సాక్షి, హైదరాబాద్:ఇంటర్ ఫలితాల వెల్లడిలో ప్రభుత్వ తప్పిదం కారణంగా ఆత్మహత్యలకు పాల్పడిన కుటుంబాలను ఆదుకోవడంలో సర్కార్ విఫలమైందంటూ భారత జాతీయ విద్యార్థి సంఘం (ఎన్‌ఎస్‌యూఐ) అసెంబ్లీ ముట్టడికి యత్నించింది. ఈ సందర్భంగా వెంకట్రావు మాట్లాడుతూ.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలు, ఫలితాల వెల్లడిలో తప్పులకు కారణమైన వారిపై చర్యల విషయంలో అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టత వస్తుందని ఎదురుచూశామని, కానీ ప్రభుత్వం ఆ ఊసే ఎత్తకపోవడం దురదృష్టకరమని పేర్కొన్నారు. ఇంటర్ ఫలితాల్లో తప్పిదాల బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment