌదరి వర్గీయుల మధ్య పోరు నడుస్తోంది. ఏవర్గంలో ఉండాలో తెలియక కార్యకర్తలు సతమతమవుతున్నారు. అనంతపురం అర్బన్‌లో టీడీపీ పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభాకర్ చౌదరిపై అసమ్మతులు రోజు రోజుకూ తీవ్రమవుతున్నాయి. పెనుకొండ నగర పంచాయతీలో భారీ ఓటమి తర్వాత బీకే పార్థసారథి పరిస్థితి దయనీయంగా మారింది. ఆయన్ను స్వయాన చంద్రబాబు పిలిపించుకుని గట్టిగా మందలించిన విషయం తెలిసిందే. శింగనమల, మడకశిర నియోజకవర్గాల్లోనూ పరిస్థితి ఏమాత్రమూ బాగోలేదని టీడీపీ నేతలే చెబుతున్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) గౌరవ సభలా? విందు భోజనాలా? గౌరవ సభల పేరిట టీడీపీ నిర్వహిస్తోన్న కార్యక్రమాలు అభాసుపాలవుతున్నాయి. శివారు ప్రాంతాలకు తీసుకెళ్లి మాంసాహారం వడ్డిస్తున్న తీరు విందు భోజనాలను తలపిస్తోంది. కొన్ని నియోజకవర్గాల్లో జనం రాకపోవడంతో డబ్బులిచ్చి మరీ తీసుకెళుతున్నారు. ఈ సభలు ఎందుకు పెడుతున్నారో వాటికి వచ్చే వారికి కూడా తెలియడం లేదంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. -
చంపుతానని బెదిరింపులు..పరిటాల శ్రీరామ్‌పై పోలీసులకు ఫిర్యాదు
చిలమత్తూరు: పరిటాల శ్రీరామ్ ఒక ఆకతాయి... ఫ్యాక్షన్ రాజకీయాలకు ఊతమిస్తూ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాడని రాప్తాడు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నేత తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి (చందు) విమర్శించారు. ఆదివారం సాయంత్రం తన కాలర్ పట్టుకుని చంపుతానంటూ శ్రీరామ్ బెదిరించడంపై రామగిరి మండల వైఎస్సార్సీపీ నేత నసనకోట ముత్యాలు సోమవారం చిలమత్తూరు పోలీస్‌స్టేషన్‌లో చందుతో కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో చందు మాట్లాడారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించుకునేందుకు ఆ పార్టీ నాయకులు బెదిరింపు ధోరణులకు పాల్పడుతుండడం సిగ్గుచేటన్నారు. కురుబ సామాజిక వర్గానికి చెందిన ముత్యాలు.. వైఎస్సార్సీపీ తరఫున తిరుగుతుండడం జీర్ణించుకోలేక గతంలో దాడులు చేయించిన నీచ సంస్కృతి శ్రీరామ్‌దని గుర్తు చేశారు. తన ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని పాపాలు చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుకు ఓటు అడిగే ధైర్యం లేక ఇలాంటి రౌడీ మూకల్ని రంగంలో దించి, ప్రజలను బెదిరించి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకొని రూ.100 కోట్ల ప్రజాధనం కొల్లగొట్టిన అల్లరి మూక శ్రీరామ్‌ను ప్రశాంతంగా జీవిస్తున్న చిలమత్తూరు మండల ప్రజలపైకి తోలి చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబం అరాచకాలు భరించలేక అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 26వేల ఓట్ల మెజారిటీతో వైఎస్సార్సీపీని గెలిపించుకున్నారన్నారు. అంతటితో ఆగకుండా స్థానిక సంస్థలు, ప్రాదేశిక ఎన్నికల్లోనూ పరిటాల కుటుంబాన్ని ఇంటికే పరిమితం చేసేలా ఓటర్లు తీర్పునిచ్చారన్నారు. సొంత మండలం రామగిరిలో 9 పంచాయతీలకు గాను కేవలం రెండింటిని మాత్రమే పరిటాల కుటుంబీకులు నిలబెట్టుకున్నారంటే వారిపై ఎంత ప్రజావ్యతిరేకత ఉందో అర్థం చేసుకోవచ్చన్నారు. చిలమత్తూరు మండల జెడ్పీటీసీ స్థానంలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ప్రజలను కోరారు. కార్యక్రమంలో చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తంరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ రమేష్, నాయకులు రామకృష్ణారెడ్డి, అమరనాథరెడ్డి, అశ్వత్థరెడ్డి, సోమశేఖర్, న్యాయవాది ఇందాద్ తదితరులు పాల్గొన్నారు. -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు, రాప్తాడు టీడీపీ నేత పరిటాల పరిటాల శ్రీరామ్‌పై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్ఐ నాగస్వామి తెలిపారు. రెండు రోజుల క్రితం ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వాఖ్యలు చేసిన పరిటాల శ్రీరామ్‌పై రామగిరి మండల వైఎస్ఆర్సీపీ నాయకులు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారన్నారు. ఆ మేరకు శ్రీరామ్‌పై 153ఎ సెక్షన్ కింద రెచ్చగొట్టేవిధంగా వాఖ్యలు చేయడం.. శాంతిభద్రతలకు విఘాతం కలిగించడంపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. చదవండి: ఆ నలుగురు ఔట్..! ‘గ్రామీణ వికాసం’లో ఏపీ టాప్ -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: రాప్తాడు టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్‌తో సహా తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముష్టికోవెల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రాముడుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇచ్చావంటూ పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట -
పరిటాల సునీతకు ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం(రామగిరి): పంచాయతీ ఎన్నికల వేళ మాజీ మంత్రి పరిటాల సునీతకు ఎదురుదెబ్బ తగిలింది. రామగిరి టీడీపీ మండల కన్వీనర్‌గా ఉన్న సుబ్బరాయుడు ఆదివారం తన పదవికి రాజీనామా చేసినట్లు తెలిపారు. సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన తనను ఏ మాత్రం పట్టించుకోలేదని, దీంతో కన్వీనర్‌గా తాను ఏమీ చేయలేకపోయానన్నారు. -
శ్రీరాం.. నీ బండారం బయటపెడతా!
సాక్షి, అనంతపురం : ‘‘టీడీపీ పాలనలో జిల్లాకు, ముఖ్యంగా రాప్తాడు నియోజకవర్గానికి జరిగిన ప్రయోజనమేమీ లేదు. మేము సాగునీరిచ్చామంటున్నావు.. ఏ నియోజకవర్గానికిచ్చావో చెప్పు. దోపిడీ తప్ప మీ కుటుంబం చేసిందేమీ లేదు. గతంలో మీకున్న ఆస్తులెన్ని.. ఇప్పుడున్న ఆస్తులెన్ని..? ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పగలవా? పరిటాల రవీంద్ర పేరు చెప్పి ఇష్టారాజ్యంగా భూములను లాక్కున్న ఘనత మీది. ప్రజాసేవే పరమావధిగా పనిచేసే మనస్తత్వం మాది. జిల్లాలో కియా ఫ్యాక్టరీ పరిసరాల్లో, రాజధాని అమరావతి ప్రాంతంలో బినామీల పేర్లతో మీరు భూములు కొనుగోలు చేయలేదా?’’ అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి పరిటాల శ్రీరాంను ప్రశ్నించారు. వీటన్నింటికీ సంబంధించిన పూర్తి వివరాలతో పరిటాల శ్రీరాం బండారం బయటపెడతానన్నారు. మంగళవారం ఆయన వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. పరిటాల కుటుంబం లాగా కక్షలతో దిగజారుడు రాజకీయాలను చేయాల్సిన అవసరం తమకు లేదన్నారు. చదవండి: విద్యార్ధినులపై వేధింపులు.. గురువుకు 49 ఏళ్ల జైలు శిక్ష జిల్లాలో చేసిన అభివృద్ధి ఏమిటో చూపించు టీడీపీ హయాంలో అభివృద్ధి జరిగిందని చెబుతున్న శ్రీరాం కుటుంబమే రాప్తాడు, పెనుకొండ ప్రాంతాల్లో ఏళ్ల తరబడి ఎమ్మెల్యేలుగా ఉన్నారని, నిజంగా వారు అభివృద్ధి చేసి ఉంటే.. ఒకసారి ప్రజలకూ చుపించగలరా? అని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి సవాల్ విసిరారు. తాము ఏదో సాధించామని చెబుతున్న శ్రీరాం పేరూరు డ్యాంకు నీరు ఎందుకు తీసుకురాలేకపోయారో వివరించాలన్నారు. రూ.800 కోట్ల కాంట్రాక్టు పనులు మంజూరైతే వాటిలో పరిటాల కుటుంబం వాటా రూ.300 కోట్లు ఉందని ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. టీడీపీ హయాంలో అభివృద్ధే జరిగి ఉంటే.. రాప్తాడు నియోజకవర్గాన్ని ఎందుకని ‘అహుడా’ పరిధిలోకి చేర్చలేదో చెప్పాలన్నారు. రాప్తాడులో జరుగుతున్న అభివృద్ధితో ఇక్కడ తమకు దిక్కు లేదని తెలిసిన పరిటాల శ్రీరాం.. ఇప్పుడు ధర్మవరానికి చేరుకుని ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నాడన్నారు. ప్రజా శ్రేయస్సుపై దృష్టి సారించాం తాము అధికారంలోకి వచ్చి 18 నెలలు పూర్తి కాగా.. ప్రతి క్షణం నియోజకవర్గ అభివృద్ధికి పనిచేశామన్నారు. పరిటాల కుటుంబీకులు మాత్రం మండలానికో ఇన్చార్జ్ని నియమించుకొని దోచుకుతిన్నారన్నారు. పేదల ఇండ్ల కోసం ఇష్టారాజ్యంగా వసూలు చేసిన ఘనత మీ మహేంద్రదనే విషయాన్ని శ్రీరాంకు ఎమ్మెల్యే ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. జాకీ పరిశ్రమతో కేవలం వెయ్యి కుటుంబాలకు లబ్ధి చేకూర్చాలని గత ప్రభుత్వం ప్రయత్నించిందన్నారు. కానీ తాము మాత్రం 15వేల కుటుంబాలకు ఉపాధి కల్పించాలని చూస్తున్నామన్నారు. పాల డెయిరీ ద్వారా మహిళలకు అండగా నిలవాలని వారి కుటుంబాల్లో వెలుగులు నింపాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామన్నారు. -
పరిటాల శ్రీరామ్‌కు కండీషనల్ బెయిల్
సాక్షి, అనంతపురం: మాజీమంత్రి పరిటాల సునీత తనయుడు, రాప్తాడు నియోజకవర్గ అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఓ కేసు విషయంలో శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. రామగిరి సీఐ జీటీ నాయుడు, ఎస్ఐ నాగస్వామి తెలిపిన వివరాల మేరకు.. 2018 ఫిబ్రవరి 7న రాప్తాడు వైఎస్సార్సీపీ నాయకుడు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి నసనకోట గ్రామంలో పర్యటించి, సూర్యంతో పాటు ముత్యాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారన్నారు. అనంతరం స్వగ్రామంలో ఉన్న సూర్యంను పరిటాల శ్రీరామ్ తన అనుచరులతో వైఎస్సార్సీపీకి మద్దతు తెలుపుతున్నాడనే కారణంతో కిడ్నాప్ చేసి నాలుగు రోజుల పాటు విచక్షణారహితంగా దాడి చేశారన్నారు. (‘ఏబీఎన్’పై వెంటనే చర్యలు తీసుకోండి) బాధితుడు సూర్యంతోనే తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి కిడ్నాప్ చేసి దాడిచేసినట్లు అప్పట్లో రామగిరిలో వారు కేసు నమోదు చేశారన్నారు. అనంతరం నసనకోట సూర్యం అనంతపురం వెళ్లి జిల్లా ఎస్పీకి పరిటాల శ్రీరామ్‌పై ఫిర్యాదు చేయగా.. అప్పట్లో పరిటాల శ్రీరామ్‌తో పాటు మరో 11 మందిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. కేసు అప్పటి నుంచి పెండింగ్‌లో ఉండగా, బాధితుడు పలుమార్లు జిల్లా ఎస్పీని ఆశ్రయించగా, పోలీసులు కేసును పునరి్వచారణ చేపట్టారు. ఈక్రమంలో టీడీపీ నాయకులు ముందస్తు బెయిల్ తీసుకొని శుక్రవారం రామగిరి పోలీస్‌స్టేషన్‌లో హాజరయ్యారు. ప్రతి మంగళ, శుక్రవారం నిందితులు పోలీస్‌స్టేషన్‌కువచ్చి సంతకాలు చేయాలని రామగిరి పోలీసులు నిబంధన విధించారు. -
మీ నాన్న బాటలో నడిస్తే ఊరుకోం
అనంతపురం సెంట్రల్: ‘‘మీ నాన్న పరిటాల రవి వందల మందిని చంపి హీరో అయ్యాడనుకుంటున్నావ్. దేశంలోనే క్రిమినల్ చరిత్రలో మొదటి స్థానం సంపాదించుకున్నాడు. మీ నాన్న చేసినట్లు నువ్వూ చేస్తానంటే ఊరుకునేది లేదు. ఆ కాలం ఎప్పుడో పోయింది. ఇప్పుడు మా మంచితనాన్ని చేతగాని తనంగా తీసుకోవద్దు’’ అని మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు శ్రీరామ్‌ను రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి హెచ్చరించారు. సోమవారం ఆయన అనంతపురంలోని తన స్వగృహంలో హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌తో కలిసి విలేకరులతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గ అభివృద్ధిని ఒక యజ్ఞంలా చేపడుతున్నామన్నారు. టీడీపీ హయాంలో కందుకూరు గోదాము మూసివేయడం వల్ల 500 కుటుంబాలు రోడ్డుపడ్డాయని, తాము అధికారంలోకి వచ్చిన 8 నెలల్లో గోదాము తెరిపించామన్నారు. పరిటాల కుటుంబం పాతిక సంవత్సరాలుగా నసనకోట ముత్యాలమ్మ దేవాలయానికి భక్తులు, దాతలు ఇచ్చిన సొమ్మును బొక్కుతూ దేవునికే శఠగోపం పెట్టిందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆలయాన్ని దేవాదాయశాఖ పరిధిలోకి తీసుకువచ్చామ్నారు. నియోజకవర్గంలో 60 వేల జనాభాకు తాగునీరు అందించేందుకు అనుమతులు తీసుకొచ్చామని, ఆ పనులను కూడా త్వరలోనే ప్రారంభిస్తున్నామన్నారు. నియోజకవర్గాన్ని ఆహుడా పరిధిలోకి తీసుకొచ్చి 20వేల ఇళ్లను మంజూరు చేయించామన్నారు. పేరూరు డ్యాం, గంగులకుంట, బోగినేపల్లి చెరువులకు నీటిని తీసుకొస్తుస్తున్నామన్నారు. నియోజకవర్గంలో పది వేల మంది మహిళలకు లబ్ధి కలిగించేందుకు ప్రత్యేకంగా డెయిరీని తీసుకొస్తున్నట్లు వివరించారు. రాప్తాడు నియోజకవర్గం అభివృద్ధి కోసం తాము పనిచేస్తుంటే.. గ్రామాల్లో ఫ్యాక్షన్ రెచ్చగొట్టే కార్యక్రమాలకు పరిటాల శ్రీరామ్ ప్రయత్నిస్తున్నాడన్నారు. దౌర్జన్య పద్ధతుల్లో ప్రజలను, అధికారులను బెదిరిస్తున్నాడన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేసి ఈడ్చుకెళ్లినట్లు స్వయంగా శ్రీరామ్ ప్రకటించాడన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో స్థానిక సంస్థలకు టీడీపీ తరఫున నిలబడేందుకు అభ్యర్థులు దొరకడం లేదని, వంద మందిని వెంట వేసుకొని అరాచకం సృష్టించాలని చూస్తున్నారన్నారు. ప్రస్తుతం రామగిరిలో జరిగిన ఘటనతో పాటు గతంలో జరిగిన దాడులు, హత్యలపై విచారణ చేసి బాధిత కుటుంబ సభ్యులు కోరిన విధంగా పరిటాల శ్రీరామ్, వారి కుటుంబ సభ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై ఎస్పీకి ఫిర్యాదు చేస్తున్నట్లు ప్రకటించారు. ప్రజాస్వామ్యవాదులారా ఏకంకండి ప్రజాస్వామ్య వాదులందరూ ఏకమై ఒక తాటిపైకి రావాల్సిన సమయం ఆసన్నమైందని హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ పిలుపునిచ్చారు. లోటు బడ్జెట్లోనూ సంక్షేమ కార్యక్రమాలతో రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ముందుకు తీసుకెళ్తున్నారని తెలిపారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రూ.5 వేల కోట్లు రావాల్సి ఉండడంతో యుద్ధ ప్రాతిపదికన ఎన్నికలు నిర్వహణకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. అయితే రాష్ట్రాభివృద్ధికి విఘాతం కలిగించేందుకు అతిపెద్ద కరోనా వైరస్ అయిన చంద్రబాబు కుట్రలు పన్నుతున్నాడని మండిపడ్డారు. కదిరి బ్రహ్మోత్సవాల్లో లక్షలాది ప్రజలు పాల్గొన్నా.. ఎవరికీ ఎలాంటి జబ్బు రాలేదన్నారు. అలాంటిది ఎన్నికలు నిర్వహించడం వల్ల కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుందని ఎన్నికల కమిషనర్ దుష్ప్రచారం చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. సమావేశంలో వైఎస్సార్సీపీ రూరల్ మండల కన్వీనర్ గోపాల్‌రెడ్డి, రాప్తాడు మార్కెట్‌యార్డు చైర్మన్ నాగేశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు రామగిరి: మాజీ మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై ఐపీసీ 153ఏ సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు రామగిరి ఎస్ఐ నాగస్వామి తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ఈనెల 15వ తేదీ (ఆదివారం) రామగిరి టీడీపీ కార్యాలయ ఆవరణలో కార్యకర్తలనుద్దేశించి పరిటాల శ్రీరావ్‌ు చేసిన ప్రసం మతం, వర్గం, పార్టీలను ప్రభావితం చేస్తుండటంతో కేసు నమోదు చేశామన్నారు. ఎన్నికల నిబంధనల ప్రకారం ప్రజలను, ఇతర పార్టీల వర్గీయులను రెచ్చగొట్టే విధంగా వ్యవహరిస్తే తగిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇదిలాఉండగా పరిటాల శ్రీరామ్ గతంలో రామగిరిలోని వైఎస్సార్ విగ్రహాన్ని కూల్చేశామని, తాము అధికారంలోకి వస్తే 15 నిమిషాల్లోనే ప్రస్తుతం ఉన్న విగ్రహాన్ని కూల్చేస్తామని బాహాటంగా చెప్పడం విమర్శలకు తావిస్తోంది. -
హింసా రాజకీయాలకు శ్రీరామ్ కుట్రలు
సాక్షి, అనంతపురం : టీడీపీ నాయుడు పరిటాల శ్రీరామ్‌పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి డిమాండ్ చేశారు. తండ్రి బాటలో హింసా రాజకీయ చేయాలని పరిటాల శ్రీరామ్ కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, హిందూపూర్ ఎంపీ గోరంట్ల మాధవ్ సోమవారం జిల్లా ఎస్పీ సత్య యేసుబాబుని కలిశారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తల తలలు నరుకుతామంటూ శ్రీరామ్ చేసిన వ్యాఖ్యాల వీడియో ఫుటేజీని ఎస్పీకి అందజేశారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ దౌర్జన్యాలను ఖండిస్తున్నామన్నారు. రామగిరిలో వైఎస్సార్ విగ్రహన్ని ధ్వంసం చేశారని శ్రీరామ్ స్వయంగా అంగీకరించరన్నారు. మా జోలికొస్తే తలలు నరుకుతామని శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను పోలీసులు సీరియస్‌గా తీసుకోవాలని కోరారు. ‘చంద్రబాబుకు కరోనా వైరస్ సోకిందా..!) ఏపీలోకరోనా వైరస్ లేదని, ఎల్లో వైరస్ ఉందని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఎద్దేవా చేశారు. చంద్రబాబు వైరస్ ప్రభావం రాష్ట్ర ఎన్నికల సంఘంపై చూపుతోందన్నారు. ఎన్నికల అధికారి రమేష్ చౌదరి కూతురుకి చంద్రబాబు ఆర్థిక మండలి డైరెక్టర్ పదవి ఇచ్చారని, రమేష్ చౌదరి చంద్రబాబు రుణం తీర్చుకుంటున్నారని గుర్తు చేశారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోందని, ముఖ్యమంత్రి వైస్ జగన్మోహన్రెడ్డి ఎన్నికల్లో డబ్బు, మద్యం పంపిణీ అరికట్టారని తెలిపారు. ఓటమి భయంతోనే స్థానిక ఎన్నికలపై చంద్రబాబు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. ఏపీకి రూ. 5000 కోట్లు రాకూడదనే బాబు కుయుక్తులు పన్నుతున్నారని, రాష్ట్ర ప్రయోజనాలు ఆయనకు పట్టావా అని ప్రశ్నించారు.(‘ఇలాంటి నిర్ణయం తీసుకుంటారని ఊహించలేదు’) పది చోట్ల వైఎస్సార్ విగ్రహాలు ధ్వంసం స్థానిక ఎన్నికలపై గవర్నర్ తక్షణమే జోక్యం చేసుకోవాలని ఎమ్మెల్యే కోరారు. వైఎస్సార్సీపీ నేతలు ప్రసాద్ రెడ్డి, శివారెడ్డి, కేశవరెడ్డి హత్య కేసుల్లో పరిటాల శ్రీరామ్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ మంచితనాన్ని చేతకాని తనంగా భావించొద్దని శ్రీరామ్‌ను హెచ్చరించారు. మాజీ మంత్రి పరిటాల రవీంద్ర వందలాది మంది ప్రాణాలను పొట్టన పెట్టుకున్నారని గుర్తు చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో 10 చోట్ల వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేశారన్నారు. మాజీ మంత్రి పరిటాల సునీత కుటుంబ సభ్యుల అరాచకాలపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.(ఫలించిన తోపుదుర్తి కృషి) బాబు రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలి చంద్రబాబు కుట్ర రాజకీయాల వల్లే స్థానిక సంస్థల ఎన్నికలు వాయిదా పడ్డాయని ఎంపీ గోరంట్ల మాధవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరోనా ఉందని పార్లమెంటు వాయిదా వేయలేదని, లక్షల మంది కలిసే జాతరలు వాయిదా వేయలేదని అన్నారు. అలాగే ‘కేంద్రం నుంచి రావాల్సిన రూ. 5000 కోట్లు అడ్డుకుంటున్న దుర్మార్గుడు చంద్రబాబు. గ్రామాలు, పట్టాణాలకు నిధులు రాకుండా అడ్డుకోవడం చంద్రబాబుకు తగదు. చంద్రబాబు నీచ రాజకీయాలు మానుకోవాలి. ఏపీ అభివృద్ధికి సహకరించాలి. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్నికల్లో వైఎస్సార్సీపీని ఎదుర్కోవాలి. స్థానిక ఎన్నికలు వెంటే జరపాలి’ అని టీడీపీపై విమర్శలు సంధించారు. -
పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు
రామగిరి: రాప్తాడు నియోజకవర్గంలో టీడీపీ నేతల అరాచకాలు ఆగడం లేదు. అధికారంలో ఉన్నా...లేకపోయినా.. తమ ఆధిపత్యం కొనసాగిస్తూ ప్రజలపైన, అధికారులపైన జులుం ప్రదర్శిస్తున్నారు. మండల కేంద్రం రామగిరిలో ఏర్పాటు చేసిన ద్వారానికి పరిటాల అనే పేరుండడంతో ఎంపీడీఓ గోవిందదాస్, పంచాయతీ కార్యదర్శి నాగమునిలు ఆదివారం అక్కడికెళ్లి జేసీబీతో ద్వారానికి తెల్లని వస్త్రం కప్పారు. విషయం తెలుసుకున్న టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ తన అనుచరులతోవచ్చి అధికారులపై దాడులకు దిగారు. ఏకంగా అధికారులనే దుర్భాషలాడుతూ.. వారి విధులకు ఆటంకం కలిగిస్తూ భయాందోళన సృష్టించారు. ఈ విషయమై వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకుల మధ్య చోటు చేసుకున్న వాగ్వాదం ఉద్రిక్తతకు దారితీసింది. ధర్మవరం డీఎస్పీ రమాకాంత్, సీఐ జి.టి.నాయుడు, ఎస్ఐ నాగస్వామిలు తమ పోలీస్ సిబ్బందితో ఇరువర్గాలనూ చెదరగొట్టారు. ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న అధికారులపై దౌర్జన్యానికి పాల్పడిన టీడీపీ నాయకులపై పోలీసులు ఎటువంటి చర్యలూ చేపట్టకపోవడంతో వైఎస్సార్సీపీ నాయకులు రోడ్డుపైన, పోలీస్‌స్టేషన్ ఆవరణలో బైటాయించి ఆందోళన చేశారు. తలలు పగులుతాయ్: పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కనగానపల్లి: మళ్లీ తాము అధికారంలోకి వస్తే వైఎస్సార్ విగ్రహాలతో పాటు వైఎస్సార్సీపీ కార్యకర్తల తలకాయలు కూడా పగలగొడతామని టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ రెచ్చగొట్టే వాఖ్యలు చేశాడు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా ఆదివారం రామగిరిలో అధికారులు రహదారి ద్వారంపై ఉన్న పరిటాల రవీంద్ర పేర్లు తొలగించటంపై టీడీపీ నాయకులు రాద్దాంతం చేసి ఘర్షణ వాతావరణం సృష్టించారు. ఈ సందర్భంగా స్థానిక టీడీపీ కార్యాలయం వద్ద పరిటాల శ్రీరామ్ పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా మాట్లాడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గత టీడీపీ ప్రభుత్వంలో ఇక్కడ ఉన్న వైఎస్సార్ విగ్రహాన్ని పగలగొట్టి తాడువేసుకొని ఈడ్చుకొని వెళ్లింది మనమేనని, ఇప్పుడు అధికార పార్టీ కార్యకర్తలు రెచ్చిపోతే తిరిగి మనం అధికారంలోకి వచ్చాక వారు పెట్టిన వైఎస్సార్ విగ్రహాలను పగలగొట్టటంతో పాటు ఆ పార్టీ కార్యకర్తల తలకాయలు కూడా పగులుతాయని అన్నాడు. దీంతో పాటు గత ఐదేళ్ల టీడీపీ పాలనలో మనకు భయపడి వైఎస్సార్సీపీ నేతలు ఎవ్వరూ రామగిరి మండలంలోకి అడుగు పెట్టలేకపోయారని బూతు మాటలతో టీడీపీ కార్యకర్తలను మరింత రెచ్చగొట్టాడు. పోలీసులు అడ్డులేకపోతే ఇప్పుడే వారి అంతు చూసేవారిమన్నారు. ఒకవైపు ఎన్నికల కోడ్ అమలులో ఉండగా, ఫ్యాక్షన్ ప్రాంతంగా ఉన్న రామగిరి మండలంలో టీడీపీ నాయకులు పబ్లిక్‌లోకి వచ్చి ఇలా రెచ్చగొట్టే ధోరణిలో మాట్లాడటంపై సర్వత్రా భయాందోళన కల్గిస్తోంది. పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ మండల నాయకులు ఎన్నికల అధికారులను కోరుతున్నారు. -
ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం
-
ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దౌర్జన్యం
సాక్షి, అనంతపురం: దాడులు.. దౌర్జన్యాలు.. చెయ్యడంలో టీడీపీ నేతలు ఆరితేరిపోయారు. టీడీపీ నాయకుల ఆగడాలకు అంతేలేకుండా పోతోంది.రామగిరిలో ఆదివారం ఎన్నికల కోడ్ అమలు చేస్తున్న ఎన్నికల అధికారులపై టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ దాడికి పాల్పడ్డారు. ఎన్నికల కోడ్ అమలులో భాగంగా రాజకీయ నేతల చిత్ర పటాలపై అధికారులు ముసుగు వేశారు. దీంతో ఎన్నికల అధికారులపై పరిటాల శ్రీరామ్ దుర్బాషలాడి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఎన్నికల అధికారి కాలర్ పట్టుకుని శ్రీరామ్ బెదిరింపులకు దిగారు. (మాజీ మంత్రి ఆదినారాయణరెడ్డి దౌర్జన్యం) -
నారా లోకేష్ ‘విందు’ రాజకీయం
సాక్షి, అమరావతి: టీడీపీ నేతల రాజకీయ వారసులతో ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతులు ఆదివారం హైదరాబాద్‌లో విందు సమావేశం నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతల కుటుంబాలకు చెందిన వారసుల్లో ప్రస్తుతం పార్టీలో క్రియాశీలకంగా పనిచేస్తున్న కొందరిని ఎంపిక చేసి ఈ విందు భేటీకి ఆహ్వానించారు. వారసుల భార్య/భర్తలను సైతం పిలిచారు. హైదరాబాద్‌లోని చంద్రబాబు నివాసంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ సమావేశం కొనసాగింది. చంద్రబాబు నాయుడు, ఆయన భార్య భువనేశ్వరిలు సైతం కొద్దిసేపు ఈ భేటీలో పాల్గొన్నట్లు సమాచారం. (చదవండి: మరోసారి కూన రవికుమార్ రౌడీయిజం..) ఎంపీ రామ్మోహన్ నాయుడు, ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ, మాజీ మంత్రి భూమా అఖిలప్రియ, మాజీ ఎమ్మెల్యే గౌతు శిరీషతో పాటు పరిటాల శ్రీరాం, టీజీ భరత్, మాగంటి రాంజీ దంపతులు, మాజీ మంత్రులు కేఈ కృష్ణమూర్తి, అయ్యన్నపాత్రుడు కుమారులు, కోడళ్లు ఈ సమావేశంలో పాల్గొన్నారు. పార్టీపై తన పట్టును నిరూపించుకోవాలన్న ఆలోచనతో పాటు రాజకీయంగానూ తనపై పార్టీ నేతల్లో నమ్మకం కలిగించే ఉద్దేశంతో నారా లోకేష్ ఈ విందు రాజకీయం మొదలుపెట్టినట్టు టీడీపీలో చర్చ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీలో కొనసాగితే రాజకీయంగా మంచి భవిష్యత్తు ఉంటుందని ఈ సందర్భంగా లోకేష్ చెప్పినట్లు తెలిసింది. (విజయవాడ నడిబొడ్డున కోట్ల విలువైన భూమి కబ్జా) -
పరిటాల శ్రీరామ్ నుంచి ప్రాణహాని
సాక్షి, ధర్మవరం(అనంతపురం) : ‘‘టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరడంతో పరిటాల శ్రీరామ్ అనుచరులు నాపై రెండు సార్లు హత్యాయత్నానికి పాల్పడ్డారు. నాకు పరిటాల కుటుంబం నుంచి ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని అనంతపురం జిల్లా రామగిరి మండల మాజీ ఎంపీపీ భర్త నసనకోట ముత్యాలప్ప ధర్మవరం డీఎస్పీ రమాకాంత్ ఎదుట వాపోయాడు. ఈ మేరకు ఆయన గురువారం డీఎస్పీని కలిపి ఫిర్యాదు చేశారు. ముత్యాలప్ప మాట్లాడుతూ.. ‘‘నాది రామగిరి మండలం నసనకోట. నా భార్య టీడీపీ హయాంలో మాజీ ఎంపీపీ. నేను ఎన్నికల ముందు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలోకి చేరాను. అప్పటి నుంచి పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు, కుటుంబ సభ్యులు నాపై కక్షకట్టి హత్య చేయాలని చూస్తున్నారు. ఇప్పటికే తల్లిమడుగు, నసనకోట గ్రామాల్లో రెండుసార్లు నాపై హత్యాయత్నం చేశారు. నాకు ప్రాణహాని ఉంది. రక్షణ కల్పించండి.’’ అని కోరారు. డీఎస్పీ రమాకాంత్ మాట్లాడుతూ ముత్యాలప్ప ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని, వారి ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. -
పరిటాల కుటుంబంతో ప్రాణహాని
సాక్షి, అనంతపురం : రాప్తాడు నియోజకవర్గంలో ఓటమిని జీర్ణించుకోలేక పరిటాల శ్రీరామ్, అతని అనుచరులు దాడులకు పాల్పడుతున్నారని నసనకోట గ్రామస్తులు ఆరోపించారు. పరిటాల కుటుంబ అరాచకాలపై శనివారం వారు ఎస్పీని కలిసి ఫిర్యాదు చేశారు. రామగిరి మండలం నసనకోటలో ఈ నెల 4న వినాయక నిమజ్జనం అనంతరం తిరిగి ఇళ్లకు వెళ్తుండగా వెంకటాపురం నుంచి పరిటాల శ్రీరామ్ అనుచరులు ట్రాక్టర్లు, వాహనాలలో 50 మందికి పైగా వచ్చి మారణాయుధాలతో విచక్షణా రహితంగా దాడులకు పాల్పడ్డారని తెలిపారు. బోయ సూర్యం అనే వ్యక్తిని హత్య చేయడానికి కుట్ర జరిగిందని, అయితే చనిపోయాడనుకోని అతడిని వదిలేసి వెళ్లారని వివరించారు. ఈ ఘటనలో అనేక మంది గాయపడ్డారని, ప్రాణభయంతో ఇళ్లలోకి పరుగులు తీశామని తెలిపారు. ఉనికి కోసమే దాడులు రామగిరి మండలంలో ఉనికి కోల్పోతున్నామనే కారణంతోనే పరిటాల శ్రీరామ్ ఈ దాడులు చేయిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. గతంలో కూడా పేరూరు బస్టాండ్‌లో వైఎస్సార్సీపీ కార్యకర్తలను చితకబాదారని గుర్తు చేశారు. రామగిరి మండలం తమకు వ్యతిరేకంగా ఎవరు ఉన్నా చంపుతామని బెదిరిస్తున్నారని, అరాచకశక్తిలా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పరిటాల శ్రీరామ్, అతని అనుచరుల నుంచి తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నసనకోట గ్రామస్తులు ముత్యాలప్ప, కేశవనారాయణ, రామలింగారెడ్డి, బండారు లింగన్న, ముత్యాలు, మహిళలు రత్న, సావిత్రమ్మ, ముత్యాలమ్మ, రంగమ్మ, పి. ముత్యాలమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇది చదవండి : పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు -
పరిటాల వర్గీయుల హింసా రాజకీయాలు
సాక్షి, అనంతపురం: మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి విమర్శించారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసిన వారిపై పరిటాల అనుచరులు దాడులకు తెగబడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులకు దిగుతున్న పరిటాల వర్గీయులపై పోలీసులు కఠినంగా వ్యవహరించాలని కోరారు. నసనకోటలో వైఎస్సార్సీపీ కార్యకర్తలపై పరిటాల వర్గీయులు దాడులకు పాల్పడ్డారని, వారిని కఠినంగా శిక్షించాలని ప్రకాశ్‌రెడ్డి పోలీసులకు విజ్ఞప్తి చేశారు. చదవండి: పరిటాల వర్గీయుల బరితెగింపు -
పరిటాల సునీత వర్గీయుల దాష్టికం
సాక్షి, అనంతపురం : మాజీ మంత్రి పరిటాల సునీత వర్గీయులు మరోసారి రెచ్చిపోయారు. రామగిరి వైఎస్సార్సీపీ నేత బోయ సూర్యంపై హత్యాయత్నానికి పాల్పడ్డారు. వేటకొడవళ్లతో సూర్యంపై దాడి చేశారు. పరిటాల సునీత సొంత పంచాయతీ నసనకోటలో ఈ ఘటన జరిగింది. వినాయక నిమజ్జనం సందర్భంగా వైఎస్సార్సీపీ కార్యకర్తలపై రాళ్లు, కర్రలతో దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ముగ్గురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు తీవ్ర గాయాలు అయ్యాయి. మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ డాడి చేయించారని బాధితులు ఆరోపించారు. గాయపడిన వారిని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు తోపుదుర్తి చందు పరామార్శించారు. -
పరిటాల వర్గీయులు ఫోన్లో బెదిరింపులు
-
పరిటాల శ్రీరాం ఓడిపోతాడనే దాడులు
అనంతపురం న్యూసిటీ: ‘‘రాప్తాడులో శాంతిభద్రతలు చచ్చిపోయాయి. ఖాకీ చొక్కా వేసుకున్న నిజమైన పోలీసులు కనపడి ఐదేళ్లు అయ్యింది.’’ అని వైఎస్పార్ సీపీ రాప్తాడు ఎమ్మెల్యే అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుల చేతిలో గాయపడి నగరంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్సార్సీపీ నాయకులను ఆయన శనివారం పరామర్శించారు. గాయపడిన చింతకాయల పోతులయ్య ఆరోగ్యపరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకుని మెరుగైన సేవలందించాలని కోరారు. అనంతరం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. ‘‘ఎన్ఎస్ గేట్లో దాడులకు పాల్పడిన వారిని ప్రజలే పట్టించినా ఎస్ఐ కనుసైగలు చేసి పారిపోమనే పరిస్థితులు ఉన్నాయి. గత ఐదేళ్లుగా వైఎస్సార్ సీపీ సానుభూతిపరులపై దాడులు చేస్తున్నా పోలీసులు పట్టించుకోరు. ధర్మవరం డీఎస్పీ, ఆత్మకూరు సీఐ.. జిల్లా ఎస్పీ సహా తెలుగుదేశం పార్టీ నాయకులకు వత్తాసు పలుకుతున్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరినైనా కొట్టచ్చు. వైఎస్సార్ సీపీ నాయకులు ప్రాణాలమీదకొచ్చినా, ఆస్పత్రుల్లో అడ్మిట్ అయిన తెలుగుదేశం పార్టీ నాయకులపై ఎలాంటి చర్యలు తీసుకోరు. ఒకవేళ కేసులు కట్టినా బెయిలబుల్ సెక్షన్ల(324, 326)తో సరిపెడుతారు. ఐదేళ్లలో నలుగురు నాయకులను పొట్టనపెట్టుకున్నారు. పోలీసులు కేఎన్ పాళ్యం, కందుకూరులో మర్డర్ కేసులో ఉన్న ముద్దాయిలను తీసుకొచ్చి ఓటు వేయించారు. ఈ విషయంలో స్థానిక ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వచ్చింది. జిల్లాలో ఎక్కడ హత్య జరిగినా మంత్రి పరిటాల సునీత ఇంటి వద్ద ఆశ్రయమిస్తారు. ఆ విషయం జిల్లా ఎస్పీకి కూడా తెలుసు.’’ శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తాడు ‘రాప్తాడులో జరిగిన హత్యలకు ప్రధాన కారకుడు మంత్రి కుమారుడు పరిటాల శ్రీరాం అని తెలిసినా ఎస్పీ ఎలాంటి చర్యలు తీసుకోరు. ఇదే విషయమై ఫిర్యాదు చేస్తే ఆ బాబు అలాంటి వ్యక్తి కాదని వెనుకేసుకొస్తారు. ఎస్పీకి శ్రీరాం ‘బాబు’గానే కన్పిస్తారు కానీ ముద్దాయిగా కన్పించడు. శవ పంచనామలో, ఎఫ్ఐఆర్లో శ్రీరాం పేరు నమోదు చేయాలని బాధిత కుటుంబీకులు ఫిర్యాదు చేసినా ఎక్కడా నమోదు చేయట్లేదు. రాప్తాడు నియోజకవర్గంలో సాయంత్రం 6 గంటల తర్వాత ఎవరూ తిరగలేని పరిస్థితి. శ్రీరాం యువసేన పేరుతో రౌడీషీటర్లు(ధర్మవరం) అమాయకులపై దాడులు చేస్తున్నారు. ఎన్ఎస్ గేట్ యూత్ కన్వీనర్‌పై దాడిని స్థానిక ప్రజలు కండించడంతో పోలీసులు కేసు కట్టారు. కేసు కట్టనివి ఎన్నో ఉన్నాయి. తోపుదుర్తి గ్రామంలో పోలింగ్ రోజున పరిటాల శ్రీరాం వచ్చి ప్రజలపై రాళ్లు రువ్వి, దాడులు చేసినా ఆయనపై కేసు కట్టడంతో పాటు అమాయక ప్రజలపైనా కేసులు పెట్టారు. అదే గ్రామంలో వైఎస్సార్ సీపీ నాయకున్ని తెలుగుదేశం నాయకులు చెప్పుతో కొట్టారు. దీనిపై ఫిర్యాదు చేసినా ఇంతవరకు కేసు నమోదు చేయలేదు. ఈ విషయమై డీఎస్పీ, సీఐను ఆరా తీస్తే ఎస్పీ ఒత్తిడి పెడుతున్నారని చెప్పారు. ఎస్పీ ప్రభుత్వంతో జీతం తీసుకుంటున్నారా? లేక ఎవరితో జీతం తీసుకుంటున్నారో ఆలోచన చేయాలి. ఎస్సీకి చెందిన దళిత రాజన్న అనే వ్యక్తి టీడీపీ నాయకులపై ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు.’ ఓటమి భయంతోనే దాడులు ‘‘ఈ ఎన్నికలు ప్రజలు, పరిటాల కుటుంబం మధ్య జరిగాయి. ఓటమి భయంతోనే పరిటాల శ్రీరాం ప్రతి గ్రామంలో వర్గాలు, కక్షలు రేకెత్తిస్తున్నారు. నియోజకవర్గంలో ఫ్యాక్షన్‌కు తిరిగి బీజం వేస్తున్నారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చట్టం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తుంది. సరైన పోలీసు అధికారులతో శాంతిభద్రతలు కాపాడుతాం.’’ అన్నారు. ప్రకాష్ రెడ్డి వెంట వైఎస్సార్ సీపీ నాయకులు తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి, నాగసముద్రం యూత్ మండల కన్వీనర్ ఓబులేసు, తదితర గ్రామస్తులు ఉన్నారు. -
పరిటాల శ్రీరామ్ అనుచరుల వీరంగం
చెన్నేకొత్తపల్లి: అనంతపురం జిల్లాలో రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ అనుచరులు మరోసారి రెచ్చిపోయారు. నాగసముద్రం గేటు వద్ద శుక్రవారం మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ అనుచరులు వైఎస్సార్సీపీ నేతలపై విచక్షణారహితంగా మారణాయుధాలతో దాడికి దిగారు. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల యూత్ కన్వీనర్ ఓబిలేసు,నాయకులు చింతకాయల పోతన్న, నాగేంద్ర, మేడాపురం రాజు, ముత్యాలు శుక్రవారం ఎన్.ఎస్.గేటులోని ఒక కూల్‌డ్రింక్ షాపు వద్ద నిలబడి ఉన్నా రు. ఆ సమయంలో అక్కడికి వచ్చిన పరిటాల శ్రీరామ్ అనుచరులు మహేష్, పవన్‌కుమార్‌రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్ వారితో గొడవకు దిగారు. ‘ఈ ప్రాంతం పరిటాల శ్రీరామ్ అడ్డా.. ఇక్కడ వైఎస్సార్సీపీ నాయకులు ఎవ్వరూ తిరగకూడదు’ అంటూ చిందులు తొక్కారు. వారిని అడ్డుకోబోయిన ఓబిలేసుతోపాటు మరో నలుగురిపై మారణాయుధాలు, కట్టెలతో దాడి చేసి గాయపరిచారు. వైఎస్సార్సీపీ నేతలు నేరుగా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. రోడ్డుపై బైఠాయించిన వైఎస్సార్సీపీ నేతలు ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులంతా చెన్నేకొత్తపల్లి పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళనకు దిగాయి. తమ పార్టీ నాయకులపై దాడి చేసిన వారిపై వెంటనే కేసు నమోదు చేసి అరెస్టు చేయాలని పార్టీ మండల కన్వీనర్ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వందలాది మంది పార్టీ కార్యకర్తలు రెండు గంటల పాటు రోడ్డుపైనే బైఠాయించారు. దీంతో వైఎస్సార్సీపీ నాయకులపై దాడికి పాల్పడ్డ ఆరుగురిని అరెస్టు చేసినట్లు రామగిరి సీఐ తేజోమూర్తి తెలిపారు. దాడికి పాల్పడిన మహేష్, పవన్‌కుమార్‌రెడ్డి, పోతలయ్య, సురేష్, రమణాచారి, ఫిరోజ్‌పై 143, 147, 148, 307, 324 ఐపీసీ సెక్షన్ల కింద కేసు నమోదు చేశామన్నారు. -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
అనంతపురం: ఆత్మకూరు మండల పోలీస్ స్టేషన్లో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌పై శుక్రవారం పోలీసులు కేసు నమోదు చేశారు. గురువారం ఎన్నికల ఓటింగ్‌లో భాగంగా తోపుదుర్తి గ్రామంలో ఓటర్లను పోలింగ్ బూత్ వద్ద భయభ్రాంతులకు గురి చేశారనే విషయంలో(రాయిటింగ్ ) కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
ఏం చేశారని ఓట్ల కోసం వచ్చారు?
అనంతపురం : ‘ఐదేళ్ల పాలనలో ఏం చేశారని ఓట్లు అడగడానికి వచ్చారు. మా ఇళ్లను కూల్చేశారు. భూములను లాక్కున్నారు. మరుగుదొడ్ల బిల్లులను తినేశారు. అష్టకష్టాలు పడుతున్న మమ్మల్ని ఏనాడూ పలకరించిన పాపాన పోలేదు. ఇప్పుడు గుర్తుకొచ్చామా?’.. అంటూ మంత్రి పరిటాల సునీత, టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరాంను రాప్తాడు వాసులు అడ్డుకున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరాం, ఎంపీ అభ్యర్థి నిమ్మల కిష్టప్ప ఆదివారం రాత్రి 9 గంటలకు అనంతపురం జిల్లా రాప్తాడుకు చేరుకున్నారు. సునీత మాట్లాడే సమయంలో స్థానిక మహిళలు పెద్దఎత్తున చుట్టుముట్టి ఇళ్లను కూల్చేశారంటూ మండిపడ్డారు. మరుగుదొడ్ల బిల్లుల మంజూరులో అవినీతిపై, జాకీ ఫ్యాక్టరీ కోసమంటూ నిరుపేదలకు చెందిన 50 ఎకరాల భూమిని బలవంతంగా స్వాధీనం చేసుకోవడంపై నిలదీశారు. ఇలాంటి అవినీతిపరులకు తామెలా ఓటు వేస్తామనుకుని వచ్చారంటూ ప్రశ్నించారు. రాత్రి 11 వరకూ మంత్రి, ఆమె తనయుడు రాప్తాడులో మైకులు పెట్టి మరీ ప్రచారం నిర్వహించారు. -
పరిటాల శ్రీరాంకు పరాజయం తప్పదు!
సాక్షి, హైదరాబాద్ : రౌడీయిజంతో ప్రజలను భయబ్రాంతులకు గురిచేస్తున్న పరిటాల శ్రీరాం, కరణం బలరాంలకు అవమానకర పరాజయం తప్పదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. గురువారం ట్విటర్ వేదికగా ఆయన సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన సుపుత్రుడు నారా లోకేష్‌లపై ధ్వజమెత్తారు. ‘చీరాల అసెంబ్లీ స్థానంలో టీడీపీ అభ్యర్ధి కరణం బలరాం పెద్దఎత్తున బయటి వ్యక్తులను దింపి ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టిస్తున్నారు. రాప్తాడులో పరిటాల శ్రీరాం రౌడీయిజం చేస్తున్నారు. బలరాం, శ్రీరాంలకు అవమానకర పరాజయం తప్పదు.’ అని ట్వీట్ చేశారు. మీ రాఘవేంద్ర రావు పరామర్శించాడా? జయసుధ, ఆలీ వైఎస్సార్ కాంగ్రెస్‌లో ఎలా చేరతారని, తిత్లీ తుఫాన్ వచ్చినపుడు వాళ్లిద్దరు ఎక్కడికెళ్లారని చంద్రబాబు ప్రశ్నిస్తున్నారంటే అయనకు నిజంగా ఏదో అయినట్లే ఉందని ఎద్దేవా చేశారు. వంద కోట్ల టీటీడీ నిధులను దోచిపెట్టిన దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు బాధితులను పరామర్శించాడా? అని, ఇతర రాష్ట్రాల నేతలు కేజ్రీవాల్, మాయావతి,మమతలు ఓదార్చారా? అని నిలదీశారు. పప్పునాయుడు గెలుపు కోసం.. ‘మంగళగిరిలో పప్పునాయుడు గెలుపు కోసం ఓటుకు పది వేలు పంపిణీ చేస్తున్నారు. కూపన్లు ఇస్తున్నారట. వాటిని గుంటూరులోనో, విజయవాడలోనో ఫలానా వ్యక్తికి చూపిస్తే డబ్బు చెల్లిస్తారట. ఎన్ని తాయిలాలు ముట్ట చెప్పినా ఆర్కే గెలుపును ఆపడం చంద్రబాబు తరం కాదు.’ అన్నారు. మందలగిరి మాలోకానికి స్టాన్‌ఫోర్డ్‌లో సీటు కోసం అప్పట్లో ఒక స్పాన్సర్‌తో 50 కోట్లు డొనేషన్ కట్టించారని, అమరావతికి డిజైన్లిచ్చే సంస్థలతో ఇప్పుడు హైదరాబాద్‌లో రూ. 300 కోట్ల ప్యాలెస్ కట్టించుకున్నారని ఆరోపించారు. జీవితమంతా మందిపై పడి బతకడమేనా చంద్రబాబూ... అంటూ, ఇది ఎంగిలి కూడు తినడం కాదా? అని ప్రశ్నించారు. -
ఓటమి భయంతోనే శ్రీరాం ప్రలోభాలు
సాక్షి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గంలో పరిటాల కుటుంబానికి ఓటమి భయం పట్టుకుంది. ప్రజల్లో ఉన్న తీవ్రమైన వ్యతిరేకత నుంచి బయటపడేందుకు తంటాలు పడుతున్నారు. ఓవైపు బెదిరింపులకు గురి చేస్తున్నారు. మరోవైపు ప్రలోభాల పర్వానికి తెర తీస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో డబ్బు, మద్యం ఏరులై పారుతోంది. తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో పరిటాల శ్రీరాం వర్గీయుడి నుంచి పోలీసులు రూ.24 లక్షల నగదు స్వాధీనం చేసుకోవడం కలకలం రేపుతోంది. మంత్రి పరిటాల సునీత ముఖ్య అనుచరుడు, రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్ డ్రైవర్ సంతోష్‌రెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. అయితే ఈ డబ్బును వాహనాల కొనుగోలుకు తరలిస్తున్నట్లు తెలిసింది. ప్రలోభాల పర్వం.. రాప్తాడు నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన పరిటాల సునీత మంత్రిగా కొనసాగుతున్నారు. పదేళ్లలో నియోజకవర్గంలో అభివృద్ధి చేసింది శూన్యం. నియోజవకర్గంలోని రాప్తాడు, ఆత్మకూరు, అనంతపురం రూరల్, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి, రామగిరి మండలాలకు కుటుంబీకులు, తన సామాజిక వర్గానికి చెందిన వారిని ఇన్‌చార్జ్‌లుగా నియమించి ‘సామంతుల’ పాలన సాగించారు. అభివృద్ధి మాటున దోపిడీ చేశారు. చివరకు వారి పార్టీకి చెందిన ద్వితీయశ్రేణి, దిగువశ్రేణి నాయకులను సైతం దగ్గరికి రానీవ్వకుండా మంత్రి సామాజిక వర్గం వారే అన్ని పథకాల్లోనూ దోచుకున్నారు. ప్రతి విషయంలోనూ వారిదే పెత్తనం. వారిని కాదని నేరుగా మంత్రిని కలిసే అవకాశం కూడా లేదని టీడీపీ కార్యకర్తలే వాపోతున్నారు. ఫలితంగా ప్రజలతో పాటు సొంత పార్టీలో కూడా తీవ్ర వ్యతిరేకత వచ్చింది. కొందరు బాహాటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. చాలామంది లోలోనే మదనపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వ్యతిరేకతను అంచనా వేసిన మంత్రి పరిటాల సునీతకు ఈసారి తాను బరిలో నిలిస్తే ఓడిపోతానని తెలిసిపోయింది. కుమారుడు శ్రీరాం అయితే కనీస పోటీ అయినా ఇస్తాడనే ఆలోచనతో బరిలో దింపారు. అయినా పరిస్థితి మెరుగుపడలేదు. ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రలోభాలకు తెర తీస్తున్నారు. ఇందులో భాగంగా ముందుగా ఓటుకు రూ.2 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించారు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో ఓట్లను బట్టి ఇంటికి రూ.5 వేల నుంచి రూ.15 వేల దాకా ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిసింది. స్కార్పియోలు, బైకుల ఆఫర్ ఓ స్థాయి నాయకులకు స్కార్పియోలు, బైకులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలిసింది. ఈ క్రమంలో జాబితా కూడా తయారు చేసినట్లు సమాచారం. పరిటాల శ్రీరాంకు గెలుపు జీవన్మరణ సమస్యగా మారడంతో ఎలాగైనా బయట పడేందుకు పరిటాల కుటుంబం తంటాలు పడుతోంది. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో మరిన్ని ప్రలోభాలకు గురి చేస్తారనే ప్రచారం సాగుతోంది. -
పరిటాల శ్రీరామ్‌కు చేరవేస్తున్న నగదు సీజ్
సాక్షి, హైదరాబాద్ : మంత్రి పరిటాల సునీత కుమారుడు, అనంతపురం జిల్లా రాప్తాడు అసెంబ్లీ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు చేర వేసేందుకు సిద్ధం చేసిన రూ.24 లక్షలు సోమవారం రాత్రి హైదరాబాద్‌లో పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్‌లో ఉంటున్న అతడి ప్రధాన అనుచరుడు తన డ్రైవర్ ద్వారా నగదు పంపేందుకు ప్రయత్నించారు. నగదు చిక్కిన విషయం తెలియడంతో టీడీపీ కీలక నేతలు, ఏపీ ప్రభుత్వ అధికారులు సైబరాబాద్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి తీసుకురావడానికి ప్రయత్నించారు. అధికారులు నిందితుడిపై కేసు నమోదు చేయడంతో పాటు ఎన్నికల అధికారులు, ఆదాయపు పన్ను శాఖకు సమాచారం ఇచ్చారు. రాప్తాడు మండల పరిషత్‌కు ప్రస్తుతం అధ్యక్షుడిగా (ఎంపీపీ) ఉన్న దగ్గుపాటి వెంకట ప్రసాద్ పటాన్చెరులో డీవీ పాలిమర్స్ పేరుతో ఓ ఫ్యాక్టరీ నిర్వహిస్తున్నారు. రాప్తాడు ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న పరిటాల శ్రీరామ్‌కు రూ.24 లక్షలు సమకూర్చడానికి సిద్ధమైన ప్రసాద్ ఈ మొత్తాన్ని పోలీసుల కంటపడకుండా తరలించడానికి పథకం వేశారు. వ్యక్తిగత వాహనాల్లో తీసుకువెళ్తే చెక్‌పోస్టుల్లో తనిఖీలు జరిగితే పట్టుబడే ప్రమాదం ఉందని భావించి తన డ్రైవర్ సంతోష్‌రెడ్డికి డబ్బు అందించాడు. ఓ టావెల్స్ బస్సులో డబ్బు తరలిస్తున్న సంతోష్‌రెడ్డిని పోలీసులు సోమవారం ఆరామ్‌ఘర్ చౌరస్తా ప్రాంతంలో తనిఖీల సందర్భంగా పట్టుకున్నారు. ఈ డబ్బుకి సంబంధించి ఆయన వద్ద ఎలాంటి రసీదులు, లెక్కలు లేకపోవడంతో పోలీసు స్టేషన్‌కు తరలించారు. తన యజమాని ప్రసాద్ సూచన మేరకే డబ్బులు తరలిస్తున్నట్లు సంతోష్‌రెడ్డి అంగీకరించాడు. నిందితుడిపై కేసు నమోదు చేసిన పోలీసులు ఈ మొత్తాన్ని ఆదాయపుపన్ను శాఖ అధికారులకు అప్పగించనున్నట్లు పేర్కొన్నారు. గెలుపు కోసం మాజీ మంత్రి పల్లె అడ్డదారులు అనంతపురం : మరోవైపు మాజీ మంత్రి పల్లె రఘునాథరెడ్డి కూడా తన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పుట్టపర్తిలో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు టీడీపీ యత్నిస్తోంది. నియోజకవర్గంలోని యువతను ఆకర్షించే ఎత్తుగడలో భాగంగా భారీగా క్రికెట్ కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా క్రీడా పరికరాల పంపిణీకి సంబంధించిన ఫోటోలు బయటపడ్డాయి. -
పరిటాల వర్గీయుల బెదిరింపులు..
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పోలీసులు వైస్సార్సీపీ అభ్యర్థికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చంపుతామని మంత్రి పరిటాల సునీత వర్గీయులు బహిరంగంగానే ప్రకటిస్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. తోపదుర్తి గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు.. మదిగుబ్బ- బి.యాలేరు మధ్య చేపట్టిన కల్వర్టు నిర్మాణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో పోలీసు గస్తీ ఏర్పాటు చేయించాలని, వారం కిందటే జిల్లా కలెక్టర్, ఎస్పీలను వైఎస్సార్సీపీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై రాప్తాడు వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాజశేఖర్ యాదవ్, కురుబ నాగిరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, కొడుకు శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు దేనికైనా తెగిస్తున్నారని తెలిపారు. తోపుదుర్తి బ్రదర్స్‌కు ప్రాణహాని ఉందని, అనుమానస్పద ప్రాంతాలపై ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మంత్రి పరిటాలకు కొందరు అధికారులు, పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
చంపుతామని బెదిరించినా .. చర్యలు శూన్యం
సాక్షి, అనంతపురం: ఎన్నికల వేళ ఆంధ్రప్రదేశ్‌లో పోలీసులు ఏకపక్షంగా వ్యహరిస్తున్నారు. అధికార టీడీపీకి చెందిన నాయకులుకు సహకరిస్తూ.. వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ముఖ్యంగా అనంతపురం జిల్లాలో టీడీపీ నేతల అరాచకాలపై పోలీసుల మౌన వైఖరిపట్ల స్థానిక ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. రాప్తాడు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్‌కు ఓట్లు వేయకపోతే చంపుతామని ఓటర్లని బహిరంగంగా బెదిరించిన టీడీపీ నేత ముకుందనాయుడుపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మంత్రి పరిటాల సునీత సమక్షంలోనే గతవారం రోజులుగా రాప్తాడు నియోజకవర్గంలో అలజడి చేస్తోన్న ముకుందనాయుడపై కేవలం బైండోవర్ కేసు నమోదు చేసి చేతులు దులుపుకున్నారు. ఓటర్లను హెచ్చరిస్తూ.. భయభ్రాంతులకు గురిచేస్తోన్న టీడీపీ నేతలను అరెస్ట్ చేయకుండా.. పోలీసులకు వారికే అనుకూలంగా వ్యవహరిస్తున్నారు. మంత్రి సునీత ఒత్తిళ్ల కారణంగానే పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇదిలావుడంగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్తి తోపుదుర్తి రాజేశేఖర్ రెడ్డిపై అక్రమంగా మూడు సెక్షన్ల కింద కేసులను నమోదు చేశారు. దీంతో అనంతపురం పోలీసుల తీరు తీవ్ర చర్చనీయాంశమైంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు టీడీపీకి మద్దతుగా నిలుస్తోన్న విషయం తెలిసిందే. దీనిని ఆసరాగా తీసుకున్న చంద్రబాబు నాయుడు ఓటర్లకు డబ్బులు పంచడానికి ఏకంగా పోలీసు వాహనాలనే ఉపయోగిస్తున్నారు. పోలీసు నిఘా వ్యవస్థ చర్యలు శూన్యం పోలీసుశాఖలో నిఘా వ్యవస్థ దారుణంగా విఫలమైంది. నేరస్తుల కదలికలపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంటుంది. ముఖ్యంగా రౌడీషీటర్లు, హత్యకేసు నిందితులు, శాంతిభద్రతలకు విఘాతం కలిగించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంచాలి. అయితే జిల్లాలో పోలీసు నిఘా వ్యవస్థ పెద్దగా దృష్టి సారించడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా అధికారపార్టీ అనుయాయులుగా చెలమాణి అవుతున్న రౌడీషీటర్ల విషయంలో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో నాల్గవ పట్టణ పోలీసుస్టేషన్లో పనిచేస్తున్న ఓ సీఐ నేరస్తులకు రాచమర్యాదలు చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి. ప్రస్తుత ఎన్నికల్లో చాలావరకు వారిని బైండోవర్లు కూడా చేయలేదని తెలుస్తోంది. అంతేకాకుండా ప్రజలను భయాబ్రాంతులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నా పట్టించుకోవడం లేదు. -
పరిటాల శ్రీరామ్‌కు ఎలా అనుమతిచ్చారు?
సాక్షి, హైదరాబాద్ : రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత తనయుడు శ్రీరామ్.. 20 వాహనాల కాన్వాయ్‌తో వెళ్తూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారని, ఎలక్షన్ అధికారులు అన్ని వాహనాలకు ఎలా అనుమతి ఇచ్చారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. అనుమతి లేకుంటే వాహనాలు స్వాధీనం చేసుకొని కేసునమోదు చేయాలని ట్విటర్ వేదికగా డిమాండ్ చేశారు. జనసేనతో లోపాయికారి పొత్తు వల్ల ప్రయోజనం లేదని చంద్రబాబు, పవన్ కల్యాణ్‌లకు అర్థమైందన్నారు. పార్టనర్ల దొంగాటను ప్రజలు గ్రహించడంతో మతి స్థిమితం కోల్పోయి మాట్లాడుతున్నారని విమర్శించారు. ఎలక్షన్ ఏకపక్షంగా ఉండబోతోందని, భారీ ఓటమి నుంచి తప్పించుకోలేరని, జీవితంలో మర్చిపోలేని గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని జోస్యం చెప్పారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ మేనిఫెస్టో విడుదలైన తర్వాత దాన్ని కాపీ కొట్టి తెలుగుదేశం హామీలు వెల్లడిస్తామని ధైర్యంగా చెప్పొచ్చు కదా చంద్రబాబు...’ అని ఎద్దేవా చేశారు. ఇప్పటికే నవరత్నాలను కాపీ పేస్ట్ చేశారని, పక్క రాష్ట్రం పథకాలను ఎత్తేశారని ధ్వజమెత్తారు. సొంత మేనిఫెస్టో ప్రకటించలేని దయనీయ స్థితి ఏమిటి బాబూ? అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. పవన్.. పగలబడి నవ్వుతున్నారు.. ‘రూ.52 కోట్ల ఆస్తులున్నట్టు ఎన్నికల అఫిడవిట్లో చూపిన వ్యక్తి ఈత చాపపై కూర్చుని మట్టి పిడతలో అన్నం తినడం డ్రామా కాక మరేమవుతుంది. 30-40 ఏళ్ల కింద ఇటువంటి వేషాలు వేస్తే జనాలు నమ్మేవారేమో. మహాత్మా గాంధీ అంత సాధారణ వ్యక్తినని షో చేస్తే ప్రజలు పగలబడి నవ్వుకుంటున్నారు.’ అని సెటైరిక్‌గా ట్వీట్ చేశారు. బాబూ నీకిది తెలుసా.. ఈ రోజు ప్రశ్న తనకు పరిటాల రవి గుండు కొట్టించారాన్న వార్తలపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పవన్ కల్యాణ్ ఏ పత్రికా కార్యాలయం ముందు ధర్నా చేశారు ? pic.twitter.com/ueR1JChLTt — Vijayasai Reddy V (@VSReddy_MP) March 25, 2019 -
‘పరిటాల శ్రీరామ్ ఓడిపోతే ఊరుకోం’
సాక్షి, అనంతపురం : జిల్లాలోని రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు బరితెగింపు చర్యలకు పాల్పడుతున్నారు. శ్రీరామ్ గెలవకపోతే తీవ్ర పరిణామాలుంటాయని ప్రజలను బెదిరిస్తున్నారు. ఈ సారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ పరిటాల శ్రీరాంను బరిలోకి దింపిన సంగతి తెలిసిందే. అయితే పరిటాల శ్రీరాం ఓడిపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని.. టీడీపీకి ఓటేయకపోతే చంపేస్తామంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు ప్రజలను బెదిరిస్తున్నారు. తాజాగా కనగానపల్లి టీడీపీ నేత ముకుంద నాయుడు బహిరంగంగానే ఓటర్లకు వార్నింగ్ ఇచ్చారు. పరిటాల సునీతతో కలిసి తల్లిమడుగు గ్రామంలో ప్రచారం నిర్వహించిన ముకుంద నాయుడు పోలింగ్ తేదీలోగా అందరూ టీడీపీలో చేరిపోవాలని అల్టిమేటం జారీ చేశారు. లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. ఎన్నికల్లో టీడీపీకి ఓటేయకపోతే చంపుతామని బెదిరింపులకు పాల్పడ్డారు. పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తున్నారని ఆయన ఓడిపోతే సహించే ప్రసక్తే లేదన్నారు. ‘బెదిరింపు అనుకోండి.. వార్నింగ్ అనుకోండి.. పోలింగ్ తేదీలోగా అందరు టీడీపీలో చేరాలి. లేదంటే తీవ్ర పరిణామాలుంటాయి’ అంటూ ముకుందనాయుడు జనాలను హెచ్చరిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అయితే ఈ వియషంలో రాప్తాడు పోలీసులు ఇంతవరకూ ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. -
రాప్తాడు రాజు ఎవరో
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నియోజకవర్గం.. అనంతపురంలోని 14 నియోజకవర్గాల్లో ఇది ప్రత్యేకం. 2009లో నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఈ నియోజకవర్గం ఏర్పడింది. ఇప్పటికే రెండు ఎన్నికలు జరిగాయి. మూడో సార్వత్రిక ఎన్నికల కోసం రాజకీయపార్టీలు సిద్ధమయ్యాయి. అయితే వైఎస్సార్సీపీ, టీడీపీ మధ్యనే ఇక్కడ ప్రధాన పోటీ నెలకొంది. మంత్రి పరిటాల సునీత ఈ నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఈ దఫా ఎన్నికల్లో సునీత స్థానంలో ఆమె తనయుడు పరిటాల శ్రీరాం బరిలో నిలిచారు. మరోవైపు వైఎస్సార్ కాంగ్రెస్‌పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి పోటీలో ఉన్నారు. తన రాజకీయ ఆరంగేట్రం, నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో 1707 ఓట్ల స్వల్వ తేడాతో ఓడిపోయిన ప్రకాశ్‌రెడ్డి ఈ దఫా ఎన్నికల్లో కచ్చితంగా గెలవాలనే సంకల్పంతో దూసుకుపోతున్నారు. మరోవైపు ప్రభుత్వ వ్యతిరేకత, కుటుంబ పాలనపై ప్రజలతో పాటు పార్టీ శ్రేణుల్లో వచ్చిన తిరుగుబాటు నేపథ్యంలో వారసుడిగా పరిటాల శ్రీరాంకు ఈ ఎన్నిక సవాల్‌గా మారింది. దీంతో ‘రాప్తాడు’ ఫలితంపై ‘అనంత’తో పాటు రాష్ట్రవ్యాప్తంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది. నియోజకవర్గ స్వరూపం రాప్తాడు మండలం 2009కు ముందు అనం తపురం నియోజకవర్గ పరిధిలో ఉండేది. అప్పటి వరకూ పరిటాల కుటుంబ పెనుకొండ నియోజక వర్గం నుంచి ప్రాతినిథ్యం వహించేంది. 2005లో పరిటాల రవీంద్ర హత్య తర్వాత జరిగిన ఉప ఎన్ని కల్లో సునీత రాజకీయ ఆరంగేట్రం చేశారు. సునీత సొంత మండలం రామగిరితో పాటు అప్పటి వర కూ పెనుకొండ పరిధిలో ఉన్న చెన్నేకొత్తపల్లి, కనగా నపల్లి మండలాలు రాప్తాడు నియోజకవర్గం లోకి చేరాయి. ఆత్మకూరుతో పాటు అనంతపురం రూరల్ మండలం కూడా ఈ నియోజవకర్గంలోకి చేర్చారు. పోటాపోటీ 2009లో నియోజకవర్గానికి జరిగిన తొలి ఎన్నికలో సునీతపై కాంగ్రెస్ పార్టీ తరఫున తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి బరిలోకి దిగారు. కేవలం 1707ఓట్ల తేడాతో ప్రకాశ్ ఓడిపోయారు. 2014 ఎన్నికల్లో కూడా స్వల్ప తేడాతో ఓటమి చెందారు. మూడో సార్వత్రిక ఎన్నికలు ఇప్పుడు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో పరిటాల కుమారుడు శ్రీరాం ఈ దఫా పోటీలో నిలిచారు. వైఎస్సార్సీపీ తరఫున మాత్రం తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి వరుసగా మూడోసారి ఎన్నికల బరిలో నిలిచారు. సామంతుల పాలన రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఎక్కడాలేని విధంగా గత 58 నెలలు ఈ నియోజకవర్గంలో ‘సామంతులపాలన’ నడిచింది. సునీత తమ్ముళ్లు మురళీ రాప్తాడు, బాలాజీ ఆత్మకూరుకు, సునీత చిన్నాన్న ఎల్ నారాయణచౌదరికి చెన్నేకొత్తపల్లి, కనగాపల్లికి నెట్టెం వెంకటేశ్, అనంతపురం రూరల్‌కు పరిటాల మహేంద్ర, రామగిరికి రామ్మూరి ్తనాయుడులను ఇన్‌చార్జ్‌లుగా కొనసాగుతున్నారు. తహశీల్దార్లు, ఎంపీడీవోలతో పాటు ప్రజలచేత ఎన్నికైన ఎంపీపీ, జెడ్పీటీసీలకు ఈ నియోజకవర్గంలో నిర్ణయాధికారాలు లేవు. ఏ మండలంలో ఏ అభివృ ద్ధి కార్యక్రమం, ప్రారంభోత్సవం, సంక్షేమ పథకాలకు సంబంధించి లబ్దిదారులను ఎంపిక చేయాలన్నా ‘సామంతుల’ నిర్ణయమే ఫైనల్! ఐదేళ్లుగా నియోజకవర్గ అభివృద్ధి విస్మరణ పాతికేళ్లుగా పరిటాల కుటుంబాన్ని ప్రజలు ఆదరించారు. 2014లో మంత్రిగా సునీతకు అవకాశం దక్కింది. దీంతో నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడతారని ఆశపడ్డారు. అయితే ఐదేళ్లలో ఫలానా అభివృద్ధి చేశామని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. దాదులూరులో గోరుచిక్కుడు ప్రాసెసింగ్ యూనిట్‌ను నెలకొల్పుతామని తొలిబడ్జెట్‌లో ప్రకటించారు. ఇప్పటి వరకూ అతీగతీ లేదు. సునీత సొంతమండలం రామగిరిలో బంగారు గనులు గతంలో పరిటాల రవీంద్ర వైఖరితోనే మూతపడ్డాయి. వీటికి పూర్వవైభవం తెస్తామన్నారు. పట్టించుకోలేదు. రాప్తాడు సమీపంలో జాకీ ఫ్యాక్టరీ మంజూరైంది. లంచాల దెబ్బతో దీనికి బ్రేక్ పడింది. చివరకు నియోజకవర్గ రైతులకు సాగునీళ్లు ఇచ్చే ఆలోచన కూడా చేయలేదు. పేరూరు ప్రాజెక్టుకు తక్కువ ఖర్చుతో , తక్కువ సమయంలో నీళ్లిచ్చేమార్గం ఉన్నా ఆదిశగా ఆలోచించలేదు. ఆర్థికప్రయోజనాలే ధ్యేయంగా కొత్తగా కాలవను తవ్వుతున్నారు. ఐదేళ్లలో ఎకరా ఆయకట్టుకు సాగునీరు ఇవ్వలేదు. ఒక్కమాటలో చెప్పాలంటే పారిశ్రామిక, వ్యవసాయఅభివృద్ధితో పాటు ఐదేళ్లలో ఫలాని పని చేశాం అని చెప్పుకునేందుకు ఒక్కటీ లేదు. ఇదే వారిపై ప్రజల్లో వ్యతిరేకత స్థాయిని పెంచింది. సాగునీరే ప్రకాశ్ ప్రధాన అస్త్రం మరోవైపు ప్రకాశ్ విభిన్నశైలిలో ప్రజల్లోకి దూసుకుపోతున్నారు. ‘ఇన్నేళ్లు పరిటాల కుటుంబాన్ని చూశారు. ఒక్కసారి తనకు అవకాశం ఇచ్చి చూడాలి’ అని అభ్యర్థిస్తున్నారు. జగన్ సీఎం అయితే రాప్తాడు నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తామన్నారు. పాదయాత్రలో జగన్ కూడా ఈ విషయంపై హామీ ఇచ్చారు. వ్యవసాయం సంక్షోభంలో ఉన్న ప్రాంతం కావడంతో అంతా వైఎస్సార్సీపీకి జైకొడుతున్నారు. ఈ పరిణామాలతో పరిటాల కుటుంబం ఈ దఫా ఎన్నికల్లో సునీతను కాకుండా శ్రీరామ్‌ను బరిలోకి దించుతోంది. సునీత అయితే ఓటమి తప్పదని, శ్రీరాం అయితే కొత్తముఖం కావడంతో వ్యతిరేకత స్థాయి తగ్గుతుందని అంతా భావిస్తున్నారు. అయితే ప్రకాశ్‌మాత్రం ఐదేళ్లపాలన శ్రీరాం కనుసన్నల్లోనే సాగిందని, ఈ దఫా పరిటాల కోటపై వైఎస్సార్సీపీ జెండా ఎగురవేస్తామనే ధీమాతో ఉన్నారు. టీడీపీని వీడిన నేతలు తెలుగు దేశం అరాచకాలు తట్టుకోలేక నియోజకవర్గంలో చాలా మంది పార్టీని వీడారు. పరిటాల రవీంద్రకు ముఖ్య అనుచరుడిగా ఉన్న వేపకుంట రాజన్న టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుబాటి ప్రసాద్ టీడీపీకి పూర్తి దూరంగా ఉన్నారు. ఐడీసీ చైర్మన్ నల్లపురెడ్డి ఇటీవలే తన పదవికి, టీడీపీకి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరారు. ఇక సర్పంచ్‌లు, ఎంపీటీసీలతో పాటు గ్రామ, మండల స్థాయి నాయకులు భారీగా పరిటాల కుటుంబాన్ని వదిలి వైఎస్సార్సీపీలో చేరారు. ఈ పరిణామాలన్నీ వారిపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నాయి. ఐదేళ్లుగా హత్యలు... దౌర్జన్యాలు ఐదేళ్లలో వైఎస్సార్సీపీకి చెందిన ఇద్దరు కీలక నేతలను హతమార్చారు. 2015 ఏప్రిల్ 29న రాప్తాడు మండలం వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహశీల్దార్ ఆఫీసులో కిరాతకంగా నరికిచంపారు. 2018 మార్చి 30న కందుకూరులో శివారెడ్డిని నరికిచంపారు. ఇవి కాకుండా వైఎస్సార్సీపీ నేతలపై జరిగిన భౌతికదాడులకు లెక్కేలేదు. ఇవి కూడా సునీతపై మైనస్‌గా మారింది. -
పరిటాల కుటుంబంలో టికెట్ చిచ్చు!
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ చిచ్చురేపింది. వివరాల్లోకి వెళ్తే.. పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఖరారు చేశారు. రాప్తాడు టికెట్‌ను మరోసారి పరిటాల సునీతకు కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆసక్తి కనబరిచారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. తాము రెండు స్థానాలు కోరినప్పటికీ చంద్రబాబు ఒకటే సీటు కేటాయించడంతో.. సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. శ్రీరామ్‌ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు. కాగా, రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీపై సునీత కుటుంబంలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ పోటీని కుటుంబంలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. -
పరిటాల శ్రీరాం రాజ్యాంగేతర శక్తి
అనంతపురం: గతంలో పరిటాల రవీంద్ర హయాంలో జిల్లాలో ఎలా దౌర్జన్యాలు జరిగాయో ఈరోజు పరిటాల సునీత మంత్రి అయిన తర్వాత ఆ కుటుంబం అదే తరహాలో దౌర్జన్యాలకు పాల్పడుతోందని, శ్రీరాం రాజ్యాంగేతర శక్తిగా మారారని మాజీ ఎంపీ, వైఎస్సార్సీపీ అనంతపురం పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి మండిపడ్డారు. మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరాం, ఎమ్మెల్యే పార్థసారథి ‘సాక్షి’ కార్యాలయం వద్ద ధర్నా చేసి జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేసేలా మాట్లాడిన తీరును నిరసిస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ చేపట్టారు. పార్టీ కార్యాలయం నుంచి ఎస్పీ కార్యాలయం వరకు ర్యాలీ సాగింది. దారి పొడవునా పరిటాల కుటుంబం, ప్రభుత్వానికి వ్యతిరేకంగా, పత్రికాస్వేచ్ఛను కాపాడాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. సప్తగిరి సర్కిల్లో మానవహారం ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఓఎస్డీ స్వామికి వినతిపత్రం అందజేశా రు. ఈ సందర్భంగా అనంత వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి వచ్చిన నాలుగున్నరేళ్లలో పత్రికాస్వేచ్ఛను పూర్తిగా హరిస్తున్నారన్నారు. అభివృద్ధి పేరుతో దోచుకుంటున్నారని, దౌర్జన్యాలు, అరాచకాలు చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో ఏ పథకం చూసినా అవినీతిమయం చేశారన్నారు. ఎక్కడ చూసినా ప్రభుత్వ భూములను లాగేసుకుంటున్నారన్నారు. పత్రికలు కాని, రాజకీయ పార్టీలు ప్రశ్నించినా వారిపై దౌర్జన్యాలు చేయడం, అక్రమంగా కేసులు బనాయించడం, ఆస్తుల, ప్రాణ నష్టం కల్గించడం వంటి చర్యలకు పాల్పడుతున్నారన్నారు. అభివృద్ధి పేరుతో మంత్రి సునీత సాగిస్తున్న దోపిడీని ‘సాక్షి’ పత్రిక ప్రచురించిందన్నారు. నియోజకవర్గంలో తన బంధువులను మండలానికి ఒక ఇన్చార్జిని నియమించుకుని సాగిస్తున్న దోపిడీపై కథనం వచ్చిందన్నారు. ఇందులో ఏవైనా తప్పులుంటే చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వారికి పూర్తి స్వేచ్ఛ ఉందన్నారు. పరిటాల సునీత మంత్రి హోదాలో ఉన్నా.. తనయుడు పరిటాల శ్రీరాం ‘సాక్షి’ కార్యాలయం ఎదుట ధర్నా చేయడాన్ని పూర్తిగా ఖండిస్తున్నామన్నారు. తాడిపత్రి ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి కూడా గతంలో ‘సాక్షి’ కార్యాలయం ఎదుట రచ్చ చేశారన్నారు. వారి అవినీతి అక్రమాలు ‘సాక్షి’లోనే కాదు తక్కిన పత్రికల్లో కూడా వచ్చాయని గుర్తు చేశారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో ప్రజలను భయభ్రాంతులకు గురచేసేలా ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోనే కుటిల ప్రయత్నం జరుగుతోందన్నారు. ఇలాంటి అప్రజాస్వామిక విధానాలను ఎవరూ జీర్ణించుకోరని హెచ్చరించారు. రెవెన్యూ, పోలీసు వ్యవస్థలు పూర్తిగా కీలుబొమ్మలుగా మారాయన్నారు. ఎమ్మెల్సీ వెన్నపూస గోపాల్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తున్నారన్నారు. పత్రికలపై దాడులకు పా ల్పడాలని చూస్తే ప్రజలు క్షమించరన్నారు. శింగనమల నియోజకవర్గ సమన్వయకర్త జొన్నలగడ్డ పద్మావతి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కనుమరుగైందన్నారు. ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారు. ఏకంగా పత్రికా కార్యాలయానికి వచ్చారంటే వారు దేనికైనా తెగిస్తారనేది అర్థమవుతోందన్నారు. రాష్ట్ర ప్ర«ధా న కార్యదర్శి రాగే పరుశురాం మాట్లాడుతూ మంత్రి కుటుంబానికి ఉన్నది ఉన్నట్లు రాస్తే అంత ఉలుకెందుకన్నారు. ఆరు మండలాల్లోనూ తమ బంధువులను ఇన్‌చార్జ్‌లుగా నియమించుకున్నది వాస్తవం కాదా అని ప్రశ్నించారు. వారి చర్యలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహలక్ష్మి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో పత్రికలకు స్వేచ్ఛ ఉంటుందని, దాన్నికూడా హరించాలని చూస్తే ప్రజలు ఒప్పుకోరన్నారు. రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వైవీ శివారెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి కుటుంబం సాగిస్తున్న దందా ప్రజలందరికీ తెలుసన్నారు. గాలి మరల నుంచి రైల్వే టెండర్ల దాకా ప్రతిదాంట్లోనూ దోచుకుంటున్నారన్నారు. నాయకులు కోగటం విజయభాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ రాప్తాడు నియోజకవర్గంలో ఒక ఓటుకు ఐదుగురు మంత్రులు, ఎమ్మెల్యేలయ్యారని ఎద్దేవా చేశారు. మంత్రి సునీత బంధువులు మండలానికో ఇన్చార్జ్ కాదని ఎమ్మెల్యే, మంత్రిలా వ్యవహరిస్తూ దోచుకుంటున్నారని మండిపడ్డారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు తోపుదుర్తి చంద్రశేఖర్‌రెడ్డి, తోపుదుర్తి రాజశేఖర్ రెడ్డి రాప్తాడు జెడ్పీటీసీ వెన్నపూస రవీంద్రరెడ్డి, గౌస్‌బేగ్, మహానందరెడ్డి, ఆలుమూరు శ్రీనివాసరెడ్డి, డాక్టర్ మైనుద్దిన్, పెన్నోబులేసు, తాటిచెర్ల నాగేశ్వరరెడ్డి, విద్యార్థి విభాగం నరేంద్రరెడ్డి, ఎద్దుల రాజేష్, మహిళా విభాగం వాసంతి సాహిత్య, కొండమ్మ, రాధ తదితరులు పాల్గొన్నారు. ఉనికి కోసమే ‘సాక్షి’పై బెదిరింపులు రాప్తాడు నియోజకవర్గంలో నాలుగున్నరేళ్లుగా మంత్రి సునీత కుటుంబం చేస్తున్న దోపిడీపై పత్రికల్లో లెక్కలేనన్ని కథనాలు వచ్చాయి. ఆధారాలతో సహా ‘సాక్షి’లో వచ్చిన కథనాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు జిల్లాలో పర్యటించిన రోజే కథనం రావడంతో పరిటాల కుటుంబం టీడీపీలో ఉనికిని కోల్పోయే పరిస్థితి తలెత్తింది. తమ ప్రతిష్ట దిగజారుతోందనే ఆక్రోషంతో మంత్రి సునీత తన కుమారుడు శ్రీరాం, మరికొందరు గూండాలను ఉసిగొలిపి ‘సాక్షి’ పత్రిక జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నం చేశారు. బహిరంగ సభలో ఆమె తనయుడు మాట్లాడిన తీరు సభ్య సమాజం తలదించుకునేలా ఉంది. సమాజంలో నాలుగో స్తంభమైన మీడియాను పరిరక్షించుకోకపోతే భవిష్యత్తులో నోరెత్తిన ప్రతి ఒక్కరి పరిస్థితి ఆగమ్యగోచరంగా తయారవుతుంది. ఇందుకోసమే ‘సాక్షి’కి అండగా నిలుస్తున్నాం. – తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి, రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త -
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
-
సాక్షి కార్యాలయం ఎదుట పరిటాల శ్రీరామ్ వీరంగం
సాక్షి, అనంతపురం : అనంతపురంలో మంత్రి పరిటాల సునీత వర్గీయులు వీరంగం సృష్టించారు. తమకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారంటూ అనంతపురం కమలానగర్‌లోని సాక్షి ప్రాంతీయ కార్యాలయం ఎదుట మంత్రి పరిటాల వర్గీయులు ధర్నా చేశారు. ఈ ధర్నాకు నేతృత్వం వహించిన మంత్రి సునీత తనయుడు పరిటాల శ్రీరామ్.. సాక్షి మీడియా పై తన అక్కసు వెళ్లగక్కారు. సాక్షి కార్యాలయం వద్ద మంత్రి పరిటాల సునీత వర్గీయుల ధర్నాను వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. నిజాలు నిర్భయంగా తెలియజేసే సాక్షి మీడియాపై అనవసర రాద్ధాంతం చేయటం మంత్రి పరిటాల సునీతకు తగదన్నారు. రాప్తాడు నియోజకవర్గంలో మంత్రి పరిటాల సునీత, ఆమె కుటుంబ సభ్యులు వందల కోట్ల అవినీతికి, అక్రమాలకు పాల్పడ్డారని ధ్వజమెత్తారు. వాటిని ప్రజలకు ఆధారాలతో సహా వివరిస్తున్న సాక్షి మీడియా పై అక్కసు వెళ్లగక్కటం మంత్రి పదవిలో ఉన్న పరిటాల సునీతకు తగదని తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయండి
సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణపై దాడి చేసి గాయపరిచిన రాష్ట్ర మంత్రి పరిటాల సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు చేయకుండా తాత్సారం చేస్తూ వస్తున్న అనంతపురం పోలీసులకు హైకోర్టు ఝలక్ ఇచ్చింది. శ్రీరామ్‌పై కేసు నమోదు చేసి నిష్ఫక్షపాతంగా దర్యాప్తు చేయాలని హైకోర్టు బుధవారం అనంతపురం పోలీసులను ఆదేశించింది. లలితకుమారి కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు సూచించింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు ఈ ఏడాది ఫిబ్రవరి 7న రామగిరి మండలం, నసనకోట గ్రామానికి వచ్చారు. అక్కడి నుంచి పార్టీ కార్యకర్త బోయ లెక్కన్నగారి నారాయణ తదితరులు కలిపి పేరూరు వెళ్లి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమాలు అయిపోయిన తరువాత నారాయణ తన గ్రామానికి తిరిగి వచ్చారు. గ్రామంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను నిర్వహించడంలో నారాయణ చురుగ్గా వ్యవహరిస్తున్నట్లు తెలుసుకున్న పరిటాల శ్రీరాం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు యర్రప్ప, మాదాపురం శంకర్, కె.పరందామ యాదవ్ తదితరులు అతనిపై దాడికి దిగారు. నారాయణ ఇంటికి వెళ్లి అతనిపై మారణాయుధాలతో దాడి చేసి అతన్ని జీపులో వేసుకుని వెంకటాపురానికి తీసుకెళ్లారు. అక్కడ పరిటాల శ్రీరాం తదితరులు నారాయణను తీవ్రంగా కొట్టడంతో అతని భుజం ఎముకలు విరిగాయి. అక్కడి నుంచి రామగిరి పోలీస్‌స్టేషన్‌కు తీసుకెళ్లి నారాయణ నుంచి బలవంతరంగా తెల్లకాగితాలపై సంతకాలు తీసుకున్నారు. అనంతరం ధర్మవరం పోలీస్‌స్టేషన్‌కు, ఆ తరువాత కర్ణాటకలోని తూముకూర్‌కు తీసుకెళ్లి తరువాత తెచ్చి గ్రామంలో విడిచిపెట్టారు. అనంతరం వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి మరికొందరిపై రామగిరి పోలీస్ స్టేషన్లో దాడి, కిడ్నాప్ కేసు నమోదు అయింది. వాస్తవానికి నారాయణ నుంచి తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్న పరిటాల శ్రీరాం తదితరులే వైఎస్సార్సీపీ నేతలపై నారాయణ పేరుతో ఫిర్యాదు ఇచ్చారు. ఇది తెలుసుకున్న నారాయణ రామగిరి పోలీసుల చర్యలను తప్పుబడుతూ పరిటాల శ్రీరాం తదితరులు వ్యవహరించిన తీరును వివరించారు. తాను ఎటువంటి ఫిర్యాదు చేయలేదని చెప్పినా పట్టించుకోకుండా వైఎస్సార్సీపీ నేతలు చంద్రశేఖర్‌రెడ్డి తదితరులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. నారాయణ ఫిర్యాదులను పట్టించుకోని పోలీసులు తనపై దాడి చేశారని పరిటాల శ్రీరాం, ఇతర టీడీపీ నేతలపై నారాయణ లిఖితపూర్వకంగా చేసిన ఫిర్యాదును పోలీసులు నిరాకరించారు. దీంతో నారాయణ పోస్టు ద్వారా తన ఫిర్యాదును జిల్లా ఎస్పీకి పంపారు. అయినా శ్రీరాంపై కేసు నమోదు చేయలేదు. దీంతో నారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డి విచారణ జరిపారు. పిటిషనర్ తరఫు న్యాయవాది పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపించారు. వాదనలు విన్న న్యాయమూర్తి జస్టిస్ రాజశేఖర్‌రెడ్డి ఫిర్యాదుదారు నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పరిటాల శ్రీరాం తదితరులపై కేసు నమోదు చేసి నిష్పాక్షికంగా దర్యాప్తు చేయాలని అనంతపురం పోలీసులను ఆదేశించారు. -
పరిటాల శ్రీరామ్ రైతులపై అనుచిత వ్యాఖ్యలు
-
పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు
సాక్షి, అనంతపురం : తెలుగుదేశం నేత, మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆయన మంగళవారం టీడీపీ ఎంపీల నిరసన దీక్షలో పాల్గొని మాట్లాడుతూ.. ‘అనంతపురం జిల్లాలో రైతులు దీన స్థితి ఎదుర్కొంటున్నారు.. రైతు కుటుంబాలకు చెందిన ఆడపిల్లలు ముంబై వ్యభిచార గృహాలకు వెళ్తున్నారు. రైతుల ఆత్మహత్యలు, వలసలు యథేచ్ఛగా సాగుతున్నాయి’ అంటూ వ్యాఖ్యానించారు. అయితే శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది. రైతులు, రైతు కుటుంబాల గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న సునీత, తన తనయుడి వ్యాఖ్యలపై ఎలా స్పందిస్తారో చూడాలి. ఆ అర్హత శ్రీరామ్‌కు లేదు పరిటాల శ్రీరామ్ వివాదాస్పద వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పందించారు. రైతుల మనోభాలను పరిటాల కుటుంబం దెబ్బతీస్తోందన్నారు. రైతు బిడ్డలు రెడ్ లైట్ ఏరియాలో ఉన్నారంటూ శ్రీరామ్ వ్యాఖ్యానించటం దుర్మార్గమన్నారు. చంద్రబాబు విధానాల వల్లే రైతు ఆత్మహత్యలు జరుగుతున్నాయని ఆరోపించారు. మంత్రి సునీత ప్రాతినిధ్యం వహిస్తున్న రాప్తాడు నియోజకవర్గం నుంచి వేలాది మంది రైతులు, వ్యవసాయ కూలీలు.. కర్నాటక, కేరళ రాష్ట్రాలకు వలస వెళ్లారని తెలిపారు. గత 25 సంవత్సరాలుగా పదవుల్లో ఉంటున్న పరిటాల కుటుంబం ఏం సాధించిందని ప్రశ్నించారు. కరవుపై మాట్లాడే అర్హత పరిటాల శ్రీరామ్‌కు లేదని ఆయన పేర్కొన్నారు. -
‘పరిటాల శ్రీరామ్ కనుసన్నల్లో క్రిమినల్ గ్యాంగ్స్’
సాక్షి, అనంతపురం : మంత్రి పరిటాల సునీత హత్యలు, కిడ్నాప్‌లను ప్రోత్సహిస్తున్నారని వైఎస్సార్ సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. పరిటాల శ్రీరామ్ నేతృత్వంలో 10 క్రిమినల్ గ్యాంగ్స్ ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు. పరిటాల కుటుంబానికి చట్టాలు వర్తించవా? అని ప్రకాష్ రెడ్డి మండిపడ్డారు. పరిటాల వర్గీయులు విచ్చలవిడిగా నేరాలు చేస్తున్నా పోలీసులు ఎందుకు స్పందించడం లేదని ఆయన ప్రశ్నించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్న మంత్రి పరిటాల సునీతను మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రిటైర్డ్ జడ్జి కృష్ణప్ప మాట్లాడుతూ.. టీడీపీ నేతల గూండాగిరికి పోలీసులు వత్తాసు పలకడం సరికాదన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకులపై ఉన్న కేసుల్లో సరైన విచారణ జరగడం లేదని ఆయన పేర్కొన్నారు. వారిపై ఆలస్యంగా ఛార్జిషీట్లు నమోదు చేసి శిక్షలు పడకుండా పోలీసులు సహకరిస్తున్నారని కృష్ణప్ప ధ్వజమెత్తారు. చదవండి : పరిటాల అనుచరుల రౌడీరాజ్యం -
ల్యాండ్‌మైన్ : పరిటాల శ్రీరాం వర్సెస్ ఎమ్మెల్యే సూరి
పరిటాల శ్రీరాం , ఎమ్మెల్యే వరదాపురం సూరి మధ్య వివాదం రాజుకుంది. ఓ భూమి తగాదా వ్యవహారం ఈ రెండు వర్గాలకు ప్రతిష్టాత్మకంగా మారింది. వ్యవహారం ఆ పార్టీ ఉన్నతస్థాయి దృష్టికి చేరినా.. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నట్లు తెలిసింది. రూ.కోట్లతో ముడిపడిన భూమి చుట్టూ తిరుగుతున్న ఈ ‘దందా’లో పైచేయి సాధించడం అటుంచితే.. తేడా వస్తే రెండు వర్గాల మధ్య ‘ల్యాండ్’మైన్ పేలడం తథ్యమనే చర్చ జరుగుతోంది. సాక్షి ప్రతినిధి, అనంతపురం: ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని ఓ బ్రాహ్మణ కుటుంబానికి సంబంధించి 13 ఎకరాల పొలం ఉంది. ప్రస్తుత మార్కెట్లో ఈ భూమి విలువ రూ.7కోట్ల పైమాటే. ఓ ముస్లిం వ్యక్తి ఈ పొలాన్ని కొనుగోలు చేయగా.. అందులో తమకూ హక్కు ఉందని ఇటీవల ముగ్గురు వ్యక్తులు తెర మీదకొచ్చారు. వీరిలో ఒకరు ఎమ్మెల్యే సూరి వర్గీయుడైన వెంకటేష్. ఆ పొలంలో 7 ఎకరాలు తనదనేది ఇతని వాదన. ఈ నేపథ్యంలో వ్యవహారాన్ని పొలం కొనుగోలు చేసిన ముస్లిం వ్యక్తి పరిటాల శ్రీరాం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిసింది. అయితే ‘పంచాయితీ’ తెంచేందుకు పెద్ద మొత్తంలో డబ్బు డిమాండ్ చేసినట్లు సమాచారం. ఆ మేరకు రంగంలోకి దిగిన శ్రీరాం అనుచరులు ‘కొంత మొత్తం ఇస్తాం.. పొలం వదిలెయ్’మని ఒకసారి, స్థలం మరోచోట ఇప్పిస్తామని ఇంకోసారి వెంకటేష్‌తో బెదిరింపులకు పాల్పడినా ఫలితం లేకపోయింది. చివరకు జేసీబీలతో పొలం చదును చేసే ప్రయత్నంలో ఉండగా వెంకటేష్ హైకోర్టును ఆశ్రయించడంతో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సూరి అండ కోరినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న శ్రీరాం వర్గీయులు మరింత రెచ్చిపోయి బెదిరింపులకు పాల్పడినట్లు సమాచారం. కలకలం రేపిన కిడ్నాప్ గత మే 10న పరిటాల శ్రీరాం ఓ కేసు విషయమై ధర్మవరం కోర్టుకు హాజరయ్యాడు. ఆ సమయంలో వెంకటేశ్ వ్యవహారం కూడా శ్రీరాం అనుచరులు చర్చించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత నాలుగు రోజులకే ధర్మవరం ఆర్డీఓ ఆఫీసు ఎదుట వెంకటేశ్‌ను కిడ్నాప్ చేశారు. శ్రీరాం అండతో రామగిరి సర్పంచ్ శ్రీనివాసులు అలియాస్ శీన ఈ కిడ్నాప్ చేసినట్లు తెలిసింది. విషయం ఎమ్మెల్యే సూరి దృష్టికి వెళ్లడంతో ఎస్పీతో మాట్లాడి, వెంకటేశ్‌ను విడుదల చేయించేందుకు చర్యలు తీసుకోవాలని గట్టిగా కోరినట్లు సమాచారం. అదేవిధంగా ఇన్చార్జి మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ముఖ్యమంత్రికి కూడా ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఆ మేరకు పోలీసులు రంగ ప్రవేశం చేయడం.. విషయం ఉన్నత స్థాయిలో చర్చనీయాంశం కావడంతో కిడ్నాప్ చేసి రామగిరికి తీసుకెళ్లిన వెంకటేశ్‌ను అక్కడి పోలీసుస్టేషన్లో అప్పగించినట్లు సమాచారం. ఆ తర్వాత అదే రోజు రాత్రి 11 గంటల సమయంలో ఆయనను వదిలేసినట్లు తెలుస్తోంది. ‘దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి’ ఒకే పార్టీలోని రెండు ముఖ్య వర్గాల మధ్య వ్యవహారం చినికి చినికి గాలివానగా మారుతోంది. సర్దిచెప్పాల్సిన టీడీపీ రాష్ట్రస్థాయి ముఖ్యనేత పోలీసు శాఖ ఉన్నత స్థాయి అధికారితో ఆరా తీసి.. ఒక వర్గానికే కొమ్ము కాస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘కిడ్నాప్ చేసి దందాలకు పాల్పడితే గట్టిగా ఉండాలి. అవసరమైతే అడ్డు తొలగించాలి’ అని చెప్పినట్లు సమాచారం. ఈ ‘ల్యాండ్’మైన్ రెండు వర్గాల మధ్య ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోనని టీడీపీ వర్గీయుల్లో చర్చనీయాంశంగా మారింది. ఈ ‘పంచాయితీ’లో ఎవరి బేరం బెడిసికొట్టినా.. గొడవకు సిద్ధంగా ఉన్న ట్లు సమాచారం. ఇదే సమయంలో ధర్మవరం, రాప్తాడులో ఈ విషయమై ప్రజలతో పాటు రాజకీయ, వ్యాపార వర్గాల్లో భయాందోళన వ్యక్తమవుతోంది. -
సారు పెళ్లికొస్తారు.. కేంద్రాలు తెరిచి ఉంచండి
అనంతపురం టౌన్ : శనివారం దసరా పండుగ.. ఆదివారం సెలవు.. అదే రోజు మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరాం పెళ్లి. ఈ వివాహానికి ప్రముఖులు విచ్చేయనున్నారు. ప్రభుత్వ సెక్రటరీ సునీత, కమిషనర్ అరుణ్‌కుమార్ ఒక రోజు ముందుగానే (30వ తేదీ) అనంతకు విచ్చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారు అంగన్వాడీలను తనిఖీ చేస్తారని అందువల్ల సెలవు రోజుల్లోనూ కొన్ని అంగన్వాడీ సెంటర్లను తెరిచే ఉంచాలని ఐసీడీఎస్ పీడీ వెంకటేశం మౌఖికంగా ఆదేశాలు జారీ చేశారు. ఈ విషయం గురువారం ఆ శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఉన్నతాధికారులు మంత్రి కుమారుడి పెళ్లి వస్తే...తాము పండుగరోజున కూడా పనిచేయాలా..? అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నారు. ఒకవేళతాము పనిచేసినా సెలవు రోజుల్లో సెంటర్లకు పిల్లలను ఎలా పిలుచుకురావాలని ప్రశ్నిస్తున్నారు. అసలు ఏ సెంటర్లను వారు తనిఖీ చేస్తారో కూడా తెలియని నేపథ్యంలో అందరూ సెంటర్లలోనే ఉండాలా? లేదా? అన్న సంశయంలో పడ్డారు. ఈ విషయమై ఐసీడీఎస్ పీడీ వెంకటేశంను ‘సాక్షి’ సంప్రదించగా.. ‘30వ తేదీన ఉన్నతాధికారులు వస్తున్నారని సమాచారం ఉంది. ఇదే సమయంలో శిశుగృహ, సేవాసదనాలు పరిశీలించవచ్చు. అన్ని ప్రాజెక్టుల అధికారులు సెంటర్లు నడపాలని చెప్పలేదు. పెనుకొండ, చెన్నేకొత్తపల్లి ప్రాజెక్టుల పరిధిలోని సెంటర్లను పరిశీలించవచ్చు. అది కూడా హెడ్‌క్వార్టర్స్‌లో ఉన్నవి మాత్రమే. పిల్లలు తప్పకుండా ఉండాలనేమీ లేదు. భవనాలు, అక్కడి వసతులపై ఆరా తీసే అవకాశం ఉంది. ఇదంతా ముందు జాగ్రత్తగా చెప్పినదే’ అని తెలిపారు. -
పరిటాల శ్రీరామ్ పెళ్లి పనుల్లో అపశ్రుతి
సాక్షి, హైదరాబాద్ : ఏపీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ వివాహ పనుల్లో అపశ్రుతి చోటు చేసుకుంది. పరిటాల శ్రీరామ్ పెళ్లి పనులు నిమిత్తం వెళుతున్న ఓ బృందం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ దుర్ఘటనలో ఇద్దరు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు. పెళ్లికి సంబంధించిన డెకరేషన్ సామగ్రిని డీసీఎం వ్యాన్‌లో హైదరాబాద్ నుంచి అనంతపురం తరలిస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. బాలానగర్ శివారులోని పెద్దాయపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై వ్యాన్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, డ్రైవర్, క్లీనర్‌తో పాటు ముగ్గురు గాయపడ్డారు. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. డ్రైవర్ నిద్ర మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. కాగా పరిటాల శ్రీరామ్ వివాహం వచ్చేనెల (అక్టోబర్) 1వ తేదీన జరగనుంది. అనంతపురం జిల్లాకు చెందిన జ్ఞానవితో గత నెల 10వ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. -
అనంతపురం జిల్లా టీడీపీలో వర్గపోరు
-
అధికార అండ.. దౌర్జన్యకాండ
టీడీపీ వర్గీయుల తీరుతో జిల్లాలో భయానక వాతావరణం అధికార పార్టీ నేతల అనుచరులుగా గ్యాంగ్స్టర్లు, దౌర్జన్యపరులు గ్యాంగ్‌స్టర్ మధు వ్యవహారంలో మంత్రి పల్లెపై విమర్శలు పరిటాల అనుచరుడిగా నగేశ్ అరాచకం అతని దాషీ్టకాలను చూపినందుకు సిటీకేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాల నిలిపివేత అరాచక శక్తులపై పోలీసుల ఉదాసీనత : సీపీఐ జగదీశ్ అవినీతి, అరాచకాలతో అధికార పార్టీ నేతలు పేట్రేగిపోతున్నారు. భూదందాలు చేస్తూ ఇటీవల మంత్రి పల్లె రఘునాథరెడ్డి అనుచరుడు మధు తెరపైకి వచ్చిన ఘటన మరవకముందే, మరో మంత్రి పరిటాల సునీత అనుచరుడు నగేశ్ చౌదరి ఆగడాలు చర్చనీయాంశంగా మారాయి. అతను పోలీసుల సమక్షంలోనే ఓ యువకుణ్ని చితకబాది, ఆ దృశ్యాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడం కలకలం సృష్టిస్తోంది. శాంతిభద్రతల పరిరక్షణ విషయంలో ప్రభుత్వం, అందులో భాగస్వాములైన మంత్రులు అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సి ఉంటుంది. కానీ వారి అనుచరులమంటూ అసాంఘిక శక్తులు అరాచకాలు సృష్టిస్తున్నా పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పైగా వీటిని ఎత్తిచూపుతున్న మీడియా గొంతును కూడా నొక్కేలా వ్యవహరిస్తున్నారు. శ్రుతిమించిన నగేశ్ చౌదరి వ్యవహారం నగేశ్‌ది బత్తపల్లి మండలం పత్యాపురం గ్రామం. పరిటాల శ్రీరామ్‌కు గతంలో కారు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. తర్వాత శ్రీరామ్‌కు ముఖ్య అనచరుడిగా ఉంటూ, అతని పేరుతో దందాలు చేస్తున్నాడనే విమర్శలున్నాయి. నగేశ్ చౌదరి బర్త్‌డేకు సునీత ఇద్దరు కుమారులు శ్రీరామ్, సిద్దార్థ Ðð ళ్లడంతో ప్రజలు కూడా అతనికి పరిటాల అండదండలు పుష్కలంగా ఉన్నట్లు నమ్ముతున్నారు. నగేశ్‌కు ఈ నెల 16న కుందుర్పి మండలం శీగలపల్లికి చెందిన ఓ యువతితో వివాహం నిశ్చయమైంది. పెళ్లిపత్రికల్లో కూడా పరిటాల రవీంద్ర, శ్రీరామ్ దివ్య ఆశీస్సులతో అని ముద్రించుకున్నాడు. అందులో పరిటాల రవి, సునీత, శ్రీరామ్ ఫొటోలను కూడా వేయించాడు. వివాహానికి నసనకోట ఆలయంలో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అలాగే రామగిరి సర్వే నంబర్ 476లో నగేశ్‌కు ప్రభుత్వం ఇంటిస్థలం కేటాయించింది. సునీత సిఫారసుతోనే అధికారులు ఇంటిస్థలం ఇచ్చినట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలన్నీ నగేశ్ పరిటాల వర్గీయుడనే విషయాన్ని స్పష్టీకరిస్తున్నాయి. బోయ ఓబులేసుపై భౌతికదాడి తనకు కాబోయే భార్య విషయంలో బోయ ఓబులేసుపై కక్షపెంచుకున్న నగేశ్ ఇటీవల అనంతపురం సమీపంలోని పండమేర వంకలోకి అతన్ని తీసుకెళ్లి చావబాదాడు. అతన్ని కొడుతూ ‘వీడ్ని వెంటనే వెంకటాపురం తీసుకుపోవాలి’ అని ఓ వ్యక్తితో ఫోన్లో అన్నాడు. ఘటనాlస్థలికి పోలీసులు కూడా వెళ్లారు. తీవ్ర రక్తస్రావంతో ఓబులేసు చావుకేకలు పెడుతున్నా వారు పట్టించుకోలేదు. ఇదే సమయంలో శ్రీరామ్ సమీప బంధువు రాజన్నకు నగేశ్ ఫోన్‌చేసి.. పోలీసులతో మాట్లాడమని ఇచ్చారు. వారు అతనితో మాట్లాడారు. కానీ దాడిని మాత్రం నివారించలేదు. ఈ ఘటనపై సామాజిక హక్కుల వేదిక నేతలు తీవ్రంగా స్పందించారు. ధర్మవరం మండలం, ఘంటాపురం గ్రామానికి చెందిన నాగప్పను అధికార పార్టీకి చెందిన వారు కిడ్నాప్ చేసి రూ.11 లక్షల అప్పు ఉన్నట్లు బాండ్లు రాయించుకున్నారని, దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని వేదిక అధ్యక్షుడు, సీపీఐ జిల్లా కార్యదర్శి జగదీశ్ ఆరోపించారు. ఇప్పుడు అణగారిన వర్గానికి చెందిన బోయ ఓబులేసుపై దాడికి దిగడం చూస్తే భవిష్యత్తు పరిణామాలు ఆందోళనకరంగా ఉండబోతున్నాయన్నారు. ‘సాక్షి’ ప్రసారాలు నిలిపివేత బోయ ఓబులేసును నగేశ్చౌదరి చితకబాదడంపై ‘సాక్షి’లో వార్తలు ప్రసారం కావడం, నగేశ్ బర్త్‌డేకు సునీత ఇద్దరు కుమారులు హాజరైన చిత్రాలనూ చూపించడంతో పరిటాల వర్గం ఆత్మరక్షణలో పడింది. అలాగే సిటీకేబుల్‌లో ‘సాక్షి’ ప్రసారాలను ఆదివారం రాత్రి నుంచి నిలిపేశారు. ప్రజాజీవితంలో ఉన్న వారిపై ఆరోపణలు వస్తే వివరణ ఇవ్వాలి కానీ.. మీడియా గొంతు నొక్కేలా ప్రసారాలు ఆపేయడం సరికాదని ప్రజలు, వివిధ సంఘాల ప్రతినిధులు ఖండిస్తున్నారు. -
రాప్తాడులో పరిటాల వర్గీయుల దాష్టీకం
-
రాప్తాడులో పరిటాల వర్గీయుల దాష్టీకం
అనంతపురం: రాప్తాడులో మంత్రి పరిటాల సునీత వర్గీయులు రెచ్చిపోయారు. బోయ ఓబులేష్ అనే వ్యక్తిపై కిరాతకంగా దాడికి దిగారు. పరిటాల శ్రీరామ్ డ్రైవర్ నగేష్ చౌదరికి కాబోయే భార్యను వేధించాడని ఆరోపిస్తూ పరిటాల అనుచరులు ఓబులేష్ ని చుట్టుముట్టి చిత్రహింసలు పెట్టారు. పోలీసులు, స్థానికుల సమక్షంలోనే ఈ దాడి జరిగినా అందరూ మౌనం వహించారు తప్ప ఆపడానికి ప్రయత్నించలేదు. పోలీసులు నన్నేమీ చేయలేరంటూ, వెంకటాపురం తీసుకుపోతే నీకు బుద్ది వస్తుంది అని నగేష్ చౌదరి వ్యాఖ్యానించాడు. మంత్రి సునీత ఒత్తిడితో నామమాత్రంగా నగేష్ చౌదరిపై కేసు నమోదు చేశారు. రాప్తాడు సమీపంలోని ముళ్ల పొదల్లో ఈ సంఘటన చోటు చేసుకున్నట్టు సమాచారం. మరోవైపు ఆటవిక న్యాయం పై పరిటాల సునీత స్పందించారు. ఇలాంటి దౌర్జన్యాలను తాను ఎలాంటి సందర్భాల్లోనూ ప్రోత్సహించనని స్పష్టం చేశారు. నగేష్ చౌదరి తన అనుచరుడు కాదని తెలిపారు. నగేష్ చౌదరిని ఏడాది నుంచి తమకు దూరంగా ఉంచుతున్నామన్నారు. తన కొడుకు పరిటాల శ్రీరామ్‌కు నగేష్ చౌదరి డ్రైవర్ కాదని చెప్పారు. -
ఇదెక్కడి సోకు.!
పన్నుల రూపంలో ప్రజల నుంచి సేకరించిన సొమ్మునే... అభివద్ధి పనులకు నిధుల పేరుతో ప్రభుత్వాలు తిప్పుతున్నాయి. ఈ విషయాన్ని కప్పిపుచ్చుతూ తమ వల్లనే ఆ అభివద్ధి జరిగిందంటూ గొప్పలు పోతున్నారు టీడీపీ ప్రజాప్రతినిధులు. ఇటీవల రాప్తాడు నియోజకవర్గంలోని మూడు మండలాల్లో కొత్తగా నిర్మించిన బస్షెల్టర్లు ఇందుకు అద్దం పడుతున్నాయి. రాప్తాడు నియోజకవర్గంలోని కనగానపల్లి, చెన్నేకొత్తపల్లి, రామగిరి మండలాల్లో ఇటీవల కొత్తగా బస్సు షెల్టర్లను ప్రారంభించారు. చెన్నేకొత్తపల్లిలో నిర్మించిన ప్రాంగణానికి రూ. 9లక్షలు (ఎంపీ కోటా, ఎస్డీఎఫ్ నిధులు), రామగిరి మండలంలోని నసనకోట, వెంకటాపురం గ్రామాల్లో, కనగానపల్లిలో నిర్మించిన ప్రాంగణాలకు రూ. 4 లక్షలు చొప్పున ఖర్చు చేశారు. వీటి నిర్మాణాలకు స్థానిక ప్రజాప్రతినిధులు గాని, దాతలు గాని ఎలాంటి విరాళాలు ఇవ్వలేదు. ప్రజాధనంతో నిర్మితమైన ఈ ప్రాంగణాలకు మంత్రి సునీత కుటుంబసభ్యులు తమ సొంత డబ్బుతో నిర్మించి ఇచ్చినట్లుగా పరిటాల రవి జ్ఞాపకార్థం అంటూ బోర్డు ఏర్పాటు చేయడాన్ని ప్రజలు వింతగా చూస్తున్నారు. సొమ్ము ఒకరిదైతే... సోకు ఇంకొకరిదంటే ఇదేనేమో అంటూ ఎద్దేవా చేస్తున్నారు.