Apple
-
ఐఫోన్ 16పై పేటీఎం సీఈఓ విమర్శలు
మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' యాపిల్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన సంఘటన మరువక ముందే.. పేటీఎం కో ఫౌండర్ & చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) 'విజయ్ శేఖర్ శర్మ' ఐఫోన్ 16 మీద విమర్శలు కురిపించారు.''ఐఫోన్ 16లో కెమెరా (సాఫ్ట్వేర్/యాప్) చాలా దారుణంగా ఉంది. నేను ఇప్పుడు పిక్సెల్ గురించి ఆలోచిస్తున్నాను. మీరు ఇలాంటి అనుభవం ఎదురైందా'' అని పేటీఎం సీఈఓ తన ఎక్స్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.విజయ్ శేఖర్ శర్మ పోస్ట్‌పై మాజీ గూగుల్ ఎగ్జిక్యూటివ్ పర్మీందర్ సింగ్ స్పందించారు. కెమెరా లేదా యాప్‌లో ఏదో తప్పు ఉందని ఆయన అన్నారు. ఎడెల్వీస్ మ్యూచువల్ ఫండ్ సీఈఓ 'రాధికా గుప్తా' స్పందిస్తూ.. పిక్సెల్ అద్భుతంగా ఉందని అన్నారు.గూగుల్ పిక్సెల్ ఫోన్ చాలా అద్భుతంగా ఉంది. కెమెరా క్వాలిటీ కూడా ఇతర ఫోన్ల కంటే బాగానే ఉందని ఓ నెటిజన్ పేర్కొన్నారు. ఈ ఫోన్ లేటెస్ట్ కంప్యూటేషనల్ ఫోటోగ్రఫీకి ప్రసిద్ధి చెందింది. కాబట్టి ఐఫోన్ 16 కంటే కూడా ఉత్తమంగా ఉందని పలువురు తమ అభిప్రాయాలను వెల్లడించారు.I am surprised how the iPhone killed its camera (software / app) so badly in 16. It is so bad that I am seriously thinking of a Pixel now. Anyone else going through the same struggles ?— Vijay Shekhar Sharma (@vijayshekhar) January 19, 2025 -
భారత్‌లో టాప్ 5 బ్రాండ్ లిస్ట్‌లోకి యాపిల్
భారతదేశంలో ఐఫోన్ అమ్మకాలను ప్రారంభించిన తరువాత మొదటిసారి యాపిల్ వాల్యూమ్ పరంగా టాప్ 5 స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లిస్ట్‌లోకి చేరింది. 2024 అక్టోబర్-డిసెంబర్ కాలంలో 10% మార్కెట్ వాటాను సాధించింది. దేశంలో యాపిల్‌కు పెరుగుతున్న ప్రజాదరణకు ఈ విజయం నిదర్శనమని కంపెనీ తెలిపింది. జులై-సెప్టెంబర్ త్రైమాసికంలో యాపిల్ మార్కెట్ వాటా 8.6 శాతంగా ఉంది. ఆ సమయంలో ఎగుమతులు ఏడాది ప్రాతిపదికన 58.5% పెరిగాయి.యాపిల్ విజయానికి ప్రధాన కారణాలుమార్కెట్ వాటా వృద్ధి: 2024 పండుగ సీజన్ అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో యాపిల్ 9-10% మార్కెట్ వాటాను కైవసం చేసుకుంది. ట్రేడ్-ఇన్ ఆఫర్లు, పండుగ డిస్కౌంట్లు, 24 నెలల వరకు నో-కాస్ట్ ఈఎంఐ వంటి ఆకర్షణీయమైన ఫైనాన్సింగ్ ఆఫర్లతో కస్టమర్లను ఆకర్షించింది. దాంతో మార్కెట్ వాటా పెరిగింది.పాపులర్ మోడల్స్: ఐఫోన్ 15, ఐఫోన్ 13 వంటి పాత మోడళ్ల కొనుగోలుకు వినియోగదారులు ఎంతో ఆసక్తి చూపించారు. ఇటీవల లాంచ్ చేసిన ఐఫోన్ 16 సిరీస్ కూడా కంపెనీ విక్రయాలు పెరిగేందుకు దోహదం చేశాయి.స్థానికంగా తయారీ: దేశీయ తయారీపై యాపిల్ దృష్టి సారించింది. కంపెనీ విక్రయాలు గణనీయంగా పెరిగేందుకు ఇది కూడా తోడైంది. ఫాక్స్‌కాన్, పెగాట్రాన్, టాటా టెక్నాలజీస్ వంటి భాగస్వాముల ద్వారా ఐఫోన్ 16 ప్రో, ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్‌ను భారత్‌లో తయారు చేస్తోంది. దేశీయంగా ఖర్చులు తగ్గించుకునేందుకు ఇది దోహదం చేస్తుంది. దాంతోపాటు భారతీయ వినియోగదారుల్లో సానుకూల బ్రాండ్ ఇమేజ్ను సృష్టిస్తుందని కంపెనీ నమ్ముతుంది.ఆర్థిక కారకాలు: మధ్యతరగతి, ముఖ్యంగా యువతలో పెరుగుతున్న ఆర్థిక స్వేచ్ఛ వల్ల ప్రీమియం మోడళ్ల కొనుగోళ్లు అధికమవుతున్నాయి. యాపిల్ బ్రాండ్‌కు ఉన్న విలువ వల్ల ఎక్కువ మంది వీటిపై ఆసక్తి చూపుతున్నారు.ఇదీ చదవండి: త్రైమాసిక ఫలితాలు డీలా.. కంపెనీ షేర్ల నేలచూపులుభవిష్యత్తు అవకాశాలు2026 నాటికి యాపిల్ మూడో అతిపెద్ద మార్కెట్‌గా భారత్ అవతరించనుందని, వార్షిక ఐఫోన్ అమ్మకాలు 15 మిలియన్ యూనిట్లకు చేరుకుంటాయని అంచనా. దేశీయ తయారీ, సమర్థవంతమైన పంపిణీ, ప్రీమియం ఆఫర్లపై కంపెనీ దృష్టి సారిస్తుండడం వంటి అంశాలు భారత మార్కెట్లో వృద్ధికి దోహదపడుతుంది. -
ఐఫోన్ కొనడానికి ఇదే మంచి సమయం!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్ (Flipkart) రిపబ్లిక్ డేకి ముందే.. మాన్యుమెంటల్ సేల్‌ను నిర్వహిస్తోంది. సేల్ సమయంలో, స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు & ఇతర అనేక ఎలక్ట్రానిక్ వస్తువులపై బ్యాంక్ ఆఫర్లు మాత్రమే కాకుండా.. భారీ తగ్గింపులను కూడా అందించనుంది. ఇందులో భాగంగానే ఐఫోన్ 16 కొనుగోలుపై అద్భుతమైన డిస్కౌంట్ ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు.. ఇక్కడ వివరంగా చూసేద్దాం.ఆపిల్ ఐఫోన్ 16 (Apple iPhone 16)ఐఫోన్ 16 125జీబీ వేరియంట్ ధర రూ. 79,999. అయితే ఫ్లిప్‌కార్ట్ మాన్యుమెంటల్ సేల్ సమయంలో ఇది రూ. 69,999లకే లభిస్తోంది. దీన్ని బట్టి చూస్తే ఐఫోన్ 16పై 12 శాతం డిస్కౌంట్ లభిస్తోందని స్పష్టమవుతోంది. డిస్కౌంట్ మాత్రమే కాకుండా.. కొనుగోలుదారులు బ్యాంక్ ఆఫర్స్ & ఎక్స్ఛేంజ్ బెనిఫిట్స్ వంటివి పొందవచ్చు.ఇతర ఆఫర్స్ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారు.. HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈఎమ్ఐ కింద కొనుగోలు చేస్తే.. 10 శాతం లేదా రూ.1,500 తగ్గింపు పొందవచ్చు.అంతే కాకుండా HDFC బ్యాంక్ క్రెడిట్ కార్డ్ లావాదేవీలపై రూ.1,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్టంగా రూ. 42150 వరకు తగ్గింపు లభిస్తుంది. అయితే ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేస్తున్న మొబైల్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 16 డీటెయిల్స్ఐఫోన్ 16 కొత్త కెమెరా లేఅవుట్, కొత్త జెన్ చిప్సెట్.. ఆపిల్ ఇంటెలిజెన్స్ వంటి కొన్ని ప్రధాన అప్గ్రేడ్లతో వస్తుంది . ఆపిల్ కెమెరా ఫీచర్లను యాక్సెస్ చేయడానికి లేదా ఏఐ పవర్డ్ విజువల్ ఇంటెలిజెన్స్ ఫీచర్‌ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగించే కొత్త కెమెరా కంట్రోల్ బటన్‌ను కూడా పరిచయం చేసింది. ఐఫోన్ 16 మెరుగైన పనితీరు కోసం 8జీబీ ర్యామ్ కలిగిన ఏ18 చిప్ కూడా పొందుతుంది.ఆపిల్ విజన్ ప్రో కోసం.. స్మార్ట్‌ఫోన్ నిలువుగా ఉన్న కెమెరా మాడ్యూల్స్ పొందుతుంది. ఇది 48 మెగా పిక్సెల్ ఫ్యూజన్ కెమెరా, 12 మెగా పిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాను పొందుతుంది. కాబట్టి ఇది మంది ఫొటోగ్రఫీ అనుభూతిని అందిస్తుంది. మొత్తం మీద కొంత తక్కువ ధర వద్ద ఐఫోన్ 16 కొనుగోలు చేయాలనుకునే వారికి ఇది మంచి అవకాశం అని స్పష్టమవుతోంది.భారీగా పెరిగిన ఐఫోన్ ఎగుమతులుదేశంలో తయారవుతున్న ఐఫోన్ ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.ఇదీ చదవండి: రూ.86 లక్షల కోట్ల సామ్రాజ్యం.. వారసుడిని ప్రకటించిన వారెన్ బఫెట్ఆపిల్ తయారీ కేంద్రాలుభారతదేశంలో ఆపిల్ ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు. -
ఏడాదిలో రికార్డు స్థాయిలో ఐఫోన్ ఎగుమతులు
దేశంలో తయారవుతున్న ఐఫోన్(iPhone) ఎగుమతుల విలువ 2024 ఏడాదిలో రూ.1.08 లక్షల కోట్లుగా ఉంది. ఇది గత సంవత్సరంతో పోలిస్తే 42% పెరుగుదలను సూచిస్తుంది. ఈ ఎగుమతులు గణనీయంగా పెరగడానికి ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహక పథకం(PLI) కారణమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత్‌లో ఐఫోన్ల వాడకం కూడా పెరగడం గమనార్హం. స్థానికంగా గతంలో కంటే వీటి వినియోగం 15-20%కి పెరిగిందని గణాంకాలు చెబుతున్నాయి.భారతదేశంలో యాపిల్(Apple) ప్రధాన తయారీదారులుగా ఫాక్స్‌కాన్, టాటా ఎలక్ట్రానిక్స్, పెగట్రాన్ వంటి కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీలతోపాటు ఎలక్ట్రానిక్స్ తయారీ సంస్థలకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించింది. దాంతో వీటి ఉత్పాదకత పెరిగింది. ఆయా కంపెనీల్లో బ్లూకాలర్ ఉద్యోగాలు సైతం గణనీయంగా పెరిగాయి. ఇటీవల కాలంలో ఏడాదిలో 1,85 వేల ఉద్యోగాలు కొత్తగా సృష్టించబడినట్లు కంపెనీల అధికారులు పేర్కొన్నారు. వీటిలో 70 శాతానికి పైగా మహిళలకే అవకాశం ఇచ్చినట్లు చెప్పారు.ఇదీ చదవండి: 40 కోట్ల జనం.. రూ.2 లక్షల కోట్ల ఆదాయం! ఎలాగో తెలుసా?యాపిల్ 2024లో దేశీయంగా 12.8 బిలియన్ డాలర్లు(రూ.1.08 లక్షల కోట్లు) ఎగుమతుల మార్కును సాధించింది. భవిష్యత్తులో వీటి విలువ ఏటా 30 బిలియన్ డాలర్లకు చేర్చాలనేలా లక్ష్యం పెట్టుకున్నట్లు కంపెనీ ప్రకటించింది. మొత్తం ఐఫోన్ ఉత్పత్తి ఎకోసిస్టమ్‌లో భారతదేశం ఉత్పాదక(Productivity) వాటా ప్రస్తుతం 14%గా ఉందని, దాన్ని భవిష్యత్తులో 26%కి పైగా పెంచేలా ప్రణాళికలు సిద్ధం చేసినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి. -
యాపిల్‌పై జుకర్‌బర్గ్ తీవ్ర వ్యాఖ్యలు
దిగ్గజ పారిశ్రామిక వేత్త, మెటా సీఈఓ 'మార్క్ జుకర్‌బర్గ్' (Mark Zuckerberg).. 'జో రోగన్ ఎక్స్పీరియన్స్'లో మాట్లాడుతూ యాపిల్ (Apple)ను విమర్శించారు. గ్లోబల్ కనెక్టివిటీని విప్లవాత్మకంగా మార్చినందుకు ఐఫోన్లను ప్రశంసిస్తూనే.. కంపెనీ కొత్త ఉత్పత్తులను ఆవిష్కరించడం లేదని, ఈ విషయంలో యాపిల్ విఫలమైందని అన్నారు.ఐఫోన్ బాగుంది, ఎందుకంటే ప్రపంచంలోని చాలామంది దగ్గర ఇప్పుడు ఈ ఫోన్ ఉందని చెబుతూనే.. సంస్థ కొంతకాలంగా గొప్పగా ఏమీ కనుగొనలేదని జుకర్‌బర్గ్ వెల్లడించారు. స్టీవ్ జాబ్స్ ఐఫోన్‌ను కనుగొన్నారు. అయితే సంస్థ కేవలం దానిపై 20ఏళ్లుగా పనిచేస్తోంది. ప్రతి ఏటా కొత్త వెర్షన్స్ లాంచ్ చేస్తోంది. కానీ అవి పాత వెర్షన్ల కంటే మెరుగ్గా లేదు. ఈ కారణంగానే చాలా తక్కువ మంది మాత్రమే కొత్త ఐఫోన్లను కొనుగోలు చేస్తున్నారని అన్నారు.సంస్థ అందిస్తున్న కొత్త ఐఫోన్ మోడళ్లలో పెద్దగా అప్గ్రేడ్లు లేకపోవడం వల్ల ఫోన్ విక్రయాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. అయితే కంపెనీ కొనుగోలుదారులపై, డెవలపర్లపై ఈ 30 శాతం పన్ను విధిస్తోందని.. ఇలాంటి వాటి వల్లనే యాపిల్ లాభపడుతోందని జుకర్‌బర్గ్ పేర్కొన్నారు.యాపిల్ ఇతర కంపెనీల పరికరాలను iPhoneలతో సజావుగా ఎలా పని చేయనివ్వదు అనే దాని గురించి జుకర్‌బర్గ్ కలత చెందారు. దీనికి ఆయన ఎయిర్పాడ్లను ఉదాహరణగా చూపాడు, అదే కనెక్షన్ టెక్నాలజీని ఉపయోగించకుండా ఇతర కంపెనీలను బ్లాక్ చేస్తుందని వివరించారు.ఇదీ చదవండి: 'సరిగ్గా 10 గంటలు.. ప్రపంచాన్ని మార్చేయొచ్చు': ఆనంద్ మహీంద్రాతమ రే-బాన్ స్మార్ట్ గ్లాసెస్ కోసం యాపిల్ కనెక్షన్ ప్రోటోకాల్‌ను ఉపయోగించమని మెటా చేసిన అభ్యర్థనను.. భద్రతా కారణాల వల్ల యాపిల్ తిరస్కరించింది. వినియోగదారు గోప్యత పట్ల నిజమైన ఆందోళన కంటే కూడా వ్యాపార ప్రయోజనాల కారణంగా అభ్యర్థనను తిరస్కరించినట్లు జుకర్‌బర్గ్ చెప్పారు.యూజర్ల గోప్యత, భద్రతపై యాపిల్ వైఖరిని ఆయన విమర్శించారు. యాపిల్ కనిపెట్టిన కొత్త వాటిలో 'విజన్ ప్రో' ఒకటి మాత్రమే అని నేను అనుకుంటున్నానని.. కంపెనీ మిక్స్డ్ రియాలిటీ హెడ్సెట్ గురించి జుకర్‌బర్గ్ ప్రస్తావించారు. ఇది కూడా సరైన అమ్మకాలు పొందలేదని ఆయన అన్నారు. -
భారీగా పెరిగిన టిమ్ కుక్ జీతం: ఇప్పుడు వార్షిక వేతనం ఎంతంటే..
ప్రముఖ టెక్ దిగ్గజం 'యాపిల్' (Apple).. సీఈఓ 'టిమ్ కుక్' (Tim Cook) జీతాన్ని ఈ ఆర్ధిక సంవత్సరంలో ఏకంగా 18 శాతం పెంచనున్నట్లు వెల్లడించింది. ఈ విషయాన్ని బ్లూమ్‌బర్గ్ తన నివేదికలో వెల్లడించింది.వార్షిక వేతనం 18 శాతం పెరగడంతో.. టిమ్ కుక్ వేతనం 74.6 మిలియన్ డాలర్ల (భారతీయ కరెన్సీ ప్రకారం రూ. 643 కోట్లు)కు చేరింది. యాపిల్ సీఈఓ జీతంలో బేసిక్ పే 3 మిలియన్ డాలర్లు, స్టాక్ అవార్డులు 58.1 మిలియన్ డాలర్లు, సుమారు 13.5 మిలియన్ డాలర్లు అదనపు పరిహారం వంటివి ఉన్నాయి.కంపెనీ వార్షిక సమావేశం (ఫిబ్రవరి 25) జరగడానికి ముందే యాపిల్ టిమ్ కుక్ జీతం భారీగా పెంచినట్లు ప్రకటించింది. త్వరలో జరగనున్న సంస్థ సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంటుంది. కుక్ వేతనం 2023 కంటే ఎక్కువే. అయినప్పటికీ ఈయన 2022లో (100 మిలియన్ డాలర్లు) అందుకున్న వేతనంతో పోలిస్తే చాలా తక్కువే అని సమాచారం.టిమ్ కుక్‌తో పాటు యాపిల్ రిటైల్ చీఫ్, మాజీ సీఎఫ్ఓ, సీఓఓ, జనరల్ కౌన్సిల్ సహా ఇతర యాపిల్ ఎగ్జిక్యూటివ్స్ అందరూ 2024లో 27 మిలియన్ డాలర్లకు పైగా వేతనాన్ని పొందనున్నారు. మొత్తం మీద యాపిల్ కంపెనీ ఉద్యోగుల వేతనాలు గణనీయంగా పెరిగినట్లు తెలుస్తోంది. -
యాపిల్‌లో భారతీయ ఉద్యోగుల అక్రమాలు, తానాపై ఎఫ్‌బీఐ కన్ను?!
అక్రమాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై టెక్ దిగ్గజం యాపిల్ 185 మంది ఉద్యోగులను తొలగించిందన్న వార్త సంచలనంగా మారింది. ఇందులో భారతీయ ఉద్యోగులు, ముఖ్యంగా తెలుగువారు ఉన్నారంటూ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. యాపిల్ మ్యాచింగ్ గ్రాంట్స్ ప్రోగ్రామ్‌కు సంబంధించి నిధుల దుర్వినియోగం చేసి జీతాల్లో మోసాలకు పాల్పడ్డారన్న ఆరోపణపై కాలిఫోర్నియా కుపెర్టినో హెడ్‌క్వార్టర్స్‌లో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేసింది. వీరిలో ఆరుగురిపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఉద్యోగుల తొలగింపుపై యాపిల్ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయలేదు. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట సంచలనంగా మారింది.యాపిల్ తొలగించిన ఉద్యోగులలో భారతీయులు, ముఖ్యంగా తెలుగువారు కూడా ఉన్నారు. తొలగించిన ఆరుగురి ఉద్యోగులకు బే ఏరియాలోని అధికారులు వారెంట్లు కూడా జారీ చేశారు. ఈ ఆరుగురు ఇండియన్స్‌గా గుర్తించబడనప్పటికీ, గణనీయమైన సంఖ్యలో భారతీయులు ఉండవచ్చని సమాచారం. వీరంతా ఆమెరికాలోని కొన్ని తెలుగు స్వచ్ఛంద సంస్థలతో కలిపి ఈ దుర్వినియోగం పాల్పడినట్టు తెలుస్తోంది.అక్రమాలు తెరలేచింది ఎలా? ఉద్యోగుల్లో సామాజిక బాధ్యత పెంచేందుకు, లాభేతర సంస్థల సేవాకార్యక్రమాలకు విరాళాలిచ్చేందుకు సంస్థ ఉద్యోగులను ప్రోత్సహిస్తుంది. అంటే తమ ఉద్యోగులు ఏదైనా స్వచ్ఛంద సంస్థకు విరాళంగా ఇస్తే, దానికి కొంత మ్యాచింగ్ గ్రాంట్ కలిపి ఆ సంస్థకు విరాళంగా ఇస్తుంది యాపిల్. ఇక్కడే ఉద్యోగులు అక్రమాలకు తెరలేపారు. ఆయా సంస్థలతో కుమ్మక్కై స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చిన సొమ్మును తమ ఖాతాలో వేసుకునేవారు. ఇవీ చదవండి: గర్భసంచి తీసివేత ఆపరేషన్లు, షాకింగ్ సర్వే: మహిళలూ ఇది విన్నారా?పార్కింగ్ స్థలంలో కంపెనీ : కట్ చేస్తే..యూకే ప్రధానికంటే మూడువేల రెట్లు ఎక్కువ జీతం అమెరికన్ చైనీస్ ఇంటర్నేషనల్ కల్చరల్ ఎక్స్ఛేంజ్ (ACICE) , Hop4Kids అనే రెండు లాభాపేక్షలేని సంస్థలకు విరాళాల ఇచ్చినట్టుగా తప్పుగా చూపించారు.ఇలా మూడు సంవత్సరాల వ్యవధిలో ఆరుగురు వ్యక్తులు సుమారు 152వేల డాలర్ల అక్రమాలనకు పాల్పడ్డారని శాంటా క్లారా కౌంటీ జిల్లా అటార్నీ కార్యాలయం పేర్కొంది. అభియోగాలు మోపబడిన వారిలో సియు కీ (అలెక్స్) క్వాన్, యథీ (హేసన్) యుయెన్, యాట్ సి (సన్నీ) ఎన్జి, వెంటావో (విక్టర్) లి, లిచావో నీ మరియు జెంగ్ చాంగ్ ఉన్నారు.తానాపై ఎఫ్‌బీఐ కన్ను టైమ్స్ఆఫ్ ఇండియా నివేదికలప్రకారం ఈ సంఘటనలతో పాటు, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) వివిధ కార్పొరేషన్ల నుండి మ్యాచింగ్ గ్రాంట్ల దుర్వినియోగానికి సంబంధించి FBI విచారిస్తోంది. దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా యూఎస్ జిల్లా కోర్టు గ్రాండ్ జ్యూరీ తానాకు సబ్పోనా జారీ చేసింది. డిసెంబర్ 26న హాజరు కావాల్సిందిగా డిసెంబర్ 12న జారీ చేసింది.దీనిపై తానాకు ఒక నెల పొడిగింపు లభించినట్టు కూడా తెలుస్తోంది. అలాగే 2019 నుండి 2024 వరకు వివిధ స్థానాల్లో ఉన్న తానా ప్రతినిధులందరికీ అందిన విరాళాలు, ఖర్చులు , సమాచారాన్ని డాక్యుమెంటేషన్‌గా ఉంచాలని కోర్టు ఆదేశించింది.మరోవైపు ఈ ఆరోపణలపై అటు యాపిల్ నుంచిగానీ, ఇటు తానా నుంచి గానీ ఎలాంటి అధికారిక ధృవీకరణ లేదు. -
యాపిల్ స్పైగా ‘సిరి’..? రూ.814 కోట్లకు దావా
ప్రపంచ నం.1 సంస్థ యాపిల్(Apple) తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు ఎదుర్కొంది. ఈమేరకు అమెరికా ఫెడరల్ కోర్టులో దావా దాఖలైంది. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ఇతరులతో పంచుకునే అవకాశం ఉందని దావాలో ఆరోపించారు.‘సిరి’ని యాపిల్ స్పైగా మార్చిందని దావాలో తెలిపారు. ఐఫోన్లు(IPhone), ఇతర డివైజ్‌ల యూజర్లపై సిరి నిఘా పెట్టిందని పేర్కొన్నారు. ఇది వినియోగదారుల వ్యక్తిగత గోప్యతకు, వారి నిబద్ధతకు యాపిల్ ద్రోహం చేయడమేనని దావా పేర్కొంది. ఈ విషయాన్ని యాపిల్ ధ్రువీకరించింది. దావా దాఖలు చేసినవారి వాదనలను ఖండించింది. యూజర్ ప్రైవసీ పట్ల నిబద్ధతతో ఉన్నట్లు తెలిపింది. కానీ కేసును పరిష్కరించాలనే ఉద్దేశంతో 95 మిలియన్ డాలర్లు(రూ.814 కోట్లు) చెల్లించడానికి అంగీకరిస్తున్నట్లు పేర్కొంది. ప్రతిపాదిత సెటిల్మెంట్కు సంబంధించిన వ్యాజ్యం ఈ వారం ప్రారంభంలో ఫెడరల్ కోర్టులో దాఖలు చేశారు. అయితే దీన్ని న్యాయమూర్తి ఆమోదించాల్సి ఉంది.ఇదీ చదవండి: ప్రపంచంలో అధిక వేతనం ఈయనకే..!అసలేం జరిగిందంటే..2014-22 వరకు యాపిల్ తన వర్చువల్ అసిస్టెంట్ ‘సిరి(Siri)’ని వినియోగదారుల అనుమతి లేకుండా ఉపయోగించడానికి వీలు కల్పించిందని ఆరోపణలు వచ్చాయి. యూజర్లకు తెలియకుండా సిరి మైక్రోఫోన్ సంభాషణలను రికార్డ్ చేసిందని, వాటిని ప్రకటనదారులతో పంచుకునే అవకాశం ఉందనేలా దావాలో ఆరోపించారు. ఈ దావా సమస్య పరిష్కారం అయితే సెప్టెంబర్ 17, 2014 నుంచి 2022 చివరి వరకు యాపిల్ ‘సిరి’ ఎనేబుల్డ్ పరికరాలను కలిగి ఉన్న లేదా కొనుగోలు చేసిన యూఎస్‌లోని యూజర్లకు ఈ సెటిల్మెంట్ మనీ అందుతుందని నిపుణులు చెబుతున్నారు. -
పేరు మారనున్న ఐఫోన్?
యాపిల్ (Apple) తదుపరి తరం ఐఫోన్ ఎస్ఈ (iPhone SE)ని 2025 మార్చిలో లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. అయితే కాస్త బడ్జెట్ ధరలో లభించే ఈ మోడల్‌ను రీబ్రాండ్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇటీవలి లీక్‌ల ప్రకారం.. రాబోయే ఐఫోన్ ఎస్ఈ4 (iPhone SE4)కి ఐఫోన్ 16ఈ (iPhone 16E) అని పేరు మార్చవచ్చు.ఐఫోన్ 16ఈ అంచనా స్పెక్స్» ఐఫోన్ 16ఈ బేస్ ఐఫోన్ 14కి సారూప్యమైన డిజైన్‌ను కలిగి ఉంటుందని పుకారు ఉంది. ఆశిస్తున్న ఫీచర్లలో 6.1-అంగుళాల OLED డిస్ప్లే, ఫేస్ ఐడీ, USB-C పోర్ట్ ఉన్నాయి.» ఐఫోన్ 16ఈకి కొత్త ఏ-సిరీస్ చిప్ రానుంది. ఈ ఫోన్లో 8జీబీ ర్యామ్ కూడా ఉంటుందని చెబుతున్నారు. ఇక కెమెరా విషయానికి వస్తే 48-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుందని భావిస్తున్నారు.» ఐఫోన్ 15 ప్రో మోడల్‌లలో ప్రారంభించిన యాక్షన్ బటన్ ఫీచర్ ఐఫోన్ 16ఈలో కూడా ఉంటుందా అనేది అస్పష్టంగానే ఉంది.» ధరల విషయానికొస్తే.. ఐఫోన్ ఎస్ఈ3తో పోలిస్తే ఐఫోన్ 16ఈ ధర స్వల్పంగా పెరిగే అవకాశం ఉంది. భారత్‌లో దీని ధర దాదాపు రూ. 50,000గా ఉండవచ్చు.ఇన్-హౌస్ 5G మోడెమ్ ఐఫోన్ 16ఈ ప్రధాన హైలైట్ యాపిల్ తొలి అంతర్గత 5G మోడెమ్. ఈ అప్డేట్ బాహ్య సప్లయిర్స్పై ఆధారపడటాన్ని తగ్గించడానికి, దాని హార్డ్‌వేర్‌లో ఏకీకరణను మెరుగుపరచడానికి ఒక వ్యూహాత్మక చర్యగా పరిగణిస్తున్నారు.బడ్జెట్ లైన్‌ను రీబ్రాండింగ్ చేయడం, ఆధునీకరించడం ద్వారా చైనా వంటి మార్కెట్లలో తిరిగి ఆదరణ పొందాలని యాపిల్ లక్ష్యంగా పెట్టుకుంది. ఇక్కడ యాపిల్.. హువాయ్, షావోమీ వంటి బ్రాండ్ల నుండి గట్టి పోటీని ఎదుర్కొంటుంది. -
రైతుబిడ్డ సక్సెస్ స్టోరీ, యంగెస్ట్ ఐఐటీయన్, 24 ఏళ్లకే యాపిల్ ఉద్యోగం
అంకిత భావం, ఓర్పు పట్టుదలగా ప్రయత్నించాలే గానీ విజయం వంగి సలాం చేయాల్సిందే. అనుకున్న లక్ష్యాన్ని చేరుకోడానికి పేదింటి రైతు బిడ్డ పడిన శ్రమ, చేసిన కృషి గురించి తెలుసుకుంటే ఈ మాటలు అక్షర సత్యాలు అంటారు. 13 ఏళ్లకే ఐఐటీ ర్యాంక్ సాధించి, 24 ఏళ్లకే యాపిల్ కంపెనీలో చేరిన సత్యం కుమార్ సక్సెస్ జర్నీ గురించి తెలుసుకుందామా!బిహార్(Bihar)కు చెందిన సామాన్య రైతు కుటుంబంలో జన్మించాడు సత్యం కుమార్ (Satyam Kumar). చిన్నప్పటి నుంచీ తెలివైన విద్యార్థిగా పేరు తెచ్చకున్నాడు. అయితే పేదరికం కారణంగా చదువు చాలా కష్టంగామారింది. మేనమామ, స్కూలు టీచర్ సాయంతోదీక్షగా చదువుకున్నాడు. కేవలం 13 సంవత్సరాల వయస్సులో దేశంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఐఐటీ జేఈఈ ర్యాంక్ సాధించిన అతి పిన్న వయస్కుడిగా చరిత్ర సృష్టించాడు. 2012లో, అతను ఆల్-ఇండియా ర్యాంక్ 8,137 సాధించి పరీక్షలో ఉత్తీర్ణత సాధించాడు. అయితే, అతను మళ్లీ మళ్లీ చేయాలని నిర్ణయించుకున్నాడు. ఒక సంవత్సరం తరువాత, అతను మళ్ళీ పరీక్ష మరియు పరీక్షలో ఎక్కువ ర్యాంక్ సాధించాడు.2013లో 13 ఏళ్ల వయసులో కాన్పూర్‌లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో సీటు పొందిన సత్యం, 679 ర్యాంక్ సాధించి, ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా నిలిచాడు (మునుపటి రికార్డు సహల్ కౌశిక్ పేరిట ఉంది అతను 14 సంవత్సరాల వయస్సులో ఈ ఘనతను సాధించాడు). 2013లో ఐఐటీలో 679 ర్యాంక్ తో ఐఐటీ కాన్పూర్( IIT Kanpur) నుంచి 2018 సంవత్సరంలో బీటెక్ పూర్తి చేశాడు. ఇక్కడ చదువుకునే సమయంలోనే మూడు ప్రాజెక్ట్ లపై సత్యం కుమార్ వర్క్ చేసిన ప్రశంలందుకోవడం విశేషం.ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో సంయుక్త BTech-MTech కోర్సు, అమెరికాలోని ఆస్టిన్లోని టెక్సాస్ విశ్వవిద్యాలయం PhDని పూర్తిచేశాడు. ఆ తరువాత కేవలం 24 సంవత్సరాల వయస్సులో Appleలో ఉద్యోగం చేసాడు. అక్కడ, అతను ఆగస్టు 2023 వరకు మెషిన్ లెర్నింగ్ ఇంటర్న్‌గా పనిచేశాడు.అలాగే యూనివర్సిటీ ఆఫ్ టెక్సాస్ లో గ్రాడ్యుయేట్ రీసెర్చ్ అసిస్టెంట్ బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫేజెస్ స్పెషలైజేషన్‌తో పనిచేశాడు.రాజస్థాన్‌లోని కోటలోని మోడరన్ స్కూల్లో చదువుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు పశుపతి సింగ్, సత్యం ప్రతిభను గుర్తించారు. అందుకే IIT ప్రవేశ పరీక్ష,కోచింగ్ ఖర్చులను వర్మ స్వయంగా భరించారని సత్యం మేనమామ మీడియాకు తెలిపారు. ఈ క్రమంలోనే భవిష్యత్తులో తన రాష్ట్రంలోని పేద విద్యార్థులకు చదువు నేర్పించాలని భావిస్తున్నాడు సత్యం. సత్యం సక్సెస్ స్టోరీ ఎంతోమందికి స్పూర్తిగా అనడంలో ఎలాంటి సందేహం లేదు. -
యాపిల్ ఐఫోన్ 14, ఎస్ఈ నిలిపివేత..కారణం..
ప్రపంచ నంబర్ 1 కంపెనీ యాపిల్ కొన్ని ఉత్పత్తులను నిలిపేస్తున్నట్లు ప్రకటించింది. ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లను యూరప్‌లో నిలిపేస్తున్నట్లు స్పష్టం చేసింది. ఎలక్ట్రానిక్ పరికరాలకు ప్రామాణికంగా ఒకే రకమైన ఛార్జింగ్ పోర్టు ఉండాలనేలా యూరప్ ప్రభుత్వం(EU) నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణమని తెలిసింది.యూరప్ ప్రభుత్వం అన్ని మోబైళ్లలో ప్రామాణికంగా యూఎస్బీ టైప్-సీ(Type-C) పోర్ట్‌తో ఉన్న ఛార్జింగ్ సదుపాయం ఉండాలనేలా నిబంధనలు తీసుకొచ్చింది. కానీ ప్రస్తుతం అధికారికంగా వాడుకలో ఉన్న ఐఫోన్ 14, ఐఫోన్ ఎస్ఈ(3వ తరం) ఫోన్లలో ప్రత్యేకంగా యాపిల్ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది. ఇది యూరప్ నిబంధనలకు విరుద్ధం. దాంతో స్థానికంగా ఈ మోడళ్లను నిలిపేస్తున్నట్లు యాపిల్(Apple) ప్రకటించింది.ఇదీ చదవండి: స్వల్ప స్థాయిలోనే కదలికలుయాపిల్ ఐఫోన్ 14 తర్వాత విడుదల చేసిన మోడళ్లలో టైప్-సీ పోర్ట్‌ను తీసుకొచ్చింది. దాంతో ఐఫోన్ 15తోపాటు తదుపరి మోడళ్లకు ఈ సమస్య లేదు. ఇప్పటికే ఐఫోన్(IPhone) 14 వాడుతున్నవారికి ఇబ్బంది ఉండదు. కానీ కొత్తగా ఈ మోడల్ కొనుగోలు చేయాలనుకుంటున్నవారికి మాత్రం యూరప్‌లో అందుబాటులో ఉండదని కంపెనీ స్పష్టం చేసింది. అయితే ఇటీవల ఐఫోన్ 16 మోడల్‌ను విడుదల చేయడంతో చాలామంది ఈ మోడల్‌ను కొనుగోలు చేస్తున్నారని కంపెనీ వర్గాలు తెలిపాయి. యూరప్‌కు చెందిన వినియోగదారులకు 2025 ప్రారంభంలో యూఎస్బీ టైప్-సీ పోర్ట్‌తో ఐఫోన్ ఎస్ఈ(IPhone SE) మోడల్‌ను అందుబాటులోకి తీసుకురాబోతున్నట్లు కంపెనీ తెలిపింది. -
కొత్త సంవత్సరంలో లేటెస్ట్ ఐఫోన్.. బంపర్ డిస్కౌంట్
కొత్త సంవత్సరంలో ఐఫోన్ (iPhone) కొనాలని ప్లాన్ చేస్తున్నారా? భారీ డీల్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కొనుగోలు చేయడానికి ఇదే సరైన సమయం. ఫ్లి ప్కార్ట్ (Flipkart) ఐఫోన్ 15 (iPhone 15)పై గొప్ప డీల్‌ని తీసుకొచ్చింది. ఈ డీల్‌ని సద్వినియోగం చేసుకుంటే ఐఫోన్ 15 128జీబీ స్టోరేజ్ వేరియంట్‌ను అతి తక్కువ ధరకు కొనుగోలు చేయవచ్చు.ఇలా చేస్తే రూ.50,999కే ఐఫోన్ 15యాపిల్ (Apple) అధికారిక వెబ్సైట్లో ఐఫోన్ 15 అసలు ధర 128జీబీ వేరియంట్‌కు రూ.69,900 లుగా ఉంది. ఇదే ఐఫోన్ 15 గ్రీన్ కలర్ వేరియంట్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 57,999 ధరతో లిస్ట్ అయింది. అన్ని ఇతర కలర్ వేరియంట్లు రూ. 58,999 వద్ద ఉన్నాయి.అయితే మీరు ఈ ఫోన్‌ను రూ.50,999కి కొనుగోలు చేయవచ్చు. ఫ్లిప్‌కార్ట్ టీజర్ చిత్రం ప్రకారం.. ఐఫోన్ 15పై రూ. 1,000 బ్యాంక్ ఆఫర్ అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ చేసుకోవడానికి పాత ఫోన్ ఉన్నట్లయితే ఆ ఫోన్ ద్వారా రూ. 6000 వరకు అదనపు ఎక్స్ఛేంజ్ బోనస్ అందుబాటులో ఉంటుంది. ఈ రెండు ఆఫర్ల తర్వాత, ఫోన్ ప్రభావవంతమైన ధర రూ. 50,999. అయితే ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ ఫోన్ పరిస్థితి, బ్రాండ్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.ఐఫోన్ 15 స్పెక్స్ఐఫోన్ 15 6.1-అంగుళాల సూపర్ రెటినా XDR డిస్ప్లేతో వస్తుంది. ఫోన్లో యాపిల్ బయోనిక్ ఎ16 (Bionic A16) చిప్సెట్ ఉంటుంది. ఇది 5-కోర్ జీపీయూతో వస్తుంది. ఫోన్లో డైనమిక్ నాచ్ కూడా ఉంది. ఫోటోగ్రఫీ కోసం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఇందులో 48 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 12 మెగాపిక్సెల్ సెకండరీ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం 12 మెగాపిక్సెల్ కెమెరా కూడా ఉంది. ఇక చార్జింగ్ విషయానికి వస్తే.. యూఎస్బీ టైప్-సి పోర్ట్ వస్తుంది. ఛార్జింగ్ కేబుల్ ఫోన్ బాక్స్‌లోనే వస్తుంది. -
పుట్టింది పనామా, పోషకాల చిరునామా
ప్రాచుర్యంలోకి రాని అద్భుతమైన ఉష్ణమండల పండ్ల జాతిలో ‘స్టార్ ఆపిల్’ ఒకటి. సపోటేసియా కుటుంబానికి చెందిన ఈ పండును వండర్ మిల్క్ ఫ్రూట్ అని వ్యవహరిస్తుంటారు. చూపులకు గుండ్రటి నేరేడు పండులాగా ఉంటుంది. మధ్యకు కోసి చూస్తే నక్షత్రపు ఆకారంలో త్లెని గుజ్జు ఉంటుంది. అందుకే దీన్ని ‘స్టార్ ఫ్రూట్’ అంటారు. దీని రంగును బట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా పిలుస్తారు. స్టార్ ఆపిల్ శాస్త్రీయ నామం క్రైసోఫైల్లం కైనిటో. కైనిటో, కైమిటో అని అంటుంటారు. ఈ పదాల మూలాలు పురాతన మయన్ భాషలో ఉన్నాయి. తెల్లని, తియ్యని రసం కలిగి ఉంటుంది కాబట్టి ఈ పేరు వచ్చిందట.పుట్టిల్లు పనామాస్టార్ ఆపిల్ మన వంటి ఉష్ణమండల ప్రాంతాల్లో సాగుకు అనువైన సతత హరిత వృక్షం. పనామా దేశంలోని ఇస్థమస్ దీని పురిటి గడ్డ. అక్కడి నుంచి గ్రేటర్ అంటిల్లెస్, వెస్ట్ ఇండీస్‌కు విస్తరించింది. ఇవ్వాళ స్టార్ ఆపిల్ విస్తరించని ఉష్ణమండల ప్రాంతాల్లేవంటే అతిశయోక్తి కాదు. ఈశాన్య ఆసియా దేశాల్లో ఈ పండ్ల చెట్టు ఎంచక్కా ఇమిడిపోయి సాగవుతోంది. స్టార్ ఆపిల్ చెట్టు చాలా వేగంగా పెరుగుతుంది. అనుకూల వాతావరణ పరిస్థితుల్లో 20 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. ఈ ఊదా రంగు పండ్లలోని తెల్లని గుజ్జు, రసం తియ్యగా ఉంటుంది. పంట పండే స్థానిక ప్రాంతాల్లో తాజా పండ్ల వినియోగంతో పాటు ఇతర దేశాలకు వాణిజ్యపరంగా ఎగుమతి అవుతుంటాయి. కొన్ని ఉష్ణమండల దేశాల్లోని వ్యవసాయంలో స్టార్ ఆపిల్ ప్రధాన భాగంగా మారిపోయింది. మయన్ భాషలోని కైనిటొ, కైమిటో పదాల నుంచి దీని శాస్త్రీయ నామం పుట్టింది. ఈ పండ్ల రసం తల్లి΄ాలు మాదిరిగా అత్యంత పోషకాలతో కూడినదని చెబుతారు. ఈ పండును అడ్డంగా రెండు ముక్కలుగా కోస్తే.. లోపలి తెల్లని గుజ్జు నక్షత్రం ఆకారంలో ఉంటుంది. అందువల్లే దీనికి స్టార్ ఆపిల్ అనే పేరు వచ్చింది. ఊదా రంగులో ఉంటుంది కాబట్టి పర్పుల్ ఆపిల్ అని కూడా అంటారు. ఈ జాతికి చెందిన కొన్ని రకాల పండ్లు పండిన తర్వాత కూడా ఆకుపచ్చగానే ఉంటాయి.మెక్సికో నుంచి పెరూ వరకు.. స్టార్ ఆపిల్ సెంట్రల్ అమెరికాలో పుట్టినట్లు చెబుతున్నప్పటికీ దీని మూలాలు వెస్ట్ ఇండీస్‌లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. దక్షిణ మెక్సికో నుంచి ఉత్తర అర్జెంటీనా, పెరు వంటి లో–మీడియం ఆల్టిట్యూడ్ ప్రాంతాల్లో విస్తారంగా సాగవుతోంది. గ్వాటెమల పసిఫిక్ తీర ప్రాంతంలో ఇది విస్తారంగా సాగు అవుతోంది. అక్కడితో దీని విస్తృతి ఆగలేదు. వియత్నాం, భారత్, చైనా, శ్రీలంక, మలేసియా, ఇండోనేసియా దేశాల్లోనూ సాగవుతోంది. కోస్టారికా, క్యూబా, డొమినిక, హైతి, హాండూరస్, జమైకా, నెదర్లాండ్స్ అంటిల్లెస్, నికరాగువ, పనామా, ఉరుగ్వే, ఫిలిప్పీన్స్, థాయిలాండ్, ఈజిప్ట్, సౌత్ఆఫ్రికా, మొంజాబిక్, జింబాబ్వే తదితర దేశాల్లోనూ సాగులో ఉంది.పోషకాలు పుష్కలంస్టార్ ఆపిల్ గుజ్జు, రసం తియ్యగా ఉండటానికి కారణం అందులో గ్లూకోజ్ శాతం ఎక్కువగా ఉండటమే. ఈ పండులో నీరు 78–86% వరకు ఉంటుంది. వంద గ్రాముల పండ్లలో 0.71–2.33 గ్రాముల ప్రొటీన్, 15 గ్రాముల పిండి పదార్థం, 9–10 గ్రాముల టోటల్ సుగర్స్ ఉన్నాయి. దీని విత్తనాల్లో శ్యానోజెనిక్ గ్లైకోసైడ్ లుకుమిన్, తదితర యాక్టివ్ కాంపౌండ్లు ఉన్నాయి. స్టార్ ఆపిల్‌లో ఉన్న జీవరసాయనాల జాబితా చెప్పాలంటే చాలానే ఉంది. ఫెనాల్స్, అల్కలాయిడ్స్, ఫ్లావనాయిడ్స్, స్టెరాయిడ్స్, సపోనిన్స్, టాన్నిన్స్, కార్డియాక్ గ్లైకోసైడ్స్ వంటివి వున్నాయి. 2002లో వెలువడిన ఓ అధ్యయన పత్రం ప్రకారం ఈ పండులో 120 రకాల వొలేటైల్ కాన్స్టిట్యుయెంట్స్ ఉన్నాయి. పచ్చి, పండిన పండ్లలోనూ విటమిన్ సి బాగా ఉంది. ఆకుల్లో కూడా గాల్లిక్ యాసిడ్, ట్రైటెర్పినాయిడ్స్ వంటి ఉపయోగకరమైన కాంపౌండ్స్ ఉన్నాయి. అధిక స్థాయిలో ఫెనోలిక్స్, ఫ్లావనాయిడ్స్ కలిగి ఉండటం వల్ల స్టార్ ఆపిల్‌కు వ్యాధినిరోధకతను పెంచే యాంటీఆక్సిడెంట్ల సామర్థ్యం మెండుగా ఉంది. ఇందులోని క్యుయెర్సెటిన్ కాంపౌండ్‌కు అత్యధిక యాంటీఆక్సిడెంట్ గుణం ఉన్నట్లు పరీక్షల్లో తేలింది.గోళాకార పండ్లుఈ చెట్టు ఆకులు ఆకర్షణీయమైన ముదురు ఆకుపచ్చగా ఓవెల్ షేప్‌లో ఉంటాయి. ప్రాంతాన్ని బట్టి 5–15 సెం.మీ. పొడవు పెరుగుతాయి. ఊదా–తెలుపు రంగుల్లో ఉండే దీని పూలు చక్కని సుగంధాన్ని వెదజల్లుతూ తేనెటీగలను ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ చెట్టు స్వీయ పరాగ సంపర్క సామర్థ్యం కలిగి ఉంటుంది. దీని కాయ గోళాకారంలో 2–3 అంగుళాల డయామీటర్‌లో ఉంటాయి. ఈ పండ్లను తాజాగా తింటారు. ఈ జాతి పండ్లు ముదురు ఊదా రంగులోను, ఆకుపచ్చ–గోధుమ, పసుపు రంగుల్లో కూడా ఉంటాయి. ఊదా రంగు పండు తొక్క మందంగా, గుజ్జు గట్టిగా ఉంటుంది. రవాణాకు, నిల్వకు అనువైనవి కాబట్టి ఈ రకం స్టార్ ఆపిల్ తోటలే సాగులో ఉన్నాయి. ఆకుపచ్చ–గోధుమ రంగులో ఉండే రకం పండ్ల తొక్క పల్చగా, గుజ్జు పల్చని ద్రవంలా ఉంటుంది. పసుపు రంగులో ఉండే పండ్లు చాలా అరుదు. ఈ కుటుంబంలోనే క్రైసోఫైల్లం కైనిటో మాదిరిగానే ప్రజాదరణ పొందుతున్న రెండు స్టార్ ఆపిల్ రకాలు ఆఫ్రికాలో సాగులో విస్తారంగా సాగులో ఉన్నాయి. అవి.. గంబేయ అల్బిద, గంబేయ ఆఫ్రికాన. 3–5 ఏళ్లకు కాపు ప్రారంభంక్రైసోఫైల్లం కైనిటో రకం స్టార్ ఆపిల్ మొక్కలు నాటిన తర్వాత 3–5 ఏళ్లలో కాపు వస్తుంది. 6–7 ఏళ్లకు పూర్తిస్థాయి కాపు తీసుకోవచ్చు. ఫ్రూట్ చాలా త్వరగా సెట్ అవుతుంది కాబట్టి తోటల సాగుదారులకు అనుకూలంగా ఉంటుంది. శీతాకాలం ముగిసి ఎండాకాలం వచ్చే దశలో పండ్లు పక్వానికి వస్తాయి. వెస్ట్ ఇండీస్‌లో ఏప్రిల్–మే మధ్యన స్టార్ ఆపిల్స్ పుష్కలంగా మార్కెట్లోకి వస్తాయి. స్టార్ ఆపిల్ విత్తనాల వ్యాప్తికి గబ్బిలాలు బాగా తోడ్పడుతుంటాయి. ఏ సీజన్లోనైనా పచ్చగా ఉండే స్వభావం వల్ల ఈ చెట్లు వ్యాపించిన చోట్ల పచ్చదనం, పర్యావరణం పరిఢవిల్లుతాయి.అన్ని పండ్లూ ఒకేసారి కోతకు రావుస్టార్ ఫ్రూట్ పక్వానికి రాక ముందు బంక సాగుతూ వగరుగా ఉంటుంది. బాగా పండి పోయిన తర్వాత కోస్తే రవాణా చేయటానికి, నిల్వ చేయటానికి ఇబ్బంది అవుతుంది. అందుకని పండు ముచ్చిక దగ్గర కొంచెం ఆకుపచ్చగా ఉన్నప్పుడే కోసెయ్యాలి. తాజా పండ్లు తినొచ్చు లేదా జెల్లీలుగా మార్చి నిల్వ చేసుకోవచ్చు. ఈ పండులోని విత్తనాలు కూడా పనికొస్తాయి. విత్తనం లోపలి పప్పుతో తయారు చేసే డ్రింక్ బాదం పాల మాదిరిగా ఉంటాయి. అనేక తినుబండారాల్లో వాడుతున్నారు. ఫ్రోజెన్ స్టార్ ఫ్రూట్ గుజ్జును ఐస్‌క్రీమ్‌లు, షర్బత్‌లలో వాడుతున్నారు. కాబట్టి, వాణిజ్యపరమైన సాగుకు అనువైన పండ్ల జాతి. అయితే, నేరేడు మాదిరిగానే ఈ పంటకు కూడా కోత కూలి ఎక్కువ అవుతుంది. -
రూ. 26999లకే ఐఫోన్ 15!
అధిక ధరల కారణంగా యాపిల్ (Apple) ఐఫోన్ కొనుగోలు చేయలేకపోయిన వారికి 'ఫ్లిప్‌కార్ట్' (Flipkart) శుభవార్త చెప్పింది. ఇప్పుడు 'ఐఫోన్15'ను కేవలం రూ. 26,999లకే అందించనున్నట్లు ప్రకటించింది. దీని గురించి మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.డిస్కౌంట్ & ఎక్స్ఛేంజ్ ఆఫర్నిజానికి యాపిల్ ఐఫోన్ 15 (iPhone 15) ధర రూ. 69,990. ఇది ఇప్పుడు 16 శాతం తగ్గింపుతో 58,499 రూపాయలకు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద గరిష్ఠగా రూ. 31,500 తగ్గింపు పొందవచ్చు. అంటే 58,499 రూపాయలలో.. 31,500 రూపాయలు తీసేస్తే.. రూ. 26,999 మాత్రమే ఉంటుంది. ఈ లెక్కన ఐఫోన్ 15ను తక్కువ ధరలోనే కొనేయొచ్చు.ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే.. ఎక్స్ఛేంజ్ ఆఫర్ అనేది మీరు ఎక్స్ఛేంజ్ చేసే మొబైల్ ఫోన్ కండిషన్ మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద ఖచ్చితంగా రూ. 31,500 తగ్గింపు లభిస్తుందని అనుకోకూడదు.ఇదీ చదవండి: అకౌంట్ ఓపెన్ చేస్తే రూ.5000 రివార్డ్ఐఫోన్ 15 డీటెయిల్స్ఐఫోన్ 15 మొబైల్ 48 మెగాపిక్సెల్ కెమెరా పొందుతుంది. USB-C కనెక్టర్‌ను కలిగి మొట్ట మొదటి ఐఫోన్ మోడల్ ఇదే. ఇది హెక్సా-కోర్ యాపిల్ ఏ17 ప్రో చిప్‌ను కలిగి.. 120 Hz రిఫ్రెష్ రేట్‌తో 6.1 ఇంచెస్ డిస్ప్లేను కలిగి ఉంది. అంతే కాకుండా ఇది IP68 డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్, వైర్లెస్ ఛార్జింగ్, డ్యూయల్ సిమ్ ఫంక్షనాలిటీని కలిగి ఉంటుంది. -
యాపిల్ సీఈవో దిగిపోయేదెప్పుడు? పెదవి విప్పిన టిమ్ కుక్
లక్షల కోట్ల విలువైన ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ కంపెనీ యాపిల్. ఈ సంస్థకు 13 ఏళ్లుగా అధిపతిగా కొనసాగుతున్నారు టిమ్ కుక్. వయసవుతున్నప్పకీ చలాకీగా ఉండే ఆయన సీఈవోగా కంపెనీని విజయ పథంలో నడిపిస్తున్నారు. అయితే టిక్ కుక్ ఎప్పుడు రిటైర్ అవుతారు అనే ఆసక్తి చాలా మందిలో ఉంది.తన రిటైర్మెంట్ గురించి వైర్డ్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కుక్ వెల్లడించారు. ఇది తనను చాలా తరచుగా అడిగే ప్రశ్న అని చెప్పారు. యాపిల్ సీఈఓగా తాను ఎంతకాలం కొనసాగాలనుకుంటున్నాననే ప్రశ్నకు సమాధానమిస్తూ "ఈ చోటు (యాపిల్) అంటే ఇష్టం. ఇక్కడ ఉండటం జీవితకాల ప్రత్యేకత" అని బదులిచ్చారు.ఎప్పుడు దిగిపోతానంటే..రిటైర్మెంట్ ఎప్పుడన్నది స్పష్టంగా చెప్పకుండా.. తాను వైదొలగడానికి సరైన సమయం ఎప్పుడదన్నది యాపిల్ సీఈఓ టిమ్ కుక్ ఓ హింట్ ఇచ్చారు. ‘ఇదీ సమయం అని నా అంతరాత్మ చెప్పే వరకు ఇక్కడ కొనసాగుతా.. తర్వాత ఏం చేయాలన్నది అప్పుడు దృష్టి పెడతా’ అన్నారు.టిమ్ కుక్ యాపిల్‌తో తన సుదీర్ఘమైన ప్రయాణాన్ని గుర్తు చేసుకున్నారు. కంపెనీ లేని జీవితాన్ని తాను ఊహించడం అసాధ్యం అని ఒప్పుకున్నారు.యాపిల్ తన వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితానికి చాలా కాలంగా కేంద్రంగా ఉందని, అది తన గుర్తింపు నుండి విడదీయరాని అనుభూతిని కలిగిస్తుందని పేర్కొన్నారు.యాపిల్‌తో సుదీర్ఘ ప్రయాణంకంపెనీలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేసిన టిమ్ కుక్ యాపిల్ పట్ల తన ఇష్టం ఎప్పటిలాగే బలంగా ఉంటుదని కుక్ స్పష్టం చేశారు. కుక్ 1998లో యాపిల్‌లో చేరారు. "నా జీవితం 1998 నుండి ఈ కంపెనీతో ముడిపడి ఉంది" అంటూ యాపిల్‌తో తన కెరీర్, వ్యక్తిగత ఎదుగుదల ఎంత లోతుగా ముడిపడి ఉందో కుక్ వివరించారు. టిమ్ కుక్ నాయకత్వంలో యాపిల్ ఎయిర్‌పాడ్స్, యాపిల్ వాచ్ వంటి విప్లవాత్మక ఉత్పత్తులను ప్రారంభించింది. -
యాపిల్‌లో ఉద్యోగం జైలు జీవితం లాంటిది!
ప్రపంచ నం.1 కంపెనీగా పేరున్న యాపిల్ ఉద్యోగుల పట్ల కఠిన విధానాలు అమలు చేస్తుందని ఓ ఉద్యోగి ఆరోపించారు. ఉద్యోగుల వ్యక్తిగత ఐప్యాడ్, ఐఫోన్ వంటి పరికరాలతో నిబంధనలకు విరుద్ధంగా తమ కార్యకలాపాలపై రహస్యంగా నిఘా వేస్తోందని తెలిపారు. 2020లో కంపెనీలో చేరిన అమర్ భక్త అనే ఉద్యోగి ఈమేరకు సంస్థపై ఆరోపణలు చేశారు. ఆదివారం ఆయన కాలిఫోర్నియాలో కంపెనీపై కేసు దాఖలు చేశారు.అక్కడ ఉద్యోగం సాఫీగా ఉండదు..‘ఉద్యోగుల గోప్యత హక్కును యాపిల్ హరిస్తోంది. సిబ్బంది ఇంట్లో ఉన్నప్పుడు కూడా వారిపై ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా నిఘా ఉంచుతోంది. దీన్ని ఉద్యోగులు అంగీకరించాలని కంపెనీ ఒత్తిడి చేస్తుంది. యాపిల్ సంస్థలో పని వాతావరణం సాధారణంగా బయట అనుకున్నంత సాఫీగా ఉండదు. అదో జైలు జీవితం లాంటిది. యాపిల్ ఉద్యోగులు కంపెనీ తయారు చేసిన ఉత్పత్తులను పని కోసం మాత్రమే ఉపయోగించాలి. అలాగని వ్యక్తిగత అవసరాల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలు వాడాలనుకుంటే మాత్రం కంపెనీ ప్రత్యేకంగా ఇన్స్టాల్ చేసిన సాఫ్ట్‌వేర్‌తోనే వాటిని వినియోగించాలి’ అని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఎవరితో మాట్లాడకుండా జాగ్రత్తలు‘వ్యక్తిగత అవసరాల కోసం వినియోగించే పరికరాల్లో ఈమెయిల్‌లు, ఫొటోలు, వీడియో.. వంటి ఆప్షన్లకు అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ప్రత్యేక సాఫ్ట్వేర్ ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాకు లింక్ చేసిన ప్రతి డేటాను యాక్సెస్ చేసేందుకు యాపిల్‌కు అనుమతి ఉంటుంది. యాపిల్ ఉద్యోగులు వారి పని పరిస్థితులు, తమ వేతనాల గురించి బయట ఎవరితో మాట్లాడనివ్వకుండా కంపెనీ జాగ్రత్త పడుతోంది. ఉద్యోగులు ఈమేరకు ఏవిధంగానూ స్పందించకుండా ఉండడంతోపాటు రాజకీయ కార్యకలాపాలకు పరిమితం అయ్యేలా కట్టడి చేస్తోంది’ అని అన్నారు.సమాచారం తొలగించమని ఆదేశాలు‘కంపెనీకి సంబంధించి ఉద్యోగులు తమ అనుభవాలను పాడ్‌క్యాస్ట్‌లు వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల్లోనూ మాట్లాడకుండా యాపిల్ నిషేధించింది. ఈమేరకు ఏదైనా కార్యకలాపాలు సాగిస్తే వెంటనే ఎలక్ట్రానిక్ పరికరాల ద్వారా కంపెనీకి సమాచారం వెళ్తుంది’ అని చెప్పారు. ప్రస్తుతం తాను చేసిన పనికి సంబంధించి నిర్దిష్ట సమాచారాన్ని అతని లింక్డ్ఇన్ ప్రొఫైల్ నుంచి తీసివేయమని కంపెనీ ఆదేశించించినట్లు భక్త పేర్కొన్నారు.ఇదీ చదవండి: మళ్లీ పెరిగిన బంగారం ధర! తులం ఎంతంటే..యాపిల్ స్పందన ఇదే..యాపిల్ దీనిపై స్పందిస్తూ దావాలోని అంశాలు నిరాధారమైనవని, అవాస్తవాలని కొట్టిపారేసింది. పని ప్రదేశాల పరిస్థితులను చర్చించడానికి ఉద్యోగుల హక్కులపై శిక్షణ ఇస్తున్నట్లు తెలిపింది. తమ బృందాలు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలను పరిరక్షిస్తూ, ఉత్తమ ఉత్పత్తులు, సేవలను అందించడంపై కంపెనీ దృష్టి సారించిందని స్పష్టం చేసింది. -
ఇది సిమ్లా యాపిల్ కాదు... కల్పా యాపిల్
యాపిల్ చెట్టు ఎన్ని కాయలు కాస్తుంది? మనం మామిడి చెట్టును చూస్తాం, జామచెట్టును చూసి ఉంటాం. కానీ యాపిల్ చెట్టుతో మనకు పరిచయం ఉండదు. యాపిల్ కోసం సిమ్లాకే కాదు... కల్పాకు కూడా వెళ్లవచ్చు. అందుకే ఓసారి హిమాచల్ ప్రదేశ్‌లోని ‘కల్పా’ బాట పడదాం. మన పక్కనే ఉన్నట్లుండే హిమాలయాలను చూస్తూ విస్తారమైన యాపిల్ తోటల్లో విహరిద్దాం. ‘రోజూ ఒక యాపిల్ పండు తింటే డాక్టర్‌ను చూడాల్సిన అవసరమే ఉండదు’ అని యాపిల్‌లో ఉండే ఆరోగ్య లక్షణాలను ఒక్కమాటలో చెప్తుంటాం. కల్పా గ్రామంలో ప్రతి ఒక్కరూ సంపూర్ణమైన ఆరోగ్యంతో కనిపిస్తారు. అస్సాం టీ తోటల్లో మహిళలు వీపుకు బుట్టలు కట్టుకుని ఆకు కోస్తున్న దృశ్యాలు కళ్ల ముందు మెదలుతాయి. యాపిల్ తోటల్లో అమ్మాయిలు బుట్టను చెట్టు కొమ్మల మధ్య పెట్టి యాపిల్ కాయలు కోస్తుంటారు. కిన్నౌర్ కైలాస్ పర్వత శ్రేణుల దగ్గర విస్తరించిన గ్రామం కల్పా. యాపిల్ పండుని చెట్టు నుంచి కోసుకుని తింటూ రంగులు మార్చే హిమాలయాలను చూడడం ఈ ట్రిప్‌లోనే సాధ్యమయ్యే అనుభూతి. తెల్లటి మంచు పర్వత శిఖరాల్లో కొన్ని ఉదయం ఎర్రగా కనిపిస్తాయి. మధ్యాహ్నానికి ఆ శిఖరం తెల్లగానూ మరో శిఖరం ఎరుపురంగులోకి మారుతుంది. సూర్యుడి కిరణాలు పడిన పర్వత శిఖరం ఎర్రగా మెరుస్తుంటుంది.సాయంత్రానికి అన్నీ తెల్లగా మంచుముత్యాల్లా ఉంటాయి. నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు ప్రకృతి ఇంతే సౌందర్యంగా ఉంటుంది. మంచుకొండలు చేసే మాయాజాలాన్ని చూడాలంటే శీతాకాలమే సరైన సమయం. గోరువెచ్చని వాతావరణంలో విహరించాలంటే మార్చి నుంచి జూన్ మధ్యలో వెళ్లాలి. కల్పా చాలా చిన్న గ్రామం. సిమ్లా టూర్లో భాగంగా ప్లాన్ చేసుకోవచ్చు. ఇంత చిన్న కల్పా గ్రామంలో ప్రాచీన దేవాలయాలున్నాయి. బౌద్ధవిహారాలు కూడా ఉన్నాయి. (చదవండి: నోరూరించే కేఎఫ్‌సీ చికెన్ తయారీ వెనుకున్న ఇంట్రస్టింగ్ స్టోరీ..!) -
పెగాట్రాన్‌లో వాటాలపై టాటా కన్ను
న్యూఢిల్లీ: యాపిల్ ఉత్పత్తుల తయారీ సంస్థ పెగాట్రాన్ భారత వ్యాపారంలో వాటాలు కొనుగోలు చేయడంపై టాటా గ్రూప్ దృష్టి సారించింది. పెగాట్రాన్ కార్యకలాపాల్లో సుమారు 60 శాతం వాటాను దక్కించుకోవడంపై టాటా ఎల్రక్టానిక్స్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. దీనిపై గత ఏడాది కాలంగా ఇరు సంస్థల మధ్య చర్చలు జరుగుతున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. యాపిల్ ఉత్పత్తుల తయారీలో మార్జిన్లు చాలా తక్కువగా ఉండటం, ప్లాంట్లలో కారి్మకుల డిమాండ్లతో సమస్యలు వస్తున్నా, అత్యుత్తమ ప్రమాణాలు పాటిస్తూ, సకాలంలో ఉత్పత్తులను సరఫరా చేయాల్సి రావడం కంపెనీకి సవాలుగా ఉంటోందని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో భారత కార్యకలాపాలకు సంబంధించి స్థానిక కంపెనీని భాగస్వామిగా చేసుకోవాలని కంపెనీ భావిస్తున్నట్లు వివరించాయి. తమిళనాడులో ఉన్న పెగాట్రాన్ ఫ్యాక్టరీలో 10,000 మంది వర్కర్లు ఉండగా, ఏటా యాభై లక్షల ఐఫోన్ల తయారీ సామర్థ్యాలు ఉన్నట్లు తెలుస్తోంది. గతేడాది భారత్‌లో తయారైన మొత్తం ఐఫోన్లలో 10% ఫోన్లను పెగాట్రాన్ ఉత్పత్తి చేసినట్లు అంచనా. తమిళనాడులోని హోసూర్‌లో ఏర్పాటు చేసే ప్లాంటు కోసం టాటా, పెగాట్రాన్ జట్టు కట్టనున్నట్లు సమాచారం. టాటా గ్రూప్ ఇప్పటికే మరో ఐఫోన్ల తయారీ సంస్థ విస్ట్రాన్ భారత వ్యాపారాన్ని కొనుగోలు చేసింది. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
సైబర్ నేరాలు విపరీతంగా పెరుగుతున్న తరుణంలో.. కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) యాపిల్ వినియోగదారులను అప్రమత్తం చేసింది. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి వాటిని వినియోగించేవారు జాగ్రత్తగా ఉండాలని కేంద్రం హెచ్చరించింది.హ్యాకర్లు.. మీ అనుమతి లేకుండానే మొబైల్ హ్యాక్ చేసే అవకాశం ఉంది. మొబైల్ హ్యాక్ చేస్తే.. డేటా మొత్తం చోరీ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీ ఉత్పత్తులను (మొబైల్స్, ట్యాబ్స్, మ్యాక్స్) ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలని ఎలక్ట్రానిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖ పరిధిలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ వెల్లడించింది.CERT-In యాపిల్ ఉత్పత్తులను ప్రభావితం చేసే రెండు బలహీనతలను గుర్తించింది. అవి ఎగ్జిక్యూషన్ వల్నరబిలిటీ (CVE-2024-44308), క్రాస్-సైట్ స్క్రిప్టింగ్ (XSS). వీటిని వాడుకొని సైబర్ నేరగాళ్లు మీ మొబైల్స్ హ్యక్స్ చేస్తారు.ఇదీ చదవండి: దీపిందర్ గోయల్ కొత్త కారు చూశారా? ధర రూ.9 కోట్లు..18.1.1కి ముందున్న యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. అలాగే 17.7.2కి ముందు యాపిల్ ఐఓఎస్, ఐప్యాడ్ఓఎస్ వెర్షన్స్.. 15.1.1కి ముందు వెర్షన్స్ అయిన యాపిల్ మ్యాక్ఓఎస్ సుక్వోయా, 2.1.1కి ముందున్న యాపిల్ విజన్ఓఎస్, 18.1.1కి ముందు ఉన్న యాపిల్ సఫారీ ఉత్పత్తులను హ్యాకర్స్ సులభంగా హ్యాక్ చేసే అవకాశం ఉంది. కాబట్టి వీటిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకుంటూ, సరికొత్త సాఫ్ట్వేర్ వెర్షన్లను ఇన్స్టాల్ చేసుకోవాలి. -
వివక్షతతో కూడిన ప్రమాణాలు తొలగింపు
భారత్‌లో యాపిల్ సరఫరాదారుగా ఉన్న ఫాక్స్‌కాన్ తన ఉద్యోగుల నియామక ఏజెంట్లకు ఆదేశాలు జారీచేసింది. కంపెనీ నియామక పద్ధతుల్లో మార్పులు చేసింది. ఉద్యోగ ప్రకటనల్లో లింగం, వైవాహిక స్థితి, వయసు వంటి వివక్షతతో కూడిన ప్రమాణాలను తొలగించాలని స్పష్టం చేసింది. ఈమేరకు రాయిటర్స్ దర్యాప్తును అనుసరించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు తెలిపారు.చెన్నై సమీపంలోని శ్రీపెరంబుదూర్‌లోని ఐఫోన్ తయారీ ప్లాంట్‌లో వివాహిత మహిళలను అసెంబ్లింగ్-లైన్ విభాగంలో పని చేసేందుకు ఫాక్స్‌కాన్ గతంలో మినహాయించినట్లు రాయిటర్స్ దర్యాప్తులో తేలింది. కానీ హై ప్రోడక్టివిటీ అవసరం అయినప్పుడు మాత్రం వివాహత మహిళలపై ఎలాంటి షరతులు విధించలేదని తెలిపింది. ఈ మేరకు జూన్ 25న రాయిటర్స్ సిద్ధం చేసిన పరిశోధన పత్రాన్ని అనుసరించి కంపెనీ తాజాగా వివక్షతతో కూడిన వివరాలు రిక్రూట్మెంట్ ప్రకటనలో ఉండకూడదని ఏజెన్సీలకు ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వారిని లింగం, వయసు, వైవాహిక స్థితిని అనుసరించి వేరు చేయడం సరికాదని తెలిపింది. దాంతో సదరు వివరాలు లేకుండానే చెన్నైలో కొన్ని సంస్థలు ఉద్యోగాల కోసం ప్రకటనలు ఇస్తున్నాయి.ఇదీ చదవండి: నారాయణ మూర్తిని మించిన సేనాపతిఫాక్స్కాన్ ఏజెన్సీ ఇచ్చిన ఓ ప్రకటన ప్రకారం స్మార్ట్‌ఫోన్ తయారీ యూనిట్‌లోని మొత్తం అసెంబ్లింగ్ స్థానాలు తెలిపారు. కానీ వయసు, లింగం, వైవాహిక ప్రమాణాల గురించి ప్రస్తావించలేదు. ‘ఎయిర్ కండిషన్డ్ వర్క్‌ప్లేస్, ఉచిత రవాణా, క్యాంటీన్ సౌకర్యం, ఉచిత హాస్టల్, నెలవారీ జీతం రూ.14,974 లేదా దాదాపు 177 అమెరికన్ డాలర్ల’ వివరాలతో ప్రకటన ఇచ్చారు. -
యాపిల్ తయారీకి మరో కంపెనీలో వాటా కొనుగోలు
భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్‌లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది.యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్కాన్తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్‌వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..పెగాట్రాన్, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్‌కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యంపెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు. -
యాపిల్ యూజర్లకు కేంద్రం హైరిస్క్ అలర్ట్!
యాపిల్ ఉత్పత్తులు వాడుతున్న వారికి కేంద్ర ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ హైరిస్క్ అలర్ట్‌లు పంపుతోంది. అవుట్‌డేటెడ్ సాఫ్ట్వేర్ వాడుతున్న ఐఫోన్, మ్యాక్‌బుక్, యాపిల్ వాచ్‌లు వంటి ఉత్పత్తుల్లో సెక్యూరిటీ లోపాలు గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. దాంతో ఆయా వినియోగదారులకు హైరిస్క్ అలర్టులు పంపుతున్నట్లు స్పష్టం చేసింది.పాత సాఫ్ట్వేర్ ఉపయోగిస్తున్న యాపిల్ డివైజ్‌ల్లో అనేక భద్రతా లోపాలను హైలైట్ చేస్తూ ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In) అడ్వైజరీని విడుదల చేసింది. ఈ లోపాల కారణంగా హ్యాకర్లు, సైబర్ ఫ్రాడ్‌కు పాల్పడేవారు వినియోగదారులకు సంబంధించిన సున్నితమైన డేటాను యాక్సెస్ చేసే ప్రమాదం ఉందని తెలిపింది. డేటా మానిప్యులేషన్‌కు దారితీసే అవకాశం ఉందని హెచ్చరించింది. తాజా సెక్యూరిటీ అప్డేట్లో ఆపిల్ ఈ లోపాలను పరిష్కరించింది. సైబర్ ప్రమాదాలను తగ్గించడానికి, భద్రతా ఉల్లంఘనల నుంచి రక్షించుకోవడానికి వినియోగదారులు తమ డివైజ్‌ల్లో తాజా సాఫ్ట్వేర్ వెర్షన్‌ను అప్డేట్ చేసుకోవాలని CERT-In సిఫార్సు చేసింది.ఇదీ చదవండి: తెరకెక్కనున్న ఆర్బీఐ ప్రస్థానం!ఐఓఎస్ 18.1 లేదా 17.7.1 కంటే ముందున్న సాఫ్ట్వేర్ వెర్షన్లను వినియోగిస్తున్న యాపిల్ కస్టమర్లు వెంటనే సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని సెర్ట్-ఇన్ సూచించింది. వాచ్ఓఎస్, టీవీఓఎస్, విజన్ ఓఎస్, సఫారి బ్రౌజర్ వంటి పాత వెర్షన్లపై కూడా దీని ప్రభావం ఉంటుందని తెలిపింది. కాబట్టి ఆయా వినియోగదారులు సాఫ్ట్వేర్ అప్డేట్ చేసుకోవాలని తెలిపింది. -
యాపిల్‌లో మరింత తగ్గిన బఫెట్ వాటా
ముంబై: టెక్ దిగ్గజం యాపిల్ సంస్థలో బెర్క్‌షైర్ హాత్వే అధిపతి వారెన్ బఫెట్ వాటా మరింత తగ్గింది. సెప్టెంబర్ క్వార్టర్లో షేర్లను విక్రయించినట్లు బెర్క్‌షైర్ హాత్వే తెలిపింది. దీంతో యాపిల్‌లో మొత్తం వాటా విలువ 69.9 బిలియన్ డాలర్లకు దిగివచి్చంది. ఆగస్టు త్రైమాసికంలో 75 బిలియన్ డాలర్ల విలువైన షేర్ల(సగానికి పైగా వాటా)ను అమ్మింది. ఈ ఏడాదిలో యాపిల్‌తో పాటు బ్యాంక్ ఆఫ్ అమెరికా షేర్లను భారీ విక్రయించడంతో పాటు ఎలాంటి ప్రధాన కొనుగోళ్లు జరపకపోవడంతో బెర్క్‌షైర్ హాత్వే నగదు రిజర్వు 325 బిలియన్ డాలర్లకి చేరింది. -
ఈ ఐఫోన్ వాడుతుంటే.. మీకే ఈ అలర్ట్!
ఐఫోన్ 14 ప్లస్ (iPhone 14 Plus) వినియోగదారులకు యాపిల్ ముఖ్యమైన అలర్ట్‌ను జారీ చేసింది. కొన్ని నెలల క్రితం తయారైన ఐఫోన్ 14 ప్లస్ యూనిట్లలో తలెత్తిన రియర్ కెమెరా సమస్య కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రకటించింది. ప్రభావితమైన ఫోన్లకు ఎటువంటి అదనపు ఖర్చు లేకుండా అధీకృత యాపిల్ సర్వీస్ ప్రొవైడర్ల వద్ద సర్వీసింగ్ పొందవచ్చని కంపెనీ ప్రకటించింది.రియర్ కెమెరా సమస్య తమ హ్యాండ్‌సెట్‌పై ప్రభావం చూపిందో లేదో కస్టమర్లు తమ క్రమ సంఖ్యను కంపెనీకి అందించడం ద్వారా ధ్రువీకరించుకోవచ్చు. ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరాకు మరమ్మతుల కోసం ఇప్పటికే డబ్బు చెల్లించినవారు ఆ మొత్తాన్ని రీఫండ్ పొందవచ్చు.సమస్య ఇదే..ఐఫోన్ 14 ప్లస్‌లో రియర్ కెమెరా సమస్య మరమ్మతు కోసం యాపిల్ ప్రత్యేక సర్వీస్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించింది. ఇందుకోసం సపోర్ట్ పేజీని ఏర్పాటు చేసింది. అసలేంటి సమస్య అంటే.. రియర్ కెమెరాతో ఫొటో తీసినప్పుడు ప్రివ్యూ చూపించడం లేదు. అయితే ఈ చాలా తక్కువ ఫోన్లలోనే ఉత్పన్నమైనట్లు కంపెనీ పేర్కొంది. ఇవి 2023 ఏప్రిల్ 10 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ 28 మధ్య తయారైనవి.ఇదీ చదవండి: బీఎస్ఎన్ఎల్ కొత్త రీఛార్జ్ ప్లాన్.. ఏడాదంతా అదిరిపోయే ప్రయోజనాలు!అయితే తమ ఫోన్లలో ఇలా సమస్య ఉంటే కంపెనీ ఉచిత సర్వీసింగ్ ప్రోగ్రామ్ పొందడానికి అర్హత ఉందా.. లేదా అన్న విషయాన్ని యాపిల్ ఏర్పాటు చేసిన సపోర్ట్ పేజీ ద్వారా తెలుసుకోవచ్చు. ఇక్కడ సీరియల్ నంబర్ నమోదు చేస్తే మీ ఫోన్‌కి ఫ్రీ సర్వీసింగ్ వస్తుందో రాదో తెలుస్తుంది. యాపిల్ సర్వీస్ ప్రోగ్రామ్ ఫోన్ కొనుగోలు తేది నుంచి మూడేళ్లపాటు వర్తిస్తుంది. -
భారత్‌లో యాపిల్ కొత్తగా నాలుగు అవుట్లెట్లు!
ప్రపంచ దిగ్గజ కంపెనీ యాపిల్ భారత్‌లో నాలుగు అవుట్లెట్లను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నట్లు కంపెనీ సీఈఓ టిమ్‌కుక్ తెలిపారు. భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల విక్రయాలు పెరుగుతున్నట్లు చెప్పారు. సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ రెవెన్యూ గతంలో కంటే 6 శాతం పెరిగి 94.9 బిలియన్ డాలర్ల(రూ.7.9 లక్షల కోట్లు)కు చేరిందని తెలిపారు.ఈ సందర్భంగా యాపిల్ సీఈఓ టిమ్‌కుక్ ముదుపర్లను ఉద్దేశించి మాట్లాడారు. ‘యాపిల్ తాజా త్రైమాసిక ఫలితాల్లో రికార్డు స్థాయి ఆదాయాన్ని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా భారీగా ఐఫోన్ అమ్మకాలు జరిగాయి. భారతదేశంలో యాపిల్ సేల్స్ గరిష్ఠాలను చేరుకున్నాయి. ఇండియాలో కంపెనీ కార్యకలాపాలు మరింత విస్తరించేందుకు చర్యలు చేపడుతున్నాం. ఇప్పటికే దేశంలో ముంబయి, ఢిల్లీలో రెండు అవుట్లెట్లను ఏర్పాటు చేశాం. రానున్న రోజుల్లో మరో నాలుగు అవుట్లెట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీంతో కంపెనీ రెవెన్యూ మరింత పెరిగే అవకాశం ఉంది’ అన్నారు.ఇదీ చదవండి: చాట్‌జీపీటీ కొత్త ఆప్షన్.. గూగుల్‌కు పోటీ ఇవ్వనుందా?మంబయిలో యాపిల్ బీకేసీ, ఢిల్లీలో యాపిల్ సాకెత్ పేరుతో రెండు అవుట్లెట్లను గతంలో ప్రారంభించింది. బెంగళూరు, పుణె, ముంబయి, ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ల్లో మరో నాలుగు కొత్త స్టోర్లను ప్రారంభించే యోచనతో ఉన్నట్లు గతంలో ప్రతిపాదించింది. తాజాగా కంపెనీ సీఈఓ కూడా ఈ విషయాన్ని ధ్రువీకరించడం గమనార్హం. ఇటీవల కంపెనీ ఐఫోన్ 16 సిరీస్‌ను ఆవిష్కరించింది. వారం కిందట యాపిల్ ఐఓఎస్ 18.1ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో వినియోగదారులకు వినూత్న ఫీచర్లను అందించినట్లు కంపెనీ తెలిపింది.