సాక్షి,వెబ్ డెస్క్ : ప్రముఖ టెక్ దిగ్గజం ఆపిల్ తన యూజర్ల కోసం మరో అప్‌డేట్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఆపిల్ డిజైన్ చేసిన వెబ్ బ్రౌజర్ సఫారీలో పాస్‌వర్డ్ లేకుండా సన్ ఇన్ అవ్వొచ్చు. గతేడాది వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ (డబ్ల్యూడబ్ల్యుడిసి)లో సఫారీ వెబ్ బ్రౌజర్లో సంబంధిత వెబ్ సైట్లలో సైన్ ఇన్ చేయడానికి ఐడీ పాస్ వర్డ్ అవసరం లేకుండా ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగించేలా వర్క్ చేస్తున్నామని ప్రకటించింది.
ఆ ప్రకటనకు సంబంధించి ఆపిల్ తాజా అప్‌డేట్ తెచ్చింది. “Move beyond passwords” కార్యక్రమంలో పాస్‌వర్డ్ లేకుండానే సైన్ అప్ చేసుకునే సదుపాయాన్ని వినియోగదారులకు పరిచయం చేసింది. 'పాస్‌కీ' అని పిలిచే ఈ సైన్అప్ లో ఇక పై పాస్ వర్డ్ అవసరం లేదని, కేవలం ఫేస్ ఐడీ, టచ్ ఐడీని ఉపయోగిస్తే సరిపోతుందని తెలిపింది. దీనివల్ల వినియోగదారుల వ్యక్తిగత అన్ లైన్ అకౌంట్స్ కు ఎలాంటి ప్రమాదం ఉండదని, ఆన్ లైన్ మోసాల్ని తగ్గించేందుకు ఉపయోగపడుతుందని ఆపిల్ వెల్లడించింది.
'పాస్‌కీ' ఎలా పని చేస్తుంది?
సఫారీ బ్రౌజర్ లో మీరు సందర్శించిన వెబ్ సైట్ లో సైన్ ఆప్ కావాల్సి వస్తే ఐడీ ని ఎంటర్ చేసి పాస్ వర్డ్ ఎంటర్ చేసే బదులు ఫేస్ ఐడీని, టచ్ ఐడీని ఉపయోగించాలి. మీకు అనుమతి ఇవ్వడానికి, సైన్ ఇన్ చేయడానికి మీ ఫేస్ ఐడి లేదా టచ్ ఐడి ఉపయోగపడుతుందని ఆపిల్ Move beyond passwords కార్యక్రమంలో వివరించింది. పాస్ కీ అనేది రాబోయే ఐఫోన్, ఐప్యాడ్ మరియు మాక్స్‌కు టెక్నాలజీలకు ప్రివ్యూగా ఉపయోగపడుతుంది. ఈ కొత్త పాస్ కీ టెక్ ఐక్లౌడ్ కీచైన్‌లో ఒక భాగం. ఇది FIDO (ఫాస్ట్ ఐడెంటిటీ ఆన్‌లైన్) అలయన్స్ యొక్క వెబ్‌ఆథ్న్ ప్రోటోకాల్‌పై ఆధారపడి ఉంటుంది.
ఆపిల్ తెచ్చిన ఈ పాస్‌కీ ఫీచర్ సురక్షితమైందని, సైబర్ దాడులు జరగకుండా వినియోగదారుల వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉంటుందని టెక్ నిపుణులు చెబుతున్నారు. కాకపోతే ఈ ఫీచర్ ఒక్క ఆపిల్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉందని, ఆండ్రాయిడ్ వినియోగ దారులు ఐడీ, పాస్ వర్డ్ లను తప్పని సరిగా ఎంటర్ చేయాలి. ఇప్పటికే యుబికో వంటి హార్డ్‌వేర్ కీల ద్వారా పాస్‌వర్డ్ లేని టెక్నాలజీకి గూగుల్, మైక్రోసాఫ్ట్ లు మద్దతు పలుకుతున్నాయి. పాస్‌వర్డ్ లేకుండా 200 మిలియన్లకు పైగా అకౌంట్స్ ఉన్నాయని ఈ ఏడాది మార్చిలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన విషయం తెలిసిందే.
చదవండి : యాపిల్ ఐప్యాడ్ ప్రో అప్ డేట్స్ ఇవే
Comments
Please login to add a commentAdd a comment