సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్‌లో యువతి హంగామా సృష్టించింది. ట్రాఫిక్ హోంగార్డ్‌పై దాడి చేసి ఫోన్ పగలగొట్టింది. రాంగ్ రూట్‌లో వచ్చిన యువతిని హోంగార్డ్ అడ్డుకోగా, యువతి బూతులు తిడుతూ అతని బట్టలు చింపి దాడికి పాల్పడింది. యువతిపై హోంగార్డ్ విగ్నేష్ బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. యువతిపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment