Technology accessories
-
ఫ్యూచర్ ఫోన్లు ఇవే..చూస్తే షాక్ అవ్వాల్సిందే!
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ మొబైల్ రూపురేఖలు మారుతున్నాయి. 1973లో మార్టిన్‌కూపర్ ఆవిష్కరించిన డబ్బా ఆకారంలో ఉండే మొదటి సెల్యులర్ ఫోన్ బరువు అక్షరాల 790గ్రాములు. అయితే రోజురోజుకు ప్రపంచవ్యాప్తంగా అధునాతన పరికరాలు పుట్టుకొస్తున్నాయి. ఎలక్ట్రానిక్స్ విభాగంలో వాటి ఆవిష్కరణలు అగ్రస్థానాన్ని తాకాయి. ప్రత్యేకించి మొబైల్ తయారీరంగంలో టెక్నాలజీ కొత్తపుంతలు తొక్కుతుంది. బరువు తక్కువగా ఉండే మొబైల్‌లు గతంలో ఆదరణ పొందేవి. ఇప్పడు ఫోల్డబుల్ ఫోన్లపై ఆసక్తి ఎక్కువవుతుంది. అయితే కంపెనీలు ఇంకా అడ్వాన్స్‌గా ఆలోచించి మడిచేఫోన్లను తయారు చేయనున్నాయి. అందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారుతున్నాయి. (ఇదీ చదవండి: ఒకేరోజు చమురుధరల్లో భారీ క్షీణత) Wow! Exciting mobile phones from the future… pic.twitter.com/tzPiIpX7gp — Wow Videos (@ViralXfun) October 24, 2023 -
సూపర్, మైండ్ బ్లోయింగ్.. ఉక్కిరి బిక్కిరి అవుతున్న టిమ్ కుక్, ఇది అసలు ఊహించలేదు!
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రపంచ దేశాల రిటైల్ మార్కెట్‌పై దృష్టిసారించింది. ప్రస్తుతం, దేశీయంగా జరుగుతున్న ఊహించని బిజినెస్‌తో భారత్‌లో మరో మూడు స్టోర్లతో పాటు చైనా, ఆసియా, అమెరికా, యూరప్ దేశాలలో రీటైల్ స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదించింది. అయితే, తాజాగా యాపిల్ కీలక నిర్ణయానికి కారణం భారత్ మార్కెటేనని సమాచారం. ఇప్పటికే ఆ సంస్థ 26 దేశాల్లో 520 స్టోర్ల నుంచి ఉత్పత్తుల్ని విక్రయించింది. రానున్న రోజుల్లో మరో 53 రీటైల్ స్టోర్లను ప్రారంభించేలా భారత్‌లోని యాపిల్ స్టోర్లు దారి చూపినట్లు టెక్ పరిశ్రమ వర్గాలు తెలిపాయి. కుపెర్టినో దిగ్గజం ఈ ఏడాది భారత్‌లో ఢిల్లీ, ముంబైలలో యాపిల్ రీటైల్ స్టోర్లను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రారంభోత్సవానికి సీఈవో టిమ్‌కుక్ హాజరయ్యారు. అయితే ఇటీవల ఈ రెండు స్టోర్లలోని యాపిల్ ఉత్పత్తుల అమ్మకాలు సరికొత్త రికార్డ్లను నమోదు చేస్తున్నాయి. రోజుల వ్యవధిలో ఈ రెండు స్టోర్లలోని నెలవారీ విక్రయాలు రూ. 22 కోట్ల నుంచి 25 కోట్ల మధ్య జరిగినట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి. ఈ అమ్మకాల ఫలితాలతో యాపిల్ సీఈఓ టిమ్ కుక్ సంతోషం వ్యక్తం చేశారని, అందుకే 2027 నాటికల్లా ఆసియా - పసిపిక్ రీజియన్లలో 15 స్టోర్లు, యూరప్ - మిడిల్ ఈస్ట్ దేశాల్లో ఐదు స్టోర్లు, అమెరికా - కెనడాలలో నాలుగు స్టోర్లను ప్రారంభించనున్నట్లు బ్లూమ్‌బెర్గ్ నివేదిక హైలెట్ చేసింది. దీంతో పాటు ఇప్పటికే కార్యకాలపాలు కొనసాగుతున్న ఆసియా దేశాల్లో ఆరు స్టోర్లు, యూరప్‌లో తొమ్మిది స్టోర్లు, నార్త్ అమెరికాలో ఉన్న 13 స్టోర్లను మరో ప్రాంతానికి మార్చేలా టిమ్ కుక్ సంబంధిత విభాగాల అధిపతులతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ముఖ్యంగా..అమెరికా, యూరప్ తర్వాత ఆసియా ప్రాంతంలో యాపిల్ రిటైల్ మార్కెట్‌ను విస్తరించాలనే లక్ష్యంతో 2027 నాటికల్లా యాపిల్ స్టోర్ల పునరుద్దరణ, విస్తరణ దిశగా అడుగులు వేస్తుంది. ఇందులో భాగంగా 2025 నాటికి ముంబైలోని సబర్బన్‌లోని బోరివాలి ప్రాంతంలో మూడో యాపిల్ స్టోర్‌ను, 2026 నాటికి ఢిల్లీలోని డీఎల్ఎఫ్ ప్రోమెనేడ్ మాల్లో ఐదో స్టోర్‌ను, 2027 నాటికి ముంబైలోని వ్రోలి ప్రాంతంలో ఇలా మరో మూడు స్టోర్లను యాపిల్ ప్రారంభించనుంది. చదవండి👉 ఆ ఇద్దరు ఉద్యోగుల కోసం.. రెండు కంపెనీల సీఈవోలు పోటీ..రేసులో చివరికి ఎవరు గెలిచారంటే? -
‘పోయే ప్రాణం తిరిగొచ్చింది’, మహిళ ప్రాణాల్ని కాపాడిన స్మార్ట్ వాచ్!
లేటెస్ట్ టెక్నాలజీ ఉపయోగించి యూజర్ల ప్రాణాల్ని కాపాడేలా ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ కొత్త కొత్త డివైజ్‌లను మార్కెట్‌కు పరిచయం చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే క్రాష్ డిటెక్షన్ అలెర్ట్, శాటిలైట్ సాయంతో అత్యవసర సేవల్ని అందిస్తుండగా..ఐఫోన్, యాపిల్ వాచ్‌లలో ఎమర్జెన్సీ, హెల్త్ ఫీచర్లను అందిస్తుంది. ఈ ఫీచర్లు అందుబాటులో ఉన్న డివైజ్‌లు వినియోగించే యూజర్లు అనారోగ్య సమస్యలు తలెత్తితే వెంటనే వారిని అప్రమత్తం చేస్తుంది. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కాపాడుతుంది. తాజాగా యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్‌తో ఓ మహిళ ప్రాణాపాయం నుంచి బయటపడింది. మహిళలో గుర్తించని హార్ట్ బ్లాకేజ్‌ను యాపిల్ వాచ్‌లోని ఈసీజీ ఫీచర్ కనుగొని అలర్ట్ చేయడంతో ఆమె ప్రాణాల్ని కాపాడుకోగలిగింది. చదవండి👉 వావ్..కంగ్రాట్స్ మేడమ్.. మీరు గర్భవతి అయ్యారు!! యూకేలోని గేట్ హెడ్‌కు చెందిన ఎలిన్ థామ్సన్‌కు ఆమె ధరించిన యాపిల్ వాచ్ నుంచి ఓ అలెర్ట్ వచ్చింది. మీ గుండె పనితీరు సరిగ్గా లేదని వార్నింగ్ ఇచ్చింది. దీంతో ఎలిన్ థామ్స్‌న్ దగ్గరలో ఉన్న కార్డియాలజిస్ట్‌ను సంప్రదించి జరిగిన విషయం చెప్పింది. ఎలిన్ థామ్సన్ మాటలు విన్న డాక్టర్ ఆమెకు ఓ హార్ట్ మానిటర్‌ను అమర్చారు. దాని సాయంతో మహిళ హృదయ స్పందనలు ఎలా ఉన్నాయో తెలిసేలా హార్ట్ మానిటర్లో రికార్డ్ ఆప్షన్ సెట్ చేశారు. వారం రోజుల తర్వాత తిరిగి ఆస్పత్రికి రావాలని సూచించారు. అప్రమత్తం చేసిన యాపిల్ వాచ్ హార్ట్ మానిటర్‌తో ఇంటికి వెళ్లిన ఎలిన్‌కు ఓ రోజు ఉదయాన్ని నిద్ర లేచిన వెంటనే యాపిల్ రెడ్ అలెర్ట్ ఇచ్చింది. మరో రోజు రాత్రి సమయంలో ఎలిన్ నిద్రలో ఉండగా.. 19 సెకండ్ల పాటు గుండె కొట్టుకోవడం ఆగిపోయినట్లు హార్ట్ మానిటర్ ఆస్పత్రికి హెచ్చరికలు జారీ చేసింది. అప్రమత్తమైన వైద్యులు థాంప్సన్ వైద్య పరీక్షలు చేశారు. ఈ వైద్య పరీక్షల్లో ఆమె గుండెలో అడ్డంకులు ఏర్పడినట్లు తేలింది. బాధితురాల్ని ప్రాణాల్ని కాపాడేందుకు గుండెకు ఫేస్మేకర్(బ్యాటరీతో నడిచే అతి చిన్న డివైజ్)ను అమర్చారు. యాపిల్ వాచ్ నా ప్రాణం కాపాడింది యాపిల్ వాచ్ తన ఆరోగ్య పరిస్థితిపై అప్రమత్తం చేసింది. కాబట్టే నా ప్రాణాల్ని కాపాడుకోగలిగాను’ అని అన్నారు. వాచ్ లేకపోతే అలర్ట్ వచ్చేది కాదు. నేను ఆస్పత్రికి వెళ్లేదాన్ని కాను. అందుకే ఎల్లప్పుడు వాచ్ ధరిస్తున్నా. యాపిల్ వాచ్ అలర్ట్ చేయకుంటే తాను ప్రాణాలతో ఉండేదాన్ని కాదనే ఆలోచన భయపెడుతున్నదని ఎలిన్ గుర్తుచేసుకున్నారు. 2018లో 2018లో నేను మూర్ఛపోయాను. మూర్ఛపోవడంతో బ్రెయిన్ సంబంధిత సమస్యలు తలెత్తాయి. నా కుతురి సలహాతో అప్పటి నుంచి యాపిల్ వాచ్ ధరించి ఆరోగ్యాన్ని ప్రాణాల్ని కాపాడుకోగలుగుతున్నట్లు తెలిపారు. చదవండి👉 మీకు హార్ట్ ఎటాక్ వచ్చింది చూసుకోండి! -
త్రీ ఇన్ వన్ ఎయిర్ ప్యూరిఫయర్..లాభాలు అనేకం
ఇప్పటి వరకు అందుబాటులో ఉన్న ఎయిర్ ప్యూరిఫయర్లు గాలిలోని దుమ్ము ధూళి కణాలను, సూక్ష్మజీవులను తొలగించి, గాలిని శుభ్రపరుస్తాయి. తాజాగా కెనడాకు చెందిన షార్క్నింజా కంపెనీ త్రీ ఇన్ వన్ ఎయిర్ ప్యూరిఫయర్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇది గాలిలోని దుమ్ము ధూళి సూక్ష్మజీవ కణాలను తొలగించడమే కాదు, గదిలోని ఉష్ణోగ్రతను కూడా నియంత్రిస్తుంది. వేసవిలో ఇది ఎయిర్ కండిషనర్‌లా పనిచేస్తుంది. శీతాకాలంలో రూమ్హీటర్లా కూడా పనిచేస్తుంది. ఇది రెగ్యులర్, మ్యాక్స్ అనే రెండు మోడల్స్‌లో దొరుకుతుంది. ఇందులోని నానోసీల్ ఫిల్టర్లు గాలిలోని అత్యంత సూక్ష్మకణాలను సైతం వడగట్టగలవు. రెగ్యులర్ మోడల్ దాదాపు 500 చదరపు అడుగుల గదిలోని గాలిని శుభ్రం చేయగలదు. మ్యాక్స్ మోడల్ 1000 చదరపు అడుగుల పరిధి వరకు సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది కెనడా, అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో దొరుకుతోంది. -
స్మార్ట్ ఉంగరం, మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది
ఈ ఫొటోలో కనిపిస్తున్నది స్మార్ట్ ఉంగరం. ఉంగరం లోపలి వైపు రాళ్లు పొదిగారేమిటా అనుకుంటున్నారా? అవి రాళ్లూ రత్నాలూ కావు. స్మార్ట్ సెన్సర్ల లైట్లు. ఈ ఉంగరం వేలికి పెట్టుకుంటే, ఇది అనుక్షణం మన ఆరోగ్యానికి కనిపెట్టుకుని ఉంటుంది. దీనిని ఒకసారి చార్జింగ్ చేసుకుంటే, ఇందులోని బ్యాటరీ ఏడురోజుల వరకు ఎలాంటి అంతరాయం లేకుండా పనిచేస్తుంది. ఫిన్లాండ్కు చెందిన ‘ఓరా’ సంస్థ ఈ స్మార్ట్ ఉంగరాన్ని ‘ఓరా రింగ్ జెన్3 హారిజన్’ పేరుతో అందుబాటులోకి తెచ్చింది. దీనిని వేలికి పెట్టుకుంటే, మన ఆరోగ్య సమాచారాన్ని ఎప్పటికప్పుడు స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. బ్లడ్ ఆక్సిజన్ లెవల్, నిద్రపోయే సమయం, గుండె స్పందనలు, రోజువారీ పనుల్లో మనం ఖర్చు చేసే కేలరీలు తదితర వివరాలను గూగుల్ ఫిట్ లేదా యాపిల్ హెల్త్ యాప్స్ ద్వారా స్మార్ట్‌ఫోన్‌కు పంపుతుంది. దీని ధర 349 డాలర్లు (సుమారు రూ.28,500). -
అదిరిపోయే ఫీచర్లతో.. 'బోట్' స్మార్ట్ వాచ్ విడుదల, ధర ఇంత తక్కువా!
తక్కువ ధర, ఎక్కువ ఫీచర్లతో ప్రముఖ వేరబుల్ తయారీ సంస్థ 'బోట్ ఎక్స్టెండ్ టాక్' అనే స్మార్ట్ వాచ్‌ను విడుదల చేయనుంది. స్మార్ట్ వాచ్‌లో బ్లూటూత్ కాలింగ్, అలెక్సా సపోర్ట్, ఐపీ 68తో పాటు ఫీచర్లు ఉన్నాయి. 2.5 డీ కర్వ్డ్ స్క్రీన్‌తో వస్తున్న ఈ స్మార్ట్ వాచ్ ధర రూ.3వేల లోపు ఉండనుంది. ఫీచర్లు 300ఎంఏహెచ్ బ్యాటరీ, హెచ్డీ రెజెల్యూషన్‌తో 1.69 డిస్ప్లేతో డిజైన్ చేసింది. బోట్ స్మార్ట్ వాచ్‌లో హార్ట్ రేట్ సెన్సార్లు, పల్స్ రేట్ ఎలా ఉందో చెక్ చేసే ఆక్సో మీటర్ తరహాలో (ఎస్పీ ఓ2 మానిటర్), ఉదాహరణకు ట్రెడ్ మిల్ మీద మీరు నడిచే సమయంలో ఎంత గాలి పీలుస్తున్నారు. ఎంత గాలి వదులుతున్నారో గుర్తించండం (వీఓ2 మ్యాక్స్), ఎన్ని మెట్లు ఎక్కారో ట్రాక్ చేయడం, మీ శరీరంలో ఎన్ని కేలరీలు ఉన్నాయి. స్పోర్ట్స్ మోడ్స్ విభాగంలో రన్నింగ్, వాకింగ్, సైక్లింగ్, యోగా, బాస్కెట్ బాల్, ఫుట్ బాల్ బ్యాడ్మింటన్, స్కిప్పింగ్, స్విమ్మింగ్ ఎంత సేపు చేశారో ఆటో మెటిగ్గా గుర్తిస్తుంది. బ్యాటరీ లైఫ్ టైం ఈ స్మార్ట్ వాచ్ బ్యాటరీ లైఫ్ టైం 10రోజులు ఉంటుందని బోట్ కంపెనీ ప్రతినిధులు తెలిపారు. కొన్ని సమయాల్లో మాత్రం బ్లూటూత్ కాలింగ్ ఆప్షన్‌తో 2 రోజుల బ్యాటరీ లైఫ్ టైంను వినియోగించుకోవచ్చని తెలిపారు. ధర ఐపీ68 రేటింగ్‌తో వస్తున్న ఈ ఎక్సెటెండ్ టాక్ స్మార్ట్ వాచ్‌లో 150 వాచ్ ఫేస్‌లు ఉన్నాయి. అంటే వాచ్ డిస్ప్లే ను మీరు 150 రకాల డిస్ప్లే స్టైల్స్‌ను మార్చుకోవచ్చు. ఇక ఈ వాచ్ ప్రారంభ ధర రూ.2,999గా ఉంది. అమెజాన్‌లో లభ్యమయ్యే ఈ స్మార్ట్ వాచ్ పిచ్ బ్లాక్, చెర్రీ బ్లూసోమ్, టీమ్ గ్రీన్ వేరియంట్లలో లభ్యం అవుతుంది. -
ఇంట్లో ఈ గాడ్జెట్ ఉంటే కీటకాలు పరార్!
ఫొటోలో కనిపిస్తున్న చిన్న సాధనం ఇంట్లో ఉంటే చాలు, ఎలాంటి కీటకాలైనా పరారు కావాల్సిందే! దీనిని వాడుకోవడం చాలా తేలిక. దోమలను పారదోలేందుకు వాడే మస్కిటో రిపెల్లెంట్స్ మాదిరిగానే, ప్లగ్‌లో పెట్టుకుని, స్విచాన్ చేస్తే చాలు. మస్కిటో రిపెల్లెంట్స్ నుంచి వెలువడే రసాయనాల వాసనలు కొందరికి సరిపడవు. దీంతో అలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఇది హైపర్సోనిక్ పెస్ట్ రిపెల్లెంట్ సిస్టమ్ ‘రాడార్కాన్ ఆర్–200’. ఇది ఆన్ చేసి ఉంచితే, చుట్టుపక్కల ఈగలు, దోమలు, చీమలు సహా ఎలాంటి కీటకాలైనా పరిసరాల్లో నుంచి మటుమాయం కావాల్సిందే! దీని ప్రభావం సుమారు 2,700 చదరపు అడుగుల విస్తీర్ణం పరిధిలో సమర్థంగా పనిచేస్తుంది. ప్రస్తుతం ఇది అమెరికా, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉంది. దీని ఖరీదు 59.99 డాలర్లు (రూ.4,773) మాత్రమే. -
టెక్కు టమారం: ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటేనా
ఇలాంటి పోర్టబుల్ డ్రైక్లీనర్ ఉంటే, ఇంటిని శుభ్రంగా ఉంచుకోవడం కష్టమేమీ కాదు. దుస్తులను, గోడలను, గచ్చును, ఫ్యాన్లు, టీవీలు, కంప్యూటర్లు వంటి పరికరాలను ఇది చిటికెలో శుభ్రం చేసేస్తుంది. ఎలాంటి రసాయనాలతో పనిలేకుండానే, ఇది చక్కగా పనిచేస్తుంది. ఇందులో కాసిన్ని నీళ్లు నింపుకుని, ఆన్ చేసుకుంటే చాలు. దీని నుంచి వేగంగా వెలువడే వేడి ఆవిరి దుమ్ము, ధూళి మరకలను క్షణాల్లో తుడిచి పెట్టేస్తుంది. వాటిపై పేరుకున్న సూక్ష్మజీవులను సమూలంగా నాశనం చేస్తుంది. దుస్తులు, వస్తువులు చెమ్మదేరిపోవడం వల్ల వెలువడే దుర్వాసనను తొలగిస్తుంది. దీని నుంచి వెలువడే ఆవిరి ఉష్ణోగ్రత 160 డిగ్రీల సెల్సియస్ వరకు ఉండటంతో, ఇది ఉతికిన దుస్తులను నిమిషాల్లో ఆరబెట్టగలదు కూడా. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియా మార్కెట్లలో అందుబాటులో ఉన్న దీని ధర 109 డాలర్లు (రూ.8,671). -
హైటెక్ డబ్బావాలా, ఆఫీస్‌కు శ్రీమతి భోజనం!
ముంబైలో డబ్బావాలాలు చాలా ఫేమస్. ఆఫీసుల్లో పనులు చేసుకునే ఉద్యోగులకు వారి వారి ఇళ్ల నుంచి లంచ్‌బాక్సులు సేకరించి, వేళకు ఇంటి భోజనాన్ని అందించే డబ్బావాలాల వ్యవస్థ ఇప్పటివరకు మరే నగరంలోనూ లేదు. అయితే, త్వరలోనే హైటెక్ డబ్బావాలాల వ్యవస్థ ప్రపంచంలోని ప్రధాన నగరాల్లో మొదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఫొటోలో కనిపిస్తున్న బుల్లి వాహనాలే హైటెక్ డబ్బావాలాలు. డ్రైవర్ అవసరం లేని రోబో వాహనాలు ఇవి. పూర్తిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ హైటెక్ డబ్బావాలాలు ఇళ్ల నుంచి లంచ్‌బాక్సులు సేకరించి, ఆఫీసుల్లో పనిచేసుకునే ఉద్యోగులకు సురక్షితంగా అందించగలవని వీటి తయారీదారులు చెబుతున్నారు. అమెరికాలోని లీపెక్స్ డిజైన్ సంస్థలో పనిచేసే చైనీస్ డిజైనర్లు సియూన్ కిమ్, యుఫెంగ్ షాంగ్ ఈ హైటెక్ డబ్బావాలాలను రూపొందించారు. -
Needle Free Injection: సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది.. నొప్పి లేకుండా...
ఇంజెక్షన్.. సైజు చిన్నదే అయిన పెద్ద వీరులని కూడా భయపెట్టగలదు. నర్సు సూది మొనను చూస్తూ.. గుచ్చడానికి సిద్ధం అవుతున్న సమయంలో చాలామంది భయంతో బిగుసుకుపోతుంటారు. ఇంజెక్షన్ వద్దు డాక్టర్.. మందులు ఇవ్వండి అని బతిమాలుతుంటారు. ఇప్పుడు ఆ అవసరం లేదు. తాజాగా.. సూదిలేని ఇంజెక్షన్ వచ్చేసింది. పేరు ‘కొబి’. కెనడాకు చెందిన ఓ యూనివర్సిటీ బృందం తయారుచేసిన ఈ రోబో.. మూడు సెంటీమీటర్ల దూరం నుంచి అధిక ఒత్తిడితో మీ శరీరంలోకి మందును పంపిస్తుంది. ఇది కూడా మీ శరీరానికి రంధ్రం చేస్తుంది. కానీ, అది వెంట్రుక మందం మాత్రమే. కంటికి కనిపించదు, నొప్పి కూడా తెలియదు. ఇందులోని ఎల్ఐడీఏఆర్ సెన్సర్లు.. ఎక్కడ ఇంజెక్షన్ ఇవ్వాలో మ్యాప్ చేయడానికి, శరీరంలోని ఇతర ఇన్ఫెక్షన్లను గుర్తించడానికి ఉపయోగపడతాయి. ముదున్న డిస్ప్లే స్క్రీన్‌పై ఇదంతా చూడొచ్చు. పైగా ఒకరికి వేసిన ఇంజెక్షన్ ఇంకొకరి వేస్తే, వచ్చే జబ్బుల నుంచి కూడా కాపాడుతుంది. బాగుంది కదూ! ప్రస్తుతం పరిశోధన దశలో ఉన్న ఈ రోబో త్వరలోనే పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసి అందుబాటులోకి తీసుకురానున్నారు. అప్పుడు ఇక చిన్నపిల్లలు సైతం ఇంజెక్షన్ వేయించుకోడానికి భయపడరు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
ముఖంపై ముడతలు, మచ్చలను మాయం చేసే డివైజ్..!
మేకప్, టచప్ అంటూ ఎన్ని కాస్మొటిక్ ప్రోడక్ట్స్ మార్చినా.. యవ్వనానికి మించిన అందమే ఉండదు. అందుకే ఆ యవ్వనం కోసం తాపత్రయపడుతుంటారు సౌందర్యప్రియులు. వయసు పెరిగేకొలదీ వచ్చిన.. ముడతల చర్మాన్ని మృదువుగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. అలాంటి వారి కోసమే ఈ మైక్రోడెర్మాబ్రేషన్ సిస్టమ్. చూడటానికి సిస్టమ్‌లానే, మినీ ల్యాప్‌టాప్‌లా కనిపించే... ఈ డివైజ్ వయసుతో వచ్చే ముడతలను, గీతలను ఇట్టే పోగొడుతుంది. చర్మానికి తగిన స్పాను అందిస్తుంది. Microdermabrasion: ఆటో మోడ్, సెన్సిటివ్ మోడ్, మాన్యువల్ మోడ్.. అనే మూడు వేరువేరు మోడ్స్‌తో చర్మానికి ఎక్స్ఫోలియేటర్ స్క్రబ్‌ను అందిస్తుంది. సిస్టమ్‌కి కుడివైపున అటాచ్ అయిన పొడవాటి ట్యూబ్ (ప్లాస్టిక్ వాండ్) లాంటిది ఉంటుంది. దానికే మరో చివర, డివైజ్‌తో పాటు లభించే.. 3 విడి భాగాలను అవసరాన్ని బట్టి మార్చుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవాలి. అవే.. పోర్ ఎక్స్ట్రాక్షన్ టిప్ (రంధ్రాలను రూపుమాపేందుకు సహకరించే పార్ట్), మాగ్నెటిక్ ఇన్ఫ్యూజర్ టిప్ (మృతకణాలను, వ్యర్థాలను తొలగించే పార్ట్), డైమండ్ టిప్ (ముడతలు, గీతలు తొలగించే పార్ట్). వాటిని అమర్చిన తర్వాత.. ప్లాస్టిక్ వాండ్‌ను పెన్ మాదిరి పట్టుకుని, చర్మానికి ఆనిస్తే సరిపోతుంది. పునర్యవ్వనంతో కూడిన ప్రకాశవంతమైన చర్మం మీ సొంతం. ల్యాప్‌టాప్‌లా ఉన్న ఈ సిస్టమ్‌లో ఒకవైపు అద్దంతో పాటు మరోవైపు పవర్ బటన్, మోడ్ సెలెక్షన్ బటన్, స్టార్ట్/స్టాప్ బటన్, లెవల్స్/ఏరియా బటన్, ఎల్సిడి స్క్రీన్ ఉంటాయి. వాటిని ఆపరేట్ చేసుకుని అద్దంలో చూసుకుంటూ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. పవర్ అడాప్టర్, క్లీనింగ్ బ్రష్, రీప్లేస్మెంట్ ఫిల్టర్స్ (డైమండ్ టిప్‌లో మార్చాల్సిన ఫిల్టర్స్) మెషిన్‌తో పాటు లభిస్తాయి. దీని ధర సుమారు 179 డాలర్లు. అంటే 13,405 రూపాయలు. చదవండి: 88 యేళ్లనాటి కేకు.. ఇప్పటికీ తాజాగానే ఉంది!! -
మీ చర్మ కాంతిని మరింత పెంచే మసాజ్ స్క్రాపర్.. ధర ఎంతంటే..
చర్మ సంరక్షణకు మించిన సౌందర్య రహస్యం మరోకటి లేదు. దానికి అద్భుతమైన టూల్ ఈ మసాజ్ స్క్రాపర్. హై క్వాలిటీ ఆక్రిలోనిట్రైల్ బుటాడిన్ స్టెరిన్ – స్టెయిన్లెస్ స్టీల్ మెటీరియల్‌తో రూపొందిందీ మినీ డివైజ్. దీని నుంచి విడుదలయ్యే 45 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్.. స్కిన్ కేర్‌కు ఎంతగానో ఉపయోగపడుతుంది. దీని వైబ్రేషన్స్.. చర్మాన్ని బిగుతుగా మార్చడానికి, కాంతిమంతం చేయడానికి తోడ్పడతాయి. అంతేకాదు ఇది ఒత్తిడిని దూరం చేసి.. ప్రశాంతతను అందిస్తుంది. అదనపు కొవ్వును తగ్గిస్తుంది. ఈ స్క్రాపింగ్ మసాజ్ టూల్.. చర్మంపైన ఆక్యుపాయింట్స్ని ప్రేరేపించేలా త్రికోణ ఆకారంలో ఉంటుంది. దీనిలో స్మూతింగ్ మోడ్, యాక్టివేటింగ్ మోడ్ అనే రెండు ఆప్షన్స్ ఉంటాయి. స్మూతింగ్ మోడ్.. లో–వైబ్రేషన్ అందిస్తే, యాక్టివేటింగ్ మోడ్.. హైయర్–వైబ్రేషన్‌ను అందిస్తుంది. దాంతో కొన్ని నిమిషాల్లోనే చర్మం తేజోవంతమవుతుంది. ఇక్కడున్న చిత్రాన్ని గమనించినట్లైతే.. కింద ఉన్న చార్జింగ్ బేస్‌కి వెనుక భాగంలో యు.ఎస్.బి పోర్ట్ ఉంటుంది. దాంతో ఈ డివైజ్‌ని చార్జింగ్ బేస్‌లో అమర్చి.. యు.ఎస్.బి పోర్ట్‌కి చార్జర్ పెట్టుకుంటే.. వైర్లెస్ మసాజర్గా ఉపయోగించుకోవచ్చు. దీన్ని మరోసారి ఉపయోగిస్తున్నప్పుడు.. చివరిగా ఏ మోడ్‌తో ఆఫ్ అయ్యిందో అదే మోడ్‌తో పని చేస్తుంది. ఈ ట్రయాంగిల్ టూల్ వాటర్ ప్రూఫ్ కావడంతో నీటితో శుభ్రం చేసుకోవచ్చు. దీని ధర 159 డాలర్లు. అంటే సుమారు 12 వేల రూపాయలు. చదవండి: ప్రపంచంలోనే అతిచిన్న తుపాకి.. లక్షల్లో ధర! -
Apple Update : పాస్వర్డ్ లేకుండానే లాగిన్
సాక్షి,వెబ్ డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన యూజర్ల కోసం మరో అప్డేట్ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ డిజైన్ చేసిన వెబ్ బ్రౌజర్ సఫారీలో పాస్వర్డ్ లేకుండా సన్ ఇన్ అవ్వొచ్చు. గతేడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యుడిసి)లో సఫారీ వెబ్ బ్రౌజర్లో సంబంధిత వెబ్ సైట్లలో సైన్ ఇన్ చేయడానికి ఐడీ పాస్ వర్డ్ అవసరం లేకుండా ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగించేలా వర్క్ చేస్తున్నామని ప్రకటించింది. ఆ ప్రకటనకు సంబంధించి ఆపిల్ తాజా అప్డేట్ తెచ్చింది. “Move beyond passwords” కార్యక్రమంలో పాస్వర్డ్ లేకుండానే సైన్ అప్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు పరిచయం చేసింది. 'పాస్కీ' అని పిలిచే ఈ సైన్అప్ లో ఇక పై పాస్ వర్డ్ అవసరం లేదని, కేవలం ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగిస్తే సరిపోతుందని తెలిపింది. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత అన్ లైన్ అకౌంట్స్ కు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆన్ లైన్ మోసాల్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆపిల్ వెల్లడించింది. 'పాస్కీ' ఎలా పని చేస్తుంది? సఫారీ బ్రౌజర్ లో మీరు సందర్శించిన వెబ్ సైట్ లో సైన్ ఆప్ కావాల్సి వస్తే ఐడీ ని ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసే బదులు ఫేస్ ఐడీని, టచ్ ఐడీని ఉపయోగించాలి. మీకు అనుమతి ఇవ్వడానికి, సైన్ ఇన్ చేయడానికి మీ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉపయోగపడుతుందని ఆపిల్ Move beyond passwords కార్యక్రమంలో వివరించింది. పాస్ కీ అనేది రాబోయే ఐఫోన్, ఐప్యాడ్ మరియు మాక్స్‌కు టెక్నాలజీలకు ప్రివ్యూగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త పాస్ కీ టెక్ ఐక్లౌడ్ కీచైన్‌లో ఒక భాగం. ఇది FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్లైన్) అలయన్స్ యొక్క వెబ్ఆథ్న్ ప్రోటోకాల్‌పై ఆధారపడి ఉంటుంది. ఆపిల్ తెచ్చిన ఈ పాస్కీ ఫీచర్ సురక్షితమైందని, సైబర్ దాడులు జరగకుండా వినియోగదారుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ ఫీచర్ ఒక్క ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆండ్రాయిడ్ వినియోగ దారులు ఐడీ, పాస్ వర్డ్ లను తప్పని సరిగా ఎంటర్ చేయాలి. ఇప్పటికే యుబికో వంటి హార్డ్‌వేర్ కీల ద్వారా పాస్వర్డ్ లేని టెక్నాలజీకి గూగుల్, మైక్రోసాఫ్ట్ లు మద్దతు పలుకుతున్నాయి. పాస్వర్డ్ లేకుండా 200 మిలియన్లకు పైగా అకౌంట్స్ ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి : యాపిల్ ఐప్యాడ్ ప్రో అప్ డేట్స్ ఇవే -
భారత్‌లో ప్రారంభమైన యాపిల్ వాచ్ సిరీస్ 6 అమ్మకాలు
న్యూఢిల్లీ : ప్రముఖ స్మార్ట్ ఫోన్ బ్రాండ్ యాపిల్ గత నెల రెండు కొత్త స్మార్ట్ వాచ్‌లను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. యాపిల్ వాచ్ సిరీస్ 6తోపాటు వాచ్ సిరీస్ఎస్ఈను ప్రకటించింది. అమెరికాలో వీటి అమ్మకాలు సెప్టెంబర్ 18నే ప్రారంభం కాగా తాజాగా భారత్‌లో ఈ వాచ్‌ల అమ్మకాలు ప్రారంభమయ్యాయి. దీంతో ప్రముఖ బ్యాంకులు భారీగా ఆఫర్లను అందిస్తున్నాయి. (రిలయన్స్ డిజిటల్లో యాపిల్ వాచ్ న్యూ సిరీస్ 6 లాంఛ్) యాపిల్ వాచ్ సిరీస్ 6 ధర ఇది రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజుల్లో అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్ వేరియంట్‌ను బట్టి 40 ఎంఎం కేన్ ఉన్న ధర రూ. 40,900 కాగా 44 ఎంఎం కేన్ ఉన్న ధర రూ. 43,900గా నిర్ణయించారు.ఇందులో జీపీఎస్+సెల్యులార్ ఆప్షన్ కూడా ఉంది. దీని ధర రూ.49,990(40ఎంఎం)...రూ. 52,900(44ఎంఎం)గా ఉంది. (ఫెస్టివ్ సీజన్ : త్వరలో ఐఫోన్12 ) యాపిల్ వాచ్ సిరీస్ 6 ఆఫర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా యాపిల్ వాచ్ సిరీస్ 6ను కొనుగోలు చేస్తే లాంచ్ ఆఫర్లతోపాటు తక్షణ 3 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. ఐసీఐసీఐ క్రెడిట్ కార్డు ప్రైమ్ మెంమర్స్ అమెజాన్‌పేతో కొనుగోలు చేస్తే ఫ్లాట్ 5% తక్షణ డిస్కౌంట్ ఇవ్వనుంది. ప్రైమ్ మెంబర్ కాని వారికి 3% డిస్కౌంట్ ఉంది. యాపిల్ వాచ్ ఎస్ఈ ధర ఇందులో కూడా రెండు 40 ఎంఎం, 44 ఎంఎం సైజులు అందుబాటులో ఉన్నాయి. జీపీఎస్ వేరియంట్‌ను బట్టి 40 ఎంఎం కేన్ ధర రూ. 29,900 ఉంండగా 44 ఎంఎం కేన్ ధర రూ. 32,900 ఉంది. జీపీఎస్ + సెల్యులార్ వేరియంట్ ధరను బట్టి రూ.33,900(40ఎంఎం) అలాగే 36,900(ఎంఎం)గా నిర్ణయించారు. యాపిల్ వాచ్ సిరీస్ ఎస్ఈ ఆఫర్లు హెచ్డీఎఫ్సీ బ్యాంక్ క్రెడిట్ ద్వారా యాపిల్ వాచ్ సిరీస్ ఎస్ఈను కొనుగోలు చేస్తే లాంచ్ ఆఫర్లతోపాటు తక్షణ 2 వేల రుపాయాల డిస్కౌంట్‌ను అందిస్తోంది. అలాగే డెబిట్ కార్డు ద్వారా చేస్తే 1500 రూపాయల డిస్కౌంట్ కూడా అందిస్తోంది. హెచ్ఎస్బీసీ క్యాష్‌బ్యాక్ కార్డ్ ద్వారా కొనుగోలు చేస్తే 5% డిస్కౌంట్ లభించనుంది. ఇంకేందుకు ఆలస్యం కావాలి అనుకునే వారు కొనేయండి. -
టెకీల కోసం... లేటెస్ట్
టెక్నాలజీ ఉపకరణాల్ని మాత్రమే విక్రయిస్తున్న లేటెస్ట్వన్.కామ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశంలో శరవేగంగా వృద్ధి చెందుతున్న ఈ-కామర్స్ మార్కెట్ 2013-14 నాటికి రూ.30 వేల కోట్లకు చేరింది. అయితే దీన్లో టెక్నాలజీ ఉపకరణాల వాటా రూ.2 వేల కోట్లుగా ఉంటుంది. ఇది చాలు... ఆన్లైన్లో టెక్ ఉత్పత్తుల డిమాండ్ తెలియజేయడానికి. అందుకే కేవలం టెక్నాలజీ ఉపకరణాలను మాత్రమే విక్రయించేందుకు లేటెస్ట్వన్.కామ్‌ను ఆరంభించామన్నారు సంస్థ సీఈఓ అమీన్ ఖ్వాజా. గురువారమిక్కడ విలేకరుల సమావేశంలో సంస్థ విస్తరణ ప్రణాళికలు వివరించారాయన. అవి... - సెల్ఫోన్లు, కంప్యూటర్లు, చార్జర్లు, కేబుల్స్ వంటి టెక్నాలజీ ఉపకరణాల విక్రయానికి రూ.30 కోట్ల పెట్టుబడితో గత ఆగస్టులో లేటెస్ట్వన్.కామ్‌ను ఏర్పాటు చేశాం. ప్రస్తుతం దీన్లో 8 వేల వరకు వివిధ రకాల ఉత్పత్తులున్నాయి. రోజుకు రూ.11-12 లక్షల విలువ చేసే 2,500 ఆర్డర్లొస్తున్నాయి. వీటిలో సెల్‌ఫోన్ యాక్ససరీల వాటా ఎక్కువ. - ఇతర ఈ-కామర్స్ సైట్లకు మాకూ ఉన్న ప్రధాన తేడా ఏంటంటే.. విక్రయించే వస్తువుల్లో 75 శాతం ఉత్పత్తులు సొంత బ్రాండ్ పీ-ట్రాన్‌వే. చైనాకు చెందిన మూడు తయారీ సంస్థలతో ఒప్పందం చేసుకుని అవి తయారు చేసిన వస్తువుల్నే విక్రయిస్తున్నాం. దీంతో ధర తక్కువగా ఉంటోంది. మార్జిన్లూ ఎక్కువే ఉన్నాయి.