కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు | income tax officers raids in contractor house at palwancha | Sakshi
Sakshi News home page

కాంట్రాక్టర్ ఇంటిపై ఐటీ దాడులు

Published Mon, Dec 14 2015 2:04 PM | Last Updated on Thu, Sep 27 2018 4:24 PM

income tax officers raids in contractor house at palwancha

పాల్వంచ: ఖమ్మం జిల్లాలో  ఓ కాంట్రాక్టర్ ఇంటిపై సోమవారం ఆదాయపుపన్ను శాఖ అధికారులు దాడులు చేశారు. పాల్వంచలోని కేఎస్‌పీ రోడ్డులో నివాసం ఉండే వెంకటేశ్వర్లు మూడు రాష్ట్రాల్లో పవర్‌ప్లాంట్లలో కాంట్రాక్టు పనులు నిర్వహిస్తుంటారు.

ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 9 గంటల నుంచి వెంకటేశ్వర్లు ఇంటితోపాటు ఆయనకు సంబంధించిన ఆఫీసుల్లో ఐటీ అధికారులు సోదాలు చేపట్టారు. ప్రస్తుతం దాడులు ఇంకా కొనసాగుతున్నాయి. భారీగా ఆస్తులతో పాటు పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement