income tax officer
-
ఐటీ అధికారుల పేరుతో ఫేక్ కాల్స్
-
ఆదాయపు పన్ను శాఖ పనితీరుపై స్పందించిన నటుడు మాధవన్
ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుచేసిన మూడు వారాల్లోనే తనకు నగదు రీఫండ్ అయిందని నటుడు మాధవన్ అన్నారు. తన సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ ఎక్స్‌లో ఆదాయపు పన్ను శాఖ పనితీరును ప్రశంసించారు. మాధవన్‌కు చెందిన ల్యూకోస్ ఫిల్మ్స్ కంపెనీ ఇటీవల ఆదాయపు పన్ను రిటర్న్న్ దాఖలు చేసింది. ఎలాంటి చిక్కులు లేకుండా మూడు వారాల్లోనే ఆదాయపు పన్ను శాఖ నుంచి రీఫండ్ పొందడంతో ఆయన స్పందించారు. అక్టోబర్ 31 వరకు రికార్డు స్థాయిలో 7.85 కోట్ల ఐటీఆర్‌లు దాఖలయ్యాయని ఆదాయపు పన్ను శాఖ ఇటీవల తెలిపింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో దాఖలు చేసిన మొత్తం 7.78 కోట్ల ఐటీఆర్‌లతో పోలిస్తే ఇదే ఆల్ టైమ్ హై అని ఐటీ శాఖ చెప్పింది. The income tax refund for our company was received within 3 weeks after filing of return for AY 2023-24. The speed and promptness is simply unheard of ..The efficiency and transparency of the income tax department is unbelievable. Totally impressed and flabbergasted .… — Ranganathan Madhavan (@ActorMadhavan) November 13, 2023 -
హైదరాబాద్ ఇన్కమ్ టాక్స్ టవర్స్‌కు బాంబు కాల్
నాంపల్లి: ఏసీ గార్డ్స్‌లోని ఆదాయపు పన్ను శాఖ కార్యాలయం (ఐటీ టవర్స్)కు సోమవారం బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వచ్చింది. ఐటీ టవర్స్‌ను కాసేపట్లో పేల్చేస్తామంటూ ఫోన్ చేసి గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. సోమవారం మధ్యాహ్నం 12.50 గంటలకు డయల్ 100కు ఫోన్ కాల్ వచ్చింది. మెయిన్ కంట్రోల్ విభాగం సిబ్బంది వెంటనే నాంపల్లి పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు ఉద్యోగులందరినీ బయటకు పంపించారు. అనంతరం ఐటీ టవర్స్‌ను పూర్తిగా బాంబు స్క్వాడ్‌తో తనిఖీ చేశారు. టవర్స్‌లోని అన్ని అంతస్తులను క్షుణ్ణంగా సోదాలు చేశారు. ఎక్కడా బాంబు లేదని, ఫోన్ కాల్ ఫేక్ అని తేలడంతో ఊపిరిపీల్చుకున్నారు. -
తమిళనాడులో ఐటీ శాఖకు చేదు అనుభవం..
-
సాధారణ తనిఖీల్లో భాగంగానే ఐటీ అధికారులు వచ్చారు : దేవినేని అవినాష్
-
ఐటీ కార్యాలయంలో మరోసారి విచారణకు హాజరైన భద్రారెడ్డి
-
నేడు ఐటీ అధికారుల ఎదుట హాజరుకానున్న మంత్రి మల్లారెడ్డి
-
మల్లారెడ్డి వర్సెస్ ఐటీ శాఖ.. కంచికి చేరని ల్యాప్‌టాప్ కథ!
సాక్షి, హైదరాబాద్/దుండిగల్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి వర్సెస్ ఆదాయపు పన్ను శాఖ డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఎపిసోడ్లో బోయిన్పల్లి ఠాణాకు చేరిన ల్యాప్‌టాప్ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. గురువారం తెల్లవారుజామున నాటకీయ పరిణామాల మధ్య పోలీసుస్టేషన్ వద్ద లభించిన ల్యాప్‌టాప్‌ను పోలీసులు తమ అధీనంలోనే ఉంచుకున్నారు. అది రత్నాకర్దన్న ఉద్దేశంతో ఐటీ అధికారులకు చూపించినా వారు నోరు మెదపకపోవడంతో కోర్టు అనుమతితో ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి (ఎఫ్ఎస్ఎల్) పంపాలని యోచిస్తున్నారు. మల్లారెడ్డి సహా ఆయన కుటుంబీకులు, బంధువులు, సన్నిహితుల ఇళ్లలో ఐటీ అధికారులు సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. దీనికి సంబంధించిన పంచనామాపై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డితో అధికారులు సంతకం చేయించుకోవడంతో వివాదం మొదలైంది. దీనిపై మల్లారెడ్డి గురువారం రాత్రి బోయిన్పల్లి ఠాణాలో రత్నాకర్‌పై ఫిర్యాదు చేశారు. రెండు గంటల తర్వాత రత్నాకర్ కూడా అదే పీఎస్‌లో మరో ఫిర్యాదు ఇచ్చారు. ఆస్ప త్రి వద్ద తనను అడ్డుకున్న మల్లారెడ్డి తదితరులు ల్యాప్‌టాప్ లాక్కున్నారని అందులో పేర్కొన్నారు. ఎఫ్ఎస్ఎల్కు పంపే యోచనలో పోలీసులు మల్లారెడ్డి, రత్నాకర్ ఫిర్యాదులతో నమోదైన కేసులను దుండిగల్ ఠాణాకు బదిలీ చేసినా ల్యాప్‌టాప్ మాత్రం బోయిన్పల్లి ఠాణాలోనే ఉండిపోయింది. అది ఐటీ అధికారి రత్నాకర్ వ్యక్తిగత ల్యాప్‌టాప్‌గా భావిస్తున్నప్పటికీ ఆయన సహా ఎవరూ ధ్రువీకరించట్లేదు. తొలుత అది ఎక్కడ నుంచి? ఎలా వచ్చిందో తేలిస్తేనే మిగతా విషయాలు చెప్తామంటూ ఐటీ అధికారులు స్పష్టం చేస్తున్నారు. తామే ఆ ల్యాప్‌టాప్ ఆన్ చేసి ఎవరిదో చూద్దామని పోలీసులు మొదట భావించినా.. అలా చేస్తే డేటాకు సంబంధించిన వివాదం తలెత్తే ప్రమాదం ఉందని మిన్నకుండిపోయారు. ఈ నేపథ్యంలోనే కోర్టు అనుమతితో సదరు ల్యాప్‌టాప్‌ను ఎఫ్ఎస్ఎల్కు పంపి తెరిపించాలని యోచిస్తున్నారు. సమీప సీసీ కెమెరాల్లోని ఫీడ్‌ను పరిశీలిస్తున్నామని, కానీ ల్యాప్‌టాప్‌ను అక్కడ ఎవరు పెట్టారనేది ఇప్పటికీ స్పష్టంగా తెలియట్లేదని బోయిన్పల్లి పోలీసులు చెప్పారు. కాగా, మంత్రి మల్లారెడ్డి, ఐటీ అధికారి రత్నాకర్ ఫిర్యాదులకు సంబంధించిన రెండు కేసులు దుండిగల్ పోలీస్ స్టేషన్‌కు బదిలీ అయ్యాయి. దీంతో ఇక్కడ కేసులు నమోదు చేసిన దుండిగల్ పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. రాత్రంతా నాటకీయ పరిణామాలు రెండు ఫిర్యాదులు పోలీసుల వద్ద ఉండగానే నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. అప్పటికే బోయిన్పల్లి ఠాణా కేంద్ర బలగాల అ«దీనంలోకి వెళ్లిపోయింది. ఆ సందర్భంలో కొందరు వ్యక్తులు కారులో వచ్చి ఓల్యాప్టాప్ను ఠాణాలో అప్పగించాలని చూశారు. అది సాధ్యం కాకపోవడంతో వాళ్లు వెళ్లిపోయారు. కొద్దిసేపటి తర్వాత మరో యువకుడు ద్విచక్ర వాహనంపై తీసుకువచ్చాడు. అప్పటికే ఠాణా గేట్లకు తాళాలు పడ్డాయి. సదరు యువకుడు ల్యాప్‌టాప్‌ను పోలీసులకు ఇవ్వాలని ప్రయత్నించాడు. వారు విముఖత చూపడంతో గేటు వద్ద పెట్టేసి వెళ్లిపోయాడు. ఈ తతంగం మొత్తం ఐటీ అధికారులు తమ ఫోన్లలో రికార్డు చేశారు. రోడ్డుపై వదిలేసిన ల్యాప్‌టాప్‌ను ఠాణాలోకి తీసుకువెళ్లిన పోలీసులు దాన్ని ఐటీ అధికారులకు చూపించారు. అది ఎవరిదన్న విష యం పక్కన పెట్టాలని, అసలు ఠాణాకు ఎలా వచి్చందో తేల్చాలని ఐటీ అధికారులు పట్టుబట్టారు. దీంతో పంచనామా నిర్వహించిన పోలీ సులు ల్యాప్‌టాప్‌ను ఠాణాలో భద్రపరిచారు. ఇదీ చదవండి: ముందస్తు మేఘాలు! అభివృద్ధి, సంక్షేమ పథకాలపై సీఎం కేసీఆర్ దృష్టి -
Malla Reddy: మల్లారెడ్డి ఇంటిపై ఐడీ దాడుల్లో కొత్త ట్విస్ట్..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుటుంబసభ్యులు, బంధువులు, భాగస్వాములపై జరిగిన ఐటీ దాడుల అంశంలో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటీ శాఖ డిప్యూటీ డైరెక్టర్ సీఎండీ రత్నాకర్ పంచనామాపై తన అన్న మహేందర్‌రెడ్డితో బలవంతంగా సంతకం పెట్టించుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు భద్రారెడ్డి బోయిన్పల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు రత్నాకర్ కూడా ఫిర్యాదు చేశారు. మంత్రి తన విధులు అడ్డుకోవడంతో పాటు కీలక పత్రాలు ధ్వంసం చేశారని ఆరోపించారు. ఈ మేరకు కేసులు నమోదు చేసుకున్న బోయిన్పల్లి పోలీసులు తదుపరి దర్యాప్తు నిమిత్తం దుండిగల్ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. నా అన్నను బెదిరించారు.. మంత్రి మల్లారెడ్డి పెద్ద కుమారుడు మహేందర్‌రెడ్డి ఐటీ సోదాల నేపథ్యంలో అస్వస్థతకు గురై మల్లారెడ్డి నారాయణ ఆస్పత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా బుధవారం రాత్రితో మహేందర్‌రెడ్డి ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు పూర్తి చేసిన అధికారులు దానికి సంబంధించిన పంచనామా రూపొందించారు. దీనిపై సంతకం చేయించుకోవడానికి డిప్యూటీ డైరెక్టర్ రత్నాకర్ ఆస్పత్రికి వెళ్లారు. అయితే గుండె నొప్పితో చికిత్స పొందుతున్న తన అన్న మహేందర్‌రెడ్డిని బెదిరించి, బలవంతంగా వాటిపై సంతకాలు తీసుకున్నారంటూ మల్లారెడ్డి చిన్న కుమారుడు, సీఎంఆర్ ఎడ్యుకేషనల్ సొసైటీ, మల్లారెడ్డి సొసైటీల అధ్యక్షుడు భద్రారెడ్డి బుధవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1.30 గంటల సమయంలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు రత్నాకర్‌పై ఐపీసీలోని 384 సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. మరోవైపు రూ.100 కోట్ల డొనేషన్లకు సంబంధిత పత్రాలపై కూడా ఐటీ అధికారులు మహేందర్‌రెడ్డి సంతకాలు తీసుకున్నట్టు సమాచారం. కాగా తమ వద్ద రూ.100 కోట్లు లేవని, మేనేజ్మెంట్ కోటా లేనప్పుడు డొనేషన్ ఎలా ఇస్తారని మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడుతూ ప్రశ్నించారు. చదవండి: Hyderabad: ట్రాఫిక్ చిక్కులకు చెక్.. ఐటీ కారిడార్‌లో ఇక రయ్ రయ్! ల్యాప్‌టాప్, హార్డ్‌డ్రైవ్‌లు ఉన్న బ్యాగులు దొంగిలించారు.. ఇలావుండగా.. తాను పంచనామాపై సంతకం చేయించుకోవడానికి ఆస్పత్రికి వెళ్లినప్పుడు అక్కడకు తన అనుచరులతో కలిసి వచ్చిన మంత్రి మల్లారెడ్డి తన విధులకు ఆటంకం కలిగించారంటూ రత్నాకర్ గురువారం తెల్లవారుజామున 3.40 గంటలకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పంచనామా సహా కొన్ని పత్రాలు చించేశారని, అసభ్య పదజాలంతో దూషించడంతో పాటు బెదిరించారని పేర్కొన్నారు. ల్యాప్‌టాప్, హార్డ్ డ్రైవ్స్‌తో ఉన్న తన రెండు బ్యాగులు కూడా దొంగిలించారని ఆరోపించారు. ఈ ఫిర్యాదు ఆధారంగా బోయిన్పల్లి పోలీసులు మల్లారెడ్డి తదితరులపై ఐపీసీలోని 342, 353, 201, 504, 506, 379 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ రెండు ఉదంతాలు చోటు చేసుకున్న మల్లారెడ్డి ఆస్పత్రి దుండిగల్ పోలీసుస్టేషన్ పరిధిలోకి వస్తుంది. దీంతో జీరో ఎఫ్ఐఆర్లు నమోదు చేసిన అధికారులు తదుపరి దర్యాప్తు నిమిత్తం ఆ ఠాణాకు బదిలీ చేశారు. ఠాణా గేటు వద్ద ప్రత్యక్షమైన ల్యాప్‌టాప్! ఈ 2 కేసులు నమోదైన కొద్దిసేపటికే ఓ ల్యాప్‌టాప్ నాటకీయంగా బోయిన్పల్లి పోలీసుస్టేషన్ వద్ద ప్రత్యక్షమైంది. రత్నాకర్ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు ప్రాథమిక విచారణ చేపట్టారు. ఆయన ల్యాప్‌టాప్ సహా ఇతర వస్తువులు మల్లారెడ్డి ఇంట్లో ఉన్నాయా? ఎవరైనా తీసుకున్నారా? తదితర అంశాలు ఆరా తీశారు. ఈ నేపథ్యంలో గురువారం తెల్లవారుజామున 4.15 గంటల ప్రాంతంలో ఓ ల్యాప్‌టాప్ బోయిన్పల్లి పోలీసుస్టేషన్ గేటు వద్ద ప్రహరీని ఆనుకుని ఉండటం కానిస్టేబుళ్ల కంటపడింది. దీంతో వారు దాన్ని రత్నాకర్‌కు చూపించగా.. ఆ ల్యాప్‌టాప్ తనది కాదని, దాన్ని ఎవరో మార్చేశారని అన్నారు. దీంతో దాని పంచనామా నిర్వహించిన సిబ్బంది దుండిగల్ పోలీసులకు అప్పగించాలని నిర్ణయించారు. -
మేం తప్పుడు పనులు చేయలేదు
-
వీళ్లు ఐటీ అధికారులు కాదు.. రక్త పిశాచులు : మల్లారెడ్డి
-
నెల్లూరులో నకిలీ అధికారుల కలకలం
-
గుట్టుచప్పుడు కాకుండా రూ. కోట్ల నగదు, బంగారం తరలింపు
జగ్గంపేట: రిజర్వ్ బ్యాంక్ నిబంధనలను తుంగలోకి తొక్కి, పన్నులను ఎగ్గొడుతూ రూ.కోట్ల నగదు, బంగారాన్ని ప్రైవేటు బస్సులలో గుట్టుచప్పుడు కాకుండా తరలిస్తున్న ఘటనలపై కస్టమ్స్, జీఎస్టీ, ఆదాయ పన్ను శాఖల అధికారులు అప్రమత్తమయ్యారు. తూర్పు గోదావరి జిల్లా కిర్లంపూడి మండలం కృష్ణవరం టోల్గేట్ వద్ద శుక్రవారం పోలీసు అధికారుల తనిఖీలో ఈ దందా వెలుగు చూసిన సంగతి విదితమే. దీనిపై కస్టమ్స్, జీఎస్టీ, ఐటీ అధికారులు జగ్గంపేట సీఐ సూర్యఅప్పారావును శనివారం కలిసి వివరాలు సేకరించారు. అనంతరం 10 కేజీల బంగారాన్ని విజయవాడ నుంచి విశాఖ తరలిస్తున్న పద్మావతి ట్రావెల్స్ బస్సు డ్రైవర్ వెంకటేశ్వరరావును, టెక్కలి నుంచి విజయవాడ వైపు రూ.5.65 కోట్ల నగదు తరలింపులో పట్టుబడిన బస్సు డ్రైవర్ సుదర్శనరావును విచారించారు. విజయవాడలో రామవరప్పాడు వద్ద బంగారం ఎవరిచ్చారు, విశాఖలో ఎవరికి అందజేయమన్నారనే వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ విధంగా బంగారం, నగదు అక్రమ రవాణా పద్మావతి ట్రావెల్స్‌లోనే జరుగుతోందా, ఇతర ప్రైవేటు ట్రావెల్స్‌లో కూడా జరుగుతోందా అనే అంశంపైనా దృష్టి సారించారు. కాగా, కృష్ణవరం టోల్‌ప్లాజా వద్ద పట్టుబడిన రూ.5.65 కోట్ల నగదు, సుమారు 10 కేజీల బంగారాన్ని రాజమహేంద్రవరంలోని ట్రెజరీలో జమ చేసినట్లు సీఐ చెప్పారు. (చదవండి: సంచలనం రేపిన ప్రణయ్ హత్య కేసులోని నిందితుడికి హార్ట్ఎటాక్) -
ఆర్ఎంపీ ఇంట్లో రూ.66 లక్షలు.. సిద్దిపేటలో కలకలం
హుస్నాబాద్: టాస్క్‌ఫోర్స్ సోదాల్లో ఓ ఆర్ఎంపీ ఇంట్లో రూ.66.11 లక్షలు గుర్తించారు. అక్రమ ఆస్తులు కలిగి ఉన్నారని ఐటీ అధికారులకు అందిన సమాచారం మేరకు శనివారం సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని ఆర్ఎంపీ కొడం ఆంజనేయులు ఇంట్లో ఏసీపీ మహేందర్ ఆధ్వర్యంలో టాస్క్‌ఫోర్స్, సివిల్ పోలీసులు సంయుక్తంగా సోదాలు నిర్వహించారు. పట్టణంలోని మెయిన్రోడ్లో క్లినిక్ నడిపిస్తూ, వినాయకనగర్‌లో ఆయన నివసిస్తున్నారు. ఈ సోదాల్లో రూ.66,11,100 స్వాదీనం చేసుకొని సీజ్ చేసినట్లు మహేందర్ తెలిపారు. సీజ్ చేసిన డబ్బులను ఐటీ అధికారులకు అప్పగించనున్నట్లు చెప్పారు. ఇంత డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులు విచారించనున్నట్లు తెలిపారు. కాగా, ఆంజనేయులును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. చదవండి: సంతోష్‌ను చంపింది సోదరుడే.. -
క్షమాపణలు చెప్పకపోతే.. చట్టపరమైన చర్యలు
ఒంగోలు: తమిళనాడులో పట్టుబడ్డ డబ్బుతో తనకు సంబంధం లేదని చెప్పినా కూడా తప్పుడు ట్వీట్లు పదే పదే చేసిన వారు, వాటిని ప్రసారం చేసిన చానళ్లు తక్షణమే క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో చట్టపరమైన చర్యలు తీసుకుంటానని మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. జూలై 14న తమిళనాడు ఎలపూరు చెక్‌పోస్టు వద్ద ఓ కారులో పట్టుబడిన నగదును పోలీసులు ఐటీ అధికారులకు అప్పజెప్పిన సంగతి విదితమే. అయితే ఆ కారుపై ఆంధ్రప్రదేశ్ ఎంఎల్ఏ స్టిక్కర్ ఉండటంతో తమిళ, కొన్ని తెలుగు మీడియా వారు డబ్బుతో తనకు సంబంధం ఉందనుకున్నారని, ఆ విషయాన్ని ఖండిస్తూ పూర్తిస్థాయి విచారణకు తాను సిద్ధం అని అన్ని మీడియాలకు సందేశాన్ని పంపానని మంత్రి పేర్కొన్నారు. కానీ టీవీ 5 చానల్, టీడీపీ నేతలు తనపై తప్పుడు వార్తలు ప్రచారం చేశారన్నారు. నారా లోకేష్ తనపై తప్పుడు ట్వీట్లు చేస్తే.. వాటిని టీవీ 5 పదేపదే ప్రచారం చేసిందన్నారు. లాయర్ నోటీసులను లోకేష్, బోండా ఉమా, బొల్లినేని రాజగోపాల్‌నాయుడు, రవీంద్రనాథ్, సాంబశివరావు, కొమ్మారెడ్డి పట్టాభిరాం, న్యూస్18, టీవీ5 చానళ్లకు పంపించారు. -
యువతులతో పట్టుబడ్డ ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్
సాక్షి, హైదరాబాద్ : గౌరవప్రదమైన ఉద్యోగం చేస్తున్న ఒక వ్యక్తి వ్యభిచారం కేసులో అడ్డంగా బుక్కయ్యాడు. వివరాల్లోకి వెళితే.. నాగేందర్ భుక్య అనే వ్యక్తి ముంబై ఎంకె రోడ్డులోని అయకార్ భవన్లో ఇన్కమ్ ట్యాక్స్ అసిస్టెంట్ కమిషనర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా అమీర్‌పేట్‌లో వ్యభిచారం దందా నడుస్తున్నట్లు ఎస్సార్‌నగర్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో వ్యభిచార గృహంపై దాడి నిర్వహించిన పోలీసులకు నాగేందర్ ముగ్గురు యవతులతో అడ్డంగా దొరికిపోయాడు. నాగేందర్‌తో పాటు, వ్యభిచారం నిర్వహిస్తున్న వారిపై పోలీసులు కేసు నమోదు చేశారు. (లిఫ్ట్‌లో అనుమానాస్పద స్థితిలో నర్సు మృతదేహం) -
టీడీపీ అధ్యక్షుడి ఇంట్లో ఐటీ సోదాలు
-
టీడీపీ నేత ఇంటిపై ఐటీ దాడులు
సాక్షి, వైఎస్సార్ కడప: టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇంటిపై ఆదాయపన్ను (ఐటీ) శాఖ అధికారులు గురువారం దాడులు చేశారు. ద్వారక నగర్‌లోని ఆయన ఇంట్లో అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులను పెద్ద సంఖ్యలో శ్రీనివాసులరెడ్డి ఇంటి చుట్టూ మొహరించారు. హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఉన్న ఆయన కార్యాలయంలోనూ ఐటీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు. జార్ఖండ్ రాష్ట్రంలో శ్రీనివాసులరెడ్డి చేపట్టిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన పత్రాలను ఐటీ పరిశీలిస్తున్నట్లు సమాచారం. పన్ను ఎగవేసినట్టు ప్రాథమికంగా గుర్తించిన ఆదాయపన్ను శాఖ అధికారులు నేరుగా రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ఏమేరకు పన్ను ఎగవేశారన్నది సోదాల్లో తేలనుంది. -
పారిశ్రామికవేత్తపై ఐటీ దాడులు: సమారు రూ.200 కోట్లు
సాక్షి, ఆదిలాబాద్: ప్రముఖ పారిశ్రామికవేత్త రఘునాథ్ మిత్తల్ ఇంటితో పాటు ఆయన పరిశ్రమల్లో ఇన్‌కం టాక్స్ అధికారుల బృందం మంగళవారం దాడులు చేసింది. జిల్లాలోని నాలుగు చోట్లతో పాటు హైదరాబాద్‌లోని పలు వ్యాపార స్థావరాలపై ఏకకాలంలో ఐటీ అధికారుల దాడులకు చేశారు. రఘునాథ్ మిత్తల్ వ్యాపార లావాదేవీలు, ఆస్తులుకు సంబంధించిన వివరాలపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి కొనసాగుతున్న ఇన్‌కం టాక్స్ సోదాలకు సంబంధించిన విషయం సాయంత్రం వరకూ బయటకు తెలియలేదు. ఐటీ అధికారులు ఈ సోదాల్లో రఘునాథ్ మిత్తల్‌కు సంబంధించిన సుమారు రూ. 200 కోట్లు లెక్కల్లో తేలని ఆస్తులను గుర్తించినట్లు తెలస్తోంది. కాని అధికారికంగా మాత్రం సంబంధిత అధికారులు దీనిపై స్పందించలేదు. ఆదిలాబాద్‌కు చెందిన రఘునాథ్ మత్తల్‌కు సంబంధించి ఢిల్లీ, పంజాబ్ రాష్ట్రాల్లో పలు వ్యాపారాలు, ఆస్తులు ఉన్నప్పటికీ.. ఆయా చోట్ల ఐటీ దాడులకు సంబంధించిన సమాచారం తెలియరాలేదు. -
12 మంది ఐటీ అధికారులపై వేటు
న్యూఢిల్లీ: అవినీతి, విధుల్లో నిర్లక్ష్యం, మహిళా అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న 12 మంది సీనియర్ ఆదాయపన్ను శాఖ అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. ఉద్వాసనకు గురైన వారిలో చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ స్థాయి అధికారులుండటం గమనార్హం. వీరిపై జనరల్ ఫైనాన్షియల్ నిబంధన 56 ప్రకారం వీరిని బాధ్యతల నుంచి తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖ ఆదేశాలు జారీ చేసింది. ఉద్యోగ బాధ్యతల నుంచి తొలగింపునకు గురైన వారిలో జాయింట్ కమిషనర్ స్థాయి అధికారి అశోక్ కుమార్ అగర్వాల్(ఐఆర్ఎస్–1985) ఉన్నారు. ఈయన తీవ్ర అవినీతికి పాల్పడటంతోపాటు ఓ వ్యాపారి నుంచి బలవంతపు వసూళ్లు, ఒకప్పటి ఆథ్యాత్మిక గురువు చంద్రస్వామికి సాయం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. కమిషనర్ స్థాయి మహిళా అధికారులను లైంగికంగా వేధించిన నోయిడాలోని కమిషనర్(అప్పీల్) ఎస్కే శ్రీవాస్తవ (ఐఆర్ఎస్) అధికారిపైనా ప్రభుత్వం వేటువేసింది. అధికార దుర్వినియోగం, అక్రమ మార్గాల్లో రూ.3.17 కోట్లు కూడబెట్టిన ఐఆర్ఎస్ అధికారి హోమీ రాజ్‌వంశ్‌ను ఉద్యోగం నుంచి తొలగించింది. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అజోయ్ కుమార్, అలోక్‡ మిత్రా, చందర్ భార్తి, అందాసు రవీందర్, వివేక్ బాత్రా, శ్వేతబ్ సుమన్, రాజ్ భార్గవ, రాజేంద్ర ప్రసాద్ తదితరులను బాధ్యతల నుంచి తప్పించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. నిర్బంధ పదవీ విరమణ చేయించాల్సిన అధికారులను గుర్తించాల్సిందిగా గత కొంతకాలంగా కేబినెట్ సెక్రటేరియట్, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్లు తమ అధికారులకు మౌఖిక ఆదేశాలిచ్చినట్లు సమాచారం. సెంట్రల్ సివిల్ సర్వీసెస్–1972 చట్టంలోని నిబంధన 56(జే) ప్రకారం ఒక అధికారికి 50, 55 సంవత్సరాలు నిండిన తర్వాత లేదా 30 ఏళ్ల సర్వీసు పూర్తయిన తర్వాత అతని పనితీరుపై సమీక్ష చేపట్టేందుకు ప్రభుత్వానికి వీలుంటుంది. పనిచేయని అధికారులపై వేటువేసేందుకు ఉద్దేశించిన ఈ విధానాన్ని 2014లో మోదీ అధికారంలోకి రాగానే పునరుద్ధరించారు. ఇటీవలి కాలంలో వేటుపడిన ఉన్నతాధికారుల్లో ఎంఎన్ విజయ్‌కుమార్(ఐఏఎస్), కె.నరసింహ(ఐఏఎస్), మయాంక్ షీల్ చోహన్(ఐపీఎస్), రాజ్ కుమార్ దేవాంగన్(ఐపీఎస్) ఉన్నారు. -
ఆదాయ పన్ను అధికారులపై కొరడా
సాక్షి, న్యూఢిల్లీ : ఆదాయ పన్ను(ఐటీ) శాఖలో అవినీతి అధికారులపై కేంద్ర ప్రభుత్వం కొరడా ఝలిపించింది. చీఫ్ కమిషనర్, ప్రిన్సిపల్ కమిషనర్, కమిషనర్ల స్థాయిలో ఉన్న 12 మంది అధికారులను ఆర్థిక మంత్రిత్వ శాఖ లోని 56 నిబంధనను అనుసరించి నిర్బంధంగా పదవీ విరమణ చేయించిందని ఆర్థిక మంత్రిత్వ శాఖ వర్గాలు పేర్కొన్నాయి. ఈ అధికారుల్లో కొందరిపై అవినీతి, అక్రమాలకు పాల్పడినట్టు, అక్రమాస్తులు కూడగట్టిన ఆరోపణలున్నాయి. మరికొందరిపై లైంగిక వేధింపుల ఆరోపణలున్నాయని సమాచారం. -
ఈ ఏడాది ఐటీఆర్ ఫామ్స్ నోటిఫై...
న్యూఢిల్లీ: అసెస్మెంట్ ఇయర్ 2019–20కి సంబంధించి వ్యక్తులు, కంపెనీలకు ఆదాయపు పన్ను (ఐటీ) రిటర్న్ ఫామ్స్‌ను ఆదాయపు పన్ను శాఖ నోటిఫై చేసింది. వేతన వర్గం ఫైల్ చేసే ఐటీఆర్–1 లేదా సహజ్‌ల్లో ఎటువంటి మార్పులూ లేవు. అయితే ఐటీఆర్ 2,3,5,6,7ల్లో కొన్ని సెక్షన్లను హేతుబద్ధీకరించడం జరిగింది. 2018–19లో సంపాదించిన ఆదాయానికి సంబంధించి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యక్తులు, కంపెనీలు రిటర్న్స్ దాఖలు చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను రిటర్న్స్ దాఖలుకు తుది గడువు జూలై 31. తమ అకౌంట్లకు ఆడిట్లు అవసరం లేని వారికి ఈ గడువు వర్తిస్తుంది. -
ఆదాయ పన్ను వివాదాల పరిష్కారానికి 2 కమిటీలు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను శాఖ సంబంధ వివాదాల పరిష్కారాలు సూచించేందుకు, అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు కేంద్రీయ ప్రత్యక్ష పన్నుల బోర్డు కొత్తగా రెండు కమిటీలు ఏర్పాటు చేసింది. ఇవి రెండూ కూడా నెల రోజుల్లోగా నివేదికలు సమర్పించాల్సి ఉంటుంది. వివాదాస్పద అంశాల క్రమబద్ధీకరణ, పరిష్కార మార్గాలు సూచించేందుకు ఏర్పాటైన కమిటీకి ఐటీ కమిషనర్ హోదా అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో ఐదుగురు సభ్యులు ఉంటారు. ఇక పన్ను వివాదాల పరిష్కారానికి అంతర్జాతీయంగా అనుసరిస్తున్న విధానాల పరిశీలనకు ఏర్పాటైన రెండో కమిటీకి కమిషనర్ స్థాయి అధికారి సారథ్యం వహిస్తారు. ఇందులో కూడా నలుగురు సభ్యులు ఉంటారు. సాధ్యమైనంత వరకూ లిటిగేషన్లను తగ్గించే దిశగా సీబీడీటీ ఇటీవలి కాలంలో పలు చర్యలు తీసుకుంది. ట్రిబ్యునల్స్, కోర్టుల్లో ట్యాక్స్ శాఖ అప్పీలు చేసేందుకు ఉద్దేశించిన పన్ను బాకీల పరిమితిని కూడా గణనీయంగా పెంచింది. అధికారిక గణాంకాల ప్రకారం 2018 ఏప్రిల్ 1 నాటికి ఐటీ అపీల్స్ కమిషనర్ ముందు అప్పీల్స్ రూపంలో రూ. 6.38 లక్షల కోట్ల బకాయిల వివాదాలు పెండింగ్‌లో ఉన్నాయి. -
గుట్టు తేల్చబోతున్నారు!
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేందుకు తాపత్రయపడ్డ అభ్యర్థులకు ఫలితాల తర్వాత షాకులు తగులబోతున్నట్లు తెలుస్తోంది. పోలీసులు, ఐటీ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా రూ.125 కోట్లు స్వాధీనం చేసుకోగా, ప్రధానంగా వరంగల్ జిల్లా పెంబర్తిలో పట్టుబడ్డ రూ.5.8 కోట్ల వ్యవహారం సంచలనంగా మారనుంది. కారు సీట్ల వెనుక సీక్రెట్ బాక్స్‌లో తరలిస్తున్న డబ్బును పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. ఈ కేసులో ముగ్గురు ప్రముఖ రాజకీయ నేతల పేర్లు విన్పిస్తున్నాయి. వరంగల్ ఈస్ట్ కాంగ్రెస్ అభ్యర్థి రవిచంద్ర, పరకాల అభ్యర్థి కొండా సురేఖ, ఖమ్మం అసెంబ్లీ బరిలో నిలిచిన మాజీ ఎంపీ నామా నాగేశ్వర్రావు మెడకు ఈ కేసు చుట్టుకోబోతున్నట్లు సమాచారం. ఎక్కడి నుంచి.. హైదరాబాద్ గోషామహల్‌కు చెందిన హవాలా వ్యాపారి కీర్తికుమార్ జైన్ రూ.5.8 కోట్లను వరంగల్ తీసుకెళ్తూ పట్టుబడ్డాడు. ఈ డబ్బును నామా నాగేశ్వర్రావు, కొండా మురళి, రవిచంద్రలకు చేర్చేందుకు వెళ్తున్నట్లు కీర్తికుమార్ జైన్ పోలీసుల ఎదుట ఒప్పుకొన్నాడు. ఈ డబ్బు హవాలా మార్గంలో ఎక్కడి నుంచి వచ్చింది.. పంపించిన వ్యక్తి ఎవరు.. అతడి వివరాలపై వరంగల్ పోలీసులు ఆరా తీస్తున్నారు. సింగపూర్‌లోని ఓ వ్యక్తి హవాలా ద్వారా ఈ డబ్బును చెన్నైకి పంపించినట్లు అనుమానిస్తున్నారు. చెన్నై నుంచి కీర్తికుమార్‌కు ఈ డబ్బు చేరినట్లు తెలిసింది. సింగపూర్‌లో ఉన్న వ్యక్తి ఎవరు.. మహాకూటిమి అభ్యర్థులకు డబ్బు పంపాలని ఆ సింగపూర్ వ్యక్తిని ఆదేశించిందెవరన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు. నేతలకు తాఖీదులు..: పలానా వ్యక్తి నుంచి డబ్బు వస్తుందని నామానాగేశ్వర్రావుతో పాటు కొండా మురళి, రవిచంద్రలకు సమాచారం ఉన్నట్లు వరంగల్ పోలీసులు గుర్తించారు. ఈ ముగ్గురిని త్వరలోనే విచారించేందుకు రంగం సిద్ధం చేసినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇప్పటికే ఈ వ్యవహారంలో కేసులు నమోదు చేసిన పోలీసు శాఖ వీరికి త్వరలో నోటిసులు జారీచేసి విచారణకు రావాలని ఆదేశించనుంది. విచారణలో పలు అంశాలు వెలుగులోకి వస్తాయని భావిస్తున్నారు. గతంలో కూడా హవాలా ద్వారా డబ్బు రవాణా జరిగిందా.. డబ్బు పంపింన అసలు వ్యక్తి ఎవరన్న దాన్ని తేల్చాలని వరంగల్ పోలీసులు భావిస్తున్నారు. బాబు కోటరీయేనా? మహాకూటమికి అన్నీ తానై నడిపించిన ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తులే ఈ హవాలా డబ్బు వెనుక ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. నామా నాగేశ్వర్రావు.. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడిగా పేరుంది. రవిచంద్రకు వరంగల్ ఈస్ట్ టికెట్‌ను కాంగ్రెస్ నుంచి ఇప్పించేందుకు చంద్రబాబు మంత్రాంగం నడిపినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరితో పాటు కొండా సురేఖ ఎన్నికల ఖర్చు కోసం కూడా చంద్రబాబు కోటరీయే హవాలా ద్వారా డబ్బును వరంగల్ చేర్చేందుకు ప్రయత్నించినట్లు రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. రిమాండ్‌లో ఉన్న కీర్తికుమార్‌ను కస్టడీలోకి తీసుకునేందుకు వరంగల్ పోలీసులు సోమవారం కోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నారు. ఆయన కస్టడీలో అసలు కథ ఏంటన్న అంశాలు వెలుగులోకి వస్తాయని రాష్ట్ర నిఘా వర్గాలు భావిస్తున్నాయి. -
రూ.33.72 లక్షల నగదు స్వాధీనం
నాగర్‌కర్నూల్ క్రైం/కందనూలు: నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండల పరిధిలోని అల్లీపూర్ చెక్‌పోస్టు వద్ద రూ.33.72 లక్షల నగదును పోలీసులు స్వాధీ నం చేసుకున్నారు. కడప జిల్లాకు చెందిన పల్లీల వ్యాపారి సాంబశివారెడ్డి ఆదివారం అర్ధరాత్రి స్కార్పియో వాహనంలో ఈ నగదును తీసుకువెళ్తున్నాడు. అల్లీపూర్ చెక్‌పోస్టు వద్ద పోలీసులు వాహనాలను ఆపి తనిఖీ చేస్తున్నారు. సాంబశివారెడ్డి వాహనం లోని ఓ బ్యాగును తెరిచి చూడగా నగదు ఉన్నట్లు గుర్తించారు. వాటికి ఎలాంటి రశీదులు చూపకపోవడంతో ఎన్నికల కమిషన్ ఆదేశం మేరకు నగదును స్వాధీనం చేసుకొని రిటర్నింగ్ అధికారి హన్మానాయక్‌కు అందజేశారు. ఈ విషయమై ఇన్‌కంట్యాక్స్ అధికారులు, జిల్లా మానిటరింగ్ కమిటీ, జిల్లా ఎన్నికల అధికారికి సమాచారం ఇచ్చామని హన్మానాయక్ తెలిపారు.