ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫయర్లు గాలిలోని దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవులను తొలగించి, గాలిని శుభ్రపరుస్తాయి. తాజాగా కెనడాకు చెందిన షార్క్‌నింజా కంపెనీ త్రీ ఇన్ వన్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను మార్కెట్‌లోకి తీసుకొచ్చింది.
ఇది గాలిలోని దుమ్ము ధూళి సూక్ష్మజీవ కణాలను తొలగించడమే కాదు, గదిలోని ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. వేసవిలో ఇది ఎయిర్ కండిషనర్‌లా పనిచేస్తుంది. శీతాకాలంలో రూమ్‌హీటర్‌లా కూడా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్, మ్యాక్స్ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతుంది. ఇందులోని నానోసీల్ ఫిల్టర్లు గాలిలోని అత్యంత సూక్ష్మకణాలను సైతం వడగట్టగలవు.
రెగ్యులర్ మోడల్ దాదాపు 500 చదరపు అడుగుల గదిలోని గాలిని శుభ్రం చేయగలదు. మ్యాక్స్ మోడల్ 1000 చదరపు అడుగుల పరిధి వరకు సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది.
Comments
Please login to add a commentAdd a comment