
సాక్షి, హైదరాబాద్: నగరంలో విషాదం చోటుచేసుకుంది. గాంధీనగర్‌లో ఇన్‌కంట్యాక్స్ ఆఫీసర్ జయలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడ్డారు. సీజీవో టవర్స్‌పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నారు. భవనంపై నుంచి దూకి.. దీంతో తీవ్ర గాయాలతో పడివున్న ఆమెను స్థానికులు గుర్తించి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు.
చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు సమాచారం. జయలక్ష్మి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అనారోగ్య కారణాల వల్లనే ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.