
భార్యపై ఎస్‌ఐ దాడి
యశవంతపుర: ప్రజలకు రక్షణ కల్పించే బాధ్యతాయుతమైన విధుల్లో ఉన్న ఎస్‌ఐ ఏకంగా తన భార్యపై దాడికి పాల్పడ్డాడు. ఈఘటన బెళగావిలో జరిగింది. ఉద్దప్ప కట్టికార ఎస్‌ఐగా పనిచేస్తున్నాడు. ఈయన గతంలో ఉత్తరకన్నడ జిల్లా అంకోలాలో పని చేస్తుండగా భార్య ప్రతిమపై దాడి చేశాడు.
ఘటనపై అంకోలా పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. కోర్టు సూచనల మేరకు ప్రతిమ బెళగావి పట్టణంలోని రామమూర్తి నగరలో నివాసం ఉంటోంది. పిల్లల ఆధార్‌కార్డ్, రేషన్‌కార్డు ఇవ్వాలని ప్రతిమ కోరగా ఎస్‌ఐ దాడి చేశాడు. గొంతు, కన్ను వద్ద బలమైన గాయాలైనట్లు బాధితురాలు బెళగావి బీమ్స్ ఆస్పత్రిలో చేరింది. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదుతో బెళగావి నగర మాళమారుతీ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment