నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment