సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్‌పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది.
ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది.
ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే!
Comments
Please login to add a commentAdd a comment