Kirti
-
Kuwait: భారతీయ మృతులపై నో క్లారిటీ: విదేశాంగ శాఖ
దుబాయ్: కువైట్ ఘోర అగ్నిప్రమాదం మృతుల లెక్కపై స్పష్టత రావాల్సి ఉంది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. 49 మంది చనిపోతే, అందులో 41 మంది భారతీయులే ఉన్నారు. అయితే మృతుల సంఖ్యపై కచ్చితత్వం.. అందులో భారతీయులు ఎందరు?.. వాళ్ల పేర్లు, స్వస్థలం .. ఇతర వివరాలు ఏంటి? అనేది నిర్ధారణ కావాల్సి ఉంది. ఈ మేరకు అగ్ని ప్రమాద సహాయ చర్యలను స్వయంగా పర్యవేక్షించడానికి విదేశాంగ శాఖ సహాయమంత్రి కీర్తివర్దన్ సింగ్ కువైట్ బయల్దేరారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తాను అక్కడికి వెళ్తున్నానంటూ కువైట్‌కు బయలుదేరే ముందు కీర్తివర్ధన్ ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు.#WATCH | Kuwait fire incident | Delhi: Before leaving for Kuwait from Delhi Airport, MoS MEA Kirti Vardhan Singh says, "We had a meeting last evening with the PM... The situation will be cleared the moment we reach there... The situation is that the victims are mostly burn… pic.twitter.com/ijqW3QQADM— ANI (@ANI) June 13, 2024‘కువైట్ ప్రమాదంపై ప్రధాని మోదీతో బుధవారం సాయంత్రం సమావేశం అయ్యాం. అక్కడి చేరుకోగానే అక్కడ నెలకొన్న పరిస్థితులపై స్పష్టత వస్తుంది. ప్రమాదంలో చాలా మృతదేహాలు తీవ్రంగా కాలిపోయి గుర్తుపట్టలేనంతగా ఉన్నాయి. మృతదేహాలను గుర్తుపట్టడానికి డీఎన్ఏ పరీక్షలు కొనసాగుతున్నాయి. ఎయిర్‌ఫోర్స్ విమానం కూడా సిద్ధంగా ఉంది. మృతదేహాలను గుర్తించిన వెంటనే ఎయిర్ పోర్స్ విమానంలో మృతదేహాలను భారత్‌కు తరలిస్తాం. ఇప్పటివరకు అందినసమాచారం మేరకు 49 మంది మృతి చెందారు. 43 మంది తీవ్రంగా గాయపడ్డారు’ అని అన్నారు.గల్ఫ్ దేశం కువైట్‌లో బుధవారం ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుక్ను ఘటనలో ఏకంగా 49 మంది మరణించారు. వీరిలో ఏకంగా 40 నుంచి 42 మంది భారతీయులేనని సమాచారం. మరో 50 మందికిపైగా గాయపడ్డారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం కనిపిస్తోంది. బాధితుల్లో ఎక్కువమంది కేరళకు చెందినవారని సమాచారం. తమిళనాడు, ఉత్తరాది రాష్ట్రాలకు చెందినవారు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.ఉపాధి కోసం వలస వచ్చి ప్రాణాలు పోగొట్టుకోవడం తీవ్ర విషాదానికి గురిచేసింది. కువైట్ దక్షిణ అహ్మదీ గవర్నరేట్‌లో మాంగాఫ్ ప్రాంతంలోని ఆరు అంతస్థుల భవనంలో బుధవారం తెల్లవారుజామున 4.30 గంటలకు ఈ ప్రమాదం జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. తొలుత వంటగది నుంచి మంటలు వ్యాపించినట్లు తెలియజేశారు. ఈ భవనంలో 200 మందికిపైగా భవన నిర్మాణ కార్మికులు నివసిస్తున్నారు.వివిధ దేశాల నుంచి వలస వచ్చిన వీరంతా ఎన్బీటీసీ గ్రూప్ అనే నిర్మాణ సంస్థలో పని చేస్తున్నారు. కార్మికుల వసతి కోసం ఈ సంస్థ సదరు భవనాన్ని అద్దెకు తీసుకుంది. మృతులు 20 నుంచి 50 ఏళ్ల లోపు వారేనని అరబ్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది చాలాసేపు శ్రమించి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాద సమయంలో కార్మికులు నిద్రలో ఉన్నారు. దట్టమైన పొగ వ్యాపించింది. దాన్ని పీల్చడం వల్లే ఎక్కువ మంది మరణించారు.అగ్నిప్రమాదంలో చాలామంది భారతీయులు మరణించడంపై కువైట్‌లోని భారత రాయబార కార్యాలయం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎమర్జెన్సీ హెల్ప్‌లైన్ నెంబర్ +965–65505246 ఏర్పాటు చేసింది. సహాయం, సమాచారం అవసరమైన వారు తమను సంప్రదించాలని సూచించింది. బాధితులకు అవసరమైన సాయం అందిస్తామని ప్రకటించింది.కువైట్ మొత్తం జనాభాలో భారతీయులు 21 శాతం(10 లక్షలు) ఉంటారు. కువైట్‌లోని మొత్తం కార్మికుల్లో 30 శాతం మంది(దాదాపు 9 లక్షలు) భారతీయులే కావడం విశేషం. అగ్నిప్రమాదంలో మరణించినవారికి భారత విదేశాంగ శాఖ మంత్రి ఎస్.జైశంకర్ సంతాపం ప్రకటించారు. బాధిత కుటుంబాలకు సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.మాంగాఫ్ ప్రాంతంలోని ఘటనా స్థలాన్ని భారత రాయబారి ఆదర్శ్ స్వాయికా సందర్శించారు. గాయపడి వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్న భారతీయులను పరామర్శించారు. తగిన సాయం అందిస్తామని భరోసా కల్పిచారు. క్షతగాత్రులకు మెరుగైన చికిత్స అందించే విషయంలో కువైట్ అధికారులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతున్నామని తెలిపారు. బాధితుల్లో కొందరి ఆరోగ్య పరిస్థితి విషమంగా, మరికొందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు వివరించారు. మాంగాఫ్ భవన యజమానిని తక్షణమే అరెస్టు చేయాలని కువైట్ ఉప ప్రధానమంత్రి షేక్ ఫహద్ అల్–యూసుఫ్ అల్–సబా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కార్మికులకు తగిన భద్రత కల్పించని భవన నిర్మాణ కంపెనీ యజమానికి సైతం అరెస్టు చేయాలన్నారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. కంపెనీ యాజమాన్యంతోపాటు భవన యజమాని దురాశ వల్ల అమాయకులు బలయ్యారని ఆయన విమర్శించారు. ఒకే భవనంలో పెద్ద సంఖ్యలో కార్మికులు నివసించడం నిబంధనలకు విరుద్ధమేనని చెప్పారు. ఇలాంటి ఉల్లంఘనలపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. అగ్నిప్రమాదానికి బాధ్యులుగా గుర్తించి పలువురు అధికారులను కువైట్ ప్రభుత్వం సస్పెండ్ చేసింది. -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
సద్గుణాల్లో ఉద్గుణం దాతృత్వం
దాతృత్వం లేదా ఈవి అన్నది ఉద్గుణాలు అన్నిటిలోకెల్లా ఉద్గుణం; సద్గుణాలు అన్నిటిలోకెల్లా సద్గుణం. అవసరమైంది లేనివాళ్లకు తగిన విధంగా అందించడానికి తన శక్తిమేరకు ప్రయత్నించడం ప్రతి మనిషికీ తప్పకుండా ఉండాల్సిన లక్షణం. అది లక్షణంగా మాత్రమే కాకుండా అంతకుమించి ప్రతివ్యక్తికీ ఉండాల్సిన ప్రధాన లక్ష్యంగా కూడా ఉండాలి. వేదవాఙ్మయంలో భాగంగా మనకు అందుబాటులో ఉన్న భిక్షుసూక్తం కమ్యూనిజంకన్నా ఎంతో ముందే అన్నార్తులకు అన్నం పెట్టడం, దీనులకు దానం చెయ్యడం గురించి ప్రగాఢంగా ప్రపంచానికి తెలియజెప్పింది. ‘దేవతలు ఆకలిని మరణానికి కారణంగా విధించలేదు. బాగా ఆహారం తిన్న వాళ్లకు కూడా మరణం వచ్చి తీరుతుంది. దానశీలికి సంపద తగ్గదు. ఇవ్వని లేదా పెట్టని వాడిని ఓదార్చే వారు కూడా ఉండరు‘ అంటూ భిక్షుసూక్తం తొలి శ్లోకం అర్థం చేసుకుని ఆచరించాల్సినదాన్ని ఆవిష్కృతం చేసింది. ఆకలికి ఆహారం కూడా కరువై అలమటిస్తున్నవాళ్లు ప్రపంచంలో ఇంకా ఉన్నారు. వాళ్లు ఎక్కడో, అక్కడక్కడో మాత్రమే కాదు మన చుట్టుపక్కల కూడా ఉన్నారు. వాళ్లను మనం చూడకపోవడం, చూడలేకపోవడం కాదు చూసినా చూడనట్టు ఉన్నాం, ఉంటున్నాం. మనకు ఎందుకులే అనుకుంటూ, అంటూ మనం వాళ్ల పక్కనే నివసిస్తున్నాం. ఇది అమానవీయం. ఈ అమానవీయత మనలో కొత్తగా చోటు చేసుకున్న అవలక్షణం కాదు. అది మనలో ఎప్పటి నుంచో గూడుకట్టుకుని లేదా పేరుకుపోయి ఉంది. ఆ లక్షణం మనలో ఉండకూడదు అని తెలియజేస్తూ, మనకు తగిన స్ఫూర్తిని ఇస్తూ ఎప్పటి నుంచో ఎంతో చెప్పబడింది; ఎందరో మహనీయులు మనకు ఈ విషయంలో ఆదర్శంగా నిలిచారు. అయినా కూడా ఆ అవలక్షణం అవనిలో అంతరించిపోలేదు. ప్రపంచం పరిణామాల్ని పొందుతూ ఇవాళ ఉన్న స్థితికి వచ్చాక కూడా ఆకలి అన్నది ప్రపంచంలో ఇంకా ఎందరినో బాధిస్తోంది. ఆకలి తన ఆకలిని తీర్చుకోలేకపోతోందేమో? అందువల్ల అది ఇంకా మనుషుల ప్రాణాల్ని తింటూనే ఉందేమో? ఎప్పటినుంచో ప్రపంచంలో ఆకలి అగ్నికి మనుషుల ప్రాణాలు ఆహుతి అవుతూనే ఉన్నాయి. ‘అన్నం