AIR
-
ఆయువు తీస్తున్న వాయువు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత కలుషిత గాలిని పీల్చడంతోనే బలి 2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడిసాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.వాయు కాలుష్యంతో నష్టాలు.. ⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి. ⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి ⇒ మహిళల్లో గర్భస్రావాలువాయు కాలుష్యానికి కారణాలు.. ⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు ⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం ⇒తీవ్ర గాలులు, తుపానులు ⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్ల విడుదలవాతావరణ సంక్షోభమే కారణమా? వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్‌ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
మోటు సరసం !.. మద్యం మత్తులో బావబామ్మర్దుల పరాచకం
ఐనవోలు: బావబామ్మర్ధి పరాచకాలు.. ఆటపట్టించుకోవడాలు సాధారణంగా చూస్తుంటాం.. కానీ, ఏకంగా ఓ బావబామ్మర్ధుల జంట సరసం పరా కాష్టకు చేరింది. దీంతో ఓ వ్యక్తి ఆస్పత్రి పాలయ్యాడు. హనుమకొండ జిల్లా ఐనవోలు మండల కేంద్రంలో జరిగిన ఈ ఘటన శుక్రవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నా యి.. మండల కేంద్రానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్, ఒంటిమామిడిపల్లికి చెందిన ఓ మెకానిక్, గూడ్స్ ట్రాలీ డ్రైవర్లు మంచి స్నేహితులు. ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ (27) ఈ నెల 20వ తేదీన రాత్రి మెకానిక్ షెడ్డులో ట్రాక్టర్ రిపేర్ చేయించుకుంటున్నాడు. అదే సమయంలో మిగతా ఇద్దరు అక్కడకు వచ్చారు. అప్పటికే మద్యం మత్తులో ఉన్న వీరు ఆకతాయి తనంతో ఏం చేస్తున్నామో తె లియని స్ధితిలో ఐనవోలుకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌ను నువ్వు బక్కగా ఉన్నావు.. లావు కావాలి.. అంటూ గేలి చేస్తూ ఆట పట్టించారు. నీకు గాలి పె ట్టి దొడ్డయ్యేలాగా(లావు) చేస్తాం.. అంటూ పరా చకాలు అడుతూ చివరకు బలవంతంగా మెకానిక్ షాపులో ఉన్న హైడ్రాలిక్ ఎయిర్ ప్రెషర్ పైపు మలద్వారం వద్ద ఉంచి ఒక్కసారిగా గాలి వది లారు. సదరు ట్రాక్టర్ డ్రైవర్ పొట్టలోకి గాలి చేరడంతో ఒక్కసారిగా అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే కుటుంబ సభ్యులు టాక్టర్ డ్రైవర్‌ను ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పెద్ద పేగులోకి గాలి చేరి ఉబ్బిందని ఆపరేషన్ చేయడంతో ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. అయితే సదరు వ్యక్తి ఆహారం తీసుకుని.. మలవిసర్జన చేసే వరకు ఆస్పత్రిలోనే ఉండాలని, ఏదైనా సమస్య వస్తే మరోసారి ఆపరేషన్ చేయాల్సి వస్తుందని డాక్టర్లు చెబుతున్నట్లు సమాచారం. ఆస్పత్రిలో అయ్యే ఖ ర్చంతా ఒంటిమామిడిపల్లికి చెందిన ఇద్దరు భరి స్తున్నారు. అయితే ఆరు రోజులైనా డిశ్చార్జ్ కాకపోవడంతో విషయం స్థానికంగా అందరికీ తెలిసిపోయి.. చర్చనీయాంశంగా మారింది. -
స్కై వాటర్: సూర్యరశ్మి, గాలితో వాటర్..!
ప్రస్తుతం మహా నగరాల్లో తాగునీటి ఇక్కట్లు మాములుగా లేవు. మన దేశంలో బెంగుళూరు, ముంబై, హైదరబాద్ వంటి నగరాలు సమ్మర్ వస్తే చాలు నీటి సమస్యతో అల్లాడిపోతున్నాయి. భవిష్యత్తులో ఈ ప్రాంతాల్లో జనాలు నివశించడానికే భయపడే పరిస్థితి ఎదురవ్వుతుందని హెచ్చరిస్తున్నారు కూడా. అభివృద్ధి పేరుతో పర్యావరణానికి చేసిన తప్పిదాలే ఇందుకు కారణమని పర్యావరణవేత్తలు ఎప్పటి నుంచే మొత్తుకుంటున్నారు. నీటి ఎద్దడి కోసం పలు రకాల ప్రయత్నాలు చేస్తున్నారు కూడా. అవన్నీ ఆయా ప్రాంతాలను బట్టి సక్సెస్ అవ్వడం అనేది ఆధారపడి ఉంది. అయితే ఇప్పుడూ ఆ సమస్యలన్నింటికీ చెక్ పెట్టేలా ఓ సరికొత్త వాటర్‌ని తాజాగా శాస్త్రవేత్తలు సృష్టిస్తున్నారు. త్వరలోనే ఆ నీటిని బాటిల్స్ రూపంలో మార్కెట్లోకి విడుదల చేయనున్నారు కూడా. ఇంతకీ పరిశోధకులు ఎలా నీటిని సృష్టిస్తున్నారంటే..అరిజోనా స్టేట్ యూనివర్సిటీ పరిశోధకులు సూర్యుడు, గాలితో నీటిని తయారుచేసే సరికొత్త సాంకేతికను కనుగొన్నారు. ఏంటీ సూర్యకాంతి, గాలితోనా అని ఆశ్చర్యపోకండి. గాలిని స్వేదనంగా మార్చేందుకు హైడ్రోపనెల్ టెక్నాలజీని అభివృద్ధి చేశారు. ఈ టెక్నాలజీ సాయంతో గాలి నుంచి నీరు ఆవిరిని అయ్యేలా చేసి..ఆ నీటిని సేకరిస్తారు. ఇందుకోసం సోలార్ ప్యానెల్ మాదిరిగా ఉండే వాటిని తీసుకుంటారు. అయితే ఇవి విద్యుత్తుకు బదులు స్వచ్ఛమైన నీటిని ఉత్పత్తి చేశాయి.ఇక్కడ ఈ ప్యానెళ్లు గాలి నుంచి నీటి ఆవిరిని తీసుకుంటాయి. ఈ తేమను సాంద్రీకృత గాలి ప్రవాహంలోకి విడుదల చేసేందుకు మళ్లీ సౌరశక్తిని వినియోగిస్తుంది. ఈ ప్యానెల్ లోపల నీటి నిష్క్రియాంతక సంక్షేపణను అనుమతిస్తుంది. అంతేగాదు ప్రతి ప్యానెల్ ఒక వ్యక్తి రోజువారీ అవసరాలకు సరిపోయేలా మూడు లీటర్ల వరకు త్రాగునీటిని ఉత్పత్తి చేయగలదు. ఈ నీరు స్వచ్ఛమైనది, మినరలైజ్ చేసినది. త్రాగేందుకు సురక్షితంగా ఉండేలా ఓజోనేటెడ్ చేయబడుతుంది కూడా.నిజానికి దీన్ని జీరోమాస్ వాటర్ పేరుతో అమెరికా సోర్స్ కంపెనీ 2014లోనే ప్రారంభించింది. ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా 56 దేశాల్లో హైడ్రోప్యానెల్స్ను ఏర్పాటు చేసింది. ఈ ప్యానెల్లను గ్రౌండ్ శ్రేణులుగా లేదా ఇంటి పైకప్పులపై తాగునీటితో అనుసంధానించవచ్చు. ప్రతి హైడ్రోప్యానెల్ ధర సుమారు రూ. 2 లక్షల్లో అందుబాటులో ఉండేలా చేసి, నీటి కొరత సమస్యను నివారించాలని భావిస్తున్నారు పరిశోధకులు. అమెరికాలోని ఫ్లోరిడాలో ఈ పద్ధతిలో నీటిని తయారు చేసే ప్రక్రియను ప్రారంభించేశారు కూడా. ఇక్కడ రోజుకు దాదాపు మూడు వేల లీటర్‌ని ఉత్పత్తి చేస్తున్నారు కూడా. అంతేగాదు సెప్టెంబర్ 2024 కల్లా యూఎస్ అంతటా స్కైవాటర్ బ్రాండ్‌తో పునర్వినియోగించే అల్యూమినియం క్యాన్‌ల్లో ఈ నీటిని విక్రయించాలని చూస్తున్నారు. అంతేగాదు అమెరికా కంపెనీ సోర్స్ స్కై వాటర్‌ని ప్రజలకు పరిచయం చేసేలా మార్కెటింగ్ చేయాలనుకోవడమే గాక హైడ్రోపనెల్ టెక్నాలజీ గురించి అవగాహన పెంచి స్థిరమైన నీటి వనరులను ప్రోత్సహించడమే లక్ష్యం అని చెబుతోంది. ప్రస్తుతం సోర్స్ కంపెనీ ఉత్పత్తి చేస్తున్న ఈ హైడ్రోప్యానెల్స్ అధిక ధర కాస్త అవరోధంగా ఉంది. భవిష్యత్తులో వీటి ధరలు గణనీయంగా తగ్గితే సదరు కంపెనీకి మంచి లాభదాయకమే గాక అన్ని దేశాలు ఎదుర్కొంటున్న నీటి సమస్యకు చక్కని పరిష్కారం దొరుకుతుందని చెప్పొచ్చు. (చదవండి: ఆ రెస్టారెంట్లో దోస, ఇడ్లీ రేట్లు తెలిస్తే కంగుతింటారు: హర్ష గోయెంకా ట్వీట్) -
ఆ బండరాయి.. కేవలం వేళ్లపైనే..! ఎలా అనేది నేటికీ మిస్టరీనే!
అసాధారణమైన దృశ్యాలు కానీ.. శాస్త్రం తేల్చలేని సంఘటనలు కానీ.. ఎప్పటికీ మిస్టరీలుగానే మిగులుతాయి.మహారాష్ట్ర, శివపురిలోని హజ్రత్ ఖమర్ అలీ దర్వేష్ దర్గాలో కూడా అలాంటి మిస్టరీనే దాగి ఉంది. ఆ దర్గాలో ఉన్న ఓ 90 కేజీల రాయి.. కేవలం పదకొండు మంది చూపుడు వేళ్ల మీద నిలబడిపోతుంది. ఆ తర్వాత గాల్లోకి తేలుతుంది.‘దర్వేష్ అలీ సాహెబ్’ అనే ఒక ముస్లిం సాధువు.. ఎక్కడి నుంచో ఆ ప్రదేశానికి వచ్చి.. కొంత కాలం అక్కడే జీవించి, అక్కడే సజీవ సమాధి అయ్యారనేది స్థానికుల కథనం. నిజానికి ఆ దర్గాను ముస్లిమ్‌ల కంటే హిందువులే ఎక్కువగా ఆరాధిస్తుండటం విశేషం. మరీ ముఖ్యంగా హిందువుల్లో కురుమ, యాదవులు తమ పెంపుడు జీవులైన గొర్రె జాతి వృద్ధి చెందాలని, అందుకు దర్వేష్ స్వామి ఆశీస్సులు ఉండాలని.. మొక్కుబడులు కట్టి, స్వామి పేరిట ప్రతి ఏడాది ఒక పొట్టేలును విడిచిపెడతారు. సంవత్సరం పాటు దాన్ని మేపి, ఉర్సు సందర్భంగా ఆ మొక్కు చెల్లించుకుంటారు. ఈ దర్గాను ‘దర్శెల్లి’ అని కూడా పిలుస్తారట. స్థానిక హిందువులు ఎంతో భక్తితో ఈ దర్గా స్వామి పేర్లను తమ పిల్లలకు పెట్టుకుంటారు. అందుకే అక్కడ ఎక్కువగా దర్శం,దర్శెల్లి అనే పేర్లు వినిపిస్తుంటాయి. ఈ అనవాయితీ నేటికీ కొనసాగుతూనే ఉంది. ఇక్కడ మొక్కితే కోరిన కోరికలు తీరతాయని నమ్ముతారు చాలామంది.ఇక ఆ రాయి విషయానికి వస్తే.. అది చూడటానికి సాధారణంగానే కనిపిస్తుంది. కానీ చేతి వేళ్ల సాయంతో ఆ బండ ఎలా గాల్లోకి లేస్తుంది? అనేది మాత్రం ఎవ్వరూ కనిపెట్టలేకపోయారు. కండలు తిరిగిన ఆజానుబాహులు కొందరు ఆ బండను బలవంతంగా లేపి.. తమ ప్రతాపాన్ని చూపిస్తూ ఉంటారు. కానీ ఎవరైనా పదకొండు మంది కలసి.. ‘దర్వేష్ అలీ బాబా’ నామాన్ని భక్తితో జపిస్తూ ఆ బండరాయిని లేపితే.. కేవలం వేళ్లపైనే.. అది తేలికగా పైకి లేస్తుంది. ఇది ఎలా సాధ్యమో నేటికీ మిస్టరీనే!సంహిత నిమ్మన (చదవండి: -
వంటల ఘుమఘుమలతో కూడా కాలుష్యానికి ముప్పేనట
వంట చేయడం వల్ల వచ్చే పొగ నుంచి గాలి కాలుష్యమవుతుంది. ఇటీవల కార్లలో వాసన చూస్తే కేన్సర్ వస్తుందని పలు నివేదికలు హల్ చల్ చేశాయి. తాజాగా మరో అధ్యయనం దిగ్భ్రాంతి రేపుతోంది. అదేంటో తెలియాలంటే మీరీ కథనం చదవాల్సిందే!పప్పు పోపు, పులిహోర తాలింపు, చికెన్, మటన్ మసాలా ఘుమ ఘుమలు లాంటివి రాగానే గాలి ఒకసారి అలా గట్టిగాపైకి ఎగ పీల్చి.. భలే వాసన అంటాం కదా. కానీ ఇలా వంట చేసేటపుడు వచ్చే వాసన గాలిని కలుషితం చేస్తుందని అధ్యయనం కనుగొంది. అమెరికాలో అత్యధిక సంఖ్యలో తినుబండారాలను కలిగి ఉన్న లాస్ వెగాస్‌లో గాలి నాణ్యత సమస్య ఎక్కువగా ఉందని పరిశోధకులు గుర్తించారు.నేషనల్ ఓషియానిక్ అండ్ అట్మాస్ఫియరిక్ అడ్మినిస్ట్రేషన్ (NOAA) చేసిన ఈ పరిశోధనలో రెస్టారెంట్లు, ఫుడ్ ట్రక్కులు , వీధి వ్యాపారుల వద్ద వంట చేసే రుచికరమైన వాసన గాలి నాణ్యతను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుందని కనుగొంది. పట్టణ వాయు కాలుష్యం ప్రభావంపై కెమికల్ సైన్సెస్ లాబొరేటరీ (CSL) పరిశోధకులు ఆశ్చర్యకరమైన ఫలితాలను విడుదల చేశారు. అమెరికాలోని లాస్ ఏంజిల్స్, లాస్ వేగాస్ ,కొలరాడోలోని బౌల్డర్ మూడు నగరాలపై దృష్టి సారించారు. ఈ నగరాల్లో వంటకు సంబంధించిన మానవ-కారణమైన అస్థిర కర్బన సమ్మేళనాలను (VOCలు) కొలుస్తారు. మీకు వాసన వచ్చిందంటే, అది గాలి నాణ్యతను ప్రభావితం చేసే మంచి అవకాశం ఉందంటున్నారు పరిశోధకులు.వెగాస్ బహిరంగ గాలిలో ఉన్న మొత్తం కర్బన సమ్మేళనాల్లో 21 శాతం వంటలనుంచి వచ్చినవేనని అధ్యయన రచయిత మాట్ కాగన్ చెప్పారు. వాహనాలు, అడవి మంటల పొగ, వ్యవసాయం, వినియోగదారు ఉత్పత్తులు వంటి విభిన్న వనరుల ఉద్గారాలను పరిశోధకులు అంచనా వేశారు. పట్టణాల్లో వీటిని లాంగ్-చైన్ ఆల్డిహైడ్లు అని పిలుస్తామని వెల్లడించారు. అయితే వంట చేయడం వల్ల వచ్చే వాయు కాలుష్యం చాలా తక్కవే అని తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో దాదాపు నాలుగింట ఒక వంతు ఉద్గారాలకు వంట వాసన కారణమవుతుందని పరిశోధకులు నిర్ధారించారు. అంతేకాదు ఇంటి లోపల ,ఇళ్ల లోపల సమస్య మరింత తీవ్రంగా ఉందని నిపుణులు హెచ్చరించారు. -
అరచేతిలో ఇమిడే గాలి పంపు.. వీడియో వైరల్
ప్రయాణాలు చేస్తున్నపుడు వాహనాల్లోని టైర్లలో కొన్ని కారణాల వల్ల గాలి దిగిపోవడం సాధారణం. అయితే పట్టణ ప్రాంతాల్లో అలాంటి పరిస్థితి ఎదురైతే సమీపంలో గాలి పంపులు ఉండే అవకాశం ఉంది. కానీ దూరప్రాంతాలకు వెళ్లేపుడు సడెన్‌గా వాహనాల టైర్లలో గాలిదిగిపోతే ఎలా..? మళ్లీ సమీపంలోని టౌన్‌కి వచ్చి ఏదైనా ఏర్పాట్లు చేసుకుని, తిరిగి వాహనం వద్దకు చేరుకుని గాలి ఎక్కించాల్సి ఉంటుంది. ఒకవేళ అత్యవసర పనిమీద బయటకు వెళ్లేపుడు ఇలాగాలి దిగిపోతే చాలా అసహానానికి గురవుతూంటారు. అలాంటి వారిని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికులకు ‘రాక్బ్రోస్’ అనే కంపెనీ ఇటీవల కొత్త ప్రొడక్ట్‌ను ఆవిష్కరించింది. ఈ కంపెనీ మినీ ఎలక్ట్రిక్ ఎయిర్ పంపును తయారుచేసింది. దాన్ని అరచేతిలో ఇమిడిపోయేలా రూపొందించారు. ఆ ఎయిర్పంప్లో రెండుమోడ్లు ఉంటాయి. మొదటిమోడ్ కోసం పంపుపై ఉన్న బటన్‌ను ఒకసారి ప్రెస్ చేయాలి. దాంతో అది వాల్వ్‌లోకి వెళ్తుంది. రెండోమోడ్ కోసం మరోసారి ప్రెస్ చేయాల్సి ఉంటుంది. దానివల్ల పూర్తిగా వాల్వ్‌లో ఫిక్స్ అయి పంపులోని గాలి టైర్‌లోకి వెళ్తుంది. ఇందులో 100పీఎస్ఐ వరకు గాలి నిండేలా ఏర్పాటుచేశారు. అందులో గాలి అయిపోతే ఛార్జింగ్ పెట్టాలి. 25 నిమిషాల్లో అది ఫుల్‌ఛార్జ్ అవుతుందని కంపెనీ తెలిపింది. దీన్ని సైకిల్, బైక్, కార్లలో వాడుకోవచ్చని, త్వరలో భారీ వాహనాలకు వీలుగా రూపొందిస్తామని కంపెనీ చెప్పింది. ఈ పంపు ఎలా పనిచేస్తుందో తెలియజేస్తూ ఎక్స్‌లో పోస్ట్చేసిన ఓ వీడియో వైరల్‌గా మారింది. ఇదీ చదవండి: ఇంజిన్‌లో సమస్య.. 16వేల కార్లను రీకాల్ చేసిన ప్రముఖ కంపెనీ Rockbros Mini Electric Air Pump, a compact and portable air pump designed for inflating bike tires, car tires, and balls. pic.twitter.com/myBxoNfrsJ — Massimo (@Rainmaker1973) March 22, 2024 -
గాలితోనే జీవించిన జానీ బాబా! విస్తుపోయిన డీఆర్డీవో శాస్త్రవేత్తలు!
ఏ కారణం చేతైనా ఒక్కపూట తినకపోతే రెండో పూట ఆకలికి ఆగడం కష్టమైన పనే. ఇక పూజో, వ్రతమో చేసి.. తప్పక సాయంకాలం వరకూ ఉపవాసం ఉండాల్సివస్తే మాత్రం రాత్రికి ఆ లెక్క పక్కాగా సరిచేయాల్సిందే. ఉదయం నుంచి తినలేదనే సాకుతో తూకం సరిచేసినట్లుగా నాలుగు ముద్దలు ఎక్కువ లాగించేస్తాం. అలాంటిది ఒక మనిషి.. కొన్ని ఏళ్ల పాటు నీరు, ఆహారం తీసుకోకుండా బతకడం సాధ్యమేనా? గుజరాత్‌కి చెందిన ప్రహ్లాద్ జానీ బాబా 90 ఏళ్ల పాటు అలానే జీవించారు. గాంధీనగర్ జిల్లా, చరాడ అనే గ్రామానికి చెందిన ప్రహ్లాద్ జానీ బాబాకు ‘చున్రీవాలా మాతాజీ’ అనే మరో పేరుంది. అతను నీళ్లు తాగకుండా, ఆహారం తినకుండా కేవలం గాలితోనే బతుకుతున్నాడనే వార్త 2001లో సంచలనం సృష్టించింది. అయితే అదే వార్త.. మరెందరికో అనుమానాలనూ రేకెత్తించింది. దాంతో 2003 నుంచి 2010 మధ్య కాలంలో ప్రహ్లాద్ బాబా జీవన శైలిపై నిఘాపెట్టిన కొందరు శాస్త్రవేత్తలు.. ‘అతను చెప్పేది, చేసేది నిజమే’ అని గ్రహించి నివ్వెరపోయారు. అప్పటికే 70 ఏళ్లు పైబడిన ఆ మాతాజీ.. ‘నేను నా పద్నాలుగో ఏట నుంచి తినడం, తాగడం మానేశాను. ఇన్నేళ్లు నేను బతికుండటానికి కారణం సాక్షాత్తు ఆ అమ్మవారే. స్వయంగా ఆవిడే నన్ను పోషిస్తున్నారు. కాబట్టి నాకు నీరు, ఆహారం అవసరం లేదు’ అని ప్రకటించడంతో భక్తుల శాతం అమాంతం పెరిగింది. అతనిపై ‘డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్’ (డీఆర్డీవో) ఆధ్వర్యంలోని.. ‘డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫిజియాలజీ అండ్ అలైడ్ సైన్సెస్’ (డీఐపీఏ) శాస్త్రవేత్తలు, వైద్యులు నిఘా పెట్టారు. సుమారు 15 రోజుల పాటు పరిశీలనాత్మకంగా సీసీ కెమెరాల ద్వారా అతన్ని గమనించారు. ఆ పరిశీలనలో.. అతను ఏం తినకుండా, తాగకుండా కేవలం గాలి సాయంతోనే జీవిస్తున్నాడని, అయినప్పటికీ పూర్తి ఆరోగ్యంగా ఉన్నాడని తేలింది. గాలితో మాత్రమే జీవించే యోగిగా ఎంతో ప్రజాదరణ పొందిన జానీ బాబా.. ‘మాతాజీ’గా పిలిపించుకోవడానికి ఇష్టపడేవారు. అతని వేషధారణ.. పెద్దబొట్టు, పాపిట కుంకుమ, ముక్కపుడక, గాజులు, ఎర్రటి వస్త్రాన్ని చీరగా కట్టుకునే తీరు అంతా కూడా అమ్మవారిని తలపించేది. ‘ఆధ్యాత్మిక అనుభూతి’ కోసం జానీ చాలా చిన్న వయసులోనే ఇంటి నుంచి పారిపోయి.. బనస్కాంత జిల్లాలోని అంబాజీ దేవాలయం సమీపంలోని గుహలో నివసించారట. అక్కడే ధ్యానం చేసి.. తను సాధించిన జ్ఞానాన్ని అందరికీ పంచేందుకు ఆ సమీపంలోనే తన ఆశ్రమాన్ని నిర్మించారట. దశాబ్దాల పాటు అన్నపానీయాలు తీసుకోకుండానే జీవించిన మనిషిగా అంతర్జాతీయంగా పాపులరైనప్పటికీ.. సమాజంలోని ఓ వర్గం అతని శైలిని అనుమానించింది. తన 91 ఏట.. 2020 మే నెలలో మాతాజీ మరణించారు. అతని ఆశ్రమంలోనే ఆ బాబాకు సమాధి నిర్మించిన భక్తులు నేటికీ అతన్ని దైవంగానే భావించి పూజిస్తుంటారు. ప్రస్తుతం అతని శిష్యులే ఆ ఆశ్రమాన్ని నడుపుతున్నారు. అయితే చున్రీవాలా మాతాజీ.. అన్నేళ్లపాటు ఆహారం తీసుకోకుండా, నీళ్లు తాకుండా ఎలా జీవించారు అనేది నేటికీ మిస్టరీనే! సంహిత నిమ్మన (చదవండి: సర్జరీ చేసే టైంలో పేషెంట్‌పై డాక్టర్ దాడి! వీడియో వైరల్) -
గ్యాస్ చాంబర్‌గా రాజధాని.. కనిపించని సూర్యుడు!
దేశరాజధాని ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో శనివారం ఉదయం దట్టమైన పొగమంచు అలముకుంది. న్యూఢిల్లీలోని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. కనిష్ట ఉష్ణోగ్రత 6.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువ. డిసెంబర్లో రెండోసారి అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. కాగా శనివారం ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 23 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత తొమ్మిది డిగ్రీల సెల్సియస్‌గా ఉండే అవకాశం ఉంది. శనివారం ఢిల్లీలో నాలుగు నుండి 10 కిలోమీటర్ల వేగంతో ఆగ్నేయ దిశ నుండి ఓ మోస్తరు గాలులు వీచే అవకాశం ఉంది. ఢిల్లీలో డిసెంబర్ 28 వరకు ఉదయం పొగమంచు కురుస్తుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. గాలి దిశలో మార్పు, తగ్గిన వేగం కారణంగా రాజధాని మరోసారి గ్యాస్ ఛాంబర్‌గా మారింది. పెరుగుతున్న కాలుష్యం కారణంగా జనం కళ్ల మంటలతో పాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. శుక్రవారం ఎన్‌సిఆర్‌లో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 409గా నమోదయ్యింది. ఇది తీవ్రమైన విభాగంలో ఉంది. ఇది గురువారం కంటే 48 సూచీలు ఎక్కువ. శుక్రవారం మధ్యాహ్నానికి కూడా సూర్యుడు కనిపించలేదు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం శుక్రవారం ఢిల్లీలోని 24 ప్రాంతాల్లో గాలి తీవ్రమైన కేటగిరీలో నమోదైంది. ఇది కూడా చదవండి: ‘జనవరి 22.. ఆగస్టు 15 లాంటిదే’ -
ఢిల్లీలో మరింత దిగజారిన గాలి నాణ్యత
దేశ రాజధాని ఢిల్లీ-ఎన్సీఆర్లో గత నెల రోజులుగా కాలుష్య తీవ్రత కొనసాగుతోంది. దీపావళికి ముందు కురిసిన వర్షంతో ఇక్కడి జనం కాస్త ఊపిరి పీల్చుకున్నప్పటికీ, దీపావళి నుండి కాలుష్యం ‘అతి పేలవమైన’ స్థాయికి చేరడంతో మరిన్ని ఇబ్బందులు ఎదురవుతున్నాయి. శుక్రవారం కూడా ఢిల్లీలో గాలి నాణ్యత సూచి(ఏక్యూఐ) 300 కంటే ఎక్కువగా ఉంది. అంటే అతి పేలవమైన కేటగిరీలో ఉంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ)తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఢిల్లీ-ఎన్సీఆర్లో గాలి నాణ్యత స్థాయి 360 దాటింది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 350, ఆర్కె పురంలో 325, పంజాబీ బాగ్‌లో 332, ఐటీవోలో 328గా ఉంది. శనివారం నుంచి గాలి వేగం పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఢిల్లీ ఏక్యూఐ శుక్రవారం 324గా ఉంది. ప్రస్తుతం ఢిల్లీలో గాలి వేగం తక్కువగా ఉంది. పగటిపూట గాలి వేగం సాధారణంగా గంటకు పది కిలోమీటర్ల కంటే తక్కువగానే ఉంటుంది. అందుకే ఇక్కడి గాలిలో కాలుష్య కణాలు ఎక్కువ కాలం ఉంటాయి. శనివారం, ఆదివారాల్లో ఢిల్లీవాసులు ప్రాణాంతక కాలుష్యం నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉందని సంబంధిత అధికారులు చెబుతున్నారు. ఈ సమయంలో గాలి వేగం గంటకు 12 నుంచి 16 కిలోమీటర్లు ఉండవచ్చు. బలమైన గాలి ప్రభావం కారణంగా కాలుష్యం తగ్గే అవకాశాలున్నాయి. శుక్రవారం ఆకాశం నిర్మలంగా ఉంది. గరిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ ఎక్కువగా 25.7 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 9.4 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. శనివారం కూడా ఉదయం తేలికపాటి పొగమంచు, పగటిపూట నిర్మలమైన ఆకాశం ఉండనుంది. గరిష్ట ఉష్ణోగ్రత 25, కనిష్ట ఉష్ణోగ్రత 8 డిగ్రీల సెల్సియస్‌గా ఉండవచ్చు. శని, ఆదివారాల్లో ఈదురు గాలులు వీస్తాయని, కనిష్ట ఉష్ణోగ్రతలు కూడా తగ్గే అవకాశం ఉన్నందున ఉదయం, సాయంత్రం వేళల్లో చలి పెరుగుతుందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఇది కూడా చదవండి: హాయిగా నడుస్తూ వెళ్తున్న వ్యక్తికి హఠాత్తుగా పులి ఎదురైతే? -
ఒకవైపు కాలుష్యం.. మరోవైపు వణికిస్తున్న చలి!
దేశ రాజధాని ఢిల్లీలో ప్రజల ఊపిరి పీల్చుకునేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గాలి దిశలో మార్పు, వేగం తగ్గడం వల్ల ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో వాతావరణం మళ్లీ తీవ్ర వర్గానికి చేరుకుంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీసీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం జహంగీర్‌పురిలో 434, బవానాలో 441, ద్వారకలో 412, బురారీలో 441, ఆనంద్ విహార్‌లో 387, అశోక్ విహార్‌లో 386గా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) నమోదైంది. ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో పొగమంచు కమ్మేయడంతో పాటు ఉష్ణోగ్రతలు భారీగా తగ్గాయి. పర్వతాలపై మంచు కురుస్తుండటంతో మైదాన ప్రాంతాల్లో చలి పెరుగుతోంది. సాయంత్రం వేళల్లో చలి తీవ్రత పెరుగుతోంది. ఫలితంగా ఢిల్లీలో కనిష్ట ఉష్ణోగ్రతలు పడిపోయాయి. బుధవారం కనిష్ట ఉష్ణోగ్రత సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా 10.6 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. సగటు గరిష్ట ఉష్ణోగ్రత 26 డిగ్రీలుగా నమోదైంది. ఇది సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. ఇదిలా ఉండగా వాయు కాలుష్య నియంత్రణకు అనుసరిస్తున్న విధానం తదుపరి దశకు చేరుకుంది. దీంతో రాజధానిలో జీఎన్జీ, బీఎస్4 డీజిల్, ఎలక్ట్రిక్ బస్సులు మినహా ఇతర బస్సుల ప్రవేశాన్ని నిషేధించనున్నారు. టూరిస్ట్ బస్సులు, కాంట్రాక్ట్ బస్సులు, రాష్ట్ర రవాణా బస్సులు, డీజిల్ బస్సులు మినహా ఇతర రాష్ట్రాల్లోని అన్ని రకాల పర్మిట్లు కలిగిన బస్సులు ఢిల్లీలోకి ప్రవేశించడాన్ని నిషేధించనున్నట్లు ఒక నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: నేపాల్‌లో మరోమారు భూకంపం.. 4.5 తీవ్రత నమోదు! -
ఢిల్లీలో మరో మూడు,నాలుగు రోజులు విష గాలులే!
ఢిల్లీని మరోమారు పొగమంచు దట్టంగా కమ్ముకుంది. ఫలితంగా విజిబులిటీ దెబ్బతినడమే కాకుండా జనం విషవాయువులతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మంగళవారం రాజధానిలోని ఐదు ప్రాంతాలలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) 400 లేదా అంతకంటే ఎక్కువ అంటే ‘తీవ్రమైన’ విభాగంలోకి చేరుకుంది. మరో మూడు నాలుగు రోజులపాటు ఈ విషపూరితమైన గాలి నుంచి ఉపశమనం లభించే అవకాశం ఢిల్లీ ప్రజలకు లేదని వాతావరణశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా గాలి దిశ, వేగం మారడంతో శని, ఆదివారాల్లో కాలుష్య స్థాయిలో కొంత మెరుగుదల కనిపించింది. అయితే ఇప్పుడు గాలిలో ఉధృతి ఏర్పడిన కారణంగా కాలుష్య స్థాయి మళ్లీ పెరుగుతోంది. మంగళవారం మధ్యాహ్నం రెండు గంటల తర్వాత సూర్యరశ్మి బలహీనంగా మారి వాతావరణంలో పొగమంచు కమ్ముకుంది. వాతావరణశాఖ తెలిపిన వివరాల ప్రకారం సఫ్దర్‌జంగ్ వాతావరణ కేంద్రం వద్ద మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు దృశ్యమాన స్థాయి 1500 మీటర్ల వరకు ఉంది. సాధారణంగా రెండు వేల మీటర్లు ఉండాలి. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఢిల్లీలో ఏక్యూఐ 372గా నమోదైంది. మంగళవారం ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 26.2 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే రెండు డిగ్రీలు తక్కువగా ఉండగా, కనిష్ట ఉష్ణోగ్రత 11.5 డిగ్రీల సెల్సియస్, సాధారణం కంటే ఒక డిగ్రీ తక్కువగా నమోదైంది. గాలిలో తేమ స్థాయి 95 నుంచి 56 శాతంగా నమోదైంది. లోధి రోడ్డు అత్యంత శీతల ప్రాంతం. ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రత 26.0 డిగ్రీలు, కనిష్ట ఉష్ణోగ్రత 11.3 డిగ్రీల సెల్సియస్‌గా నమోదైంది. బుధవారం కూడా ఇదే వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఇది కూడా చదవండి: అమేథీలో మళ్లీ రాహుల్ Vs స్మృతి? -
హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు విమాన సేవలు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి మరో నాలుగు నగరాలకు విమాన సర్విసులు అందుబాటులోకి వచ్చాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ సహకారంతో దేశీయ విమానయాన సేవలను విస్తరించినట్లు హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం అధికారులు తెలిపారు. వీటిలో మూడు నగరాలకు శుక్రవారం నుంచి (17వ తేదీ) సర్విసులు ప్రారంభమయ్యాయి. హైదరాబాద్ నుంచి అమృత్‌సర్‌కు వెళ్లే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ విమానం (ఐగీ 954) రోజూ ఉదయం 07:30కి హైదరాబాద్ నుంచి బయల్దేరి 10.15కి అమృత్‌సర్‌కు చేరుకుంటుంది. ఇక లక్నో–హైదరాబాద్ మధ్య వారానికి ఆరు సర్విసులు అందుబాటులో ఉంటాయి. ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ (ఐగీ 953) హైదరాబాద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.35కి లక్నోకు చేరుకుంటుంది. అలాగే ఎయిర్ ఇండియా ఎక్స్‌ప్రెస్ ( ఐగీ 955) ప్రతీరోజు సాయంత్రం 7.45 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రాత్రి 9.30 గంటలకు కొచ్చిన్‌కు చేరుకుంటుంది. గ్వాలియర్‌కు ఆరు సర్విసులు నవంబర్ 28 నుంచి హైదరాబాద్–గ్వాలియర్ మధ్య వారానికి మూడు సర్విసులు అందుబాటులోకి రానున్నాయి. ఈ విమానం హైదరాబా ద్ నుంచి మధ్యాహ్నం 2.30కి బయల్దేరి సాయంత్రం 4.20కి గ్వాలియర్ చేరుకుంటుంది. ఈ సందర్భంగా జీఎమ్మార్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం సీఈవో ప్రదీప్ ఫణిక్కర్ మాట్లాడుతూ...ఈ మార్గాల్లో మెరుగైన అనుసంధానం కోసం కొత్త విమానాలు దోహదం చేయనున్నాయని చెప్పారు. -
ఢిల్లీలో రోడ్లు కనిపించక జనం అవస్థలు!
ఢిల్లీలో వాయుకాలుష్యం కారణంగా జనజీవనం కష్టతరంగా మారింది. డిల్లీ ప్రభుత్వం పలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కాలుష్య స్థాయిలలో గణనీయమైన మెరుగుదల కనిపించడంలేదు. గురువారం ఢిల్లీలో వాయు నాణ్యత మరోసారి ‘తీవ్ర’ కేటగిరీలో కనిపించింది. కలుషిత గాలి కారణంగా ప్రజలు బయటకు వెళ్లేందుకు పలు అవస్థలు పడుతున్నారు. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఢిల్లీలోని బవానాలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ)442, ఐటీఓలో 415, జహంగీర్‌పురిలో 441, ద్వారకలో 417, అలీపూర్‌లో 415, ఆనంద్ విహార్,ఢిల్లీ విమానాశ్రయంలో 411గా నమోదయ్యింది. రాజధానిలోని పలు ప్రాంతాల్లో పొగమంచు కమ్ముకుంది. దీంతో రోడ్లపై వెళ్లే వాహనదారులు, పాదచారులకు ఎదుటనున్నవి స్పష్టంగా కనిపించడం లేదు. విజిబులిటీ మరింతగా క్షీణించింది. ఢిల్లీని కమ్మేసిన కాలుష్యం గురించి హర్షిత్ గుప్తా అనే యువకుడు మాట్లాడుతూ తాను యూపీ నుంచి వచ్చానని, ఢిల్లీలో ఊపిరి పీల్చుకుంటుంటే పొగ పీల్చినట్లు అనిపిస్తున్నదని వాపోయాడు. ఢిల్లీలో ఇదే పరిస్థితి కొనసాగితే ప్రజల ఆరోగ్యం క్షీణించడం ఖాయమని గుప్తా పేర్కొన్నాడు. ఇది కూడా చదవండి: గడచిన పదేళ్లలో ఘోర రైలు ప్రమాదాలివే.. #WATCH | A layer of haze covers Delhi as the air quality in several areas in the city remains in 'Severe' category. (Visuals from Akshardham, shot at 7:20 am) pic.twitter.com/u7Iuqgf4mZ — ANI (@ANI) November 16, 2023 -
ఢిల్లీని బెంబేలెత్తిస్తున్న కాలుష్య స్థాయిలు
దీపావళి తర్వాత ఢిల్లీ-ఎన్సీఆర్లో వాయు కాలుష్యం మరింతగా పెరిగింది. గాలి నాణ్యత ‘పేలవమైన’ కేటగిరీకి పడిపోయింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (సీపీసీబీ) తెలిపిన వివరాల ప్రకారం మంగళవారం ఉదయం ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో గాలి నాణ్యత స్థాయి 450కి చేరుకుంది. ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ 360, ఆర్కె పురంలో 422, పంజాబీ బాగ్‌లో 415గా ఉంది. వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే కొద్ది రోజుల్లో ఢిల్లీ-ఎన్‌సిఆర్‌లో కాలుష్యంతో పాటు పొగమంచు కమ్మేయనుంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ (డీపీసీసీ)దీపావళి సందర్భంగా ఢిల్లీలోని 31 ప్రదేశాలలో శబ్ద కాలుష్యాన్ని అంచనా వేసింది. వీటిలో ఏడు నిశ్శబ్ద మండలాలు, ఎనిమిది నివాస ప్రాంతాలు, 11 వాణిజ్య, ఐదు పారిశ్రామిక ప్రాంతాలు ఉన్నాయి. నజాఫ్‌గఢ్‌లో అత్యల్ప స్థాయి శబ్ధ కాలుష్యం, కరోల్ బాగ్‌లో అత్యధిక శబ్ధ కాలుష్యం నమోదైంది. ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ విశ్లేషణ ప్రకారం, దేశ రాజధానిలోని దాదాపు అన్ని ఎయిర్ క్వాలిటీ మానిటరింగ్ స్టేషన్లలో గత సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం కాలుష్య స్థాయిలు మరింతగా పెరిగాయి. దీపావళి (ఆదివారం) నాడు ఢిల్లీలో 24 గంటల సగటు పార్టికల్ మీటర్(పీఎం)10 గాఢత ఒక క్యూబిక్ మీటరుకు 430 మైక్రోగ్రాములుగా ఉంది. గత సంవత్సరం క్యూబిక్ మీటరుకు 322 మైక్రోగ్రాములు, 2021లో క్యూబిక్ మీటరుకు 748 మైక్రోగ్రాములుగా నమోదయ్యింది. అలీపూర్, పట్పర్గంజ్, నజాఫ్‌గఢ్, కర్ణి సింగ్ షూటింగ్ రేంజ్‌లలో 2022తో పోలిస్తే 2023లో పార్టికల్ మీటర్ 10 సాంద్రతలు పెరిగాయని డీపీసీసీ డేటా వెల్లడించింది. ఇది కూడా చదవండి: గాజాపై హమాస్ పట్టుకోల్పోయింది: ఇజ్రాయెల్ -
‘సరి- బేసి’తో ఎంత ప్రయోజనం? గతంలో ఏం తేలింది?
ఢిల్లీలో వాయు కాలుష్యం తీవ్ర స్థాయికి చేరుకుంది. రానున్న రోజుల్లో మరింత పెరిగే అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలో ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం మరోసారి సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇది దీపావళి మరుసటి రోజు ఉదయం అంటే నవంబర్ 13 నుండి ప్రారంభంకానుంది. ఢిల్లీలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) గత కొన్ని రోజులుగా నిరంతరం 450కు పైననే ఉంటూ వస్తోంది. ఏక్యూఐ 201 నుంచి 300 మధ్య ఉంటే గాలి పీల్చుకోవడానికి ‘చెడు’ అయినదిగా పరిగణిస్తారు. ఇది 301-400 మధ్య ఉంటే ‘చాలా పేలవంగా’ ఉన్నట్లులెక్క. 401-500 మధ్య ఉంటే ‘తీవ్రమైనది’గా పరిగణిస్తారు. అంతకంటే ఎక్కువగా ఉంటే ‘చాలా తీవ్రమైనది’గా పరిగణిస్తారు. నవంబరు 13-20 తేదీల మధ్య గత ఏడేళ్లుగా ఢిల్లీలో సరి-బేసి విధానాన్ని అమలు చేస్తున్నారు. తొలుత దీనిని 2016లో ప్రారంభించారు. సరి-బేసి విధానం అంటే ఏమిటి? రెండు చేత భాగింపబడని సంఖ్యను బేసిగా పరిగణిస్తారు. ఉదాహరణకు 1, 3, 5…. ఇక సరి (ఈవెన్) అంటే రెండు చేత పూర్తిగా భాగింపబడే సంఖ్య. ఉదాహరణకు 2, 4, 6.. ఇవి సరి సంఖ్యలుగా పరిగణిస్తారు. ‘బేసి-సరి’ నియమం ప్రకారం డ్రైవింగ్ చేయడం అంటే.. సరి సంఖ్యగల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ సరి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి ఉంటుంది. అదేవిధంగా బేసి సంఖ్యల తేదీలలో.. రిజిస్ట్రేషన్ నంబర్ బేసి సంఖ్యతో ముగిసే వాహనాలు మాత్రమే ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అనుమతి కల్పిస్తారు. ఈ పథకాన్ని అమలు చేయడం వెనుక ఉన్న ఉద్దేశం విషయానికొస్తే.. ఢిల్లీ ప్రభుత్వం రోడ్లపై కార్ల సంఖ్యను దాదాపు సగానికి తగ్గించాలనుకుంటోంది. ఇలా చేయడం వలన వాయు నాణ్యత మెరుగుపడుతుందని భావిస్తోంది. గతంలో ప్రభుత్వం దీనిని అమలు చేసినప్పుడు, టాక్సీలు (సీఎన్జీతో నడిచేవి), మహిళలు నడిపే కార్లు, ఎలక్ట్రిక్, హైబ్రిడ్ వాహనాలు, అన్ని ద్విచక్ర వాహనాలతో సహా అనేక వర్గాల వాహనాలకు మినహాయింపు ఇచ్చారు. ప్రస్తుతం ఢిల్లీలో దాదాపు 75 లక్షల వాహనాలు రోడ్లపై తిరుగాడుతున్నాయి. ఈ 75 లక్షల వాహనాల్లో మూడో వంతు కార్లు. బేసి-సరి పథకం అమలయినప్పుడు ప్రతి రోజు దాదాపు 12.5 లక్షల కార్లు (ఎలక్ట్రిక్, హైబ్రిడ్ మినహా) ఢిల్లీ రోడ్లపై తిరిగేందుకు అవకాశం ఉండదు. ఢిల్లీలో వాయు కాలుష్యం ఏడాది పొడవునా ఉంటుంది. అయితే కొన్ని నెలల్లో (ముఖ్యంగా దీపావళి వచ్చే మాసంలో) వాయు కాలుష్యం మరింత తీవ్రంగా మారుతుంది. పంజాబ్, హర్యానాలలో పంట చేతికొచ్చాక గడ్డిని కాల్చివేస్తుంటారు. ఇది కూడా వాయు కాలుష్యానికి కారణంగా నిలుస్తుంది. అక్కడి నుంచి వచ్చే పొగ ఢిల్లీ వాతావరణాన్ని కలుషితం చేస్తుంది. వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి చైనా, మెక్సికో, ఫ్రాన్స్‌లోని నగరాల్లో సరి-బేసి విధానాలను అమలు చేస్తున్నారు. అయితే ఈ విధానం ఎంత ప్రభావవంతంగా ఉంటుందనే దానిపై చర్చ జరుగుతోంది. 2019లో ఢిల్లీలో సరి-బేసి విధానం అమలు చేసినప్పుడు నోయిడా, ఘజియాబాద్‌లలో స్వల్పంగా వాయు కాలుష్యంలో తగ్గుదల కనిపించిందని తేలింది. రోడ్లపై వాహనాల సంఖ్యను తగ్గించడం వల్ల తీవ్రమైన కాలుష్య స్థాయిలు ఖచ్చితంగా తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది ఎంత మేరకు ఉంటుందనేది అంచనా వేయడం కష్టమని అంటున్నారు. 2016 జనవరిలో సరి-బేసి విధానాన్ని అమలు చేసినప్పుడు.. ఈ ప్రణాళిక ‘వాయు కాలుష్యాన్ని తగ్గించడంలో విఫలమైంది’ అని ఒక అధ్యయనం పేర్కొంది. ఇది కూడా చదవండి: కాలుష్యంతో ఏఏ క్యాన్సర్లు వస్తాయి? -
ఈ డివైజైలో తక్కువ ఆయిల్తోనే బూరెలు, గారెలు వండేయొచ్చు!
డిజిటల్ డివైస్‌లలో.. లేటెస్ట్ మేకర్స్‌ని ఎన్నుకోవడమే నయాట్రెండ్. చిత్రంలోని డివైస్ అలాంటిదే. ఇంతవరకు ఫ్రంట్‌లోడ్ ఎయిర్ ఫ్రైయర్స్‌నే చూశాం. కానీ ఈ చిత్రంలోని డివైస్ టాప్లోడ్ ఫ్రైయర్. దీనిలో బేకింగ్, గ్రిల్లింగ్, రోస్టింగ్, డీప్ఫ్రైయింగ్ వంటి ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి. ఆరులీటర్ల సామర్థ్యం కలిగిన ఈ మెషిన్ బాస్కెట్లో.. బూరెలు, గారెలు, బజ్జీలు, చగోడీలు, మురుకులు, వడియాలు వంటివన్నీ తయారు చేసుకోవచ్చు. ఇందులో టైమింగ్, టెంపరేచర్ రెండిటినీ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. చాలా తక్కువ ఆయిల్తోనే ఆహారం వేగంగా గ్రిల్ అవుతుంది. దీన్ని మూవ్ చేసుకోవడం చాలా సులభం. ఇందులో గ్రిల్ బాస్కెట్‌తో పాటు.. గ్రిల్ ప్లేట్ కూడా లభిస్తుంది. దానిలో చికెన్, మటన్ ముక్కల్ని గ్రిల్ చేసుకోవచ్చు. దీన్ని వినియోగించడం చాలా ఈజీ. (చదవండి: ఇంట్లోనే పిజ్జా చేసుకునేలా సరికొత్త మేకర్!) -
బుకింగ్‌లపై బ్లూడార్ట్ భారీ డిస్కౌంట్లు
ముంబై: దక్షిణాసియాలో ప్రముఖ ఎక్స్?ప్రెస్ ఎయిర్ రవాణా, ఏకీకృత లాజిస్టిక్స్ సంస్థ బ్లూడార్ట్ ఎక్స్?ప్రెస్ లిమిటెడ్ దీపావళి పండుగ సందర్భంగా బుకింగ్‌లపై ఆఫర్లను ప్రకటించింది. ఇందుకోసం ‘దివాలి ఎక్స్?ప్రెస్’ను తీసుకొచి్చంది. ఈ ప్రత్యేక ఆఫర్ నవంబరు 19 వరకు అందుబాటులో ఉంటుందని కంపెనీ తెలిపింది. దేశీయ లేదా అంతర్జాతీయ ప్రదేశాలకు పంపించే అన్ని దీపావళి బహుమతుల షిప్మెంట్లపై డిస్కౌంట్ ఇస్తున్నట్టు ప్రకటించింది. 2 నుంచి 10 కిలోల బరువు ఉన్న దేశీయ షిప్మెంట్లపై 40 శాతం తగ్గింపు, 3 కిలోలు, 5 కిలోలు, 10 కిలోలు, 15 కిలో లు, 20 కిలోలు, 25 కిలోల బరువు ఉన్న అంతర్జాతీయ నాన్–డాక్యుమెంట్ షిప్మెంట్స్పై 50 శాతం తగ్గింపును పొందొచ్చని తెలిపింది. -
ఢిల్లీలో మరింత క్షీణించిన గాలి నాణ్యత.. ‘నాసా’ ఫొటోలలో కారణం వెల్లడి!
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం మరింత దిగజారుతోంది. చలి తీవ్రమవుతోంది. ఢిల్లీతోపాటు ఎన్సీఆర్ ప్రాంతాల్లో గాలి నాణ్యత క్షీణిస్తోంది. పొరుగున ఉన్న పంజాబ్, హర్యానాల్లో పొల్లాల్లోని గడ్డిని తగలబెడుతూండటమే రాజధాని ప్రాంతంలో ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మరింత దిగజారేందుకు కారణమవుతోంది. అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా) తాజాగా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాలు, సమాచారం కూడా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తోంది. కొన్నేళ్లుగా నాసా వాతావరణ కాలుష్యంపై ఈ గడ్డి వాముల కాల్చివేత ప్రభావంపై అధ్యయనం చేస్తోంది. తాజాగా నాసా విడుదల చేసిన ఉపగ్రహ ఛాయాచిత్రాల్లో (దిగువన) ఎర్రటి చుక్కలు పంటపొలాల్లో కాలిపోతున్న గడ్డిని స్పష్టంగా చూపుతున్నాయి. నాసా సీనియర్ రీసెర్చ్ సైంటిస్ట్ హిరెన్ జెత్వా మీడియాతో మాట్లాడుతూ పంజాబ్, హర్యానాలలో గడ్డివాములను కాల్చడం అధికమవుతున్నదని అన్నారు. కాలుష్య నియంత్రణ అధికారుల తెలిపిన వివరాల ప్రకారం ఢిల్లీలో గాలి నాణ్యత వరుసగా మూడవ రోజు పేలవ స్థాయిలో నమోదైంది. రాబోయే రోజుల్లో ఢిల్లీ ఏక్యూఐలో పెద్దగా మెరుగుపడే అవకాశాలు లేవు. బుధవారం ఉదయం పది గంటలకు నగరంలో సగటు వాయు నాణ్యత సూచిక (ఏక్యూఐ) 238గా ఉంది. ఢిల్లీలోని సెంటర్ ఎయిర్ క్వాలిటీ ఎర్లీ వార్నింగ్ సిస్టమ్ తెలిపిన వివరాల ప్రకారం రాబోయే నాలుగైదు రోజులలో నగరంలో గాలి నాణ్యత మరింత తగ్గే అవకాశం ఉంది. గాలి నాణ్యత సూచీ 500గా ఉంటే కాలుష్య స్థాయిని మరింత తీవ్రమైనదిగా పరిగణిస్తారు. గడచిన మే తర్వాత తొలిసారిగా ఆదివారం ఢిల్లీలో గాలి నాణ్యత పేలవమైన స్థాయిని చూపింది. ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలి వేగం మందగించడం, పొలాల్లో గడ్డిని కాల్చడం మొదలైనవి ఢిల్లీలో కాలుష్య స్థాయి పెరగడానికి కారణాలని నిపుణులు చెబుతున్నారు. ఇది కూడా చదవండి: జమ్ముకశ్మీర్‌పై గాజా ఉద్రిక్తతల ప్రభావం? ఉన్నతాధికారుల అత్యవసర సమావేశం -
నాచుతో కాలుష్యాన్ని మాయం గాడ్జెట్.. ధర ఎంతంటే?
సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్‌పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది. ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది. ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే! -
'అత్యంత స్వచ్ఛమైన గాలి' లభించేది ఇక్కడే..బాటిల్లో నింపి..
భూమిపై స్వచ్ఛమైన గాలి కోసం పరిశోధకులు ఎన్నో ఏళ్లుగా తెగ అన్వేషిస్తున్నారు. మానవుల మెరుగైన ఆరోగ్యం కోసం పరిశుభ్రమైన గాలి లభించే ప్రాంతాల గురించి జరిగిన అన్వేషణలో ఓ ప్రాంతం హాట్ టాపిక్‌గా మారింది. ఆ ప్రదేశంలోనే ప్రపంచంలోనే అత్యంత స్వచ్ఛమైన గాలి లభిస్తుందని పరిశోధకులు గుర్తించారు. ప్రపంచం చిట్టచివరి ప్రదేశంగా పిలిచే ఆస్ట్రేలియాలోని టాస్మానియాలో వాయువ్య కొన వద్దే ఈ స్వచ్ఛమైన గాలి లభిస్తుందట. కేప్గ్రిమ్ అనే ద్వీపకల్పం వద్ద ఈ ప్రదేశం ఉంది. పర్యాటకులు సైతం ఆ గాలిని పీల్చేందుకు తండోపతండాలుగా వస్తుంటారు. ఇక్కడ గాలి చాలా నాణ్యవంతంగా ఉంటుందని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ కేప్గ్రిమ్ని దక్షిణ మహాసముద్రం మీద నుంచి పశ్చిమ గాలులు చాలా బలంగా తాకుతాయని చెబుతున్నారు. అందువల్లే ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉందని చెప్పారు. ఈ ప్రాంతం "ఎడ్జ్ ఆప్ ది వరల్డ్"గా ప్రసిద్ధి. భయంకరమైన గాలులకు పేరుగాంచిన ప్రాంతం కూడా. ఇక్కడ గంటకు 180 కిలోమీటర్ పర్ అవర్‌తో గాలులు వీస్తాయి. అందువల్లే కలుషితం కానీ గాలి ఇక్కడ వీస్తుందని అంటున్నారు శాస్త్రవేత్తలు. గాలి వేగం, గాలి దిశ డేటా ఆధారంగా కేప్గ్రిమ్కు చేరే గాలిలో దాదాపు 30 శాతం బాగుంటే చాలని దీన్ని బేస్‌లైన్‌గా తీసుకుంటామని అన్నారు. కానీ ఇక్కడ గాలి అంతకు మించి స్వచ్ఛంగా ఉండటమే కాకుండా స్థానిక వాతావరణ వనరులతో ప్రభావితం కాకుండా చాలా పరిశుభ్రమైన గాలి ఉంటుందని శాస్త్రవేత్త స్టావర్ట్ చెప్పారు. ఇప్పటి వరకు ప్రపంచంలో ఓ మోస్తారుగా స్వచ్ఛమైన గాలి లభించే ప్రాంతాలు హవాయిలోని మౌనాలోవా స్టేషన్, మాక్వేరీ ద్వీపం, అంటార్కిటికాలోని కేసీ స్టేషన్, నై అలెసుండ్, స్వాల్బార్డ్ పట్టణం తదితరాలు ఉన్నాయి. కానీ ఈ టాస్మానియాలో వీచే గాలి మాత్రమే ఈ భూమిపై లభించే గాలుల్లోకెల్ల స్వచ్ఛమైన గాలి అని శాస్త్రవేత్తలు నిర్థారించారు. ప్రస్తుతం ఈ టాస్మానియాలోని స్వచ్ఛమైన గాలిని డబ్బాలో పట్టి విక్రయిస్తున్నారట. ఒక రకంగా పరిశుభమైన గాలికి సంబంధించిన వ్యాపారం ఊపందుకుంది. ప్రతి డబ్బాలో దాదాపు ఓ వ్యక్తి 130 సార్లు టాస్మానియా గాలిని పీల్చుకునేంత స్టోరై ఉంటుందట. (చదవండి: మూత్రంతో తయారు చేసిన బీరు..ఎగబడుతున్న జనాలు!) -
గాలిలో స్పృహ కోల్పోయి, గుడ్లు తేలేసి, తల వాల్చేసి.. నవ్విస్తున్న పారాగ్లైడర్
సోషల్ మీడియాలో తాజాగా పారాగ్లైడింగ్కు సంబంధించిన ఒక వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియో ఒక విదేశీయునికి సంబంధించినది. అతను పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో ఎంతో ఉద్వేగానికి గురయ్యాడు. అతను గాలిలో స్పృహతప్పి పోయాడు. స్పృహలోకి రాగానే ఏం చేసాడో చూస్తే ఎవరైనా నవ్వు ఆపుకోలేరు. ఈ 15 సెకన్ల వీడియోలో ఒక వ్యక్తి పారాగ్లైడింగ్ చేస్తూ కనిపిస్తాడు. అతని పరిస్థితి చూస్తే అతను పారాగ్లైడింగ్‌ని పూర్తిగా ఆస్వాదించడం లేదని మనకు అర్థం అవుతుంది. పారాగ్లైడింగ్ చేస్తున్న సమయంలో అతని నోరు తెరిచి ఉంది. మెడ కూడా వేలాడుతోంది. వెనుకనున్న పారాగ్లైడింగ్ శిక్షకుడు అతని పరిస్థితి చూసి నవ్వుతున్నాడు. భయం లేదా అమిత ఉత్సాహం కారణంగా వ్యక్తి స్పృహ కోల్పోయే అవకాశం ఉంది. అతనిని చూసిన గైడ్ అతన్ని నవ్వించడానికి ప్రయత్నించాడు. ఆ వ్యక్తి స్పృహ వచ్చిన వెంటనే బిగ్గరగా అరవడం మొదలెడతాడు. ఈ వీడియోను సెప్టెంబర్ 13న @Enezator అనే వినియోగదారు Xలో భాగస్వామ్యం చేశారు. ఈ వీడియోను ఇప్పటివరకు 78 వేలకు పైగా వ్యూస్ దక్కించుకుంది. ఈ వీడియోను చూసినవారు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఒక యూజర్.. ‘అతను ఉత్సాహం ఎక్కువై మూర్ఛపోయినట్లు నాకు అనిపించడం లేదని’ రాశారు. మరొకరు ‘భయంతో స్పృహతప్పిపోయాడు’ అని రాశారు. ఈ వీడియోను చూసిన కొంతమంది ‘తాము నవ్వు ఆపుకోలేకపోతున్నామని’ కామెంట్ చేశారు. ఇది కూడా చదవండి: ఆ నగరం మన దేశానికి ఒక్కరోజు రాజధాని ఎందుకయ్యింది? fainted from excitement in the air pic.twitter.com/k7X80jze05 — Enezator (@Enezator) September 13, 2023 -
జనం.. గగనయానం!
హైదరాబాద్‌లోని మాదాపూర్ ప్రాంతానికి చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగి ఏపీలోని విశాఖపట్నంలో ఓ శుభకార్యానికి వెళ్లాల్సి వచ్చింది. రైలులో వెళ్లి రావాలంటే.. మూడు, నాలుగు రోజులు సెలవు పెట్టాలి. పైగా సుదీర్ఘ ప్రయాణంతో ఇబ్బంది. దీంతో విమానంలో వెళ్లాడు. మరుసటి రోజు ఉదయానికల్లా హైదరాబాద్‌కు వచ్చేసి యథావిధిగా ఆఫీసుకు వెళ్లాడు. కీసర ప్రాంతానికి చెందిన నలుగురు స్నేహితులు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. నాలుగు రోజుల పాటు సరదాగా ఎక్కడికైనా వెళ్లాలనుకున్నారు. విమాన టికెట్లు అందుబాటులో ఉండటంతో బుక్ చేసుకుని సింగపూర్ చుట్టి వచ్చేశారు. ఇదీ ప్రయాణికుల రద్దీ 2022 ఏప్రిల్‌నుంచి జూలై వరకు ప్రయాణికుల సంఖ్య: 26,73,979 పెరిగిన ప్రయాణికుల శాతం:28.2% ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూలై వరకు సంఖ్య: 34,29,083 ..రాష్ట్రంలో విమాన ప్రయాణికులు పెరుగుతున్నారనేందుకు ఈ రెండు చిన్న ఉదాహరణలే. దూర ప్రయాణాలకు ఎక్కువ సమయం పట్టడం, ప్రయాణ బడలిక, ఇతర ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చాలా మంది విమాన ప్రయాణాలకు మొగ్గుచూపుతున్నారు. విమాన టికెట్ల ధరలు అందుబాటులో ఉండటం, విదేశాలకు వెళ్లేందుకు వీసాలు కూడా సులువుగా లభిస్తుండటంతో విదేశాలకు వెళ్లేవారూ పెరుగుతున్నారు. మరోవైపు చదువుల కోసం విదేశాలకు వెళ్లివచ్చే విద్యార్థుల సంఖ్య ఇటీవల భారీగా పెరిగింది. దీనితోనూ విమానాలకు డిమాండ్ నెలకొంది. ఈ క్రమంలో కొన్ని రోజులుగా హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ప్రయాణికుల రాకపోకలు భారీగా పెరిగాయి. ప్రయాణికులకు వీడ్కోలు పలికేందుకు, ఆహా్వనం పలికేందుకు వస్తున్న బంధువులు, స్నేహితుల రద్దీని నియంత్రించేందుకు ఎయిర్‌పోర్టు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాల్సి రావడం గమనార్హం. ఒక్క జూలై నెలలోనే 3.68 లక్షల మంది అంతర్జాతీయ ప్రయాణికులు, 16.40 లక్షల మంది దేశీయ ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి రాకపోకలు సాగించడం విశేషం. 25శాతం పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి విదేశాలకు, దేశంలోని ఇతర ప్రాంతాలకు కలిపి రోజూ సుమారు 400 వరకు విమాన సరీ్వసులు నడుస్తున్నాయి. సగటున రోజూ 65వేల మందికిపైగా వీటిలో రాకపోకలు సాగిస్తున్నారు. కొన్నిరోజులుగా ఈ సంఖ్య 70వేలకుపైగా ఉంటోందని, విదేశాలకు వెళ్లే విద్యార్ధులే రోజూ సుమారు 5 వేల మంది వరకు ఉంటున్నారని ఎయిర్‌పోర్టు అధికారులు చెప్తున్నారు. అమెరికాకు వెళ్లే విద్యార్ధులతోపాటు పర్యాటకులు, బంధువుల వద్దకు వెళ్లేవారు కూడా పెరిగారని అంటున్నారు. ఇక దేశంలో కేరళ, తమిళనాడు, కర్ణాటక, జైపూర్, ఢిల్లీ తదితర ప్రాంతాలకు వెళ్లే పర్యాటకులు,వ్యాపారం,ఇతర పనులపై రాకపోకలు సాగించేవారు ఎక్కువయ్యారని చెప్తున్నారు. గత ఏడాది జూలైలో 16,01,281 మంది విమాన ప్రయాణం చేయగా.. ఈసారి ఆ సంఖ్య 25శాతం పెరిగి 20 లక్షలకుపైగా నమోదైంది. అవసరం ఏదైనా విమానం ఎక్కాల్సిందే.. దేశంలోని అన్ని ప్రధాన మెట్రో నగరాలు, ఇతర ముఖ్యమైన నగరాలకు హైదరాబాద్ నుంచి విమాన కనెక్టివిటీ పెరిగింది. యూరప్‌తోపాటు దుబాయ్, సింగపూర్, మలేసియా, థాయ్‌లాండ్, మాల్దీవులు, ఢాకా వంటి దేశాలు, అంతర్జాతీయ నగరాలకు ఇక్కడి నుంచి నేరుగా విమానాలు అందుబాటులోకి వచ్చాయి. మరోవైపు కోవిడ్ తర్వాత చాలా మంది విమాన ప్రయాణానికి మొగ్గుచూపుతున్నట్టు ట్రావెల్ ఏజెన్సీలు, పర్యాటక రంగ సంస్థలు చెప్తున్నాయి. ఒకప్పుడు తప్పనిసరి అయితే తప్ప విమాన ప్రయాణం జోలికి వెళ్లనివారు కూడా.. ఏమాత్రం అవకాశం ఉన్నా విమానంలో వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారని అంటున్నాయి. కొంత ఖర్చయినా ఫర్వాలేదు, విమానంలో వెళ్లాలనే కోరికతో సాధారణ, మధ్య తరగతి వర్గాలవారు కూడా విమానం ఎక్కేస్తున్నారని పేర్కొంటున్నాయి. -
అంతరిక్షంలో వ్యోమగామి చనిపోతే మృతదేహం భూమికి ఎలా చేరుతుంది?
భారత అంతరిక్ష సంస్థ ఇస్రో ‘గగన్‌యాన్’ ద్వారా త్వరలో మానవులను అంతరిక్షంలోకి పంపేందుకు సన్నాహాలు చేస్తోంది. చంద్రయాన్-3 విజయం, ఆదిత్య ఎల్-1 విజయవంతమైన తర్వాత ముగ్గురు భారతీయ వ్యోమగాములు గగన్‌యాన్ సాయంతో భూమికున్న దిగువ కక్ష్యలోకి వెళ్లనున్నారు. ఈ వ్యోమగాములు మూడు రోజుల పాటు నిర్ణీత కక్ష్యలో ఉంటారు. ఆ తర్వాత క్షేమంగా భూమికి తిరిగి రానున్నారు. అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ నాసా కూడా హ్యూమన్ స్పేస్ మిషన్ కోసం సన్నద్ధమవుతోంది. మృతదేహాలు ఏమవుతాయి? అనేక ప్రైవేట్ సంస్థలు కూడా అంతరిక్ష పర్యాటక దిశగా పనిచేస్తున్నాయి. ఇప్పటివరకు ప్రపంచం నలుమూలల నుంచి 600 మందికి పైగా ప్రజలను అంతరిక్షంలోకి పంపారు. 1961లో తొలిసారిగా సోవియట్ యూనియన్‌కు చెందిన వ్యోమగామి యూరి గగారిన్ అంతరిక్ష యాత్రకు వెళ్లారు. అంతరిక్షంలో ప్రయాణించిన వారిలో ఎక్కువ మంది వ్యోమగాములే ఉన్నారు. అయితే ఇటీవల కొంత మంది సామాన్యులు కూడా స్పేస్ టూరిజం కింద అంతరిక్షయానం చేశారు. అయితే అంతరిక్ష యాత్రకు వెళ్లినవారిలో ఎవరైనా అంతరిక్షంలోనే మరణించారా? అనే ప్రశ్న ఇప్పుడు తలెత్తుతుంది. అదే జరిగితే వారి మృతదేహాలను భూమికి ఎలా తీసుకువచ్చారు? అనే ప్రశ్నకూడా మదిలో మెదులుతుంది. అత్యధిక ప్రమాదాలు ఎక్కడ జరుగుతాయి? అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం ఇప్పటి వరకు 188 మంది అంతరిక్ష విమానాల్లో మరణించారు. 1980ల నుంచి ఇలాంటి ప్రమాదాలు గణనీయంగా తగ్గాయి. స్పేస్ ఫ్లైట్‌తో కూడిన చాలా ప్రమాదాలు భూమిపైన లేదా అంతరిక్షంగా పరిగణించే పాయింట్‌ను చేరుకోవడానికి ముందుగానే సంభవించాయి. ఈ పరిమితిని కర్మన్ లైన్ అంటారు. ఇది సముద్ర మట్టానికి 100 కిలోమీటర్లు అంటే 62 మైళ్ల ఎత్తులో ఉంది. అంతరిక్షంలో స్పేస్ క్రాఫ్ట్ తప్పిపోయిన సందర్భాలు కొన్ని ఉన్నాయి. అంతరిక్షంలో ప్రమాదానికి గురైన వ్యోమనౌకలోని బాధితులు సాధారణంగా భూమిపైన పడిపోతారు. ముగ్గురు వ్యోమగాములు మృతి చెందినప్పుడు.. అంతరిక్షంలో ఒకే ఒక్క ప్రమాదం 1971లో జరిగింది. సాల్యూట్-1 అంతరిక్ష కేంద్రం నుండి తిరిగి వస్తున్నప్పుడు సోయుజ్-11 క్యాప్సూల్ ఒత్తిడి తగ్గింది. ఫలితంగా వ్యోమగాములు జార్జి డోబ్రోవోల్స్కీ, వ్లాడిస్లావ్ వోల్కోవ్, విక్టర్ పట్సాయేవ్ మరణించారు. క్యాప్సూల్ భూమిపైకి దిగుతూనే సముద్రంలో పడిపోయింది. అనంతరం క్యాప్సూల్ నుంచి ముగ్గురు వ్యోమగాముల మృతదేహాలను వెలికి తీశారు. అంతరిక్షంలో వ్యోమగాములు మరణించిన ఒకేఒక్క ఉదంతం ఇది. బహిరంగపరచగానికి సోవియట్ యూనియన్ నిరాకరణ 1960 సంవత్సరపు ‘ది లాస్ట్ కాస్మోనాట్స్’ సిద్ధాంతం ప్రకారం యూరి గగారిన్ అంతరిక్ష ప్రయాణంలో విజయవంతమైన ప్రయత్నానికి ముందు, సోవియట్ యూనియన్ రహస్యంగా ఇటువంటి అనేక ప్రయత్నాలు చేసింది. అలాంటి ఒక ప్రయత్నంలో అంతరిక్షంలో ఒక ప్రమాదం జరిగింది. అందులో కొంతమంది వ్యోమగాములు మరణించారు. అయితే సోవియట్ యూనియన్ విషయాన్ని బహిరంగపరచడానికి నిరాకరించింది. ది లాస్ట్ కాస్మోనాట్స్ థియరీ నిజమా అబద్ధమా అనేది ఇప్పటి వరకు రుజువు కాలేదు. ఈ సిద్ధాంతం సరైనదని రుజువు చేయగల అటువంటి ఆధారాలు ఇప్పటి వరకు తెరపైకి రాలేదు. జంతువులను పంపినప్పుడు ఏమి జరిగింది? మానవులను అంతరిక్షంలోకి పంపే ముందు సోవియట్, అమెరికన్ ఏజెన్సీలు 1950లలో అంతరిక్ష నౌకలో జంతువులను సజీవంగా ఉంచడానికి ప్రయత్నం చేశాయి. ఈ ప్రయత్నంలో భాగంగా అమెరికా వి-2 బ్లోసమ్ రాకెట్లో ఆల్బర్ట్ ఫస్ట్ అనే కోతిని పంపింది. సోవియట్ యూనియన్ స్పుత్నిక్-2 ఉపగ్రహంతో లైకా అనే కుక్కను పంపింది. ఈ రెండు జంతువులు కూడా అంతరిక్షంలో మరణించాయి. తదుపరి ప్రయత్నాలలో కూడా కొన్ని జంతువులు అంతరిక్షంలో చనిపోయాయి. ఈ జంతువులన్నీ క్యాప్సూల్‌లోనే చనిపోయాయి. ఆ క్యాప్సూల్స్ భూమికి తిరిగి వచ్చాయి. వాటి మృతదేహాలు తిరిగి లభ్యమయ్యాయి. ఇప్పటివరకు అంతరిక్షంలో ఏ జంతువు కూడా గల్లంతైన సంఘటన ఎదురుకాలేదు. ఇది కూడా చదవండి: తొలి ఐఎఎస్ సెలక్షన్ ఎలా జరిగింది? మొదటి ఐఎఎస్ అధికారితో ఠాగూర్కున్న సంబంధం ఏమిటి? -
స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరుకు మూడో ర్యాంకు
నెహ్రూనగర్(గుంటూరుఈస్ట్): కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రాం (ఎన్.క్యాప్) జాతీయ స్థాయిలో చేపట్టిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో గుంటూరు నగరానికి మూడో ర్యాంక్ దక్కింది. దక్షిణ భారతదేశం నుంచి గుంటూరు నగరానికి మాత్రమే ర్యాంకు దక్కిందని మేయర్ కావటి శివనాగ మనోహర్‌నాయుడు, కమిషనర్ కీర్తి చేకూరి గురువారం సంయుక్త ప్రకటనలో పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 131 నగరాలు పోటీ పడగా, అందులో 10 లక్షల లోపు జనాభా కేటగిరిలో గుంటూరు నగరానికి 3వ ర్యాంక్ దక్కిందన్నారు. జాతీయ కాలుష్య నియంత్రణ మండలి 131 నగరాల్లో స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లోని అంశాలను పరిశీలించి 2023–24 ఆర్థిక సంవత్సరానికి ఉత్తమ నగరాలను సిఫార్సు చేసిందన్నారు. ఈ అవార్డును సెపె్టంబర్ 7న మధ్యప్రదేశ్‌లోని భోపాల్‌లో కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి చేతుల మీదుగా అందుకోనున్నట్లు చెప్పారు. -
ఓం శాంతిః శాంతిః శాంతిః
మీరు ఎన్నిక్రతువులు చేయండి, ఎన్ని పూజలు చేయండి, యజ్ఞాలు చేయండి... చివరకు మీరు కోరుకునేది ఏది... కేవలం ప్రశాంతత. నేను రాజభవనంలో ఉన్నా, నేనెంత అందగాడినయినా, ఎంత విద్వాంసుడినయినా, ఎంత ఐశ్వర్యం ఉన్నా... మనసు అల్లకల్లోలంగా ఉన్నప్పుడు, తీవ్ర అశాంతితో ఉన్నప్పుడు ఇవేవీ మీకు శాంతినివ్వలేవు. ఒక పచ్చటి చెట్టు, రంగురంగుల పూలతో, కాయలతో, పళ్ళతో ఉన్నప్పటికీ తొర్రలో అగ్నిహోత్రం ఉన్నప్పుడు అది లోపల.. లోపల ఎంత దహించుకు పోతుంటుందో... మనసులో అశాంతి ఉన్న వ్యక్తికూడా అలాగే బాధపడుతూ ఉంటాడు. అందుకే శాంతి కావాలి. మన సంప్రదాయం మనకు ఒక శాంతి మంత్రాన్నే ఇచ్చింది...ఓం శాంతిః శాంతిః శాంతిః ఇది కేవలం ప్రాణులు మాత్రమే కాదు, అంతరిక్షం శాంతి పొందాలి, పృథివి శాంతి పొందాలి, వాయువు శాంతిపొందాలి. జలం శాంతి పొందాలి. ఏదీ కూడా వ్యగ్రతను పొందకూడదు. భూమికి అచల అని పేరు. అంటే కదలనిది..అని. భూమికి కోపం వచ్చి తన కట్టుతప్పి కదిలిందనుకోండి.. ఎంత ప్రాణ నష్టం? ఎంత ఆస్తి నష్టం ? అందుకే భూమి ప్రశాంతంగా ఉండాలి. వాయుః శాంతిః వాయువు తన కట్టుతప్పి తీవ్రతను చూపిందనుకోండి.. ప్రభంజనం అంటాం. అన్నీ నేలకొరుగుతాయి. అదే వాయువు తాను ఉండాల్సిన కట్టుబాటులో ఉంటే... వాయుః ప్రాణః, సుఖం వాయుః. అప్పుడు ప్రాణమూ వాయువే, సుఖమూ వాయువే. చల్లగాలి చక్కగా వీస్తుందనుకోండి. సుఖంగా అనిపిస్తుంది. ఏ ఇబ్బందీ లేకుండా ఊపిరిని ఒకే వేగంతో తీసి, ఒకే వేగంతో విడిచిపెడుతూ ఉన్నప్పుడు.. అంతకన్నా ఆయుర్దాయం మరేముంది! వాయువు ఎంతకాలం శరీరంలో తిరుగుతూ ఉంటుందో అంతకాలమే సంధిబంధాలు.. కాళ్ళు, చేతులు, మణికట్టు అన్నీ వంగుతాయి. అది ప్రసరించనప్పుడు శరీరం ఒక కర్రయిపోతుంది. అందుచేత వాయువు అత్యంత ప్రధానమైనది. దాని చేత ప్రాణులన్నీ చలనశీలంగా ఉంటాయి. వడిబాయక తిరితే ప్రాణబంధుడా !.. అంటారు అన్నమాచార్యులవారు. ఒకే వేగంతో ఊపిరిని శరీరం లోపలికి, బయటికి పంపుతున్నాడే..ఆయనే వేంకటేశ్వరుడు. ఇక అంతకన్నా నాకు దగ్గరగా ఎవరున్నార్రా!!! అని అడిగాడు. వడిబాయక తిరిగే ప్రాణబంధుడా.. అని పిలిచాడు ఆయన వేంకటేశ్వరుడిని. అదే.. వాయుఃప్రాణః సుఖం వాయుః. ఊపిరిని తీసి విడిచి పెడుతున్న శరీరం ఆచంద్రార్కం.. శాశ్వతంగా ఉండదు. పడిపోతుంది. ఇప్పుడు వాయువుకున్న గొప్పదనం ఏమిటంటే.. అదే వాక్కుగా మారుతుంది. ఆ వాయువు చేత ప్రాణాలను నిలబెట్టుకున్నవాడు వాటిని సార్ధక్యం చేసుకున్నప్పుడు శరీరం పడిపోయినా ఆ వ్యక్తి.. కాలంలో శతాబ్దాలు నిలబడిపోతాడు.. ఎలా! అది వాక్కుగా మారినందువల్ల...! బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు