రాప్తాడు (అనంతపురం జిల్లా): రాప్తాడు మండలం మరూర్ గ్రామంలో వదినపై మరిది గొడ్డలితో దాడి చేశాడు. ఈ ఘటనలో తీవ్రగాయాలపాలైన జ్యోతి(35)ని చికిత్స నిమిత్తం అనంతపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. జ్యోతి మరిది నాగార్జున పరారీలో ఉన్నాడు. నాగార్జున ఊర్లో అందరితో గొడవపడుతూ ఉంటాడని, ఎలాంటి కారణం లేకుండానే సైకోలా ప్రవర్తిస్తుంటాడని గ్రామస్తులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.