కలిగిన వాడై ఉండీ, అవసరమైన దీనులకి ఆహారం పెట్టకుండా మనసును చంపుకుని ఆ దీనుల ముందే ఎవడయితే తాను అనుభవిస్తూ తింటాడో వాడికి అనునయించే వాళ్లు దొరకరు’ అన్న విషయాన్ని ఒక హెచ్చరికగా భిక్షుసూక్తం మనకు తెలియజెప్పింది. ఈ సూక్తం లో చెప్పబడినట్టుగా ఆకలి కారణంగా మన సమాజంలో దాడులు జరుగుతూనే ఉన్నాయి. ‘ధనవంతుడు పేదలకు తప్పకుండా ఇవ్వాలి. దూరదృష్టితో మార్గాల్ని ఆలోచించి ధనాన్ని పెంచుకునే ప్రయత్నం చెయ్యాలి. ఎందుకంటే రథచక్రాలు తిరుతున్నట్టుగా సంపద ఒకరి నుంచి మఱొకరికి వెళుతూ ఉంటుంది’ అనీ,‘మూర్ఖుడు అహారాన్ని ఇతరులకి పెట్టకుండా ఆశగా సేకరించి నిల్వ ఉంచుకుంటాడు. నిజం చెబుతున్నాను అది వాడికి చావునే ఇస్తుంది. దేవుడికో, స్నేహితుడికో ఇవ్వకుండా తాను తినే వాడు ఒట్టి పాపి అవుతాడు‘ అనీ భిక్షుసూక్తం ఎప్పటి నుంచో చెబుతూనే ఉంది. కానీ మానవులు దాన్ని పెద్దగా పట్టించుకోకుండా పాపులుగా లేదా దోషులుగా మనుగడ చేస్తున్నారు. ‘ఆహారాన్ని వెతుక్కుంటూ తిరిగే బలహీనులకు ఎవరు వెంటనే ఆహారాన్ని ఇస్తారో వారి కోసం విలువైనవి వేచి ఉన్నాయి. వారు విరోధులతో కూడా స్నేహాన్ని పొందుతారు’ అని భిక్షుసూక్తం ఉపదేశించి దాన్ని మనం మనసుతోనూ, మెదడుతోనూ అందుకుని ఆచరణలోకి తీసుకురావాలి. ఆ పని చేస్తూ మనల్ని మనం మనుషులుగా మలుచుకోవాలి; తథాస్తు. పూవుకే కాదు ఈవికి కూడా తావి ఉంటుంది! ఆ తావి పేరు కీర్తి!! ఈవివల్ల మనం కీర్తిమంతులం అవుదాం. బతికి ఉండగానే కాదు, మరలిపోయాక కూడా మనం పరిమళిద్దాం. ఈవితో మనకు మనం తావిని అద్దుకుందాం. – రోచిష్మాన్ -
మెరుపు
‘‘ఈ రోజు నీ బర్త్‌డే కదా. ఆఫీసుకు సెలవ్ పెట్టేద్దాం. ఈరోజంతా జాలీగా గడిపేద్దాం. ఏమంటావు?’’‘‘అంతకంటేనా!’’ఎప్పుడూ ఆఫీసు తప్ప మరో విషయం పట్టని భర్త...ఇలా మాట్లాడడం కీర్తిని ఆశ్చర్యపరిచింది.‘‘మాట్లాడింది మీరేనా? ఎందుకో నేను ఒక పట్టాన నమ్మలేకపోతున్నాను’’ అంది సరదాగా.‘‘అవును. నేనే. నీ పుట్టిన రోజుకు కూడా నేను ఆఫీసుకు వెళితే ఇంకేమైనా ఉందా? నువ్వు తప్పించి నాకు ఎవరు ఉన్నారు చెప్పు?’’ అన్నాడు ప్రభాకర్. ఈమాట అంటున్నప్పుడు అతని కళ్లలో సన్నటి కన్నీటి పొర. అవును. ప్రభాకర్‌కు ఆమె తప్ప ఎవరూ లేరు.తల్లిదండ్రులు ఎప్పుడో చనిపోయారు. ఉన్న... ఒక్కగానొక్క అన్న తనని ఎప్పుడో మరిచిపోయాడు.ఒంటరితనం భారమై, అది డిప్రెషన్‌గా మారి, ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు చుట్టుముడుతున్న రోజుల్లో పరిచయమైంది కీర్తి. ప్రభాకర్ ఎవరితోనూ పెద్దగా మాట్లాడే రకం కాదు.ఇతరులతో అంత త్వరగా కలిసిపోయే రకం కూడా కాదు.అలాంటి ప్రభాకర్‌ను తన స్నేహంతో మార్చేసింది కీర్తి.ఆమె స్నేహంలో ప్రభాకర్‌లో కొత్త కళ తొంగి చూసింది.‘ఆఫీసు కోసం కాదు... ఆఫీసుకొచ్చే కీర్తి కోసం’ అన్నట్లుగా... ఎప్పుడు ఆఫీసుకు వెళదామా అని ఎదురుచూసేవాడు. తనకు వేరే సెక్షన్‌కు బదిలీ అయినట్లు చెప్పింది కీర్తి.ప్రభాకర్ తల్లడిల్లిపోయాడు. సెక్షన్ బదిలీ కావడం అంటే... ఎక్కడికో దూరంగా వెళ్లిపోవడం కాదు. జస్ట్... ఫ్లోర్ మారడం అంతే!ఈమాత్రానికే... ప్రభాకర్ విరహ వేదనతో తల్లడిల్లిపోయాడు.ఒకరోజు కీర్తితో ఏకాంతంగా మాట్లాడాడు...‘‘నువ్వు సెక్షన్ మారిపోతేనే... చాలా దూరమైనట్లు ఫీలైపోతున్నాను. రేపు... నువ్వు పెళ్లి చేసుకొని ఎక్కడికైనా వెళ్లిపోతే నేను బతకలేను. నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను’’ అన్నాడు. ప్రభాకర్ మాటలకు కీర్తి కరిగిపోయింది.పెళ్లికి పచ్చజెండా ఊపింది. ఆమె ఇంట్లో వాళ్లు కూడా పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. పెళ్లైన ఆరు నెలల తరువాత....కీర్తి తన కొలిగ్ అశోక్‌తో క్లోజ్‌గా ఉంటున్నట్లు ప్రభాకర్ చెవిలో వేశారెవరో. ఆ తరువాత కూడా... కీర్తి, అశోక్‌లపై ఆఫీసులో చిలవలు పలవలుగా ప్రచారం జరిగింది. అది ప్రభాకర్ వరకు వచ్చింది. ఇక ఆగలేకపోయాడు.ఒకరోజు భార్యను నిలదీశాడు.‘‘నువ్వేనా ఇలా మాట్లాడుతుంది. ఎవరో ఏదో అన్నారని నన్ను అనుమానిస్తావా?’’ అంటూ బాగా ఏడ్చింది కీర్తి.‘‘నిన్ను బాధ పెట్టి ఉంటే... క్షమించు’’ అన్నాడు ప్రభాకర్. అయితే ఆ మాట మనసులో నుంచి రాలేదు.అతడి కళ్లలో అనుమాన బీజం... పెద్ద చెట్టై కూర్చుంది. ప్రభాకర్ ఏడుస్తూ చెబుతున్నాడు... ‘‘ఈరోజు నా భార్య పుట్టిన రోజు. సరదాగా దుర్గంచెరువుకు వెళ్లాం. మేము ఇంటికి తిరిగివచ్చే సమయానికి రాత్రి అయింది... ఆ చీకట్లో పెద్దగా ఉరుము ఉరిమింది. వెంటనే... మెరుపు మెరిసింది. ఆ వెలుగులో... నాకు కనిపించిన దృశ్యం... కిందపడిపోయి ఉన్న కీర్తి. అక్కడ తడిగా ఉండడంతో... ఉరుము శబ్దం విన్న వెంటనే ఉలిక్కిపడి జారి పడింది. ఆమె తల అక్కడ ఉన్న బండరాయిని తాకడంతో.... చనిపోయింది...’’ ‘‘నువ్వు చెప్పింది అబద్ధం’’ అన్నాడు ఇన్స్పెక్టర్ నరసింహ.ఆతరువాత... రకరకాల పద్ధతుల్లో ప్రభాకర్‌ని విచారించగా... కీర్తిని తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు ప్రభాకర్.ఏ విషయం వల్ల... ప్రభాకర్ అబద్ధం చెబుతున్నాడని ఇన్స్పెక్టర్ గ్రహించాడు?