‘సామాన్యుడిపై భారం తగ్గించండి’ | Finance Minister Nirmala Sitharaman responded to a request from a social media user | Sakshi
Sakshi News home page

‘సామాన్యుడిపై భారం తగ్గించండి’

Published Mon, Nov 18 2024 9:09 AM | Last Updated on Mon, Nov 18 2024 9:41 AM

Finance Minister Nirmala Sitharaman responded to a request from a social media user

బడ్జెట్‌ రూపకల్పనకు కేంద్రం రంగం సిద్ధం చేస్తోంది. ఫిబ్రవరి 2025లో ప్రకటించే కేంద్ర బడ్జెట్‌లో మార్పులు చేయాలంటూ కొన్ని ఆర్థిక సంస్థలు, ప్రజల నుంచి కేంద్రానికి వినతులు వస్తున్నాయి. అందులో భాగంగా ఇటీవల కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఎక్స్‌ పేజ్‌ను ట్యాగ్‌ చేస్తూ ఓ వ్యక్తి ప్రభుత్వానికి తన అభ్యర్థనను తెలిపారు.

ఎక్స్‌ వేదికగా తుషార్‌ శర్మ అనే వ్యక్తి సామాన్యుడిపై పన్ను భారం తగ్గించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వేడుకున్నాడు. ‘@nsitharaman దేశాభివృద్ధికి మీరు చేస్తున్న సహకారం, ప్రయత్నాలను ఎంతో అభినందిస్తున్నాను. ప్రభుత్వం మధ్యతరగతి ప్రజలకు కొంత ఉపశమనం కలిగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాను. మీరు ఎదుర్కొంటున్న సవాళ్లను కూడా నేను అర్థం చేసుకున్నాను. కానీ ఇది నా హృదయపూర్వక అభ్యర్థన మాత్రమే’ అని తుషార్ శర్మ ఎక్స్‌లో పోస్ట్‌ చేశారు.

కేంద్రమంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ పోస్ట్‌కు స్పందిస్తూ ‘మీ మాటలు, అవగాహనకు ధన్యవాదాలు. నేను మీ అభ్యర్థనను అభినందిస్తున్నాను. నరేంద్రమోదీ ప్రభుత్వం సమస్యలపై స్పందించి చర్య తీసుకునే ప్రభుత్వం. ప్రజల అభిప్రాయాలను వింటోంది. వాటికి తగినట్లు ప్రతిస్పందిస్తోంది. మీ అభ్యర్థన చాలా విలువైంది’ అని రిప్లై ఇచ్చారు. కేంద్ర బడ్జెట్ 2025 ద్వారా మధ్యతరగతి ప్రజలకు ఉపశమనం కలిగించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని జులైలో ఆర్థిక మంత్రి తెలిపారు.

ఇదీ చదవండి: మెటాపై రూ.6,972 కోట్ల జరిమానా!

గతంలో మంత్రి స్పందిస్తూ ‘నేను మధ్యతరగతి వారికి విభిన్న రూపాల్లో మేలు చేయాలని ప్రయత్నిస్తున్నాను. కానీ నాకు కూడా కొన్ని పరిమితులు ఉన్నాయి. నేను పన్ను రేటును తగ్గించి వారికి ఉపశమనం ఇవ్వాలనుకుంటున్నాను. అందుకే స్టాండర్డ్ డిడక్షన్ రూ.50,000 నుంచి రూ.75,000కి పెంచాం. అదనంగా అధిక ఆదాయ వర్గాలకు పన్ను రేటు పెంచాం. సామాన్యులపై పన్ను రేట్లను తగ్గించాలనే ఉద్దేశంతోనే కొత్త పన్ను విధానం ప్రవేశపెట్టాం’ అని చెప్పారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement