సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు.
ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్‌సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment