భారత్‌లో యాపిల్ ఉత్పత్తుల తయారీ భాగస్వామిగా ఉన్న పెగాట్రాన్‌లో 60 శాతం వాటాను టాటా గ్రూప్ కొనుగోలు చేసింది. ఇటీవల ఈమేరకు రెండు సంస్థల మధ్య ఒప్పందం జరిగింది. దాంతో భారత్‌లో యాపిల్ ఉత్పత్తులు తయారీ చేసే కంపెనీల్లో టాటా గ్రూప్ టాప్‌లో నిలిచింది.
యాపిల్ సంస్థ చైనా భయట ఇతర దేశాల్లో తన ఉత్పత్తిని పెంచేలా ఇండియాలో ఉత్పాదకతను పెంచుతోంది. దానికోసం టాటా గ్రూప్, ఫాక్స్‌కాన్‌తోపాటు ఇతర కంపెనీలతో ఒప్పందం చేసుకుంది. కానీ కొన్ని చిన్న కంపెనీల్లోని మేజర్‌వాటాను ఇప్పటికే ఈ సంస్థలు కొనుగోలు చేశాయి. టాటా గ్రూప్ యాపిల్ తయారీదారుగా ఉన్న విస్ట్రన్ కంపెనీను ఇప్పటికే కొనుగోలు చేసింది. తాజాగా పెగాట్రాన్ కంపెనీలో 60 శాతం వాటా కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకుంది. దాంతో స్థానికంగా యాపిల్ ఉత్పత్తులను తయారీని పెంచాలని నిర్ణయించింది.
తయారీదారుగా ఉండడం తేలికైన విషయం కాదు..
పెగాట్రాన్, టాటా గ్రూప్‌నకు చెందిన టాటా ఎలక్ట్రానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ మధ్య గత ఏడాది కాలంగా ఈ ఒప్పందానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని కంపెనీ వర్గాలు తెలిపాయి. ‘యాపిల్‌కు కాంట్రాక్ట్ తయారీదారుగా ఉండటం అంత తేలికైన విషయం కాదు. తయారీపై మార్జిన్‌లు కూడా అధికంగానే ఉంటాయి. యాపిల్ ఉత్పత్తుల అధునాతన స్వభావాన్ని పరిగణనలోకి తీసుకుని కంపెనీలు అత్యున్నత స్థాయితో ఉత్పత్తి చేపట్టాల్సి ఉంటుంది. నిత్యం నాణ్యతను ధ్రువీకరించుకోవాల్సి ఉంటుంది. గ్లోబల్ మార్కెట్‌లకు సరఫరా చేస్తున్నందున ఉత్పత్తిలో ఎటువంటి అంతరాయాలు ఉండకూడదు’ అని యాపిల్ ఉత్పత్తుల తయారీ వ్యవస్థలో భాగమైన ఒక ఉన్నత అధికారి తెలిపారు. టాటా గ్రూప్ ఇప్పటికే భారత్‌లో ఐఫోన్ 16 తయారీని ప్రారంభించింది.
ఇదీ చదవండి: ‘సామాన్యుడిపై భారం తగ్గించండి’
పెగాట్రాన్ ఉత్పత్తి సామర్థ్యం
పెగాట్రాన్ గత సంవత్సరం దేశీయంగా వినియోగిస్తున్న ఐఫోన్ ఉత్పత్తిలో సుమారు 10 శాతం సహకారం అందించింది. ఈ కంపెనీకి తమిళనాడులో తయారీ యూనిట్ ఉంది. ఇందులో దాదాపు 10,000 మంది కార్మికులు పనిచేస్తున్నారని అధికారులు తెలిపారు. ఈ యూనిట్ ఏటా ఐదు మిలియన్ల ఐఫోన్‌లను ఉత్పత్తి చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment