'పాతకక్షలతోనే ప్రసాద్రెడ్డిని హత్య చేశారు' | YSRCP leader prasadareddy murder case, four arrested | Sakshi
Sakshi News home page

'పాతకక్షలతోనే ప్రసాద్రెడ్డిని హత్య చేశారు'

Published Thu, Apr 30 2015 11:07 AM | Last Updated on Tue, May 29 2018 2:48 PM

'పాతకక్షలతోనే ప్రసాద్రెడ్డిని హత్య చేశారు' - Sakshi

'పాతకక్షలతోనే ప్రసాద్రెడ్డిని హత్య చేశారు'

అనంతపురం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ప్రసాద్రెడ్డి హత్యకేసులో నలుగురిని అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజశేఖరబాబు తెలిపారు. 14మందిపై కేసు నమోదు చేసినట్లు ఆయన గురువారమిక్కడ మీడియా సమావేశంలో తెలిపారు. పాత కక్షల కారణంగానే ప్రసాద్ రెడ్డి హత్య జరిగినట్లు ఎస్పీ పేర్కొన్నారు.  ఈ కేసులో రాప్తాడు ఎమ్మార్వో, ఆర్ఐలతో పాటు ఎంపీపీ దగ్గుపాటి ప్రసాద్లను అనుమానితులుగా చేర్చినట్లు ఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుంచి నాలుగు వేటకొడవళ్లు, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.

కాగా ప్రసాద్రెడ్డి హత్య వెనుక పలు విషయాలు బయటపడుతున్నాయి. ఆయనను కావాలనే ఎమ్మార్వో కార్యాలయానికి పిలిపించినట్లు సమాచారం. రెండు నెలల క్రితమే రాప్తాడు ఎస్ఐ బదిలీ కాగా...కొత్త ఎస్ఐగా నాగేంద్ర ప్రసాద్ నియామకం వెనుక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  రాప్తాడు ఎస్ఐగా నాగేంద్ర ప్రసాద్ బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి తమ కార్యకర్తలు, నేతలపై వేధింపులకు పాల్పడుతున్నారని వైఎస్ఆర్ సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. జిల్లాలో ఇటువంటి పోలీసు అధికారులు చాలామంది ఉన్నారని, హత్యలు జరిగిన తర్వాతే ఉన్నతాధికారులు వస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులు చేసినా పట్టించుకోవటం లేదంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement