raptadu
-
సీబీఐ విచారణకు సిద్ధమా?.. పరిటాల శ్రీరామ్‌కు తోపుదుర్తి సవాల్
అనంతపురం, సాక్షి: మహేష్ రెడ్డి అనే యువకుడి మృతి కేసులో తనపై వస్తున్న రాజకీయపరమైన ఆరోపణలను రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఖండించారు. టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారాయన. సోమవారం ఉదయం ఆయన ఈ అంశంపై మీడియాతో మాట్లాడారు. ‘‘తోపుదుర్తి గ్రామానికి చెందిన మహేష్ రెడ్డి వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నారు. మృతుడికి ఆర్థిక ఇబ్బందులు, ప్రేమ వ్యవహారాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి వాట్సాప్ స్టాటస్ లో లవ్ ఫెయిల్యూర్ కు సంబంధించిన మేసేజ్ లు ఉన్నాయి. అలాంటిది మా అన్నదమ్ముల పాత్ర ఉందంటూ పరిటాల శ్రీరామ్ చెప్పడం సరికాదు. ఈ కేసులో టీడీపీ నేత పరిటాల శ్రీరామ్ ఆరోపణలు బాధ్యతారాహిత్యం. మహేష్ రెడ్డి మృతికి మేము కారణమని ఆరోపించటం సరికాదు. తోపుదుర్తి మహేష్ రెడ్డి ఆత్మహత్య పై సీబీఐ విచారణ కు సిద్ధం.. మీరు సిద్ధమా?’’ అని శ్రీరామ్‌కు సవాల్ ప్రకాష్ రెడ్డి విసిరారు. మహేష్ రెడ్డి కి పరిటాల శ్రీరామ్ తో సత్సంబంధాలు ఉన్నాయి. మహేష్ రెడ్డి ని పరిటాల శ్రీరామ్ వాడుకుని వదిలేశారు అని ప్రకాష్ రెడ్డి సంచలన ఆరోపణ చేశారు. ఆత్మకూరు మండలం తోపుదుర్తి గ్రామానికి చెందిన తోపుదుర్తి మహేష్ రెడ్డి.. సోమలదొడ్డినాగిరెడ్డిపల్లి మార్గంలో ఉన్న రైల్వే పట్టాలపై శవమై కనిపించాడు. అయితే అతని మరణం వెనుక చాలా అనుమానాలు ఉన్నాయని, ప్రకాష్ రెడ్డి, ఆయన సోదరుడు రాజారెడ్డిల ప్రమేయం ఉందంటూ ధర్మవరం నియోజకవర్గ టిడిపి ఇన్చార్జ్ పరిటాల శ్రీరామ్ ఆరోపించారు. -
శ్రీ సత్యసాయి జిల్లా నసనకోటలో టీడీపీ నేతల దుర్మార్గం
-
జగన్ సీఎం అయితే..లక్ష్మీదేవి ఇంటికి నడిచొస్తది
-
అనంతపురం జిల్లా రాప్తాడులో చంద్రబాబు సభకు జనం కరువు
-
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. కాగా, కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అనువుగాని హామీలు వందల్లోనే గుప్పించారు. ఈ మాటలు వివీ వినీ జనం అక్కడనుంచి మెల్లగా జారుకోవడం కనిపించింది. ఆయన పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి.. అంటున్నా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో వైపు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభలకు లభించిన విశేష స్పందన, సభలకు హాజరైన అశేష జనవాహినిని పత్రికలు, టీవీలలో చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుంది. ‘మేమంతా సిద్ధం’ సీఎం జగన్ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు -
రాప్తాడులో రాజసం చూపించిన జగన్
-
నిరూపిస్తే రాసిస్తా.. చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి సవాల్
సాక్షి, అనంతపురం: తనకు రూ.500 కోట్ల ఆస్తులున్నట్లు నిరూపిస్తే మీకే రాసిస్తానంటూ చంద్రబాబుకు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి సవాల్ విసిరారు. ‘‘మీరు ఎక్కడ సంతకం చేయమంటే అక్కడ సంతకం చేస్తా.. నాకు ఉన్నాయని చెప్తున్న 500 కోట్లు మీరే రాప్తాడు నియోజకవర్గం ప్రజలకు పంచండి’’ అని చెప్పారు. చంద్రబాబు చెప్పేవన్నీ అబద్ధాలేనంటూ తోపుదుర్తి మండిపడ్డారు. ‘‘రాప్తాడు టీడీపీ నేత, మాజీ మంత్రి పరిటాల సునీత అవినీతి చంద్రబాబుకు కనిపించలేదా?. పరిటాల కుటుంబీకుల అక్రమాస్తులపై చంద్రబాబు ఎందుకు మాట్లాడరు?. చంద్రబాబు దిగజారి ఆరోపణలు చేస్తున్నారు. కియా ఫ్యాక్టరీ చంద్రబాబు వల్ల రాలేదు. వైఎస్సార్, నరేంద్ర మోదీ కృషి ఫలితంగా కియా ఫ్యాక్టరీ ఏర్పడింది. హంద్రీనీవా ప్రాజెక్టులో భాగంగా గొల్లపల్లి రిజర్వాయర్ నిర్మించిన ఘనత వైఎస్సార్‌దే. పెనుకొండ ప్రాంతంలో వైఎస్సార్ నీటి వసతి కల్పించారు కనుకే కియా ఫ్యాక్టరీ వచ్చింది’’ అని తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి అన్నారు. ఇదీ చదవండి: ఆ కాన్ఫిడెన్స్ లెవెల్స్.. కేడర్‌కు గూస్ బంప్స్ -
మీ స్వార్థానికి జర్నలిస్టులను బలి చేస్తారా?
అనంతపురం ఎడ్యుకేషన్: చంద్రబాబు, లోకేశ్, ఈనాడు రామోజీరావు, ఏబీఎన్ రాధాకృష్ణ, టీవీ–5 సాంబ స్వార్థాలకు జర్నలిస్టులను బలి చేస్తున్నారని రాప్తాడు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం పత్రికా స్వేచ్ఛను హరిస్తోందని, విలేకరులపై దాడులకు తెగబడుతోందంటూ ఈనాడులో వచ్చిన కథనాన్ని ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో ఖండించారు. అనంతపురంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈనాడు, ఏబీఎన్, టీవీ–5 మీడియాను వైఎస్సార్సీపీ బ్యాన్‌చేసి ప్రెస్మీట్లు, మీటింగ్‌లకు రావద్దని స్పష్టంచేసినప్పటికీ ఏకంగా 10 లక్షల మంది వైఎస్సార్సీపీ శ్రేణులు, అభిమానులు వచ్చిన రాప్తాడు ‘సిద్ధం’ సభకు ఏబీఎన్ లోగో పట్టుకుని శ్రీకృష్ణ అనే ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ ఎందుకొచ్చారని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ఆయనను ఎవరు పంపించారు? దాడి జరుగుతుంటే మరో ఏబీఎన్ ఉద్యోగి అక్కడి నుంచి జారుకోవడం వెనుక ఆంతర్యమేమిటని ప్రశ్నించారు. అలాగే, ఓవైపు దాడి జరుగుతుంటే రక్షించే ప్రయత్నం చేయకుండా వీడియోలు తీయడం వెనుక ఉద్దేశమేమిటో కూడా పోలీసులు వెలికితీయాలన్నారు. నిజానికి.. ప్రభుత్వంపై ఎంత దుర్మార్గంగా, వాస్తవాలను వక్రీకరించి కథనాలు రాస్తున్నా రాష్ట్రంలో ఎక్కడా దాడులు జరగలేదని.. ఈ సభకు ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ లోగో పట్టుకుని వెళ్లడం చూస్తుంటే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. దాడులకు వారే బాధ్యత వహించాలి.. ఇక రాప్తాడులో ఏబీఎన్ ఫొటోగ్రాఫర్‌పై, కర్నూలు ఈనాడు కార్యాలయంపై దాడి జరిగినా అందుకు పూర్తిబాధ్యత వహించాల్సింది చంద్రబాబు, లోకేశ్, ఏబీఎన్ రాధాకృష్ణ, ఈనాడు రామోజీరావు, టీవీ–5 సాంబ మాత్రమేనని తోపుదుర్తి స్పష్టంచేశారు. గతంలో పవన్‌కళ్యాణ్, మోదీని కూడా చాలా దుర్మార్గంగా మాట్లాడారని ప్రకాష్‌రెడ్డి గుర్తుచేశారు. వైఎస్సార్సీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు ప్రజాస్వామ్యవాదులని, చాలా సహనం, ఓర్పు కల్గిన వాళ్లని ఆయనన్నారు. తప్పుడు కథనాలు రాస్తూ ప్రభుత్వాన్ని గద్దె దించుతామని భావిస్తే అది వారి అమాయకత్వమే అవుతుందన్నారు. -
ప్రతిపక్షాలను సీఎం జగన్ ర్యాంప్ ఆడిస్తున్నాడు
-
రాప్తాడు సిద్ధం సభ ఒక ప్రభంజనం: వైఎస్సార్సీపీ నేతలు
-
టీడీపీ తప్పుడు రాతలపై జర్నలిస్ట్ స్వప్న విశ్లేషణ
-
ఈల వేశారు జనం! వెల్లివిరిసింది జ(గ)నం!
అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన ముఖ్యమంత్రి జగన్ YSRCP సిద్ధం సభ కొత్త ఊపు తీసుకొచ్చింది. విశ్వసనీయతకు, వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునివ్వడం, ముఖ్యమంత్రి స్పీచ్ కోసం లక్షలాది మంది తరలి రావడం పట్ల చాలా మంది చాలా రకాలుగా స్పందిస్తున్నారు. ఖాళీ అయ్యింది బంగాళా ఖాతపు జల సంద్రం రాయల సీమలో మోహరించింది జన సముద్రం ఈల వేశారు జనం వెల్లివిరిసింది జ(గ)నం అదొక జగన ఘన ప్రభంజనం, ఆడబిడ్డలకు అన్న అంజనం జగనన్న కలిగించాడు ఎంతో ప్రమోదం ప్రజలందరికీ అన్న సర్వ ఆమోదం - డాక్టర్ రాం కేసరి, అమెరికా సభలో సీఎం జగన్ ఏమన్నారంటే.. జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి -
గూస్బంప్స్ వచ్చేలా సీఎం వైఎస్ జగన్ రాప్తాడు సిద్ధం మీటింగ్
-
జగన్ మామ.. జగన్ మామ పాటకు.. పరవశించిన రాప్తాడు సభ
-
రాప్తాడు సీఎం జగన్ సిద్దం హైలైట్స్ విజువల్స్
-
వెళ్తూ...వెళ్తూ సీఎం జగన్ చేసిన పనికి దండం పెట్టాల్సిందే
-
మంచి పాలనకు మళ్లీ ‘సిద్ధం’
జిల్లాల విభజన తర్వాత రాయలసీమకు జల సముద్రం వస్తే ఈరోజు రాప్తాడుకు జన సముద్రం తరలి వచ్చింది. ఈ జన సముద్రానికి, రాయలసీమ గడ్డకు, ప్రతి సీమ బిడ్డకూ మీ జగన్ నిండు మనసుతో గుండెల నిండా ప్రేమతో అభివాదం చేస్తున్నాడు. ఈ ఎన్నికల్లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది. ఇవి కేవలం ఎమ్మెల్యేలను, ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు మాత్రమే కావు. పెత్తందార్లకు – పేదలకు మధ్య సంగ్రామం. మన పథకాలతో కోట్లాది మంది గుండె తలుపుతట్టాం. ఈ మంచి కొనసాగాలన్నా, భవిష్యత్‌లో ఇంకా మంచి పనులు జరగాలన్నా మనం మళ్లీ గెలవాలి. పొరపాటు జరిగితే చంద్రముఖి మన ఇంట్లోకి గ్లాసు పట్టుకొని సైకిల్‌పై వస్తుంది. పేదల రక్తం తాగేస్తుంది. – ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సాక్షి ప్రతినిధి, అనంతపురం: విశ్వసనీయతకు–వంచనకు మధ్య జరగబోతున్న ఎన్నికల యుద్ధంలో పేదవాడి భవిష్యత్ కోసం వారి తరఫున నిలబడటానికి మీరంతా సిద్ధంగా ఉండాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ యుద్ధం.. వేరే రాష్ట్రంలో ఉంటూ మోసం చేసేందుకు అప్పుడప్పుడూ మన రాష్ట్రానికి వచ్చిపోతున్న నాన్ రెసిడెంట్స్ ఆంధ్రాస్కు, ఈ గడ్డమీదే పుట్టి ఇక్కడే ఇల్లు కట్టుకుని ప్రజల మధ్యే ఉన్న మనకూ మధ్య జరగబోతోందన్నారు. మనందరి ప్రభుత్వం 57 నెలలుగా అందిస్తున్న సంక్షేమం, అభివృద్ధిని అడ్డుకుంటూ వాటిని రద్దు చేయడమే లక్ష్యంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం అనంతపురం జిల్లా రాప్తాడులో నిర్వహించిన ‘సిద్ధం’ సభకు హాజరైన అశేష జనవాహినిని ఉద్దేశించి సీఎం జగన్ మాట్లాడారు. బాబు మార్కు ఎక్కడైనా ఉందా? ఈ వేదిక నుంచి చంద్రబాబుకు ఒక సవాల్ విసురుతున్నా. మీరు 14 ఏళ్లు పరిపాలన చేశారు. మూడుసార్లు ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నారు. కానీ మీ పేరు చెబితే రైతులకు గుర్తుకొచ్చే ఒక్కటైనా పథకం ఉందా? మీ పేరు చెబితే అక్కచెల్లెమ్మలకు గుర్తుకొచ్చే పథకం కనీసం ఒక్కటంటే ఒక్కటైనా ఉందా? మీ పేరు చెబితే విద్యార్థులకు గుర్తొచ్చే పథకం ఏదైనా ఉందా? మీ పేరు చెబితే కనీసం అవ్వాతాతలకైనా కూడా మమ్మల్ని బాగా చూసుకున్నాడు.. మా పెన్షన్ మా ఇంటికే పంపాడనే పరిస్థితి ఏనాడైనా ఉందా? చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండగా ఫలానా మంచి చేశాడని చెప్పుకునేందుకు ఒక్కటంటే ఒక్క పథకం కూడా గుర్తుకురాదు. చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్క గ్రామంలోనైనా ఏర్పాటు చేసిన పరిపాలన వ్యవస్థ ఒక్కటైనా కనిపిస్తుందా? బాగుపడిన స్కూళ్లు, ఆస్పత్రులు ఏ గ్రామంలోనైనా ఉన్నాయా? కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలోనైనా సరే మీ మార్క్ ఉందా చంద్రబాబూ? పథకాలను పక్కనపెడితే చంద్రబాబు పేరు చెబితే సామాజిక న్యాయం ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా? మేనిఫెస్టోకు రంగులు పూసి ప్రతి సామాజికవర్గాన్ని మోసం చేయడం చంద్రబాబుకు ఆనవాయితీ. ఏనాడైనా కనీసం 10శాతం వాగ్దానాలను అమలు చేశారా? బంగారు కడియం ఇస్తానంటూ ఊబిలోకి దింపి మనుషుల్ని తిన్న పులి మాదిరిగా మరోసారి ఎర వేస్తున్నాడు. అబద్ధాలు చెప్పేటప్పుడు భావ దారిద్య్రం ఎందుకన్నది బాబు నైజం. నమ్మినవాడు మునుగుతాడు.. నమ్మించినవాడు దోచుకోగలుగుతాడన్నది ఆయన సిద్ధాంతం. చంద్రబాబు వాగ్దానాలన్నీ మోసాలేనని ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. బాబు మోసాల్ని భరించలేకే కదా ఐదేళ్ల క్రితం అన్ని సామాజికవర్గాలు, అన్ని ప్రాంతాల ప్రజలంతా చొక్కా మడతేసి కుర్చీని లాగేసి చీపుర్లతో ఊడ్చి ఆయన పార్టీని శాసనసభలో 102 నుంచి 23కు తగ్గించారు. అదే పని మరోసారి చేయడానికి, చొక్కాలు మడత వేయడానికి మీరంతా సిద్ధంగా ఉండాలి. లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లు మన ప్రభుత్వ హయాంలో పథకాలు అందుకున్న ప్రతి కుటుంబం మనకు స్టార్ క్యాంపెయినర్‌గా బయటకు రావాలి. వైఎస్సార్ సీపీలో ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడు, వలంటీర్లు ఇంటింటికీ వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటేయాల్సిన అవసరాన్ని చెప్పాలి. మనం చేసినవి తెలియజేస్తూ వాటి కొనసాగింపు ఎంత అవసరమో ప్రతి ఇంటికీ వివరించాలి. ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా గ్రామాల్లో రైతన్నను చేయి పట్టుకుని నడిపించే ఆర్బీకే వ్యవస్థను తెచ్చి తోడుగా నిలిచాం. సాగుకు పగటిపూటే 9 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చాం. ఏ సీజన్లో నష్టం జరిగితే ఆ సీజన్ ముగిసేలోగానే రైతన్నకు ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వటం మొదలు పెట్టింది మీ బిడ్డ ప్రభుత్వమే. ఉచిత పంటల బీమా ఇస్తున్నది కూడా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే. ఈ పథకాలన్నీ కొనసాగాలన్నా, బాబు మార్క్ దళారీ వ్యవస్థ మళ్లీ రాకూడదన్నా ప్రతి రైతన్న మన స్టార్ క్యాంపెయినర్‌గా ముందుకొచ్చి ఇంకో వంద మందికి చెప్పాల్సిన అవసరం ఉంది. విందు భోజనం, బిర్యానీ పెడతానంటూ ఆశ చూపించి చంద్రబాబు ఇప్పుడు మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెను లాక్కోవడానికి అడుగులు వేస్తున్నాడు. గతంలో ఇదే పెద్దమనిషి రూ.87,612 కోట్ల రుణ మాఫీని ఓ మోసంలా ఎలా మార్చాడో ప్రతి రైతన్నకూ గుర్తుచేయాలి. అమ్మ ఒడి, ఆసరా, సున్నా వడ్డీ, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, 31 లక్షల ఇళ్లపట్టాలు, 22 లక్షల ఇళ్ల నిర్మాణం, దిశ యాప్, మహిళా పోలీస్.. ఇవన్నీ గతంలో ఎప్పుడూ జరగని విధంగా మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే జరుగుతున్నాయి. ఇవన్నీ ప్రతి అక్కచెల్లెమ్మకు కొనసాగాలంటే జగనన్న ప్రభుత్వానికి అండగా ఉండాలని, ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని, మరో వంద మందితో ఓటు వేయించాల్సిన బాధ్యత ఉందని మీరంతా చెప్పాలి. ఏ గ్రామానికైనా వెళదాం.. ఇవాళ రాష్ట్రంలోని ఏ గ్రామానికి వెళ్లి నిల్చున్నా ఓ విలేజ్ సెక్రటేరియట్ కనిపిస్తుంది. పది మంది శాశ్వత ఉద్యోగులు కనిపిస్తారు. నాలుగడుగులు ముందుకేస్తే ఆర్బీకే కనిపిస్తుంది. మరో నాలుగు అడుగులు వేస్తే విలేజ్ క్లినిక్, కడుతున్న డిజిటల్ లైబ్రరీలు కనిపిస్తాయి. నాడు–నేడుతో రూపురేఖలు మారిన బడులు, హాస్పిటల్స్ కనిపిస్తాయి. ప్రతి 50–60 ఇళ్లకు చేయి పట్టుకొని నడిపించే మంచి వలంటీర్ వ్యవస్థ ఉంది. ఇవన్నీ ఈ 57 నెలల కాలంలోనే జరిగాయి. కుప్పం నుంచి ఇచ్ఛాపురం వరకు ఏ గ్రామంలో ఆగి చూసినా, ఏ సామాజికవర్గాన్ని పలుకరించినా మీ జగన్ చేసిన అభివృద్ధి కనిపిస్తుంది. ప్రజలు మనను మొదటిసారి ఆశీర్వదిస్తేనే దేవుడి దయతో ఇంత మంచి చేయగలిగాం. సెకండ్ టైమ్, థర్డ్ టైమ్, ఫోర్త్ టైమ్ ఆశీర్వదిస్తే ఇక ఎంత మంచి జరుగుతుందో ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ‘నా’ వాళ్లకు గరిష్టంగా లబ్ధి అణగారిన వర్గాలను ఆప్యాయంగా అక్కున చేర్చుకుని నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలంటూ చరిత్రలో చూడని విధంగా నామినేషన్ పనులు, కాంట్రాక్టుల్లో 50 శాతం చట్టం చేసి మరీ ఇస్తున్నది ఎవరంటే మీ జగన్ అని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. మీ జగన్ బటన్ నొక్కి నేరుగా ఖాతాల్లో జమ చేసిన రూ.2.55 లక్షల కోట్లలో 75 శాతం ‘నా..’ అని ఆప్యాయంగా పిలుచుకునే వర్గాలకే ఇచ్చాడు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 4 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలుంటే ఈ 57 నెలల పాలనలోనే ఏకంగా 2.13 లక్షల ఉద్యోగాలు కొత్తగా ఇచ్చాం. ఆ ఉద్యోగాల్లో 80 శాతం నా ఎస్సీలు, నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీలు, నా నిరుపేద వర్గాలకే దక్కాయి. ఇంతటి సామాజిక న్యాయం మీ బిడ్డ ముఖ్యమంత్రి అయిన తర్వాతే కనిపిస్తోంది. 35 లక్షల ఎకరాలపై అనుభవదారులు, గిరిజనులు, రైతన్నలు, నిరుపేదలకు సర్వహక్కులు ఇచ్చింది ఎవరంటే మీ జగనే. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు రాజ్యాధికారంలో సింహభాగం వాటా దక్కింది మీ జగన్ వచ్చాకే. చంద్రబాబుకు ఓటేయడం అంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటేయడమే. డీబీటీకి వ్యతిరేకంగా ఓటు వేయడమే. ఈ విషయాన్ని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పాలి. మీరంతా గతంలో చంద్రబాబు పాలన చూశారు. ఇంకా చాలామంది పరిపాలన చూశారు. కానీ మేనిఫెస్టోను 99శాతం అమలు చేసిన తర్వాతే ఎన్నికలకు వెళ్తున్నది మీ జగన్ మాత్రమే. మొదటి చాన్స్ ఇస్తేనే మీ జగన్ ఇంత గొప్పగా అన్ని వర్గాలనూ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. మరి మూడుసార్లు సీఎంగా, 14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేకపోయాడని ప్రతి ఒక్కరూ ప్రతి ఇంటికీ వెళ్లి అడగండి. మీ జగన్ పేరు చెబితే.. మీ జగన్ పేరు చెబితే.. ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం, విద్యాకానుక, గోరుముద్ద, బాగుపడ్డ పాఠశాలలు, బైజూస్ కంటెంట్, బైలింగ్యువల్ బుక్స్, ట్యాబ్‌లు, డిజిటల్ బోధనతో ఐఎఫ్‌పీ ప్యానళ్లు, తొలిసారిగా సబ్జెక్ట్ టీచర్ కాన్సెప్ట్, టోఫెల్ శిక్షణ, సీబీఎస్ఈ నుంచి ఐబీ వరకు ప్రయాణం గుర్తొస్తాయి. పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో విద్యా దీవెన, వసతి దీవెన, జాబ్ ఓరియెంటెడ్‌గా కరిక్యులమ్‌లో మార్పులు, ఆన్లైన్ వర్టికల్స్ చదువులతో అనుసంధానం.. ఇవన్నీ తల్లిదండ్రులకు వివరించాలి. ఇవన్నీ కొనసాగాలంటే, పిల్లలు అనర్గళంగా ఇంగ్లిషులో మాట్లాడాలంటే, పెత్తందార్ల పిల్లలతో పోటీ పడే పరిస్థితి రావాలంటే మీ అన్న మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే జరుగుతుందని చెప్పండి. ఇవాళ ఒకటో తరగతిలో ఉన్న పేదింటి పాప, పేదింటి బాబు మరో 10–15 ఏళ్లలో అంతర్జాతీయ చదువులతో గొప్ప ఉద్యోగాలు సాధించాలంటే మీ అన్న ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుందని ప్రతి ఇంటికీ చెప్పండి. సైకిల్‌కు ఓటేయడం అంటే గవర్నమెంట్ బడుల్లో ఇంగ్లిష్ మీడియం రద్దుకు ఓటేస్తున్నామని గుర్తు పెట్టుకోవాలి. ప్రతి నెలా ఒకటో తేదీనే ఇంటి వద్దే రూ.3 వేల పెన్షన్లు కొనసాగాలన్నా, భవిష్యత్‌లో పెరగాలన్నా, కొందరికే పింఛన్లు ఇచ్చిన రోజులు మళ్లీ రాకూడదన్నా, లంచాల జన్మభూమి కమిటీలు కాటేయకూడదన్నా ఫ్యాన్ గుర్తుకే ఓటేయాలని ఇంటింటికీ వెళ్లి చెప్పాలి. ఇవాళ అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరినీ సేవలతో విస్తరించిన ఆరోగ్యశ్రీ, 104, 108 వాహనాలు, ఆరోగ్య ఆసరా, విలేజ్ క్లినిక్, ఫ్యామిలీ డాక్టర్, ఆరోగ్య సురక్ష ఆదుకుంటున్నాయి. వీటి పేరు వింటే కోవిడ్ కష్టకాలంలో అందించిన సేవలు గుర్తుకొస్తాయి. పేదలు వైద్యం కోసం అప్పులపాలు కాకూడదన్నా, గడపగడపకూ వైద్యం అందించే పరిస్థితి కొనసాగాలన్నా లబ్ధిదారులే స్టార్ క్యాంపెయినర్లుగా ముందుకు రావాలని కోరాలి. 57 నెలల్లో మీకోసం 125 సార్లు బటన్లు ఈ 57 నెలల్లో నేను ప్రజల కోసం 125 సార్లు బటన్లు నొక్కా. ఏకంగా రూ.2.55 లక్షల కోట్లు నేరుగా నా అక్కచెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు వెళ్లాయి. ఇంత మంచి చేసిన మనందరి ప్రభుత్వానికి మద్దతుగా, ఈ పాలనకు కొనసాగింపుగా ప్రతి కుటుంబం, ప్రతి ఒక్కరూ మంచి భవిష్యత్ కోసం రెండు బటన్లు నొక్కాలని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి. ఒకటి అసెంబ్లీకి, ఒకటి పార్లమెంటుకు. ఫ్యాన్ మీద నొక్కితే మీరు గత ఎన్నికల్లో బటన్ నొక్కి పెట్టెలో బంధించిన చంద్రముఖి బెడద శాశ్వతంగా పోతుంది. పొరపాటు చేశారంటే చంద్రముఖి మళ్లీ సైకిలెక్కుతుంది. టీ గ్లాస్ పట్టుకొని మీ ఇంటికొస్తుంది. పేదల రక్తం తాగేందుకు లకలకా అంటూ మీ ఇంటి తలుపులు తడుతుందని ప్రతి అక్కకూ, ప్రతి చెల్లెమ్మకూ చెప్పండి. మీకు మంచి జరిగితే నాకు ఓటేయండి మన పాలనలో మీకు మంచి జరిగితే నాకు ఓటు వేయండి అని, మీ బిడ్డకు మీరే సైనికులుగా తోడుగా నిలబడాలని మనం నిబద్ధతతో సిద్ధం అంటుంటే ఏ ఒక్కరికైనా ఏం చేశారో చెప్పుకొనేందుకు ఒక్కటీ కనిపించని పరిస్థితిలో చంద్రబాబు ఉన్నారు. మేమూ సిద్ధం.. సంసిద్ధం అంటూ చంద్రబాబు పోస్టర్లు వేయిస్తున్నారు. ప్రజలకు మంచి చేయకుండా దేనికయ్యా సంసిద్ధం? ఎందుకు సంసిద్ధం? ఎవరితో యుద్ధం? పెత్తందార్ల తరఫున చంద్రబాబు సంసిద్ధం అంటున్నాడంటే ఎవరితోనయ్యా నువ్వు యుద్ధం చేస్తున్నావ్? కృష్ణుడిలా కోట్ల గుండెలు తోడున్నాయి.. దుష్ట చతుష్టయం బాణాలకు బలి కావడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు. ఇక్కడ ఉన్నది అర్జునుడు. ఆ అర్జునుడికి తోడుగా కృష్ణుడి రూపంలో ప్రతి పేదవాడి ఇంట్లో కోట్ల గుండెలున్నాయి. ప్రజలే అండగా, ప్రజలతోనే పొత్తులతో ఎన్నికల పోరాటానికి మీ బిడ్డ సిద్ధం. ఇది మీ అందరి పార్టీ. జగన్‌ను నమ్మిన వారికి, పార్టీ కోసం కష్టపడిన వారికి అంచెలంచెలుగా అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ మన వైఎస్సార్సీపీ. ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ ఎల్లప్పుడూ తోడుగా ఉంటాడని తెలియజేస్తున్నా. ప్రతి కార్యకర్త, ప్రజాసేవలో ఉన్న ప్రతి ఒక్కరికీ మరో రెండు మెట్లు ఎక్కే అవకాశం కల్పించే బాధ్యత నాది. మా నాయకుడు మాటిచ్చాడంటే చేస్తాడంతే అని ప్రతి కార్యకర్త కాలర్ ఎగరేసి చెప్పుకునేలా ఉండాలి. 99 శాతం వాగ్దానాలు అమలుచేసి ప్రతి ఇంటికీ వెళ్లి మేనిఫెస్టో చూపించి మరీ ప్రజల ఆశీస్సులు కోరుతున్న పార్టీ మనదే. అందుకే ఎన్నికల్లో 175కు 175 మన టార్గెట్. మన టార్గెట్ 25కు 25 ఎంపీ సీట్లు. పరిపాలనలో మనం ఎక్కడా తగ్గలేదు. మనకు ఒక్క ఎమ్మెల్యేగానీ, ఎంపీగానీ తగ్గేందుకు వీలేలేదు. మరో 55 రోజుల్లో మరో రెండు నెలల్లోనే ఎన్నికలు. ఈరోజు నుంచి చూస్తే మరో 55 రోజులు కూడా ఉండవేమో. చంద్రబాబు అబద్ధాలు, ఈనాడు, ఏబీఎన్, టీవీ5, ఎల్లో మీడియా తప్పుడు కథనాలను ఎదుర్కొంటూ పేదవాడి భవిష్యత్తును కాపాడేందుకు మీరంతా సిద్ధంగా ఉండాలి. చీకటి రాతల్ని, చీకటి పనుల్ని బట్టబయలు చేసేందుకు సంసిద్ధంగా ఉండాలి. మీరంతా సెల్‌ఫోన్ టార్చిలైట్లు వెలిగించి సిద్ధమే అని చెప్పండి. ప్రతి కార్యకర్త, బూత్ కమిటీ సభ్యులు, వలంటీర్లు, గృహ సారథుల పాత్ర అత్యంత కీలకం. సమరభేరి మోగిద్దాం.. సమరనాదం వినిపిద్దాం. చంద్రబాబుకు ఇప్పటికే 75 ఏళ్లు. ఎన్నికలు అయిపోయిన తర్వాత చంద్రబాబు వయసు 80కి చేరుతుంది. ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు. ఈ ఎన్నికలు చాలా కీలకం కావడంతో పెత్తందార్లంతా ఏకం అవుతున్నారు. వీరంతా సరిపోరని జాతీయ పార్టీలతో పరోక్షంగా ఒకరితో, ప్రత్యక్షంగా మరొకరితో పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారు. ఒకే ఒక్కడిపై యుద్ధం చేయడానికి ఇన్ని తోడేళ్లు ఏకం అవుతున్నాయి. ఈ తోడేళ్లను ఎదుర్కోవాలంటే మీ జగన్ ఒక్కడికే సాధ్యం కాదు. మీ జగన్‌కు ప్రతి గుండె తోడుగా నిలబడాలి. ప్రతి ఇంట్లో అక్కచెల్లెమ్మలు, అవ్వాతాతలు, తల్లీతండ్రీ, ప్రతి రైతన్న మీ జగన్‌కు తోడుగా స్టార్ క్యాంపెయినర్లుగా బయటకు రావాల్సిన అవసరం ఉంది. మీరు వేసే ఓటు పేదవాడి భవిష్యత్‌ను, జీవితాన్ని నిర్ణయించే ఓటు అవుతుంది. పొరపాటు జరిగిందంటే పేదవాడి బతుకులు అతలాకుతలం అవుతాయి. మీకెందుకు ఓటేయాలి బాబూ? జగన్ మార్కు ప్రతి గ్రామంలో కనిపిస్తున్నప్పుడు, ప్రతి పేద ఇంట్లో, ప్రతి సామాజికవర్గంలో, ప్రతి ప్రాంతంలో మంచి మార్పు కనిపిస్తున్నప్పుడు బాబుకు ఎందుకు ఓటు వేయాలని అడుగుతున్నా. జగన్ పాలనలో ప్రజలకు మంచి చేయలేదని, జగన్‌కు ప్రజాబలం లేదని చంద్రబాబు నిజంగా నమ్మితే ఇన్ని పొత్తులు ఎందుకయ్యా చంద్రబాబూ? అని అడుగుతున్నా. ఊతం కోసం అటో కర్రా, ఇటో కర్ర ఎందుకయ్యా? సైకిల్ తోయడానికి నీకొక ప్యాకేజీ స్టార్ ఎందుకయ్యా? జగన్ ప్రతి ఇంటికీ మంచి చేశాడని తెలుసు కాబట్టే చంద్రబాబు గుండెల్లో రైళ్లు పరుగెడుతున్నాయి. -
Watch Live: రాష్ట్ర చరిత్రలోనే భారీ బహిరంగ సభ
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రసంగంలో ముఖ్యాంశాలు రాప్తాడులో వైసీపీ సిద్ధం సభ జనసముద్రంలా కనిపిస్తోంది పెత్తందారులతో మన యుద్ధం జరగబోతుంది 2024లో రెండు సిద్ధాంతాల మధ్య యుద్ధం జరగబోతోంది పెత్తందార్లతో యుద్ధానికి మీరు సిద్ధమేనా? విశ్వసనీయతకు వంచనకు మధ్య యుద్ధం జరుగుతోంది పక్క రాష్ట్రాల్లో ఉంటూ ఇక్కడ రాజకీయాలు చేసేవాళ్లు అవసరమా? చంద్రబాబు పేరు చెబితే ఒక్క పథకమైనా గుర్తొస్తుందా? ప్రజల మంచి కోసం చంద్రబాబు చేసిన మంచి పని ఒక్కటైనా ఉందా? చంద్రబాబు 14 ఏళ్ల పాలనలో రైతులకు గుర్తుకువచ్చే పథకం ఒక్కటైనా ఉందా? చంద్రబాబు పేరు చెబితే ఏ ఒక్కరికైనా సామాజిక న్యాయం గుర్తుకొస్తుందా? మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు 10 శాతమైనా అమలు చేశారా? 1995, 1999, 2014 టీడీపీ మేనిఫెస్టోలో 10 శాతమైనా అమలు చేశారా? మళ్లీ అబద్దాలు, మోసాలతో చంద్రబాబు వస్తున్నారు రంగురంగుల మేనిఫెస్టోలతో మళ్లీ మోసం చేయడానికి బాబు వస్తున్నాడు చంద్రబాబు చేసేవన్నీ మోసాలే, చెప్పేవన్నీ అబద్ధాలే అబద్ధాలు చెప్పేటప్పుడు భావదారిద్ర్యం ఎందుకు అనేది చంద్రబాబు సిద్ధాంతం 14 ఏళ్ల పాలనలో చంద్రబాబు ఏ ప్రాంతానికైనా న్యాయం చేశారా? చంద్రబాబు అబద్ధాలను నమ్మొద్దని ప్రతి ఇంటికీ వెళ్లి చెప్పండి గత ఎన్నికల్లో ప్రజలు టీడీపీని 23 సీట్లకే పరిమితం చేశారు గత ఎన్నికల్లో అందరూ చొక్కాలు మడతపెట్టి చంద్రబాబు కుర్చీని మడతేసి వాళ్ల సీట్లను తగ్గించారు చంద్రబాబును మళ్లీ ఇంటికి సాగనంపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు చంద్రబాబు పేరు చెబితే ఒక్క మంచి పనైనా గుర్తొస్తుందా? కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు బాబు మార్క్ ఎక్కడైనా ఉందా? 57 నెలల పాలనలో చిత్తశుద్ధితో పాలన అందించాం 57 నెలల పాలనలో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాం 57 నెలల పాలనలో జరిగిన మంచిని ప్రజలందరికీ వివరించండి ప్రతీ ఇంట్లో జరిగిన మంచిని ప్రతీ ఒక్కరికీ వివరించండి చేసినవి చెప్పాలి, వాటి కొనసాగింపు ఎంత అవసరమో చెప్పాలి ప్రతి అవ్వా, తాత ముఖంలో చిరునవ్వులు చూశాం ప్రతి అక్క, చెల్లెమ్మకు ఎంతో మేలు చేశాం రైతులకు రైతు భరోసా తీసుకొచ్చి ఇచ్చాం రైతన్నకు పగటిపూట 9 గంటలపాటు ఉచిత విద్యుత్ ఇచ్చాం మనం పెడుతున్న అన్నాన్ని, గిన్నెని చంద్రబాబు లాక్కుంటారు వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే అక్క చెల్లెమ్మలకు ఎన్నో పథకాలు గుర్తొస్తాయి 31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం మనది ప్రతీ అక్కచెల్లెమ్మ ఫోన్ లో దిశ యాప్ తీసుకొచ్చాం చంద్రబాబు మోసాలను ప్రతీ రైతన్నకు వివరించాలి సంక్షేమ పథకాలన్నీ కొనసాగాలంటే వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వమే మళ్లీ రావాలి ఫ్యాన్ ఎప్పుడూ ఇంట్లోనే ఉండాలి, సైకిల్ ఎప్పుడూ బయటే ఉండాలి, తాగేసిన టీ గ్లాస్ ఎప్పుడూ సింక్ లోనే ఉండాలి గతంలో ఎన్నడూ చూడని విధంగా నాడు-నేడుతో మార్పులు తెచ్చాం విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చాం పేద విద్యార్ధులకు ఇంగ్లీష్ మీడియం అందుబాటులోకి తెచ్చాం కేవలం కొందరికే పెన్షన్ ఇచ్చే రోజులు రాకూడదంటే మళ్లీ వైసీపీ ప్రభుత్వం రావాలి వాళ్లంతా మనకు స్టార్ క్యాంపెయినర్లుగా మారాలి సైకిల్ గుర్తుకు ఓటు వేయడమంటే ప్రభుత్వ స్కూల్స్ లో ఇంగ్లీష్ మీడియం రద్దు చేయడమే YSRCP మార్క్ ప్రతి ఇంట్లో, ప్రతి గ్రామంలో కనిపిస్తోంది ప్రజలు ఒక్కసారి అధికారం ఇస్తేనే ఇవన్నీ చేశాం ప్రజలు మళ్లీ ఆశీర్వదిస్తే మరిన్ని మంచి పనులు చేస్తాం లంచాలకు తావులేకుండా పేదల ఖాతాల్లోకి నగదు బదిలీ జరుగుతోంది 57 నెలల్లోనే 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం ఇందులో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు ఇచ్చాం చంద్రబాబుకు ఓటు వేయడమంటే సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా ఓటు వేయడమే మేనిఫెస్టోలోని 90 శాతం హామీలను అమలు చేశాం 3 సార్లు సీఎం అయిన చంద్రబాబు ఇవన్నీ ఎందుకు చేయలేదు అసలు చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటు వేయాలి? సైకిల్ తొయ్యడానికి ప్యాకేజీ స్టార్ ఎందుకు? విద్యాదీవెన, వసతి దీవెనతో విద్యార్ధులకు అండగా నిలిచాం పెత్తందారుల పిల్లలతో మన పిల్లలు పోటీ పడాలంటే మళ్లీ మన ప్రభుత్వమే రావాలి మన పిల్లలు ప్రపంచ స్థాయికి ఎదిగేలా విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చాం పెన్షన్ కొనసాగాలంటే మళ్లీ మీ బిడ్డ ప్రభుత్వమే రావాలి మీ అన్న ప్రభుత్వమే సంక్షేమ పథకాలను కొనసాగించగలదు జరుగుతున్న మంచి కొనసాగాలంటే మన ప్రభుత్వమే రావాలి వైఎస్ఆర్ సీపీ పేరు చెబితే సంక్షేమ పథకాలు గుర్తొస్తాయి కోవిడ్ కష్టకాలంలోనూ అందించిన సేవలు గుర్తొస్తాయి లంచాలకు తావు లేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల ఖాతాల్లో డబ్బు వేశాం మీ బిడ్డ 125 సార్లు బటన్ నొక్కి అక్కచెల్లెమ్మల ఖాతాల్లో నిధులు జమ చేశాం రూ.2.55 లక్షల కోట్ల రూపాయలు నేరుగా ఖాతాల్లో వేశాం వైఎస్ఆర్ సీపీ మార్క్ ప్రతీ ఇంట్లోనూ కనిపిస్తోంది మళ్లీ అవకాశమిస్తే ఇంకెంత మంచి జరుగుతుందో ఆలోచించమని చెప్పండి 75 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పదవుల్లో ప్రాధాన్యతనిచ్చాం కేవలం 57 నెలల కాలంలో 2 లక్షల 13 వేల ఉద్యోగాలు ఇచ్చాం నిరుపేద వర్గాలకు 80 శాతం ఉద్యోగాలు ఇచ్చాం మేనిఫెస్టోను మీ బిడ్డ మాదిరిగా అమలు చేసిన వారెవరైనా ఉన్నారా? చంద్రబాబుకు ప్రజలు ఎందుకు ఓటేయాలి? జగన్ కు జనబలం లేకుంటే చంద్రబాబుకు పొత్తులెందుకు? తన నడక కోసం అటో కర్ర ఇటో కర్ర ఎందుకు? సైకిల్ ను తొయ్యడానికి ప్యాకేజ్ స్టార్ ఎందుకు? ప్రజల కోసం 125 సార్లు నేను బటన్ నొక్కాను మళ్లీ ఫ్యాన్ కు ఓటేస్తే చంద్రముఖి బెడద ఇక మీకుండదు సైకిల్ కు ఓటేస్తే పేదల రక్తం తాగేందుకు చంద్రముఖి వస్తుంది పేదవాడి బతుకును మార్చేందుకు మనం యుద్దం చేస్తున్నాం చంద్రబాబు పెత్తందారుల తరపున సంసిద్ధం అంటున్నారు టీడీపీ దేనికి సంసిద్ధమని అడుగుతున్నా ?? దుష్టచతుష్టయం బాణాలకు తల వంచేందుకు ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నది అర్జునుడు, అర్జునుడికి తోడు కృష్ణుడి రూపంలో ప్రజలున్నారు వైఎస్ఆర్ సీపీ మీ అందరి పార్టీ మాకు ఏ పార్టీతోనూ పొత్తు లేదు.. ప్రజలతోనే మా పొత్తు గతంలో లంచాలు పిండుతూ తన వారికే చంద్రబాబు పథకాలిచ్చుకున్నాడు పార్టీలో ప్రతి కార్యకర్తకూ మీ అన్న జగన్ తోడుగా ఉంటాడు నాయకుడంటే ప్రతీ కార్యకర్తా కాలర్ ఎగరేసేలా ఉండాలి వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 175కి 175 అసెంబ్లీ స్థానాలు వచ్చే ఎన్నికల్లో మన టార్గెట్ 25కి 25 ఎంపీ స్థానాలు 650 హామీలిచ్చి 10 శాతం కూడా చంద్రబాబు అమలు చేయలేదు మేనిఫెస్టోలో వైఎస్ఆర్ సీపీ 99 శాతం హామీలు అమలు చేసింది ఎల్లోమీడియా దుష్ప్రచారాలను తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? మరో చారిత్రక విజయాన్ని అందుకునేందుకు మీరు సిద్ధమా? ఈ ఎన్నికల తర్వాత టీడీపీ రూపురేఖలు ఎక్కడా కనిపించవు ఎల్లో మీడియా చీకటి రాతలు తిప్పి కొట్టేందుకు మీరు సిద్ధమా? పెత్తందారులంతా తోడేళ్లుగా ఏకమవుతున్నారు ఈ ఎన్నికలు చాలా కీలకం పొరపాటు జరిగితే పేదవాడి బతుకు అతలాకుతలమవుతుంది సమర భేరి మోగిద్దాం... సమర నినాదం వినిపిద్దాం -
ఇది సీఎం జగన్ చరిష్మా.. ట్రెండింగ్‌లో ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సోషల్ మీడియాలో ‘సిద్ధం’ కార్యక్రమం ట్రెండింగ్‌లో నిలిచింది. ఎక్స్(ట్విట్టర్)లో దేశంలోనే మొదటిస్థానంలో సిద్ధం’ హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. సిద్ధం అప్డేట్స్ను వైఎస్సార్సీపీ అభిమానులు భారీగా షేర్ చేస్తున్నారు. ‘సిద్ధం’ సభా ప్రాంగణం ఫొటోలతో ఫేస్బుక్, ట్విట్టర్ నిండిపోయింది. ఎన్నికల కురుక్షేత్ర యుద్ధానికి గత నెల 27న భీమిలి వేదికగా శంఖం పూరించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజా క్షేత్రంలో దూసుకుపోతున్నారు. ఈ క్రమంలోనే నేడు రాయలసీమలోని రాప్తాడులో ఏపీలోనే కనివిని ఎరుగని రీతిలో సిద్ధం సభ జరిగింది. రాప్తాడు సభ సముద్రాన్ని తలపించింది. సభకు లాక్షలాదిగా సీఎం జగన్ సైన్యం తరలివచ్చింది. సీఎం జగన్ ప్రసంగం సింహనాదంలా కొనసాగింది. ఎంతమంది జత కట్టినా.. ఎన్ని పొత్తులు పెట్టుకున్నా ప్రజలతోనే తన పొత్తు అని సీఎం జగన్ స్పష్టం చేశారు. ప్రజలే స్టార్ క్యాంపెనర్లుగా సీఎం జగన్ ప్రకటించారు. లబ్ధిదారులే తనకు ఓటు వేయిస్తారని సీఎం జగన్ పేర్కొన్నారు. చదవండి: రాప్తాడు సిద్ధం సభలో సీఎం జగన్ పంచ్‌లు -
ఈరోజు సిద్ధం సభతో..మా దమ్మెంటో మళ్లీ నిరూపిస్తాం
-
జై జగన్..హోరెత్తుతున్న రాప్తాడు
-
రాప్తాడులో సిద్ధం సభపై పబ్లిక్ రియాక్షన్స్
-
రాప్తాడులో సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు..
-
భీమిలి, దెందులూరును మించిపోయేలా రాప్తాడు ‘సిద్ధం’
సాక్షి, అనంతపురం: సిద్ధం సభకు సర్వం సిద్ధం అయింది. అనంతపురం జిల్లా రాప్తాడులో రేపు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిద్ధం సభ జరగనుంది. రాయలసీమ జిల్లాల నుంచి లక్షలాది మంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఈ కార్యక్రమంలో హాజరుకానున్నారు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ... సిద్ధం సభలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ. ఇప్పటికే భీమిలి, దెందులూరు బహిరంగ సభలు విజయవంతం అయ్యాయి. రేపు అనంతపురం జిల్లా రాప్తాడులో సిద్ధం సభ జరగనుంది. రాప్తాడు సమీపంలోని బైపాస్ రోడ్డు వద్ద సుమారు 250 ఎకరాల మైదానం లో సిద్ధం సభ కోసం ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. రాయలసీమలోని అనంతపురం, కర్నూలు, చిత్తూరు, వైఎస్సార్ జిల్లాలకు చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు హాజరుకానున్నారు. లక్షలాది మంది వచ్చే సిద్ధం సభ సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజినల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వెల్లడించారు. రాప్తాడు బైపాస్ వద్ద బహిరంగ సభకు ఏర్పాట్లు చేశారు. పరిసర ప్రాంతాల్లో 16 చోట్ల వాహనాల పార్కింగ్ కోసం ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్ - బెంగళూరు జాతీయ రహదారిపై ట్రాఫిక్ ఆంక్షలను విధించారు పోలీసులు. బెంగళూరు నుంచి వచ్చే భారీ వాహనాలు కళ్యాణ దుర్గం మీదుగా మళ్లిస్తారు. అలాగే హైదరాబాద్ నుంచి బెంగళూరు వైపు వెళ్లే భారీ వాహనాలను ధర్మవరం మీదుగా మళ్లిస్తారు. ఈ ఆంక్షలు భారీ వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. సాధారణ ప్రయాణికుల వాహనాలు యథావిధిగా రాప్తాడు హైవే పై వెళ్లవచ్చు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సిద్ధం సభకు పెద్ద సంఖ్యలో జనం వస్తారని... ఆ మేరకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు సీఎం ప్రొగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం తెలిపారు. రాప్తాడు సిద్ధం సభ నుంచి సీఎం జగన్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేస్తారని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో సీఎం జగన్ పరిపాలనలో అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్ సీపీ ప్రభంజనం మరోసారి ఖాయమని ఎమ్మెల్యే తోపుదుర్తి పేర్కొన్నారు. -
YSRCP ఎన్నికల శంఖారావం సిద్ధం బహిరంగసభకు ముస్తాబైన రాప్తాడు
-
రాయలసీమలో వైఎస్సార్ సీపీ మళ్లీ క్లీన్ స్వీప్ చేస్తుంది
-
సీఎం జగన్ సిద్ధం సభకు లక్షల సంఖ్యలో కార్యకర్తలు
-
రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి: మంత్రి పెద్దిరెడ్డి
-
రాప్తాడు సిద్ధం సభకు భారీ ఏర్పాట్లు
-
Anantapur: పరిటాల సునీతకు గట్టి షాక్
సాక్షి ప్రతినిధి, అనంతపురం: తమ కుటుంబానికి రెండుచోట్ల ఎమ్మెల్యే టికెట్లు వస్తున్నట్టు ప్రచారం చేసుకున్న పరిటాల సునీతకు గట్టి షాక్ తగిలింది. 2009, 2014 ఎన్నికల్లో రాప్తాడు నుంచి గెలిచిన సునీత 2019లో ఓటమి పాలైన విషయం విదితమే. నాలుగోసారి కూడా రాప్తాడు నుంచి టీడీపీ తరఫున సునీత పోటీ చేస్తారని భావిస్తూ వచ్చిన ఆమె అనుచరుల్లో ధీమా సన్నగిల్లుతోంది. రోజుకో సమీకరణంతో టికెట్ ఎక్కడిస్తారో నమ్మకం లేకుండాపోయింది. మొన్నటివరకు రాప్తాడుతోపాటు ధర్మవరం టికెట్ తమకే అని పరిటాల కుటుంబం చెప్పుకుంది. ఇప్పుడు అందులో ఒక టికెట్‌పై ఆశలు వదులుకోవాల్సి వస్తుండటంతో కలవరం మొదలైంది. రాప్తాడు నుంచి తెరపైకి రియల్టర్ అనంతపురం జిల్లాకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి రాప్తాడు నియోజకవర్గం నుంచి టీడీపీ తరఫున పోటీకి దిగుతున్నారనే ప్రచారం తెరమీదకు వచ్చింది. ఈ సీటు కోసం ఆయన భారీ మొత్తంలో పార్టీ ఫండ్ ఇచ్చేందుకు అధిష్టానంతో డీల్ కుదుర్చుకున్నట్టు తెలిసింది. ఈ నెల 18 లేదా 19న ఆయన పార్టీ అధిష్టానాన్ని కలవనున్నట్టు చెబుతున్నారు. రాప్తాడు నియోజకవర్గంలో బంధువర్గం ఉండటంతోపాటు బాగా డబ్బు ఖర్చు చేయగలిగిన సామర్థ్యం ఉండటంతో అధిష్టానం ఆయనవైపే మొగ్గు చూపుతున్నట్టు తెలుస్తోంది. రాప్తాడు ఇవ్వకపోతే ధర్మవరం? రాప్తాడు నియోజకవర్గంలో సునీతకు టికెట్ ఇవ్వని పక్షంలో ధర్మవరం పంపించాలనే యోచనలో టీడీపీ ఉన్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే తనకు ధర్మవరం టికెట్ కావాలని సునీత కుమారుడు శ్రీరామ్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. తాజా పరిణామాలతో శ్రీరామ్‌కు టికెట్ ఇచ్చే పరిస్థితి లేకపోగా.. తల్లి సునీతకు ధర్మవరం టికెట్ ఇవ్వొచ్చని అంటున్నారు. రాప్తాడులో సునీతకు అనుకూల పరిస్థితులు లేవని, కొత్త అభ్యర్థి అయితే బావుంటుందని కూడా ఆలోచిస్తున్నారు. సునీతకు నియోజకవర్గంలో అనుకూలంగా లేదనే ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ ఇప్పటికే మొదలుపెట్టింది. సూరిని తీసుకుంటే పరిస్థితి ఏమిటి? చంద్రబాబు ఎక్కడున్నా తగవులు పెట్టి తన్నుకునేలా చేస్తారనే విమర్శ ఉంది. ధర్మవరం నియోజకవర్గంలో వరదాపురం సూరికే టికెట్ ఇవ్వాలని ఆలోచిసూ్తనే సునీతకు కూడా ఇస్తామని లీకులిస్తున్నారు. ఒకవేళ ధర్మవరం నియోజకవర్గానికి సూరిని నియమిస్తే సునీతను పెనుకొండకైనా పంపించాలని మరో వాదన వినిపిస్తోంది. ఉదయం లేచినప్పటి నుంచి చంద్రబాబు జపం చేసే పరిటాల సునీతకు స్థానచలనం చేస్తే ఏళ్ల తరబడి నమ్మకంతో ఉన్న మన పరిస్థితి ఏమిటన్న ఆందోళన కేడర్‌లో మొదలైంది. కొంప ముంచుతున్న నాన్చుడు ధోరణి చంద్రబాబు చివరివరకూ నాన్చుడు ధోరణి అవలంభిస్తుండటంతో టికెట్ ఆశిస్తున్న నాయకులు మానసికంగా కుంగిపోతున్నారు. ఎన్నికల ముహూర్తం ముంచుకొస్తున్నా.. ఎక్కడ ఏ అభ్యర్థో తేల్చకపోవడంతో ఉమ్మడి అనంతపురం జిల్లా మొత్తం గందరగోళంగా ఉంది. 2019లో చంద్రబాబును నమ్ముకుని రూ.కోట్లు ఖర్చు చేశామని, ఇప్పుడు కూడా ఆయన్ని నమ్ముకుంటే మునుగుతామో తేలుతామో అర్థం కావడం లేదని సీనియర్ నాయకులు వాపోయారు. -
సామాజిక సాధికార యాత్రకు పోటెత్తిన జనం
-
మాటల్లేవ్.. ఇది చేతల ప్రభుత్వం.. ప్రజల ప్రభుత్వం
వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు జై జగన్ నినాదాలతో హోరెత్తిన సభ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని వివరించిన నేతలు అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు వేలాదిగా తరలి వచ్చి..విజయయాత్ర చేశారు. ఈ సందర్భంగా మంత్రులు, నేతలు మాట్లాడుతూ.. ‘బడుగు, బలహీన వర్గాలను చంద్రబాబు అణిచివేస్తే.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయి పట్టుకుని అభివృద్ధి పథం వైపు నడిపించారు. ఆయన తెచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయి’ అని చెప్పారు. రాప్తాడు సాధికార మహోత్సవం అపూర్వం సాక్షి,అమరావతి/రాప్తాడు రూరల్: ఫ్యాక్షన్‌ను తోసిరాజని అనంతపురం జిల్లా రాప్తాడులో సామాజిక సాధికారత నినాదం మార్మోగింది. రాయలసీమ ప్రాంతంలో కీలక నియోజకవర్గం అయిన రాప్తాడులో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజల ఆదరాభిమానాలతో సామాజిక సాధికార బస్సు యాత్ర సోమవారం అపూర్వ రీతిలో ఉత్సవంలా సాగింది. వేలాదిగా తరలి వచ్చిన ఎస్సీ, ఎస్టీ బీసీ, మైనార్టీ ప్రజలు విజయయాత్ర చేశారు. ముఖ్యంగా మహిళలు కూడా పెద్దసంఖ్యలో తరలిరావడం విశేషం. సీఎం వైఎస్ జగన్ పాలనలో తమకు లభించిన ప్రాధాన్యతను, రాజ్యాధికారం పొందిన వైనాన్ని ప్రజలకు వివరించారు. అనంతరం జరిగిన సభకు బడుగు, బలహీన వర్గాల ప్రజలు పోటెత్తారు. సీఎం జగన్ నామస్మరణతో సభా ప్రాంగణం మార్మోగింది. సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో సామాజిక సాధికారత సాధించిన వైనాన్ని మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు వివరించినప్పుడు ప్రజలు పెద్దపెట్టున హర్షధ్వానాలు చేశారు. ‘జగనన్నే మా భవిష్యత్తు.. 2024 ఎన్నికల్లో మళ్లీ వైఎస్ జగనే గెలవాలి .. జగనే కావాలి’ అంటూ ఒకే గళమై నినదించారు. దేశ చరిత్రలో ఒకే ఒక్కడు : కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ దేశ చరిత్రలో సామాజిక న్యాయం చేసిన ఒకే ఒక్క ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరామ్ చెప్పారు. సీఎం జగన్ అణగారిన వర్గాలకు అండగా నిలిచి, వారి అభ్యున్నతికి పాటుపడుతున్నారని తెలిపారు. ఆయన తీసుకొచ్చిన నవరత్నాల పథకాల ద్వారా ప్రతి ఇంటా వెలుగులు నిండాయన్నారు. సీఎం వైఎస్ జగన్ పాలనలో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలకు ఎంత మేలు జరిగిందనేది ఇక్కడికి వచ్చిన జనాలే సాక్ష్యమన్నారు. మీ ఇంటికి మేలు జరిగిందంటేనే నాకు ఓటేయండి.. లేదంటే వద్దని ధైర్యంగా చెప్పిన నాయకుడు వైఎస్ జగన్ అని అన్నారు. బడుగు, బలహీన వర్గాలను మరింతగా అణచివేసిన నాయకుడు చంద్రబాబు అని దుయ్యబట్టారు. చంద్రబాబు పార్టీకే గ్యారంటీ లేదు కానీ ప్రజలకు ష్యూరిటీ ఇస్తాడట అని వ్యాఖ్యానించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నతంగా బతుకుతున్నారు: మంత్రి మేరుగు ‘మంత్రివర్గంలో అధిక శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్ పర్సన్ ఈ వర్గాల వారే. ఎమ్మెల్సీలు, రాజ్యసభ సభ్యుల్లోనూ ఈ వర్గాలకే ప్రాధాన్యం. నామినేటెడ్ పదవుల్లో ఈ వర్గాలకే పెద్ద పీట. ఏ సంక్షేమ పథకం తీసుకున్నా లబ్ధిదారుల్లో 80 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలే. సీఎం వైఎస్ జగన్ పాలనలో ఈ వర్గాలు ఉన్నతంగా బతుకుతున్నాయి. ఇదే అసలైన సామాజిక సాధికారత’ అని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి మేరుగు నాగార్జున చెప్పారు. చంద్రబాబు హయాంలో అవహేళనకు, హింసకు గురైన ఈ వర్గాలు ఇప్పుడు తలెత్తుకొని తిరుగుతున్నాయని వివరించారు. ఎస్సీ కులంలో ఎవరైనా పుట్టాలనుకుంటారా, బీసీల తోక కత్తిరిస్తా, బీసీలు జడ్జీలుగా పనికి రారంటూ రకరకాలుగా అవమానించిన వ్యక్తి చంద్రబాబు అని చెప్పారు. బాబు మనకు రావాల్సిన రాజ్యాంగబద్ధ హక్కులన్నీ కాల రాశారన్నారు. అన్ని వర్గాలను ఆదరించి, ఉన్నతంగా తీర్చిదిద్దుతున్న సీఎం వైఎస్ జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం: ఎంపీ నందిగం సురేష్ జగనన్న సీఎం అయ్యాక రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల రాజ్యం నడుస్తోందని ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. ప్రతి కులానికీ దన్నుగా నిలిచారని తెలిపారు. నామినేటెడ్ పదవులు, స్థానిక సంస్థలు, పార్టీ పదవుల్లో 75 శాతానికి పైగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకే అవకాశం కల్పించారని, సీఎం వైఎస్ జగన్ దేవుడు పంపిన వ్యక్తి అని అన్నారు. మనల్ని ఆదుకున్న జగనన్నకు అండగా ఉందామని పిలుపునిచ్చారు. నేడు రాయదుర్గంలో బస్సు యాత్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన కార్యక్రమాలతో రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు సాధించిన అభివృద్ధిని, సాధికారతను వివరించేందుకు వైఎస్సార్సీపీ చేపట్టిన సామాజిక సాధికార బస్సు యాత్ర రాష్ట్రంలో విజయవంతంగా సాగుతోంది. సోమవారం అనంతపురం జిల్లా రాప్తాడులో యాత్ర అద్భుత రీతిలో జరిగింది. మంగళవారం అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలో సామాజిక సాధికార బస్సు యాత్ర జరగనుంది. -
పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు తొత్తు: ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి
-
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
-
రాప్తాడులో టీడీపీ కాకిగోల.. సాక్ష్యం ఇదిగో
సాక్షి, అనంతపురం: చేసింది, చేసేది తప్పుడు పనులు.. పైగా కప్పిపుచ్చుకునేందుకు తప్పుడు ప్రచారాలకు దిగడం టీడీపీ బాగా అలవాటు చేసుకుంది. వైజాగ్ గ్లోబల్ ఇన్వెస్టర్ల సమ్మిట్ విజయవంతం కాగానే.. తెలుగుదేశం నేతలకు ఏం చేయాలో తోచడం లేదేమో!. అందుకే మళ్లీ ఏపీ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారాలకు దిగుతున్నారు. తాజాగా అనంతపురం జిల్లా రాప్తాడులో జాకీ కంపెనీ యూనిట్ భూకేటాయింపుల అంశాన్ని ప్రస్తావిస్తూ వైఎస్సార్సీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రచారానికి దిగారు. ‘జాకీ కంపెనీని మేం తెస్తే.. దాన్ని బెదిరించి వెళ్లగొట్టారు’.. ఇది ఇప్పుడు టీడీపీ నేతలు చేసుకుంటున్న ప్రచారం. మరి వాస్తవాలు బయటపెట్టి.. ప్రజల దాకా తీసుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది కదా. అందుకే వైఎస్సార్సీపీ నేతలు ఆధారాలతో సహా ఆ వ్యవహారాన్ని బయటపెట్టారు. ఇందుకోసం జాకీకి కేటాయించిన స్థలాన్ని పరిశీలించి.. యెల్లో బ్యాచ్ చేస్తున్న ఫేక్ ప్రచారాన్ని గట్టిగా తిప్పి కొట్టారు. రాప్తాడులో తెలుగుదేశం పార్టీ కార్యాలయం సమీపంలోనే జాకీ కోసం 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు స్థలం కేటాయించాడు. రాప్తాడులో హైవే పక్కనే ఉండే ఈ స్థలం కనీసం విలువ రూ.150 కోట్లు. దీన్ని కేవలం రూ.3 కోట్లకే కట్టబెట్టడం వెనక అవినీతి జరిగింది. పరిటాల సునీతతో పాటు అప్పటి మంత్రి నారా లోకేష్ కూడా ఈ వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. విచిత్రమేమంటే.. 2015లో జాకీ కంపెనీకి స్థలం కేటాయిస్తే.. అక్కడ ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణం చేపట్టలేదు. అంటే.. ఇక ఇటుక కూడా కనిపించని స్థలం నుంచి జాకీని వెళ్లగొట్టారంటూ టిడిపి ప్రచారం చేయడం దుర్మార్గం కాక మరేముంది!. మరో విచిత్రం ఏంటంటే.. రాప్తాడు టీడీపీ కట్టిన స్థలం కూడా పండమేటి వెంకటరమణ స్వామి ఆలయ భూమి కబ్జా చేసిందని తేలడం!. -
'చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది'
సాక్షి, అనంతపురం: చంద్రబాబు హయాంలోనే కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు పునాది పడిందని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి విమర్శించారు. ఆయన పాలనలోనే సాగునీటి ప్రాజెక్టులు నిర్లక్ష్యానికి గురుయ్యాయని ధ్వజమెత్తారు. కర్ణాటక అక్రమ ప్రాజెక్టులకు చంద్రబాబు ఏనాడూ అభ్యంతరం చెప్పలేదని దుయ్యబట్టారు. ఆల్మట్టి ప్రాజెక్టు ఎత్తు పెంచినా చంద్రబాబు నోరు మెదపలేదని గుర్తు చేశారు. '2017లో రెండో విడత అప్పర్‌భద్ర ప్రాజెక్టుకు అనుమతులు వచ్చాయి. అప్పటిముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు అభ్యంతరం చెప్పలేదు. ఈ ప్రాజెక్టుపై సీఎం జగన్ ప్రభుత్వం అభ్యంతరాలు చెబుతూనే ఉంది. న్యాయపోరాటం చేస్తోంది.' అని తోపుదుర్తి వ్యాఖ్యానించారు. చదవండి: మెరుగైన పనితీరు కనబర్చాలి: సీఎం జగన్ -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, ఆత్మకూరు: మాజీ మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్‌పై ఆత్మకూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. మండలంలోని సింగంపల్లి, వై.కొత్తపల్లి, పి.యాలేరు, ఆత్మకూరు మీదుగా పరిటాల శ్రీరామ్ గురువారం పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా ఆత్మకూరు సభలో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రజల మధ్య గొడవలు ప్రేరేపించేలా మాట్లాడారు. దీనిపై వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పరిటాల శ్రీరామ్‌తో పాటు టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బండి పరశురామ్‌పై ఐపీసీ సెక్షన్ 153 ఏ, 505 (2) కింద కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
పరిటాల సునీతకు చేదు అనుభవం
-
దళిత మహిళపై చెయ్యెత్తిన పరిటాల సునీత
సాక్షి, అనంతపురం(రాప్తాడు): టీడీపీ నాయకురాలు, మాజీమంత్రి పరిటాల సునీత దళిత మహిళపై దౌర్జన్యం చేశారు. ‘ఏయ్..’ అంటూ చెయ్యెత్తి కొట్టేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. అనంతపురం జిల్లా రాప్తాడు మండలం మరూరు గ్రామంలో సోమవారం పరిటాల సునీత పర్యటించారు. ఈ సందర్భంగా దళిత మహిళ, ఆశా కార్యకర్త అయిన ఆదిలక్ష్మిని కొట్టేందుకు ఆమె యత్నించారు. పరిటాల సునీత అనుచరుడైన రైటర్ కదిరప్ప భూముల విషయంలో తమను మోసం చేశాడంటూ కదిరప్ప సొంత అన్న నారాయణ కోడలైన ఆదిలక్ష్మి నిలదీసింది. దీన్ని జీర్ణించుకోలేని పరిటాల సునీత తన వెంట ఉండే వ్యక్తి గురించి అలా మాట్లాడతావా అంటూ ఆదిలక్ష్మికి వేలు చూపుతూ బెదిరించడమే కాక.. ‘ఏయ్’ అంటూ గద్దించారు. ఆదిలక్ష్మి కూడా ఏమాత్రమూ తగ్గకుండా అంతే స్థాయిలో ఘాటుగా బదులిచ్చింది. ఇలాంటి మోసగాళ్లను పక్కన పెట్టుకుని తిరిగితే నీ పార్టీ నాశనం అయిపోతుందంటూ మండిపడింది. చదవండి: (యువకుడితో వివాహేతర సంబంధం.. వదిలేయాలని వేడుకున్నా..) -
Paritala Family: పరిటాల కుటుంబం.. దిక్కు ‘లేని’ చూపులు
సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పాలనలో సంతోషంగా ఉన్న జనమంతా ఆయన వెంటే నడుస్తున్నారు. ఉనికి చాటుకునేందుకు ప్రతిపక్షాలు చేస్తున్న చీప్ ట్రిక్స్ చూసి ఛీదరించుకుంటున్నారు. ప్రజల నుంచి అడుగడుగునా వ్యతిరేకత వ్యక్తమవుతుండడంతో టీడీపీ నేతలు భయపడిపోతున్నారు. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తే గెలుస్తామా? చేయకుంటే క్యాడర్ వెంట ఉంటుందా? పక్క నియోజకవర్గానికి వెళ్తే బాగుంటుందా? అనే సందిగ్ధంలో కొందరు నేతలు ఉన్నారు. అందులో ముందుగా చెప్పుకోవాల్సింది.. పరిటాల కుటుంబం గురించే! సాక్షి, పుట్టపర్తి: 1994 నుంచి అనంతపురం రాజకీయాల్లో తెలుగుదేశం పార్టీ తరఫున ప్రభావం చూపిన పరిటాల కుటుంబం.. 2019 ఎన్నికల్లో ఓటమి చవిచూసింది. ఆ తర్వాత రాప్తాడు, ధర్మవరం నియోజకవర్గాల బాధ్యతలను పరిటాల కుటుంబ సభ్యులే మోసుకున్నారు. అక్కడే అసలు సమస్య వచ్చి పడింది. ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియక కార్యకర్తలు వెంట వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా ఎక్కడి నుంచి పోటీ చేయాలనే దానిపై పరిటాల కుటుంబ సభ్యులకు కూడా క్లారిటీ లేకుండా పోయింది. రాప్తాడు, ధర్మవరం వద్దనుకుంటే పెనుకొండ నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే దానిపై కూడా సర్వే చేయించుకున్నట్లు తెలిసింది. రాప్తాడుకు రాం..రాం.. రాప్తాడుపై సీఎం జగన్ ప్రత్యేక దృష్టి సారించడంతో నియోజకవర్గంలో అభివృద్ధి పరుగు తీస్తోంది. రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి చేస్తున్న ప్రజారంజక పనులకు విపరీతమైన ఆదరణ లభిస్తోంది. ఫలితంగా వచ్చే ఎన్నికల్లోనూ వైఎస్సార్ సీపీ జెండా ఎగరడం ఖాయమని టీడీపీ నేతలే భావిస్తున్నారు. పేరూరు డ్యాంకు నీళ్లు తీసుకురావడం అంత ఈజీ కాదని.. అప్పట్లో మంత్రిగా ఉన్న పరిటాల సునీత అన్నారు.. దాన్ని కూడా ప్రకాశ్‌రెడ్డి సాధ్యం చేసి చూపించారు. రైతులకు ఉచితంగా బోర్లు వేయించి అందరి మన్ననలు పొందుతున్నారు. ఈ క్రమంలో పరిటాల కుటుంబం రాప్తాడులో మనుగడ సాగించడం కష్టంగా మారింది. అంతేకాకుండా పరిటాల కుటుంబం నుంచి రాప్తాడులో ఎవరు పోటీ చేస్తారనే దానిపై కూడా ఇంకా స్పష్టత లేదు. మాజీ మంత్రి పరిటాల సునీత బరిలో దిగుతారా? లేక ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్ పోటీ చేస్తారా? అనేది క్లారిటీ లేదు. దీంతో పరిటాల కుటుంబం వెనుక నడించేందుకు కార్యకర్తలు వెనుకడుగు వేస్తున్నారు. ధర్మవరం.. అయోమయం రాప్తాడుతో పాటు ధర్మవరం నియోజకవర్గానికి టీడీపీ ఇన్చార్జిగా పరిటాల శ్రీరామ్ కొనసాగుతున్నారు. అక్కడి నుంచి పోటీ చేసేందుకు టీడీపీ టికెట్ వస్తుందా? ఒకవేళ వస్తే పోటీ చేస్తారా? పోటీ చేసినా గెలుస్తాడా? అనే సందేహాలకు సమాధానమే చిక్కడం లేదు. ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. వారి సమస్యలు తెలుసుకుని పరిష్కారం చూపిస్తున్నారు. అక్కడ వైఎస్సార్సీపీ ధాటిని తట్టుకుని టీడీపీ గెలవడం కష్టమని జనం భావిస్తున్నారు. దీనికి తోడు పరిటాల శ్రీరామ్‌కు మరోవైపు వరదాపురం సూరి (గోనుగుంట్ల సూర్యనారాయణ) నుంచి ప్రమాదం పొంచి ఉంది. సూరి టీడీపీలో చేరినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినా.. బీజేపీలో కొనసాగినా.. పరిటాల శ్రీరామ్‌కు నష్టమే. పెనుకొండ.. కష్టమేనంట బీసీ ఓటర్లు అధికంగా ఉన్న నియోజకవర్గం పెనుకొండ. అక్కడి నుంచి వైఎస్సార్సీపీ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న మాలగుండ్ల శంకర్‌నారాయణ మంత్రిగా సేవలందించారు. ఆ తర్వాత ప్రజల్లో ఒకడిగా.. నిత్యం సమస్యలపై దృష్టి పెట్టి.. ఇంటింటా తిరిగి ప్రభుత్వ పథకాలను జనాల్లోకి తీసుకెళ్తున్నారు. అక్కడి నుంచి టీడీపీ తరఫున పోటీ చేసేందుకు బీకే పార్థసారథి, సవితమ్మ ఆసక్తి చూపుతున్నారు. ఇలాంటి తరుణంలో ఓసీ సామాజిక వర్గానికి చెందిన పరిటాల కుటుంబ సభ్యులు పెనుకొండ నుంచి పోటీ చేస్తే డిపాజిట్లు రావడం కూడా కష్టమే. బీసీ ఓట్లు అధికంగా ఉన్న పెనుకొండలో అగ్రవర్ణ కులాల నుంచి పోటీ చేస్తే ఘోరంగా ఓడిపోవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. శ్రీరామ్ చీప్ ట్రిక్స్.. పరిటాల శ్రీరామ్ రాజకీయ రంగ ప్రవేశం చేసిన నాటి నుంచి పరాజయాల బాటలో ఉన్నారు. వెంట నడిచే కార్యకర్తలు కరువయ్యారు. ఈ క్రమంలో రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం లేక.. ఎల్లోమీడియాను అడ్డుపెట్టుకుని చీప్ ట్రిక్స్‌కు పాల్పడుతున్నారు. అసత్య ప్రచారాలు చేయడం.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను బెదిరించడం లాంటివి చేస్తున్నారు. చిన్న చిన్న విషయాలపై అధికారులతో వాగ్వాదానికి దిగడం.. పోలీసులతో వాదించడం చేస్తూ ఉనికి చాటాలని ప్రయత్నిస్తున్నారు. బీసీ, ఎస్సీ కులాలకు చెందిన వారికి రాజకీయ పదవులు ఆశ చూపి.. ఉసిగొల్పి దాడులు చేయిస్తున్నారు. కేసుల్లో ఇరికిస్తే వెంట ఉంటారని.. సొంత పార్టీ వారిపైనే కేసులు పెట్టిస్తున్నారు. (క్లిక్ చేయండి: చంద్రబాబు ఎదుటే తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు) అన్ని ఎన్నికల్లో చిత్తు చిత్తు.. రాప్తాడు నియోజకవర్గంలోని 6 మండలాల్లో జెడ్పీటీసీ, ఎంపీపీల స్థానాలను వైఎస్సార్సీపీ కైవసం చేసుకుంది. ధర్మవరం మున్సిపాలిటీలోని 40 స్థానాలనూ వైఎస్సార్సీపీ తన ఖాతాలో వేసుకుంది. బత్తలపల్లి, తాడిమర్రి, ముదిగుబ్బ మండలాల్లో సైతం జెడ్పీటీసీ, ఎంపీపీ స్థానాల్లో వైఎస్సార్సీపీ నేతలే కొనసాగుతున్నారు. కొత్తగా మున్సిపాలిటీగా అప్‌గ్రేడ్ అయిన పెనుకొండలోని 20 స్థానాలకు 18 చోట్ల వైఎస్సార్సీపీ అభ్యర్థులు గెలిచారు. ఇలా అన్నింటా వైఎస్సార్ సీపీ విజయదుందుభి మోగించడంతో ఎక్కడైనా టీడీపీకి ఎదురుగాలే వీస్తోందని ఆ పార్టీ నాయకులే చెప్పుకుంటున్నారు. (క్లిక్ చేయండి: మాజీ మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు) -
జాకీ పాపం టీడీపీదే.. అప్పట్లోనే సర్దుకున్నారు!
సాక్షి ప్రతినిధి, అనంతపురం: రాప్తాడు నుంచి జాకీ పరిశ్రమ వెనక్కి వెళ్లిపోవడానికి అప్పటి టీడీపీ ప్రభుత్వ తీరు, ఆ పార్టీ నేతల ఒత్తిళ్లే ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఈ పరిశ్రమ ఏర్పాటు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీ గోబెల్స్ ప్రచారానికి దిగింది. తమ తప్పులు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను అడ్డు పెట్టుకుంది. దాని సాయంతో ప్రస్తుత ప్రభుత్వంపై బురద జల్లడానికి ప్రయత్నిస్తోంది. తాజాగా జాకీ నేపథ్యంలో పుట్టుకొచ్చిన పత్రికా కథనాలు కూడా టీడీపీ మోసాలను కప్పిపుచ్చుకునేందుకే అన్నట్టు తేటతెల్లమవుతోంది. టీడీపీ నేతలకు ముడుపులు చెల్లించలేకనే జాకీ వెళ్లిపోయిందనేది వాస్తవం. గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతో.. దుస్తుల తయారీ ఫ్యాక్టరీ పెట్టడానికి టీడీపీ ప్రభుత్వ హయాంలో అంటే 2017 సంవత్సరంలో జాకీ యాజమాన్యం ముందుకు వచ్చింది. రాప్తాడు వద్ద సుమారు 42 ఎకరాల్లో ఈ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాల్సి ఉండేది. 2017 అక్టోబర్ నాటికి భూమిని అభివృద్ధి చేయాలని, నవంబర్ నాటికి సివిల్ వర్క్ పూర్తి చేయాలని, 2018 ఆగస్ట్ నాటికి భవన నిర్మాణాలు పూర్తిచేసి, నవంబర్ నాటికి ఉత్పత్తి ప్రారంభించాలనేది ప్రభుత్వ అగ్రిమెంటు. కానీ 2018 చివర్లో అంటే తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోతున్న దశలో ఆదరాబాదరాగా కాంపౌండ్ వాల్ నిర్మాణానికి పూనుకున్నారు. అందులోనూ అప్పటి మంత్రి తనయుడు, సోదరుడు గుడ్‌విల్ కోసం పట్టుపట్టడంతోనే వాళ్లు వెనక్కు వెళ్లారన్నది అనంతపురం జిల్లాలో అందరికీ తెలిసిన విషయం. ఈ ప్రభుత్వం వచ్చే నాటికే... వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది 2019 మే 30న. అంతకుముందే జాకీ ప్రతినిధులు వెనక్కు వెళ్లిపోయేందుకు సిద్ధమయ్యారు. అప్పటి టీడీపీ ప్రభుత్వ మంత్రి, తన సోదరుడి ఒత్తిడి మేరకు ఇక్కడ తాము పెట్టుబడులు పెట్టలేమని చేతులెత్తేశారు. ఈ నేపథ్యంలో రెండేళ్ల పాటు కంపెనీ యాజమాన్యం ఒక్క ఇటుక కూడా వెయ్యలేక పోయింది. టీడీపీ, పచ్చమీడియా ఆరోపిస్తున్నట్లుగా 2019లో ఈ ప్రభుత్వం వచ్చాక జాకీ కంపెనీ వెళ్లిపోయి ఉంటే అంతకు ముందు పనులు జరిగి ఉండాలి కదా అన్నది సామాన్యుడి ప్రశ్న. వాస్తవానికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం 2018 అక్టోబర్ నాటికి ఫ్యాక్టరీ పనులన్నీ పూర్తి కావాలి. మరి అప్పటివరకూ కాంపౌండ్ వాల్ కూడా ఎందుకు నిర్మించలేక పోయారన్నది ప్రశ్నగానే ఉండిపోయింది. అనుమతులు పొందిన రెండేళ్ల వరకూ జాకీ యాజమాన్యాన్ని పనులు చేయనివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకుని, కోట్లాది రూపాయల కమీషన్లు డిమాండ్ చేయడం వల్లే వెనక్కు వెళ్లిపోయారనేది బహిరంగ రహస్యం. ముడుపుల పాపాలు కప్పిపుచ్చుకునేందుకు పచ్చమీడియాను రంగంలోకి దించారన్న విమర్శలు వస్తున్నాయి. -
రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి నిద్రపోయింది.. తెల్లారి చూస్తే..
సాక్షి, అనంతపురం(రాప్తాడు): మండలంలోని ప్రసన్నాయపల్లి పంచాయతీ ఇందిరమ్మ కాలనీకి చెందిన వెంకటరామిరెడ్డి కుమారై గడ్డం రాజ సింధూరి (18) కనిపించడం లేదు. అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్న సింధూరి శనివారం రాత్రి ఇంట్లో కుటుంబసభ్యులతో కలసి నిద్రపోయింది. ఆదివారం తెల్లవారుజామున 5.30 గంటలకు తల్లిదండ్రులు నిద్ర లేచి చూడగా కనిపించడం లేదు. బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసినా ఆచూకీ లభించకపోవడంతో రాప్తాడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రాఘవరెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు 94407 96817కు సమాచారం ఇవ్వాలని కోరారు. చదవండి: (హనీట్రాప్ వెనుక ఇదీ కుట్ర!.. ఇంజనీరింగ్ విద్యార్థినితో కథ అమలు) -
పరిటాల శ్రీరామ్.. మా తండ్రిని హత్య చేయించింది మీరు కాదా?
సాక్షి, కనగానపల్లి (అనంతపురం): తగరకుంట సర్పంచ్‌గా పనిచేసిన మా తండ్రి బోయ ముత్యాలప్పను రాజకీయ ఆధిపథ్యం కోసం మీ నాన్న పరిటాల రవీంద్ర హత్య చేయించింది నిజం కాదా ? అని ముత్యాలప్ప కుమారుడు వెంకటరాముడు పరిటాల శ్రీరామ్‌ను ప్రశ్నించారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి కుటుంబంపై టీడీపీ నాయకుడు పరిటాల శ్రీరామ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ బుధవారం ఆయన కనగానపల్లిలో విలేకరులతో మాట్లాడారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ వాల్మీకులపై ప్రేమ ఒలకబోసినట్లు శ్రీరామ్ కట్టు కథలు చెపుతున్నాడన్నారు. మీ ఫ్యాక్షన్ రాజకీయాలతో ఐక్యంగా ఉన్న వాల్మీకులను విడగొట్టింది పరిటాల కుటుంబమే అన్నారు. కనగానపల్లి, రామగిరి మండలాల్లో ప్రతి గ్రామంలోనూ వాల్మీకుల మధ్య చిచ్చు పెట్టి వాళ్లు చంపుకొనేవరకు తీసుకొచ్చింది మీరు కాదా? అని ప్రశ్నించారు. 2007 తర్వాతా రాజకీయాల్లోకి వచ్చిన తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి తన సేవాభావంతో పేద రైతులకు ఉచితంగా బోర్లు వేయించటంతో పాటు మహిళలను ఆర్థికంగా ఆదుకున్నారన్నారు. ఇక ఎమ్మెల్యే అయిన తర్వాతా నియోజక వర్గంలో పలు అభివృద్ధి పనులు చేయించటంతో పాటు పేరూరు డ్యాంకు కృష్ణ జలాలు తీసుకొచ్చిన అపర భగీరథుడు ప్రకాష్‌రెడ్డి అన్నారు. పేద ప్రజల కష్టాన్ని తీరుస్తున్న తోపుదుర్తి కుటుంబంపై అనవసరమైన ఆరోపణలు చేయటం మానుకోవాలని ఆయన పరిటాల శ్రీరామ్‌కు, టీడీపీ నాయకులకు సూచించారు. చదవండి: (‘బాబూ పరిటాల శ్రీరామ్.. మా నాన్న ఇన్ని రోజులకు గుర్తుకొచ్చాడా?’) -
టీడీపీ వర్గీయుల చేతిలో వైఎస్సార్సీపీ కార్యకర్త దారుణ హత్య
-
పరిటాల సునీత, శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం(రాప్తాడు): నిబంధనలకు విరుద్ధంగా బహిరంగ సభ నిర్వహించిన మాజీ మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్‌తో పాటు మరికొందరిపై రాప్తాడు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు ఎస్ఐ బి.రాఘవరెడ్డి గురువారం తెలిపారు. జిల్లాలో 30 పోలీస్ యాక్ట్ అమలులో ఉన్నందున అనుమతులు లేకుండా సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదన్నారు. అయితే రాప్తాడు మండల టీడీపీ కన్వీనర్ పంపు కొండప్ప, ప్రధాన కార్యదర్శి దగ్గుపాటి శ్రీనివాసులు, ఉపాధ్యక్షుడు రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షుడు మల్లికార్జున తదితరులతో కలిసి సునీత, శ్రీరామ్ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, అభిమానులు బుధవారం జాతీయ రహదారిపై ర్యాలీ చేపట్టడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం కలిగిందన్నారు. అలాగే తహసీల్దార్ కార్యాలయం ఎదుట ప్రచార వాహనంపై నుంచి సునీత, శ్రీరామ్, సర్పంచ్ సాకే తిరుపాలు, పంపు కొండప్ప, సీపీఐ రాప్తాడు నియోజకవర్గ కార్యదర్శి రామకృష్ణ తదితరులు ప్రసంగాలు చేశారని, 30 యాక్ట్ ఉల్లంఘన కింద వీరిపై కేసు నమోదు చేసినట్లు వివరించారు. చదవండి: (హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పీఏ అరెస్ట్) -
అనంతపురంలో టీడీపీ నేతల భూదందాలు
-
కష్టాల కడలి: రాత మార్చిన ‘గీత’
రాప్తాడు: చేయి పట్టుకుని నడక నేర్పించే తండ్రి దూరం కావడం.. ఆ చిన్నారి ఒంటరితనానికి కారణమైంది. కుటుంబ పోషణ కోసం అమ్మ పడుతున్న కష్టం కలచి వేసింది. పలుగు... పార చేతబట్టి ఉపాధి పనులకు పోయిన తల్లి చేతుల నిండా బొబ్బలు.. అన్నం ముద్ద తినిపిస్తున్న ఆమె చేతిలోని గాయాలు ఆ చిన్నారి హృదయాన్ని మరింత గాయపరిచాయి. ఏదో తెలియని ఒత్తిడి. ఆ భారం నుంచి బయటపడేందుకు తనకొచ్చిన గీతలతో కాలక్షేపం. ఆ గీతలే చివరకు అతని ఒత్తిడిని దూరం చేశాయి. అభద్రతాభావం నుంచి బయటపడేస్తూ అద్భుత చిత్రకారుడిని ఈ లోకానికి పరిచయం చేశాయి. అతనే షేక్ మహమ్మద్ అర్షద్ (ఎస్.ఎం.అర్షద్). చనిపోవాలనుకుని.. రాప్తాడుకు చెందిన బికెన్బాషా, కౌసర్‌బాను దంపతులకు ఇద్దరు కుమారులు. పదేళ్ల క్రితం భార్యాపిల్లలకు బికన్బాషా దూరమయ్యాడు. దిక్కుతోచని స్థితిలో కౌసర్‌బాను కొట్టుమిట్టాడింది. చిల్లిగవ్వ కూడా చేతిలో లేక సతమతమవుతున్న కౌసర్‌బాను తన ఇద్దరు కొడుకులతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆ సమయంలో పుట్టింటి వారు ఆమెకు ధైర్యం చెప్పారు. మదర్‌థెరిస్సా చిత్రాన్ని గీస్తున్న అర్షద్- అర్షద్ గీసిన త్రీడీ చిత్రం.. ఎలాగైనా ఇద్దరు కొడుకులను ప్రయోజకులను చేయాలని అనుకున్న ఆమె ఉపాధి పనులతో పాటు కూలి పనులకు వెళ్లడం మొదలు పెట్టింది. ఏనాడూ ఎండ ముఖం ఎరుగని ఆమె.. ఒక్కసారిగా తట్టాబుట్ట పట్టుకుని పొలాల బాట పట్టింది. ఈ క్రమంలోనే తమ కోసం తల్లి పడుతున్న తపన ఆ ఇద్దరు చిన్నారులనూ కదిలించింది. తల్లి రెక్కల కష్టం వృథా కాకూడదనుకున్న వారు ఇష్టంతో చదువుకుంటూ రాప్తాడు ఏపీ మోడల్ స్కూల్లో సీటు దక్కించుకున్నారు. ప్రస్తుతం కౌసర్‌బాను పెద్ద కుమారుడు ఎస్.ఎం.అర్షద్ స్థానిక ఏపీ మోడల్ స్కూల్లో ప్రస్తుతం పదో తరగతి చదువుతున్నాడు. గీతలతోనే కాలక్షేపం రాప్తాడులోనే అద్దె ఇంటిలో నివసిస్తున్న కౌసర్‌బాను.. అప్పు చేసి కుట్టుమిషన్ సమకూర్చుకుంది. ఉదయం ఉపాధి పనులకు పోవడం, ఇంటికి వచ్చిన వెంటనే కుట్టు మిషన్ మీద ఇతరుల దుస్తులు కుట్టి ఇవ్వడం ద్వారా వచ్చే సంపాదనతో పొదుపుగా జీవనం సాగించడం మొదలు పెట్టింది. ఇలాంటి సమయంలోనే తాను ఇంటి వద్ద లేని సమయంలో అర్షద్ కాగితాలపై గీతలు గీస్తుండడం ఆమె గ్రహించింది. నోటు పుస్తకాల నిండా గీతలు గమనించిన ఆమె ఒక్కసారిగా అసహనానికి గురైంది. అసలే అప్పులతో కుటుంబాన్ని నెట్టుకొస్తుంటే.. చదువులకు ఇక నోటు బుక్కులు ఎలా కొనుగోలు చేయాలంటూ కుమారుడిని మందలిస్తూ వచ్చింది. ఇలాగే గీతలు గీస్తూ కూర్చొంటే తనలా కూలి పనులకు వెళ్లాల్సి ఉంటుందని కుమారుడిని హెచ్చరించింది. బుద్ధిగా బాగా చదువుకుని మంచి ఉద్యోగం తెచ్చుకుని జీవితంలో బాగా ఎదగాలని హితబోధ చేసేది. త్రీడీ చిత్రాలు గీయడంలో దిట్ట ఇంటి వద్ద ఒంటరితనాన్ని దూరం చేసుకునేందుకు పిచ్చి గీతలు గీయడం మొదలు పెట్టిన అర్షద్... ఆ తర్వాత ఆ గీతల ద్వారా అద్భుతాలను ఆవిష్కరించడం మొదలు పెట్టాడు. తల్లి ఇస్తున్న డబ్బును దాచుకుని వాటితో తనకు కావాల్సిన పెన్నులు, స్కెచ్‌లు, పెయింట్స్, డ్రాయింగ్ పేపర్లు కొనుగోలు చేయడం మొదలు పెట్టాడు. ఇంటిలో ఒంటరిగా ఉన్న సమయంలో బొమ్మలు గీయడం మొదలు పెట్టాడు. అతనిలోని కళాకారుడిని అతని క్లాస్మేట్స్ గుర్తించి ప్రోత్సహిస్తూ వచ్చారు. ఈ క్రమంలోనే తాను చదువుకుంటున్న స్కూల్లోని ఉపాధ్యాయుల చిత్రాలను గీసి, అందరి మన్ననలూ పొందాడు. ఆ సమయంలోనే త్రీడీ చిత్రాలు గీయడం నేర్చుకోవాలని ఉపాధ్యాయులు సూచించారు. అప్పటి వరకూ త్రీడీ చిత్రాలు అంటే ఏమిటో తెలియని అర్షద్.. ఇంటికెళ్లిన తర్వాత సెల్ఫోన్లో యూట్యూబ్ ద్వారా త్రీడీ చిత్రాలు గీయడం చూసి సాధన మొదలు పెట్టాడు. చూస్తుండగానే అందరినీ అబ్బురపరిచే స్థాయికి ఎదిగాడు. అర్షద్లోని ప్రతిభను తల్లి కౌసర్ గుర్తించింది. కుమారుడి అభీష్టం మేరకు అతనికి ఇష్టమైనవి కొనుగోలు చేసి ఇస్తూ మరింత ప్రోత్సహిస్తూ వచ్చింది. -
ఆశావర్కర్ అనిత కేసు ఓ డ్రామా
సాక్షి, అనంతపురం: టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత బురద రాజకీయాలు మరోసారి బయటపడ్డాయి. ఆశావర్కర్ అనితను పరామర్శించిన పరిటాల సునీత ప్రభుత్వంపై ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించిన కీలక విషయాలను సీఐ విజయభాస్కర్ వెల్లడించారు. చెర్లోపల్లిలో లైంగిక వేధింపులపై ఆశావర్కర్ అనిత పోలీసులకు ఫిర్యాదు చేసి ఆత్మహత్యాయత్నం చేసింది. అయితే ఆమె ఉద్దేశపూర్వకంగానే, నలుగురు వైఎస్సార్సీపీ కార్యకర్తలపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీంతో పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. ఈ ఘటనపై లోతుగా దర్యాప్తు చేసి వాస్తవాలను వెల్లడించారు. అనిత కేసు ఓ డ్రామాగా ప్రాథమిక విచారణలో తేలిందని పోలీసులు పేర్కొన్నారు. ఆమెపై ఎలాంటి లైంగిక వేధింపులు జరగలేదని తెలిపారు. ఉద్యోగం నుంచి తీసేస్తారని అనిత అపోహ పడిందని సీఐ విజయభాస్కర్ తెలిపారు. రాజకీయ ఒత్తిడితో అనిత కేసు పెట్టిందని సీఐ పేర్కొన్నారు. అనిత ఆత్మహత్యాయత్నం ఓ డ్రామా, ఆమె పాయిజన్ తీసుకోలేదని చెప్పారు. లైంగిక వేధింపుల ఆరోపణలపై ఎలాంటి ఆధారాలు లభించలేదని వెల్లడించారు. ఈ కేసులో రాజకీయ కుట్ర కోణం ఉందని సీఐ విజయభాస్కర్ పేర్కొన్నారు. పరిటాల సునీత మహానటి.. సాక్షి, అనంతపురం: రాప్తాడు మండలం చెర్లోపల్లి ఆశావర్కర్ ఘటనను టీడీపీ మాజీ మంత్రి పరిటాల సునీత రాజకీయం చేయాలనుకోవడం దురదృష్టకరమని రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి మండిపడ్డారు. పరిటాల సునీత చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. దౌర్జన్యాలకు కేరాఫ్ అడ్రస్ పరిటాల వర్గమే అని మండిపడ్డారు. తప్పుడు ఆరోపణల ద్వారా రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారని తెలిపారు. మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఆశా వర్కర్ అనిత టీడీపీ ట్రాప్‌లో పడిందని తెలిపారు. పరిటాల సునీత మహానటి అనే విషయం అందరికీ తెలిసిందేనని, తాజాగా ఆశా వర్కర్ ఘటనను రాజకీయం చేసేందుకు దర్శకత్వ బాధ్యతలు తీసుకున్నారని విమర్శించారు. ఇటీవల జరిగిన పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల్లో ఘోర ఓటమి నేపథ్యంలో ఉనికి చాటుకునేందుకు ఓ చిరుద్యోగిని అడ్డుపెట్టుకుని రాజకీయానికి సిద్ధమయ్యారన్నారు. జిల్లా ఎస్పీ సత్యయేసుబాబు శాంతిభద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరిస్తున్నారనే విషయం గుర్తుంచుకోవాలన్నారు. ఆశా వర్కర్ అనిత ఆరోగ్య పరిస్థితిపై ఎప్పటికప్పుడు డాక్టర్లను అడిగి తెలుసుకుంటున్నామని, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఆశా వర్కర్ కుటుంబం వైఎస్సార్సీపీ సానుభూతి పరులని, తమలో తమకే చిచ్చు పెట్టేందుకు సునీత ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. పరిటాల శ్రీరాంపై మూడు ఎఫ్ఐఆర్లు నమోదయ్యాయని.. వైఎస్సార్ విగ్రహాన్ని ధ్వంసం చేసింది తానేనని శ్రీరాం ఒప్పుకున్నా... ఇప్పటి వరకు అరెస్టు చేయలేదన్నారు. చట్టం తనపని తాను చేసుకుపోతుందనే నమ్మకంతో ఉన్నామన్నారు. నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకు సాగుతున్నట్లు తెలిపారు. చదవండి: చంద్రబాబుపై ఘాటు వ్యాఖ్యలు చేసిన ఎంపీ విజయసాయి రెడ్డి -
పరిటాల శ్రీరామ్‌పై కేసు నమోదు
సాక్షి, అనంతపురం: రాప్తాడు టీడీపీ ఇంఛార్జి పరిటాల శ్రీరామ్‌పై చెన్నేకొత్తపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. శ్రీరామ్‌తో సహా తొమ్మిది మంది టీడీపీ కార్యకర్తలపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. ముష్టికోవెల గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త వెంకట్రాముడుపై టీడీపీ కార్యకర్తలు దాడి చేశారు. పంచాయతీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీకి ఎందుకు మద్దతు ఇచ్చావంటూ పరిటాల వర్గీయులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటన నేపథ్యంలో పరిటాల శ్రీరామ్‌పై పోలీసులు 324 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. చదవండి: నిమ్మగడ్డది అప్పుడో మాట.. ఇప్పుడో మాట -
80 టన్నుల కూరగాయల పంపిణీ
-
సీఎం వైఎస్ జగన్ మహిళలకు నేన్నునాను అని బరోసా ఇస్తున్నారు
-
నిర్లక్ష్యాన్ని సహించబోం
బోధనలో నిర్లక్ష్యం వహించినా, మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోయినా సహించేది లేదని జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం ఆయన రాప్తాడులో ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ అడిగిన పలు ప్రశ్నలకు విద్యార్థులు సమాధానాలు చెప్పలేకపోవడం పట్ల అసహనం వ్యక్తం చేశారు. బోధన విధానం బాగోలేదన్నారు. సాక్షి, రాప్తాడు : విద్యా బోధనలో ఉపాధ్యాయులు నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని కలెక్టర్ ఎస్.సత్యనారాయణ హెచ్చరించారు. శుక్రవారం రాప్తాడు ఉన్నత పాఠశాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా ఉపాధ్యాయుల హాజరుపట్టిక, మధ్యాహ్న భోజన వివరాలు పరిశీలించారు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. విద్యార్థులు సమాధానం చెప్పలేక తడబడ్డారు. మరి కొంతమంది విద్యార్థులను సైన్సు, గణితం, ఇంగ్లిష్ సబ్జెక్టులలో ప్రశ్నలు అడగడంతో వారు కూడా చెప్పలేకపోయారు. ఉపాధ్యాయుల బోధన తీరు బాగలేదంటూ కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. విద్యార్థుల చదువు విషయంలో ఎవరు అశ్రద్ధ చేసినా వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు ఉత్సుకత, ప్రేరణ కలిగించేలా బోధన చేయాలని ఉపాధ్యాయులకు సూచించారు. విద్యార్థుల్లో ఆలోచన, పరిశీలనాశక్తి పెగిగేలా సైన్సు ఎగ్జిబిషన్లు, క్విజ్ పోటీలు, ప్రయోగాలు నిర్వహించేలా చూడాలని డీఈఓ శామ్యూల్‌కు సూచించారు. విద్యార్థులు కూడా బాగా చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆకాంక్షించారు. ముఖ్యంగా రీడీంగ్, రైటింగ్, కమ్యూనికేష్‌న్స్ స్కిల్స్‌లో ప్రావీణ్యత సాధించాలన్నారు. భోజనం రుచిగా లేకపోతే చర్యలు మధ్యాహ్న భోజనం రుచిగా లేకపోతే చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు. సాంబారులో ప్రతి 30 మందికి కేజీ చొప్పున ఆరు కేజీలు కంది పప్పు వాడాల్సి ఉండగా ఐదు కేజీలే వాడినట్లు తెలుసుకున్న కలెక్టర్ సదరు ఏజెన్సీ నిర్వాహకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సాంబారులో కూడా కాయగూరలు తక్కువగా ఉన్నాయన్నారు. మరొకసారి పాఠశాలను తనిఖీ చేస్తానని, ఆ రోజు ఇదే విధంగా మధ్యాహ్న భోజనం ఉంటే ఏజెన్సీని బాధ్యతల నుంచి తప్పిస్తామని స్పష్టం చేశారు. మెనూ ప్రకారం భోజనం ఉండేలా పర్యవేక్షించాలని హెచ్ఎం నరసింహులును ఆదేశించారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ రామాంజనరెడ్డి పాల్గొన్నారు. -
‘రౌడిషీటర్లని ఎందుకు అనుమతించారో చెప్పాలి’
సాక్షి, అమరావతి : ఓటమి భయంతో కౌంటింగ్ ప్రాంతాల్లో అలజడి సృష్టించేందుకు సీఎం చంద్రబాబు పన్నాగం పన్నారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి గౌతమ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో కౌంటింగ్ రోజున గొడవలు సృష్టించేందుకు టీడీపీ కుట్రలు, కుయుక్తులకు తెరతీసిందని అన్నారు. ఆ క్రమంలోనే పదిహేడుమంది రౌడీ షీటర్లు, నేర చరిత్ర ఉన్నవారిని కౌంటింగ్ ఏజెంట్లుగా నియమించిందని ఆరోపించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి గోపాలకృష్ణ ద్వివేదీని ఆయన మంగళవారం కలిసి ఆధారాలతో సహా టీడీపీ కుట్రలను ఆయన దృష్టికి తీసుకొచ్చారు. రౌడీషీటర్లను కౌంటింగ్ ప్రక్రియలంలో పాల్గొనకుండా అడ్డుకోవాలని వినతి పత్రం అందించారు. కౌంటింగ్ ఏజెంట్లుగా రౌడీషీటర్లని ఎందుకు అనుమతించారో జిల్లా అధికారులు చెప్పాలని గౌతమ్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులను బెదించడం, భయపెట్టడం కాదంటే కాల్లబేరానికి రావడం చంద్రబాబు నైజం అని ఎద్దేవా చేశారు. -
మంత్రి పరిటాల సునీత దాష్టీకం
సాక్షి, అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి సహకరించని వారిని మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ టార్గెట్ చేశారు. మంత్రి అండతో చెన్నెకొత్తపల్లి మండలం నాగసముద్రం గ్రామంలో పరిటాల వర్గీయులు రెచ్చిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలపై దాడులకు పాల్పడ్డారు. పోలింగ్ రోజున వైఎస్సార్ సీపీకి ఎందుకు ఓట్లు వేశారంటూ రాడ్లు, కర్రలతో దాడి చేశారు.ఈ సంఘటనలో నలుగురు వైఎస్సార్ సీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడినవారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మరోవైపు దాడులు చేసిన వారిలో ఇద్దరిని స్థానికులు పట్టుకుని పోలీసులకు అప్పగించారు. అయితే దాడికి పాల్పడ్డ పరిటాల వర్గీయులను వదిలివేయాలంటూ మంత్రి పరిటాల సునీత... ఎస్ఐ రఫీకి ఫోన్ కాల్ చేశారు. మంత్రి ఆదేశాలతో దాడి చేసినవారిని ఎస్ఐ వదిలివేయడంతో పాటు, పోలీసులు ఓ వర్గంవారికే వత్తాసు పలుకుతున్నారంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆరోపించారు. రాప్తాడు టీడీపీ అభ్యర్థి పరిటాల శ్రీరామ్ ఆదేశాలతోనే దాడులు చేశామని నిందితులు చెబుతున్నా పోలీసులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ఎన్ఎస్ గేట్ వద్ద ఆందోళనకు దిగారు. -
వైఎస్ఆర్సీపీ అభ్యర్ధి కాన్వాయ్‌పై రాళ్లదాడి
-
పరిటాల వర్గీయుల బెదిరింపులు.. పట్టించుకోని పోలీసులు
సాక్షి, అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాప్తాడు అభ్యర్థి తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. అత్యంత సమస్యాత్మక ప్రాంతమైన ఈ నియోజకవర్గంలో పోలీసులు వైస్సార్సీపీ అభ్యర్థికి భద్రత కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డిని చంపుతామని మంత్రి పరిటాల సునీత వర్గీయులు బహిరంగంగానే ప్రకటిస్తున్నా.. పోలీసులు నిమ్మకు నీరెత్తనట్లు వ్యవహరిస్తున్నారు. తోపదుర్తి గ్రామం నుంచే రాకపోకలు సాగిస్తున్న ప్రకాష్ రెడ్డి ఆయన సోదరులు.. మదిగుబ్బ- బి.యాలేరు మధ్య చేపట్టిన కల్వర్టు నిర్మాణాలపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ దారిలో పోలీసు గస్తీ ఏర్పాటు చేయించాలని, వారం కిందటే జిల్లా కలెక్టర్, ఎస్పీలను వైఎస్సార్సీపీ నేతలు కలిసి విజ్ఞప్తి చేశారు. అయినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పోలీసుల తీరుపై రాప్తాడు వైఎస్సార్సీపీ నేత వెన్నపూస రవీంద్రారెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన రాజశేఖర్ యాదవ్, కురుబ నాగిరెడ్డిలతో కలిసి మీడియాతో మాట్లాడారు. మంత్రి పరిటాల సునీత హింసా రాజకీయాలకు పాల్పడుతున్నారని, కొడుకు శ్రీరామ్‌ను గట్టెక్కించేందుకు దేనికైనా తెగిస్తున్నారని తెలిపారు. తోపుదుర్తి బ్రదర్స్‌కు ప్రాణహాని ఉందని, అనుమానస్పద ప్రాంతాలపై ఫిర్యాదు చేసిన ఎందుకు పట్టించుకోవడంలేదని ప్రశ్నించారు. మంత్రి పరిటాలకు కొందరు అధికారులు, పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. భద్రతా వైఫల్యంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామన్నారు. -
బెదిరింపనుకోండి.. వార్నింగనుకోండి!
సాక్షి, అనంతపురం: ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే లక్ష్యంతో జిల్లాలో అధికార పార్టీ నాయకులు చేస్తున్న బెదిరింపులు తారస్థాయికి వెళ్తున్నాయి. వారి మాటాలు సామాన్య ప్రజలను భయోత్పాతానికి గురి చేస్తున్నాయి. ఎలాగైనా అధికారాన్ని దక్కించుకోవాలనే ఉద్దేశంతో బరితెగింపులకు దిగుతుండడం పట్ల ప్రజలు విస్మయం చెందుతున్నారు. నిజంగా వారిని గెలిపిస్తే కలిగే ఇబ్బందులను తలుచుకుంటూ ఆందోళన చెందుతున్నారు. ‘నన్ను గెలిపించండి. ఎమ్మెల్యే కాగానే ఆర్నెల్లు అవకాశం ఇస్తా. ప్రత్యర్థులను కాళ్లు చేతులు విరచండి. చంపుతారా చంపండి. నేను చూసకుంటా’నని ధర్మవరం ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ బెదిరించిన వైనం మరువకముందే రాప్తాడు నియోజకవర్గం కనగానపల్లి ఎంపీపీ భర్త చేసిన బెదిరింపులు కలకలం రేపుతున్నాయి. ఆయన మాట్లాడిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ‘వచ్చేది మా ప్రభుత్వమే. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి పోతాడు. ఎన్నికలలోపు అందరూ తెలుగుదేశం వైపు రావాలి. లేదంటే మీ ఇష్టం’ అంటూ కనగానపల్లి ఎంపీపీ పద్మగీత భర్త ముకుందనాయుడు బీసీ, ఎస్సీలను బహిరంగంగా బెదిరింపులకు గురి చేశారు. ఈ నెల 13న కనగానపల్లి మండలం ముత్తవకుంట్ల పంచాయతీ తల్లిమడుగుల గ్రామంలో మంత్రి పరిటాల సునీత ఎన్నికల ప్రచారం ప్రారంభించారు. స్వయానా మంత్రి సమక్షంలో బహిరంగ సభలో ఎంపీపీ భర్త ఇచ్చిన వార్నింగ్ దుమారం రేపుతోంది. ‘కచ్చితంగా మళ్లీ మేమే అధికారంలో ఉంటాం. పరిటాల శ్రీరామ్ అసెంబ్లీకి వెళ్తాడు. గుర్తు పెట్టుకోండి. బెదిరింపు అన్నా అనుకోండి, వార్నింగ్ అన్నా అనుకోండి. పద్ధతిగా ఉండండి. మారేందుకు అవకాశం ఇస్తున్నాం. ఎన్నికల్లోపు ఈ పక్క ఉండాలి. పొరబాటు జరిగిందంటే మాత్రం వచ్చే మా ప్రభుత్వంలో తీవ్ర ఇబ్బందులు ఉంటాయి. దీనికి రెడీగా ఉండండి’ అంటూ హెచ్చరించారు. పరిటాల కుటుంబ దౌర్జన్యాలకు పరాకాష్ట పరిటాల కుటుంబం సాగిస్తున్న దౌర్జన్యాలకు ఈ ఘటన పరాకాష్టగా నిలుస్తోందని నియోజకవర్గ ప్రజలు మండిపడుతున్నారు. తాము చేసే మంచి పనులను ప్రజలకు వివరించి, వారిలో అభిమానం సంపాదించి ఓట్లు వేయించుకోవడం తప్పు కాదని, అయితే బలవంతంగా తమ పార్టీకే ఓట్లు వేయాలనే ధోరణిలో బెదిరింపులకు దిగడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. పరిటాల శ్రీరామ్ సూచనల మేరకే ముకుందనాయడు ఇలా బెదిరిస్తున్నారని, ఆయన్ను గెలిపిస్తే ఆరాచకాలు మితిమీరిపోతాయంటూ ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి బెదిరింపులకు ఓటు ద్వారా బుద్ధి చెబుదామని స్పష్టం చేస్తున్నారు. -
పరిటాల కుటుంబంలో టికెట్ చిచ్చు!
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత కుటుంబంలో ఎమ్మెల్యే టికెట్ చిచ్చురేపింది. వివరాల్లోకి వెళ్తే.. పరిటాల కుటుంబం రాప్తాడు, కల్యాణదుర్గం టికెట్లను తమకు కేటాయించాలని టీడీపీ అధిష్టానాన్ని కోరింది. అయితే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు పరిటాల కుటుంబానికి ఒక టికెట్ మాత్రమే ఖరారు చేశారు. రాప్తాడు టికెట్‌ను మరోసారి పరిటాల సునీతకు కేటాయించారు. అయితే ఆ స్థానం నుంచి పోటీ చేసేందుకు సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ఆసక్తి కనబరిచారు. దీంతో రాప్తాడు నుంచి శ్రీరామ్‌ను బరిలో నిలిపేందుకు సునీత సిద్దమయ్యారు. తాము రెండు స్థానాలు కోరినప్పటికీ చంద్రబాబు ఒకటే సీటు కేటాయించడంతో.. సునీత పోటీ నుంచి తప్పుకున్నారు. శ్రీరామ్‌ను గెలిపించాల్సిందిగా ఆమె పార్టీ శ్రేణులను కోరారు. కాగా, రాప్తాడు నుంచి శ్రీరామ్ పోటీపై సునీత కుటుంబంలో అభిప్రాయ భేదాలు చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. శ్రీరామ్ పోటీని కుటుంబంలోని మరో వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది. -
రాప్తాడులో రాజకీయ హత్య
అనంతపురం సెంట్రల్: రాప్తాడు నియోజకవర్గంలో హత్యారాజకీయాలకు అంతులేకుండా పోతోంది. జిల్లాలో సీఎం చంద్రబాబు పర్యటిస్తుండగానే విపక్ష వైఎస్సార్ సీపీకి చెందిన ప్రముఖ నేతను దారుణంగా హతమార్చడం సంచలనం రేకెత్తించింది. టీడీపీ నాయకులు ఎంతటికి బరితెగిస్తున్నారని చెప్పేందుకు బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యనే నిదర్శనం. దృష్టి మళ్లించి.. బుధవారం ఉదయం 11 గంటలకు గుమ్మఘట్ట మండలం భైరవాని తిప్ప ప్రాజెక్ట్ వద్ద సీఎం చంద్రబాబు పైలాన్ ఆవిష్కరణకు వచ్చారు. ఇందుకు జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని సీఎం కార్యక్రమానికి ఆత్మకూరు మీదుగానే తరలించారు. సీఎం చంద్రబాబు బీటీపీలో కాలు పెట్టే గంట ముందు అంటే పది గంటల సమయంలో ఆత్మకూరులో కాపు కాచి వైఎస్సార్ సీపీ సీనియర్ నేత జి.కేశవరెడ్డిని హతమార్చారు. పథకం ప్రకారం జరిగిన ఈ దాడిలో తాము ఎంతకైనా తెగిస్తామంటూ టీడీపీ నేతలు చెప్పకనే చెప్పినట్లేంది. పరిటాల కుటుంబం ప్రమేయంతోనే.. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాప్తాడు నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు శ్రుతిమించిపోయాయి. ఆధిపత్యం నిలుపుకునేందుకు విపక్ష వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు, హత్యలకు తెగబడుతున్నారు. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరాం ప్రమేయంతోనే నియోజకవర్గంలో దౌర్జన్యాలు, హత్యారాజకీయాలు పెరిగిపోతున్నాయంటూ విపక్ష పార్టీలే ఏక కంఠంతో నినదిస్తున్నాయి. గతంలోనూ ఇలానే.. రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డి విషయంలోనూ ఇలానే జరిగింది. పథకం ప్రకారం తహసీల్దార్ కార్యాలయానికి రప్పించుకుని అతన్ని అధికార పార్టీ నాయకులు హత్య చేశారు. వైఎస్సార్ సీపీలో ముఖ్య నేతలకు ప్రత్యర్థులను పరిటాల కుటుంబం చేరదీస్తూ.. వారిద్వారా హత్యారాజకీయాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అల్లరి మూకలు, కిడ్నాపర్లు, నేరాలతో ప్రత్యక్ష సంబంధాలు ఉన్న వారిని శ్రీరాం తన కోటరీలో చేర్చుకుంటూ దారుణాలకు తెగబడుతున్నాడనే విమర్శలు ఉన్నాయి. బెంగుళూరుకు చెందిన ఓ రియల్ఎస్టేట్ వ్యాపారిని కిడ్నాప్‌చేసి రామగిరి మండలం కొత్తపల్లి బంధించిన ఘటనలోనూ పరిటాల కుటుంబం హస్తమున్నట్లు అప్పట్లో ఆరోపణలు వెలువడ్డాయి. బుధవారం ఆత్మకూరులో జరిగిన కేశవరెడ్డి హత్యలోనూ మంత్రి పరిటాల సునీత సోదరుడు బాలాజీ ప్రమేయమున్నట్లు హతుడి బార్య స్వయంగా పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం. తండ్రి బాటలో తనయుడు తన తండ్రి పరిటాల రవీంద్ర బాటలోనే హత్యారాజకీయాలతో ఆధిపత్యం చెలాయించేందుకు శ్రీరాం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా నియోజకవర్గంలోని విపక్ష వైఎస్సార్సీపీలో ముఖ్య నేతలను హతమారుస్తూ వచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. పక్కా పథకం ప్రకారమే ఈ హత్యలు కొనసాగిస్తున్నట్లు ఘటనలు స్పష్టం చేస్తున్నాయి. 2004కు ముందు శత్రుశేషం లేకుండా జిల్లాలో పరిటాల రవీంద్ర మారణకాండను సృష్టించారు. వందల సంఖ్యలో విపక్ష పార్టీలకు చెందిన ముఖ్య నాయకుల ఆచూకీ లభ్యం కాకుండా పోయింది. పదుల సంఖ్యలో మృతదేహాలు వెలుగు చూశాయి. ఇదంతా పరిటాల రవి కనుసన్నల్లోనే జరిగాయనేది బహిరంగ రహస్యం. శ్రీరాం అదే బాటలో పయనిస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. ► 2015 ఏప్రిల్ 29న రాప్తాడు వైఎస్సార్సీపీ మాజీ కన్వీనర్ భూమిరెడ్డి ప్రసాద్‌రెడ్డిని తహసీల్దార్ కార్యాలయంలో దారుణంగా హత్య చేశారు. ► 2016 మే 30న కనగానపల్లి మండలం కుర్లపల్లిలో వైఎస్సార్సీపీ నాయకులపై టీడీపీ నాయకులు దాడి చేశారు. బాధితులను పరామర్శిం చేందుకు ఆస్పత్రికి చేరుకున్న వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డిపై హత్యాయత్నం. ► 2017 నవంబర్‌లో గొందిరెడ్డిపల్లిలో సర్పంచ్ కుమారుడు బాబయ్యపై టీడీపీ వర్గీయుల దాడి. ► 2017 నవంబర్ 12న రామగిరి మండలం పేరూరులో వైఎస్సార్సీపీ కార్యకర్త సుబ్బుకృష్ణపై దాడి. ► 2018 మార్చి 30 అనంతపురం రూరల్ మండలం కందుకూరులో శివారెడ్డి హత్య. ► అనంతరం రూరల్ మండలంలో ఎంపీటీసీ ధనుంజయయాదవ్ హత్యకు కుట్ర. టీడీపీలోకి చేర్చుకునేలా పథక రచన. -
అసెంబ్లీ సాక్షిగా అంగీకరించారు
రాప్తాడు: ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై రాప్తాడు వైఎస్సార్సీపీ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. డ్వాక్రా రుణాలు మాఫీ కాలేదని మంత్రి పరిటాల సునీత అసెంబ్లీ సాక్షిగా అంగీకరించినా మొత్తం మాఫీ చేసినట్లు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. అనంతపురం జిల్లా రాప్తాడులో తోపుదుర్తి విలేకరులతో మాట్లాడుతూ..చంద్రబాబు జరిపే జిల్లా పర్యటనలు వృధా అని విమర్శించారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేర్చలేదని తీవ్రంగా దుయ్యబట్టారు. అనంతలో లక్ష ఇంకుడు గుంతల నిర్మాణం బోగస్ అని వెల్లడించారు. యంత్రాలతో ఉపాధి పనులు చేసి టీడీపీ నేతలు కోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. ఆధారాలతో ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం 4.3 టీఎంసీలు భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు కర్నాటక నుంచి రావాలి కానీ చంద్రబాబు, ఆయన మంత్రులు ఎందుకు అడగలేదని ప్రశ్నించారు. హంద్రినీవా నుంచి భైరవానితిప్ప ప్రాజెక్టుకు నీరు తరలించే సాకుతో 968 కోట్ల రూపాయల పనులు చేపట్టడం భావ్యమా అని ప్రశ్నించారు. మంత్రి కాలువ శ్రీనివాస్‌కు దోచిపెట్టేందుకే ఈ ప్రాజెక్టు చేపట్టారని ధ్వజమెత్తారు. -
మంత్రి పరిటాల వర్గానికి ఎదురుదెబ్బ
సాక్షి, అనంతపురం: మంత్రి పరిటాల సునీత వర్గానికి అనంతపురం కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి 2011లో దాఖలు చేసిన పరువునష్టం కేసు విచారణ పూర్తి అయింది. మంత్రి సునీత సమీప బంధువు ఎల్. నారాయణ చౌదరి రూ. 10 లక్షలు, ఆంధ్రజ్యోతి సిబ్బంది లక్ష రూపాయలు చెల్లించాలని కోర్టు శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది. జూబ్లీహిల్స్ కారుబాంబు కేసులో తనపై అసత్య ప్రచారం చేస్తున్నారని తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం ప్రకాశ్‌రెడ్డికి, ఈ కేసుకు ఎటువంటి సంబంధం లేదని తీర్పు ఇచ్చింది. అనవసరంగా ఆయనపై దుష్ప్రచారం చేసినందుకు తగిన మూల్యం చెల్లించాలని తీర్పు వెలువరించింది. తీర్పు పట్ల తోపుదుర్తి ప్రకాశ్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. -
మైనర్ ఇరిగేషన్ అధికారులతో మంత్రి సమీక్ష
అనంతపురం టౌన్: రాప్తాడు నియోజకవర్గంలోని మైనర్ ఇరిగేషన్ అధికారులతో మంత్రి పరిటాల సునీత నగరంలోని తన స్వగృహంలో మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గానికి గతంలో మంజూరైన పనులు, ఇంకా కావాల్సిన ప్రతిపాదనలపై చర్చించారు. మండలాల వారీగా పనుల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. చెరువుల్లో జంగిల్ క్లియరెన్స్, కాలువల్లో పూడికతీత, దారి పక్కన కంప చెట్ల తొలగింపు పనులు చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం చేస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాప్తాడు : మండల కేంద్రంలోని ప్రసన్నాయపల్లి రోడ్డు సమీపంలో 44వ జాతీయ రహదారిపై బుధవారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. రాప్తాడుకు చెందిన సాకే శివప్రసాద్ (30) ఓ దినపత్రికను ప్రతి రోజూ నార్పల రూటుకు ఆటోలో తీసుకెళ్లేవాడు. దినచర్యలో భాగంగా బుధవారం రాత్రి 11 గంటల సమయంలో ఇంటి నుంచి ఆటోలో దినపత్రిక కార్యాలయానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో డాల్ఫిన్ రెస్టారెంట్ సమీపంలోకి రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో అతడికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రున్ని 108 ద్వారా రాప్తాడు పోలీసులు అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందాడు. ఏడాది కిందట అతడి భార్య విద్యుదాఘాతంతో మృతి చెందింది. అతడికి ఒక కూతురు ఉంది. ఎస్ఐ ధరణిబాబు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
పెళ్లి బస్సు బోల్తా: 10 మందికి గాయాలు
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం గొళ్లపల్లి వద్ద పెళ్లి బస్సు అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో 10 మందికి గాయాలయ్యాయి. హిందూపురం డిపోకు చెందిన బస్సు ఉరవకొండ నుంచి పాలసముద్రం వైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు టైరు పంక్చర్ కావడంతోనే బస్సు బోల్తాపడినట్లు ప్రాధమికంగా సమాచారం. -
రూపాయి ఖర్చు లేకుండా..
♦ అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర కింద 10 మందికి ఉద్యోగాలు ♦ పరిటాల సునీత వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టు కోల్పోతున్నాం ♦ ఆర్నెళ్లలో పట్టిసీమను పూర్తిచేశాననే ముఖ్యమంత్రి.. దమ్ముంటే పేరూరుకు నీళ్లివ్వాలి ♦ తాగునీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి ఉంటే ఎంత? లేకుంటే ఎంత? ♦ రాప్తాడు నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది : తోపుదుర్తి ప్రకాశ్ ♦ కరువుపై చంద్రబాబు మొండిగా వ్యవహరిస్తున్నారు : ఎమ్మెల్యే విశ్వ, ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి ♦ చంద్రబాబు చర్యలతో ‘అనంత’కు తీరని నష్టం : మాజీ ఎంపీ అనంత (సాక్షిప్రతినిధి, అనంతపురం): ‘కర్నూలు జిల్లా మల్యాల నుంచి జీడిపల్లికి నీళ్లు తెచ్చేందుకు రూ.వెయ్యికోట్లు కేటాయించారు. జీడిపల్లి నుంచి పేరూరుకు నీళ్లిచ్చేందుకు రూ.1300కోట్లతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. దోపిడీ చేయడం మినహా నీళ్లిచ్చే ఉద్దేశ్యం ప్రభుత్వానికి లేదు. మడకశిర బ్రాంచ్ కెనాల్ పరిధిలో లిఫ్ట్‌ల సామర్థ్యం పెంచితే ఒక్క రూపాయి ఖర్చు లేకుండా తురకాలాపట్నం నుంచి నీళ్లు ఇస్తా!’ అని వైఎస్సార్సీపీ రాప్తాడు సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రభుత్వానికి సవాల్ విసిరారు. ‘రైతు పోరుబాట’ పేరుతో శనివారం చెన్నేకొత్తపల్లిలో భారీ బహిరంగసభ నిర్వహించారు. టీడీపీ నేతలు ఇటీవల వైఎస్ విగ్రహాన్ని కూల్చేయడం, ప్రత్యేకించి రాప్తాడు నియోజకవర్గంలో తరచూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావడంతో నిరసన తెలిపేందుకు నియోజకవర్గం నుంచి పార్టీ కార్యకర్తలు, వైఎస్ అభిమానులు భారీగా తరలివచ్చారు. మొదటగా ఇటీవల వైఎస్ విగ్రహాన్ని తొలగించిన స్థానంలో నూతన విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు రోజా, పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, నాయకులు తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి, చందులు విగ్రహాన్ని ఆవిష్కరించి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం బహిరంగసభలో ప్రకాశ్‌రెడ్డి మాట్లాడారు. ‘రాప్తాడు నియోజకవర్గంలో ఓట్లు బడుగు, బలహీనవర్గాలవి. పెత్తనం దొరలది. మండలానికో పెత్తందారిని నియమించి రాచరిక పాలన సాగిస్తున్నారు. చెన్నేకొత్తపల్లి మండలంలో ఏదైనా పనికోసం పేదలు పోలీస్‌స్టేషన్, తహసీల్దార్, ఎంపీడీఓ కార్యాలయాలకు వెళితే ‘పెద్దయ్యతో ఫోన్ చేయించు!’’ అంటారు. ఎవరు పెద్దయ్య? ఎవరికి పెద్దయ్య? చెన్నేకొత్తపల్లిలో ఎన్నో గ్రామాలకు తాగునీళ్లు లేవు. నీళ్లు కూడా ఇవ్వలేని మంత్రి పదవి సునీతకు అవసరమా? ఇలాంటి పరిస్థితి ఉంటే సిగ్గు, ఎగ్గూ లేకుండా వైఎస్ విగ్రహాలు కూల్చేస్తున్నారు. మా మంచితనాన్ని చేతకానితనంగా భావించొద్దు. గాలిమరల కంపెనీలతో డబ్బులు దండుకుని నియోజకవర్గంలోని నిరుద్యోగుల కడుపుకొడుతున్నారు. మేం అధికారంలోకి వస్తే ఒక్కో గాలిమర పరిధిలో 10మందికి ఉద్యోగాలు ఇస్తాం. నియోజకవర్గంలో అరాచక పాలన సాగుతోంది. బోయ ఓబులేసును కొట్టినా, కురబ రాజేంద్ర ఎంపీపీ కాకుండా రాజకీయం చేసినా చర్యలు లేవు. రోజులు ఎప్పుడూ ఒకేలా ఉండవని గ్రహించాలి’ అని అన్నారు. ధనార్జనే లక్ష్యంగా పని చేస్తున్నారు ‘గొల్లపల్లి రిజర్వాయర్ పనులను పాతకాంట్రాక్టర్కు రద్దు చేయించి, నామినేషన్ కింద రూ.53కోట్లతో సునీత తన బినామీ కాంట్రాక్టర్‌కు పనులు కట్టబెట్టింది. ఇందులో రూ.6.73కోట్లు మేర ఎక్కువ చెల్లింపులు జరిగాయని కాగ్ పేర్కొంది. అయినా ఎలాంటి చర్యలు లేవు. 2, 3 ప్యాకేజీల్లో కూడా చంద్రబాబు, సునీత బినామీ కంపెనీలైన సీఎం రమేశ్, ఎస్ఆర్ కన్స్ట్రక్షన్స్కు పనులు కట్టబెట్టారు. సునీత పాత కాంట్రాక్టు రద్దు చేయడం వల్ల రాప్తాడు నియోజకవర్గంలో 74వేల ఎకరాల ఆయకట్టును కోల్పోయాం. హంద్రీ–నీవా వెడల్పు చేస్తామని చంద్రబాబు అంటున్నారు. వైఎస్ డిజైన్ చేసింది 100 క్యూబిక్ మీటర్లు. మీరు చెబుతోంది అంతే! ఎకరా ఆయకట్టుకు కూడా నీళ్లు ఇవ్వలేనపుడు పనులు ఎందుకు చేయాలి. మట్టిపనులు తవ్వి నిధులు స్వాహా చేయడం మినహా ఇందులో మరో ఉద్దేశ్యం లేదు. పట్టిసీమను 6నెలల్లో పూర్తి చేశామని చంద్రబాబు గొప్పలు చెబుతున్నారు. అదే చిత్తశుద్ధి పేరూరుపై ఉంటే ఆర్నెళ్లలో నీళ్లు ఇస్తామని చంద్రబాబు చెప్పగలడా?’ అని ప్రకాశ్‌రెడ్డి నిలదీశారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ చైర్పర్సన్ తోపుదుర్తి కవిత, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బోయ సుశీలమ్మ, మాజీ మేయర్ రాగే పరుశురాం, రాష్ట్ర కార్యదర్శి ఎల్ఎం మోహన్‌రెడ్డి, ట్రేడ్‌యూనియన్ జిల్లా అధ్యక్షులు ఆదినారాయణరెడ్డి, రైతు విభాగం రాయలసీమ అధ్యక్షులు శరత్ చంద్రారెడ్డి, నాయకులు ఆలమూరు శ్రీనివాసరెడ్డి, మీసాల రంగన్న, శ్రీదేవి, రంగంపేట గోపాల్‌రెడ్డి, మహానందిరెడ్డి, కృష్ణవేణి, దేవి, నాగేశ్వరరెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, బాలకృష్ణారెడ్డి , సాధిక్‌వలి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ విగ్రహం కూల్చడంపై క్షమాపణ చెప్పాలి ‘ప్రజల గుండెల్లో నుంచి వైఎస్‌ను చెరిపివేయాలనుకోవడం కాదు.. చేతనైతే వైఎస్ కంటే మంచిపాలన అందించండి. అంతేకానీ విగ్రహాలు కూల్చేయడం కాదు. వెంటనే విగ్రహం కూల్చివేతపై ప్రభుత్వం క్షమాపణలు చెప్పాలి. 130 ఏళ్లలో భయంకర కరువు ఇది. బతకలేక ప్రజలు వలసెళ్లారు. మూడేళ్లలో 200మందికిపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. అయినా ‘అనంత’పై చంద్రబాబుకు కనికరం లేదు. కరువుపోగొడతా అని రెయిన్గన్లకు రూ.160కోట్లు ఖర్చు చేశారు. ఖర్చుల పేరుతో మరో రూ.100 కోట్లు కాజేసేందుకు స్కెచ్చేశారు. ‘సాక్షి’లో కథనం రాగానే ఆగారు. పంటకుంటలు తవ్వాలని చంద్రబాబు చెబుతున్నారు. పంట కుంటల్లో కాంక్రీట్ వేస్తారు. ఆ నీరు భూమిలోకి ఇంకదు. జిల్లాలో ఆవిరి నష్టం ఎక్కువ. నీరు వృథా అవుతుంది. ఇదే జరిగితే భూగర్భజలాలు తగ్గి లక్షల బోర్లు ఎండిపోతాయి. చంద్రబాబు లెక్కప్రకారం 1.10కోట్ల ఖాతాల్లో రూ.87 వేలకోట్ల రుణాలను మాఫీ చేయాలి. మాఫీ జరగకపోవడంతో 40లక్షల ఖాతాలు డిఫాల్డ్ అయ్యాయి. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి ఓ జోకర్లా మారిపోయాడు. –ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి బాబు చర్యలతో రైతులకు తీరని నష్టం ‘రూ.1070కోట్లతో ఇన్పుట్ సబ్సిడీ కోసం కేంద్రానికి ప్రతిపాదనలు పంపితే అందులో 50 శాతం రూ.535కోట్లు కేంద్రం విడుదల చేసింది. రాష్ట్రవాటా 535కోట్లు కలిపి 1070కోట్లు ఇన్‌పుట్‌సబ్సిడీ రావాలి. మరో 450కోట్లు ఇన్సూరెన్స్ రావాలి. కానీ ఇన్సూరెన్స్‌ను తమ వాటాగా రాష్ట్ర ప్రభుత్వం భావించి ఇన్సూరెన్స్, ఇన్‌పుట్‌సబ్సిడీ అన్నీ కలిపి రూ.1030 కోట్లు ఇస్తామంటోంది. ఇలా చేయడం ‘అంనత’ రైతులకు తీరని మోసం చేయడమే! చంద్రబాబు తన జేబు కంపెనీ అయిన బజాజ్‌కు ప్రీమియం చెల్లించేలా చేశారు. వారికున్న లావాదేవీలతో ఇన్సూరెన్స్‌పై నిలదీయలేకపోతున్నారు. రైతులు ఎవ్వరూ ఆత్మహత్యలు చేసుకోద్దు. ప్రభుత్వం మెడలు వంచైనా మన హక్కులు సాధించుకుందాం’. – అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎంపీ విగ్రహాలపై ప్రతాపమెందుకో? రైతులకు మూడు పూటలా అన్నం పెట్టిన పెద్ద దిక్కు, ఇళ్లు లేని నిరుపేదలు తలదాచుకునేందుకు 45 లక్షల గృహాలు నిర్మించిన మహోన్నత నేత విగ్రహాలను ధ్వంసం చేయడం బాధాకరం. దౌర్జన్యాలు చాలాకాలం నిలవవు. రైతులకు చెల్లించాల్సిన ఇన్పుట్ సబ్సిడీ, ఇన్సూరెన్స్‌ను ఇప్పటిదాకా చెల్లించకుండా కాలయాపన చేస్తున్న మహానుభావుడా? రైతుల ప్రాణాలతో ఆడుకోవద్దు. వారి స్వేదం పది మందికీ అన్నం పెడుతుంది. అలాంటి రైతుల ఉసురు తీసేలా నిర్లక్ష్యంగా వ్యవహరించి ఆ పాపాన్ని మూటగట్టుకోవద్దు. – ఎమ్మెల్సీ గోపాల్‌రెడ్డి పోరుబాటకు మీరే బాసట ప్రజల సంక్షేమ కోసం తలపెట్టిన ఈ రైతు పోరుబాటకు ప్రజలు బాసటగా నిలవడం చూస్తే గర్వంగా ఉంది. కరువుతో రైతుల ఆత్మహత్యలు ఓవైపు, వర్షాలు రాక తాగేందుకు గుక్కెడు నీరు లభించని దుర్భిక్ష పరిస్థితులు మరోవైపు నాట్యం చేస్తుంటే ముఖ్యమంత్రి ఈ జిల్లాలోనే పుట్టినరోజు వేడుకలు జరుపుకొంటానని చెప్పడం సిగ్గుచేటు. అయ్యా..! ఈ జిల్లాలో ఇకపై మీ జన్మదిన వేడుకలు జరుపుకోవద్దు. కరువుతో పోట్లాడలేక ఇబ్బంది పడుతున్న మాపై మీ పుట్టినరోజు వేడుకల ఖర్చులు కూడా మోపి మరింత దెబ్బతీయొద్దు. – వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ అన్యాయాన్ని ప్రశ్నిస్తే కేసులా? ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించినా అన్యాయంగా కేసులు బనాయిస్తున్నారు. టీడీపీ నేతలు చట్టాన్ని పూర్తిగా చేతుల్లోకి తీసుకుని ప్రజాస్వామాన్ని ఖూనీ చేసేలా వ్యవహరిస్తున్నారు. ప్రజలు గుండెల్లో గుడి కట్టుకుని పూజించే వైఎస్సార్ విగ్రహాలను ధ్వంసం చేయడాన్ని ఏ ఒక్కరూ జీర్ణించుకోలేకపోతున్నారు. – రాయదుర్గం సమన్వయకర్త కాపు రామచంద్రారెడ్డి 70 ఏళ్ల నాటి కరువు చూస్తున్నాం 70 ఏళ్ల క్రితం నాటి కరువు స్పష్టం కనిపిస్తోందని పెద్దలు చెబుతున్నారు. పాలకులు రైతు సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే ప్రకృతి కూడా సహకరిస్తుంది. వైఎస్సార్ మనసు మంచిది కావడంతోనే ఆయన పాలనలో రాష్ట్రం సుభిక్షంగా ఉండేది. – కదిరి సమన్వయకర్త సిద్దారెడ్డి ఏం ఒరగబెట్టావు ‘బాబూ’ ‘అనంత’ అంటే అమితమైన ప్రేమని చెబుతున్నావు. మూడేళ్లలో జిల్లాకు ఏం ఒరగబెట్టావు. పలానా కార్యక్రమం చేశానని చంద్రబాబు కానీ, టీడీపీ నేతలు కానీ చెప్పగలరా?. ఇలాంటివారు అనంతకే మొదటి ప్రాధాన్యత అని చెప్పడం సిగ్గుచేటు. ప్రతీసారి ప్రజలు మోసపోరు. వచ్చే ఎన్నికల్లో బుద్ధి చెబుతారు. – నదీం అహ్మద్, మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జేసీని మెడబట్టి బయటకు నెడతారు తాడిపత్రికి చెందిన జేసీకి బయటి వారిపైనే నోటి దురుసు. బయట మాట్లాడే మాటలు ఇంట్లో పిల్లల్ని అంటే కుటుంబ సభ్యులే వారిని మెడబట్టి బయటకు నెడతారు. కేవలం బాబును ప్రసన్నం చేసుకునేందుకు ఇంత దిగజారి వ్యవహరించాల్సిన అవసరం లేదు. – తాడిపత్రి సమన్వయకర్త పెద్దారెడ్డి గూండాలను ఎన్నుకున్నామా? ప్రభుత్వ ఉద్యోగులను చెప్పుతో కొట్టేవారు కొందరు.. ఆత్మహత్య చేసుకునేదాకా వేధించేవారు మరికొందరు.. మహిళలు అని కూడా చూడకుండా అధికారులపై దాడి చేసేవారు ఇంకొందరు.. ఓట్లేసి గూండాలను ఎన్నుకున్నట్లయింది. – మడకశిర సమన్వయకర్త తిప్పేస్వామి 20 సార్లు పర్యటించినా ప్రయోజనం శూన్యం ఆరొందల అబద్ధాలతో మూడేళ్లపాటు కాలం వెళ్లదీస్తున్న చంద్రబాబు ఈ జిల్లాకు 20 సార్లు వచ్చి వెళ్లినా ఒక్క పైసా కూడా జిల్లా అభివృద్ధిని కాంక్షించి ఖర్చు చేయలేదు. వైఎస్సార్ విగ్రహాలను ఈ ప్రాంతంలో ధ్వంసం చేసిన వారిని శిక్షించాల్సిన పోలీసులు చిల్లర దొంగలపై కేసులు బనాయించి చేతులు దులుపుకొంటున్నారు. – రాష్ట్ర యువజన కార్యదర్శి ధనుంజయయాదవ్ -
కట్నం వేధింపులకు వివాహిత బలి
చెన్నేకొత్తపల్లి(రాప్తాడు): మండలంలోని గంగినేపల్లిలో నాగమణి(24) అనే వివాహిత అదనపు కట్నం వేధింపులు తాళలేక బుధవారం ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఆయన కథనం ప్రకారం... గ్రామానికి చెందిన ఆదెమ్మ, రాములప్ప దంపతుల కుమార్తె నాగమణి వివాహం బుక్కపట్నం మండలం సిద్దరాంపురానికి చెందిన దైవకుమార్తో రెండేళ్ల కిందట అయింది. అదనపు కట్నం కోసం భర్త సహా అత్తమామల వేధింపులు అధికం కావడంతో మూడు నెలల కిందట ఆమె మెట్టినింటి నుంచి పుట్టినింటికి వచ్చింది. అప్పటి నుంచి తల్లిదండ్రుల వద్ద ఉంటూ కొత్తచెరువులో టైలరింగ్ శిక్షణ పొందేది. రెండ్రోజుల కిందట భర్త అక్కడి వచ్చి బెదిరించడంతో మనస్తాపానికి గురైన నాగమణి మంగళవారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలో పడిపోయింది. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం వెంటనే ఆమెను అనంతపురం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం అస్పత్రిలోనే మృతి చెందింది. మృతురాలి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
'పోలీసులతో నాకు ప్రాణహాని ఉంది'
-
జంట హత్య కేసులో నిందితుల అరెస్ట్
వివాహేతర సంబంధం మానుకోనందుకే హత్య పోలీసుల విచారణలో ఒప్పుకున్న నిందితులు రాప్తాడు మండలం బుక్కచెర్లకు జయచంద్రారెడ్డి, అశోక్‌రెడ్డిల కేసులో నిందితులను అనంతపురం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలను సోమవారం సాయంత్రం రూరల్ పోలీసుస్టేషన్లో సీఐ కష్ణమోహన్ మీడియాకు వెల్లడించారు. జయచంద్రారెడ్డి గ్రామంలోని ఓ మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. ఎన్నిసార్లు చెప్పినా అతను పద్ధతి మార్చుకోకపోవడంతో రాప్తాడు మండలం గాండ్లకొత్తపల్లికి చెందిన బాల సోమనాథ్, గొల్లప్రతాప్, బుక్కచెర్లకు చెందిన పూజారి లక్ష్మినారాయణలు జయచంద్రారెడ్డి హత్యకు కుట్రపన్నారు. అందులో భాగంగా ఈ నెల 11న రాత్రి అనంతపురం నుంచి ఇంటికి ఆటోలో వెళుతున్న జయచంద్రారెడ్డిని కక్కలపల్లి సమీపంలో అటకాయించారు. గొంతునులిమి హత్య చేశారు. జయచంద్రారెడ్డి వెంట అశోక్‌రెడ్డి కూడా ఉండడంతో ఎక్కడ సాక్ష్యం చెబుతాడోననే ఉద్దేశంతో ఆటోను స్టార్ట్ చేసేందుకు ఉపయోగించే తాడుతో ఉరితీశారు. ఇద్దరినీ రోడ్డు పక్కన పడేసి వెల్లిపోయారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలో నిందితులు సోమవారం బుక్కచెర్ల వీఆర్వో సాకే ప్రసాద్ ఎదుట లొంగిపోయారు. ఆయన నేరుగా ముద్దాయిలను సీఐ కష్ణమోహన్‌కు వద్దకు పిలుచుకొచ్చారు. నిందితులను అరెస్ట్ చేసి, హత్యకు ఉపయోగించి ద్విచక్రవాహనం, సెల్‌ఫోన్, తాడును సీఐ స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్‌కు పంపుతున్నట్లు వివరించారు. కార్యక్రమంలో ఎస్ఐ జగదీష్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన పాము భయం
సడన్ బ్రేక్‌తో ఆటో బోల్తా ఒక ప్రయాణికుడు మృతి మరో ఏడుగురికి గాయాలు పోలీసుల అదుపులో డ్రైవర్ ముత్తువకుంట్ల నుంచి సోమవారం ప్యాసింజర్ ఆటో పది మంది ప్రయాణికులతో మండల కేంద్రం కనగానపల్లికి బయల్దేరింది. కోనాపురం దాటగానే రోడ్డుపై ఎదురుగా పాము కనిపించడంతో భయపడిపోయిన డ్రైవర్ తిరుపాలు సడన్ బ్రేక్ వేశాడు. దీంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడింది. అందులో ప్రయాణిస్తున్న బాలేపాళ్యం గ్రామానికి చెందిన నడిపి నరిసింహులు (50), అక్కమ్మ, బొమ్మయ్య, శ్రీరాములు, రామస్వామి, పెద్దన్న, ప్రకాష్, నరిసింహులు గాయపడ్డారు. స్థానికులు గమనించి వారిని కనగానపల్లి ఆరోగ్య కేంద్రానికి తీసుకొని వచ్చారు. తీవ్రంగా గాయపడిన నడిపి నరిసింహులు అప్పటికే మతి చెందినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. మిగిలిన వారికి ప్రథమ చికిత్స చేసి వారిలో కొందరిని మెరుగైన వైద్యం కోసం అనంతపురం తరలించారు. మతుడి కుటుంబ సభ్యుల రోదనలతో కనగానపల్లి పీహెచ్సీ ఆవరణం దద్దరిల్లింది. ప్రమాదానికి కారణమైన ఆటో డ్రైవర్ తిరుపాలును పోలీసులు అదుపులోకి తీసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. -
రెచ్చిపోతున్న పరిటాల శ్రీరామ్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గంలో రౌడీ రాజ్యం రాజ్యమేలుతోంది. అధికారం అండతో మంత్రి పరిటాల సునీత తనయుడు పరిటాల శ్రీరామ్ తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. హంద్రీ-నీవా జల సాధన సమితి ఆధ్వర్యంలో గురువారం రామగిరి మండలం పోలేపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశాన్ని అడ్డుకునేందుకు అల్లరిమూకలు బీహార్ తరహాలో రాళ్లు, కట్టెలు పట్టుకుని రోడ్లపై నిలబడి భయానక పరిస్థితులను తలపించారు. ఈ మొత్తం వ్యవహారం వెనుక మంత్రి, ఆమె కొడుకు పరిటాల శ్రీరామ్ ఉన్నట్లు తెలుస్తోంది. ప్రజల మద్దతు పెరుగుతుండడంతో.. జిల్లాకు అన్యాయం చేస్తూ హంద్రీ-నీవా నీటిని అక్రమంగా కుప్పంకు తరలించేందుకు ముఖ్యమంత్రి కుట్ర పన్నారని, ఈ విషయాన్ని జిల్లా ప్రజలకు అవగాహన కల్పించడంలో భాగంగా వైఎస్సార్ సీపీ రాప్తాడు నియోజకవర్గ సమన్వయకర్త తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన హంద్రీ-నీవా జల సాధన సమితి చైతన్య యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ క్రమంలో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు రామగిరి మండలం పోలేపల్లిలో కార్యక్రమం ఏర్పాటుకు ఇన్చార్జ్ సీఐ శ్రీధర్‌తో ముందురోజే ప్రకాష్‌రెడ్డి అనుమతి తీసుకున్నారు. అనుమతి ఉత్తర్వు సీఐ నుంచి ధర్మవరం డీఎస్పీ వేణుగోపాల్‌కు వెళ్లింది. ఏం జరిగిందో ఏమో కానీ డీఎస్పీ అనుమతికి నిరాకరించారు. పరిటాల సునీత, శ్రీరామ్ ఒత్తిడి మేరకే పోలీసులు అనుమతి ఇవ్వలేదనే వాదన వినిపిస్తోంది. దారి పొడవునా రౌడీ, అల్లరిమూకలు పోలేపల్లి సమావేశానికి పోలీసుల అనుమతి ఇవ్వలేదని తెలిసిన తర్వాత పరిటాల శ్రీరామ్ హల్చల్ చేసినట్లు తెలుస్తోంది. చుట్టు పక్కల గ్రామాల్లో తమ అనుచరులుగా ఉన్న కొంతమంది రౌడీ మూకలను దింపి, వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కనిపిస్తే అడ్డుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎన్ఎస్ గేటు నుంచి వెంకటాపురం వెళ్లే దారిలో పాపిరెడ్డిపల్లి క్రాస్, పోలేపల్లి క్రాస్, చిగురుచెట్టు కింద, ఎగువపల్లి క్రాస్, సంజీవరాయుని రైస్‌మిల్, శ్రీహరికోట వద్ద గుంపులు గుంపులుగా జనం కట్టెలు, రాళ్లు, మారణాయుధాలు పట్టుకుని రోడ్డుపై బైఠాయించారు. ఎస్పీని కలిసి ప్రకాష్‌రెడ్డి ఈ క్రమంలో తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి గురువారం మధ్యాహ్నం ఎస్పీ రాజశేఖర్‌బాబును కలిసి నియోజకవర్గంలో పరిటాల శ్రీరామ్ చేస్తున్న దౌర్జన్యాలను వివరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని శాంతిభద్రతలకు విఘాతం కల్గిస్తున్నారని ఆరోపించారు. అనుమతులు ఇవ్వకపోవడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల అండతో వెళ్లి తీరుతాం శాంతియుతంగా నిర్వహిస్తున్న సమావేశాన్ని అధికారం దౌర్జన్యంతో అడ్డుకోవాలని మంత్రి సునీత, ఆమె తనయుడు శ్రీరామ్ చూస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవ ర్గ ప్రజలను పూర్తిగా విస్మరించారు. అన్నివర్గాల నుంచి వస్తున్న వ్యతిరేకతను చూసి జీర్ణించుకోలేక పోలేపల్లి సమావేశాన్ని అడ్డుకున్నారు. పార్టీ కార్యకర్తలు, ప్రజల అండతో రామగిరి పర్యటన కచ్చితంగా చేసి తీరుతాం. దీంట్లో వెనుకడుగు వేసే ప్రసక్తేలేదు. - తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి -
జల్లెడ పడుతున్న పోలీసులు
రాప్తాడు: అనంతపురం జిల్లా రాప్తాడు మండల కళాకారుల కాలనీలో పోలీసులు శనివారం తెల్లవారుజామున నాకా బందీ చేపట్టారు. తిరుపాల్ అనే వ్యక్తిని దుండగులు హత్య చేసి పూడ్చి పెట్టిన దారుణం రెండు రోజుల క్రితం వెలుగు చూసిన విషయం తెలిసిందే. దీంతో కాలనీలో ఏం జరుగుతుందో తెలుసుకోవాలన్న ఎస్పీ ఆదేశాల మేరకు ఓ సీఐ, ఐదుగురు ఎస్ఐలతో పాటు మొత్తం 80 మంది వరకు పోలీసులు కళాకారుల కాలనీలోని ప్రతి ఇంటిని జల్లెడ పడుతున్నారు. అసాంఘిక కార్యకలాపాలకు కేంద్రంగా మారిన ఈ కాలనీలో స్థానికేతరులు ఎవరూ ఉండడానికి వీల్లేదని పోలీసులు హుకుం జారీ చేశారు. -
వదినపై గొడ్డలితో దాడి
రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు మండలం మరూర్ గ్రామంలో వదినపై మరిది గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన జ్యోతి(35)ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్యోతి మరిది నాగార్జున పరారీలో ఉన్నాడు. నాగార్జున ఊర్లో అందరితో గొడవపడుతూ ఉంటాడని, ఎలాంటి కారణం లేకుండానే సైకోలా ప్రవర్తిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
బస్సు నడుపుతూ గుండెపోటుతో డ్రైవర్ మృతి
రాప్తాడు (అనంతపురం జిల్లా) : అనంతపురం జిల్లా రాప్తాడు మండలం బొమ్మిరెడ్డిపల్లె మలుపులో బస్సు నడుపుతుండగా ఆర్టీసీ డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. అంత బాధలోనూ బస్సును పక్కనున్న గోతిలోకి మెల్లగా దింపి ఆపాడు. క్షణాల్లో కూర్చున్న సీట్లోనే మృతిచెందాడు. సంఘటన జరిగినపుడు బస్సులో వంద మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు కాస్త పక్కకు ఒరిగి ఆగిపోవడంతో వారందరూ క్షేమంగా కిందికి దిగారు. ఈ సంఘటన శనివారం రాత్రి 7.30 గంటలకు జరిగింది. అనంతపురం డిపోకు చెందిన పల్లెవెలుగు బస్సు సాయంత్రం బండమీదపల్లెకు బయలుదేరింది. బొమ్మిరెడ్డిపల్లె మలుపు వద్దకు రాగానే డ్రైవర్ ముత్యాలప్పకు కళ్లు తిరిగి ఒళ్లంతా చెమట్లు పట్టాయి. గుండెనొప్పి రావడంతో బస్సును జాగ్రత్తగా ఆపి స్టీరింగ్‌పైనే కుప్పకూలిపోయాడు. గమనించిన కండక్టర్, ప్రయాణికులు వెళ్లి చూడగా అప్పటికే ప్రాణాలు వదిలాడు. వెంటనే 108కు, పోలీసులకు సమాచారం అందించారు. 108 సిబ్బంది డ్రైవర్‌ను అనంతపురం ఆస్పత్రికి తరలిస్తున్నారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళుతున్నారు. -
చంద్రబాబు క్షమాపణ చెప్పాలి: రఘువీరా
అనంతపురం : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్‌ను చంద్రబాబు ఓ పక్క నవ్యాంధ్రను చేస్తానని చెబుతూ మరోవైపు నేరాంధ్రప్రదేశ్‌గా మార్చుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. రాజధాని భూ సేకరణ విషయంలో చంద్రబాబు ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రఘువీరారెడ్డి బుధవారం అనంతపురంలో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ రాప్తాడులో జరిగిన హత్యను చూస్తే ప్రభుత్వం ఈ హత్యలను దగ్గరుండి చేయిస్తున్నట్లుగా కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. ప్రతి పక్ష నేతలకు గన్మెన్లను తొలగించిన ప్రభుత్వం రాజకీయ హత్యలకు లైసెన్స్ ఇస్తుందన్నారు. హత్య తదనంతరం జరిగిన పరిణామాలను గమనిస్తే దీని వెనక టీడీపీ భూ కబ్జాదారుల ప్రమేయం ఉండవచ్చునని అనుమానాన్ని రఘువీరా వ్యక్తం చేశారు. హత్య జరిగిన కార్యాలయంలో రికార్డులను తగులబెట్టడం వెనక పెద్ద కుట్ర దాగి ఉందన్నారు. రాప్తాడులో ఒక ఎకరం కోటి రూపాయల ధర పలుకుతున్న సమయంలో రికార్డులు తగులబెట్టి ఏదో మతలబు చేస్తున్నట్లు అర్ధమవుతోందన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా 43 శాతం ఫిట్మెంట్ ఇవ్వాలని రఘువీరారెడ్డి డిమాండ్ చేశారు. -
'తోపులాటలోనే ఎస్సై నేమ్ బ్యాడ్జ్ పడిపోయింది'
అనంతపురం: రాప్తాడులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భూమిరెడ్డి ప్రసాద్ రెడ్డి హత్యాస్థలం వద్ద లభించిన రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ నేమ్ ప్లేట్ వివాదంపై డీఐజీ బాలకృష్ణ ఎట్టకేలకు పెదవి విప్పారు. హత్యానంతరం అక్కడ జరిగిన తోపులాటను నియంత్రించే క్రమంలోనే ఎస్సై నేమ్ బ్యాడ్జ్ పడిపోయిందని ఆయన మంగళవారం మీడియాకు తెలిపారు. దీంతో పాటు మంత్రి పరిటాల సునీత సెక్యూరిటీని వదిలేశారన్న వార్తలను కూడా డీఐజీ ఖండించారు. మంత్రి సెక్యూరిటీని వదల్లేదని తెలిపారు. ప్రసాద్ రెడ్డి హత్య కేసులో సీఐ శ్రీనివాస్, ఎస్ ఐ నాగేంద్ర ప్రసాద్ లను తొలుత వీఆర్ కు పంపామని.. కేసు దర్యాప్తు కోసమే వారిని తిరిగి యథాస్థానంలో కొనసాగిస్తున్నామన్నారు. వైఎస్సార్ సీపీ నేతలు గుర్నాథ్ రెడ్డి, తోపుదుర్తి చంద్రశేఖర్ రెడ్డి తీసుకొచ్చిన జనాలను నియంత్రించలేకపోయామన్నారు. ఎస్పీతో సహా, ఇతర పోలీసు అధికారులతో వాదనకు దిగారని.. అందుకే ఐదు కేసులు నమోదు చేశామన్నారు. కాగా, డీజీపీ రాముడిపై ఆరోపణలు తనకు బాధ కలిగించాయన్నారు. డీజీపీని మామ, అన్న అంశాన్ని మరో విధంగా ప్రసారం చేస్తున్నారని.. మామ, అన్న అనడం అనంతపురంలో సహజమేనన్నారు. దత్తత గ్రామాల అభివృద్ధి కోసమే డీజీపీ రాముడు మంత్రి పరిటాల సునీత ఇంటికి వెళ్లారన్నారు.ఇదిలా ఉండగా రాప్తాడులో ఆస్తుల విధ్వంసాన్ని అడ్డుకలేకపోయారన్న ప్రశ్నకు జవాబును మాత్రం డీఐజీ దాటవేశారు. -
ప్రసాద్‌రెడ్డి హత్యకేసు: సీఐ, ఎస్ఐలకు వీఆర్
అనంతపురం : అనంతపురం జిల్లా రాప్తాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రసాద్‌రెడ్డి హత్య కేసులో పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. ఇటుకలపల్లి సీఐ శ్రీనివాసులు, రాప్తాడు ఎస్ఐ నాగేంద్ర ప్రసాద్‌లను వీఆర్ (వేకెన్సీ రిజర్వ్)కు పంపుతూ జిల్లా ఎస్పీ రాజేశేఖరబాబు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ప్రసాద్‌రెడ్డి హత్య నేపథ్యంలో పోలీసుల తీరుపై విమర్శులు వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. కాగా రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)ని బుధవారం రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపిన విషయం తెలిసిందే. -
'పాతకక్షలతోనే ప్రసాద్‌రెడ్డిని హత్య చేశారు'
-
'పాతకక్షలతోనే ప్రసాద్‌రెడ్డిని హత్య చేశారు'
అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్‌రెడ్డి హత్యకేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. 14మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. పాత కక్షల కారణంగానే ప్రసాద్ రెడ్డి హత్య జరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు. ఈ కేసులో రాప్తాడు ఎమ్మార్వో, ఆర్ఐలతో పాటు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్‌లను అనుమానితులుగా చేర్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు వేటకొడవళ్లు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. కాగా ప్రసాద్‌రెడ్డి హత్య వెనుక పలు విషయాలు బయటపడుతున్నాయి. ఆయనను కావాలనే ఎమ్మార్వో కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే రాప్తాడు ఎస్ఐ బదిలీ కాగా...కొత్త ఎస్ఐగా నాగేంద్ర ప్రసాద్ నియామకం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాప్తాడు ఎస్ఐగా నాగేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ కార్యకర్తలు, నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇటువంటి పోలీసు అధికారులు చాలామంది ఉన్నారని, హత్యలు జరిగిన తర్వాతే ఉన్నతాధికారులు వస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు. -
పథకం ప్రకారమే..
⇒ వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి దారుణహత్య ⇒ రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో నరికి చంపిన ప్రత్యర్థులు ⇒ పోలీసులు, రెవెన్యూ అధికారుల అండతో మంత్రి పరిటాల సునీత హత్య చేయించారని బంధువుల ఆరోపణ ⇒ తహశీల్దార్, ఎంపీడీవో కార్యాలయాలకు నిప్పు.. రాప్తాడులో ఉద్రిక్తత ⇒ పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు ⇒ 13 మందిపై కేసు.. నిందితుల్లో ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులు (సాక్షి ప్రతినిధి, అనంతపురం): రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లికి చెందిన వైఎస్సార్సీపీ కీలక నేత భూమిరెడ్డి శివ ప్రసాదరెడ్డిని ప్రత్యర్థులు పథకం ప్రకారమే హత్య చేసినట్లు స్పష్టమవుతోంది. బుధవారం రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలో అధికారులందరూ చూస్తుండగానే వేటకొడవళ్లతో అతి కిరాతకంగా నరికి చంపారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల సహకారంతో మంత్రి పరిటాల సునీత ఈ హత్య చేయించారని ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. హత్యతో రాప్తాడుతో పాటు అనంతపురంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ప్రసాదరెడ్డి మొన్నటిదాకా వైఎస్సార్సీపీ రాప్తాడు మండల కన్వీనర్‌గా కొనసాగారు. ప్రస్తుతం ఆయన భార్య సావిత్రి ప్రసన్నాయపల్లి సర్పంచ్‌గా ఉన్నారు. ప్రసాదరెడ్డి ఓ వ్యక్తిగత పని కోసం తహశీల్దార్ కార్యాలయానికి కొన్నిరోజులుగా వస్తూ పోతూ ఉండేవారు. దీన్ని గమనించిన ప్రత్యర్థులు హత్యకు పక్కా వ్యూహం రచించారు. బుధవారం మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలిసి తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు. ఆర్ఐ దివాకర్ గదిలో కూర్చొన్నారు. అప్పటికే ఎనిమిది మంది దుండగులు అక్కడ మాటు వేసివున్నారు. ప్రసాదరెడ్డి ఆర్ఐ ఛాంబర్లోకి వెళ్లిన కొద్దిసేపటికే వారు కార్యాలయం లోపలికి చొరబడ్డారు. మొదట కొందరు ప్రసాద్ అనుచరుడు శివను కంప్యూటర్ గదిలో నిర్బంధించి.. తలుపు వేశారు. ఇంకొందరు ఆర్ఐ ఛాంబర్లోకి వెళ్లి తలుపులు మూసి.. వేటకొడవళ్లతో ప్రసాదరెడ్డిపై విరుచుకుపడ్డారు. మెడపై బలంగా నరికారు. రక్షించుకునే ప్రయత్నంలో ప్రసాదరెడ్డి చేయి అడ్డుపెట్టగా.. చేతివేళ్లు తెగిపోయాయి. ఆయన ఒక్కడే కావడం...ప్రత్యర్థులు భారీగా ఆయుధాలతో రావడంతో ఏమీ చేయలేకపోయారు. వారి దాడిలో అక్కడికక్కడే ప్రాణాలొదిలారు. ప్రసాదరెడ్డికి కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. బోరున విలపించిన కుటుంబ సభ్యులు హత్య విషయం తెలీగానే ప్రసాదరెడ్డి భార్య సావిత్రి, సోదరుడు మహానందరెడ్డితో పాటు కుటుంబ సభ్యులు ఘటన స్థలికి చేరుకున్నారు. రక్తపు మడుగుల్లో ఉన్న ప్రసాదరెడ్డిని చూసి బోరున విలపించారు. ‘వస్తానని చెప్పి వెళ్లి ఇలా అయ్యాడే’ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. ఇంతలోనే భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు, ప్రసాదరెడ్డి అనుచరులు అక్కడికి వచ్చారు. ఆగ్రహావేశాలకు లోనయ్యారు. తహశీల్దార్ కార్యాలయంలోని ఫర్నీచర్‌తో పాటు రికార్డులను ధ్వంసం చేసి.. నిప్పటించారు. బైక్‌లకు నిప్పటించారు. మండల పరిషత్ కార్యాలయంలోకీ చొరబడి.. ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి, నిప్పటించారు. దీంతో పోలీసు బలగాలను భారీగా రప్పించారు. ఎస్పీతో పాటు పలువురు డీఎస్పీలు, సీఐలు, స్పెషల్‌పార్టీ పోలీసులు చేరుకున్నారు. ఎస్పీ కార్యాలయం ఎదుట ఉద్రిక్తత పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని దివంగత సీఎం రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద తీసుకెళ్లేందుకు ఎమ్మెల్యేలు, పార్టీ నేతలు, కార్యకర్తలు భారీర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం వద్ద ర్యాలీని పోలీసులు అడ్డుకున్నారు. మరో దారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. శాంతియుతంగా వైఎస్సార్ విగ్రహం వద్దకు వెళ్లడం కూడా తప్పేనా అని మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డి పోలీసులను నిలదీశారు. పది నెలల్లో చాలా ఘోరమైన సంఘటనలు చోటు చేసుకున్నాయని, పోలీసులు ఏం చేశారని అనంత వెంకట్రామిరెడ్డి నిలదీశారు. డీజీపీ వచ్చిన రోజే పెద్దవడుగూరులో హత్య, అనంతపురం తహశీల్దార్ షేక్ మహబూబ్ బాషాపై దాడి చేశారని గుర్తు చేశారు. ఇవాల తహశీల్దార్ కార్యాలయంలోనే ప్రసాదరెడ్డిని హతమార్చారన్నారు. ఇవన్నీ మీ నిర్లక్ష్యంతోనే జరిగాయంటూ మండిపడ్డారు. డీఎస్పీలు చివరకు జిల్లా ఎస్పీకి సమాచారాన్ని అందించారు. ఎస్పీ వచ్చి ఘటనకు బాధ్యులపై చర్యలు తీసుకుంటామనడంతో వారు శాంతించారు. పక్కా వ్యూహం ప్రకారం హత్య ప్రసాదరెడ్డి హత్య పక్కా వ్యూహం ప్రకారం జరిగింది. ప్రసాదరెడ్డి బుధవారం తహశీల్దార్ కార్యాలయానికి వస్తారనే సంగతిని ప్రత్యర్థులు ముందే ఎలా పసిగట్టారనే దానిపై బోలెడు అనుమానాలు తలెత్తుతున్నాయి.కార్యాలయానికి ప్రసాదరెడ్డిని..తహశీల్దార్ హరికుమార్, ఆర్ఐ దివాకర్ ఫోన్ చేసి పిలిపించినట్లు ఆయన సోదరుడు మహానందరెడ్డి చెబుతున్నారు. పైగా ప్రత్యర్థులు ఆర్ఐ ఛాంబర్లోకి వచ్చిన తర్వాత అక్కడి బీరువాలో నుంచి వేటకొడవళ్లను తీసుకున్నారని కూడా తెలుస్తోంది. అంటే పథకం ప్రకారమే వేటకొడవళ్లను బీరువాలో ఉంచి, హత్యకు రెవె న్యూ అధికారులు కూడా సహకరించారని తెలుస్తోంది. ఎస్ఐ నాగేంద్రప్రసాద ఆధ్వర్యంలోనే హత్య? ప్రసాదరెడ్డి హత్యకు రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ పూర్తిగా సహకరించారని మహానందరెడ్డి ఆరోపిస్తున్నారు. తహశీల్దార్ కార్యాలయం, పోలీసుస్టేషన్ పక్కపక్కనే ఉన్నాయి. రెంటికీ ముళ్లకంచె మాత్రమే అడ్డు. పైగా హత్య జరిగిన ప్రదేశంలో ఎస్ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. అది ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్ఐ కూడా హత్య జరిగే సందర్భంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు. నాగేంద్రప్రసాద్ ఇటీవలే పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. టీడీపీ నేతలకు ఈయన పూర్తిగా సహకరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను రాప్తాడుకు బదిలీ చేయించినట్లు ప్రసాదరెడ్డి బంధువులు ఆరోపిస్తున్నారు. 13 మందిపై కేసు : ప్రసాదరెడ్డి హత్యకు సంబం ధించి 13 మందిపై కేసు నమోదు చేశారు. రాప్తాడు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్, ఉప్పర శ్రీనివాసులతో పాటు పలువురిని నిందితులుగా పేర్కొన్నారు. తలశిల రఘురాం పరామర్శ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రోగ్రాం కో ఆర్డినేటర్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ప్రసాదరెడ్డి కుటుంబీకులను ఓదార్చారు. వారి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ప్రసాదరెడ్డి తమ్ముడు మహానంద రెడ్డితో మాట్లాడారు. మృతదేహం తీసుకెళ్లకుండా ఆందోళన ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం తీసుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే పార్టీ కార్యకర్తలు, మిహ ళలు తహశీల్దార్ కార్యాలయం గేటు ఎదురుగా బైఠాయించి ఆందోళన చేశారు. చివరకు ఎస్పీ రాజశేఖర్‌బాబు.. ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి,మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించారు. మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు సహకరించాలని కోరారు. దీంతో ప్రసాదరెడ్డి వాహనంలోనే మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్రప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం, క్రమశిక్షణ కమిటీ సభ్యులు ఎర్రిస్వామిరెడ్డి, తోపుదుర్తి భాస్కర్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో కార్యకర్తలు ప్రభుత్వాస్పత్రి మార్చురీ వద్దకు వచ్చారు. -
రాప్తాడులో సర్కారీ వేట!
‘అనంత’లో తహసీల్దార్ ఆఫీస్‌లోనే వైఎస్సార్ సీపీ నేత దారుణ హత్య ⇒ పోలీస్‌స్టేషన్‌కు పక్కనే పథకం ప్రకారం ఘాతుకం ⇒ ఘటనాస్థలంలో రాప్తాడు ఎస్ఐ నేమ్‌బ్యాడ్జీ లభ్యం ⇒ మంత్రి పరిటాల సునీత కుటుంబీకులు, పోలీసు, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానాలు సాక్షి ప్రతినిధి, అనంతపురం: అనంతపురం మరోసారి రక్తసిక్తమైంది. విపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రాప్తాడు మండల నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డి(49)పై రాజకీయ ప్రత్యర్థులు వేటకొడవళ్లతో విచక్షణా రహితంగా దాడిచేసి నరికి చంపారు. బుధవారం మధ్యాహ్నం 12 గంటల సమయంలో రాప్తాడు తహశీల్దార్ కార్యాలయంలోని ఆర్ఐ చాంబర్లోనే ప్రసాదరెడ్డి ఉసురు తీశారు. సాక్షాత్తూ రాష్ట్ర పౌరసరఫరాల శాఖా మంత్రి పరిటాల సునీత సొంత నియోజకవర్గ కేంద్రం రాప్తాడులో జరిగిన ఈ ఘటన వెనుక ప్రభుత్వంలోని పెద్దల హస్తం స్పష్టంగా కనిపిస్తోంది. హత్య జరిగిన ప్రాంతం రెవెన్యూ కార్యాలయంలోని ఆర్ఐ చాంబర్ కావడం, అక్కడి బీరువాలోనే హత్యకు ఉపయోగించిన వేట కొడవళ్లను దాచి ఉంచడం, ఘటన జరిగిన ప్రాంతానికి కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడం, ఘటనా ప్రాంతంలో ఆ పోలీస్ స్టేషన్‌కు చెందిన ఎస్.ఐ.నాగేంద్రప్రసాద్ నేమ్ బ్యాడ్జి లభ్యం కావడం, హత్య జరిగిన సమయంలో పోలీస్ స్టేషన్లో అధికారులు సహా సిబ్బంది ఉండడం, అయినా ప్రత్యర్థులు వ్యూహాత్మకంగా హత్య చేయడం వంటి పరిణామాలు ప్రభుత్వ పెద్దల కనుసన్నల్లోనే ఈ దారుణం జరిగిందనడానికి ప్రత్యక్ష నిదర్శనా లుగా కనిపిస్తున్నాయి. కాగా, ప్రభుత్వమే ఈ హత్యను చేయించిందని వైఎస్సార్ సీపీ నేతలు ముక్తకంఠంతో పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనతో ప్రసాదరెడ్డి అనుచరులు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పుపెట్టారు. మరోపక్క ప్రసాదరెడ్డి హత్యతో ఆయన కుటుంబం కన్నీరుమున్నీరైంది. మంత్రి పరిటాల సునీత, ఆమె తనయుడు పరిటాల శ్రీరామ్, పరిటాల మురళిల అండతోనే హత్య జరిగిందని విరుచుకుపడ్డారు. పక్కా ప్రణాళికతో.. మూడు నిమిషాల్లోనే.. రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లి గ్రామ సర్పంచ్ సావిత్రి భర్త ప్రసాదరెడ్డి వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్‌గా గతంలో బాధ్యతలు నిర్వర్తించారు. వ్యక్తిగత పని నిమిత్తం ఇటీవల మండల కేంద్రానికి వస్తూ వెళ్తుండేవారు. ప్రత్యర్థులు దీనిని అవకాశంగా తీసుకుని హత్యకు కుట్ర పన్నారు. ఈ క్రమంలో ప్రసాదరెడ్డిని తహశీల్దార్, ఆర్ఐలే బుధవారం పని ఉందంటూ ఫోన్ చేసి పిలవడంతో మధ్యాహ్నం 12.10 గంటలకు ప్రసాదరెడ్డి తన అనుచరుడు శివయాదవ్‌తో కలసి రాప్తాడు తహశీల్దార్ కార్యాలయానికి వెళ్లారు.అప్పటికే 8 మంది ప్రత్యర్థులు అక్కడ మాటు వేసి ఉన్నారు. ప్రసాదరెడ్డి ఆర్ఐ దివాకర్ గదిలోకి వెళ్లి కూర్చున్నారు. ఇంతలోనే రెప్పపాటు కాలంలో ప్రత్యర్థులు ఒక్కసారిగా కార్యాలయంలోకి చొరబడి, శివయాదవ్‌ను కంప్యూటర్ గదిలోకితోసి తలుపులు మూసి, ఆర్ఐ చాంబర్ లోపల గడియపెట్టి ప్రసాదరెడ్డిపై వేటకొడవళ్లతో విరుచుకుపడ్డారు. మెడపై విచక్షణా రహితంగా నరికారు. చేతిని తెగ్గొట్టారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. రెవెన్యూ కార్యాలయ సిబ్బంది సాక్షిగా మూడు నాలుగు నిమిషాల్లోనే ఈ ఘాతుకం జరిగిపోయింది. ప్రసాదరెడ్డికి భార్య, కుమారుడు రమణారెడ్డి ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. పోలీస్, రెవెన్యూ సిబ్బంది పాత్రపై అనుమానం హత్యకు పోలీసులతో పాటు రెవెన్యూ సిబ్బంది సహకరించారని ప్రసాదరెడ్డి సోదరుడు మహానందరెడ్డి ఆరోపించారు. నాగేంద్రప్రసాద్ ఇటీవల పరిటాల సునీత సొంత మండలం రామగిరి నుంచి రాప్తాడుకు బదిలీ అయ్యారు. ప్రసాదరెడ్డి హత్య కుట్రలో భాగంగానే నాగేంద్రప్రసాద్‌ను ఇక్కడికి బదిలీ చేయిం చినట్లు మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు. ఘటన స్థలంలో ఎస్ఐ నేమ్‌బ్యాడ్జి ప్రసాదరెడ్డి హత్య జరిగిన ప్రదేశంలో రాప్తాడు ఎస్ఐ నాగేంద్రప్రసాద్ నేమ్‌బ్యాడ్జీ దొరికింది. నేమ్‌బ్యాడ్జీ ఊడిపోయి ఉందంటే తోపులాట లేదా ఘర్షణ జరిగి ఉండాలని, అంటే ఎస్ఐ కూడా హత్య జరిగిన సందర్భంలో ఘటనా స్థలంలో ఉన్నట్లేనని బంధువులు ఆరోపిస్తున్నారు.ఈయన టీడీపీ వారికి సహకరిస్తూ.. వైఎస్సార్సీపీ వారి పట్ల పక్షపాతంతో వ్యవహరిస్తుంటారనే విమర్శలున్నాయి. కాగా, ఇటీవల పెద్దవడుగూరు మండలం కిష్టిపాడులో సింగిల్‌విండో అధ్యక్షుడు విజయభాస్కరరెడ్డిని సొసైటీ కార్యాలయంలోనే ప్రత్యర్థులు హత్యచేశారు. ఇంతలోనే ఈ ఘటన జరగడంతో జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసులు విఫలమయ్యారనే వాదన వినిపిస్తోంది. ఎస్పీ కార్యాలయం వద్ద ఆందోళన అనంతపురం ప్రభుత్వాస్పత్రిలో పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ప్రసాదరెడ్డి మృతదేహాన్ని దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్దకు తీసుకెళ్లేందుకు వైఎస్సార్ సీపీ నేతలు, కార్యకర్తలు ర్యాలీగా బయలుదేరారు. ఎస్పీ కార్యాలయం సమీపంలోకి రాగానే పోలీసులు అడ్డుకున్నారు. మరోదారి గుండా వెళ్లాలని సూచించారు. దీంతో వారు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఎస్పీ రాజశేఖరబాబు వచ్చి 24 గంటల్లో నిందితులను పట్టుకుంటామని హామీ ఇవ్వడంతో వారు శాంతించారు. అనంతరం మృతదేహాన్ని ప్రసాదరెడ్డి నివాసానికి తీసుకెళ్లారు. రాప్తాడులో తీవ్ర ఉద్రిక్తత హత్య సమాచారం తెలిసిన వెంటనే ప్రసాదరెడ్డి బంధువులు, అనుచరులు రాప్తాడుకి చేరుకుని ఆర్ఐ చాంబర్లో రక్తపు మడుగులో పడివున్న ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఆయన అనుచరులు ఆవేశానికిగురై.. తహశీల్దార్, మండల పరిషత్ కార్యాలయాల్లోని సామగ్రిని ధ్వంసం చేసి.. నిప్పంటించారు. సీఎం చంద్రబాబు చిత్రపటాలకు నిప్పంటించారు. ప్రసాదరెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు తీసుకెళ్లేందుకు యత్నించగా.. అనుచరులు అడ్డుపడ్డారు. రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన ఎస్పీ రాజశేఖరబాబు.. మహానందరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించి మృతదేహాన్ని అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పాతకక్షలతోనే హత్య: డీఐజీ పాత కక్షల నేపథ్యంలోనే ప్రసాద్‌రెడ్డి హత్య జరిగిందని డీఐజీ బాలకృష్ణ చెప్పారు. బుధవారం ఆయన అనంతపురంలో మీడియాతో మాట్లాడుతూ.. 2003లో రాప్తాడు మండలం ప్రసన్నాయపల్లిలో జరిగిన ఉప్పర చలపతితో పాటు మరో ఇద్దరి హత్య కేసులో ప్రసాద్‌రెడ్డి, ఆయన సోదరుడు మహానందరెడ్డితో పాటు గోపాల్‌రెడ్డి నిందితులన్నారు. కాగా, ప్రసాదరెడ్డి హత్య కేసులో నిందితులను వీలైనంత త్వరగా పట్టుకుంటామని చెప్పారు. సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: వైఎస్సార్ సీపీ నేతలు ప్రసాదరెడ్డిది రాజకీయహత్య అని, పథకం ప్రకారమే పోలీసులు, రెవెన్యూ సిబ్బంది హత్యకు సహకరించారని, మంత్రి పరిటాల సునీతతో పాటు పరిటాల మురళి, శ్రీరామ్ పాత్ర ఉందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపించారు. వైఎస్సార్ సీపీ ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, చాంద్‌బాషా, పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు గురునాథరెడ్డి, కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి, పార్టీ ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాంలు ప్రభుత్వాస్పత్రిలో ప్రసాద్‌రెడ్డి మృతదేహాన్ని సందర్శించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రసాదరెడ్డి హత్యపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.