అనంతలో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన | ysrcp leaders protets in anantapur | Sakshi
Sakshi News home page

అనంతలో వైఎస్ఆర్ సీపీ శ్రేణుల ఆందోళన

Published Wed, Apr 29 2015 6:42 PM | Last Updated on Fri, Jun 1 2018 8:39 PM

వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ఉద్రికత్త పరిస్థితి ఏర్పడింది.

అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు మండలం వైఎస్ఆర్ సీపీ నేత ప్రసాద్ రెడ్డి హత్యానంతరం ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో ప్రసాద్ రెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేశారు. ప్రసాద్ రెడ్డి హత్యను నిరసిస్తూ వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

ప్రసాద్ రెడ్డి మృతదేహంతో ఆస్పత్రి నుంచి ఎస్పీ కార్యాలయం వైపునకు ర్యాలీగా వెళ్లేందుకు వైఎస్ఆర్ సీపీ నేతలు ప్రయత్నించారు. పోలీసులు వైఎస్ఆర్ సీపీ నేతలను అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అనంతపురం జిల్లా రాప్తాడు తాహసీల్దార్ కార్యాలయంలో పట్టపగలు ప్రసాద్ రెడ్డిని దుండగులు హత్య చేసిన విషయం తెలిసిందే.  ఈ రోజు ఉదయం ఆరుగురు దుండగులు  ఎమ్మార్వో కార్యాలయంలోకి ప్రవేశించి... అక్కడే ఉన్న ప్రసాద్రెడ్డిపై వేట కొడవళ్లతో దాడి చేసి దారుణంగా నరికి చంపారు. ఈ ఘటనపై వైఎస్ఆర్ సీపీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement