Inter results
-
సర్కారు మెప్పు కోసం.. విద్యార్థులకు ముప్పు!
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియెట్ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో అధికారులు కొత్త విధానాలను అనుసరిస్తున్నారు. ప్రభుత్వం మెప్పు కోసం వేగంగా ఫలితాలు వెల్లడించేందుకు రికార్డు సమయంలో జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నట్టు తెలుస్తోంది. ఒక లెక్చరర్‌తో పరిమితికి మించి బుక్లెట్లు వేల్యుయేషన్ చేయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఈ క్రమంలో మూల్యాంకనం షెడ్యూల్‌ను కూడా అధికారులు కుదించారు. మార్చి 17 నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు మూల్యాంకనం షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు ఖరారు చేసింది. అయితే, రెండుసార్లు ఈ షెడ్యూల్‌ను మార్చేసి ఏప్రిల్ 3 నాటికి మొత్తం ప్రక్రియ పూర్తి చేయాలని తాజాగా ఆదేశించినట్టు సమాచారం. ఆ తక్కువ సమయంలో జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేశామన్న గొప్ప కోసం... ఏదైనా పొరపాటు జరిగి మార్కులు తప్పుగా నమోదైతే విద్యార్థుల జీవితాలు నాశనమవుతాయనే విషయాన్ని విస్మరించారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇంటర్లో లిమిట్ 30.. టార్గెట్ 45 జవాబు పత్రాలుఇంటర్మీడియెట్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఈ నెల 7న ప్రారంభించారు. మొదటి పరీక్షగా నిర్వహించిన సంస్కృతం జవాబు పత్రాల మూల్యాంకనం ఆ రోజే పూర్తి చేశారు. ఇంగ్లిష్‌తోపాటు ఇతర పరీక్షల పేపర్ల మూల్యాంకనం ఈ నెల 17న ప్రారంభించి విడతల వారీగా ఏప్రిల్ 8 నాటికి పూర్తి చేయాలని తొలుత షెడ్యూల్ నిర్ణయించారు. కానీ, తర్వాత తుది గడువును ఏప్రిల్ 5కి మార్చారు. తాజాగా 3వ తేదీకి కుదించినట్టు అధ్యాపకులు చెబుతున్నారు. మూల్యాంకనంలో రోజుకు ఒక ఎగ్జామినర్ (లెక్చరర్) ఉదయం 15, మధ్యాహ్నం 15... మొత్తం 30 జవాబు పత్రాలనే దిద్దాలనేది నిబంధన. ఇలా చేస్తే ఎక్కడా పొరపాట్లు జరిగే అవకాశం ఉండదు. కానీ, ఈసారి 30 జవాబు పత్రాలే దిద్దాలని చెప్పినా... ఎగ్జామినర్లపై ఒత్తిడి తెచ్చి అదనంగా మరో 15 జవాబు పత్రాలను మూల్యాంకనం చేయిస్తున్నారు. ఫలితాలు త్వరగా ఇవ్వాలనే ఉద్దేశంతో నిబంధనలకు తూట్లు పొడిచి విద్యార్థుల భవిష్యత్‌కు నష్టం కలిగేలా ఎక్కువ పేపర్లు దిద్దించడంపై లెక్చరర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఒత్తిడిలో జవాబు పత్రాల్లో మార్కులు తప్పుగా నమోదై ఒక్క పేపర్ తప్పినా విద్యార్థికి తీవ్ర నష్టం కలుగుతుందని చెబుతున్నారు. -
ఫలితాల్లో సర్కార్ కాలేజీల సత్తా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ప్రైవేటు కాలేజీలకు ఏమాత్రం తీసిపోని విధంగా ప్రభుత్వ కాలేజీలు సత్తా చాటాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం తగ్గినా అత్యధిక మార్కులు కైవసం చేసుకున్నారు. ప్రభుత్వ రెసిడెన్షియల్ గురుకులాలు, కేజీబీవీలు ప్రైవేటు కాలేజీలను మించి ఫలితాలు సాధించాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీల నుంచి 77,022 మంది పరీక్ష రాస్తే 37,842 (49.13%) పాసయ్యారు.గురుకులాలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల నుంచి 80,331 మంది విద్యార్థులు ఇంటర్ సెకండియర్ పరీక్షలు రాయగా 59,530 (74.11%) మంది పాసయ్యారు. ప్రైవేటు కాలేజీల నుంచి 3,44,724 మంది పరీక్షలు రాస్తే వారిలో 2,23,911 (65.24%) మందే పాసవడం గమనార్హం. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లోని విద్యార్థుల్లో కొందరు రాష్ట్రంలోనే అత్యధిక మార్కులు సాధించారు. -
ఒక్క క్లిక్‌తో తెలంగాణ ఇంటర్ ఫలితాలు
కింద ఇవ్వబడిన లింక్స్‌తో ఇంటర్ ఫలితాలు ఒక్క క్లిక్‌తో చెక్ చేసుకోండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..ఇంటర్ సెకండ్ ఇయర్ ఒకేషనల్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. -
కర్నూలు విద్యార్థినిపై సమంత ప్రశంసలు... పోస్ట్ వైరల్!
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం సిటాడెల్ వెబ్ సిరీస్ ఇండియన్ వర్షన్లో కనిపించనుంది. బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ సరసన నటిస్తోంది. గతేడాది శాకుంతలం, ఖుషి సినిమాలతో అలరించింది. మయోసైటిస్ వ్యాధి నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే రీ ఎంట్రీతో అదరగొడుతోంది. తాజాగా సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించింది. ఏపీలోని కర్నూలు జిల్లాకు చెందిన నిర్మలను కొనియాడింది. ఈ రోజుల్లో తనే నాకు ఆదర్శం అంటూ ఇన్‌స్టా స్టోరీస్‌లో పోస్ట్ చేసింది. అంతే కాకుండా ప్రముఖ పత్రిక క్లిప్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. స్టార్ హీరోయిన్ సమంత ఇంటర్ విద్యార్థినిపై ప్రశంసలు కురిపించడంతో సామ్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. కాగా.. ఇటీవల రిలీజైన ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో ఆలూరు కేజీబీవీలో చదివిన ఎస్ నిర్మల బైపీసీలో 440 కి 421 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. బాల్య వివాహం నుంచి తప్పించుకుని మరీ తానేంటో నిరూపించుకుంది. అంతేకాదు ఐపీఎస్ ఆఫీసర్ కావాలని లక్ష్యంగా పెట్టుకుంది. అంతే కాదు నిర్మల పదో తరగతిలోనూ 537 మార్కులు సాధించింది. నిరుపేదలైన నిర్మల తల్లిదండ్రులకు నలుగురు కుమార్తెలు, వీరిలో ముగ్గురికి ఇప్పటికే వివాహాలైనాయి. ఆర్థిక ఇబ్బందులను సాకుగా చూపి నిర్మలకి కూడా చిన్నతనంలోనే వివాహంచేయాలని భావించారు. కానీ చదువుకోవాలన్నపట్టుదలతో పోరాడి బాల్య వివాహంనుంచి తప్పించుకుంది. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని పరీక్షలో టాపర్‌గా నిలిచి తానేమిటో నిరూపించుకుంది. -
సర్కారు చేయూత.. చదువుల తల్లి కల సాకారం
ఆదోని రూరల్/ఆస్పరి: చదువుల్లో అత్యుత్తమంగా రాణిస్తున్న ఆ బాలికను పేదరికంతో తల్లిదండ్రులు చదువు మానిపించారు. ఆ చదువుల తల్లి పదో తరగతిలో 537 మార్కులు సాధించినా.. ఉన్నత చదువులు చదవాలనే ఆశ ఉన్నా.. ఆ ర్థిక పరిస్థితుల రీత్యా చదువుకు దూరమైంది. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ‘గడప గడపకు మన ప్రభుత్వం’ ఆమెకు వరమైంది. ఈ కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాదరెడ్డి గతేడాది జూన్‌లో బాలిక ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో తాను చదువుకుంటానంటూ బాలిక ఆయనకు మొరపెట్టుకోవడంతో ఎమ్మెల్యే ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేక చొరవ తీసుకున్నారు. బాలికను కర్నూలు జిల్లా ఆస్పరి కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయం(కేజీబీవీ)లో చేర్పించారు. అడుగడుగునా ప్రభుత్వ ప్రోత్సాహం అందించడంతో తాజాగా విడుదలైన మొదటి ఏడాది ఇంటర్ ఫలితాల్లో బైపీసీ విభాగంలో 440 మార్కులకు 421 మార్కులు సాధించి ఆ బాలిక టాపర్‌గా నిలిచింది. ‘కార్పొరేట్ కళాశాలల్లో చదివితేనే ఎక్కువ మార్కులు’ అనే అపోహను తుడిచిపెట్టేసి ప్రభుత్వ విద్యాసంస్థలో చదివి అత్యుత్తమ మార్కులను సొంతం చేసుకుంది. వైఎస్ జగన్ ప్రభుత్వ ప్రోత్సాహంతో ఐపీఎస్ సాధించడమే లక్ష్యంగా ముందుకెళ్తోంది చదువుల తల్లి నిర్మల. కూలి పనుల నుంచి కాలేజీకి పంపిన ప్రభుత్వం కర్నూలు జిల్లా ఆదోని మండలం పెద్దహరివాణం గ్రామానికి చెందిన నిరుపేద దంపతులు హనుమంతమ్మ, శీనప్ప దంపతులకు నలుగురు ఆడపిల్లలు. ముగ్గురు కుమార్తెలకు పెళ్లిళ్లు చేసి అత్తారింటికి పంపించారు. నాలుగో కుమార్తె నిర్మలను స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి వరకు చదివించారు. పదో తరగతిలో 600కి 537 మార్కులు సాధించి నిర్మల సత్తా చాటింది. అయితే నిరుపేద కుటుంబం కావడంతో ఉన్నత చదువులు చదివించేందుకు నిర్మల తల్లిదండ్రులకు ఆ ర్థిక స్థోమత సరిపోలేదు. దీంతో ఆమెను చదువు మానిపించి తమతోపాటే కూలిపనులకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన.. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా ఆదోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి, అధికారులు ఆమె ఇంటికి వెళ్లారు. ఈ క్రమంలో ఇంటిలోనే ఉన్న నిర్మల ‘సార్ నేను చదుకుంటాను. నాకు సీటు ఇప్పించండి. మా అమ్మానాన్నలు పేదవాళ్లు. డబ్బులు పెట్టి చదివించలేని పరిస్థితి’ అని వేడుకుంది. చలించిపోయిన ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డి వెంటనే ఆమెను కాలేజీలో చేర్పించాలని అప్పటి ఎంపీడీవో గీతావాణి, తహసీల్దార్ వెంకటలక్షి్మని ఆదేశించారు. మరోవైపు నిర్మలపై ‘సాక్షి’లో కథనం రావడంతో కర్నూలు జిల్లా కలెక్టర్ సృజన నిర్మలను తన కార్యాలయానికి పిలిపించారు. నిర్మల ఉన్నత చదువులకు ప్రభుత్వం సాయం అందిస్తుందని చెప్పి ఆమెను ఆస్పరి కేజీబీవీలో చేర్పించారు. ప్రభుత్వం అండగా నిలవడంతో రూపాయి కూడా ఫీజు కట్టకుండానే నిర్మల చదువుకుంది. అంతేకాకుండా ఆమెకు మెటీరియల్, పుస్తకాలను కూడా కలెక్టర్ అందించారు. ప్రభుత్వ ప్రోత్సాహంతో ఓవైపు చదువుల్లోనే కాకుండా మరోవైపు ఆటల్లోనూ నిర్మల రాణిస్తోంది. గతేడాది కబడ్డీ పోటీల్లో రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికైంది. ఈ క్రమంలో నిర్మలను జిల్లా కలెక్టర్ సృజన ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ కావాలన్నదే నా జీవిత ఆశయం ఎమ్మెల్యే సాయిప్రసాద్‌రెడ్డితో పాటు జిల్లా కలెక్టర్ సృజన నన్ను ఎంతగానో ప్రోత్సహించారు. కలెక్టర్ మాటలను ఎప్పటికీ మర్చిపోలేను. నా చదువుకు మేడమ్ అన్నివిధాల సహకరిస్తున్నారు. ఐపీఎస్ కావాలన్నదే నా లక్ష్యం. – నిర్మల, విద్యా ర్థిని చాలా గర్వంగా ఉంది.. నిర్మల ఎంతో క్రమశిక్షణతో ఉంటుంది.. పాఠ్యాంశాలపై ఆసక్తి చూపుతోంది. స్టేట్ ప్రాజెక్టు డైరెక్టర్ రూపకల్పన చేసిన పంచతంత్ర ప్రోగ్రామ్ ద్వారా డైలీ, వీక్లీ, గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహిస్తున్నాం. నిరంతర మూల్యాంకనంతోపాటు విద్యార్థుల సందేహలను నివృత్తి చేస్తున్నాం. ఈ టెస్ట్‌ల్లో నిర్మల మంచి మార్కులు తెచ్చుకుంది. ఆమె సాధిస్తున్న విజయాల పట్ల ఎంతో గర్వంగా ఉంది. – శారున్ స్మైలీ, ప్రిన్సిపాల్, కేజీబీవీ, ఆస్పరి, కర్నూలు జిల్లా -
ఫలించిన ప్రభుత్వ కృషి.. దుమ్ములేపిన ప్రభుత్వ కళాశాలలు
సాక్షి, అమరావతి/సాక్షి, నెట్వర్క్: ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు సత్తా చాటాయి. కార్పొరేట్, ప్రైవేటు కళాశాలలను మించిన ఫలితాలను సాధించి ఔరా అనిపించాయి. వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకున్న చర్యలే ఇందుకు కారణమని విద్యావేత్తలు విశ్లేషిస్తున్నారు. నాడు–నేడు కింద ప్రభుత్వ పాఠశాలల్లో సకల సౌకర్యాలను కల్పించిన ప్రభుత్వం ప్రభుత్వ కళాశాలలను కూడా అభివృద్ధి చేసింది. వాటిలో చదువుకుంటున్న విద్యార్థులకు జగనన్న అమ్మఒడి పథకాన్ని అందించింది. ప్రతి మండలంలో ఒక జూనియర్ కళాశాలను ఏర్పాటు చేసింది. ప్రభుత్వ హైస్కూళ్లను హైస్కూల్ ప్లస్‌గా అప్‌గ్రేడ్ చేసి వాటిలో ఇంటర్మీడియెట్ కోర్సులను ప్రవేశపెట్టింది. దీంతో గతంలో మండల కేంద్రాల్లో కళాశాలలు లేక చదువుమానేసే విద్యార్థులకు తమ నివాసాలకు సమీపప్రాంతాల్లోనే కళాశాలలు అందుబాటులోకి వచ్చాయి. అలాగే ఇంటర్మీడియెట్ పరీక్షలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ప్రభుత్వం ప్రత్యేక తరగతులు సైతం నిర్వహించింది. ఈ చర్యలన్నీ ఫలించి కార్పొరేట్ కళాశాలలు బిత్తరపోయేలా ప్రభుత్వ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో అత్యుత్తమ మార్కులతో రికార్డులు సృష్టించారు. టాపర్‌గా తహురా అన్నమయ్య జిల్లా మదనపల్లె రాజీవ్‌నగర్‌కు చెందిన షేక్ రియాజ్ అలీ, షేక్ నూర్‌భాను కుమార్తె షేక్ తహురా స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో ఇంటర్ ఎంపీసీ చదివింది. తాజా ఫలితాల్లో 979 మార్కులతో టాపర్‌గా నిలిచింది. ♦ కృష్ణా జిల్లా మొవ్వలో క్షేత్రయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల జనరల్ కోర్సుల్లో 91.26 శాతం, వృత్తి విద్యా విభాగంలో 92.9 శాతం ఉత్తీర్ణతను సాధించింది. కళాశాల విద్యార్థులు ఎన్.హర్షిత (ఎంఈటీ)968, శ్రీవిద్య(ఎంపీసీ) 963, పి.శ్రావ్య (బైపీసీ) 953 మార్కులతో సత్తా చాటారు. అలాగే అవనిగడ్డ ప్రభుత్వ జూనియర్ కళాశాలకు చెందిన సెకండ్ ఇయర్ విద్యార్థి ని ఎం.శ్వేత ఎంపీసీలో 951 మార్కులతో టాపర్‌గా నిలిచింది. చల్లపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల విద్యాలయంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థినులు 92 శాతం, ఫస్టియర్ విద్యార్థి నులు 87.5 శాతం ఉత్తీర్ణత సాధించారు. ♦ పార్వతీపురం మన్యం జిల్లా జియ్యమ్మవలస మండలం కన్నపుదొరవలసకు చెందిన బర్ల లలిత ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కు 435 మార్కులు సాధించి జిల్లాలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఆమె తల్లిదండ్రులు సుశీల, సంగమేష్ భవన నిర్మాణ కూలీలు. లలిత విజయనగరంలోని నెల్లిమర్ల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుతూ ఈ ఫలితాలను సాధించింది. ♦ ఏలూరు జిల్లా నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి హెచ్.అజయ్ రాజు సీనియర్ ఇంటర్ ఎంపీసీలో 985 మార్కులతో జిల్లా టాపర్‌గా నిలిచాడు. అలాగే పెదపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థి ని జి.కళ్యాణి ఎంపీసీలో 975 మార్కులతో ఏలూరు జిల్లాలో సెకండ్ ర్యాంక్ దక్కించుకుంది. బుట్టాయగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని ఎస్. కళ్యాణి ఎంఎల్‌టీలో 961 మార్కులతో తృతీయ స్థానంలో నిలిచింది. నూజివీడు, కలిదిండి, ఆగిరిపల్లి, బుట్టాయగూడెం, జంగారెడ్డిగూడెం, నారాయణపురం ప్రభుత్వ జూనియర్ కళాశాలలు కూడా మంచి ఫలితాలను సాధించాయి. ♦ చిత్తూరు జిల్లాలోని పెనుమూరు మండలం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సీనియర్ ఇంటర్ ఎంపీసీ చదువుతున్న దీక్షిత 975 మార్కులతో సత్తా చాటింది. చిత్తూరు నగరంలోని పీసీఆర్ ప్రభుత్వ కళాశాలలో ద్వితీయ సంవత్సరం సీఈసీలో నందిని 966, ఎంపీసీలో నందిని 945 మార్కులతో దుమ్ములేపారు. అలాగే పలమనేరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్ గురుకుల కళాశాల, రామకుప్పం కళాశాల, చిత్తూరు ఏపీఎస్‌డబ్ల్యూఆర్, కుప్పం ఏపీఎస్‌డబ్ల్యూఆర్ కళాశాలల విద్యార్థులు కూడా అత్యుత్తమ మార్కులు సాధించారు. ఏపీ మోడల్ స్కూల్స్ అదుర్స్.. ఇంటర్ వార్షిక పరీక్షల ఫలితాల్లో ఏపీ మోడల్ స్కూళ్ల విద్యార్థులు సంచలనాలు సృష్టించారు. గతేడాది కంటే మెరుగైన ఫలితాలు సాధించడంతో పాటు అధిక మార్కులు సొంతం చేసుకున్నారు. ఈ ఏడాది రాష్ట్రంలోని 162 ఏపీ మోడల్ స్కూల్స్ నుంచి ఇంటర్ మొదటి సంవత్సరం 10,121 మంది పరీక్షలకు హాజరవగా 6,244 మంది (62 శాతం) ఉత్తీర్ణులయ్యారు. అలాగే ఇంటర్ సెకండియర్ 9,896 మంది పరీక్షలకు హాజరవగా 7,017 మంది (71 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. నంద్యాల జిల్లా మిడ్తూరు, అనంతపురం జిల్లా రాప్తాడు, ప్రకాశం జిల్లా దర్శి, నెల్లూరు జిల్లా నందవరం, శ్రీకాకుళం జిల్లా రాజపురం మోడల్ స్కూళ్లు సంచలన ఫలితాలను సాధించాయి. కేజీబీవీలు కేక కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు (కేజీబీవీ) సైతం ఈసారి ఇంటర్ ఫలితాల్లో దుమ్ములేపాయి. కర్నూలు జిల్లా గూడూరు కేజీబీవీలో ఫస్టియర్ విద్యార్థి ని జి.విజయలక్ష్మి(ఎంపీసీ) 462/470 మార్కులతో సత్తా చాటింది. సీఈసీలో వి.నాగేశ్వరి 459, అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో యు.మానస 495, కంప్యూటర్ సైన్స్‌లో ఎం.యమున 494, ఎస్.హజీరాభాను 490 మార్కులు సాధించారు. సెకండియర్ ఫలితాల్లో మార్కాపురం కేజీబీవీ విద్యార్థి జి.లక్ష్మి అకౌంట్స్ అండ్ ట్యాక్సేషన్‌లో 980, విజయనగరం జిల్లా వేపాడ విద్యార్థి ని కంప్యూటర్ సైన్స్ డిప్లొమాలో 978, పల్నాడు జిల్లా నకరికల్లు విద్యార్థి ని జె.లక్ష్మీప్రసన్న (ఎంపీసీ) 978, శ్రీకాకుళం కేజీబీవీ విద్యార్థి ని బి.హేమలత (ఎంపీసీ) 973, నర్సీపట్నం కేజీబీవీ విద్యార్థిని వి.నాగలక్ష్మి (బైపీసీ) 973 మార్కులతో రికార్డు సృష్టించారు. శాంతిపురం కేజీబీవీలో సీఈసీ ప్రథమ సంవత్సరం మాధవి 500కు 480, కేజీబీవీ కుప్పంలో జయంతి 500కు 473 మార్కులు సాధించారు. హైస్కూల్ ప్లస్‌ల్లో పెరిగిన ఉత్తీర్ణత రాష్ట్రంలోని ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజీ ఉండాలన్న ప్రభుత్వ ప్రణాళికతో గతేడాది రాష్ట్రంలో 294 ఉన్నత పాఠశాలలను హైస్కూల్ ప్లస్‌గా మార్చారు. అయితే, వాటిలో 249 స్కూల్స్‌లో మాత్రమే గతేడాది ప్రవేశాలు కల్పించారు. వాటిలో ఈ ఏడాది 4,542 మంది ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు రాయగా 1,262 మంది ఉత్తీర్ణులయ్యారు. బాల్య వివాహం నుంచి బయటపడి టాపర్‌గా.. కర్నూలు జిల్లా ఆలూరు కేజీబీవీలో ఇంటర్ ఫస్టియర్ బైపీసీలో 440కి 421 మార్కులు సాధించిన ఎస్.నిర్మల సమాజంతో పోరాడి గెలిచింది. ఈ బాలికకు గతేడాది బాల్య వివాహం జరిపిస్తుండగా జిల్లా యంత్రాంగం రక్షించి కేజీబీవీలో చేర్పించింది. ప్రభుత్వం అండగా నిలవడంతో నిర్మల చక్కగా చదువుకుని అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్.. నిర్మలను ప్రత్యేకంగా అభినందించారు. ఐపీఎస్ అధికారి కావాలనే ఆమె కల సామాజిక న్యాయం, బాల్య వివాహాల నిరోధంపై ఆమెకున్న తిరుగులేని నిబద్ధతను ప్రతిబింబిస్తోందని ప్రశంసించారు. ఆదిత్య ప్రతిభ బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు నూరుశాతం ఉత్తీర్ణత సాధించారని ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్.శేషారెడ్డి తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 465 మార్కులు ఏడుగురు, 464 మార్కులు 20 మంది పొందారని పేర్కొన్నారు. బైపీసీలో 435, 434 మార్కులు, ఎంఈసీలో 489 మార్కులు సాధించారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో 990, 989, బైపీసీలో 986, ఎంఈసీలో 978 మార్కులు పొంది తమ విద్యార్థులు ప్రతిభ చూపారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను ఆదిత్య విద్యాసంస్థల కార్యదర్శి దీపక్‌రెడ్డి, వైస్ చైర్మన్ సతీ‹Ùరెడ్డి, కో–ఆర్డినేటర్ లక్ష్మీకుమార్, డైరెక్టర్లు గంగిరెడ్డి, రాఘవరెడ్డి, ప్రిన్సిపాల్ మెయినా అభినందించారు. శ్రీచైతన్య విజయకేతనం విజయవాడ: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని శ్రీ చైతన్య విద్యాసంస్థల అకడమిక్ డైరెక్టర్ సుష్మశ్రీ బొప్పన తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో చింటు రేవతి రాష్ట్రస్థాయిలో 467 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీలో 440 మార్కులకు గాను టి.దివ్య రాష్ట్రస్థాయిలో 436 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. అలాగే సీనియర్ ఎంపీసీలో ఎ.వి.దుర్గామధులిక 1000 మార్కులకు గాను 992 మార్కులతో స్టేట్ ఫస్ట్ వచ్చారని తెలిపారు. అలాగే బైపీసీలో ఎస్.పావని 991 మార్కులతో స్టేట్ ఫస్ట్ సాధించినట్లు చెప్పారు. శ్రీప్రకాష్ విజయభేరి తుని: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో శ్రీప్రకాష్ జూనియర్ కళాశాల విద్యార్థులు విజయభేరి మోగించారని ఆ విద్యాసంస్థల సంయుక్త కార్యదర్శి సీహెచ్ విజయ్‌ప్రకాష్ తెలిపారు. శుక్రవారం విడుదల చేసిన ఫలితాల్లో ఎంపీసీ ద్వితీయ ఏడాది విద్యార్థి ని టి.వెన్నెల 982/1000, డీడీ సాయి శ్రీనివాస్ 980/1000, బైపీసీలో కె.లాస్య నందిని 979/1000 మార్కులతో అగ్రస్థానం సాధించారని పేర్కొన్నారు. ఎంపీసీ ప్రథమ సంవత్సరం డీవీఎల్ సాయి నిహారిక 464/470, ఎస్.మేఘన 463/470, బైపీసీలో జి.వర్షిణి 428/470 మార్కులు పొందారని తెలిపారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను విద్యాసంస్థల అధినేత నరసింహారావు, కార్యదర్శి విజయ్‌ప్రకాష్ అభినందించారు. నారాయణ జయకేతనం మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో తమ విద్యార్థులు విజయకేతనం ఎగురవేశారని నారాయణ విద్యా సంస్థల డైరెక్టర్లు డాక్టర్ పి.సింధూర నారాయణ, పి.శరణి నారాయణ తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను పి.మేఘన 467, కె.ప్రసన్న 466 మార్కులు పొందారని పేర్కొన్నారు. బైపీసీ విభాగంలో 440 మార్కులకు గాను 435 మార్కులు 14 మంది సాధించారని తెలిపారు. సీనియర్ ఇంటర్లో ఎంపీసీలో 1000 మార్కులకు గాను 991, 991 టాప్ మార్కులు సాధించినట్లు చెప్పారు. బైపీసీలో 988 మార్కులతో అగ్రస్థానంలో నిలిచినట్లు చెప్పారు. సత్తా చాటిన శశి ఉండ్రాజవరం: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు అత్యుత్తమ మార్కులు సాధించారని శశి విద్యా సంస్థల చైర్మన్ బూరుగుపల్లి రవికుమార్ శుక్రవారం తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు ఎం.నవ్యశ్రీ 990, బి.పార్వతి, కె.లిఖిత 989 మార్కులు సాధించారని చెప్పారు. బైపీసీ విభాగంలో 1000 మార్కులకు కేఎస్ సాయి శివాని 987, ఎండీ అబ్దుల్ జాఫర్ 985 మార్కులు పొందారని తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470 మార్కులకు గాను ఎం.లీలాకృష్ణారెడ్డి, డి.దుర్గా కౌసల్య 466, ఎస్కే ఇర్పాత్, బి.సహస్ర, బి.షన్మిత, టి.మనోజ్ఞ 465 మార్కులు తెచ్చుకున్నారని తెలిపారు. బైపీసీలో 440 మార్కులకు టి.కీర్తి, పీవీ హసని, వి.ఖ్యాతి, ఎం.నిస్సి, సీహెచ్ తేజస్వి 435 మార్కులు సాధించారని వివరించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శశి విద్యా సంస్థల వైస్ చైర్పర్సన్ బూరుగుపల్లి లక్ష్మీసుప్రియ అభినందించారు. తిరుమల విద్యాసంస్థల ప్రభంజనం రాజమహేంద్రవరం రూరల్: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రాజమహేంద్రవరంలోని తిరుమల జూనియర్ కళాశాల విద్యార్థులు అత్యద్భుత ఫలితాలు సాధించారని తిరుమల విద్యాసంస్థల చైర్మన్ నున్న తిరుమలరావు తెలిపారు. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో 470కి 466 మార్కులు 12 మంది సాధించారని చెప్పారు. బైపీసీలో 440కి 436 మార్కులు నలుగురు తెచ్చుకున్నారని తెలిపారు. సీనియర్ ఇంటర్ ఎంపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను ఇద్దరికి 990 మార్కులు వచ్చాయని తెలిపారు. బైపీసీలో 1000 మార్కులకు గాను నలుగురు 989 మార్కులు పొందారని నున్న తిరుమలరావు వివరించారు. ‘విజ్ఞాన్’ విజయభేరి చేబ్రోలు: ఇంటర్ ఫలితాల్లో తమ విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించారని విజ్ఞాన్ విద్యా సంస్థల సమన్వయకర్త గుదిమెళ్ల శ్రీకూర్మనాథ్ తెలిపారు. గుంటూరు జిల్లా వడ్లమూడి విజ్ఞాన్ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపాల్స్ జె.మోహనరావు, వై.వెంకటేశ్వరరావు తెలిపారు. ద్వితీయ సంవత్సర విద్యార్థులు కె.లీలావతి (989), జి.వైశాలి (988), ఎం.స్నేహ (987), ఎస్కే.మీరావలి (987), కె.వంశీక్రిష్ణ (987), టి.సంజయ్ తేజ (986), సీహెచ్ మనస్వి (986), టి.సంజయ్ తేజ (986) మార్కులు సాధించారని తెలిపారు. ఫస్ట్ ఇయర్ ఫలితాల్లో వి.కౌశిక్ (466), జీవీఏ తేజస్వి(464), వై.పార్థసారథి(464), జె.హేమంత్ సందీప్(464), కె.విష్ణువర్ధన్(464), ఆర్.శ్రీకాంత్(464), ఎం.అఖిలేష్ (464), ఎం.హర్ష వర్ధన్(464) మార్కులు సాధించారని చెప్పారు. సత్తా చాటిన భాష్యం గుంటూరు ఎడ్యుకేషన్: ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాల్లో భాష్యం విద్యార్థులు అద్భుతమైన ఫలితాలు సాధించారని భాష్యం విద్యాసంస్థల చైర్మన్ భాష్యం రామకృష్ణ తెలిపారు. జూనియర్ ఎంపీసీ విభాగంలో భాష్యం ఐఐటీ–జేఈఈ అకాడమీ విద్యార్థులు ఎం. హేమ ప్రియ హాసిని, జి సాయి మనోజ్ఞ 470 మార్కులకు 466 సాధించారని పేర్కొన్నారు. సీనియర్ ఎంపీసీ విభాగంలో జి.చంద్రలేఖ్య వెయ్యి మార్కులకు గాను 990 మార్కులు, బి.అభిజ్ఞ, ఎం.లహరి పి.సాయి మనోజ్ఞ, కె.వినోదిని 988 మార్కులు సాధించినట్లు చెప్పారు. జూనియర్ బైపీసీలో భాష్యం మెడెక్స్ విద్యార్థులు ఎల్.నవ్య, షేక్ నసీమా 440కి 436 మార్కులు సాధించారని పేర్కొన్నారు. సీనియర్ బైపీసీలో ఎం.హాసిని లాలిత్య, ఇంటూరి యోషిత వెయ్యి మార్కులకు 985, శ్రీషా 984 మార్కులు సాధించినట్లు తెలిపారు. శ్రీగోసలైట్స్ విద్యార్థుల ప్రతిభ భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో శ్రీ గోసలైట్స్ జూనియర్ కళాశాలకు చెందిన బైపీసీ విద్యార్థులు అత్యుత్తమ ఫలితాలు సాధించి తమ ప్రతిభను కనబరిచారు. సీనియర్ ఇంటర్ విద్యార్థి ని ఆలూరు కిరణ్మయి 990/1000 మార్క్‌లతో రాష్ట్రంలో సెకండ్ టాప్, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. అలాగే జూనియర్ ఇంటర్ విద్యార్థి ని ఇంజమూరి హరిచందన 435/440 మార్కులతో రాష్ట్రంలో సెకండ్ టాప్‌లో, కృష్ణాజిల్లాలో సెకండ్ టాప్‌లో నిలిచింది. ఈ సందర్భంగా శ్రీ గోసలైట్స్ చైర్మన్ నరేంద్ర బాబు మాట్లాడుతూ ఇంటర్ ఫలితాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు అభినందనలు తెలిపారు. శ్రీవిశ్వశాంతి విజయం భవానీపురం(విజయవాడ పశ్చిమ): ఇంటర్ ఫలితాల్లో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన శ్రీవిశ్వశాంతి విద్యార్థులు మంచి ఫలితాలను సాధించి విజయకేతనం ఎగురవేశారు. ఎంపీసీ, బైపీసీ గ్రూపులలో ద్వితీయ సంవత్సర విద్యార్థులు అత్యధికంగా 988, 984, 984, 982, 982, 981 మార్కులను సాధించారు. అదే విధంగా ప్రథమ సంవత్సర విద్యార్థులు ఎంపీసీ, బైపీసీ గ్రూపుల్లో 465, 464, 464, 463, 463, 463, 463, 462, 462, 462, 462, 462 మార్కులు పొందారు. ఈ ఘన విజయాలు సాధించిన విద్యార్థులను శ్రీ విశ్వశాంతి విద్యా సంస్థల అధినేత మాదల సుబ్రహ్మణ్యేశ్వరరావు, డైరెక్టర్ మాదల సూర్యశేఖర్ అభినందించారు. -
ఏపీ ఇంటర్ 2024 ఫలితాలు విడుదల
-
AP Inter Results 2024: ఒక్క క్లిక్‌తో రిజల్ట్స్ చూడండి..
👉: ఏపీ ఇంటర్ ఫలితాల కోసం ఈ కింద ఇచ్చిన లింక్స్ క్లిక్ చేయండి.. 👉: ఇంటర్ జనరల్ ఫస్ట్ ఇయర్ 👉: ఇంటర్ జనరల్ సెకండ్ ఇయర్ 👉: ఇంటర్ ఒకేషనల్ ఫస్ట్ ఇయర్ 👉: ఇంటర్ ఒకేషనల్ సెకండ్ ఇయర్ -
AP Inter Results: ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఏపీలో ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇంటర్ ఫలితాలను ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కమిషనర్ సౌరబ్ గౌర్ విడుదల చేశారు. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో 67 శాతం ఉత్తీర్ణత శాతం వచ్చింది.సెకండ్ ఇయర్లో 78 శాతం ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ప్లేస్‌లో నిలిచింది. రెండో స్థానం గుంటూరు. మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా నిలిచింది. ఇంటర్ ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు జరిగాయి. ఇంటర్మీడియట్లో 10.53 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. రికార్డు స్థాయిలో 22 రోజుల్లోనే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఇక, మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు. ఫస్ట్ ఇయర్.. కృష్ణా జిల్లా-84 శాతం గుంటూరు- 81 శాతం ఎన్టీఆర్-79 శాతం సెకండ్ ఇయర్.. కృష్ణా-90 శాతం గుంటూరు-87 శాతం ఇక, ఈనెల 18 నుంచి 24వ తేదీ వరకు రీవాల్యుయేషన్‌కు అవకాశం కల్పించారు. పరీక్షలకు సంబంధించి వివరాలు ఇలా.. పరీక్షలకు హాజరైన 10,53,435 మంది విద్యార్థులు ఇంటర్ ఫస్టియర్ పరీక్షలకు 5,17,570 మంది విద్యార్థులు సెకండియర్ పరీక్షలకు 5.35,865 మంది విద్యార్థులు సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి అడ్డుకట్ట సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలు ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో కృష్ణా జిల్లా టాప్ ఇంటర్ సెకండియర్‌లోనూ కృష్ణా జిల్లానే టాప్ రెండో స్థానంలో గుంటూరు జిల్లా మూడో స్థానంలో ఎన్టీఆర్ జిల్లా ఫస్టియర్ ఉత్తీర్ణత శాతం 67 శాతం సెకండియర్ ఉత్తీర్ణత శాతం 78 శాతం ఇంటర్ ఫలితాల్లో బాలికలదే పైచేయి ఒకేషన్ లో 71 శాతం ఉత్తీర్ణత పాసయిన విద్యార్థులకు ఇంటర్ బోర్డు అభినందనలు ఫెయిలైనా మళ్లీ చదివి పరీక్షలు రాయండి ఫెయిల్ అయ్యామని ఎలాంటి అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు ఫెయిలైన విద్యార్థులకు తల్లిదండ్రులు అండగా నిలవాలి ఫస్టియర్ ఫలితాల్లో మొదటి స్థానం కృష్ణా జిల్లా 84 శాతం రెండో స్థానం గుంటూరు జిల్లా 81 శాతం మూడో స్థానం ఎన్టీఆర్ జిల్లా 79 శాతం ఇంటర్ సెకండయిర్ ఫలితాల్లోమొదటి స్థానం కృష్ణా జిల్లా 90 శాతం రెండో స్థానం గుంటూరు జిల్లా 87 శాతం ఈనెల 18 నుంచి 24 వరకు రీవాల్యూయేషన్‌కు అవకాశం -
నేడు ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ ఫలితాలను శుక్రవారం ఉదయం 11 గంటలకు వెల్లడించనున్నట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ సుబ్బారావు గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ నిర్ణయం మేరకు పరీక్షలను గత మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు నిర్వహించారు. ఇంటర్మీడియట్లో రెండు సంవత్సరాల విద్యార్థులు మొత్తం 9,99,698 మంది పరీక్షలు రాయగా, జవాబు పత్రాల మూల్యాంకనం ఏప్రిల్ 4వ తేదీకి పూర్తి అయ్యింది. శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రకటించే మొదటి, రెండో సంవత్సరం ఫలితాలను www.sakshi education.comలో చూడొచ్చు. -
AP Inter Results 2024: రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల.. ఎన్ని గంటలకంటే?
సాక్షి, విజయవాడ: ఏపీ ఇంటర్ ఫలితాలు రేపు విడుదల కానున్నాయి. శుక్రవారం ఉదయం 11 గంటలకు ఫస్టియర్, సెకండియర్ రిజల్ట్స్ ఇంటర్ బోర్డు ప్రకటించనుంది. రికార్డుస్ధాయిలో 22 రోజులలోనే ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించనుంది. మార్చి ఒకటి నుంచి 20వ తేదీ వరకు ఇంటర్ పరీక్షలు జరగ్గా, పరీక్షలకు 10,53,435 మంది విద్యార్ధులు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్‌కి 5,17,570 మంది విద్యార్ధులు, ఇంటర్ సెకండియర్ 5,35,865 మంది విద్యార్దులు హాజరయ్యారు. సరికొత్త టెక్నాలజీతో లీకేజ్‌కి ఇంటర్ బోర్డు అడ్డుకట్ట వేసింది. ప్రత్యేక బార్ కోడ్‌తో పాటు ప్రశ్నాపత్రంలోని ప్రతీ పేజీపై సీరియల్ నంబర్లతో లీకేజ్ జరగకుండా పకడ్బందీగా పరీక్షలను నిర్వహించింది. ఏపీ ఇంటర్ మొదటి, రెండో సంవత్సరం పబ్లిక్ పరీక్షల 2024 ఫలితాలను www.sakshieducation.com లో చూడొచ్చు. -
హైదరాబాద్‌లో విషాదం.. ఇంటర్లో ఫెయిలయ్యామని..
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలయ్యామని, మార్కులు తక్కువ వచ్చాయని మనస్తాపం చెంది పలువురు విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. సంతోష్‌నగర్ ప్రాంతానికి చెందిన పి.జాహ్నవి (17) ఇంటర్ సెకండ్ ఇయర్ ఎంపీసీ విద్యనభ్యసిస్తుంది. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్తాపానికి గురై ఫ్యాన్‌కు చీరతో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది. కాగా సంగెం లక్ష్మీబాయి జూనియర్ కళాశాలలో జాహ్నవి ఎంపీసీ పూర్తిచేసింది. వనస్థలిపురంలో ఇంటర్ ఇద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పరీక్షల్లో ఫెయిల్ అవ్వడంతో గాయత్రి అనే విద్యార్తి ఇంట్లో ఉరేసుకుంది. హస్తినాపురం నవీన కళాశాలలో అక్కాచెల్లెల్లు చదవుతుండగా .. చెల్లి పాస్ అయి తాను ఫెయిల్ అవ్వడంతో మనస్తాపం చెంది బలవన్మరణానికి పాల్పడింది. ఖైరతాబాద్‌లోని తుమ్మల బస్తీకి చెందిన ఓ ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇంటర్ సెకండ్ ఇయర్లో (బైపీసీ) ఓ సబ్జెక్ట్ ఫెయిల్ కావడంతో ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థిని గౌతమ్ కుమార్‌గా గుర్తించారు. కేసు నమోదు చేసుకున్న సైఫాబాద్ పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా మార్చరీకి తరలించారు. మణికొండలో ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థి శాంతకుమారి ఆత్మహత్యకు పాల్పడింది. పరీక్షలో ఫెయిల్ అయ్యానని తీవ్ర మనస్తాపం చెంది ఐదో అంతస్తు నుంచి కిందకి దూకింది. హుటాహుటిన ఆసుపత్రి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందింది. కాగా శాంతకుమారి రాయదుర్గం ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతోంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు. సికింద్రాబాద్‌లోని నేరేడ్మెట్లో ఠాణా పరిధి వినాయక్ నగర్‌కు చెందిన ఓ విద్యార్థి(17) ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదివాడు. ఒక సబ్జెక్టులో తప్పడంతో ఇంట్లో ఉరేసుకున్నాడు. చదవండి: అయ్యో ఐశ్వర్య! పుట్టిన రోజు చేసుకోకుండానే మృత్యుఒడికి.. -
చదువుకు పేదరికం అడ్డుకాదని నిరూపించిన కూలీ బిడ్డ..
హుజూర్నగర్/మంచిర్యాల అర్బన్/సాక్షి, హైదరాబాద్: రెక్కాడితే గానీ కడుపునిండని పేదరికం. అయినా వారి చదువుకు పేదరికం అడ్డుకాలేదు. కష్టాలను దిగమింగి మొక్కవోని ఆత్మవిశ్వాసంతో ఇంటరీ్మడియట్ పరీక్షల్లో సత్తా చాటారు. సంపదకు, సరస్వతీ కటాక్షానికి సంబంధం లేదని నిరూపించారు. ప్రభుత్వ కాలేజీలో చదివి ప్రతిభాపాటవాలను కనబర్చిన ఈ విద్యార్థులను పలువురు అభినందించారు. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో నిరుపేద కుటుంబానికి చెందిన సీఎస్వీ వైష్ణవిదేవి ఎంపీసీలో 1000 మార్కులకు 991 మార్కులు సాధించి ఔరా అనిపించింది. వైష్ణవి స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదివింది. వైష్ణవి తండ్రి సీఎస్ సురేంద్ర కుమార్ పెయింటర్ కాగా, తల్లి రాజమణి గృహిణి. ఐఏఎస్ కావాలన్నదే తన లక్ష్యమని ఆమె చెప్పింది. కూలీ బిడ్డ... మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియా క్రిష్ణాకాలనీలో ఓ చిన్న గదిలో ఆకుల లక్ష్మీ.. కుతూరు శిరీష, కుమారుడు శివసాయికుమార్‌తో కూలీ చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శిరీష మంచిర్యాల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఫస్టియర్‌లో మల్టీ పర్పస్‌హెల్త్ వర్కర్ (ఎంపీహెచ్‌డబ్ల్యూ) కోర్సులో చేరింది. ఇంకోవైపు బ్రిడ్జి కోర్సు బైపీసీ కూడా చదువుతుంది. ఇంటర్ ఫలితాల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూలో 500 మార్కులకుగాను 495 సాధించింది. బైపీసీ తర్వాత బీకాం చేసి సీఏ కావాలన్నదే లక్ష్యమని శిరీష తెలిపింది. అత్యధికం 994! ఇంటర్లో 994 మార్కులు టాప్‌ర్యాంక్‌గా నమోదైనట్టు తెలిసింది. బాన్సువాడకు చెందిన అక్రమహబీన్ అనే విద్యార్థిని 994 మార్కులు సాధించింది. ఎంపీసీలో వరంగల్‌కు చెందిన పూజా, ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం పిండిప్రోల్‌కు చెందిన పి.రాజేశ్ కూడా 994 మార్కులు సాధించాడు. వీరు ప్రైవేటు కాలేజీల్లో చదివారు. ఈసారి ఇంటర్ బోర్డ్ కేవలం ప్రభుత్వ కాలేజీల్లో అత్యధిక మార్కులు సాధించిన టాపర్ల జాబితాను మాత్రమే విడుదల చేసింది. ప్రైవేటు కాలేజీలతో కలుపుకుని రాష్ట్రంలో టాపర్లు ఎవరన్నది ప్రకటించలేదు. ► నిజామాబాద్‌కు చెందిన ఆరెపల్లి దీక్షిత ఎంపీసీలో 992 మార్కులు సాధించింది. ఆమె తల్లిదండ్రులు రమేశ్, భాగ్య ముంబైలో రజక వృత్తిలో ఉండగా, దీక్షిత స్థానికంగా బంధువుల వద్ద ఉంటూ చదుకుంటోంది. ► జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన పాటిల్ వర్ష (బైపీసీ), సీహెచ్ రష్మిత (ఎంపీసీ) 992 మార్కులు సాధించారు. ► ఖమ్మంలోని ఏఎస్ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో బైపీసీ చదువుతున్న తప్పేట రోహిణి 990 మార్కులు సాధించింది. ► సత్తుపల్లి ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇంటర్ ద్వితీయ సంవత్సరం హెచ్ఈసీ విద్యారి్థని దాసరి సిరి వెయ్యి మార్కులకు గాను 972 మార్కులు సాధించింది. ఆమె తండ్రి దాసరి ధర్మయ్య లారీ డ్రైవర్‌గా పనిచేస్తుండగా, తల్లి స్వప్న గృహిణి. ► నిర్మల్ జిల్లా భైంసా ప్రభుత్వ జూనియర్ కళాశాల ఉర్దూ మీడియం విద్యారి్థనులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. సెకండియర్ ఎంపీసీలో జవేరియా ఫిర్దోస్ నబా 990/1000 మార్కులు సాధించగా, ఫస్టియర్‌కు చెందిన అదీబానాజ్ 462/470 మార్కులు సాధించింది. చదవండి: అమ్మాయిలదే హవా -
TS Inter Results: గురుకులాలు భేష్.. ప్రభుత్వ కాలేజీలు డౌన్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో సంక్షేమ గురుకుల సొసైటీలు సత్తా చాటాయి. కార్పొరేట్ కాలేజీల కంటే దీటైన మార్కులను సొంతం చేసుకున్నాయి. రాష్ట్రంలో అత్యంత ఎక్కువ సంఖ్యలో ఉన్న మహాత్మా జ్యోతిభా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతులు సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (ఎంజేపీటీబీసీడబ్ల్యూఆర్‌ఈఐఎస్) నుంచి ఫస్టియర్, సెకండియర్‌లో అత్యధిక మార్కులు సొంతం చేసుకున్నారు. టాప్ 10లో సగం ర్యాంకులు ఈ సొసైటీకే సొంతమయ్యాయి. మేనేజ్మెంట్ల వారీగా చూస్తే.. గురుకుల కాలేజీల్లో ఉత్తీర్ణత శాతం పెరిగితే.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మాత్రం తగ్గిపోయింది. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్టియర్ కేవలం 40 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. రెండో ఏడాది కూడా 54 శాతమే పాసయ్యారు. విద్యాశాఖ ఆధ్వర్యంలో కొనసాగుతున్న తెలంగాణ గురుకుల విద్యా సంస్థల సొసైటీ (టీఆర్ఈఐఎస్) 92శాతం ఉత్తీర్ణతతో ముందు వరుసలో నిలబడింది. వివిధ వర్గాలకు చెందిన గురుకుల కాలేజీల్లోనూ విద్యార్థులు ఎక్కువ మంది పాసయ్యారు. కానీ మోడల్ స్కూళ్లలో మాత్రం ఫ్యాకలీ్టలోపం వల్ల ఉత్తీర్ణత శాతం 66కు మించలేదు. ప్రైవేటు కాలేజీల్లోనూ ఈసారి 63 శాతమే ఉత్తీర్ణత నమోదైంది. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, మోడల్ స్కూల్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాల విడుదల సందర్భంగా పేర్కొనడం గమనార్హం. రెసిడెన్షియల్ కాలేజీల తరహాలో ఉత్తీర్ణత సాధించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టాలని అధికారులకు మంత్రి సూచించారు. కార్పొరేట్‌కు దీటైన ఫలితాలివి: మంత్రి గంగుల ప్రైవేటు కాలేజీలు, కార్పొరేట్ కాలేజీలకు దీటైన ఫలితాలను గురుకుల పాఠశాలలు సాధించాయి. బీసీ గురుకుల సొసైటీ నుంచి అద్భుతమైన ర్యాంకులు రావడం ఆనందకరం. జూనియర్ ఇంటర్ ఎంపీసీలో మందమర్రికి చెందిన హరిత 468 మార్కులు సాధించి ఫస్ట్ ర్యాంకు కొట్టింది. ఇక సికింద్రాబాద్‌కు చెందిన భూమిక 467 మార్కులతో రెండో ర్యాంకు సాధించింది. ఇంతటి అద్భుత పలితాలు సాధించిన సొసైటీ కార్యదర్శి మల్లయ్యబట్టు, బోధన, బోధనేతర సిబ్బందికి ప్రత్యేక అభినందనలు. ఉన్నత అవకాశాల్లోనూ ముందే..: మంత్రి కొప్పుల ఉత్తమ ఫలితాల్లోనే కాకుండా ఉన్నత ఉద్యోగాలను చేజిక్కించుకుంటున్న వారిలో గురుకుల విద్యార్థులుంటున్నారు. ఈసారి ఇంటర్ మొదటి, ద్వితీయ సంవత్సరాల్లో గురుకుల విద్యార్థులు సత్తా చాటారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుని గురుకులాలను నిర్వహిస్తున్నందున మంచి ఫలితాలు వచ్చాయి. పేదల విద్యకు ప్రాధాన్యత:మంత్రి సత్యవతి రాథోడ్ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం అధికారంలోకి వచి్చన వెంటనే గురుకుల పాఠశాలలను పెద్ద సంఖ్యలో తెరిచి పేదలకు కేజీ టు పీజీ విద్య అందించే లక్ష్యాన్ని మొదలుపెట్టారు. ఇందులోభాగంగా గురుకులాలు రికార్డులు సాధిస్తున్నాయి. ప్రభుత్వం విద్యకు ప్రాధాన్యత ఇస్తున్నందునే గురుకులాల విద్యార్థులు కార్పొరేట్ కాలేజీల కంటే మెరుగైన ఫలితాలను సాధిస్తున్నారు. చదవండి: సికింద్రాబాద్-తిరుపతి వందేభారత్.. ప్రయాణికులకు గుడ్‌న్యూస్ -
ఇంటర్ రెండేళ్ల ఫలితాల్లోనూ అమ్మాయిలదే హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఇంటర్మీడియట్ ఫలితాల్లో మరోసారి బాలికలు సత్తా చాటారు. మొదటి, రెండో సంవత్సరం రెండింటిలోనూ బాలురను మించి ఉత్తీర్ణత శాతాన్ని నమోదు చేశారు. ఫస్టియర్‌లో బాలురు 54.66 శాతం పాసయితే, బాలికలు 68.68% ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో బాలురు 55.60% ఉత్తీర్ణులైతే, బాలికలు 71.57 శాతం పాస్ కావడం గమనార్హం. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఇంటర్ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ఇంటర్ రెండేళ్ల పరీక్షలు కలిపి మొత్తంగా 9,48,153 మంది హాజరయ్యారని తెలిపారు. ఫస్టియర్‌లో 61.68 శాతం, సెకండియర్‌లో 63.49 శాతం ఉత్తీర్ణత నమోదైనట్టు వెల్లడించారు. ఫస్టియర్‌లో 1,75,505 మంది, సెకండియర్‌లో 1,91,698 మంది ఏ గ్రేడ్ (75శాతంపైన మార్కులతో)లో ఉత్తీర్ణులైనట్టు వివరించారు. ఫస్టియర్ ఫలితాల్లో మేడ్చల్ (75% పాస్) మొదటి స్థానంలో, రంగారెడ్డి (73% పాస్) ద్వితీయ స్థానంలో నిలిచా యని మంత్రి తెలిపారు. సెకండియర్‌లో ములుగు (85% పాస్) మొదటి స్థానంలో, కొమురం భీం (81 శాతం పాస్) రెండో స్థానంలో నిలిచినట్టు స్పష్టం చేశారు. ఫెయిలైతే ఆందోళన పడొద్దు ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు ఎలాంటి ఆందోళనకు గురికావొద్దని, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ రాసి పాసవ్వాలని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఈ ఏడాది ఇంటర్ మార్కులకు వెయిటేజీ లేదని, అందువల్ల ఇంటర్ మార్కులు తక్కువ వచ్చినా ఆందోళన పడొద్దని చెప్పారు. నేటి నుంచి రీవెరిఫికేషన్.. ఇంటర్ జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీవాల్యూయేషన్ ప్రక్రియను ఈ నెల 10 నుంచి 16 వరకు చేపడుతున్నామని.. విద్యార్థులు సంబంధిత కాలేజీల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చని ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ తెలిపారు. రీవెరిఫికేషన్‌కు రూ.100, రీవ్యాల్యూయేషన్‌కు రూ.600 చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. ఫెయిలైన విద్యార్థులతోపాటు పాసైనా ఇంప్రూవ్మెంట్ కోరుకునే విద్యార్థులు ఈ నెల 16 లోగా ఫీజు చెల్లించాలని సూచించారు. మార్కుల మెమోలు, కలర్ ప్రింట్లను ఇంటర్ బోర్డ్ వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని చెప్పారు. మానసిక ఆందోళనకు గురైన విద్యార్థులు 14416 టోల్ ఫ్రీనంబర్‌కు కాల్ చేసి నిపుణుల ద్వారా కౌన్సిలింగ్ పొందవచ్చని తెలిపారు. వీలైనంత త్వరగా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు వెల్లడిస్తామన్నారు. ఇంటర్ బోర్డ్ అడ్మిషన్ నోటిఫికేషన్ ఇచ్చే వరకు కూడా.. ఏ కాలేజీలోనూ అడ్మిషన్లు చేపట్టడానికి వీల్లేదని స్పష్టం చేశారు. ఎంపీసీలో అత్యధిక ఉత్తీర్ణత.. రెండో స్థానంలో బైపీసీ – హెచ్ఈసీ, సీఈసీ కోర్సుల్లో 50 శాతంలోపే పాస్ ఇంటర్మీడియట్ ఫలితాల్లో రాష్ట్రవ్యాప్తంగా సైన్స్ గ్రూపుల్లోనే అత్యధిక ఉత్తీర్ణత శాతం నమోదైంది. ప్రథమ, ద్వితీయ సంవత్సరం రెండింటిలోనూ ఎంపీసీ (మేథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ) గ్రూపులో ఎక్కువ మంది పాసయ్యారు. తర్వాత స్థానంలో బైపీసీ ఉండగా.. సీఈసీ, హెచ్ఈసీ వంటి సంప్రదాయ గ్రూపుల్లో తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. తగ్గిన ఉత్తీర్ణత శాతం – వంద శాతం సిలబస్ కారణమంటున్న నిపుణులు – కోవిడ్‌కు ముందుతో పోలిస్తే ఉత్తీర్ణత ఎక్కువే ఇంటర్లో గత ఏడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం తగ్గింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాలు రెండింటి ఫలితాలూ ఇలాగే ఉన్నాయి. కోవిడ్ కారణంగా 2021లో పరీక్షలు నిర్వహించకుండానే అందరినీ పాస్ చేశారు. తర్వాత 2022లోనూ 75శాతం సిలబస్‌తో పరీక్షలు జరిగాయి. ఈ ఏడాది వంద శాతం సిలబస్‌తో పరీక్షలు పెట్టారు. పూర్తి సిలబస్ నేపథ్యంలోనే ఇంటర్ జనరల్ విభాగంలో ఉత్తీర్ణత స్వల్పంగా తగ్గిందని నిపుణులు చెప్తున్నారు. అయితే 2019తో పోలిస్తే మాత్రం పాస్ పర్సంటేజీ ఎక్కువగానే ఉంది. కొన్నేళ్లుగా ఇంటర్ ఉత్తీర్ణత శాతం (శాతాల్లో) ఏడాది ఫస్టియర్ సెకండియర్ 2018–19 60.60 64.94 2019–20 61.07 69.61 2020–21 100 100 2021–22 64.85 68.68 2022–23 62.85 67.27 -
పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి.. ఉత్తగ సచ్చిపోతివి బిడ్డా..
సాక్షి, మహబూబాబాద్: పరీక్షల్లో ఫెయిల్ అయి కొందరు విద్యార్థుల.. పరీక్షలు ఫలితాలు వెలువడక ముందే మరొకొందరు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. క్షణికావేశంలో విద్యార్ధులు తీసుకునే నిర్ణయాలు వారి తల్లిదండ్రులకు తీరాని శోకాన్ని నింపుతున్నాయి. పరీక్ష ఫలితాలే జీవితాలను మార్చలేవని విద్యార్థులు తెలుసుకోవాలని పేరెంట్స్ చెబుతున్నా కొందరు మాత్రం మారడం లేదు. తాజాగా ఇలాంటి ఘటనే ఒకటి మహబూబాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఫలితాలు వెలువడక ముందే భయంతో ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాల ప్రకారం.. కేసముద్రం మండలం పిక్లా తండా శివారు బోడగుట్ట తండాకు చెందిన ఇంటర్ విద్యార్థి గుగులోతు కృష్ణ(19) ఇంటర్ చదువుతున్నాడు. కాగా, ఇంటర్ సెకండ్ ఇయర్లో తనకు మంచి మార్కులు రావనే ఆలోచనతో ఆవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో ‘అమ్మ, నాన్న నన్ను క్షమించండి .. నాకు ఎంబీబీఎస్‌లో సీటు రాదు. అందుకనే ఆత్మహత్య చేసుకుంటున్నాను’ అని సూసైడ్ నోట్ రాసి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే, మంగళవారం ఉదయం వెలువడిన ఇంటర్ ఫలితాల్లో కృష్ణ.. బైపీసీలో 892/1000 మార్కులు సాధించాడు. ఏ గ్రేడ్‌లో ఉత్తీర్ణుడయ్యాడు. ఇక, ఫలితాలు చూసిన అనంతరం.. కృష్ణ పేరెంట్స్ కన్నీటిపర్యంతమయ్యారు. ‘కొడుకా.. లేనిపోని అనుమానంతో ఉరేసుకొని చనిపోతివి.. ఇప్పుడు ఇంటర్ పరీక్షల్లో గిన్ని మార్కులతో పాసయితివి’ అంటూ తల్లిదండ్రులు ఆవేదన చెందారు. ఈ ఘటన ప్రతి ఒక్కరినీ కంటతడి పెట్టించింది. ఇదిలా ఉండగా.. కృష్ణ కల్వల ఆదర్శ పాఠశాలలో పదోతరగతి వరకు పూర్తి చేసి ఏటూరు నాగారంలోని తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల కళాశాలలో ఇంటర్ బైపీసీలో చేరాడు. ఇటీవల పరీక్షలు రాసి ఇంటికి వచ్చాడు. కృష్ణ చిన్నప్పటి నుంచి ఎంబీబీఎస్ చేయాలనే కోరికతో కష్టపడి చదువుతున్నాడు. ఈ క్రమంలోనే ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్షకు సన్నద్ధమయ్యాడు. ఆశించిన స్థాయిలో రాణించలేకపోతున్నానని అతనిలో నిరాశ మొదలైంది. తనకు ఎంబీబీఎస్‌లో సీటు రాదని ఆవేదన చెందాడు. దీంతో, ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది కూడా చదవండి: మహిళా ప్రయాణికులకు రూ.80 కే టీ–24 టికెట్ -
ఇంటర్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి సబితా
-
TS Inter Results 2023: ఇంటర్ ఫలితాలు విడుదల.. రిజల్ట్స్‌ను ఇలా చెక్ చేసుకోండి..
సాక్షి, హైదరాబాద్: కాసేపట్లో తెలంగాణ ఇంటర్ పరీక్ష ఫలితాలు విడుదల అయ్యాయి. మంగళరం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలను https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో విద్యార్థులు చూసుకోవచ్చు. అదే విధంగా ‘ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చు. కాగా మార్చి, ఏప్రిల్ నెలలో తెలంగాణ ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలు నిర్వహించారు. మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగిన ఈ పరీక్షను 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదల అయ్యాయి. ఇంటర్ ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణత సాధించగా, సెకండియర్‌లో 67. 26 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు. ఫస్టియర్‌లో 2 లక్షల 72వేల 208 మంది పాసవ్వగా, సెకండియర్‌లో 2 లక్షల 56వేల 241 మంది పాసైనట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇంటర్ ఫస్టియర్ ఫలితాల్లో 75. 27 శాతంలో మేడ్చల్ జిల్లా తొలి స్థానంలో నిలవగా, ఇంటర్ సెకండియర్ ఫలితాల్లో 85.05 శాతంలో ములుగు జిల్లా అగ్రస్థానం సాధించింది. జూన్ 4వ తేదీ నుంచి ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లమెంటరీ ఎగ్జామ్స్ నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. అదే సమయంలో ఫెయిలైన విద్యార్థులు ఎవరూ కూడా ఆందోళన చెందొద్దన్నారు మంత్రి. చదవండి: ఎంసెట్‌కు బయోమెట్రిక్ తప్పనిసరి.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ.. -
TS Inter Results 2023 Live: నేడే ఇంటర్ తెలంగాణ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షల మంది విద్యార్థులు ఎదురుచూస్తున్న ఇంటర్మీడియట్ ఫలితాలు మంగళవారం వెలువడనున్నాయి. రాష్ట్ర ఇంటర్ బోర్డ్ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఈ విషయాన్ని ధ్రువీకరించారు. ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని ఇంటర్ బోర్డ్ కార్యాలయంలో ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్ష ఫలితాలను విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి లాంఛనంగా విడుదలల చేస్తారు. అనంతరం https://tsbie.cgg.gov.in, http://results.cgg.gov.in వెబ్సైట్లలో విద్యార్థులు ఫలితాలను చూసుకోవచ్చు. మంత్రి అనుమతితో.. రాష్ట్రంలో మార్చి 15 నుంచి ఏప్రిల్ 5 వరకు ఇంటర్ వార్షిక పరీక్షలు జరిగాయి. మొత్తంగా 9.47 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. గతేడాది ఫలితాలు జూన్‌లో విడుదల కాగా.. ఈ ఏడాది ఒక నెల ముందుగానే విడుదలకు ఏర్పాట్లు చేశారు. ఈ ఫలితాల క్రోడీకరణ ప్రక్రియ, ట్రయల్స్‌ను పూర్తిచేసిన అధికారులు.. సోమవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డికి నివేదిక సమర్పించారు. దానిని పరిశీలించిన మంత్రి మంగళవారం ఫలితాలను విడుదల చేసేందుకు అనుమతినిచ్చారు. ‘సాక్షి’లో ఇంటర్ ఫలితాలు ఇంటర్ ఫలితాలు తెలుసుకునేందుకు ‘సాక్షి’ఏర్పాట్లు చేసింది. www.sakshieducation.com వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చు. చదవండి: మహిళలకు శుభవార్త.. రూ.80కే టీ-24 టికెట్! సిటిబస్సులో 24 గంటల పాటు.. -
TS Inter Result 2023: రేపే ఇంటర్మీడియట్ ఫలితాలు.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం ఫలితాలు మంగళవారం (మే 9వ తేదీ) విడుదల కానున్నాయి. ఫలితాల వెల్లడిపై బోర్డు అధికారులు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి సబిత ఫలితాలు వెల్లడించాల్సి ఉన్నందున ఆమె వెసులుబాటును పరిగణనలోకి తీసుకున్న అనంతరం ఫలితాల విడుదల తేదీని ప్రకటించారు. ఫలితాల వెల్లడికి సంబంధించి సాఫ్ట్‌వేర్‌ను కూడా సిద్ధం చేశారు. విద్యార్థులు మంగళవారం ఇంటర్ బోర్డు వెబ్సైట్లు tsbie.cgg.gov.in ద్వారా, www. sakshieducation.com ద్వారా వేగంగా ఫలితాలు పొందవచ్చు. కాగా, తొలుత ఇంటర్‌బోర్డు పరీక్ష పత్రాల ఆన్లైన్ మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినా, వీలు కాకపోవడంతో ఆఫ్‌లైన్ ద్వారా మూల్యాంకనం చేపట్టింది. పలు దఫాలుగా ట్రయల్‌రన్ చేసిన అనంతరం సాంకేతిక ఇబ్బందులు తలెత్తకుండా ఉండటంతో జీరో సాంకేతిక సమస్యలు నిర్ధారౖణెందని, దీంతో ఫలితాల వెల్లడికి ఎలాంటి ఆటంకాల్లేవని అధికారులు నిర్ణయానికి వచ్చారు. ఈ క్రమంలోనే మంగళవారం ఫలితాలు వెలువరించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకూ జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23, 901 మంది హాజరయ్యారు. దాదాపు 9.06 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన సమాధాన పత్రాల మూల్యంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలోనే పూర్తయింది. చదవండి: మృత్యు ఘంటికలు!.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 9 గంటల వరకు -
TS: వచ్చే వారం ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ప్రథమ, ద్వితీయ ఇంటర్ పరీక్ష ఫలితాల వెల్లడికి అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ నెల 13వ తేదీలోగా రిజల్ట్స్ ప్రకటించాలని నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన కసరత్తు గత రెండు రోజులుగా వేగం పుంజుకుంది. మూల్యాంకనం తర్వాత మార్కుల క్రోడీకరణ, డీ కోడింగ్ ప్రక్రియ ను త్వరగా ముగించారు. ఇప్పటికే పలు దఫా లుగా ట్రయల్ రన్ చేశారు. ఈ సందర్భంగా వచ్చిన సాంకేతిక సమస్యలను పరిష్కరించా రు. ఈ ప్రక్రియలో గత రెండు రోజులుగా ఎలాంటి సమస్యలు తలెత్తలేదని, దీన్నిబట్టి ఫలితాల వెల్లడికి ఎలాంటి ఇబ్బంది లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు. ఫలితాల విడుదల తేదీ ఖరారు కాకున్నా, ఈ నెల 13లోగా కచ్చితంగా వెల్లడిస్తామని ఇంటర్‌బోర్డ్ ముఖ్య అధి కారి తెలిపారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనే.. పలు దఫాలుగా ఫలితాల విశ్లేషణ, క్రోడీకరణ, కోడింగ్ విధానాన్ని పరిశీలిస్తున్నామని ఆయన చెప్పారు. మంత్రి అనుమతి తర్వాత తేదీ ఖరారు.. ఫలితాల వెల్లడికి సంబంధించిన కసరత్తును సోమవారం నాటికి పూర్తి చేయాలని ఉన్నతాధికారులు బోర్డు సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం మంత్రి సబితా ఇంద్రారెడ్డిని ఇంటర్ అధికారులు కలిసే అవకాశం ఉందని తెలుస్తోంది. అదే రోజు పరీక్షల ఫలితాల వెల్లడి సమాచారాన్ని తెలియజేస్తారు. మంత్రి అనుమతి తర్వాత ఫలితాల వెల్లడి తేదీని ఖరారు చేస్తారని సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు మార్చి 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 4,82,501 మంది, రెండో సంవత్సరం పరీక్షలకు 4,23,901 మంది హాజరయ్యారు. ఇంటర్ పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ ఏప్రిల్ రెండో వారంలో పూర్తయింది. రెండో సంవత్సరం పరీక్ష రాసిన విద్యార్థులు ఎంసెట్‌తో పాటు, అనేక పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ ఫలితాలు త్వరగా విడుదల చేయాలని అధికారులు నిర్ణయించారు. ఇది కూడా చదవండి: ఎల్లుండి నుంచి మళ్లీ మంటలే! -
ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల
-
AP: నేటి నుంచి ఇంటర్ ఫలితాల రీకౌంటింగ్
సాక్షి, అమరావతి: ఇంటర్ ఫలితాలకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు ఉన్నా ఇంటర్ బోర్డుకు తెలియజేయాలని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు. ఏప్రిల్ 27 నుంచి మే 6 వరకు రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. మే 24 నుంచి జూన్ 1 వరకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు త్వరలో విడుదల చేస్తుందని తెలిపారు. అదే విధంగా జూన్ 5 నుంచి జూన్ 9 వరకు సప్లిమెంటరీ ప్రాక్టికల్స్ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. -
కష్టపడి చదివి ఇంటర్ పాసైన ఎమ్మెల్యేలు.. డిగ్రీ పూర్తి చేయడమే లక్ష్యం
లక్నో: చదువుకోవాలనే తపన ఉంటే వయసుతో సంబంధం లేదు అని నిరూపించారు ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన వీరు కష్టపడి చదివి ఇంటర్లో ఉత్తీర్ణులయ్యారు. ఇపుడు డిగ్రీ పూర్తి చేయడమే తమ లక్ష్యమని, ఎలాగైనా పట్టుభద్రులం అవుతామని చెబుతున్నారు. బరేలి జిల్లా బిత్రి-చైన్పూర్ నుంచి 2017లో బీజేపీ తరఫున పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు రాజేశ్ మిశ్రా. మంగళవారం ప్రకటించిన యూపీ ఇంటర్ ఫలితాల్లో ఈయన 500కు గానూ 263 మార్కులు తెచ్చుకుని ఉత్తీర్ణులయ్యారు. రెండేళ్ల క్రితమే పదో తరగతి పాసయ్యారు. ఇప్పుడు ఇంటర్ కూడా పూర్తి చేసి చదువుపై తనకున్న మక్కువ చాటుకున్నారు. డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెబుతున్నారు. అయితే మార్కులుపై తాను సంతృప్తిగా లేనని మరోసారి తన ఆన్సర్ షీట్స్‌ను మూల్యంకనం చేయిస్తానని మిశ్రా చెప్పడం గమనార్హం. హస్తీన్పూర్ నుంచి ఎస్పీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన ప్రభూదయాల్ వాల్మీకి కూడా ఇంటర్లో పాసయ్యారు. సెకండ్ క్లాస్‌లో ఆయన ఉత్తీర్ణులయ్యారు. చదవుకు వయసులో సంబంధం లేదని పేర్కొన్నారు. డా.బీఆర్ అంబేడ్కరే తనకు స్ఫూర్తి అని, డిగ్రీ కూడా పూర్తి చేస్తానని చెప్పారు. ఈయన 2002-2007 వరకు, 2012-2017వరకు ఎమ్మెల్యేగా ఉన్నారు. చదవండి: గుండెపోటుతో మంత్రి మృతి.. సీఎం దిగ్భ్రాంతి.. మూడు రోజులు సంతాప దినాలు.. -
రేపే ఏపీ ఇంటర్ ఫలితాలు.. ఒకేసారి ఫస్ట్, సెకండియర్ రిజల్ట్స్
సాక్షి, అమరావతి: ఇంటర్మీడియట్ మొదటి, రెండవ సంవత్సర ఫలితాలు ఒకేసారి విడుదల కానున్నాయి. ఇటీవల సంవత్సరాల్లో ఇలా ఒకేసారి ఫస్ట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ రిలీజ్ చేయడం ఇదే మొదటిసారి. రేపు(బుధవారం) సాయంత్రం 5 గంటలకు మంత్రి బొత్స సత్యనారాయణ ఫలితాలను విడుదల చేయనున్నారు. ఈ పరీక్షలకు మొత్తం 10,03,990 మంది పరీక్షకు హాజరయ్యారు. ఇంటర్ ఫస్టియర్ పరీక్షలు 4.84 లక్షల మంది విద్యార్థులు రాయగా, ఇంటర్ సెకండియర్ పరీక్షలు 5.19 లక్షల మంది విద్యార్థులు రాశారు. పరీక్షల కోసం రాష్ట్రవ్యాప్తంగా 1,489 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు మార్చి 15వ తేదీన ప్రథమ సంవత్సరం, 16వ తేదీన ద్వితీయ సంవత్సరం పరీక్షలు ప్రారంభమై.. ఏప్రిల్ 4వ తేదీన ముగిసిన విషయం తెలిసిందే. కేవలం 22 రోజుల వ్యవధిలో ఫలితాలను ఇంటర్ బోర్డు ప్రకటించబోతోంది. ఫలితాల కోసం క్లిక్ చేయండి -
మే 15 కల్లా ఇంటర్, టెన్త్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: లక్షలాది మంది విద్యార్థులు ఎదురు చూస్తున్న టెన్త్, ఇంటర్ పరీక్షల ఫలితాలు మే 15 కల్లా విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి విద్యా శాఖ ఉన్నతాధికారుల కసరత్తు తుది దశకు చేరుకుంటోంది. ఇంటర్మీడియట్ మొదటి, రెండో ఏడాది పరీక్షలకు దాదాపు 9 లక్షల మంది, టెన్త్ పరీక్షలకు 4.90 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇంటర్ మూల్యాంకన ఇప్పటికే ముగిసింది. మార్కులను మరోసారి పరిశీలించి, కంప్యూటర్ ద్వారా ఇంటర్ బోర్డ్‌కు పంపారు. డీకోడింగ్ ప్రక్రియ కూడా ముగిసినట్టు అధికారులు తెలిపారు. ట్రయల్ రన్ జరుగుతోందని, సాంకేతిక పరమైన లోపాలు పరిశీలించిన తర్వాత ఫలితాల విడుదల తేదీ ప్రకటిస్తామని అధికారులు వెల్లడించారు. మే రెండోవారం అంటే.. 15వ తేదీలోగా ఫలితాలు వెల్లడించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ఇక పదవ తరగతి పరీక్షలకు సంబంధించిన మూల్యాంకనం దాదాపు ముగిసింది. కొన్ని పెద్ద కేంద్రాల్లో అక్కడక్కడా కొనసాగుతోంది. మూల్యాంకనం పూర్తికాగానే డీ కోడింగ్ చేసి, మార్కులను ఎప్పటికప్పుడు ఆన్లైన్ ద్వారా బోర్డుకు పంపుతున్నారు. కాగా, టెన్త్ ఫలితాలను వచ్చే నెల 10లోగా ప్రకటించేందుకు సిద్ధంగా ఉన్నామని అధికారులు చెపుతున్నారు. -
ఇంటర్లో 75 శాతం సాధిస్తేనే జేఈఈ మెయిన్‌కు అర్హత
సాక్షి, అమరావతి: జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) మెయిన్–2023లో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) ఈసారి పలు మార్పులు చేసింది. కరోనా సమయంలో సడలింపులిచ్చిన అంశాలను పునరుద్ధరించింది. కొన్ని కొత్త సడలింపులను ప్రకటించింది. జేఈఈ మెయిన్‌కు హాజరయ్యే అభ్యర్థులకు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండటం సహా పలు నిబంధనలను పెట్టింది. సెంట్రల్ సీట్ అలకేషన్ బోర్డు నిబంధనల ప్రకారం ఎన్ఐటీ, ఐఐఐటీ, సీఎఫ్‌ఐటీ తదితర సంస్థల్లో ప్రవేశానికి అభ్యర్థులు జేఈఈలో ఆలిండియా ర్యాంకుతో పాటు ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులు సాధించి ఉండాలి. అలాగే ఇంటర్మీడియెట్‌లోని ప్రతి సబ్జెక్టులోనూ అభ్యర్థి నిర్ణీత అర్హత మార్కులను సాధించాలి. అందువల్ల మెయిన్‌కు 75 శాతం మార్కులు తప్పనిసరి చేసింది. మరికొన్ని నిబంధనలు జేఈఈ మెయిన్ తొలి దశ పరీక్షలు జనవరి 24 నుంచి 31 వరకు, రెండో దశ ఏప్రిల్ 6 నుంచి 12వ తేదీ వరకు జరగనున్నాయి. తొలి దశ పరీక్షలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. రెండో దశ రిజిస్ట్రేషన్లు ఫిబ్రవరి 7న ప్రారంభమవుతాయి. అభ్యర్ధులు రెండు విడతల పరీక్షలకు వేర్వేరుగా దరఖాస్తు చేయాలి. ఒక సెషన్‌కు ఒక్క దరఖాస్తే సమర్పించాలి. ఒకటికి మించి దరఖాస్తులు ఇస్తే.. ఆ తరువాత ఎప్పుడు దాన్ని గుర్తించినా ఆ అభ్యర్థిపై కఠిన చర్యలు తీసుకుంటారని ఎన్టీఏ స్పష్టంచేసింది. 2021, 2022 సంవత్సరాల్లో ఇంటర్మీడియెట్, తత్సమాన బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణులైన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈసారి వయోపరిమితిని విధించకుండా బోర్డు పరీక్షల్లో ఉత్తీర్ణతను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటోంది. అయితే, అడ్మిషన్ల సమయంలో విద్యా సంస్థలు నిర్ణయించే వయోపరిమితి నిబంధనలను అభ్యర్థులు అనుసరించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే డ్రాపర్ల (గత ఏడాది మెయిన్‌లో ఫెయిలై, మళ్లీ ఈ ఏడాది రాసే వారు, ఇంటర్మీడియెట్ పూర్తి చేసి కొన్ని సంవత్సరాలు వ్యవధి ఇచ్చి జేఈఈకి దరఖాస్తు చేసేవారు)కు వయోపరిమితిని సడలించి వరుసగా మూడుసార్లు మెయిన్‌కు అవకాశం కల్పించింది. ముందుగానే రిజర్వు తేదీల ప్రకటన రెండు దశల పరీక్షల తేదీల్లో మార్పులు చేయాల్సి వచ్చినా, ఇతర పరీక్షలకు ఆటంకం లేకుండా కొన్ని రిజర్వు తేదీలను కూడా ఎన్టీఏ ఈసారి ముందుగానే ప్రకటించింది. తొలివిడత పరీక్షలకు ఫిబ్రవరి 1, 2, 3 తేదీలను రిజర్వుగా ప్రకటించింది. రెండో విడతకు ఏప్రిల్ 13, 15 తేదీలను రిజర్వు తేదీలుగా పేర్కొంది. తగ్గిన పరీక్ష కేంద్రాలు కరోనా సమయంలో భౌతిక దూరం పాటించడం, ఇతర నిబంధనల కారణంగా మెయిన్ పరీక్షలను ఎక్కువ నగరాల్లో నిర్వహించింది. గత ఏడాది కూడా దేశవ్యాప్తంగా 514 నగరాలు, పట్టణాల్లో నిర్వహించింది. ఈసారి వాటిని 399కు కుదించింది. ఇతర దేశాల్లో పరీక్షల కేంద్రాలు గత ఏడాది 24 కాగా ఈసారి 13కు తగ్గించింది. రిజిస్ట్రేషన్ల ఫీజు పెంపు రిజిస్ట్రేషన్ల ఫీజులను కూడా ఎన్టీఏ పెంచింది. జనరల్ కేటగిరీ అభ్యర్థుల ఫీజు రూ.650 నుంచి రూ.1,000కి పెంచింది. మహిళలకు రూ.800 చేసింది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ట్రాన్స్జెండర్లకు ఫీజును రూ.325 నుంచి రూ.500కు పెంచింది. ఇతర దేశాల అభ్యర్థుల ఫీజును రూ.3 వేల నుంచి రూ.5 వేలకు, మహిళల ఫీజును రూ.1500 నుంచి రూ.3 వేలకు పెంచింది. అభ్యర్థులు జేఈఈ మెయిన్ ఆన్లైన్ దరఖాస్తులో తల్లిదండ్రులు లేదా సంరక్షకుల ఈమెయిల్, మొబైల్ నంబర్లు తదితర వివరాలను తప్పనిసరిగా ఇవ్వాలని, లేదంటే రిజిస్ట్రేషన్ పూర్తి కాదని ఎన్టీఏ స్పష్టంచేసింది. ఇదిలా ఉండగా కరోనా పరిస్థితులు సద్దుమణిగినా గతంలోని పరిస్థితుల ప్రభావం ఇంకా ఉన్నందున, ఇంటర్మీడియెట్‌లో 75% మార్కుల నిబంధనను ఈసారి కూడా మినహాయించాలని అభ్యర్థులు కోరుతున్నారు. తొలివిడత సెషన్ పరీక్షలకు వ్యవధి తక్కువగా ఉందని, దీనినీ పునఃపరిశీలన చేయాలని అభ్యర్థిస్తున్నారు. -
UP Board 12th Result 2022: ముందు అక్క, తర్వాత చెల్లి.. యూపీలో ఇంటర్ టాపర్లుగా కవలలు
ఫతేపూర్: యూపీ ఇంటర్ బోర్డు 12వ తరగతి పరీక్ష ఫలితాల్లో గమ్మత్తు జరిగింది. తొలుత దివ్యాన్షీ అనే అమ్మాయి రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. కానీ దివ్య అనే మరో అమ్మాయికి హిందీ పేపర్ రీ వాల్యుయేషన్‌లో ఎక్కువ మార్కులు రావడంతో దివ్యాన్షిని తోసిరాజని ఆమె నయా టాపర్‌గా అవతరించింది. ఇందులో ట్విస్ట్ ఏమిటంటే వారిద్దరూ కవలలు! వారిద్దరూ చదివింది ఒకే స్కూల్లో. మొత్తం 500 మార్కులకు దివ్యాన్షి 477 మార్కులతో తొలుత టాపర్‌గా నిలిచింది. కానీ హిందీ తప్ప అన్ని సబ్జెక్టుల్లోనూ ఆమె కంటే దివ్యకే ఎక్కువ మార్కులొచ్చాయి. హిందీలో మరీ 56 మార్కులే రావడంతో ఆమె రీ వాల్యుయేషన్‌కు వెళ్లింది. దాంతో ఏకంగా 38 మార్కులు కలిసి రావడంతో మొత్తం 479 మార్కులతో తన సోదరిని దాటేసింది. అలా మొత్తానికి టాప్ రెండు ర్యాంకులు చేజిక్కించుకున్న కవలలపై ప్రశంసలు కురుస్తున్నాయి. -
Telangana: ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదలయ్యాయి. బోర్డు కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ మంగళవారం ఉదయం విడుదల చేశారు. విద్యార్థులు సాక్షి ఎడ్యుకేషన్ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. ఈ ఏడాది మే నెలలో ఇంటర్మీడియెట్ రెగ్యులర్ పరీక్షలు జరిగాయి. ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థులకు ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించారు. ఎంసెట్ కౌన్సిలింగ్ ఉన్నందున విద్యార్థుల తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు సప్లిమెంటరీ ఫలితాలను ముందుగానే ప్రకటించారు. ఈ ఫలితాల్లో 48,816 మంది విద్యార్థులు పాస్ అయ్యారు. 47.74 ఉత్తీర్ణత శాతం నమోదైంది. మొత్తం 1,02,236 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వొకేషన్‌లో 12,053 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవ్వగా.. ఇందులో 7,843 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 65.07గా నమోదైంది. అయితే, సెప్టెంబర్ 5 నుంచి 8 వరకు రీకౌంటింగ్‌కు ఇంటర్ బోర్డు అవకాశం కల్పించింది. మరో వైపు ఇవాళ సాయంత్రం ఇంటర్ మొదటి సంవత్సరం సప్లిమెంటరీ ఫలితాలను ప్రకటించనున్నట్లు బోర్డు పేర్కొంది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు వార్షిక పరీక్షలతో సంబంధం లేకుండా ఎంసెట్‌కు హాజరవుతారు. అయితే ఇప్పటికే ఎంసెట్ ఫలితాలు ప్రకటించి, కౌన్సెలింగ్ ప్రక్రియ కూడా మొదలైంది. ఇందులో భాగంగా ధ్రువపత్రాల పరిశీలనకు విద్యార్థులు హాజరవ్వాల్సి ఉంటుంది. ఇంటర్ ఫెయిల్ అయి, సప్లిమెంటరీ పరీక్షలు రాసిన 1.13 లక్షల మంది విద్యార్థులు ఫలితాలు రాకపోవడంతో తొలిదశ ఎంసెట్ కౌన్సెలింగ్‌కు హాజరవ్వలేకపోతున్నారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు వారి తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీన్ని దృష్టిలో ఉంచుకుని ఫలితాలు విడుదల చేశారు ఇంటర్ బోర్డు అధికారులు. ఫలితాల కోసం డైరెక్ట్ లింక్స్ ఇవే జనరల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఒకేషనల్ గ్రూపుల ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి ఎంసెట్ కౌన్సెలింగ్ తేదీల్లో మార్పులు..? ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల కోసం నిరీక్షిస్తున్న వారికి ఉన్నత విద్యామండలి ఎంసెట్‌కు హాజరయ్యే అవకాశం కల్పించాలని సూత్రప్రాయంగా నిర్ణయించినట్లు తెలిసింది. వాస్తవానికి సెప్టెంబర్ 6న ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు జరగనుంది. ఈ కారణంగా సప్లిమెంటరీ రాసిన విద్యార్థులు తొలిదశ కౌన్సెలింగ్‌కు హాజరయ్యే అవకాశం కన్పించడం లేదు. దీన్ని దృష్టిలో ఉంచుకుని రిజిస్ట్రేషన్, ఆప్షన్ల నమోదు తేదీలను పొడిగించాలని నిర్ణయించారు. ఉన్నత విద్యామండలి అధికారులు మంగళవారం సమావేశమైన అధికారిక నిర్ణయం తీసుకునే వీలుంది. -
దేవుడు అన్యాయం చేసినా.. సీఎం న్యాయం చేస్తున్నారు
వెంగళరావునగర్: అవిభక్త కవలలైన వీణావాణీలకు దేవుడు కొంత అన్యాయం చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం తన వంతుగా తగిన న్యాయం చేస్తున్నారని మం త్రులు సత్యవతి రాథోడ్, సబితా ఇంద్రారెడ్డి అన్నారు. ఇంటర్ పరీక్షల్లో వీణావాణీలు ఫస్ట్‌క్లాస్ మార్కులతో బీ–గ్రేడ్‌లో పాసైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బుధ వారం మధురానగర్‌లోని మహిళా శిశుసం క్షేమ శాఖ కార్యాలయం శిశువిహార్‌లో ఆశ్రయం పొందుతున్న వీరిని మంత్రులు కలిశారు. తొలుత వారికి స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఉన్నత చదువులు ఏం చదవాలని అనుకుంటు న్నారని వీణావాణీలను ప్రశ్నించగా.. దానికి వారు తాము సీఏ చదవాలని అనుకుంటున్నామని సమాధానం చెప్పారు. కార్యాలయాలకు వెళ్లి ఉద్యోగాలు చేసే పరిస్థితి లేని కారణంగా సీఏ చదివితే ఇంట్లోనే ఉంటూ ఉద్యోగాలు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. వారి మాటలకు స్పందించిన మంత్రులు తప్పనిసరిగా మీ చదువులకు ప్రభుత్వం అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తుందని హామీ ఇచ్చారు. ఇప్పటికే వీణావాణీల తల్లికి ఇక్కడే ఉద్యోగం ఇచ్చారు. వీణావాణీలు సీఏ చదవడానికి శ్రీమేధ ఇన్స్టిట్యూట్లో ఉచితంగా కోర్సులు ఇప్పిస్తున్నామని, వారికి కావాల్సిన ల్యాప్‌టాప్‌లు కూడా త్వరలోనే అందజేస్తామని చెప్పారు. కార్యక్రమంలో మహిళా శిశుసంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇంటర్లో గురుకులాల హవా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన ఇంటర్ విద్యార్థులు అద్భుత ఫలితాలు సాధించారు. ఇంటర్ ఫలితాల్లో మహాత్మా జ్యోతిబాఫూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించి ప్రతిభ కనబరిచారు. ఇంటర్ రెండో సంవత్సర ఫలితాల్లో 93.84 శాతం, మొదటి సంవత్సరం ఫలితాలలో 86.14 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. 950కి పైగా మార్కులు పొంది న విద్యార్థుల సంఖ్య వందకు పైగా ఉంది. ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలను 2,755 మంది విద్యార్థులు రాయగా వారిలో 2,544 మంది పాసయ్యారు. మొదటి సంవత్సరం ఫలితాల్లో కొత్తగా ప్రారంభించిన ఒకేషనల్ కోర్సుల్లోనూ విద్యార్థులు తమ సత్తా చాటారు. నాగార్జునసాగర్‌లోని గురుకుల కాలేజీ ఫస్ట్, సెకండియర్ ఫలితాల్లో వంద శాతం ఉత్తీర్ణత సాధించింది. మెరుగైన ఫలితాలు సాధించిన విద్యార్థులను, అధ్యాపకులను, సిబ్బందిని బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్, ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, కార్యదర్శి మల్లయ్య బట్టు అభినందించారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థుల మెరుపులు.. తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యా సంస్థల సొసైటీకి చెందిన విద్యార్థినీ విద్యార్థులు మంచి ప్రతిభ కనబరిచారు. ఫస్టియర్ విద్యార్థులు 88.03 శాతం ఉత్తీర్ణులు కాగా, రాష్ట్రవ్యాప్త ఉత్తీర్ణత 64.25% మాత్రమే కావడం గమనార్హం. 17 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. సెకండియర్‌లో ఏకంగా 93.23 శాతం మంది (రాష్ట్ర ఉత్తీర్ణత 68.68%) ఉత్తీర్ణులయ్యారు. 41 కాలేజీలు నూటికి నూరు శాతం ఫలితాలు సాధించాయి. అత్యుత్తమ ఫలితాలు సాధించడం పట్ల ఎస్సీ అభివృద్ధి శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, సొసైటీ కార్యదర్శి రోనాల్డ్ రాస్లు హర్షం వ్యక్తం చేశారు. మరోవైపు గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల్లో చదివిన విద్యార్థులు కూడా మంచి ఫలితాలు సాధించారు. సెకండియర్‌లో 82.09 శాతం, ఫస్టియర్‌లో 78.75 శాతం ఫలితాలు వచ్చాయి. తేజావత్ భావనశ్రీ 984 మార్కులతో సెకండియర్ టాపర్‌గా నిలిచారు. ఇక రాష్ట్రంలోని ఏకలవ్య ఆదర్శ గురుకుల విద్యాలయాల్లో చదువుతున్న ఇంటర్ విద్యార్థులు ఇంటర్ ఫలితాల్లో 94.18 సగటుతో ఉత్తీర్ణులై తమ ప్రత్యేకతను నిలుపుకున్నారు. విద్యార్థులను మంత్రి సత్యవతి రాథోడ్ అభినందించారు. మైనారిటీ గురుకులాల వివరాలు ఇంకా ప్రకటించలేదు. -
ఇంటర్ ఫలితాలు: మార్కులు తక్కువ వచ్చాయని ఒకరు, ఫెయిల్ అయ్యానని మరొకరు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తక్కువ మార్కులతో పాస్ కావడంతో అవమానంగా భావించి ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఖైరతాబాద్ సమీపాన చింతలబస్తీలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం.. తెలంగాణ బోర్డు ఇంటర్ మార్కులను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చింతలబస్తికి చెందిన విద్యార్థి గౌతం కుమార్ (18) (ఎంపీసీ) తన ఇంటర్ ఫలితాలను తెలుసుకున్నాడు. అయితే అందులో తక్కువ మార్కులతో పాస్ కావడంతో అది అవమానంగా భావించిన గౌతం మనస్తాపం చెంది తన ఇంటిలోని ఫ్యాన్‌కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇది గమనించిన కుటుంబ సభ్యులు మొదటగా గౌతమ్‌ని స్థానిక మహావీర్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే గౌతం మృతి చెందడంతో కేసు నమోదు చేసుకుని శవ పరీక్ష నిమిత్తం సైఫాబాద్ పోలీసులు ఉస్మానియా ఆసుపత్రి తరలించారు. పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది.. ఖమ్మం: ఇంటర్ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపం చెంది ఓ విద్యార్థి బావిలోదూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఖమ్మం జిల్లాలో చోటుచేసుకుంది. కూసుమంచి మండలం జుజ్జులరావు పేట గ్రామానికి చెందిన సిరికొండ సాయి అనే విద్యార్థి కూసుమంచిలోని ఓ ప్రవేట్ కళాశాలలో ఇంటర్ ప్రధమ సంవత్సరం చదివి పరీక్షలు రాశాడు. తెలంగాణలో వెలువడిన ఇంటర్ ఫలితాల్లో సాయి మూడు సబ్జెక్టులలో పెయిల్ అయ్యాడు. దీంతో మనస్తాపం చెందిన సాయి గ్రామ సమీపంలో ఉన్న బావిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సాయి ఇంటి వద్ద కనిపించకపోవడంతో అనుమానం వచ్చిన సాయి తల్లితో పాటు, స్థానికులు చుట్టు పక్కల వెతుకుతుండగా బావి వద్ద సాయి చెప్పులు కనిపించాయి. దీంతో అక్కడికి వెళ్లి చూడగా బావిలో సాయి మృత దేహం కనిపించింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: నెలకావట్టే.. నేల చదునాయే! మేఘమా.. మరువకే! -
ఇంటర్ ఫలితాలు విడుదల.. బాలికలు భళా
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ పరీక్ష ఫలితాల్లో బాలికలే పైచేయి సాధించారు. బాలుర కన్నా బాలికలే ఎక్కువ శాతం ఉత్తీర్ణులయ్యారు. ఫస్టియర్‌లో 76 శాతం ఫలితాలతో మేడ్చల్ మొదటి స్థానంలో, 74 శాతంతో హనుమకొండ రెండో స్థానంలో నిలిచింది. రెండో ఏడాదిలో సైతం 78 శాతం ఉత్తీర్ణతతో మేడ్చల్ మొదటి స్థానంలో నిలువగా, 77 శాతంతో కుమురం భీం ఆసిఫాబాద్ రెండో స్థానంలో ఉంది. మే నెలలో జరిగిన ఇంటర్ పరీక్షలకు సంబంధించిన ఫలితాలను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోవిడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, సీజీజీ డైరెక్టర్ ఖాలిక్, పరీక్షల విభాగం ఓఎస్డీ సుశీల్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఫస్టియర్‌లో..: ఫస్టియర్‌లో మొత్తం 4,64,892 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,94,378 మంది ఉత్తీర్ణులయ్యారు. ఎక్కువ మంది (1,93,925) ‘ఎ’గ్రేడ్ సాధించారు. 63,501 మంది ‘బి’గ్రేడ్, 24,747 మంది ‘సి’గ్రేడ్, 12,205 మంది ‘డి’గ్రేడ్ సాధించారు. బాలికలు 2,33,210 మంది పరీక్ష రాస్తే, 1,68,692 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,31,682 మందికి గాను 1,25,686 మంది పాసయ్యారు. సెకెండియర్.. ద్వితీయ సంవత్సరంలో మొత్తం 4,42,895 మంది పరీక్ష రాశారు. వీరిలో 2,97,458 మంది పాసయ్యారు. ఈ సంవత్సరంలో కూడా ఎక్కువమందికి (1,59,432) ‘ఎ’గ్రేడ్ వచ్చింది. 82,501 మంది ‘బి’గ్రేడ్, 35,829 మంది ‘సి’గ్రేడ్, 18,243 మంది ‘డి గ్రేడ్’సాధించారు. 2,19,271 మంది బాలికలు పరీక్ష రాస్తే 1,65,060 మంది, 2,23,624 మంది బాలురుకు గాను 1,32,398 మంది ఉత్తీర్ణులయ్యారు. ఆగస్టు 1 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ: సబిత ఈ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం ఆగస్టు ఒకటి నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సబిత తెలిపారు. ఈ నెల 30 నుంచి దరఖాస్తు చేసుకోవచ్చని, ఆగస్టు చివరి నాటికి ఫలితాలు వెల్లడిస్తామని చెప్పారు. కోవిడ్ కాలంలోనూ విద్యా ప్రమాణాల మెరుగుదలకు అధికారులు తీసుకున్న చొరవను అభినందించారు. ఒకే క్లిక్‌లో ఇంటర్ ఫస్టియర్, సెంకడ్ ఇయర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. ఎంపీసీలోనే ఎక్కువ ఉత్తీర్ణత ఇంటర్ ఫలితాల్లో ఎంపీసీ గ్రూపు విద్యార్థులే ఎక్కువమంది ఉత్తీర్ణులయ్యారు. రెండు సంవత్సరాల్లోనూ 70 శాతానికిపైగా విద్యార్థులు పాసయ్యారు. రెండో స్థానంలో బైసీపీ ఉంటే, హెచ్ఈసీ, సీఈసీ గ్రూపుల విద్యార్థుల ఉత్తీర్ణత 50 శాతానికి కూడా చేరుకోలేదు. ఉత్తీర్ణత ఇలా.. ఫస్టియర్ : 63.32% సెకెండియర్: 67.16% ఫస్టియర్: బాలికలు: 63.32% బాలురు: 54.25% సెకెండియర్: బాలికలు: 75.28% బాలురు: 59.21% గ్రూపుల వారీగా ఉత్తీర్ణత శాతం ఫస్టియర్ సెకెండియర్ ఎంపీసీ 76.3 79.6 బైపీసీ 71.9 75.3 సీఈసీ 44.4 47.7 హెచ్ఈసీ 31.8 45.7 ఎంఈసీ 64.7 69.4 ––––––––– 2018–22 వరకూ ఇంటర్ జనరల్ (ఒకేషనల్ కాకుండా) విభాగంలో ఫలితాలు (శాతాల్లో) ఇలా... ఫస్టియర్ సెకెండియర్ 2018 62.74 67.08 2019 60.60 64.94 2020 61.07 69.61 2021 100 100 2022 64.85 68.88 (నోట్: 2021లో కోవిడ్ వల్ల పరీక్షలు లేకుండానే పాస్ చేశారు) -
TS Inter Results 2022: రేపే తెలంగాణ ఇంటర్ ఫలితాలు..
సాక్షి, హైదరాబాద్: ఎట్టకేలకు ఇంటర్ ఫలితాలపై బోర్డు స్పష్టత ఇచ్చిం. గత కొన్ని రోజులుగా నెలకొన్న సస్పెన్స్‌కు తెర దించింది. ఇంటర్మీడియెట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్ష ఫలితాలను రేపు(మంగళవారం) విడుదల చేస్తున్నట్టు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ ఆదివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఉదయం 11 గంటలకు ఫలితాలు విడుదల చేస్తారని ఆయన తెలిపారు. పరీక్షలు మే 23న పూర్తికాగా, పరీక్షలు పూర్తయిన నెల రోజుల్లో ఫలితాలు వెల్లడిస్తామని షెడ్యూల్ విడుదల చేసినప్పుడే ఇంటర్ బోర్డు ప్రకటించింది. చదవండి: సత్ఫలితాలిస్తున్న ‘నయీ కిరణ్’.. సాయం పొందండిలా! ఆ తర్వాత ఈ నెల 20వ తేదీ నాటికే ప్రకటిస్తామని అధికారులు తెలిపారు. అందుకు తగ్గట్టుగానే మూల్యాంకనం పూర్తి చేశారు. అయితే, కొన్ని జిల్లాల్లో మార్కుల క్రోడీకరణలో సాంకేతిక సమస్యలు తలెత్తినట్టు తెలిసింది. కొంతమంది విద్యార్థులకు తక్కువ మార్కులు రావడంతో సమాధాన పత్రాలను అనేక సార్లు క్షుణ్ణంగా పరిశీలించినట్టు తెలిసింది. చివరకు ఈ నెల 25న ఫలితాల వెల్లడికి రంగం సిద్ధం చేశారు. కానీ ప్రభుత్వ కాలేజీల్లో ఫలితాలు తగ్గడంపై ప్రభుత్వం కొంత ఆలోచనలో పడ్డట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత శాతాన్ని పెంచేలా ప్రభుత్వ స్థాయిలో కొన్ని సూచనలు చేసినట్టు సమాచారం. ఈ కారణంగా ఫలితాల వెల్లడి ఆలస్యమైనట్టు బోర్డు వర్గాలు తెలిపాయి. ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు. -
ఇంటర్లో 61% ఉత్తీర్ణత
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఇంటర్మీడియట్– 2022 సెకండియర్ పరీక్ష ఫలితాల్లో 61 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. విజయవాడలో బుధవారం ఈ పరీక్ష ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. పరీక్షలు పూర్తయిన 28 రోజుల్లోనే ఇంటర్మీడియట్ బోర్డు ఈ ఫలి తాలను ప్రకటించింది. ఇంటర్ పరీక్షలు రాసిన మొత్తం 9,41,358 మందిలో రెగ్యులర్ స్ట్రీమ్ విద్యార్థులు 8,69,059 మంది, వొకేష నల్ విద్యార్థులు 72,299 మంది ఉన్నారు. రెగ్యులర్ స్ట్రీమ్‌లో ఫస్టియర్‌లో 4,45,604 మందికిగాను 2,41,591 (54 శాతం) మంది, సెకండియర్‌లో 4,23,455 మందికిగాను 2,58,449 (61 శాతం) మంది ఉత్తీర్ణుల య్యారు. ఈసారి ఫలితాల్లో బాలురకన్నా బాలికలు ఎక్కువమంది పాసయ్యారు. ఫస్టియర్‌లో బాలురు 49 శాతం, బాలికలు 60 శాతం మంది, సెకండియర్‌లో బాలురు 54 శా తం, బాలికలు 68 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఇంటర్ వొకేషనల్ పరీక్షల్లో ఫస్టియర్‌లో 45 శాతం, సెకండియర్‌లో 55 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. కృష్ణాజిల్లా టాప్ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాల్లో విద్యార్థుల ఉత్తీర్ణతలో కృష్ణాజిల్లా అగ్రస్థానంలో నిలిచింది. సెకండియర్‌లో 72 శాతం ఉత్తీర్ణతతో కృష్ణాజిల్లా మొదటిస్థానంలో ఉండగా 50 శాతం ఉత్తీర్ణత తో వైఎస్సార్ జిల్లా చివరిస్థానంలో ఉంది. సెకండియర్‌లో కృష్ణాలో బాలురు 66 శాతం, బాలికలు 72 శాతం మంది, వైఎస్సార్ జిల్లాలో బాలురు 34 శాతం, బాలికలు 47 శాతం మంది పాసయ్యారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీకి ఫీజు చెల్లింపు గడువు జూలై 8 ఫలితాలు విడుదల చేసిన మంత్రి బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలను ఆగస్టు 3వ తేదీ నుంచి 12వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు చెప్పారు. రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు తొలిసెషన్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు రెండో సెషన్ కింద ఈ పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఫెయిలైన వారితోపాటు ప్రస్తుతం పాసైన విద్యార్థులు మార్కుల ఇంప్రూవ్‌మెంటుకోసం కూడా ఈ పరీక్షలకు దరఖాస్తు చేయవచ్చని చెప్పారు. ప్రాక్టి కల్స్ ఆగస్టు 17 నుంచి 22 వరకు జరుగు తాయన్నారు. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజును ఈనెల 25 నుంచి జూలై 8వ తేదీ లోగా చెల్లించాలని చెప్పారు. ప్రస్తుత ఫలితాలకు సంబంధించి మార్కుల రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌కు ఈనెల 25 నుంచి జూలై 5వ తేదీవరకు దరఖాస్తు చేయవచ్చని తెలిపారు. ఫెయిలైన ప్రభుత్వ కాలేజీల విద్యార్థుల కోసం ప్రత్యేక తరగతులు నిర్వహించనున్నామన్నారు. ఇవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు గతంలోకన్నా ఈసారి ఇంటర్మీడియట్లో ప్రమాణాలతో కూడిన ఫలితాలు వచ్చినట్లు మంత్రి బొత్స చెప్పారు. విద్యార్థులు చూపిన ప్రతిభ మేరకు ఫలితాల శాతాలు ఉంటాయన్నారు. మాస్‌కాపీయింగ్ చేయిస్తే ఉత్తీర్ణత శాతాలు పెరుగుతాయని, కానీ అవి ప్రమాణాలతో కూడిన ఫలితాలు కావని చెప్పారు. ఈ సందర్భంగా 2017 నుంచి ఇంటర్మీడియట్ పరీక్షల ఉత్తీర్ణత శాతాలను మంత్రి వివరించారు. విద్యార్థులు ఉత్తమ ప్రమాణాలతో కూడిన విద్యను నేర్చుకునేలా విద్యాసంస్థల్లో తగిన వాతావరణాన్ని తమ ప్రభుత్వం కల్పిస్తోందని తెలిపారు. ప్రభుత్వ చర్యల వల్ల ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేరికలు గణనీయంగా పెరుగుతున్నాయన్నారు. గతంలో ప్రభుత్వంలో 38 శాతం, ప్రైవేటులో 65 శాతం మంది విద్యార్థులుంటే.. ఇప్పుడు ప్రభుత్వంలో 60 శాతం, ప్రైవేటులో 40 శాతం మంది విద్యార్థులున్నారని చెప్పారు. చంద్రబాబులా డబ్బాలు కొట్టుకోవడం కాకుండా విద్యాసంస్థల్లో అభివృద్ధి పనులు చేస్తున్నందునే తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారని వివరించారు. ముందుగా టెట్ నిర్వహించి అనంతరం అవసరం మేరకు డీఎస్సీని కూడా పెడతామని ఆయన చెప్పారు. -
తెలంగాణ ఇంటర్ ఫలితాలు 26న..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలు ఈ నెల 26న వెల్లడించే అవకాశాలున్నాయి. పదవ తరగతి పరీక్షా ఫలితాలను ఈ నెల 30లోగా విడుదల చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇంటర్ ఫలితాల వెల్లడికి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నుంచి బోర్డు అధికారులు అనుమతి కోరినట్టు తెలిసింది. ఫలితాల ప్రకటనపై ట్రయల్ రన్ చేస్తున్న అధికారులు, ఈ ప్రక్రియ ఒకటి రెండురోజుల్లో పూర్తవుతుందనే ధీమాతో ఉన్నారు. తొలుత ఈ నెల 25న ఫలితాల వెల్లడిపై అధికారులు ఆసక్తి చూపారు. ఈ విషయాన్ని మంత్రి దృష్టికి కూడా తీసుకెళ్ళినట్టు సమాచారం. మూల్యాంకనం తర్వాత మార్కులను కంప్యూటర్ ద్వారా ఫీడ్ చేశారు. ఈ క్రమంలో తప్పులు దొర్లినట్టు అధికారులు గమనించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో సగటు ఫలితాల విశ్లేషణలో ఎక్కువ మొత్తంలో తేడా ఉన్నట్టు తెలియడంతో కలవరపడ్డారు. దీంతో మరోసారి సమగ్ర విశ్లేషణకు సిద్ధమయ్యారు. టెన్త్ ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు.. టెన్త్ పరీక్ష ఫలితాలు ఈ నెల 30 నాటికి వెల్లడిస్తామని పరీక్షల విభాగం ఉన్నతాధికారి తెలిపారు. మూల్యాంకన ప్రక్రియ పూర్తయిన తర్వాత, సాంకేతికపరమైన అన్ని విషయాలను త్వరగా ముగించేందుకు ప్రయత్నిస్తున్నామని, డీకోడింగ్ తర్వాత వివిధ సబ్జెక్టుల మార్కుల క్రోడీకరణ జరిగిందని వివరించారు. వీటిని మరోసారి సమ గ్రంగా పరిశీలించి తుది నిర్ణయానికి వస్తామని పేర్కొన్నారు. అనుకున్న సమయానికి ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పొరపాట్లు దొర్లనివ్వొద్దు: మంత్రి వివరాలన్నీ తెలుసుకున్న మంత్రి ఆలస్యమైనా పర్వాలేదని, అన్నీ పరిశీలించిన తర్వాతే ఫలితాల విడుదలకు సిద్ధమవ్వా లని అధికారులకు సలహా ఇచ్చినట్టు తెలిసింది. గత ఏడాది కోవిడ్ నేపథ్యంలో ఫస్టియర్ ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం అతి తక్కువగా (49%) రావడం రాష్ట్రవ్యాప్తంగా కలకలం సృష్టించింది. విద్యార్థుల్లో పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తమైంది. దీంతో కనీస మార్కులతో అందరినీ పాస్ చేయాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా కోవిడ్ తీవ్రత మధ్యే విద్యార్థులు ఇంటర్ పరీక్షలు రాశారు. ఇలాంటి సమయంలో పొరపాట్లు దొర్లి ఉత్తీర్ణతలో తేడా వస్తే విద్యార్థులు తీవ్ర ఆందోళనకు దిగే అవకాశం ఉందని అధికారులకు మంత్రి సూచించినట్టు తెలిసింది. నిశితంగా పరిశీలించి అన్నీ బాగున్నాయని నిర్థారించుకుంటే ఈ నెల 26వ తేదీన ఫలితాల వెల్లడికి సిద్ధం కావాలని చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఫలితాల క్రాస్ చెక్‌పై సీరియస్‌గా దృష్టి పెట్టిన అధికారులు 24వ తేదీ లోగానే దీన్ని పూర్తి చేసుకుని, 25న మంత్రిని మరోసారి కలిసే అవకాశం ఉందని బోర్డు అధికారి ఒకరు తెలిపారు. 26వ తేదీన ఫలితాల వెల్లడికి కృషి చేస్తున్నామని చెప్పారు. -
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
-
ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ -2022 ఫలితాలు వచ్చేశాయ్. బుధవారం మధ్యాహ్నం విజయవాడలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఏపీ ఇంటర్ ఫస్టియర్, సెకండియర్ ఫలితాలను విడుదల చేసి.. మీడియాతో ఫలితాల గురించి మాట్లాడారు. ఫస్టియర్‌లో 2,41,591 మంది పాస్ కాగా, ఫస్టియర్‌లో 54 శాతం ఉత్తీర్ణత నమోదు అయ్యింది. సెకండియర్‌లో 2,58,449 మంది పాస్ కాగా, 61 ఉత్తీర్ణత శాతం రికార్డు అయ్యింది. ఇంటర్ ఫస్ట్, సెకండ్ ఇయర్ ఫలితాల్లో బాలికలదే పైచేయిగా ఉంది. ఉత్తీర్ణతలో కృష్ణా జిల్లా టాప్‌గా నిలిచిందని, రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం జూన్ 25వ తేదీ నుంచి జులై 5వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. రికార్డు స్థాయిలో 28 రోజుల్లోనే ఫలితాలు విడుదల చేయడం గమనార్హం. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా.. జవాబు పత్రాల మూల్యాంకనాన్ని వేగంగా, జాగ్రత్తగా పూర్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. -
AP Inter Results 2022: ఇంటర్ ఫలితాలు విడుదల.. డైరెక్ట్ లింక్ ఇదే..
సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షల ఫలితాలు జూన్ 22వ తేదీ (బుధవారం) విడుదలయ్యాయి. విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ విజయవాడలో ఫలితాలను విడుదల చేశారు. కాగా, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా పూర్తి చేశారు. మే 6వ తేదీ నుంచి ఫస్టియర్, 7వ తేదీ నుంచి సెకండియర్ పరీక్షలు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. ఆంధ్రప్రదేశ్ ఇంటర్ ఫలితాలను సాక్షిఎడ్యుకేషన్.కామ్(www.sakshieducation.com)లో చూడొచ్చు. 10.01 లక్షల మంది విద్యార్థులు.. ఈ సారి రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,456 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. మొత్తం 10.01 లక్షల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు. మే 24వ తేదీ వరకు జరిగిన ఈ పరీక్షలను ఏపీ ఇంటర్ బోర్డు పటిష్ట ఏర్పాట్లతో పూర్తిచేసింది. ఈ సారి పరీక్షలను.. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో నెలకొన్న ఘటనలను దృష్టిలో పెట్టుకొని ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా అధికారులు జాగ్రత్త పడ్డారు. అలాగే పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లోనూ, బయట సీసీ కెమెరాలను అమర్చారు. ఈ కెమెరాల ద్వారా పరీక్షల తీరుతెన్నులను రికార్డు చేయడంతోపాటు వాటన్నింటినీ ఇంటర్ బోర్డు కార్యాలయానికి అనుసంధానించారు. ఆన్లైన్ స్ట్రీమింగ్ ద్వారా బోర్డు అధికారులు పరీక్షలు జరుగుతున్న తీరును నిత్యం పరిశీలిస్తారు. జిల్లాల్లో కలెక్టర్ల ఆధ్వర్యంలోని ప్రత్యేక కమిటీలు ఇంటర్ పరీక్షలను పర్యవేక్షించారు. -
20లోగా ఇంటర్ ఫలితాలు.. నెలాఖరుకు టెన్త్ ఫలితాలు కూడా..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెన్త్, ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా సాగుతోంది. ఇంటర్ స్పాట్ వ్యాల్యుయేషన్ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. దీంతో ఈ నెల 20లోగా ఇంటర్ ఫలితాలు వెల్లడించాలని ఇంటర్ బోర్డ్ కృత నిశ్చయంతో ఉంది. ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు ఈ నెల 11 నాటికి టెన్త్ మూల్యాంకన ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది. ఈ నేపథ్యంలో టెన్త్ ఫలితాలను ఈ నెల 30లోగా వెల్లడిస్తామని ఎస్సెస్సీ బోర్డ్ అధికారులు స్పష్టం చేశారు. కరోనాతో గత రెండేళ్లుగా విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్నాయి. టెన్త్, ఇంటర్ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్ చేశారు. రెండేళ్ల తర్వాత టెన్త్ పరీక్షలు జరగడంతో ఈసారి 11 ప్రశ్నపత్రాలకు బదులు 6 మాత్రమే ఇచ్చారు. పరీక్షల సమయాన్ని పెంచారు. ఇంటర్, టెన్త్‌కు 70 శాతం సిలబస్ మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కరోనా వ్యాప్తి తగ్గడంతో ఈసారి విద్యాసంవత్సరం సాధారణ సమయాల్లోనే చేపట్టాలని భావిస్తున్నారు. -
జూన్ 20 నాటికి ఇంటర్ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షలు మంగళవారంతో ముగియనున్న నేపథ్యంలో అధికారులు సమాధాన పత్రాల మూల్యాంకన ప్రక్రియ వేగం పెంచారు. వాస్తవానికి సంస్కృతం పేపర్ మూల్యాంకనం ఈ నెల 12నే ప్రారంభమైంది. తాజాగా ఆదివారం సబ్జెక్టుల మూల్యాంకనం చేపట్టారు. హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మూల్యాంకన కేంద్రాలను ఇంటర్ విద్య కమిషనర్ సయ్యద్ ఒమర్ జలీల్ పరీశీలించారు. కేంద్రాల్లో ఏర్పాట్లను ఆయన అడిగి తెలుసుకున్నారు. మూల్యాంకన విధానంలో పాటించాల్సిన పద్ధతులను వివరించారు. మూల్యాంకనం కోసం ఇంటర్ బోర్డు రాష్ట్రవ్యాప్తంగా 14 కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఈసారి ఇంటర్ పరీక్షలు విభిన్నమైన వాతావరణంలో జరిగాయి. కోవిడ్ వల్ల టెన్త్ పరీక్షలు రాయకుండానే విద్యార్థులు ఇంటర్లో ప్రవేశాలు పొందారు. ఫస్టియర్ పరీక్షలు లేకుండానే ద్వితీయ సంవత్సరం కొనసాగించినా, ఆ తర్వాత మళ్లీ పరీక్షలు పెట్టారు. కానీ 49 శాతం ఉత్తీర్ణత మాత్రమే వచ్చింది. కోవిడ్ వల్ల క్లాసులు జరగకపోవడం వల్లే పాస్ అవలేకపోయామని విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగారు. కొంతమంది ఆత్మహత్యలకు కూడా పాల్పడ్డారు. దీంతో అందరినీ కనీస మార్కులతో పాస్ చేశారు. ఇప్పుడు వాళ్లంతా ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశారు. వీరి కోసం ఇంటర్ బోర్డు ప్రత్యేక స్టడీ మెటీరియల్ అందించింది. పరీక్ష ఫలితాలను జూన్ 20 నాటికి వెల్లడిస్తామని అధికారులు ప్రకటించారు. ఫలితాలు వచ్చిన 15 రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పెడతామని తెలిపారు. -
ఫెయిలైన విద్యార్థులంతా పాస్..
-
తెలంగాణ ఇంటర్ ఫలితాలపై కొనసాగుతున్న ఆందోళనలు
-
Inter Results: కరోనా చదువు ‘ప్రాణాల’మీదకొచ్చింది
సాక్షి, వరంగల్/నెట్వర్క్: ఇంటర్ ఫస్టియర్ పరీక్ష ఫలితాలు విద్యార్థుల్లో కలకలం రేపుతున్నాయి. దాదాపు 50 శాతం మంది ఫెయిలవడంతో కలవరపడుతున్నారు. ఫెయిల్ అయినందుకు ఇంట్లో ఏమంటారో.. ఊళ్లో చులకనగా చూస్తారేమో.. ఇలా ఎన్నో ఆలోచనలు విద్యార్థుల మెదళ్లను తొలిచేస్తున్నాయి. దీంతో మనస్తాపానికి లోనై ఉసురు తీసుకోవాలని తలపోస్తున్నారు. శుక్రవారం వివిధ ప్రాం తాల్లో ముగ్గురు విద్యార్థులు బలవన్మరణం పొంద గా, పలుచోట్ల ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పరీక్ష తప్పిన విద్యార్థులు కలవరపడకుండా.. రాబోయే పరీక్షలకు సిద్ధం కావాలని నిపుణులు చెబుతున్నారు. తల్లిదండ్రులు విద్యార్థులకు మనోధైర్యం కల్పించాలని సూచిస్తున్నారు. చురుకైన విద్యార్థి తప్పాడు నిజామాబాద్ అర్బన్: నగరంలోని అర్సపల్లిలో ఇంటర్ విద్యార్థి యశ్వంత్ (17) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో ఎంపీసీ సెకండియర్ చదువుతున్నాడు. మొదటి సంవత్సరం పరీక్షల్లో మూడు సబ్జెక్టులు తప్పాడు. దీంతో మనస్తాపానికి గురైన యశ్వంత్ రాత్రి 8.30 సమయంలో ఇంట్లోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. ఎప్పటిలాగే యశ్వంత్ టీవీ చూడ టంగానీ, సెల్‌ఫోన్‌తో కాలక్షేపం గానీ చేస్తుంటాడని అతడి తల్లి భావించింది. కొద్దిసేపటి తర్వాత ఆమె తలుపు తీసేందుకు వెళ్లగా గడియవేసి ఉంది. పిలిచినా స్పందన రాలేదు. అనుమానం వచ్చిన ఆమె పొరుగువారితో కలిసి తలుపులు బద్దలు కొట్టగా యశ్వంత్ ఫ్యాన్‌కు ఉరివేసుకొని వేలాడుతూ కనిపించాడు. వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. అయితే యశ్వంత్ చదువులో చురుకైన విద్యార్థి అని, పదో తరగతిలోనూ 9.0 గ్రేడ్ మార్కులు వచ్చాయని కుటుంబ సభ్యులు తెలిపారు. యశ్వంత్ మరణంపై పీడీఎస్‌యూ, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వరంలో నిజామాబాద్‌లో ఆందోళన నిర్వహించారు. రైలుకు ఎదురుగా వెళ్లి.. నల్లగొండ క్రైం: నల్లగొండ పట్టణంలోని గాంధీనగర్‌కు చెందిన వాలుగొండ హరికృష్ణ కూతురు జాహ్నవి (16) ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతోంది. మ్యాథ్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. అందులో 75 మార్కులకుగాను 13 మార్కులు వచ్చాయి. వేల రూపాయలు ఫీజులు కట్టి చదివిస్తే ఇలా ఫెయిల్ అయితే ఎలా? అని తండ్రి మందలించారు. గురువారం రాత్రంతా జాహ్నవి బాధపడడం గమనించిన కుటుంబ సభ్యులు.. ఇకనైనా బాగా చదువుకో అని ధైర్యం చెప్పారు. శుక్రవారం ఉదయం 5 గంటలకు జాహ్నవి ఇంట్లో నుంచి రైల్వే స్టేషన్ వద్దకు వెళ్లింది. రైలుకు ఎదురుగా వెళ్లి ఆత్మహత్య చేసుకుంది. రైల్వే ఎస్సై కోటేశ్వర్రావు కేసు దర్యాప్తు చేస్తున్నారు. జాహ్నవి మ్యాథ్స్ మినహా మిగిలిన సబ్జెక్టుల్లో 56 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించింది. భూపాలపల్లి జిల్లాలో... చిట్యాల: భూపాలపల్లి జిల్లా చిట్యాల మండలంలో కొల్లూరి వరుణ్ (19) ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. చల్లగరిగ గ్రామానికి చెందిన బాబు–పూలమ్మ దంపతుల కుమారుడు వరుణ్ హనుమకొండలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఫస్టియర్ ఫలితాల్లో ఫెయిలవడంతో మనస్తాపానికి గుర య్యాడు. శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఫిజిక్స్‌లో ఫెయిలయ్యానని.. కమలాపూర్: ఇంటర్ పరీక్షల్లో ఫెయిలయ్యాననే బాధతో ఓ విద్యార్థిని హాస్టల్ భవనం పైనుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన హనుమకొండ జిల్లాలో చోటుచేసుకుంది. దామెర మండలం పసరగొండకు చెందిన దామెర లత (17) కమలాపూర్‌లోని తెలంగాణ మోడల్ స్కూల్ హాస్టల్లో ఉంటూ బైపీసీ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఫస్టియర్‌లో ఫిజిక్స్‌లో లతకు 14 మార్కులు వచ్చాయి. దీంతో ఆమె శుక్రవారం మధ్యాహ్నం హాస్టల్ భవనం పైకెక్కి కిందకు దూకింది. తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం స్థానిక పీహెచ్‌సీకి, అక్కడి నుంచి వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించామని ప్రిన్సిపాల్ డాక్టర్ జి.అనిత తెలిపారు. లతకు ప్రాణాపాయం లేదని, ప్రస్తుతం క్షేమంగా ఉందని వైద్యులు చెప్పారన్నారు. లత హాస్టల్ భవనం పైకెక్కి కిందికి దూకేందుకు సిద్ధమైన తరుణంలో లహరి, సోమేశ్వరి అనే విద్యార్థినులు చూసి దూకొద్దని హెచ్చరించారు. అయినా వినకుండా లత కిందికి దూకగా ఆ విద్యార్థినులు తమ రెండు చేతులను అడ్డుపెట్టి ఆమెను ఒడిసిపట్టేందుకు యత్నించారు. అయినా లత తమ చేతుల్లో నుంచి కిందకు పడిపోయిందని వారు చెప్పారు. కుషాయిగూడలో అదృశ్యం కుషాయిగూడ: ఇంటర్ తప్పడంతో ఓ విద్యార్థి కనిపించకుండా పోయిన ఘటన కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో వెలుగుచూసింది. ప్రకాశం జిల్లా ఇంకోలుకు చెందిన ఆరే తరుణ్ (17)కుషాయిగూడలోని బంధువుల ఇంట్లో ఉంటూ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. పరీక్షల్లో ఫెయిలవడంతో గురువారం సాయంత్రం ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. పరీక్షలనూ జయించొచ్చు ఆన్లైన్ చదువుల వల్ల ప్రతి విద్యార్థి చేతికి సెల్‌ఫోన్ వచ్చింది. ఈ క్రమంలో సోషల్ మీడియాకు బాగా అలవాటుపడ్డారు. అయితే రెగ్యులర్‌గా కళాశాలలు లేకపోవడంతో ఒక్కసారిగా గతంలో ఉన్న పాత వాతావరణానికి అలవాటుపడేందుకు చాలా ఇబ్బందులు పడ్డారు. ఇదే సమయంలో పరీక్షలు నిర్వహించడంతో అనుకున్నమేర ప్రదర్శన చేయలేకపోయారు. అయితే కరోనా తెచ్చిన ఈ విభిన్న వాతావరణం నుంచి బయటపడేందుకు ప్రణాళిక రూపొందించుకుని కసరత్తు చేయాలి. పరీక్షలు జయించడమనేది పెద్ద లెక్క కాదు. –అనూష వినయత, రైజ్‌అప్ ఫౌండేషన్ అండ్ కౌన్సెలింగ్ సెంటర్ ప్రిపరేషన్ సమయం ఇవ్వలేదు కోవిడ్ నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాస్‌లు అంతంత మాత్రమే జరిగాయి. స్మార్ట్ఫోన్లు లేని వారికి అసలే అందలేదు. టెన్త్ నుంచి ఇంటర్లో అడుగిడాక ప్రత్యక్ష బోధనే జరగలేదు. వారికి ఇంటర్ సబ్జెక్టులపై ప్రాథమిక అవగాహన రాలేదు. కోవిడ్‌తో పరీక్షలు నిర్వహించకుండా సెకండియర్‌కు ప్రమోట్ చేశారు. దీంతో పరీక్షలు ఉండవనే భావన విద్యార్థుల్లో ఏర్పడింది. హడావుడిగా ఫస్టియర్ పరీక్షలు నిర్వహించారు. సిలబస్ తగ్గించినా ప్రిపరేషన్‌కు సయయం ఇవ్వలేదు. –బాబురావు, రిటైర్డ్ లెక్చరర్, హనుమకొండ ప్రభుత్వ కళాశాల -
తెలంగాణ: ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు విడుదల
Telangana Inter First Year Results 2021: తెలంగాణ ఇంటర్ ఫస్టియర్ ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ ఫస్ట్ ఇయర్లో మొత్తం 4,59,242 మంది విద్యార్థులు పరీక్ష రాయగా.. 2,24,012 మంది (49శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఇందులో బాలికలు 56 శాతం ఉండగా.. బాలురు 42 శాతం ఉత్తీర్ణత సాధించారు. కాగా కరోనా మహమ్మారి కారణంగా గత సంవత్సరం రద్దయిన ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలను అక్టోబర్ 25, 2021 నుంచి నవంబర్ 3, 2021 వరకు నిర్వహించిన విషయం తెలిసిందే. విద్యార్థులు ఫలితాల కోసం తెలంగాణ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ అధికారిక వెబ్సైట్ tsbie.cgg.gov.in లో చూసుకోవచ్చు. చదవండి: (అవినీతి కేసులో డీఎస్పీ జగన్ అరెస్టు ) ఇంటర్ ఫస్టియర్ ఫలితాల కోసం క్లిక్ చేయండి -
ఇంటర్ ఫలితాలు: ‘అసంతృప్తి ఉంటే.. పరీక్షలకు సిద్ధం’
-
ఏపీ ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
తెలంగాణ : ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
-
TS Inter Results 2021: ఇంటర్ సెకండియర్ ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఇంటర్ సెకండియర్ ఫలితాలు సోమవారం విడుదలయ్యాయి. విద్యాశాఖా మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఫీజు చెల్లించిన 4,51,585 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 1,76,719 మంది ‘ఏ’ గ్రేడ్... 1,04,888 మంది ‘బీ’ గ్రేడ్ సాధించారు. ఇక 61,887 మంది ‘సీ’ గ్రేడ్... 1,08,093 మంది ‘డీ’ గ్రేడ్‌లో ఉత్తీర్ణులయ్యారు. కాగా ఫస్టియర్ మార్కుల ఆధారంగా సెకండియర్ మార్కులు కేటాయించారు. ఇంటర్ సెకండియర్ ప్రాక్టికల్స్‌కు వందశాతం మార్కులు ఇచ్చారు. కాగా మంగళవారం వెబ్సైట్లో పూర్తి వివరాలు అందుబాటులోకి రానున్నాయి. ఇక మహమ్మారి కరోనా వ్యాప్తి కారణంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులను ప్రమోట్ చేసి, సెకండియర్ పరీక్షలను తెలంగాణ ప్రభుత్వం రద్దు చేసిన విషయం తెలిసిందే. ద్వితీయ సంవత్సర విద్యార్థులకు మార్కులు కేటాయించే విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ చేసిన సిఫారసులను ప్రభుత్వం ఆమోదించింది. ఈ నేపథ్యంలో ఫలితాల వెల్లడికి మార్గం సుగమమైంది. చదవండి: ఇంటర్ సెకండియర్ ఫలితాల వెల్లడి: మార్గదర్శకాల్లోని ప్రధాన అంశాలివీ..! -
వారంలో టెన్త్, ఇంటర్ ఫలితాలివ్వాలి
సాక్షి, అమరావతి: టెన్త్, ఇంటర్ ఫలితాల వెల్లడిపై దృష్టి సారించాలని అధికారులను విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ ఆదేశించారు. శనివారం విద్యా శాఖ ఉన్నతాధికారులతో మంత్రి వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టెన్త్, ఇంటర్ ఫలితాల కోసం త్వరితగతిన ఉన్నత స్థాయి నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వారం రోజుల్లో ఫలితాలు ప్రకటించేలా చూడాలని సూచించారు. పాఠశాలలు తెరిచే అంశంపై లోతుగా పరిశీలన చేయాలని ఆదేశించారు. 2021–22 అకడమిక్ క్యాలెండర్ తయారు చేయాలని, పరిస్థితులను అనుసరించి తరగతుల నిర్వహణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆలోచించాలని సూచించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. వైద్య ఆరోగ్య శాఖ సూచనల మేరకు తరగతుల నిర్వహణ తేదీని నిర్ణయించాల్సి ఉంటుందన్నారు. ‘సాల్ట్’ పర్యవేక్షణకు ప్రత్యేకాధికారులు రాష్ట్రంలో పాఠశాల విద్యను బలోపేతం చేసేందుకు ‘ఆంధ్రప్రదేశ్ అభ్యసన పరివర్తన’(సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్–సాల్ట్)’ అనే పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తెలిపారు. ఐదేళ్ల(2021–22 నుంచి) కాలపరిమితి కలిగిన ఈ పథకానికి ప్రపంచ బ్యాంకు 250 మిలియన్ అమెరికన్ డాలర్లు(రూ.1,860 కోట్లు) ఆర్థిక సహాయంగా అందిస్తోందని తెలిపారు. ఫలితాలే లక్ష్యంగా అమలయ్యే ఈ ప్రాజెక్టును.. నిర్వహణ సామర్థ్యం కలిగిన రాష్ట్రాలకు మాత్రమే ప్రపంచ బ్యాంకు ఇస్తుందని చెప్పారు. రాష్ట్రంలో ఈ పథకం పర్యవేక్షణ కోసం ఒక ఐఏఎస్ అధికారిని, జాయింట్ డైరెక్టర్ స్థాయి అధికారిని నియమిస్తామన్నారు. వైఎస్సార్ జిల్లాలో ఫిజికల్లీ చాలెంజ్డ్(దివ్యాంగ) పిల్లల కోసం ఏర్పాటైన వైఎస్సార్ విజేత స్కూల్ తరహాలో.. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో స్కూళ్లు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. ప్రాజెక్టు ఉద్దేశాలు.. సాల్ట్ పథకం ద్వారా బేస్మెంట్ లెర్నింగ్‌ను బలోపేతం చేయడంతో పాటు టీచర్లు, విద్యార్థుల పరస్పర సంబంధాలను, బోధనా నాణ్యతను మెరుగుపరుస్తామని మంత్రి సురేష్ చెప్పారు. అలాగే శిశు సంరక్షణ విద్యను పాఠశాలకు అనుసంధానించడం.. అంగన్వాడీ టీచర్లకు శిక్షణ, ఆటపాటల ఆధారిత టీచింగ్, మరుగుదొడ్లు, తాగునీరు వంటి మౌలిక సౌకర్యాలు కల్పించడం ఈ పథకంలో భాగమన్నారు. రాష్ట్రంలోని పాఠశాలల్లో ‘నాడు–నేడు’ పనులు పూర్తి చేయడంతో పాటు ప్రత్యేక అవసరాలున్న పిల్లల కోసం వనరుల కేంద్రాలను మెరుగుపరచడం, తల్లిదండ్రుల కమిటీలతో స్కూళ్లలో సామాజిక తనిఖీ తదితర కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం ద్వారా విద్యా రంగంలో ప్రపంచ స్థాయి ప్రమాణాలను సాధించగలుగుతామని మంత్రి చెప్పారు. సమావేశంలో పాఠశాల విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుడితి రాజశేఖర్, పాఠశాల విద్యా శాఖ సంచాలకులు వాడ్రేవు చినవీరభద్రుడు, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి, పాఠశాల విద్య సలహాదారు(ఇన్ ఫ్రా) ఎ.మురళి, సీమ్యాట్ డైరెక్టర్ వి.ఎన్.మస్తానయ్య పాల్గొన్నారు. -
తెలంగాణ: మరో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్: మరో వారంలో ఇంటర్ ఫలితాలు విడుదల చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఉమర్ జలీల్ వెల్లడించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, జులై 1 నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థులకు ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తామని తెలిపారు. జులై మధ్యలో ఫస్ట్ ఇయర్ క్లాసులు నిర్వహిస్తామని పేర్కొన్నారు. విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. చదవండి: టీఆర్ఎస్ నాయకుడి ఇంట్లో అర్థరాత్రి రికార్డింగ్ డ్యాన్స్‌లు ఎన్నికల కోడ్ ఉల్లంఘన.. మంత్రి తలసానికి ఊరట -
కూలీ కూతురు.. టాపర్
నంగునూరు(సిద్దిపేట): కూలీ పనులు చేస్తేనే పూట గడిచే కుటుంబం.. పైగా నిరక్ష్యరాస్యులు.. తమలాగ పిల్లలు కూలీ పనులు చేయకుండా చదివి ప్రయోజకులు కావాలని కలలు కన్నారు. వారి కలను నిజం చేస్తూ ఇంటర్లో మండల టాపర్‌గా దేవర రమ్య నిలిచింది. మండల కేంద్రం నంగునూరుకు చెందిన దేవర ఉప్పలయ్య, పద్మ దంపతులకు ఇద్దరు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు. ఉప్పలయ్య స్థానికంగా ఇనుప సామాను వ్యాపారం చేయడంతో పాటు ఉపాధి హామీ పనులు నిర్వహిస్తుండగా అతని భార్య పద్మ బీడీలు చుట్టడంతో పాటు కూలీ పనులకు వెళ్తూ పిల్లలను చదివిస్తున్నారు. వారి పెద్ద కూతురు రమ్య అక్కేపల్లి మోడల్స్కూల్లో చేరి పదో తరగతిలో మంచి జీపీఏ సాదించింది. అదే స్ఫూర్తితో ఇంటర్ బైపీసీలో 920 మార్కులు సాధించి మండల టాపర్‌గా నిలిచింది. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తల్లిదండ్రుల బాధ చూసి చక్కగా చదివి మంచి ఉద్యోగం చేయాలనే పట్టుదలతో చదివానని ఆమె పేర్కొంది. కాగా రెండవ కూతురు రవళి గతేడాది పదో తరగతిలో పది జీపీఏ సాదించి బాసర ట్రిపుల్‌ఐటీలో సీటు సాధించింది. రైతు కుటుంబంలో విద్యాకుసుమం : రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించిన సువర్ణ హుస్నాబాద్: వ్యవసాయ కుటుంబంలో జన్మించిన ఇర్రి సువర్ణ ఇంటర్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో 16వ ర్యాంక్ సాధించింది. హుస్నాబాద్ పట్టణంలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో చదివిన సువర్ణ ఇంటర్ ద్వితీయ సంవత్సరం ఎంపీసీ (ఇంగ్లీష్ మీడియం)లో 978/1000 మార్కులు సాధించింది. అక్కన్నపేట మండలం రేగొండ గ్రామానికి చెందిన ఇర్రి మల్లారెడ్డి, పద్మ దంపతులకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. పెద్ద అమ్మాయి డిగ్రీ వరకు విద్యాభ్యాసం చేసింది. రెండవ కుమార్తె అపర్ణ కూడా హుస్నాబాద్ ప్రభుత్వ కళాశాలలో 2017–2019 సంవత్సరంలో ఎంపీసీలో 922 మార్కులు సాధించి జిల్లా స్ధాయిలో ర్యాంకర్‌గా నిలిచింది. సువర్ణ గత విద్యా సంవత్సరంలో ఎంపీసీ ప్రథమ సంవత్సరంలో 456/470 మార్కులు సాధించి సిద్దిపేట జిల్లా ప్రభుత్వ కళాశాలల విభాగంలో జిల్లా టాపర్‌గా నిలిచింది. తల్లిదండ్రులు వ్యవసాయం చేసుకుంటూ ముగ్గురు కూతుళ్లకు ఎలాంటి లోటు రాకుండా చదివిస్తున్నారు. తల్లిదండ్రుల ఆశయాలకు అనుగుణంగా ఉన్నత చదువులు చదివి భవిష్యత్‌లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యమని సువర్ణ తెలిపారు. -
ఇంటర్ ఫలితాలు బాలికలే టాప్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో మరోసారి బాలికలే పైచేయి సాధించారు. బాలురకంటే బాలికలే ఎక్కువ శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి 4 నుంచి 21 వరకు జరిగిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు కార్యాలయంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాం చంద్రన్, బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ పాల్గొన్నారు. ద్వితీయ సంవత్సరంలో 75.15% మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 62.10% మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ద్వితీయ సంవత్సరంలో (జనరల్, వొకేషనల్) రెగ్యులర్ విద్యార్థులు 68.86% మంది ఉత్తీర్ణులయ్యారు. వొకేషనల్ తీసేసి జనరల్‌లోనే చూస్తే 69.61% మంది ఉత్తీ ర్ణులయ్యారు. ఫస్టియర్‌లోనూ 67.47% మంది బాలికలు, 52.30 శాతం మంది బాలురు ఉత్తీర్ణులయ్యారు. మొత్తంగా ప్రథమ సంవత్స రంలో 60.01% మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ స్థానంలో ఆసిఫాబాద్, మేడ్చల్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఆసిఫాబాద్, మేడ్చల్ జిల్లాలు అత్యధిక ఉత్తీర్ణత శాతంతో ప్రథమ స్థానంలో నిలవగా మెదక్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. ద్వితీయ సంవత్సరం జనరల్‌లో రెగ్యులర్, ప్రైవేటు విద్యార్థులు కలిపి (వొకేషనల్ రెగ్యులర్ ప్రైవేటు మినహా) 4,44,708 మంది పరీక్షలకు హాజరు కాగా వారిలో 2,82,208 మంది ఉత్తీర్ణులయ్యారు. అం దులో ఆసిఫాబాద్ జిల్లా 80% ఉత్తీర్ణతతో ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక ద్వితీయ సంవ త్సర జనరల్, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులనే తీసుకుంటే 4,11,631 మంది పరీక్షలకు హాజరు కాగా 2,83,462 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇందులో 80% ఉత్తీర్ణతతో మేడ్చల్ జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ రెండు కేటగిరీల్లోనూ మెదక్ చివరి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించిన మరిన్ని వివరాలు.. ప్రథమ సంవత్సరంలో పరీక్షలకు హాజరైన విద్యార్థులు 4,80,555. అందులో జనరల్ విద్యార్థులు 4,31,358 మంది, వొకేషనల్ విద్యార్థులు 49,197 మంది ఉన్నారు. ప్రథమ సంవత్సరంలో 2,44,105 మంది బాలికలు పరీక్షలకు హాజరవగా బాలురు 2,36,450 మంది పరీక్షలకు హాజరయ్యారు. ప్రథమ సంవత్సరంలో మొత్తంగా ఉత్తీర్ణులైన వారు 2,88,383 (60.01 శాతం) మంది ఉన్నారు. వారిలో జనరల్ విద్యార్థులు 2,63,463 మంది. వొకేషనల్ విద్యార్థులు 24,920 మంది విద్యార్థులు ఉన్నారు. పరీక్షకు హాజరైన మొత్తం విద్యార్థుల్లో బాలికలు 1,64,704 మంది (67.47 శాతం) ఉత్తీర్ణులవగా 1,23,679 మంది (52.30 శాతం) బాలురు ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలో గ్రేడ్లవారీగా ఉత్తీర్ణులు.. ద్వితీయ సంవత్సరంలో.. ద్వితీయ సంవత్సర పరీక్షలకు జనరల్ రెగ్యులర్ విద్యార్థులు, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థులు 4,11,631 మంది విద్యార్థులు హాజరయ్యారు. అందులో జనరల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 3,74,492 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 37,139 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 70,216 మంది, వొకేషనల్‌లో ప్రైవేటు విద్యార్థులు 3,660 మంది పరీక్షలకు హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరంలో పరీక్షలకు మొత్తంగా జనరల్, వొకేషనల్ రెగ్యులర్‌లో 2,13,121 మంది బాలికలు హాజరవగా, 1,98,510 మంది బాలురు హాజరయ్యారు. పరీక్షలకు హాజరైన మొత్తం ద్వితీయ సంవత్సర జనరల్, వొకేషనల్ రెగ్యులర్ విద్యార్థుల్లో 2,83,462 మంది (68.86 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. వారిలో జనరల్ రెగ్యులర్ విద్యార్థులు 2,60,703 మంది, వొకేషనల్‌లో రెగ్యులర్ విద్యార్థులు 22,759 మంది ఉన్నారు. వారికి అదనంగా జనరల్ ప్రైవేటు విద్యార్థులు 21,505 మంది, వొకేషనల్ ప్రైవేటు విద్యార్థులు 1,713 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలికల్లో 1,60,171 మంది (75.15 శాతం) ఉత్తీర్ణులుకాగా పరీక్షలకు హాజరైన మొత్తం రెగ్యులర్ బాలురులో 1,23,291 మంది (62.10 శాతం) ఉత్తీర్ణులయ్యారు. ఎంపీసీలో అత్యధికంగా ఉత్తీర్ణత ఈసారి ఇంటర్ ద్వితీయ సంవత్సరంలో ఎంపీసీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. మిగతా గ్రూపులతో పోలిస్తే అత్యధికంగా ఎంపీసీలో 67.95 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులైనట్లు బోర్డు పేర్కొంది. ఆ తరువాత బైపీపీలో ఎక్కువ శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. సీఈసీలో చాలా తక్కువ శాతం మంది విద్యార్ణులయ్యారు. ద్వితీయ సంవత్సర హాజరైన విద్యార్థులు వివరాలు.. పెరుగుతున్న ఉత్తీర్ణత శాతం ఇంటర్లో ఉత్తీర్ణత శాతం ఏటేటాæ పెరుగుతోంది. గతంతో పోలిస్తే ఈసారి ప్రథమ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. ద్వితీయ సంవత్సర ఫలితాల్లోనూ ఉత్తీర్ణత శాతంలో పెరుగుదల నమోదైంది. గతేడాది మినహాయిస్తే గత ఆరేళ్లుగా రాష్ట్రంలో ద్వితీయ సంవత్సర ఫలితాల్లో ఉత్తీర్ణత శాతం క్రమంగా పెరుగుతూ వస్తోంది. 2014 వార్షిక పరీక్షల్లో 60.14 శాతం ఉన్న ద్వితీయ సంవత్సర ఉత్తీర్ణత ప్రస్తుతం 68.86 శాతానికి పెరిగింది. రెగ్యులర్ విద్యార్థుల్లో మాత్రమే చూస్తే 69.61 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. ప్రథమ సంవత్సరంలోనూ గతేడాదితో పోలిస్తే ఈసారి ఉత్తీర్ణత శాతం భారీగా పెరిగింది. 2014లో 52.65 శాతం ఉత్తీర్ణత నమోదవగా ఈసారి 61.07 శాతానికి పెరిగింది. -
రెండ్రోజుల్లో తెలంగాణ ఇంటర్ ఫలితాలు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాలను ఎప్పుడు విడుదల చేయాలన్న అంశంపై సోమవారం స్పష్టత రానుంది. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో నేడు ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు సమావేశమై తేదీని ఖరారు చేయనున్నారు. వచ్చే రెండు రోజుల్లో ఫలితాలను విడుదల చేసే అవకాశం ఉంది. ఇప్పటికే ఫలితాల ప్రాసెస్ పూర్తయింది. ఫలితాలు సరిగ్గా వచ్చాయా? ఏమైనా లోపాలు ఉన్నాయా? అన్న దానిపై ఒకటికి రెండుసార్లు పరీశీలిస్తున్నారు. కాగా, కరోనా నేపథ్యంలో ఈసారి ఫలితాలను నేరుగా ఆన్లైన్లోనే విడుదల చేసే అవకాశం ఉంది. అన్నీ ఓకే అనుకుంటే, మంగళవారం విడుదల చేయాలన్న ఆలోచన ఉంది. అయితే అది సాధ్యం కాకపోతే బుధవారం (17వ తేదీన) విడుదల చేసేందుకే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి. గత మార్చి నెలలో జరిగిన ఈ పరీక్షలకు 9.65 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. -
ఎంత పనిచేశావమ్మా..!
సాక్షి, పాలకొండ: ఆ విద్యార్థిని చదువే లోకం అనుకుంది... కష్టజీవులైన తల్లిదండ్రుల ఆశలు నెరవేర్చాలని తపన పడింది... టెన్త్, ఇంటర్ ఫస్టియర్‌లో మంచి మార్కులు సాధించి, శుక్రవారం వెలువడిన ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో రెండు సబ్జెక్టుల్లో పరీక్ష తప్పడంతో మనస్తాపం చెందింది... ఇంతటితో ఏం అయిపోలేదని, పడి లేచిన కెరటంలా విజయ తీరాన్ని చేరవచ్చని తెలుసుకోలేకపోయింది... బలవంతంగా ప్రాణాలు తీసుకుంది... కన్నవారికి కన్నీళ్లు మిగిల్చింది. పాలకొండ పట్టణంలోని ఇందిరానగర్ కాలనీలో ఈ దుర్ఘటన జరిగింది. దూశి లక్ష్మణరావు, సరోజిని దంపతుల ఏకైక కుమార్తె అయిన స్వర్ణలత (17) శనివారం తెల్లవారేసరికి విగత జీవిగా కనిపించింది. ఏకైక కుమార్తె కావడంతో... స్వర్ణలత తండ్రి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. డాక్టర్ కావాలన్న ఆశతో ఆమె ఇంటర్లో బైపీసీ గ్రూప్ తీసుకుంది. తొలి ఏడాది మంచి మార్కులతో ఉత్తీర్ణురాలైంది. శుక్రవారంనాటి ఫలితాల్లో రెండు పరీక్షలు తప్పడాన్ని తట్టుకోలేకపోయింది. కన్నీరు పెట్టుకుంది. ఇంట్లో ముభావంగా ఉండిపోయింది. తల్లిదండ్రులు నచ్చచెప్పటంతో కొంతమేర ఆ కష్టం నుంచి ఉపశమనం పొందినట్లు కనిపించింది. కానీ రాత్రి అన్నం తిన కుండా పడుకుంది. ఉదయానికి ఫ్యాన్‌కు ఉరి వేసుకుని తనువు చా లించింది. అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న ఏకైక కుమార్తె తిరిగిరాని లోకాలకు వెళ్లిపోవటంతో ఆ కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. చదవండి: వారిపై హింస, అకృత్యాలు భారత్‌లోనే కాదు.. ఇంటర్ ఫెయిల్ కావటంతో ఇంతటి కఠిన నిర్ణయం తీసుకుంటుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. కాలనీలో, కళాశాలలో అందరితో కలివిడిగా ఉండటంతో విషయం తెలుసుకున్న సన్నిహితులు, కాలనీవాసులు మృతురాలి ఇంటి వద్దకు చేరుకుని రోదించా రు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం పాలకొండ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి లక్ష్మణరావు ఆటో యూనియన్ ఉపాధ్యక్షుడు, సీపీఎం సభ్యుడు కావటంతో ఆటో డ్రైవర్లు ఆయనను పరామర్శించేందుకు ఆసుపత్రికి చేరుకున్నా రు. సీఐటీయూ డివిజన్ కార్యదర్శి దావాల రమణారావు, కాదరాము తదితరులు ఆ కుటుంబాన్ని ఓదార్చారు. ఎమ్మెల్యే దిగ్భ్రాంతి విద్యార్థిని స్వర్ణలత ఆత్మహత్య విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విద్యార్థులు ఈ విధంగా అనాలోచిత నిర్ణయాలతో తల్లిదండ్రులకు కడుపుకోత మిగల్చవద్దని హితవు పలికారు. మృతురాలి కుటుంబసభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇంటర్ తప్పిన విద్యార్థి అదృశ్యం రేగిడి: కొమెర గ్రామానికి చెందిన వావిలపల్లి సత్యనారాయణ (సాయిరాం) అదృశ్యమయ్యాడని ఎస్సై బి.రేవతి శనివా రం విలేకరులకు తెలిపారు. శుక్రవారం విడుదలైన ఇంటర్ ఫలితాల్లో మొదటి సంవత్సరం పరీక్ష తప్పడంతో సత్యనారాయణ మనస్థాపం చెంది ఇంటి నుంచి వెళ్లిపోయాడని తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు చేశారని చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నామన్నారు. -
ఇది ఓ చరిత్రాత్మక రోజు
-
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
-
ఏపీలో ఇంటర్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి: ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్ష ఫలితాలు శుక్రవారం విడుదల అయ్యాయి. విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ విజయవాడలో సాయంత్రం 4 గంటలకు ఫలితాలు విడుదల చేశారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి ఆదిమూలపు సురేష్ మాట్లాడుతూ... అన్ని సవాళ్లను అధిగమించి దేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ప్రప్రథమంగా ఫలితాలను మనం విడుదల చేశాం. కరోనా సంక్షోభ సమయంలోనూ ఫలితాలను అనుకున్న సమయానికి విడుదల చేయడమనేది ఇది ఓ చరిత్రాత్మకం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్గదర్శకంలో విద్యాశాఖలోని అందరూ అధికారుల సమిష్టి కృషితో ఫలితాలను విడుదల చేశాం. లాక్డౌన్ ఉన్నప్పటికీ నెలరోజుల పాటు వాల్యూయేషన్ పూర్తి చేశాం. ఈ ఏడాది విద్యా వ్యవస్థలో పెనుమూర్పులకు శ్రీకారం చుట్టాం. రానున్న రోజుల్లో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ అందరికీ ఆదర్శంగా నిలవనుంది.’ అని తెలిపారు. (షెడ్యూల్ ప్రకారమే టెన్త్ పరీక్షలు) ఈసారి కూడా బాలికలదే పైచేయి ఇంటర్ ఫలితాలకు వస్తే... మొదటి సంవత్సరంలో 59శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. రెండో సంవత్సరంలో 63 శాతం విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఈసారి కూడా ఉత్తీర్ణతలో బాలురు కన్నా బాలికలే పైచేయిగా నిలిచారు. జిల్లాలువారీగా చూస్తే ఫలితాల్లో కృష్ణాజిల్లా మొదటి స్థానంలో నిలిచింది. ఫలితాలకు సంబంధించి టోల్‌ఫ్రీ నెంబర్‌ను విద్యాశాఖ ఏర్పాటు చేసింది. ఫలితాలు https://bie.ap.gov.in, www.sakshieducation.com తదితర వెబ్సైట్లలో అందుబాటులో ఉంటాయి. బోర్డు వెబ్సైట్లో హాల్‌టికెట్ నంబర్, పుట్టిన తేదీని నమోదు చేయడం ద్వారా ఫలితాలు పొందవచ్చు. ఇంటర్ మొదటి సంవత్సరం 5,07,228 మంది, రెండో సంవత్సరం 4,88,795 మంది, ఒకేషనల్ మొదటి సంవత్సరం 39,139 మంది, రెండో సంవత్సరం 29,993 మంది మొత్తం 10,65,155 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇంటర్లో గ్రేడింగ్ విధానాన్ని రద్దు చేసినందున మొదటి సంవత్సరం ఫలితాల్లో సబ్జెక్టుల వారీగా మార్కులు, రెండో సంవత్సరం ఫలితాలు సబ్జెక్టుల వారీగా గ్రేడ్ పాయింట్లలో ప్రకటించనున్నారు. ఇక ఫలితాల షార్ట్ మార్కుల మెమోలు ఈనెల 15వ తేదీ నుంచి విద్యార్థులకు ఇంటర్ బోర్డు వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. లాక్డౌన్ సడలింపుల తర్వాత పరీక్ష ఫలితాలు వెల్లడించిన మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ కావడం విశేషం. కాగా సర్వర్‌పై లోడ్ అధికం కావడంతో వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందారు. అయితే ఫలితాల కోసం ఒకేసారి వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయడంతో ఆలస్యం జరుగుతోందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని విద్యాశాఖ అధికారులు తెలిపారు. -
రేపు సాయంత్రం ఇంటర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్మీడియెట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలు శుక్రవారం విడుదల కానున్నాయి. రేపు సాయంత్రం నాలుగు గంటలకు విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్, పాఠశాల ముఖ్య కార్యదర్శి రాజశేఖర్ సంయుక్తంగా గేట్ వే హోటల్లో ఫలితాలు విడుదల చేయనున్నారు. విద్యార్థులు తమ ఫలితాలను హాల్‌టికెట్ లేదా డేట్ ఆఫ్ బర్త్ ఆధారంగా బీఐఈ.ఏపీ.జీవోవీ.ఇన్ (https://bie.ap.gov.in/)తో పాటు ఇతర వెబ్సైట్లలో చూసుకోవచ్చు. ఇక మార్కులు మెమోలు 15వ తేదీ నుంచి వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. కాగా ఫలితాలను తొలిసారిగా క్లౌడ్ సర్వీస్ ద్వారా విడుదల చేయనున్నామని ఇంటర్ బోర్డు కార్యదర్శి వి.రామకృష్ణ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఫలితాల డేటా కావలసిన వెబ్సైట్లు, ఇతరులు తమ సమాచారాన్ని ముందుగా బోర్డుకు అందించాలన్నారు. వెబ్సైట్ల నిర్వాహకులు వెబ్సైట్ పేరు, యూఆర్ఎల్ వివరాలు అందించాలి. ఇతరులు తమ పేరు, మొబైల్ నంబర్, ఈ-మెయిల్ ఐడీ అందించాలి. ఈ వివరాలను probieap@gmail.comకు పంపించాలి. -
15 లేదా 17న తెలంగాణ ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ ఫలితాలు వచ్చే వారంలో వెలువడనున్నాయి. ఇందుకోసం ఇంటర్మీడియట్ బోర్డు అవసరమైన ఏర్పాట్లు చేస్తోంది. సాధ్యమైనంత వరకు ఈనెల 15న ఫలితాలను విడుదల చేయాలని కసరత్తు చేస్తోంది. అయితే ఫలితాలను ఒకటికి రెండుసార్లు తనిఖీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో 15న ఫలితాల విడుదల వీలుకాకపోతే 17న వెల్లడించాలని భావిస్తోంది. మరోవైపు ఇంటర్మీడియట్ ఫలితాలు వెలువడిన వెంటనే విద్యార్థులకు ఫలితాల (విద్యార్థులు డౌన్లోడ్ చేసుకునే వెబ్ కాపీ)తోపాటు డిగ్రీ ప్రవేశాల గ్రీటింగ్ మెసేజ్ పంపిస్తామని డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ (దోస్త్) కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. తెల్లవారే ప్రవేశాల నోటిఫికేషన్ జారీచేస్తామన్నారు. దీంతో ఈనెల 20–23 తేదీల మధ్య డిగ్రీ ప్రవేశాల దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. మొత్తానికి వచ్చే నెలలో మొదటి దశ సీట్ల కేటాయింపును దోస్త్ ప్రకటించనుంది. -
జూన్ 15న ఇంటర్ ‘ద్వితీయ’ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాలను జూన్ 15వ తేదీన విడుదల చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు చేపట్టింది. ప్రథమ, ద్వితీయ సంవత్సరాల జవాబు పత్రాల మూల్యాంకనం శనివారంతో పూర్తయింది. ప్రస్తుతం స్కానింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఆ తరువాత ఫలితాల ప్రాసెస్ చేయాల్సి ఉంది. అయితే ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఫలితాలను ఒకేసారి విడుదల చేయాలని ఇదివరకే భావించినా అది సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. అయినా ద్వితీయ సంవత్సరంతోపాటే ప్రథమ సంవత్సర ఫలితాలను విడుదల చేసేందుకు కసరత్తు చేస్తోంది. సాధ్యం కాకపోతే జూన్ 15న ద్వితీయ సంవత్సర ఫలితాలను ప్రకటించి ఆ తరువాత రెండు మూడు రోజుల్లో ఫస్టియర్ ఫలితాలు విడుదల చేయనుంది. మొత్తానికి జూన్ 20వ తేదీలోగా ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదల కానున్నాయి. ఇక ఈ ఫలితాలు వచ్చాక నెల రోజుల్లో అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించేందుకు చర్యలు చేపట్టింది. వార్షిక పరీక్షలకు హాజరైన వారిలో 30 శాతం మంది వీటికి హాజరు కానున్నారు. టెన్త్ ఫలితాలు వచ్చాక ప్రథమ సంవత్సర తరగతులను ప్రారంభించాలని ఇదివరకే నిర్ణయించింది. ఇక ద్వితీయ సంవత్సర తరగతులను జూలై 15 తరువాత ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఎంసెట్, నీట్, జేఈఈ ఆన్లైన్ మాక్ టెస్టులు.. ఎంసెట్, నీట్, జేఈఈకి సిద్ధమయ్యే విద్యార్థుల కోసం మాక్ టెస్టులను అందుబాటులోకి తెచ్చినట్లు ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ ఒక ప్రకటనలో తెలిపారు. మోడల్ పేపర్లు, ఆన్లైన్ ప్రాక్టీస్ టెస్టులు www.rankersl-earning.comలో పొందవచ్చని తెలిపారు. -
ఒకేసారి ఇంటర్ ప్రథమ, ద్వితీయ ఫలితాలు!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాలను ఒకేసారి విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి కాగా, ఈ నెల 30నాటి కి ప్రథమ సంవత్సర జవాబు పత్రాల మూల్యాం కనం పూర్తి కానుంది. ఆ తరువాత జూన్ మొదటి వారంలో ఫలితాల ప్రక్రియను చేపట్టి, రెండో వారంలో ఫలితాలను విడుదల చేయాలని బోర్డు భావిస్తోంది. కాగా, ఇంటర్మీడియట్ విద్యా సంవత్సరం ఎలా ఉండాలన్న దానిపై నియమించిన సీనియర్ అధికారుల కమిటీ ఈ నెల 30లోగా నివేదిక ఇవ్వనుంది. కమిటీ నివేదిక ఆధారంగా విద్యా కార్యక్రమాల కొనసాగింపుపై కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయం తీసుకోనుంది. -
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాలను జూన్ రెండో వారంలో ప్రకటిస్తామని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. జవాబు పత్రాల కోడింగ్ గురువారం మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి మూల్యాంకనం ప్రారంభమవుతుందని వెల్లడించారు. పదో తరగతి పరీక్షలు, ఇంటర్మీడియట్ జవాబు పత్రాల మూల్యాంకనంపై గురువారం అధికారులతో సమీక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించి మొత్తంగా 53,10,543 జవాబు పత్రాల మూల్యాకనం చేయాల్సి ఉందని, అవన్నీ ఈనెల 30వ తేదీ వరకు పూర్తవుతాయన్నారు. జూన్ రెండో వారంలో ద్వితీయ సంవత్సర ఫలితాలను, మూడో వారంలో ప్రథమ సంవత్సర ఫలితాలను ప్రకటిస్తామని వెల్లడించారు. మొదట ఇంటర్ ద్వితీయ సంవత్సర జవాబు పత్రాల మూల్యాంకనాన్నే చేపడతామన్నారు. లాక్‌డౌన్‌తో వాయిదా పడిన ఇంటర్మీడియట్ మోడర్న్ లాంగ్వేజ్, జియోగ్రఫీ పరీక్షలను ఈ నెల 18న నిర్వహించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఆ విద్యార్థులు 861 మంది ఉన్నారని, ఆ పరీక్షల నిర్వహణకు 17 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ప్రస్తుతం 12 స్పాట్ కేంద్రాలుండగా, భౌతిక దూరం పాటిస్తూ 33 కేంద్రాల్లో మూల్యాంకనం చేపట్టాలని నిర్ణయించినట్లు చెప్పారు. ప్రతి కేంద్రంలో రోజూ 600 నుంచి 700 మంది మూల్యాంకనం చేసేలా ఏర్పాట్లు చేస్తున్నామని పేర్కొన్నారు. చదవండి: భయం.. భయంగానే.. హైకోర్టు అనుమతించాక టెన్త్ పరీక్షలు కరోనా కారణంగా నిలిపేసిన పదో తరగతి పరీక్షలను హైకోర్టు అనుమతిస్తే అన్ని జాగ్రత్తలతో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు మంత్రి సబిత స్పష్టం చేశారు. ప్రస్తుతం 2,530 పదో తరగతి పరీక్ష కేంద్రాలను రెట్టిం పు చేస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు, ఇన్విజిలేటర్లకు మాస్కులు, శానిటైజర్లు ఇస్తామని చెప్పారు. పరీక్షల నిర్వహణకు చేసే ఏర్పాట్లపై కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తామని, కోర్టు అనుమతివ్వగానే పరీక్ష తేదీలను ప్రకటిస్తామన్నారు. పరీక్ష కేంద్రాల్లో థర్మల్ స్క్రీనింగ్ ఏర్పాటు చేస్తామన్నారు. ప్రతిరోజూ కేం ద్రాల్లో కెమికల్ శానిటైజేషన్ చేస్తామన్నారు. బెంచ్‌కు ఒక్కరిని మాత్రమే కూర్చోబెట్టేలా చర్యలు చేపడతామన్నారు. విద్యార్థులకు రవాణా సౌకర్యం కల్పిస్తామన్నారు. అనారోగ్యంతో ఉన్న విద్యార్థులకు ప్రత్యేక గదుల్లో పరీక్షలను నిర్వహిస్తామన్నారు. స్కూళ్ల పునఃప్రారంభంపై లాక్డౌన్ తర్వాతే నిర్ణయం.. రాష్ట్రంలో పాఠశాలలు ఎప్పటి నుంచి పునఃప్రారంభించాలనే అంశంపై లాక్డౌన్ తర్వాత నిర్ణయిస్తామని మంత్రి సబిత తెలిపారు. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థుల నుంచి గతేడాది ఫీజులే వసూలు చేయాలని ఆదేశాలిచ్చామని, మానవత్వంతో ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. నెల వారీగా ఫీజులు తీసుకోవాలన్నారు. ఫీజులపై ఒకట్రెండు ఫిర్యాదులు వచ్చాయని, వాటిపై చర్యలు చేపడతామన్నారు. ఇతర బోర్డులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు పాటించాలని, ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు చేస్తామన్నారు. సమావేశంలో విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రారామచంద్రన్, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. చదవండి: తెలంగాణలో కొత్త రూట్లో ప్రజా రవాణా! -
జూన్ రెండో వారంలో ఇంటర్ ఫలితాలు
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాలు జూన్ రెండోవారంలో విడుదల చేయనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇప్పటికే పేపర్ కోడింగ్ ప్రక్రియ మొదలైందని, ఈ నెల 12వ తేదీ నుంచి ఇంటర్ పరీక్షా పేపర్లు వాల్యుయేషన్ ప్రారంభం అవుతుందన్నారు. మంత్రి సబితా గురువారమిక్కడ మాట్లాడుతూ గతంలో 12 వాల్యుయేషన్ సెంటర్లు ఉంటే ఇప్పుడు 33 కేంద్రాలకు పెంచామన్నారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్షలు వాయిదా పడిన విషయం తెలిసిందే. అయితే న్యాయస్థానం నుంచి అనుమతి వచ్చిన వెంటనే పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన పని లేదన్నారు. ఇక ప్రయివేట్ స్కూల్స్ గత ఏడాది ఫీజులే ఈ విద్యా సంవత్సరంలోనూ వసూలు చేయాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు పాటించకుంటే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అధిక ఫీజలు వసూలు చేస్తున్న స్కూళ్లపై ఇప్పటికే చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. (జూన్‌లో జేఈఈ మెయిన్, అడ్వాన్స్డ్!) -
ఇంటర్ ఫలితాల ప్రాసెస్‌పై నిపుణుల కమిటీ: సబిత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షలు, ఫలితాల ప్రాసెస్‌ను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు సాంకేతిక నిపుణులతో ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆదేశించారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెస్‌లో సాంకేతిక సహకారాన్ని సీజీజీ నుంచి తీసుకుంటున్నామని, దాని నిర్వహణ తీరును ఈ కమిటీ ఎప్పటికప్పుడు పరిశీలించాలన్నారు. గురువారం హైదరాబాద్‌లోని మంత్రి తన కార్యాలయంలో ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులతో సమీక్షించారు. నిపుణుల సలహాలు తీసుకుంటూ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలన్నారు. గతేడాది ఎదురైన అనుభవాలను పరిగణనలోకి తీసుకొని ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఫిబ్రవరి 1వ తేదీ నుంచి 20వ తేదీ వరకు ప్రాక్టికల్స్, మార్చి 4 నుంచి 29 వరకు థియరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కాగా పరీక్షలకు 9,85,840 మంది విద్యార్థులు హాజరు కానున్నారని, వీరి కోసం 1,994 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సమావేశంలో ఇంటర్మీడియెట్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్, పరీక్షల నియంత్రణాధికారి అబ్దుల్ ఖాలిక్ పాల్గొన్నారు. -
‘ఇంటర్’లో ఈసారి తప్పులు దొర్లనివ్వం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ప్రవేశాలు, పరీక్షల నిర్వహణ, మూల్యాంకనానికి సంబంధించిన సాంకేతిక (ఆన్లైన్) పనుల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకకుండా పకడ్బందీ చర్య లు చేపడుతున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ వెల్లడించారు. ఇటీవల బోర్డు కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన బుధవారం బోర్డు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. గతంలో పొరపాట్లు ఎక్కడ దొర్లాయో పరిశీలిస్తున్నామని, త్రీమెన్ కమిటీ నివేదికను అధ్యయనం చేస్తున్నామన్నారు. వాట న్నింటిని పరిగణనలోకి తీసుకొని అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా చర్యలు చేపడతామని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఇందులో భాగంగానే సాంకేతిక సమస్యల పరిష్కారం కోసం బోర్డులోని ఐటీ నిఫుణులతో పాటు ప్రభుత్వ ఐటీ విభాగానికి చెందిన ఐటీ నిఫుణులతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. డిసెంబర్ వరకే ఫీజుల చెల్లింపు.. ఫిబ్రవరి వరకు పరీక్ష ఫీజులు చెల్లించే విధానం వల్ల కూడా కొన్ని పొరపాట్లు దొర్లుతున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఈసారి డిసెంబర్ వరకే పరీక్ష ఫీజుల చెల్లింపు విధానాన్ని అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ తెలిపారు. బోర్డుకు సంబంధించిన అంశాలు, క్షేత్రస్థాయిలో తలెత్తే సమస్యలపై సమీక్షించేందుకు, తగిన కార్యాచరణను రూపొందించి అమలు చేసేందుకు ఈనెల 27న జిల్లా ఇంటర్ విద్యాధికారులతో (డీఐఈవో) సమావేశం నిర్వహించనున్న ట్లు తెలిపారు. జిల్లాల వారీగా గుర్తింపు పొందిన కాలేజీల జాబితాలను జిల్లాల్లోని డీఐఈవో కార్యాలయంలో ప్రదర్శిస్తామన్నారు. కమిటీ సిఫారసులు అమలు.. గత వార్షిక పరీక్షల్లో పరీక్షల మూల్యాంకనం, ఆ తర్వాత కంప్యూటరీకరణ, ఆన్లైన్ ప్రాసెస్ వంటి వాటిపై త్రీమెన్ కమిటీ ఇచ్చిన సిఫారసులను అమలు చేస్తామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. అందుకు అనుగుణంగా చర్యలు చేపడతామన్నారు. సెలవుల్లో క్లాసులు నిర్వహిస్తే చర్యలు ఇక జూనియర్ కాలేజీలకు ఈనెల 28 నుంచి వచ్చే నెల 9 వరకు దసరా సెలవులుగా ప్రకటిస్తున్నట్లు ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఉమర్ జలీల్ చెప్పారు. కాలేజీలు తిరిగి వచ్చే నెల 10న ప్రారం భం అవుతాయని స్పష్టం చేశారు. సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే సంబంధిత కాలేజీలు, ప్రిన్సిపాళ్లపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. -
అసెంబ్లీ ముట్టడికి ఎన్ఎస్యూఐ యత్నం
సాక్షి, హైదరాబాద్:ఇంటర్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ తప్పిదం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫలితాల వెల్లడిలో తప్పులకు కారణమైన వారిపై చర్యల విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. -
అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించిన ఎన్ఎస్యూఐ
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ విద్యార్థుల ఆత్మహత్యల పై ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రానందుకు నిరసనగా శనివారం ఎన్ఎస్యూఐ విద్యార్థి విభాగం అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. ఈ సందర్భంగా ఎన్ఎస్యూఐ ప్రెసిడెంట్ వెంకట్ బలమూరి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన వారిపై అసెంబ్లీలో క్లారిటీ వస్తుందేమోనని చివరి రోజు వరకు వేచి చూశాం. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాకపోవడంతోనే అసెంబ్లీ ముట్టడి నిర్వహించామని పేర్కొన్నారు. రీ కరెక్షన్, రీ వాల్యుయేషన్ పేరుతో విద్యార్థుల దగ్గర డబ్బులు తీసుకున్న ఇంటర్మీడియట్ బోర్డు ఇప్పుడు మాట మార్చి వారు ఎలాంటి ఫీజులు చెల్లించలేదని ఆరోపణలు చేస్తుంది. కాగా, విద్యార్థులు చెల్లించిన ఫీజులు మొత్తం రూ. కోటిదాకా ఉన్నట్లు మేము ఆర్టీఐ ద్వారా తెలుసుకున్నామని ఆయన తెలిపారు. ఎలాగూ ప్రభుత్వం చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ఆదుకోవడంలో విఫలమైంది, కనీసం విద్యార్థులు చెల్లించిన ఫీజులకు అదనంగా రూ. 2 లేదా 3 కోట్లు జత చేసి వారి కుటుంబాలకు అందజేయాలని డిమాండ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. తప్పుడు ఫలితాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ, ఇంటర్మీడియట్ బోర్డుపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు స్పష్టం చేశారు. చనిపోయిన విద్యార్థి కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేసే వరకు ఎన్ఎస్యూఐ పోరాటం కొనసాగుతుందని వెంకట్ వెల్లడించారు. -
బాధ్యులపై చర్యలు చేపట్టారా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారంలో తలెత్తిన తప్పిదాలపై గవర్నర్ నరసింహన్ అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. పాఠశాల, ఇంటర్, ఉన్నత విద్యా శాఖలపై సోమవారం గవర్నర్ సమీక్షించారు. ఈ సందర్భంగా ఇంటర్మీడియట్ ఫలితాల వ్యవహారంలో చోటుచేసుకున్న పరిణామాలపై కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలిసింది. మార్కుల్లో పొరపాట్లకు కారణమైన బాధ్యులను గుర్తించారా? ఏం చర్యలు చేపట్టారని ప్రశ్నించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా బోర్డు కార్యదర్శి అశోక్ కోర్టు క్లీన్ చీట్ ఇచ్చిందని పేర్కొన్నప్పటికీ అసంతృప్తిగానే ఆ అంశాన్ని ముగించినట్లు సమాచారం. అలాంటి పొరపాట్లు పునరావృతం కాకుండా పక్కా ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యా సంబంధ అంశాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లు సమాచారం. అలాగే పాఠశాల విద్య, ఉన్నత విద్య కార్యక్రమాలపైనా సమీ క్షించి, నాణ్యత ప్రమాణాల పెంపు కోసం చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిసింది. ఇంజనీరింగ్ ఫీజుల వ్యవహారంపై అడిగినట్లు సమాచారం. సమావేశంలో ఉన్నత విద్య మం డలి చైర్మన్ ప్రొఫెసర్ పాపిరెడ్డి, విద్యా శాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, కళాశాల విద్య కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ లింబాద్రి, వెంకటరమణ, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్, పాఠశాల విద్య కమిషనర్ విజయ్‌కుమార్ పాల్గొన్నారు.బాధ్యులపై చర్యలు చేపట్టారా? -
ఇంటర్ ఫలితాల పిటిషన్లపై ముగిసిన విచారణ
సాక్షి, హైద్రాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తలెత్తిన గందరగోళ పరిస్థితులపై దాఖలైన పిటిషన్లపై హైకోర్టులో బుధవారం విచారణ ముగిసింది. ఫలితాల్లో చిన్న తప్పులే జరిగాయని, రీ వెరిఫికేషన్‌లో 0.16 శాతం మాత్రమే ఉత్తీర్ణులయ్యారని గుర్తు చేసింది. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం దురదృష్టకరమన్న కోర్టు, చనిపోయిన వారికి పరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించలేమని పేర్కొంది. అలాగే బాధ్యుల విషయంలో ప్రభుత్వమే శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని, తాము జోక్యం చేసుకోలేమని న్యాయస్థానం స్పష్టం చేసింది. -
ఇంటర్ ఫలితాలపై హైకోర్టులో విచారణ
-
‘అనామిక’పై అశోక్ నిర్లక్ష్యపు సమాధానం..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల్లో ఫెయిలవడంతో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక విషయంలో ఇంటర్ బోర్డు ఇంకా నిర్లక్ష్యం వీడటం లేదు. తాము చేసిన తప్పును ఒప్పుకో కుండా కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోంది. విద్యార్థుల జవాబు పత్రాలు, మార్కులపై మంగళ వారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో బోర్డు కార్యదర్శి అశోక్ చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శ నం. ఆత్మహత్య చేసుకున్న అనామిక మార్కుల విషయంలో నెలకొన్న గందరగోళంపై విలేక రులు అడిగిన ప్రశ్నలకు ఆయన పొంతనలేని సమాధా నాలు చెప్పారు. అనామికకు జవాబుపత్రంలో 21 మార్కులు వస్తే 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో ఎలా పొందుపరిచారని విలేకరులు ప్రశ్నించగా అశోక్ చిరాకుపడ్డారు. (అశోకా.. ఏంటీ లీల!) ‘వెబ్సైట్లో ఇచ్చినవి పరిగణనలోకి తీసుకోం. జవాబు పత్రాల్లో ఉన్న మార్కులనే పరిగణనలోకి తీసుకుంటాం. ఆ మార్కులే ఫైనల్. జవాబుపత్రాల మూల్యాంకనం గాలిలో చేయరు. ఆ జవాబు పత్రాలు నేను కరెక్షన్ చేయను. నాకు ఎలాంటి సంబంధంలేదు’ అంటూ విచిత్రమైన సమాధానం చెప్పారు. తప్పు ఎక్కడ, ఎలా జరిగిందో చెప్పకుండా తప్పించుకునే సమాధానం ఇచ్చారు. అనామిక విషయంలో బోర్డు తప్పే చేయనట్లు ఆయన మాట్లాడడం గమనార్హం. ఏ విద్యార్థి అయినా తమ ఫలితాలను ముందుగా వెబ్సైట్లో ఇచ్చే మెమోలోనే చూసుకుంటారు. అలా అనామికకు మొదట 20 మార్కులు వేశారు. ఆమె ఆత్మహత్య చేసుకున్నా ఆమె జవాబు పత్రాన్ని రీ వెరిఫికేషన్ చేసి 21 మార్కులు వచ్చాయని పేర్కొన్నారు. చివరకు మరోసారి ఫెయిల్ అయిన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేసిన సమయంలో అనామికకు 48 మార్కులు వచ్చినట్లు వెబ్సైట్లో పొందుపరిచారు. దీంతో గందరగోళం నెలకొంది. దానిపై బోర్డు స్పష్టౖ మెన వివరణ ఇవ్వకుండా తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. మరోవై పు ఓఎంఆర్ షీట్లలో బోర్డు తప్పుగా ముద్రించే పొరపాట్లను విద్యార్థులు సరిచూసుకొని ఇన్విజిలే టర్లకు చెప్పి సరిచేయించుకోవాలని, లేదంటే అందు లోని తప్పులకు విద్యార్థులదే బాధ్యత అంటూ వారిని ఆందోళన పడేసే చర్యలకు బోర్డు దిగింది. బాధ్యులపై చర్యలు.. మూల్యాంకనంలో పొరపాట్లకు బా«ధ్యులైన లెక్చరర్లపై చర్యలు చేపడతామని అశోక్ పేర్కొన్నారు. అలాగే తొలుత ఫెయిలై, ఆ తర్వాత రీ వెరిఫికేషన్‌లో పాసైన విద్యార్థుల జవాబుపత్రాలు మొదట మూల్యాంకనం చేసిన వారిపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. రీ వెరిఫికేషన్‌లో 1,155 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. ఈ లెక్కన గమనిస్తే లెక్చరర్లపై చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. మరోవైపు రీ వెరిఫికేషన్‌లో ఐదు లేదా అంతకన్నా మార్కులు పెరిగిన పేపర్లను మూల్యాంకనం చేసిన లెక్చరర్లకు రూ. 5 వేల జరిమానాతోపాటు మూల్యాంకన విధుల నుంచి మూడేళ్లు డీబార్ చేయనున్నట్లు అశోక్ తెలిపారు. గత నెల విడుదల చేసిన రీ వెరిఫికేషన్ ఫలితాల్లో 1,137 మంది విద్యార్థులు పాసైనట్లు బోర్డు ప్రకటించింది. వారం తిరిగే సరికి ఆ సంఖ్య మారిపోయింది. ఉత్తీర్ణుల సంఖ్య 1,155కి చేరింది. అంటే మరో 18 మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంకా 800 మంది ఫలితాల ప్రాసెసింగ్ ఇంకా పూర్తి కాలేదు. వారిలో ఎంత మంది ఉత్తీర్ణులు అవుతారో వేచి చూడాల్సిందే. -
అశోకా.. ఏంటీ లీల!
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో ఫెయిలైనట్లు వచ్చిన మార్కులతో మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్న విద్యార్థిని అనామిక రీవెరిఫికేషన్లో ఉత్తీర్ణురాలైనట్లు బోర్డు ప్రకటించింది. అయితే జవాబు పత్రాల ఫొటో స్టాట్‌లో మాత్రం 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో అనామిక పాసైనట్లా.. ఫెయిలైనట్లా..? అన్నది సందిగ్ధంగా మారింది. రీవెరిఫికేషన్ చేసిన తరువాత కూడా ఇలాంటి తప్పిదాలు చోటుచేసుకోవడంతో ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ తీరుపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. మెమోలో ఒకటి కాదు.. రెండు కాదు.. ఆమెకు ఏకంగా 28 మార్కులు పెరిగినట్లు చూపించారు. ఆదిలాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్‌నగర్‌కి చెందిన గణేష్‌కుమార్, హారిక దంపతులకు అనామికతో పాటు ఉదయ, సీతల్, భావేష్ అనే పిల్లలున్నారు. కూరగాయలు అమ్ముకుంటూ జీవనం సాగించే వీరికి పిల్లలను చదివించే ఆర్థిక స్థోమత లేదు. దీంతో అనామిక సికింద్రాబాద్ చాచానెహ్రూనగర్‌లో ఉంటున్న అమ్మమ్మ ఉమా వద్దే ఉంటూ చదువుకుంది. కింగ్‌కోఠిలోని ప్రగతి మహావిద్యాలయలో ఇంటర్ సీఈసీ మొదటి సంవత్సరం పూర్తి చేసింది. చదువులోనే కాదు.. ఆటలు, ఎన్సీసీ, ఇతర కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా పాల్గొనేది. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలైంది. నాడు 20.. మెమోలో 48... ఇంటర్ బోర్డు వెల్లడించిన ఫలితాల్లో అనామిక (హాల్‌టికెట్ నంబర్ 1961112037)కు ఇంగ్లీష్– 64, ఎకనామిక్స్–55, సివిక్స్ –67, కామర్స్–75, తెలుగు–20 మార్కులు వచ్చినట్లు ప్రకటించింది. మిగతా సబ్జెక్టుల్లో మంచి మార్కులు సాధించిన ఆమెకు తెలుగులో 20 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిలైంది. పరీక్ష బాగా రాసినప్పటికీ ఎందుకు ఫెయిలైందో అర్థం కాక ఆమె ఒత్తిడికి గురైంది. అదే బాధతో ఏప్రిల్ 18న ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలను రీవెరిఫికేషన్ చేయడంతో.. అందులో అనామిక పాసైనట్లు వెల్లడైంది. తెలుగులో ఆమెకు 28 మార్కులు పెరిగి.. మొత్తంగా 48 మార్కులు వచ్చినట్లు ఇంటర్ బోర్డు తన వెబ్ సైట్లో పేర్కొంది. తమ కుమార్తె పాసైనట్లు తేలడంతో అనామిక కుటుంబం మరోసారి శోకసంద్రంలో మునిగిపోయింది. అధికారులు మూల్యాంకనాన్ని సరిగ్గా చేపట్టి ఉంటే తమ చిన్నారి బతికి ఉండేదని అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ కన్నీటిపర్యంతం అయ్యారు. అయితే జావాబు పత్రంలో ఫొటో స్టాట్‌లో మాత్రం అనామికకు 21 మార్కులే వచ్చినట్లు చూపించారు. దీంతో తీవ్ర గందరగోళం నెలకొంది. చనిపోయిన తర్వాత ఫలితాలా? అనామిక పాసైందన్న మెమోను చూసిన తరువాత ఆమె అమ్మమ్మ ఉమ, సోదరి ఉదయ మీడియాతో మాట్లాడారు. చనిపోయిన అనామిక పాసైనందుకు ఆమె ప్రాణాలను తెచ్చి ఇవ్వాల్సిన బాధ్యత అధికారులదేనని, ఈ అంశంపై న్యాయం కోసం కోర్టుకెళ్తామని, న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని ఉదయ బోరున విలపిస్తూ చెప్పింది. ఫలితాలు ముందే సరిగ్గా వచ్చి ఉంటే అనామిక బతికేదని, ఇంటర్ బోర్డు అధికారులు తమ పిల్లను పొట్టనబెట్టుకున్నారని ఉమ ఆవేదన వ్యక్తం చేశారు. అనామిక పాస్ కాలేదు: ఇంటర్ బోర్డు ఆరుట్ల అనామిక పాస్ కాలేదని ఇంటర్ బోర్డు సాయంత్రం ఓ ప్రకటన చేసింది. అనామిక సోదరి ఆరుట్ల ఉదయ ఇంటర్ బోర్డు తప్పిదం కారణంగానే తన సోదరి ఆత్మహత్యకు పాల్పడిందన్న ఆరోపణను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఖండించారు. ఈ విషయంలో తాము హైకోర్టు ఆదేశాల మేరకు పూర్తి పారదర్శకతతో వ్యవహరించామని, రీ వెరిఫికేషన్‌లో అనామికకు కేవలం 20 నుంచి ఒకే ఒక్క మార్కు పెరిగి 21 వచ్చాయని తెలిపారు. కానీ, క్లరికల్ మిస్టేక్ వల్ల ఫలితాల వెల్లడిలో 48 మార్కులు వచ్చినట్లు చూపించిందని వివరించారు. ఈ మేరకు అశోక్ శనివారం సాయంత్రం ఓ ప్రకటన విడుదల చేశారు. అనామిక రాసిన 24 పేజీల బుక్‌లెట్‌ను కూడా జత చేశారు. -
ఇంటర్ బోర్డు నిర్వాకానికి అనామిక బలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల విడుదలలో తీవ్ర తప్పిదాలు జరిగాయని రీవెరిఫికేషన్ ఫలితాలు వెలువడిన అనంతరం స్పష్టమవుతోంది. ఫలితాల్లో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం బయటపడింది. ఏప్రిల్ 18న విడుదలైన తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో మూడు లక్షల మందికి పైగా విద్యార్థులు ఫెయిల్ అయ్యారని ఇంటర్ బోర్డు ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో అనేక మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. పరీక్షలు బాగానే రాసినా.. ఫెయిల్ అయినామన్న బాధతో ప్రాణాలు తీసుకున్నారు. మొదట విడుదలైన ఫలితాల్లో అనామిక అనే విద్యార్థిని ఫెయిల్ అయినట్లు రావడంతో క్షణీకావేశంలో ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. తాజాగా విడుదలైన రీవెరిఫికేషన్ ఫలితాల్లో ఆమె పాస్ అయినట్లు రిజల్ట్ వచ్చింది. మొదటి ఫలితాల్లో 20 మార్కులని చెప్పగా.. రీవెరిఫికేషన్లో 48 మార్కులు వచ్చినట్లు బోర్డు ప్రకటించింది. దీంతో ప్రభుత్వ తప్పిదం కారణంగా తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని ఆమె తల్లీదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు. బోర్డుపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. దీనిపై శనివారం మక్దుంభవన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్చుతరావు మాట్లాడుతూ.. విద్యార్థుల మరణానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని అన్నారు. ఇంటర్ బోర్డు నిర్లక్ష్యానికి ఐపీసీ సెక్షన్ 304 (ఏ) ప్రకారం కేసు నమోదు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్‌ను కోర్డు చెప్పక మందే అరెస్ట్ చేయాలని అన్నారు. -
రివాల్యుయేషన్లో మార్కులు రాలేదని..
జవహర్‌నగర్: ఇటీవల విడుదల ఇంటర్ రివాల్యుయేషన్ ఫలితాల్లో మార్కులు రాలేదని మనస్తాపం చెందిన ఓ విద్యార్థిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం జవహర్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని దమ్మాయిగూడలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దమ్మాయిగూడకు చెందిన మానస ఇంటర్మీడియట్ చదువుతోంది. ఇటీవల ఇంటర్ రివాల్యుయేషన్లో మార్కులు పెరగలేదని మనస్తాపానికిలోనైన ఆమె ఉరి వేసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. దీనిని గుర్తించిన కుటుంబసభ్యులు ఆమెను గాంధీ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం మానస ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్యులు పేర్కొన్నారు. -
రేపు ఇంటర్ రీవెరిఫికేషన్ ఫలితాలు అప్లోడ్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు, ఇతరత్రా కారణాలతో ఫెయిలైన 3.28 లక్షల విద్యార్థుల రీవెరిఫికేషన్ ఫలితాలు, జవాబుపత్రాల స్కానింగ్ కాపీలను ఈ నెల 27న బోర్డు వెబ్సైట్లో అప్లోడ్ చేసేందుకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాట్లు చేసింది. హైకోర్టు ఆదేశాల ప్రకారం ఈ నెల 27వ తేదీలోగా విద్యార్థుల జవాబుపత్రాల స్కానింగ్ ప్రతులను వెబ్సైట్లో పొందుపరుచాల్సివుంది. అందుకనుగుణంగా చర్యలు చేపట్టిన ఇంటర్‌బోర్డు ఈ నెల 27న అదే విషయాన్ని కోర్టు తెలియజేయాలని నిర్ణయించింది. కోర్టు అంగీకరిస్తే వాటిని అదే రోజు విద్యార్థులకు అందుబాటులోకి తేనుంది. -
విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వమే కారణం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్ కంపెనీలకు లాలూచీపడటం వల్లనే ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని సీపీఐ పార్టీ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు. ఇంటర్ కుంభకోణాలకు నిరసనగా హిమాయత్ నగర్ ఏఐటీయూసీ నుంచి ట్యాంక్ బండ్ పై ఉన్న అంబేడ్కర్ విగ్రహం వరకు నల్ల చొక్కాలతో సీపీఐ పార్టీ తలపెట్టిన నిరసన ర్యాలీను పోలీసులు ఏఐటీయూసీ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రతి విద్యార్థి జీవితంలో ఇంటర్ విద్య అనేది ఓ మలుపు వంటిదని... ఏ రంగానైన ఎంచుకోవాలంటే తప్పనిసరిగా ఇంటర్ పాస్ అవ్వాలని అన్నారు. అటువంటి ప్రాధాన్యత ఉన్న ఇంటర్ విద్యలో బోర్డ్ తప్పిదాల వల్ల 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. విద్యార్థుల ఆత్మహత్యలపై ప్రభుత్వ వైఖరి స్పష్టం చేయలేదన్నారు. ఇంటర్ బోర్డ్ నిర్లక్ష్యం వల్ల పోటీ పరీక్షలకు వెళ్లే విద్యార్థులు అకాడమిక్ ఇయర్ కోల్పోయారని నారాయణ పేర్కొన్నారు. ఇంటర్ బోర్డ్ కుంభకోణం పై సిట్టింగ్ జడ్జ్‌తో విచారణ చేపట్టి ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల ఆత్మహత్యలకు కారణమైన గ్లోబరినా సంస్థపై క్రిమినల్ కేసులు పెట్టాలని నారాయణ డిమాండ్ చేశారు. అనంతరం ట్యాంక్ బండ్ వైపు వెళ్తున్న సీపీఐ నాయకులతో పాటు నారాయణను కూడా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేశారు. -
విద్యా విధానంలో మార్పులు తప్పనిసరి
తెలంగాణలో ఇంటర్మీడియట్ బోర్డు నిర్వాకం రెండు డజన్లకుపైగా విద్యార్థుల ప్రాణాలు హరించిన నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ విద్య అవసరం గురించి విస్తృత చర్చ జరుగుతోంది. ఈ సందర్భంగా తెలంగాణలో విద్యారంగంపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి సంక్రమించిన ఒంటెత్తువాదం ప్రభావం గురించి చర్చిస్తే గానీ తెలంగాణ విద్యారంగం తీరుతెన్నులు అర్థం కావు.విద్యారంగంలో దేశంలోని 29 రాష్ట్రాల్లో తెలం గాణ స్థానం 28. దీని తర్వాత మిగిలింది బిహార్ రాష్ట్రం ఒక్కటే. దక్షిణాదిలో మనది అట్టడుగు స్థానం. విద్యాభివృద్ధి సూచికల విషయంలో 2018 లో ఇండియా టుడే సంస్థ నిర్వహించిన సర్వేలో కూడా మన ర్యాంక్ 18 మాత్రమే. విద్యారంగంలో వెనకబాటుకు ప్రధాన కారణాలు రెండు. ఒకటి, అందరికీ సమానమైన చదువు అందకూడదనే ఫ్యూడల్ భావజాలం. రెండు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి సంక్రమించిన విద్యారంగంలో ‘నా రూటే సెపరేట్‘ అనే వైఖరి. ఈ రెంటిలో మార్పు రానంత కాలం ఇంతే సంగతులు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో విద్యారంగానికి సంబంధించిన సమగ్రమైన చట్టం 1982లో వచ్చింది. 37 సంవత్సరాలు గడిచినా కనీసం సమీక్ష కూడా లేకుండా అదే చట్టం కొనసాగుతోంది. దేశంలో జాతీయ విద్యా విధానం 1986 (1992లో అప్డేట్ చేశారు)లో వచ్చింది. ఆ తర్వాత వచ్చిన సర్వ శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ), రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్ (ఆర్‌ఎంఎస్‌ఏ), విద్యాహక్కు చట్టం మున్నగునవి పాఠశాల విద్యా రంగాన్ని ఎంతోకొంత ప్రభావితం చేశాయి. కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలో గానీ పాఠశాల విద్యా చట్రం ఎలాంటి సంస్థాగత మార్పులను అనుమతించకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా వుండిపోయింది. గత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గానీ నేటి తెలం గాణలోగానీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1/1982లో ప్రీ–ప్రైమరీ (3–5 సం.ల వయసు) ఎడ్యుకేషన్ గురించి పేర్కొన్నా కొన్ని ప్రైవేట్ స్కూళ్లలో తప్ప ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకావడం లేదు. మరో ముఖ్య విషయం, 1968 జాతీయ విద్యా విధానంలోని 10+2+3 విధానాన్ని అమలు చేయడంలో వ్యత్యాసం. కేంద్ర ప్రభుత్వంలో, అన్ని రాష్ట్రాల్లో హైస్కూళ్లు 12వ తరగతి (+2) వరకు ఉన్నవి. తెలంగాణలో కూడా సీబీఎస్ఈ అనుబంధ ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్లు మరియు ఇటీవల వచ్చిన ప్రభుత్వ గురుకులాలు, మోడల్ స్కూల్స్, కస్తూరిబా గాంధీ బాలికా విద్యాలయాలు 12వ తరగతి (ఇంటర్మీడియట్) వరకు నడుస్తున్నవి. కానీ అనాదిగా వస్తున్న ప్రభుత్వ, జిల్లా పరిషత్, ఎయిడెడ్ హైస్కూళ్లు మాత్రం 10 వ తరగతి వరకే పరిమితమైనవి. 11, 12 తరగతులను విడగొట్టి ఇంటర్మీడియట్ విద్యగా జూనియర్ కాలేజీలను నిర్వహిస్తున్నారు. ఈ ఏర్పాటు విద్యారంగంలో తెలంగాణ వెనుకబాటుతనానకి ఒక ముఖ్య కారణం. మరోవైపు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారానికి ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థ వనరుగా మారింది. ఇంటర్మీడియట్ విద్యా విధానం వలన తెలంగాణకు జరుగుతున్న లాభం కంటే నష్టం ఎక్కువ. జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో సంవత్సరానికి ఐదారొందల మందికి సీట్లు వస్తూ ఉండవచ్చు. కానీ అందుకు భారీ మూల్యం చెల్లించడం జరుగుతోంది. ఐఐటీ, నీట్ తదితర పరీక్షల్లో సీట్లు వస్తున్న వారిలో అత్యధికులు కార్పొరేట్ కాలేజీల్లో ప్రత్యేక తర్ఫీదు పొందినవారే. ప్రభుత్వ రెసిడెన్షియల్ కాలేజీల్లో చదివిన వారికి కూడా కొన్ని రావచ్చు. కానీ ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చదివిన వారికి వస్తున్నవి చెప్పుకోదగినంత లేవు. ఇంటర్మీడియట్ విద్యా వ్యాపారంపైన జరుగుతున్న టర్నోవర్ సంవత్సరానికి రూ. పదివేల కోట్లు పైగా ఉన్నట్లు అంచనా. లక్షల మంది తల్లిదండ్రులు తమ కష్టార్జితాన్ని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా వ్యాపారులకు ధారబోస్తున్నారు. టీనేజ్ దశలోని అమ్మాయిలు, అబ్బాయిలు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు కోల్పోయి భావోద్వేగాలకు సామాజిక జీవనానికి దూరమై యంత్రాల్లా బతుకుతున్నారు. ఒత్తిడి తట్టుకోలేక కొందరు ఆత్మహత్యలకు, బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. చనిపోతున్న వారిలో, ఫెయిలవుతున్న విద్యార్థుల్లో దళిత, గిరిజన, మైనార్టీ మరియు అమ్మాయిలే ఎక్కువ. ఇన్ని రకాల నష్టాలు కల్గిస్తూ రాష్ట్ర విద్యారంగానికి గుదిబండగా మారిన ఇంటర్మీడియట్ విద్యా అవస్థను ఇకనైనా విరమిస్తేనే మంచిది. జాతీయ విద్యా ప్రధాన స్రవంతిలో కలిసి పురోగమించే విద్యా విధానానికి మరలాలి. తెలుగు రాష్ట్రాల్లో పాఠశాల విద్యా వ్యవస్థకు జాతీయ పాఠశాల విద్యా స్థాయిని కల్పించాలి. బడిలో చేరిన బాలబాలికలు అందరూ తమ నివాస ప్రాంతంలోనే 12వ తరగతి వరకు చదువుకునే అవకాశం కల్గుతుంది. సార్వత్రిక సెకండరీ విద్యను సాధిస్తూ విద్యాభివృద్ధిలో ఏపీ, తెలంగాణ ముందడుగు వేయగలవు. ఇందుకు అనువుగా మన విద్యా విధానాన్ని మార్చుకుంటే ఎంతో మేలు. నాగటి నారాయణ, విద్యారంగ విశ్లేషకులు మొబైల్ : 94903 00577 -
ఆ ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యత
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై రాష్ట్రపతిని కలుస్తామని అఖిలపక్ష నేతలు ప్రకటించారు. విద్యార్థుల ఆత్మహత్యలకు సర్కారుదే బాధ్యతని, వారి తల్లిదండ్రులకు న్యాయం చేసే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. ‘ఇంటర్’అవకతవకలపై కాంగ్రెస్, టీడీపీ, సీపీఐ, టీజేఎస్, జనసేన, తెలంగాణ ఇంటి పార్టీ శనివారం ఇందిరాపార్కు వద్ద నిరసన కార్యక్రమం చేపట్టాయి. విద్యామంత్రి జగదీశ్‌రెడ్డిని తక్షణమే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ నేత కుంతియా డిమాండ్ చేశారు. లేదంటే ముఖ్యమంత్రి కేసీఆర్ హస్తం కూడా ఉందని భావించాల్సి వస్తుందన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.25 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించాలన్నారు. ఇంటర్ సమస్యకు పరిష్కారం చూపకపోతే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదండరాం హెచ్చరించారు. 3 రోజుల్లో ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. కీలక సమయాల్లో ముఖ్యమంత్రి విహార యాత్రలకు వెళ్లడమేంటని మండిపడ్డారు. ఇంటర్ బోర్డు అవకతవకల ఘటనకు నూటికి నూరుపాళ్లు ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని సీపీఐ నేత నారాయణ అన్నారు. ఇసుక మాఫియా తర్వాత ఇప్పుడు రాష్ట్రంలో విద్యా మాఫియా నడుస్తోందని టీటీడీపీ అధ్యక్షుడు రమణ అన్నారు. విద్యార్థుల ఆత్మహత్యలకు బాధ్యులైన వారిని శిక్షించాలని, ఆయా కుటుంబాలకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణ మాదిగ పేర్కొన్నారు. ఆ కుటుంబాలకు న్యాయం చేయకపోతే కేసీఆర్‌ను గద్దె దించే వరకు పోరాటం చేస్తామన్నారు. నాడు డిప్యూటీ సీఎం రాజయ్యను అకారణంగా తొలగించారని, ఇప్పుడు ఇన్ని తప్పులు జరిగినా జగదీశ్‌రెడ్డిని ఎందుకు బర్తరఫ్ చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్, తెలంగాణ జనసేన అధ్యక్షుడు నేమూరి శంకర్ గౌడ్ మాట్లాడారు. తల్లిదండ్రుల కన్నీరుమున్నీరు... ఈ సందర్భంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు, కుటుంబసభ్యులు కూడా కార్యక్రమం లో మాట్లాడారు. వారు మాట్లాడుతున్నంతసేపు అక్కడ ఉద్విగ్న వాతావరణం నెలకొంది. మహేశ్వరి తల్లి మాట్లాడుతూ.. తమ కుమార్తె కిరోసిన్ పోసుకొని ఆత్మహత్య చేసుకుందని కన్నీటి పర్యంతమయ్యారు. తనకు ఒకతే బిడ్డ అని.. ఎవరూ లేరన్నారు. అనామిక తల్లిదండ్రులు, అమ్మమ్మ మాట్లాడుతూ... కేసీఆర్ ఇంత మంది పిల్లలను పొట్టన పెట్టుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీహెచ్, నగేశ్ బాహాబాహీ సీనియర్ కాంగ్రెస్ నేత వీహెచ్, టీపీసీసీ అధికార ప్రతినిధి నగేశ్ బాహాబాహీకి దిగారు. దీంతో ధర్నా కార్యక్రమం రసాభాసగా మారింది. వేదికపై నుంచి వీహెచ్ మాట్లాడుతుండగా, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి కుంతియా అక్కడికి వచ్చారు. అదే సమయంలో నగేశ్ కూడా వేదిక పైకి వెళ్లారు. కుంతియా కోసం ఏర్పాటు చేసిన కుర్చీలో ఆయన కూర్చునేందుకు యత్నించారు. ఈ క్రమంలో నగేశ్, వీహెచ్ మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. వీహెచ్ చేయి చేసుకోవడంతో నగేశ్ ఆయన చొక్కా పట్టుకున్నారు. తోపులాటలో ఇద్దరూ కిందపడిపోయారు. అప్రమత్తమైన అఖిలపక్ష నేతలు ఇద్దరి మధ్య సయోధ్యకు యత్నించారు. పార్టీ రాష్ట్ర ఇన్చా ర్జి వచ్చినప్పుడు బాధ్యతగల నాయకుడు ఇలా ప్రవర్తించడం సరికాదంటూ వీహెచ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోదండరాం, నారాయణ జోక్యం చేసుకుని పరిస్థితి సద్దుమణిగేలా చేశారు. చనిపోయిన పిల్లల కుటుంబాల ముందు ఇలా మనం కొట్టుకోవడం వారిని అవమానించడమేనని కోదండరాం అన్నా రు. కావాలంటే మీరు గాంధీభవన్‌లో కొట్లాడుకోం డంటూ సీపీఐ నేత నారాయణ కాంగ్రెస్ నాయకులపై మండిపడ్డారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ తదితరులు పాల్గొన్నారు. -
అధికారులు, గ్లోబరీనాను కాపాడేందుకే: కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళం నేపథ్యంలో చోటుచేసుకున్న విద్యార్థుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలుగానే భావించాల్సి ఉంటుందని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ప్రభుత్వ బాధ్యతారాహిత్యం కారణంగానే ఆత్మహత్యలు జరిగాయని ధ్వజమెత్తారు. బోర్డు అధికారులు, గ్లోబరీనాను కాపాడటానికే ప్రభుత్వం కుట్రలకు పాల్పడుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌కు ఇతర రాష్ట్రాల పర్యటనలపై ఉన్న శ్రద్ధ విద్యార్థులపై లేదన్నారు. శుక్రవారం మఖ్దూంభవన్‌లో ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరవధిక దీక్షా శిబిరాన్ని సందర్శించి.. విద్యార్థులకు సంఘీభావం ప్రకటించారు. ప్రభుత్వం, అధికార పార్టీలోని ఒక్క ప్రజాప్రతినిధి అయినా ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శించారా అని ప్రశ్నించారు. ఉచితంగా రీవెరిఫికేషన్, రీ కౌంటింగ్ పేరుతో ప్రభుత్వం చేతులు దులుపుకోవాలని చూస్తోందని మండిపడ్డారు. -
గ్లోబరీనా తొలగింపు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ వార్షిక ఫలితాల ప్రక్రియలో పొరపాట్లు చేసిన గ్లోబరీనా సంస్థను ప్రభుత్వం పక్కన పెట్టింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల ప్రాసెస్ కోసం కొత్త సంస్థను ఎంపిక చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ నెల 25 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఆ పరీక్షలకు హాజరయ్యే దాదాపు 3.5 లక్షల మంది విద్యార్థుల ఫలితాలను ప్రాసెస్ చేయాల్సి ఉంది. ఆ పనుల బాధ్యతలను గ్లోబరీనాకు అప్పగిం చకుండా, కొత్త సంస్థకు అప్పగించేందుకు తెలంగాణ స్టేట్ టెక్నలాజికల్ సర్వీసెస్ (టీఎస్టీఎస్) ఈ ప్రొక్యూర్మెంట్ ద్వారా టెండర్లను ఆహ్వానించింది. కనీసం 10 లక్షల మంది విద్యార్థుల డాటా ప్రాసెస్ చేసి ఉండాలన్న నిబంధనను అందులో పొందుపరిచింది. అంతేకాకుండా గతంలో 2 ఏళ్లపాటు ఇంటర్ బోర్డులో పనిచేసి ఉండకూడదనే నిబంధన కూడా విధించింది. దీంతో గ్లోబరీనా సంస్థ ఈ టెండర్లలో పాల్గొనే అవకాశం కోల్పోయింది. -
13న పదో తరగతి ఫలితాలు విడుదల
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణలో పదో తరగతి పరీక్షా ఫలితాలు ఈ నెల 13వ తేదీన విడుదల కానున్నాయి. సోమవారం ఉదయం 11.30 గంటలకు సచివాలయంలో విద్యాశాఖ అధికారులు ఫలితాలు విడుదల చేస్తారు. రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 3వ తేదీవరకూ జరిగాయి. కాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో గందరగోళం నెలకొన్న నేపథ్యంలో ఫలితాల విడుదలలో ఎలాంటి సాంకేతిక లోపం తలెత్తకుండా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. -
ప్రభుత్వ వైఫల్యంవల్లే అవకతవకలు
హైదరాబాద్: ‘అందరూ చదువుకుంటే బాగుపడతారు అనుకుంటే, ప్రస్తుతం చదువు లేకున్నా మా బిడ్డ బతికేది అనుకునే స్థాయికి పరిస్థితి వచ్చింద’ని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యంవల్లే జరిగాయని, ఓ పనికిమాలిన సంస్థకు కాంట్రాక్టు ఇచ్చి పిల్లల జీవితాలతో ఆడుకున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ‘విద్యార్థుల ఆత్మహత్యలు – ప్రభుత్వ హత్యలు, వ్యవస్థల విధ్వంసం’అనే అంశంపై సోమవారం సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో అఖిలపక్ష సమావేశం జరిగింది. తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కోదండరామ్ మాట్లాడుతూ .. ఇంటర్మీడియట్ ఫలితాల్లోని అవకతవకలు ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. ఇప్పుడు ఇంటర్‌బోర్డు తమ తప్పులేదని, విద్యార్థులే సరిగ్గా చదవలేదని నెపం వారి మీదకు నెట్టేందుకు చూస్తోందన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఒక్కో విద్యార్థి కుటుంబ సభ్యులను తాము స్వయంగా కలిశామని, 10వ తరగతిలో 9.2 మార్కులు సాధించిన వారు ఇంటర్లో ఒక సబ్జెక్ట్‌లో ఎలా ఉత్తీర్ణులు కాలేరో వివరించాలన్నారు.వ్యవస్థను ప్రభుత్వం సరిగ్గా వాడుకోవడంలేదని, నిబంధనలు, మార్గదర్శకాలు, పద్ధతి అనేది లేకుండా పోయిందన్నారు. మనం పాత రాచరిక పాలన నుంచి బయటపడ్డాము రాజ్యాంగ పరమైన పాలనలో ఉన్నామని ప్రభుత్వానికి గుర్తుచేయాల్సి వస్తోందన్నారు. గతంలో స్వపరిపాలన కోసం ఉద్యమం చేశామనీ, ఇప్పుడు రాజ్యాంగబద్ధమైన పాలనకోసం పోరాటం చేయాల్సి వస్తోందన్నారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర మాజీ మంత్రి బండారు దత్తాత్రేయ మాట్లాడుతూ.. తెలంగాణలో ఎమర్జెన్సీని తలపిస్తోందన్నారు. గతంలో ఓ రైలు ప్రమాదం జరిగి 100 మంది మరణిస్తే నైతిక బాధ్యత వహిస్తూ అప్పటి కేంద్రమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారని, ఇప్పుడు 23 మంది పిల్లల ఆత్మహత్యకు కారణమైన మంత్రి జగదీశ్వర్ రెడ్డిని ఇప్పటివరకు ఎందుకు బర్తరఫ్ చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ ప్రముఖ విద్యావేత్త సమక్షంలో అన్ని పేపర్లను మరోమారు దిద్దించాలని డిమాండ్ చేశారు. బీసీ సంఘ జాతీయ నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ ఈ వైఫల్యంపై.. హైకోర్టు సిట్టింగ్ జడ్జిచే విచారణ జరిపించాలని అన్ని పార్టీలు కోరుతున్నా ప్రభుత్వం ఎందుకు జరిపించడంలేదో అర్థం కావడంలేదన్నారు. దోపిడీ, అణచివేతకు వ్యతి రేకంగా సామాజిక తెలంగాణ కోసం మరోమారు ఉద్యమిస్తామని హెచ్చరించారు. మాజీ ఎంపీ వి.హనుమంతరావు మాట్లాడుతూ.. చనిపోయిన 23 మం ది విద్యార్థులవి ప్రభుత్వ హత్యలే అని పేర్కొన్నారు. నిర్ణయాలివీ.. ఈ సందర్భంగా సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ ప్రకటించారు. మృతి చెందిన విద్యార్థుల కుటుంబీకులకు 2 కోట్ల నష్టపరిహారం ఇవ్వాలి. ఘటనపై సిట్టింగ్ జడ్జితో న్యాయవిచారణ జరపాలి, సీబీఐచే విచారణ జరిపించాలి. ‘గ్లోబరీనా’సంస్థ వెనక గల మూలాలు, సంబంధాలు, అవకతవకలపై విచారణ జరిపించాలి. కార్పొరేట్ విద్యా వ్యవస్థను అంతమొందించాలి వంటి తీర్మానాలను అఖిలపక్షం చేసినట్లు తెలిపారు. 13నుంచి చైతన్య సభలు ఈ నెల 13 నుంచి అన్ని జిల్లా కేంద్రాల్లో చైతన్య సభలు, 25న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరసన దీక్షలు, 27న వేలాదిమందితో ధర్నాచౌక్ వద్ద నిరసన , జూన్ మొదటివారంలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు కాశీనాథ్, సీపీఐ నేతలు బాల మల్లేశ్, పాండు రంగాచారి, వివిధ పార్టీల, సంఘాల నాయకులు నాగుల శ్రీనివాస్ యాదవ్, సింహాద్రి తదితరులు పాల్గొన్నారు. -
11వ తేదీన నిరసన దీక్ష
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 11న ఇందిరాపార్కు వద్ద నిరసన దీక్ష నిర్వహిస్తున్నట్టు అఖిలపక్ష నేతలు ప్రకటించారు. ఇంటర్ ఫలితాల వెల్లడిలో అనేక అవకతవకలు బయటపడి 18 రోజులు గడిచినా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోకపోవడం వల్ల విద్యార్థుల ఆత్మహత్యలు ఆగడం లేదని, వీటిని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యపూరితంగా వ్యవహరిస్తోందని వారు విమర్శించారు. ఆదివారం మఖ్దూంభవన్‌లో జరిగిన సమావేశంలో ఇంటర్ పరీక్షల వ్యవహారంపై చేపట్టాల్సిన కార్యాచరణపై చర్చించిన అనంతరం చాడ వెంకటరెడ్డి (సీపీఐ), ఎం.కోదండరాం (టీజేఎస్), రావుల చంద్రశేఖరరెడ్డి (టీడీపీ), ఎం.ఆర్.జి.వినోద్‌రెడ్డి (కాంగ్రెస్) విలేకరులతో మాట్లాడారు. అన్ని జవాబు పత్రాలను సమీక్షించి, అవసరమైతే పునఃమూల్యాంకనం చేయాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని, తప్పిదాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని కోదండరాం డిమాండ్ చేశారు. ప్రధానమైన ఐదు డిమాండ్లపై 11న దీక్షా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు చెప్పారు. అఖిలపక్ష నేతలని అరెస్ట్‌లు చేయడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని చాడ వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. బాధిత విద్యార్థుల కుటుంబాలతో కలిసి 11న చేపడుతున్న నిరసన దీక్షలో అందరూ పాల్గొనాలని కోరారు. ప్రభుత్వం వెంటనే స్పందించి ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని, బోర్డు తప్పిదాలకు కారకులైన వారిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా కేసీఆర్‌లో ఏమాత్రం చలనం లేదని రావుల చంద్రశేఖర్‌రెడ్డి విమర్శించారు. గతంలో రూ.74 లక్షలకే టెండరిచ్చి ఈ ఏడాది మాత్రం దానిని రూ.4.34 కోట్లకు పెంచి గ్లోబరీనాకు ఎవరు అప్పగించారనే దానిపై విచారణ జరిపించాలని వినోద్‌రెడ్డి డిమాండ్ చేశారు. తాము చేయని తప్పులకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని ఆయన కోరారు. -
కేసీఆర్‌కు కోమటిరెడ్డి చురకలు..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల మూల్యాంకనంలో రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే ఇరవై అయిదు మంది విద్యార్థులు చనిపోయారని, దీనికి ప్రభుత్వమే బాధ్యత వహించాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక మంది విద్యార్థులు చనిపోయారని, రాష్ట్ర ఏర్పాటు తర్వాత అదే పరిస్థితి పునరావృతం అవుతోందన్నారు. ఇంటర్మీడియట్ పరీక్షలనే నిర్వహించలేని ముఖ్యమంత్రి .. ప్రధాని ఎట్లవుతారంటూ చురకలు అంటించారు. ఈ ఘటనలకు ముఖ్యమంత్రి కేసీఆర్ బాధ్యత వహించాలన్నారు. ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఎన్ఎస్యూఐ, యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్షకు కోమటిరెడ్డి శుక్రవారం సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఐదేళ్లలో తెలంగాణ పూర్తిగా భ్రష్టు పట్టిందని, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను పరామర్శించడానికి సైతం ముఖ్యమంత్రికి తీరిక లేదని విమర్శించారు. ఎమ్మెల్యేల కొనుగోలు మీద ఉన్న ఆసక్తి రాష్ట్ర పాలన మీద లేదన్నారు. గ్లోబరీనా సంస్థపై మర్డర్ కేస్ పెట్టాలని, అవినీతి అధికారి అశోక్‌ను సస్పెండ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అసమర్థుడు విద్యాశాఖ మంత్రి కావడం దురదృష్టకరమని పేర్కొన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కుసుమ కుమార్ మాట్లాడుతూ, చనిపోయిన విద్యార్థి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలతో విద్యార్థులు బలౌతున్నారని పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య అన్నారు. అనంతరం సీనియర్ కాంగ్రెస్ నేత టి.పురుషోత్తంరావు, మధుయాష్కీ గౌడ్, జాతీయ యువజన కాంగ్రెస్ నేతలు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లచే దీక్ష విరమింపజేశారు. -
ఎక్కువ పేపర్లు దిద్దాలంటూ ఒత్తిడి..అందుకే ఫెయిల్..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో సాంకేతిక తప్పులే కాకుండా ఎక్కువపేపర్లు దిద్దాలన్న ఒత్తిడితో చేసిన వ్యాల్యుయేషన్లోనూ పొరపాట్లు దొర్లాయి. దీంతో చాలామంది విద్యార్థులకు తక్కువ మార్కులు వచ్చాయి. ప్రస్తుతం చేస్తున్న రీవెరిఫికేషన్లో ఈ లోపాలు బయటపడుతున్నా యి. ఈ నేపథ్యంలో వాటిని సవరించేపనిలో ఇంటర్ బోర్డు పడింది. జవాబుపత్రాల మూల్యాంకన సమయంలో ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో వ్యాల్యుయేషన్ చేసే లెక్చరర్లకు పరిమితికి మించి జవాబుపత్రాలను పంపిం చారు. దీంతో అక్కడి అధికారులు వ్యాల్యుయే షన్ చేయలేమంటూ చేతులెత్తేశారు. మిగిలిన వాటిని తిరిగి హైదరాబాద్‌కు తెప్పించి వ్యాల్యు యేషన్ చేయించారు. ఈ క్రమంలో ఒక్కో లెక్చరర్ చేత రోజూ దిద్దాల్సిన పేపర్ల సంఖ్య కంటే ఎక్కువ పేపర్లను దిద్దించారు. దీంతో పలువురు విద్యార్థుల జవాబుపత్రాల మూల్యాంకనంలో తప్పులు దొర్లినట్లు రీవెరిఫికేషన్లో బయటపడింది. దీంతో వాటిని సవరించి ఇచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. 3 శాతం మంది పాస్ అయ్యే చాన్స్... ఇంటర్ ఫలితాల్లో తప్పుల నేపథ్యంలో ఫెయిల్ అయిన, సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన దాదాపు 3.28 లక్షల మంది విద్యార్థులకు చెందిన 12 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో పలువురు విద్యార్థులు పాస్ అవుతున్నారు. మొత్తంగా ఫెయిల్ విద్యార్థుల్లో 3 శాతం మంది వరకు రీ వెరిఫికేషన్‌లో పాస్ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలిసింది. కొందరు విద్యార్థులకు మొదట్లో తక్కువ మార్కులు రాగా, మరికొంత మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. దీంతో 48,960 మంది విద్యార్థులు తమకు తక్కువ మార్కులు వచ్చాయంటూ రీ వెరిఫికేషన్ కోసం బోర్డుకు దరఖాస్తు చేసుకున్నారు. మరో 10,576 వేల మంది రీ కౌంటింగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రస్తుతం వారి జవాబు పత్రాలతోపాటు సున్నా మార్కులు వచ్చిన, ఆబ్సెంట్ పడిన 3.28 లక్షల మందికి చెందిన 11 లక్షల జవాబు పత్రాలను రీ వెరిఫికేషన్ చేస్తున్నారు. ఒక విద్యార్థికి రీ వెరిఫికేషన్‌కు ముందు సంస్కృతంలో కేవలం 5 మార్కులే రాగా రీ వెరిఫికేషన్ తర్వాత 50 మార్కులు వచ్చినట్లు తెలిసింది. అలాగే మరో విద్యార్థి సివిక్స్‌లో 18 మార్కులతో ఫెయిల్ అవగా రీ వెరిఫికేషన్‌లో అతనికి 39 మార్కులు వచ్చి పాస్ అయినట్లు సమాచారం. ఇంకో విద్యార్థికి కూడా మ్యాథ్స్‌లో మొదట 18 మార్కులే రాగా రీ వెరిఫికేషన్‌లో 29 మార్కులు వచ్చి పాస్ అయినట్లు తెలిసింది. -
ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన..!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పుల కారణంగా తలెత్తిన వివాదాల నేపథ్యంలో విద్యాశాఖ అప్రమత్తమైంది. త్వరలో విడుదల కానున్న పదోతరగతి పరీక్షల ఫలితాల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కా చర్యలు చేపడుతోంది. తొందరపడి ఫలితాలు ప్రకటించి 5.5 లక్షల మంది విద్యార్థులను ఇబ్బందుల్లోకి నెట్టకుండా.. ఒకటికి రెండు, మూడుసార్లు పునఃపరిశీలన జరిపాకే ఫలితాలను వెల్లడించాలని నిర్ణయించింది. పదో తరగతి పరీక్ష ఫలితాల ప్రాసెస్, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి.. శుక్రవారం విద్యాశాఖ కమిషనర్ విజయ్‌కుమార్, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ సుధాకర్, ఇతర అధికారులు, సాంకేతిక సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. పదోతరగతి పరీక్షల ఫలితాల విషయంలో ఒక్క పొరపాటు కూడా జరక్కుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం పదో తరగతి పరీక్షల మూల్యాంకనం పూర్తయింది. స్కానింగ్ ప్రక్రియ కూడా ముగిసింది. ఫలితాల ప్రాసెస్ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో తప్పులు దొర్లకుండా పక్కా ఏర్పాట్లు చేయాలని స్పష్టం చేశారు. తప్పులు దొర్లకుండా పక్కాగా పరిశీలన జరపడంతోపాటు ఒకవేళ విద్యార్థులకు అనుమానాలున్నా, ఫిర్యాదు చేయాలన్నా ఆన్లైన్లోనే చేసేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. విద్యార్థులు హైదరాబాద్‌కు రావాల్సిన అవసరం లేకుండా, తమ పాఠశాల ప్రధానోపాధ్యాయుని లాగిన్ నుంచి, లేదా ఇంటర్నెట్ సెంటర్ నుంచి ఫిర్యాదు చేసేలా, దానికి మెసేజ్ రూపంలో రెస్పాన్స్ ఇచ్చేలా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా ముందుగా రీ–వెరిఫికేషన్ ప్రక్రియను చేపట్టనున్నారు. శనివారం నుంచి వచ్చే నాలుగైదు రోజులు పునఃపరిశీలన జరుపనున్నారు. ఆ ప్రక్రియ పూర్తయ్యాక వీలైతే వచ్చే 10వ తేదీన ఫలితాలను వెల్లడించే అవకాశం ఉంది. పరిశీలన ప్రక్రియ కనుక సవ్యంగా పూర్తికాకపోతే 15వ తేదీలోగా పూర్తి చేసి ఫలితాలను ప్రకటించాలని నిర్ణయించారు. మొత్తానికి 10–15 తేదీల మధ్య ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. పరీక్షల విషయంలో తీసుకోనున్న జాగ్రత్తలివే! ఒక సబ్జెక్టు మినహా మిగతా సబ్జెక్టుల్లో పాస్ అయిన విద్యార్థులు ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినా, ఆబ్సెంట్ పడినా ఆ జవాబు పత్రాలను రీ–వెరిఫికేషన్ చేస్తారు. సున్నా మార్కులు వచ్చినా వారి జవాబు పత్రాలను పునఃపరిశీలిస్తారు. సబ్జెక్టుల వారీగా మార్కుల వ్యత్యాసాన్ని సరిపోల్చి చూస్తారు. సైన్స్‌లో అత్యధిక మార్కులు వచ్చి, మ్యాథ్స్‌లో తక్కువ మార్కులు వస్తే మళ్లీ పరిశీలన జరుపుతారు. అన్ని సబ్జెక్టుల్లో ఎక్కువ మార్కులు వచ్చి ఒక సబ్జెక్టులో తక్కువ మార్కులు వస్తే ఆ విద్యార్థి జవాబు పత్రాన్ని రీ–చెక్ చేస్తారు. ఫలితాలు విడుదలైన వెంటనే విద్యార్థులు తమ ఫలితాలను తెలుసుకునేందుకు పాఠశాలలకు ప్రత్యేక లింకు ఇస్తారు. పాఠశాలల వారీగా విద్యార్థుల మార్కులను కూడా ఆయా పాఠశాలలకు పంపిస్తారు. అందులో ఏమైనా అనుమానాలు ఉన్నా, తక్కువ మార్కులు వచ్చినట్లు గుర్తించినా విద్యార్థులు సంబంధిత ప్రిన్సిపాల్ దగ్గర్నుంచే ఆన్లైన్లో ఫిర్యాదు చేసేలా ఏర్పాట్లు చేస్తారు. పరీక్షలకు సంబంధించి విద్యార్థులకు తలెత్తే అనుమానాలను నివృత్తి చేసేందుకు, ఫిర్యాదులను స్వీకరించేందుకు ఆన్లైన్ విధానం ప్రవేశ పెడతారు. విద్యార్థులు నేరుగా ఫిర్యాదు చేసేందుకు ఆన్లైన్ లింక్ ఇస్తారు. అవసరమైతే మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెస్తారు. ఈ ప్రక్రియ కోసం ప్రత్యేక సర్వర్‌ను అందుబాటులో ఉంచుతారు. విద్యార్థులెవరూ హైదరాబాద్‌కు రావాల్సిన అవసరమే లేకుండా ఆన్లైన్ ద్వారానే వారి సమస్యలు పరిష్కరించేలా చర్యలు చేపడతారు. ఈ క్రమంలో విద్యార్థి ఫిర్యాదు చేసిన వెంటనే అతని మొబైల్ నంబరుకు మెసేజ్ పంపిస్తారు. అది పరిష్కారం అయ్యాక కూడా మెసేజ్ పంపిస్తారు. ఈ–మెయిల్ ఐడీకి కూడా ఆ వివరాలను పంపిస్తారు. వీటికి సంబంధించిన వెబ్సైట్/వెబ్‌లింక్/మొబైల్ యాప్‌ను నాలుగైదు రోజుల్లో సిద్ధం చేయాలని నిర్ణయించారు. -
విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలి
కందుకూరు: ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమైన విద్యాశాఖ మంత్రి వెంటనే రాజీనామా చేయాలని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి, జెడ్పీటీసీ ఏనుగు జంగారెడ్డి డిమాండ్ చేశారు. ఆత్మహత్య చేసుకున్న ఇంటర్ విద్యార్థుల ఆత్మశాంతిని కోరుతూ గురువారం రాత్రి మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు ఎస్.కృష్ణనాయక్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో శాంతి ర్యాలీ నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. తెలంగాణ ప్రభుత్వం విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతోందన్నారు. వెంటనే వారి వైఖరి మార్చుకోకపోతే రానున్న రోజుల్లో ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలన్ని ప్రభుత్వ వైఫల్యంతో జరిగినవేనని ఆరోపించారు. విద్యాశాఖ మంత్రి నైతిక బాధ్యత వహించాల్సిందేనన్నారు. కార్యక్రమంలో పీసీసీ కార్యదర్శి జానకీరామ్, జిల్లా ప్రధానకార్యదర్శి సుదర్శన్‌రెడ్డి, ఎంపీటీసీలు నిమ్మల వెంకటేష్‌గౌడ్, ఎం.నర్సింహా, సర్పంచ్ మహేశ్, నాయకులు చల్లా బాల్‌రెడ్డి, రాణాప్రతాప్‌రెడ్డి, కరుణాకర్‌రెడ్డి, ప్రశాంత్, అజ్జు, రాంరెడ్డి, మల్లేష్, ఆంజనేయులు, దేవేందర్, శ్రీను, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
బీజేపీ బంద్ ప్రశాంతం
హన్మకొండ: ఇంటర్ జవాబుపత్రాల మూల్యాంకనం, ఫలితాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బీజేపీ రాష్ట్ర శాఖ ఇచ్చిన పిలుపు మేరకు అర్బన్ జి ల్లాలో గురువారం బంద్ ప్రశాంతంగా జరిగింది. బంద్ సందర్భంగా అవాంచనీయ సంఘటనలు జరగకుండా ఉం డేలా పోలీసులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. పలువురు బీజేపీ నాయకులను ముందస్తుగా అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలించారు. అయి తే, పలువురు నాయకులు ర్యాలీలుగా వెళ్తూ తెరిచి ఉన్న దుకాణాలను మూసివేయించారు. బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి ఆధ్వర్యాన నాయకులు, కార్యకర్తలు ఉదయమే హన్మకొండలోని ఆర్టీసీ జిల్లా బస్‌స్టేషన్‌కు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఈమేరకు పోలీసులు చేరుకుని రాకేష్ రెడ్డితో పాటు నాయకులను సుబేదారి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు, మార్తినేని ధర్మారావు ఆధ్వర్యంలో పార్టీ నాయకులు ర్యాలీ తీశారు. అక్కడక్కడా తెరిచి ఉన్న దుకాణాలను మూయిస్తుండగా రాజేశ్వర్‌రావు, ధర్మారావు, రావుల కిషన్‌తో పాటు ఇతర నాయకులను అరెస్టు చేసి సుబేదారి పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక హంటర్ రోడ్డు మీదుగా బంద్‌ను పర్యవేక్షిస్తున్న మాజీ మంత్రి డాక్టర్ గుండె విజయరామారావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వరంగల్ ఎంపీ అభ్యర్థి చింత సాంబమూర్తిని అరెస్టు చేసి హన్మకొండ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇక జిల్లాలోని మిగతా మండలాల్లోను బంద్ ప్రశాంతంగా ముగిసింది. ఈ కార్యక్రమాల్లో నాయకులు వంగాల సమ్మిరెడ్డి, చింతలఫణి అమరేందర్‌రెడ్డి, రావు అమరేందర్‌రెడ్డి, కొలను సంతోష్‌రెడ్డి, కందగట్ల సత్యనారాయణ, రాజేంద్రప్రసాద్, వినోద్, కోటేశ్వర్, మహేష్‌గౌడ్, రవి నాయక్, పెరుగు సురేష్, రాజేష్ ఖన్నా, శేఖర్ పాల్గొన్నారు. ప్రజాస్వామ్యమా.. రాచరిక రాజ్యమా? తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నది... ప్రజాస్వామ్యమా, రాచరిక రాజ్యమా అని మాజీ మంత్రి గుండె విజయరామారావు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చింత సాంబమూర్తి ప్రశ్నించారు. ఇంటర్మీడియేట్ ఫలితాల్లో అవకతవకలను నిరసిస్తూ బంద్‌కు పిలుపునివ్వగా పోలీసులను ముందు పెట్టి నిరసనలు తెలపకుండా అడ్డుకోవడం గర్హనీయమన్నారు. బీజేపీ రాష్ట్ర అ«ధికార ప్రతినిధి ఏనుగుల రాకేష్ రెడ్డి మాట్లాడుతూ నిమ్స్‌లో నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు వ లక్ష్మణ్‌కు ఏం జరిగినా దానికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలన్నారు. బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ టి.రాజేశ్వర్‌రావు మాట్లాడుతూ ఇంటర్ పరీక్షలు విద్యార్థులకు జవాబు పత్రాల జిరాక్స్ ప్రతులను అందించాలని డిమాండ్ చేశారు. -
నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్..!
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్ గంగారాం ఆహిర్ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్చార్జి కృష్ణదాస్, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు. (చదవండి : అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్ రావు) కేంద్రమంత్రి హన్సరాజ్ మాట్లాడుతూ.. 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో లక్ష్మణ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమింపజేశాం. ఇంటర్ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం. విద్యార్థుల కుంటుంబాలకు మా సానుభూతి ఉంటుంది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విద్యార్థులకు నా విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా. ఉద్యమం ఉధృతం.. 9 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్యపై టీఆర్ఎస్ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై కేసీఆర్ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఒక జాతీయ పార్టీగా బాధితుల పక్షాన నిలబడ్డాం. వారి నిరసనలకు మద్దతు తెలుసుతున్నాం. లక్ష్మణ్‌తో అమిత్‌షా ఫోన్లో మాట్లాడారు. ఆయన దీక్షను హన్సరాజ్‌తో విరమింపజేయాలని వర్తమానం పంపారు. విద్యార్థుల పోరాటాలపై భరోసానివ్వడంతో లక్ష్మణ్ దీక్ష విరమించారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదు. ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తాం. 119 అసెంబ్లీ కేంద్రాల్లో దీక్షలు చేసి టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఢిల్లీకి వెళ్లి, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలుస్తాం. -బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు -
‘టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల అవకతవకలకు బాధ్యులైనవారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ), యువజన కాం గ్రెస్ ఆధ్వర్యంలో 48 గంటల దీక్ష ప్రారంభమైంది. గురువారం ఉదయం రెండు విభాగాల రాష్ట్ర అధ్యక్షులు బల్మూరి వెంకట్, అనిల్‌కుమార్‌యాదవ్‌లతోపాటు పలువురు నేతలు గాంధీభవన్ వేదికగా దీక్షకు కూర్చున్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏఐసీసీ కిసాన్ సెల్ వైస్‌చైర్మన్ కోదండరెడ్డి ఈ దీక్షను ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో విఫలమైందన్నారు. 10 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఇంటర్ ఫలితాల్లో తప్పులు జరిగితే బాధ్యులపై చర్యలు తీసుకోకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని మండిపడ్డారు. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు విశ్రమించబోమన్నారు. ప్రభు త్వం ఆందోళనలు జరగకుండా నిర్బంధాలు విధిస్తోందని విమర్శించారు. విద్యార్థుల చావుల కోసమేనా?: వెంకట్ ఇంటర్‌బోర్డు చేసిన తప్పులపై ఎన్నిసార్లు వినతిపత్రాలిచ్చినా పట్టించుకోలేదని ఎన్ఎస్ యూఐ రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్ ఆరోపించారు. విద్యార్థుల చావుల కోసమే తెలంగాణ సాధించుకున్నట్టు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటర్ ఫలితాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఇంటర్ విద్యార్థులకు న్యాయం చేయకపోతే టీఆర్ఎస్ నేతలను రోడ్లపై తిరగనివ్వబోమని హెచ్చరించా రు. యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్ మాట్లాడుతూ ఉన్నతశిఖరాలను అధిరోహించాలనుకునే విద్యార్థుల కలలు కల్లలయ్యేం దుకు ప్రభుత్వ అసమర్థతే కారణమని విమర్శించారు. దీక్షకు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు నేరెళ్ల శారద, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్, టీపీసీసీ అధికార ప్రతినిధులు ఇందిరా శోభన్, సతీశ్ మాదిగ సంఘీభావం తెలిపారు. దొంగల చేతికే తాళం ఇస్తారా: రేవంత్ ఇంటర్ బోర్డు ఫలితాల్లో తప్పు చేసిన గ్లోబరీనా సంస్థకే మళ్లీ రీవెరిఫికేషన్ బాధ్యతలు ఇవ్వడం దొంగ చేతికే తాళం చెవి ఇచ్చినట్టుందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి విమర్శించారు. గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాల్సింది పోయి కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు. దీక్షా శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపిన అనంతరం ఆయన మాట్లాడుతూ ఇంటర్ బోర్డులో అక్రమాలు జరిగాయని నిరూపిం చేందుకు తాను సిద్ధంగా ఉన్నానని రేవంత్ చెప్పారు. -
ఉన్నతవిద్య పరీక్షల్లో తెలంగాణ సర్కార్ సంస్కరణలు
-
ఉన్నత విద్య పరీక్షల్లో సంస్కరణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఉన్నతవిద్య పరీక్షల్లో సంస్కరణలకు తెలంగాణ ఉన్నత విద్యామండలి శ్రీకారం చుట్టింది. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో పొరపాట్ల నేపథ్యంలో ఉన్నత విద్యామండలి అప్రమత్తమైంది. డిగ్రీ, పీజీ, ఇతర వృత్తివిద్యా కోర్సులకు సంబంధించిన పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రాసెసింగ్ తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించింది. పరీక్షల నిర్వహణలో తప్పిదాలు దొర్లకుండా చూడటంతోపాటు ఫలితాల్లో పొరపాట్లు దొర్లకుండా పకడ్బందీ చర్యలు చేట్టాలని నిర్ణయించింది. అలాగే ఛాయిస్ బేస్డ్ క్రెడిట్ సిస్టం (సీబీసీఎస్)ను పక్కాగా అమలు చేయడంతోపాటు డిగ్రీ కోర్సుల్లో ఒకే రకమైన గ్రేడింగ్ విధానాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి తీసుకురానుంది. పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం అమలు చేయడంతోపాటు పరీక్షల మూల్యాంకన కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించాలని యూనివర్సిటీల వీసీలకు స్పష్టం చేసింది. మరోవైపు పరీక్షల నిర్వహణ, వ్యాల్యుయేషన్, ఫలితాల ప్రాసెసింగ్ వంటి అంశాలపై యూనివర్సిటీలు స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని ముందుకు సాగాలని పేర్కొంది. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే సంబంధిత లెక్చరర్లపై క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా నిబంధనలను రూపొందించి అమలు చేయాలని పేర్కొంది. గురువారం ఉన్నత విద్యామండలి కార్యాలయంలో రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చెందిన వీసీలతో పరీక్షల సంస్కరణలపై సమీక్ష సమావేశం జరిగింది. ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసరావు, వీసీలు, ఇతర అధికారులు పాల్గొన్నారు. సమావేశానంతరం తీసుకున్న నిర్ణయాలను పాపిరెడ్డి విలేకరులకు తెలియజేశారు. ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిదాల ఘటన తర్వాత యూనివర్సిటీల్లో పరీక్షల విధానంపై సమీక్షించినట్లు తెలిపారు. ఇప్పటికిప్పుడు పలు సంస్కరణలు తేవడంతోపాటు భవిష్యత్తులో మరింత పక్కాగా ఉండేందుకు కార్యాచరణపై నివేదిక అందజేసేందుకు ఐదుగురు సభ్యులతో ఉన్నతస్థాయి పరీక్షల సంస్కరణల కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. మండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఆర్. లింబాద్రి, ప్రొఫెసర్ వెంకటరమణ, ఉస్మానియా విశ్వవిద్యాలయం వీసీ ప్రొఫెసర్ రామచంద్రం, కాకతీయ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ సాయన్న, మహత్మాగాంధీ యూనివర్సిటీ వీసీ ప్రొఫెసర్ అల్తాఫ్ హుస్సేన్‌లతో కమిటీని ఒకట్రెండు రోజుల్లో ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ నెల రోజుల్లో నివేదిక అందజేయాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ సమావేశంలో తీసుకున్న ప్రధాన నిర్ణయాలు... పరీక్షల్లో ఎలాంటి పొరపాట్లు దొర్లకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలి. జవాబుపత్రాల మూల్యాంకనానికి యూనివర్సిటీలవారీగా స్పష్టమైన మార్గదర్శకాలు రూపొందించుకొని అమలు చేయాలి. రోజుకు ఎన్ని పేపర్లు దిద్దాలి అన్న దానిపైనా స్పష్టత ఇవ్వాలి. అధ్యాపకులు వ్యాల్యుయేషన్ సరిగ్గా చేస్తున్నారా లేదా? అన్న దానిపై పర్యవేక్షణ ఉండాలి. వ్యాల్యుయేషన్ కేంద్రాల్లో సెల్ఫోన్లను నిషేధించాలి. కాన్ఫిడెన్షియల్ వర్క్‌లో పాల్గొనే వారికి స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలి. బాధ్యతలను అప్పగించాలి. వ్యాల్యుయేషన్‌లో పొరపాట్లు చేస్తే క్రమశిక్షణ చర్యలు చేపట్టేలా యూనివర్సిటీ నిర్ణయం తీసుకోవాలి. ఆయా కేంద్రాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలి. పరీక్ష కేంద్రాల కేటాయింపులో జంబ్లింగ్ విధానం అమలు చేయాలి. ప్రభుత్వ కాలేజీల్లో మాత్రమే అవసరమైతే సెల్ఫ్ సెంటర్లు ఇవ్వాలి. పరీక్షల సమయంలో ఫ్లైయింగ్ స్క్వాడ్లు, సిట్టింగ్ స్క్వాడ్ల ద్వారా పర్యవేక్షణను కొనసాగించాలి. అన్ని యూనివర్సిటీలు... విద్యార్థులు దరఖాస్తు చేసుకుంటే వారి జవాబు పత్రాల జిరాక్స్ కాపీలను ఇచ్చేలా చర్యలు చేపట్టాలి. వాటి అమలు, పర్యవేక్షణ కోసం ప్రతి యూనివర్సిటీలో హైపవర్ కమిటీని ఏర్పాటు చేయాలి. వైస్ చాన్సలర్లు ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఈ ప్రక్రియలను పర్యవేక్షించాలి. తద్వారా పరీక్షల నియంత్రణాధికారులు, సహాయక పరీక్షల నియంత్రణాధికారులపై భారం పడుకుండా చూడాలి. ఫలితాలు ఇచ్చేటప్పుడు ఆన్లైన్ సర్వీసెస్ సరిగ్గా ఉన్నాయా? లేదా? సర్వీసు ప్రొవైడర్ సరిగ్గా చేస్తున్నారా? లేదా? ఒకటికి రెండుసార్లు పరిశీలించి ఫలితాలు ఇవ్వాలి. ప్రథమ సంవత్సరంలో మార్కులు ఎక్కువ వచ్చి ద్వితీయ సంవత్సరంలో బాగా తగ్గితే వాటిని క్రాస్‌చెక్ చేసేలా సాఫ్ట్‌వేర్‌ను రూపొందించుకోవాలి. వ్యవస్థపై నమ్మకం పోకుండా పిల్లలకు నష్టం కలగకుండా చూసుకోవాలి. ఫలితాల్లో పొరపాట్లు దొర్లితే వెంటనే సవరించుకునేలా చర్యలు చేపట్టాలి. -
పర్యవేక్షణ లోపమే ‘ఇంటర్’ వైఫల్యం
పరీక్షా ఫలితాల వెల్లడి కోసం ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశితంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత, దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్ బోర్డుపై ఉన్నాయి. ఈ బాధ్యతలను తెలంగాణ ఇంటర్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది నిజం. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు.. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. అలాంటి పర్యవేక్షణ, నిర్ధారణ లోపమే పరీక్షా ఫలితాల వెల్లడిలో ఇంటర్ బోర్డు వైఫల్యానికి కారణం. భారతదేశంలో విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా చాలా ప్రధానమైనటువంటి ఘట్టం ఇంటర్మీడియట్ విద్య. విద్యార్థులు భవిష్యత్తులో ఏ వృత్తిలో ఉండాలనేది ఇప్పుడే నిర్ణయమవుతుంది. ఉన్నత విద్యాస్థాయిలో ఒక విద్యా విభాగం నుంచి మరొక విభాగానికి మారే అవకాశం లేని మన విద్యా విధానంలో ఇంటర్మీడియట్లో తీసుకున్న నిర్ణయాన్ని బట్టి విద్యార్థుల భవిష్యత్ విద్యే కాక వారి వృత్తిపరమైన నిర్ణయం కూడా జరుగుతుంది. తీసుకున్న సబ్జెక్టులను బట్టి భవిష్యత్తులో వారు డాక్టర్లయ్యేది, ఇంజనీర్లయ్యేది, ఇంకేదైనా వృత్తిలో స్థిరపడేది ఈ సమయంలోనే నిర్ణయమవుతుంది. అందుకనే తల్లిదండ్రులు కూడా విద్యార్థుల చదువులలో ఈ ఘట్టానికి చాలా ప్రాధాన్యం ఇస్తారు. పిల్లలతోపాటు తామూ శ్రమపడి వారు చక్కని ఫలితాలు సాధించడానికి తోడ్పడుతుంటారు. ఒకరకంగా మొత్తం కుటుంబం కలిసి తీసుకునే పరీక్ష ఇంటర్మీడియట్ పరీక్ష. ఇంత ప్రాధాన్యం కలిగిన ఇంటర్ పరీక్షలను ప్రభుత్వాలు సక్రమంగా నిర్వహించకపోవడం కొత్తేమీ కాదు. గతంలో చాలాసార్లు పరీక్ష పత్రాల లీకేజీ, జంబ్లింగ్ విధానాల్లో లోపాలు విద్యార్థులను ఇబ్బందులకు గురిచేశాయి. ఇటువంటి సమస్యలు ఉత్పన్నం అయినప్పుడు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రులు ముందే అనుకున్న వ్యూహం ప్రకారంగా రాజీనామాలు చేయడానికి సమాయత్తపడటం సీఎంలు నివారించటం సాధారణంగా పరిపాటి అయిపోయింది. కానీ నేడు తెలంగాణ ఇంటర్ బోర్డ్ చేసిన స్థాయిలో ఫలితాలను పూర్తిగా అస్తవ్యస్తంగా ఎవరూ చేయలేదు. ఇలాగే 1997లో ఒకసారి ఇంటర్ ఫలితాలు వెలువరించడంలో ఇంటర్మీడియట్ బోర్డు తీవ్రమైన తప్పులు చేసింది. నాటి సీఎం ఇంటర్ బోర్డ్ సెక్రటరీని సస్పెండ్ చేయాలని భావించినా, నాటి ఉన్నతాధికారులు ఆయనకు బాసటగా నిలిచి పరిస్థితిని చక్కదిద్ది చేయి దాటి పోకుండా చూసుకున్నారు. అంతకు మించిన స్థాయిలో ఫలితాలు వెలువరించడంలో గోల్మాల్ చేసిన ఇంటర్మీడియట్ బోర్డు నేడు మళ్లీ తన పరిమితులను చాటుకున్నది. మునుపెన్నడూ లేనివిధంగా ఈనాటి పరీక్ష ఫలితాలు చాలా మంది విద్యార్థుల ఆత్మహత్యలకు కారణమై వారి తల్లిదండ్రులకు గర్భశోకాన్ని మిగిల్చాయి. తమ ప్రమేయం ఏమీ లేకున్నప్పటికీ.. మరొకరి అసమర్థతకూ, నిర్లక్ష్యానికీ పిల్లలు బలైపోయారు. తెలం గాణలో ఇటీవలి ఎన్నికలలో పూర్తిగా నైతిక స్థైర్యం దెబ్బతిన్న ప్రతిపక్షాలకు ప్రభుత్వం లక్ష్యంగా విమర్శించడానికి ఇది ఒక ఆయుధంగా పనికి వచ్చింది. ప్రభుత్వం పక్షం నుంచి వెంటనే తగిన నివారణా చర్యలు తీసుకోవడంలో జాప్యం జరగడం కూడా సమస్యను జటిలం చేసింది. ప్రజాప్రయోజనాల వ్యాజ్యాన్ని పరిశీలించిన హైకోర్టు ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వానికి కొన్ని ఆదేశాలిచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభజనకు ముందు ఇంటర్మీడియట్ విద్యా విధానాన్ని నిర్వహించటానికి ఉన్న విధి విధానాలే నేటికీ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొనసాగుతున్నాయి. స్థూలంగా ఇంటర్మీడియట్ విద్యా కమిషనర్, ఆయన ఆఫీసు ప్రభుత్వ ఇంటర్మీడియట్ కళాశాల విధి విధానాలను వ్యవహారాలను చూసుకుంటాయి. ఇంటర్మీడియట్ బోర్డు సిలబస్ విద్యాపరమైన అంశాలను పరీక్ష నిర్వహణను చూసుకుంటుంది. బోర్డుకు విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి కానీ మంత్రిగానీ అధ్యక్షులుగా ఉంటారు. బోర్డు సెక్రటరీగా వ్యవహరించే ఐఏఎస్ అధికారి బోర్డు కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటారు. ఇతర రాష్ట్రాలలో లాగా ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో ఇంటర్ బోర్డుకు రీజనల్ కార్యాలయాలు లేవు. పరీక్ష నిర్వహణ ఫలితాలను రాష్ట్రమంతటికీ కేంద్రీకృత విధానంలో ఇంటర్ బోర్డు ద్వారా వెల్లడిస్తున్నారు. గతంలో సమాధాన పత్రాల మార్కులను క్రోడీకరించడం ఫలితాలు వెల్లడించటం కార్యాలయ సిబ్బంది సహాయంతో యాంత్రీకరణ లేకుండా చేసేవారు. కాలక్రమేణా మార్పులు తీసుకొచ్చి ఫలితాలను క్రోడీకరించి ఎలక్ట్రానిక్ విధానంలో వెల్లడించసాగారు. ఇందుకు కావలసిన సామర్థ్యం బోర్డు సిబ్బందికి లేదు కాబట్టి విభజనకు ముందే ఏపీలో ఈ బాధ్యతను రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌కి ఇవ్వడం జరిగింది. అక్కడ తగిన సాంకేతిక సిబ్బంది సామర్థ్యం ఉన్నందున వారు తగిన సంస్థను ఎన్నిక చేసి తమ పర్యవేక్షణలో ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించి ఫలితాలను ఇంటర్ బోర్డుకు అందజేయడం జరిగేది. ఎటువంటి వివాదాలు లేకుండా సాఫీగా ఈ కార్యక్రమం నిర్వహించబడుతుండేది. ఎంసెట్ పరీక్షలు నిర్వహించే జె.ఎన్.టి.యు విశ్వవిద్యాలయానికి స్వతహాగా ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించే సామర్ధ్యం ఉంది కాబట్టి ఇతరుల సహాయ సహకారాలతో ప్రమేయం లేకుండా సాఫీగా ఎంసెట్ పరీక్ష ఫలితాలను నిర్వహించగలుగుతారు. నేను సీసీఎల్‌గా పనిచేసిన రోజుల్లో ఓఎంఆర్ షీట్ పరీక్ష ద్వారా విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక చేయదలచినప్పుడు కావలిసిన సహాయ సహకారాలు జేఎన్టీయూ నుంచి తీసుకోవటం జరిగింది. ఎటువంటి సమస్యలు లేకుండా పెద్ద ఎత్తున ఆరోజు విలేజ్ అసిస్టెంట్ల ఎంపిక నిర్వహించగలిగాం. అటు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సహాయ సహకారాలు తీసుకోకుండా, ప్రత్యామ్నాయంగా జేఎన్టీయూ వారి సేవలను వినియోగించుకోకుండా, అంతర్గతంగా సరైన సామర్థ్యం లేకుండా ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా ఈ మొత్తం కార్యక్రమాన్ని నిర్వహించడానికి పూనుకొని తెలం గాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్ పెద్ద తప్పు చేసింది. ఇంటర్మీడియట్ బోర్డులో పనిచేస్తున్న ఉద్యోగులు క్రమంలో తలెత్తుతున్న సమస్యలను వివరిస్తున్నప్పటికీ, వాటిని బోర్డు పట్టించుకోకపోవడం వల్లే నేడు ఈ పరిస్థితికి దారితీసింది. నేడు ప్రభుత్వం ఏర్పాటుచేసిన త్రిసభ్య కమిటీ కూడా ఇంటర్మీడియట్ బోర్డు ఈ బాధ్యతలు అప్పగించిన గ్లోబరీనా సంస్థపై సరైన పర్యవేక్షణ చేయనందుకు ఇంటర్మీడియట్ బోర్డును అధికారులను తప్పుపట్టారు. ప్రైవేట్ సంస్థను ఎంచుకోవడంలో అన్ని విధివిధానాలూ పాటించి ఉన్నా, ఆచరణలో సంస్థ కార్యక్రమాలను నిశి తంగా పర్యవేక్షించాల్సిన బాధ్యత దానికి తగిన సామర్థ్యం తమదగ్గర లేనప్పుడు అటువంటి సామర్థ్యం ఉన్న ప్రభుత్వ సంస్థ సహాయ సహకారాలు తీసుకోవాల్సిన బాధ్యత పూర్తిగా ఇంటర్మీడియట్ బోర్డుపై ఉంది. ఈ బాధ్యతను ఇంటర్మీడియట్ బోర్డు సక్రమంగా నిర్వహించలేదన్నది ఈ మొత్తం ఉదంతంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది. ఎలక్ట్రానిక్ రూపంలో వచ్చిన ఫలితాలను భౌతికంగా ఒక పది శాతం దాకా అయినా సరిచూసుకోవటం, ఇలాంటి కార్యక్రమాల్లో తీసుకోవలసిన కనీస జాగ్రత్త చర్యలు. అటువంటి నిర్ధారణ చేసి ఉంటే పరీక్ష ఫలితాలు ప్రకటించడానికి ముందే ఈ లోపాలన్నీ ఇంటర్మీడియట్ బోర్డు అధికారుల దృష్టికి వచ్చి ఉండేవి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇందుకు భిన్నంగా సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ వారు ఎంపిక చేసిన సంస్థ తోనే తమ కార్యక్రమాలను నిర్వహిం చారు. అక్కడ నేడు సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సేవలు అందుబాటులో లేవు. వారు కూడా జేఎన్టీయూ విశ్వవిద్యాలయం లాంటి సంస్థ సహాయ సహకారాలు కూడా తీసుకోలేదు. కానీ సమస్యలు లేకుండా స్థిరంగా సాగిపోతున్న పాత సంస్థని కొనసాగించటం వలన ఇలాంటి సమస్యలు ఎదుర్కోకుండా తమ ఫలితాలు వెల్లడించగలిగారు. ప్రభుత్వ పాలనలో ఎక్కడా కూడా అలసత్వానికి తావుండకూడదు. ముఖ్యంగా విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉన్న పరీక్షలు నిర్వహించడంలోను ఆ ఫలితాలను సక్రమంగా వెల్లడించడంలోనూ, దురదృష్టమేమిటంటే పదే పదే ఈ విషయాలలో లోపాలు జరుగుతున్నా, విద్యార్థులకు సమస్యలు ఎదురవుతున్నా, ప్రభుత్వాలు సమస్య పునరావృతం కాని విధంగా విధి విధానాలు రూపొందించటంలో విఫలమవుతున్నాయి. ఇకనైనా మేలుకొని కేవలం ఇంటర్మీడియట్ స్థాయిలోనే కాకుండా అన్ని స్థాయిల్లో కూడా పరీక్షలు నిర్వహించడంలో, ఫలితాలు వెల్లడించడంలో ఇటువంటి సమస్యలకు ఆరోపణలకు తావులేని విధి విధానాలను రూపొందించే దిశగా ప్రభుత్వాలు కృషిచేస్తే బాగుంటుంది. కొసమెరుపు: మొదట్లోనే చెప్పినట్లు, లోపాలకు నైతిక బాధ్యత వహించి మంత్రులు రాజీనామా చేయడం అనేది ప్రహసనప్రాయంగా మారిపోవడానికి సంబంధించి నాకు తెలిసిన ఒక అంశాన్ని ప్రస్తావించి ఈ వ్యాసాన్ని ముగిస్తాను. ఇది 1987లో నేను ఖమ్మం జిల్లా కలెక్టర్‌గా చేరక ముందు జరిగిన సంఘటన. 1986లో కూడా ఇంటర్మీడియట్ ప్రశ్నాపత్రాల లీకేజీ జరిగింది. నాటి ఉన్నత విద్యా శాఖ మంత్రి, ముఖ్యమంత్రి తన రాజీనామాను ఆమోదించరు అన్న పూర్తి ధీమాతో లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ తాను రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. నాటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు. ఆ రోజు ఆయన ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. మధ్యాహ్న భోజన సదుపాయాల ఏర్పాటు సరిగా లేకపోవడంతో చాలా కోపంగా ఉన్న సమయంలో ఆయన వ్యక్తిగత సిబ్బంది ఉన్నత విద్యాశాఖ మంత్రి రాజీనామా పత్రాన్ని పంపించారు అని తెలియజేశారు. ఆయన వెంటనే ‘ఆమోదించండి’ అని తన ఆమోదముద్రను తెలియజేశారు. సీఎం ఆమోదించరని గట్టిగా నమ్మి రాజీ నామా ప్రకటించిన ఉన్నత విద్యా శాఖ మంత్రి బయటికి తన నైతిక బాధ్యతను నొక్కి వక్కాణించినప్పటికీ.. అంతర్గతంగా ఖిన్నుడైనాడు. ఆపైన ఖమ్మం జిల్లా మంత్రివర్యులతో మీరు ఆ రోజు సరైన భోజన సదుపాయాలు ఏర్పాటు చేసి ఉంటే నా రాజీనామా ఆమోదం అయిఉండేది కాదని వాపోయారట. ఐవైఆర్ కృష్ణారావు వ్యాసకర్త ఏపీ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి ఈ–మెయిల్ : iyrk45@gmail.com -
ఇంటర్ ఫలితాల అవకతవకలపై బీజేపీ బంద్‌కు పిలుపు
-
ఇంటర్ వైఫల్యాలపై కాంగ్రెస్ పార్టీ పోరుబాట
-
ఇంటర్ వైఫల్యాలపై నేడు రాష్ట్ర బంద్
-
మా విద్య–మా హక్కు పేరుతో పోరాటం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు దారుణమని భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్ఎస్యూఐ) జాతీయ కార్యదర్శి రుచిగుప్తా వ్యాఖ్యానించారు. విద్యార్థులు చనిపోతున్నా ఇంటర్ ఫలితాల వ్యవహారంలో బాధ్యులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశా రు. బుధవారం గాంధీభవన్‌లో ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్ తదితరులతో కలసి విలేకరులతో మాట్లాడుతూ విద్యార్థులెవ రూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, విద్యార్థుల పక్షాన తాము పోరాటం చేస్తామన్నారు. మా విద్య– మా హక్కు పేరుతో విద్యార్థుల పక్షాన పోరాడుతామని, పరీక్షల విధానంపై జాతీయ స్థాయిలో చర్చ జరిగేలా ఉద్యమిస్తామని వెల్లడించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. -
విద్యార్థులారా ఆత్మహత్యలొద్దు..
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల గందరగోళంపై న్యాయ విచారణకు ఆదేశించాలనే డిమాండ్‌తోపాటు విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడొద్దని భరోసా కల్పించేందుకు కాంగ్రెస్, టీజేఎస్, సీపీఐ, టీడీపీల ఆధ్వర్యంలో బుధవారం సంతకాల సేకరణ నిర్వ హించారు. దీనిలో భాగంగా ఉస్మానియా విశ్వవిద్యాలయం క్యాంపస్, ఇందిరాపార్కు, కేబీఆర్ పార్కు వద్ద మార్నింగ్ వాక్కు వచ్చే వారి నుంచి ఈ పార్టీల నేతలు సంతకాలు సేకరించారు. అఖిలపక్షం పిలుపు మేరకు విద్యార్థి జన సమితి ఆధ్వర్యంలో ఓయూ ఎన్సీసీ చౌరస్తా దగ్గర మార్నింగ్ వాకర్స్‌తో సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భం గా టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం సంతకం చేసి మద్దతు తెలిపారు. విద్యార్థులు ఎవరు కూడా చనిపోవద్దని.. బతికుండి సాధించాలని.. ప్రభుత్వం న్యాయం చేసేంత వరకు తాము పోరాడుతామని చెప్పారు. విద్యార్థులు భవిష్యత్తులో నేర్చుకోవాల్సింది.. సాధించాల్సింది ఎంతో ఉందన్నారు. ‘మార్కులతోనే జీవితం అంతం కాదు. జీవితంలో ప్రతి ఒక్క రూ ఏదో స్థాయిలో ఫెయిలైన వారే.. ఫెయిల్ కాకుం డా విజయానికి తోవ దొరకదు..’అని చెప్పారు. మేమంతా మీవెంటే.. సంతకం చేసి సంఘీభావం తెలిపిన బీసీ సంక్షేమ సంఘం నేత ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారి పక్షాన నిలిచి పోరాడేందుకు తామంతా ఉన్నామన్నారు. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని, ఇంటర్ బోర్డు కారదర్శి అశోక్‌పై చర్యలు తీసుకోవాలని విద్యార్థి జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు రమేశ్ ముదిరాజ్ డిమాండ్ చేశారు. ఇందిరాపార్కు వద్ద నిర్వహించిన సంతకాల సేకరణ సందర్భంగా ‘వైఫల్యం విజయానికి తొలిమెట్టు.. జీవితానికి అది ముగింపు కాదు.. చావు సమస్యకు పరిష్కారం చూపదు బతికుండి సాధిద్దాం.. మేమంతా మీవెంటే ఉన్నాం’ అని విద్యార్థులకు మద్దతు పలుకుతూ పలువురు సంతకాలు చేశారు. -
ఇంటర్ రద్దే ‘కార్పొరేట్’ జబ్బుకు మందు
తెలుగు రాష్ట్రాల్లో ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల చీడను మూలం వరకు పెకిలించాలంటే ప్రభుత్వాలు తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. రాజకీయ పార్టీలన్నింటిపై ప్రభావం చూపగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థల లాబీలు నెలకొల్పుకున్నాయి. ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్నీ, ఇంటర్ విద్యను రద్దు చేయడాన్నీ సుతరామూ అనుమతించవు. తెలుగు రాష్ట్రాలలో ప్రభుత్వాలు కఠిన వైఖరి అవలంబించి హైస్కూల్స్‌లోనే విద్యార్థులు 12వ తరగతిని పూర్తిచేసుకునేలా చేయగలిగితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ పరీక్షల బోర్డు్డ భారీ సంక్షోభాన్ని సృష్టించింది. దీని బారినపడి ఇప్పటికే దాదాపు 20 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇంకా పలువురు విద్యార్థులు తీవ్రమైన నిరాశానిస్పృహల్లో కూరుకుపోయారు. ఈ పెనుసమస్యకు పరిష్కారం.. పరీక్షాపత్రాల్లోని మార్కులను తిరిగి లెక్కించడంతో కానీ, పరీక్షా పత్రాల పునర్మూల్యాంకనం చేయడంతో కానీ లభించదు. ప్రస్తుత సమస్య మరింత విస్తృతస్థాయిలో ఉంది. విద్యాపాలనా వ్యవస్థలపై అజమాయిషీ చేస్తున్న ప్రైవేట్ కాలేజీ నెట్‌వర్క్‌లో ఈ సమస్యకు మూలం దాగి ఉంది. తెలుగు రాష్ట్రాల్లో అందరికీ సుపరిచితమైన గుత్తాధికార స్వభావం కలిగిన రెండు కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలు అత్యంత కీలకమైన మన విద్యావ్యవస్థను ధ్వంసం చేసిపడేశాయి. పైగా అవి ఇప్పుడు కాన్సెప్ట్ స్కూల్స్ పేరిట పాఠశాల విద్యా వ్యవస్థలోకి జొరబడ్డాయి. ఈ ప్రైవేట్ విద్యా సంస్థలు ప్రధానంగా నాలుగు అంశాలను చేపట్టాయి. 1) ఇవి రెండు రాష్ట్రాల్లో జూనియర్ కాలేజీలు, పాఠశాలలు, కోచింగ్ సెంటర్లను నెలకొల్పాయి. 2) భారీ పెట్టుబడులతో ప్రకటనలు గుప్పించడం ద్వారా ఇవి రెండు రాష్ట్రాల కుటుంబ వ్యవస్థను (గిరిజన ప్రాంతాల వరకు కూడా) ప్రైవేట్ విద్యా సంస్థల్లోనే చక్కటి విద్య లభ్యమవుతుందని నమ్మేలా చేశాయి. కుటుంబ ఆర్థిక వ్యవస్థను ధ్వంసం చేయడం ద్వారా ఈ కార్పొరేట్ విద్యా సంస్థలు గ్రామాలు, పట్టణాలు, నగరాల నుంచి లక్షలాదిమంది విద్యార్థులను చేర్చుకుంటున్నాయి. కొన్ని డజన్లమంది విద్యార్థులకు పెయిడ్ ర్యాంకులను ప్రకటించడమే కాకుండా పరీక్షా ఫలితాలు ప్రకటించిన వెంటనే మీడియా నెట్‌వర్క్‌లలో భారీ స్థాయి ప్రకటనలు గుప్పిస్తూ తల్లిదండ్రులు, పిల్లల మనస్సులపై భారీ యుద్ధానికి తలపెడుతున్నాయి. 3) దీనివల్ల రెసిడెన్షియల్, డే స్కాలర్ ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సెంటర్లలో భారీ ఎత్తున విద్యార్థులు చేరిపోతున్నారు. పైగా కార్పొరేట్ విద్యాసంస్థలు విస్తృత స్థాయిలో రెసిడెన్షియల్ స్కూల్ నెట్‌వర్క్‌ను కలిగి ఉన్నాయి. అధ్యయనానికి బదులుగా నిద్రపోనీయకుండా వల్లెవేయించడం, తరుణ వయస్సులో ఎలాంటి వినోదాల్లో పాలుపంచుకోనీయకుండా చేస్తూ ఈ విద్యాసంస్థలు విద్యార్థుల మానసిక స్థితిని ధ్వంసం చేస్తున్నాయి. సృజనాత్మకతలేని ఈ హింసాత్మక విద్యావంచన కోసం ఇవి కుటుంబాల ఆర్థిక వ్యవస్థనే కూల్చివేస్తున్నాయి. 4) ముఖ్యంగా కార్పొరేట్ విద్యాసంస్థలు భారీస్థాయిలో రాష్ట్రాల ప్రభుత్వాలపై అజమాయిషీ చలాయించడానికి వచ్చాయి. నారాయణ విద్యాసంస్థల అధిపతి పొంగూరు నారాయణను పార్టీలోకి తీసుకోవడం ద్వారా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దుష్ట సంప్రదాయానికి తెర తీశారు. ఇప్పుడీయన రెండు తెలుగు రాష్ట్రాల్లోకెల్లా అతి పెద్ద ఇంటర్మీడియట్ విద్యా కుంభకోణాల కర్తల్లో అగ్రగణ్యుడిగా ఉంటున్నారు. నారాయణ కొల్లగొట్టిన ధనసంపదను చూసి చంద్రబాబు ఆయనకు మంత్రిపదవినిచ్చారు. అలాగే హైదరాబాద్‌లో ఉండే ప్రముఖ విద్యాసంస్థల అధిపతిని కూడా చంద్రబాబు పార్టీలోకి తీసుకొచ్చి ఎంపీని చేశారు. ఇప్పుడీయన కేసీఆర్ పార్టీలో చేరిపోవడమే కాకుండా మంత్రిపదవి కూడా కొట్టేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రైవేట్ స్కూళ్లు, ఇంటర్, డిగ్రీకాలేజీ యాజమాన్యాలు వాస్తవానికి అక్రమంగా ఆర్జించిన సంపదతో రాష్ట్రాలను నడుపుతున్నాయి. నా ఉద్దేశం ప్రకారం, ప్రైవేట్ స్కూల్, ఇంటర్మీడియట్, డిగ్రీ కాలేజీ ఎడ్యుకేషన్ నుంచి ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీల వరకు అన్నీ అనైతికమైన, అవినీతికరమైన, నాసిరకం విద్యా కుంభకోణాలకు పాల్పడుతున్నాయి. అయితే ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థ ద్వారానే అతిపెద్ద నష్టం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లోని ఈ చీడ మూలాన్ని పెకిలించాలంటే తక్షణం ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను రద్దు చేసి పడేయాలి. ప్రతి హైస్కూల్లోనూ 11, 12 తరగతులను తప్పనిసరిగా బోధించాలి. పదవ తరగతిలో కఠినమైన ఇంటర్నల్ పరీక్షను నిర్వహిస్తూ 12వ తరగతిలో మాత్రమే టెర్మినల్ బోర్డు పరీక్షను నిర్వహించాలి. ఈ నూతన వ్యవస్థలో 12వ తరగతి వరకు తెలుగు భాషా సబ్జెక్టును కలిగి ఉంటూనే చక్కటి ఇంగ్లిష్ మీడియంని బలోపేతం చేసినట్లయితే గ్రామీణ స్థాయి పాఠశాలల ప్రమాణాలు మెరుగుపడతాయి. దీనివల్ల ప్లస్ 2 లెవల్ విద్యపై తల్లితండ్రులు ఖర్చు చేయాల్సిన అవసరం ఉండదు. ఇక రెండో అంశం ఏదంటే, తమ పిల్లలను గ్రామాల నుంచి సుదూరంలో ఉండే పట్టణ ప్రాంతాల్లోని కాలేజీలకు పంపించడాన్ని పరిత్యజించాలి. ఇంటర్మీడియట్ స్థాయిలో తెలుగుకు బదులుగా సంస్కృతాన్ని రెండో సబ్జెక్టుగా అనుమతించడం అనేది మార్కుల నిర్వహణా యంత్రాంగంగా మారిపోయింది. ఈ విధానంలో ఏ విద్యార్థి కూడా నిజమైన సంస్కృతాన్ని నేర్చుకోవడం లేదు. అందుకే సంస్కృతాన్ని తొలగించి తెలుగును తప్పనిసరి సబ్జెక్టును చేయాలి. ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాల సంక్షోభం తర్వాత తెలంగాణ ప్రభుత్వం ప్రస్తుతం కొనసాగుతున్న 10+2 విద్యా విధానాన్ని ఎస్బీఎస్ఈ నమూనాలో ఉండే 1 నుంచి 12వ స్కూల్ లెవల్ లోకి మార్చాలని తలుస్తున్నట్లు సమాచారం. ఇది నిజంగా అందరూ ఆహ్వానించదగిన అంశం. కానీ ఈ మార్పును కూడా ఇంటర్మీడియట్, ప్రైవేట్ స్కూల్ లాబీలు ప్రతిఘటించే ప్రమాదం ఉంది. అందుకే ప్రైవేట్ విద్యా లాబీల ఒత్తిడికి తలొగ్గకుండా దీనిని చేపట్టాల్సి ఉంటుంది. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పడనున్న కొత్త ప్రభుత్వం కూడా ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థను తక్షణం రద్దు చేయాలి. అయితే రాజకీయ పార్టీలన్నింటిపైనా అజమాయిషీ చేయగల బలమైన వ్యవస్థను ప్రైవేట్ ఇంటర్మీడియట్, కోచింగ్ సంస్థల లాబీలు నెలకొల్పుకున్న విషయాన్ని మనం మర్చిపోకూడదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో అధికారంలోకి వచ్చే ఆశ లేశమాత్రంగా లేని కమ్యూనిస్టుపార్టీలతో సహా ఏ రాజకీయపార్టీనీ ప్రైవేట్ విద్యా సంస్థల లాబీలు వదిలిపెట్టడం లేదు. అన్నిరకాల రాజకీయ భావజాలాలకు చెందిన జూనియర్, స్కూల్ టీచర్ నాయకులు సైతం ప్రైవేట్ స్కూల్స్, జూనియర్ కాలేజీలు, భారీస్థాయిలో డబ్బు దండుకుంటున్న కోచింగ్ సెంటర్లను నెలకొల్పడంలో మునిగి తేలుతున్నారు. ఇక నారాయణ, శ్రీచైతన్య కాలేజీల్లో, కోచింగ్ సెంటర్లలో పాఠాలు చెబుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీ టీచర్లు, ఇతర టీచర్లు కూడా తమ డబ్బును, తమ ఆర్థిక, సంస్థాగత శక్తిని ప్రదర్శిస్తున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ విద్యావ్యవస్థలో మార్పులు చోటు చేసుకుంటే, ఆంధ్రప్రదేశ్‌లో అధికారంలోకి వచ్చేవారు కూడా తప్పకుండా జరగాల్సిన ఈ మార్పునుంచి తప్పించుకోలేరని వీరికి తెలుసు. విద్యావ్యవస్థలో మార్పు తీసుకువస్తే ఎన్నికల వ్యవస్థలోకి చొప్పిస్తున్న భారీ మొత్తంలోని డబ్బును అది తగ్గిస్తుంది. ఎందుకంటే ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలు రాజకీయ పార్టీలకు పెద్ద మొత్తంలో డబ్బును అందిస్తున్నాయి. ఇదంతా అమాయకులైన విద్యార్థుల తల్లిదండ్రులనుంచి లూటీ చేసిన డబ్బే. అందుకే రాజకీయ పార్టీలకు, ప్రైవేట్ విద్యా సంస్థలకు మధ్య ఉన్న అపవిత్ర సంబంధాన్ని బద్దలు చేయాల్సి ఉంది. అయితే విద్యా విధానంలో మార్పును ఇవి అంత సులభంగా అనుమతించవు. విద్యార్థి సంఘాలు, పౌర సమాజ సంస్థలు తప్ప కుండా వీరిపై ఒత్తిడి తీసుకురావాలి. తెలంగాణలో దీనికి సంబంధించిన ఉద్యమం ప్రారంభమైతే అది ఆంధ్రప్రదేశ్‌లో కూడా వేగం పుంజు కుంటుంది. అధికారంతో ముడిపడి ఉన్న ఈ పవర్ బ్రోకర్లు ఇంతకుముందు కేసీఆర్‌నే లొంగదీసుకున్నారు. ప్రభుత్వ రంగంలోని విద్యావ్యవస్థలో కేజీ టు పీజీ ప్రవేశపెడతామని కేసీఆర్ గతంలో పదే పదే మాట్లాడారు. ఆ తర్వాత అందరికీ ఉచిత విద్యను అందించే ఈ కేజీ టు పీజీ గురించి మాట్లాడటమే ఆయన మానేశారు. ఈ ప్రైవేట్ శక్తులే ప్రభుత్వ స్కూళ్లలో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టడాన్ని వ్యతిరేకించాయి. పాఠశాల, జూని యర్ కళాశాల టీచర్ల నాయకులు పలువురు ప్రైవేట్ ఇంగ్లిషు మీడియం పాఠశాలలను నిర్వహిస్తున్నారు. ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థను రద్దు చేయడాన్ని, దాన్ని ప్రభుత్వ స్కూల్ వ్యవస్థలో విలీనం చేయడాన్ని జూనియర్ లెక్చరర్ సంఘాలు వ్యతిరేకించవచ్చు. ఎందుకంటే హైస్కూల్లో పాఠాలు చెప్పడం తమ పని కాదని ఇవి వాదించవచ్చు. జూనియర్ కాలేజీల్లాగా కాకుండా పాఠశాలలు గ్రామీణ ప్రాంతాల్లో పూర్తిగా వ్యాపించాయి. లోతట్టు గ్రామీణ ప్రాంతాలకు వెళ్లి జూనియర్ కళాశాలల అధ్యాపకులు పాఠాలు బోధించకపోవచ్చని ఈ సంఘాలు వాదించవచ్చు. ఇలాంటి వాదనలు చేసేవారితో ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించాలి. జూనియర్ కాలేజీ గ్రేడ్ టీచర్లు ఆన్ రోల్స్‌లో ఉన్నంతవరకు పాఠశాలల్లోని 11, 12 తరగతులకు బోధించాల్సి ఉంటుంది. కానీ వీరిని ఎక్కడైనా నియమించవచ్చు. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంను ప్రవేశపెట్టినప్పుడు తాము తెలుగు మీడియంలో బోధించడానికే నియమితులమయ్యామని పాఠశాల ఉపాధ్యాయులు వాదించారు. కానీ ఇలాంటి బోధనా వ్యతిరేక శక్తులతో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాల్సి ఉంటుంది. చివరగా... ఇంటర్మీడియట్ రద్దు అనేది మన విద్యావ్యవస్థలో కొత్త మలుపును తీసుకొస్తుంది. భారతదేశంలోని పాఠశాల విద్యావ్యవస్థ మొత్తాన్ని ఈ చట్రం కిందికి తీసుకురావాలి. ఇంతవరకు సీబీఎస్ఈ మోడల్ ఉత్తమమైనదిగా ఉంటోంది. ప్రతి గ్రామీణ విద్యార్థి గ్రామీణ పాఠశాలలోనే 12వ తరగతిని పూర్తి చేసుకున్నట్లయితే నూతన సమాజం రూపుదిద్దుకుంటుంది. కంచ ఐలయ్య షెఫర్డ్ వ్యాసకర్త రాజకీయ సిద్ధాంతవేత్త, సామాజిక కార్యకర్త, రచయిత ‘ ఈ–మెయిల్ : kanchailaiah1952@gmail.com -
కేటీఆర్ అలా చెప్పడం సిగ్గుచేటు..
బంజారాహిల్స్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు కారణమైన గ్లోబరీనా సంస్థ పేరును తాను మొదటిసారి విన్నానని కేటీఆర్ చెప్పడం సిగ్గుచేటని కాంగ్రెస్ సీనియర్ నేత వి.హన్మంతరావు అన్నారు. ఆ సంస్థ తెలియదని పెద్దమ్మ తల్లిపై ప్రమాణం చేయాలని కేటీఆర్‌కు సవాల్ విసిరిన ఆయన... మంగళవారం ఉదయం జూబ్లీహిల్స్‌లోని పెద్దమ్మ తల్లి దేవాలయానికి వచ్చి అమ్మవారి దర్శనం చేసుకున్నారు. అనంతరం అక్కడ బైఠాయించారు. మధ్యాహ్నం 12గంటల వరకు కేటీఆర్ కోసం గుడి బయట వేచి చూశారు. కేటీఆర్ రాకపోవడంతో బయటకు వచ్చిన వీహెచ్ మీడియాతో మాట్లాడారు. రెండేళ్లలో ప్రభుత్వం పడిపోవాలని అమ్మవారిని కోరుకున్నానని చెప్పారు. 23 మంది విద్యార్థుల మరణానికి కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలన్నారు. -
కన్నవాళ్ల ముందే ప్రాణాలొదిలాడు
హైదరాబాద్: ఐఐటీ చదవాలని ఆ యువకుడు కలలు కన్నాడు. ఉన్నత స్థాయికి ఎదిగి తల్లిదండ్రుల ఆశలను నిలబెట్టాలనుకున్నాడు. దీని కోసం కష్టపడి చదివి జేఈఈ మెయిన్స్ ప్రవేశ పరీక్ష రాశాడు. సోమవారం విడుదలైన జేఈఈ ఫలితాల్లో అర్హత సాధించలేదు. దీంతో తీవ్ర మనోవేదనకు గురయ్యాడు. తనపై ఎన్నో ఆశలు పెట్టుకున్న తల్లిదండ్రులకు ఏం చెప్పాలని తనలో తానే మదనపడ్డాడు. ఇక ఇంటర్ (సీబీఎస్ఈ)లో గత ఏడాది మిగిలిపోయిన రెండు సబెక్టుల్లోనైనా పాసవుతానో? లేదో? అన్న ఆందోళన అతన్ని మానసికంగా మరింత వేదనకు గురిచేసింది. దీంతో తల్లిదండ్రులు నిద్రపోయిన తరువాత అర్ధరాత్రి డబుల్ బారెల్ గన్‌తో నుదుటిపై కాల్చుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు సోహెల్ (19). కొన్ని గంటల ముందు తమతోనే ఉన్న కొడుకు కళ్ల ముందే విగతజీవిగా మారడం చూసి తల్లిదండ్రులు గుండెలు పగిలేలా రోధించారు. నేరేడ్మెట్ ఠాణా పరిధిలోని బాలాజీ కాలనీలో సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత సుమారు 1.30 గంటలకు ఈ విషాద ఘటన చోటు చేసుకుంది. సీఐ నర్సింహ్మస్వామి వివరాలను మీడియాకు వెల్లడించారు. హరియాణాకు చెందిన మహరుద్దీన్ ఆర్మీలో ఉద్యోగం చేసి పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం ఓ బ్యాంకులో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నారు. బాలాజీ కాలనీలో భార్య సరోజ్బాల, చిన్న కొడుకు సోహెల్‌తో కలసి ఉంటున్నారు. మరో ఇద్దరు కొడుకుల్లో.. ఆసిఫ్ పోచారంలోని ప్రైవేట్ బ్యాంకులో, సమీర్ ఒడిశాలో ఉద్యోగం చేస్తున్నారు. సోహెల్ తిరుమలగిరిలోని కేంద్రీయ విద్యాలయంలో ఇంటర్ (సీబీఎస్ఈ) చదివాడు. గత ఏడాది తప్పిన రెండు సబ్జెక్టుల్లో పాసు కావడానికి ప్రైవేట్‌గా ఈసారి పరీక్షలు రాశాడు. ఆ ఫలితాలు వచ్చే నెల విడుదల కానున్నాయి. ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల ప్రోత్సాహంతో సోహెల్ ఐఐటీ చదవడానికి ప్రణాళికలు వేసుకున్నాడు. దీని కోసం కోచింగ్ తీసుకుని జేఈ ఈ మెయిన్స్ ప్రవేశ పరీక్షకు హాజరయ్యాడు. సోమవారం వచ్చిన జేఈఈ ఫలితాల్లో తాను అర్హత సాధించలేదని గుర్తించాడు. ఇక రానున్న ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకున్నాడు. రాత్రి 1.30కి పెద్ద శబ్దం... సుమారు రాత్రి 1.30 గంటలకు పెద్దగా తుపాకీ పేలిన శబ్దం. సోహెల్ తన నుదుటిపై పాయింట్ బ్లాక్‌లో డబుల్‌బారెల్ గన్‌తో కాల్చుకున్నాడు. ఈ శబ్దంతో గదిలో నిద్రపోతున్న మహరుద్దీన్, సరోజ్బాల ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు కూడా మేల్కొన్నారు. మహరుద్దీన్, సరోజ్బాల వెంటనే కొడుకు గదిలోకి వెళ్లి చూడగా సోహెల్ రక్తపు మడుగులో గిలగిలకొట్టుకోవడం కనిపించింది. కొడుకును ఆ స్థితిలో చూసి తల్లిదండ్రులు నిర్ఘాంతపోయారు. కొడుకును కాపాడాలని తల్లిదండ్రులు కొద్దిసేపు తల్లడిల్లినా ప్రయోజనం లేకపోయింది. ఇంట్లోంచి కేకలు వినపడటంతో స్థానికులు లోపలికి వెళ్లారు. కళ్ల ముందు కొడుకు గిలగిలకొట్టుకుంటూ ప్రాణాలు వీడటం చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. 100 డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో సీఐ నర్సింహ్మస్వామి ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. క్లూస్ టీం ఆధారాల సేకరణ... క్లూస్ టీం ఘటనా స్థలంలో ఆధారాలు సేకరించింది. గన్‌పై వేలిముద్రలను సేకరించి, దాన్ని స్వాధీనం చేసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులకు అప్పగించారు. తండ్రి ఫిర్యాదు మేరకు ఆత్మహత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ నర్సింహ్మస్వామి తెలిపారు. రాత్రి జరిగిందిది... సోమవారం రాత్రి 10 గంటలకు భోజనం చేయడానికి తల్లిదండ్రులు పిలిస్తే రాలేదు. ఏం జరిగిందని తల్లిదండ్రులు అతనితో మాట్లాడారు. బాగా చదివినా పాస్ అవుతానో లేదోనన్న ఆందోళనగా ఉందని సోహెల్ వారికి బాధను వ్యక్తం చేశాడు. అతని పరిస్థితిని గమనించిన తల్లిదండ్రులు ఓదార్చారు. ఫలితాల గురించి ఆలోచించి బాధపడొద్దని ధైర్యం చెప్పి.. 10.30 గంటలకు అతనితో భోజనం చేయించారు. అనంతరం తల్లిదండ్రులు తమ గదిలో నిద్రపోయారు. సోహెల్ తన గదిలోకి వెళ్లాడు. ‘‘ చిన్నవాడు కావడంతో సోహెల్‌పై మాకు ›ప్రేమ ఎక్కువ. ఇద్దరు అన్నల్లాగా బాగా చదువుకొని ఉన్నత స్థాయికి ఎదుగుతాడనుకున్నాం. కానీ ప్రాణాలు తీసుకొని మాకు కడుపుకోత మిగుల్చుతాడని అనుకోలేదు. – మహరుద్దీన్, సరోజ్బాల -
ఇంటర్ అవకతవకలపై న్యాయ విచారణ చేయాలి
హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాపాలన గాడి తప్పిందని, ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై న్యాయ విచారణ చేయాలని, విద్యార్థుల చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని రౌండ్‌టేబుల్ సమావేశంలో పలువురు వక్తలు డిమాండ్ చేశారు. సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మంగళవారం తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన ‘ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణ’అనే అంశంపై రౌండ్‌టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జస్టిస్ ఈశ్వరయ్య, విద్యావేత్త చుక్కారామయ్య, ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్, ప్రొఫెసర్ పీఎల్. విశ్వేశ్వర్రావు, ప్రొఫెసర్ కంచ ఐలయ్య, కాసీంలతో పాటు పలువురు సామాజిక వేత్తలు, విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఈశ్వరయ్య మాట్లాడుతూ ఇంటర్‌బోర్డు, గ్లోబరీనా సంస్థ చేసిన తప్పుల వల్ల 24 మంది ఇంటర్ విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. చనిపోయిన కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటర్ విద్యార్థుల తల్లిదండ్రులకు నమ్మకం కలిగేలా చర్యలు చేపట్టాలని కోరారు. సీఎం కేసీఆర్‌కు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షం ఏర్పాటుచేసి–మేధావులు, విద్యావంతులతో పరిష్కార మార్గాలు కనుగొనే చర్యలు తీసుకోవాలని సూచించారు. కంచ ఐలయ్య మాట్లాడుతూ..ఇంటర్ విద్యను రద్దు చేసి రానున్న విద్యాసంవత్సరం నుంచి 11వ తరగతి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. 12వ తరగతి వరకూ హైస్కూల్స్ విద్య ద్వారా గ్రామాల్లోని పేద ప్రజలకు ఆర్థికంగా వెసులుబాటు ఉంటుందన్నారు. ఈ ప్రపంచాన్ని మార్చే ఒకేఒక్క ఆయుధం విద్య అని అలాంటి విద్యను వ్యాపారంగా చేసి పేద ప్రజల జీవితాలతో ప్రభుత్వాలు, కార్పొరేట్ సంస్థలు చెలగాటమాడుతు న్నాయని మండిపడ్డారు. నారాయణ, చైతన్య లాంటి విద్యాసంస్థల్లో చదివిన ఏ ఒక్కరూ మేధావులు కాలేదని ఎద్దేవా చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలను రాష్ట్ర హైకోర్టు సుమోటోగా స్వీకరించి బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని ప్రొఫెసర్ గాలి వినోద్‌కుమార్ డిమాండ్ చేశారు. సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ప్రభుత్వ నిర్బంధాలకు, విద్యార్థులపట్ల చూపుతున్న వైఖరికి నిరసనగా 48 గంటల్లో నగరంలో మహాధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆచార్య కాసీం మాట్లాడుతూ పాలకుల వల్లే విద్య వ్యాపారంగా మారిందని, తెలంగాణలో వ్యాపార ధోరణిలు పెట్రేగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో పలు సంఘాల నేతలు విక్రంగౌడ్, నరేష్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు ప్రాణాలు తీసుకోవద్దు
ఆమనగల్లు : ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పిదాలకు అమాయకులైన పిల్లలు ప్రాణాలు కోల్పోయారని శ్రీ త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. ఎవరో చేసిన తప్పుకు పిల్లలు బలికావద్దని ఆ తప్పులపై పోరాడి విజయం సాధించాలన్నారు. విద్యార్థులు మనోబలం, ఆత్మ విశ్వాసం పెంచుకోవాలని ఆయన సూచించారు. కడ్తాల మండలం బాలాజీనగర్ తాండా సమీపంలోని ధనరాశి పర్వతంపై వెలసిన శ్రీరాధాకృష్ణ దేవాలయ బ్రహ్మోత్సవాలలో సోమవారం చినజీయర్‌స్వామి, కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్యాదవ్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన రాధాకృష్ణ కళ్యాణోత్సవంలో వారు పాల్గొన్నారు. అనంతరం చిన్న జీయర్‌స్వామి మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాలలో జరిగిన తప్పు ఎవరిదో తెలియదు కానీ, అమాయకులైన 21 మంది విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారని అన్నారు. మానవ తప్పిదాలు సహజమని, ఎవరివల్లనో జరిగిన తప్పిదాలకు తొందరపడి పిల్లలు ప్రాణాలు తీసుకోవడం సరికాదని ఆయన చెప్పారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఊరికే రాలేదని, పోరాడితేనే తెలంగాణ వచ్చిందని ఆయన గుర్తుచేశారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు దానికి ఎదురొడ్డి పోరాడి పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. పిల్లలలో మనోబలం, ఆత్మవిశ్వాసం పెరగాలని, అందుకోసం పిల్లలలో దేవునిమీద భక్తి విశ్వాసం పెంపొందించేలా తల్లిదండ్రులు చూడాలన్నారు. జీవితంలో జయాపజయాలు, వ్యాపారంలో లాభ నష్టాలు సహజమని, మన కృషి, శ్రమను బట్టి ఫలితాలు ఉంటాయని ఆయన వివరించారు. దైవ నామ స్మరణ మనసుకు బలాన్ని ఇస్తుందన్నారు. ఆలయాల అభివృద్ధికి ప్రభుత్వం చేస్తున్న కృషి అభినందనీయమని, అలాగే ఆలయాలకు సంబందించిన భూములను ఆలయాలకు దక్కేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దైవ సంకల్పబలంతో ఆలయాలు నిర్మిస్తున్నారని ప్రశంసించారు. మనందరిదీ భగవత్ కుటుంబం ప్రతి మినిషి తనలో ఉన్న చెడును, ద్వేషాన్ని విడనాడాలని, ప్రేమను, మంచిని పెంచుకుని ఒకే కుటుంబంలా ముందుకు సాగాలని త్రిదండి చినజీయర్ స్వామి అన్నారు. మనందరిదీ ఒకటే కుటుంబమని అది భగవత్ కుటుంబమని ఆయన అన్నారు. సమాజంలో ప్రతీది దైవ కల్పితమని, దైవానుగ్రహం లేనిదే ఏది సాధ్యంకాదని ఆయన చెప్పారు. యజ్ఞయాగాలు, భగవన్నామస్మరణ లోకశాంతికి ఉపకరిస్తాయని ఆయన వివరించారు. దైవానుగ్రహంతోనే ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రాభివృద్ధి కోసం అనేక మంచి కార్యక్రమాలు చేపడుతున్నారని అన్నారు. గతంలో ప్రభుత్వాలు మేఘమథనం ద్వారా కృత్రిమ వర్షాలు కురిపించడానికి పెద్ద ఎత్తున డబ్బు ఖర్చు చేశారని, అయితే భగవంతుని అనుగ్రహం లేక ఫలితాన్ని ఇవ్వలేదని ఆయన గుర్తుచేశారు. యజ్ఞాలు, యాగాలు, భగవన్నామస్మరణ వర్షాలు కురవడానికి దోహదపడతాయని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ ధర్మకర్త రామావత్ బిచ్చానాయక్, ఆమనగల్లు సింగిల్‌విండో చైర్మన్ దశరథ్‌నాయక్, సర్పంచ్‌లు గూడురి లక్ష్మీ నర్సింహారెడ్డి, కమ్లి, కృష్ణయ్య, లయన్స్‌క్లబ్ మాజి గవర్నర్ చెన్నకిషన్‌రెడ్డి, నాయకులు గంప వెంకటేశ్, సుదర్శన్‌రెడ్డి, రామకృష్ణ, శ్రీనివాస్‌రెడ్డి, రాంచందర్‌నాయక్, లచ్చిరాంనాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఇంటర్ బోర్డు ముట్టడి
-
ఇంటర్ బోర్డు ముట్టడి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలకు బాధ్యులైన వారిపై చర్యలకు డిమాండ్ చేస్తూ సోమవారం అఖిలపక్షం చేపట్టిన ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడి ఉద్రిక్తతకు దారితీసింది. ఫలితాల్లో తప్పులు చోటుచేసుకొని విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డా.. ప్రభుత్వం తూతూమంత్రంగా చర్యలు తీసుకోవడంపై అఖిలపక్ష పార్టీలు తీవ్రంగా మండిపడ్డాయి. విద్యార్థుల కుటుంబాలకు న్యాయం చేయాలనే డిమాండ్‌తో పాటు.. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతూ విపక్షాలన్నీ సోమవారం ఇంటర్మీడియట్ బోర్డు ముట్టడికి పిలుపునిచ్చాయి. ఈ ముట్టడికి విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు, విద్యార్థులు మద్దతుగా నిలిచారు. ఉదయం 10గంటల కల్లా అన్ని పార్టీల నాయకులు అక్కడకు చేరుకుని ఆందోళనలో పాల్గొనేందుకు సిద్దమవుతుండగా.. పోలీసులు శాఖ ముందుస్తు చర్యల్లో భాగంగా ఇంటర్మీడియట్ బోర్డు వద్ద పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేసింది. వందల సంఖ్యల్లో పోలీసులను మోహరించి ఆందోళనకారులను అడ్డుకునేందుకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. మరోవైపు, ముందస్తు అరెస్టులతో ముఖ్య నాయకులెవరూ ఇంటర్ బోర్డువద్దకు రానప్పటికీ, విద్యార్థులు, విద్యార్థిసంఘాల నాయకులు, తల్లిదండ్రులు పెద్దసంఖ్యలో తరలిరావడంతో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. మూకుమ్మడి అరెస్టులు అఖిలపక్షం ఆధ్వర్యంలో ముట్టడి కావడంతో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, జనసేన తదితర పార్టీల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఉదయం నుంచే ఇంటర్మీడియట్ బోర్డు వద్దకు చేరుకున్నారు. అదేవిధంగా విడతల వారీగా విద్యార్థి సంఘాల నేతలు సైతం అక్కడికి చేరుకోవంతో ఆందోళనకారుల సంఖ్య క్రమక్రమంగా పెరిగింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు.. ముట్టడికి వచ్చిన వారిని వచ్చినట్లుగా అరెస్టు చేశారు. తద్వారా ఆందోళన తీవ్రం కాకుండా సద్దుమణుగుతుందని పోలీసులు భావించారు. కానీ పోలీసుల వ్యూహాలను వమ్ముచేస్తూ.. విద్యార్థి సంఘాలు మూకుమ్మడిగా ఇంటర్‌బోర్డు వైపు దూసుకొచ్చాయి. వందల సంఖ్యలో విద్యార్థి నాయకులు దూసుకురావడంతో పోలీసులు సైతం విస్తుపోయారు. వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినప్పటికీ ఆందోళనకారులు బారీకేడ్లు దాటుకుని ఇంటర్‌బోర్డు కార్యాలయం గేటు వద్దకు చేరుకున్నారు. కార్యాలయంలోకి చొచ్చుకెళ్లే ప్రయత్నించగా.. పోలీసులు వారిని అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ గ్రౌండ్‌కు తరలించారు. బాధ్యులపై చర్యలేవి? ఇంటర్మీడియట్ ఫలితాల్లో తప్పులకు బాధ్యులెవరో తేలినప్పటికీ ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడాన్ని అఖిలపక్ష పార్టీలు తప్పుబట్టాయి. విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశాయి. ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు రూ.25లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కూడా కోరాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థిసంఘాలు, అఖిలపక్ష నేతలు, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు నినాదాలు చేయడంతో ఇంటర్‌బోర్డు కార్యాలయం దద్దరిల్లింది. ఇంటర్‌బోర్డు అక్రమాలపై న్యాయ విచారణ చేపట్టాలని మాజీమంత్రి జే.గీతారెడ్డి డిమాండ్ చేశారు. అవకతవకలపై ఉద్యమిస్తున్న ప్రతిపక్షాలను అణిచివేసేందుకు ప్రభుత్వం కుట్ర చేస్తోందన్నారు. గాంధీభవన్ నుంచి బోర్డు వద్దకు చేరుకుంటున్న ఆమెను పోలీసులు అక్కడికక్కడే అరెస్టు చేశారు. అదేవిధంగా టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్, ఎన్ఎస్యూఐ రాష్ట్ర అధ్యక్షుడు బల్మూరి వెంకట్‌లను కూడా పోలీసులు అరెస్టు చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ.. విద్యార్థుల ఆత్మహత్యలు దురదృష్టకరమని, ఇంతమంది మృతి చెందినా కేసీఆర్ స్పందించకపోవడం దారుణమన్నారు. గ్లోబరీనాపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, సిట్టింగ్ జడ్జితో ఈ వివాదం మొత్తాన్ని న్యాయవిచారణ చేయాలన్నారు. అరెస్టులతో నిజాన్ని కప్పిపుచ్చలేరన్నారు. మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్, జనసేన రాష్ట్ర నాయకులు శంకర్‌గౌడ్ ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి బోయినపల్లి రాము, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్‌కుమార్, పీవైఎల్ రాష్ట్ర కార్యదర్శి ప్రదీప్, ఏఐడీఐఎస్ఓ రాష్ట్ర కార్యదర్శి గంగాధర్‌ల తదితరులను కూడా పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతిభవన్ వద్ద ఏబీవీపీ అలజడి ఇంటర్మీడియట్ ఫలితాల్లో అవకతవకలపై చర్యలకు డిమాండ్ చేస్తూ.. సోమవారం ప్రగతిభవన్ వద్ద ఏబీవీపీ చేపట్టిన ఆందోళన ఉద్రిక్తంగా మారింది. పెద్ద సంఖ్యలో ఏబీవీపీ కార్యకర్తలు, విద్యార్థులు ప్రగతిభవన్‌వైపు దూసుకురావడంతో పరిస్థితి ఉద్రిక్తకరంగా మారింది. ఏబీవీపీ కార్యకర్తలు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ క్యాంపు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. పోలీసులు వారికి కట్టడి చేసేందుకు ప్రయత్నించినా.. విద్యార్థులు బారీకేడు దాటేందుకు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో ప్రగతిభవన్ గేటు వద్దే విద్యార్థినాయకులు బైఠాయించారు. ఇంటర్ ఫలితాల్లో అక్రమాలకు పాల్పడిన వారిని ప్రభుత్వమే వెనకేసుకోస్తోందని, వారిపై చర్యలు తీసుకునే వరకు కదిలేదని భీష్మించుకు కూర్చున్నారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.50 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో పోలీసులు, ఏబీవీపీ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. పోలీసులు అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో కొందరు రోడ్డుపై పడుకుని నిరసన తెలిపారు. తమ ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రభుత్వాన్ని కూల్చేవరకు నిద్రపోమని ఏబీవీపీ నాయకులన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, టాస్క్‌ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ వారిని సముదాయించేందుకు యత్నించినా వెనక్కుతగ్గలేదు. దాదాపు గంటన్నరపాటు ఉద్రిక్తత అనంతరం వారిని బలవంతంగా అరెస్టు చేసి గోషామహల్ పోలీస్ గ్రౌండ్స్‌కు తరలించారు. సోమవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో పలువురు పోలీసులు, ఏబీవీపీ నాయకులకు వడదెబ్బ తగిలింది. విధుల్లో ఉన్న పోలీసు సిబ్బంది విద్యార్థులకు తాగేందుకు మంచినీళ్లు కూడా అందించారు. ఎక్కడికక్కడే గృహనిర్బంధాలు అఖిలపక్షం నిర్వహించ తలపెట్టిన ‘చలో ఇంటర్‌బోర్డు’కార్యక్రమాన్ని పోలీసులు అడుగడుగునా అడ్డుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాద్ వస్తున్న అన్ని విపక్ష పార్టీలకు చెందిన నేతలను పోలీసులు రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడిక్కడే అరెస్టు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీజేఎస్, సీపీఐ, టీడీపీకి చెందిన పలువురు నేతలను సాయంత్రం వరకు గృహ నిర్బంధం చేసిన పోలీసులు మరికొందరిని అదుపులోనికి తీసుకుని స్థానిక పోలీస్స్టేషన్లకు తరలించారు. మాజీ మంత్రి షబ్బీర్ అలీ ఇంట్లోకి వెళ్లి మరీ అదుపులోనికి తీసుకుని ఆయన్ను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. మాజీ ఎంపీ అంజన్‌కుమార్ యాదవ్, యూత్‌కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్‌లను పాతబస్తీలోని వారి నివాసం వద్దే అదుపులోనికి తీసుకుని కంచన్‌బాగ్ పీఎస్‌కు తరలించారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రమణ, టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డిలను వారి ఇళ్లలోనే అరెస్టు చేసి బంజారాహిల్స్ పీఎస్‌కు తరలించారు. టీజేఎస్ అధ్యక్షుడు కోదండరాం నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో జెండా ఎగరేయగానే (పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా) ఆయన్ను అదుపులోనికి తీసుకున్నారు. అంతకుముందు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్‌ను అరెస్టు చేశారు. టీపీసీసీ నేత మల్రెడ్డి రంగారెడ్డి, టీపీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య, మాజీ ఎంపీ వీహెచ్‌లను కూడా గృహ నిర్బంధం చేసి అదుపులోనికి తీసుకున్నారు. కొంతమంది మహిళా నేతలతో కలిసి ఇంటర్‌బోర్డు ముట్టడికి వచ్చిన మాజీ మంత్రి గీతారెడ్డిని అడ్డుకుని సైఫాబాద్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. గాంధీభవన్ నుంచి ఇంటర్‌బోర్డుకు ర్యాలీగా బయలుదేరిన టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మానవతారాయ్తోపాటుగా పలువురు పార్టీ నేతలను ఇంటర్‌బోర్డు సమీపంలో అరెస్టు చేసి గోషామహల్‌కు తరలించారు. -
లక్ష్మణ్ దీక్ష భగ్నం, అరెస్ట్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల్లో ప్రభుత్వ, బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డా. కె. లక్ష్మణ్ సోమవారం ఉదయం చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షను పోలీసులు భగ్నం చేశారు. లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి నిమ్స్‌కు తరలించారు. తొలుత ఇంటి వద్దే లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా వారి కళ్లుగప్పి ఆయన క్యాబ్‌లో పార్టీ కార్యాలయానికి చేరుకొని దీక్ష ప్రారంభించారు. దీంతో అక్కడ దీక్ష ›ప్రారంభించిన కొద్దిసేపటికే పోలీసులు రావడంతో అరెస్ట్‌లను అడ్డుకునేందుకు నాయకులు, కార్యకర్తలు వారితో వాగ్వాదానికి దిగారు. ఈ సమయంలో అక్కడ తోపులాట జరగ్గా పార్టీ తరఫున చాంద్రాయణగుట్ట అసెంబ్లీ స్థానానికి పోటీ చేసిన షెహజాది సొమ్మసిల్లారు. అనంతరం లక్ష్మణ్‌ను అరెస్ట్ చేసి నిమ్స్‌కు, పార్టీ నాయకులను అరెస్ట్ చేసి గోషామహల్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. అంతకుముందు దీక్ష ప్రారంభించిన సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ అనుభవం లేని గ్లోబరీనా టెక్నాలజీస్ సంస్థకు ఇంటర్ ఫలితాల ప్రాసెసింగ్ బాధ్యతను ప్రభుత్వం ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. బోర్డు నిర్వాకం వల్ల 24 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమని మండిపడ్డారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులకు మనోస్థైర్యాన్ని కల్పించేందుకే దీక్ష నిర్వహిస్తున్నామన్నారు. విద్యార్థులూ.. ఆత్మహత్యలొద్దు విద్యార్థులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని లక్ష్మణ్ స్పష్టం చేశారు. పోలీసులు తనను బలవంతంగా నిమ్స్‌కు తరలించినా దీక్ష ఆగదని, నిరశనను కొనసాగిస్తానని చెప్పారు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని, వారికి అండగా బీజేపీ ఉంటుందన్నారు. ప్రభుత్వం నిర్బంధాలతో ఉద్యమాన్ని ఆపలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. సీఎం నైతిక బాధ్యత వహించాలి: రాంమాధవ్ ఇంటర్ ఫలితాల్లో గందరగోళానికి సీఎం కేసీఆర్, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, బోర్డు కార్యదర్శి అశోక్ నైతిక బాధ్యత వహించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థులకు ఆత్మవిశ్వాసం కల్పించకపోగా అహంకారం ప్రదర్శిస్తోందని విమర్శించారు. ఇంటర్ బోర్డు అవకతవకలపై న్యాయ విచారణ జరిపించాలని ఎంపీ దత్తాత్రేయ డిమాండ్ చేశారు. బాధ్యులపై సీబీఐ విచారణ లేదా సిట్టింగ్ హైకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ డిమాండ్ చేశారు. తెలంగాణ వస్తే తమ బతుకులు మారతాయని ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థుల భవిష్యత్తు స్వరాష్ట్రంలో అంధకారంలో మునిగిపోయిందని డీకే అరుణ విమర్శించారు. 24 మంది విద్యార్థుల ప్రాణాలు పోవడానికి సీఎం కేసీఆర్ నిర్లక్ష్యమే కారణమన్నారు. ఆత్మహత్యలు వద్దంటూ ట్వీట్లు చేసే కేటీఆర్ బయటకు వచ్చి మాట్లాడలేరా అని ప్రశ్నించారు. నేడు ప్రగతిభవన్ ముట్టడి: మురళీధర్‌రావు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఇతర నాయకులను అరెస్ట్ చేయడాన్ని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు ఖండించారు. బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ శాంతియుత వాతావరణంలో దీక్ష చేస్తున్న లక్ష్మణ్‌ను అరెస్ట్ చేయడం సరికాదన్నారు. ఇంటర్ విద్యార్థులకు జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా లక్ష్మణ్ దీక్ష చేపట్టారని తెలిపారు. పోలీసుల తీరుకు నిరసనగా మంగళవారం అన్ని జిల్లా కేంద్రాల్లోని కలెక్టరేట్ల వద్ద నిరసన చేయాలని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ప్రగతిభవన్ ముట్టడి సహా రేపటి అన్ని కార్యక్రమాలు యథాతథంగా కొనసాగుతాయని మురళీధర్‌రావు స్పష్టం చేశారు. దీక్షకు పలువురి సంఘీభావం... లక్ష్మణ్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శులు మురళీధర్‌రావు, రాంమాధవ్, ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ, సీనియర్ నేత నల్లు ఇంద్రసేనారెడ్డి, మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, మాజీ మంత్రి డీకే అరుణ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, గుజ్జ కృష్ణ, జాజుల శ్రీనివాస్‌గౌడ్ తదితరులు సంఘీభావం తెలిపారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావులను పోలీసులు వారి ఇళ్లలోనే గృహ నిర్బంధంలో ఉంచారు. -
కేటీఆర్ ప్రమాణం చేస్తావా?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల అవకతవకలపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు వీ హనుమంతరావు, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా ఐటీ కంపెనీ తనకు తెలియదని కేటీఆర్ చెప్పడం అబద్ధమని తెలిపారు. గ్లోబరీనా కంపెనీ తెలియదని అమ్మవారి మీద ప్రమాణం చేస్తావా అని కేటీఆర్‌కు సవాలు విసిరారు. కేటీఆర్ రేపు ఉదయం 12 గంటలకు పెద్దమ్మ గుడి వద్దకు రావాలని అన్నారు. ఆయన పెద్దమ్మ గుడి దగ్గరకు రాకపోతే గ్లోబరీనా ఐటీ కంపెనీతో ఆయనకు సంబంధం ఉన్న మాట నిజమని వ్యాఖ్యానించారు. ఐదేళ్లు ఐటీ మంత్రిగా ఉన్న కేటీఆర్‌కు ఐటీ కంపెనీ గురించి తెలియదా అని ప్రశ్నించారు. -
ప్రజల గొంతు నొక్కేస్తున్నారు..
భద్రాచలంటౌన్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిపక్షాన్ని నిర్వీర్యం చేసి ప్రజాగొంతుకను నొక్కేస్తోందని కాంగ్రెస్ శాససనభా పక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క అన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ యాత్రలో భాగంగా ఆదివారం బూర్గంపాడు, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో ఆయన పర్యటించారు. అంతకుముందు భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారిని దర్శించుకున్నారు. అక్కడి ఎమ్మెల్యే పొదెం వీరయ్య క్యాంపు కార్యాలయంలో విలేకరులతో, ఆ తర్వాత ఆయా మండలాల్లో జరిగిన సభల్లో భట్టి మాట్లాడారు. భారత రాజ్యాంగాన్ని ప్రపంచ దేశాలు గౌరవిస్తాయని, కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం అపహాస్యం చేశారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలను అనైతికంగా టీఆర్ఎస్లో చేర్చుకుని ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ నుంచి గెలిచి టీఆర్ఎస్లో చేరిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్ హయాంలో ప్రారంభించిన రాజీవ్‌సాగర్, ఇందిరాసాగర్ ప్రాజెక్టులను ప్రస్తుత ప్రభుత్వం రీ డిజైన్ చేసి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడిందని విమర్శించారు. ఈ దోపిడీపై అసెంబ్లీలో నిలదీస్తున్నందుకే ప్రతిపక్ష కాంగ్రెస్ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో చేర్చుకుంటున్నారని ఆరోపించారు. వేలాది మంది ఓటర్ల మనోభావాలను దెబ్బతీసి టీఆర్ఎస్లో చేరిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పార్టీ మారామని ఎమ్మెల్యేలు చెపుతున్నా.. అది నిజం కాదని, వారి సొంత ప్రయోజనాల కోసమే ఆ పని చేశారని అన్నారు. ప్రజాస్వామ్యానికి ప్రభుత్వం, ప్రతిపక్షం రెండు కళ్ల లాంటివని చెప్పారు. కేసీఆర్‌కు పాలన మీద దృష్టి లేదని, ఫాంహౌస్‌లో కూర్చుని అధికారం చెలాయిస్తున్నాడని విమర్శించారు. ఇంటర్ బోర్డు లో అవకతవకలతో ఫెయిలైన విద్యార్థుల్లో 23 మంది ఆత్మహత్య చేసుకున్నా ఫాంహౌస్ నుంచి బయటకు రాకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఈ ప్రభుత్వాన్ని తక్షణమే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు చనిపోయి వారి తల్లిదండ్రులు ఏడుస్తుంటే, పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు పెద్ద ఎత్తున నిర్వహించడం ఏంటని ప్రశ్నించారు. ప్రజలకు వాస్తవ పరిస్థితులు వివరించేందుకే ప్రజా పరిరక్షణ యాత్ర చేస్తున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికలలో కాంగ్రెస్ కూటమి అభ్యర్థులను గెలిపించి పార్టీ మారిన ఎమ్మెల్యేలకు బుద్ధి చెప్పాలన్నారు. బూర్గంపాడు జెడ్పీటీసీ కాంగ్రెస్ అభ్యర్థి బాదం సావిత్రిని గెలిపించాలని కోరారు. అంతకు ముందు బూర్గంపాడు ప్రధాన కూడలిలోని అంబేడ్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ చందా లింగయ్య, టీడీపీ నాయకులు కొడాలి శ్రీనివాసన్, కాంగ్రెస్ నాయకులు బొలిశెట్టి రంగారావు, డీసీసీ అధికార ప్రతినిధి బుడగం శ్రీనివాస్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ బోగాల శ్రీనివాసరెడ్డి, బూర్గంపాడు జెడ్పీటీసీ అభ్యర్థి బాదం సావిత్రి, సర్పంచ్‌లు సిరిపురపు స్వప్న, భూక్యా శ్రావణి, కాంగ్రెస్, టీడీపీ నాయకులు కోమటిరెడ్డి మోహన్‌రెడ్డి, మారం వెంకటేశ్వరరెడ్డి, పూలపెల్లి సుధాకర్‌రెడ్డి, మందా నాగరాజు, భజన సతీష్, తాళ్లూరి జగదీశ్వరరావు, పోటు రంగారావు, లక్కోజు విష్ణువర్ధన్, దుద్దుకూరి ఠాగూర్, బాదం నాగిరెడ్డి తదితరులు ఉన్నారు. రాక్షస పాలనను అంతం చేయాలి కొత్తగూడెంరూరల్: ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారి తల్లిదండ్రులకు సమాధానం చెప్పాల్సిన పాలకులు పట్టించుకోకపోవడం సిగ్గుచేటని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. ఆదివారం ఆయన కొత్తగూడెంలో విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రస్తుతం రాక్షస పాలన సాగుతోందని, దీన్ని అంతం చేయాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ అవినితీకి పాల్పడుతూ రాజ్యంగాన్ని లెక్కచేయడం లేదని ఆరోపించారు. రాజ్యాంగాన్ని సైతం తుంగలో తొక్కారని అన్నారు. ఆయన వెంట మాజీ ఎమ్మెల్సీ పోట్ల నాగేశ్వరరావు, ఏనుగుల అర్జున్‌రావు, మోతుకూరి ధర్మారావు, రాందాస్, నాగ సీతారాములు, శౌరి తదితరులు ఉన్నారు. -
నేటి నుంచి లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష
హైదరాబాద్: ఇంటర్ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు పూర్తి న్యాయం జరగాలని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ సోమవారం ఉదయం నుంచి బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద నిరవధిక నిరశన చేపట్టనున్నారు. అంతకుముందే ముషీరాబాద్‌లోని క్యాంపు కార్యాలయానికి నగరం నుంచే కాకుండా రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకుంటారు. అక్కడి నుంచి అనుచరులతో కలసి భారీ కాన్వాయ్‌తో బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి లక్ష్మణ్ చేరుకొని అక్కడి దీక్ష శిబిరంలో నిరవధిక నిరాహార దీక్ష చేపడతారు. దీనికి సంబంధించి ఆదివారం ముషీరాబాద్ క్యాంపు కార్యాలయంలో ముఖ్య నేతలతో సమావేశం నిర్వహించి నిరశన నిర్ణయాన్ని ప్రకటించారు. ఈ నెల 28న అన్ని జిల్లా కేంద్రాల్లో నిరాహార దీక్షలు, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం, 30న ప్రగతిభవన్ ము ట్టడి, మే 2న రాష్ట్ర బంద్ చేపట్టాలని నిర్ణయించా రు. కానీ అకస్మాత్తుగా లక్ష్మణ్ నిరవధిక నిరాహార దీక్ష చేపట్టే కార్యక్రమానికి పూనుకోవడం.. ఇంటర్ ఫలితాల అంశాన్ని బీజేపీ సీరియస్‌గా తీసుకుందని, ఈ అంశంపై ప్రభుత్వాన్ని ఎండగట్టే కార్యక్రమానికి సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఒక వైపు రాష్ట్ర అధ్యక్షుడిగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తూ.. మరో వైపు దీక్షకు మద్దుతుగా రోజుకో కార్యక్రమాన్ని ప్రజా సంఘాలు, పార్టీ నాయకులు విజయవంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడగా, ఆ కుటుంబాల కు ప్రభుత్వం సానుభూతి తెలుపకపోగా తూ.తూ. మం త్రంగా చర్యలు తీసుకోవడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. విద్యార్థులకు జరి గిన అన్యాయానికి బాధ్యత వహిస్తూ విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను బర్తరఫ్ చేయాలని డాక్టర్ కె.లక్ష్మణ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ డిమాండ్ చేశారు. విద్యార్థుల ఆత్మహత్యలకు ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలని, ఫలితాల అవకతవకలపై విచారణ జరిపించాలని, గ్లోబరీనా సంస్థ యాజమానులపై క్రిమినల్ కేసులు పెట్టాలనే డిమాండ్‌తో నిరశన చేపడుతున్నట్లు ఆయన ప్రకటించారు. -
సున్నా మార్కుల ఉదంతంలో ఎగ్జామినర్‌పై వేటు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ రెండో సంవత్సరం తెలుగు పేపర్లో ఓ విద్యార్థినికి 99 మార్కులు రాగా సున్నా మార్కులు వేసిన ఉదంతంలో ఎగ్జామినర్, పర్యవేక్షకుడిపై వేటు పడింది. ఇటీవల విడుదలై తీవ్ర దుమారం లేపిన ఇంటర్ పరీక్షల ఫలితాల్లో బాగా చర్చనీయాంశంగా మారిన వాటిల్లో ఇదీ ఒకటిగా నిలిచింది. వివరాలను ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఆదివారం పత్రికా ప్రకటన రూపంలో వెల్లడించారు. ఆయన కథనం ప్రకారం.. మంచిర్యాల జిల్లా జిన్నారం మండలం కరిమల జూనియర్ కళాశాలలో సీఈసీ రెండో సంవత్సరం పరీక్షలు రాసిన నవ్య అనే యువతికి తెలుగులో సున్నా మార్కులు వచ్చాయి. తాను పరీక్ష బాగా రాసినా, సున్నా మార్కులు రావటమేంటని ఆ యువతి, ఆమె కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందారు. పునర్మూల్యాంకనం చేయగా ఆమెకు 99 మార్కులు వచ్చాయి. దీనిపై బోర్డు అ«ధికారులు విచారణ జరిపారు. ఎగ్జామినర్ బబ్లింగ్ చేసే సమయంలో జరిగిన పొరపాటుగా తేల్చారు. ఎగ్జామినర్ ఉమాదేవి (తెలుగు అధ్యాపకురాలు) 99 మార్కులకుగాను 00గా నమోదు చేసినట్టు గుర్తించారు. దీన్ని తీవ్ర తప్పిదంగా భావిస్తూ ఆమెకు రూ.5 వేల జరిమానా విధించగా ఆమె బోర్డుకు చెల్లించారు. శంషాబాద్ ఆర్బీనగర్లోని నారాయణ కళాశాలలో అధ్యాపకురాలిగా పనిచేస్తున్నందున ఈ విషయాన్ని ఆ విద్యా సంస్థ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో నిర్వాహకులు ఆమెను విధుల నుంచి తప్పించారు. ఇక రంగారెడ్డి జిల్లా బాలానగర్ కొత్తూరు తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ బాలుర జూనియర్ కళాశాలలో అధ్యాపకుడిగా పనిచేస్తున్న ఎస్.విజయకుమార్ స్క్రూటినైజర్ హోదాలో ఉండి ఈ తప్పిదాన్ని గుర్తించలేదు. దీంతో ఆయనను కూడా బాధ్యుడిని చేస్తూ సస్పెండ్ చేసేందుకు, తదుపరి విచారణ చేపట్టేందుకు చర్యలు తీసుకున్నట్టు అశోక్ వెల్లడించారు. -
ఇద్దరు ఉద్యోగులపై తెలంగాణ ఇంటర్ బోర్డు వేటు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ పరీక్షా ఫలితాలలో అవకతవకలపై తెలంగాణ ఇంటర్ బోర్డు చర్యలు తీసుకుంది. ఇందుకు సంబంధించి ఇద్దరు ఉద్యోగులపై వేటు పడింది. మంచిర్యాలకు చెందిన నవ్య అనే విద్యార్థినికి తెలుగులో 99 మార్కులకు బదులుగా 00 గా బబ్లింగ్ అవడానికి కారణం అయిన ఇద్దరిపై ఇంటర్మీడియట్ బోర్డు చర్యలు తీసుకుంది. ఎగ్జామినర్ ఉమాదేవికి అయిదువేలు జరిమానాతో పాటు ఉద్యోగం నుంచి తొలగించగా, లెక్చరర్ విజయ్‌కుమార్‌పై సస్పెన్షన్ వేటు వేసింది. ఈ మేరకు ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ ఓ ప్రకటన విడుదల చేశారు. ఇంటర్ ఫలితాలలో తప్పిదాల కారణంగా సుమారు 20మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ విషయం తెలిసిందే. -
ఇంటర్’ వ్యవహారంపై 2న బీజేపీ రాష్ట్ర బంద్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకల అంశాన్ని ఉద్యమంగా మార్చేదిశగా బీజేపీ అడుగులేస్తోంది. మే 2వ తేదీన బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ విషయాన్ని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ శనివారం ఇక్కడ విలేకరుల సమావేశంలో వెల్లడించారు. ఆదివారం(28న) అన్ని జిల్లాకేంద్రాల్లో నిరాహార దీక్ష, 29న విద్యార్థులు, మేధావులతో హైదరాబాద్‌లో రౌండ్‌టేబుల్ సమావేశం, 30న ప్రగతిభవన్‌ను ముట్టడించాలని నిర్ణయించినట్టు లక్ష్మణ్ పేర్కొన్నారు. ఈలోపు మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని, బోర్డు కార్యదర్శి అశోక్‌ను తొలగించాలని, అవకతవకలపై సిట్టింగ్ జడ్జి చేత న్యాయ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. తాము పెట్టిన డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించకుంటే మే 2న రాష్ట్ర బంద్ నిర్వహిస్తామని వెల్లడించారు. ఈ నేపథ్యంలో జరగబోయే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన హెచ్చరించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం, ఫలితాల్లో భారీస్థాయిలో లొసుగులు చోటుచేసుకోవటం తో ఇప్పుడు ఈ అంశం పెద్ద చర్చకు దారితీసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేయాలని బీజేపీ నిర్ణయించింది. ‘టెన్త్’పై కూడా ఆరోపణలు... ఇంటర్ వ్యవహారంలో తీవ్ర తప్పిదాలు దొర్లిన నేపథ్యంలో పదోతరగతి పరీక్షా పత్రాల మూల్యాంకనంపై కూడా ఆరోపణలు వస్తున్నట్టు లక్ష్మణ్ చెప్పారు. ఇంటర్ వ్యవహారంలో ఫలితాలకు ముందే ఆరోపణలు వచ్చినా పట్టించుకోలేదని, ఇప్పుడు పదో తరగతి విషయంలో ఎలా జరగబోతోందన్న అనుమానాలున్నాయన్నారు. కేసీఆర్ ప్రభుత్వం లక్ష లాది మంది విద్యార్థులను ఆగం చేసినందున పదో తరగతి ఫలితాల విషయంలో జాగ్రత్తలు తీసు కోవాలన్నారు. అనాలోచిత నిర్ణయంతో గ్లోబరీనా సంస్థకు కాంట్రాక్టు ఇచ్చారని, ప్లాన్ బి లేకుండా గందరగోళం చేశారన్నారు. 23 మంది పిల్లల ఆత్మ హత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని డిమాం డ్ చేశారు. పరీక్షలు, ఫలితాలపై కనీసం సమీక్ష చేయలేకపోయిన విద్యాశాఖ మంత్రి ‘పుండు మీద కారం చల్లినట్టు’సమస్యను రాజకీయం చేస్తున్నారని ఆరోపించారు. -
విద్యార్థులారా... ఆత్మహత్యలకు పాల్పడవద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో గందరగోళంపై సోమవారం (29న) ఇంటర్‌బోర్డు ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు కాంగ్రెస్, సీపీఐ, టీజేఎస్, టీడీపీ ప్రకటించాయి. ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ చేపట్టిన ఈ ఆందోళన కార్యక్రమంలో ఇతర రాజకీయపార్టీలు, విద్యార్థి, ప్రజాసంఘాలు, విద్యార్థులు, తల్లిదండ్రులు, ఇతర వర్గాలవారు కలసి రావాలని పిలుపునిచ్చాయి. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, వారికి తాము అండగా ఉంటామని, ఆత్మహత్యలకు పాల్పడొద్దని విజ్ఞప్తి చేశాయి. శనివారం ఇక్కడి మఖ్దూంభవన్‌లో భేటీ అనంతరం ఆయా పార్టీల నేతలు మీడియాతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. 23 మంది మరణం హృదయవిదారకం ఇంటర్ బోర్డు తప్పులకు 23 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం హృదయ విదారకరమని టీజేఎస్ అధ్యక్షుడు ప్రొ.కోదండరాం అన్నారు. ఎదిగిన పిల్లలు రాలిపోయి, ఎద నిండా ఆవేదనతో తల్లిదండ్రులున్నారని, ఈ పరిస్థితుల్లో తెలంగాణ సమాజం మొత్తం మేల్కొని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తేనే న్యాయం జరుగుతుందన్నారు. ఒక కంపెనీ ప్రయోజనాల పరిరక్షణకే ప్రభుత్వం, అధికారులు ప్రయత్నిస్తున్నారని, ఈ సంస్థ మొదటి నుంచి తప్పులు చేస్తున్నా వెనకేసుకు వచ్చారని విమర్శించారు. తప్పులపై కాలేజీల ప్రిన్సిపాళ్లు, అధ్యాపకులు మొదటి నుంచి హెచ్చరిస్తున్నా బోర్డు అధికారులు పట్టించుకోలేదన్నారు. ఇంటర్ కార్యదర్శికి సమస్యలన్నీ తెలుసని, విద్యార్థులు ఫెయిలైతే డ్రైవర్లు కావచ్చని, దుకాణాల్లో పని చేసుకోవచ్చని ఉచిత సలహాలు ఇస్తున్నారని దుయ్యబట్టారు. సీఎం కూడా ఉచితంగా విద్యార్థులకు వాల్యూయేషన్ చేస్తామన్నారే తప్ప ఈ సమస్యపై సమగ్ర సమీక్ష నిర్వహించలేదన్నారు. తమకు ఎమ్మెల్యేల సంఖ్య లేకపోయినా సమాజం పట్ల నిబద్ధత ఉందని, ఏదిఏమైనా ఈ కార్యక్రమాన్ని చేపట్టి తీరుతామన్నారు. నిద్ర నటించే సర్కార్‌ను తట్టి లేపేందుకే ఈ వ్యవహారంపై నిద్ర నటిస్తున్న రాష్ట్ర ప్రభుత్వాన్ని తట్టి లేపేందుకు ధర్నా నిర్వహిస్తున్నట్టు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ చెప్పారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిఫారసుతోనే పరీక్షల నిర్వహణలో అనుభవంలేని గ్లోబరీనా సంస్థకు టెండర్ కట్టబెట్టారని ఆరోపించారు. విద్యావ్యవస్థను నిర్వీర్యం చేసేందుకే ఈ సంస్థకు పరీక్షా ఫలితాల బాధ్యతలు అప్పగించారని ఆరోపించారు. ప్రతి అంశంపై ట్విట్టర్లో స్పందించే కేటీఆర్ ఇంటర్ వ్యవహారంపై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నిం చారు. విద్యార్థులు రోడ్డున పడితే టీఆర్ఎస్ మంత్రు లు, ఎంపీలు, ఎమ్మెల్యేలు స్పందించకపోవడం దారుణమన్నారు. సీఎం కేసీఆర్ ఫ్యూడల్ మైండ్‌సెట్‌తో వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. కేబినెట్ బాధ్యత వహించాలి: రమణ ఇంటర్ బోర్డు తప్పులకు సీఎం కేసీఆర్, కేబినెట్ బాధ్యత వహించాలని, మంత్రి జగదీశ్‌రెడ్డిని బర్తరఫ్ చేయాలని టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల వ్యవహారంపై విపక్షపార్టీలుగా గవర్నర్‌ను కలిస్తే నామమాత్రంగా స్పందించారన్నారు. విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటుంటే కేటీఆర్ మాత్రం ఇతర పార్టీ ఎమ్మెల్యేలకు కండువాలు కప్పుతున్నారని ఆరోపించారు. కేసీఆర్ నిర్బంధాన్ని ఛేదిస్తాం: చాడ సీఎం కేసీఆర్ ప్రయోగించే నిర్బంధాన్ని, పోలీస్ వ్యవస్థను ఛేదించి 29న ధర్నా నిర్వహిస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి తెలిపారు. తొంభై మార్కులు వచ్చిన అమ్మాయికి ఇంటర్‌బోర్డు సున్నా మార్కులు వేసినందుకు సిగ్గుపడాల్సింది పోయి... ఇలాగే జరుగుతాయి అని చెప్తారా? అని ప్రశ్నించారు. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులకు అండగా ఉంటామని, జోలె పట్టి ప్రజల నుంచి విరాళాలు వసూలు చేసి బాధిత కుటుంబాలను ఆదుకుంటామన్నారు. -
‘ఇంటర్’వివాదానికి కారణాలివే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో నెలకొన్న వివాదాలపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ శనివారం తమ నివేదికను సమర్పించింది. కమిటీకి చైర్మన్, టీఎస్టీఎస్ ఎండీ వెంకటేశ్వరరావు, ఐఐటీ ప్రొఫెసర్ నిశాంత్ డొంగరి, బిట్స్ ప్రొఫెసర్ ఏ.వాసన్ బృందం దాదాపు 5రోజుల పాటు సుదీర్ఘ పరిశీలన చేపట్టిన కమిటీ పది పేజీల నివేదికను రూపొందించింది. పరిశీలన ప్రక్రియంతా నాలుగు ప్రధాన అంశాలుగా విభజించింది. కాంట్రాక్టు సంస్థకు అప్పగించిన విధులు, ఉపయోగించిన మానవ వనరులు, తప్పిదాలు జరిగిన ప్రక్రియ–తీసుకున్న చర్యలు, సాంకేతికత అంశాల ఆధారంగా పరిశీలన చేపట్టింది. వీటిని లోతుగా సమీక్షించిన కమిటీ పలు అంశాలను గుర్తిస్తూ నివేదికను రూపొందించింది. దీంతోపాటుగా పొరపాట్ల సవరణ, భవిష్యత్‌లో చేపట్టాల్సిన అంశాలపైనా లోతైన విశ్లేషణ చేసి ఐదు అంశాలతో కూడిన సూచనలను నివేదికతో జతచేసి ప్రభుత్వానికి అందించింది. కాగా, త్రిసభ్య కమిటీ నివేదికపై ఇంటర్ విద్యా జేఏసీ అధ్యక్ష, కార్యదర్శులు పి.మధుసూదన్‌రెడ్డి, కళింగ కృష్ణకుమార్ హర్షంవ్యక్తం చేశారు. కమిటీ ప్రభుత్వానికి నివేదించిన నివేదికలోని పలు ముఖ్యాంశాలు.. అసౌకర్యం.. ఆగమాగం! ఇంటర్మీడియట్ బోర్డుతో కాంట్రాక్టు సంస్థ కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం.. డేటా మైగ్రేషన్, మొబైల్ యాప్‌కు అనుసంధానమయ్యేలా విద్యార్థుల ఆన్లైన్ సర్వీసు, అడ్మిషన్ మాడ్యూల్, పరీక్షా కేంద్రాల నిర్వహణ (థియరీ, ప్రాక్టికల్), ప్రీ ఎగ్జామినేషన్ (జంబ్లింగ్, హాల్టిక్కెట్ల జనరేషన్), పోస్ట్ ఎగ్జామినేషన్ వర్క్ చేయాలి. కానీ నిర్దేశించిన పనులను కాంట్రాక్టు సంస్థ సకాలంలో పూర్తి చేయలేదు. నిర్దేశిత గడువుదాటి పూర్తిచేసినా అందులోనూ చాలా లోపాలున్నాయి. దీంతో కలిగిన అసౌకర్యమే విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. దీనికి కాంట్రాక్టు సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డుదీ బాధ్యతే. బాధ్యతల నిర్వహణలో వైఫల్యం ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతల్లో కీలక ఘట్టాలను సైతం కాంట్రాక్టు సంస్థ నిర్లక్ష్యం చేసింది. హాల్‌టికెట్ల జారీ, ఫలితాల విడుదల తదితర కార్యక్రమాలను నిర్దేశించిన తేదీల కంటే ముందుగా మాక్‌టెస్ట్ నిర్వహించాలి. ఓకే అనుకన్న తర్వాతే ఫలితాలు వెల్లడి చేయాలి. కానీ ఇందుకు తగిన ప్రామాణిక నిర్వహణ వ్యవస్థను కాంట్రాక్టు సంస్థ ఎక్కడా వినియోగించలేదు. విద్యాసంవత్సరం ప్రారంభంలోనే ఇంటర్మీడియట్ బోర్డు అధికారులు ప్రాజెక్టులో చోటుచేసుకున్న పొరపాట్లు, తప్పిదాలను గుర్తించి పూర్తిస్థాయి నివేదికను గ్లోబరీనాకు అందించారు. గతేడాది అక్టోబర్, నవంబర్ నెలలో ఈ తంతు జరిగింది. బోర్డు చేసిన సూచనలను గ్లోబరీనా విస్మరించింది. వీటిని పరిష్కరించకుండానే మళ్లీ ప్రతిపాదనలు పంపగా.. బోర్డు ఆమోదించలేదు. మొత్తంగా ఇంటర్మీడియట్ బోర్డు నిర్దేశించిన బాధ్యతలను నిర్వహించడంలో గ్లోబరీనా పూర్తిగా విఫలమైంది. ఫలితాల వెల్లడిలో తప్పులు 531 మంది జాగ్రఫీ విద్యార్థుల ప్రాక్టికల్ మార్కులు వారి మెమోల్లో కనిపించలేదు. 496 మంది విద్యార్థుల మెమోల్లో వారి మార్కులకు బదులుగా ఏపీ అని వచ్చింది. కొంతమంది విద్యార్థుల మెమోలో ఏఎఫ్ అని వచ్చింది. 4,288 మంది ఎంఈసీ విద్యార్థులకు మ్యాథమేటిక్స్ సబ్జెక్టులో సింగిల్ డిజిట్ మార్కులు వచ్చాయి. ఓఎంఆర్ షీట్ల బబ్లింగ్‌లో చోటుచేసుకున్న తప్పిదాలతో, కొందరికి సరైన మార్కులు రాకపోవడంతో ఈ పరిస్థితి నెలకొంది. సాంకేతిక సమస్యల కారణంగానే ఇలాంటి తప్పులు జరిగాయి. విద్యార్థుల ప్రవేశాలకు సంబంధించిన మాడ్యూల్‌ను గ్లోబరీనా సంస్థ సకాలంలో అభివృద్ధి చేయలేదు. గతంలో ఈ ప్రక్రియంతా సీజీజీ చూసుకుంది. కానీ తాజాగా ప్రాజెక్టు బాధ్యతలు తీసుకున్న గ్లోబరీనా అన్ని అంశాల్లోనూ దారుణంగా వెనుకబడింది. కనీసం గతేడాది డిసెంబర్ నాటికి కూడా వీటిని పూర్తి చేయలేదు. ఫీజు చెల్లింపులు, నామినల్ రోల్స్‌లో అసమానతలు, ఆన్లైన్ ప్రశ్నాపత్రాలు, ప్రాక్టికల్ పరీక్షల మార్కుల స్వీకరణ, హాల్‌టిక్కెట్లలో తప్పిదాలు, పరీక్షా కేంద్రాల్లో సరిపోలని విధానంతో భారీగా తప్పిదాలు జరిగాయి. అతి పెద్ద తప్పిదమేమిటంటే ఫలితాల విడుదలకు ముందే.. వచ్చిన రిజల్ట్స్‌ను మరో సంస్థతో ప్రాసెస్ చేసి ఉండాల్సింది. రెండు రికార్డులు సరిపోలిన తర్వాత స్పష్టత వచ్చినప్పుడు ఫలితాలను విడుదల చేసుంటే బాగుండేది. గతేడాది అదే తరహాలో చేసినా.. ఇప్పుడు ఇలాంటి పరిశీలనలేమీ లేకుండానే ఫలితాలు విడుదల చేశారు. దీంతోనే గందరగోళం తలెత్తింది. తక్షణ సూచనలు సాంకేతిక సహకారం అందించిన గ్లోబరీనా సంస్థతో పాటు ఇంటర్మీడియట్ బోర్డు కూడా.. పొరపాట్లను తక్షణమే సవరించాలని త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి సూచించింది. వీటితోపాటు భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా నూటికి నూరుశాతం కచ్చితమైన ఫలితాలు ఇచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సూచించింది. ఒక విద్యార్థి మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టుల్లో 80% మార్కులు సాధించి.. రెండో సంవత్సరంలో ఫెయిల్ అయినట్లు తేలితే బోర్డు యంత్రాంగం వెంటనే సదరు సబ్జెక్టు జవాబుపత్రాన్ని రీ–వెరిఫికేషన్ చేయాలి. వారంలోపు ఈ ప్రక్రియ పూర్తి చేసి ఫలితాలు ఇవ్వాలి. ఐవీఆర్ ఆధారిత హెల్ప్‌లైన్‌ను తక్షణమే ఏర్పాటు చేయాలి. సందేహాలు, ప్రశ్నలు లేవనెత్తితే వాటిని సంక్షిప్త సమాచారం, ఈమెయిల్ ద్వారా పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలి. హాల్‌టిక్కెట్ నంబర్‌ను కూడా ఐవీఆర్తో క్యాప్చర్ చేసేలా ఉండాలి. అభ్యర్థులకు ఎస్సెమ్మెస్‌లు, ఈ–మెయిల్ పంపించేలా ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేయాలి. బోర్డు నిర్దేశించిన ప్రాజెక్టును కాంట్రాక్టు సంస్థతోనే కాకుండా మరో స్వతంత్ర సంస్థతో ప్రాసెసింగ్ చేయించి రెండింటి ఔట్‌కమ్ సరిపోలిన తర్వాతే ఫలితాలు వెల్లడించాలి. త్వరలో జరిగే సప్లిమెంటరీ పరీక్షలకు సంబంధించి అన్ని ప్రక్రియలను మాక్‌టెస్ట్ నిర్వహించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకోవాలి. మాక్‌టెస్ట్‌ల్లో ప్రధాన తప్పిదాలు గుర్తిస్తే సవరించేందుకు వీలుంటుంది. భవిష్యత్తులో ఏం చేయాలంటే! భవిష్యత్తులో నిర్దేశిత ప్రాజెక్టును చేపట్టే కంపెనీ ఎంపిక పక్కాగా ఉండాలి. పరీక్షల నిర్వహణ, అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఈ రంగం లో అనుసరిస్తున్న విధానాలు కవర్ చేస్తూ ఆదర్శవంతమైన సర్వీస్ ప్రొవైడర్‌ను ఎంపిక చేయాలి. అడ్మిషన్ల నుంచి ఫలితాల విడుదల వరకు అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో పరిశీలించేందుకు బోర్డులో సీనియర్ అధికారులతో కూడిన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేయాలి. ఈ కమిటీ ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహించి ప్రాజెక్టు తీరును పరిశీలిస్తుండాలి. మాక్టెస్ట్ల నిర్వహణ, పర్యవేక్షణ బాధ్యతలు నిర్వర్తించాలి. అన్నీ సర్వీసుల మాడ్యూల్స్‌కు సంబంధించిన ఔట్పుట్ అందుబాటులోకి వచ్చే కంటే 4 వారాల ముందే టెస్ట్‌డ్రైవ్ జరపాలి. నిర్వహణాపరమైన అంశాలను సర్వీస్ ప్రొవైడర్‌కు తెలియజేయాలి. సర్వీసు ప్రొవైడర్ అనుసరిస్తున్న పద్దతులన్నింటినీ డాక్యుమెంటేషన్ చేయాలి. అన్ని మాడ్యుల్ సర్వీసులకు సంబంధించి ముందుగా మాక్ టెస్ట్, బీటా టెస్ట్‌లు తప్పనిసరిగా చేయాలి. అలా చేసిన టెస్ట్‌ల తాలూకు ఫలితాలు సంతృప్తికరంగా ఉన్నప్పుడు ఇంటర్‌బోర్డు ప్రత్యేక కమిటీ, ఈడీపీ బృందం విశ్లేషించి ఫలితాలు ప్రకటించాలి. కనీసం రెండు వారాలకు ముందు ఫీడ్‌బ్యాక్‌ను సర్వీస్ ప్రొవైడర్‌కు అందజేయాలి. సమాచార సమన్వయలోపం లేకుండా చూసుకునేందుకు.. ప్రత్యేకంగా టెక్నికల్ సెల్ ఏర్పాటు చేయాలి. అనుభవం, సరైన పరిజ్ఞానం ఉన్న అధికారులను ఇందులో నియమించాలి. ప్రత్యేక కమిటీల్లో ఉండే వారికి శిక్షణ తరగతులు నిర్వహించి అప్డేట్ చేయాలి. పనితీరు అధ్వానం ప్రాజెక్టులో భాగంగా బోర్డు నిబంధనలకు అనుగుణంగా కావాల్సిన సాంకేతికత, మానవ వనరులను గ్లోబరీనా సంస్థ సమకూర్చింది. ఇంటర్మీడియట్ బోర్డుతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం చేపట్టాల్సిన కార్యక్రమాన్ని నిర్దేశిత గడువులోగా నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా పూర్తి చేయాలి. కానీ.. ఈ ప్రక్రియలో కాంట్రాక్టు సంస్థ బాగా వెనకబడింది. సరైన వనరులను సమకూర్చితేనే నాణ్యతతో కూడిన ఫలితం వచ్చేది. గ్లోబరీనా సంప్థ పనితీరు అసంతృప్తికరంగా, అధ్వానంగా ఉంది. -
ఇంటర్ ఫలితాల్లో కొన్ని తప్పులు దొర్లాయి..
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పులు దొర్లాయని తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి అంగీకరించారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలపై ఏర్పాటైన త్రిసభ్య కమిటీ నివేదికను శనివారం ప్రభుత్వానికి సమర్పించిన సంగతి తెలిసిందే. ఆ నివేదికపై విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ‘ఇంటర్ బోర్డు తీసుకున్న నిర్ణయాలు బాగున్నా, వాటి అమలులో ఫెయిల్ అయ్యారు. ఫలితాలు వెల్లడి చేయడంలో కొన్ని తప్పులు జరిగాయి. రిజల్ట్స్ వచ్చిన రెండు, మూడు గంటల్లోనే తప్పు జరిగిందని బోర్డు దృష్టికి వచ్చింది. కోడింగ్ సరిగా జరగకపోవడం వల్లే విద్యార్థుల హాజరు విషయంలో పొరపాట్లు జరిగాయి. ఓఎమ్మార్ షీట్లలో బబ్లింగ్ చేసే సమయంలో కూడా కొన్ని మానవ తప్పిదాలు జరిగాయి. ఫలితాల ముందు డేటా అనాలసిస్ చేసి ఉంటే బాగుండేది. సర్వర్ సామర్థ్యం పెంచమని త్రిసభ్య కమిటీ సూచించింది. ఇక గ్లోబరినా ఏజెన్సీకి ఎలాంటి డబ్బులు చెల్లించలేదు. విద్యార్థుల ఆందోళనకు కారణమైనవారిపై చర్యలు తీసుకుంటాం. 531 మంది జాగ్రఫీ విద్యార్థుల మెమోలో ప్రాక్టికల్స్ మార్కులు కనిపించలేదు. చివరి నిమిషంలో సెంటర్ మార్పుల వల్ల కొన్ని తప్పులు జరిగాయి. ఉత్తీర్ణత శాతంలో తేడాలు లేవని కమిటీ గుర్తించింది. ఫెయిల్ అయిన విద్యార్థుల జవాబు పత్రాలను రీవాల్యుయేషన్ చేయాలని ప్రభుత్వానికి త్రిసభ్య కమిటీ సిఫార్సు చేసింది. సాఫ్ట్వేర్ లోపాలు ఉండటంతో కోడింగ్, డీ కోడింగ్ సమస్యలు వచ్చాయి. గతంలో కూడా ఇంటర్ ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయి. వాటిని సరిచేసాం. ఈ తప్పులు ఊహించనవి కాదు. ప్రతి సంవత్సరంలాగే ఈసారి జరిగాయి. ఫెయిల్ అయని విద్యార్థులకు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ సదుపాయం ఉచితంగా ఇస్తాం. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఇకపై మానవ తప్పిదాలు లేకుండా చూసుకుంటాం. అందరి సందేహాలు తొలగించేందుకు కమిటీ తెలిపిన ఆరు సూచనలను అమలు చేస్తాం.’ అని తెలిపారు. -
ఇంటర్ ఫలితాలపై నివేదిక సమర్పించిన కమిటీ
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ విద్యాశాఖ కార్యదర్శి జనార్ధన్‌రెడ్డికి నివేదిక అందజేసింది. ఐదు రోజులుగా అధ్యయనం చేసిన త్రిసభ్య కమిటీ శనివారం విద్యాశాఖ కార్యదర్శి జనార్దనరెడ్డికి అధ్యయన రిపోర్ట్‌ను ఇచ్చింది. త్రిసభ్య కమిటీతో భేటీ అనంతరం జనార్దన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కమిటీ రిపోర్ట్ ఆధారంగా అవకతవకలపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్‌కు 50వేల దరఖాస్తులు అందాయని.. ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించామని తెలిపారు. చదవండి : ‘గ్లోబరీనా’దే గోల్మాల్! -
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ బాధ్యతలు కలెక్టర్లకు అప్పగింత
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాలకు సంబంధించి విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. శనివారం ఆయన పలువురు అధికారులు, జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ బాధ్యతలను జిల్లా కలెక్టర్లకు అప్పగిస్తున్నట్టు తెలిపారు. ఇందుకోసం ఇప్పటివరకు 50 వేల దరఖాస్తులు వచ్చాయని అన్నారు. ఇంటర్లో ఫెయిల్ అయిన విద్యార్థుల రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ 12 రోజుల్లో పూర్తి చేస్తామని పేర్కొన్నారు. అధికారులు సక్రమంగా విధులు నిర్వహించేలా ఆదేశాలు జారీ చేసినట్టు వెల్లడించారు. అయితే ఇంటర్మీడియట్ పరీక్షలో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని సీఎం కేసీఆర్ ఆదేశించిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ, రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ నిర్వహణ నుంచి ఇంటర్ బోర్డు కార్యదర్శిని తప్పించి.. ఆ బాధ్యతలను జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. కాగా, ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు చెల్లింపు చివరి తేదీని ఈ నెల 29 వరకు పొడిగిస్తున్నట్టు ఇంటర్ బోర్డు పేర్కొంది. మరోవైపు ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ మరికాసేపట్లో తమ నివేదికను సమర్పించనుంది. ఇంటర్మీడియట్ ఫలితాల వైఫల్యాలపై పూర్తి స్థాయిలో పరిశీలించిన కమిటీ సుదీర్ఘ నివేదికను రూపొందిచినట్టుగా తెలుస్తోంది. -
ఇంటర్ అక్రమాలపై సమగ్ర విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన అక్రమాలపై సమగ్ర న్యాయవిచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీపీఎం డిమాండ్ చేసింది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఇంటర్ బోర్డును సమూలంగా ప్రక్షాళన చేయాలని, ఆత్మహత్యలకు పాల్పడ్డ విద్యార్థుల కుటుంబాలకు రూ.20 లక్షల చొప్పున పరిహారమివ్వాలని విజ్ఞప్తి చేసింది. విద్యార్థుల భవితవ్యాన్ని కాపాడేందుకు ప్రభుత్వపరంగా వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. ప్రస్తుతమున్న గ్లోబరీనా సంస్థ టెండర్ రద్దు చేయాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేట్ సంస్థల జోక్యాన్ని అనుమతించొద్దని ఇంటర్ బోర్డు కార్యదర్శికి సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సమర్పించిన వినతిపత్రంలో పేర్కొన్నారు. ఇంటర్ పరీక్షల నిర్వహణ, ఫలి తాల వెల్లడి జవాబుదారీగా వ్యవహరించాల ని, ప్రభుత్వ టెక్నాలజీ సహకారాన్ని తీసు కోవాలని కోరారు. ఇతర ప్రవేశపరీక్షలకు నష్టం కలగకుండా టైం బౌండ్‌గా తిరిగి పరీక్షల నిర్వహణకు ఇంటర్ బోర్డు చర్యలు తీసుకోవాలని సూచించారు. శుక్రవారం ఇంటర్‌బోర్డు కార్యాలయం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహణ సందర్భంగా పార్టీ lనేతలు జి.నాగయ్య, చెరుపల్లి సీతారాములు, నంద్యాల నర్సింహారెడ్డి, టి.జ్యోతి, డీజీ నర్సింహారావు, ఎం.శ్రీనివాస్, పి.సత్యంలను పోలీసులు అరెస్ట్ చేశారు. -
‘మాజీ’లకు ఉద్వాసన
సాక్షి, హైదరాబాద్: కుర్చీలకు అతుక్కుపోయిన ‘మాజీ’లకు ఉద్వాసన పలకాలని రాష్ట్ర ప్రభుత్వం దాదాపు నిర్ణయించింది. పదవీ విరమణ పొందినా ఆయా శాఖల్లో సలహాదారులుగా, ప్రత్యేక అధికారులుగా కొనసాగుతున్న వారిని తొలగించేందుకు రంగం సిద్ధం చేసింది. ప్రభుత్వ శాఖల్లో ఇలా తిష్ట వేసిన వారితో ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని నిర్ధారణకు వచ్చింది. అన్ని శాఖల్లో ఇలా కొనసాగుతున్న వారిని గుర్తించి తొలగించాలని నిర్ణయించింది. ఇంటర్మీడియట్ మార్కుల వ్యవహారమే దీనికి కారణంగా కనిపిస్తోంది. పదవీ విరమణ పొందినా అదే శాఖలో కొనసాగుతున్న కొందరితోనే ఇంటర్ మార్కుల వ్యవహారంలో తప్పులు జరిగినట్లు నిఘా వర్గాలు ప్రభుత్వానికి నివేదిక అందజేసినట్లు తెలిసింది. తాజాగా ఇంటర్ ఫలితాల వెల్లడిలో జరిగిన రాద్ధాంతం వెనుక ఈ అధికారుల పాత్ర ఉందని నిఘా వర్గాలు సీఎం కేసీఆర్ నివేదిక సమర్పించాయి. మాజీ అధికారులే బోర్డు పాలనా వ్యవహారాల్లో కీలక భూమిక పోషిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో పదవీ విరమణ పొందినా... అదే పోస్టుల్లో కొనసాగుతున్న ఉద్యోగులను తొలగించాలని అధికారులను ఆదేశించారు. అదే సమయంలో శాఖల వారీగా ఈ తరహాలో పనిచేస్తున్న ఉద్యోగుల లెక్కతీయాలని సీఎం స్పష్టం చేశారు. మెరుగైన సేవలు అందిం చేందుకు అనుభవజ్ఞులను కొన్ని శాఖల్లో కొనసాగించాలని రాష్ట్రం ఏర్పాటైన కొత్తలో ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని అవకాశంగా తీసుకుని పలు శాఖల్లో కొందరు పదవీ విరమణ పొందినా రకరకాల కారణాలతో అదే శాఖలో విధులు నిర్వహిస్తూ వస్తున్నారు. దీంతో ఆయా శాఖల్లోని రెగ్యులర్ ఉద్యోగులు, ‘విరమణ’ఉద్యోగుల మధ్య ప్రచ్ఛన్న యుద్ధం లాంటి పరిస్థితులు నెలకొన్నాయి. 1,127 మంది ఉన్నట్లు లెక్క... రాష్ట్రవ్యాప్తంగా అన్ని విభాగాల్లో 1,127 మంది ఉద్యోగులు కన్సల్టెంట్, ఓఎస్డీ పోస్టుల పేరు తో పాత విధులనే నిర్వర్తిస్తున్నారని తేలింది. ఇందులో మాజీ ఐఏఎస్, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు మొదలు కిందిస్థాయి ఉద్యోగుల వరకు ఉన్నట్లు స్పష్టమైంది. వీరందరిని తొలగించాలని నిర్ణయించింది. పదవీ విరమణ చేసినా కన్సల్టెంట్లుగా అవే సీట్లలో కొనసాగుతుండడంతో పదోన్నతులు, పోస్టింగ్‌లలో దిగువ శ్రేణి అధికారులకు అన్యాయం జరుగుతోంది. శాఖలో వారి పెత్తనమే కొనసాగడంతో రెగ్యు లర్ ఉద్యోగులు ఇబ్బంది పడుతున్నారు. -
విద్యార్థుల ఆత్మహత్యలపై హైకోర్టులో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: ఆత్మహత్యలకు పాల్పడిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం ఇచ్చేలా ప్రభుత్వాన్ని ఆదేశించడంతోపాటు, ఆత్మహత్యలకు బాధ్యులైన వారిపై క్రిమినల్ చర్యలకు ఆదేశాలు ఇవ్వాలంటూ న్యాయవాది రాపోలు భాస్కర్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరి జవాబుపత్రాలను పునర్ మూల్యాంకనం చేసేలా ఆదేశాలివ్వాలని కోర్టును కోరారు. మూల్యాంకనం కాంట్రాక్ట్ పొందిన గ్లోబరీనా సంస్థ పూర్తి నిర్లక్ష్యంతో, బాధ్యతారాహిత్యంతో వ్యవహరించిందని, అంతిమంగా విద్యార్థులు నష్టపోయారన్నారు. పలువురు విద్యార్థులు తక్కువ మార్కులు వచ్చాయన్న భావనతో ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. 900లకు పైగా మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఫెయిల్ అయ్యారన్నారు. మొత్తం వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఇచ్చిన నివేదికలో గ్లోబరీనా సంస్థ నిర్వాకం వల్లే ఇదంతా జరిగిందంటూ పేర్కొన్నట్లు పత్రికల్లో వచ్చిందని వివరించారు. -
ఎంసెట్‌పై ఆందోళన వద్దు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ పరీక్షల జవాబు పత్రాల రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ ప్రక్రియ ఫలితాలు వెల్లడించాకే ఎంసెట్–2019 ఫలితాలు ప్రకటిస్తామని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి స్పష్టం చేశారు. విద్యార్థులెవరూ ఆందోళనకు గురికావొద్దని విజ్ఞప్తి చేశారు. ఇంటర్ ఫలితాల్లో పెద్ద ఎత్తున తప్పిదాలు చోటు చేసుకున్న నేపథ్యంలో ఫెయిలైన విద్యార్థులందరి జవాబు పత్రాలకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ప్రక్రియలకు కొంత సమయం పట్టనుండగా, ఆలోపే ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తే, ఇంటర్ బోర్డు తప్పిదాల వల్ల ఫెయిలైన విద్యార్థులు ఎంసెట్‌లో సైతం ఫెయిల్ కానున్నారు. దీంతో రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ తర్వాతే ఎంసెట్ ఫలితాలు ప్రకటించాలని నిర్ణయించినట్లు తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. ఉన్నత విద్యా మండలి వైస్ చైర్మన్లు లింబాద్రి, వి.వెంకటరమణతో కలసి శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. విద్యార్థులెవరూ ఇంటర్ ఫలితాలపై బెంగ పెట్టుకోకుండా ఎంసెట్‌కు సిద్ధం కావాలని కోరారు. రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ విషయంలో ఇంటర్ బోర్డుతో సమన్వయం చేసుకుని ఎంసెట్ ఫలితాలు ప్రకటిస్తామన్నారు. విద్యార్థులెవరికీ అన్యాయం జరగనివ్వబోమని హామీ ఇచ్చారు. వచ్చే నెల 3, 4, 5 తేదీల్లో ఇంజనీరింగ్, 7, 8 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులకు సంబంధించి ఎంసెట్ ప్రవేశపరీక్ష జరగనుందని, ఆ తర్వాత 28న ఫలితాలు ప్రకటించాలని భావించినట్లు తెలిపారు. అయితే ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల కారణంగా ఈ నిర్ణయాన్ని విరమించుకున్నట్లు చెప్పారు. ఎంసెట్ ఫలితాలు కొద్దిగా ఆలస్యమైనా, కౌన్సెలింగ్‌తో పాటు విద్యా సంవత్సరం అనుకున్న సమయానికి ప్రారంభమవుతుందన్నారు. రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ ఫలితాలొచ్చిన తర్వాతే దోస్త్ ద్వారా డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ కౌన్సిలింగ్ నిర్వహిస్తామన్నారు. ఇక ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులు రాష్ట్రంలోని నాలుగు ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సును 2020–21 విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించనున్నామని తుమ్మల పాపిరెడ్డి వెల్లడించారు. డిగ్రీతో పాటు బీఈడీ చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టనుందని, కానీ ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సులో చేరితే నాలుగేళ్లలో డిగ్రీ, బీఈడీ పూర్తి చేయొచ్చన్నారు. నాలుగేళ్ల బీఏ, బీఈడీ/బీకాం, బీఈడీ/ బీఎస్సీ, బీఈడీ కోర్సులను ప్రారంభించాలని యోచిస్తున్నామన్నారు. లక్సెట్టిపేట, కల్వకుర్తి, నారాయణ్‌ఖేడ్, భూపాలపల్లిలోని ప్రభుత్వ మోడల్ డిగ్రీ కళాశాలల్లో తొలుత ఈ కోర్సు ప్రారంభం కానుందన్నారు. ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సు సాధారణ డిగ్రీతో సమానమన్నారు. -
‘గ్లోబరీనా’దే గోల్మాల్!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో భారీగా చోటు చేసుకున్న పొరపాట్లకు కాంట్రాక్టు సంస్థ గ్లోబరీనా టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్‌దే తప్పని స్పష్టమవుతోంది. ఫలితాలపై నెలకొన్న పరిస్థితి ని క్షుణ్నంగా పరిశీలించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీ ఈ వ్యవ హారంలో జరిగిన పొరపాట్లను గుర్తించి నివేది కలో పొందుపరిచినట్లు తెలుస్తోంది. ఫలితాల్లో తప్పిదాలకు కాంట్రాక్టు సంస్థదే ప్రధాన బాధ్యతగా కమిటీ అభిప్రాయ పడినట్లు సమాచారం. పరీక్ష ఫీజుల చెల్లింపు వెబ్సైట్ సరిగ్గా పని చేయకపోవడం మొదలు డేటా ప్రాసెసింగ్, లోపాలతో కూడిన ఓఎంఆర్ షీట్లు, ఫలి తాల ప్రాసెసింగ్ వరకు గ్లోబరీనా సంస్థ అనేక సాంకేతిక తప్పిదాలకు పాల్పడిందని కమిటీ అంచనాకు వచ్చినట్లు తెలిసింది. అలాగే గ్లోబరీ నాకు కాంట్రాక్టు ఇవ్వడంలోనూ వ్యూహాత్మక తప్పిదం జరిగిందని, నిబంధనలను పట్టించు కోకుండా బోర్డు ఏకపక్షంగా కాంట్రాక్టును కట్టబెట్టినట్లు కమిటీ గుర్తించింది. కాంట్రాక్టు ప్రారంభమైన నాటి నుంచి గ్లోబరీనా పలు సాంకే తిక పొరపాట్లు చేసినా బోర్డు కనీసం పట్టించు కోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కమిటీ తేల్చినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అదే విధంగా కాంట్రాక్టు కట్టబెట్టడంలో జరిగిన అవకతవకలపైనా ఆరా తీసినట్లు సమాచారం. సమాచారమంతా నివేదికలోకి... ఫలితాల్లో జరిగిన తప్పిదాలపై త్రిసభ్య కమిటీ లోతుగా అధ్యయనం చేసింది. పరీక్షల నిర్వ హణ, ఫలితాల వెల్లడిలో జరి గిన ప్రక్రియనంతా వడపోసిన కమిటీ... ఇందులో బాధ్యులుగా ఉన్న వారిని కేటగిరీలవారీగా విభజించి వివరాలను సేకరిం చింది. ఇంటర్ బోర్డు అధి కారులు, ఉద్యోగులతోపాటు గ్లోబరీనా ప్రతినిధులు, గతంలో పరీక్షల నిర్వహణలో కీలకపాత్ర పోషించిన వారితోనూ మాట్లాడింది. అలాగే కాంట్రాక్టు సంస్థ, ఇంటర్ బోర్డు అధికారులపై వస్తున్న విమర్శలపైనా సమాచారాన్ని సేకరించి నట్లు తెలిసింది. ఈ వివరాలతోపాటు అధికారు లపై వచ్చిన ఆరోపణలు, మీడియా కథనాలను క్రమ పద్ధతిలో సేకరించి వాటిని విశ్లేషించింది. కమిటీ ఇచ్చే నివేదికతో పాటు బయటివర్గాల నుంచి విశ్వసనీయంగా సేకరించిన వివరాలను కూడా ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సమాచారం. ష్... గప్‌చుప్... లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గందర గోళంలో పడేసిన ఇంటర్ ఫలితాల విషయంలో తప్పొప్పుల నిగ్గు తేల్చేందుకు ఏర్పాటైన త్రిసభ్య కమిటీ ప్రస్తుతం తమ విచారణ వివరాలను ఎక్కడా ప్రస్తావించడంలేదు. కనీసం మీడియాతో సైతం మాట్లాడేందుకు నిరాకరిస్తోంది. కమిటీ చైర్మన్‌తోపాటు ఇద్దరు సభ్యులు సైతం పరిశీలన తాలూకు అంశాలను బయటకు వెల్లడి కానివ్వడం లేదు. ఇంటర్ ఫలితాల తప్పిదాలపై రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళనలు జరుగుతుండటం... లక్షలాది మంది విద్యార్థులకు సంబంధించిన సున్నితమైన అంశం కావడంతో కమిటీ సభ్యులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నివేదికలోని అంశాలు బయటపడితే పరిస్థితి తారుమారయ్యే అవకాశం లేకపోలేదు. దీంతో నివేదికను ప్రభుత్వానికి సమర్పించే వరకు కమిటీ బృందం అత్యంత గోప్యత పాటించాలని నిర్ణయించిన క్రమంలో ఎప్పుడు ప్రభుత్వ దరికి నివేదిక చేరుతుందనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. త్రిసభ్య కమిటీపై తీవ్ర ఒత్తిడి? ఇంటర్ ఫలితాల వ్యవహారంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన త్రిసభ్య కమిటీపై ఒత్తిడి తీవ్రమవుతోంది. మూడు రోజుల్లో పరిస్థితిని పూర్తిగా పరిశీలించి సుదీర్ఘ నివేదిక ఇవ్వాలని ప్రభుత్వం ఆదేశించంతో గురువారమే వివరాల సేకరణ పూర్తి చేసింది. అయితే శుక్రవారం సాయంత్రం నాటికి కూడా నివేదికను ప్రభుత్వానికి సమర్పించలేదు. సాంకేతిక కారణాలతో నివేదిక సమర్పణలో జాప్యమే ఇందుకు కారణమని తెలుస్తోంది. దీంతో నివేదిక సమర్పణ కోసం కమిటీపై ఒత్తిడి పెరుగుతోంది. మరోవైపు గ్లోబరీనా సంస్థపై ఆరోపణలకు తోడు... ఆ సంస్థ తప్పిదాలు, ఇంటర్ బోర్డు ఉన్నతాధికారులతో కొనసాగించిన వ్యవహారాలపై కమిటీ తన నివేదికలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కమిటీపై గ్లోబరీనా సంస్థ కూడా ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఫలితాల విషయంలో సంస్థ పొరపాట్లు లేవనే అంశాన్ని బలంగా వినిపించేందుకు కాంట్రాక్టు సంస్థ రకరకాల మార్గాలను అన్వేషిస్తున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. నివేదికలో సంస్థ పరపతికి భంగం కలగకుండా చూడాలని కమిటీని కోరేందుకు గ్లోబరీనా యాజమాన్యం శతవిధాలా ప్రయత్నిస్తోందనే వాదనలు వినిపిస్తున్నాయి. దీంతో కమిటీ సభ్యులు నివేదికను అత్యంత గోప్యంగా ప్రభుత్వానికి చేరవేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలో శనివారం నివేదికను ప్రభుత్వానికి అందించనున్నట్లు సమాచారం. -
అశ్రుతర్పణం
ప్రస్తుతం తెలంగాణ ఇంటర్ బోర్డు చుట్టుతా వార్తలు తిరుగుతున్నాయ్. జరిగింది చాలా పెద్ద తప్పిదం. తప్పు ఎవరిదన్నా కావచ్చు, దాదాపు ఇరవై యువ ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. ఇరవై చిన్న ప్రాణాలని ప్రాణంగా చూసుకుంటూ కనీసం వెయ్యి పెద్ద ప్రాణాలుంటాయ్. వారంతా శేష జీవితాన్ని జీవచ్ఛవాల్లా గడపాల్సిందే. ముఖ్య మంత్రి నించి అంతా పరీక్ష తప్పితే ఏముంది, మళ్లీ మళ్లీ రాసుకోవచ్చు. ఉత్తీర్ణత సాధిం చవచ్చు– అంటూ కౌన్సిలింగ్ కబుర్లు చెబుతు న్నారు. మూడు లక్షల ముప్ఫై వేలమంది ఇంటర్ పిల్లల జాతకాలను కలగాపులగం చేసి పెట్టారు. ముఖ్యంగా టెన్త్, ఇంటర్ పరీక్షలంటే చావో రేవో అన్నట్టు అందరూ కలిసి తయా రుచేసి పెట్టారు. దానికి వత్తాసుగా కార్పొరేట్ విద్యా సంస్థలు కలుపు మొక్కల్లా వచ్చాయ్. వాళ్ల వ్యాపారం కోసం ర్యాంకుల్ని, మార్కుల్నీ జీవిత లక్ష్యంగా మార్చాయ్. అన్ని సబ్జెక్ట్లనీ పిల్లలకి రుబ్బి పోస్తున్నారు. నేడు వ్యాపార క్షేత్రంలో ప్రముఖ స్థానం వహిస్తోంది విద్యా వ్యాపారం. అందులోనూ విద్యార్థులకు స్టెప్పింగ్ స్టోన్స్ అయిన ‘టెన్త్, ఇంటర్’ ‘ఇక్కడ జారావో ఇంతే సంగతులు’ అంటూ పిల్లలకు పాఠాలతో పాటు నూరి పోస్తున్నారు. ఉపాధ్యాయులే కాదు, విద్యావేత్తలుగా చలామణి అవుతున్న వారే కాదు, అమ్మ నాన్నలే కాదు అంతా ఇదే హెచ్చరిక. ప్రస్తుతం పోటీ ఉన్నమాట నిజం. అంత మాత్రాన పిల్లల ప్రాణాలు పణంగా పెట్టాల్సిన అవసరం లేదు. పరీక్షకి ఒక్క నిమిషం అంటే ఒక్క నిమిషం ఆలస్యమైతే పరీక్షా కేంద్రంలోకి పిల్లల్ని రానివ్వ లేదు. ఎంతటి క్రమశిక్షణ. మహా నగరంలో ఇళ్ల దగ్గర్నించి రకరకాల ట్రాన్స్‌పోర్ట్‌లలో రావడానికి ఓ నిమిషం ఆలస్యం కావచ్చు. అంత మాత్రాన అంత శిక్షా?! ఇప్పుడు మూడు లక్షల ముప్ఫై వేల మంది భవితవ్యాన్ని వీధిన పడేసిన ఈ అధికారులకు ఏమి శిక్ష విధిస్తారు? నిన్న ముఖ్యమంత్రిగారు నిమ్మకి నీరెత్తినట్టు మాట్లాడారు. ప్రాణంతో ఉన్న పిల్లలకు భరోసా ఇచ్చారు. కనీసం ఇన్ని రోజులుగా పిల్లల తల్లిదం డ్రులు తల్లడిల్లుతుంటే సరైన స్పందన లేదు. ఒక పనికిమాలిన ఏజెన్సీకి బాధ్యతాయుతమైన పరీక్షల వ్యవహారం అప్పగించారన్నది మాత్రం నిజం. మన దేశంలో జవాబుదారీతనం లేదు. ఉండదు. ఇదే ప్రజా రాజ్యానికి అమరిన అలం కారం. ఎంత తప్పు జరిగినా ఎవరికీ శిక్షలుం డవ్. ఇంతటి ఘోరం జరిగినప్పుడు, రాష్ట్రం పెద్ద పెట్టున రోదిస్తున్నప్పుడు, సంబంధిత మంత్రి అప్పటికప్పుడు రాజీనామా చేసి ఉండ వచ్చు. చేస్తే... పోయిన ప్రాణాలు వస్తాయా అని అడగచ్చు. కనీసం అసమర్థతని అంగీకరిం చడం ఒక మంచి లక్షణం. ముఖ్యమంత్రిగారు పరీక్ష పోతే జీవితం పోయినట్లు కాదని పదే పదే వక్కాణిస్తున్నారు. మంత్రి పదవి పోతే ఎంత? కాస్త ఈ గొడవ సద్దుమణగగానే దీని బాబులాంటి పదవి రానే వస్తుంది. పొరబాట్లు అందరూ చేస్తారు. త్యాగాలు కొందరే చేస్తారని నానుడి. కేసీఆర్ మొన్నీమధ్యనే అవినీతి మీద పెక్కు బాణాలు సంధించారు. క్షాళనకి దిగుతున్నానని హెచ్చ రించారు. రెవెన్యూ శాఖ మీద కన్ను వేశారు. చెద పురుగుల్లా రాష్ట్రంలో అవినీతి, ఆశ్రితపక్షపాతం ఎక్కడంటే అక్కడే ఉంది. ఎందుకైనా మంచిది మీమీ సింహాసనాలను ఒకసారి బాగా దులి పించుకోండి. ఈ సంఘటన పట్ల ముఖ్య మంత్రి ఇంకొంత ప్రభావవంతంగా ప్రవర్తించి ఉంటే బాగుండేది. అసలీ ట్రాజెడీ ఇంకా యువ రాజు కేటీఆర్ దృష్టికి వచ్చినట్టు లేదు. తాము చెయ్యని తప్పుకు బలైపోయిన విద్యార్థినీ విద్యా ర్థులకు అశ్రుతర్పణం సమర్పించుకుంటున్నా. వారి పెద్దలకు సానుభూతి తెల్పుకుంటున్నా. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) -
ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టులో మరో పిటిషన్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు నిర్లక్ష్యంపై హైకోర్టు మరో పిటిషన్ దాఖలు అయింది. ఇంటర్ ఫలితాల్లో జరిగిన అవకతవకల కారణంగా ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల ఒక్కో కుటుంబానికి రూ. 50 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని న్యాయవాది రాపోలు భాస్కర్ పిటిషన్లో పేర్కొన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇంటర్ బోర్డుతో గ్లోబరీనా సంసథ కాంట్రాక్టు రద్దు చేయాలని అన్నారు. అయితే రాపోల్ భాస్కర్ పిటిషన్‌పై హైకోర్టు మరికాసేపట్లో విచారణ చేపట్టనుంది. ఇప్పటికే ఇంటర్ బోర్డు వైఫల్యాలపై పలువరు హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. -
ఇంటర్ బోర్డు ముట్టడికి యత్నించిన వామపక్షాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్ ఫలితాల్లో చోటుచేసుకున్న అవకతవకలపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. శుక్రవారం వామపక్ష నేతలు నాంపల్లిలోని ఇంటర్మీడియట్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. అయితే వామపక్ష నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. అనంతరం నాంపల్లి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా సీపీఐ నాయకులు మాట్లాడుతూ.. ప్రభుత్వం విద్యార్థులకు న్యాయం చేయాలని కోరారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలన్నారు. ప్రశ్నించిన వాళ్లను ప్రభుత్వం అణిచివేస్తోందని మండిపడ్డారు. చనిపోయిన ఇంటర్ విద్యార్థుల కుటుంబాలకు 20 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
బోర్డు రద్దు యోచన సమర్థనీయం కాదు
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ పరీక్షల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం, ఇంటర్‌బోర్డు బాధ్యతా రాహిత్యంతో వ్యవహరించాయని తెలంగాణ జన సమి తి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిగితేనే అన్ని విషయాలు బయటికి వస్తాయని, విద్యార్థులకు న్యాయం జరుగుతుందన్నారు. పరీక్షల ఫీజుల వసూలు మొదలు ఫలితాల ప్రకటన వరకు విద్యార్థుల జీవితాలతో ఆడుకున్న ఇంటర్ బోర్డును ప్రక్షాళన చేయాల్సింది పోయి, బోర్డునే రద్దు చేయాలని ఆలోచించడం సమర్థనీయం కాదన్నారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చేస్తున్నట్టుగా వస్తున్న ప్రతిపాదనలను తాము అంగీ కరించే ప్రసక్తి లేదన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించిన విధులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించాలన్న ఆలోచన సరికాదన్నారు. గురువారం పార్టీ నాయకులు ప్రొ.పీఎల్ విశ్వేశ్వర్రావు, రమేశ్‌రెడ్డి, భావనారెడ్డి, రమేశ్ ముదిరాజ్‌లతో కలసి కోదండరాం విలేకరులతో మాట్లాడారు. ఇంటర్ ఫలితాల గందరగోళానికి టీఆర్ఎస్ అధినాయకత్వం, బోర్డు కార్యదర్శి, విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బాధ్య త వహించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై నైతికబాధ్యత వహించి విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. గ్లోబరీనాను ఎందుకు వెనుకేసుకొస్తున్నారు... బోర్డు కార్యదర్శి, ఇతర అధికారులు ఎవరి ప్రయోజనాలు కాపాడడానికి గ్లోబరీనా సంస్థను వెనకేసుకొస్తున్నారో చెప్పాలని కోదండరాం డిమాండ్ చేశారు. పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడిలో నైపుణ్యం, సామ ర్థ్యం లేని ఈ సాఫ్ట్వేర్ కంపెనీకి లక్షలాదిమంది విద్యార్థుల భవిష్యత్‌తో ముడిపడిన కీలకబాధ్యతలు ఇంటర్ బోర్డ్ ఎలా అప్పగించిందని ప్రశ్నించారు. విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి అన్ని విషయాలు తెలుసని, అయినా చర్యలు తీసుకోలేకపోయారని ఆరోపించారు. రీవాల్యుయేషన్, రీ వెరిఫికేషన్‌కు పట్టే సమయం, ఇతరత్రా విషయాల్లోనూ హైకోర్టుకు ప్రభుత్వం తప్పుడు సమాచారం ఇచ్చిందని, ఈ వ్యవహారంలో తాము కూడా ఇంప్లీడ్ అవుతామని వెల్లడించారు. చివరకు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను కూడా అరెస్ట్ చేసే దుస్థితి నెలకొందన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ వద్ద టీజేఎస్ రిజిస్టర్ పార్టీ అని, అయినా జెడ్పీటీసీ అభ్యర్థులకు అగ్గిపెట్టె, ఎంపీటీసీ అభ్యర్థులకు గ్యాస్‌సిలిండర్ గుర్తులు కేటాయించారని, ఎన్నికల కమిషన్ చేసిన లోపం వల్ల తమ అభ్యర్థులు, పార్టీ ఇబ్బందులు పడాల్సి వస్తోం దని కోదండరాం అన్నారు. గురువారం ఈ అంశాన్ని తాము కమిషనర్ నాగిరెడ్డి దృష్టికి తీసుకెళ్లామన్నారు. -
స్వాతంత్య్రం తెచ్చిన పార్టీనే విలీనం చేస్తారా?
సాక్షి, హైదరాబాద్: దేశానికి స్వాంతంత్య్రం తెచ్చిన కాంగ్రెస్ పార్టీనే రాష్ట్రంలో లేకుండా చేయాలనే కుట్ర జరుగుతోందని పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఇచ్చిన పార్టీనే నిర్వీర్యం చేసేలా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారని దుయ్యబట్టారు. గతంలో సోనియా గాంధీ కాళ్లు పట్టుకొని తెలంగాణ తెచ్చుకున్న విషయాన్ని ఆయన మర్చిపోయి విలీన ఆలోచన చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులు, ఇంటర్ పరీక్షా ఫలితాల్లో అవకతవకలపై ఫిర్యాదు చేసేందుకు గురువారం అఖిలపక్ష నేతలు రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో సమావేశమయ్యారు. ఈ భేటీలో ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు జగ్గారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి, షబ్బీర్ అలీ, టీజేఎస్ అధినేత కోదండరాం, టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ, రావుల చంద్రశేఖర్‌రెడ్డి, ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరుకు సుధాకర్, సీపీఐ నేతలు పాల్గొన్నారు. భేటీ అనంతరం ఉత్తమ్ మీడియాతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని అన్యాయంగా, అక్రమంగా, అప్రజాస్వామికంగా టీఆర్ఎస్లో విలీనం చేయాలని కేసీఆర్ చూస్తున్నారని మండిపడ్డారు. గతంలో కౌన్సిల్ చైర్మన్ స్వామిగౌడ్‌ను బెదిరించినట్లే ఇప్పుడు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని సీఎం బెదిరిస్తున్నారని ఆరోపించారు. అందుకే స్పీకర్ హైదరాబాద్ రావట్లేదని, అనర్హత పిటిషన్ తీసుకునేందుకు భయపడుతున్నారన్నారు. ప్రతిపక్ష పార్టీగా ఎంఐఎంను నిలబెట్టేందుకే ఇలాంటి కుట్రలు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలకు రూ. కోట్ల ఆశ చూపి, పదవులు ఎరవేసి పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతున్న పద్ధతులను ప్రజలు, ప్రజాస్వామ్యవాదులు అర్థం చేసుకోవాలన్నారు. మీడియా సైతం ఈ విషయంలో ప్రేక్షకపాత్ర వహించొద్దన్నారు. మంత్రిని డిస్మిస్ చేయాలి...: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తప్పిదాలు, అవకతవకలు, అవినీతి, బోర్డు వైఫల్యం వల్ల 20 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని, వాటిని ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు ఉత్తమ్ వెల్లడించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో బోర్డు విఫలమైందని, ఎలాంటి అనుభవం లేని గ్లోబరీనా సంస్థకు టెండర్లు కట్టబెట్టి విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడారని విమర్శించారు. ఈ వ్యవహారంపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, బాధ్యులైన అధికారులను సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. నిర్ల క్ష్యంగా వ్యవహరించిన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని కేబినెట్ నుంచి డిస్మిస్ చేయాలని గవర్నర్‌ను కోరినట్లు ఉత్తమ్ తెలిపారు. విద్యార్థుల విషయంలో తాను కఠినంగా ఉంటానని, న్యాయం జరిగేలా చూస్తానని గవర్నర్ హామీ ఇచ్చినట్లు వివరించారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం: భట్టి ముఖ్యమంత్రి విపరీత చర్యల కారణంగా రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం ఏర్పడే ప్రమాదం నెలకొందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆందోళన వ్యక్తం చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని, కేసీఆర్ ఆగడాల నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు తెలిపారు. దేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే కేసీఆర్ పెను సవాల్ విసురుతున్నారన్నారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే స్పీకర్ చర్యలు తీసుకోవట్లేదని భట్టి ఆరోపించారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తక్షణం చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఇంటర్ బోర్డు విధానాలకు వ్యతిరేకంగా ఈ నెల 29న బోర్డు కార్యాలయం వద్ద అఖిలపక్షం నేతృత్వంలో ధర్నా నిర్వహిస్తామని టీడీపీ అధ్యక్షుడు ఎల్. రమణ తెలిపారు. ఓ సంస్థ ప్రయోజనాల కోసం లక్షలాది మంది విద్యార్థులతో చెలగాటమాడారని టీజేఎస్ అధినేత కోదండరాం విమర్శించారు. విద్యార్థుల ఆత్మహత్యలపై మంత్రి జగదీశ్‌రెడ్డి స్పందించిన తీరు బాగాలేదని చెరుకు సుధాకర్ విమర్శించారు. -
విద్యాశాఖ మంత్రిని ఎందుకు తప్పించడం లేదు?
సాక్షి, హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అవకతవకలకు బాధ్యులైన విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డిని, సీఎం కేసీఆర్ ఎందుకు తప్పించడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ప్రశ్నించారు. విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేసే వరకు తాము ఉద్యమం చేస్తామని అన్నారు. గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్ కలిసిన బీజేపీ నేతలు తెలంగాణ ఇంటర్ బోర్డు వైఫల్యాలపై ఫిర్యాదు చేశారు. గవర్నర్‌ను కలిసిన వారిలో లక్ష్మణ్, బండారు దత్తాత్రేయ, డీకే అరుణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రామచంద్రారావు ఉన్నారు. ఇంటర్ పరీక్షలు రాసిన విద్యార్థులందరికీ ఉచితంగా రీ వెరిఫికేషన్ నిర్వహించాలని కోరారు. గ్లోబరీనా సంస్థ బాగోతాలపై దర్యాప్తు జరిపించి.. ఆ సంస్థను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలన్నారు. ఆందోళన చేసిన విద్యార్థుల తల్లిదండ్రులపై, విద్యార్థి సంఘాల నాయకులపై పెట్టిన కేసులు వెంటనే ఎత్తివేయాలన్నారు. మొత్తం వ్యవహారాన్ని హైకోర్టు సిట్టింగ్ జడ్జి చేత విచారణ జరిపించాలని అన్నారు. ఈ సమావేశం అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ.. గ్లోబరీనా సంస్థకు అనుభవం లేకపోయిన ఆ సంస్థతో ఎందుకు ఒప్పందం చేసుకున్నారని ప్రశ్నించారు. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలు జరగడంతో లక్షలాది మంది తల్లిదండ్రులు మనోవేదనకు గురయ్యారని.. 23 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఈ అంశంలో ప్రభుత్వం న్యాయం చేసే వరకు బీజేపీ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. ఆత్మహత్యలు చేసుకోవద్దని విద్యార్థులను కోరారు. వారం తరువాతైనా సీఎం ఈ ఘటనపై స్పందించినందుకు సంతోషం అన్నారు. ఈ ఘటనపై న్యాయ విచారణ జరిపించడానికి ప్రభుత్వం ఎందుకు భయపడుతుందని నిలదీశారు. గవర్నర్ ఈ విషయాన్ని సీరియస్‌గా పరిగణించినట్టు పేర్కొన్నారు. అశోక్ కుమార్‌ను బోర్డు కార్యదర్శి పదవి నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. దత్తాత్రేయ మాట్లాడుతూ.. ఇంటర్ ఫలితాల్లో అవకతవకలపై తామిచ్చిన ఫిర్యాదుపై గవర్నర్ స్పందన సంతృప్తికరంగా ఉందన్నారు. విద్యార్థులు ఆత్మ స్థైర్యాన్ని కోల్పోకూడదని కోరారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. డీకే అరుణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే విద్యార్థులకు ఇబ్బంది కలిగిందని విమర్శించారు. 23 మంది విద్యార్థులు ఆత్మహత్యకు చేసుకోవడం బాధకరమన్నారు. సీఎం పాలన ఫామ్‌హౌస్‌కే పరిమితమయిందని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా మంత్రిపై, బోర్డు కార్యదర్శిపై చర్యలు తీసుకోకుండా కేసీఆర్ ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. 9 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేసీఆర్‌కు ఒక్క క్షణం కూడా సీఎం కుర్చీలో కూర్చునే అర్హత లేదన్నారు. అవినీతితో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని మండిపడ్డారు. -
ఈ నెల 29న ఇంటర్ బోర్డు ముందు ధర్నా చేస్తాం
-
అవి ఆత్మహత్యలు కావు.. ప్రభుత్వ హత్యలు
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల విషయంలో గందరగోళం నెలకొనడం వల్ల పలువురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారని.. అవి ప్రభుత్వ హత్యలుగా పరిగణించాలని గవర్నర్ నరసింహన్‌ను కోరినట్లు టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. గవర్నర్‌తో భేటీ అనంతరం ఉత్తమ్ కుమార్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. రెండు విషయాలపై గవర్నర్‌కు వివరించామని తెలిపారు. కనీస పరిపాలనా సమర్థత కేసీఆర్‌కు లేదని విమర్శించారు. విద్యార్థి దశలో కీలకమైన ఇంటర్ పరీక్షల నిర్వహణలో విఫలమయ్యారని దుయ్యబట్టారు. ఇంటర్ ఫలితాల విషయంలో విద్యార్థులు విశ్వాసం కోల్పోయారని, అందుకే పెద్ద సంఖ్యలో విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని వ్యాక్యానించారు. అందరికీ న్యాయం జరిగేలా మరోసారి ఫలితాలు పున: సమీక్షించాలని కోరినట్లు తెలిపారు. హైకోర్టు సిట్టింగ్ జడ్జీతో విచారణ జరిపించాలని, కారకులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నిర్లక్ష్యంగా వ్యవహరించారు.. వెంటనే భర్తరఫ్ చేయాలని కోరినట్లు తెలిపారు. రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు కేసీఆర్ రాజ్యాంగానికి వ్యతిరేకంగా ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్లో సీఎల్పీ విలీనం అసాధ్యమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్‌తో సంబంధం లేకుండా సీఎల్పీ విలీనం సాధ్యమయ్యే పనేనా అని ప్రశ్నించారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిన కాంగ్రెస్‌ను నిన్న గాక మొన్న పుట్టిన టీఆర్ఎస్లో విలీనమా...సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. కోట్లు పెట్టి, పదవులు ఎరగా చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో రాజ్యాంగ సంక్షోభం: భట్టి గవర్నర్ ను కలిసిన అనంతరం భట్టి విక్రమార్క మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్ రాజ్యాంగాన్ని కాపాడాల్సిన తక్షణ అవసరం ఏర్పడిందని అన్నారు. రాజ్యాంగంలోని 10 షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవలని భట్టి అన్నారు. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థకే ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక పెను సవాల్ విసిరారని భట్టి అన్నారు. కేసీఆర్ ఆగడాలు నుంచి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరినట్లు ఆయన చెప్పారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై వెంటనే ఫిరాయింపు చట్టాన్ని వర్తింపచేయలని భట్టి చెప్పారు. ఫిరాయించిన ఎమ్మెల్యేలపై కావాలనే, ఉద్దేశపూర్వకంగానే స్పీకర్ చర్యలు తీసుకోవడం లేదని భట్టి ఆరోపించారు. -
నేడు కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ ధర్నా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ఇంటర్మీడియెట్ ఫలితాల్లో తీవ్ర తప్పిదాలకు పాల్పడి పదుల సంఖ్యలో విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేసేందుకు జిల్లా కాంగ్రెస్ కమిటీ పిలుపునిచ్చింది. గురువారం ఉదయం పది న్నర గంటలకు లక్డీకాపూల్‌లోని జిల్లా కలెక్టరేట్ ఎదుట కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేపడతామని డీసీసీ అధ్యక్షుడు చల్లా నర్సింహారెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌కు సంబంధించిన ఫలితాల పట్ల తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడమేగాక.. తల్లిదండ్రుల కడుపుకోతకు కారకులైన వారిని గుర్తించి తక్షణమే కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు. ఇతర పార్టీల నాయకులను తమ పార్టీలో చేర్చుకునేంత ధ్యాసను.. ఫలితాల పట్ల చూపిస్తే 20 మందికిపైగా విద్యార్థుల ప్రాణాలు నిలచేవని పేర్కొన్నారు. పాలకుల నిర్లక్ష్యం, విద్యాశాఖ తప్పిదాన్ని ఎండకట్టేందుకు ధర్నాకు కాంగ్రెస్ నేతలు, శ్రేణలు అధిక సంఖ్యలో హాజరుకావాని నర్సింహారెడ్డి పిలుపునిచ్చారు. -
నేడు కలెక్టరేట్ల ముట్టడికి కాంగ్రెస్ పిలుపు
-
ఇద్దరు ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్య
చిన్నశంకరంపేట/బొమ్మలరామారం/పరకాల: ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం విద్యార్థుల పాలిట యమపాశంగా తయారైంది. విద్యార్థుల ఆత్మహత్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 18 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోగా, తాజాగా మెదక్ జిల్లాలో ఒకరు, యాదాద్రి భువనగిరి జిల్లాలో మరొకరు బలవన్మరణానికి పాల్పడ్డారు. వరంగల్ రూరల్ జిల్లాలో ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యార్థిని పరిస్థితి విషమంగా ఉంది. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్‌కి చెందిన చాకలి రాజు(18) ఇంటర్ ఫెయిల్ అయ్యా నని చెట్టుకి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిన్నశంకరంపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన రాజు ఇంటర్ ఫస్ట్ ఇయర్లో అన్ని సబ్జెక్టులు పాసయ్యాడు. తాజాగా సెకండియర్ రిజల్ట్‌లో ఎకనమిక్స్‌లో 08 మార్కులు, సివిక్స్‌లో 27 మార్కులు మాత్రమే రావడంతో ఫెయిల్ అయ్యాడు. మనస్థాపంతో విద్యార్థిని ఆత్మహత్య యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మలరామారం మండలం నాగినేనిపల్లిలో మితి (19) అనే ఇంటర్ విద్యార్థిని ఫెయిల్ అయ్యానన్న మనస్థాపంతో ఆత్మహత్యకు పాల్పడింది. మితి బీబీనగర్ మండలంలోని ఓ ప్రైవేటు కాలేజీలో ఇంటర్ బైపీసీ రెండో ఏడాది పూర్తిచేసింది. ఇటీవల ఫలితాల్లో మితిæ జువాలజీ, కెమిస్ట్రీల్లో ఫెయిలైంది. కుటుంబ సభ్యులు నిద్రలో ఉండగా బుధవారం తెల్లవారుజామున మితి ఉరి వేసుకుంది. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం వరంగల్ రూరల్ జిల్లా శాయంపేట మండలం పత్తిపాకకు చెందిన ఐరబోయిన సింధు ఇంటర్ ఫస్టియర్‌లో బోటనీ సబ్జెక్ట్‌లో ఫెయిల్ కావడంతో బుధవా రం పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సింధు పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. -
ప్రగతిభవన్ ముట్టడిలో ఉద్రిక్తత
హైదరాబాద్: ఇంటర్ ఫలితాల్లో అక్రమాలపై సీఎం కేసీఆర్ వెంటనే స్పందించాలని, నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఎస్ఎఫ్ఐ) ఆధ్వర్యంలో చేపట్టిన ప్రగతిభవన్ ముట్టడి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ఎస్ఎఫ్ఐ విద్యార్థులు ప్లకార్డులు పట్టుకుని, ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేస్తూ ప్రగతిభవన్ ముట్టడికి రాగా.. అక్కడ భారీగా మోహరించిన పోలీసులు వారిని అడ్డుకునేందుకు యత్నించారు. విద్యార్థులు లోపలికి చొచ్చుకువెళ్లేందుకు యత్నించగా పోలీసులు, ఎస్ఎఫ్ఐ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది. 28 మంది విద్యార్థులను అరెస్టు చేసి గోషామహల్ తరలించారు. ఎస్ఎఫ్ఐ కార్యదర్శి కోటా రమేష్, రాష్ట్ర ఉపాధ్యక్షులు టి.రవిలు మాట్లాడుతూ... ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, వారికి జరిగిన అన్యాయం గురించి ఆందోళన చేస్తుంటే పోలీసులు అరెస్టు చేయడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఇప్పటికే 18 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నా ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. ప్రభుత్వ వైఖరితోనే విద్యార్థుల ఆత్మహత్యలు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని అన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, రీవాల్యుయేషన్ కల్పించాలన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలకు 50 లక్షలు నష్టపరిహారం ఇవ్వాలని, బోర్డు అధికారులపై చర్యలు చేపట్టాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. సీఎం కేసీఆర్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తునఉద్యమిస్తామని హెచ్చరించారు. -
ఇంటర్ ఫలితాలపై సీఎం సీరియస్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ ఫలితాల ప్రాసెసింగ్‌లో తలెత్తిన లోపాలపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లు తెలిసింది. 9.74 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడిఉన్న ఫలితాలను ప్రాసెస్ చేసేప్పుడు ఒకటికి రెండు, మూడుసార్లు చెక్ చేసుకోకుండా ఎలా వెల్లడిస్తారని బోర్డు కార్యదర్శి అశోక్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. సామర్థ్యంలేని సాఫ్ట్వేర్ సంస్థకు పనులను ఎలా అప్పగించారని మండిపడ్డారని సమాచారం. దీంతోపాటుగా.. ఆయన్ను రీ–వెరిఫికేషన్ కమ్ ఫొటో స్కాన్డ్ కాపీ, రీ–కౌంటింగ్, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ నుంచి తప్పించి.. ఆ బాధ్యతలను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. తక్కువ కోట్ చేశారన్న సాకుతో నిబంధనలను కూడా సరిగ్గా అమలు చేయకపోవడం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. నిబంధనల ప్రకారం ఆ సంస్థ 2017–18 విద్యాసంవత్సరంలో వార్షిక, అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల ప్రాసెసింగ్‌ను సరిగా చేసి చూపించనపుడు.. ఆ సంస్థతో ఒప్పందం ఎందుకు రద్దు చేయలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అధికారులు చేసే తప్పుల వల్ల ప్రభుత్వం బదనాం అవుతోందని, ఇలాంటి పరిస్థితి మళ్లీ పునరావృతం అయితే సహించేది లేదని సీఎం స్పష్టం చేసినట్లు సమాచారం. విద్యాసంవత్సరం ప్రారంభంలో ఆన్లైన్ ప్రవేశాలకు సంబంధించి సమస్యలు తలెత్తినపుడు సదరు సంస్థ ఒప్పందం రద్దు చేసుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదని, పైగా ఆ సంస్థ ప్రవేశాల ప్రాసెసింగ్ సరిగ్గా చేయలేదని ఆ పనులను సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ (సీజీజీ)కి అప్పగించిన సమయంలోనే.. ఆ సంస్థతో ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని ప్రశ్నించినట్లు తెలిసింది. అప్పటినుంచి హాల్‌టికెట్ల జనరేషన్, ఆన్లైన్లో ప్రాక్టికల్ మార్కుల అంశం సరిగాచేయలేని సంస్థను ఎందుకు కొనసాగించారని కేసీఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఇప్పటికైనా ఈ మొత్తం వ్యవహారం పక్కాగా జరిగేందుకు చర్యలు చేపట్టడంతోపాటు అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల తరువాత సదరు సంస్థతో ఒప్పందాన్ని రద్దు చేయాలని ఆదేశించినట్లు తెలిసింది. మరోవైపు ఆ సంస్థ చేసుకున్న ఒప్పందం, దాని ప్రకారమే పని చేసిందా? లేదా? అన్న దానిపైనా విచారణ జరిపి సమగ్ర నివేదిక అందజేయాలని ఆదేశించినట్లు తెలిసింది. విద్యార్థులకు తక్కువ మార్కులు వేయడం, పరీక్షలకు హాజరైనా గైర్హాజరైనట్లు చూపడం వంటివి సాఫ్ట్వేర్ సమస్యల కారణంగానే దొర్లినట్లు స్పష్టమైంది. మరోవైపు త్రిసభ్య కమిటీ కూడా ఈ అంశంపై మరింత లోతుగా అధ్యయనం చేసి పూర్తి స్థాయి నివేదికను ఇవ్వనుంది. ఆ తర్వాత సదరు సంస్థపై చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు తెలిసింది. ఈ నేపథ్యంలో ఇంటర్‌బోర్డు కార్యదర్శి అశోక్ సెలవుపై వెళ్లనున్నట్లు తెలిసింది. సందేహాలుంటే డీఐఈవోలను సంప్రదించండి ఆర్వీ, ఆర్సీలకు దరఖాస్తు చేసుకునే విద్యార్థులకు ఇంటర్ బోర్డు సూచన ఇంటర్ ఫలితాలకు సంబంధించి రీవాల్యుయేషన్(ఆర్వీ), రీకౌంటింగ్(ఆర్సీ) కోసం దరఖాస్తు చేయాలనుకునే విద్యార్థులు bie.telangana.gov.in వెబ్సైట్ లేదా టీఎస్ఆన్లైన్ ద్వారా ఆన్లైన్లో ఫీజు చెల్లించాలని ఇంటర్ బోర్డు బుధవారం ఓ ప్రకటనలో తెలిపింది. రీవాల్యుయేషన్‌కు రూ.600, రీకౌంటింగ్‌కు రూ.100 చొప్పున ఫీజు చెల్లించాలని తెలిపింది. మరింత సమాచారం కోసం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయాల్లో సంప్రదించాలని సూచించింది. డీఐఈవో హైదరాబాద్–9848781805, డీఐఈవో రంగారెడ్డి– 9848018284, డీఐఈవో మేడ్చల్– 9133338584 లోనూ సంప్రదించవచ్చంది -
ఆత్మహత్యలు వద్దని వేడుకుంటున్న: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలపై ఆందోళనతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడంపై సీఎం కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇంటర్మీడియట్లో ఫెయిలైనంత మాత్రాన జీవితం ఆగిపోదని, విద్యార్థులెవరూ ఆత్మహత్య చేసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నాలుగైదు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. ‘ఇంటర్మీడియట్లో ఫెయిలయ్యామనే బాధతో కొందరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధపడ్డా. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలైతే.. జీవితంలో ఫెయిలైనట్లు కాదు. ప్రాణం చాలా విలువైంది. పరీక్షల్లో ఫెయిలైనప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే మీ తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. అది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్నా’’ అని సీఎం పేర్కొన్నారు. ఈ ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరమైన సంఘటనలని సీఎం పేర్కొన్నారు. ఈ సమీక్షలో విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితోపాటు విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్మీడియట్ బోర్డు కార్యదర్శి అశోక్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సీఎంవో కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. విద్యార్థులకు ఉపశమనం కలిగించే చర్యలను వెంటనే చేపట్టాలని ఆదేశించారు. ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ చేయాలని ఆదేశించారు. పాసైన విద్యార్థులు కూడా రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకొని చేయాలని సీఎం చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని చెప్పారు. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్, అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణను పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి బి.జనార్దన్‌రెడ్డికి అప్పగించారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. తల్లిదండ్రుల అనుమానాల నివృత్తికి చర్యలు ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ–వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ–వెరిఫికేషన్ చేయాలి. రీ–కౌంటింగ్ చేయాలి. పాసైన విద్యార్థులకు కూడా రీ–వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ–వెరిఫికేషన్, రీ–కౌంటింగ్ ప్రక్రియను వీలైనంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశవ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరుకావాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా అడ్వాన్స్›డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’అని సీఎం స్పష్టమైన ఆదేశాలు జారీచేశారు. సమస్యల్లేని పరీక్షల విధానం ‘ఇంటర్మీడియట్‌తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతిసారీ తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి ఏడాదీ విద్యార్థులు, వారి తల్లిదండ్రులతోపాటు ప్రభుత్వం కూడా అనవసరంగా తలనొప్పులు భరిస్తోంది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయనం చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో ఎలా అమలు చేయగలమో ఆలోచించాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పుల్లేని పరీక్షావిధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు మొదలుపెట్టాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలెత్తుతున్న తలనొప్పులు నివారించడం కూడా అసాధ్యమేదీ కాదు’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. సాఫ్ట్వేర్ సంస్థపైనా ఆరా ఇంటర్మీయట్ విద్యార్థుల డేటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజెన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ–ప్రొక్యూర్‌మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజెన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యంపై సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ నిర్ణయం తీసుకుందని వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. -
ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, హైదరాబాద్ : తెలంగాణ ఇంటర్మీడియెట్ ఫలితాల వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పరీక్షల్లో ఫెయిలయిన విద్యార్థులందరి పేపర్లను ఉచితంగా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ చేయాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులను ఆదేశించారు. పాసయిన విద్యార్థులు కూడా రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోరుకుంటే గతంలోఉన్న పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని చేయాలని సీఎం ఆదేశాలు ఇచ్చారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించి విద్యా సంవత్సరం కోల్పోకుండా అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాలని పేర్కొన్నారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్, అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ప్రక్రియనంతా పర్యవేక్షించే బాధ్యతను విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డికి ముఖ్యమంత్రి అప్పగించారు. ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల వెల్లడి అనంతరం తలెత్తిన పరిణామాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతిభవన్‌లో సమీక్ష నిర్వహించారు. చదవండి...(ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష) ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ‘ఈ ఏడాది 9.74 లక్షల మంది విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాశారు. వారిలో 3.28 లక్షల మంది విద్యార్థులు ఫెయిలయ్యారు. మార్కులను కలిపే క్రమంలో కొన్ని తప్పులు దొర్లడం వల్ల తమకు రావాల్సిన మార్కులకన్నా తక్కువ మార్కులొచ్చి, ఫెయిలయ్యామని కొంత మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు భావిస్తున్నారు. కాబట్టి వారి అనుమానాలు నివృత్తి చేయడానికి ఫెయిలయిన విద్యార్థులకు ఉచితంగా రీ వెరిఫికేషన్ చేయించుకునే వెసులుబాటు కల్పించాలి. విద్యార్థి ఏ సబ్జెక్టులోనైతే ఫెయిలయ్యారో ఆ పేపర్‌ను రీ వెరిఫికేషన్ చేయాలి. రీ కౌంటింగ్ చేయాలి. పాసయిన విద్యార్థులకు కూడా రీ వెరిఫికేషన్ కోరుకుంటే గతంలో అనుసరించిన పద్ధతి ప్రకారమే ఫీజు తీసుకుని రీ వెరిఫికేషన్ చేయాలి. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ ప్రక్రియను వీలయినంత త్వరగా ముగించాలి. నీట్, జేఈఈ లాంటి దేశ వ్యాప్త ప్రవేశ పరీక్షలకు విద్యార్థులు హాజరు కావాల్సి ఉన్నందున వీలయింత త్వరగా అడ్వాన్సుడు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించి, ఫలితాలు వెల్లడించాలి’ అని ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ‘ఇంటర్మీడియెట్‌తో పాటు ఎంసెట్ తదితర ప్రవేశార్హత పరీక్షల విషయంలో కూడా ప్రతీసారి ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రభుత్వం, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు అనవసరంగా తలనొప్పులు భరించాల్సి వస్తున్నది. ఈ పరిస్థితిని నివారించాలి. పరీక్షల నిర్వహణను స్వతంత్ర్య సంస్థకు అప్పగించే అవకాశాలను పరిశీలించాలి. మెరుగైన పరీక్షల నిర్వహణ ఏ దేశంలో, ఏ రాష్ట్రంలో ఉందో అధ్యయన చేసి, ఆ పద్ధతులను మన రాష్ట్రంలో అమలు చేయాలి. భవిష్యత్తులో ఎలాంటి తలనొప్పులు లేని పరీక్షల విధానం తీసుకురావాలి. దీనికోసం ఇప్పటి నుంచే కసరత్తు చేయాలి. రాష్ట్రంలో ఎన్నో రుగ్మతలను నివారించగలిగాం. ఎన్నో సమస్యలను పరిష్కరించగలిగాం. అలాంటిది పరీక్షల నిర్వహణలో తలనొప్పులు నివారించడం అసాధ్యమేదీ కాదు’ అని ముఖ్యమంత్రి చెప్పారు. ఇంటర్మీయట్ విద్యార్థుల డాటా ప్రాసెస్, పరీక్షల ఫలితాల వెల్లడికి సంబంధించి బోర్డుకు సహకారం అందించే ఔట్ సోర్సింగ్ ఏజన్సీల ఎంపిక, వాటి సామర్థ్యంపై కూడా ముఖ్యమంత్రి అధికారులను అడిగారు. ఇ ప్రొక్యూర్ మెంటు ప్రక్రియ ద్వారా టెండర్లను ఆహ్వానించి, ఏజన్సీలను ఎంపిక చేశామని, తక్కువ రేటు కోట్ చేసిన సంస్థకే బాధ్యతలు అప్పగించామని అధికారులు చెప్పారు. టెండర్లు వేసిన సంస్థల సామర్థ్యాన్ని సాంకేతిక నిపుణులు, అనుభవజ్ఞులైన బోర్డు సభ్యులతో కూడిన కమిటీ మదించిందని వారు వివరించారు. టెండర్ల ప్రక్రియ, సామర్థ్యాన్ని గణించడం తదితర ప్రక్రియలన్నీ నిబంధనల ప్రకారం జరిగాయని అధికారులు వెల్లడించారు. ‘ఇంటర్మీడియట్ లో ఫెయిలయ్యామనే బాధతో కొంత మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం. ఈ వార్తలు చూసి నేను చాలా బాధ పడ్డాను. విద్యార్థుల ఆత్మహత్యలు అత్యంత దురదృష్టకరం. ఇంటర్మీడియట్ చదువు ఒక్కటే జీవితం కాదు. పరీక్షల్లో ఫెయిలయితే జీవితంలో ఫెయిలయినట్లు కాదు. ప్రాణం చాలా ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలయినప్పటికీ చదువులో, జీవితంలో ఎన్నో అవకాశాలుంటాయి. అభిరుచి, సామర్థ్యాన్ని బట్టి ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని, వృత్తులను ఎంచుకుని రాణించాలి. జీవితంలో నిలబడాలి. పిల్లలు ధైర్యంగా ఉండాలి. మీరు చనిపోతే తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగులుతుంది. వారికది ఎన్నటికీ తీరని లోటు. విద్యార్థులెవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని వేడుకుంటున్న’ అని ముఖ్యమంత్రి అన్నారు. భవిష్యత్తులో పరీక్షల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు, తలనొప్పులు లేకుండా అనుసరించాల్సిన వ్యూహం ఖరారు చేయాలని అధికారులను ఈ సందర్భంగా ముఖ్యమంత్రి ఆదేశించారు. ఈ సమీక్ష సమావేశంలో విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్థన్ రెడ్డి, బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ కార్యదర్శి డాక్టర్ అశోక్ కుమార్, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, సిఎంఓ కార్యదర్శులు రాజశేఖర్ రెడ్డి, భూపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రీ వెరిఫికేషన్ కోసం 8 కేంద్రాలు
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా గత నాలుగు రోజులుగా విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద తీవ్ర ఉద్రిక్తత కొనసాగుతోంది. విద్యార్థులు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నా బోర్డు వెబ్సైట్, యాప్ ఓపెన్ కాకపోవడంతో పలు ఇక్కట్లు పడుతున్నారు. విద్యార్థుల ఆందోళన దృష్ట్యా స్పందించిన ఇంటర్ బోర్డు రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్ కోసం హైదరాబాద్‌లో ఎనిమిది సెంటర్లను ఏర్పాటు చేసింది. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు దరఖాస్తు చేయదలిచిన విద్యార్థులు ఆన్లైన్ ద్వారా (bie.telangana.gov.in) మరియు TSONLINE ద్వారా దిగువ ఇచ్చిన కేంద్రాల్లో రీ వెరిఫికేషన్ కోసం రూ.600, రీ కౌంటింగ్‌కు రూ.100 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా ఇంటర్మీడియెఓట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మహబూబియా జూనియర్ కాలేజీ, గన్‌ఫౌండ్రి, హైదరాబాద్ ఎంఏఎం జూనియర్ కాలేజీ, నాంపల్లి హైదరాబాద్ ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కాచిగూడ, హైదరాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కాలేజీ, ఫలక్‌నుమా, హైదరాబాద్ (మొబైల్ నెంబర్: 9848781805) ప్రభుత్వ జూనియర్ కాలేజీ, హయత్ నగర్, రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, శంషాబాద్, రంగారెడ్డి జిల్లా (మొబైల్ నెంబర్: 9848018284) జిల్లా ఇంటర్మీడియోట్ విద్యా అధికారి (డీఐఈవో) కార్యాలయం, మల్కాజ్గిరి, మేడ్చల్ జిల్లా ప్రభుత్వ జూనియర్ కాలేజీ, కూకట్పల్లి, మేడ్చల్ జిల్లా మొబైల్ నెంబర్: 9133338584) -
ఇంటర్ ఫలితాల వివాదంపై కేసీఆర్ సమీక్ష
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియెట్ ఫలితాల్లో వివాదంపై ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం ప్రగతి భవన్లో ఉన్నతాస్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి విద్యాశాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్ రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ కుమార్ హాజరయ్యారు. కాగా ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 19మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా రాచకొండ కమిషనరేట్ బొమ్మల రామారం పోలీస్ స్టేషన్ పరిధిలో మరో విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. నాగినేనిపల్లిలో ఇంటర్ విద్యార్థిని మిథి ఉరేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఇంటర్ సెకండియర్‌లో రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఆమె ఈ ఘటనకు పాల్పడింది. మరోవైపు ఇవాళ కూడా ఇంటర్ బోర్డు కార్యాలయం వద్ద విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. చదవండి....(మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య) -
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, హైదరాబాద్: మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం మడూర్ గ్రామానికి చెందిన చాకలి రాజు అనే 18 ఏళ్ల విద్యార్థి.. అదే గ్రామంలోని పాఠశాలలో చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానిక ప్రభుత్వ జూనియర్ కాలేజీలో సీఈసీ గ్రూప్‌లో ఇంటర్ చదివిని రాజు...రెండు సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యాడు. దాంతో తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నాడు. సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద ఉద్రిక్తత బేగంపేట సీఎం క్యాంప్ ఆఫీస్ వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ప్రగతి భవన్ ముట్టడికి వామపక్ష విద్యార్థి సంఘం ఎస్ఎఫ్ఐ ప్రయత్నించింది. ప్రగతి భవన్ ముట్టడికి తరలివచ్చిన ఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం నేతలను, కార్యకర్తలను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేశారు. ఇంటర్ బోర్డు వైఫల్యంతో వేలాది మంది విద్యార్థులు నష్టపోయారని విద్యార్థి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాలుగో రోజూ ఆందోళనలు ఇంటర్ బోర్డ్ కార్యాలయం వద్ద వరుసగా నాలుగో రోజూ ఆందోళనలు కొనసాగుతున్నాయి. బోర్డు తప్పిదాలపై తల్లిదండ్రులతోపాటు విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తుండటంతో బోర్డ్ వద్ద భారీగా పోలీసులను మోహరించారు. పెద్ద ఎత్తున బారికేడ్లను ఏర్పాటు చేశారు. ఉద్యోగులు సైతం రావల్సిన సమయం కంటే ముందుగానే బోర్డుకి చేరుకున్నారు. అయినా, ఆందోళనలు ఆగడం లేదు. మరోవైపు పరీక్షా పత్రాల రీ వాల్యుయేషన్, మార్కుల రీకౌంటింగ్ గడువు పెంచినప్పటికీ.. విద్యార్థులకు ప్రయోజనం లేకుండా పోయింది. దరఖాస్తు చేసుకోవడానికి ఇంటర్ బోర్డు వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో ఆందోళన చెందుతున్న విద్యార్థులు.. పెద్దసంఖ్యలో ఇంటర్ బోర్డు వద్దకు క్యూ కడుతున్నారు. ఈ క్రమంలో ఇక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇంటర్ తప్పిదాలు.. విద్యార్థుల బలవన్మరణాలు ఇంటర్ ఫలితాల అవకతవకల నేపథ్యంలో పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థుల మనస్తాపంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇప్పటికే 18మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారు. తాజాగా ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి..ఇంటర్ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన జ్యోతి..ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. కాగా, వరంగల్ జిల్లా నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్ (నిన్న) మంగళవారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటర్ పరీక్షల్లో అన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో అతను రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంత జరుగుతున్నా ఇంటర్ బోర్డు కళ్లు తెరవడం లేదు. తప్పులు సరిదిద్దుకునే చర్యలు చేపట్టడం లేదు. కళ్లేదుట తప్పులు కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న విద్యార్ధుల్లో ధైర్యం నింపాల్సిన అధికారులు కూడా తమకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. దీనిపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. రేపు ఆధ్వర్యంలో కలెక్టరేట్ల ముందు కాంగ్రెస్ ధర్నా.. ఇంటర్ పరీక్షల నిర్వహణలో టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యం వల్ల 18 మంది విద్యార్థులు తమ జీవితాలను కోల్పోయారని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. డీసీసీ అధ్యక్షుల ఆధ్వర్యంలో గురువారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ల ఎదురుగా ధర్నాలు చేపట్టనున్నట్టు తెలిపారు. విద్యార్థుల పరీక్షాపత్రాలను ఉచితంగా రీవాల్యుయేషన్ చేయాలని, విద్యాశాఖ మంత్రిని బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. -
‘తెలంగాణ’ వచ్చాక అతిపెద్ద కుంభకోణం
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియట్ పరీక్షాఫలితాల్లో చోటుచేసుకున్న గందరగోళం సాధారణ విషయం కాదని, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జరిగిన అతిపెద్ద కుంభకోణాల్లో ఇది ఒకటని బీజేపీ ఆరోపించింది. దాదాపు 10 లక్షల మంది విద్యార్థుల కుటుంబాలతో చెలగాటం ఆడటాన్ని ప్రభుత్వం సాధారణ విషయంగా తీసుకుందని మండిపడింది. ఇప్పటి వరకు 16 మంది విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ప్రభుత్వం వెంటనే హైకోర్టు సిట్టింగ్ జడ్జి తో న్యాయవిచారణ జరిపించాలని డిమాండ్ చేసింది. వివిధ అంశాలపై గంటల తరబడి సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ వ్యవహారంపై ఒక్కమాట కూడా మాట్లాడకపోవటం విడ్డూరంగా ఉందని పేర్కొంది. మంగళవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలసి వినతిపత్రం అందజేసింది. అనంతరం లక్ష్మణ్ విలేకరులతో మాట్లాడారు. పది లక్షలమంది విద్యార్థులను తీవ్ర మనోవేదనకు, కొంతమంది ఆత్మహత్యలకు దారితీసిన ఈ ఉదంతాన్ని ప్రభుత్వం తేలికగా తీసుకోవటం భావ్యం కాదన్న విషయాన్ని సీఎస్ దృష్టికి తెచ్చినట్టు చెప్పారు. మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దైర్యంగా ఉండాలని, ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని లక్ష్మణ్ విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వాన్ని దారిలోకి తెచ్చేందుకు అన్ని కలెక్టరేట్ల ఎదుట బుధవారం దిష్టిబొమ్మలు దహనం చేయనున్నట్టు తెలిపారు. -
ఇంటర్ అవకతవకలు : అంతా పథకం ప్రకారమే!
సాక్షి, హైదరాబాద్: ఇంటర్మీడియెట్ బోర్డులో డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు టెండర్ కేటాయింపులో భారీగా అవకతవకలు జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూలురైన వారికి మేలు జరిగే విధంగా టెండర్ విధానాన్ని కొనసాగించినట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాధారణంగా ప్రభుత్వ విభాగాల్లో ఒక పని లేదా ప్రాజెక్టు అమలును నేరుగా ప్రైవేటు సంస్థకు అప్పగించకుండా టెండర్లు పిలిచి కాంట్రాక్టు సంస్థను ఖరారు చేస్తారు. టెండర్లు పిలిచిన సమయంలో ఆశావహ సంస్థల నుంచి బిడ్లు ఆహ్వానించి తక్కువ ధరలో కోట్ చేసే సంస్థకు ప్రాజెక్టు బాధ్యతలు అప్పగిస్తారు. ఇందుకు సంబంధించి నిపుణుల సమక్షంలో దరఖాస్తు పరిశీలన జరుగుతుంది. కానీ ఇంటర్ బోర్డు డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్ ప్రాజెక్టు అప్పగింత అంతా ఏకపక్షంగా జరిగినట్లు తెలుస్తోంది. బోర్డు ఉన్నతాధికారులు తమకు అనుకూల సంస్థకు కాంట్రాక్టు దక్కేలా వ్యూహాత్మకంగా పావులు కదిపారు. కేవలం అనుకూల సంస్థకు లబ్ధి చేకూర్చేందుకు ఏకంగా లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తుతో ఆటలాడారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టెండర్ వేసింది రెండు సంస్థలే! ఇంటర్ అడ్మిషన్లు, ప్రీ ఎగ్జామినేషన్, పోస్ట్ ఎగ్జామినేషన్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్ తదితర పనులకు ఇంటర్మీడియెట్ బోర్డు 2017 సెప్టెంబర్‌లో టెండర్లు పిలిచింది. నెల రోజులపాటు బిడ్ల దాఖలుకు అవకాశం కల్పించినప్పటికీ కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్లు వేశాయి. గడువులోగా కేవలం గ్లోబరీనా టెక్నాలజీస్, మ్యాగ్నటిక్ ఇన్ఫోటెక్ సంస్థలు మాత్రమే టెండర్లు దాఖలు చేశాయి. ఈ క్రమంలో టెండర్లు తెరిచి ఖరారు చేసే పనిలో భాగంగా ఎల్1 (లోయెస్ట్ వన్) కంపెనీగా ఉన్న గ్లోబరీనాను ప్రభుత్వం ఖరారు చేసింది. కొత్త సంస్థ అయినప్పటికీ తక్కువ మొత్తానికి కోట్ చేయడంతో ఎంపిక చేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ పేర్కొన్నారు. గ్లోబరీనా సంస్థ సేవలను ఇంటర్ బోర్డు మూడేళ్లపాటు వినియోగించుకోనుంది. అంతా పథకం ప్రకారమే... డేటా ప్రాసెసింగ్, రిజల్ట్స్ ప్రాసెసింగ్, ఓఎంఆర్ షీట్ల స్కానింగ్‌కు సంబంధించిన ప్రాజెక్టు అనుకూల సంస్థకు అప్పగించడం అంతా పథకం ప్రకారమే జరిగినట్లు తెలుస్తోంది. దాదాపు పది లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తును నిర్దేశించే భారీ ప్రాజెక్టుకు కేవలం రెండు సంస్థలు మాత్రమే టెండర్ వేయడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి. ఈ టెండర్లో పాల్గొన్న రెండు సంస్థలు ఒకే కన్సార్షియంలో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టినట్లు తెలుస్తోంది. గతంలో జేఎన్టీయూ కాకినాడలో విద్యార్థుల ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ కార్యక్రమంలో గ్లోబరీనా, మ్యాగ్న టిక్ సంస్థలు కన్సార్షియంగా ఏర్పడి ప్రాజెక్టును చేపట్టాయి. ఈ ప్రక్రియలో దాదాపు 2.5 లక్షల మంది విద్యార్థులకు సంబంధించిన ఆన్సర్ స్క్రిప్ట్స్ ఆన్లైన్ ఎవాల్యూషన్ చేసినట్లు జేఎన్టీయూ కాకినాడ సర్టిఫై చేసింది. తాజాగా ఇంటర్మీడియెట్ బోర్డుకు ఈ రెండు సంస్థలు అడపాదడపా సేవలం దిస్తున్నట్లు అధికారులు సైతంచెబుతున్నారు. మ్యా గ్నటిక్ సంస్థతో దాదాపు 13 సంవత్సరాలు కలసి పనిచేసినట్లు బోర్డు కార్యదర్శి అశోక్ స్వయంగా అంగీకరించారు. టెండర్ ప్రక్రియలో తక్కువ కోట్ చేయడంతో గ్లోబరీనాకు టెండర్ ఖరారు చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే ఈ రెండు సంస్థల కు ఉన్న అర్హతల ఆధారంగానే టెండర్ నిబంధనలు రూపొందించారనే ఆరోపణలు వస్తున్నాయి. -
మూడోరోజూ ఉద్రిక్తత
హైదరాబాద్: తోపులాటలు.. నినాదాలు... అరెస్టుల మధ్య తెలంగాణ ఇంటర్మీడియెట్ బోర్డు కార్యాలయం వద్ద మూడో రోజు కూడా ఉద్రిక్తత కొనసాగింది. ఇంటర్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలకు నిరసనగా బోర్డు ముట్టడికి విద్యార్థి సంఘాలు పిలుపునివ్వడంతో విద్యా ర్థులు, తల్లిదండ్రులు మంగళవారం ఉదయం పెద్ద ఎత్తున ఇంటర్ బోర్డు కార్యాలయం ఉన్న నాంపల్లికి చేరుకున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతోపాటు ప్రజాసంఘాల నాయకులు, రాజకీయ పార్టీల నేతలు కూడా వారికి జత కలిశారు. వారంతా బోర్డు కార్యాలయం లోపలికి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. అయితే కార్యాలయం వద్ద ఉన్న రోడ్డు పొడవునా పోలీసులు బారికేడ్లను, ముళ్ల కంచెలను అమర్చడంతోపాటు మూడంచలుగా మోహరించి ఉండటంతో ఆందోళనకారులు లోపలకు వెళ్లలేకపోయారు. దీంతో వారు రోడ్డుపైనే బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమకు న్యాయం చేయాలని ఫెయిలైన విద్యార్థులు, వారి తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. పోలీసులతో తల్లిదండ్రుల వాగ్వాదం.. ఇంటర్ బోర్డు లోపలకు వెళ్లేందుకు ఓ టీఆర్ఎస్ నేతను పోలీసులు అనుమతించడంపై విద్యా ర్థులు, తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తల్లిదండ్రుల ఆందోళనతో పోలీసులు వెనక్కి తగ్గారు. లోపలకు వెళ్లేందుకు సిద్ధమైన టీఆర్ఎస్ నేతను వెనక్కి పంపించారు. ఈ క్రమంలో తల్లిదండ్రులు, పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. అలాగే మీడియా ప్రతినిధులతోనూ పోలీసులు దురుసుగా ప్రవర్తించారు. ఇంటర్మీడియెట్ బోర్డు ఎదుట బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన ప్రొఫెసర్ కె. నాగేశ్వర్ సహా మరికొందరు ఆందోళనకారులను పోలీసులు అరెస్టు చేశారు. ట్రాఫిక్‌కు ఇబ్బంది కలగకుండా ఆందోళనకారులను అక్కడి నుంచి వాహనాల్లో బేగంబజార్, నాంపల్లి పోలీసు స్టేషన్లకు తరలించారు. అరెస్టయిన వారిలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శి రమేశ్, పీడీఎస్‌యూ నేత నాగరాజు, మాదిగ విద్యార్థి సమాఖ్య అధ్యక్షుడు ఇ. విజయ్ మాదిగ, విద్యార్థి జనసమితి (టీజేఎస్) అధ్యక్షుడు ఎన్. రమేశ్ ముదిరాజ్, టీఎన్ఎస్ఎఫ్, టీడీఎఫ్ నేతలు సాయిబాబా, బాలరాజ్ గౌడ్, మధుకర్ ఉన్నారు. ఉదయాన్నే కార్యాలయానికి బోర్డు సిబ్బంది... ఇంటర్మీడియెట్ బోర్డులో పనిచేసే సిబ్బంది ఉదయం 8 గంటలకే డ్యూటీలకు వచ్చారు. ఆందోళనకారులు రాక ముందే కార్యాలయానికి చేరుకున్నారు. మొదటి రెండు రోజుల్లో ఎదురైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని బోర్డు సిబ్బంది అంతా ఉదయాన్నే విధులకు హాజరు కావాలని బోర్డు కార్యదర్శి ఆదేశించడంతోనే వారంతా సమయంకన్నా ముందే ఆఫీసుకు చేరుకున్నట్లు తెలిసింది. ఉదయాన్నే లోపలకు వెళ్లిన ఉద్యోగులు బయటకు రావడానికి వీలు కాలేదు. సాయంత్రం 6 తరువాతే వారు ఇళ్లకు వెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. రాత్రివేళ ఉన్నతాధికారుల సమీక్ష... మంగళవారం సాయంత్రం తర్వాత ఉద్రిక్తత చల్లబడటంతో విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇంటర్ బోర్డు కార్యాలయానికి చేరుకున్నారు. ఫలితాల్లో తప్పిదాలు, గత రెండు రోజులుగా జరుగుతున్న పరిణామాలపై వారు బోర్డు కార్యదర్శితో సమీక్షించినట్లు సమాచారం. రాత్రి 8 గంటలకు మొదలైన ఈ సమావేశం రాత్రి 10 గంటల వరకు కొనసాగినట్లు తెలిసింది. ఈ సమావేశంలో రీ కౌంటింగ్, రీ వ్యాల్యుయేషన్, సప్లిమెంటరీ పరీక్షలపై వారు చర్చించినట్లు విశ్వసనీయంగా తెలియవచ్చింది. -
కొట్టొచ్చినట్టుగా నిర్లక్ష్యం
తగినంత యంత్రాంగం లేదని చెప్పొద్దు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ధి లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా? – హైకోర్టు ధర్మాసనం సాక్షి, హైదరాబాద్ : ఇంటర్మీడియట్ పరీక్షా పత్రాల మూల్యాంకనం విషయంలో ప్రభుత్వ తీరుపై హైకోర్టు తీవ్రస్థాయిలో మండిపడింది. ఈ విషయంలో నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపిస్తోందని వ్యాఖ్యానించింది. తమకు గణాంకాలతో పని లేదని, విద్యార్థుల సమస్యకు పరిష్కారం ఎలా చూపుతారో సోమవారం కల్లా స్పష్టం చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఉత్తీర్ణులు కాలేకపోయిన 3 లక్షల మంది విద్యార్థుల పత్రాలను పునర్ మూల్యాంకనం చేయడానికి ఉన్న అవకాశాలు ఏమిటో తెలియచేయాలని సూచించింది. సోమవారం ఉదయం 10.15 గంటలకల్లా పరిష్కార మార్గాలతో తమ ముందు హాజరు కావాలని విద్యాశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి, ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌లను ధర్మాసనం ఆదేశించింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ ఎ.రాజశేఖర్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇది విద్యార్థుల జీవితానికి సంబంధించిన వ్యవహారమని, ఎంత మాత్రం తేలిగ్గా తీసుకోవద్దని ప్రభుత్వానికి స్పష్టంచేసింది. ఇంటర్ పరీక్షా పత్రాల మూల్యాంకనం సక్రమంగా చేయకపోవడం వల్ల విద్యార్థులకు తీరని నష్టం జరిగిందని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఈ నేపథ్యంలో రీవాల్యుయేషన్‌కు ఆదేశించడంతోపాటు మృతి చెందిన విద్యార్థుల కుటుంబాలకు రూ.50 లక్షల చొప్పున పరిహారం చెల్లించేలా ఆదేశాలు ఇవ్వాలంటూ బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. ఈ వ్యాజ్యంపై లంచ్‌మోషన్ రూపంలో ఏసీజే నేతృత్వంలో అత్యవసరంగా విచారణ జరిపింది. ఈ సందర్భంగా పిటిషనర్ తరఫు న్యాయవాది సి.దామోదర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. ఇది చాలా తీవ్రమైన అంశమని, 16 మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని కోర్టుకు నివేదించారు. అధికారులు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ.. ఈ సమస్యపై ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసిందని తెలిపారు. కమిటీని ఎందుకు ఏర్పాటు చేశారని ధర్మాసనం ప్రశ్నించగా.. మూల్యాంకన బాధ్యతలు తీసుకున్న ఏజెన్సీ తన పని సక్రమంగా చేసిందా? లేదా? ఒప్పందం మేరకు వ్యవహరించిందా? లేదా? అన్నది కమిటీ చూస్తుందని ఆయన బదులిచ్చారు. సక్రమంగా మార్కులిచ్చారా అన్నదే ముఖ్యం.. ఇక్కడ సమస్య అది కాదని.. ప్రశ్నలు, వాటి జవాబులు, వాటికి సక్రమంగా మార్కులు ఇచ్చారా? అన్నదే ముఖ్యమని ధర్మాసనం వ్యాఖ్యానించింది. లెక్కల్లో 100కి 100 వస్తాయనుకున్న విద్యార్థికి కేవలం 60 మార్కులే వస్తే ఆ విద్యార్థి మానసిక పరిస్థితి ఎలా ఉంటుందని ప్రశ్నించింది. ఇలాంటి పరిస్థితిని అధిగమించేందుకు దిద్దిన పేపర్లను ఒకటికి రెండు సార్లు పరిశీలించే యంత్రాంగం ఉండటం తప్పనిసరని అభిప్రాయపడింది. పిటిషనర్ చెబుతున్న దాన్ని బట్టి చూస్తే, ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున తప్పులు జరిగినట్లు అర్థమవుతోందని వ్యాఖ్యానించింది. దీనికి ఏఏజీ స్పందిస్తూ.. 9.7 లక్షల మంది పరీక్షలు రాశారని, ఇందులో 3 లక్షల మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ 3 లక్షల మందిలో 22 వేల మంది రీ కౌంటింగ్‌కు, రీ వెరిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారని వివరించారు. ఈ సమయంలో పిటిషనర్ న్యాయవాది దామోదర్‌రెడ్డి జోక్యం చేసుకుంటూ.. అధికారుల తప్పదానికి విద్యార్థులు బలైపోయారని, అందువల్ల విశ్రాంత న్యాయమూర్తి చేత జ్యుడీషియల్ విచారణకు ఆదేశించాలని కోరారు. జ్యుడీషియల్ విచారణ పరిష్కారం కాదు... ఈ సమస్యకు జ్యుడీషియల్ విచారణ ఎంత మాత్రం పరిష్కారం కాదని ధర్మాసనం స్పష్టంచేసింది. ఒకవేళ విచారణకు ఆదేశిస్తే, తప్పు ఎలా జరిగింది.. ఎవరు బాధ్యులు అన్న విషయాలే తేలతాయి తప్ప.. విద్యార్థులకు న్యాయం జరిగే మార్గం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించింది. బాధ్యులను జైల్లో పెట్టినంత మాత్రాన విద్యార్థుల భవిష్యత్తకు భరోసా ఇచ్చినట్లు కాదంది. పరీక్షా పత్రాలను సక్రమంగా మూల్యాంకనం చేశారా? లేదా? ఏం తప్పులు జరిగాయి.. ఆ తప్పులను ఎలా సరిదిద్దాలి.. విద్యార్థుల భవిష్యత్తును ఎలా నిలబెట్టాలి.. అన్న అంశాలకే ప్రాధాన్యతనిచ్చి, వాటికి పరిష్కార మార్గాలను వెతకాలని అభిప్రాయపడింది. ఈ మొత్తం వ్యవహారంలో అధికారుల నిర్లక్ష్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందని, ఇందులో తమకు ఎటువంటి సందేహం లేదని పేర్కొంది. వారంలోగా పునర్ మూల్యాంకనం చేయలేరా? అంటూ ఏఏజీని ప్రశ్నించింది. పునర్ మూల్యాంకనానికి 2 నెలల సమయం పడుతుందని ఏఏజీ రామచంద్రరావు చెప్పగా.. 9 లక్షల మంది పేపర్లను మూల్యాంకనం చేయడానికి నెల రోజులు పడితే, 3 లక్షల మంది పేపర్లను పునర్ మూల్యాంకనం చేయడానికి రెండు నెలల గడువు కావాలా? అంటూ ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తంచేసింది. కనీసం పది రోజుల్లో చేయలేరా? అని ప్రశ్నించింది. మన పిల్లల పట్ల ఇలాగేనా వ్యవహరించేది? ‘‘తగినంత యంత్రాంగం లేదని చెప్పొదు. మరింత మంది సిబ్బందిని నియమించండి. సమస్య ఉందని, తప్పు జరిగిందని ఒప్పుకుంటున్నారు. అలాంటప్పుడు న్యాయం చేయాల్సిన బాధ్యత కూడా ప్రభుత్వంపై ఉంది. చేయాలన్న చిత్తశుద్ది లేదు. చేయలేమన్న భావనలో ఉన్నారు. సునామీ వస్తే బాధ్యత మాది కాదంటూ ఇలానే తప్పుకుంటారా? ఇది విద్యార్థుల జీవితాలకు సంబంధించిన విషయం. వారు మన పిల్లలు. వారి పట్ల వ్యవహరించాల్సిన తీరు ఇదేనా? వారికి భరోసా కల్పించాల్సిన బాధ్యత మనపై లేదా? వరల్డ్ ట్రేడ్ సెంటర్‌పై ఉగ్రదాడి జరిగి మంటలు చెలరేగినప్పుడు 58 ఏళ్ల అగ్నిమాపక అధికారి చూస్తూ ఉండిపోలేదు. అందరి కన్నా ముందు వెళ్లి ఆయన ప్రాణాలను పణంగా పెట్టి పౌరుల ప్రాణాలను కాపాడారు. ఇక్కడ అంత సాహసం అవసరం లేదు. మీరు నిర్వర్తించాల్సిన బాధ్యతలు నిర్వర్తించండి చాలు’’అని ధర్మాసనం ఘాటుగా వ్యాఖ్యానించింది. ఈ సమయంలో కోర్టు హాలులో ఉన్న ఇంటర్ కార్యదర్శి అశోక్ స్పందిస్తూ.. పునర్ మూల్యాంకనానికి తగినంత గడువు కావాలని కోరారు. రోజుకు 40 పత్రాలు మాత్రమే పునర్ మూల్యాంకనం అవుతాయని, ముగ్గురు ఎగ్జామినర్లు వాటిని పరిశీలించాల్సి ఉంటుందని వివరించారు. సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించాల్సి ఉందని, ఇందుకు 4వేల మంది సిబ్బంది అవసరమని చెప్పారు. దీనిపై ధర్మాసనం తీవ్ర అభ్యంతరం చెబుతూ.. తమకు ఈ గణాంకాలతో పనిలేదని, సమస్యకు పరిష్కార మార్గాలు మాత్రమే కావాలని స్పష్టం చేసింది. కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత కూడా తాము పని చేస్తున్నామని.. సుప్రీంకోర్టు అవసరమైతే అర్థరాత్రులు కూడా కేసులను విచారిస్తుందని, మీరు పిల్లల కోసం మరింత ఎక్కువ సమయం పనిచేయలేరా? అని ప్రశ్నించింది. ఏది ఏమైనా కూడా సోమవారం కల్లా పునర్ మూల్యాంకనం విషయంలో పరిష్కార మార్గాలేమిటో చెప్పాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. -
ఇంటర్ బోర్డుకు భంగపాటు
లక్షలాదిమంది విద్యార్థుల జీవితాలతో ముడిపడి ఉండే వార్షిక పరీక్షల నిర్వహణను తేలిగ్గా తీసుకుంటే ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయో ఇంటర్మీడియెట్ బోర్డుకు కనీసం ఇప్పటికైనా అర్ధమై ఉండాలి. ఫలితాల విషయంలో వస్తున్న ఫిర్యాదులపై నిజాయితీగా ఆలోచించి, తగిన చర్యలు తీసుకోవడానికి స్వచ్ఛందంగా సిద్ధపడినట్టయితే మంగళవారం తెలంగాణ హైకోర్టులో బోర్డుకు భంగపాటు ఎదురయ్యేది కాదు. కానీ బోర్డు వ్యవహారశైలి ఆదినుంచీ అందుకు భిన్నంగా ఉంది. ఫెయిలైన 3 లక్షలమంది విద్యార్థుల పరీక్ష పత్రాలను తిరిగి మూల్యాంకనం చేసే విష యంలో మీ నిర్ణయమేమిటో చెప్పాలని ధర్మాసనం ఆదేశించడం ఎందరో తల్లిదండ్రులకు ఊరటనిస్తుంది. ఫలితాలు వెల్లడైనప్పటినుంచి తెలంగాణ రాష్ట్రంలో విద్యార్థిలోకం అట్టుడుకు తోంది. తల్లిదండ్రులు తల్లడిల్లుతున్నారు. కానీ బోర్డు తన నిర్వాకాన్ని సరిదిద్దుకోవడానికి ముందుకు రాలేదు సరిగదా వింత తర్కాలకూ, విచిత్ర వాదనలకూ దిగింది. ఒకపక్క తాము ఫెయి లయ్యామన్న ఆవేదనతో రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 18మంది విద్యార్థులు ప్రాణాలు తీసుకున్నారు. ఎంతో బాగా రాసినా ఫెయిలయ్యామని కొందరు, అనుకున్నవిధంగా మార్కులు రాలేదని మరి కొందరు మనస్తాపం చెంది కన్నీరుమున్నీరవుతున్నారు. నిద్రాహారాలకు దూరమయ్యారు. వారి నెలా సముదాయించాలో, ఎలా సర్దిచెప్పాలో తెలియక... వారి భవిష్యత్తు ఏమవుతుందో తోచక తల్లిదండ్రులు ఆందోళనపడుతున్నారు. బోర్డు సారథులు మాత్రం ఇదంతా సాధారణమేనని మాట్లాడుతున్నారు. ఇంతకన్నా అన్యాయం మరేమైనా ఉంటుందా?! సోమవారం విలేకరులతో మాట్లాడిన బోర్డు కార్యదర్శి అశోక్ వివరణనిచ్చిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. మూల్యాంకనం పారదర్శకంగా, ప్రామాణికంగా జరిగిందని... ఫలితాలు కూడా సక్ర మంగానే ఉన్నాయని ఆయన చెప్పిన మాటలు తల్లిదండ్రుల ఆందోళనను మరింత పెంచాయి. మార్కులు సరిగా రాలేదని భావించినవారు ఎప్పటిలాగే పునఃపరిశీలనకూ లేదా లెక్కింపునకూ దరఖాస్తు చేసుకోవాలని ఆయన సలహా ఇచ్చారు. ఈ దరఖాస్తులకు ఎలాంటి రుసుమూ వసూలు చేయదల్చుకోకపోతే వేరు. ఒక్కో సబ్జెక్టుకు పునఃపరిశీలనకైతే రూ. 600, తిరిగి లెక్కించడానికైతే రూ. 100 చొప్పున విద్యార్థి చెల్లించాల్సి ఉంటుంది. ఇప్పుడు ఫెయిలైనట్టు ఫలితం వచ్చిన 3 లక్షలమంది విద్యార్థుల్లో ఎందరు ఈ స్థాయి ఫీజుల్ని భరించగలరు? ఒక్కో పేపర్‌కు రూ. 600 చొప్పున చెల్లించాలంటే ఎన్ని వేల రూపాయలు అవసరమవుతాయో బోర్డు సారథులు ఆలోచిం చారా? సాధారణ పరిస్థితుల్లో అయితే ఈ నిబంధనలను ఎవరూ తప్పుబట్టరు. కానీ ఈసారి జరిగింది వేరు. సాఫ్ట్వేర్ కారణంగానో, మూల్యాంకనం సక్రమంగా లేకపోవడం వల్లనో, ఇతర అవకతవకల కారణంగానో ఫలితాల్లో తప్పిదాలు దొర్లాయని, అందువల్ల లక్షలమంది విద్యార్థుల ఫలితాలు తారుమారయ్యాయని ఆరోపణలొచ్చాయి. అందులో వాస్తవం ఉన్నదని భావించడానికి అనేక ఉదాహరణలు కనబడుతున్నాయి. అరబిక్ సబ్జెక్టులు రాసిన ఒకరికి ఉర్దూ సబ్జెక్టుల్లో సున్నా మార్కులొచ్చాయి. తెలుగులో సున్నా మార్కులొచ్చిన ఒక విద్యార్థినికి రీవాల్యుయేషన్ తర్వాత 99 మార్కులొచ్చాయి. 810 మార్కులొచ్చిన ఒక విద్యార్థికి గణితంలో కేవలం 17 మార్కులే వచ్చినట్టు చూపడం, కొందరు విద్యార్థులైతే పరీక్షకు గైర్హాజరైనట్టు చూపడం వంటివి ఎన్నో ఉన్నాయి. మీడియా దృష్టికి ఇంకా రాని అవకతవకలు మరెన్ని ఉన్నాయో ఊహించలేం. ఇలాంటి పరిస్థితుల్లో బోర్డు జరిగిన లోపాలను నిజాయితీగా అంగీకరించి ఫెయిలైనవారి పరీక్ష పత్రాలు మళ్లీ దిద్దించ డానికి స్వచ్ఛందంగా ముందుకొస్తే విద్యార్థుల ఆందోళన సద్దుమణిగేది. అది లేకపోబట్టే ఉన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. బోర్డుకు సాంకేతిక సేవలు అందించడానికి ఒప్పందం కుదుర్చుకున్న గ్లోబరీనా సంస్థకు ఈ విషయంలో కనీస స్థాయి అనుభవమైనా లేదని వస్తున్న ఆరోపణలు ఆందోళన కలిగిస్తాయి. అడ్మి షన్లు మొదలుకొని పరీక్షా ఫలితాలు ఇచ్చేవరకూ అన్ని దశల్లోనూ అవసరమైన సాంకేతికతను సమ కూర్చవలసిన సంస్థ ప్రారంభంలోనే సమస్యల్లో కూరుకుపోయి అయోమయానికి లోనైందని చెబు తున్నారు. ఫలితంగా అడ్మిషన్ల ప్రక్రియలో జాప్యం చోటుచేసుకోవడంవల్ల ఎన్నో ఇబ్బందులు తలె త్తాయి. ఆ తర్వాత విద్యార్థులు ఎంపిక చేసుకున్న సబ్జెక్టులకు సంబంధించి కూడా గందరగోళం తప్పలేదు. మొదట్లోనే బోర్డు అధికారులు మేల్కొని ఆ సంస్థను పక్కనపెట్టకపోవడం పర్యవసా నంగా పరీక్షల సమయానికి, చివరకు ఫలితాల ప్రకటనలో సమస్యలు తలెత్తాయి. లక్షలాదిమంది విద్యార్థుల బంగారు భవిష్యత్తుతో ముడిపడి ఉండే అత్యంత కీలకమైన ప్రక్రియను ప్రైవేటు సంస్థ లకు కట్టబెట్టడం ఎన్ని ప్రమాదాలకు దారితీస్తుందో గుర్తించలేకపోవడం బోర్డు సారథుల తప్పిదం. ఏడాదిక్రితం తొలి దశలో గందరగోళం తలెత్తినప్పుడే దాన్ని పక్కనబెడితే బాగుండేది. ఆందోళనలు తలెత్తినప్పుడు అవి కట్టుదాటకుండా చూడటం పోలీసుల బాధ్యత. కానీ ఇంటర్ బోర్డు ముందు జరిగిన ఆందోళనల విషయంలో వారి తీరు సమర్థనీయం కాదు. తమకు అన్యాయం జరిగిందని అక్కడికి చేరుకున్న పిల్లలు, వారి తల్లిదండ్రుల విషయంలో పోలీసులు అమానుషంగా వ్యవహరించారు. ఏబీవీపీ నాయకుడు అయ్యప్పకు సంకెళ్లు వేశారు. ఆఖరికి మీడియాతో కూడా వాగ్వివాదానికి దిగారు. అసలు మూడురోజులుగా బోర్డు కార్యాలయానికి వస్తున్న విద్యార్థులకూ, వారి తల్లిదండ్రులకూ తగిన జవాబిచ్చి సముదాయించమని ప్రభుత్వం సలహా ఇచ్చి ఉంటే వివాదం ఇంతగా ముదిరేది కాదు. ఇప్పుడు న్యాయస్థానం జోక్యంతోనైనా పరి స్థితులు చక్కబడతాయని ఆశించాలి. ఎటూ సమస్య వచ్చింది కనుక మొత్తంగా ఇంటర్మీడియెట్ విద్యావ్యవస్థను ప్రక్షాళన చేసి, విద్యార్థులకు భవిష్యత్తులో ఏ సమస్యా ఎదురుకాని విధంగా, బోర్డు ప్రతిష్ట పెరిగేవిధంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం పూనుకోవాలి. -
మరో ఇంటర్ విద్యార్థిని బలవన్మరణం
సాక్షి, చేవెళ్ళ : ఇంటర్ బోర్డు తప్పిదాలకు మరో విద్యార్థిని బలవన్మరణానికి పాల్పడింది. షాబాద్ మండలం తిరుమలాపూర్‌కు చెందిన జ్యోతి అనే విద్యార్థిని చేవెళ్ళలోని వివేకానంద జూనియర్ కాలేజీలో సీఈసీ రెండో సంవత్సరం చదువుతోంది. తాజాగా విడుదలైన ఇంటర్ ఫలితాల్లో సెకండియర్ సివిక్స్ పరీక్షలో ఫెయిల్ అయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన విద్యార్థిని మంగళవారం సాయంత్రం ఒంటికి నిప్పంటించుకుంది. తీవ్ర గాయాలపాలైన జ్యోతిని ఉస్మానియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూసింది. ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్‌పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపాల్సిన చర్యలు కానరాకపోవడం బాధకరం. (అందుకు పది రోజుల సరిపోతుంది కదా : హైకోర్టు) -
రెండో రోజు ఇంటర్ బోర్డ్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
-
మరో ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య
సాక్షి, వరంగల్: తెలంగాణ వ్యాప్తంగా ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతుంది. ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించిన ఫలితాల్లో తప్పిదాలు విద్యార్థుల పాలిట శాపంగా మారాయి. తాజాగా వరంగల్ రూరల్ జిల్లాలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మంగళవారం నెక్కొండ రైల్వేస్టేషన్ సమీపంలో రైలు కింద పడి తనువు చాలించారు. మృతున్ని నెక్కొండ మండలం రెడ్లవాడకు చెందిన నవీన్‌గా గుర్తించారు. ఇంటర్ మొదటి సంవత్సరంలో అన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యాననే మనస్తాపంతో నవీన్ ఆత్మహత్యకు పాల్పడట్టుగా తెలుస్తోంది. ఫలితాల్లో అవకతవకల కారణంగా ఇప్పటికే పలువురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఇంటర్ బోర్డు తప్పిదాలు కళ్లేదుట కనబడుతున్న బోర్డు పెద్దలు ఆ తప్పును అంగీకరించడం లేదు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు, రాజకీయ పార్టీల నాయకులు, సామాజిక కార్యకర్తలు ఇంటర్ బోర్డు ఎదుట పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతున్న వారి నుంచి స్పష్టమైన హామీ లభించడం లేదు. పైగా న్యాయం కోసం పోరాడుతున్న వారిపై పోలీసులు దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇంటర్ బోర్డు వ్యవహారంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఫలితాల్లో ఫెయిలైన 3 లక్షల మంది విద్యార్థుల పేపర్ రీ వాల్యువేషన్‌పై ఇంటర్ బోర్డు తన నిర్ణయం తెలిపాలని ఆదేశించింది. అయితే విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతున్న ఇటువంటి పరిస్థితుల్లో వారిలో ధైర్యం నింపాల్సిన చర్యలు కానరాకపోవడం బాధకరం. -
‘గంటలు గంటలు సమీక్షలు చేసే సీఎం ఎక్కడా..?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల వెల్లడిలో చోటుచేసుకున్న తప్పిదాలు, ఇంటర్ బోర్డు అవకతవకలపై బీజేపీ రాష్ట్రాధ్యక్షుడు కె.లక్ష్మణ్ మండిపడ్డారు. ఇంటర్ ఫలితాల గందరగోళంపై మంగళవారం ఆయన సీఎస్‌ను కలిశారు. టీఆర్ఎస్ ప్రభుత్వ వైఫల్యాన్ని సీఎస్ దృష్టికి తీసుకొచ్చారు. పరీక్షల్లో తప్పామనే మనోవేదనతో 16 మంది విద్యార్థులు బలవన్మరణానికి పాల్పడ్డారని లక్ష్మణ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘటనలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల మధ్య గొడవ అని మంత్రి, మాస్ హిస్టీరియాతో ఫలితాల్లో గందరగోళం నెలకొందని ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్ మాట్లాడటం సిగ్గుచేటని అన్నారు. గంటలు గంటలు సమీక్షలు చేసే ముఖ్యమంత్రి కేసీఆర్ దీనిపై ఎందుకు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను వదిలేసి గ్లోబరీనా అనే సంస్థకు ఇంటర్ ఫలితాల బాధ్యత ఎలా అప్పగించారని ప్రశ్నించారు. వీటన్నిటిపై న్యాయ విచారణ జరగాలని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం.. ఫలితాలు తారుమారైన పిల్లల తల్లిదండ్రులు నిరసన తెలుపుతుంటే నిర్బంధిస్తున్నారని లక్ష్మణ్ ఆగ్రహం చేశారు. పోలీస్ జులుంతో బీజేపీ కార్యకర్తలను చితకబాదారని ఆరోపించారు. ఇప్పటికే ఎంఎసెట్ మూడుసార్లు నిర్వహించారని, గ్రూప్ 2 వాయిదా వేశారని విమర్శలు గుప్పించారు. విద్యావ్యవస్థను టీఆర్ఎస్ ప్రభుత్వం పూర్తిగా నిర్వీర్యం చేసిందని ధ్వజమెత్తారు. విద్యార్థులు తొందరపాటు చర్యలకు దిగొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బీజేపీ వారికి అండగా ఉంటుందని వెల్లడించారు. ప్రభుత్వం మెడలు వంచుతామని అన్నారు. ఇంటర్ బోర్డు వైఫల్యం, గ్లోబరీనా సంస్థ అవకతవకలు, ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై రేపటి నుంచి నిరసన కార్యక్రమాలు చేపడుతామని లక్ష్మణ్ తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్ల ముందు దిష్టి బొమ్మలు దగ్దం చేస్తామని చెప్పారు.