![Minister Sabitha Indra Reddy Consultation Women In Hyderabad - Sakshi](/styles/webp/s3/article_images/2021/02/13/Sabitha-Indra-Reddy.jpg.webp?itok=ZuAtN0c5)
మణికొండ: రోడ్డుపక్కన ఎండలో అచేతనంగా పడి ఉన్న ఓ మహిళను విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి పరామర్శించి వివరాలు ఆరా తీశారు. శుక్రవారం మంత్రి చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్యతో కలిసి శంకర్‌పల్లి మండల పర్యటనకు వెళ్తుండగా మార్గమధ్యలో లంగర్‌హౌస్ టిప్పుఖాన్‌పూల్ ప్రాంతంలో రోడ్డు పక్కన ఓ మహిళ పడి ఉండటాన్ని గమనించారు. కాన్వాయ్‌ను ఆపాలని ఆదేశించగా అప్పటికే కాన్వాయ్ ముందుకు వెళ్లటంతో డివైడర్ వద్ద యూటర్న్ తీసుకుని తిరిగి వచ్చి మహిళతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. ఆమెకు మాటలు రావని సైగలతో చెప్పడంతో నీళ్లు తాగించి నీడలోకి వెళ్లాలని సూచించారు.
చదవండి: తరగతి గదిలో విద్యార్థి ఆత్మహత్య
Comments
Please login to add a commentAdd a comment