ప్రముఖ ఆర్థికవేత్తలతో మంత్రి సీతారామన్ సమావేశం
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బడ్జెట్‌కు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఇవి శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆమె భేటీ కానున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌కు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే.
ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఎంఎస్‌ఎంఈ రంగ ప్రతినిధులతో ఈ నెల 7న ఆర్థిక మంత్రి భేటీ కానున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్ర వరి 1న పార్లమెంట్‌కు సమరి్పంచే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment