manohar naidu
-
మీటింగ్‌కు కమిషనర్ డుమ్మా.. గుంటూరు మేయర్ సంచలన వ్యాఖ్యలు
గుంటూరు, సాక్షి: మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి కమిషనర్ పులి శ్రీనివాసులు డుమ్మా కొట్టడంపై మేయర్ కావట్టి మనోహర్ నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వరద సహాయం పేరుతో ఖర్చుపెట్టిన నిధులకు లెక్క చెప్పాల్సి వస్తుందని కారణంతోనే కమిషనర్ సమావేశాలకు రావట్లేదని ఆయన ఆరోపించారు. శుక్రవారం ఆయన సాక్షితో మాట్లాడుతూ.. ..మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసులు(Puli Srinivasulu) ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు.. ప్రభుత్వాన్ని తప్పు దోవ పట్టిస్తున్నారు. మేయర్ నిర్ణయించిన తర్వాత ఖచ్చితంగా సమావేశం నిర్వహించాల్సిందే. ఈనెల 4వ తేదీన జరిగిన సమావేశంలో విజయవాడ వరదల సహాయం కింద ఖర్చుపెట్టి అంశం మీద ప్రశ్న లేవనెత్తాం. ఆ సమావేశం నుంచి ఆయన అర్ధాంతరంగా వెళ్లిపోయారు. అప్పటి నుంచి కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి నాటకాలు ఆడుతున్నారు. నగర వరద బాధితుల సహాయం పేరుతో కార్పొరేషన్ సొమ్మును9 కోట్ల 24 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. ఎంతెంత సాయం చేశారన్నదానిపై మంత్రులు, ఎమ్మెల్యేలకే క్లారిటీ లేకుండా పోయింది. మున్సిపల్ కమిషనర్ పులి శ్రీనివాసరావు 9 కోట్ల 24 లక్షలు దోచేశారు. పైగా ఖర్చులకు సంబంధించిన తప్పుడు నివేదిక అందించారు. కార్పొరేషన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కోటేశ్వరరావు ఖాతాలో కోటి రూపాయలు జమ చేశారు. కనీసం ఎవరెవరికి ఎంత చెల్లించారో కూడా కమిషనర్ చెప్పటం లేదు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ పై వెంటనే విచారణ చేయాలని ముఖ్యమంత్రికి, ప్రధానమంత్రికి లేఖలు రాస్తా. మున్సిపల్ కమిషనర్(Municipal Commissioner) కు ఓపిక, సహనం ఉండాలి. నేనొక ఐఏఎస్‌ని.. నా ఇష్టం వచ్చినట్టు నేను ఉంటాను అంటే కుదరదు. ప్రజలకు ఆయన జవాబుదారిగా వ్యవహరించాలి. పది రోజుల క్రితం కౌన్సిల్ జరుగుతుండగా మధ్యలో అర్ధాంతరంగా కమీషనర్ పులి శ్రీనివాస్ వెళ్లిపోవడం మంచి పద్ధతి కాదు. పులి శ్రీనివాస్ కేవలం మేయర్‌ను, కార్పొరేటర్లను మాత్రమే కాదు.. 11 లక్షల మంది జనాల్ని అవమానించారు. ఆయన మేయర్, డిప్యూటీ మేయర్ ఉన్న సిబ్బందిని కూడా ఏకపక్షంగా తొలగించారు. కనీసం నోటీసు కూడా ఇవ్వలేదు.ఇవాళ కౌన్సిల్ సమావేశం నిర్వహించమని ఎనిమిదో తారీకు కమిషనర్ పులి శ్రీనివాసులుకు లెటర్ రాశాను. అయినా ఆయన రాలేదు. ఎక్కడ తాను చేసిన అవినీతి చెప్పాల్సి వస్తుందోనని కమిషనర్ స్టాండింగ్ కౌన్సిల్ ఎన్నికల పేరుతో సమావేశాన్ని వాయిదా వేసుకుంటూ వస్తున్నారు. ప్రజల సొమ్మును దోచేసిన కమిషనర్ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు.. అని మేయర్ కావట్టి మనోహర్ నాయుడు అన్నారాయన. -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
నేను చెప్పినట్టే వినాలి!
అనంతపురం : రాప్తాడు నియోజకవర్గంలోని అనంతపురం రూరల్ మండలంలో తెలుగుదేశం పార్టీ నేత ఒకరు రౌడీయిజం చేస్తున్నారు. తమ పార్టీ అధికారంలోకి వచ్చిందని, మండలంలో అంతా తాను చెప్పినట్లే వినాలని హుకుం జారీ చేస్తున్నారు. తానడిగినంత డబ్బు ఇచ్చుకోవాలంటూ అక్రమ వసూళ్లు చేపట్టారు. కాదు.. కూడదని అన్న వారిపై భౌతికదాడులు చేస్తున్నారు. కక్కలపల్లి కాలనీ పంచాయతీలో ఇప్పటి వరకు 20 మందిపై భౌతికదాడులు జరిగాయి. పోలీసులూ పట్టించుకోకపోవడంతో ఆ నేత పేట్రేగిపోతున్నారు. ఇటీవల కక్కలపల్లి కాలనీకి చెందిన అంజి, ప్రేమ్, గోవర్ధన్లపై భౌతికదాడులకు పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా వార్డుమెంబర్ నాగేంద్ర, శారదమ్మ ఇళ్లపై దాడి చేసి..చంపుతామని బెదిరించారు. ఎంపీటీసీ భర్త శ్రీనివాసులును ఊరు వదిలి వెళ్లిపోవాలని హెచ్చరించారు. రవి అనే వ్యక్తిపై పెట్రోల్ పోసి అంటిస్తామని బెదిరించారు. ఈ ఘటనలతో సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. ఎప్పుడు ఏమి జరుగుతుందోనని భయపడ్డ పలువురు గ్రామస్తులు సదరు టీడీపీ నేత మనోహర్ నాయుడుపై రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంత్రి పరిటాల సునీత, టీడీపీ జెడ్పీ చైర్మన్ అభ్యర్థి చమన్ అండదండలు ఉండటంతో మనోహర్ నాయుడు పేట్రేగిపోతున్నాడని, తమకు రక్షణ కల్పించాలని ప్రజలు కోరుతున్నారు.