Air purifier
-
ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్
న్యూఢిల్లీ: ఎయిర్ ప్యూరిఫయర్లకు (గాలిని శుద్ధి చేసే పరికరాలు) డిమాండ్ పెరుగుతోంది. ఢిల్లీ ఎన్సీఆర్ వంటి ప్రాంతాల్లో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయిలకు చేరడం ఇందుకు నేపథ్యమని తయారీదారులు చెబుతున్నారు. ప్రస్తుత పండుగల సీజన్లో ఎయిర్ ప్యూరిఫయర్ల అమ్మకాలు గతేడాది ఇదే సీజన్‌తో పోలి్చనప్పుడు 50 శాతం పెరిగినట్టు కెంట్ ఆర్వో సిస్టమ్స్, షావోమీ, ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా వెల్లడించాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల కోసం గడిచిన 2–3 వారాలుగా విచారణలు పెరిగాయని, గాలి నాణ్యత సూచీ రానున్న రోజుల్లో మరింత ప్రమాదకర స్థాయికి చేరుకోనున్న (శీతాకాలం కావడంతో) దృష్ట్యా వీటి అమ్మకాలు ఇంకా పెరుగుతాయని కంపెనీలు అంచనా వేస్తున్నాయి. ఎయిర్ ప్యూరిఫయర్ల విభాగం పరిమాణం పరంగా చాలా చిన్నది కావడం గమనార్హం. ఏటా అక్టోబర్–నవంబర్ కాలంలో వీటి అమ్మకాలు గరిష్టానికి చేరుతుంటాయి. ఆ సమయంలో ఉత్తర భారత్‌లోని కొన్ని ప్రాంతాలతోపాటు ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో వాయు నాణ్యత దారుణంగా పడిపోతుంటుంది. దీపావళి వేడుకలకుతోడు పంట వ్యర్థాల దహనం ఇందుకు కారణం. ఒక్కసారిగా డిమాండ్.. ‘‘ఢిల్లీ అత్యంత కాలుష్యంతో కూడిన సీజన్‌ను ప్రస్తుతం చూస్తోంది. దీంతో అక్కడ ఉన్నట్టుండి ఎయిర్ ప్యూరిఫయర్లకు డిమాండ్ ఏర్పడింది’’అని ఎల్జీ ఎల్రక్టానిక్స్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సంజయ్ చిత్కార తెలిపారు. గాలి నాణ్యత సూచీ (ఏక్యూఐ) ప్రమాదకర స్థాయిని దాటిపోతే అప్పుడు కాలుష్య కారకాలు పీఎం 2.5 పారి్టకల్స్ కంటే సూక్ష్మంగా ఉంటాయని, వీటిని వడగట్టడం కూడా కష్టమేనన్నారు. శీతాకాలంలో వాయునాణ్యత క్షీణించడం వల్ల ఎయిర్ ప్యూరిఫయర్లు, ఫిల్టర్ల అమ్మకాలు సహజంగానే పెరుగుతుంటాయని కెంట్ఆర్వో సిస్టమ్స్ సీఎండీ మహేష్ గుప్తా తెలిపారు. ఉత్తరాది ప్రాంతాల్లో ప్రమాదకర స్థాయికి కాలుష్యం చేరడంతో తమ ఆరోగ్యం కాపాడుకోవడం కోసం వినియోగదారులు ఎయిర్ ప్యూరిఫయర్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నట్టు వివరించారు. ఇప్పటికే అమ్మకాలు 20–25 శాతం మేర అధికంగా నమోదైనట్టు చెప్పారు. సాధారణం కంటే 50 శాతం మేర అధికంగా ఎయిర్ ప్యూరిఫయర్, ఫిల్టర్ల అమ్మకాలు పెరిగినట్టు షావోమీ ఇండియా అధికార ప్రతినిధి సైతం వెల్లడించారు. 2023 నాటికి ఎయిర్ ప్యూరిఫయర్ల మార్కెట్ విలువ రూ.778 కోట్లు ఉన్నట్టు.. 2024 నుంచి 2032 వరకు ఏటా 16 శాతం కంటే ఎక్కువే వృద్ధిని నమోదు చేస్తుందని ఒక అంచనా. ‘‘కాలుష్యం అదే పనిగా పెరిగిపోతుండడంతో హానికారకాల నుంచి తమ కుటుంబ సభ్యులను రక్షించుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడం ముఖ్యం. అందుకే చాలా మంది కాలుష్యం నుంచి రక్షణగా ఈ కాలంలో బయటకు వెళ్లడానికి బదులు ఇళ్లల్లో ఉండేందుకే ప్రాధాన్యమిస్తుంటారు’’అని బ్రిటిష్ కంపెనీ డైసన్ పేర్కొంది. ఈ సంస్థ సైతం ఎయిర్ ప్యూరిఫయర్లను విక్రయిస్తుంటుంది. -
ప్రశాంతంగా, కంటికి హాయిగా : బెస్ట్ ఇండోర్ ప్లాంట్స్
అపార్టమెంట్లలో పచ్చని ప్రకృతి శోభ ఉండేలా, శుభ్రమైన గాలికోసం ఇంట్లోమొక్కలను పెంచుకోవడం ఒక ట్రెండ్. వీటినే ఇండోర్ ప్లాంట్లు అని అంటారు. ఇలాంటి మొక్కలు ఇంటి అందాన్ని ఇనుమడింపజేయడం మాత్రమే కాదు స్వచ్ఛమైన గాలితో కంటికి ఆహ్లాదంగా ఉంటూ అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇండోర్ ప్లాంట్లు కలిగి ఉంటాయి. మరి అలాంటి వాటిలో కొన్ని ముఖ్యమైన వాటి గురించి తెలుసుకుందామా!పర్యావరణహితమైన ఆరోగ్యకరమైన ఇండోర్ ప్లాంట్లతో ఇంట్లోని గాలి నాణ్యత మెరుగు పడుతుంది. కాలుష్యానికి చెక్ చెప్పవచ్చు. ఒత్తిడి లేకుండా మనసుకు హాయిగా ఉంటుంది. పచ్చని ఇండోర్ వల్ల ఒత్తిడి తగ్గుతుందని అధ్యయనాలు చెబుతున్నాయిస్నేక్ ప్లాంట్అత్తగారి నాలుక అని కూడా పిలుస్తారు. ఇది రాత్రిపూట ఆక్సిజన్‌ను విడుదల చేస్తుంది. బెడ్రూమ్లో ఈ మొక్కను పెట్టుకోవచ్చు. గాలిలోని ఫార్మాల్డిహైడ్, జిలీన్, బెంజీన్, టోలున్, ట్రైక్లోరోఎథిలిన్ లాంటి వాటిని ఫిల్టర్ చేస్తుందిఅలోవెరాఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉన్న అలోవెరా ఇండోర్ ప్లాంట్‌గా బెంజీన్, ఫార్మాల్డిహైడ్‌ను ఫిల్టర్ చేస్తుంది. కార్బన్ డయాక్సైడ్ , కార్బన్ మోనాక్సైడ్‌ను పీల్చుకుంటుంది. తొమ్మిది ఎయిర్ ప్యూరిఫయర్లు చేసిన పనితో దీని సామర్థ్యం సమానమని చెబుతారు. కొద్దిగా ఎండ, కొద్దిపాటి నీళ్లతో దీన్ని చాలా సులభంగా పెంచుకోవచ్చు. కలబంద జెల్ యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలున్నాయి.పీస్ లిల్లీతెల్లటి పువ్వులతో అందంగా కనిపించే ఈ మొక్క కూడా గాలిలో ఉండే కొన్ని విష రసాయనాలను శుద్ధి చేస్తుంది. ఈ సూపర్ ఎయిర్ ప్యూరిఫైయింగ్ ఇండోర్ ప్లాంట్‌ను ఎలక్ట్రానిక్స్, ఫర్నీచర్ , ఇతర గృహోపకరణాల ద్వారా విడుదలయ్యే ఇండోర్ కాలుష్యాలను సమర్థవంతంగా తొలగించగల క్లెన్సర్‌లలో ఒకటి.కాలుష్య కారకాలను తొలగించే విషయంలో ఇది పవర్‌హౌస్. స్పైడర్ ప్లాంట్స్పైడర్ ప్లాంట్‌ను కూడా ఇంట్లో చక్కగా చేర్చుకోవచ్చు, ప్రత్యేకించి పెంపుడు జంతువులకు విషపూరితం కాని కొన్ని మొక్కలలో ఇది ఒకటి. కార్బన్ మోనాక్సైడ్,జిలీన్తో సహా టాక్సిన్స్‌తో నివారిస్తుంది.వెదురు మొక్కబటర్ఫ్లై పామ్ లేదా అరేకా పామ్ అని పిలిచే ఈ వెదురు మొక్క భారతదేశంలోని అత్యుత్తమ గాలిని శుద్ధి చేసే మొక్కలలో ఒకటి. ఇది గాలి శుద్దీకరణకు మించిన అదనపు ప్రయోజనంగా, ఇది సహజ హ్యూమిడిఫైయర్ కూడా. ఇది పొడి శీతాకాలంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.పోథోస్ లేదా మనీ ప్లాంట్: డెవిల్స్ ఐవీ అని కూడా పిలుస్తారు. ఇంట్లోని టాక్సిన్స్ తొలగించడంలో ప్రసిద్ధి చెందింది, ప్రతి 1-2 వారాలకు ఒకసారి నీళ్లు పోస్తే చాలు. ఇందులో చాలా రకాలున్నాయి.జెడ్ జెడ్ ప్లాంట్ తక్కువ-కాంతిలో కూడా చక్కగా పెరుగుతుంది. జిలీన్, టోలున్ , బెంజీన్ వంటి టాక్సిన్స్‌ను తొలగిస్తుంది. దీన్ని ఆఫీసుల్లో కూడా పెట్టుకోవచ్చు. వీటితోపాటు స్పైడర్ ప్లాంట్ (క్లోరోఫైటమ్ కోమోసమ్), ఫెర్న్ మొక్కలు కూడా ఈ కోవలోకే వస్తాయి. -
ఈ సరికొత్త టెక్నాలజీ గురించి విన్నారా! వీటి పనేంటో తెలుసా!!
