నేను చెప్పినట్టే వినాలి! | TDP Leader Manohar naidu Rowdy owns up role in raptadu | Sakshi
Sakshi News home page

నేను చెప్పినట్టే వినాలి!

Published Tue, Jun 17 2014 8:45 AM | Last Updated on Fri, Aug 10 2018 9:40 PM

నేను చెప్పినట్టే వినాలి! - Sakshi

నేను చెప్పినట్టే వినాలి!

అనంతపురం  :  రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ నేత ఒకరు రౌడీయిజం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మండలంలో అంతా తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు. తానడిగినంత డబ్బు ఇచ్చుకోవాలంటూ అక్రమ వసూళ్లు చేపట్టారు. కాదు.. కూడదని అన్న వారిపై భౌతికదాడులు చేస్తున్నారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఇప్పటి వరకు 20 మందిపై భౌతికదాడులు జరిగాయి. పోలీసులూ పట్టించుకోకపోవడంతో ఆ నేత పేట్రేగిపోతున్నారు.

ఇటీవల కక్కలపల్లి కాలనీకి చెందిన అంజి, ప్రేమ్, గోవర్ధన్‌లపై భౌతికదాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వార్డుమెంబర్ నాగేంద్ర, శారదమ్మ ఇళ్లపై దాడి చేసి..చంపుతామని బెదిరించారు. ఎంపీటీసీ భర్త శ్రీనివాసులును ఊరు వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రవి అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి అంటిస్తామని బెదిరించారు. ఈ ఘటనలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు.

ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడ్డ పలువురు గ్రామస్తులు సదరు టీడీపీ నేత మనోహర్‌ నాయుడుపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పరిటాల సునీత, టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి చమన్ అండదండలు ఉండటంతో మనోహర్‌ నాయుడు పేట్రేగిపోతున్నాడని, తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement