consultation
-
నేటి నుంచే బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వచ్చే ఆర్థిక సంవత్సరం (2025–26) బడ్జెట్‌కు సంబంధించి వివిధ భాగస్వాములతో సంప్రదింపులు నిర్వహించనున్నారు. ఇవి శుక్రవారం ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ప్రముఖ ఆర్థికవేత్తలతో ఆమె భేటీ కానున్నారు. దేశ జీడీపీ వృద్ధి రేటు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం సెపె్టంబర్ క్వార్టర్‌కు ఏడు త్రైమాసికాల కనిష్ట స్థాయికి పడిపోవడం తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే బడ్జెట్‌కు సంబంధించి ప్రముఖ ఆర్థిక వేత్తల అభిప్రాయాలను ఆమె తెలుసుకోనున్నట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. ఆ తర్వాత రైతు సంఘాలు, వ్యవసాయ ఆర్థికవేత్తలు, ఎంఎస్ఎంఈ రంగ ప్రతినిధులతో ఈ నెల 7న ఆర్థిక మంత్రి భేటీ కానున్నారు. 2025–26 బడ్జెట్‌ను ఫిబ్ర వరి 1న పార్లమెంట్‌కు సమరి్పంచే అవకాశం ఉంది. -
న్యాయ నిపుణులతో రెజ్లర్ల చర్చలు
న్యూఢిల్లీ: పోలీసుల నుంచి తీవ్రమైన ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ భారత స్టార్ రెజ్లర్లు తమ నిరసన దీక్ష కొనసాగిస్తున్నారు. లైంగిక ఆరోపణలు ఎదుర్కొంటున్న భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ) అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్‌పై ఎఫ్ఐఆర్ నమోదు కావడం, సుప్రీంకోర్టులో కేసు విచారణ ముగియడం... ఢిల్లీ న్యాయపరిధిలో తేల్చుకోవాలన్న కోర్టు సూచనపై రెజ్లర్లు న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతున్నారు. ‘శుక్రవారం రెండు కమిటీలు ఏర్పాటు చేశాం. ఖాప్ పంచాయత్, రైతులు, మహిళా సంఘాలకు చెందిన 31 మంది సభ్యులున్న ఒక కమిటీ, తొమ్మిది మంది సభ్యులుగా ఉన్న మరో కమిటీని ఏర్పాటు చేశాం. కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ నిజం వైపు నిలబడాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ముగ్గురు రెజ్లర్లకే ఈ పోరాటం పరిమితం కాదు. హైకోర్టుకు వెళ్లి మళ్లీ మా పోరాటం మొదలుపెట్టే అవకాశాలున్నాయి’ అని రెజ్లర్ బజరంగ్ పూనియా తెలిపాడు. దర్యాప్తుతోనే వాస్తవాలు: క్రీడల మంత్రి ఠాకూర్ ‘రెజ్లర్ల డిమాండ్లన్నీ తీరుతాయి. ముందయితే ఢిల్లీ పోలీసుల దర్యాప్తు జరగనివ్వండి. దీనిపై సుప్రీంకోర్టు కూడా అదే చెప్పింది. విచారణలో పోలీసులు పాలకు పాలు, నీళ్లకు నీళ్లు తేటతెల్లం చేస్తే... న్యాయబద్ధంగా గట్టి చర్యలు తీసుకునేందుకు వీలవుతుంది’ అని కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. గంగూలీ ఏమన్నాడంటే... భారత జట్టు మాజీ కెప్టెన్, బీసీసీఐ మాజీ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ మాట్లాడుతూ ‘రెజ్లర్లు దేశానికెంతో చేశారు. అంతర్జాతీయ వేదికలపై పతకాలతో కీర్తి ప్రతిష్టలు తెచ్చారు. వారి పోరాటం వాళ్లని చేసుకోనివ్వండి. ఈ వ్యవహారంపై నాకు పూర్తి వివరాలు తెలియదు. పత్రికల్లో చదివిందే! ఏదేమైనా ఈ వివాదం త్వరలోనే పరిష్కారం కావాలని ఆశిస్తున్నా’ అని అన్నాడు. -
కేఐఐటీ డీయూలో వై20 కన్సల్టేషన్స్
భువనేశ్వర్: జీ20 సదస్సులో భాగంగా ఒడిశా రాజధాని భువనేశ్వర్‌లోని కళింగ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండస్ట్రియల్ టెక్నాలజీ డీమ్డ్ టు బీ యూనివర్సిటీ(కేఐఐటీ డీయూ)లో ‘వై20 కన్సల్టేషన్స్’ శుక్రవారం ప్రారంభమైంది. ఒడిశా రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ, పర్యావరణ, అటవీ శాఖ సహాయ మంత్రి అశ్వినీకుమార్ చౌబే ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు. స్వామి వివేకానంద జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని 21వ శతాబ్దంలో మన దేశాన్ని అగ్రగామిగా తీర్చదిద్దడానికి యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమాజంలో శాంతి, సౌభాగ్యాలను నెలకొల్పడంలో యువత పాత్ర అత్యంత కీలకమని ఉద్ఘాటించారు. వై20 కన్సల్టేషన్స్‌కు కేఐఐటీ వ్యవస్థాపకులు డాక్టర్ అచ్యుత సమంత అధ్యక్షత వహించారు. -
విధాన స్థిరత్వం, పారదర్శకత బాటన భారత్
న్యూఢిల్లీ: దేశంలో పెట్టుబడులను పురోభివృద్దికి పాలసీ స్థిరత్వం, పారదర్శకత, చక్కటి సంప్రదింపుల ప్రక్రియ బాటను అందిస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పేర్కొన్నారు. దేశంలో ఇంధన వనరుల రంగంలో అవకాశాలు అపారమన్న ఆమె, ఈ అవకాశాలను అందిపుచ్చుకోడానికి పెట్టుబడులు పెట్టాలని విజ్ఞప్తి చేశారు. బొగ్గు అమ్మకానికి సంబంధించి ఆరవ విడత గనుల వేలం పక్రియ ప్రారంభం సందర్భంగా ఆమె మాట్లాడారు. ‘ఈ అమృత్ కాలం (భారత్ స్వాతంత్రం సముపార్జించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా) సమయంలో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ సమయంలో భారతదేశానికి అన్ని ప్రాథమిక ఖనిజాలు అవసరం. ఈ రంగంలో పెట్టుబడుల అవకాశాలు అపారం’ అని ఆర్థికమంత్రి ఈ సందర్బంగా పేర్కొన్నారు. పెట్టుబడులకు తగిన దేశం భారత్ అని మోర్గాన్ స్టాన్లీ చేసిన వ్యాఖ్యను ఆర్థికమంత్రి ప్రస్తావించారు. బొగ్గు శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మాట్లాడుతూ వాణిజ్య గనుల ఆరవ విడత వేలంలో 141 బొగ్గు, లిగ్నైట్ గనులను విక్రయించనున్నట్లు ఈ సందర్భంగా తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు 67 బొగ్గు గనులను కమర్షియల్ మైనింగ్ కింద అమ్మకానికి ఉంచినట్లు కూడా తెలిపారు. ప్రపంచంలో పలు దేశాలు మందగమనం ముందు నుంచొన్న సమయంలో భారత్ పటిష్ట వృద్ధి బాటన పయనిస్తోందని తెలిపారు. ఆరవ విడత బొగ్గు గనుల వేలం పక్రియను ప్రారంభిస్తున్న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ -
మెదక్: వెల్దుర్తి మండలం శేరిల్లలో వైఎస్ షర్మిల పర్యటన
-
మెదక్: వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల
సాక్షి,మెదక్: జిల్లాలోని వెల్దుర్తి మండలం శేరిల్లా గ్రామంలో వైఎస్ షర్మిల బుధవారం ఉదయం పర్యటించారు. ప్రభుత్వ ఉద్యోగం కోసం కోచింగ్ తీసుకొని, ఉద్యోగ నోటిఫికేషన్ కోసం ఎదురుచూస్తున్నా.. ఎంతకు నోటిఫికేషన్ రాకపోవడంతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న వెంకటేష్ కుటుంబాన్ని ఆమె పరామర్శించారు. డీఎస్సి నోటిఫికేషన్ విడుదల కాకపోవడంతో వెంకటేష్ మే16న ఆత్యహత్య చేసుకున్నాడు. వెంకటేశ్ కుటుంబాన్ని పరామర్శించిన వైఎస్ షర్మిల అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అనంతరం వెఎస్ షర్మిల మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్రం వస్తే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని అనుకున్నారు. కానీ, తెలంగాణ రాష్ట్రం వచ్చి ఏడేళ్లు గడిచినా ఉద్యమ లక్ష్యాలు దరిదాపుల్లో లేవన్నారు. నేడు తెలంగాణలో ఉద్యోగాల కోసం ఆత్మహత్యలు చేసుకుంటున్నారని మండిపడ్డారు. నిరుద్యోగులు చనిపోవడం తెలంగాణ ఉద్యమానికి అవమానమని, 35 లక్షల మంది నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని గుర్తుచేశారు. నోటిఫికేషన్లు ఇవ్వకుండా పాలకులు మరణ శాసనాలు రాస్తున్నారని మండిపడ్డారు. ఇంకా ఎంత మంది నిరుద్యోగులు చనిపోతే ఉద్యోగాలు ఇస్తారో కేసీఆర్ చెప్పాలని ప్రశ్నించారు. కేసీఆర్ పిల్లలకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారని, మరి ప్రజల పిల్లలకు ఉద్యోగాలు వద్దా అని షర్మిల నిలదీశారు. చదవండి: బ్లాక్‌ఫంగస్ బాధితుడికి కేటీఆర్ అండ.. -
వెనక్కి తగ్గని ఇజ్రాయెల్, హమాస్
గాజా సిటీ: ఇజ్రాయెల్, పాలస్తీనా తీవ్రవాద సంస్థ హమాస్ మధ్య ఉద్రిక్తతలు యథాతథంగా కొనసాగుతున్నాయి. గురువారం ఇరు వర్గాలు భీకరస్థాయిలో ఘర్షణకు దిగాయి. రాకెట్లతో నిప్పుల వర్షం కురిపించుకున్నాయి. మరోవైపు పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ఈజిప్టు రంగంలోకి దిగింది. ఉద్రిక్తతలను చల్లార్చి, సాధారణ స్థితిని నెలకొల్పడమే లక్ష్యంగా ఈజిప్టు మధ్యవర్తులు ఇజ్రాయెల్, హమాస్ ప్రతినిధులతో సంప్రదింపులు ప్రారంభించారు. ఒకవైపు చర్చలు సాగుతుండడగానే రాకెట్లతో దాడులు కొనసాగడం గమనార్హం. హమాస్ భారీ స్థాయిలో రాకెట్లతో ఇజ్రాయెల్ భూభాగంపై విరుచుకుపడింది. కొన్ని రాకెట్లు ముఖ్యనగరం టెల్ అవీవ్ దాకా దూసుకురావడం గమనార్హం. ఇజ్రాయెల్ సైన్యం సైతం ధీటుగా బదులిచ్చింది. గాజాపై తన అస్త్రాలను ఎక్కుపెట్టింది. ఇంకోవైపు గాజాలో అరబ్, యూదు ప్రజలు వీధుల్లో బాహాబాహీకి దిగారు. 13 మంది హమాస్ తీవ్రవాదులు హతం! గాజాలో హమాస్ తీవ్రవాదులు తలదాచుకుంటున్నట్లు భావిస్తున్న మూడు బహుళ అంతస్తుల భవనాలను ఇజ్రాయెల్ దళాలు ధ్వంసం చేశాయి. ఇజ్రాయెల్ దాడుల్లో ఇప్పటివరకు 83 మంది పాలస్తీనా పౌరులు మరణించారని, వీరిలో 17 మంది చిన్నారులు ఉన్నారని గాజా ఆరోగ్య శాఖ ప్రకటించింది. తమ సభ్యులు 13 మంది అమరులైనట్లు హమాస్ తెలిపింది. హమాస్ దాడుల్లో ఏడుగురు ఇజ్రాయెల్ వాసులు ప్రాణాలు కోల్పోయారు. ‘ఇజ్రాయెల్‌లోని టెల్ అవీవ్, దిమోనా, జెరూసలేం నగరాలపై బాంబులు వేయడం మాకు మంచి నీళ్లు తాగడం కంటే సులభం’ అని హమాస్ మిలటరీ విభాగం ప్రతినిధి ఒకరు ఒక వీడియో సందేశంలో పేర్కొన్నారు. ఇజ్రాయెల్ అణు రియాక్టర్ దిమోనా సిటీలో ఉంది. హమాస్ తమ దేశంపై 1,200 రాకెట్లు ప్రయోగించగా, ఐరన్ డోమ్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్‌తో 90 శాతం రాకెట్లను నిర్వీర్యం చేశామని ఇజ్రాయెల్ ప్రకటించింది. -
యూటర్న్ తీసుకుని వచ్చి మరీ మంత్రి పరామర్శ
మణికొండ: రోడ్డుపక్కన ఎండలో అచేతనంగా పడి ఉన్న ఓ మహిళను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శించి వివరాలు ఆరా తీశారు. శుక్రవారం మంత్రి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్పల్లి మండల పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యలో లంగర్‌హౌస్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని గమనించారు. కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించగా అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్లటంతో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి వచ్చి మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమెకు మాటలు రావని సైగలతో చెప్పడంతో నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు. చదవండి: తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య -
చర్చలపై డ్రాగన్ కీలక వ్యాఖ్యలు
బీజింగ్ : సరిహద్దుల్లో ప్రతిష్టంభనను నివారించేందుకు భారత్-చైనాల మధ్య జరుగుతున్న సైనిక చర్చల్లో ఏకాభిప్రాయం వ్యక్తమైందని బీజింగ్ బుధవారం వెల్లడించింది. ఈనెల 6న ప్రారంభమైన సైనిక అధికారుల స్ధాయి చర్చల్లో వ్యక్తమైన సానుకూల ఏకాభిప్రాయం దిశగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను తగ్గించే చర్యలను ఇరు దేశాలూ చేపట్టాయని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి హు చునింగ్ చెప్పారు. కాగా బుధవారం జరిగే తాజా చర్చలకు ముందు తూర్పు లడఖ్‌లో పలు ప్రాంతాల్లో భారత్, చైనా దళాలు కొంతమేర వెనుతిరిగాయని భారత్ ప్రకటించిన క్రమంలో చైనా ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. సరిహద్దు ప్రతిష్టంభనకు శాంతియుతంగా తెరదించే క్రమంలో ఇరు దేశాల సేనలు వెనక్కిమళ్లాయా అని ప్రశ్నించగా సరిహద్దుల్లో ఉద్రిక్తతలను నివారించేందుకు ఇరు దేశాలు చర్యలు చేపడుతున్నాయని చునింగ్ వ్యాఖ్యానించారు. భారత్-చైనాలు ఇటీవల సరిహద్దు సమస్యలపై పరస్పర అవగాహనతో సంప్రదింపులు జరుపుతూ సానుకూల ఏకాభిప్రాయానికి వచ్చాయని ఆమె పేర్కొన్నారు. మరోవైపు నియంత్రణ రేఖ వెంబడి మోహరించిన 10 వేల బలగాలను పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ(పీఎల్ఏ) ఉపసంహరించుకున్నపుడే సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన పూర్తిగా తొలగిపోయే అవకాశం ఉందని భారత్ స్పష్టం చేసింది. చదవండి : ‘10 వేల బలగాలను చైనా వెనక్కి పిలవాలి’ -
వీడియోకాల్‌తో ‘కరోనా’ కన్సల్టేషన్
సాక్షి, హైదరాబాద్ : వీడియో కాల్స్ ద్వారా ఆన్లైన్లో కరోనా కన్సల్టేషన్ ప్రక్రియ దోహదపడుతుందని ప్రతిష్టాత్మక అంతర్జాతీయ బ్రిటిష్ మెడికల్ జర్నల్ (బీ ఎంజే) వెల్లడించింది. దీన్నే రిమోట్ కన్సల్టింగ్ అంటారు. కరోనా అనుమానితులు ఆస్పత్రులకు రాకుండానే, వారి లక్షణాలను ఆన్లైన్ ద్వారా అంచనా వేయొచ్చని, ఆయా లక్షణాలను బట్టి వారిని హోం క్వారంటైన్లో ఉంచొచ్చని తెలిపింది. వారి లక్షణాల తీవ్రతను బట్టి ఆస్పత్రికి రిఫర్ చేయొచ్చని పేర్కొంది. దీన్ని వైద్యులు ప్రోత్సహించాలని సూచించింది. వీడియో కాల్ (కొన్నిసార్లు టెలిఫోన్ ద్వారా) ద్వారా జరిగే ఈ కన్సల్టేషన్ ప్రక్రియ ద్వారా చాలావరకు కరోనా అనుమానితులు ఆస్పత్రులకు రాకుండానే చూడొచ్చని తెలిపింది. ఈ వీడియో కాల్ కరోనా కన్సల్టేషన్‌పై అంతర్జాతీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుండగా, కొన్ని దేశాల్లో అనేకమంది డాక్టర్లు దీన్ని అనుసరిస్తున్నారు. అనుమానిత లక్షణాలున్న వారిని అనవసరంగా ఆస్పత్రికి రప్పించడం, లక్షణాలుంటే ఇతరులకు సోకే ప్రమాదం ఉండటం వంటి కారణాల వల్ల వీడియో కన్సల్టేషన్ ప్రక్రియకు ప్రాధాన్యం ఏర్పడింది. ఒకవేళ వారికి లక్షణాలున్నట్లు అంచనాకు వస్తే, సంబంధిత కరోనా ఆస్పత్రికి రిఫర్ చేయడానికి వీలుంటుంది. పైగా వైరస్ విస్త్రృతంగా, వేగంగా వ్యాపిస్తున్న తరుణంలో వీడియో కన్సల్టేషన్ ప్రక్రియ మరింత ఉపయుక్తంగా ఉంటుందని బీఎంజే అభిప్రాయపడింది. వీడియో కాల్ ద్వారా వివరాల సేకరణ.. వైరస్ వ్యాప్తి విపరీతంగా ఉంది. కొన్ని ప్రైవేటు ఆస్పత్రులు కరోనా అనుమానితులను చూడటానికి కూడా ముందుకు రావట్లేదు. ఈ పరిస్థితుల్లో వీడియో కన్సల్టేషన్ ప్రక్రియ ప్రయోజనకరంగా ఉంటుంది. టెలిఫోన్ ద్వారా కూడా సమాచారం సేకరించొచ్చు కానీ, రోగిని నేరుగా ఆన్లైన్లో చూస్తేనే అంచనా వేయొచ్చని బీఎంజే సూచించింది. కరోనా లక్షణాల్లో ప్రధానమైనది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది. దగ్గు ఉంటుంది. అసాధారణ జ్వరం ఉంటుంది. అలసట, ఆకలి లేకపోవడం, నిరంతరం పొడి దగ్గు ఉంటుంది. ఆ తర్వాత తేలికపాటి విరేచనాలు వస్తాయి. కొన్ని సందర్భాల్లో ఛాతీ చాలా గట్టిగా అనిపిస్తుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఉండే వారిని వీడియో కాలింగ్ ద్వారా పరీక్షించే వీలుంటుంది. వీడియో కన్సల్టేషన్‌కు సంబంధించి కొన్ని మార్గదర్శకాలను బీఎంజే వెల్లడించింది. చదవండి: లాక్'డౌన్': ప్రజలు రోడ్లెక్కేశారు మార్గదర్శకాలు ఇవే.. – వీడియో కన్సల్టేషన్ ప్రతి అనారోగ్య సమస్యకు పరిష్కారం కాదు. అలాగే కరోనా నిర్ధారణ అయిన రోగి చికిత్స నిర్వహణకు దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు. – కరోనా అనుమానిత సాధారణ లక్షణాలున్న వారిని ఆన్లైన్లో చెక్ చేయడానికి వీలుంది. అత్యంత తేలికపాటి లక్షణాలు ఉన్నవారికైతే టెలిఫోన్ ద్వారా కూడా కన్సల్టేషన్ చేయొచ్చు. – వీడియో కాలింగ్‌లో అప్పటికే రోగికి సంబంధించిన వివిధ వైద్య పరీక్షల పత్రాలను నేరుగా డౌన్లోడ్ చేసి డాక్టర్‌కు ఆన్లైన్లో పంపొచ్చు. – కరోనా లక్షణాలు ఉన్నవారిని వీడియో కాలింగ్ ద్వారా పరీక్షించొచ్చు. రోగులు వీడియో ద్వారా డాక్టర్‌కు చెప్పడానికి ఇష్టపడతారు. – రోగితో వీడియో కాలింగ్‌కు ముందే రోగి వైద్య రికార్డులను ముందు పెట్టుకోవాలి. అంటే మధుమేహం, మూత్రపిండాలు లేదా కాలేయ వ్యాధి, గర్భం, లేదా కీమోథెరపీ, స్టెరాయిడ్స్ లేదా ఇతర రోగ నిరోధక మందులు తీసుకోవడం వంటివి, ధూమపానం, గుండె జబ్బులు, ఉబ్బసం వంటి వ్యాధులుంటే వాటి వైద్య పరీక్షల వివరాలను ముందే తెప్పించుకోవాలి. – వీడియో కాలింగ్ నాణ్యతతో వీడియో స్పష్టంగా కనిపించేలా చూడాలి. – రోగుల పరిస్థితిని గమనించాలి. వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారో గమనించాలి. పడుకున్నారా? కూర్చున్నారా? బాధపడుతున్నట్లు అనిపిస్తుందా? మాట్లాడటానికి ఇబ్బంది పడుతున్నారా? అనారోగ్యంగా కనిపిస్తున్నారా.. చూడాలి. – రోగి అనారోగ్యంగా అనిపిస్తే, నేరుగా సంబంధిత క్లినికల్ ప్రశ్నలు వేయాలి. తద్వారా వారి నుంచి సమాచారం రాబట్టాలి. మరింత తీవ్రమైన కేసుల్లో సాధారణంగా శ్వాసకోశ సమస్యలు అధికంగా ఉంటాయి. రోగనిరోధక శక్తి లేని రోగులు విలక్షణంగా కనిపిస్తారు. – జ్వరం ఎంతుందో అడగాలి. జ్వరం ఎన్నాళ్ల నుంచి వస్తుందో తెలుసుకోవాలి. సాధారణంగా జ్వరం 5 రోజులకు మించి ఉంటుంది. – కరోనా అనుమానిత రోగుల్లో ప్రధానంగా శ్వాసకోశ లక్షణాలను ఆన్లైన్లో అంచనా వేయడం కష్టమే. అయితే కొందరు వైద్యులు ఆన్లైన్లో కానీ, టెలిఫోన్లో గానీ రోగి మాట్లాడేటప్పుడు శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం పడుతుందో అంచనా వేయగలరు. అయితే తీవ్రమైన సందర్భంలో ఒక్కోసారి తప్పుదారి పట్టే అవకాశముంది. అందువల్ల రోగుల శ్వాస క్రియ సమస్యను వారి మాటల్లోనే వివరించాలని డాక్టర్లు అడగాలి. – మీ శ్వాస ఎలా ఉంది? ఎక్కువ మాట్లాడలేకపోతున్నారా? సాధారణం కంటే గట్టిగా లేదా వేగంగా ఊపిరి పీల్చుకుంటున్నారా? రోజువారీ కార్యకలాపాలన్నింటినీ ఆపేసేంత అనారోగ్యంతో ఉన్నారా? వంటి ప్రశ్నలు అడగాలి. మంచి వీడియో కనెక్షన్ ద్వారా శ్వాసకోశ రేటు కొలవడం సాధ్యమే అంటున్నారు. – కుటుంబంలో మరెవరైనా అనారోగ్యంతో ఉన్నారా అని అడగండి. – ముక్కు దిబ్బడ, కళ్ల కలక వంటివి ఉన్నాయో తెలుసుకోవాలి. చాలా మంది రోగుల్లో ఆకలి లేకపోవడం ప్రధానంగా ఉంటుంది. వాసన లక్షణాన్ని కోల్పోతారు. – ఒకవేళ లక్షణాలు సాధారణమైనవి అయితే మందులను సూచించాలి. హోం క్వారంటైన్లో ఉండాలని చెప్పాలి. కుటుంబసభ్యుల నుంచి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండాలని చెప్పాలి. – శారీరక పరీక్షలు ఆన్లైన్లో చేయలేరు. రిమోట్ కన్సల్టేషన్‌లో వ్యక్తిలో లక్షణాలు తీవ్రంగా ఉంటే వ్యక్తిగతంగా చూడాలి. అప్పుడు ఆస్పత్రికి రిఫర్ చేయాలి. -
పరిశ్రమ వర్గాలతో ప్రి–బడ్జెట్ సమావేశాలు
న్యూఢిల్లీ: వచ్చే ఏడాది ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే బడ్జెట్‌పై కేంద్రం కసరత్తు జరుపుతోంది. ఇందులో భాగంగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సోమవారం (నేడు) నుంచి పరిశ్రమవర్గాలు, రైతు సంఘాలు, ఆర్థికవేత్తలు మొదలైనవారితో సమావేశం కానున్నారు. వినియోగానికి, వృద్ధికి ఊతమిచ్చేందుకు తీసుకోతగిన చర్యల గురించి చర్చించనున్నారు. సోమవారం ప్రారంభమయ్యే ప్రి–బడ్జెట్ సమావేశాలు డిసెంబర్ 23 దాకా కొనసాగుతాయని, ఫిబ్రవరి 1న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. సోమవారం నాడు స్టార్టప్స్, ఫిన్‌టెక్, డిజిటల్ రంగ సంస్థలు, ఆర్థిక రంగం.. క్యాపిటల్ మార్కెట్ ప్రతినిధులతో ఆర్థిక మంత్రి సమావేశమవుతారు. వ్యాపారాల నిర్వహణను మరింత సులభతరం చేసేందుకు, ప్రైవేట్ పెట్టుబడులకు అనువైన పరిస్థితులు కల్పించేందుకు, వృద్ధికి ఊతమివ్వడానికి తీసుకోతగిన చర్యల గురించి వారి అభిప్రాయాలు తెలుసుకుంటారు. పరిశ్రమల సమాఖ్యలతో డిసెంబర్ 19న సమావేశమవుతారు. 2019–20 రెండో త్రైమాసికంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు ఆరేళ్ల కనిష్ట స్థాయి 4.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో.. రాబోయే బడ్జెట్లో ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే చర్యలపై మరింత దృష్టి పెట్టవచ్చని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇప్పటికే కార్పొరేట్ ట్యాక్స్‌లను గణనీయంగా తగ్గించినందున.. వేతనజీవులకు సంబంధించి వ్యక్తిగత ఆదాయ పన్ను రేట్లపరంగా ఊరటనిచ్చే చర్యలేమైనా ఉండొచ్చనే అంచనాలు నెలకొన్నాయి. వస్తువులు, సేవలకు డిమాండ్ పెంచే విధంగా ఆదాయ పన్ను పరిమితిని ప్రస్తుతమున్న రూ. 2.5 లక్షల నుంచి రూ. 5 లక్షలకు పెంచాలని పరిశ్రమవర్గాలు కోరుతున్నాయి. అలాగే, డిడక్షన్ పరిమితులను కూడా ప్రస్తుత రూ. 1.5 లక్షల నుంచి రూ. 3 లక్షలకు పెంచిన పక్షంలో.. పెట్టుబడులకు ఊతం లభించగలదని ఆశిస్తున్నాయి. -
ఆరెస్సెస్‌తో టచ్‌లో ఉండండి: బీజేపీ
న్యూఢిల్లీ: బీజేపీ బూత్ స్థాయి కార్యకర్తలు, నేతలు క్రమం తప్పకుండా ఆరెస్సెస్ శ్రేణులతో సంప్రదింపులు జరపాలని పార్టీ అధిష్టానం ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పార్టీ అగ్ర నాయకత్వం ఈ సూచనలు చేయగా ఆదివారం ఈ విషయం వెల్లడైంది. గతవారం ఢిల్లీలో ఆరెస్సెస్ మూడు రోజులపాటు నిర్వహించిన సదస్సులో ఆ సంస్థ చీఫ్ మోహన్ భాగవత్ మాట్లాడుతూ రాజకీయ పార్టీ కోసం పనిచేయాలని తాము ఆరెస్సెస్ కార్యకర్తలకు ఎప్పుడూ చెప్పలేదనడం గమనార్హం -
విధులకు దూరంగా ఉండాలి
న్యూఢిల్లీ: ఏడు ప్రతిపక్ష పార్టీలు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) దీపక్ మిశ్రాపై అభిశంసన నోటీసులు ఇచ్చినందున ఆయన న్యాయవిధులకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ కోరింది. గతంలో అభిశంసనను ఎదుర్కొన్న న్యాయమూర్తులు వారిపై వచ్చిన ఆరోపణలు తొలగిపోయే వరకు విధులకు దూరంగా ఉన్నారనీ, జస్టిస్ దీపక్ మిశ్రా కూడా ఆ సంప్రదాయాన్ని పాటించాలని కాంగ్రెస్ పేర్కొంది. సీజేఐకి బీజేపీ మద్దతు తెలపడంపైనా కాంగ్రెస్ మండిపడింది. అత్యున్నత న్యాయస్థానంలోని ప్రధాన న్యాయమూర్తి పదవిని బీజేపీ స్వార్థ ప్రయోజనాలకు వాడుకుంటోందని ఆరోపించింది. ‘తన పదవిని రాజకీయాల కోసం వాడుకోవద్దని బీజేపీకి సీజేఐ చెప్పాలి’ అని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణ్‌దీప్ సుర్జేవాల అన్నారు. ‘సీజేఐ తనపై ఏ అనుమానాలూ రాకుండా చూసుకోవాలి. ప్రవర్తనపై అనుమానాలు వచ్చినప్పుడు విధుల నుంచి తప్పుకుని విచారణకు సహకరించి తన సచ్ఛీలతను నిరూపించుకోవాల్సిన నైతిక బాధ్యత లేదా?’ అని ప్రశ్నించారు. మరోవైపు అభిశంసన కోసం ఇచ్చిన నోటీసును రాజ్యసభ అధ్యక్షుడు వెంకయ్య నాయుడు తిరస్కరిస్తే సుప్రీంను ఆశ్రయించాలని కాంగ్రెస్, ఇతర పార్టీలు భావిస్తున్నాయి. రాజ్యాంగం ప్రకారం ఎలాంటి గడువూ లేకపోయిన రాజ్యసభ చైర్మన్ నోటీసును అట్టిపెట్టుకోకూడదని న్యాయ నిపుణుడొకరు వ్యాఖ్యానించారు. సంప్రదింపులు ప్రారంభించిన వెంకయ్య అభిశంసన నోటీసులపై సంప్రదింపుల ప్రక్రియను వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజ్యాంగ, న్యాయ నిపుణులతో ఆదివారం చర్చలు జరిపారు. హైదరాబాద్ పర్యటనను అర్థాంతరంగా ముగించుకుని ఢిల్లీ చేరుకున్న ఆయన.. అటార్నీ జనరల్ కేకే వేణుగోపాల్, మాజీ ఏజీ పరాశరణ్, లోక్‌సభ మాజీ సెక్రటరీ జనరల్ సుభాష్ కశ్యప్, న్యాయశాఖ మాజీ కార్యదర్శి పీకే మల్హోత్రా తదితరులతో మాట్లాడారు. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి సుదర్శన్ రెడ్డిని కూడా సంప్రదిస్తారని సమాచారం. -
మంత్రి పరామర్శ
జైనథ్ : మండలంలోని భోరజ్ గ్రామానికి చెందిన పొద్దుటూరి సుభద్రబాయి ఆదివారం ఉదయం మృతి చెందడంతో రాష్ట్ర అటవీ, పర్యావరణ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న భోరజ్ గ్రామానికి చేరుకొని బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఏఎంసీ వైస్ చైర్మెన్ ఎల్టి భూమారెడ్డి సమీప బంధువు అయిన సుభద్రబాయి వయసు పైబడంతో మృతి చెందింది. పరామర్శలో భాగంగా మంత్రి మృతురాలి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. మంత్రి వెంట నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి, అడ్డి భోజారెడ్డి, తల్లెల చంద్రయ్య, పెందూర్ దేవన్న, సర్సన్ లింగా రెడ్డి, తదితరులు ఉన్నారు. -
4 నుంచి బడ్జెట్ ముందస్తు సంప్రదింపులు
న్యూఢిల్లీ: ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ జనవరి 4వ తేదీ నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం (2016-17) బడ్జెట్‌కు సంబంధించి పరిశ్రమ, వాణిజ్య సంఘాలు, ఆర్థికవేత్తలుసహా పలు వర్గాల నుంచి అభిప్రాయాలను తెలుసుకోనున్నారు. ఫిబ్రవరి చివర్లో ఆయన తన రెండవ పూర్తి స్థాయి బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెట్టనున్న సంగతి తెలిసిందే. ఆర్థిక మంత్రిత్వశాఖ గురువారం విడుదల చేసిన ప్రకటన ప్రకారం జైట్లీ వివిధ రంగాల ప్రతినిధులతో జనవరిలో సంప్రదింపులు జరిపే తేదీలను పరిశీలిస్తే... 4: వ్యవసాయం, వాణిజ్య సంఘాల ప్రతినిధులు 5: ఆర్థికవేత్తలు 6: పారిశ్రామికవర్గాలు 7: ఐటీ రంగం ప్రతినిధులు 11: ఫైనాన్షియల్ రంగం రెగ్యులేటర్లు 12: బ్యాంకులు ఇతర ఆర్థిక సంస్థల ప్రతినిధులు ఆన్లైన్లో కూడా: బడ్జెట్ రూపకల్పనపై ఆన్లైన్లో కూడా సూచనలు అందించడానికి కేంద్రం వీలు కల్పిస్తోంది. ఇందుకు జ్ట్టిఞ:// ఝడజౌఠి.జీఛి.జీఞౌట్ట్చను వినియోగించుకోవాలని ఆర్థిక శాఖ విజ్ఞప్తి చేసింది. -
ఐ ఫోన్ డెలివరీ!
చదివింత... సత్యవర్షి ‘‘గుప్పిట్లోకి ప్రపంచాన్నే తెచ్చేస్తా... గుట్టుగా ప్రసవమూ చేయించేస్తా’’ నంటోంది మొబైల్ టెక్నాలజీ. న్యూజెర్సీ నివాసి రివెరా స్వీయానుభవమిది. మధ్య వయస్కురాలైన రివెరా నిండు గర్భిణిగా రెగ్యులర్ చెకప్స్ కోసం డాక్టర్ మీనా దేవెళ్లను కలిసేందుకు వెళ్లింది. అయితే అపాయింట్మెంట్ ఇచ్చిన ఆ డాక్టర్ అనుకోకుండా వేరే చోట ఉన్న ఆసుపత్రిలో ఉండిపోవాల్సి వచ్చింది. అదే సమయంలో రివెరాకి పురిటి నొప్పులు రావడం మొదలయ్యాయి. అప్పుడా కన్సల్టేషన్ క్లినిక్‌లో దిగువ స్థాయి సిబ్బంది తప్ప వైద్య నిపుణులు ఎవరూ లేరు. అంత గాభరాలోనూ కాస్త స్థిమితంగా ఆలోచించిన రివెరా భర్త... ‘‘ఐఫోన్ ఉండగా... డాక్టరెందుకు దండగా’’ అంటూ అప్పటికప్పుడు తన ఐఫోన్‌ను సమయోచితంగా ఉపయోగించాడు. తమ డాక్టర్‌కు ఫేస్‌టైమ్‌ను కనెక్ట్ చేశాడు. వీడియో మెసేజింగ్ యాప్ ద్వారా డాక్టర్ ప్రత్యక్షంగా ఇస్తున్న సూచనలతో సిబ్బంది రివెరాకి సుఖప్రసవం జరిగేలా చూశారు. మొత్తం మీద ఇరవై నిమిషాల వ్యవధిలో ప్రసవం జరిగిపోవడం, పండంటి మగబిడ్డ రివెరా ఒడిలోకి చేరిపోవడం జరిగిపోయాయి. -
పీఎంఓ యాప్‌పై సలహాల కోసం పోటీ
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి కార్యాలయం(పీఎంఓ) కోసం ఓ మొబైల్ ఫోన్ యాప్‌ను అభివృద్ధి పరచేందుకు ప్రజల నుంచి సలహాలు స్వీకరించడానికి ప్రభుత్వం ఆన్లైన్ సెర్చింజన్ గూగుల్‌తో కలసి బుధవారం ఓ పోటీ ప్రారంభించింది. అప్లికేషన్ నిర్మాణం, అందులో ఏం ఉండాలన్నదానిపై సూచనల కోసం దీన్ని నిర్వహిస్తున్నట్లు పోటీ ప్రారంభించిన సమాచార, సాంకేతిక మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు. రెండు నెలల్లో ఈ యాప్ రూపొందుతుందన్నారు. ‘మైగవ్’ వెబ్సైట్లో పేర్లు నమోదు చేయించుకున్న వారందరూ ఈ పోటీకి అర్హులు. -
రోగులపై ప్రై‘వేటు’
రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ ఫీజులు 30 శాతం వరకు పెంపు పెరిగిన నిర్వహణ భారం తప్పదంటున్న ఆస్పత్రి యాజమాన్యాలు సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ప్రభుత్వ ఆస్పత్రుల్లో అర కొర వసతులు, వైద్యుల కొరత...తదితర కారణాల వల్ల పేదలు సైతం ప్రైవేట్ ఆస్పత్రుల వైపు చూస్తున్న తరుణంలో వాటిల్లో ఫీజులు పెరిగిపోయాయి. నగరంలోని అనేక ఆస్పత్రులు రిజిస్ట్రేషన్, కన్సల్టేషన్ ఫీజులను పది నుంచి 30 శాతం వరకు పెంచేశాయి. ఈ నెల ఒకటో తేదీ నుంచే పెంచిన ఫీజులను వసూలు చేస్తున్నారు. అన్ని ధరలు పెరుగుతున్న దశలో ఆస్పత్రుల్లో ఫీజులను పెంచడం సహేతుకమేనని ప్రైవేట్ యాజమాన్యాలు తమ నిర్ణయాన్ని సమర్థించుకుంటున్నాయి. ఆస్పత్రి నిర్వహణా ఖర్చులు, వైద్యుల వేతనాలు, సర్జరీ ఖర్చులు పెరిగినందున అదే నిష్పత్తిలో ఫీజులను పెంచక తప్పలేదని చెబుతున్నాయి. హెబ్బాళలోని కొలంబియా ఏషియా ఆస్పత్రి, బాప్టిస్ట్, పాత విమానాశ్రయం రోడ్డులోని మణిపాల్, ఎంఎస్ఆర్ నగరలోని ఎంఎస్. రామయ్య, తిలక్ నగరలోని సాగర్, నృపతుంగ రోడ్డులోని సెయింట్ మార్తాస్ ఆస్పత్రుల్లో ఫీజులు పెరిగాయి. నారాయణ హృదయాలయలో అనేక పరీక్షలకు సంబంధించిన ఫీజులను గత జనవరి నుంచే 10 నుంచి 15 శాతం పెంచారు. పెరిగిన ఛార్జీల అనంతరం...హాస్‌మాట్ ఆస్పత్రిలో వివిధ రోగాలకు సంబంధించి కన్సల్టేషన్ ఫీజులు రూ.250 మొదలు రూ.550 వరకు ఉన్నాయి. = విఠల్ మల్య ఆస్పత్రిలో కన్సల్టేషన్ ఫీజును రూ.400, రిజిస్ట్రేషన్ ఛార్జీని రూ.100గా నిర్ణయించారు. ఆపోలో ఆస్పత్రి కూడా ఫీజులను పెంచే దిశగా యోచిస్తోంది. ఎక్కడెక్కడ.. ఎంతెంత... = బాప్టిస్ట్ ఆస్పత్రిలో సాధారణ కన్సల్టేషన్ ఫీజు రూ.50 నుంచి రూ.70కి పెరిగింది. రెండోసారి కన్సల్టేషన్ ఫీజు రూ.30 నుంచి రూ.50కి పెంచారు. ఇతర కన్సల్టేషన్ ఫీజును రూ.175 నుంచి రూ.250కి పెంచారు. = కొలంబియా ఏషియా ఆస్పత్రిలో రూ.500 నుంచి రూ.600 = రామయ్య ఆస్పత్రిలో రూ.300 నుంచి రూ.350 = సాగర్ ఆస్పత్రిలో రూ.250 నుంచి రూ.300కు, రూ.350 నుంచి రూ.450కు పెరిగాయి. = మణిపాల్ ఆస్పత్రిలో గతంలో రూ.400, రూ.500 ఉన్న కన్సల్టేషన్ ఫీజును రూ.వంద చొప్పున పెంచారు. -
దళితులు,బలహీన వర్గాల మేధావులతో రాహుల్ భేటీ