ఇప్పటి వరకు చాలా రకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ‘కరోనా’ దెబ్బకు ప్రపంచం అంతటా ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం బాగా పెరిగింది. అయితే, ఇవి టేబుల్ ఫ్యాన్ల మాదిరిగానే ఉంచిన చోట నుంచే తమ సామర్థ్యం మేరకు నిర్ణీత విస్తీర్ణంలో గాలిని శుభ్రం చేస్తాయి. దుమ్ము ధూళి కణాలతో పాటు సూక్ష్మజీవులను తొలగిస్తాయి.ఫొటోలో కనిపిస్తున్న రోబో ఎయిర్ ప్యూరిఫైయర్ మామూలు ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైనది. ఇది సెల్ఫ్ డ్రైవింగ్ రోబో ఎయిర్ ప్యూరిఫైయర్. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలో ఎక్కడ తేడా ఉంటే అక్కడ నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ పోతుంది. ఇది క్షణాల్లోనే గాలిలోని దుమ్ము ధూళి కణాలను, వ్యాధికారక సూక్ష్మజీవులను తొలగిస్తుంది. ‘పయాగర్’ పేరుతో కొరియన్ డిజైనర్ గ్వాంగ్ డియోక్ సియో దీనిని రూపొందించాడు. దీని ధరను ఇంకా ప్రకటించలేదు.అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్..ప్రతి ఇంటిలోనూ చీమలు, దోమలు, ఈగలు, సాలెపురుగులు, బొద్దింకలు, చెదపురుగులు వంటి కీటకాలతో ఇబ్బందులు తప్పవు. వీటికి తోడు బల్లులు, ఎలుకలు వంటివి ఇంటి వాతావరణాన్ని దెబ్బతీస్తాయి. చీమలు, దోమలు, బొద్దింకలు, చెదపురుగులను నిర్మూలించడానికి రసాయనాలతో కూడిన రకరకాల మందులు వాడుతుంటాం.ఈ మందులు మనుషులకూ హాని చేస్తాయి. ఇక ఎలుకలను పట్టడానికి బోనులు, ట్రాప్‌లు వాడుతుంటాం. ఇన్ని ఇబ్బందులు లేకుండా వీటన్నింటినీ తరిమికొట్టే సాధనాన్ని అమెరికన్ కంపెనీ ‘టెకోఆర్ట్’ అందుబాటులోకి తెచ్చింది. ఇది అల్ట్రాసోనిక్ పెస్ట్ రిపెల్లర్. దీనిని వాడటం చాలా సులువు. ప్లగ్ సాకెట్లో పెట్టి, స్విచాన్ చేసుకుంటే చాలు, ఇది నిశ్శబ్దంగా తన పని తాను చేసుకుపోతుంది.దీని ప్రభావంతో చీమలు, దోమలు, బొద్దింకలు మొదలుకొని బల్లులు, ఎలుకలు కూడా ఇంటి పరిసరాల నుంచి పరారైపోతాయి. ఈ పెస్ట్ రిపెల్లర్ 1200 చదరపు అడుగుల పరిధిలో ప్రభావం చూపుతుంది. దీని ధర 28.99 డాలర్లు (రూ.2,420) మాత్రమే!ఇవి చదవండి: బట్టతలను దూరం చేసే.. టోపీ గురించి విన్నారా! -
వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు!
ఢిల్లీలో వాయుకాలుష్యం చెప్పనలవి కానంతగా పెరిగిపోయింది. ఫలితంగా శ్వాస సంబంధిత సమస్యలు కలిగినవారు ఊపిరి తీసుకునేందుకు సైతం తల్లడిల్లిపోతున్నారు. ఈ నేపధ్యంలో డిల్లీ ప్రభుత్వం కాలుష్య నివారణకు తగిన చర్యలు చేపడుతోంది. దీనిలో భాగంగా వృద్ధాశ్రమాల్లో ఎయిర్‌ప్యూరిఫయర్లు, ఆక్సిజన్ సిలిండర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఢిల్లీ నగరంలోని వృద్ధాశ్రమంలో ఉంటున్నవారు వీలైంతవరకూ బయటకు వెళ్లకుంటూ ఉంటే మంచిదని, స్వల్ప వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. ఉత్తర ఢిల్లీలోని రోహిణిలో ఉన్న శివ ఆశ్రయ్ వృద్ధాశ్రమం సెక్రటరీ రాజేశ్వరి మిశ్రా మాట్లాడుతూ పెరుగుతున్న వాయుకాలుష్యం కారణంగా అత్యవసర అవసరాల కోసం ఆశ్రమంలో ఆక్సిజన్ సిలిండర్లను అందుబాటులో ఉంచామన్నారు. న్యూ ఢిల్లీ మునిసిపల్ కౌన్సిల్ (ఎన్డీఎంసీ) పలుచోట్ల ‘ఎయిర్ ప్యూరిఫయర్లు’ ఏర్పాటు చేసింది. ఎన్డీఎంసీ వైస్-ఛైర్మెన్ సతీష్ ఉపాధ్యాయ మాట్లాడుతూ తాము వృద్ధాశ్రమాలలో నివసించేవారి కోసం అనేక ఏర్పాట్లు చేస్తున్నామని, యోగా తరగతులను కూడా నిర్వహిస్తుంటామని, అయితే ఇప్పుడు పెరుగుతున్న కాలుష్య స్థాయిల దృష్ట్యా వృద్ధుల విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామన్నారు. ఇది కూడా చదవండి: సీజేఐ ఎదుట సంకేత భాషలో జాతీయ గీతాలాపన! -
డేంజర్ బెల్స్ : టెక్ కంపెనీల కీలక చర్యలు
ఢిల్లీ: దేశ రాజధాని నగరం ఢిల్లీ కాలుష్య కాసారంలో చిక్కి విలవిల్లాడుతోంది. మితిమీరిన కాలుష్యంతో గాలి నాణ్యత రోజు రోజుకు క్షీణిస్తోంది. శుక్రవారం సాయంత్రానికి మరింత ప్రమాదకర స్థాయికి చేరుకుంది. వాయు నాణ్యత సూచి(ఏక్యూఐ) 151కి చేరింది. ఇది చాలా అనారోగ్యకరమైందని, ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసిన పరిమితి కంటే 6.3 రెట్లు ఎక్కువ అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే నగరాన్ని పొగమంచు కప్పేయడంతో జనం ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఈ సందర్బంగా పలు టెక్ కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచే పనిచేయాలని కోరినట్టు తెలుస్తోంది. దట్టమైన విషపూరిత పొగమంచు కప్పివేయడంతో శ్వాసకోశ , హృదయ సంబంధిత సమస్యలకు కారణమ వుతుందన్న ఆందోళన నేపథ్యంలో ఇంటి నుండి పని చేయడం, ప్రాంగణంలో ఎయిర్ ప్యూరిఫైయర్లు, ఆన్లైన్లో వైద్య సలహాలు లాంటి అనేక చర్యలు చేపట్టినట్టు ఎకనామిక్ టైమ్స్ నివేదించింది. డెలాయిట్, కేపీఎంజీ, పానసోనిక్, బిగ్ బాస్కెట్, బ్లూ స్మార్ట్, Zepto , CIEL HR సర్వీసెస్‌తో సహా డజనుకు పైగా కంపెనీలు ఈ మేరకు ఆదేశించినట్టు తెలుస్తోంది. ఉద్యోగులు ఇంటి నుండి పని చేయవచ్చని డెలాయిట్ తెలిపింది. అనారోగ్యంగా ఉన్న ఉద్యోగులు వెల్ బీయింగ్ డే ఆఫ్ ఆఫర్ చేసినట్టు పేర్కొంది. రైడ్-షేరింగ్ కంపెనీ బ్లూస్మార్ట్ పర్యావరణ అనుకూల రవాణాను ప్రోత్సహించేలా ఉద్యోగులకు సబ్సిడీ అందిస్తోంది. అలాగే ఉద్యోగులు ఎవరికైనా అనారోగ్యంగా అనిపిస్తే రిమోట్‌గా పని చేయవచ్చని పానసోనిక్ తన సిబ్బందికి తెలిపింది. దీంతోపాటు మాస్క్‌లు ధరించడం, హైడ్రేటెడ్‌గా ఉండటం లాంటి జాగ్రత్తలు తీసుకోవాలని సేల్స్ టీమ్‌కు సూచించినట్లు నివేదిక తెలిపింది. క్విక్ కామర్స్ స్టార్టప్ Zepto తన రైడర్లకు N95 మాస్క్‌లను అందించింది. ఆన్-కాల్ మెడికల్ సపోర్టును అందిస్తోంది. అయితే ప్రస్తుత పరిస్థితికి సంస్థ నిర్దిష్ట చర్యలను అమలు చేయలేదని, అవసరమైతే ఉద్యోగులు విశ్రాంతి తీసుకోవాలని సూచించినట్టు మేక్మైట్రిప్ చీఫ్ హెచ్ఆర్ శివరాజ్ శ్రీవాస్తవ తెలిపారు. కాగా జాతీయ రాజధాని ప్రాంతంలోని పలు ప్రాంతాల్లో కాలుష్య తీవ్రత పెరిగిన నేపథ్యంలో ఢిల్లీలో పలు ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రధానంగా ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 500 మార్కును అధిగమించడంతో ప్రాథమిక పాఠశాలలను మూసివేశారు. నిర్మాణ పనులపై ఆంక్షలు విధించారు. లైట్ కమర్షియల్ వాహనాలు, డీజిల్ ట్రక్కుల రాకపోకలను నిషేధించారు. భవన నిర్మాణ పనులను, కూల్చివేతలను నిషేధిస్తున్నట్లు ఢిల్లీ పర్యావరణ శాఖ మంత్రి గోపాల్ రాయ్ ప్రకటించారు. దీనిపై ఇప్పటికే అత్యసరం సమావేశాన్ని నిర్వహించిన ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పలు కీలక చర్యల్ని చేపట్టిన సంగతి తెలిసిందే. -
నాచుతో కాలుష్యాన్ని మాయం గాడ్జెట్.. ధర ఎంతంటే?
సముద్రపు నాచుతో పనిచేసే మొట్టమొదటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పనిచేసే చోట టేబుల్‌పై పెట్టుకుని ఉపయోగించుకోవడానికి అనువుగా దీనిని రూపొందించారు. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్ల మాదిరిగానే ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మకణాలను తొలగిస్తుంది. ఇందులోని సజీవమైన సముద్రపు నాచు పరిసరాల్లోని ఆక్సిజన్ స్థాయిని పెంచుతుంది. గాలిలోని తేమను పీల్చుకుని, గదిని చల్లబరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘మోస్ ఎయిర్’ దీనిని రూపొందించింది. ఇందులో హెపా ఫిల్టర్లతో పాటు ఒక చదరపు మీటరు నాచు ఫిల్టర్ కూడా ఉంటుంది. ఇందులోని నాచును రెండేళ్లకు ఒకసారి మార్చుకోవచ్చు. ఇందులోని డ్రిప్ నాజిల్స్ నాచును సజీవంగా ఉంచేందుకు సన్నని నీటి తుంపర్లను నిరంతరం విడుదల చేస్తుంటాయి. దీని ధర 198 డాలర్లు (రూ16,481) మాత్రమే! -
బ్యాటరీతో పనిచేసే ఎయిర్‌ప్యూరిఫైయర్, అదెలా పనిచేస్తుందంటే?
ఇప్పటి వరకు ఫ్యాన్ మాదిరిగా నేరుగా కరెంట్ కనెక్షన్‌తో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్స్నే చూశాం. ఇప్పుడు రీచార్జబుల్ బ్యాటరీతో పనిచేసే ఎయిర్ ప్యూరిఫైయర్ అందుబాటులోకి వచ్చింది. ఇది మూడంచెల్లో గాలిని శుభ్రపరుస్తుంది. అమెరికన్ కంపెనీ ‘డ్రియో’ ఈ మ్యాక్రో ప్రో బ్యాటరీ పవర్డ్ ఎయిర్ పూరిఫైయర్ను ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసింది. ఇది గాలిలోని కాలుష్యానికి కారణమయ్యే సూక్ష్మ కణాలను, ప్రమాదకరమైన సూక్ష్మజీవులను తొలగిస్తుంది. గాలిలో వ్యాపించే వాసనలను తొలగిస్తుంది. దీనిని స్థూపాకారంలో నిర్మించడం వల్ల 360 డిగ్రీల్లో పనిచేస్తూ, గదిలోని అన్ని దిశల్లోనూ గాలిని సమానంగా శుభ్రపరుస్తుంది. ఇందులోని హెచ్13 హెపా ఫిల్టర్లు గాలిలోని సూక్ష్మాతి సూక్ష్మ కణాలను కూడా సమర్థంగా క్షణాల్లో పీల్చేసుకుంటాయి. ఇది 680 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న గదికి చక్కగా సరిపోతుంది. దీని ధర 109.99 డాలర్లు (రూ.9,156) మాత్రమే! -
‘ఫ్లోరా’ ఎయిర్ ప్యూరిఫైయర్ దీని ప్రత్యేక ఏంటో తెలుసా?
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫైయర్లకు పూర్తిగా భిన్నమైన ఎయిర్ ప్యూరిఫైయర్ ఇది. పచ్చదనానికి లోటు రాకుండా, గాలిని ఇట్టే పరిశుభ్రం చేసేస్తుంది. చాలా ఎయిర్ ప్యూరిఫయర్ల తయారీలో ప్లాస్టిక్, లోహాలను విరివిగా వాడతారు. అమెరికన్ కంపెనీ ‘ఫ్లోరా’ మార్కెట్లోకి విడుదల చేసిన ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ మాత్రం సహజసిద్ధమైన పదార్థాలతోనే తయారు కావడం విశేషం. దీని తయారీలో అత్యధిక భాగం కలప, గాజు, సిరామిక్ వంటి ప్రకృతికి హాని కలిగించని పదార్థాలనే వాడారు. దీని లోపలిభాగంలో నిత్యం పచ్చగా ఉండే సజీవమైన సముద్రపు నాచును ఉపయోగించారు. ఇది రెండంచెల్లో గాలిని శుభ్రం చేస్తుంది. ఒక అంచెలో నాచు, మరో అంచెలో ఇందులో కొబ్బరిపీచుతో ఏర్పాటు చేసిన కార్బన్ ఫిల్టర్ గాలిలోని సూక్ష్మకణాలను పూర్తిగా తొలగిస్తాయి. ఇందులో బెడ్లైట్కు సరిపోయే బల్బును కూడా అమర్చడంతో గదిలో ఒక మూల పెట్టుకుంటే, ఇంటి అలంకరణకే వన్నె తెచ్చేలా కనిపిస్తుంది. దీని ధర 141.85 డాలర్లు (రూ.11,806) మాత్రమే! -
గాలిని నిమిషాల్లో పరిశుభ్రం చేసే రోబో ఎయిర్ ప్యూరిఫైయర్!
‘కరోనా’ విజృంభణ తర్వాత ప్రపంచవ్యాప్తంగా ఎయిర్ ప్యూరిఫైయర్ల వినియోగం పెరిగింది. సాధారణ ఎయిర్ ప్యూరిఫైయర్లను గదిలో ఎక్కడో ఒకచోట ఫ్యాన్‌ను పెట్టుకున్నట్లే పెట్టుకోవాల్సి ఉంటుంది. అవి వాటి సామర్థ్యాన్ని బట్టి గదిలోని గాలిని శుభ్రపరుస్తాయి. కొరియన్ డిజైనర్ సాంగ్ ఇల్ సిన్ తాజాగా ‘ప్లాని’ పేరుతో రోబో ఎయిర్ ప్యూరిఫైయర్‌ను రూపొందించాడు. ఇది ఇల్లంతా కలియదిరుగుతూ గాలిలోని తేడాలను గుర్తించి, దానికి అనుగుణంగా పనిచేస్తుంది. ఇందులో ప్రత్యేకమైన సెన్సార్లు ఏర్పాటు చేయడం వల్ల దీని దారికి మనుషులు, పెంపుడు జంతువులు అడ్డు వచ్చినా, తప్పుకుని ముందుకు సాగుతుంది. పొగ, దుమ్ము, ధూళి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు నిలిచి ఉండి, అక్కడి గాలిని నిమిషాల్లోనే పరిశుభ్రం చేస్తుంది. దీని ధరను ఇంకా ప్రకటించాల్సి ఉంది. -
గాలిలోని వైరస్‌లనూ ఖతం చేస్తుంది.. ధర ఎంతంటే?
ఇటీవలి కాలంలో రకరకాల ఎయిర్ ప్యూరిఫైయర్లు అందుబాటులోకి వచ్చాయి. ఫొటోలో కనిపిస్తున్నది వాటికి పూర్తి భిన్నమైన ఎయిర్‌ప్యూరిఫైయర్. ఇది గాలిలోని దుమ్ము, ధూళితో పాటు ఫంగస్, బ్యాక్టీరియా, వైరస్ల వంటి సూక్ష్మజీవులను పూర్తిగా ఖతం చేసేస్తుంది. హాంకాంగ్‌కి చెందిన ‘హోమ్ప్యూర్’ కంపెనీ ఈ ఎయిర్ ప్యూరిఫైయర్ని రూపొందించింది. ఇది ఆరు దశలలో తన పరిసరాల్లోని గాలిని శుభ్రపరుస్తుందని, కోవిడ్ వైరస్‌లోని ఒమిక్రాన్ వేరియంట్‌ను కూడా ఇట్టే ఖతం చేసేస్తుందని తయారీదారులు చెబుతున్నారు. ఇందులోని ప్రీఫిల్టర్, ఎలక్ట్రోస్టాటిక్ ఫిల్మ్, హైప్రెషర్ ప్రాసెసర్లు సమ్మిళితంగా పనిచేస్తూ, గాలిలోని 0.1 మైక్రాన్ల పరిమాణంలోని సూక్షా్మతి సూక్ష్మమైన కణాలను కూడా తొలగిస్తాయని చెబుతున్నారు. దీని ధర 820 డాలర్లు (రూ. 67,767) మాత్రమే! -
Delhi air pollution: స్కూళ్లలో ఔట్‌డోర్ బంద్
న్యూఢిల్లీ: ఢిల్లీలో గాలి కాలుష్యం పెరగడంతో విద్యార్థుల ఆరోగ్య సంరక్షణపై పాఠశాలల యాజమాన్యాలు దృష్టిసారించాయి. ‘పాఠశాలల ప్రాంగణాల్లో చిన్నారుల ఆటపాటలు, ఇతరత్రా కార్యక్రమాలు ఉండబోవు. గదుల్లో శ్వాస సంబంధ, యోగా తరగతులు నిర్వహిస్తాం. విద్యాసంవత్సం దెబ్బతినకుండా ఉండేందుకు బోధనను కొనసాగిస్తాం. స్కూళ్ల మూసివేత ఉండదు’ అంటూ కొన్ని పాఠశాలలు నిర్ణయం తీసుకున్నాయి. స్కూళ్లో ఎయిర్ ప్యూరిఫయర్లు, వైద్య సదుపాయాలు కల్పిస్తున్నాయి. గాలి కాలుష్యం రోజురోజుకూ పెరుగుతుండటంతో విద్యార్థుల ఆరోగ్యం దృష్ట్యా ఢిల్లీలో స్కూళ్లు మూసేయాలన్న చిన్నారుల హక్కుల పరిరక్షణ జాతీయ కమిషన్(ఎన్సీపీసీఆర్) సూచనపై విద్యార్థుల తల్లిదండ్రులు స్పందించారు. ‘పాఠశాల టైమింగ్స్ పెంచడంతో పెద్దగా ఉపయోగం లేదు. స్కూళ్లు మూసేయాలి. వాయు కాలుష్యంతో విద్యార్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు’ అని ఢిల్లీ స్కూల్ విద్యార్థుల సంఘం అధ్యక్షులు అపరాజితా గౌతమ్ డిమాండ్‌చేశారు. అయితే, ‘ స్కూళ్లు కొనసాగాల్సిందే. లాక్డౌన్లతో ఇప్పటికే చదువులు దెబ్బతిన్నాయి. పదో తరగతి పరీక్షలు దగ్గరపడుతున్నాయి. ఇంకొంత సేపు స్కూల్ టైమింగ్స్ పెంచాలి’ అని కొందరు తల్లిదండ్రులు వాదిస్తున్నారు. కాగా, ఈనెల 8వ తేదీ వరకు 8వ తరగతిదాకా పిల్లలకు ఆన్లైన్లోనే క్లాసులు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. -
త్రీ ఇన్ వన్ ఎయిర్ ప్యూరిఫయర్..లాభాలు అనేకం
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫయర్లు గాలిలోని దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవులను తొలగించి, గాలిని శుభ్రపరుస్తాయి. తాజాగా కెనడాకు చెందిన షార్క్నింజా కంపెనీ త్రీ ఇన్ వన్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది గాలిలోని దుమ్ము ధూళి సూక్ష్మజీవ కణాలను తొలగించడమే కాదు, గదిలోని ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. వేసవిలో ఇది ఎయిర్ కండిషనర్‌లా పనిచేస్తుంది. శీతాకాలంలో రూమ్హీటర్లా కూడా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్, మ్యాక్స్ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతుంది. ఇందులోని నానోసీల్ ఫిల్టర్లు గాలిలోని అత్యంత సూక్ష్మకణాలను సైతం వడగట్టగలవు. రెగ్యులర్ మోడల్ దాదాపు 500 చదరపు అడుగుల గదిలోని గాలిని శుభ్రం చేయగలదు. మ్యాక్స్ మోడల్ 1000 చదరపు అడుగుల పరిధి వరకు సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
గాలిని శుభ్రం చేసే ఈ డబుల్ ధమాకా గాడ్జెట్ గురించి మీకు తెలుసా
ఈ ఫొటోలో గోడకు ఏదో అమర్చినట్లు కనిపిస్తోంది కదూ! గోడకు ఏమీ అమర్చలేదు గాని, ప్లగ్‌లో పెట్టిన చిన్న సాధనమిది. ఇదొక డబుల్ ధమాకా పరికరం. దీనిని ప్లగ్‌లో పెట్టి స్విచ్ ఆన్ చేస్తే చాలు, గదిలోని గాలిని శుభ్రపరచడమే కాకుండా, దోమలనూ పారదోలుతుంది. ఈ ‘2022 ఎయిర్ ప్యూరిఫయర్స్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్’ పరికరాన్ని అమెరికన్ ఆన్లైన్ షాపింగ్ సంస్థ ‘కార్నర్షాప్స్’ ఇటీవల అందుబాటులోకి తెచ్చింది. ఈ ఎయిర్ ప్యురిఫయర్ కమ్ అల్ట్రా మస్కిటో రిపెల్లెంట్ పరికరం వివిధ దేశాల్లోని వాల్‌మార్ట్ స్టోర్స్‌లోనూ దొరుకుతుంది. దీనిని ఆన్ చేశాక ప్రతి 40 సెకండ్లకు ఒకసారి కొద్దిసేపు దీని నుంచి సన్నని ధ్వని వెలువడుతుంది. ఈ పరికరం గాలిలోని దుర్వాసనను పోగొడుతుంది. గాలిలోని హానికరమైన జీవ రసాయనిక కణాలను తొలగిస్తుంది. -
ఎయిర్ ప్యూరిఫైయర్.. ప్రతీ ఇంట్లో ఉండాల్సిందే
మన పరిసరాల్లో గాలి స్వచ్ఛంగా ఉంటేనే మనం స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతాం. వీధుల్లోకి వెళితే వాహనాల నుంచి వెలువడే పొగ, దుమ్ము ధూళితో నిండే గాలి ఉక్కిరిబిక్కిరి కావడం ఎటూ తప్పదు. కనీసం ఇంట్లోనైనా స్వచ్ఛమైన గాలిలో ఊపిరి పీల్చుకుందామనుకుంటే ఇలాంటి ఎయిర్ ప్యూరిఫైయర్ ఇంట్లో ఉండాల్సిందే! ఇది ఫ్యాను మాదిరిగా చక్కని గాలి అందిస్తూనే, గాలిలోని ప్రమాదకరమైన సూక్ష్మజీవులను నాశనం చేస్తుంది. ఇది వెయ్యి చదరపు గజాల పరిధిలోని గాలిని క్షణాల్లో స్వచ్ఛంగా మార్చేస్తుంది. యూరోపియన్ ఎలక్ట్రిక్ పరికరాల తయారీ సంస్థ ‘ఏస్పెన్’ డిజైనర్లు ‘హెచ్13 హెపా యూవీసీ జెర్మిసైడల్ ఎయిర్ ప్యూరిఫైయర్’ పేరిట దీనిని రూపొందించారు. దీనిని ఆన్ చేయగానే, గాలి వీచడంతో పాటు, ఇందులోని అల్ట్రావయొలెట్ లైట్ కూడా వెలుగుతుంది. దీని నుంచి వెలువడే అల్ట్రావయొలెట్ కిరణాలు గాలిలోని సూక్ష్మక్రిములను క్షణాల్లో నాశనం చేస్తుంది. చదవండి: చనిపోయి మళ్లీ అదే తల్లి కడుపున పుట్టారు..సైన్స్‌కే అందని అద్భుతం -
వచ్చేశాయి.. ! బడ్జెట్ ఫ్రెండ్లీ రియల్మీ వాషింగ్మెషిన్లు, వాక్యూమ్ క్లీనర్లు..! ధర ఎంతంటే..?
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్ధ రియల్మీ భారత మార్కెట్లో మరింత పురోగతిని సాధించేందుకు గృహోపకరణాల రంగంలోకి అడుగుపెట్టింది. గృహోపకరణాల విభాగంలో ప్రముఖ చైనీస్ సంస్ధ షావోమీ ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. షావోమీ పోటీగా భారత మార్కెట్లలోకి వాషింగ్మెషిన్లను, వాక్యూమ్ క్లీనర్స్‌ను, ఎయిర్ ఫ్యూరిఫైయర్, రోబోట్ వాక్యూమ్ గృహోపకరణాలను రియల్మీ లాంచ్చేసింది. చదవండి: AI స్వగతం: తప్పులు లేకుండా చెప్పే యాంకర్లు.. రైటర్లు ఫ్లిప్‌కార్ట్ బిగ్‌బిలియన్ డేస్‌లో కొనుగోలుదారులకు ఈ ఉపకరణాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ గృహోపకరణాలను లాంచ్ సందర్భంగా రియల్మీ వైస్ ప్రెసిడెంట్, రియల్మీ ఇండియా, యూరోప్, అండ్ లాటిన్ సీఈవో మాధవ్ సేత్ మాట్లాడుతూ..‘భారతీయులకు టెక్లైఫ్ను అందించేందుకు రియల్మీ ఎప్పుడు ముందుఉంటుంది. అంతేకాకుండా స్మార్ట్ హోమ్ కేటగిరీని మెరుగుపరుస్తూ..భారత్‌లో రియల్మీ నెం.1 లైఫ్‌స్టైల్, టెక్లైఫ్ బ్రాండ్‌గా నిలిచేందుకు కంపెనీ కృషి చేస్తోంద’ని వెల్లడించారు. రియల్మీ గృహోపకరణాల ధరలు ఇలా ఉన్నాయి..! రియల్మీ ఎయిర్ ప్యూరిఫైయర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 1000 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ హ్యండ్హెల్డ్ వాక్యూమ్ క్లీనర్ ధర రూ. 7,999. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్‌కు బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో రూ. 500 తగ్గింపు వర్తించనుంది. రియల్మీ టెక్లైఫ్ రోబోట్ వాక్యూమ్ ధర రూ .24,999 అయితే ఫ్లిప్‌కార్ట్ యొక్క బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో ఇది రూ .19,999 కే విక్రయించబడుతుంది. ఫ్లిప్‌కార్ట్ భాగస్వామ్యంతో రియల్మీ రెండు కొత్త టాప్-లోడ్ ఆటోమేటిక్ వాషింగ్ మెషిన్లను కూడా విడుదల చేసింది. వాషింగ్ మెషీన్ల ధర రూ .12,990(7.5 కిలోలు ), రూ .15,990(8 కిలోలు). చదవండి: రోల్స్‌రాయిస్ నుంచి తొలి ఎలక్ట్రిక్ కార్‌పై ఓ లుక్కేయండి..! -
ఈ కంపెనీ ఎయిర్ ఫిల్టర్‌తో కరోనా వైరస్ ఖతం..!
వాషింగ్టన్: ప్రస్తుత మానవాళిని వెంటాడుతున్న పెద్ద సమస్య కరోనా వైరస్. ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ కారణంగా అనేకమంది చనిపోయారు. కరోనా వైరస్‌ను ఎదుర్కొవడానికి పలు దేశాల్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ కూడా వేగంగానే కొనసాగుతుంది. కరోనా వైరస్ కూడా అంతేవేగంగా మ్యూటేషన్లకు గురై, కొత్త వేరియంట్లతో ఇబ్బంది పెడుతుంది. కరోనా వైరస్ ముప్పు నుంచి రక్షించడం కోసం ప్రముఖ ఏసీ తయారీ సంస్థ హనీవెల్ ఇంటర్నేషనల్ సరికొత్త ఏసీ ఎయిర్ ఫిల్టర్‌ను ఆవిష్కరించింది. ఎయిర్కండిషనర్ల ఎయిర్ ఫిల్టర్లకు ప్రత్యేకమైన కోటింగ్‌ను అమర్చడంతో సుమారు 97 శాతం వరకు కరోనా వైరస్‌ను నాశనం చేయవచ్చునని హనీవెల్ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఏడాది సెప్టెంబర్ చివరినాటికి కోటింగ్ చేయబడిన ఎయిర్‌ఫిల్టర్‌ను అందుబాటులోకి వస్తుందని కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ డారియస్ ఆడమ్జిక్ ఒక ప్రకటనలో తెలిపారు. ఏసీల ఏయిర్‌ఫిల్టర్లకు పూసే రసాయన కోటింగ్‌కు ఎన్విరానెమెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ నుంచి ఆమోదం రావాల్సి ఉంది. ఈ ప్రక్రియను వేగవంతం చేయడం కోసం హనీవెల్ టెక్సాస్ , నార్త్ కరోలినా రాష్ట్రాలను భాగస్వాములుగా చేసుకోవాలని కంపెనీ ఆశిస్తుందని డారియస్ బ్లూమ్‌బర్గ్‌కు ఇచ్చిన ఇంటర్వ్వూలో పేర్కొన్నారు. హనీవెల్ కంపెనీ ప్రయోగశాలలో నిర్వహించిన పరిశోధన ప్రకారం..కరోనా వైరస్‌ను నిర్మూలించడంలో ఎయిర్ ఫిల్టర్లు 97 శాతం వరకు ప్రభావవంతంగా పనిచేశాయని డారియస్ వెల్లడించారు. కరోనా మహమ్మారి ప్రారంభమైనప్పటి నుంచి, హనీవెల్ కంపెనీ N95 మాస్క్‌లు వంటి వ్యక్తిగత రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసింది. హనీవెల్‌కు చెందిన రోబోట్లను ఉపయోగించి అల్ట్రా వైలెట్ కాంతితో విమానాలను శుభ్రం చేయడానికి ఉపయోగించారు. -
ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కలు
ఈ కరోనా కాలంలో ఆక్సిజన్ గురించిన మాటలు తరచూ వింటున్నాం. ఇంట్లో మన చుట్టూ గాలి స్వచ్ఛంగా ఉండాలంటే అదనపు ప్రయత్నాలు తప్పనిసరి. అదీ సహజమైన రీతిలో. అందుకే ఇంటి లోపల ఆక్సిజన్‌ను శుద్ధి చేసే మొక్కల ఏర్పాట్లపై చాలా మంది దృష్టి సారిస్తున్నారు. ఏయే మొక్కలు విషయవాయువులను తొలగిస్తాయి, గాలిని శుద్ధి చేస్తాయో తెలుసుకుందాం. ఎరికా పామ్ ఈ మొక్క కార్బన్ మోనాక్సైడ్ వంటి విష వాయువులను తొలగించడంతో పాటు గాలిని శుద్ధి చేస్తుంది. పామ్ ఆకులపైన దుమ్ము త్వరగా పేరుకుపోతుంది, కాబట్టి దానిని రోజూ మెత్తని క్లాత్‌తో శుభ్రం చేయాలి. ఈ మొక్కను 45 రోజులకు ఒకసారి ఎండలో ఉంచాలి. నేల పొడిగా కనిపించినప్పుడు మాత్రమే కొద్దిగా నీళ్లు పోయాలి. పెంపుడు జంతువులు ఈ మొక్కను తిన లేవు. అయినప్పటికీ వాటిని దూరంగా ఉంచడం మంచిది. సాన్సేవిరియా దీనిని స్నేక్ ప్లాంట్ అని కూడా అంటారు. ఈ మొక్క రాత్రిపూట కార్బన్‌డయాక్సైడ్‌ను తొలగించి ఆక్సిజన్‌గా మారుస్తుంది. ఇది ఎక్కువ సేపు కూర్చునే లివింగ్ రూమ్ వంటి గదుల్లో ఏర్పాటు చేసుకోవడం మంచిది. బాల్కనీలోని నీడలో కూడా బాగుంటుంది. తద్వారా గాలి శుద్ధి అవుతుంది. ఇది తక్కువ నీటిలో, తక్కువ సూర్యకాంతిలో ఆకుపచ్చగా ఉంటుంది. ఈ మొక్క పిల్లలకు, పెంపుడు జంతువులకు అందనంత ఎత్తులో ఏర్పాటు చేసుకోవడం శ్రేయస్కరం. రబ్బరు మొక్క స్టడీ లేదా ఆఫీసు వర్క్ చేసుకునే అంటే మూసివేసినట్టుగా ఉండే గది శుభ్రంగా ఉంచాలంటే రబ్బరు మొక్క ఉన్న కుండీని ఏర్పాటు చేసుకోవాలి. ఈ మొక్కకు తక్కువ సూర్యకాంతి సరిపోతుంది. నేల తేమగా ఉండేంత నీళ్లు చాలు. ఎక్కువ నీళ్లు పోస్తే వేళ్లు కుళ్లిపోతాయి. ఈ మొక్క ప్రత్యేక లక్షణం పెయింట్స్, గ్రీజు, లాండ్రీ సబ్బులలో ఉండే ఫార్మాల్డిహైడ్ వంటి రసాయనాలను తొలగిస్తుంది. ఈ మొక్కను పిల్లలు, పెంపుడు జంతువులకు దూరంగా ఉంచడం మంచిది. బోస్టన్ ఫెర్న్ ఈ మొక్క ఇంటిలోపలి గాలిలో పొగ, పెయింట్, పెర్ఫ్యూమ్, ఇతర సౌందర్య ఉత్పత్తుల నుండి విడుదలయ్యే ఫార్మాల్డిహైడ్‌ను గ్రహిస్తుంది. కిటికీ గుండా లోపలికి సూర్యకిరణాలు పడే చోట ఈ మొక్క ఉన్న కుంyీ ని ఉంచాలి. బాల్కనీలలో ఈ మొక్క కుండీలను వేలాడదీయవచ్చు. ఎందుకంటే మొక్క గుబురు గడ్డిలా కనిపిస్తుంది, కాబట్టి వేలాడుతున్నప్పుడు ఇది చాలా అందంగా, ఆకర్షణీయంగా కనిపిస్తుంది. నీళ్లు ఎక్కువ అవసరం లేదు. వేళ్లు తేమగా ఉండేలా జాగ్రత్తపడితే చాలు. -
ఎల్జీ ఎయిర్ ప్యూరిఫైర్ ఫేస్‌మాస్క్
న్యూఢిల్లీ : ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ మహమ్మారి విస్తరిస్తున్న నేపథ్యంలో మాస్కులు ధరించడం తప్పనిసరి అయ్యింది. ముఖానికి మాస్కు లేకుండా బహిరంగ ప్రదేశాల్లో సంచరిస్తే పోలీసులు జరిమానా కూడా విధిస్తున్నారు. ఈ క్రమంలో ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఎల్జీ ప్రజలకు గుడ్ న్యూస్ అందించింది. ఎల్జీ పూర్యరీకేర్ వేరబుల్ ప్యూరిఫైర్ ఫేస్ మాస్కును తయారు చేసినట్లు శుక్రవారం అధికారికంగా ప్రకటించింది. ఇది ఇప్పుడున్న మాస్కుల కన్నా మరింత ఎక్కువగా వడపోత ప్రక్రియ చేపడుతుందని ఎల్జీ కంపెనీ పేర్కొంది. దీనిలో బ్యాటరీతో నడిచే రెండు ఫ్యాన్లుతోపాటు రెస్పిరేటరీ సెన్సార్ పరిశుభ్రమైన, తాజా గాలిని అందిస్తుంది. అలాగే వేర్వేరు స్థాయిల్లో వేగాన్ని సర్దుబాటు చేసుకునేలా, అందరికీ సరిపోయేలా రూపొందించారు. అయితే ముఖానికి ధరించే పోర్టబుల్ ఎయిర్ ప్యూరిఫైయర్ మాస్క్ ధర వంటి వివరాలను మాత్రం సెప్టెంబరులో జరగనున్న ఐఎఫ్ఏ 2020లో వెల్లడించనున్నారు. ఎల్జీ ప్యూరీకేర్ వేరబుల్ ఎయిర్ ప్యూరిఫైర్‌లో గాలిని శుద్ధి చేసేందుకు రెండు హెచ్13 హెచ్ఈపీఏ ఫిల్టర్లు ఉపయోగించారు. అవసరమైనప్పుడు వాటిని మార్చుకోవచ్చు. ఇందులో అంతర్గతంగా రెండు ప్యాన్లను ఉపయోగించారు. ఇవి మూడు స్పీడ్ లెవల్స్ కలిగి ఉంటాయి. గాలి పీల్చుకునేటప్పుడు ఇవి వాటంతట అవే వేగం పుంజుకుని, వదిలేటప్పుడు నెమ్మదిస్తాయి. ఈ మాస్క్‌లో ఉపయోగించిన రెస్పిరేటరీ సెన్సార్ మాస్క్ ధరించిన వారి శ్వాస చక్రం, పరిమాణాన్ని గుర్తించి అందుకు అనుగుణంగా ఫ్యాన్ల వేగాన్ని సర్దుబాటు చేస్తుంది. (మాస్క్ ధరించలేదని ఫోన్ లాక్కొని..) ఫేస్‌మాస్క్‌లో 820 ఎంఏహెచ్ బ్యాటరీని ఉపయోగించారు. మోడ్‌లో 8 గంటలు, హై మోడ్‌లో రెండు గంటలు పనిచేస్తుంది. ఎలక్ట్రానిక్ పరికరం కావడం వల్ల, దీనిని ఛార్జ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. మాస్కులో చిక్కుకున్న హానికరమైన సూక్ష్మక్రిములను చంపే సందర్భంలో అతినీలలోహిత కాంతి వస్తుంది. ఫిల్టర్లను మార్చాల్సిన అవసరం వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా గుర్తించి ఎల్జీ థింక్యూ యాప్ ద్వారా మనకు సంకేతాలను ఇస్తుంది. ఫేస్ మాస్క్‌లతో ప్రజలు కలిగి ఉన్న ఆందోళనలలో ఒకటి సౌకర్యం, రెండోది గాలి బయటకు రాకుండా సరిపోయేలా పూరీకేర్‌ను రూపొందించినట్లు ఎల్జీ పేర్కొంది. చివరికి ఎక్కువ గంటలు ధరించేంత సౌకర్యంగా ఉంటుందని కంపెనీ తెలిపింది. -
మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసిన షావోమి
స్మార్ట్‌ఫోన్ మార్కెట్లో సంచలనాలు సృష్టించిన చైనీస్ స్మార్ట్ఫోన్ల తయారీ దిగ్గజం.. ‘స్మార్ట్ లివింగ్’ పోర్టుఫోలియోలో కూడా తనదైన శైలిలో దూసుకుపోతుంది. ఎయిర్ ప్యూరిఫైయర్స్‌ను, స్మార్ట్ సెక్యురిటీ సిస్టమ్‌ను, ఫిట్నెస్ బ్యాండ్లను, స్మార్ట్ టీవీలను ప్రవేశపెడుతూ.. కస్టమర్లను మరింత ఆకట్టుకుంటోంది. నేడు కూడా షావోమి ఐదు సరికొత్త ప్రొడక్ట్‌లను మార్కెట్లోకి తీసుకొచ్చింది. అవేమిటంటే.. ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ సిరీస్‌లను, ఎంఐ బ్యాండ్ 3, ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్, ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360, ఎంఐ లగేజీని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ- సిరీస్.... గురువారం షావోమి ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొ రేంజ్లో మూడు స్మార్ట్ టీవీలను లాంచ్ చేసింది. గతేడాది లాంచ్ చేసిన టీవీలకు సక్సెసర్‌గా వీటిని తీసుకొచ్చింది. 32 అంగుళాలు, 49 అంగుళాలు, 55 అంగుళాల స్క్రీన్ సైజ్‌లో ఎంఐ ఎల్ఈడీ టీవీ 4 ప్రొలు మార్కెట్లోకి వచ్చాయి. 32 అంగుళాల టీవీ ధర 14,999 రూపాయలు కాగ, 49 అంగుళాల మోడల్ ధర 29,999 రూపాయలు, 55 అంగుళాల మోడల్ ధర 49,999 రూపాయలు. ఈ కొత్త టీవీల ప్రత్యేకత పునరుద్ధరించిన సాఫ్ట్వేర్. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో ప్యాచ్‌వాల్ యూఐ రిఫ్రెస్తో ఈ టీవీలు పనిచేస్తున్నాయి. అంటే ఆండ్రాయిడ్ లేదా ప్యాచ్‌వాల్ ఏ విధంగానైనా టీవీ మోడ్‌లోకి వెళ్లవచ్చు. ఆండ్రాయిడ్ సపోర్ట్‌తో గూగుల్ ప్లే స్టోర్ నుంచి యాప్‌లను డౌన్లోడ్ చేసుకోవచ్చు. కొత్త టీవీలకు క్రోమోకాస్ట్ సపోర్టు కూడా ఉంది. రిమోట్‌లోనే వాయిస్ సపోర్ట్‌ను ప్రవేశపెట్టింది. 55 అంగుళాల టీవీ 4కే ప్లస్ హెచ్డీఆర్ సపోర్ట్‌తో వచ్చింది. ప్రపంచంలో పలుచైన టీవీ ఇదే. డోల్బే ప్లస్ డీటీఎస్ సినిమా ఆడియో క్వాలిటీ, 3 హెచ్డీఎంఐ పోర్ట్‌లు, 2 యూఎస్బీ 3.0 పోర్ట్‌లు, వైఫై, బ్లూటూత్ 5.0, 2జీబీ ర్యామ్, 8జీబీ ఇన్‌బిల్ట్ స్టోరేజ్ వీటిలో ఫీచర్లుగా ఉన్నాయి. ఎంఐ బ్యాండ్ 3... షావోమి కొత్త ఫిట్నెస్ బ్యాండ్ ఇది. దీని ధర 1,999 రూపాయలు. ఎంఐ బ్యాండ్ 3 అతిపెద్ద డిస్ప్లేను కలిగి ఉంటుంది. వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఎస్ఎంఎస్లు, ఇతర మెసేజింగ్ అప్లికేషన్ల కంటెంట్‌ను ఇది చూపిస్తోంది. రిజెక్ట్ అయిన కాల్స్‌ను కూడా దీని స్క్రీన్‌పై చూడొచ్చు. హార్ట్-రేటు మానిటర్‌ను ఇది కలిగి ఉంది. 50 మీటర్ల వరకు వాటర్ రెసిస్టెంట్ పవర్, 20 రోజుల వరకు బ్యాటరీ లైఫ్ ఉన్నాయి. ఎంఐ ప్యూరిఫైయర్ 2ఎస్..... షావోమి నేడు తన సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను కూడా మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరా 360.... టూ-వే ఆడియోతో 360 డిగ్రీలు చూసే యాంగిల్లో ఎంఐ హోమ్ సెక్యురిటీ కెమెరాను షావోమి తీసుకొచ్చింది. ఫుల్ హెచ్డీ వీడియో రికార్డింగ్, ఐదు రోజుల వరకు ఫుటేజీ స్టోరేజ్, ఇన్ఫ్రారెడ్ నైట్ వ్యూ, ఏఐ మోషన్ డిటెక్షన్, 64జీబీ వరకు స్టోరేజ్‌ను విస్తరించుకునేందుకు మైక్రో ఎస్డీ కార్డు స్లాట్ దీనిలో ఉన్నాయి. ఎంఐ హోమ్ స్మార్ట్‌ఫోన్ యాప్ ద్వారానే సెక్యురిటీ కెమెరాను కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంఐ లగేజ్... 20 అంగుళాలు, 24 అంగుళాల సైజుల్లో షావోమి ఎంఐ లగేజ్‌ను లాంచ్ చేసింది. చిన్న దాని ధర 2,999 రూపాయలు కాగా, 24 అంగుళాల మోడల్ ధర 4,299 రూపాయలు. గ్రే, బ్లూ, రెడ్ రంగుల్లో ఇది మార్కెట్లోకి వచ్చింది. -
ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ వచ్చేసింది..
న్యూఢిల్లీ : షావోమి నేడు మరో సరికొత్త ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ధర రూ.8,999గా నిర్ణయించింది. ఓలెడ్ డిజిటల్ డిస్ప్లే, లేజర్ సెన్సార్, 360 డిగ్రీల ట్రిపుల్ లేయర్ ఫిల్టర్‌తో ఈ డివైజ్ రూపొందించింది. ఈ ఎయిర్ ప్యూరిఫైయర్‌ను మీ ఫోన్లలో ఉన్న ఎంఐ యాప్ ద్వారా నియంత్రించుకోవచ్చు. అంతేకాక ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ అమెజాన్ అలెక్సాను, మెరుగైన నియంత్రణ కోసం గూగుల్ అసిస్టెంట్ ఇంటిగ్రేషన్‌ను ఆఫర్ చేస్తుంది. ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2ఎస్ తొలి సేల్‌ను సెప్టెంబర్ 28న మధ్యాహ్నం 12 గంటలకు చేపట్టనుంది షావోమి కంపెనీ. దీన్ని ఎంఐ.కామ్, అమెజాన్.ఇన్, ఫ్లిప్‌కార్ట్‌లలో కొనుగోలు చేసుకోవచ్చు. ఆ తర్వాత ఎంఐ హోమ్, ఇతర ఆఫ్‌లైన్ స్టోర్లలో కూడా ఎంఐ ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ఎస్‌అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం షావోమి ఎయిర్ ప్యూరిఫైయర్ 2 ను కూడా రూ.8,999కే విక్రయిస్తున్నారు. -
క్లీనింగ్ షాండ్లియర్
ఇది టూ ఇన్ వన్. రాత్రిపూట వెలుగులు చిమ్మే షాండ్లియర్. మిగిలిన సమయమంతా ఓ ఎయిర్ ప్యూరిఫయర్! లండన్‌కు చెందిన డిజైనర్, ఇంజనీర్ జూలియాన్ మిచిరీరి తయారు చేశాడు దీన్ని. షాండ్లియర్ వరకూ ఓకే గానీ.. ఇది గాలినెలా శుభ్రం చేస్తుంది? మన చుట్టుపక్కల పాత చెరువో, బావో ఉంటే అక్కడ మీకు పచ్చగా నాచు కనిపిస్తుంది తెలుసుగా. దాన్నే ఇంగ్లిష్‌లో ఆల్గే అంటారు. అతిసూక్ష్మస్థాయిలో ఉండే మొక్కలన్నమాట ఇవి. మొక్కలకు ఉండే సహజ లక్షణం వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ను పీల్చేసుకుని ఆక్సిజన్‌ను వదలడం. షాండ్లియర్లోనూ ఇదే జరుగుతుంది. ఆకుల్లాంటి నిర్మాణాల్లో ప్రత్యేకమైన బ్లూగ్రీన్ ఆల్గేను పెంచుతున్నారన్నమాట. బయోకెమికల్ టెక్నాలజీలో పరిశోధనలు కూడా చేస్తున్న జూలియన్ పర్యావరణానికి మేలు చేసే లక్ష్యంతో ఈ షాండ్లియర్‌ను రూపొందించాడట. ప్రస్తుతానికి ఇదో నమూనా మాత్రమే. లండన్ డిజైన్ వీక్‌లో భాగంగా వీ అండ్ ఏ మ్యూజియంలో ప్రదర్శిస్తున్నారు. కానీ తాను అభివృద్ధి చేసిన ఫొటో రియాక్టివ్ సెల్ టెక్నాలజీ సాయంతో భవిష్యత్తులో ఇలాంటి వాటిని భవనాలన్నింటిలోనూ ఏర్పాటు చేసుకోగలిగితే వాతావరణంలో ఎప్పటికప్పుడు పెరిగిపోతున్న కార్బన్ డయాక్సైడ్ మోతాదును తగ్గించవచ్చునని అంటున్నాడు జూలియన్. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
షావోమి నుంచి ఎయిర్ ప్యూరిఫయర్
ధర రూ.9,999 • ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ కూడా విడుదల • వచ్చే ఏడాది మార్కెట్లోకి స్మార్ట్ రైస్ కుక్కర్! న్యూఢిల్లీ: చైనా ప్రముఖ మొబైల్ హ్యాండ్సెట్స్ తయారీ కంపెనీ ‘షావోమి’ తాజాగా ‘మి ఎయిర్ ప్యూరిఫయర్-2’ని భారత్ మార్కెట్లో ప్రవేశపెట్టింది. దీని ధర రూ.9,999గా ఉంది. ఇండియాలో హోమ్ కేటగిరి విభాగంలో కంపెనీ విడుదల చేస్తోన్న తొలి ఉత్పత్తి ఇదే. ఇందులో ఇన్‌బిల్ట్ సెన్సార్స్, ఆటో మోడ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. కొత్త ఎయిర్ ప్యూరిఫయర్‌లో ఇన్‌బిల్ట్ వై-ఫై అమర్చామని, అందువల్ల ఈ పరికరం మి హోమ్ యాప్‌తో కనెక్ట్ అవుతుందని కంపెనీ పేర్కొంది. ఫిల్టర్ల కాలం చెల్లిపోతే ఇది మనకు తెలియజేస్తుందని తెలిపింది. కాగా ఫిల్టర్ల రిప్లేస్మెంట్కు రూ.2,499 ఖర్చవుతుందని పేర్కొంది. ఈ ఎయిర్ ఫ్యూరిఫయర్లు మి.కామ్‌లో సెప్టెంబర్ 26 నుంచి ఫ్లిప్‌కార్ట్‌లో అక్టోబర్ 2 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటాయని వివరించింది. వచ్చే ఏడాదిలో స్మార్ట్ రైస్ కుక్కర్‌ను మార్కెట్లోకి తెస్తామని కంపెనీ వైస్ ప్రెసిడెంట్ హుగో బర్రా తెలిపారు. కాగా క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌ను త్వరలోనే భారత్ మార్కెట్లోకి ప్రవేశపెడతామని పేర్కొన్నారు. ఇక్కడ హార్డ్‌వేర్ స్టార్టప్స్ తయారు చేసిన ప్రొడక్ట్‌లను కస్టమర్లు కొనుగోలు చేయవచ్చు. తద్వారా స్టార్టప్స్ నిధుల సమీకరణకు షావోమి తనవంతు సహకారమందిస్తుంది. ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ విడుదల షావోమి ఎయిర్ ప్యూరిఫయర్‌తోపాటు ‘మి బ్యాండ్-2’ కొత్త వెర్షన్ మార్కెట్లోకి తెచ్చింది. దీని ధర రూ.1,999గా ఉంది. ఇందులో ఓఎల్ఈడీ డిస్ప్లే, 20 రోజుల బ్యాటరీ లైఫ్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయని కంపెనీ పేర్కొంది. ‘మి బ్యాండ్-2’ అనేది ఫిట్నెస్, స్లీప్, హార్ట్ రేట్ ట్రాకర్ పరికరం. దీని సాయంతో ఫోన్‌ను అన్‌లాక్ చేసుకోవచ్చు. పలు యాప్ అలర్ట్స్‌ను పొందొచ్చు. ఇది మి.కామ్‌లో సెప్టెంబర్ 27 నుంచి, అమెజాన్‌లో సెప్టెంబర్ 30 నుంచి వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. -
ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి యూనిలీవర్!
లండన్: ఎఫ్ఎంసీజీ దిగ్గజ కంపెనీ యూనిలీవర్ తాజాగా ఎయిర్ ఫ్యూరిఫయర్ వ్యాపారంలోకి అడుగుపెట్టనున్నది. ఇందులో భాగంగా యూనిలీవర్ స్వీడన్‌కు చెందిన ఎయిర్ ఫ్యూరిఫికేషన్ సర్వీసులను అందించే ‘బ్లూఎయిర్’ కంపెనీని కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. డీల్ విలువ తెలియాల్సి ఉంది. బ్లూఎయిర్.. స్టాక్‌హోమ్ కేంద్రంగా తన కార్యకలాపాలను 1996లో ప్రారంభించింది. దీని టర్నోవర్ గతేడాది 106 మిలియన్ డాలర్లుగా ఉంది.