
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలపై బోర్డు స్పష్టత ఇచ్చిం. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది. ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను రేపు(మంగళవారం) విడుదల చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారని ఆయన తెలిపారు. పరీక్షలు మే 23న పూర్తికాగా, పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్ విడుదల చేసినప్పుడే ఇంటర్ బోర్డు ప్రకటించింది.
చదవండి: సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్’.. సాయం పొందండిలా!
ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ నాటికే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, కొన్ని జిల్లాల్లో మార్కుల క్రోడీకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో సమాధాన పత్రాలను అనేక సార్లు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. చివరకు ఈ నెల 25న ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు తగ్గడంపై ప్రభుత్వం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా ప్రభుత్వ స్థాయిలో కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి.
ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.
Comments
Please login to add a commentAdd a comment